న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే పీఎస్‌ఎల్ జరుగుతున్న సమయంలోనే ఒక మ్యాచ్ లైవ్‌లో బాబర్ ఆజంపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాక్ క్రికెట్ అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సైమన్ డౌల్ బయటికి వస్తే తమ చేతిలో దెబ్బలు తినడం ఖాయమని బెదిరించారు.
దీంతో పీఎస్‌ఎల్ నిర్వాహకులు టోర్నీ ముగిసేవరకు సైమన్ డౌల్‌ను బయటకు వెళ్లడానికి అనుమతించలేదు. మ్యాచ్‌లు లేనప్పుడు హోటల్ రూంకే పరిమితమైన సైమన్ డౌల్ పీఎస్‌ఎల్ కోసం పాకిస్తాన్‌లో ఉన్నప్పుడు జైళ్లో ఉన్నట్లుగా అనిపించిందని పేర్కొన్నాడు.
"పాకిస్థాన్ లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నట్లే అనిపించింది. బాబర్ ఆజం అభిమానులు నన్ను టార్గెట్ చేయడంతో నన్ను కనీసం బయటకు వెళ్లడానికీ అనుమతించలేదు. చాలా రోజుల పాటు కనీసం తిండి కూడా తినకుండా పాకిస్థాన్ లో ఉన్నాను. నన్ను మానసికంగా హింసించారు. దేవుని దయ వల్ల ఎలాగోలా పాకిస్థాన్ నుంచి బయటపడ్డాను" అని సైమన్ డౌల్ పేర్కొన్నాడు.
బాబర్ ఆజం స్ట్రైక్ రేట్ ను ఉద్దేశించి డౌల్ గతంలో వివాదాస్పద కామెంట్స్ చేశాడు. అతడు కేవలం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతాడని విమర్శించాడు. ఈమధ్యే విరాట్ కోహ్లిని కూడా డౌల్ ఇలాగే విమర్శించాడు. ఐపీఎల్లో అతని స్ట్రైక్ రేట్ సరిగా లేదని, విరాట్ కూడా కేవలం రికార్డుల కోసమే ఆడతాడని డౌల్ అన్నాడు. ఈ కామెంట్స్ పై కూడా ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment