ఆగస్ట్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 5) ప్రకటించింది. పురుషుల విభాగంలో సౌతాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్, శ్రీలంక ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలగే అవార్డు రేసులో ఉండగా.. మహిళల విభాగంలో శ్రీలంకకు చెందిన హర్షిత సమరవిక్రమ, ఐర్లాండ్ ఆల్‌రౌండర్ ఓర్లా ప్రెండర్‌గాస్ట్, ఐర్లాండ్ ఓపెనర్ గాబీ లూయిస్ పోటీలో ఉన్నారు.
కేశవ్ మహారాజ్: ఈ దక్షిణాఫ్రికా స్పిన్నర్ గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లలో విశేషంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. మహారాజ్ ఈ రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.
జేడెన్ సీల్స్: ఈ విండీస్ ఫాస్ట్ బౌలర్ గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 12 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్‌లో సీల్స్ ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. తద్వారా అతను ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి ఎగబాకాడు.
దునిత్ వెల్లలగే: ఈ లంక ఆల్‌రౌండర్ గత నెలలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. వెల్లలగే తొలి వన్డేలో 67 నాటౌట్, రెండో వన్డేలో 39 మరియు రెండు వికెట్లు, మూడో వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment