Pakistan Super League
-
పాక్ యువ పేసర్ సంచలన నిర్ణయం
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ సెన్సేషన్ ఇహసానుల్లా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 22 ఏళ్లకే పాకిస్తాన్ క్రికెట్ లీగ్‌కు (PSL) గుడ్‌బై చెప్పాడు. నిన్న జరిగిన పీఎస్ఎల్-10 డ్రాఫ్ట్‌లో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవడంతో చిర్రెత్తిపోయిన ఇహసానుల్లా ఇకపై పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడనని శపథం చేశాడు. వాస్తవానికి ఇహసానుల్లా తరుచూ గాయాల బారిన పడుతుండటంతో అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్నా ఇహసానుల్లాపై ఫ్రాంచైజీలు ఆనాసక్తిని ప్రదర్శించాయి. ఇహసానుల్లా గంటకు 150 కిమీకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తాడు. ఇహసానుల్లాకు పేస్ కింగ్‌గా పేరుంది. పీఎస్ఎల్ డ్రాఫ్ట్ అనంతరం ఇహసానుల్లా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. తాను కోపంలో ఈ నిర్ణయం తీసుకోలేదని చెబుతూనే పీఎస్ఎల్ ఫ్రాంచైజీలపై అసహనం వ్యక్తిం చేశాడు. నెలన్నర రోజుల్లో పీఎస్ఎల్ ఫ్రాంచైజీలకు తానేంటో తెలిసొచ్చేలా చేస్తానని అన్నాడు. దేశవాలీ క్రికెట్ ఆడి సత్తా చాటుతానని తెలిపాడు. పీఎస్ఎల్లో కాకుండా దేశవాలీ క్రికెట్లో బాగా పెర్ఫార్మ్ చేసి పాకిస్తాన్ జట్టుకు ఎంపికవుతానని అన్నాడు.కాగా, నిన్న జరిగిన పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో అన్ని ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లను ఎంపిక చేసుకుని తమ జట్లను పటిష్టం చేసుకున్నాయి. డ్రాఫ్ట్‌లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, రస్సీ వాన్ డర్ డస్సెన్ లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. పీఎస్ఎల్ 2025లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ ఒకే ఫ్రాంచైజీకి ఆడనున్నారు. వీరిద్దరిని కరాచీ కింగ్స్ కొనుగోలు చేసింది. వార్నర్, కేన్ ద్వయం గతంలో ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడింది.పాకిస్తాన్ సూపర్ లీగ్ డ్రాఫ్ట్‌లో ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్న విదేశీ ఆటగాళ్లు..కరాచీ కింగ్స్- డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, జేమ్స్ విన్స్, టిమ్ సీఫర్ట్, ఆడమ్ మిల్నే, మొహమ్మద్ నబీ, లిటన్ దాస్లాహోర్ ఖలందర్స్- కుసాల్ పెరీరా, డారిల్ మిచెల్, సికందర రజా, సామ్ కర్రన్, రిషద్ హొసేన్, డేవిడ్ వీస్, సామ్ బిల్లింగ్స్ముల్తాన్ సుల్తాన్స్- మైఖేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లే, గుడకేశ్ మోటీ, జాన్సన్ ఛార్లెస్, షాయ్ హోప్, జాషువ లిటిల్, క్రిస్ జోర్డన్ఇస్లామాబాద్ యునైటెడ్- మాథ్యూ షార్ట్, ఆండ్రియస్ గౌస్, బెన్ డ్వార్షుయిష్, రిలే మెరిడిత్, జేసన్ హోల్డర్, రస్సీ వాన్ డర్ డస్సెన్, కొలిన్ మున్రోక్వాట్టా గ్లాడియేటర్స్- ఫిన్ అలెన్, కైల్ జేమీసన్, అకీల్ హొసేన్, రిలీ రొస్సో, మార్క్ చాప్మన్, సీన్ అబాట్, కుసాల్ మెండిస్పెషావర్ జల్మీ- బ్రైయాంట్, కొర్బిన్ బాష్, అల్జరీ జోసఫ్, ఇబ్రహీం జద్రాన్, నహిద్ రాణా, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ -
కేన్ విలియమ్సన్కు అవమానం
దిగ్గజ బ్యాటర్, న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్కు అవమానం జరిగింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) డ్రాఫ్ట్‌లో కేన్ మామను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ప్లాటినమ్ డ్రాఫ్ట్‌లో కేన్ మరో 43 మంది స్టార్ ఆటగాళ్లతో కలిసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన కేన్‌ను పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కూడా ఎవరూ పట్టించుకోలేదు. కేన్ బరిలో నిలిచిన ప్లాటినమ్ డ్రాఫ్ట్ నుంచి 10 మంది ఆటగాళ్లను ఎంపిక చేసున్నాయి ఫ్రాంచైజీలు.అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. వార్నర్ రిటైర్మెంట్ తర్వాత కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో వార్నర్ అదరగొడుతున్నాడు. ఈ లీగ్‌లో వార్నర్ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 63.20 సగటున 142.34 స్ట్రయిక్‌రేట్‌తో 316 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుత ఫామ్ కారణంగానే పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో వార్నర్‌కు మాంచి గిరాకీ ఉండింది.విలియమ్సన్ విషయానికొస్తే.. ఈ కివీస్ లెజెండ్ ఇటీవలి కాలంలో పెద్దగా టీ20లు ఆడింది లేదు. 2023లో ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడని కేన్.. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్ (2024) కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్, పీఎస్ఎల్లో కేన్ ఎంపిక కాకపోవడానికి అతని ఫిట్నెస్ కూడా ఓ కారణమే. ఇటీవలి కాలంలో కేన్ తరుచూ గాయాల బారిన పడుతున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ ఉండి కూడా కేన్ పొట్టి ఫార్మాట్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్నాడు. బ్యాటింగ్‌లో వేగం లేకపోవడం, భారీ షాట్లు ఆడలేకపోవడం కేన్‌కు ప్రధాన సమస్యలు.కేన్ ప్రైవేట్ లీగ్‌ల్లో పెద్దగా రాణించలేకపోయినా అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం పర్వాలేదనిపించాడు. కేన్ తన దేశం తరఫున 93 టీ20లు ఆడి 33.44 సగటున 2575 పరుగులు చేశాడు. కేన్‌ను ప్రైవేట్ లీగ్‌ల్లో ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోకపోవడానికి అతని వయసు మరో ప్రధాన కారణం. ప్రస్తుతం కేన్ మామ వయసు 34 ఏళ్లు.కేన్ ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో కేన్ డర్బన్ జెయింట్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే కేన్ అదరగొట్టాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేన్ 40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో ఆయా ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్న పలువురు స్టార్ ఆటగాళ్లు..డేవిడ్ వార్నర్ (కరాచీ కింగ్స్)డారిల్ మిచెల్ (లాహోర్ ఖలందర్స్)మార్క్ చాప్మన్ (క్వెట్టా గ్లాడియేటర్స్)మైఖేల్ బ్రేస్‌వెల్ (ముల్తాన్ సుల్తాన్స్)ఆడమ్ మిల్నే (కరాచీ కింగ్స్)ఫిన్ అలెన్ (క్వెట్టా గ్లాడియేటర్స్)జేసన్ హోల్డర్ (ఇస్లామాబాద్ యునైటెడ్)ఆమెర్ జమాల్ (కరాచీ కింగ్స్) -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 సీజన్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఈ ఏడాది పీఎస్ఎల్ ఛాంపియన్స్‌గా ఇస్లామాబాద్ యునైటడ్ నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో ముల్తాన్ సూల్తాన్స్ను 2 వికెట్ల తేడాతో ఓడించిన ఇస్లామాబాద్.. మూడో సారి ఛాంపియన్స్‌గా అవతరించింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది సీజన్లో పెషెవర్ జెల్మీ టైటిల్ సాధించకపోయినప్పటికి ఆ జట్టు కెప్టెన్, పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం మాత్రం అరుదైన ఘనతను సాధించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మూడు సార్లు హనీఫ్ మొహమ్మద్ క్యాప్ సొంతం చేసుకున్న మొదటి క్రికెటర్‌గా బాబర్ రికార్డులకెక్కాడు. పీఎస్ఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి హనీఫ్ మొహమ్మద్ క్యాప్(గ్రీన్ క్యాప్)ను అందిస్తారు. ఇప్పుడు వరకు మూడు పీఎస్ఎల్ సీజన్లలో లీడింగ్ రన్ స్కోరర్‌గా బాబర్ నిలిచాడు. 2020 సీజన్లో 473 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన బాబర్.. ఆ తర్వాత 2021 సీజన్లోనూ 554 పరుగులతో గ్రీన్ క్యాప్‌ను తన వద్దే ఉంచుకున్నాడు. ఇప్పుడు పీఎస్ఎల్-2024లోనూ 569 పరుగులతో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. 11 మ్యాచ్‌ల్లో 569 పరుగులు చేశాడు. అందులో 5 ఫిప్టీలతో పాటు ఓ సెంచరీ కూడా ఉంది. -
ఛీ.. ఇదేం పని.. మ్యాచ్ మధ్యలోనే పాక్ క్రికెటర్ ఇలా! వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 విజేతగా ఇస్లామాబాద్ యునైటడ్ నిలిచింది. ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌ను ఓడించిన ఇస్లామాబాద్ యునైటెడ్.. మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంలో ఇస్లామాబాద్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం కీలక పాత్ర పోషించాడు. తొలుత బౌలింగ్‌లో 5 వికెట్లు పడగొట్టిన వసీం.. అనంతరం బ్యాటింగ్‌లోనూ కీలకమైన 19 పరుగులు చేశాడు. దీంతో అతడికి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే తన ప్రదర్శనతో అందరిని అకట్టుకున్న ఇమాద్ వసీం.. ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. మ్యాచ్ జరుగుతుండగా డ్రెసింగ్ రూంలో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. తమ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వసీం సిగరెట్ వెలగించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు 'పీఎసీఎల్ అంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ కాదు.. పాకిస్తాన్ స్మోకింగ్ లీగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్!? PAKISTAN "SMOKING" LEAGUE 🚬🔥🔥#HBLPSL9 #HBLPSLFinal pic.twitter.com/pwpaj4bLh8 — Farid Khan (@_FaridKhan) March 18, 2024 -
ఆఖరి బంతికి సంచలనం.. పీఎస్ఎల్ ఛాంపియన్స్‌గా ఇస్లామాబాద్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 విజేతగా ఇస్లామాబాద్ యునైటెడ్ నిలిచింది. కరాచీ వేదికగా జరిగిన ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్‌ను 2 వికెట్లతో ఓడించిన ఇస్లామాబాద్.. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో హునైన్ షా ఫోర్ కొట్టి ఇస్లామాబాద్‌ను గెలిపించాడు. ఆఖరి ఓవర్లో ఇస్లామాబాద్ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసే బాధ్యతను ముల్తాన్ కెప్టెన్ రిజ్వాన్ పేసర్ మహ్మద్ అలీకి అప్పగించాడు. ఈ క్రమంలో తొలి బంతిని ఇమాద్ వసీం సింగిల్ తీసి నసీం షాకు స్ట్రైక్ ఇచ్చాడు. నసీం షా రెండో బంతిని ఫోర్‌గా మలిచాడు. దీంతో యూనైటడ్ విజయ సమీకరణం నాలుగు బంతుల్లో 3 పరుగులగా మారింది. మూడో బంతి నసీం సింగ్ తీసి వసీంకు మళ్లీ స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో ఆఖరి మూడు బంతుల్లో రెండు పరుగులు అవసరమయ్యాయి. ఇక నాలుగో బంతికి ఇమాద్ వసీం సింగిల్ తీసి స్కోర్లను సమం చేశాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆఖరి రెండు బంతుల్లో ఒక్కపరుగు కావల్సిన సమయంలో నషీం ఔటయ్యాడు. ఐదో బంతికి రిజ్వాన్ క్యాచ్‌కు ఔటయ్యాడు. దీంతో ఇస్లామాబాద్ డగౌట్లో టెన్షన్ వాతవారణం నెలకొంది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హునైన్ షా ఆఖరి బంతికి ఫోరు బాది తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ముల్తాన్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్(57) హాఫ్ సెంచరీతో చెలరేగగా, ఆఖరిలో ఇఫ్తికర్ ఆహ్మద్(20 బంతుల్లో 32, 3 సిక్స్‌లు, 3 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో స్పిన్నర్ ఇమాద్ వసీం 5 వికెట్లతో చెలరేగాడు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఇస్లామాబాద్ ఛేదించాడు. ఇస్లామాబాద్ బ్యాటర్లలో ఓపెనర్ మార్టిన్ గప్టిల్(50) హాఫ్ సెంచరీతో రాణించాడు. కాగా ఐదు వికెట్లతో ఇస్లామాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇమాద్ వసీం 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. అలాగే 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డ్ షదాబ్ ఖాన్‌కు దక్కింది. Shadab Khan won at this life! 😭♥️#HBLPSLFinal I #PSL2024 I #PSLFinal pic.twitter.com/gd53bAzPpy — Rizwan Babar Army (@RizwanBabarArmy) March 18, 2024 -
సూపర్ మ్యాన్‌లా.. గాల్లోకి ఎగురుతూ? బాబర్‌కు ఫ్యూజ్‌లు ఔట్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 లీగ్ ఫైనల్లో ఇస్లామాబాద్ యునైటెడ్ అడుగుపెట్టింది. శనివారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో పెషావర్ జల్మీపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇస్లామాబాద్ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్‌తో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజంను పెవిలియన్‌కు పంపాడు. పెషావర్ ఇన్నింగ్స్ 8 ఓవర్ వేసిన నసీమ్ షా 4వ బంతిని బాబర్‌కు ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బాబర్ కొంచెం రూమ్ తీసుకుని మిడ్ ఆఫ్ మీదగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో మిడ్ ఆఫ్‌లో ఉన్న షాదాబ్ ఖాన్.. ఒక్కసారిగా గాల్లోకి ఎగురుతూ బంతిని అందుకున్నాడు. ఇది చూసిన బాబర్ షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. A bird, a plane? No, it's SUPERMAN SHADAB KHAN 😱#HBLPSL9 | #KhulKeKhel | #PZvIU pic.twitter.com/PZFbd2ZNHV — PakistanSuperLeague (@thePSLt20) March 16, 2024 -
నిరాశపరిచిన బాబర్.. ఫైనల్‌కు చేరిన షాదాబ్ ఖాన్ జట్టు
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో పెషావర్ జల్మీ కథ ముగిసింది. ఈ లీగ్‌లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 5 వికెట్ల తేడాతో పెషావర్ ఓటమి పాలైంది. దీంతో ఈ లీగ్ నుంచి బాబర్ ఆజం సారథ్యంలోని పెషావర్ ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జల్మీ బ్యాటర్లలో సైమ్ అయూబ్(44 బంతుల్లో 73,6 ఫోర్లు, 4 సిక్స్‌లు) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు మహ్మద్ హ్యారిస్(40) పరుగులతో రాణించాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో నసీం షా 3 వికెట్లు పడగొట్టగా.. మెకాయ్, షాదాబ్ ఖాన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇస్లామాబాద్ బ్యాటర్లలో మిడిలార్డర్ బ్యాటర్లు ఇమాద్ వసీం(59 నాటౌట్), హైదర్ అలీ(52 నాటౌట్) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పెషావర్ బౌలర్లలో అయూబ్ రెండు వికెట్లు పడగొట్టగా.. వుడ్, ముమ్టాజ్, కుర్రామ్ తలా వికెట్ సాధించారు. ఇక మార్చి 18న కరాచీ వేదికగా జరగనున్న ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌తో ఇస్లామాబాద్ యూనైటడ్ తలపడనుంది. -
మరోసారి చెలరేగిన బాబర్ ఆజమ్.. వరుసగా మూడో హాఫ్ సెంచరీ
పాకిస్తాన్ సూపర్ లీగ్ చివరి దశకు చేరింది. లీగ్ దశలో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ప్లే ఆఫ్స్ బెర్తులు ఇదివరకే ఖరారయ్యాయి. పెషావర్ జల్మీ, ముల్తాన్ సుల్తాన్స్, ఇస్లామాబాద్ యునైటెడ్, క్వెట్టా గ్లాడియేటర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకోగా.. కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. నిన్న జరిగిన నామమాత్రపు లీగ్ మ్యాచ్‌లో పెషావర్ జల్మీ.. కరాచీ కింగ్స్‌ను 2 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (51) మరోసారి చెలరేగడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. బాబర్‌కు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. పెషావర్ ఇన్నింగ్స్‌లో రోవ్‌మన్ పావెల్ (30) ఓ మోస్తరుగా రాణించాడు. కరాచీ బౌలర్లు డేనియల్ సామ్స్, జహీద్ మహమూద్, ఆరాఫత్, హసన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన కరాచీ.. పెషావర్ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేసింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నవీన్ ఉల్ హాక్ తన కోటా 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో పాటు 2 వికెట్లు పడగొట్టగా.. వుడ్, ఆమెర్ జమాల్, సైమ్ అయూబ్ పొదుపుగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు. టిమ్ సీఫర్ట్ (41), ఇర్ఫాన్ ఖాన్ (39 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించినా కరాచీని గెలిపించలేకపోయారు. -
వికెట్లను కాలితో తన్నాడు.. ఫలితం అనుభవించాడు?
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 ప్లే ఆఫ్స్‌కు ఇస్లామాబాద్ యునైటెడ్ ఆర్హత సాధించింది. ఆదివారం ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇస్లామాబాద్.. తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇస్లామామాబాద్ విజయంలో మున్రో(84), ఇమాద్ వసీం(30) కీలక పాత్ర పోషించారు. నసీం షాకు బిగ్ షాక్.. ఇస్లామామాబాద్ స్టార్ పేసర్ నసీం షాకు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో పీఎస్ఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు నసీంకు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించాడు. షా లెవెల్1 అత్రికమణకు పాల్పడ్డాడని, ఈ విషయంలో మ్యాచ్ రెఫరీదే తుది నిర్ణయమని పీఎస్ఎల్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఏం చేశాండంటే? ముల్తాన్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ షాదాబ్ ఖాన్‌ను నసీం షా అప్పగించాడు. కెప్టెన్ నమ్మకాన్ని షా వమ్ము చేయలేదు. అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే ఇక్కడ వరకు అంతబాగానే ఉన్నప్పటికి ఓవర్ పూర్తి అయిన వెంటనే నసీం తన కాలితో స్టంప్స్‌ను తన్నాడు. ఈ విషయాపై అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామా అతడిపై ఈ చర్యలు తీసుకున్నాడు. చదవండి: ధోని, యువీ కాదు..! టీమిండియాలో గ్రేటెస్ట్ సిక్స్ హిట్టర్ అతడే: ద్రవిడ్ -
కొలిన్ మున్రో విధ్వంసం.. ఉస్మాన్ ఖాన్ మెరుపు శతకం వృధా
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మరో హై స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య ఇవాళ (మార్చి 10) జరిగిన మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 460 పరుగులు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్ 228 పరుగులు చేయగా.. ఛేదనలో ఇస్లామాబాద్ చివరి బంతికి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ చేసిన స్కోర్ సీజన్ మొత్తానికే అత్యధిక స్కోర్‌గా రికార్డైంది. పీఎస్ఎల్ చరిత్రలో ఇస్లామాబాద్‌కు ఇదే అత్యుత్తమ ఛేదన. ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇస్లామాబాద్.. ప్లే ఆఫ్స్ బెర్త్‌ను సైతం ఖరారు చేసుకుంది. ఈ సీజన్లో ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ ఇదివరకే నాకౌట్ దశకు క్వాలిఫై కాగా.. లాహోర్ ఖలందర్స్ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు ఉస్మాన్ కేవలం 50 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 15 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. ఉస్మాన్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. మార్చి 3న కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఉస్మాన్ సెంచరీలు చేసిన ఈ రెండు సందర్భాల్లో నాటౌట్‌గా మిగిలాడు. ఉస్మాన్‌తో పాటు జాన్సన్ చార్లెస్ (18 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), యాసిర్ ఖాన్ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. మున్రో విధ్వంసం.. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్.. కొలిన్ మున్రో (40 బంతుల్లో 84; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (31 బంతుల్లో 54; 6 ఫోర్, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో చివరి బంతికి విజయం సాధించింది. ఇమాద్ వసీం (13 బంతుల్లో 30) చివరి రెండు బంతులకు సిక్సర్, బౌండరీ బాది ఇస్లామాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. -
ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. 50 బంతుల్లోనే శతకం.. వరుసగా రెండవది
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మరో భారీ స్కోర్ నమోదైంది. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో ఇవాళ (మార్చి 10) జరుగుతున్న మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక స్కోర్. ముల్తాన్ సుల్తాన్స్ భారీ స్కోర్ చేయడంలో ఉస్మాన్ ఖాన్ ప్రధానపాత్ర పోషించాడు. వన్‌డౌన్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన ఉస్మాన్ కేవలం 50 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ 15 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. ఉస్మాన్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. మార్చి 3న కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఉస్మాన్ సెంచరీలు చేసిన ఈ రెండు సందర్భాల్లో నాటౌట్‌గా మిగిలాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఉస్మాన్‌తో పాటు జాన్సన్ చార్లెస్ (18 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), యాసిర్ ఖాన్ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (17 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్), ఇఫ్తికార్ అహ్మద్ (12 బంతుల్లో 13; 2 ఫోర్లు), క్రిస్ జోర్డన్ (7 బంతుల్లో 15 నాటౌట్; ఫోర్, సిక్స్) రాణించారు. ఇస్లామాబాద్ బౌలర్లలో ఫహీమ్ అష్రాఫ్ 2 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, హునైన్ షా తలో వికెట్ దక్కించుకున్నారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్.. తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డేవిడ్ విల్లే భారీ హిట్టర్ అలెక్స్ హేల్స్‌ను డకౌట్ చేయగా.. అఘా సల్మాన్‌ను మొహమ్మద్ అలీ (2) పెవిలియన్‌కు పంపాడు. 4 ఓవర్ల తర్వాత ఇస్లామాబాద్ స్కోర్ 38/2గా ఉంది. షాదాబ్ ఖాన్ (8 బంతుల్లో 13; 2 ఫోర్లు), కొలిన్ మున్రో (10 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. -
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆసీస్ దిగ్గజం..?
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆసీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఎంపిక కానున్నాడని తెలుస్తుంది. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాట్సన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వాట్సన్ సమాధానం కోసం పీసీబీ ఎదురు చూస్తున్నట్లు నివేదికలు ద్వారా తెలుస్తుంది. వాట్సన్ త్వరలోనే పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వి కలుస్తాడని సమాచారం. ప్రస్తుతం వాట్సన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ అయిన క్వెట్టా గ్లాడియేటర్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. పీసీబీ ప్రతిపాదనకు వాట్సన్ నో చెప్పినా వారి వద్ద ప్రత్యామ్నాయ ఆప్షన్ ఉన్నట్లు సమాచారం. పీసీబీ అధికారుల దృష్టిలో విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో సామి పీఎస్ఎల్ ఫ్రాంచైజీ పెషావర్ జల్మీకి కెప్టెన్‌గా వ్యవహరించి ఉండటంతో అతనికి పాక్‌లో భారీ క్రేజ్ ఉంది. పాక్ హెచ్ కోచ్ పదవికి వాట్సన్ నో చెబితే పీసీబీ సామినే కోచ్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. కాగా, పాకిస్తాన్ టీమ్ డైరెక్టర్‌గా మొహమ్మద్ హఫీజ్ తొలగించబడినప్పటి నుంచి పాక్ జట్టు కోచ్ లేకుండానే ఉంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన అనంతరం పీసీబీ నాటి విదేశీ కోచింగ్ సిబ్బంది మొత్తాన్ని తొలగించింది. ప్రస్తుతం పాకిస్తాన్లో పీఎస్ఎల్ సీజన్ నడుస్తుంది. ఈ లీగ్ చివరి దశకు చేరింది. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ నాకౌట్ దశకు క్వాలిఫై అయ్యాయి. లాహోర్ ఖలందర్స్ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. -
బాబర్ ఆజమ్ పరుగుల ప్రవాహం కొనసాగింపు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో పెషావర్ జల్మీ సారధి బాబర్ ఆజమ్ పరుగుల ప్రవాహం కొనసాగుతుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్న బాబర్.. తాజాగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో హాఫ్ సెంచరీ చేసి తన పరుగుల సంఖ్యను మరింత పెంచుకున్నాడు. క్వెట్టతో జరుగుతున్న మ్యాచ్‌లో 30 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 53 పరుగులు చేసిన బాబర్.. ప్రస్తుత ఎడిషన్‌లో తన పరుగుల సంఖ్యను 447కి పెంచుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన బాబర్.. సెంచరీ, 4 అర్దసెంచరీలు చేశాడు. క్వెట్టాతో మ్యాచ్‌లో బాబర్ రాణించడంతో పెషావర్ జల్మీ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. 15 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 156 పరుగులుగా ఉంది. జల్మీ ఇన్నింగ్స్‌లో బాబర్‌తో పాటు సైమ్ అయూబ్ (12 బంతుల్లో 30), మొహమ్మద్ హరీస్ (13 బంతుల్లో 20), కోహ్లెర్ కాడ్మోర్ (19 బంతుల్లో 33) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. రోవ్‌మన్ పావెల్ (6), ఆమెర్ జమాల్ (5) క్రీజ్‌లో కొనసాగుతున్నారు. -
నిప్పులు చెరిగిన హసన్ అలీ.. టిమ్ సీఫర్ట్ మెరుపులు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో ఇవాళ (మార్చి 6) జరిగిన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్.. హసన్ అలీ (4-0-15-4), బ్లెస్సింగ్ ముజరబానీ (4-0-27-2), జహీద్ మెహమూద్ (4-0-25-2), మీర్ హమ్జా (3.1-0-25-1) ధాటికి 19.1 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. .@RealHa55an is a vibe 😄pic.twitter.com/oq7KK1mc5M — CricTracker (@Cricketracker) March 6, 2024 గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ (33) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేసన్ రాయ్ (15), ఖ్వాజా నఫే (17), రిలీ రొస్సో (10), అకీల్ హొసేన్ (14) రెండంకెల స్కోర్లు చేశారు. బిగ్ హిట్టర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (9), సర్ఫరాజ్ ఖాన్ (7), ఆమిర్ (2), హస్నైన్ (5), ఉస్మాన్ తారిక్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కరాచీ కింగ్స్.. 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. టిమ్ సీఫర్ట్ (31 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. షోయబ్ మాలిక్ (27 నాటౌట్) కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. మధ్యలో జేమ్స్ విన్స్ (27) పర్వాలేదనిపించగా.. కెప్టెన్ షాన్ మసూద్ (7) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. గ్లాడియేటర్స్ బౌలర్లలో అకీల్ హొసేన్, మొహమ్మద్ ఆమిర్, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. -
సత్తా చాటిన బాబర్.. మరోసారి బ్యాట్ ఝులిపించిన ఆమెర్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో పెషావర్ జల్మీ మరోసారి భారీ స్కోర్ సాధించింది. ముల్తాన్ సుల్తాన్స్‌తో ఇవాళ (మార్చి 5) జరుగుతున్న మ్యాచ్‌లో పెషావర్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్‌కు ఓపెనర్లు సైమ్ అయూబ్ (22 బంతుల్లో 46;3 ఫోర్లు, 5 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (40 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరికి వికెట్‌కీపర్ హసీబుల్లా ఖాన్ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్), రోవ్‌మన్ పావెల్ (15 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), ఆసిఫ్ అలీ (10 బంతుల్లో 11; 2 ఫోర్లు) తోడయ్యారు. ఆఖర్లో ఆమెర్ జమాల్ (5 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) గత మ్యాచ్ తరహాలో (జమాల్ నిన్న ఇస్తామాబాద్తో జరిగిన మ్యాచ్‌లో పూనకం వచ్చినట్లు ఊగిపోయి 49 బంతుల్లో 8 ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేశాడు) రెచ్చిపోయాడు. సుల్తాన్స్ బౌలర్లలో ఉసామా మిర్, క్రిస్ జోర్డన్లు పెషావర్ బ్యాటర్లకు అడ్డుకట్ట వేయగలిగారు. ఉసామా 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. జోర్డన్ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. వీరిద్దరు మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మొహ్మద్ అలీ 3 ఓవర్లలో 46, డేవిడ్ విల్లే 4 ఓవర్లలో 36, ఇఫ్తికార్ ఓవర్లో 12, ఖుష్దిల్ షా ఓవర్లో 13, అఫ్తాబ్ 3 ఓవర్లలో 30 పరుగులు సమర్పించుకున్నారు. -
సూపర్ క్యాచ్ పట్టిన బాల్ బాయ్.. హగ్ చేసుకున్న స్టార్ బ్యాటర్! వీడియో
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో భాగంగా సోమవారం రావల్పిండి వేదికగా పెషావర్ జెల్మీ, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్లు తలపడ్డాయి. ఈ హైలోల్టేజ్ పోరులో పెషావర్‌ను 29 పరుగుల తేడాతో ఇస్లామాబాద్ చిత్తు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ ఆటగాడు, కివీస్ స్టార్ కోలిన్ మున్రో ఓ బాల్ బాయ్‌ను ఎత్తుకున్నాడు. ఏం జరిగిందంటే? పెషావర్ ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లో అమీర్ జమాల్ భారీ సిక్స్ బాదాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ అవతల ఉన్న ఓ బాల్ బాయ్ బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇది గమనించిన మున్రో అతడి దగ్గరకు వెళ్లి బంతిని ఎలా పట్టుకోవాలో కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ తర్వాత అదే ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లో పెషావర్ బ్యాటర్ ఆరిఫ్ యూకుడ్ అదే పొజిషన్లో సిక్సర్ బాదాడు. ఈ సారి మాత్రం బాల్‌బాయ్ ఎటువంటి తప్పిదం చేయలేదు. అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన మున్రో వెంటనే అతడి దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుని అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2024: ధోని సంచలన నిర్ణయం.. సీఎస్కే కెప్టెన్‌గా రుత్‌రాజ్ గైక్వాడ్!? From drop to dazzling catch! 😲 Ball boy redeems himself in #IUvPZ match and gets a warm hug from Colin Munro. #HBLPSL9 | #KhulKeKhel pic.twitter.com/ncTKJ0xPfr — PakistanSuperLeague (@thePSLt20) March 4, 2024 -
ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి విధ్వంసం.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో! వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో పెషావర్ జల్మీ మరో ఓటమి చవిచూసింది. రావల్పిండి వేదికగా ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో పెషావర్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో పెషావర్ ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు యువ ఆల్‌రౌండర్ అమీర్ జమాల్ తన విరోచిత పోరాటంతో అందరని అకట్టుకున్నాడు. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్ కేవలం 18 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అమీర్ జమీల్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. మరో ఎండ్‌లో ఉన్న వాల్టర్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బౌండరీలు వర్షం కురిపించాడు. జమాల్ ఇన్నింగ్స్ చూసి పెషావర్ మరో విజయం తమ ఖాతాలో వేసుకుంటుందని అంతా భావించారు. కానీ ఆఖరిలో జమాల్ ఔట్ కావడంతో పెషావర్ ఓటమి చవిచూసింది. ఓవరాల్‌గా 49 బంతులు ఎదుర్కొన్న జమాల్ 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 87 పరుగులు చేశాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి సంచలన ఇన్నింగ్స్ ఆడిన జమాల్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా లక్ష్య ఛేదనలో పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. AAMER JAMAL PLAYING LIKE HE DID IN THE TESTS IN AUSTRALIA 🔥🔥🔥#HBLPSL9 #tapmad #HojaoAdFree pic.twitter.com/UeiRi24PSB — Farid Khan (@_FaridKhan) March 4, 2024 ఇస్లామాబాద్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్, హునైన్ షా తలా రెండు వికెట్లు సాధించారు.ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇస్లామాబాద్ బ్యాటర్లలో కెప్టెన్ షాదాబ్(51 బంతుల్లో 80, 4ఫోర్లు,6 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. Aamer Jamal REMEMBER THE NAME !🤝#HBLPSL9 #IUvPZ #PSL2024 pic.twitter.com/7Dgqv69zTD — Aussies Army🏏🦘 (@AussiesArmy) March 4, 2024 -
విధ్వంసకర సెంచరీ.. 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో! వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో ముల్తాన్ సుల్తాన్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. తాజాగా కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముల్తాన్ ఘన విజయం సాధించింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసింది. కరాచీ బ్యాటర్లలో షోయబ్ మాలిక్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు షాన్ మసూద్(36) పరుగులతో రాణించాడు. ముల్తాన్ సుల్తాన్స్ బౌలర్లలో ఉసమా మీర్ రెండు వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ విల్లీ, మహ్మద్ అలీ, క్రిస్ జోర్డాన్, కుష్దుల్ షా తలా ఒక్క వికెట్ సాధించారు. ఉస్మాన్ ఖాన్ విధ్వంసకర సెంచరీ.. అంతకముందు బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ముల్తాన్ ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కరాచీ బౌలర్లను ఉస్మాన్ ఖాన్ ఊచకోత కోశాడు. కేవలం 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 106 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(58) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక ఈ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ముల్తాన్ సుల్తాన్ ఖారారు చేసుకుంది. USMAN KHAN, TAKE A BOW! 🙇 Second HBL PSL 💯 for the Sultans star 👏#HBLPSL9 | #KhulKeKhel | #KKvMS pic.twitter.com/DCP60FJwoD — PakistanSuperLeague (@thePSLt20) March 3, 2024 -
విండీస్ ప్లేయర్ సిక్సర్ల సునామీ
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024లో భాగంగా కరాచీ కింగ్స్‌తో నిన్న (ఫిబ్రవరి 29) జరిగిన మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేర్స్ బ్యాటర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ చెలరేగిపోయాడు. 31 బంతుల్లో బౌండరీ, ఆర డజను సిక్సర్ల సాయంతో అజేయమైన 58 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. చివరి బంతికి బౌండరీ బాది గ్లాడియేటర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కరాచీ ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. జేమ్స్ విన్స్ (37) టాప్ స్కోరర్‌గా కాగా.. టిమ్ సీఫర్ట్ 21,షోయబ్ మాలిక్ 12, మొహమ్మద్ నవాజ్ 28, పోలార్డ్ 13, ఇర్ఫాన్ ఖాన్ 15, హసన్ అలీ 2 పరుగులు చేశారు. ఆఖర్లో అన్వర్ అలీ (14 బంతుల్లో 25 నాటౌట్) మెరపు ఇన్నింగ్స్ ఆడగా.. జహిద్ మహమూద్ 3 పరుగులతో అజేయంగా నిలిచారు. క్వెట్టా బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. అకీల్ హొసేన్, ఉస్మాన్ తారిక్ తలో 2 వికెట్లు, వసీం ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్వెట్టా.. 5 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయతీరాలకు చేరింది. జేసన్ రాయ్ (31 బంతుల్లో 52; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ మెరుపు అర్దశతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో అకీల్ హొసేన్ (17 బంతుల్లో 22 నాటౌట్) రూథర్‌ఫోర్డ్‌కు జత కలిశాడు. క్వెట్టా ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ 24, ఖ్వాజా నఫే 2, సర్ఫరాజ్ అహ్మద్ 3, రిలీ రొస్సో 6 పరుగులు చేశారు. కరాచీ బౌలర్లలో హసన్ అలీ, జహిద్ మహమూద్ తలో 2 వికెట్లు.. షోయబ్ మాలిక్ ఓ వికెట్ పడగొట్టారు. -
పాకిస్తాన్ లీగ్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. 13 మందికి అస్వస్థత, ఒకరికి సీరియస్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కరాచీ కింగ్స్‌కు చెందిన 13 మంది క్రికెటర్లు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని సమాచారం. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పరిస్థితి చేయి దాటేలా ఉండటంతో సదరు ఆటగాడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. క్వెట్టా గ్లాడియేటర్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 29) జరుగుతున్న మ్యాచ్‌కు ముందు ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తుంది. ఆసుపత్రికి తరలించిన క్రికెటర్ సౌతాఫ్రికాకు చెందిన తబ్రేజ్ షంషి అని సమాచారం. నిన్న ఆస్ట్రేలియాకు చెందిన డేనియల్ సామ్స్, సౌతాఫ్రికాకు చెందిన లూయిస్ డు ప్లూయ్ ఉదర సంబంధింత సమస్యల కారణంగా చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. కరాచీ కింగ్స్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ సైతం స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఇంతమంది ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తున్నప్పటికీ.. కరాచీ కింగ్స్ యాజమాన్యం వాస్తవాలను బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నట్లు పాక్ మీడియానే ప్రచారం చేస్తుంది. క్వెట్టాతో కొద్ది సేపటి క్రితం మొదలైన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్.. పై పేర్కొన్న ఆటగాళ్లు కాకుండా వేరే ముగ్గురు ఫారెన్ ప్లేయర్లతో బరిలోకి దిగింది. క్వెట్టాతో జరుగుతున్న మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 16.1 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 134/6గా ఉంది. షాన్ మసూద్ (2), టిమ్ సీఫర్ట్ (21), జేమ్స్ విన్స్ (37), షోయబ్ మాలిక్ (12), మొహమ్మద్ నవాజ్ (28), పోలార్డ్ (13) ఔట్ కాగా.. ఇర్ఫాన్ ఖాన్ (15), హసన్ అలీ క్రీజ్‌లో ఉన్నారు. క్వెట్టా బౌలర్లలో అకీల్ హొసేన్, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్ తలో 2 వికెట్లు పడగొట్టారు. -
న్యూజిలాండ్ ఓపెనర్ ఊచకోత.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో ఇస్లామాబాద్ యునైటెడ్ రెండో విజయం నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఇస్లామాబాద్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కరాచీ బ్యాటర్లలో కిరాన్ పొలార్డ్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 48 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో ఇమాడ్ వసీం, నసీం షా, సల్మాన్, హునైన్ షా తలా వికెట్ సాధించారు. మున్రో ఊచకోత.. అనంతరం 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ 18.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇస్లామాబాద్ బ్యాటర్లలో కొలిన్ మున్రో విధ్వంసం సృష్టించాడు. 47 బంతులు ఎదుర్కొన్న మున్రో.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేశాడు. అతడితో పాటు అలెక్స్ హేల్స్(47), అఘా సల్మాన్(25) పరుగులతో రాణించారు. చదవండి: BAN vs SL: హసరంగాపై వేటు.. శ్రీలంక కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ -
ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. విధ్వంసం సృష్టించిన ఇఫ్తికార్, హెండ్రిక్స్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మరో భారీ స్కోర్ నమోదైంది. లాహోర్ ఖలందర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ డకౌటైనా సుల్తాన్స్ ఏ మాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేశారు. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, సిక్స్), ఇఫ్తికార్ అహ్మద్ (18 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడగా.. వికెట్‌కీపర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ (55 బంతుల్లో 96; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. వీరికి తయ్యబ్ తాహిర్ (14 బంతుల్లో 21; 3 ఫోర్లు) జత కలిశాడు. లాహోర్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 2 వికెట్లు పడగొట్టగా.. బ్రాత్‌వైట్, సికందర్ రజా తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుండగా.. ముల్తాన్ సుల్తాన్స్ 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్, ఇస్తామాబాద్ యునైటెడ్ వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి. -
బాబర్ ఆజమ్ విధ్వంసం.. టీ20ల్లో 11వ శతకం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజమ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్‌లో బాబర్.. 59 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 63 బంతులను ఎదుర్కొన్న బాబర్.. 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 111 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబర్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. సైమ్ అయూబ్ (38) కాస్త పర్వాలేదనిపించగా.. మొహమ్మద్ హరీస్ (2), హసీబుల్లా ఖాన్ (0), పాల్ వాల్టర్ (19), రోవ్‌మన్ పావెల్ (8) విఫలమయ్యారు. ఆఖర్లో ఆసిఫ్ అలీ (17 నాటౌట్) వేగంగా పరుగులు సాధించాడు.ఈ మ్యాచ్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 42 బంతులు తీసుకున్న బాబర్.. ఆతర్వాతి హాఫ్ సెంచరీని కేవలం 21 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2, నసీం షా, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, పొట్టి క్రికెట్లో 11వ సెంచరీ (284 మ్యాచ్‌ల్లో) పూర్తి చేసుకున్న బాబర్.. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీల రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఈ ఫార్మాట్లో గేల్ అత్యధికంగా 22 సెంచరీలు (463 మ్యాచ్‌ల్లో) చేశాడు. -
సౌతాఫ్రికా ఆటగాడి విధ్వంసకర సెంచరీ.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో!
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో లాహోర్ ఖలందర్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ లీగ్‌లో భాగంగా ఆదివారం పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో లాహోర్ 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లాహోర్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. 212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లాహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు మాత్రమే చేసింది. లాహోర్ స్టార్ బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. భారీ లక్ష్య ఛేదనలో డస్సెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలో కేవలం 50 బంతుల్లోనే తన తొలి పీఎస్ఎల్ సెంచరీని ఈ సఫారీ స్టార్ బ్యాటర్ అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 52 బంతులు ఎదుర్కొన్న డస్సెన్ 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఏదేమైనప్పటికీ డస్సెన్ విధ్వంసకర సెంచరీ వృథా అయిపోయింది. లహోర్ బ్యాటర్లలో డస్సెన్ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. పెషావర్ బ్యాటర్లలో ఓపెనర్ సైమ్ అయూబ్(55 బంతుల్లో 88, 8 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు బాబర్ ఆజం(48), పావెల్(46) పరుగులతో రాణించారు. 2024 PSL's first centurion 💯🥇 Take a bow, Rassie van der Dussen 🤩🔥pic.twitter.com/6RIybWt2Ay — Sport360° (@Sport360) February 25, 2024 -
సైమ్ అయూబ్ విధ్వంసం.. రోవ్‌మన్ పావెల్ ఊచకోత
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో ఇవాళ (ఫిబ్రవరి 25) లాహోర్ ఖలందర్స్, పెషావర్ జల్మీ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఖలందర్స్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన పెషావర్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సైమ్ అయూబ్ (55 బంతుల్లో 88; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), రోవ్‌మన్ పావెల్ (20 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు), మొహమ్మద్ హరీస్ (5 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో పెషావర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ చేసింది. పెషావర్ ఇన్నింగ్స్‌లో ఆసిఫ్ అలీ (6) తక్కువ స్కోర్‌కు ఔట్ కాగా.. పాల్ వాల్టర్ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు. లాహోర్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (4-0-33-3) విజృంభించగా.. జహాన్దాద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. లీగ్ ప్రస్తుత ఎడిషన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన లాహోర్ ఇంతవరకు బోణీ కొట్టలేదు. ఈ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌లు ఆడిన పెషావర్ ఓ విజయం, రెండు పరాజయాలతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ముల్తాన్ సుల్తాన్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. క్వెట్టా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
రెచ్చిపోయిన రీజా హెండ్రిక్స్.. రాణించిన రిజ్వాన్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు రీజా హెండ్రిక్స్ భీకర ఫామ్ కొనసాగుతుంది. ఈ సీజన్లో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసిన హెండ్రిక్స్ తాజాగా మరో హాఫ్ సెంచరీ సాధించాడు. క్వెట్టా గ్లాడయేటర్స్తో ఇవాళ (ఫిబ్రవరి 25) జరిగిన మ్యాచ్‌లో హెండ్రిక్స్ మెరుపు అర్ధశతకంతో (47 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫలితంగా సుల్తాన్స్ 13 పరుగుల తేడాతో గ్లాడియేటర్స్‌పై విజయం సాధించింది. సుల్తాన్స్ విజయంలో ఆ జట్టు కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (51) సైతం కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. హెండ్రిక్స్, రిజ్వాన్‌తో పాటు తయ్యబ్ తాహిర్ (35 నాటౌట్) రాణించాడు. గ్లాడియేటర్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్ 2, అకీల్ హొసేన్, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లాడియేటర్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సుల్తాన్స్ బౌలర్లలో మొహమ్మద్ అలీ అద్భుత ప్రదర్శనతో (4-1-19-3) విజృంభించగా.. డేవిడ్ విల్లే 3, ఆఫ్తాబ్ ఇబ్రహీం 2, ఉసామా మిర్ ఓ వికెట్ పడగొట్టారు. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్‌లో ఖ్వాజా నఫే (36), రిలీ రొస్సో (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
పొలార్డ్ విధ్వంసం.. ఆఖరి బంతికి గెలుపు! షాక్‌లో షాహీన్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 సీజన్లో కరాచీ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా శనివారం లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 2 వికెట్ల తేడాతో కరాచీ విజయం సాధించింది. చివరి బంతికి మీర్ హంజా సింగిల్ తీసి కరాచీని గెలిపించాడు. అయితే 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కరాచీ ఆటగాడు, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదుకు దాడికి దిగాడు. మరో ఎండ్‌లో ఉన్న షోయబ్ మాలిక్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కిరాన్ కేవలం 33 బంతుల్లోనే 5 సిక్స్‌లు, ఒక ఫోరుతో 58 పరుగులు చేశాడు. అయితే కరాచీ ఇన్నింగ్స్ 16 ఓవర్లో షాహీన్ అఫ్రిది.. అద్భుత బంతితో పొలార్డ్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మాలిక్ కూడా ఔట్ కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ లాహోర్ వైపు మలుపు తిరిగింది. ఆఖరి ఓవర్లో కరాచీ విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది.. ఆఫ్ స్పిన్నర్ ఆషాన్ బట్టికి అప్పగించాడు. ఇదే షాహీన్ చేసిన తప్పిదం. చివరి ఓవర్లో తొలి బంతినే హసన్ అలీ సిక్సర్‌గా మలిచాడు. దీంతో కరాచీ విజయసమీకరణం 5 బంతుల్లో 5 పరుగులగా మారిపోయింది. ఆ తర్వాత ఐదో బంతికి హసన్ అలీ ఔటైనప్పటికీ.. క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్ మీర్ సింగిల్ తీసి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఇది చూసిన అఫ్రిది తలను పట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. లహోర్ ఓన సాహిబ్జాదా ఫర్హాన్(72) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కరాచీ బౌలర్లలో మీర్ హంజా, షంసీ, హసన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. -
దమ్ముంటే ఇక్కడకు రా.. కట్టలు తెంచుకున్న బాబర్ ఆగ్రహం
Angry Babar Azam Fumes At Ill Mannered Fans: పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంకు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఆకతాయి బాబర్ ఆట తీరును కించపరిచేలా కామెంట్ చేశాడు. దీంతో సహనం కోల్పోయిన ఈ మాజీ కెప్టెన్ అతడి పైకి బాటిల్ విసిరాలని చూశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగిందంటే.. పెషావర్ జల్మీ కెప్టెన్‌గా ఉన్న బాబర్ ఆజం.. ముల్తాన్ సుల్తాన్స్‌తో మ్యాచ్‌లో 31 పరుగులు చేశాడు. ముల్తాన్ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బాబర్ ఆజం తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పెషావర్ జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 37 పరుగులతో హసీబుల్లా ఖాన్ జల్మీ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలవగా.. బాబర్ 31 పరుగులతో అతడి తర్వాతి స్థానంలో నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనలో ముల్తాన్ సుల్తాన్స్ 174 పరుగులకే కుప్పకూలడంతో పెషావర్ జల్మీ 5 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. మ్యాచ్ సంగతి ఇలా ఉంటే.. డగౌట్లో కూర్చున్న సమయంలో బాబర్ ఆజంను ఉద్దేశించి ఓ ప్రేక్షకుడు ‘జింబాబర్’ అంటూ అరిచాడు. This is really unacceptable, Never expected this from Multan fans.. 🤦♂️ pic.twitter.com/MgZWQlO8oR — Nibraz Ramzan (@nibraz88cricket) February 24, 2024 దీంతో బాబర్‌కు చిర్రెత్తుకొచ్చింది. ‘‘ఏయ్ దమ్ముంటే.. ఇక్కడకు రా’’ అంటూ సైగ చేసిన బాబర్ ఆజం.. తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ విసిరేస్తానంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన బ్యాటింగ్ నైపుణ్యాలను తక్కువ చేసి మాట్లాడినందుకు తగిన బుద్ధి చెప్తానన్నట్లుగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘జింబాబర్’ అని ఎందుకన్నాడు? టీమిండియా స్టార్ బ్యాటర్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లితో పోల్చదగిన సమకాలీన క్రికెటర్లలో ఒకడు బాబర్ ఆజం అని పలువురు పాక్ మాజీ క్రికెటర్ల అభిప్రాయం. అందుకు తగ్గట్లుగానే అంతర్జాతీయ స్థాయిలో అద్బుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్. అయితే, గత కొంతకాలంగా నిలకడలేమి ప్రదర్శనతో బాబర్ సతమతమవుతున్నాడు. ముఖ్యంగా పటిష్ట జట్ల మీద మెరుగైన స్కోర్లు సాధించలేకపోతున్నాడు. జింబాబ్వే వంటి పసికూన జట్లపై మాత్రం సెంచరీలు బాదాడు. ఈ నేపథ్యంలో చాలాకాలంగా.. ‘‘జింబాబర్’’అంటూ నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పీఎస్ఎల్ మ్యాచ్‌లోనూ ఇలాగే ఆటపట్టించే ప్రయత్నం చేయగా.. బాబర్ కోపోద్రిక్తుడయ్యాడు. Kalesh b/w Babar Azam And One of guy from Crowd over he was Calling him "Zimbabar" during PSL match pic.twitter.com/mtR99WDmoW — Ghar Ke Kalesh (@gharkekalesh) February 24, 2024 -
అన్నను మించిపోయేలా ఉన్నాడు.. తొలి మ్యాచ్‌లోనే! వీడియో వైరల్
పాకిస్తాన్ క్రికెట్ నుంచి మరో పేస్ సంచలనం పుట్టుకొచ్చాడు. ఇటీవలే అండర్-19 అండర్ వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన యువ పేసర్ హునైన్ షా.. ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. పీఎస్ఎల్-2024లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున హునైన్ షా బరిలోకి దిగాడు. ఈ క్రమంలో గురువారం లాహోర్ వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హునైన్ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన హునైన్.. 13 పరుగులిచ్చి వికెట్ పడగొట్టాడు. కట్టుదిట్టమైన బంతులు విసురుతూ ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టాడు. ఈ క్రమంలో క్వెట్టా గ్లాడియేటర్స్ ఓపెనర్ జాసెన్ రాయ్‌ను 20 ఏళ్ల హునైన్ అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. పీఎస్ఎల్లో హునైన్కు ఇదే తొలి వికెట్. కాగా హునైన్ షా ఎవరో కాదు.. పాకిస్తాన్ స్టార్ పేసర్ నసీం షాకు స్వయాన సోదరుడే. అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంఛైజీకే ప్రాతినిథ్యం వహిస్తుండడం గమనార్హం. అయితే తన తమ్ముడు తొలి పీఎస్ఎల్ వికెట్ సాధించగానే నసీం సంబరాల్లో మునిగితేలిపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటైడ్ పై 3 వికెట్ల తేడాతో క్వెట్టా గ్లాడియేటర్స్ విజయం సాధించింది. hunain shah, remember the name pic.twitter.com/kkONIs1qXg — :) (@babardrive) February 22, 2024 -
పాక్ బ్యాటర్ విధ్వంసం.. కేవలం 11 బంతుల్లోనే? వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో ముల్తాన్ సుల్తాన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. బుధవారం లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ముల్తాన్ ఘన విజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముల్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(59 బంతుల్లో 82, 9 ఫోర్లు,3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరిలో సుల్తాన్స్ మిడిలార్డర్ బ్యాటర్ ఇఫ్తికర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 11 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 పరుగులు చేసి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. 19 ఓవర్ వేసిన లహోర్ పేసర్ జమాన్ ఖాన్‌కు ఇఫ్తి భాయ్ చుక్కలు చూపించాడు. ఏకంగా ఆ ఓవర్లో 24 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను ముగించేశాడు. డగౌట్ నుంచి ఇఫ్తికర్ విధ్వంసం చూసిన రిజ్వాన్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతంలో కూడా ఇఫ్తికర్ పాక్ జట్టుకు ఎన్నో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. లాహోర్ బ్యాటర్లలో వండర్ డస్సెన్(54) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముల్తాన్ బౌలర్లలో మహ్మద్ అలీ రెండు వికెట్లు పడగొట్టగా.. అఫ్రిది, ఉసామా మీర్ తలా వికెట్ పడగొట్టారు. చదవండి: AFG vs SL: నరాలు తెగే ఉత్కంఠ.. శ్రీలంకకు ఊహించని షాకిచ్చిన అఫ్గాన్ IFTI MANIA 🤯 Enough said...#HBLPSL9 | #KhulKeKhel | #MSvLQ pic.twitter.com/uXqkWv2btV — PakistanSuperLeague (@thePSLt20) February 21, 2024 -
పూనకాలు తెప్పించిన పోలార్డ్.. బాబర్ వరల్డ్ రికార్డు ఇన్నింగ్స్ వృధా
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో కరాచీ కింగ్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర యోధుడు కీరన్ పోలార్డ్ రెచ్చిపోయాడు. పెషావర్ జల్మీతో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో పూర్వంలా పూనకాలు తెప్పించాడు. 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 49 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. 𝑽𝒊𝒏𝒕𝒂𝒈𝒆 𝑷𝒐𝒍𝒍𝒚 𝒊𝒏 𝑷𝑺𝑳 𝟐𝟎𝟐𝟒🔥 📸: Fan Code pic.twitter.com/uUMO58x5Sj — CricTracker (@Cricketracker) February 21, 2024 పోలార్డ్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో ప్రత్యర్ది బ్యాటర్ బాబర్ ఆజమ్ (పెషావర్) వరల్డ్ రికార్డు ఇన్నింగ్స్ వృధా అయ్యింది. ఈ మ్యాచ్‌లో 51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 72 పరుగులు చేసిన బాబర్.. టీ20ల్లో అత్యంత వేగంగా (271 ఇన్నింగ్స్‌ల్లో) 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. He's still got it 🥶pic.twitter.com/kthsVbhdf3 — CricTracker (@Cricketracker) February 21, 2024 పోలార్డ్‌తో పాటు జేమ్స్ విన్స్ (30 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), ముహమ్మద్ అక్లక్ (13 బంతుల్లో 24; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షోయబ్ మాలిక్ (29 బంతుల్లో 29; ఫోర్, సిక్స్) రాణించడంతో పెషావర్ నిర్ధేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని కరాచీ 16.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పెషావర్ బౌలర్లలో లూక్ వుడ్ (3.5-1-20-2) ఒక్కడే కరాచీ బ్యాటర్లను కాస్త ఇబ్బంది పెట్టాడు. సలాంకీల్ వికెట్ తీసినప్పటికీ (4-0-54-1) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. బాబర్ ఆజమ్ (72) రాణించడంతో 154 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ (19.5 ఓవర్లలో ఆలౌట్) చేయగలిగింది. పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబర్‌తో పాటు రోవ్‌మన్ పావెల్ (39), ఆసిఫ్ అలీ (23) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, హసన్ అలీ చెరో 3 వికెట్లు, డేనియల్ సామ్స్ 2, షోయబ్ మాలిక్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ పడగొట్టారు. -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో భాగంగా కరాచీ కింగ్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 21) జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్ (పెషావర్ జల్మీ) ఈ రికార్డును సాధించాడు. బాబర్‌కు ముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ ఈ మార్కును తాకేందుకు 285 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. బాబర్ కేవలం 271 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్, గేల్ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి (299 మ్యాచ్‌లు), డేవిడ్ వార్నర్ (303), ఆరోన్ ఫించ్ (327) ఉన్నారు. ఓవరాల్‌గా టీ20ల్లో 10000 పరుగుల మార్కును ఇప్పటివరకు 12 మంది (బాబర్ సహా) క్రాస్ చేశారు. పాక్ తరఫున షోయబ్ మాలిక్, బాబర్ ఆజమ్ ఈ ఘనతను సాధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 10,000 పరుగుల మార్కును తాకిన బాబర్ 51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబరే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. బాబర్ ఒక్కడే రాణించడంతో 154 పరుగులకు ఆలౌటైంది. బాబర్‌తో పాటు రోవ్‌మన్ పావెల్ (39), ఆసిఫ్ అలీ (23) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. పెషావర్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు (సైమ్ అయూబ్, జీషన్, సలాంకీల్) డకౌట్లయ్యారు. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, హసన్ అలీ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. డేనియల్ సామ్స్ 2, షోయబ్ మాలిక్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
కొవ్వు పేరుకుపోయింది: బాబర్‌పై మండిపడ్డ హఫీజ్
When the fat levels Checked Skin fold of all of them was high: పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ప్రస్తుత బ్యాటర్ బాబర్ ఆజం తీరును హెడ్‌కోచ్ మహ్మద్ హఫీజ్ విమర్శించాడు. మాజీ కోచ్ మిక్కీ ఆర్థర్‌తో కలిసి జట్టును భ్రష్టుపట్టించాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు క్రమశిక్షణ లేకుండా తయారు కావడానికి బాబర్, మిక్కీ కారణమని హఫీజ్ మండిపడ్డాడు. వరల్డ్‌కప్‌లో వైఫల్యం కాగా మిక్కీ ఆర్థర్ మార్గదర్శనంలో బాబర్ ఆజం కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టు వన్డే వరల్డ్‌కప్-2023లో దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్లో కనీసం సెమీస్ కూడా చేరుకుండానే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలగగా.. హెడ్‌కోచ్ మిక్కీ ఆర్థర్‌పై వేటు పడింది. ఈ క్రమంలో మహ్మద్ హఫీజ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. అంతేకాదు హెడ్‌కోచ్ బాధ్యతలనూ తానే చేపట్టాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో చేదు అనుభవం ఇక బాబర్ స్థానంలో టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది సారథులుగా ఎంపికయ్యారు. ఈ క్రమంలో కొత్త నాయకత్వంలో ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన పాక్.. న్యూజిలాండ్ టూర్లో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో తనకు ఓ విచిత్రమైన విషయం తెలిసిందంటూ మహ్మద్ హఫీజ్ తాజాగా వెల్లడించాడు. బాబర్ ఆజం, మిక్కీ ఆర్థర్ కలిసి ఫిట్నెస్ విలువలు గాలికొదిలేసిన తీరు తెలిసి ఆశ్చర్యపోయానన్నాడు. ఈ మేరకు.. ‘‘ఆస్ట్రేలియాకు వెళ్లినపుడు ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆటగాళ్లకు చెప్పాను. ట్రైనర్‌తో కూడా ఇదే మాట అన్నాడు. కానీ అప్పుడతడు నాకో షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఆర్నెళ్ల క్రితం అప్పటి కెప్టెన్, డైరెక్టర్.. ఆటగాళ్ల ఫిట్నెస్ లెవల్స్ చెక్ చేయొద్దని చెప్పారన్నాడు. వారి శరీరాల్లో కొవ్వు పేరుకుపోయింది ఆటగాళ్లను స్వేచ్ఛగా వదిలేయాలని వాళ్లిద్దరు తనను ఆదేశించారన్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆటగాళ్ల ఫిట్నెస్ లెవల్స్ చెక్ చేయిస్తే.. ఉండాల్సిన దాని కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ కొవ్వు వారి శరీరాల్లో పేరుకుపోయినట్లు తెలిసింది. చాలా మంది అన్‌ఫిట్‌గా ఉన్నారు. కొంతమంది కనీసం 2 కిలోమీటర్ల ట్రయల్ రన్ కూడా పూర్తిచేయలేకపోయారు. ఆర్నెళ్ల క్రితం వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని నేను తారుమారు చేశాను. ఫిట్‌గా లేకుంటే ఓడిపోతూనే ఉంటారని ఆటగాళ్లను హెచ్చరించాను’’ అని మహ్మద్ హఫీజ్ ‘ఏ’ స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు. కాగా ప్రస్తుతం పాక్ ప్రధాన ఆటగాళ్లంతా పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో బిజీగా ఉన్నారు. చదవండి: Ind Vs Eng 4th Test: బుమ్రాను రిలీజ్ చేసిన బీసీసీఐ.. అతడికి గ్రీన్ సిగ్నల్! -
షోయబ్ మాలిక్ భార్యకు చేదు అనుభవం
పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ భార్య, నటి సనా జావెద్‌కు చేదు అనుభవం ఎదురైంది. సొంత జట్టు అభిమానులే ఆమెను టీజ్ చేస్తూ అసహనం వెళ్లగక్కారు. కాగా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా నుంచి విడిపోయినట్లు ప్రకటించకముందే షోయబ్ మాలిక్.. సనాను పెళ్లాడిన ఫొటోలు బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సానియాతో విడిపోకముందే షోయబ్‌కు సనాతో రిలేషన్ ఉందంటూ పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరు చేసిన మోసం బయటపడంతో సానియానే స్వయంగా విడాకులకు పూనుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక షోయబ్‌కు ఇది మూడో వివాహం కాగా.. సనా జావెద్‌కు రెండో పెళ్లి. అయితే, పెళ్లైన నాటి నుంచే ఈ జంటపై నెటిజన్లు భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. జీవిత భాగస్వాములకు ద్రోహం చేసి.. ఆ విషయం బయటపడగానే మళ్లీ నిఖా పేరిట తమ ‘బంధాన్ని’ పవిత్రం చేసుకునేందుకు పెద్ద నాటకమే ఆడారని మండిపడ్డారు. ముఖ్యంగా సానియా మీర్జా షోయబ్ కోసం ఎన్నో అవాంతరాలు దాటుకుని పాకిస్తానీని పెళ్లి చేసుకుందని.. అయినా ఆమె పట్ల ఇంత దారుణంగా ఎలా వ్యవహరిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత జట్టు అభిమానులు సైతం షోయబ్ మాలిక్‌ను ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా తప్పుబట్టారు. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా సనా జావెద్‌కు నేరుగానే నిరసన సెగ తగిలింది. కరాచీ కింగ్స్‌కు ఆడుతున్న తన భర్త షోయబ్ మాలిక్‌కు మద్దతుగా ఆమె ముల్తాన్ స్టేడియానికి వచ్చింది. ముల్తాన్ సుల్తాన్స్ మ్యాచ్ సమయంలో డగౌట్ నుంచి సనా వెళ్తున్నపుడు కొంత మంది సానియా మీర్జా అంటూ గట్టిగా అరిచారు. దీంతో వాళ్లవైపు చూసిన సనా.. తనకేమీ పట్టనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. కాగా 42 ఏళ్ల షోయబ్ మాలిక్ తొలుత ఆయేషా సిద్దిఖి(2002)ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి విడిపోయిన తర్వాత 2010లో సానియా మీర్జాను వివాహమాడాడు. ఈ జంటకు కుమారుడు ఇజహాన్ ఉన్నాడు. అయితే, షోయబ్‌తో విభేదాలు తలెత్తిన కారణంగా సానియానే ఖులా ద్వారా అతడికి విడాకులివ్వడం గమనార్హం. ఈ క్రమంలో తాను సనాను పెళ్లి చేసుకున్నట్లు షోయబ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. చదవండి: హెండ్రిక్స్ విధ్వంసం.. సత్తా చాటిన డేవిడ్ మలాన్.. మాలిక్ పోరాటం వృథా Pakistan fans teasing Shoaib Malik's 3rd wife 'Sana Javed' by calling her "Sania Mirza"#PSL9 pic.twitter.com/EXr0OQywvQ — Don Cricket 🏏 (@doncricket_) February 20, 2024 -
హెండ్రిక్స్ విధ్వంసం.. సత్తా చాటిన డేవిడ్ మలాన్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్ మూడో మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు రీజా హెండ్రిక్స్ రెచ్చిపోయాడు. కరాచీ కింగ్స్‌తో నిన్న (ఫిబ్రవరి 18) జరిగిన మ్యాచ్‌లో కేవలం 54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హెండ్రిక్స్‌తో పాటు డేవిడ్ మలాన్ (41 బంతుల్లో 52; 4 ఫోర్లు, సిక్స్) కూడా మెరుపు అర్దశతకంతో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (11) విఫలం కాగా.. ఆఖర్లో ఖుష్దిల్ షా (13 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు) వేగంగా పరుగులు సాధించాడు. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, డేనియల్ సామ్స్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కరాచీ.. మొహమ్మద్ అలీ (4-0-23-3), డేవిడ్ విల్లే (4-0-22-2), అబ్బాస్ అఫ్రిది (3-0-16-2), ఉసామా మిర్ (4-0-14-1) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా సుల్తాన్స్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. కరాచీ ఇన్నింగ్స్‌లో షోయబ్ మాలిక్ (53), కెప్టెన్ షాన్ మసూద్ (30), కీరన్ పోలార్డ్ (28 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కరాచీ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు డకౌట్లు కావడం విశేషం. రాయ్, షకీల్ మెరుపు అర్దసెంచరీలు నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో పెషావర్ జల్మీపై క్వెట్టా గ్లాడియేటర్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్.. ఓపెనర్లు జేసన్ రాయ్ (75), సౌద షకీల్ (74) మెరుపు అర్దసెంచరీలతో విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 206 పరుగులు చేయగా.. ఛేదనలో చివరి వరకు పోరాడిన పెషావర్ లక్ష్యానికి 17 పరుగుల దూరంలో (190/6) నిలిచిపోయింది. పెషావర్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు బాబర్ ఆజమ్ (68), సైమ్ అయూబ్ (42) రాణించారు. -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. తొలి క్రికెటర్‌గా
పాకిస్తాన్ స్టార్ ఆటగాడు, పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన ఘనత సాధించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో 3000 పరుగులు మైలు రాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా బాబర్ నిలిచాడు. పీఎస్ఎల్-2024 సీజన్లో భాగంగా ఆదివారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద.. బాబర్ ఈ ఘనతను అందుకున్నాడు. ఆజం ఇప్పటివరకు 78 ఇన్నింగ్స్‌లలో 3003 పరుగులు చేశాడు. బాబర్ తర్వాత పాక్ ఓపెనర్ ఫఖార్ జమాన్(2381) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 16 పరుగుల తేడాతో పెషావర్ జల్మీపై క్వెట్టా గ్లాడియేటర్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్వెట్టా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్వెట్టా బ్యాటర్లలో ఓపెనర్లు జాసన్ రాయ్(75), షకీల్(74) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. పెషావర్ బౌలర్లలో ఈర్షద్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. పెషావర్ బ్యాటర్లలో బాబర్ ఆజం(68) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
బాబర్ ఆజం విధ్వంసం.. కేవలం 29 బంతుల్లోనే! అయినా పాపం?
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 సీజన్‌ను పెషావర్ జల్మీ ఓటమితో ఆరంభించింది. లహోర్ వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో పెషావర్ పరాజయం పాలైంది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో పెషావర్ ఓటమిపాలైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం తన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 42 బంతులు ఎదుర్కొన్న ఆజం.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. బాబర్ క్రీజులో ఉన్నంతసేపు పెషావర్ సునాయసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ 15 ఓవర్లో ఆజం కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ క్వెట్టా మలుపు తిరిగింది. క్వెట్టా బౌలర్లలో అర్బర్ ఆహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. అమీర్, వసీం, అకిల్ తలా ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన క్వెట్టా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్వెట్టా బ్యాటర్లలో ఓపెనర్లు జాసన్ రాయ్(75), షకీల్(74) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. You can't hit a six like that to 140+ KPH ball if you are not Babar Azam 🥵🔥#PSL2024 #BabarAzam𓃵pic.twitter.com/RB9uE1gVBF — Hassan (@HassanAbbasian) February 18, 2024 -
రెచ్చిపోయిన షాదాబ్ ఖాన్.. డస్సెన్ మెరుపు ఇన్నింగ్స్ వృధా
పాకిస్తాన్ సూపర్ లీగ్ తొలి మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్‌పై ఇస్లామాబాద్ యునైటెడ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా.. ఇస్లామాబాద్ టీమ్ 18.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన డస్సెన్.. వాన్ డర్ డస్సెన్ మెరుపు ఇన్నింగ్స్‌తో (41 బంతుల్లో 71 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ భారీ స్కోర్ చేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ (57) అర్దసెంచరీతో రాణించగా.. షఫీక్ 28, ఫకర్ జమాన్ 13, డేవిడ్ వీస్ 14 పరుగులు చేశారు. కెప్టెన్ షాహీన్ అఫ్రిది డకౌటయ్యాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో టైమాల్ మిల్స్ 2, షాదాబ్ ఖాన్, నసీం షా తలో వికెట్ పడగొట్టారు. రెచ్చిపోయిన షాదాబ్ ఖాన్.. 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇస్లామాబాద్.. కెప్టెన్ షాదాబ్ ఖాన్ (41 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), అఘా సల్మాన్ (31 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్దశతకాలతో రెచ్చిపోవడంతో మరో 10 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. అలెక్స్ హేల్స్ (36) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడగా.. కొలిన్ మున్రో (5) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. ఖలందర్స్ బౌలర్లలో జమాన్ ఖాన్, సల్మాన్ ఫయాజ్ తలో వికెట్ పడగొట్టారు. -
IPL: విండీస్ పేస్ సంచలనానికి లక్కీ ఛాన్స్.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ప్రకటన
వెస్టిండీస్ యువ సంచలనం షమార్ జోసెఫ్‌కు లక్కీ ఛాన్స్!!... 24 ఏళ్ల ఈ పేస్ బౌలర్ త్వరలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టనున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు అతడు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని లక్నో ఫ్రాంఛైజీ శనివారం వెల్లడించింది. ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌలర్ మార్క్ వుడ్ స్థానంలో షమార్ జోసెఫ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు.. ‘‘షమార్.. నీ రాక మాకెంతో సంతోషం. ఐపీఎల్-2024 సందర్భంగా మార్క్ వుడ్ స్థానంలో షమార్ జట్టుతో చేరనున్నాడు’’ అని లక్నో ప్రకటన విడుదల చేసింది. ఆస్ట్రేలియాపై అదరగొట్టి.. సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన షమార్ జోసెఫ్ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అడిలైడ్ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్ తొలి బంతికే వికెట్ తీసి చరిత్ర సృష్టించాడు. స్టీవ్ స్మిత్ రూపంలో అంతర్జాతీయస్థాయిలో తొలి వికెట్ దక్కించుకున్నాడు. అడిలైడ్‌లో మొత్తంగా ఐదు వికెట్లు తీసిన షమార్ జోసెఫ్.. బ్రిస్బేన్ టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎనిమిది వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించి.. కంగారూ గడ్డపై వెస్టిండీస్‌కు చారిత్రాత్మక విజయం అందించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు లీగ్ ఫ్రాంఛైజీలు షమార్ జోసెఫ్‌నకు బంపరాఫర్లు ఇస్తున్నాయి. ఇటీవలే అతడు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగమైన పెషావర్ జల్మీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాజాగా ఐపీఎల్‌లోనూ ఎంట్రీ ఇస్తున్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ ధ్రువీకరించింది. కాగా రూ. 3 కోట్లు వెచ్చించి ఈ కరేబియన్ బౌలర్‌ను లక్నో సొంతం చేసుకుంది. Shamar, we're so happy to have you 💙🔥@SJoseph70Guyana joins our squad for IPL 2024, replacing Mark Wood 🤝 pic.twitter.com/YPfGQZB18N — Lucknow Super Giants (@LucknowIPL) February 10, 2024 -
సంచలన బౌలర్ షమార్ జోసఫ్‌కు బంపర్ ఆఫర్లు
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సంచలన ప్రదర్శనలు నమోదు చేసి వార్తల్లో నిలిచిన విండీస్ పేసర్ షమార్ జోసఫ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లీగ్‌ల నుంచి ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. 24 ఏళ్ల షమార్కు తొలుత పాకిస్తాన్ క్రికెట్ లీగ్ నుంచి ఆహ్వానం లభించింది. షమార్ నిన్ననే పీఎస్ఎల్లో పెషావర్ జల్మీ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. షమార్కు తాజాగా మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 1న అతను ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌తో డీల్ చేసుకోనున్నట్లు సమాచారం. అరంగేట్రం సిరీస్‌తోనే (ఆసీస్) షమార్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. షమార్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కడంతో పాటు విదేశీ లీగ్‌ల నుంచి ఆఫర్లు, ఎండార్స్మెంట్లు వస్తున్నాయి. అరంగేట్రం సిరీస్‌కు ముందు సెక్యూరిటీ గార్డ్‌గా పని చేసిన షమార్ రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ఆసీస్‌తో రెండో టెస్ట్‌లో ప్రదర్శనకు గానూ షమార్ విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు నుంచి ప్రశంసలను అందుకుంటున్నాడు. ఆసీస్ మీడియా సహా ప్రపంచ మీడియా మొత్తం ఈ యువ పేసర్‌కు జేజేలు పలుకుతుంది. మాజీలు, విశ్లేషకులు షమార్ బౌలింగ్ ప్రదర్శనలను కొనియాడుతున్నాడు. షమార్ విండీస్ క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకువస్తాడని వారు అభిప్రాయపడుతున్నారు. రెండో టెస్ట్‌లో ఆసీస్‌ను ఓడించిన అనంతరం విండీస్ మాజీలు కన్నీటిపర్యంతమవుతూ షమార్‌ను ఆకాశానికెత్తిన వైనం క్రికెట్ అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యింది. ప్రభ కోల్పోతున్న టెస్ట్ క్రికెట్‌ను షమార్ మళ్లీ జీవం పోశాడంటూ ఆసీస్ మీడియా షమార్‌ను కొనియాడుతుంది. షమార్ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే భవిష్యత్తులో అతనికి ఐపీఎల్ బంపరాఫర్ కూడా లభించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలు షమార్పై కన్నేసి ఉంచాయి. గాయపడిన ఆటగాళ్ల స్థానంలో షమార్‌ను తమ పంచన చేర్చుకోవాలని ఆశిస్తున్నాయి. కాగా, ఆస్ట్రేలియాతో వారి స్వదేశంలో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో షమార్ రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలతో 13 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన షమార్.. ఆ మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ రాణించాడు. రెండో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అయితే షమార్ పట్టపగ్గాలు లేకుండా దూసుకుపోయాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో షమార్ 7 వికెట్ల ప్రదర్శన టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనగా కీర్తించబడుతుంది. ఈ ప్రదర్శన కారణంగానే షమార్ ఓవర్‌నైట్ హీరో అయిపోయాడు. -
పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే ఐపీఎల్ చాలా పెద్దది: వసీం అక్రమ్
ఐపీఎల్- ప్రపంచంలో ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లకు రారాజు. ప్రపంచంలోని ప్రతీ ఒక్క క్రికెటర్ ఐపీఎల్లో భాగం కావాలని కలలు కంటుంటారు. పీఎల్‌కు పోటీగా ఎన్నో లీగ్‌లు పుట్టుకొచ్చినప్పటికీ.. ఈ క్యాచ్ రిచ్ లీగ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గించలేకపోయాయి. అయితే మన చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ సైతం ఐపీఎల్‌కు పోటీగా ఓ టీ20 లీగ్(పాకిస్తాన్ సూపర్ లీగ్)ను నిర్వహిస్తోంది. ఇప్పటికీ 8 సీజన్లు గడిచిపోయినప్పటికీ పీఎస్ఎల్ మాత్రం పెద్దగా ఆదరణ పొందలేకపోయింది. కానీ పాక్ క్రికెటర్లు, మాజీలు పాకిస్తాన్ సూపర్ లీగ్‌నే వరల్డ్‌లో నెం1 అని ప్రగల్బాలు పలుకుతూ వస్తూ ఉన్నారు. అయితే పాకిస్తాన్ లెజెండ్ వసీం అక్రమ్ మాత్రం వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే ఐపీఎల్ చాలా పెద్ద క్రికెట్ లీగ్ అని అక్రమ్ పేర్కొన్నాడు. అక్రమ్ తాజాగా ప్రముఖ క్రీడా వెబ్సైట్ స్పోర్ట్కీడాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా వరల్డ్ ప్రాంఛైజీ క్రికెట్ లీగ్‌లో ఐపీఎల్ లేదా పీఎస్ఎల్ పెద్దదా అన్న ప్రశ్న ఎదురైంది. అందుకు బదులుగా.. 'నేను పీఎస్ఎల్తో పాటు ఐపీఎల్‌లోనూ కోచ్‌గా పనిచేశాను. అన్నిటికంటే ఐపీఎల్ అతి పెద్ద ప్రాంఛైజీ క్రికెట్ లీగ్. అందులో ఎటువంటి సందేహం లేదు. పీఎస్ఎల్ను ఐపీఎల్‌తో పోల్చడం సరికాదు. పీఎస్ఎల్ పాకిస్తాన్‌కు మినీ ఐపీఎల్ వంటిది" అని అక్రమ్ పేర్కొన్నాడు. చదవండి: #Saumy Pandey: ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో -
ఆర్సీబీతో బంధానికి ముగింపు.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో.. హెడ్‌కోచ్‌గా
Mike Hesson- Pakistan Super League: న్యూజిలాండ్ మాజీ హెడ్‌కోచ్ మైక్ హసన్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగం కానున్నాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు అతడు హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బంధం తెంచుకున్న తర్వాత ఈ మేరకు కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందు ఆర్సీబీ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సేవలు అందించిన మైక్ హసన్‌కు ఉద్వాసన పలికింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీని వీడుతున్నందుకు బాధగా ఉందంటూ మైక్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి పూర్తిగా బయటికొచ్చిన ఈ న్యూజిలాండ్ స్టార్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటికే రెండుసార్లు టైటిల్ గెలిచిన ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు మార్గదర్శనం చేయనున్నాడు. కాగా గత ఐదు సీజన్లలో ఇస్లామాబాద్ జట్టు నాలుగుసార్లూ నాకౌట్ దశకు చేరుకున్నా ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది. ఈ నేపథ్యంలో కోచ్ అజర్ మహ్మూద్పై వేటు వేసిన యాజమాన్యం ఆ స్థానాన్ని మైక్ హసన్‌తో భర్తీ చేసింది. సంతోషంగా ఉంది ఇక తన నియామకంపై హర్షం వ్యక్తం చేసిన మైక్ హసన్.. ‘‘ఇస్లామాబాద్ యునైటెడ్‌లో భాగం కావం సంతోషంగా ఉంది. ఎక్స్‌లెన్స్, ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్.. ఇలా నాలుగు E-లను ప్రధాన లక్షణాలుగా చేసుకుని ముందుకు సాగుతున్న జట్టుతో చేరడం గొప్ప విషయం. ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కలిగి ఉన్న ఈ టీమ్‌తో ప్రయాణం సాగించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నాడు. ఆర్సీబీతో దాదాపు ఐదేళ్లు కాగా గతంలో న్యూజిలాండ్‌తో పాటు అర్జెంటీనా, కెన్యా జట్లకు మైక్ హసన్ కోచ్‌గా వ్యవహరించాడు. అదే విధంగా 2019-2023 వరకు ఆర్సీబీ డైరెక్టర్‌గా ఉన్నాడు. అతడి మార్గదర్శనంలో ఆర్సీబీ 2020- 2022 వరకు వరుసగా మూడుసార్లు ప్లే ఆఫ్స్ చేరుకుంది. కానీ టైటిల్ గెలవడంలో మాత్రం విఫలమైంది. చదవండి: WC 2023 Semis Race: అలా అయితే న్యూజిలాండ్‌కు షాక్ తగిలినట్లే! ఇప్పటికి భారం వరణుడిపైనే! -
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
ఇంగ్లండ్ యువ కెరటం హ్యారీ బ్రూక్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL), ద హండ్రెడ్ లీగ్ (THL)ల్లో సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. బ్రూక్‌కు ముందు ఈ మూడు లీగ్‌ల్లో సెంచరీలు చేసిన ఆటగాడే లేడు. హండ్రెడ్ లీగ్‌లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన బ్రూక్ నిన్న (ఆగస్ట్ 22) వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో (42 బంతులు 105; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) కదంతొక్కాడు. ఈ సెంచరీ హండ్రెడ్ లీగ్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ (41) కావడం విశేషం. దీనికి ముందు బ్రూక్ 2023 ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై శతకం (55 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదాడు. ఈ సెంచరీతో బ్రూక్ సన్‌రైజర్స్ యంగెస్ట్ సెంచూరియన్గానూ రికార్డుల్లోకెక్కాడు. 2023 ఐపీఎల్‌కు ముందు సన్‌రైజర్స్ బ్రూక్‌ను 13.25 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. పై పేర్కొన్న మూడు లీగ్‌ల్లో (ఐపీఎల్, పీఎస్ఎల్, హండ్రెడ్) బ్రూక్ తన తొలి సెంచరీని పీఎస్ఎల్లో సాధించాడు. 2022 పీఎస్ఎల్లో బ్రూక్, లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ.. ఇస్లామాబాద్ యునైటెడ్‌పై శతక్కొట్టాడు (49 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు). ఓవరాల్‌గా బ్రూక్ కెరీర్ చూసుకుంటే, 2022 జనవరిలో విండీస్‌తో జరిగిన టీ20తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 12 టెస్ట్‌ల్లో 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలతో 1181 పరుగులు.. 3 వన్డేల్లో ఫిఫ్టి సాయంతో 86 పరుగులు, 20 టీ20ల్లో హాఫ్ సెంచరీ సాయంతో 372 పరుగులు చేశాడు. బ్రూక్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున 11 మ్యాచ్‌ల్లో సెంచరీ సాయంతో 190 పరుగులు చేశాడు. -
పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంఛైజీ ముల్తాన్ సుల్తాన్స్ యజమాని ఆత్మహత్య!
Alamgir Tareen, Owner Of Pakistan Super League Franchise: పాకిస్తాన్ సూపర్ లీగ్ జట్టు ముల్తాన్ సుల్తాన్స్ శిబిరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముల్తాన్ సుల్తాన్స్ ఫ్రాంఛైజీ యజమాని ఆలంగిర్ తరీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. లాహోర్‌లోని గుల్బర్గ్లో గల తన నివాసంలో బలన్మరణానికి పాల్పడ్డట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా ముల్తాన్ సుల్తాన్స్ సీఈఓ హైదర్ అజర్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఆలంగిర్ కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించాడు. ‘‘మా జట్టులో అత్యంత కీలకమైన, గౌరవనీయులైన వ్యక్తి ఆలంగిర్ తరీన్ హఠాన్మరణం చెందారు. ఈ కష్టకాలంలో ఆ దేవుడు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని మనమంతా ప్రార్థిద్దాం’’ అని హైదర్ ప్రకటన విడుదల చేశాడు. ఇక ముల్తాన్ సుల్తాన్స్ సైతం ట్విటర్ వేదికగా స్పందించింది. ప్రైవసీకి భంగం కలిగించకండి ‘‘మా ప్రియమైన యజమాని ఆలంగిర్ ఖాన్ తరీన్ ఇక లేరన్న విషాదకర వార్త జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి. దయచేసి ఎవరూ కూడా తరీన్ కుటుంబ గోప్యతకు భంగం కలిగించే విధంగా వ్యవహరించకూడదని ఈ సందర్భంగా విజ్జప్తి చేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక’’ అని విచారం వ్యక్తం చేసింది. ఇక పీఎస్ఎల్లోని ఇతర ఫ్రాంఛైజీ లాహోర్ ఖలందర్స్ కూడా ఆలంగిర్ మృతి పట్ల సంతాపం తెలిపింది. కాగా 2021లో ముల్తాన్ సుల్తాన్స్ టైటిల్ విజేతగా నిలిచింది. తాజా సీజన్లో ఈ జట్టుకు మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇదిలా ఉంటే.. ఆలంగిర్ ఆత్మహత్యకు కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఉన్నత విద్యావంతుడు ఆలంగిర్ తరీన్(63) ప్రఖ్యాత యేల్ యూనివర్సిటీలో విద్యనభ్యసించాడు. దక్షిణ పంజాబ్‌లో మేటి వ్యాపారవేత్తగా ఎదిగిన అతడికి క్రీడల పట్ల ఆసక్తి మెండు. పాకిస్తాన్‌లోనే అత్యంత పెద్దదైన నీటి శుద్ధి కేంద్రాలను నిర్వహిస్తున్న ఆలంగిర్.. పీఎస్ఎల్లో భాగమయ్యే క్రమంలో ముల్తాన్ సుల్తాన్స్ జట్టును కొనుగోలు చేశాడు. ఆ జట్టు ఇప్పటి వరకు ఒకే ఒకసారి ట్రోఫీ గెలిచింది. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: భారత్‌లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరో తెలుసా? 'టీమిండియాతో మ్యాచ్ మాకు గొప్పేమి కాదు.. కేవలం ఒక్క గేమ్ మాత్రమే' إنا لله وإنا إليه راجعون It is with deep sadness that we share the news of the passing of our beloved team owner, Alamgir Khan Tareen. Our thoughts and prayers are with Mr. Tareen’s family. We request you all to kindly respect his family’s privacy. May his soul rest in… pic.twitter.com/aISUQtAqI5 — Multan Sultans (@MultanSultans) July 6, 2023 -
'పాక్‌లో ఉన్నప్పుడు జైళ్లో ఉన్నట్లుగా అనిపించింది'
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే పీఎస్ఎల్ జరుగుతున్న సమయంలోనే ఒక మ్యాచ్ లైవ్‌లో బాబర్ ఆజంపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాక్ క్రికెట్ అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సైమన్ డౌల్ బయటికి వస్తే తమ చేతిలో దెబ్బలు తినడం ఖాయమని బెదిరించారు. దీంతో పీఎస్ఎల్ నిర్వాహకులు టోర్నీ ముగిసేవరకు సైమన్ డౌల్‌ను బయటకు వెళ్లడానికి అనుమతించలేదు. మ్యాచ్‌లు లేనప్పుడు హోటల్ రూంకే పరిమితమైన సైమన్ డౌల్ పీఎస్ఎల్ కోసం పాకిస్తాన్లో ఉన్నప్పుడు జైళ్లో ఉన్నట్లుగా అనిపించిందని పేర్కొన్నాడు. "పాకిస్థాన్ లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నట్లే అనిపించింది. బాబర్ ఆజం అభిమానులు నన్ను టార్గెట్ చేయడంతో నన్ను కనీసం బయటకు వెళ్లడానికీ అనుమతించలేదు. చాలా రోజుల పాటు కనీసం తిండి కూడా తినకుండా పాకిస్థాన్ లో ఉన్నాను. నన్ను మానసికంగా హింసించారు. దేవుని దయ వల్ల ఎలాగోలా పాకిస్థాన్ నుంచి బయటపడ్డాను" అని సైమన్ డౌల్ పేర్కొన్నాడు. బాబర్ ఆజం స్ట్రైక్ రేట్ ను ఉద్దేశించి డౌల్ గతంలో వివాదాస్పద కామెంట్స్ చేశాడు. అతడు కేవలం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతాడని విమర్శించాడు. ఈమధ్యే విరాట్ కోహ్లిని కూడా డౌల్ ఇలాగే విమర్శించాడు. ఐపీఎల్లో అతని స్ట్రైక్ రేట్ సరిగా లేదని, విరాట్ కూడా కేవలం రికార్డుల కోసమే ఆడతాడని డౌల్ అన్నాడు. ఈ కామెంట్స్ పై కూడా ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. -
దేశం క్లిష్ట పరిస్థితుల్లో.. వాళ్లకు ప్లాట్లు, ఖరీదైన ఫోన్లు?
పాకిస్తాన్ దేశం ఇప్పుడిప్పుడే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతోంది. ఇప్పటికి అక్కడ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే అక్కడి పాకిస్తాన్ ఆటగాళ్లకు మాత్రం ప్లాట్లు, ఖరీదైన ఐఫోన్లను గిఫ్ట్‌లుగా అందజేశారు. ఇప్పుడు ఈ వార్త పాక్‌లో సంచలనం రేపింది. విషయంలోకి వెళితే.. ఇటీవలే ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) తొమ్మిదో సీజన్ విజేతగా లాహోర్ ఖలండర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో షాహిన్ అఫ్రిది సేన విజయం సాధించి వరుసగా రెండోసారి పీఎస్ఎల్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. దీంతో సదరు ఫ్రాంఛైజీ ఓనర్ లాహోర్ ఖలండర్స్ సీవోవో సమీన్ రాణా ఆటగాళ్లకు అదిరిపోయే గిఫ్ట్ లు ఇచ్చింది. ప్లేయర్స్ అందరికీ ప్లాట్లు, ఐఫోన్లు ఇచ్చారు. ఈ ఫ్రాంఛైజీ ఓనర్ ఖలందర్స్ సిటీ అనే ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేపట్టింది. దీంతో తమ ప్లేయర్స్ కు అందులోనే ప్లాట్లు ఇచ్చింది. ఈ ప్లాట్లు, ఐఫోన్లు అందుకున్న వాళ్లలో స్టార్ ప్లేయర్స్ షాహీన్ షా అఫ్రిది, ఫఖర్ జమాన్, జమాన్ ఖాన్, ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఉన్నారు. ఒక్కొక్క ప్లేయర్ కు 5445 చదరపు అడుగుల ప్లాట్లు ఇచ్చారు. వీటి విలువ పాకిస్థాన్ కరెన్సీలో 92. 5 లక్షలు కాగా.. ఇండియన్ కరెన్సీలో రూ.27 లక్షలు. ఈ లీగ్ మొత్తం ఆడే అవకాశం రాకుండా బెంచ్ కే పరిమితమైన ప్లేయర్స్ కు కూడా ఈ ప్లాట్లు ఇచ్చారు. పీఎస్‌లో ఫైనల్లో బ్యాట్‌తోనూ, బంతితోను మెరిసి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి అదనంగా గిఫ్ట్‌లు అందించడం విశేషం. ఫైనల్లో మొదట బ్యాటింగ్‌లో 44 రన్స్.. ఆ తర్వాత బౌలింగ్ లో రాణించిన షాహిన్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. లాహోర్ టీమ్ లీగ్ గెలిచినందుకు ఒక ప్లాట్ అందుకున్న షాహీన్.. కెప్టెన్ గా వ్యవహరించినందుకు మరో రెండు ప్లాట్స్ అదనంగా అందుకోవడం విశేషం. ఇది చూసిన క్రికెట్ అభిమానులు.. ''దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పాక్ ఆటగాళ్లకు లభించిన గిఫ్ట్‌లను డబ్బుల రూపంలో దేశానికి అందిస్తే బాగుండేది'' అంటూ కామెంట్ చేశారు. Great Gesture from Lahore Qalandars - Appreciation for ALL "This is why we call it a FAMILY"#PSL08 #qalandarhum #SabSitarayHumaray #QalandarsCity pic.twitter.com/X4z2wxi7Tj — Lahore Qalandars (@lahoreqalandars) March 22, 2023 చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు సీనియర్ క్రికెటర్ గుడ్‌బై అభిమానులను పిచ్చోళ్లను చేశారు -
ఐపీఎల్‌కు అంత సీన్ లేదు.. పాకిస్తాన్ సూపర్ లీగే తోపు..!
ఐపీఎల్‌ను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు నజమ్ సేథీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో పోలిస్తే పాకిస్తాన్ సూపర్ లీగ్ సూపర్ సక్సెస్ అంటూ నిరాధారమైన కామెంట్స్ చేశాడు. పీఎస్ఎల్ 2023 సీజన్ ముగిసిన అనంతరం పీసీబీ చీఫ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఐపీఎల్ కంటే పీఎస్ఎల్కు మెరుగైన డిజిటల్ రేటింగ్ ఉందని గొప్పలు పోయాడు. డిజిటల్ ప్లాట్‌ఫాం వేదికగా పీఎస్ఎల్ 8వ ఎడిషన్‌ను 150 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారని, ఐపీఎల్-2022 సీజన్‌ను కేవలం 130 మిలియన్ల డిజిటల్ రేటింగ్ మాత్రమే దక్కిందని నిరాధారమైన లెక్కలు చెబుతూ జబ్బలు చరుచుకున్నాడు. ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ ఎంతో గొప్పదో చెప్పడానికి ఇదొక్క విషయం చాలంటూ బడాయి ప్రదర్శించాడు. పాక్‌లో జరగాల్సిన 2023 ఆసియా కప్‌లో పాల్గొనేది లేదని భారత్ కరాఖండిగా తేల్చి చెప్పిన నేపథ్యంలో సేథీ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై అంతర్జాతీయ క్రికెట్ సమాజం అసహనం వ్యక్తం చేస్తుంది. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ, ఇలాంటి నిరధారమైన వ్యాఖ్యలు చేసి అంతంతమాత్రంగా ఉన్న ప్రతిష్టను మరింత దిగజార్చుకోవద్దంటూ నెటిజన్లు పీసీబీకి చురకలంటిస్తున్నారు. ఇదిలా ఉంటే, మార్చి 18న ముగిసిన పీఎస్ఎల్ 2023 సీజన్లో లాహోర్ ఖలందర్స్ విజేతగా నిలిచింది. షాహీన్ అఫ్రిది నేతృత్వంలో ఖలందర్స్ వరుసగా రెండో సీజన్లో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. పీఎస్ఎల్ 2022 సీజన్లో ఎదురైన ప్రత్యర్ధి ముల్తాన్ సుల్తాన్స్నే ఖలందర్స్ మళ్లీ ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. ఛేదనలో సుల్తాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి పరుగు తేడాతో ఓటమిపాలైంది. రన్నరప్‌గా నిలిచన సుల్తాన్స్‌కు మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. -
ఉత్కంఠ.. ఆఖరి బంతికి రనౌట్; టైటిల్ నిలబెట్టుకున్న లాహోర్
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 8వ సీజన్ విజేతగా లాహోర్ ఖలండర్స్ నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగిన షాహిన్ అఫ్రిది సేన వరుసగా రెండో ఏడాది టైటిల్‌ను నిలబెట్టుకుంది. అప్పుడు కూడా ఫైనల్ ముల్తాన్ సుల్తాన్స్‌తో ఆడడం విశేషం. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలండర్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన దశలో జమాన్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ చివరి బంతిని కుష్దిల్ షా మిడాన్ దిశగా ఆడాడు. రెండు పరుగులు పూర్తి చేసిన కుష్దిల్ షా మూడో పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ అప్పటికే బంతిని అందుకున్న డేవిడ్ వీస్ అఫ్రిదికి త్రో వేశాడు. వేగంగా అందుకున్న బంతిని అఫ్రిది క్షణం ఆలస్యం చేయకుండా వికెట్లకు గిరాటేశాడు. అంతే ముల్తాన్ సుల్తాన్స్ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచింది. ఓడినా ముల్తాన్ సుల్తాన్స్ తన ప్రదర్శనతో అభిమానుల మనసులను గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. షఫీకి 40 బంతుల్లో 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ షాహిన్ అఫ్రిది 15 బంతుల్లో 2ఫోర్లు, 5 సిక్సర్లతో 44 పరుగులు నాటౌట్ సంచలన ఇన్నింగ్స్ ఆడగా.. ఫఖర్ జమాన్ 39 పరుగులు చేశాడు. ముల్తాన్ సుల్తాన్స్ బౌలింగ్‌లో ఉస్మా మీర్ మూడు వికెట్లు తీయగా.. అన్వర్ అలీ, ఇషానుల్లా, కుష్దిల్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్స్ వికెటఉల పడుతున్న లక్ష్యం దిశగా సాగుతూ వచ్చింది. రిలీ రొసౌ(32 బంతుల్లో 52, 7ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. మహ్మద్ రిజ్వాన్ 34, టిమ్ డేవిడ్ 20, కుష్దిల్ షా 25 పరుగులు చేశారు. లాహోర్ ఖలండర్స్ బౌలింగ్‌లో షాహిన్ అఫ్రిది నాలుగు వికెట్లతో చెలరేగగా.. రషీద్ ఖాన్ రెండు, డేవిడ్ వీస్ ఒక వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో తన ప్రదర్శనతో అదరగొట్టిన షాహిన్ అఫ్రిది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. ఇషానుల్లా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. 𝘽𝙡𝙤𝙘𝙠𝙗𝙪𝙨𝙩𝙚𝙧 𝙛𝙞𝙣𝙞𝙨𝙝! 🤩#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvLQ pic.twitter.com/QfKcUSSnhj — PakistanSuperLeague (@thePSLt20) March 18, 2023 🏆 W I N N E R S 🏆@lahoreqalandars - owners of the Supernova Trophy 🤩#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvLQ pic.twitter.com/XIDb9hDRlw — PakistanSuperLeague (@thePSLt20) March 18, 2023 చదవండి: బంగ్లా జోరు.. తమ వన్డే చరిత్రలో అత్యంత పెద్ద విజయం -
సిక్సర్ బాది తన జట్టును ఫైనల్‌కు చేర్చిన షాహిన్ అఫ్రిది
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. ముల్తాన్ సుల్తాన్స్ ఇదివరకే ఫైనల్స్‌కు చేరుకోగా.. నిన్న (మార్చి 17) జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీపై విజయం (4 వికెట్ల తేడాతో) సాధించడంతో లాహోర్ ఖలందర్స్ ఇవాళ జరిగే తుది సమరానికి అర్హత సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ.. మహ్మద్ హరీస్ (54 బంతుల్లో 85; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (36 బంతుల్లో 42; 7 ఫోర్లు), రాజపక్స (18 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. మీర్జా తాహిర్ బేగ్ (42 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో ఖలందర్స్ మరో 7 బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఆఖర్లో ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది (11 నాటౌట్) వరుసగా బౌండరీ, సిక్సర్ బాది తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. సామ్ బిల్లింగ్స్ (28), సికందర్ రజా (23) ఓ మోస్తరుగా రాణించారు. జల్మీ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 2, వాహబ్ రియాజ్, ఆమెర్ జమాల్, సల్మాన్ ఇర్షాద్ తలో వికెట్ దక్కించుకోగా.. ఖలందర్స్ బౌలర్లు జమాన్ ఖాన్, రషీద్ ఖాన్ తలో 2 వికెట్లు, షాహీన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టాడు. -
ఫోజులు తర్వాత.. ముందు బౌలింగ్ మెరుగుపరుచుకో!
పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో బిజీగా ఉన్నాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్ అలీ టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ఫోజును కాపీ కొట్టాలని ప్రయత్నించాడు. ఐపీఎల్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన సమయంలో చహల్ బౌండరీ లైన్ అవతల.. బీచ్‌లో రిలాక్స్ మోడ్‌లో కూర్చొన్నట్లుగా ఫోజు ఇచ్చాడు. చహల్ ఇచ్చిన ఆ ఫోజు ఎవర్‌గ్రీన్‌గా మిగిలిపోయింది. ఆ తర్వాత ఎన్నోసార్లు ఎంతోమంది ఆటగాళ్లు చహల్లా ఫోజు ఇవ్వడానికి ప్రయత్నించారు. అప్పటికి, ఇప్పటికి ఎప్పుడు చహల్ ఫోజు ఐకానిక్‌లా మారిపోయింది. తాజాగా పెషావర్ జాల్మీతో ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా హసన్ అలీ చహల్ ఫోజును ఇమిటేట్ చేయాలనుకున్నాడు. అయితే చహల్ అప్పుడు మైదానం బటయ చేస్తే.. హసన్ అలీ మాత్రం గ్రౌండ్‌లోనే ఐకానిక్ ఫోజును ఇచ్చాడు. ఈ ఫోటోను పాకిస్తాన్ సూపర్ లీగ్ తన ట్విటర్లో షేర్ చేస్తూ క్యాప్షన్ ఏం ఇస్తారు అని అడిగింది. అయితే మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన హసన్ అలీ 37 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో సొంత అభిమానులే హసన్ అలీపై తిట్ల దండకం మొదలుపెట్టారు. ''ఫోజులు తర్వాత ఇవ్వు.. ముందు నీ బౌలింగ్ ప్రదర్శనను మెరుగుపరుచుకో''.. ''ఈ ఫోజులకేం తక్కువ లేదు.. బౌలింగ్ బాగా చేస్తే మంచిది'' అంటూ చివాట్లు పెట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పెషావర్ జాల్మీ 12 పరుగుల తేడాతో ఇస్లామాబాద్ యునైటెడ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. బాబర్ ఆజం 64 పరుగులు చేయగా.. మహ్మద్ హారిస్ 34 పరుగులు చేశాడు. అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేసింది. షోయబ్ మక్సూద్ 60, అలెక్స్ హేల్స్ 57 పరుగులు చేశారు. Caption this? #HBLPSL8 | #SabSitarayHumaray | #IUvPZ pic.twitter.com/9MZM7BbE4Y — PakistanSuperLeague (@thePSLt20) March 16, 2023 Jalebia zyada bik gai inki shayad — Noor ul Ain (@thenoorulain13) March 16, 2023 -
Viral: పోలార్డ్పైకి దూసుకెళ్లిన అఫ్రిది.. నాలుగు సిక్సర్లు కొట్టాడన్న కోపంలో..!
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023 చివరి అంకానికి చేరుకున్న సమయంలో ఇద్దరు అంతర్జాతీయ స్టార్ల మధ్య జరిగిన గొడవ లీగ్ మొత్తానికే కలంకంగా మారింది. లీగ్‌లో భాగంగా నిన్న (మార్చి 15) జరిగిన మ్యాచ్‌లో సుల్తాన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్పై ఖలందర్స్ బౌలర్ షాహీన్ అఫ్రిది దాదాపుగా చేయి చేసుకున్నంత పని చేశాడు. తన బౌలింగ్‌లో పోలార్డ్ 4 సిక్సర్లు (ఒక ఓవర్లో 1, ఇంకో ఓవర్ 3) బాదడంతో సహనం కోల్పోయిన అఫ్రిది.. దూషణ పర్వానికి దిగగా, పోలీ సైతం అంతే ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశాడు. Shaheen Afridi and Kieron Pollard 😲#PSL8 #LQvMSpic.twitter.com/HM9CP5Y8tC — Cricket Pakistan (@cricketpakcompk) March 15, 2023 అయితే సొంతగడ్డ అడ్వాంటేజ్ తీసుకున్న అఫ్రిది ఓవరాక్షన్ చేసి పోలార్డ్పైకి దూసుకెళ్లడంతో మైదానంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనంతరం సహచరులు సర్ది చెప్పడంతో వెనక్కు తగ్గిన అఫ్రిది తన పని తాను చేసుకున్నాడు. అఫ్రిది-పోలార్డ్ మధ్య వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో అఫ్రిది చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు పాక్ యువ పేసర్‌ను ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్‌పై 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ముల్తాన్ సుల్తాన్స్ నేరుగా ఫైనల్‌కు చేరింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. పోలార్డ్ (34 బంతుల్లో 57; ఫోర్, 6 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా, ఛేదనలో షెల్డన్ కాట్రెల్ (3-0-20-3), ఉసామా మిర్ (2-0-12-2) ధాటికి ఖలందర్స్ 14.3 ఓవర్లలో 76 పరుగులకే చాపచుట్టేసింది. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ (29 బంతుల్లో 33; 3 ఫోర్లు), ఉస్మాన్ ఖాన్ (28 బంతుల్లో 29; 4 ఫోర్లు), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, సిక్స్) ఓ మోస్తరుగా రాణించగా.. ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో సామ్ బిల్లింగ్స్ (19), డేవిడ్ వీస్ (12), హరీస్ రౌఫ్ మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఖలందర్స్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3, జమాన్ ఖాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. సుల్తాన్స్ బౌలర్లలో కాట్రెల్ 3, మిర్ 2, అన్వర్ అలీ, అబ్బాస్ అఫ్రిది, ఇహసానుల్లా, కీరన్ పోలార్డ్ తలో వికెట్ పడగొట్టారు. రెండో ఫైనల్ బెర్తు ఎవరిది..? ఇవాళ (మార్చి 16) జరిగే ఎలిమినేటర్ 1 మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ తలపడనుండగా.. రేపు జరుగబోయే ఎలిమినేటర్ 2 మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ ఎలిమినేటర్ 1 విజేతను ఢీకొడుతుంది. ఈ మ్యాచ్‌లో విజేత మార్చి 19న జరిగే ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. -
పేలిన పోలార్డ్.. కేక పుట్టించిన కాట్రెల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023 ఎడిషన్‌లో ఓ ఫైనల్ బెర్తు ఖరారైంది. నిన్న (మార్చి 15) లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని ముల్తాన్ సుల్తాన్స్ తుదిపోరుకు అర్హత సాధించింది. ఇంకో రెండు మ్యాచ్‌ల తర్వాత సుల్తాన్స్‌తో తలపడబోయే రెండో ఫైనలిస్ట్ ఎవరో తేలిపోతుంది. TO THE FINALS#HBLPSL8 | #SabSitarayHumaray | #LQvMS pic.twitter.com/gIIye2TYtO — PakistanSuperLeague (@thePSLt20) March 15, 2023 ఇవాళ (మార్చి 16) జరిగే ఎలిమినేటర్ 1 మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ తలపడనుండగా.. రేపు జరుగబోయే ఎలిమినేటర్ 2 మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ ఎలిమినేటర్ 1 విజేతను ఢీకొడుతుంది. ఈ మ్యాచ్‌లో విజేత మార్చి 19న జరిగే ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 𝐏𝐎𝐋𝐋𝐀𝐑𝐃 𝐓𝐇𝐄 𝐁𝐈𝐆-𝐇𝐈𝐓𝐓𝐈𝐍𝐆 𝐌𝐀𝐂𝐇𝐈𝐍𝐄 💥 Giving the treatment to the Qalandars 💪#HBLPSL8 | #SabSitarayHumaray | #LQvMS pic.twitter.com/k2CfWGN3xq — PakistanSuperLeague (@thePSLt20) March 15, 2023 ఇక నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. లాహోర్ ఖలందర్స్‌పై ముల్తాన్ సుల్తాన్స్ 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. పోలార్డ్ (34 బంతుల్లో 57; ఫోర్, 6 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా, ఛేదనలో షెల్డన్ కాట్రెల్ (3-0-20-3), ఉసామా మిర్ (2-0-12-2) ధాటికి ఖలందర్స్ 14.3 ఓవర్లలో 76 పరుగులకే చాపచుట్టేసింది. 🫡 #HBLPSL8 | #SabSitarayHumaray | #LQvMS pic.twitter.com/zDH8en06kW — PakistanSuperLeague (@thePSLt20) March 15, 2023 సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ (29 బంతుల్లో 33; 3 ఫోర్లు), ఉస్మాన్ ఖాన్ (28 బంతుల్లో 29; 4 ఫోర్లు), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, సిక్స్) ఓ మోస్తరుగా రాణించగా.. ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో సామ్ బిల్లింగ్స్ (19), డేవిడ్ వీస్ (12), హరీస్ రౌఫ్ మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఖలందర్స్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3, జమాన్ ఖాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. సుల్తాన్స్ బౌలర్లలో కాట్రెల్ 3, మిర్ 2, అన్వర్ అలీ, అబ్బాస్ అఫ్రిది, ఇహసానుల్లా, కీరన్ పోలార్డ్ తలో వికెట్ పడగొట్టారు. -
పాకిస్తాన్ క్రికెట్లో సమూల మార్పులు.. తొలుత కెప్టెన్, తాజాగా కోచ్‌లు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ జాతీయ జట్టులో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. రమీజ్ రాజా నుంచి పీసీబీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక, తొలిసారి జట్టు మొత్తం ప్రక్షాళణ చేపట్టిన నజమ్ సేథీ.. త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా షాదాబ్ ఖాన్‌ను, హెడ్ కోచ్‌గా అబ్దుల్ రెహ్మాన్‌ను, బ్యాటింగ్ కోచ్‌గా మహ్మద్ యూసఫ్‌ను, బౌలింగ్ కోచ్‌గా ఉమర్ గుల్‌ను నియమించింది. సెలెక్షన్ కమిటీ నూతన చీఫ్ హరూన్ రషీద్ అమల్లోకి తెచ్చిన కొత్త వర్క్ లోడ్ పాలసీని బూచిగా చూపుతూ తొలుత కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను పక్కకు పెట్టిన పీసీబీ.. తాజాగా హెడ్ కోచ్, కోచింగ్ సిబ్బంది, నాన్ కోచింగ్ సిబ్బందిపై వేటు వేసి వారి స్థానాల్లో కొత్త వారిని నియమించింది. ఈ మార్పులన్నీ తాత్కాలికమేనని పీసీబీ చెబుతున్నప్పటికీ.. ఈ స్థాయిలో ప్రక్షాళణ జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. గత కొంతకాలంగా బాబర్ ఆజమ్‌పై గుర్రుగా ఉన్న పీసీబీ పలు మార్లు అతన్ని తప్పించి సారధ్య బాధ్యతలు ఇతరులకు కట్టబెట్టాలని ప్రయత్నాలు చేసింది. అయితే బాబర్‌కు ఉన్న బలమైన కోఠరి కారణంగా అది సాధ్యపడలేదు. తాజాగా పీసీబీ చీఫ్ ఏదైతే అదైందని తెగించి ప్రక్షాళణకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. @TheRealPCB announces Support Personnel for Sharjah T20Is. Abdul Rehman, Head Coach; Umar Gul, Bowling Coach; M Yousuf, Batting Coach; A Majeed, Fielding Coach; Drikus Simon, Trainer; Cliffe Deacon, Physio; Talha Ijaz, Analyst; Mansoor Rana, Manager; Ahsan Nagi, Media. #PAKvAFG — Najam Sethi (@najamsethi) March 14, 2023 కాగా, షార్జా వేదికగా మార్చి 24, 26, 27 తేదీల్లో పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు మాత్రమే తాజాగా జరిగిన మార్పులన్నీ (కెప్టెన్, కోచింగ్, నాన్ కోచింగ్ స్టాఫ్) వర్తిసాయని పీసీబీ ప్రకటిన విడుదల చేసినప్పటికీ, ఎక్కడో ఏదో జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. బాబర్ ఆజమ్‌తో పాటు సీనియర్లు మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్‌లకు విశ్రాంతినిచ్చిన పీసీబీ.. సైమ్ అయూబ్, ఇహసానుల్లా లాంటి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) స్టార్లకు జట్టులో తొలిసారి అవకాశం కల్పించింది. ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు.. షాదాబ్ ఖాన్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఆజమ్ ఖాన్ (వికెట్‌కీపర్), ఫహీమ్ అష్రాఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇహసానుల్లా, ఇమాద్ వసీం, మహ్మద్ హరీస్ (వికెట్‌కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, నసీం షా, సైమ్ అయూబ్, షాన్ మసూద్, తయాబ్ తాహిర్, జమాన్ ఖాన్ -
కట్టింగ్ మెరుపు ఇన్నింగ్స్.. ఇమ్రాన్ తాహిర్ మాయాజాలం
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో చాలా రోజుల తర్వాత బౌలర్ల హవా నడిచింది. లీగ్‌లో భాగంగా నిన్న (మార్చి 12) జరిగిన రెండు మ్యాచ్‌ల్లో నాలుగు జట్ల బౌలర్లు పేట్రేగిపోయారు. ఫలితంగా గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న పరుగుల ప్రవాహానికి పాక్షికంగా బ్రేక్ పడింది. నిన్న మధ్యాహ్నం ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ ఓ మోస్తరు స్కోర్ (179/8) నమోదు చేయగా.. ఛేదనలో జల్మీ బౌలర్ల ధాటికి ఇస్లామాబాద్ యునైటెడ్ (166 ఆలౌట్) చేతులెత్తేసింది. రాత్రి జరిగిన మ్యాచ్‌లోనూ దాదాపు ఇదే సీన్ రిపీటయ్యింది. లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ జట్టు.. ముహమ్మద్ అక్లక్ (51), ఇమాద్ వసీం (45), తయ్యబ్ తాహిర్ (40), బెన్ కట్టింగ్ (33) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఖలందర్స్.. ఇమాద్ వసీం (2/26), అకీఫ్ జావిద్ (2/8), మహ్మద్ ఉమర్ (2/20), జేమ్స్ ఫుల్లర్ (1/29), ఇమ్రాన్ తాహిర్ (2/24) చెలరేగడంతో 18.5 ఓవర్లలో 110 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. కాగా, ఈ పీఎస్ఎల్ సీజన్లో ట్రెండ్‌ను పరిశీలిస్తే.. దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఇరు జట్లు సునాయాసంగా 200 పరుగుల మైలురాయిని దాటాయి. క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే ముల్తాన్ సుల్తాన్స్ రికార్డు స్థాయిలో 262 పరుగులు చేయగా.. ఛేదనలో అదే స్థాయిలో రెచ్చిపోయిన గ్లాడియేటర్స్ 253 పరుగులు చేసి లక్ష్యానికి 10 పరుగులు దూరంలో నిలిచిపోయింది. ఈ సీజన్ మ్యాచ్‌ల గురించి చెప్పుకుంటు పోతే 240, 242, 243, 244, 226.. ఇలా ఆయా జట్లు పలు మార్లు 250 పరుగుల మైలురాయి వరకు రీచ్ అయ్యాయి. ప్రస్తుత సీజన్లో బ్యాటర్లు శతక్కొట్టుడులోనూ టాప్‌లో నిలిచారు. మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, జేసన్ రాయ్, రిలీ రొస్సొ, ఫకర్ జమాన్, ఉస్మాన్ ఖాన్ వంటి బ్యాటర్లు విధ్వంసకర శతకాలతో విరుచుకుపడి ఆయా జట్లు భారీ స్కోర్లు చేయడానికి దోహదపడ్డారు. మరోవైపు లీగ్ కూడా చివరి అంకానికి చేరింది. మార్చి 15 లాహోర్ ఖలందర్స్-ముల్తాన్ సుల్తాన్స్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుండగా.. ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ మార్చి 16న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఆ తర్వాత ఎలిమినేటర్-2, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. -
పరుగుల సునామీకి, శతకాల మోతకు పాక్షిక విరామం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 ఎడిషన్‌లో పరుగుల సునామీకి, శతకాల మోతకు కాస్త బ్రేక్ పడింది. ఈ సీజన్లో గత కొన్ని మ్యాచ్‌లుగా అతి భారీ స్కోర్లు, విధ్వంసకర శతకాలు నమోదవుతూ వస్తుండగా.. ఇవాళ (మార్చి 12) ఇస్లామాబాద్ యునైటెడ్-పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో పరుగుల ప్రవాహానికి, శతక్కొట్టుడుకు పాక్షిక విరామం దొరికింది. ఇస్లామాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. ఛేదనలో ఇస్లామాబాద్ 166 పరుగులకే చాపచుట్టేసి 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో గత కొన్ని మ్యాచ్‌ల తరహాలో ఎలాంటి మెరుపులు లేకపోగా.. బౌలర్లు ఆధిపత్యం చలాయించి అందరినీ ఆశర్యర్యపరిచారు. పెషావర్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హరీస్ (79) ఒక్కడే మెరుపు హాఫ్‌సెంచరీతో అలరించగా.. భానుక రాజపక్ష (41) పర్వాలేదనిపించాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో హసన్ అలీ 3, షాదాబ్ ఖాన్ 2, ఫజల్ హక్ ఫారూఖీ, ఫహీమ్ అష్రాఫ్, మహ్మద్ వసీం జూనియర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన ఇస్లామాబాద్.. జల్మీ బౌలర్లు ఖుర్రమ్ (1.4-0-13-3), సూఫియాన్ (3/37), అమెర్ జమాల్ (2/28), జేమ్స్ నీషమ్ (2/23) ధాటికి 19.4 ఓవర్లలో 166 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఇస్లామాబాద్ ఇన్నింగ్స్‌లో ఫహీమ్ అష్రాఫ్ (38), రహ్మానుల్లా గుర్భాజ్ (33), షాదాబ్ ఖాన్ (25) ఓ మోస్తరుగా రాణించారు. పీఎస్ఎల్-2023లో గత కొన్ని మ్యాచ్‌ల్లో స్కోర్ల వివరాలు.. ముల్తాన్ సుల్తాన్స్: 262/3 (ఉస్మాన్ ఖాన్ 43 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 120) క్వెట్టా గ్లాడియేటర్స్: 253/8 పెషావర్ జల్మీ 242/6 ముల్తాన్ సుల్తాన్స్ 244/6 (రిలీ రొస్సొ 51 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 121) లాహోర్ ఖలందర్స్ 226/5 (ఫకర్ జమాన్ 57 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 115) ఇస్తామాబాద్ యునైటెడ్ 107 పెషావర్ జల్మీ 240/2 (బాబర్ ఆజమ్ 65 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 115) క్వెట్టా గ్లాడియేటర్స్ 243/2 (జేసన్ రాయ్ 63 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 145 నాటౌట్) -
PSL 2023: టీ20 మ్యాచ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు! 43 బంతుల్లో 120 రన్స్‌తో..
Quetta Gladiators vs Multan SultansWorld Record: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో ముల్తాన్ సుల్తాన్స్ సంచలన విజయాలు నమోదు చేస్తోంది. పెషావర్ జల్మీతో మ్యాచ్‌లో 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముల్తాన్ జట్టు.. శనివారం నాటి మ్యాచ్‌లో మరో రికార్డు విజయం సాధించింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన రిజ్వాన్ బృందం.. క్వెటా గ్లాడియేటర్స్‌ను ఇంటికి పంపింది. వివరాలు.. రావల్పిండిలో మార్చి 11న ముల్తాన్ సుల్తాన్స్, క్వెటా గ్లాడియేటర్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన గ్లాడియేటర్స్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ముల్తాన్ ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ పరుగుల సునామీ సృష్టించాడు. పరుగుల సునామీ 43 బంతుల్లోనే 12 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 120 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఏకంగా 279.07 స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. మరో ఓపెనర్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 29 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. వీరిద్దరికి తోడు టిమ్ డేవిడ్ 43, పొలార్డ్ 23 పరుగులతో రాణించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. పీఎస్ఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముల్తాన్ సుల్తాన్స్ కేవలం 3 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. తద్వారా పీఎస్ఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన క్వెటా గ్లాడియేటర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జేసన్ రాయ్.. 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 37, వన్‌డౌన్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్ 67 పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరితో పాటు ఐదో స్థానంలో వచ్చిన ఇఫ్తికర్ అహ్మద్ అర్ధ శతకం(53)తో రాణించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టోర్నీ నుంచి అవుట్ మిగతా వాళ్ల నుంచి సహకారం లేకపోవడంతో 20 ఓవర్లలో 253 పరుగులు మాత్రమే చేయగలిగింది మహ్మద్ నవాజ్ బృందం. దీంతో 9 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. 4 ఓవర్లలో 47 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చి గ్లాడియేటర్స్ పతనాన్ని శాసించిన అబ్బాస్ ఆఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 515 పరుగులు.. రికార్డు బద్దలు ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి ఏకంగా 515 పరుగులు నమోదు చేయడం విశేషం. ఈ క్రమంలో సౌతాఫ్రికా టీ20 చాలెంజ్-2022లో టైటాన్స్- నైట్స్ జట్లు నమోదు చేసిన 501 పరుగుల రికార్డు బద్దలైంది. టీ20 ఫార్మాట్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన మ్యాచ్‌గా ముల్తాన్- గ్లాడియేటర్స్ మ్యాచ్ చరిత్రకెక్కింది. ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ క్వెటా గ్లాడియేటర్స్ స్కోర్లు: ముల్తాన్ సుల్తాన్స్- 262/3 (20) క్వెటా గ్లాడియేటర్స్- 253/8 (20) చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్! Usain Bolt: పది క్షణాల్లో ప్రపంచాన్ని జయించడం అంటే ఇదేనేమో! అప్పుడు దారితప్పినా.. 🚨RAINING RECORDS🚨 5⃣1⃣5⃣: This is the highest match aggregate in T20 cricket in the world. #HBLPSL8 I #SabSitarayHumaray | #QGvMS pic.twitter.com/xlzynehkGr — PakistanSuperLeague (@thePSLt20) March 11, 2023 🚨 𝐇𝐀𝐓𝐓𝐑𝐈𝐂𝐊 𝐅𝐎𝐑 𝐀𝐅𝐑𝐈𝐃𝐈 🚨 FIRST hattrick of the #HBLPSL8 Abbas Afridi on a ROLL 🕺🏻 #SabSitarayHumaray | #QGvMS pic.twitter.com/sM3KCdQUMG — PakistanSuperLeague (@thePSLt20) March 11, 2023 -
41 బంతుల్లోనే శతకం.. అతిపెద్ద టార్గెట్‌ను చేధించి ప్లేఆఫ్స్‌కు
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో సంచలనాలు నమోదవుతన్నాయి. మ్యాచ్ స్కోర్లు 250 దరిదాపుల్లో నమోదవుతున్నా చేజింగ్ జట్లు అవలీలగా టార్గెట్‌నే చేధిస్తున్నాయి. తాజాగా ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జాల్మీల మధ్య జరిగిన మ్యాచ్ అందుకు ఉదాహరణ. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం 39 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేయగా.. సయామ్ అయుబ్ 33 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఇక మహ్మద్ హారిస్(11 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సర్లతో 35 పరుగులు), కొహ్లెర్ కాడ్మెర్(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు) మెరుపులు మెరిపించడంతో భారీ స్కోరు నమోదైంది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు ఇద్దరు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అయితే ఆ తర్వాత వచ్చిన రిలీ రొసౌ(51 బంతుల్లోనే 121 పరుగులు, 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. కీరన్ పొలార్డ్ (25 బంతుల్లో 52, 3ఫోర్లు, 5 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ముల్తాన్ సుల్తాన్స్ లక్ష్యం దిశగా సాఫీగా సాగిపోయింది. అయితే చివర్లో ఇద్దరు స్వల్ప తేడాతో ఔటైనప్పటికి అన్వర్ అలీ(8 బంతుల్లో 24 నాటౌట్), ఉస్మా మీర్(3 బంతుల్లో 11 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. కాగా పీఎస్ఎల్ చరిత్రలోనే అతిపెద్ద టార్గెట్‌ను చేధించిన ముల్తాన్ సుల్తాన్స్ విజయంతో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది. Name: Riley Rossouw Game: Hitting the fastest 100s in the HBL PSL RECORD-HOLDER ROSSOUW#SabSitarayHumaray l #HBLPSL8 l #PZvMS @Rileerr pic.twitter.com/JJtHoomWt3 — PakistanSuperLeague (@thePSLt20) March 10, 2023 చదవండి: 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్ భరత్‌కు కోహ్లి ఆదేశం -
PSL: హృదయాలు కొల్లగొట్టింది.. సూపర్.. స్టన్నింగ్! ఇంక ఆపుతావా?
PSL 2023- Simon Doull: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ మరోసారి తన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అవుతున్నాడు. ‘నీకిది అవసరమా’ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా.. ‘పర్లేదు.. అతడు అన్నదాంట్లో తప్పేముంది’ అంటూ మరికొందరు సమర్థిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో నేపథ్యంలో సైమన్ డౌల్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రావల్పిండి వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్- ముల్తాన్ సుల్తాన్స్ తలపడ్డాయి. ఇందులో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇస్లామాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో ముల్తాన్ కింగ్స్‌ను 205 పరుగులకు అవుట్ చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్ 19.5 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 209 పరుగులు చేసింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన పోరులో అద్భుత విజయం అందుకుంది. దీంతో ఇస్లామబాద్ యునైటెడ్ శిబిరంలో సంతోషాలు వెల్లివిరిశాయి. ఈ క్రమంలో డగౌట్లో ఉన్న హసన్ అలీ భార్య సమియా అర్జూ సైతం ఆనందంతో గెంతులేసింది. నమ్మశక్యంరాని రీతిలో భర్త ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు గెలుపొందడంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఈ నేపథ్యంలో కెమెరాలు సమియా సెలబ్రేషన్స్ మీద దృష్టిసారించాయి. హృదయాలు కొల్లగొట్టింది. సూపర్.. స్టన్నింగ్ సమియా రూపానికి ఫిదా అయిన సైమన్ డౌల్.. ‘‘ఆమె గెలిచింది. నాకు తెలిసి ఇక్కడున్న చాలా మంది హృదయాలు ఆమె కొల్లగొట్టింది. సూపర్.. స్టన్నింగ్’’ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. దీంతో నెటిజన్లు 53 ఏళ్ల డౌల్‌ను ఓ ఆటాడేసుకుంటున్నారు. ‘‘ఇంక ఆపెయ్! ఆట గురించి మాట్లాడమంటే.. నువ్వు చేసే పని ఇదా! జట్టును గెలిపించడానికి కృషి చేసిన ఆ ఆటగాళ్ల గురించి వర్ణించేందుకు నీ భాషాప్రావీణ్యాన్ని ఉపయోగించు.. బాగుంటుంది’’ అని ట్రోల్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. అందాన్ని ఆస్వాదించడంలో తప్పేముంది? అంటూ సైమన్ డౌల్‌కు అండగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో హసన్ అలీ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఇక ఆఖరి వరకు అజేయంగా నిలిచి 51 పరుగులతో రాణించిన ఫహీం అష్రఫ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా ఇటీవల పాక్ కెప్టెన్, పెషావర్ జల్మీ సారథి బాబర్ ఆజం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతాడంటూ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ఇక హసన్ అలీ భార్య సమియా భారత్‌కు చెందిన ఫ్లైట్ ఇంజనీర్ అన్న విషయం తెలిసిందే. చదవండి: IND Vs AUS: 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్ భరత్‌కు కోహ్లి ఆదేశం Ind Vs Aus: గ్రౌండ్‌లోనే ఇషాన్‌పై చెయ్యెత్తిన రోహిత్.. సర్వెంట్ అనుకున్నావా! అయినా ప్రతిదానికీ.. Simon Doull is all of Us right now 😂😂😂 even he is baffled by the beauty of Pakistan 😅😅🔥🔥❤️❤️ #simondoull #tiktokdown #PSL8 pic.twitter.com/08VK1KizuQ — Adil Ali Shah (@AdilAliShah13) March 9, 2023 -
ఫఖర్ జమాన్ వీరవిహారం.. డిఫెండింగ్ ఛాంపియన్స్ జోరు
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 8వ సీజన్లో లాహోర్ ఖలండర్స్ తన జోరు కొనసాగిస్తుంది. గత మ్యాచ్‌లో ఓటమిని మరిచిపోయేలా ఇస్లామాబాద్ యునైటెడ్‌పై 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఖలండర్స్ ఓపెనర్ ఫఖర్ జమాన్ 57 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. సామ్ బిల్లింగ్స్ 22 బంతుల్లో 32 పరుగులు చేయగా.. చివర్లో రషీద్ ఖాన్ 5 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 15 పరుగులు బాదాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ యునైటెడ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేకపోయింది. స్పిన్నర్ రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలానికి ఇస్లామాబాద్ తోక ముడిచింది. జట్టులో అత్యధిక స్కోరు 18 పరుగులే కావడం గమనార్హం. బౌలర్ల ధాటికి ఇస్లామాబాద్ 15.1 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. హారిస్ రౌఫ్, జమాన్ ఖాన్లు తలా రెండు వికెట్లు తీశారు. ఇప్పటికే 9 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, రెండు పాయింట్లతో ఉన్న లాహోర్ ఖలండర్స్ దాదాపు సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. చదవండి: మెస్సీని భయపెట్టిన అజ్ఞాత వ్యక్తి -
క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద సిక్స్.. స్టేడియం బయటికి బంతి! వీడియో వైరల్
వెస్టిండీస్ టీ20 కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పావెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 18 బంతులు ఎదుర్కొన్న పావెల్.. 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. భారీ సిక్సర్ బాదిన పావెల్.. ఈ మ్యాచ్‌లో పావెల్ 116 మీటర్ల ఓ భారీ సిక్సర్ బాదాడు. 15 ఓవర్ వేసిన మహ్మద్ నవాజ్ బౌలింగ్‌లో తొలి బంతిని పావెల్ సిక్స్‌గా మలిచాడు. పావెల్ కొట్టిన బంతి ఏకంగా స్టేడియం బయటకు వెళ్లి పడింది. దెబ్బకు నవాజ్‌కు ప్యూజ్‌లు ఎగిరిపోయాయి. పావెల్ కొట్టిన సిక్స్ పాకిస్తాన్ సూపర్ లీగ్ చరిత్రలోనే బిగెస్ట్ సిక్స్ల్లో ఒకటిగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 8 వికెట్ల తేడాతో పెషావర్ పరాజయం పాలైంది. 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. క్వెట్టా ఓపెనర్ ఓపెనర్ జాసన్ రాయ్(63 బంతుల్లో 145పరుగులు నాటౌట్) విధ్వంసకర శతకంతో తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక ఇదే మ్యాచ్‌లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజం కూడా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 65 బంతులు ఎదుర్కొన్న బాబర్ 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115 పరుగులు సాధించాడు. చదవండి: BGT 2023: తొలి ఓవర్లోనే షమీకి చేదు అనుభవం.. తర్వాత అద్భుత డెలివరీతో! దెబ్బకు.. Rovman Powell, what a shot 👏 #HBLPSL8 pic.twitter.com/hrJaON9hLL — Farid Khan (@_FaridKhan) March 8, 2023 -
బాబర్ ఆజం విధ్వంసకర శతకం.. 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో! వార్నర్ రికార్డు సమం
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ మరో ఓటమి చవిచూసింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పెషావర్ పరజాయం పాలైంది. 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. క్వెట్టా ఓపెనర్ ఓపెనర్ జాసన్ రాయ్(63 బంతుల్లో 145పరుగులు నాటౌట్) విధ్వంసకర శతకంతో తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అతడితో పాటు ఆల్‌రౌండర్ మహ్మద్ హాఫీజ్ 41 పరుగులతో రాణించాడు. బాబర్ ఆజం సెంచరీ వృథా ఇక తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 240 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజం అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 60 బంతుల్లోనే బాబర్ సెంచరీ సాధించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బాబర్‌కు ఇదే తొలి సెంచరీ. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 65 బంతులు ఎదుర్కొన్న బాబర్ 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115 పరుగులు సాధించాడు. అతడితో పాటు మరోఓపెనర్ సైమ్ అయూబ్(74) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా ఈ మ్యాచ్‌లో పెషావర్ ఓటమి పాలవ్వడంతో బాబర్ విరోచిత శతకం వృథాగా మిగిలిపోయింది. ఇక ఇది బాబర్ టీ20 కెరీర్లో ఎనిమిదివ శతకం. తద్వారా ఓ అరుదైన ఘనతను బాబర్ తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా ఫించ్, వార్నర్, మైఖేల్ క్లింగర్ సరసన ఆజం నిలిచాడు. ఇక ఘనత సాధించిన జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ 22 సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు. Jersey # 56 lives rent-free in our hearts 🥰#SabSitarayHumaray l #HBLPSL8 l #PZvQG pic.twitter.com/e6HsozWROG — PakistanSuperLeague (@thePSLt20) March 8, 2023 -
జేసన్ రాయ్ విధ్వంసకర శతకం.. టీ20ల్లో అతి భారీ లక్ష్యఛేదన రికార్డు
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పరుగుల ప్రవాహం పతాక స్థాయికి చేరింది. క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ జట్ల మధ్య నిన్న (మార్చి 8) జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు విధ్వంసకర శతకాలతో రెచ్చిపోవడంతో భారీ స్కోర్లు నమోదవ్వడంతో పాటు పలు రికార్డులు బద్దలయ్యాయి. టీ20 క్రికెట్ చరిత్రలో (ఆసియా పరిధిలో) అతి భారీ లక్ష్యఛేదన రికార్డు ఈ మ్యాచ్‌లోనే నమోదైంది. Jersey # 56 lives rent-free in our hearts 🥰#SabSitarayHumaray l #HBLPSL8 l #PZvQG pic.twitter.com/e6HsozWROG — PakistanSuperLeague (@thePSLt20) March 8, 2023 పెషావర్ జల్మీ నిర్ధేశించిన 241 పరుగుల భారీ లక్ష్యాన్ని క్వెట్టా గ్లాడియేటర్స్ మరో 10 బంతులు మిగిలుండగానే ఊదేసి, ఆసియాలోనే అతి భారీ లక్ష్య ఛేదన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఈ ఊపుతో ఆ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి ఉంటే టీ20ల్లో మొట్టమొదటిసారి 300 పరుగుల టీమ్ స్కోర్ నమోదయ్యేది. B for Babar, B for Best 💯 Best in the world for a reason 👑#PZvQG #PSL8 #BabarAzam𓃵pic.twitter.com/XwoWJFjJOl — Cricket Pakistan (@cricketpakcompk) March 8, 2023 తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ.. బాబర్ ఆజమ్ (65 బంతుల్లో 115; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో, సైమ్ అయూబ్ (34 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), రోవమన్ పావెల్ (18 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. Roy, oh ROY! Celebrate all you want @TeamQuetta 😍#SabSitarayHumaray l #HBLPSL8 I #PZvQG pic.twitter.com/QghDUv9BQ9 — PakistanSuperLeague (@thePSLt20) March 8, 2023 60 బంతుల్లోనే శతక్కొట్టిన పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు ఇది పీఎస్ఎల్లో తొలి సెంచరీ కాగా.. పీఎస్ఎల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్ల (15) రికార్డు కూడా బాబర్ ఖాతాలోకే వెళ్లింది. అయితే గంట వ్యవధిలోనే ఈ రికార్డు తారుమారైంది. 241 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్.. జేసన్ రాయ్ (63 బంతుల్లో 145 నాటౌట్; 20 ఫోర్లు, 5 సిక్సర్లు) సునామీ శతకంతో శివాలెత్తడంతో 18.2 ఓవర్లలోనే రికార్డు విజయం సాధించింది. New ball please ☝️🏽 because @Ravipowell26 has SENT IT OUTTA THE PARK! #SabSitarayHumaray l #HBLPSL8 l #PZvQG pic.twitter.com/Q8OA4uBA71 — PakistanSuperLeague (@thePSLt20) March 8, 2023 రాయ్‌కు మార్టిన్ గప్తిల్ (8 బంతుల్లో 21; 3 ఫోర్లు, సిక్స్), విల్ స్మీడ్ (22 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు), మహ్మద్ హఫీజ్ (18 బంతుల్లో 41 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మరో ఎండ్ నుంచి పూర్తిగా సహకరించారు. ఫలితంగా గ్లాడియేటర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాయ్ విధ్వంసం ధాటికి 3 పెషావర్ బౌలర్లు 11 ఓవర్లలో 167 పరుగులు సమర్పించుకున్నారు. ఈ క్రమంలో రాయ్ పీఎస్ఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (145 నాటౌట్) రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు పీఎస్ఎల్ టాప్ స్కోర్ రికార్డు కొలిన్ ఇంగ్రామ్ (127) పేరిట ఉండేది. 𝐊𝐢𝐧𝐠 𝐁𝐚𝐛𝐚𝐫 - 𝐑𝐞𝐜𝐨𝐫𝐝 𝐁𝐫𝐞𝐚𝐤𝐞𝐫 👑#PSL8 #PzvQG pic.twitter.com/By7yTLXrRy — Cricket Pakistan (@cricketpakcompk) March 8, 2023 -
టిమ్ డేవిడ్ ఊచకోత.. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఖుషీ, అయినా..!
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో బ్యాటర్ల డామినేషన్ పతాక స్థాయిలో నడుస్తుంది. లీగ్‌లో ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు జరగ్గా దాదాపు అన్ని మ్యాచ్‌ల్లో బ్యాటర్లు శివాలెత్తిపోయారు. ఫలితంగా ప్రతి మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. నిన్న (మార్చి 7) ముల్తాన్ సుల్తాన్స్-ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ పరుగుల ప్రవాహం కొనసాగింది. ఇరు జట్లకు చెందిన బ్యాటర్లు పోటాపోటీగా విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్.. షాన్ మసూద్ (50 బంతుల్లో 75; 12 ఫోర్లు), మహ్మద్ రిజ్వాన్ (18 బంతుల్లో 33; ఫోర్, 3 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (27 బంతుల్లో 60; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరలెవెల్లో విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ ఊచకోత ధాటికి ఇస్తామాబాద్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. షాదాబ్ ఖాన్ (4-1-26-2) ఒక్కడే పర్వాలేదనిపించాడు. అనంతరం బరిలోకి దిగిన ఇస్లామాబాద్.. సుల్తాన్స్ బ్యాటర్ల కంటే ఎక్కువగా రెచ్చిపోయి భారీ లక్ష్యాన్ని మరో బంతి మిగిలుండగానే (19.5 ఓవర్లలో 209/8) ఊదేశారు. ఇస్లామాబాద్ బ్యాటర్లు తలో చేయి వేసి తమ జట్టును గెలిపించుకున్నారు. రహమానుల్లా గుర్భాజ్ (14 బంతుల్లో 25; 5 ఫోర్లు), కొలిన్ మున్రో (21 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (25 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (26 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మద్ వసీం జూనియర్ (7 బంతుల్లో 16; ఫోర్, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. ఫలితంగా ఇస్లామాబాద్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సుల్తాన్స్ బౌలర్లు అన్వర్ అలీ (3/33), ఇహసానుల్లా (2/35), ఉసామా మీర్ (2/38) బంతితో ఓ మోస్తరుగా రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి. కాగా, ఇస్లామాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ విధ్వంసాన్ని చూసిన ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగి తేలుతున్నారు. భారీ కాయుడు ఇదే తరహా విధ్వంసాన్ని ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని వారు ఆశిస్తున్నారు. గత సీజన్లోనూ మెరుపులు మెరిపించిన టిమ్.. రాబోయే సీజన్లో మరింత రెచ్చిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆసీస్ ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్‌ను 2022 ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
Danny Morrison: అప్పుడు ఇండియా యువతి.. ఇప్పుడు ఆసీస్ యువతి
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్ విజయవంతంగా నడుస్తోంది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మోరిసన్ లీగ్‌లో కామెంటేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ మాజీ క్రికెటర్ ఎక్కడ ఉంటే అక్కడ సందడి వేరుగా ఉంటుంది. ఆటలో గొప్ప బౌలర్‌గా పేరు పొందిన డానీ మోరిసన్ ఆట తర్వాత కూడా అదే జోష్‌ను కంటిన్యూ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా డానీ మోరిసన్ చర్య ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మార్చి 5న(ఆదివారం) కెట్టా గ్లాడియేటర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియన్ టీవీ ప్రజెంటర్.. మాజీ క్రికెటర్ బెన్ కటింగ్ భార్య ఎరిన్ హాలండ్‌తో కలిసి మోరిసన్ మాట్లాడాడు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే సడన్‌గా ఎరిన్ హాలండ్‌ను ఎత్తుకొని తన తొడపై కూర్చొబెట్టుకున్నాడు. ఈ చర్యతో ఎరిన్ హాలండ్ షాక్‌కు గురైనప్పటికి ఫన్నీగానే తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ ఎరిన్ హాలండ్ ట్విటర్లో షేర్ చేస్తూ.. ''లవ్ యూ అంకుల్ @SteelyDan66'' అని రాసుకొచ్చింది. దీనిపై స్పందించిన మోరిసన్.. ''నిన్ను నీ పాదాలపై నిల్చునేలా చేశాను మిసెస్ కటింగ్'' అంటూ రిప్లై ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''బెన్ కటింగ్ ఎక్కడున్నావు''.. ''బెన్ కటింగ్ చూశాడో నీ పని అయిపోతుంది మోరిసన్'' అంటూ ఫన్నీవేలో పేర్కొన్నారు. అయితే ఇలా చేయడం డానీ మోరిసన్‌కు కొత్తేం కాదు. గతంలో ఐపీఎల్‌లోనూ రెండు సందర్భాల్లో మోరిసన్ ఇలానే ప్రవర్తించాడు. ఒకసారి చీర్ లీడర్‌ను తన భుజాలపై మోసుకెళ్లిన మోరిసన్.. మరోసారి మాజీ ఐపీఎల్ ప్రజంటేటర్.. నటి కరిష్మా కొటక్‌ను కూడా తన తొడలపై కూర్చొబెట్టుకున్నాడు. అప్పట్లో దీనికి సంబంధించిన ఫోటో బాగా వైరల్ అయింది. తాజాగా పీఎస్ఎల్లోనూ సేమ్ సీన్ రిపీట్ చేసిన డానీ మోరిసన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇక 57 ఏళ్ల డానీ మోరిసన్ 1987లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 1994లో టీమిండియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీయడం ద్వారా మోరిసన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. 1997లో కివీస్ తరపున ఆఖరి మ్యాచ్ ఆడిన మోరిసన్ తన 10 ఏళ్ల కెరీర్లో 48 టెస్టుల్లో 160 వికెట్లు, 96 వన్డేల్లో 126 వికెట్లు పడగొట్టాడు. Love ya uncle @SteelyDan66 😂 @thePSLt20 pic.twitter.com/9reSq6ekdN — Erin Holland (@erinvholland) March 5, 2023 Just keeping you on your toes Mrs Cutting!!! 🤣💃 #PSL8 https://t.co/r1i5Oebc5l — Danny Morrison (@SteelyDan66) March 5, 2023 చదవండి: షాహిన్ అఫ్రిది చితక్కొటినా తప్పని ఓటమి.. -
షాహిన్ అఫ్రిది చితక్కొటినా తప్పని ఓటమి..
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023లోలో డిఫెండింగ్ ఛాంపియన్స్ లాహోర్ ఖలండర్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. మంగళవారం పెషావర్ జాల్మీతో జరిగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలండర్స్ 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. జట్టు కెప్టెన్ షాహిన్ అఫ్రిది(36 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు), హుస్సేన్ తలత్(37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63) చితక్కొట్టినా ఓటమి నుంచి మాత్రం తప్పించలేకపోయారు. పెషావర్ జాల్మీ బౌలింగ్‌లో అర్షద్ ఇక్బాల్, వహాబ్ రియాజ్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. అజ్మతుల్లా రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మీ 19.3 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు సయీమ్ అయూబ్(36 బంతుల్లో 68), కెప్టెన్ బాబర్ ఆజం(41 బంతుల్లో 50) రాణించారు. ఇక కొహ్లెర్ కాడ్మోర్ 16 బంతుల్లో 36 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. లాహోర్ ఖలండర్స్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది నాలుగు వికెట్లు పడగొట్టగా, హారిస్ రౌఫ్, జమాన్ ఖాన్, రషీద్ ఖాన్లు తలా రెండు వికెట్లు తీశారు. చదవండి: క్రికెట్లో కొత్త పంథా.. ఐపీఎల్ 2023 నుంచే మొదలు -
మార్టిన్ గప్తిల్ వీరవిహారం.. 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో..
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో క్వెట్టా గ్లాడియేటర్స్ 5 మ్యాచ్‌ల తర్వాత ఓ మ్యాచ్‌లో విజయం సాధించింది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన గ్లాడియేటర్స్.. 2 విజయాలు, 6 పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. కరాచీ కింగ్స్‌తో నిన్న (మార్చి 6) జరిగిన మ్యాచ్‌లో గ్లాడియేటర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. గ్లాడియేటర్స్ 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (56 బంతుల్లో 86; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయమైన అర్ధసెంచరీతో గ్లాడియేటర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. గప్తిల్‌కు మరో ఎండ్ నుంచి ఎవరి సపోర్ట్ లేనప్పటికీ, ఒంటరి పోరాటంచేసి తన జట్టును గెలిపించుకున్నాడు. గప్తిల్‌కు సర్ఫరాజ్ అహ్మద్ (29), మహ్మద్ నవాజ్ (15), డ్వేన్ ప్రిటోరియస్ (10 నాటౌట్) నుంచి ఓ మోస్తరు మద్దతు లభించింది. కరాచీ బౌలర్లలో తబ్రేజ్ షంషి 2 వికెట్లు పడగొట్టగా.. ఆమెర్ యామిన్, ముహ్మద్ మూసా, జేమ్స్ ఫుల్లర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు కరాచీ ఇన్నింగ్స్‌లో రొస్సింగ్టన్ (45 బంతుల్లో 69; 10 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో మెరవగా.. ఇమాద్ వసీం (30 నాటౌట్), ఆమెర్ యామిన్ (23 నాటౌట్) పర్వాలేదనిపించారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో నసీం షా, ఐమల్ ఖాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ నవాజ్, నవీన్ ఉల్ హక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. లీగ్‌లో భాగంగా ఇవాళ (మార్చి 7) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు పెషావర్ జల్మీ-లాహోర్ ఖలందర్స్ తలపడనుండగా.. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ఇస్లామాబాద్-ముల్తాన్ సుల్తాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
మున్రో విధ్వంసం.. చెలరేగిన ఆజమ్ ఖాన్, ఆఖర్లో ఫహీమ్ మెరుపులు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో లాహోర్ ఖలందర్స్ తర్వాత ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన రెండో జట్టుగా ఇస్లామాబాద్ యునైటెడ్ నిలిచింది. క్వెట్టా గ్లాడియేటర్స్‌పై గెలుపుతో ఖలందర్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. నిన్న (మార్చి 5) జరిగిన మ్యాచ్‌లో గ్లాడియేటర్స్‌పై ఇస్లామాబాద్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్.. మహ్మద్ నవాజ్ (44 బంతుల్లో 52; 6 ఫోర్లు), నజీబుల్లా (34 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆఖర్లో ఉమర్ అక్మల్ (14 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో గ్లాడియేటర్స్ ఈ స్కోర్ సాధించగలిగింది. ఇస్లామాబాద్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ 3 వికెట్లు పడగొట్టగా.. ఫహీమ్ అష్రాఫ్ 2, రయీస్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన ఇస్లామాబాద్.. 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కొలిన్ మున్రో.. 29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేయగా.. ఆజమ్ ఖాన్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (31 బంతుల్లో 39 నాటౌట్; 6 ఫోర్లు) హ్యాట్రిక్ బౌండరీలు బాది ఇస్లామాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. గ్లాడియేటర్స్ బౌలర్లలో ఉమైద్ ఆసిఫ్ 3, మహ్మద్ నవాజ్ 2, నసీం షా, నవీన్ ఉల్ హక్, ఇఫ్తికార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. లీగ్‌లో ఇవాళ జరిగే మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్.. కరాచీ కింగ్స్‌తో తలపడనుంది. -
ఫేర్వెల్ ఫంక్షన్లో బిజీబిజీగా సానియా.. భర్త షోయబ్ మాలిక్ ఎక్కడ..?
Sania Mirza-Shoaib Malik: భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఇటీవలే ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న (మార్చి 5) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫేర్వెల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల్లో పాల్గొన్న సానియా.. చివరిసారిగా రాకెట్ పట్టుకుని అందరినీ అలరించింది. ఫేర్వెల్ మ్యాచ్‌ల్లో భాగంగా జరిగిన సింగిల్స్ పోటీలో రోహన్ బోపన్నతో తలపడిన సానియా.. ఆ తర్వాత జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో బోపన్నతో జతకట్టి.. ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీని ఢీకొట్టింది. నామమాత్రంగా జరిగిన ఈ రెండు మ్యాచ్‌ల్లో సానియానే విజయం సాధించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన తెలంగాణ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్, హీరో దుల్కర్ సల్మాన్, భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తదితరులు సానియాపై పొగడ్తల వర్షం కురిపించారు. ఫేర్వెల్ మ్యాచ్‌ల అనంతరం ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన రెడ్ ప్రత్యేక కార్పెట్ ఈవెంట్లో పాల్గొన్న సానియా.. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులతో కలిసి సందడి చేసింది. ఈ కార్యక్రమంలో ఏఆర్ రెహ్మాన్, ప్రిన్స్ మహేశ్ బాబు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. Wasim Akram and Shoaib Malik in an intense discussion after the match 🧐 What could they be discussing? 🤔#IUvKKpic.twitter.com/HHumHfhUnt — Cricket Pakistan (@cricketpakcompk) March 3, 2023 కాగా, సానియా గౌరవార్ధం నిన్న జరిగిన కార్యక్రమాల్లో ఆమె భర్త షోయబ్ మాలిక్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్నటి నుంచి నెటిజన్లు షోయబ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో జనాలకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. ప్రస్తుతం షోయబ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. షోయబ్‌కు సంబంధించిన ఓ వీడియో సానియా ఫేర్వెల్ ఈవెంట్‌కు కొద్ది రోజుల కిందట నెట్టింట చక్కర్లు కొట్టింది. పీఎస్ఎల్లో కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించే షోయబ్.. ఆ ఫ్రాంచైజీ మెంటార్, పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్‌తో వాదన తరహా డిస్కషన్‌కు దిగినట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. భార్య సానియా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో షోయబ్ పాల్గొనకపోవడంతో ఈ వీడియో మరోసారి నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది. సానియా-షోయబ్ జంట విడాకులు తీసుకున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఇరువురు మీకు మీరే మాకు మేమే అన్న రీతిలో వ్యవహరించడంతో వీరి మధ్య అంతా అయిపోయిందని, విడాకులే బాకీ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. -
సామ్ బిల్లింగ్స్ మెరుపు అర్ధశతకం.. రషీద్ ఖాన్ మయాజాలం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023లో భాగంగా ముల్తాన్ సుల్తాన్స్‌తో నిన్న (మార్చి 4) జరిగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ సామ్ బిల్లింగ్స్ (35 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీతో చెలరేగగా.. షఫీక్ (35 బంతుల్లో 48; 6 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించాడు. ఫకర్ జమాన్ (0), తలాత్ (9), రషీద్ ఖాన్ (0), షాహీన్ అఫ్రిది (9), హరీస్ రౌఫ్ (0) విఫలం కాగా.. మీర్జా బేగ్ (17), సికందర్ రజా (14), డేవిడ్ వీస్ (15 నాటౌట్) రెండంకెల స్కోర్ చేశారు. సుల్తాన్స్ బౌలర్లలో అన్వర్ అలీ, ఇహసానుల్లా, అబ్బాస్ అఫ్రిది, పోలార్డ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. సమీన్ గుల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సుల్తాన్స్ బౌలర్లు 14 ఎక్స్ట్రా పరుగులు ఇచ్చారు. ఇందులో 11 వైడ్ బాల్స్ ఉండటం విశేషం. అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సుల్తాన్స్.. నిర్ణీత ఓవర్లు పూర్తియ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఖలందర్స్ బౌలర్ రషీద్ ఖాన్ (4-0-15-3) తన స్పిన్ మాయాజాలంతో సుల్తాన్స్‌ను భారీ దెబ్బకొట్టగా.. జమాన్ ఖాన్ (1/23), హరీస్ రౌఫ్ (1/30), సికందర్ రజా (1/10), హుసేన్ తలాత్ (1/22) తలో వికెట్ పడగొట్టారు. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో కీరన్ పోలార్డ్ (28 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించినా ప్రయోజనం లేకుండా పోయింది. మహ్మద్ రిజ్వాన్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో సీజన్ ఆరంభంలో వరుసగా విజయాలు సాధించిన సుల్తాన్స్.. రిజ్వాన్ ఒక్కసారిగా లయ తప్పడంతో పరాజయాల బాటపట్టింది. లీగ్‌లో ఇవాళ (మార్చి 5) ఇస్లామాబాద్ యునైటెడ్, క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి. -
ఆజాం ఖాన్ విధ్వంసం.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో! పాపం వసీం
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో ఇస్లామాబాద్ యునైటెడ్ నాలుగో విజయం నమోదు చేసింది. శుక్రవారం కరాచీ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆరు వికెట్ల తేడాతో ఇస్లామాబాద్ గెలిపొందింది. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ 4 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. ఇస్లామాబాద్ విజయంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ కీలక పాత్ర పోషించాడు. కేవలం 41 బంతుల్లో 72 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. అతడితో పాటు ఫహీమ్ అష్రఫ్ 41 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లుకోల్పోయి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కరాచీ కింగ్స్ కెప్టెన్ ఇమాడ్ వసీం సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. వసీం 54 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. అయితే వసీం అద్భుత ఇన్నింగ్స్ వృథాగా మిగిలిపోయింది. కాగా సునామీ ఇన్నింగ్స్ ఆడిన ఆజం ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: పరువు తీసుకున్న బంగ్లా; క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రివ్యూ ISLU fans to @MAzamKhan45 #SabSitarayHumaray l #HBLPSL8 I #IUvKK pic.twitter.com/OH93u9uCzR — PakistanSuperLeague (@thePSLt20) March 3, 2023 A͛͛͛Z͛͛͛A͛͛͛M͛͛͛,͛͛͛ ͛͛͛A͛͛͛Z͛͛͛A͛͛͛M͛͛͛!͛͛͛ ͛͛͛ Pindi crowd cannot stop cheering! #SabSitarayHumaray l #HBLPSL8 I #IUvKK pic.twitter.com/wwpVcDUhv3 — PakistanSuperLeague (@thePSLt20) March 3, 2023 -
సికందర్ రజా సునామీ ఇన్నింగ్స్.. వరుసగా నాలుగో విజయం
Pakistan Super League 2023: పాకిస్తాన్ సూపర్‌లీగ్-2023లో లాహోర్ ఖలండర్స్ వరుసగా నాలుగో విజయం సాధించింది. క్వెటా గ్లాడియేటర్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టుకు గెలుపు అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో గురువారం రాత్రి లాహోర్ ఖలండర్స్, క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన క్వెటా గ్లాడియేటర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ సర్ఫరాజ్ నమ్మకాన్ని నిర్ణయానికి సార్థకత చేకూరుస్తూ.. క్వెటా బౌలర్లు అదరగొట్టారు. ఉమైద్ అసీఫ్ లాహోర్ ఓపెనర్లు మీర్జా బేగ్(2), ఫఖర్ జమాన్(రనౌట్)లను తక్కువ స్కోర్లకే పరిమితం చేసి శుభారంభం అందించాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ షఫీక్ 15 పరుగులు చేయగా, వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ (2) పూర్తిగా నిరాశపరిచాడు. ఐదో స్థానంలో వచ్చిన హుసేన్ తలట్ కూడా కేవలం ఆరు పరుగులు చేసి నిష్క్రమించగా.. ఆరోస్థానంలో వచ్చిన కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇలా వరుస వికెట్లు కోల్పయి జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ సికందర్ రజా తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. 34 బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి లాహోర్ 148 పరుగుల మెరుగైన స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. క్వెటా బౌలర్లలో నసీం షా, ఓడియన్ స్మిత్, ఉమైద్ అసీఫ్ ఒక్కో వికెట్ తీయగా.. నవీన్ ఉల్ హక్, మహ్మద్ నవాజ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెటా గ్లాడియేటర్స్‌ను లాహోర్ బౌలర్లు హారిస్ రవూఫ్(3 వికెట్లు), రషీద్ ఖాన్(2 వికెట్లు) దెబ్బ కొట్టారు. వీరికి తోడు డేవిడ్ వీస్ ఒక వికెట్‌తో రాణించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన క్వెటా గ్లాడియేటర్స్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పటి వరకు ఒకే ఒక్క గెలుపు నమోదు చేసిన క్వెటా గ్లాడియేటర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. చదవండి: Ind Vs Aus 3rd Test: ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. రోహిత్ సేనపై 9 వికెట్ల తేడాతో విజయం IND vs AUS: ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే! వీడియో వైరల్ View this post on Instagram A post shared by Pakistan Super League (@thepsl) -
రోవమన్ పావెల్ ఊచకోత.. బాబర్ సేన ఘన విజయం
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో భాగంగా కరాచీ కింగ్స్‌తో నిన్న (మార్చి 1) జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీ జట్టు 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ టీమ్.. కోహ్లెర్ కాడ్మోర్ (45 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), హసీబుల్లా ఖాన్ (29 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రోవమన్ పావెల్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. కరాచీ బౌలర్లలో మహ్మద్ అమీర్ (4-0-26-4) నిప్పులు చెరగగా.. షంషి (1/25), ఆమెర్ యామిన్ (4-1-38-0) పర్వాలేదనిపించారు. అనంతరం198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కరాచీ కింగ్స్.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు మాత్రమే చేసి 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మాథ్యూ వేడ్ (41 బంతుల్లో 53; 9 ఫోర్లు), ఇమాద్ వసీం (30 బంతుల్లో 57 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో రాణించినా తమ జట్టును గెలిపించుకోలేకపోయారు. పెషావర్ బౌలరల్లో అజ్మతుల్లా ఒమర్జాయ్, ఆమెర్ జమాల్ తలో 3 వికెట్లు, ముజీబ్ ఉర్ రెహ్మాన్ 2 వికెట్లు పడగొట్టారు. 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన బాబర్ ఆజమ్ సేనను మెరుపు అర్ధశతకంతో గట్టెక్కించిన రోవమన్ పావెల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. లీగ్‌లో ఇవాళ (మార్చి 2) లాహోర్ ఖలందర్స్-క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి. 17 మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి లాహోర్ ఖలందర్స్ (5 మ్యాచ్‌ల్లో 4 విజయలతో 8 పాయింట్లు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. ముల్తాన్ సుల్తాన్స్, ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో నిలిచాయి. -
ఆట తక్కువ.. డ్రామాలెక్కువ
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) ఎనిమిదో సీజన్లో ఆట కన్నా డ్రామాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రత్యర్థి ఆటగాళ్లను తమ మాటలతో కవ్వించడం.. లేదంటే గొడవపడడం ఇవే హైలైట్ అవుతున్నాయి. తాజాగా ఆదివారం పీఎస్ఎల్లో డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరిగాయి. ముల్తాన్ సుల్తాన్స్, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ సందర్భంగా కరాచీ కింగ్స్ కెప్టెన్ ఇమాద్ వసీమ్ బూతులు మాట్లాడడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. విషయంలోకి వెళితే.. ముల్తాన్ సుల్తాన్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో అన్వర్ అలీ ఔటయ్యాడు. ఆ తర్వాత యంగ్ పేసర్ ఇషానుల్లా క్రీజులోకి వచ్చాడు. ఈ సందర్భంగా బౌలింగ్ వేస్తున్న అకిఫ్ జావేద్‌తో ఇషానుల్లాను ఉద్దేశించి ఇమాద్ వసీమ్.. 'వాడికి ఫుల్ డెలివరీలు వేయకు.. బౌన్సర్లు మాత్రమే సంధించు'(“Don’t bowl full delivery to this ****only bowl bouncers”) అంటూ అసభ్యకరమైన పదం వాడాడు. ఇది స్టంప్ మైక్‌లో రికార్డయింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు పీఎస్ఎల్లో ఆట తక్కువ.. డ్రామాలెక్కువ అనేలా తయారైందంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. తయాబ్ తాహిర్ 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మాథ్యూ వేడ్ 46, జేమ్స్ విన్స్ 27 పరుగులు చేశారు. అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్స్ 101 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్ రిజ్వాన్ 29 పరుగులు చేశాడు. కరాచీ కింగ్స్ బౌలర్లలో షోయబ్ మాలిక్, తబ్రెయిజ్ షంసీలు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ఇమాద్ వసీమ్, అకిఫ్ జావెద్‌లు తలా రెండు వికెట్లు తీశారు. Imad when Ihsanullah walked on https://t.co/o6IsjZYa3N pic.twitter.com/ka6B6AVbvL — Ali (@stuckon70) February 26, 2023 చదవండి: ముచ్చటగా మూడో టెస్టు.. ఎన్ని రోజుల్లో ముగుస్తుందో? ఓటమి నేర్పిన పాఠం.. ప్రతీసారి 'బజ్‌బాల్' పనికిరాదు -
సూర్య కాదు.. అతడే నాకు స్ఫూర్తి! నిజమే.. నీకు ‘స్కై’తో పోలికేంటి?
Pakistan Super League, 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఇటీవల వార్తల్లో నిలిచాడు వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్. ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. క్వెటా గ్లాడియేటర్స్‌తో మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించాడు. 24 ఏళ్ల ఈ రైట్ హ్యాండర్.. 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 97 పరుగులు సాధించాడు. తన తండ్రి మొయిన్ ఖాన్ హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న గ్లాడియేటర్స్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేలా ఎదురైన ఘోర పరాభవానికి కారణమయ్యాడు. ఫిబ్రవరి 24 నాటి మ్యాచ్‌లో ఇస్లామాబాద్ 220 పరుగుల భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తుపాన్ ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు ఆజం ఖాన్. ఈ క్రమంలో అతడిని టీమిండియాస్టార్, టీ20 వరల్డ్ నంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో పోలుస్తూ ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో సూర్యతో పోలికపై ఆజం ఖాన్ మాత్రం భిన్నంగా స్పందించాడు. తనకు ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ ఆదర్శమని, అతడి ఆట తీరుతో స్ఫూర్తిపొందానని చెప్పుకొచ్చాడు. సూర్య కాదు.. టిమ్ డేవిడ్.. ఎందుకంటే ఇందుకు గల కారణం వెల్లడిస్తూ.. ‘‘బ్యాటింగ్ ఆర్డర్లో నా స్థానం ఏమిటో చెప్పాల్సిన పనిలేదు. 40కి నాలుగు వికెట్లు పడిన సందర్భాల్లో బ్యాటింగ్‌కు వెళ్లి మ్యాచ్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ విషయంలో నేను టిమ్ డేవిడ్‌ను చూసి చాలా నేర్చుకుంటున్నా. అతడు భారీ షాట్లు ఆడతాడు. తన పాత్రను చక్కగా పోషిస్తాడు. జట్టుకు ఏం కావాలో అదే చేస్తాడు. నేను కూడా తనలాగే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాను కదా! అయితే, సూర్యకుమార్ మాత్రం ఎక్కువగా వన్‌డౌన్‌లో వస్తాడు. టాపార్డర్‌లో ఆడటానికి నా బ్యాటింగ్ పొజిషన్‌కు తేడా ఉంటుంది కదా!’’ అని ఆజం ఖాన్ పాక్‌టీవీతో పేర్కొన్నాడు. నిజమే నీకు సూర్యతో పోలికేంటి? ఇక ఆజం ఖాన్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘నిజం చెప్పావు ఆజం ఖాన్! అయినా.. సూర్యతో నీకు పోలికేంటి? ఒక్క ఇన్నింగ్స్‌తో అందరూ చాలా ఊహించేసుకుంటున్నారు. సూర్య నంబర్ 1గా ఎదగడానికి ఎంతలా కష్టపడ్డాడో.. ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడో అతడి ఆట తీరు గమనిస్తే మీకు తెలుస్తుంది’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆజం ఖాన్ 2021లో ఇంగ్లండ్‌తో టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు మొత్తంగా 3 టీ20లు ఆడి కేవలం ఆరు పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 5. అయితే, పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో మాత్రం రాణిస్తున్నాడు. చదవండి: NZ Vs Eng: మరీ ఇలా కూడా అవుట్ అవుతారా? వాళ్లు అంతలా కష్టపడితే.. నీకేమో ఇంత బద్ధకమా? Shaheen Afridi: తొలి బంతికి బ్యాట్ రెండు ముక్కలైంది.. రెండో బంతికి వికెట్ ఎగిరిపడింది Asif aur Azam ka kamaal 🪄 Just stand and admire. #SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/6zrlpJpM7Z — PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023 -
ఇదెక్కడి బాదుడు రా బాబు.. 34 బౌండరీలు, 28 సిక్సర్లు..!
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. దాదాపు ప్రతి మ్యాచ్‌లో బ్యాటర్లు.. బౌలర్లను చీల్చిచండాతూ భారీ స్కోర్లు చేస్తున్నారు. లీగ్‌లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 26) లాహోర్ ఖలందర్స్-పెషావర్ జల్మీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు మరోసారి శివాలెత్తడంతో పరుగుల వరద పారింది. ఇరు జట్లకు చెందిన బ్యాటర్లు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్‌కు వేదిక అయిన గడాఫీ స్టేడియంను హోరెత్తించారు. బ్యాటర్ల విధ్వంసం ధాటికి ఈ మ్యాచ్‌లో ఏకంగా 34 బౌండరీలు, 28 సిక్సర్లు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్.. ఫకర్ జమాన్ (45 బంతుల్లో 96; 3 ఫోర్లు, 10 సిక్సర్లు), షఫీక్ (41 బంతుల్లో 75; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), సామ్ బిల్లింగ్స్ (23 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంకర ఇన్నింగ్స్‌ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పెషావర్ జల్మీ కూడా ఏమాత్రం తగ్గకుండా విజృంభించి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదినప్పటికీ టార్గెట్ కొండంతలా ఉండటంతో 40 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పెషావర్ బ్యాటర్లు సైమ్ అయూబ్ (34 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), భానుక రాజపక్ష (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), రోవమన్ పావెల్ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్), జేమ్స్ నీషమ్ (8 బంతుల్లో 12; సిక్స్), సాద్ మసూద్ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పెషావర్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేయగలిగింది. షాహీన్ అఫ్రిది (5/40) పెషావర్ పతనాన్ని శాసించగా.. జమాన్ ఖాన్ 2, హరీస్ రౌఫ్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. లీగ్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 27) లాహోర్ ఖలందర్స్-ఇస్లామాబాద్ యునైటెడ్ జట్లు తలపడనున్నాయి. -
షంషి, షోయబ్ మాలిక్ మాయాజాలం.. రిజ్వాన్ జట్టుకు ఊహించని షాక్
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో మహ్మద్ రిజ్వాన్ సారథ్యంలోని ముల్తాన్ సుల్తాన్స్‌కు రెండో ఓటమి ఎదురైంది. ప్రస్తుత సీజన్లో తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన సుల్తాన్స్ ఆ తర్వాత వరుసగా 4 విజయాలు సాధించి, ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన 6వ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ప్రస్తుత సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న రిజ్వాన్.. ఈ మ్యాచ్‌లో విఫలం కావడంతో సుల్తాన్స్ ఓటమిపాలైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా 75, 28 నాటౌట్, 66, 50, 110 నాటౌట్, 29 స్కోర్లు చేసిన రిజ్వాన్.. ఈ ఒక్క మ్యాచ్‌లోనే నిరుత్సాహపరిచాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్.. మాథ్యూ వేడ్ (46), జేమ్స్ విన్స్ (27), తయ్యబ్ తాహిర్ (65) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా, ఛేదనలో సుల్తాన్స్ 101 పరుగులకే చాపచుట్టేయడంతో ఓటమిపాలైంది. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో షాన్ మసూద్ (25), మహ్మద్ రిజ్వాన్ (29), అన్వర్ అలీ (12), ఉసామా అలీ (10) మినహా మిగతవారు కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. తబ్రేజ్ షంషి (3/18), షోయబ్ మాలిక్ (3/18), అకీఫ్ జావిద్ (2/8), ఇమాద్ వసీం (2/34) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు సుల్తాన్స్‌ను కట్టడి చేయడంలోనూ సఫలమయ్యారు. అంతకుముందు ముల్తాన్స్ బౌలర్లు ఇహసానుల్లా 2 వికెట్లు, అన్వర్ అలీ ఓ వికెట్ పడగొట్టారు. పీఎస్ఎల్లో ఇవాళ రాత్రి లాహోర్ ఖలందర్స్-పెషావర్ జల్మీ తలపడనున్నాయి. -
ఇదేమి ఖర్మరా బాబు.. క్రికెట్ స్టేడియంలో కెమరాలు చోరీ! పాక్‌లో అంతే?
ప్రస్తుతం జరుగున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ మరోసారి భద్రతా లోపం బయటపడింది. ఈ ఏడాది ఈ లీగ్‌కు కరాచీ, ముల్తాన్, రావల్పిండి, లాహోర్ అతిథ్యం ఇస్తున్నాయి. అయితే ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు రావల్పిండి, లాహోర్‌లో ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. ఫిబ్రవరి 26(ఆదివారం) లాహోర్ క్యాలండెర్స్, పెషావర్ జల్మీ మ్యాచ్‌తో లాహోర్ లెగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ భద్రత కోసం లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎనిమిది సెక్యూరిటీ కెమెరాలు చోరికి గురయ్యాయి. సెక్యూరిటీ కెమెరాలతో పాటు జనరేటర్ బ్యాటరీలు, ఫైబర్ కేబుల్స్ కూడా ఎత్తుకుపోయినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. చోరీకి గురైన వస్తువులన్నీ దాదాపు కోటి రూపాయలు విలువ చేస్తాయని పాకిస్తాన్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా ఇందుకు సంబంధించి గుల్బర్గ్ పోలీస్ స్టేషన్లో రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా గడ్డాఫీ స్టేడియంలోనే క్వాలిఫియర్, ఎలిమినేటర్‌తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది. ఈ క్రమంలో మరో సారి భద్రతా వైఫల్యం తలెత్తడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్‌ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. చదవండి: IND vs AUS: 'ఆసీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే.. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ టీమిండియాదే' -
ఇక్కడ ఆడాల్సిన అవసరం వాళ్లకేంటి? బీసీసీఐని చూసి బుద్ధి తెచ్చుకోండి: పాక్ మాజీ ప్లేయర్
BCCI- Indian Premier League: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచంలోని పొట్టి ఫార్మాట్ లీగ్‌లన్నింటిలోకి క్యాష్ రిచ్ లీగ్ అనడంలో సందేహం లేదు. యువ ఆటగాళ్లు ఒక్కసారి ఈ వేదికపై ప్రతిభ నిరూపించుకుంటే చాలు కోటీశ్వరుల జాబితాలో చేరిపోతారు. జాతీయ జట్టులో అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఇక వెటరన్ ప్లేయర్లు సైతం ఇక్కడ తమను తాము నిరూపించుకుంటే మరికొంత కాలం కెరీర్ పొడిగించుకోగలుగుతారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే.. స్టార్ క్రికెటర్లపై కాసుల వర్షం కురుస్తుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలోని ఐపీఎల్ ద్వారా ఇప్పటికే ఎంతో స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు కెరీర్ పరంగా, ఆర్థికంగా నిలదొక్కుకున్న దాఖలాలు కోకొల్లలు. అయితే, అంతబాగానే ఉన్నా బీసీసీఐ తమ క్రికెటర్లను మాత్రం విదేశీ టీ20 లీగ్‌లలో ఆడేందుకు అనుమతి ఇవ్వదన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో బీసీసీఐని సమర్థిస్తూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ బోర్డు సరైన పనిచేస్తోందని ప్రశంసించాడు. కాగా పాక్‌లో ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎనిమిదో సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడిన అక్మల్‌కు.. టీమిండియా క్రికెటర్లు పీఎస్ఎల్ ఆడటానికి అనుమతి లభిస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్న ఎదురైంది. కమ్రాన్ అక్మల్ వాళ్లకేం అవసరం? ఇందుకు స్పందిస్తూ.. ‘‘భారత క్రికెటర్లు పీఎస్ఎల్లో అస్సలు ఆడకూడదు. విదేశీ లీగ్‌లలో తమ ప్లేయర్లను ఆడించే విషయంలో ఇండియన్ బోర్డు సరైన దిశలో పయనిస్తోంది. ఐపీఎల్ దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత వరుస అంతర్జాతీయ సిరీస్‌లు ఉంటాయి. నిజానికి ఐపీఎల్ ద్వారా ఆర్థికంగా వాళ్లు కావాల్సిన మేర పరిపుష్టం అవుతారు. పీసీబీ బీసీసీఐని చూసి నేర్చుకోవాలి అలాంటపుడు విదేశీ లీగ్‌లలో ఆడాల్సిన అవసరం వాళ్లకేం ఉంటుంది? నిజానికి మన బోర్డు(పీసీబీ) కూడా బీసీసీఐని చూసి నేర్చుకోవాల్సి చాలా ఉంది. ఆటగాళ్ల కెరీర్‌ను పొడిగించుకునేందుకు వాళ్లు పాటిస్తున్న విధానాలు గమనించాలి. అక్కడ వంద టెస్టులాడిన వాళ్లు దాదాపు 14- 15 మంది ప్లేయర్లు ఉన్నారు. కానీ ఇక్కడ ఒకరో.. ఇద్దరో ఉంటారు. ఇండియాలో వాళ్లు క్రికెట్‌కు, క్రికెటర్లకు విలువనిస్తారు. ఐపీఎల్ ద్వారా ఆటగాళ్లకు భారీ మొత్తంలో చెల్లిస్తారు. నిజానికి ఐపీఎల్ ముందు బీబీఎల్(బిగ్‌బాష్ లీగ్) దిగదిడుపే. ప్రపంచంలో ఏ లీగ్ కూడా ఐపీఎల్‌కు సాటిరాదు’’ అని మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ పేర్కొన్నాడు. బీసీసీఐని చూసైనా పీసీబీ బుద్ధి తెచ్చుకోవాలని వ్యాఖ్యానించాడు. చదవండి: Virat Kohli: అత్యాశ లేదు! బాధపడే రకం కాదు.. ఆయనకు ఫోన్ చేస్తే 99 శాతం లిఫ్ట్ చేయడు.. అలాంటిది.. BGT 2023: ‘టమ్ టమ్’ పాటకు టీమిండియా క్రికెటర్ స్టెప్పులు.. వీడియో వైరల్ -
గుజరాత్ టైటాన్స్‌కు ఊహించని షాక్.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం!
ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌కు బిగ్‌షాక్ తగిలింది. ఐర్లాండ్ పేసర్ జోష్ లిటిల్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. గతేడాది డిసెంబర్లో కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ మినీవేలంలో లిటిల్ను రూ.4.4 కోట్ల భారీ ధరకు గుజరాత్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న లిటిల్ మోకాలి గాయం బారిన పడ్డాడు. ఈ క్రమంలో అతడు పీఎస్ఎల్ మొత్తానికి దూరమయ్యాడు. అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌తో పాటు ఐపీఎల్లో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. కాగా గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2022లో లిటిల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో లిటిల్ కూడా రాణించాడు. చదవండి: ENG vs NZ: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్ -
కోహ్లి కంటే బాబర్ చాలా బెటర్..! డేవిడ్ మిల్లర్ సంచలన వాఖ్యలు
ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అత్యుత్తమ క్రికెటర్ల అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎవరికి వారే సాటి. అయితే కొంత మంది కోహ్లి కంటే బాబర్ అద్భుతమైన ఆటగాడని.. మరి కొంత మంది కోహ్లితో బాబర్‌కు పోలిక అంటూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక తాజాగా ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌కు కోహ్లి, బాబర్ సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. కవర్‌డ్రైవ్ షాట్ విషయంలో బాబర్, కోహ్లిలో ఎవరు బెస్ట్ అన్న ప్రశ్న మిల్లర్‌కు ఎదురైంది. దానికి బదులుగా మిల్లర్ ఏమీ ఆలోచించకుండా బాబర్ బెటర్ అంటూ సమాధానం ఇచ్చాడు. అంతే కాకుండా బాబర్ ఆజం కవర్ డ్రైవ్ షాట్స్ అంటే తనకు చాలా ఇష్టం అంటూ మిల్లర్ పేర్కొన్నాడు. ఇక కోహ్లి బెటర్ కాదుంటూ మిల్లర్ చేసిన వాఖ్యలపై కింగ్ అభిమానులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మిల్లర్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్నంత మాత్రాన బాబర్‌కు సపోర్ట్ చేస్తావా అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా మిల్లర్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ మూల్తాన్ సుల్తాన్స్‌కు మిల్లర్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: ENG vs NZ: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్