
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్బడోస్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్య ఛేదనలో రాయల్స్ మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ర్యాన్ జాన్ బౌలింగ్‌లో న్యీమ్ యంగ్ సిక్సర్ బాది రాయల్స్‌ను గెలిపించాడు. దునిత్ వెల్లలగే ఆల్‌రౌండ్ షోతో (3/35, 39) అదరగొట్టి రాయల్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మిఖైల్ లూయిస్ 30, హసరంగ 40, జోష్ క్లార్క్‌సన్ 24, ర్యాన్ జాన్ 29 పరుగులు చేశారు. పేట్రియాట్స్ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు డకౌట్లయ్యారు. రాయల్స్ బౌలర్లలో వెల్లలగే 3, తీక్షణ, మెక్‌కాయ్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
వెల్లలగే ఆల్‌రౌండ్ షో
154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. వెల్లలగే (39), కడీమ్ అలెన్ (30) రాణించడంతో 19.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. బంతితో రాణించిన వెల్లలగే బ్యాట్‌తో కూడా రాణించాడు.
Comments
Please login to add a commentAdd a comment