పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్‌తో పోలిస్తే..! | List of Top 10 Highest Paid Cricketers In Pakistan Super League 2025 | Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్‌తో పోలిస్తే..!

Apr 17 2025 6:42 PM | Updated on Apr 17 2025 7:23 PM

List of Top 10 Highest Paid Cricketers In Pakistan Super League 2025

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ ఐపీఎల్‌కు పోటీగా జరుగుతుంది. ఐపీఎల్‌ మార్చి 22న ప్రారంభం కాగా.. పీఎస్‌ఎల్‌ ఏప్రిల్‌ 11న ప్రారంభమైంది. ఐపీఎల్‌తో పోటీపడే క్రమంలో ఈ సీజన్‌లో పీఎస్‌ఎల్‌ ఆటగాళ్ల పారితోషికాలకు భారీగా పెంచింది.

గతంలో పీఎస్‌ఎల్‌లో విదేశీ ఆటగాళ్లు 2 కోట్లలోపు (భారత కరెన్సీలో), పాక్‌ ఆటగాళ్లు కోటిన్నర లోపు పారితోషికాన్ని అందుకున్నారు. అయితే ఈ సీజన్‌లో డేవిడ్‌ వార్నర్‌ అత్యధికంగా 2.57 కోట్ల రూపాయలను పారితోషికంగా పొంది రికార్డు సృష్టించాడు. పీఎస్‌ఎల్‌ 2025లో వార్నర్‌దే అత్యధిక పారితోషికం. 

వార్నర్‌ తర్వాత అత్యధికంగా డారిల్‌ మిచెల్‌ రూ. 1.88 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నాడు. వార్నర్‌, మిచెల్‌ తర్వాత అత్యధిక పారితోషికాన్ని పాక్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజమ్‌, ఫకర్‌ జమాన్‌, షాహీన్‌ అఫ్రిది, సైమ్‌ అయూబ్‌, నసీం షా, మొహమ్మద్‌ రిజ్వాన్‌, మాథ్యూ షార్ట్‌, షాదాబ్‌ ఖాన్‌ అందుకుంటున్నారు. 

వీరింతా భారత కరెన్సీలో కోటి 88 లక్షలను పారితోషికంగా అందుకుంటున్నారు. ఈ సారి పీఎస్‌ఎల్‌లో స్థానిక ఆటగాళ్లకంటే విదేశీ ఆటగాళ్లకే అధిక పారితోషికం ఇవ్వడం విశేషం.

భారత్‌లో జరిగే ఐపీఎల్‌తో పోలిస్తే.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆటగాళ్లకు లభించే పారితోషికం నామమాత్రమే. ఐపీఎల్‌-2025లో అత్యధిక ధర పొందిన రిషబ్‌ పంత్‌ పారితోషికంతో పోలిస్తే వార్నర్‌ పారితోషికం 10 శాతం లోపే. పంత్‌ను ఈ సీజన్‌లో మెగా వేలంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ. 27 కోట్లకు సొంతం చేసుకుంది. 

ఈ సీజన్‌లో పంత్‌ అందుకుంటున్న మొత్తం ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధికం. వార్నర్‌ తొలుత ఐపీఎల్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసి, అక్కడ ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడంతో  పీఎస్‌ఎల్‌వైపు మళ్లాడు. ఈ సీజన్‌ వేలంలో అతన్ని కరాచీ కింగ్స్‌ సొంతం​ చేసుకుని కెప్టెన్సీ కూడా అప్పగించింది.

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో అత్యధిక పారితోషికాలు పొందుతున్న ఆటగాళ్లు..
డేవిడ్‌ వార్నర్‌ (కరాచీ కింగ్స్‌)- 2.57 కోట్లు (భారత కరెన్సీలో)
డారిల్‌ మిచెల్‌ (లాహోర్‌ ఖలందర్స్‌)- 1.88 కోట్లు
బాబర్‌ ఆజమ్‌ (పెషావర్‌ జల్మీ)- 1.88 కోట్లు
ఫకర్‌ జమాన్‌ (లాహోర్‌ ఖలందర్స్‌)- 1.88 కోట్లు
షాహీన్‌ అఫ్రిది (లాహోర్‌ ఖలందర్స్‌)- 1.88 కోట్లు
సైమ్‌ అయూబ్‌ (పెషావర్‌ జల్మీ)- 1.88 కోట్లు
నసీం షా (ఇస్లామాబాద్‌ యునైటెడ్‌)- 1.88 కోట్లు
మొహమ్మద్‌ రిజ్వాన్‌ (ముల్తాన్‌ సుల్తాన్స్‌)- 1.88 కోట్లు
మాథ్యూ షార్ట్‌ (ఇస్లామాబాద్‌ యునైటెడ్‌)- 1.88 కోట్లు
షాదాబ్‌ ఖాన్‌ (ఇస్లామాబాద్‌ యునైటెడ్‌)- 1.88 కోట్లు

ఐపీఎల్‌ 2025లో టాప్‌-5 పారితోషికాలు.. 
రిషబ్‌ పంత్‌ (లక్నో)- 27 కోట్లు
శ్రేయస్‌ అయ్యర్‌ (పంజాబ్‌)- 26.75 కోట్లు
వెంకటేశ్‌ అయ్యర్‌ (కేకేఆర్‌)- 23.75 కోట్లు
అర్షదీప్‌ సింగ్‌ (పంజాబ్‌)- 18 కోట్లు
చహల్‌ (పంజాబ్‌)- 18 కోట్లు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement