రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 సీజన్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఈ ఏడాది పీఎస్‌ఎల్ ఛాంపియన్స్‌గా ఇస్లామాబాద్ యునైటడ్ నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో ముల్తాన్ సూల్తాన్స్‌ను 2 వికెట్ల తేడాతో ఓడించిన ఇస్లామాబాద్.. మూడో సారి ఛాంపియన్స్‌గా అవతరించింది.
ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది సీజన్‌లో పెషెవర్ జెల్మీ టైటిల్ సాధించకపోయినప్పటికి ఆ జట్టు కెప్టెన్, పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం మాత్రం అరుదైన ఘనతను సాధించాడు.
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మూడు సార్లు హనీఫ్ మొహమ్మద్ క్యాప్ సొంతం చేసుకున్న మొదటి క్రికెటర్‌గా బాబర్ రికార్డులకెక్కాడు. పీఎస్‌ఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి హనీఫ్ మొహమ్మద్ క్యాప్(గ్రీన్ క్యాప్)ను అందిస్తారు.
ఇప్పుడు వరకు మూడు పీఎస్‌ఎల్ సీజన్లలో లీడింగ్ రన్ స్కోరర్‌గా బాబర్ నిలిచాడు. 2020 సీజన్‌లో 473 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన బాబర్.. ఆ తర్వాత 2021 సీజన్‌లోనూ 554 పరుగులతో గ్రీన్ క్యాప్‌ను తన వద్దే ఉంచుకున్నాడు. ఇప్పుడు పీఎస్‌ఎల్-2024లోనూ 569 పరుగులతో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. 11 మ్యాచ్‌ల్లో 569 పరుగులు చేశాడు. అందులో 5 ఫిప్టీలతో పాటు ఓ సెంచరీ కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment