Caribbean Premier League
-
దంచికొట్టిన రోస్టన్, జోన్స్.. కింగ్స్‌దే సీపీఎల్ టైటిల్
కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)-2024 చాంపియన్‌గా సెయింట్ లూసియా కింగ్స్ జట్టు అవతరించింది. గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన ఫైనల్లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. లూసియా కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ రోస్టన్ ఛేజ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.ఆకట్టుకోలేకపోయిన బ్యాటర్లుగయానా వేదికగా.. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున సెయింట్ లూసియా కింగ్స్- గయానా అమెజాన్ వారియర్స్ మధ్య సీపీఎల్ టైటిల్ పోరు జరిగింది. టాస్ గెలిచిన కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.దెబ్బ కొట్టిన నూర్ అహ్మద్వారియర్స్ బ్యాటర్లలో టెయిలెండర్ ప్రిటోరియస్ 25 పరుగులతో టాప్ స్కోర్‌గా నిలవడం గమనార్హం. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ షాయీ హోప్ 22 పరుగులు సాధించాడు. ఇక కింగ్స్ బౌలర్లలో స్పిన్నర్ నూర్ అహ్మద్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 19 పరుగులే ఇచ్చి.. మూడు వికెట్లు కూల్చాడు.ఓపెనర్ మొయిన్ అలీ(14), హిట్టర్ షిమ్రన్ హెట్మెయిర్(11) రూపంలో కీలక వికెట్లు తీసి.. వారియర్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. కింగ్స్ జట్టులోని మిగిలిన బౌలర్లలో ఖారీ పియరీ, మాథ్యూ ఫోర్డ్, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్, డేవిడ్ వీస్ ఒక్కో వికెట్ పడగొట్టారు.దంచికొట్టిన రోస్టన్, జోన్స్ఇక వారియర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ లూసియా కింఘ్స్ 18.1 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్ దంచికొట్టడంతో విజయం సాధ్యమైంది. ఓపెనర్లలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(21) ఫర్వాలేదనిపించగా.. జాన్సన్ చార్ల్స్(7) నిరాశపరిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ టిమ్ సిఫార్ట్ 10 బంతులు ఎదుర్కొని మూడు పరుగులే చేశాడు.ఇలాంటి దశలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రోస్టన్ ఛేజ్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 39 పరుగులతో దుమ్ములేపాడు. ఐదో స్థానంలో వచ్చిన ఆరోన్ జోన్స్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 48 రన్స్ చేశాడు. ఇద్దరూ కలిసి అజేయంగా నిలిచి.. లూసియా కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చారు. PC: SLK Xవిజేతల జాబితా ఇదేకాగా సీపీఎల్‌లో లూసియా కింగ్స్‌కు ఇదే మొట్టమొదటి టైటిల్. ఇక 2013లో వెస్టిండీస్ వేదికగా మొదలైన ఈ టీ20 టోర్నీలో జమైకా తలైవాస్ అరంగేట్ర విజేతగా నిలిచింది. తర్వాత వరుసగా బార్బడోస్ ట్రిడెంట్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో రెడ్‌స్టీల్, జమైకా తలైవాస్, ట్రింబాగో నైట్ రైడర్స్, ట్రింబాగో నైట్ రైడర్స్, బార్బడోస్ ట్రిడెంట్స్, ట్రింబాగో నైట్ రైడర్స్, సెయింట కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్, జమైకా తలైవాస్, గయానా అమెజాన్ వారియర్స్.. తాజాగా సెయింట్ లూసియా కింగ్స్ ట్రోఫీలు కైవసం చేసుకున్నాయి.చదవండి: నేను అలా బౌలింగ్ చేయడానికి కారణం వారే: మయాంక్ యాదవ్ The wait is over 🙌 The Saint Lucia Kings are CPL Champions 🇱🇨🏆#CPL24 #CPLFinals #SLKvGAW #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/nqVbnilsAH— CPL T20 (@CPL) October 7, 2024 -
రాణించిన డుప్లెసిస్, ఛార్లెస్.. సీపీఎల్ ఫైనల్లో లూసియా కింగ్స్
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ చివరి అంకానికి చేరుకుంది. సెయింట్ లూసియా కింగ్స్ ఫైనల్స్‌కు చేరింది. ఇవాళ (అక్టోబర్ 3) జరిగిన క్వాలిఫయర్-1లో లూసియా కింగ్స్ గయానా అమెజాన్ వారియర్స్‌పై 15 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతిన) గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అమెజాన్ వారియర్స్‌కు వరుణుడు ఆడ్డు తగిలాడు. వారియర్స్ ఇన్నింగ్స్ 13 ఓవర్ల వరకు సజావుగా సాగింది. ఈ దశలో వర్షం మొదలై మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. వర్షం ఎంతకీ ఆగకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన లూసియా కింగ్స్‌ను విజేతగా ప్రకటించారు. వర్షం ప్రారంభమయ్యే సమయానికి అమెజాన్ వారియర్స్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 106 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో లూసియా కింగ్స్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. అమెజాన్ వారియర్స్ బార్బడోస్ రాయల్స్‌తో క్వాలిఫయర్-2 ఆడనుంది. అక్టోబర్ 5న జరిగే క్వాలిఫయర్-2లో గెలిచే జట్టు అక్టోబర్ 7న జరిగే ఫైనల్లో లూసియా కింగ్స్‌తో తలపడుతుంది.రాణించిన డుప్లెసిస్, జాన్సన్ ఛార్లెస్అమెజాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ (57), జాన్సన్ ఛార్లెస్ (79) అర్ద సెంచరీలతో రాణించారు. వీరిద్దరు మినహా లూసియా ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. రోస్టన్ ఛేజ్, టిమ్ సీఫర్ట్ తలో 18 పరుగులు, డేవిడ్ వీస్ 13, మాథ్యూ ఫోర్డ్ 0, జెర్మియా 1 పరుగు చేశారు. వారియర్స్ బౌలర్లలో మొయిన్ అలీ, ప్రిటోరియస్ తలో రెండు, షమార్ జోసఫ్ ఓ వికెట్ తీశారు.లక్ష్య ఛేదనలో అమెజాన్ వారియర్స్ కూడా ధాటిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. రహ్మానుల్లా గుర్బాజ్ 24, కీమో పాల్ 14, షాయ్ హోప్ 27, ప్రిటోరియస్ 2 పరుగులు చేసి ఔట్ కాగా.. హెట్‌మైర్ 37, మొయిన్ అలీ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. లూసియా కింగ్స్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, డేవిడ్ వీస్, ఛేజ్, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: Irani Cup 2024: సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్ -
డేవిడ్ మిల్లర్ విధ్వంసం.. కేవలం 17 బంతుల్లోనే
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో క్వాలిఫియర్-2కు బార్బడోస్ రాయల్స్ ఆర్హత సాధించింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం ఎలిమినేటర్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌పై 9 వికెట్ల తేడాతో బార్బడోస్ ఘన విజయం సాధించింది. ఫ్లడ్ లైట్స్ అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ మరోసారి సత్తాచాటాడు. 60 బంతులు ఎదుర్కొన్న పూరన్.. 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు. అతడితో పాటు జాసన్ రాయ్ 25 పరుగులతో రాణించాడు. డీఎల్ఎస్ ప్రకారం రాయల్స్ టార్గెట్‌ను 5 ఓవర్లలో 60 పరుగులగా నిర్ణయించారు.చెలరేగిన మిల్లర్..అనంతరం లక్ష్య చేధనలో బార్బడోస్ స్టార్ ప్లేయయ్, ప్రోటీస్ విధ్వంసకర వీరుడు డేవిడ్ మిల్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మిల్లర్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అతడి ఊచకోత ఫలితంగా బార్బడోస్ కేవలం 4.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. -
పూరన్ సుడిగాలి శతకం
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2024 చివరి లీగ్ దశ మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌పై ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 74 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నికోలస్ పూరన్ సుడిగాలి శతకంతో (59 బంతుల్లో 101; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. HUNDRED FOR NICHOLAS POORAN IN CPL...!!!! 🙇- Pooran is a beast in T20s, What a remarkable consistency. pic.twitter.com/2gn9VaD5c6— Johns. (@CricCrazyJohns) September 30, 2024జేసన్ రాయ్ (26 బంతుల్లో 34), కీసీ కార్తీ (13 బంతుల్లో 27 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. పోలార్డ్ 19, రసెల్ 9, టిమ్ డేవిడ్, పార్రిస్ డకౌట్ అయ్యారు. వారియర్స్ బౌలర్లలో షమార్ జోసఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇమ్రాన్ తాహిర్, ప్రిటోరియస్ తలో వికెట్ దక్కించుకున్నారు.137 పరుగులకే కుప్పకూలిన వారియర్స్212 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అమెజాన్ వారియర్స్ 137 పరుగులకే (18.5 ఓవర్లలో) కుప్పకూలింది. టెర్రన్స్ హిండ్స్, వకార్ సలాంకీల్, నాథన్ ఎడ్వర్డ్స్ తలో మూడు వికెట్లు తీసి వారియర్స్‌ను దెబ్బకొట్టారు. అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. వారియర్స్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ (36), షాయ్ హోప్ (28), గుడకేశ్ మోటీ (26 నాటౌట్), ఇమ్రాన్ తాహిర్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. హెట్‌మైర్ (9), కీమో పాల్ (1), మొయిన్ అలీ (5), రొమారియో షెపర్డ్ (0), ప్రిటోరియస్ (0) విఫలమయ్యారు.ఈ మ్యాచ్ ఫలితంతో ఎలిమినేటర్, క్వాలిఫయర్-1లో తలపడబోయే జట్లేవో తేలిపోయాయి. అక్టోబర్ 1న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ట్రిన్బ్రాగో నైట్‌రైడర్స్, బార్బడోస్ రాయల్స్ తలపడనుండగా.. అక్టోబర్ 2న జరిగే క్వాలిఫయర్-1లో గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్ పోటీ పడనున్నాయి. లీగ్ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాక గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, బార్బడోస్ రాయల్స్ పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచాయి.చదవండి: చెలరేగిన అదైర్ బ్రదర్స్.. సౌతాఫ్రికాపై ఐర్లాండ్ సంచలన విజయం -
రాణించిన హోప్, హెట్‌మైర్.. సరిపోని డుప్లెసిస్ మెరుపులు
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ మ్యాచ్ తర్వాత ప్లే ఆఫ్స్ మొదలవుతాయి. ప్లే ఆఫ్స్ నాలుగు బెర్త్‌లు ఇదివరకే ఖరారైపోయినప్పటికీ.. ఏ జట్టు ఏ స్థానంలో ఉంటున్నది రేపటి మ్యాచ్‌తో తేలనుంది.లీగ్‌లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 28) గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అమెజాన్ వారియర్స్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.రాణించిన హోప్, హోట్మైర్ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. షాయ్ హోప్ (31 బంతుల్లో 56; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), షిమ్రోన్ హెట్‌మైర్ (30 బంతుల్లో 58; 9 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ (26), ఆజమ్ ఖాన్ (26), రొమారియో షెపర్డ్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లూసియా కింగ్స్ బౌలర్లలో డేవిడ్ వీస్ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్ అహ్మద్, అల్జరీ జోసఫ్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు.సరిపోని డుప్లెసిస్ మెరుపులుఅనంతరం 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమతమైంది. డుప్లెసిస్ (59 బంతుల్లో 92 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) లూసియా కింగ్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అతనికి అల్జరీ జోసఫ్ (21 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) తోడుగా నిలిచాడు. లక్ష్యం పెద్దది కావడంతో లూసియా కింగ్స్ గమ్యాన్ని చేరుకోలేకపోయింది. డుప్లెసిస్ మెరుపులు సరిపోలేదు. వారియర్స్ బౌలర్లలో మోటీ, మొయిన్, తాహిర్ తలో రెండు వికెట్లు తీసి లూసియా కింగ్స్‌ను దెబ్బకొట్టారు.చదవండి: NZ Vs SL 2nd Test: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. -
నికోలస్ పూరన్ వరల్డ్ రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
వెస్టిండీస్ స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్ టీ20 క్రికెట్లో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న పూరన్.. తాజా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వరల్డ్ రికార్డు సృష్టించాడు. శనివారం సీపీఎల్‌లో భాగంగా బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగులు చేసిన పూరన్ ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో ఇప్పటివరకు 65 ఇన్నింగ్స్‌ల్లో 42.02 సగటుతో 2,059 పరుగులు చేశాడు. అందులో 14 హాఫ్ సెంచరీలు ఉండడం గమనార్హం. కాగా ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉండేది. 2021 ఏడాదిలో 45 టీ20 ఇన్నింగ్స్‌లలో 2,036 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో రిజ్వాన్ ఆల్‌టైమ్ రికార్డును ఈ కరేబియన్ విధ్వంసకర వీరుడు బ్రేక్ చేశాడు. ఈ ఏడాదిలో టీ20ల్లో వెస్టిండీస్, డర్బన్ సూపర్ జెయింట్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ న్యూయార్క్, నార్తర్న్ సూపర్ ఛార్జర్స్, రంగ్‌పూర్ రైడర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్లకు పూరన్ ప్రాతినిథ్యం వహించాడు. -
కన్నీటిపర్యంతమైన బ్రావో
విండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరీబియన్ ప్రీమియర్ లీగ్-2024లో సెప్టెంబర్ 24న సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ బ్రావో కెరీర్లో చివరి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బ్రావో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మ్యాచ్ అనంతరం బ్రావో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఉబికి వస్తున్న బాధను ఆపుకోలేక కన్నీటిపర్యంతమయ్యాడు. బ్రావో కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. Champion Dwayne Bravo announces his retirement from all formats of cricket.Know more: https://t.co/ljuWjTsGQS— CricTracker (@Cricketracker) September 27, 20242021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బ్రావో.. వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ గెలిచిన రెండు సందర్భాల్లో (2012, 2016) ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. బ్రావో పొట్టి క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. బ్రావో తన టీ20 కెరీర్లో 582 మ్యాచ్‌లు ఆడి 631 వికెట్లు పడగొట్టాడు. బ్రావో తాజాగా ఐపీఎల్లో కేకేఆర్ ఫ్రాంచైజీ మెంటార్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2025 నుంచి బ్రావో కేకేఆర్ మెంటార్‌గా వ్యవహరిస్తాడు. కాగా, 40 ఏళ్ల బ్రావో 2004లో తన అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టాడు. నాటి నుంచి 2021 వరకు అతను విండీస్ జాతీయ జట్టుకు సేవలందించాడు. ఈ మధ్యలో 40 టెస్ట్‌లు, 164 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన బ్రావో తన అంతర్జాతీయ కెరీర్లో 6300 పైచిలుకు పరుగులు సాధించి, 363 వికెట్లు పడగొట్టాడు. బ్రావో 2008 నుంచి 2022 వరకు వివిధ ఫ్రాంచైజీల తరఫున ఐపీఎల్లో ఆడాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో బ్రావో 161 మ్యాచ్‌లు ఆడి 1560 పరుగులు చేసి 183 వికెట్లు తీశాడు. చదవండి: భారత్‌తో టెస్ట్ మ్యాచ్.. బంగ్లాదేశ్ వీరాభిమానిపై దాడి.. ఆసుపత్రికి తరలింపు -
మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడిన హోప్, హెట్‌మైర్
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2024లో భాగంగా బార్బడోస్ రాయల్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 26) జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. షాయ్ హోప్ (37 బంతుల్లో 71; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), షిమ్రోన్ హెట్‌మైర్ (34 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆజమ్ ఖాన్ 17 బంతుల్లో 26 పరుగులు.. రొమారియో షెపర్డ్ 13 బంతుల్లో 23 పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో తీక్షణ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. జేసన్ హోల్డర్, కేశవ్ మహారాజ్, ఓబెద్ మెక్కాయ్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసి 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డేవిడ్ మిల్లర్ (34 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) రాయల్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. క్వింటన్ డికాక్ ఓ మోస్తరు స్కోర్ (35) చేశాడు. వీరిద్దరు మినహా రాయల్స్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. గడకేశ్ మోటీ 3, మొయిన్ అలీ, ఇమ్రాన్ తాహిర్ తలో 2, ప్రిటోరియస్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా, ప్రస్తుత సీపీఎల్ ఎడిషన్‌లో సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్, బార్బడోస్ రాయల్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. చదవండి: విరాట్ కోహ్లి మరో 35 పరుగులు చేస్తే.. -
డుప్లెసిస్ 74వ హాఫ్ సెంచరీ
టీ20 క్రికెట్లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ 74వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ట్రిన్‌బాగో అండ్ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాఫ్ ఈ ఫీట్‌ను సాధించాడు. సెంచరీలతో (6) కలుపుకుని ఫాఫ్ తన కెరీర్లో మొత్తం 80 సార్లు 50 పరుగుల మార్కును దాటాడు.పొట్టి క్రికెట్ చరిత్రలో కేవలం పది మంది (ఫాఫ్‌తో సహా) మాత్రమే ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ టాప్‌లో (112) ఉండగా.. క్రిస్ గేల్ (110), విరాట్ కోహ్లి (106), బాబర్ ఆజమ్ (101), జోస్ బట్లర్ (90), అలెక్స్ హేల్స్ (88), రోహిత్ శర్మ (86), ఆరోన్ ఫించ్ (85), షోయబ్ మాలిక్ (83), ఫాఫ్ డెప్లెసిస్ (80) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు.ట్రిన్‌బాగో అండ్ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ (43 బంతుల్లో 59), జాన్సన్ ఛార్లెస్ (40 బంతుల్లో 89) అర్ద సెంచరీలతో రాణించారు. కీరన్ పోలార్డ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్ 17.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేసింది. డ్వేన్ బ్రావో (0) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. నూర్ అహ్మద్ (3/39), డేవిడ్ వీస్ (2/27) నైట్‌రైడర్స్ పతనాన్ని శాశించగా.. పియెర్రి, అల్జరీ జోసఫ్, రోస్టన్ ఛేజ్, సడ్రక్ డెస్కార్టే తలో వికెట్ పడగొట్టారు. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో హేమాహేమీ హిట్టర్లు ఉన్నా జేసన్ రాయ్ ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ (41) చేశాడు. చదవండి: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. శ్రీలంక తుది జట్టు ప్రకటన -
నేను హార్డ్ హిట్టర్‌ని.. వచ్చే వరల్డ్‌కప్‌లోనూ ఆడతా!
మరో రెండేళ్ల పాటు తాను అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని వెస్టిండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ అన్నాడు. మునుపటి కంటే ఇప్పుడే మరింత ఫిట్‌గా ఉన్నానని.. టీ20 ప్రపంచకప్-2026లోనూ తనను చూస్తారని పేర్కొన్నాడు. తమ కోచ్ డారెన్ సామీ తనను మరికొన్నాళ్లపాటు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాల్సిందిగా కోరాడని.. అలాంటపుడు తానెలా జట్టుకు దూరమవుతానని ప్రశ్నించాడు.హార్డ్ హిట్టర్కాగా 2010లో వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేసిన రసెల్.. టీ20 స్పెషలిస్టుగా గుర్తింపు పొందాడు. జాతీయ జట్టుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పొట్టిలీగ్లలో భాగమవుతూ హార్డ్ హిట్టర్‌గా పేరొందాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 82 టీ20లు ఆడిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్.. 60 వికెట్లు తీయడంతో పాటు 1033 పరుగులు చేశాడు.విధ్వంసకర వీరుడుఇక ఐపీఎల్లో అయితే తనబ్యాటింగ్ తీరుతో విధ్వంసకర వీరుడిగా పేరొందిన ఆండ్రీ రసెల్ 126 మ్యాచ్‌లలో.. 2484 పరుగులు చేశాడు. ఇందులో 170 ఫోర్లు, 209 సిక్సర్లు ఉన్నాయి. ఇక మొత్తంగా 115 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్.ట్రోఫీలు గెలిచిన జట్లలో సభ్యుడుఇక.. వెస్టిండీస్ తరఫున టీ20 ప్రపంచకప్-2012, 2016 ట్రోఫీలు గెలిచిన జట్లలో సభ్యుడైన రసెల్.. చివరగా టీ20 వరల్డ్‌కప్-2024 సందర్భంగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఐసీసీ టోర్నీలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఆఖరిగా ఆడాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024తో బిజీగా ఉన్న రసెల్.. ట్రింబాగో నైట్ రైడర్స్‌కు ఆడుతున్నాడు.ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో 207కు పైగా స్ట్రైక్‌రేటుతో 56 పరుగులు రాబట్టిన రసెల్.. కేవలం ఒకే ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ త్వరలోనే శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటానని 36 ఏళ్ల రసెల్ స్పష్టం చేశాడు.బంతిని బాదగల సత్తా నాకు ఉందిఇండియా టు డేతో మాట్లాడుతూ.. ‘‘2026 వరల్డ్‌కప్‌లో నేను కచ్చితంగా ఆడతాను. ఎందుకంటే నాలో క్రికెట్ ఆడగల సత్తా ఇంకా మిగిలే ఉందని మీకు కూడా తెలుసు. నేను ఇప్పటికే అంతర్జాతీయక్రికెట్ నుంచి తప్పుకొని ఉండవచ్చు. అలా చేస్తే యువ ఆల్రౌండర్లకు అవకాశాలు రావచ్చు.అయితే, నేను ఇప్పటికీ బంతిని అనుకున్న చోటకు బాదగలను. అద్భుతమైన పేస్‌తో బౌలింగ్ చేయగలను. ఇంకా ఫిట్‌గానే ఉన్నాను. కాబట్టి ఇక్కడితో ఎందుకు ఆగిపోవాలి’’ అంటూ రసెల్ ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడు. తమ కోచ్ ఈ విషయం గురించి తనతో చర్చించాడని.. మరికొన్నాళ్లపాటు విండీస్‌కు ఆడతానని తెలిపాడు.చదవండి: వీవీఎస్ లక్ష్మణ్ క్యాచ్ డ్రాప్ చేశా.. నా కెరీర్ అంతటితో ఖతం! -
చరిత్ర సృష్టించిన పూరన్
విండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ టీ20ల్లో ఓ అరుదైన సిక్సర్ల రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భీకర ఫామ్‌లో ఉన్న పూరన్.. టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో 150 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో నిన్న (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో ఏడు సిక్సర్లు బాదిన పూరన్ ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో 63 ఇన్నింగ్స్‌లు ఆడి 151 సిక్సర్లు బాదాడు. పూరన్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఇప్పటివరకు 21 సిక్సర్లు బాదాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో పూరన్ తర్వాతి స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 2015లో 135.. 2012లో 121 సిక్సర్లు బాదాడు.పేట్రియాట్స్‌తో మ్యాచ్‌లో 43 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 93 పరుగులు చేసిన పూరన్.. మరో అరుదైన ఘనత కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. పూరన్ ఈ ఏడాది టీ20ల్లో 2022 పరుగులు చేశాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మొహమ్మద్ రిజ్వాన్ పేరిట ఉంది. రిజ్వాన్ 2021లో 48 ఇన్నింగ్స్‌ల్లో 2036 పరుగులు చేశాడు. పూరన్ తర్వాతి స్థానంలో అలెక్స్ హేల్స్ ఉన్నాడు. హేల్స్ 2022లో 61 మ్యాచ్‌లు ఆడి 1946 పరుగులు చేశాడు.సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ (పూరన్ జట్టు) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్ (61 బంతుల్లో 93; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), కైల్ మేయర్స్ (30 బంతుల్లో 60; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో చెలరేగారు.అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించడంతో 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పూరన్‌తో పాటు జేసన్ రాయ్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.కాగా, ఈ మ్యాచ్ గెలుపుతో సంబంధం లేకుండా నైట్‌రైడర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. నైట్‌రైడర్స్‌తో పాటు సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్, బార్బడోస్ రాయల్స్ ఈ సీజన్ ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఈ సీజన్ నుంచి ఇదివరకే ఎలిమినేట్ అయ్యాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు అక్టోబర్ 1, 2, 4 తేదీల్లో జరుగనున్నాయి. అక్టోబర్ 6న ఫైనల్ జరుగుతుంది. చదవండి: రాణించిన గబ్బర్.. అయినా డీకే జట్టు చేతిలో ఓటమి -
నికోలస్ పూరన్ ఊచకోత.. 6 ఫోర్లు, 7 సిక్సర్లతో..!
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్ (61 బంతుల్లో 93; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), కైల్ మేయర్స్ (30 బంతుల్లో 60; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో చెలరేగారు. రిలీ రొస్సో 20, మికైల్ లూయిస్ 10, ఎవిన్ లూయిస్ 2 పరుగులు చేశారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ 2, జేడన్ సీల్స్, అకీల్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు.THE NICHOLAS POORAN SHOW IN CPL.- 93* (43) with 6 fours and 7 sixes, the unreal dominance of Pooran. 🤯pic.twitter.com/k1f0CYfCaj— Mufaddal Vohra (@mufaddal_vohra) September 23, 2024అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. నికోలస్ పూరన్ (43 బంతుల్లో 93 నాటౌట్; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. జేసన్ రాయ్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కీసీ కార్టీ 13, టిమ్ డేవిడ్ 9, కీరన్ పోలార్డ్ 10 పరుగులు చేశారు. పేట్రియాట్స్ బౌలర్లలో కైల్ మేయర్స్, అన్రిచ్ నోర్జే, తబ్రేజ్ షంషి తలో వికెట్ పడగొట్టారు.కాగా, ప్రస్తుత మ్యాచ్ గెలుపుతో సంబంధం లేకుండా నైట్‌రైడర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. నైట్‌రైడర్స్‌తో పాటు సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్, బార్బడోస్ రాయల్స్ ఈ సీజన్ ప్లే ఆఫ్స్‌కు చేరాయి. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు అక్టోబర్ 1, 2, 4 తేదీల్లో జరుగనున్నాయి. అక్టోబర్ 6న ఫైనల్ జరుగుతుంది.చదవండి: క్లీన్ స్వీప్ పరాభవం తప్పించుకున్న సౌతాఫ్రికా -
ఆండ్రీ రసెల్ విధ్వంసం.. నైట్ రైడర్స్ ఖాతాలో మరో విజయం
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మరో విజయం సాధించింది. గయానా అమెజాన్ వారియర్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 19) జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. నైట్ రైడర్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.రసెల్ విధ్వంసం149 పరుగుల లక్ష్య ఛేదనలో నైట్ రైడర్స్ 89 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆండ్రీ రసెల్ (36).. టిమ్ డేవిడ్‌తో (31) కలిసి నైట్ రైడర్స్‌ను గెలిపించాడు. రసెల్ 15 బంతుల్లో బౌండరీ, నాలుగు సిక్సర్ల సాయంతో విధ్వంసం సృష్టించాడు. నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌లో సునీల్ నరైన్ (11), పూరన్ (10), పోలార్డ్ (8) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.షెపర్డ్ మెరుపు హాఫ్ సెంచరీఅంతకుముందు రొమారియో షెపర్డ్ మెరుపు హాఫ్ సెంచరీతో (24 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో వారియర్స్ ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. టిమ్ రాబిన్సన్ (34), ప్రిటోరియస్ (21 నాటౌట్), మొయిన్ అలీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. నైట్ రైడర్స్ బౌలర్లలో నరైన్, వకార్ సలాంఖీల్ తలో రెండు, బ్రావో, అకీల్ హొసేన్ చెరో వికెట్ పడగొట్టారు.కాగా, ఈ సీజన్లో నైట్ రైడర్స్ ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించిన బార్బడోస్ రాయల్స్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్, ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ చివరి నుంచి రెండు స్థానాల్లో ఉన్నాయి.చదవండి: IND VS BAN 1st Test: నిరాశపరిచిన రోహిత్ -
రాణించిన రకీమ్, డికాక్.. ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన రాయల్స్
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యింది. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన తొలి జట్టు రాయల్సే. ఇవాళ (సెప్టెంబర్ 18) జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్.. రకీమ్ కార్న్‌వాల్ (4-0-16-5), నవీన్ ఉల్ హక్ (4-0-21-3), ఓబెద్ మెక్కాయ్ (2.1-0-11-2) ధాటికి 110 పరుగులకే (19.1 ఓవర్లలో) కుప్పకూలింది. పేట్రియాట్స్ ఇన్నింగ్స్‌లో ఆండ్రీ ఫ్లెచర్ (32), జాషువ డసిల్వ (25), అన్రిచ్ నోర్జే (22), హసరంగ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 11.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. క్వింటన్ డికాక్ (59 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు. ఈ సీజన్లో డికాక్‌కు ఇది మూడో ఫిఫ్టి ప్లస్ స్కోర్. డికాక్ గత మ్యాచ్‌లో సెంచరీ చేశాడు.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఈ సీజన్లో రాయల్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. మరోవైపు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఈ సీజన్లో పేలవ ప్రదర్శనలు కనబరుస్తూ పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సెయింట్ లూసియా కింగ్స్ రెండో స్థానంలో, గయానా అమెజాన్ వారియర్స్ మూడు, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ నాలుగో స్థానంలో, ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ ఐదో స్థానంలో ఉన్నాయి.చదవండి: ఐదు వికెట్లతో చెలరేగిన భారీకాయుడు -
ఐదు వికెట్లతో చెలరేగిన భారీకాయుడు
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో క్రికెట్ భారీకాయుడు రకీమ్ కార్న్‌వాల్ చెలరేగిపోయాడు. బార్బడోస్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించే రకీమ్.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడు. భారీ సిక్సర్లు అలవోకగా కొట్టగలడని పేరున్న రకీమ్ ఈసారి బంతితో సత్తా చాటాడు. FIVE WICKET HAUL FOR RAHKEEM CORNWALL. ⚡🤯- The Magician of Barbados Royals in CPL 2024...!!!! pic.twitter.com/49zUlypBjZ— Johns. (@CricCrazyJohns) September 18, 2024ఈ మ్యాచ్‌లో రకీమ్ తన కోటా నాలుగు ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. రకీమ్‌తో పాటు నవీన్ ఉల్ హక్ (4-0-21-3), ఓబెద్ మెక్కాయ్ (2.1-0-11-2) రాణించడంతో పేట్రియాట్స్ 110 పరుగులకే (19.1 ఓవర్లలో) కుప్పకూలింది. పేట్రియాట్స్ ఇన్నింగ్స్‌లో ఆండ్రీ ఫ్లెచర్ (32), జాషువ డసిల్వ (25), అన్రిచ్ నోర్జే (22), హసరంగ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.కాగా, ప్రస్తుత కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఎడిషన్‌లో బార్బడోస్ రాయల్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట విజయాలు సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. మరోవైపు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఈ సీజన్లో పేలవ ప్రదర్శనలు కనబరుస్తూ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సెయింట్ లూసియా కింగ్స్ రెండో స్థానంలో, గయానా అమెజాన్ వారియర్స్ మూడు, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ నాలుగో స్థానంలో, ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ ఐదో స్థానంలో ఉన్నాయి.చదవండి: ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్.. -
వీస్ మెరుపు బ్యాటింగ్.. లూసియా కింగ్స్ ఘన విజయం
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 16) జరిగిన మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ 26 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. డేవిడ్ వీస్ మెరుపు ఇన్నింగ్స్‌తో (26 బంతుల్లో 43 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) రాణించగా.. అకీమ్ అగస్ట్ (35), జాన్సన్ చార్లెస్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. డుప్లెసిస్ (14), రోస్టన్ ఛేజ్ (0), టిమ్ సీఫర్ట్ (13), భానుక రాజపక్స (1) తక్కువ స్కోర్లకే ఓటయ్యారు. ఫాల్కన్స్ బౌలర్లలో క్రిస్ గ్రీన్ 4, షమార్ స్ప్రింగర్ 3, కోఫి జేమ్స్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఫాల్కన్స్‌ను కింగ్స్ స్పిన్నర్లు చాలా ఇబ్బంది పెట్టారు. ఖారీ పియెర్ (4-1-24-3), రోస్టన్ ఛేజ్ (3-1-15-1), నూర్ అహ్మద్ (4-0-13-2) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి ఫాల్కన్స్ పతనాన్ని శాశించారు. వీరి ధాటికి ఫాల్కన్స్ 28 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి, 8 వికెట్ల నష్టానికి 125 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. ఆఖర్లో క్రిస్ గ్రీన్ (48).. షమార్ స్ప్రింగర్ (24), రోషన్ ప్రైమస్ (17 నాటౌట్) సహకారంతో ఫాల్కన్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. చదవండి: ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ సంచలన విజయం -
CPL 2025: డికాక్ విధ్వంసకర సెంచరీ.. 8 ఫోర్లు, 9 సిక్స్‌లతో
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో బార్బడోస్ రాయల్స్ మరో అద్భుత విజయం సాధించింది. కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో బార్బడోస్ రాయల్స్ గెలుపొందింది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గయానా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. గయానా బ్యాటర్లలో షాయ్ హోప్(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు మొయిన్ అలీ(33), కీమో పాల్(30) తమవంతు ప్రయత్నం చేసినప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. బార్బడోస్ బౌలర్లలో కేశవ్ మహారాజ్ 3 వికెట్లు పడగొట్టగా.. హోల్డర్ రెండు వికెట్లు సాధించారు.డికాక్ విధ్వంసకర సెంచరీ..అంతకముందు బ్యాటింగ్ చేసిన బార్బోడస్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బార్బోడస్ ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు.ఈ మ్యాచ్‌లో 68 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 8 ఫోర్లు, 9 సిక్స్‌లతో 115 పరుగులు చేశాడు. డికాక్‌కు ఇదే తొలి సీపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. అతడితో పాటు హోల్డర్(10 బంతుల్లో 28,3 సిక్స్‌లు, ఒక ఫోర్) మెరుపులు మెరిపించాడు.టాప్‌లో గయానా..ఇక ఈ విజయంతో బార్బోడస్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన బార్బోడస్ నాలుగింట విజయం సాధించి టాప్‌లో కొనసాగుతోంది. బార్బోడస్ తర్వాత గయానా, ట్రినాబాగో నైట్‌రైడర్స్, సెయింట్ లూసియా వరుసగా ఉన్నాయి.చదవండి: ఇద్దరం ఒకే జట్టుకు ఆడాము.. అయినా నన్ను స్లెడ్జ్ చేశాడు: ధ్రువ్ -
డుప్లెసిస్ ఊచకోత.. కేవలం 31 బంతుల్లోనే! వీడియో
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో సెయింట్ లూసియా కింగ్స్ తమ మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రాస్ ఐలెట్ వేదికగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. సెయింట్ కిట్స్ బ్యాటర్లలో ఆండ్రీ ఫ్లెచర్(62), రూసో హాఫ్ సెంచరీలతో మెరిశారు. సెయింట్ లూసియా బౌలర్లలో ఆల్జారీ జోషఫ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఛేజ్, వీస్, సద్రక్ తలా వికెట్ సాధించారు.డుప్లెసిస్ ఊచకోత..అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని సెయింట్ లూసియా కింగ్స్ 16.3 ఓవర్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. లక్ష్య చేధనలో ఓపెనర్లు ఫాప్ డుప్లెసిస్, జాన్సెన్ చార్లెస్ విధ్వంసం సృష్టించారు. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశారు. చార్లెస్ 42 బంతుల్లో 4ఫోర్లు, 7 సిక్స్‌లతో 74 పరుగులు చేయగా.. డుప్లెసిస్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లలో హసరంగా,క్లార్క్సన్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా డుప్లెసిస్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పాయింట్ల పట్టిక విషయానికి వస్తే.. గయానా ఆమెజాన్ వారియర్స్ తొలి స్ధానంలో ఉండగా.. సెయింట్ లూసియా మూడో స్ధానంలో కొనసాగుతోంది. చదవండి: అంతా అనుకున్నట్టే జరిగింది.. న్యూజిలాండ్- అఫ్గాన్ టెస్టు రద్దు pic.twitter.com/ex0bSYNHN4— Cricket Cricket (@cricket543210) September 13, 2024 -
రాణించిన డికాక్.. రాయల్స్ హ్యాట్రిక్ విజయం
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 12) బార్బడోస్ రాయల్స్, ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఫాల్కన్స్‌పై రాయల్స్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 10 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. జస్టిన్ గ్రీవ్స్ (61 నాటౌట్), సామ్ బిల్లింగ్స్ (56) అర్ద సెంచరీలతో రాణించారు. రాయల్స్ బౌలర్లలో జేసన్ హోల్డర్, నవీన్ ఉల్ హక్ తలో 2, కేశవ్ మహారాజ్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు ఛేదనకు దిగిన రాయల్స్‌కు వరుణుడు వరుస క్రమాల్లో అడ్డుతగిలాడు. 14.3 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం ఎంతకీ ఆగకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన రాయల్స్‌ను విజేతగా ప్రకటించారు. ఆ సమయానికి రాయల్స్ 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి డీఎల్ఎస్ స్కోర్‌కు 10 పరుగులు అధికంగా ఉండింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో క్వింటన్ డికాక్ (48), అలిక్ అథనాజ్ (34) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. రోవ్‌మన్ పావెల్ 15, డేవిడ్ మిల్లర్ 19 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫాల్కన్స్ బౌలర్లలో క్రిస్ గ్రీన్, రోషన్ ప్రైమస్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో రాయల్స్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. బ్యాటింగ్‌లో 48 పరుగులు చేసి, వికెట్‌కీపింగ్‌తో ముగ్గురిని ఔట్ చేసిన డికాక్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్: ఒక్క ఫోర్ లేదు! అన్నీ సిక్సర్లే! -
పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్: ఒక్క ఫోర్ లేదు! అన్నీ సిక్సర్లే!
వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ కీరన్ పొలార్డ్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ అభిమానులకు కనువిందు చేశాడు. కేవలం పందొమ్మిది బంతుల్లోనే 52 పరుగులు సాధించి సత్తా చాటాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)-2024లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో మ్యాచ్‌లో ఈ మేరకు తుఫాన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.రోస్టన్ చేజ్ హాఫ్ సెంచరీకాగా సీపీఎల్ తాజా ఎడిషన్‌లో పొలార్డ్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన లూసియా కింగ్స్ సొంత మైదానంలో మెరుగైన స్కోరు సాధించింది. ఓపెనర్లు, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(26 బంతుల్లో 34), జె.చార్ల్స్(14 బంతుల్లో 29) శుభారంభం అందించగా.. రోస్టన్ చేజ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన చేజ్ 40 బంతుల్లో 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా భనుక రాజపక్స(29 బంతుల్లో 33) కూడా ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 187 పరుగులు సాధించింది. ట్రిన్‌బాగో బౌలర్లలో సునిల్ నరైన్, వకార్ సలామ్‌ఖీల్ రెండేసి వికెట్లు తీయగా.. టెర్రాన్స్ హిండ్స్, పొలార్డ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఆకాశమే హద్దుగా పొలార్డ్ఈ క్రమంలో లూసియా కింగ్స్ విధించిన లక్ష్య ఛేదనకు దిగిన ట్రిన్‌బాగోకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు జేసన్ రాయ్(15 బంతుల్లో 16), సునిల్ నరైన్(8 బంతుల్లో 14) విఫలమయ్యారు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ షకెరె పారిస్ 33 బంతుల్లో 57 పరుగులతో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.సిక్సర్ల వర్షంమిగతా వాళ్లలో నికోలస్ పూరన్(17), కేసీ కార్టీ(15) పూర్తిగా నిరాశపరచగా.. పొలార్డ్ రంగంలోకి దిగిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఈ ఆల్‌రౌండర్. ఏడు సిక్సర్ల సాయంతో 19 బంతుల్లోనే 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పందొమ్మిదో ఓవర్లోనే నాలుగు సిక్సర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఆఖరి ఓవర్లో అకీల్ హొసేన్ ఫోర్ బాదడంతో.. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ట్రిన్‌బాగో గెలుపు ఖరారైంది. లూయిస్ కింగ్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన కీరన్ పొలార్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.సెయింట్ లూయీస్ వర్సెస్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ స్కోర్లులూయీస్ కింగ్స్- 187/6 (20 ఓవర్లు)నైట్ రైడర్స్- 189/6 (19.1 ఓవర్లు)ఫలితం- కింగ్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో నైట్ రైడర్స్ విజయం.టాప్‌లో అమెజాన్ వారియర్స్కాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో గయానా అమెజాన్ వారియర్స్ మూడు విజయాల(ఆరు పాయింట్లు)తో పట్టికలో టాప్‌లో ఉండగా.. బార్బడోస్ రాయల్స్ రెండింట రెండు గెలిచి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ట్రిన్‌బాగో నైట్ రైడర్స్మూడింట రెండు గెలిచి మూడు, ఆంటిగ్వా-బర్బుడా ఫాల్కన్స్ ఆరింట రెండు గెలిచి నాలుగు, సెయింట్ లూసియా కింగ్స్ నాలుగింట రెండు గెలిచి ఐదు, సెయింట్ కిట్స్- నెవిస్ పేట్రియాట్స్ ఆరింట ఒకటి గెలిచి అట్టడుగున ఆరో స్థానంలో ఉంది.చదవండి: హిట్‌మ్యాన్ మరో 10 పరుగులు చేస్తే..! Kieron Pollard is awarded @Dream11 MVP! Well done Polly 🙌🏾 #CPL24 #SLKvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Dream11 pic.twitter.com/AASf9KO7mC— CPL T20 (@CPL) September 11, 2024 -
గుర్బాజ్ ఊచకోత.. ఒక్క బౌండరీ లేదు.. అన్నీ సిక్సర్లే..!
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 19 బంతుల్లో 7 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. 101 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో మాథ్యూ ఫోర్డ్ వేసిన మూడో ఓవర్లో గుర్బాజ్ శివాలెత్తిపోయాడు. హ్యాట్రిక్ సిక్సర్లు సహా మొత్తం నాలుగు సిక్సర్లు బాదాడు. గుర్బాజ్ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ లేదు. అన్నీ సిక్సర్లే. గుర్బాజ్ ఊచకోత ధాటికి వారియర్స్ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలో ఛేదించింది. గుర్బాజ్‌కు జతగా టిమ్ రాబిన్సన్ (20 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. pic.twitter.com/aXt21tOfvL— Cricket Cricket (@cricket543210) September 8, 2024వారియర్స్ ఇన్నింగ్స్‌లో షాయ్ హోప్ 11, ఆజమ్ ఖాన్ 0, హెట్‌మైర్ 8, కీమో పాల్ 1 పరుగు చేశారు. లూసియా కింగ్స్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్.. గుడకేశ్ మోటీ (3.3-0-16-3), ఇమ్రాన్ తాహిర్ (4-0-29-3), కీమో పాల్ (2-0-19-2), ప్రిటోరియస్ (2-0-10-1) ధాటికి 14.3 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌటైంది. లూసియా కింగ్స్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ ఫోర్డ్ (31), జాన్సన్ ఛార్లెస్ (19), టిమ్ సీఫర్ట్ (12), అకీమ్ అగస్ట్ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ గెలుపుతో వారియర్స్ సీజన్లో వరుసగా మూడో విజయం నమోదు చేసింది. లూసియా కింగ్స్ సీజన్ తొలి ఓటమిని ఎదుర్కొంది. -
వెల్లలగే ఆల్‌రౌండ్ షో.. ఉత్కంఠ పోరులో రాయల్స్ విజయం
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్బడోస్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్య ఛేదనలో రాయల్స్ మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ర్యాన్ జాన్ బౌలింగ్‌లో న్యీమ్ యంగ్ సిక్సర్ బాది రాయల్స్‌ను గెలిపించాడు. దునిత్ వెల్లలగే ఆల్‌రౌండ్ షోతో (3/35, 39) అదరగొట్టి రాయల్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మిఖైల్ లూయిస్ 30, హసరంగ 40, జోష్ క్లార్క్సన్ 24, ర్యాన్ జాన్ 29 పరుగులు చేశారు. పేట్రియాట్స్ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు డకౌట్లయ్యారు. రాయల్స్ బౌలర్లలో వెల్లలగే 3, తీక్షణ, మెక్కాయ్ తలో 2 వికెట్లు పడగొట్టారు.వెల్లలగే ఆల్‌రౌండ్ షో154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. వెల్లలగే (39), కడీమ్ అలెన్ (30) రాణించడంతో 19.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. బంతితో రాణించిన వెల్లలగే బ్యాట్‌తో కూడా రాణించాడు. -
చరిత్ర సృష్టించిన హెట్‌మైర్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో గయానా అమెజాన్ వారియర్స్ మరో అద్బుత విజయం సాధించింది. ఈ లీగ్‌లో భాగంగా గురువారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో అమెజాన్ వారియర్స్ విజయభేరి మోగిచింది.267 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ కిట్స్ 18 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటైంది. సెయింట్ కిట్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఆండ్రీ ఫ్లెచర్(33 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 81 పరుగులు) అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. మిగితా బ్యాటర్ల నుంచి ఆశించినంత మేర సహకారం అందకపోవడంతో సెయింట్ కిట్స్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. గయానా బౌలర్లలో స్పిన్నర్లు ఇమ్రాన్ తహీర్, మోటీ తలా మూడు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిటోరియస్ రెండు, కిమో పాల్, రిఫర్ చెరో వికెట్ పడగొట్టారు.హెట్‌మైర్ విధ్వంసం..ఇక తొలుత బ్యాటింగ్ చేసిన గయానా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గయానా బ్యాటర్లలో షిమ్రాన్ హెట్‌మైర్ విధ్వంసం సృష్టించాడు. తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన హెట్‌మైర్.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. 39 బంతులు ఎదుర్కొన్న ఈ కరేబియన్ ఆటగాడు 11 సిక్స్‌లు సాయంతో 91 పరుగులు చేశాడు.అతడితో పాటు గుర్బాజ్ 69 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.హెట్‌మైర్ వరల్డ్ రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన హెట్‌మైర్ ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్ కూడా కొట్టకుండా పదికి పైగా సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా హెట్‌మైర్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 11 సిక్స్‌లు బాదిన హెట్‌మైర్ కనీసం ఒక్క ఫోరు కూడా కొట్టకపోవడం విశేషం. అంతకుముందు ఫోరు కూడా లేకుండా అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు ఇంగ్లండ్ ఇంగ్లండ్ ఆటగాడు రికీ వెసెల్స్ పేరిట ఉండేది. 2019లో టీ20 బ్లాస్ట్ మ్యాచ్‌లో నాటింగ్హామ్షైర్పై రికీ వెసెల్స్ బౌండరీ లేకుండా 9 సిక్సర్లు బాదాడు. Shimron Hetmyer is today's Dream11 MVP. pic.twitter.com/dKFLBJoAmp— CPL T20 (@CPL) September 5, 2024 -
CPL 2024: రాణించిన నూర్ అహ్మద్, సీఫర్ట్
కరీబియర్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో సెయింట్ లూసియా కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో ఆ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో జయభేరి మోగించింది. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో నూర్ అహ్మద్ (4-0-18-3), బ్యాటింగ్‌లో టిమ్ సీఫర్ట్ (11 బంతుల్లో 26 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించి లూసియా కింగ్స్‌ను గెలిపించారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. జట్టులో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జస్టిన్ గ్రీవ్స్ (36), ఇమాద్ వసీం (29 నాటౌట్), ఫఖర్ జమాన్ (21) పర్వాలేదనిపించారు. లూసియా కింగ్స్ బౌలర్లలో నూర్ అహ్మద్‌తో పాటు డేవిడ్ వీస్, అల్జరీ జోసఫ్, రోస్టన్ ఛేజ్, ఖారీ పియెర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన లూసియా కింగ్స్.. 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సీఫర్ట్ మెరుపు వేగంతో పరుగులు చేయగా.. జాన్సన్ ఛార్టెస్ (46 బంతుల్లో 47 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడాడు. డుప్లెసిస్ 28, రాజపక్ష 9, అకీమ్ 27 పరుగులు చేశారు. ఫాల్కన్స్ బౌలర్లలో ఇమాద్ వసీం, క్రిస్ గ్రీన్, ఫేబియన్ అలెన్ తలో వికెట్ పడగొట్టారు. లీగ్‌లో భాగంగా రేపు సెయింట్ కిట్స్, గయానా అమెజాన్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. -
ఎవిన్ లూయిస్ విధ్వంసకర శతకం
కరీబియర్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో తొలి శతకం నమోదైంది. సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఆటగాడు ఎవిన్ లూయిస్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో లూయిస్ 54 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో కైల్ మేయర్స్ కూడా శతకానికి చేరువగా వచ్చి ఔటయ్యాడు. మేయర్స్ 62 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. లూసియా కింగ్స్ బౌలర్లలో డేవిడ్ వీస్ రెండు వికెట్లు పడగొట్టాడు.202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్.. భానుక రాజపక్స (35 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), టిమ్ సీఫర్ట్ (27 బంతుల్లో 64; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) పేట్రేగిపోవడంతో 17.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. ఆఖర్లో డేవిడ్ వీస్ (20 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝులిపించాడు. పేట్రియాట్స్ బౌలర్లలో కైల్ మేయర్స్, అన్రిచ్ నోర్జే తలో రెండు వికెట్లు, ఓడియన్ స్మిత్ ఓ వికెట్ పడగొట్టారు. ఎవిన్ లూయిస్ సెంచరీతో చెలరేగినా పేట్రియాట్స్ ఓడిపోవడం గమనార్హం.