Faf du Plessis
-
నవశకం.. కొత్త కెప్టెన్ అతడే!.. ఆర్సీబీ హెడ్‌కోచ్ వ్యాఖ్యలు వైరల్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ).. మూడుసార్లు ఫైనల్ చేరినా ఒక్కసారి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్ గెలవలేకపోయింది. ప్రత్యర్థి జట్ల ఎత్తులకు చిత్తై.. ఆఖరి మెట్టుపై బోల్తా పడి ట్రోఫీని చేజార్చుకుంది. దీంతో.. ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచే టీమిండియా సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి(Virat Kohli) కెరీర్లో ఐపీఎల్ టైటిల్ లేని లోటు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది.ఆర్సీబీ ముఖచిత్రంగా కోహ్లిఅయితే, ఈసారి మాత్రం ఆర్సీబీ తలరాత మారుతుందంటున్నాడు ఆ జట్టు హెడ్‌కోచ్ ఆండీ ఫ్లవర్(Andy Flower). అదే విధంగా కొత్త కెప్టెన్ గురంచి కూడా సంకేతాలు ఇచ్చాడు. కాగా ఆర్సీబీకి భారీ ఫాలోయింగ్ రావడానికి ప్రధాన కారణం కోహ్లినే అనడంలో సందేహం లేదు. తన ఇమేజీ ద్వారా ఆర్సీబీ ముఖచిత్రంగా మారిపోయిన ఈ రన్‌మెషీన్.. 2011లో తొలిసారి కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు.ఆ తర్వాత రెండేళ్లకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమితుడైన కోహ్లి.. 2016లో జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. కానీ తుదిపోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయి.. రిక్తహస్తాలతో వెనుదిరిగింది. ఆ తర్వాత కూడా చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ భారాన్ని, పని ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో 2021లో సారథ్య బాధ్యతల నుంచి కోహ్లి వైదొలిగాడు.డుప్లెసిస్ సారథ్యంలోఈ క్రమంలో సౌతాఫ్రికా వెటరన్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్(Faf Du Plesis) ఆర్సీబీ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 2024 వరకు నాయకుడిగా జట్టును ముందుండి నడిపించాడు. అయితే, మెగా వేలానికి ముందు ఆర్సీబీ డుప్లెసిస్‌ను వదిలేసింది. ఆక్షన్ సమయంలోనే అతడిని కొనేందుకు ఆసక్తి చూపలేదు.ఈ నేపథ్యంలో ఆర్సీబీకి ఐపీఎల్-2025లో కొత్త కెప్టెన్ రావడం ఖాయమైంది. అతడు మరెవరో కాదు.. కోహ్లినే అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై స్పోర్ట్స్‌తక్‌తో మాట్లాడిన ఆండీ ఫ్లవర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.నవశకం ఆరంభం‘‘నవశకం ఆరంభం కాబోతోంది. మూడేళ్ల సైకిల్లో ఊహించిన ఫలితాన్ని రాబట్టబోతున్నాం. అందరూ అనుకున్నదే నిజమయ్యే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకు అందుకు సంబంధించిన చర్చ జరుగలేదని మాత్రం చెప్పగలను’’ అని ఆండీ ఫ్లవర్ పేర్కొన్నాడు. అదే సమయంలో.. కోహ్లికే మరోసారి పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ఆండీ ఫ్లవర్ సంకేతాలు ఇచ్చాడు. మరోవైపు.. ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మొ బొబాట్ సైతం కెప్టెన్సీ అంశం గురించి ఇంకా చర్చించలేదని చెప్పినా.. పరోక్షంగా కోహ్లి వైపే తాము మొగ్గుచూపే ఛాన్స్ ఉందని తెలియజేశాడు.తిరుగులేని కింగ్కాగా ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు 252 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లి 8004 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది శతకాలతో పాటు.. 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా 705 ఫోర్లు, 272 సిక్సర్లు ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో ఉన్నాయి. రైటార్మ్ మీడియం పేసర్ అయిన కోహ్లి ఐపీఎల్లో నాలుగు వికెట్లు కూడా తీయడం విశేషం. మూడేళ్ల షెడ్యూల్ ఇదేఇదిలా ఉంటే.. గతేడాది ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ.. ఫైనల్లో మాత్రం అడుగుపెట్టలేకపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లోనే ఇంటిబాట పట్టింది. ఇక బీసీసీఐ ఇప్పటికే మూడేళ్ల ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2025.. మార్చి 14- మే 25 వరకు.. ఐపీఎల్-2026.. మార్చి 15- మే 31 వరకు.. ఐపీఎల్- 2027.. మార్చి 14- మే 30 వరకు నిర్వహించనున్నారు. చదవండి: 'డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి'.. భజ్జీ పోస్ట్ వైరల్ -
కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న డుప్లెసిస్.. వీడియో
అబుదాబీ టీ10 లీగ్‌లో భాగంగా ఢిల్లీ బుల్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో మోరిస్విల్లే సాంప్ ఆర్మీ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. అమీర్ హంజా బౌలింగ్‌లో షాదాబ్ ఖాన్ కొట్టిన బంతిని డుప్లెసిస్ ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఇది జరిగింది. ఈ ఓవర్లో డుప్లెసిస్ రెండు క్యాచ్‌లు పట్టాడు. షాదాబ్ ఖాన్ క్యాచ్‌కు ముందు డుప్లెసిస్ టామ్ బాంటన్ క్యాచ్ కూడా పట్టుకున్నాడు.WHAT A STUNNER FROM 40-YEAR-OLD FAF DU PLESSIS IN T10 LEAGUE 🤯 pic.twitter.com/LV9KLNHuPt— Johns. (@CricCrazyJohns) December 2, 2024ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్ మొత్తంగా మూడు క్యాచ్‌లు పట్టాడు. ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్లో మరో సూపర్ క్యాచ్‌తో డుప్లెసిస్ రోవ్‌మన్ పావెల్‌ను పెవిలియన్‌కు పంపాడు. 40 ఏళ్ల వయసులోనూ డుప్లెసిస్ మైదానంలో పాదరసంలా కదలడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 89 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇసురు ఉడాన 3, అమీర్ హంజా 2, కరీం జనత్, ఇమాద్ వసీం తలో వికెట్ పడగొట్టి ఢిల్లీ బుల్స్‌ను కట్టడి చేశారు. ఢిల్లీ బుల్స్ ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ (24) టాప్ స్కోరర్‌గా నిలువగా.. నిఖిల్ చౌదరీ (16), రోవ్‌మన్ పావెల్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. -
మెగా వేలానికి ముందు విధ్వంసం సృష్టించిన డుప్లెసిస్
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ విధ్వంసం సృష్టించాడు. అబుదాబీ టీ10 లీగ్‌లో భాగంగా చెన్నై బ్రేవ్ జాగ్వర్స్తో జరిగిన మ్యాచ్‌లో ఫాఫ్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఫాఫ్ 26 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేశాడు. ఫలితంగా ఫాఫ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మోరిస్విల్లే సాంప్ ఆర్మీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై బ్రేవ్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. డాన్ లారెన్స్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. చెన్నై బ్రేవ్ ఇన్నింగ్స్‌లో వాన్ డర్ డస్సెన్ 3, జోష్ బ్రౌన్ 13, భానుక రాజపక్ష 18, తిసార పెరీరా 8, క్రిస్ లిన్ 3, కోబ్ హెర్ఫ్ట్ 1 పరుగు చేశారు. సాంప్ ఆర్మీ బౌలర్లలో ఇమాద్ వసీం, ఆమిర్ హమ్జా, ఉడాన, కరీమ్ జనత్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 105 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సాంప్ ఆర్మీ.. ఫాఫ్ చెలరేగిపోవడంతో మరో 18 బంతులు మిగిలుండగానే (వికెట్ కోల్పోయి) విజయతీరాలకు చేరింది. సాంప్ ఆర్మీ ఇన్నింగ్స్‌లో షర్జీల్ ఖాన్ 8, చరిత్ అసలంక 17 పరుగులు చేశారు. చెన్నై బ్రేవ్ బౌలర్లలో ఒషేన్ థామస్‌కు ఓ వికెట్ దక్కింది. కాగా, ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఫాఫ్ డుప్లెసిస్ ఇవాళ (నవంబర్ 25) ఆక్షన్‌కు రానున్నాడు. ఫాఫ్ 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. తాజా ఇన్నింగ్స్ నేపథ్యంలో ఫాఫ్ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది. ఫాఫ్ కోసం ఆర్సీబీ, చెన్నై పోటీ పడవచ్చు. -
రాణించిన డుప్లెసిస్, ఛార్లెస్.. సీపీఎల్ ఫైనల్లో లూసియా కింగ్స్
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ చివరి అంకానికి చేరుకుంది. సెయింట్ లూసియా కింగ్స్ ఫైనల్స్‌కు చేరింది. ఇవాళ (అక్టోబర్ 3) జరిగిన క్వాలిఫయర్-1లో లూసియా కింగ్స్ గయానా అమెజాన్ వారియర్స్‌పై 15 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతిన) గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అమెజాన్ వారియర్స్‌కు వరుణుడు ఆడ్డు తగిలాడు. వారియర్స్ ఇన్నింగ్స్ 13 ఓవర్ల వరకు సజావుగా సాగింది. ఈ దశలో వర్షం మొదలై మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. వర్షం ఎంతకీ ఆగకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన లూసియా కింగ్స్‌ను విజేతగా ప్రకటించారు. వర్షం ప్రారంభమయ్యే సమయానికి అమెజాన్ వారియర్స్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 106 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో లూసియా కింగ్స్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. అమెజాన్ వారియర్స్ బార్బడోస్ రాయల్స్‌తో క్వాలిఫయర్-2 ఆడనుంది. అక్టోబర్ 5న జరిగే క్వాలిఫయర్-2లో గెలిచే జట్టు అక్టోబర్ 7న జరిగే ఫైనల్లో లూసియా కింగ్స్‌తో తలపడుతుంది.రాణించిన డుప్లెసిస్, జాన్సన్ ఛార్లెస్అమెజాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ (57), జాన్సన్ ఛార్లెస్ (79) అర్ద సెంచరీలతో రాణించారు. వీరిద్దరు మినహా లూసియా ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. రోస్టన్ ఛేజ్, టిమ్ సీఫర్ట్ తలో 18 పరుగులు, డేవిడ్ వీస్ 13, మాథ్యూ ఫోర్డ్ 0, జెర్మియా 1 పరుగు చేశారు. వారియర్స్ బౌలర్లలో మొయిన్ అలీ, ప్రిటోరియస్ తలో రెండు, షమార్ జోసఫ్ ఓ వికెట్ తీశారు.లక్ష్య ఛేదనలో అమెజాన్ వారియర్స్ కూడా ధాటిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. రహ్మానుల్లా గుర్బాజ్ 24, కీమో పాల్ 14, షాయ్ హోప్ 27, ప్రిటోరియస్ 2 పరుగులు చేసి ఔట్ కాగా.. హెట్‌మైర్ 37, మొయిన్ అలీ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. లూసియా కింగ్స్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, డేవిడ్ వీస్, ఛేజ్, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: Irani Cup 2024: సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్ -
రాణించిన హోప్, హెట్‌మైర్.. సరిపోని డుప్లెసిస్ మెరుపులు
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ మ్యాచ్ తర్వాత ప్లే ఆఫ్స్ మొదలవుతాయి. ప్లే ఆఫ్స్ నాలుగు బెర్త్‌లు ఇదివరకే ఖరారైపోయినప్పటికీ.. ఏ జట్టు ఏ స్థానంలో ఉంటున్నది రేపటి మ్యాచ్‌తో తేలనుంది.లీగ్‌లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 28) గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అమెజాన్ వారియర్స్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.రాణించిన హోప్, హోట్మైర్ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. షాయ్ హోప్ (31 బంతుల్లో 56; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), షిమ్రోన్ హెట్‌మైర్ (30 బంతుల్లో 58; 9 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ (26), ఆజమ్ ఖాన్ (26), రొమారియో షెపర్డ్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లూసియా కింగ్స్ బౌలర్లలో డేవిడ్ వీస్ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్ అహ్మద్, అల్జరీ జోసఫ్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు.సరిపోని డుప్లెసిస్ మెరుపులుఅనంతరం 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమతమైంది. డుప్లెసిస్ (59 బంతుల్లో 92 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) లూసియా కింగ్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అతనికి అల్జరీ జోసఫ్ (21 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) తోడుగా నిలిచాడు. లక్ష్యం పెద్దది కావడంతో లూసియా కింగ్స్ గమ్యాన్ని చేరుకోలేకపోయింది. డుప్లెసిస్ మెరుపులు సరిపోలేదు. వారియర్స్ బౌలర్లలో మోటీ, మొయిన్, తాహిర్ తలో రెండు వికెట్లు తీసి లూసియా కింగ్స్‌ను దెబ్బకొట్టారు.చదవండి: NZ Vs SL 2nd Test: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. -
డుప్లెసిస్ 74వ హాఫ్ సెంచరీ
టీ20 క్రికెట్లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ 74వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ట్రిన్‌బాగో అండ్ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాఫ్ ఈ ఫీట్‌ను సాధించాడు. సెంచరీలతో (6) కలుపుకుని ఫాఫ్ తన కెరీర్లో మొత్తం 80 సార్లు 50 పరుగుల మార్కును దాటాడు.పొట్టి క్రికెట్ చరిత్రలో కేవలం పది మంది (ఫాఫ్‌తో సహా) మాత్రమే ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ టాప్‌లో (112) ఉండగా.. క్రిస్ గేల్ (110), విరాట్ కోహ్లి (106), బాబర్ ఆజమ్ (101), జోస్ బట్లర్ (90), అలెక్స్ హేల్స్ (88), రోహిత్ శర్మ (86), ఆరోన్ ఫించ్ (85), షోయబ్ మాలిక్ (83), ఫాఫ్ డెప్లెసిస్ (80) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు.ట్రిన్‌బాగో అండ్ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ (43 బంతుల్లో 59), జాన్సన్ ఛార్లెస్ (40 బంతుల్లో 89) అర్ద సెంచరీలతో రాణించారు. కీరన్ పోలార్డ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్ 17.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేసింది. డ్వేన్ బ్రావో (0) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. నూర్ అహ్మద్ (3/39), డేవిడ్ వీస్ (2/27) నైట్‌రైడర్స్ పతనాన్ని శాశించగా.. పియెర్రి, అల్జరీ జోసఫ్, రోస్టన్ ఛేజ్, సడ్రక్ డెస్కార్టే తలో వికెట్ పడగొట్టారు. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో హేమాహేమీ హిట్టర్లు ఉన్నా జేసన్ రాయ్ ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ (41) చేశాడు. చదవండి: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. శ్రీలంక తుది జట్టు ప్రకటన -
డుప్లెసిస్ ఊచకోత.. కేవలం 31 బంతుల్లోనే! వీడియో
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో సెయింట్ లూసియా కింగ్స్ తమ మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రాస్ ఐలెట్ వేదికగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. సెయింట్ కిట్స్ బ్యాటర్లలో ఆండ్రీ ఫ్లెచర్(62), రూసో హాఫ్ సెంచరీలతో మెరిశారు. సెయింట్ లూసియా బౌలర్లలో ఆల్జారీ జోషఫ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఛేజ్, వీస్, సద్రక్ తలా వికెట్ సాధించారు.డుప్లెసిస్ ఊచకోత..అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని సెయింట్ లూసియా కింగ్స్ 16.3 ఓవర్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. లక్ష్య చేధనలో ఓపెనర్లు ఫాప్ డుప్లెసిస్, జాన్సెన్ చార్లెస్ విధ్వంసం సృష్టించారు. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశారు. చార్లెస్ 42 బంతుల్లో 4ఫోర్లు, 7 సిక్స్‌లతో 74 పరుగులు చేయగా.. డుప్లెసిస్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లలో హసరంగా,క్లార్క్సన్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా డుప్లెసిస్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పాయింట్ల పట్టిక విషయానికి వస్తే.. గయానా ఆమెజాన్ వారియర్స్ తొలి స్ధానంలో ఉండగా.. సెయింట్ లూసియా మూడో స్ధానంలో కొనసాగుతోంది. చదవండి: అంతా అనుకున్నట్టే జరిగింది.. న్యూజిలాండ్- అఫ్గాన్ టెస్టు రద్దు pic.twitter.com/ex0bSYNHN4— Cricket Cricket (@cricket543210) September 13, 2024 -
డుప్లెసిస్పై వేటు..? ఆర్సీబీ కెప్టెన్‌గా ఊహించని ఆటగాడు!
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటైన్ జాబితాను సిద్దం చేసే పనిలో పడ్డాయి. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి ఇంకా రిటెన్షన్ పక్రియకు సంబంధించి ఎటువంటి గైడ్‌లైన్స్ రానిప్పటకి.. ఆయా జట్లు మాత్రం ఇప్పటినుంచే తమ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. మెగా వేలంకు ముందు ఎవరనీ విడిచిపెట్టాలి, ఎవరిని రిటైన్ చేసుకోవాలి అన్న ఆంశాలపై ఫ్రాంచైజీలు ఓ నిర్ణయంకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పలు సంచలన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్పై వేటు వేయాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.డుప్లెసిస్‌తో పాటు ఆసీస్ విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను సైతం వేలంలోకి విడిచిపెట్టాలని ఆర్సీబీ నిర్ణయించుకున్నట్లు వినికిడి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పాటు రజత్ పటిదార్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్‌ను రిటైన్ చేసుకోవాలని యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించే ఆలోచనలో ఆర్సీబీ యాజమాన్యం ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చనడుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పాటిదార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఫస్ట్ హాఫ్‌లో నిరాశపరిచిన పాటిదార్.. సెకెండ్ హాఫ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 15 మ్యాచ్‌లు ఆడి 398 పరుగులు చేశాడు.గ్రీన్‌కు గుడ్ బై.. ?అదే విధంగా 2024 మినీ వేలం లో రూ.11 కోట్ల రూపాయలకు దక్కించుకున్న అల్జారీ జోసెఫ్ తో పాటు ట్రేడింగ్ ద్వారా రూ. 17 కోట్లకు దక్కించుకున్న ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ సైతం వేలంలోకి వచ్చే అవకాశముంది.ఐపీఎల్-2024లో పర్వాలేదన్పించిన ఆర్సీబీ.. లిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. 2024 ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన ఆర్సీబీ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. -
IPL 2025: ఈ ముగ్గురు కెప్టెన్లను రిలీజ్ చేయనున్న ఫ్రాంఛైజీలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం-2025 నేపథ్యంలో ఆటగాళ్ల రిటెన్షన్ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. పది జట్ల ఫ్రాంఛైజీలు- భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారుల మధ్య జూలై 31 నాటి సమావేశంలో ఈ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఫ్రాంఛైజీ యజమానుల్లో అధికులు ఆరుగురు క్రికెటర్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరగా.. బీసీసీఐ ఇందుకు సానుకూలంగా స్పందించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు ఫ్రాంఛైజీలు మాత్రం తమ కెప్టెన్లను విడిచిపెట్టి.. వారి స్థానంలో కొత్త వారిని నియమించుకోవాలనే యోచనలో ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది.ఆర్సీబీఐపీఎల్-2025 నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తమ సారథిని మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. వేలానికి ముందు ఫాఫ్ డుప్లెసిస్‌ను విడిచిపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 36 ఏళ్ల డుప్లెసిస్ ఐపీఎల్-2024లో 438 పరుగులు చేయడంతో పాటు.. జట్టును ప్లే ఆఫ్స్ వరకు చేర్చగలిగాడు.అయితే, డుప్లెసిస్ వయసు రీత్యా కెప్టెన్‌గా అతడిని కొనసాగించేందుకు విముఖంగా ఉన్నట్లు సమాచారం. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని.. యువ టీమిండియా ఆటగాడిని సారథిగా నియమించుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.పంజాబ్ కింగ్స్ఐపీఎల్ టాప్ రన్ స్కోర్లలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఒకడు. అయితే, పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న అతడు గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. అంతేకాదు.. ఐపీఎల్-2024లో ఆరంభ మ్యాచ్‌ల తర్వాత గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు.ధావన్ స్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ పంజాబ్ కింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే, ప్లే ఆఫ్స్మాత్రం చేర్చలేకపోయాడు. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ సాధించని జట్లలో పంజాబ్ కూడా ఉందన్న విషయం తెలిసిందే.ఇందుకు ప్రధాన కారణం సరైన నాయకుడు లేకపోవడమే. ఇక ధావన్ ఇప్పటికే జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. అంతేకాదు దేశవాళీ క్రికెట్లోనూ ఆడటం లేదు. అలాంటి ఆటగాడిని సారథిగా కొనసాగించడంలో అర్థం లేదని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 38 ఏళ్ల ధావన్‌ను కెప్టెన్‌గా తప్పించి.. అతడి స్థానంలో యువ నాయకుడిని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.లక్నో సూపర్ జెయింట్స్ఐపీఎల్లో 2022లో అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌కు మూడేళ్లుగా టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. 2022, 2023 సీజన్లలో లక్నోను టాప్-4లో నిలబెట్టిన రాహుల్.. 2024లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆటగాడినూ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 520 పరుగులు చేసినప్పటికీ.. స్ట్రైక్‌రేటు(136.12) పరంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా ఓనర్ సంజీవ్ గోయెంకా రాహుల్‌పై బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అంతా బాగానే ఉందని సంజీవ్ గోయెంకా సంకేతాలు ఇచ్చినా.. రాహుల్ మాత్రం బాగా హర్టయినట్లు సమాచారం. జట్టును వీడాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఫ్రాంఛైజీ సైతం రాహుల్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: IPL 2025: గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం.. ఆశిష్ నెహ్రాపై వేటు! -
రాణించిన కాన్వే.. సూపర్ కింగ్స్‌ను గెలిపించిన డుప్లెసిస్
మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (జులై 25) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఫాఫ్ మరో అర్ద సెంచరీ బాదాడు. ఫలితంగా సూపర్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో ఎంఐ న్యూయార్క్‌పై ఘన విజయం సాధించింది.FAF DU PLESSIS - THE LEGEND OF THE SUPER KINGS FAMILY. ⭐- 72 (47) with 6 fours and 3 sixes in the Eliminator against MI New York in the MLC. The captain at the age of 40 keeps getting better. 👌pic.twitter.com/GrURm0QS7U— Mufaddal Vohra (@mufaddal_vohra) July 25, 2024రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. రషీద్ ఖాన్ (30 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఎంఐ ఇన్నింగ్స్‌లో రషీద్‌తో పాటు మెనాంక్ పటేల్ (48), షయాన్ జహంగీర్ (26) మాత్రమే రాణించారు. సూపర్‌కింగ్స్ బౌలర్లలో స్టోయినిస్, ఆరోన్ హార్డీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. జియా ఉల్ హక్, నూర్ అహ్మద్, బ్రావో తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్ కింగ్స్.. ఓపెనర్లు డుప్లెసిస్ (72), డెవాన్ కాన్వే (43 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), సత్తా చాటడంతో అలవోకగా (18.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) విజయం సాధించింది. బంతితో రాణించిన ఆరోన్ హార్డీ బ్యాట్‌తోనూ (22 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సూపర్ కింగ్స్ ఛాలెంజర్ మ్యాచ్‌కు అర్హత సాధించగా.. ముంబై ఇండియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. రేపు జరుగబోయే క్వాలిఫయర్ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడం, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ పోటీపడతాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుతో సూపర్ కింగ్స్ ఛాలెంజర్ మ్యాచ్ ఆడతుంది. క్వాలిఫయర్ విజేత, ఛాలెంజర్ గేమ్ విజేత జులై 28న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.ఎంఎల్సీ 2024లో డుప్లెసిస్ స్కోర్లు..14(14), 100(58), 34(17), 61(38), 55(32), 39(17), 72(47)7 ఇన్నింగ్స్‌ల్లో 168.16 స్ట్రయిక్‌రేట్‌తో 53.57 సగటున సెంచరీ, 3 అర్ద సెంచరీల సాయంతో 375 పరుగులు. -
IPL 2025: డుప్లెసిస్‌కు షాక్.. ఆర్సీబీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్!?
ఐపీఎల్-2025 సీజన్‌కు పలు ఫ్రాంచైజీలు భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి లక్నో సూపర్ జెయింట్స్. వచ్చే ఏడాది సీజన్‌కు ముందు తమ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను విడిచిపెట్టాలని లక్నో ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. కేఎల్ రాహుల్, లక్నో మేనేజ్మెంట్ మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడిని లక్నో విడిచిపెట్టాలని భావిస్తున్నట్లు సదరు పత్రిక పేర్కొంది. రాహుల్ కూడా లక్నో మేనేజ్మెంట్ పైన ఆంసతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఏడాది సీజన్లో ఎల్ఎస్జి యజమాని సంజీవ్ గోయెంకా, రాహుల్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు పలు ఊహాగానాలు వినిపించాయి.ఆ తర్వాత రాహుల్, గోయెంకా ఇద్దరూ ఈ ఊహాగానాలను ఖండించినప్పటికి.. క్రికెట్ వర్గాల్లో మాత్రం ఇంకా ఈ చర్చనడుస్తోంది. రాహుల్ సారథ్యంలోని ఎల్ఎస్జి రెండు సార్లు ఫ్లే ఆఫ్స్‌కు చేరింది. కానీ ఈ ఏడాది సీజన్లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.ఆర్సీబీ కెప్టెన్‌గా రాహుల్?ఇక కేఎల్ రాహుల్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కన్నేసినట్లు తెలుస్తోంది. మెగా వేలానికి ముందు ఎల్ఎస్జి నుంచి రాహుల్‌ను ట్రేడ్ చేసుకోవాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ వయస్సు 40కి చేరుకోవడంతో.. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా కొత్త కెప్టెన్‌ను ఫ్రాంచైజీ వెతుకుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కేఎల్ రాహల్‌ను సొంతం చేసుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని ఆర్సీబీ యాజమాన్యం యోచిస్తున్నట్లు వినికిడి. కాగా కేఎల్ రాహుల్ తన ఐపీఎల్ కెరీర్‌ను ఆర్సీబీ ఫ్రాంచైజీతో ప్రారంభించాడు. -
డుప్లెసిస్ మెరుపు అర్ద సెంచరీ.. రషీద్ ఖాన్ వీరోచిత పోరాటం
మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) 2024 ఎడిషన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో ఇవాళ (భారతకాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది.డుప్లెసిస్ మెరుపు అర్ద సెంచరీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టెక్సాస్ సూపర్ కింగ్స్.. ఓపెనర్లు డుప్లెసిస్ (38 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డెవాన్ కాన్వే (28 బంతుల్లో 40; 3 ఫోర్లు, సిక్సర్) చెలరేగి ఆడటంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో ఆరోన్ హార్డీ 22, జాషువ ట్రంప్ 3, మిలింద్ కుమార్ 2, సావేజ్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. స్టోయినిస్ 24, డ్వేన్ బ్రావో 7 పరుగులతో అజేయంగా నిలిచారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ (4-0-17-1) పొదుపుగా బౌలింగ్ చేయగా.. ట్రెంట్ బౌల్ట్ 2, నోష్తుష్ కెంజిగే, ఎహసాన్ ఆదిల్ తలో వికెట్ పడగొట్టారు.రషీద్ ఖాన్ వీరోచిత పోరాటం వృధా177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. మెనాంక్ పటేల్ (45 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రషీద్ ఖాన్ (23 బంతుల్లో 50; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రషీద్ పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు బ్యాటింగ్ చేశాడు. రషీద్ వీరోచితంగా పోరాడినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో కీరన్ పోలార్డ్ (17 బంతుల్లో 5), టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 6) చాలా బంతులు వృధా చేశారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో స్టోయినిస్ 4, జియా ఉల్ హక్ 2, మొహమ్మద్ మోహిసిన్ ఓ వికెట్ పడగొట్టారు.ఇదిలా ఉంటే, మేజర్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ జులై 5న మొదలైన విషయం తెలిసిందే. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో వాషింగ్టన్ ఫ్రీడం (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) టాప్‌లో ఉండగా.. టెక్సాస్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్, సీయాటిల్ ఓర్కాస్ వరుస స్థానాల్లో ఉన్నాయి. లీగ్‌లో భాగంగా రేపు (రాత్రి ఒంటి గంటకు) జరుగబోయే మ్యాచ్‌లో సీయాటిల్ ఓర్కాస్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్ తలపడనున్నాయి. -
డుప్లెసిస్ విధ్వంసకర సెంచరీ.. 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో
మేజర్ లీగ్ క్రికెట్-2024లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం చర్చ్ స్ట్రీట్ పార్క్ వేదికగా వాష్టింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్లను డుప్లెసిస్ ఊచకోత కోశాడు. కేవలం 58 బంతుల్లోనే ఫాప్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. మేజర్ లీగ్ క్రికెట్లో డుప్లెసిస్‌కు ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. అతడితో పాటు మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(39) పరుగులతో రాణించాడు. వాష్టింగ్టన్ బౌలర్లలో నేత్రవల్కర్ రెండు వికెట్లు పడగొట్టగా.. మార్కో జానెసన్, డిల్, హోస్సేన్ తలా వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వాష్టింగ్టన్‌కు ఓపెనర్ స్మిత్(26), హెడ్(36) మంచి ఆరంభాన్ని ఆంచారు. వీరిద్దరూ ధాటికి వాషింగ్టన్ 4 ఓవర్లలో 62 పరుగులు చేసింది. అయితే ఈ సమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. వర్షం ఎప్పటికి తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. -
అదే మా ఓటమిని శాసించింది.. లేదంటే విజయం మాదే: డుప్లెసిస్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమేనిటర్‌లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. వరుస మ్యాచ్‌ల్లో గెలిచి ఫ్లే ఆఫ్స్‌కు చేరిన బెంగళూరు.. ఎలిమినేటర్ రౌండ్‌ను దాటలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. విరాట్ కోహ్లి(33), మహిపాల్(32) పరుగులతో రాణించారు.అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(45) పరుగులతో అదరగొట్టగా.. రియాన్ పరాగ్(36), హెట్‌మైర్(26), పావెల్(16)పరుగులతో రాణించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. బ్యాటింగ్‌లో మరింత మెరుగ్గా రాణించింటే ఫలితం మరో విధంగా ఉండేదని డుప్లెసిస్ తెలిపాడు."మేము తొలుత బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించలేకపోయాం. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అదనంగా 20 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. సాధరణంగా ఈ వికెట్‌పై 180 పరుగులు సాధిస్తే టార్గెట్‌ను డిఫెండ్ చేసుకోవచ్చు.ఎందుకంటే అహ్మదాబాద్ పిచ్ కాస్త స్లోగా ఉంది. మా బౌలర్లు అద్బుతంగా పోరాడారు. ఈ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మాకు పెద్దగా ఉపయోగపడలేదు. ఇక ఈ సీజన్లో మా జట్టు ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. పాయింట్ల పట్టకలో అట్టడుగు స్ధానం నుంచి ప్లే ఆఫ్స్‌కు రావడం నిజంగా గర్వించదగ్గ విషయం. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాం. కానీ దురదృష్టవశాత్తూ ఎలిమినేటర్ రౌండ్‌ను దాటలేకపోయామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో డుప్లెసిస్ పేర్కొన్నాడు. A comeback to winning ways when it mattered the most & how 👌👌Upwards & Onwards for Rajasthan Royals in #TATAIPL 2024 😄⏫Scorecard ▶️ https://t.co/b5YGTn7pOL #RRvRCB | #Eliminator | #TheFinalCall pic.twitter.com/NsxjVGmjZ9— IndianPremierLeague (@IPL) May 22, 2024 -
RR vs RCB: వార్ వన్‌సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
ఐపీఎల్-2024 ఆఖరి అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే ఒక ఫైనలిస్టు ఖరారు కాగా.. తుది పోరుకు అర్హత సాధించేందుకు మిగిలిన మూడు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజర్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకువెళ్లింది కేకేఆర్.ఇక ఫైనల్ రేసులో మిగిలినవి రెండే మ్యాచ్‌లు. ఎలిమినేటర్, క్వాలిఫయర్-2. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది.సన్‌రైజర్స్‌తో ఎలిమినేటర్ విజేత పోటీఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. క్వాలిఫయర్-1లో కేకేఆర్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. ఆ మ్యాచ్‌లో గనుక గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది.ఈ క్రమంలో బెంగళూరు- రాజస్తాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సునిల్ గావస్కర్ ఎలిమినేటర్ విజేత ఎవరన్న అంశంపై తన అంచనా తెలియజేశాడు.‘‘ఆర్సీబీ ఈసారి ఎంతటి అద్భుతం చేసిందో చూశాం. ముఖ్యంగా వరుస పరాజయాల తర్వాత వాళ్లు తిరిగి పుంజుకున్న తీరు అమోఘం. మామూలు జట్లకు ఇలాంటివి సాధ్యం కావు.అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాంఆర్సీబీ ప్రధాన ఆటగాళ్లలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లితో పాటు మిగతా సీనియర్ ప్లేయర్లు తమ ఆట తీరుతో.. జట్టులో ఉత్సాహం నింపారు. ఆర్సీబీ స్థానంలో మరే ఇతర జట్టు ఏదైనా ఉంటే.. ‘అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాం. అంతా ముగిసిపోయింది’ అని బెంబేలెత్తిపోయేవాళ్లు.కానీ డుప్లెసిస్, కోహ్లి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వలేదు. ఇక రాజస్తాన్.. గత నాలుగు- ఐదు మ్యాచ్‌లలో ఓడిపోతూనే ఉంది. ఆఖరిగా ఆడిన మ్యాచ్‌లోనూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.వాళ్లను చూస్తే పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. పదకొండు రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్న కేకేఆర్ మాదిరి ఏదైనా ప్రత్యేకంగా చేస్తే తప్ప రాజస్తాన్‌కు గెలిచే అవకాశాలు ఉండవు.లేదంటే మ్యాచ్ ఏకపక్షంగా సాగిపోయే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ రాజస్తాన్‌ను చిత్తు చేసినా చేస్తుంది. ఒకవేళ అలా జరగకపోతేనే ఆశ్చర్యం’’ అని సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాడు.గావస్కర్ వర్సెస్ కోహ్లికాగా ఇటీవల గావస్కర్- కోహ్లి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి గావస్కర్ విమర్శించగా.. రన్‌మెషీన్ అందుకు కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ఎలా ఆడాలో తనకు తెలుసునని.. జట్టు ప్రయోజనాల కోసం ఏం చేయాలో కూడా తెలుసంటూ కౌంటర్ వేశాడు. -
RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
ఆర్సీబీ.. ఆర్సీబీ.. ఆర్సీబీ.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పేరు.. ఆర్సీబీ నామస్మరణతో హోరెత్తుతూ ఆగని జోరు... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా ఐపీఎల్-2024 టైటిల్ సాధించిందా? అన్నంతగా సంబరాలు..ఖండాంతరాలు దాటిన సంబురం.. అమెరికాలోనూ పేలుతున్న విన్నింగ్ క్రాకర్స్.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరిన క్రమంలో ‘నమ్మ బెంగళూరు’ అంటూ కనీవినీ ఎరుగని రీతిలో సెలబ్రేషన్స్.. అంత ప్రత్యేకమాఈ విజయం అంత ప్రత్యేకమా అంటే అవుననే చెప్పాలి. ఇంత వరకు ఒక్కసారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలవనే లేదు. అయితే, అనూహ్య రీతిలో ఈసారి మహిళా ప్రీమియర్ లీగ్ రూపంలో తొలిసారి బెంగళూరు ఫ్రాంఛైజీకి ట్రోఫీ దక్కింది.స్మృతి మంధాన కెప్టెన్సీలో ఆర్సీబీ వుమెన్ టీమ్ కప్ కొట్టింది. ఇదే జోరులో పురుషుల జట్టు కూడా ఈసారి ట్రోఫీ సాధిస్తుందని.. టైటిల్ లేదన్న వెలితిని పూరిస్తుందని అభిమానులు ఆశపడ్డారు. అయితే, ఆరంభ మ్యాచ్‌లోనే ఆర్సీబీ ఓటమిపాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయంతో సీజన్‌ను మొదలుపెట్టింది.ఆ తర్వాత సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించిన బెంగళూరు జట్టు.. అదే జోరును కొనసాగించలేకపోయింది. వరుస వైఫల్యాలతో చతికిల పడి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించే తొలి జట్టు అవుతుందేమోనన్న భావన కలిగించింది. KGF త్రయంలో విరాట్ కోహ్లి రాణించినా గ్లెన్ మాక్స్వెల్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అంచనాలు అందుకోలేకపోయారు.మాక్సీ కొన్నాళ్లు జట్టుకు దూరంగాఫలితంగా విమర్శల పాలయ్యారు. దీంతో మాక్సీ కొన్నాళ్లు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్రతి మ్యాచ్‌లోనూ చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. నిజానికి ఇలాంటి ఒత్తిడిలో ఏ జట్టైనా చిత్తవుతుంది. కానీ ఆర్సీబీ అందుకు విరుద్ధం.ఎంత ఒత్తిడి పెరిగితే అంతగా చెలరేగిపోతాం అన్నట్లుగా వరుసగా ఆరు విజయాలు సాధించి.. ఇప్పుడిలా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఊహించని విజయం సాధించింది. రిపీట్ అవుతుందా?సీఎస్కేపై గెలిచినా నెట్ రన్‌రేటు పరంగా కూడా ఆ జట్టు కంటే మెరుగైన స్థితిలో ఉంటేనే టాప్-4కు అర్హత సాధిస్తుందన్న తరుణంలో అద్భుతం చేసి.. టాప్-4కు అర్హత సాధించింది. కాగా 2016లోనూ ఆరంభంలో ఆకట్టుకోలేకపోయిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ చేరి.. అటుపై ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతమవుతుందని అభిమానులు భావిస్తున్నారు. కాగా 2016 ఫైనల్లో ఆర్సీబీ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.ఆర్సీబీ వర్సెస్ చెన్నై స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: చెన్నై.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 218/5 (20)👉చెన్నై స్కోరు: 191/7 (20)👉ఫలితం: చెన్నైపై 27 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్స్‌లో ఎంట్రీ👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఫాప్ డుప్లెసిస్(39 బంతుల్లో 54, కీలక సమయంలో రెండు క్యాచ్‌లు).చదవండి: Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్ Winning celebration of RCB in North America right now🔥🔥.Bigger than any franchise.RCB , RCB , RCB . pic.twitter.com/2M2FipXGYX— Kohlified. (@123perthclassic) May 19, 2024Winning celebration of RCB near Trump building Chicago. right now🔥🔥.Bigger than any franchise.RCB , RCB , RCB . pic.twitter.com/dy1Oko6QS7— #RCBNation (@9Sxventy3) May 19, 2024Bengaluru won't sleep tonight 😎RCB RCB all over the city @RCBTweets ❤️🔥pic.twitter.com/6jvvAAVERT— M. (@RCB_Hiv3) May 18, 2024Hear the Roar, Hear "Kohli, Kohli & RCB, RCB" Chants when they qualify for playoffs.- King Kohli & RCB are emotions..!!!! pic.twitter.com/Afqck4jNSH— Tanuj Singh (@ImTanujSingh) May 18, 2024📽️ RAW Reactions post a surreal win ❤️When emotions spoke louder than words at Chinnaswamy 🏟️A special lap of honour for the @RCBTweets fans that continue to believe in their side 👏👏#TATAIPL | #RCBvCSK pic.twitter.com/CrBQUBRKEI— IndianPremierLeague (@IPL) May 19, 2024 -
RCB Vs CSK: అతడి వల్లే గెలిచాం.. డుప్లిసెస్ ఎమోషనల్
#RCB Vs CSK ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకు ఒక పండుగ. అలాంటి ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంటర్స్(#RCB) అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అదరగొట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరగని రీతిలో ఐపీఎల్-17లో ప్లే ఆఫ్ల్స్కు చేరుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చైన్నె సూపర్ కింగ్స్‌కు షాకిస్తూ మెరుగైన రన్‌రేట్‌తో విజయం సాధించి ముందంజలో నిలిచింది. ప్లే ఆఫ్స్‌కు చేరాల్సిన నాకౌట్ మ్యాచ్‌లో సీఎక్కేపై 27 పరుగుల తేడాలో ఆర్సీబీ విజయం సాధించింది. ఇక, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లిసిస్కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా డూప్లిసిస్ మాట్లాడుతూ.. బెంగళూరులో ఈ సీజన్‌ను ముగించడం చాలా ఆనందనిచ్చింది. విజయంతో ప్లే ఆఫ్స్‌కు ఎంతో సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. నాకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును బౌలర్ యశ్ దయాల్‌కు అంకితమిస్తున్నాను. యశ్ బౌలింగ్ చేసిన విధానం చాలా బాగుంది. అతడి వల్లే మ్యాచ్ గెలిచాం. అందుకే తనకు అవార్డ్‌ను అంకితమిస్తున్నా. THE WINNING CELEBRATION FROM RCB. 🫡❤️- RCB into the Playoffs after having 1 win out of first 8 matches. 🤯🔥pic.twitter.com/LPFjay2A7C— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 ఇలాంటి పిచ్‌పై పరుగులు చేయడం ఎంతో కష్టం. మా బ్యాటర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించారు. మా బౌలర్లు కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ప్రత్యర్థిని పరుగులు చేయకుండా ఆపగలిగారు. ఈ క్రెడిట్ అంతా మా బౌలర్లదే. ఇక, మా జట్టు ఓడినా.. గెలిచినా ఆర్సీబీ అభిమానులు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాను. ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో కూడా జట్టుగా రాణించి విజయాలను సాధిస్తామనే నమ్మకం ఉంది అంటూ కామెంట్స్ చేశాడు. THE GREATEST COMEBACK IN IPL HISTORY. 🏆- RCB qualified for Playoffs after losing 6 consecutive matches. 🤯pic.twitter.com/eIe6J7Iqhh— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 అదరగొట్టిన ఆర్సీబీ బ్యాటర్స్..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్స్ అందరూ రాణించారు. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీలే లక్ష్యంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. డుప్లెసిస్ (54), కోహ్లి (47), రజత్ పటీదార్ (41), గ్రీన్ (38) చెలరేగడంతో మొదట ఆర్సీబీ 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో ఇన్నింగ్ ప్రారంభించిన చెన్నైకి మొదటి బంతికే ఫామ్‌లో ఉన్న సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ ఔటయ్యాడు. ఇక, మూడో ఓవర్లో మిచెల్ (4) కూడా నిష్క్రమించాడు. దీంతో, 19/2తో సీఎస్కే ఒత్తిడిలో పడిపోయింది. కానీ రచిన్, రహానె (33) నిలబడడంతో కాసేపు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 8 ఓవర్లలో 85/2 స్కోర్‌తో మళ్లీ రేసులో నిలిచింది. ఈ దశలో ఆర్సీబీ బౌలర్ ఫెర్గూసన్.. రహానెను ఔట్ చేయడంతో మ్యాచ్ మళ్లీ ఆర్సీబీ చేతిలోకి వచ్చింది. 14 పరుగుల వ్యవధిలో రచిన్‌తో పాటు దూబె, శాంట్నర్ ఔట్ కావడంతో ఆ జట్టు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. సీఎస్కే 15 ఓవర్లలో 129/6తో నిలిచింది. గెలవాలంటే ఐదు ఓవర్లలో 90 పరుగులు పరిస్థితి. ఓడినా ప్లేఆఫ్స్‌కు చేరాలన్నా 72 పరుగులు చేయాల్సిన స్థితి. అలాంటి దశలో ధోని, జడేజా పోరాడారు. చివరి రెండు ఓవర్లలో ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం 35 (విజయం కోసం కావాల్సింది 53) పరుగులు చేయాలి. ఫెర్గూసన్ వేసిన ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్లో జడేజా, ధోని కలిసి.. 18 పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. ఆఖరి ఓవర్ (యశ్ దయాళ్) తొలి బంతికే ధోని సిక్స్ బాదడంతో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగయ్యాయి. కానీ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి రెండో బంతికి ధోనీని ఔట్ చేశాడు. ఆ తర్వాతి నాలుగు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి ఆర్సీబీకి మరిచిపోలేని విజయాన్ని అందించాడు. -
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్‌ది క్లియర్‌గా నాటౌట్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఔటైన విధానం వివాదస్పదమైంది. ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తీవ్ర చర్చానీయాంశమైంది.ఏమి జరిగిందంటే?ఆర్సీబీ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో సీఎస్కే స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ఐదో బంతి స్టంప్స్ దిశగా వేశాడు. దీంతో రజిత్ పాటిదార్ ఆ డెలివరీని స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. ఈ క్రమంలో శాంట్నర్ బంతిని ఆపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.అయితే బంతి మాత్రం శాంట్నర్ చేతి వేలికి దగ్గరగా వెళ్తూ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో స్టంప్స్‌ను తాకింది. వెంటనే సీఎస్కే ఆటగాళ్లు రనౌట్ అప్పీల్ చేశారు. దీంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. తొలుత బంతి చేతి వేలికి తాకిందా లేదా అని నిర్ధారించుకోవడానికి థర్డ్ అంపైర్ మైఖేల్ గోఫ్ అల్ట్రా ఎడ్జ్ సాయంతో చెక్చేశాడు.అయితే అల్ట్రా ఎడ్జ్‌లో చిన్నగా స్పైక్ రావడంతో బంతి చేతికి వేలికి తాకినట్లు అంపైర్ నిర్ధారించుకున్నాడు. అనంతరం బంతి స్టంప్స్‌కు తాకే సమయానికి బ్యాటర్ క్రీజులోకి వచ్చాడా లేదాన్నది పలు కోణాల్లో అంపైర్ పరిశీలించాడు.ఓ యాంగిల్లో బంతి వికెట్లను తాకే సమయానికే డుప్లిసిస్ తన బ్యాటను గీతను దాటించినట్లు కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం బ్యాట్ గాల్లో ఉందంటూ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు.దీంతో ఫాప్ డుప్లెసిస్‌తో పాటు స్టేడియంలో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. కానీ చేసేదేమి లేక డుప్లెసిస్ (29 బంతుల్లో 54 రన్స్) నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ డుప్లెసిస్‌ది క్లియర్‌గా నాటౌట్, చెత్త అంపైరింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. pic.twitter.com/4hijPiCz9A— Reeze-bubbly fan club (@ClubReeze21946) May 18, 2024 -
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు చెలరేగారు. సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫాప్ డుప్లెసిస్(54) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లి(47), రజిత్ పాటిదార్(41), కామెరాన్ గ్రీన్(38 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు.సీఎస్కే బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ రెండు వికెట్లు, తుషార్ దేశ్‌పాండే, శాంట్నర్ తలా వికెట్ సాధించారు. ఇక ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించాలంటే 18 పరుగుల తేడాతో సీఎస్కేను ఓడించాలి.చదవండి: టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్..! -
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. 2008 నుంచి ఇప్పటి దాకా.. ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. అయినప్పటికీ ఆ జట్టుకు ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్సీబీకి ఉన్నంత విశ్వసనీయమైన ఫ్యాన్ బేస్ మరే జట్టుకు లేదంటారు.నాయకుడి స్థానం నుంచి వైదొలిగిఇంతటి క్రేజ్‌కు కారణం టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అన్న విషయం తెలిసిందే. ఇక్కడే తన ఫ్రాంఛైజీ క్రికెట్ మొదలుపెట్టిన ఈ రన్‌మెషీన్.. ఇప్పటికీ ఆ జట్టుతోనే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనూ కెప్టెన్‌గానూ బాధ్యతలు చేపట్టిన కోహ్లి పనిఒత్తిడిని తగ్గించుకుని.. కేవలం బ్యాటింగ్‌పై ఫోకస్ చేసే క్రమంలో నాయకుడి స్థానం నుంచి 2021 తర్వాత తప్పుకొన్నాడు.గత రెండు సీజన్లుగా సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్‌గా కొనసాగుతుండగా.. కోహ్లి ఓపెనింగ్ బ్యాటర్‌గా సేవలు అందిస్తున్నాడు. అయితే, అతడి సారథ్యంలో గతేడాది ఆరో స్థానంతో ముగించిన ఆర్సీబీ.. ఐపీఎల్-2024 ఆరంభంలో వరుస ఓటములు చవిచూసింది.వరుసగా ఐదు విజయాలు సాధించితర్వాత తిరిగి పుంజుకుని వరుసగా ఐదు విజయాలు సాధించి.. ప్రస్తుతానికి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది. అయితే, కేజీఎఫ్‌గా ప్రసిద్ధి పొందిన ఆర్సీబీ బ్యాటింగ్ త్రయం కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్లలో కేవలం కోహ్లి ఒక్కడే రాణిస్తున్నాడు.ఇప్పటి వరకు ఈ ఎడిషన్‌లో ఆడిన 13 మ్యాచ్‌లలో కలిపి 661 పరుగులు చేసిన కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, జట్టును ప్లే ఆఫ్స్ చేర్చడం మాత్రం కష్టంగా మారింది.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే సీజన్లో విరాట్ కోహ్లిని మళ్లీ కెప్టెన్‌గా ప్రకటించాలని ఆర్సీబీ మేనేజ్మెంట్కు సూచించాడు.ఆర్సీబీకి కోహ్లి కూడా అలాగేఈ మేరకు.. "ఈసారి వాళ్లు(ఆర్సీబీ గనుక ) ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించకపోతే.. భారత క్రికెటర్‌ను కెప్టెన్‌గా తీసుకురావాలి. అయినా ఎవరో ఎందుకు? మళ్లీ కోహ్లినే కెప్టెన్‌ను చేస్తే సరిపోతుంది కదా! చెన్నై జట్టు మీద ధోని ప్రభావం ఎంత ఉంటుందో.. ఆర్సీబీకి కోహ్లి కూడా అలాగే!బలమైన నాయకుడు. జట్టును ఎలా ముందుకు నడిపించాలో అతడికి తెలుసు. ప్రస్తుతం వాళ్లు దూకుడుగానే ఆడుతున్నారు. కోహ్లి సారథిగా వస్తే మరింత బాగుంటుంది. విరాట్ కోహ్లి తిరిగి ఆర్సీబీ పగ్గాలు చేపడితే చూడాలని ఉంది" అని భజ్జీ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు.చదవండి: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు: ధోని ఫ్యాన్స్‌పై సంచలన వ్యాఖ్యలు -
IPL 2024 GT VS RCB: అత్యంత అరుదైన క్లబ్లో చేరిన ఫాఫ్ డుప్లెసిస్
ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టీ20ల్లో అత్యంత అరుదైన క్లబ్లో చేరాడు. నిన్న (మే 4) గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్దసెంచరీతో ఇరగదీసిన ఇతను.. పొట్టి ఫార్మాట్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్న 14వ బ్యాటర్‌గా, తొలి సౌతాఫ్రికన్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. టీ20 కెరీర్లో 369 మ్యాచ్‌లు ఆడిన డుప్లెసిస్.. 134.30 స్ట్రయిక్‌రేట్‌తో 32.17 సగటున 10039 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ 463 మ్యాచ్‌ల్లో 22 సెంచరీలు, 88 హాఫ్ సెంచరీల సాయంతో 14562 పరుగులు చేశాడు. ఈ జాబితాలో గేల్ తర్వాతి స్థానాల్లో షోయబ్ మాలిక్ (13360), పోలార్డ్ (12900), విరాట్ కోహ్లి (12536), అలెక్స్ హేల్స్ (12319), వార్నర్ (12232), రోహిత్ శర్మ (11482), జోస్ బట్లర్ (11465), ఆరోన్ ఫించ్ (11458), కొలిన్ మున్రో (10961), బాబర్ ఆజమ్ (10620), జేమ్స్ విన్స్ (10451), డేవిడ్ మిల్లర్ (10230), డుప్లెసిస్ ఉన్నారు.ఈ మ్యాచ్‌లో చేసిన పరుగులతో కలుపుకుని డుప్లెసిస్ మరో ఘనత సాధించాడు. డుప్లెసిస్ ఆర్సీబీ తరఫున నాలుగో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఆర్సీబీకి ముందు సీఎస్కేకు ఆడిన డుప్లెసిస్ ఆ ఫ్రాంచైజీ తరఫున మూడో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. డుప్లెసిస్ మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో గుజరాత్‌పై ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఆర్సీబీ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో షారుక్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్ (30), రాహుల్ తెవాతియా (35) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతా ప్లేయర్లంతా పెవిలియన్‌కు క్యూకట్టారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కర్ణ్ శర్మ, గ్రీన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. పవర్ ప్లేలో పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోయింది. తొలి ఆరు ఓవర్లలో 92 పరుగులు చేసిన ఆర్సీబీ.. ఆతర్వాత ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయి ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే దినేశ్ కార్తీక్ (21 నాటౌట్).. సప్నిల్ సింగ్ (15 నాటౌట్) సాయంతో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో జాషువ లిటిల్ 4 వికెట్లతో విజృంభించగా.. నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో భారీ జంప్ కొట్టి చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమితో గుజరాత్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. -
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపున్‌కుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఏడో స్ధానానికి చేరుకుంది. ఈమ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది.19.3 ఓవర్లలో 147 పరుగులకు గుజరాత్ ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో షారూఖ్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్(30), రాహుల్ తెవాటియా(35) పర్వాలేదన్పించారు. ఇక ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, విజయ్ కుమార్, యశ్ దయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్, కరణ్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.ఆర్సీబీ బ్యాటర్లలో ఓపెనర్లు ఫాప్ డుప్లెసిస్(23 బంతుల్లో 64), విరాట్ కోహ్లి(27 బంతుల్లో 42) పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత దినేష్ కార్తీక్(21 నాటౌట్), స్వప్నిల్ సింగ్(15) పరుగులతో మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. గుజరాత్ బౌలర్లలో లిటిల్ 4 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ రెండు వికెట్లు సాధించాడు.No RCB RCB fans will pass without liking this. ❤️🔥💫⭐Vintage RCB | Just RCB is RCBing | Can RCB vs GT | Faf du Plessis | Only RCB #RCBvsGT #GTvsRCB #ViratKohli pic.twitter.com/Ou5XvqxCv1— crazy (@cricrazyNandu) May 4, 2024 -
RCB కెప్టెన్‌గా అతడు ఉంటే ఏం మాట్లాడగలరు: సెహ్వాగ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆట తీరుపై విమర్శలు వెల్లుతుతున్నాయి. సొంతమైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో సొంత జట్టు అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఐపీఎల్-2024లో కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరే అవకాశం ఉండదని మండిపడుతున్నారు. ఇక ఇప్పటికే భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి సైతం ఆర్సీబీని కొత్త వాళ్లకు అమ్మేయాలంటూ యాజమాన్యం తీరును విమర్శించాడు. జట్టు నిండా స్టార్లు ఉన్నా ఇలాంటి చెత్త ప్రదర్శన ఏమిటని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అదే ఇక్కడ ప్రధాన సమస్య ‘‘జట్టులో 12- 15 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. కేవలం 10 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. కానీ ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో దాదాపుగా అందరూ విదేశీయులే ఉన్నారు. అదే ఇక్కడ ప్రధాన సమస్య. ఇక ఆటగాళ్లలో కొంతమంది మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నారు. వీరిలో సగం మందికి ఇంగ్లిష్ పూర్తిగా అర్థమే కాదు. అలాంటపుడు ఆ విదేశీ కోచ్‌లు వీరిని ఎలా మోటివేట్ చేయగలరు? వారితో ఎక్కువ సమయం ఎలా గడపగలరు? భాష పూర్తిగా రాని ఆటగాళ్లు తమ సమస్యలను కోచ్‌లకు ఎలా వివరించగలరు? నాకైతే ఆర్సీబీలో ఒక్క ఇండియన్ కోచ్ కూడా కనిపించడం లేదు. కనీసం ఒక్కరైనా అనుభవజ్ఞుడైన కోచ్ ఉంటే బాగుంటుంది కదా! ఆటగాళ్లు ఏది చర్చించాలన్నా అందుకు తగిన వాతావరణం ఉండాలి. కెప్టెన్‌గా అతడు ఉంటే ఏం మాట్లాడతారు? నాకు తెలిసి చాలా మంది ఆటగాళ్లు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దగ్గరికి వెళ్లడానికే సంశయిస్తారు. ఎందుకంటే అతడు ఏదైనా అడిగితే వీరు సమాధానం చెప్పలేరు కదా! ఒకవేళ కెప్టెన్ గనుక భారతీయుడైతే.. సదరు ఆటగాళ్లు తాము అనుకుంటున్న విషయాన్ని స్పష్టంగా అతడికి తెలియజేయగలరు. కానీ విదేశీ ఆటగాడితో సరిగా కమ్యూనికేట్ చేయలేక.. ఒకదానికి బదులు ఇంకొకటి మాట్లాడితే తదుపరి మ్యాచ్‌లో తుదిజట్టులో చోటు దక్కే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఆర్సీబీ సహాయక సిబ్బందిలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురైనా భారతీయులు ఉండాలి’’ అని క్రిక్‌బజ్ షోలో సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి గెలిచి ఆరు ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ హెడ్‌కోచ్‌గా ఆండీ ఫ్లవర్ బాధ్యతలు చేపట్టగా.. బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్, బౌలింగ్ కోచ్‌గా ఆడం గ్రిఫిత్(టాస్మేనియా మాజీ క్రికెటర్), ఫీల్డింగ్ కోచ్‌గా మలోలన్ రంగరాజన్ వ్యవహరిస్తున్నారు. చదవండి: SRH: ‘బాధితులు’ కూడా అసూయ పడేలా.. కమిన్స్ ఏమన్నాడో తెలుసా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మా కుర్రాళ్లు బాగా పోరాడారు.. అదే మా కొంపముంచింది: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో ఆర్సీబీ వరుసగా ఐదో ఓటమి చవచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో బెంగళూరు ఓటమి పాలైంది. మరోసారి బెంగళూరు బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. తొలుత బౌలింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 287 పరుగుల రికార్డు స్కోర్‌ను సమర్పించుకుంది. ట్రావిస్ హెడ్(102) ,హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశారు. అనంతరం లక్ష్య చేధనలో ఆర్సీబీ బ్యాటర్లు ఆఖరి వరకు పోరాడారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో దినేష్ కార్తీక్ అద్బుతమైన పోరాటం చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లతో కార్తీక్ 83 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(62), విరాట్ కోహ్లి(42) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఈ ఓటమితో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఛాన్స్‌లను సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. బౌలింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైమని ఫాప్ చెప్పుకొచ్చాడు. "ఈ మ్యాచ్‌లో మేము ఆఖరి వరకు పోరాడినందుకు సంతోషంగా ఉంది. ఈ సీజన్లో మా నుంచి వచ్చిన మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన ఇదే. చిన్నస్వామి వికెట్ సరిగ్గా టీ20 క్రికెట్‌కు సరిపోతుంది. 280 పైగా టార్గెట్‌ను ఛేజ్ చేయడం అంత సులభం కాదు. కానీ మేము దగ్గరికి వచ్చి ఓడిపోయాం. ఈ మ్యాచ్‌లో కొన్ని మార్పులు చేశాము. కొత్తగా కొన్ని విషయాలను ప్రయత్నించాం. ఫాస్ట్ బౌలర్లు ఈ పిచ్‌పై పూర్తిగా తేలిపోయారు. బ్యాటింగ్ పరంగా మేము బలంగానే ఉన్నాము. మేము ఇంకా కొన్ని విభాగాల్లో ఇంకా మెరుగవ్వాలి. ముఖ్యంగా బౌలింగ్‌పై ఎక్కువ దృష్టిపెట్టాలి. అదే విధంగా బ్యాటింగ్‌లో కూడా పవర్‌ప్లే తర్వాత రన్ రేట్ తగ్గకుండా చూసుకోవాలి. ఈ హైస్కోరింగ్ రన్ ఛేజ్‌లో మా బాయ్స్ ఆఖరి వరకు మ్యాచ్‌ను విడిచిపెట్టలేదు. తొలుత బౌలింగ్‌లో 30-40 పరుగులు ఎక్కువగా ఇచ్చాం. అదే మా కొంపముంచింది. కానీ ఆటలో గెలుపుటములు సహజం. ఓడిపోయినందుకు కచ్చితంగా బాధ ఉంటుంది. కానీ మా మైండ్‌ను ఫ్రెష్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మా తర్వాతి మ్యాచ్‌ల్లో ఆడేందుకు సిద్దంగా ఉండాలి కదా" అంటూ పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో డుప్లెసిస్ పేర్కొన్నాడు. -
IPL2024 RCB vs SRH: హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి..
IPL2024 RCB vs SRH Live Updates: హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి.. ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమి చవిచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఆర్సీబీ ఆఖరివరకు పోరాడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో దినేష్ కార్తీక్ అద్బుతమైన పోరాటం చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లతో కార్తీక్ 83 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(62), విరాట్ కోహ్లి(42) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కండే రెండు, నటరాజన్ ఒక్క వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఎస్ఆర్హెచ్ ఏకంగా 287 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఆర్సీబీ ఆరో వికెట్ డౌన్ 181 పరుగులు వద్ద ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన మహిపాల్ లామ్రోర్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో దినేష్ కార్తీక్(36), రావత్(5) పరుగులతో ఉన్నారు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5 13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఆర్సీబీ విజయానికి 42 బంతుల్లో 128 పరుగులు కావాలి. క్రీజులో దినేష్ కార్తీక్(16), లామ్రోర్(18) పరుగులతో ఉన్నారు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5 ఆర్సీబీ వరుస క్రమంలో మూడు వికెట్లు కోల్పోయింది. 9 ఓవర్ వేసిన మార్కండే బౌలింగ్‌లో పాటిదార్ ఔట్ కాగా.. అనంతరం కమ్మిన్స్ బౌలింగ్‌లో డుప్లెసిస్(62), సౌరవ్ చౌహన్ పెవిలియన్‌కు చేరారు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5 ఆర్సీబీ రెండో వికెట్ డౌన్.. జాక్స్ ఔట్ 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ఉనద్కట్ బౌలింగ్‌లో విల్ జాక్స్ రనౌటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో ఆర్సీబీ ఫాప్ డుప్లెసిస్(51), పాటిదార్ ఉన్నారు. ఆర్సీబీ తొలి వికెట్ డౌన్.. కోహ్లి ఔట్ 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. మార్కండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. చెలరేగి ఆడుతున్న ఆర్సీబీ ఓపెనర్లు.. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. క్రీజులో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లి(25), ఫాప్ డుప్లెసిస్(31) పరుగులతో ఉన్నారు. సన్‌రైజర్స్ విధ్వంసం.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ను ఎస్ఆర్హెచ్ సాధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఎస్ఆర్హెచ్ ఏకంగా 287 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుమందు ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 277 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తో తన రికార్డును తానే తిరగరాసింది. అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఏకంగా 22 సిక్స్‌లు బాదారు. ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్ 233 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. హెన్రిచ్ క్లాసెన్(31 బంతుల్లో 67, 7 సిక్స్‌లు, 4 ఫోర్లు).. ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. 16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 217/2 16 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), మార్క్రమ్(9) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్.. హెడ్ ఔట్ ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. విధ్వంసకర సెంచరీతో చెలరేగిన హెడ్.. ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 41 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు. 14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిస్ క్లాసెన్(39), మార్క్రమ్(2) పరుగులతో ఉన్నారు. ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీ.. ట్రావిస్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లకు హెడ్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై హెడ్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 38 బంతుల్లో హెడ్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 9 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. 102 పరుగులతో హెడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 12 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి1 57 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. 108 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన ఆభిషేక్ శర్మ.. టాప్లీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(79), క్లాసెన్(1) పరుగులతో ఉన్నారు. దంచి కొడుతున్న ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు.. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దంచికొడుతున్నారు. 8 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(33), ట్రావిస్ హెడ్(71) పరుగులతో ఉన్నారు. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ ట్రావిస్ హెడ్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కేవలం 20 బంతుల్లో 5 ఫోర్లు, 3సిక్స్‌లతో హెడ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(23), ట్రావిస్ హెడ్(52) పరుగులతో ఉన్నారు. దంచి కొడుతున్న ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(14), ట్రావిస్ హెడ్(13) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గ్లెన్ మాక్స్వెల్, సిరాజ్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. ఆర్సీబీ తుది జట్టులోకి కివీస్ ఫాస్ట్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ వచ్చాడు. సన్‌రైజర్స్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. తుది జట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, సౌరవ్ చౌహాన్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, విజయ్‌కుమార్ వైషాక్, రీస్ టోప్లీ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్