
కేశవ్ మహరాజ్
ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఏప్రిల్ నెలకు గానూ దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఈ అవార్డును గెలుచుకున్నట్లు వెల్లడించింది. కాగా బంగ్లాదేశ్‌తో స్వదేశంలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కేశవ్ మహరాజ్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచ్‌లలో కలిపి అతడు మొత్తంగా 16 వికెట్లు తీశాడు.
తద్వారా దక్షిణాఫ్రికా సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుపొందాడు. ఇక ఇదే సిరీస్‌లో దక్షిణాఫ్రికా మరో ఆటగాడు సిమోన్ హార్మర్ కూడా ఆకట్టుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడు కూడా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌కు నామినేట్ అయ్యాడు.
మరోవైపు ఒమన్ ఓపెనర్ జతిందర్ సింగ్ కూడా ఏప్రిల్‌లో జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్2లో నాలుగు మ్యాచ్‌లలో కలిపి 259 పరుగులు చేసి పోటీలో నిలిచాడు. అయితే, వీరందరినీ దాటుకుని కేశవ్ మహరాజ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రొటిస్ మాజీ బ్యాటర్, ప్రస్తుత వోటింగ్ పానెల్ సభ్యుడు జేపీ డుమిని కేశవ్‌పై ప్రశంసలు కురిపించాడు. అద్భుతంగా రాణించాడని కొనియాడాడు.
చదవండి: Devon Conway: కాన్వే జోరు వెనుక ప్రధాన సూత్రధారి ఎవరంటే?
7️⃣ wickets at Keshav Maharaj's home ground💚 🇿🇦 #SAvBAN #BetwayTestSeries #BePartOfIt | @Betway_za pic.twitter.com/cIcqpKD50Q
— Cricket South Africa (@OfficialCSA) April 4, 2022
Comments
Please login to add a commentAdd a comment