కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ చివరి అంకానికి చేరుకుంది. సెయింట్ లూసియా కింగ్స్ ఫైనల్స్‌కు చేరింది. ఇవాళ (అక్టోబర్ 3) జరిగిన క్వాలిఫయర్-1లో లూసియా కింగ్స్ గయానా అమెజాన్ వారియర్స్‌పై 15 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతిన) గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అమెజాన్ వారియర్స్‌కు వరుణుడు ఆడ్డు తగిలాడు. వారియర్స్ ఇన్నింగ్స్ 13 ఓవర్ల వరకు సజావుగా సాగింది. ఈ దశలో వర్షం మొదలై మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. వర్షం ఎంతకీ ఆగకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన లూసియా కింగ్స్‌ను విజేతగా ప్రకటించారు. వర్షం ప్రారంభమయ్యే సమయానికి అమెజాన్ వారియర్స్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 106 పరుగులుగా ఉంది.
ఈ మ్యాచ్‌లో గెలుపుతో లూసియా కింగ్స్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. అమెజాన్ వారియర్స్ బార్బడోస్ రాయల్స్‌తో క్వాలిఫయర్-2 ఆడనుంది. అక్టోబర్ 5న జరిగే క్వాలిఫయర్-2లో గెలిచే జట్టు అక్టోబర్ 7న జరిగే ఫైనల్లో లూసియా కింగ్స్‌తో తలపడుతుంది.
రాణించిన డుప్లెసిస్, జాన్సన్ ఛార్లెస్
అమెజాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ (57), జాన్సన్ ఛార్లెస్ (79) అర్ద సెంచరీలతో రాణించారు. వీరిద్దరు మినహా లూసియా ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. రోస్టన్ ఛేజ్, టిమ్ సీఫర్ట్ తలో 18 పరుగులు, డేవిడ్ వీస్ 13, మాథ్యూ ఫోర్డ్ 0, జెర్మియా 1 పరుగు చేశారు. వారియర్స్ బౌలర్లలో మొయిన్ అలీ, ప్రిటోరియస్ తలో రెండు, షమార్ జోసఫ్ ఓ వికెట్ తీశారు.
లక్ష్య ఛేదనలో అమెజాన్ వారియర్స్ కూడా ధాటిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. రహ్మానుల్లా గుర్బాజ్ 24, కీమో పాల్ 14, షాయ్ హోప్ 27, ప్రిటోరియస్ 2 పరుగులు చేసి ఔట్ కాగా.. హెట్‌మైర్ 37, మొయిన్ అలీ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. లూసియా కింగ్స్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, డేవిడ్ వీస్, ఛేజ్, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.
చదవండి: Irani Cup 2024: సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్
Comments
Please login to add a commentAdd a comment