Dunith Wellalage
-
SL vs WI 2nd T20I: విండీస్‌ను చిత్తు చేసిన శ్రీలంక
వెస్టిండీస్ చేతిలో తొలి టీ20లో ఎదురైన పరాభవానికి శ్రీలంక ప్రతీకారం తీర్చుకుంది. దంబుల్లా వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి నామమాత్రపు స్కోరుకే పరిమితమైనా.. బౌలర్ల విజృంభణ కారణంగా జయకేతనం ఎగురవేసింది. విండీస్‌ను 73 పరుగుల తేడాతో చిత్తు చేసి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.పరిమిత ఓవర్ల సిరీస్ కోసంకాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్ జట్టు శ్రీలంక పర్యటనకు వచ్చింది. పొట్టి సిరీస్‌కు దంబుల్లా, వన్డే సిరీస్‌కు పల్లెకెలె ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం తొలి టీ20లో విండీస్ గెలవగా.. మంగళవారం శ్రీలంక జయభేరి మోగించింది.నిసాంక హాఫ్ సెంచరీటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్,ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పాతుమ్ నిసాంక (49 బంతుల్లో 54; 9 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీతో రాణించగా... కుశాల్ మెండిస్ (26; 2 ఫోర్లు, ఒక సిక్సర్), కుశాల్ పెరీరా (24; 3 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించారు.బౌలర్లు పడగొట్టేశారుఇక విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 16.1 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రావ్మన్ పావెల్ (17 బంతుల్లో 20; ఒక ఫోర్, ఒక సిక్స్) టాప్ స్కోరర్. బ్రాండన్ కింగ్ (5), ఎవిన్ లూయిస్ (7), ఆండ్రూ ఫ్లెచర్ (4), రోస్టన్ చేజ్ (0) పూర్తిగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో టీ20 అరంగేట్ర ఆటగాడు దునిత్ వెల్లలాగె 3, మహీశ్ తీక్షణ, అసలంక, హసరంగ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సిరీస్‌లోని చివరిదైన మూడో టీ20 గురువారం జరుగనుంది.చదవండి: T20 WC: భారత్ అవుట్!.. ఇంత చెత్తగా ఆడతారా?: పాక్ మాజీ కెప్టెన్ -
ఐసీసీ అవార్డులలో సత్తాచాటిన శ్రీలంక ప్లేయర్స్..
అంతర్జాతీయ క్రికెట్లో ప్రతీ నెలా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పురుష, మహిళ క్రికెటర్లకు 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్' అవార్డులను ఇస్తుంది. తాజాగా ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. ఈ అవార్డులలో శ్రీలంక ప్లేయర్స్ సత్తాచాటారు.పురుషుల, మహిళల విభాగాల్లో రెండు అవార్డులు కూడా శ్రీలంకకే దక్కడం గమనార్హం. మెన్స్ కేటగిరీలో లంక యువ స్పిన్ సంచలనం దునీత్ వెల్లలాగే, మహిళల క్రికెట్ విభాగంలో శ్రీలంక స్టార్ బ్యాటర్ హర్షిత సమరవిక్రమ ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నారు.అదరగొట్టిన దునీత్..గత నెలలో స్వదేశంలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వెల్లలాగే కీలక పాత్ర పోషించాడు. లంక సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో వెల్లలాగే కీలక పాత్ర పోషించాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వెల్లలాగే 133 పరుగులతో పాటు 7 వికెట్లు పడగొట్టాడు. అందులో ఓ ఫైవ్ వికెట్ హాల్ కూడా ఉంది. ఈ క్రమంలోనే అతడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. తద్వారా ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు అందుకున్న ఐదో లంక ఆటగాడిగా దునీత్ నిలిచాడు. ఈ జాబితాలో ఏంజెలో మాథ్యూస్ (మే 2022), ప్రబాత్ జయసూర్య (జూలై 2022), వనిందు హసరంగా (జూన్ 2023), కమిందు మెండిస్ (మార్చి 2024) ఉన్నారు. మరోవైపు లంక మహిళా క్రికెటర్ హర్షిత సమరవిక్రమ ఐర్లాండ్ పర్యటనలో అదరగొట్టింది.చదవండి: కోహ్లిని చూసి నేర్చుకో బాబర్.. లేకుంటే కష్టమే: యూనిస్ ఖాన్ -
వెల్లలగే ఆల్‌రౌండ్ షో.. ఉత్కంఠ పోరులో రాయల్స్ విజయం
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్బడోస్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్య ఛేదనలో రాయల్స్ మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ర్యాన్ జాన్ బౌలింగ్‌లో న్యీమ్ యంగ్ సిక్సర్ బాది రాయల్స్‌ను గెలిపించాడు. దునిత్ వెల్లలగే ఆల్‌రౌండ్ షోతో (3/35, 39) అదరగొట్టి రాయల్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మిఖైల్ లూయిస్ 30, హసరంగ 40, జోష్ క్లార్క్సన్ 24, ర్యాన్ జాన్ 29 పరుగులు చేశారు. పేట్రియాట్స్ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు డకౌట్లయ్యారు. రాయల్స్ బౌలర్లలో వెల్లలగే 3, తీక్షణ, మెక్కాయ్ తలో 2 వికెట్లు పడగొట్టారు.వెల్లలగే ఆల్‌రౌండ్ షో154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. వెల్లలగే (39), కడీమ్ అలెన్ (30) రాణించడంతో 19.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. బంతితో రాణించిన వెల్లలగే బ్యాట్‌తో కూడా రాణించాడు. -
ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వీరే..!
ఆగస్ట్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 5) ప్రకటించింది. పురుషుల విభాగంలో సౌతాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్, శ్రీలంక ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలగే అవార్డు రేసులో ఉండగా.. మహిళల విభాగంలో శ్రీలంకకు చెందిన హర్షిత సమరవిక్రమ, ఐర్లాండ్ ఆల్‌రౌండర్ ఓర్లా ప్రెండర్‌గాస్ట్, ఐర్లాండ్ ఓపెనర్ గాబీ లూయిస్ పోటీలో ఉన్నారు.కేశవ్ మహారాజ్: ఈ దక్షిణాఫ్రికా స్పిన్నర్ గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లలో విశేషంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. మహారాజ్ ఈ రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.జేడెన్ సీల్స్: ఈ విండీస్ ఫాస్ట్ బౌలర్ గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 12 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్‌లో సీల్స్ ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. తద్వారా అతను ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి ఎగబాకాడు.దునిత్ వెల్లలగే: ఈ లంక ఆల్‌రౌండర్ గత నెలలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. వెల్లలగే తొలి వన్డేలో 67 నాటౌట్, రెండో వన్డేలో 39 మరియు రెండు వికెట్లు, మూడో వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. -
SL VS PAK: శ్రీలంక యువ సంచలనం అరుదైన ఘనత
శ్రీలంక యువ సంచలన స్పిన్నర్ దునిత్ వెల్లలగే అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియాకప్‌లో టాప్-10 ర్యాంకింగ్స్‌లో ఉన్న నాలుగురు బ్యాటర్లను ఔట్ చేశాడు. వరల్డ్ నంబర్ వన్ వన్డే బ్యాటర్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు వరల్డ్ నంబర్ 2 బ్యాటర్, టీమిండియా యంగ్ గన్ శుభ్‌మన్ గిల్.. వరల్డ్ నంబర్ 8, 9 బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను పెవిలియన్‌కు పంపాడు. Young sensation Dunith Wellalage dismantled ODI ranking No. 1, 2, 8 & 9 at the Asia Cup 2023 🌟 Incredible - Dunith Wellalage 🙌 pic.twitter.com/eWFBqFne0k — CricTracker (@Cricketracker) September 14, 2023 సెప్టెంబర్ 12న భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్, గిల్, కోహ్లిలతో పాటు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాల వికెట్లు కూడా తీసిన వెల్లలగే.. ఇవాళ (సెప్టెంబర్ 14) పాకిస్తాన్‌తో జరుగుతున్న కీలక పోరులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ భరతం పట్టాడు. వెల్లలగే సంధించిన బంతికి బోల్తా కొట్టిన బాబర్ స్టంపౌటయ్యాడు. వెల్లలగే కేవలం 3 రోజుల వ్యవధిలో వరల్డ్ టాప్ బ్యాటర్లనంతా ఔట్ చేయడంతో అతనిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. భారత్, పాక్ మ్యాచ్‌లలో 6 వికెట్లు పడగొట్టిన వెల్లలగే, గ్రూప్ దశలో బంగ్లాదేశ్‌పై ఓ వికెట్.. ఆతర్వాత ఆఫ్ఘనిస్తాన్పై మరో 2 వికెట్లు.. దీని తర్వాత సూపర్-4లో బంగ్లాదేశ్‌పై మరో వికెట్.. ఇలా మొత్తంగా ఈ టోర్నీలో ఇప్పటివరకు 10 వికెట్లు తీసి, లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. వెల్లలగే బంతితో మ్యాజిక్ చేయడమే కాకుండా, బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించగలడు. టీమిండియాతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో ఓ పక్క అతని సహచరులు, స్పెషలిస్ట్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కడుతున్నా అతను మాత్రం చివరివరకు ఒంటరిపోరాటం (42 నాటౌట్) చేసి అజేయంగా నిలిచాడు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక పట్టుబిగించింది. లంక బౌలర్లు 130 పరుగులకే (27.4 ఓవర్లలో) సగం మంది పాక్ ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపారు. ఈ దశలో వర్షం ప్రారంభమైంది. మ్యాచ్‌కు ముందు కూడా వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే పాక్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా, మెరుగైన రన్‌రేట్ ఆధారంగా శ్రీలంక ఫైనల్‌కు చేరుకుంటుంది. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్లో టీమిండియాతో తలపడుతుంది. -
‘టీమిండియా మ్యాచ్ ఫిక్స్ చేశారు’.. మండిపడ్డ అక్తర్! మనోళ్లకు చేతకాదు..
Asia Cup 2023- India vs Sri Lanka: ‘‘అసలు మీరేం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇండియా మ్యాచ్ ఫిక్స్ చేసిందంటూ నాకు మీమ్స్‌తో కూడిన మెసేజ్‌లు వచ్చిపడుతున్నాయి. పాకిస్తాన్‌ను రేసు నుంచి తప్పించేందుకు టీమిండియా ఉద్దేశపూర్వకంగానే ఓడిపోతుందనేది వాటి సారాంశం. మీరంతా బాగానే ఉన్నారు కదా? అసలు ఇలా మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా? శ్రీలంక బౌలర్లు శక్తిని కూడదీసుకుని ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. వెల్లలలగే, అసలంక కఠినంగా శ్రమించారు. 20 ఏళ్ల పిల్లాడి పట్టుదల చూశారా? ఆ 20 ఏళ్ల పిల్లాడి తాపత్రయాన్ని మీరు చూశారా? 43 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇదంతా చూస్తూ ఉన్నా.. ఇండియా నుంచి, ఇతర దేశాల అభిమానుల నుంచి నాకు ఒకటే ఫోన్ కాల్స్. ఈరోజు ఇండియా కావాలనే ఓడిపోతుందని ఒకటే వాగడం’’ అంటూ పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే పోరాటం చూసిన తర్వాత కూడా ఇలా ఎలా మాట్లాడగలిగారో అర్థం కావడం లేదంటూ సోకాల్డ్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఆసియా కప్-2023 సూపర్-4లో పాకిస్తాన్‌ను 228 పరుగులతో చిత్తు చేసిన భారత జట్టు.. మంగళవారం శ్రీలంకతో తలపడింది. తిప్పేసిన స్పిన్నర్లు ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో కొలంబోలో రోహిత్ సేన ఎలాంటి పొరపాటు చేయలేదు. పాక్‌తో మ్యాచ్ ముగిసిన 15 గంటల్లోపే మళ్లీ మైదానంలో దిగిన టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో లంక స్పిన్నర్లు వెల్లలగే, చరిత్ అసలంక ధాటికి 213 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై వెల్లలగే బంతిని తిప్పేసి ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. టీమిండియా- లంక ఫలితంపై అయితే, లక్ష్య ఛేదనలో లంక 172 పరుగులకే ఆలౌట్ కావడంతో అతడి పోరాటం వృథాగా పోయింది. 41 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా నేరుగా ఫైనల్లో ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. గ్రూప్-ఏలో భారత జట్టుతో పాటు ఉన్న పాకిస్తాన్‌కు ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే.. లంకను రోహిత్ సేన ఓడించాల్సిందే! ఈ నేపథ్యంలోనే కొంతమంది టీమిండియా టాపార్డర్ విఫలం కావడం చూసి.. లంకను గెలిపించి పాక్‌ను రేసు నుంచి తప్పించేందుకు ఇలా ఆడుతున్నారంటూ ఆరోపించారు. ఇదే విషయమై తనకు కాల్స్ వచ్చాయని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా తెలిపాడు. వాళ్లంతా కష్టపడ్డారు.. మనోళ్లకు చేతకాదు ‘‘వాళ్లు ఎందుకు అలా అంటున్నారో అర్థం కాలేదు. అసలు టీమిండియా ఎందుకు ఓడిపోవాలని అనుకుంటుంది? గెలిస్తే ఎంచక్కా ఫైనల్ చేరే అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుంటుంది? ఎలాంటి కారణాలు లేకుండా ఇలాంటి పిచ్చిపని ఎందుకు చేయాలనుకుంటుంది? లో స్కోరింగ్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు పట్టుదలగా పోరాడారు. కుల్దీప్ అద్భుతం చేశాడు. జట్టును గెలిపించేందుకు జస్ప్రీత్ బుమ్రా శక్తిమేర కష్టపడ్డాడు. ఇక లంక కుర్రాడు వెల్లలగే బౌలింగ్, బ్యాటింగ్ రెండూ చేయగలడు. కానీ మన వాళ్ల సంగతి వేరు. వాళ్ల నుంచి ఇలాంటి పోరాటం ఎప్పుడూ చూడలేదు. మన ఫాస్ట్‌బౌలర్లు షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్, నసీం షా 10 ఓవర్లు బౌలింగ్ చేసినా గాయపడకుండా ఉంటే చూడాలని ఉంది. మన వాళ్లు కూడా పోరాటపటిమ కనబరచాలి’’ అని అక్తర్ వ్యాఖ్యానించాడు. కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిస్తేనే ఫైనల్ బెర్తు ఖరారవుతుంది. చదవండి: టీమిండియాకు షాక్.. ఉమ్రాన్‌కు లక్కీ ఛాన్స్! రేసులో అతడు కూడా! 5 వికెట్లు మాత్రమే కాదు.. సిక్సర్లు, సెంచరీ హీరో కూడా! ఎవరీ దునిత్ వెల్లలగే? Super11 Asia Cup 2023 | Super 4 | India vs Sri Lanka | Highlightshttps://t.co/EI2KjpFup6#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 12, 2023 -
Ind vs SL: అస్సలు ఊహించలేదు.. కోహ్లి వికెట్ తీశాడు.. కానీ!
Asia Cup 2023- India vs Sri Lanka: ఆసియా కప్-2023 సూపర్-4లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమిపై శ్రీలంక కెప్టెన్ దసున్ షనక స్పందించాడు. కొలంబో వికెట్ బ్యాటర్లకు అనుకూలిస్తుందని భావించామని.. కానీ అనూహ్యరీతిలో బంతి టర్న్ అయిందని పేర్కొన్నాడు. ఇక దునిత్ వెల్లలగే అద్భుతం చేయగలడని తాను ముందే ఊహించానన్న షనక.. అందుకు తగ్గట్లే అతడి ఆట తీరు కొనసాగిందని హర్షంవ వ్యక్తం చేశాడు. అదే విధంగా చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని కొనియాడాడు. టాపార్డర్‌ను కుదేలు చేసిన వెల్లలగే కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుని.. లంకను ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో శ్రీలంక స్పిన్నర్లు దునిత్ వెల్లలగే, చరిత్ అసలంక ధాటికి భారత బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. వెల్లలగే ఐదు, అసలంక నాలుగు వికెట్లు పడగొట్టగా.. మహీశ్ తీక్షణకు ఒక వికెట్ దక్కింది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ శతకం(53)తో టాప్ స్కోరర్‌గా నిలవగా.. 49.1 ఓవర్లలో టీమిండియా 213 పరుగులు చేయగలిగింది. అసలంక, ధనంజయ పోరాడినా లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకను స్పిన్ ఆల్‌రౌండర్లు చరిత్ అసలంక(22), ధనంజయ డి సిల్వ(41) ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్ల ధాటికి లంక జట్టు 172 పరుగులకే చాపచుట్టేయగా.. 41 పరుగులతో గెలిచి రోహిత్ సేన ఫైనల్‌కు చేరింది. కాగా ఈ ఓటమితో వరుసగా 13 వన్డే విజయాలు సాధించిన షనక బృందం జోరుకు బ్రేక్ పడింది. బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఈ నేపథ్యంలో దసున్ షనక మాట్లాడుతూ.. ‘‘వికెట్ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు. బ్యాటింగ్ పిచ్ అనుకున్నాం.. కానీ అలా జరుగలేదు. వెల్లలగే అద్భుతంగా రాణించాడు. ధనంజయ, అసలంక కూడా గొప్పగా బౌలింగ్ చేశారు. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. అందుకే టీమిండియాతో మ్యాచ్లోనాకు వారిద్దరి రూపంలో రెండు మంచి స్పిన్ ఆప్షన్లు కనిపించాయి’’ అని పేర్కొన్నాడు. ఇక వెల్లలగే అద్భుతంగా ఆడగలడని అంచనా వేశానన్న షనక.. అతడు విరాట్ కోహ్లి వికెట్ తీయడం ప్రత్యేకమని హర్షం వ్యక్తం చేశాడు. ఈరోజు వెల్లలగేదే అంటూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా ఈ మ్యాచ్‌లో వెల్లలగే శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి(3), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వికెట్లు తీశాడు.ఘ తదుపరి పాకిస్తాన్‌తో చావోరేవో ఇదిలా ఉంటే.. శ్రీలంక తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో చావోరేవో తేల్చుకోనుంది. గురువారం నాటి ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే లంక ఫైనల్‌కు చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇదిలా ఉంటే.. గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్ టోర్నీలో శ్రీలంక ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: టీమిండియాకు షాక్.. ఉమ్రాన్‌కు లక్కీ ఛాన్స్! రేసులో అతడు కూడా! 5 వికెట్లు మాత్రమే కాదు.. సిక్సర్లు, సెంచరీ హీరో కూడా! ఎవరీ దునిత్ వెల్లలగే? Sri Lanka's young sensation finishes with a maiden five-for🤩#INDvSL📝: https://t.co/PCYHPHAr6B pic.twitter.com/dLKo0UrIJc — ICC (@ICC) September 12, 2023 -
5 వికెట్లు మాత్రమే కాదు.. సిక్సర్లు, సెంచరీ హీరో కూడా! ఎవరీ దునిత్ వెల్లలగే?
Asia Cup 2023- India vs Sri Lanka- Who Is Dunith Wellalage: ‘‘శ్రీలంక టీమిండియాను కుప్పకూల్చింది’’.. ఆసియా కప్-2023 సూపర్-4 మ్యాచ్‌లో పటిష్ట టీమిండియా టాప్-5 బ్యాటర్లలో నలుగురిని లంక కుర్ర స్పిన్నర్ పెవిలియన్‌కు పంపిన క్రమంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డొమినిక్ కార్క్ చేసిన వ్యాఖ్య ఇది. మ్యాచ్ చూస్తున్న ప్రతి క్రికెట్ అభిమాని ఇలాగే ఫీలై ఉంటారనడంలో సందేహం లేదు. తొలుత ఓపెనర్ శుబ్‌మన్ గిల్(19)ను బౌల్డ్ చేసి.. ఆ తర్వాత వెంటనే రన్‌మెషీన్, గత మ్యాచ్‌లో సెంచరీ సాధించిన వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లిని అవుట్ చేసిన సదరు బౌలర్ పేరు.. దునిత్ వెల్లలగే.. 20 ఏళ్ల లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ అతడి బౌలింగ్ స్టైల్. జనవరి 9, 2003లో కొలంబోలో జన్మించాడు ఈ కుర్రాడు. గతేడాది వెస్టిండీస్‌లో జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఐసీసీ టోర్నీలో ఆస్ట్రేలియా, స్కాట్లాండ్లతో మ్యాచ్‌లలో 5 వికెట్ల ఘనత సాధించిన ఈ శ్రీలంక చిన్నోడు.. ప్రపంచకప్ టాప్ పెర్ఫార్మర్స్‌లో ఒకడిగా నిలిచాడు. వన్డే ఈవెంట్లో మొత్తంగా 17 వికెట్లు పడగొట్టాడు. టాప్ స్కోరర్ కూడా అతడే అదే విధంగా.. 264 పరుగులతో సత్తా చాటిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్ శ్రీలంక తరఫున టాప్ రన్ స్కోరర్‌గానూ నిలిచాడు. కీలక సమయాల్లో జట్టుకు విజయాన్ని అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న వెల్లలగే.. ఆస్ట్రేలియా మీద కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సౌతాఫ్రికాపై సెంచరీ ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు.. 71 బంతుల్లో 52 పరుగులు సాధించి శ్రీలంకను విజేతగా నిలిపాడు. అయితే, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో మెరిశాడు వెల్లలగే. 130 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 113 పరుగులు సాధించాడు. అరంగేట్రంలో దిగ్గజ బ్యాటర్ వికెట్ తీసి అంతేకాదు.. ప్రొటిస్ యువ జట్టుతో మ్యాచ్‌లో ఒక వికెట్ కూడా పడగొట్టాడు. అద్భుత ప్రదర్శనతో శ్రీలంకకు 65 పరుగుల తేడాతో విజయం అందించాడు. అండర్-19 వరల్డ్‌కప్‌లో ప్లేయర్‌గా, కెప్టెన్‌గా రాణించిన దునిత్ వెల్లలగే.. గతేడాది ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. వన్డేలో అరంగేట్రంలోనే స్టీవ్ స్మిత్ వంటి దిగ్గజ బ్యాటర్‌ను అవుట్ చేసిన వెల్లలగే.. మొత్తంగా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఒకే ఒక టెస్టులో ఒక్క వికెట్ కూడా తీయకపోయినప్పటికీ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో.. శ్రీలంక వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ జట్టులో స్టాండ్ బైగా చోటు సంపాదించాడు. టీమిండియాపై సంచలన ప్రదర్శనతో అదే విధంగా ఆసియా కప్-2023 జట్టుకు ఎంపికైన వెల్లలగే.. టీమిండియాపై సంచలన ప్రదర్శనతో ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారాడు. తన కెరీర్లో గుర్తుండిపోయే విధంగా.. టీమిండియాతో మ్యాచ్‌లో 5 వికెట్లతో అదరగొట్టాడు. గిల్, కోహ్లిలను పెవిలియన్‌కు పంపడంతో.. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా రూపంలో టాప్ బ్యాటర్ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. పిన్న వయస్కుడిగా చరిత్ర తద్వారా.. లంక తరఫున ఐదు వికెట్ల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు వెల్లలగే. కొలంబోలో ఆకాశమే హద్దుగా చెలరేగి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే లంకతో మ్యాచ్‌లో 41 పరుగులతో గెలుపొందిన భారత జట్టు ఆసియా వన్డే కప్-2023 ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs SL: ప్రతి బంతికి వికెట్ తీయాలనుకుంటాడు.. అతడు అద్భుతం: రోహిత్ కుంబ్లేకు సాధ్యం కాలేదు.. కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర! Super11 Asia Cup 2023 | Super 4 | India vs Sri Lanka | Highlightshttps://t.co/EI2KjpFup6#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 12, 2023 -
Ind Vs SL: ప్రతి బంతికి వికెట్ తీయాలనుకుంటాడు.. అతడు అద్భుతం: రోహిత్
Asia Cup 2023- India vs Sri Lanka, Super Fours- Rohit Sharma Comments: ‘‘ఇలాంటి చాలెంజింగ్ పిచ్‌పై.. తీవ్రమైన ఒత్తిడితో కూడిన సందర్భంలోనూ రాణించడం సంతోషాన్నిచ్చింది. నిజానికి.. ఇలాంటి పిచ్‌లపై ఆడినపుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది. మ్యాచ్ అద్భుతంగా సాగింది’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. బౌలర్లు మెరుగ్గా రాణించారని కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యాలను ప్రశంసించాడు. వెల్లలగే ఆకాశమే హద్దుగా కాగా ఆసియా కప్-2023 సూపర్-4 దశలో భాగంగా మంగళవారం భారత జట్టు శ్రీలంకతో తలపడింది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్‌పై భారీ విజయం తర్వాత 15 గంటల్లోపే తిరిగి ఆరంభమైన ఈ మ్యాచ్‌లో.. రోహిత్ సేన 49.1 ఓవర్లలో 213 పరుగులు చేసి ఆలౌట్ అయింది. స్పిన్‌కు అనుకూలించిన కొలంబో పిచ్‌పై లంక లెఫ్టార్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లలగే ఆకాశమే హద్దుగా చెలరేగి 5 వికెట్లు పడగొట్టాడు. ఇక చరిత్ అసలంక సైతం నాలుగు, తీక్షణ ఒక వికెట్ తీశారు. జడేజా, కుల్దీప్ కుల్దీప్ నాలుగు వికెట్లతో.. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకే చాపచుట్టేసింది. టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా రెండు, మహ్మద్ సిరాజ్, హార్దిక్‌పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టగా.. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ అత్యధికంగా నాలుగు, రవీంద్ర జడేజా రెండు వికెట్లు కూల్చారు. దీంతో 41 పరుగులతో గెలుపొందిన టీమిండియా ఆసియా కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. వాళ్ల వల్లే గెలిచాం ఈ నేపథ్యంలో విజయంపై స్పందించిన రోహిత్ శర్మ కొలంబో పిచ్ తమకు సవాల్ విసిరిందని పేర్కొన్నాడు. ఇలాంటి పిచ్‌పై 213 పరుగుల స్కోరును డిఫెండ్ చేయడం తేలిక కాదని.. ఏదేమైనా తమ బౌలర్లు మెరుగ్గా రాణించడం వల్లే గెలుపు సాధ్యమైందని తెలిపాడు. ప్రతి బంతికి వికెట్ తీయాలనుకుంటాడు ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ప్రతి బంతికి వికెట్ తీయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతాడంటూ కొనియాడాడు. రాత్రికి రాత్రే మార్పులు రావని.. గత రెండేళ్లుగా బౌలింగ్‌పై దృష్టి సారించిన పాండ్యా.. కఠినంగా శ్రమిస్తున్నాడని రోహిత్ పేర్కొన్నాడు. అతడు అద్భుతం ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గతేడాది కాలంగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడన్న రోహిత్ శర్మ.. హార్డ్వర్క్తోనే అతడు తిరిగి ఫామ్‌లోకి వచ్చాడని ప్రశంసించాడు. లోపాలు సరిచేసుకుని నూతనోత్సాహంతో దూసుకుపోతున్నాడంటూ కొనియాడాడు. కాగా టీమిండియా- శ్రీలంక మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న లంక స్పిన్నర్ దునిత్ వెల్లలగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అర్ధ శతకం(53) సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Asia Cup 2023 IND VS SL: చరిత్ర సృష్టించిన లంక యువ స్పిన్నర్ As 'KUL' as it gets! 🧊@imkuldeep18 continues his sensational form as he rips one through the batter, while @klrahul pulls off a sharp stumping. 💥 Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/NZccClhhRW — Star Sports (@StarSportsIndia) September 12, 2023 Cannot keep @imjadeja out of the game! 🤯 Rewarded for his disciplined bowling, Jaddu sends skipper @dasunshanaka1 packing!#SriLanka in trouble. Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/vsI2M1TTDr — Star Sports (@StarSportsIndia) September 12, 2023 Edged & takennnnnnnnn! 😍🥳@Jaspritbumrah93 makes inroads! In the corridor of uncertainty and Boom Boom gets the edge! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/mjQ2xvqJdh — Star Sports (@StarSportsIndia) September 12, 2023 -
Asia Cup 2023 IND VS SL: లంకను గెలిచి... ఆసియా కప్ ఫైనల్లో భారత్
ఆసియా కప్‌లో వరుసగా మూడో రోజూ భారత్‌దే... సోమవారం పాక్‌పై విజయానందాన్ని కొనసాగిస్తూ మంగళవారం కూడా మరో విజయాన్ని టీమిండియా తమ ఖాతాలో వేసుకొని ఫైనల్లోకి అడుగు పెట్టింది. బౌలింగ్‌కు బాగా అనుకూలించిన పిచ్‌పై శ్రీలంక స్పిన్నర్ల ధాటికి తడబడి 213 పరుగులకే పరిమితమైనా... మన బౌలింగ్ బలగంతో ఆ స్వల్ప స్కోరును కూడా కాపాడుకోగలిగింది. కొంత వరకు పోరాడగలిగినా చివరకు లంకకు ఓటమి తప్పలేదు. కొలంబో: సూపర్–4 దశలో వరుసగా రెండో విజయంతో భారత జట్టు ఆసియా కప్ టోర్నీలో ఫైనల్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.1 ఓవర్లలో 213 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (48 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... కేఎల్ రాహుల్ (44 బంతుల్లో 39; 2 ఫోర్లు), ఇషాన్ కిషన్ (61 బంతుల్లో 33; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దునిత్ వెలలాగె (5/40) కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేయగా, అసలంకకు 4 వికెట్లు దక్కాయి. వరుసగా 14వ వన్డేలోనూ శ్రీలంక జట్టు ప్రత్యర్థిని ఆలౌట్ చేయగా... భారత జట్టు మొత్తం 10 వికెట్లను స్పిన్నర్లకే చేజార్చుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అనంతరం లంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. దునిత్ వెలలాగె (46 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), ధనంజయ డిసిల్వా (66 బంతుల్లో 41; 5 ఫోర్లు) రాణించారు. నాలుగు పాయింట్లతో ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న భారత్ తమ చివరి సూపర్–4 మ్యాచ్‌లో శుక్రవారం బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. రెండు పాయింట్లతో ప్రస్తుతం శ్రీలంక, పాకిస్తాన్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య గురువారం జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో తలపడుతుంది. ఒకవేళ శ్రీలంక, పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే మెరుగైన రన్‌రేట్ ఉన్న శ్రీలంక (–0.200) పాకిస్తాన్ (–1.892)ను వెనక్కి నెట్టి ఫైనల్ చేరుతుంది. ఆదుకున్న రాహుల్, కిషన్... గత మ్యాచ్ తరహాలోనే ఓపెనర్ రోహిత్ జట్టుకు శుభారంభం అందించాడు. శుబ్‌మన్ గిల్ (25 బంతుల్లో 19; 2 ఫోర్లు) కాస్త నెమ్మదిగా ఆడినా రోహిత్ దూకుడుతో భారత్ దూసుకుపోయింది. షనక ఓవర్లో రోహిత్ 4 ఫోర్లతో చెలరేగాడు. తొలి వికెట్‌కు 67 బంతుల్లోనే 80 పరుగులు జతచేరాయి. అయితే వెలలాగె జట్టును దెబ్బ తీశాడు. తన తొలి మూడు ఓవర్లలో అతను వరుసగా గిల్, కోహ్లి (12 బంతుల్లో 3), రోహిత్‌లను అవుట్ చేయడంతో 11 పరుగుల వ్యవధిలో జట్టు 3 వికెట్లు కోల్పోయింది.ఈ దశలో కిషన్, రాహుల్ కలిసి పరిస్థితికి తగినట్లుగా జాగ్రత్తగా ఆడుతూ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 63 పరుగులు జత చేశాక రాహుల్ వికెట్ కూడా వెలలాగె ఖాతాలో చేరింది. కిషన్‌ను అసలంక వెనక్కి పంపగా, తర్వాతి 16 పరుగుల వ్యవధిలో భారత్ మరో 4 వికెట్లు చేజార్చుకుంది. చివర్లో అక్షర్ పటేల్ (36 బంతుల్లో 26; 1 సిక్స్) కీలక పరుగులు జోడించి స్కోరును 200 దాటించాడు. గత మ్యాచ్ ఆడిన శార్దుల్ స్థానంలో అక్షర్‌ను భారత్ తుది జట్టులోకి తీసుకుంది. పోరాడినా... శ్రీలంకలాగే మనమూ స్పిన్నర్లతో దెబ్బ కొట్టేందుకు సిద్ధమైనా... దానికి ముందే పేసర్లు వారి పనిపట్టారు. బుమ్రా, సిరాజ్ ధాటికి 25 పరుగులకే తొలి 3 వికెట్లు కోల్పోయిన లంక ఆ తర్వాత తక్కువ వ్యవధిలో మరో 3 వికెట్లు చేజార్చుకొని ఓటమి దిశగా పయనించింది. అయితే ఈ దశలో ధనంజయ, వెలలాగె భాగస్వామ్యం లంక విజయంపై ఆశలు రేపింది. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు పరుగులు సాధించారు. ఏడో వికెట్‌కు ఈ జోడీ 75 బంతుల్లో 63 పరుగులు జోడించింది. ఎట్టకేలకు జడేజా ఈ భాగస్వామ్యాన్ని విడదీయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. రోహిత్@ 10,000 భారత కెపె్టన్ రోహిత్ శర్మ వన్డేల్లో అరుదైన మైలురాయిని అధిగమించాడు. లంకతో మ్యాచ్‌లో రజిత బౌలింగ్‌లో సిక్సర్‌తో 23 పరుగులకు చేరుకోగానే రోహిత్ 10 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఆరో బ్యాటర్‌గా నిలిచిన రోహిత్ ఓవరాల్‌గా 15వ ఆటగాడు. తన 241వ ఇన్నింగ్స్‌లో తాజా రికార్డు అందుకున్న అతను ఈ జాబితాలో కోహ్లి (205 ఇన్నింగ్స్) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) వెలలాగె 53; గిల్ (బి) వెలలాగె 19; కోహ్లి (సి) షనక (బి) వెలలాగె 3; ఇషాన్ కిషన్ (సి) వెలలాగె (బి) అసలంక 33; రాహుల్ (సి అండ్ బి) వెలలాగె 39; హార్దిక్ పాండ్యా (సి) మెండిస్ (బి) వెలలాగె 5; జడేజా (సి) మెండిస్ (బి) అసలంక 4; అక్షర్ పటేల్ (సి) సమరవిక్రమ (బి) తీక్షణ 26; బుమ్రా (బి) అసలంక 5; కుల్దీప్ (సి) ధనంజయ (బి) అసలంక 0; సిరాజ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (49.1 ఓవర్లలో ఆలౌట్) 213. వికెట్ల పతనం: 1–80, 2–90, 3–91, 4–154, 5–170, 6–172, 7–178, 8–186, 9–186, 10–213. బౌలింగ్: రజిత 4–0–30–0, తీక్షణ 9.1–0– 41–1, షనక 3–0–24–0, పతిరణ 4–0–31–0, వెలలాగె 10–1–40–5, ధనంజయ 10–0–28– 0, అసలంక 9–1–18–4. శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) రాహుల్ (బి) బుమ్రా 6; కరుణరత్నే (సి) గిల్ (బి) సిరాజ్ 2; మెండిస్ (సి) (సబ్) సూర్యకుమార్ (బి) బుమ్రా 15; సమరవిక్రమ (స్టంప్డ్) రాహుల్ (బి) కుల్దీప్ 17; అసలంక (సి) రాహుల్ (బి) కుల్దీప్ 22; ధనంజయ (సి) గిల్ (బి) జడేజా 41; షనక (సి) రోహిత్ (బి) జడేజా 9; వెలలాగె (నాటౌట్) 42; తీక్షణ (సి) (సబ్) సూర్యకుమార్ (బి) పాండ్యా 2; రజిత (బి) కుల్దీప్ 1; పతిరణ (బి) కుల్దీప్ 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (41.3 ఓవర్లలో ఆలౌట్) 172. వికెట్ల పతనం: 1–7, 2–25, 3–25, 4–68, 5–73, 6–99, 7–162, 8–171, 9–172, 10– 172. బౌలింగ్: బుమ్రా 7–1–30–2, సిరాజ్ 5– 2–17–1, పాండ్యా 5–0–14–1, కుల్దీప్ 9.3– 0– 43–4, జడేజా 10–0–33–2, అక్షర్ 5–0–29 –0. -
నిన్న అద్భుత శతకం.. ఇప్పుడు మరీ ఘోరంగా! 71- 77 దాకా ఇదే తీరు!
Asia Cup, 2023 - India vs Sri Lanka- Virat Kohli: శ్రీలంకలో మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పూర్తిగా నిరాశపరిచాడు. ఆసియా కప్-2023 సూపర్-4 దశలో భాగంగా కొలంబోలో జరుగుతున్న మ్యాచ్‌లో 12 బంతులు ఎదుర్కొన్న కోహ్లి కేవలం 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే సంధించిన బంతిని తప్పుగా అంచనా వేసి మూల్యం చెల్లించుకున్నాడు. లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్‌లో తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. దసున్ షనకు క్యాచ్ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు. అదే బలహీనత.. కాగా 2021 నుంచి ఇప్పటి వరకు లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్‌లో కోహ్లి 159 బంతులు ఎదుర్కొని సగటు 13తో 104 పరుగులు సాధించాడు. ఎనిమిదిసార్లు పెవిలియన్ చేరాడు. శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా లెఫ్టార్మ్ స్సిన్నర్లను ఎదుర్కోవడంలో కోహ్లికి ఉన్న ఈ బలహీనత మరోసారి బయటపడింది. నిన్న సెంచరీ.. ఈరోజు ఇలా దారుణంగా ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి అవుటైన తీరు క్రికెట్ అభిమానులకు రుచించడం లేదు. ‘‘నిన్న సెంచరీ.. ఈరోజు ఇలా! ఏంటిది కోహ్లి! ఇలాగేనా ఆడేది? 20 ఏళ్ల యువ బౌలర్ చేతిలో నువ్వు అవుటైన తీరు నీ స్థాయికి ఏమాత్రం తగదు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రమే బ్యాట్ ఝులిపిస్తావా ఏంటి?’’ అని ట్రోల్ చేస్తున్నారు. 71- 77వ సెంచరీ దాకా.. శతకం బాదిన తదుపరి ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్ మాత్రమే స్కోరు చేయడం కోహ్లికి అలవాటని ఎద్దేవా చేస్తున్నారు. పాకిస్తాన్‌పై సూపర్ సెంచరీ కాగా సూపర్-4లో పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా వింటేజ్ కోహ్లిని గుర్తు చేస్తూ కోహ్లి క్లాసిక్ ఇన్నింగ్స్‌తో బౌలర్లపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో వీర విహారం చేసిన కింగ్.. 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతర్జాతీయ కెరీర్లో 77వ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా టీమిండియా భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించి జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే, 15 గంటలు తిరిగే లోపే శ్రీలంకతో ఆరంభమైన మ్యాచ్‌లో మాత్రం కోహ్లి విఫలమయ్యాడు. అదే సమయంలో పాకిస్తాన్ మీద కోహ్లితో పాటు అజేయ సెంచరీ(111)తో ఆకట్టుకున్న కేఎల్ రాహుల్ 39 పరుగులతో రాణించాడు తిప్పేసిన వెల్లలగే, అసలంక ఇక వర్షం మొదలయ్యే సమయానికి టీమిండియా 47 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 53 పరుగులు సాధించాడు. ఇక లంక స్పిన్నర్ దునిత్ వెల్లలగేకు అత్యధికంగా 5 వికెట్లు దక్కగా.. ఆఫ్‌బ్రేక్ స్పిన్ బౌలర్ చరిత్ అసలంక 4 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ప్రచండులైన పాక్ బౌలర్లతోనే కాలేదు.. ఈ కుర్రాడు టీమిండియాను కకావికలం చేశాడు! Virat Kohli's score after 71st century - 2(7) 72th century - 1(5) 73rd century - 4(9) 74th century - 4(9) 75th century - 4(9) 76th century - 4(7) 77th century - 3(12) — Rajkumar (@khannachinna) September 12, 2023 Kohli got over cautious.. !! Every time he gets out when he does that. — Satyam (@Puchuu17) September 12, 2023 Kohli vs left arm spin..never ending story 🤦🏻♂️#INDvsSL — igneel🀄️ (@Rakesh_1327) September 12, 2023 Rohit Sharma Wicket.... The ball Kept Very Low👀👀... Was Looking In Good Form Today... #INDvsSL #SLvIND #AsiaCup2023 #CricketTwitter #INDvPAK #ViratKohli𓃵 #KLRahul #RohitSharma𓃵 #Kuldeep #IshanKishan #IndianCricketTeam#ShubmanGill #Hitman #ODIs pic.twitter.com/3SEOFrhZMq — Anshu Sharma (@Ash10cric) September 12, 2023 FIFTY UP! 👏🏻😍 Back to back half centuries for #TeaIndia skipper, @ImRo45! Will he notch up his 31st 💯 today? 👀 Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/N9eImshbuf — Star Sports (@StarSportsIndia) September 12, 2023 Sri Lanka's young sensation finishes with a maiden five-for🤩#INDvSL📝: https://t.co/PCYHPHAr6B pic.twitter.com/dLKo0UrIJc — ICC (@ICC) September 12, 2023 -
Asia Cup 2023 IND VS SL: చరిత్ర సృష్టించిన లంక యువ స్పిన్నర్
20 ఏళ్ల శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే చరిత్ర సృష్టించాడు. లంక తరఫున వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 12) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో దునిత్ ఈ ఘనత సాధించాడు. దునిత్ 20 ఏళ్ల 246 రోజుల్లో ఈ ఘనత సాధించగా.. దీనికి ముందు ఈ రికార్డు చరిత బుద్ధిక పేరిట ఉండేది. బుద్ధిక 2001లో జింబాబ్వేపై 21 ఏళ్ల 65 రోజుల వయసులో 5 వికెట్ల ఘనత సాధించాడు. ఇతనికి ముందు తిసార పెరీరా (21 ఏళ్ల 141 రోజులు), ఉవైస్ కర్నైన్ (21 ఏళ్ల 233 రోజులు) లంక తరఫున పిన్న వయసులో ఐదు వికెట్ల ఘనత సాధించిన వారిలో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో దునిత్ (10-1-40-5) ఐదు వికెట్ల ఘనత సాధించి, టీమిండియా టాపార్డర్‌ను కకావికలం చేశాడు. ఇతన్ని ఎదుర్కొనేందుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. దునిత్ సంధించిన బంతులకు సమాధానం లేక విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి వారే చేతులెత్తేశారు. యువ కెరటం శుభ్‌మన్ గిల్, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా వెల్లలగే మాయాజాలానికి చిక్క వికెట్లు సమర్పించుకున్నారు. బ్యాటింగ్ హేమహేమీలైన రోహిత్, గిల్, విరాట్, రాహుల్, హార్దిక్‌లను అంతుచిక్కని బంతులు వేసి ఔట్ చేసిన వెల్లలగేపై ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో ప్రశంసల వర్షం కురుస్తుంది. దునిత్‌కు మరో స్పిన్నర్ మహీష్ తీక్షణ (8-0-29-4) కూడా తోడవ్వడంతో భారత్ 47 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో వర్షం ప్రారంభంకావడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. రోహిత్ శర్మ (53), ఇషాన్ కిషన్ (33), కేఎల్ రాహుల్ (39), శుభ్‌మన్ గిల్ (19), విరాట్ కోహ్లి (3), హార్దిక్ (5), జడేజా (4), బుమ్రా (5), కుల్దీప్ (0) ఔట్ కాగా.. అక్షర్ (15), సిరాజ్ (2) క్రీజ్‌లో ఉన్నారు. -
ప్రచండులైన పాక్ బౌలర్లతోనే కాలేదు.. ఈ కుర్రాడు టీమిండియాను కకావికలం చేశాడు..!
ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 12) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే చెలరేగిపోయాడు. కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించి సత్తా చాటాడు. ఈ అనామక బౌలర్ టీమిండియా టాపార్డర్‌ను కకావికలం చేసి, జట్టు భారీ స్కోర్ సాధించకుండా నియంత్రించాడు. పట్టుమని 15 మ్యాచ్‌లు కూడా ఆడని 20 ఏళ్ల వెల్లలగేను ఎదుర్కొనేందుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. స్లో ట్రాక్‌పై లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన వెల్లలగే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇతను సంధించిన బంతులకు సమాధానం లేక విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి వారే చేతులెత్తేశారు. యువ కెరటం శుభ్‌మన్ గిల్, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా వెల్లలగే మాయాజాలానికి చిక్కి వికెట్లు సమర్పించుకున్నారు. వీరిలో రోహిత్, గిల్ క్లీన్‌బౌల్డ్‌లు కాగా.. కోహ్లి షనకకు, హార్దిక్ కుశాల్ మెండిస్‌కు క్యాచ్‌లు ఇచ్చి పెవిలియన్ బాట పట్టారు. కేఎల్ రాహుల్‌ను అయితే వెల్లలగేనే క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు. బ్యాటింగ్ హేమహేమీలైన రోహిత్, గిల్, విరాట్, రాహుల్, హార్దిక్‌లను అంతుచిక్కని బంతులు వేసి ఔట్ చేసిన వెల్లలగేపై ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో ప్రశంసల వర్షం కురుస్తుంది. లంక క్రికెట్‌కు మరో మిస్టరీ స్పిన్నర్ దొరికాడని నెట్టింట కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. దుర్భేద్యమైన భారత టాపార్డర్‌ను నియంత్రించడం ప్రచండులైన పాక్ బౌలర్ల వల్లనే కాలేదు, 20 ఏళ్ల కుర్రాడు భారత టాపార్డర్‌కు ముచ్చెమటలు పట్టించాడని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానిని వెల్లలగే మాయలో పడి టీమిండియా నామమాత్రపు స్కోర్ చేసేందుకు కూడా అష్టకష్టాలు పడుతుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్.. దునిత్ వెల్లలగే (10-1-40-5) మాయాజాలం ధాటికి 41 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. వెల్లలగేకు తోడుగా చరిత్ అసలంక (6-0-14-2) కూడా రాణించడంతో భారత్ 200 పరుగుల మార్కును చేరేందుకు కూడా చమటోడుస్తుంది. రోహిత్ శర్మ (53) ఒక్కడే హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించగా.. ఇషాన్ కిషన్ (33), కేఎల్ రాహుల్ (39) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. శుభ్‌మన్ గిల్ (19), విరాట్ కోహ్లి (3), హార్దిక్ (5), జడేజా (4) నిరాశపరిచారు. Dunith Wellalage 3wkts#Kohli #RohitSharma #shubmangill #INDvsSL pic.twitter.com/Oh1z6VzlYt — Jokes Master (@JokesMasterpk) September 12, 2023