IPL 2023
-
ఐపీఎల్ మ్యాచ్ స్ట్రీమింగ్ వివాదం... చిక్కుల్లో తమన్నా!
మిల్కీ బ్యూటీ తమన్నా చిక్కుల్లో పడింది. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ‘ఫెయిర్ ప్లే’ యాప్‌లో స్ట్రీమింగ్ చేసినందుకుగాను మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ‘పెయిర్ ప్లే’ యాప్‌లో స్ట్రీమింగ్ చేయడం కారణంగా తమకు రూ. కోట్లలో నష్టం జరిగిందని ప్రసార హక్కులను సొంతం చేసుకున్న ‘వయాకామ్’ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే ఈ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను చూడాలంటూ తమన్నా, సంజయ్ దత్తో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు, గాయకులు ప్రచారం చేశారు. ఇదే కేసులో ఈ మధ్యే సంజయ్ దదత్‌కి కూడా సమన్లు జారీ అయ్యాయి. ఆయన ఈ ఏప్రిల్ 23న విచారణకు రావాల్సి ఉండగా.. గైర్హాజరయ్యారు. ప్రస్తుతం తాను ముంబైలో లేనని.. వాంగ్మూలం ఇచ్చేందుకు మరో తేది కేటాయించాలని పోలీసులను కోరారు. ఈ కేసు విచారణలో భాగంగానే తాజాగా తమన్నాకు నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఫెయిర్ ప్లే యాప్‌పై గతంలోనూ మనీలాండరింగ్ కేసు నమోదైంది. ఈ యాప్ మహదేవ్ ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్‌కు అనుబంధ సంస్థ. ఆన్లైన్ బెట్టింగ్ ముసుగులో మనీలాండరింగ్‌కి పాల్పడినట్లు ఈడీ గుర్తించి సదరు సంస్థపై కేసు నమోదు చేసింది. ఈ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి అధికారికంగా ఎలాంటి బ్రాడ్ కాస్టింగ్ హక్కులు లేవు. అయినప్పటకిఈ గతేడాది నిబంధనలకు విరుద్దంగా కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లను స్ట్రీమింగ్ చేశారు. వాటిని చూడలంటూ తమన్నా.. సంజయ్ దత్, జాక్వెలిన్ ఫెర్నాండెస్ లాంటి అగ్రతారలు ప్రచారం చేశారు. ఫలితంగా వయాకామ్‌కు రూ.కోట్లల్లో నష్టం రావడంతో ఆ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. -
IPL 2023: నేనొక ఇడియట్.. సెంచరీ తర్వాత అలా మాట్లాడినందుకు: బ్రూక్
IPL 2023- SRH- Harry Brook: భారత క్రికెట్ అభిమానుల గురించి తాను అలా మాట్లాడకపోవాల్సిందంటూ ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2023లో సెంచరీ చేసిన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యల వల్ల మనశ్శాంతి లేకుండా పోయిందని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ఏదేమైనా సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉన్న తర్వాతే తన మానసిక స్థితి మెరుగుపడిందని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2022 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ 13.25 కోట్ల రూపాయాల భారీ మొత్తానికి హ్యారీ బ్రూక్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, 24 ఏళ్ల ఈ మిడిలార్డర్ బ్యాటర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. నోళ్లు మూయించానంటూ ఘాటు వ్యాఖ్యలు వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు. సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో శతకం బాదిన తర్వాత.. తనను ట్రోల్ చేసిన వాళ్ల నోళ్లు మూయించాను అంటూ బ్రూక్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పశ్చాత్తాపంతో ఈ విషయం గురించి తాజాగా బీబీసీ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్న హ్యారీ బ్రూక్.. ‘‘అప్పుడు నేను ఓ ఇడియట్‌లా ప్రవర్తించాను. ఇంటర్వ్యూలో అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది. ఆ తర్వాత దాని గురించి పశ్చాత్తాపపడ్డాను. హోటల్ గదిలో కూర్చుని సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేయగానే.. చూడకూడని కామెంట్లు ఎన్నో చూశాను. అప్పటి నుంచి నెట్టింటికి కొంతకాలం పాటు దూరం కావాలని నిర్ణయించుకున్నాను. భారీ మొత్తానికి న్యాయం చేయలేక నెగిటివిటీ గురించి పట్టించుకోకుండా.. కేవలం ఆట మీదే దృష్టిసారించాను. తద్వారా నా మానసిక ఆరోగ్యం మరింత మెరుగైంది’’ అని తెలిపాడు. కాగా ఐపీఎల్-2023 కోసం సన్‌రైజర్స్ తనపై వెచ్చించిన భారీ మొత్తానికి హ్యారీ బ్రూక్ న్యాయం చేయలేకపోయాడు. ఆడిన 11 ఇన్నింగ్స్‌లో కేవలం 190 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్-2024 వేలానికి ముందు బ్రూక్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం అతడు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. విండీస్‌తో తొలి మ్యాచ్‌లో అతడు 71 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విండీస్ చేతిలో ఓటమిపాలైంది. చదవండి: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్.. సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! -
2023 అంతా 'శుభ్'మయం.. రికార్డులు కొల్లగొడుతున్న టీమిండియా యంగ్ డైనమైట్
అంతర్జాతీయ క్రికెట్లో 2023 సంవత్సరమంతా 'శుభ్'మయంగా మారింది. ఈ ఏడాది ఈ టీమిండియా యంగ్ డైనమైట్ ఫార్మాట్లకతీతంగా చెలరేగుతూ, సెంచరీల మీద సెంచరీలు చేస్తూ, పరుగుల వరద పారిస్తూ రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఆసీస్‌తో ఇవాళ (సెప్టెంబర్ 24) జరుగుతున్న రెండో వన్డేలో శతక్కొట్టిన గిల్ (97 బంతుల్లో 104; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) వన్డేల్లో ఆరో సెంచరీని, ఈ ఏడాది ఐదో వన్డే శతకాన్ని, ఓవరాల్‌గా (అన్ని ఫార్మాట్లలో) ఈ ఏడాది ఏడో శతకాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో గిల్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో 5 అంతకంటే ఎక్కువ వన్డే సెంచరీలు చేసిన ఏడో భారత ఆటగాడిగా.. 25 ఏళ్లలోపే ఈ ఘనత సాధించిన ఐదో ప్లేయర్‌గా.. భారత్ తరఫున వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ రికార్డులతో పాటు గిల్ ఈ ఏడాది దాదాపు అన్ని విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచాడు. అవేంటంటే.. వన్డే కెరీర్లో మొత్తంగా 35 మ్యాచ్‌లు ఆడి 66.10 సగటున 6 సెంచరీలు, 9 అర్ధసెంచరీల సాయంతో 1919 పరుగులు చేసిన గిల్.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆడిన 20 మ్యాచ్‌ల్లో 1230 పరుగులు చేసి, వన్డేల్లో ఈ ఏడాది టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 2023లో వన్డేల్లో అత్యధిక సెంచరీలు (5) చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది అత్యధిక అంతర్జాతీయ పరుగులు (అన్ని ఫార్మాట్లలో): 1763 ఈ ఏడాది అత్యధిక సెంచరీలు (అన్ని ఫార్మాట్లలో): 7 ఈ ఏడాది అత్యధిక సిక్సర్లు (అన్ని ఫార్మాట్లలో): 46 ఈ ఏడాది అత్యధిక ఫోర్లు (అన్ని ఫార్మాట్లలో): 186 ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు: 10 ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక బౌండరీలు: 139 ఇలా గిల్ ఈ ఏడాది దాదాపుగా అన్ని విభాగాల్లో టాప్‌లో కొనసాగుతున్నాడు. వన్డే అగ్రపీఠం దిశగా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న గిల్.. ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో విచ్చలవిడిగా పరుగులు చేస్తూ అగ్రపీఠం దిశగా దూసుకుపోతున్నాడు. ఆసీస్‌తో సిరీస్‌కు ముందు 814 రేటింగ్ పాయింట్లు కలిగిన గిల్.. ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న బాబర్ ఆజమ్‌ను దాటేందుకు 44 పాయింట్ల దూరంలో ఉన్నాడు. ఆసీస్‌పై తొలి వన్డేలో 74 పరుగులు, రెండో వన్డేలో 104 పరుగులు చేసిన గిల్.. వన్డే అగ్రస్థానం దక్కించుకునేందుకు కావాల్సిన 44 పాయింట్లను ఈ రెండు ప్రదర్శనలతోనే సాధిస్తాడు. ఈ సిరీస్‌లో మరో మ్యాచ్ కూడా ఉండటంతో గిల్ వన్డే టాప్ ర్యాంక్‌కు చేరడం దాదాపుగా ఖాయమైపోయింది. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ ఇరగదీసిన గిల్.. అంతర్జాతీయ క్రికెట్లోనే కాకుండా ఈ ఏడాది గిల్ ఐపీఎల్‌లోనే సత్తా చాటాడు. 2023 ఐపీఎల్లో 17 మ్యాచ్‌లు ఆడిన గిల్ 59.33 సగటున, 157.80 స్ట్రయిక్‌రేట్‌తో 890 పరుగులు చేసి, ఎడిషన్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఎడిషన్‌లో మొత్తం 3 సెంచరీలు బాదిన గిల్.. అత్యధిక పరుగులతో పాటు అత్యధిక వ్యక్తిగత స్కోర్, అత్యుత్తమ సగటు, అత్యధిక శతకాలు,అత్యధిక ఫోర్లు.. ఇలా పలు విభాగాల్లో టాప్‌లో నిలిచాడు. ఇదిలా ఉంటే, రెండో వన్డేలో టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్ (105) శతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (52) అర్ధసెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్ (31) పర్వాలేదనిపించాడు. రుతురాజ్ (8) ఒక్కడే విఫలమయ్యాడు. ఆసీస్ బౌలర్లలో కెమరూన్ గ్రీన్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 400 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్ (9), స్టీవ్ స్మిత్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. 7 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 43/2గా ఉంది. లబూషేన్ (12), వార్నర్ (19) క్రీజ్‌లో ఉన్నారు. -
నువ్వస్సలు మారొద్దు: గంభీర్ పోస్ట్ వైరల్.. సెటైర్లతో కోహ్లి ఫ్యాన్స్ కౌంటర్
There are very few like you, never change: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌ను విరాట్ కోహ్లి అభిమానులు మరోసారి టార్గెట్ చేశారు. మీ ఎక్స్ట్రాలన్నింటికి ఢిల్లీలో మా కింగ్ బ్యాట్‌తోనే సమాధానమిస్తాడంటూ చురకలు అంటిస్తున్నారు. మీ స్టాండ్ అస్సలు మారొద్దు.. అలాగే ఉండాలి అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఐపీఎల్-2023లో లక్నోలో ఆర్సీబీ- లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి- అఫ్గన్ పేసర్ నవీన్ ఉల్ హక్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ లక్నో బౌలర్‌కు మద్దతుగా ఆ జట్టు మెంటార్ గౌతం గంభీర్ మైదానంలోకి వచ్చాడు. గంభీర్ జోక్యంతో ముదిరిన గొడవ కోహ్లితో గొడవపడుతున్న నవీన్‌ను సమర్థించేలా మాట్లాడటంతో కోహ్లి కూడా అంతే ఘాటుగా బదులిచ్చాడు. దీంతో వివాదం మరింత ముదిరింది. భారత మాజీలు సహా మిగతా క్రికెటర్లు సైతం ఈ విషయంలో గంభీర్‌ను తప్పుబట్టారు. మైదానంలో ఆటగాళ్లు మాటా మాటా అనుకోవడం సహజమేనని.. అంతమాత్రాన కోచ్ స్థాయిలో ఉన్నవాళ్లు ఇలా మధ్యలో దూరిపోకూడదని విమర్శించారు. అయితే, నవీన్ కోహ్లితో గొడవను అక్కడితో ముగించలేదు. మ్యాంగోస్ పోస్టులతో కోహ్లి, కోహ్లి ఫ్యాన్స్ కవ్వించగా.. అదే స్థాయిలో ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాడు. నువ్విలాగే ఉండాలి.. మారొద్దు ఇదిలా ఉంటే.. నవీన్ ఈరోజు(సెప్టెంబరు 23) ఇరవై నాలుగవ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా గంభీర్ సోషల్ మీడియా వేదికగా అతడికి విషెస్ తెలియజేశాడు. ‘‘హ్యాపీ బర్త్‌డే నవీన్.. అతి కొద్ది మంది మాత్రమే నీలా ఉండగలుగుతారు. నువ్విలాగే ఉండాలి. ఎప్పటికీ మారొద్దు’’ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. ఢిల్లీలో టీమిండియాతో మ్యాచ్ ఈ పోస్ట్‌పై కోహ్లి ఫ్యాన్స్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ పైవిధంగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆసియా కప్-2023 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన నవీన్ ఉల్ హక్‌ను అనూహ్యంగా వన్డే వరల్డ్‌కప్-2023కి ఎంపిక చేశారు అఫ్గనిస్తాన్ సెలక్టర్లు. ఈ క్రమంలో అక్టోబరు 11న టీమిండియాతో ఢిల్లీలో అఫ్గనిస్తాన్ జట్టు తలపడనుంది. కోహ్లి హోం గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరుగనుండటంతో నవీన్ బౌలింగ్‌ను చెడుగుడు ఆడేస్తాడంటూ ఫ్యాన్స్ గంభీర్ పోస్టుకు బదులిస్తున్నారు. చదవండి: Ind vs Aus: తప్పు నీదే.. వరల్డ్‌కప్ జట్టు నుంచి తీసేయడం ఖాయం.. జాగ్రత్త! View this post on Instagram A post shared by Gautam Gambhir (@gautamgambhir55) -
ఇంతలో ఎంత మార్పు.. ఐపీఎల్లో పులిలా, దేశానికి ఆడేప్పుడు పిల్లిలా..!
భారత అభిమానులచే భవిష్యత్తు సూపర్ స్టార్‌గా, జూనియర్ విరాట్ కోహ్లిగా, మరో పరుగుల యంత్రంగా కీర్తించబడిన టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, నెలలు తిరగకుండగానే ఏ నోళ్లతో అయితే కీర్తించబడ్డాడో అదే నోళ్లతో దూషించబడుతున్నాడు. ఐపీఎల్ 2023లో ఆకాశమే హద్దుగా చెలరేగి, ఏకంగా 3 సెంచరీలు బాది పరుగుల వరద (17 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 890 పరుగులు) పారించిన గిల్.. అంతర్జాతీయ స్థాయిలో దేశం కోసం ఆడాల్సి వచ్చే సరికి వరుస వైఫల్యాల బాట పట్టి తేలిపోతున్నాడు. ఇదే భారత అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తుంది. దీంతో వారు పట్టలేని కోపంతో గిల్‌పై దూషణల పర్వానికి దిగుతున్నారు. పొగిడిన నోళ్లతోనే దుర్భాషలాడుతున్నారు. ఏమాత్రం ములాజా లేకుండా జట్టు నుండి తీసిపారేయాలని డిమాండ్ చేస్తున్నారు. దేశం తరఫున ఆడేప్పుడు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చకపోతే మహామహులకే తప్పలేదు, ఇతనెంత అంటూ ఘాటైన కామెంట్లు చేస్తున్నారు. గిల్‌ను త్వరలో జరుగనున్న ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్‌లకు కూడా ఎంపిక చేయొద్దని సూచిస్తున్నారు. ఐపీఎల్ ఇచ్చిన సక్సెస్‌తో విర్రవీగుతున్నాడు, కొద్ది రోజులు పక్కకు కూర్చోబెడితే టీమిండియాలో స్థానం విలువ తెలిసొస్తుందని అంటున్నారు. ప్రస్తుతం భారత రిజర్వ బెంచ్ కూడా బలంగా ఉంది, గిల్‌కు ప్రత్యామ్నాయంగా రుతురాజ్‌ను ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. ఐపీఎల్-2023 తర్వాత గిల్ గణాంకాలను చూపిస్తూ సోషల్‌మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు. కాగా, గిల్‌పై అభిమానుల ఆగ్రహానికి నిజంగానే అర్ధం ఉంది. ఐపీఎల్ 2023లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన గిల్.. నాటి నుంచి నిన్న విండీస్‌తో మూడో టీ20 వరకు టీమిండియా తరఫున 11 మ్యాచ్‌లు ఆడి కేవలం 218 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క అర్ధ సెంచరీ ఉంది. ఐపీఎల్ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 31 పరుగులు (13, 18) చేసిన గిల్.. ప్రస్తుత విండీస్ పర్యటనలో తొలి టెస్ట్‌లో 6, రెండో టెస్ట్‌లో 39 పరుగులు (10, 29 నాటౌట్), తొలి వన్డేలో 7, రెండో వన్డేలో 34, మూడో వన్డేలో 85 పరుగులు, తొలి టీ20లో 3, రెండో టీ20లో 7, మూడో టీ20లో 6 పరుగులు చేశాడు. గిల్ చేసిన ఈ స్కోర్లు చూసే పొగిడిన నోళ్లు దూషిస్తున్నాయి. స్టార్ ఆటగాడైన గిల్ వరుసగా ఇన్ని మ్యాచ్‌ల్లో విఫలం కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే అతనిపై భారీ స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. గిల్ సరిగా ఆడకపోవడం టీమిండియాపై ప్రభావం చూపుతుందని, పసికూన విండీస్ చేతిలో వరుస పరాజయాలే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. మొత్తంగా ఐపీఎల్ ఆడినప్పుడు గిల్లో కనిపించిన కసి, దేశం కొరకు ఆడుతున్నప్పుడు కనిపించడం లేదని మండిపడుతున్నారు. -
MS Dhoni: ధోనిని భయ్యా అని పిలవలేం.. అదంతే: టీమిండియా కెప్టెన్ భార్య
India Star Opener Wife On MS Dhoni's 'Aura': మహేంద్ర సింగ్ ధోని అంటేనే ఓ ఎమోషన్. కెప్టెన్ కూల్ పక్కన ఉన్నాడంటే ఆటగాళ్లకు పండుగే! ఆటకు సంబంధించి తగిన సూచనలు ఇవ్వడంతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్లను నవ్వించడం, వాళ్లలో సానుకూల దృక్పథం నింపేలా నడచుకోవడం తలా స్టైల్! టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ భార్య, క్రికెటర్ ఉత్కర్ష పవార్ కూడా ఇదే మాట అంటోంది. నాలుగేళ్లుగా సీఎస్కేకే మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ధోని సారథ్యంలో గత నాలుగేళ్లుగా సీఎస్కేకు ఆడుతున్న అతడు 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023 ముగిసిన తర్వాత రుతు.. తన చిరకాల ప్రేయసి ఉత్కర్షను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. భయ్యా అని పిలవలేం అయితే, అంతకంటే ముందే ఆమెను తనతో పాటు సీఎస్కే క్యాంపునకు తీసుకెళ్లాడు రుతురాజ్. ఈ క్రమంలో సీఎస్కే కెప్టెన్ ధోనిని కలిసిన ఉత్కర్ష.. జట్టు చాంపియన్‌గా అవతరించిన తరుణంలో అతడితో కలిసి ఫొటోలు దిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడిన ఉత్కర్ష.. ధోని వ్యక్తిత్వం, నిరాడంబరత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఎంఎస్ ధోని తన చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉండేలా చేస్తారు. ఆయనను మనం భయ్యా అని పిలవలేము. ఆయనతో మాట్లాడిన తర్వాతే కచ్చితంగా ‘సర్’ అని పిలవడమే సరైందని భావిస్తాం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం ఆయనకే చెల్లింది. కుటుంబ సభ్యుల్లా చూస్తారు అసలు మనం ధోనితోనే ఉన్నామా అనే ఫీలింగ్ కలిగేలా చేస్తారు. తన హాస్యచతురతతో చుట్టూ ఉన్న వాళ్లను నవ్విస్తారు. అందరూ కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చేస్తారు. ఆరంభంలో అడపాదడపా ఆయనను నేరుగా కలిసే అవకాశం వచ్చింది. అయితే, ఫైనల్ తర్వాత ఎక్కువ సమయం కలిసి గడిపే అవకాశం దొరికింది. ఆయన ప్రతి ఒక్కరిని తన సొంత కుటుంబ సభ్యుల్లాగే ప్రేమగా చూస్తారు. నేను, రుతు.. రెండు నెలల పాటు సీఎస్కేతో కలిసి ఉన్న రోజులు సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగించాయి’’ అని ఉత్కర్ష చెప్పుకొచ్చింది. కాగా దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న 24 ఏళ్ల ఉత్కర్ష పేస్ ఆల్‌రౌండర్. ఇక ఐపీఎల్-2023 విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడలు-2023 నేపథ్యంలో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు రుతురాజ్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. చదవండి: WC: సిరాజ్ కూడా ఉండకపోవచ్చు! వాళ్లకు జట్టులో చోటు దక్కినా కూడా.. టీమిండియా క్రికెటర్ సంచలన నిర్ణయం.. -
నువ్వో, నేనో తేల్చుకుందాం.. సీఎస్కే ఆటగాళ్ల మధ్య ఫైట్
ఐపీఎల్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఇద్దరు ఆటగాళ్ల మధ్య సరదా ఫైట్ జరిగింది. జట్టులో స్థానం కోసం ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, దీపక్ చాహర్ మాటల యుద్దానికి దిగారు. తన ఆల్‌టైమ్ బెస్ట్ సీఎస్కే ప్లేయింగ్ ఎలెవెన్‌లో స్థానం కల్పించకపోవడంతో చాహర్.. దూబేకు ఓ ఛాలెంజ్ విసిరాడు. వచ్చే ఏడాది నువ్వు (దూబే), నేను (చాహర్) ఓ సింగిల్ ఓవర్ మ్యాచ్ ఆడదాం. నేను నీకొక ఓవర్ బౌల్ చేస్తాను. నువ్వు నాకు ఒక ఓవర్ బౌల్ చెయ్యి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారిదే సీఎస్కే ఆల్‌టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో స్పాట్ అని చాహర్.. దూబేను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. చాహర్ సరదాగా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతుంది. ఛాంపియన్ జట్టులో స్థానం కోసం ఈ మాత్రం పోటీ ఉండాల్సిందే అని అభిమానులు అంటున్నారు. కాగా, దూబే తన ఆల్‌టైమ్ బెస్ట్ సీఎస్కే జట్టులో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా తనతో పాటు అల్బీ మోర్కెల్, డ్వేన్ బ్రేవోలను ఎంపిక చేసి, ఇదే కేటగిరీకి చెందిన దీపక్ చాహర్‌కు అవకాశం కల్పించలేదు. ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023 ఎడిషన్‌లో శివమ్ దూబే సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో అతను 16 మ్యాచ్‌ల్లో 159.92 స్ట్రయిక్‌రేట్‌తో 3 అర్ధసెంచరీల సాయంతో 411 పరుగులు చేశాడు. దూబే ఈ సీజన్లో ఏకంగా 35 సిక్సర్లు బాది ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. మరోవైపు ఇదే సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన దీపక్ చాహర్ బంతితో ఓ మోస్తరుగా రాణించి 13 వికెట్లు పడగొట్టాడు. ఓ రకంగా చూస్తే వీరిద్దరూ తమతమ స్థానాలకు న్యాయం చేశారు. -
సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం.. 13 కోట్ల ఆటగాడికి గుడ్‌బై! అతడికి కూడా
ఐపీఎల్-2023 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పేలవ ప్రదర్శన కనబరిచి అభిమానులను తీవ్ర నిరాశ పరిచింది. ఈ ఏడాది సీజన్లో కొత్త కెప్టెన్, కొత్త హెడ్‌కోచ్‌తో బరిలోకి దిగినప్పటికీ.. ఎస్ఆర్హెచ్ ఆట తీరు మాత్రం మారలేదు. ఐపీఎల్ 2023లో 14 మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ.. కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. 13 కోట్ల ఆటగాడికి గుడ్ బై.. ఈ క్రమంలో ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు తమ జట్టును మరోసారి ప్రక్షాళన చేయాలని సన్‌రైజర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా హెడ్ కోచ్ బ్రియాన్ లారాపై వేటు వేయనున్నట్లు సమాచారం. అదే విధంగా గత సీజన్లో నిరాశపరిచిన కొంతమంది ఆటగాళ్లను కూడా ఎస్ఆర్హెచ్ వదులుకోనున్నట్లు తెలుస్తోంది. అందులో ముందు వరుసలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హ్యారీ బ్రూక్ కోసం సన్‌రైజర్స్ రూ.13.25 కోట్లు ఖర్చు పెట్టగా.. అతను 11 మ్యాచ్‌ల్లో 190 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడికి ఎస్ఆర్హెచ్ గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు వినికిడి. మరోవైపు రూ.8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను వదులుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. సుందర్ గాయం కారణంగా టోర్నీ మధ్యలో తప్పుకోగా.. మాలిక్ మాత్రం పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్.. 5 వికెట్లు మాత్రమే చేశాడు. వీరితో పాటు మరికొంత మందికి కూడా ఎస్ఆర్హెచ్ ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. చదవండి: WC 2023: టీ20 వరల్డ్‌కప్ మాదిరే ఈసారి కూడా! ఇషాన్‌ను ఆడిస్తే రోహిత్ ‘డ్రాప్’.. మరి కోహ్లి సంగతి? -
ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్యా బాధను చూడలేకపోతున్నా: రజనీకాంత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదారబాద్ గత కొన్ని సీజన్లగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ సీజన్‌కు ఆటగాళ్లతో పాటు కోచ్‌లు మారుతున్నప్పటికీ.. ఎస్ఆర్ఆహెచ్ ఆటతీరు మాత్రం మారడం లేదు. కనీసం ఈ ఏడాది సీజన్లోనైనా అదరగొడుతుందని భావించిన అభిమానులను ఎస్ఆర్హెచ్ మరోసారి నిరాశ పరిచింది. ఐపీఎల్-2023లో 14 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగే విజయాలతో ఆఖరి స్థానంతో ముగించింది. ఇక తాజాగా ఎస్ఆర్హెచ్ ప్రదర్శనపై సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక వాఖ్యలు చేశారు. సన్‌రైజర్స్ యాజమాని కావ్యా మారన్ పడే బాధను తన చూడలేక పోతున్నాని రజనీ అన్నారు. తన రాబోయే చిత్రం ‘జైలర్’ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ వాఖ్యలు చేశారు. జైలర్ ఆడియో లంచ్‌లో తలైవా మాట్లాడుతూ.. "ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు స్టేడియంలో కావ్యా నిరాశగా ఉండటం చూడలేకపోతున్నా. చాలా సందర్భాల్లో టీవీ ఛానల్‌ను కూడా మార్చేశా. కాబట్టి కళానిధి మారన్(కావ్య మారన్ తండ్రి)కు నేను ఒక్క సలహా ఇవ్వాలనుకుంటున్నాను. జట్టులో మంచి ప్లేయర్స్‌కు అవకాశం ఇవ్వాలి. వేలంలో మెరగైన ఆటగాళ్లను సొంతం చేసుకోవాలి. జట్టున మరింత బలపేతం చేయాలని" సూచించారు. కాగా కళానిధి మారన్ రజినీ జైలర్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఐపీఎల్-2024కు ముందు మరోసారి తమ జట్టును ప్రక్షాళన చేయాలని ఎస్ఆర్హెచ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే హెడ్‌కోచ్ బ్రియాన్ లారాను ఉద్వసన పలకనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్(రూ. 13.25 కోట్లు)ను వదులుకోవాలని ఎస్ఆర్హెచ్ మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చదవండి: IND vs WI: అస్సలు నేను ఊహించలేదు.. అతడు ఓపెనర్‌గా వస్తాడని! కచ్చితంగా జట్టులో ఉండాలి -
సిక్సర్ల వర్షం.. సెంచరీతో పాటు 4 వికెట్లు! రియాన్ పరాగ్ విధ్వంసం.. నిజమేనా?
Deodhar Trophy 2023- North Zone vs East Zone: దియోధర్ ట్రోఫీ-2023లో ఈస్ట్ జోన్ బ్యాటర్ రియాన్ పరాగ్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. నార్త్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. తన విలువైన ఇన్నింగ్స్‌లో జట్టును గెలిపించాడు. కాగా పుదుచ్చేరి వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో నార్త్ జోన్- ఈస్ట్ జోన్ తలపడ్డాయి. టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ శుభారంభం అందుకోలేకపోయింది. టాపార్డర్‌లో మొత్తం పూర్తిగా విఫలమైంది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(10), ఉత్కర్ష్ సింగ్(11) స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ సింగ్ కేవలం 2 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ సిక్సర్ల వర్షం ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన సుభ్రాంషు సేనాపతి (13), కెప్టెన్ సౌరభ్ తివారి(16) సైతం నిరాశపరిచారు. ఈ క్రమంలో ఆరో స్థానంలో బరిలోకి దిగిన రియాన్ పరాగ్ ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడ్డాడు. వికెట్ కీపర్ బ్యాటర్ కుశర్గ(98)తో కలిసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అద్భుత సెంచరీ 102 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 131 పరుగులు సాధించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఈస్ట్ జోన్ 8 వికెట్ల నష్టపోయి ఏకంగా 337 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన నార్త్ జోన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను రియాన్ పరాగ్ కకావికలం చేశాడు. నాలుగు వికెట్లు తీసి 10 ఓవర్ల బౌలింగ్‌లో 57 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. ఉత్కర్ష్, ఆకాశ్ దీప్, ముఖ్తార్ హుసేన్ తలా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో 45.3 ఓవర్లలోనే నార్త్ జోన్ కథ ముగిసింది. 249 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ కావడంతో.. 88 పరుగులతో ఈస్ట్‌జోన్ జయభేరి మోగించింది. అస్సలు ఊహించలేదు.. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ ప్రదర్శనపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఎన్నాళ్లకెన్నాళ్లకు.. రియాన్ పరాగ్ ఇప్పటికైనా నువ్వున్నావని గుర్తించేలా చేశావు... అది కూడా ఆటతో! అస్సలు ఊహించలేదు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ అసోం కుర్రాడు.. ఆట కంటే తన చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఓవరాక్షన్ ప్లేయర్‌గా ముద్రపడి విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజా సీజన్లో 7 ఇన్నింగ్స్ ఆడి 78 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రియాన్ దియోదర్ ట్రోఫీ ప్రదర్శనపై నెటిజన్లు ఈ మేరకు కామెంట్లు చేయడం గమనార్హం. చదవండి: టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు.. -
అప్పట్లో శుబ్‌మన్.. ఇప్పుడు అర్జున్ టెండుల్కర్! ఒకే మాదిరి..
Arjun Tendulkar Latest Six-Pack Abs Pic: టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్‌కు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. సిక్స్ ప్యాక్ బాడీతో మిర్రర్ సెల్ఫీ తీసుకున్న అర్జున్.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ఫిట్‌నెస్‌కు అర్జున్ ఎంత ప్రాధాన్యం ఇస్తాడో అర్థమవుతోందంటూ ప్రశంసిస్తున్నారు. ఈ ఏడాది కల నెరవేరింది కాగా దేశవాళీ క్రికెట్లో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ యువ పేసర్ ఐపీఎల్లో అరంగేట్రం కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూశాడు. ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నా రెండేళ్లపాటు అర్జున్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్ పదహారో ఎడిషన్ సందర్భంగా అతడి కల నెరవేరింది. తాజా సీజన్లో ముంబై తరఫున క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టాడు. తన తండ్రి మెంటార్‌గా ఉన్న జట్టుకే ప్రాతినిథ్యం వహించిన అర్జున్.. మొత్తంగా నాలుగు మ్యాచ్‌లు ఆడి 92 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇక ప్రస్తుతం దియోదర్ ట్రోఫీ-2023లో సౌత్ జోన్‌కు ఆడుతున్న అర్జున్.. తాజా సెల్ఫీతో నెట్టింట సందడి చేస్తున్నాడు. అప్పట్లో శుబ్‌మన్.. ఇప్పుడు అర్జున్ కాగా ఆటగాళ్లకు ఫిట్నెస్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఎప్పటికపుడు జిమ్‌లో చెమటోడుస్తూ.. సరైన జీవనశైలిని పాటిస్తేనే ఆరోగ్యంతో పాటు కెరీర్‌ను పొడిగించుకునే అవకాశం ఉంటుంది. ఇక టీమిండియా క్రికెటర్లలో ఫిట్‌నెస్‌కు మారుపేరుగా నిలిచిన విరాట్ కోహ్లి కూడా గతంలో తన సిక్స్ పాక్ ఆబ్స్ ఫొటోను పంచుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేఎల్ రాహుల్, టీమిండియా భవిష్యత్ ఆశాకిరణంగా మారిన శుబ్‌మన్ గిల్ కూడా అదే బాటలో నడిచారు. ఇప్పుడు అర్జున్ టెండుల్కర్ సైతం వారిని అనుసరిస్తూ తన ఫొటోను షేర్ చేశాడు. కాగా గోవా తరఫున ఏడు మ్యాచ్‌లు ఆడి అత్యధికంగా ఎనిమిది వికెట్లు తీసిన పేసర్‌గా అర్జున్ అగ్రస్థానంలో ఉన్నాడు. దియెదర్ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలో ఆడుతున్న అతడు.. కర్ణాటక బౌలర్ విద్వత్ కవెరప్ప, వైశాక్ విజయ్‌కుమార్, వి.కౌశిక్‌తో కలిసి పేస్ దళంలో భాగమయ్యాడు. 23 ఏళ్ల అర్జున్ టెండుల్కర్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ ఉంటూ అప్డేట్లు అభిమానులతో షేర్ చేసుకుంటాడు. చదవండి: ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే! -
సన్‌రైజర్స్ హెడ్‌కోచ్‌గా వీరేంద్ర సెహ్వాగ్.. ఇక తిరుగుండదు!
ఐపీఎల్లో గత కొన్ని సీజన్లగా సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్‌కోచ్‌లు మారుతున్నప్పటికీ.. జట్టు ఆటతీరు మాత్రం మారడంలేదు. ఈ క్రమంలో ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు తమ జట్టును మరోసారి ప్రక్షాళన చేయాలని సన్‌రైజర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా హెడ్ కోచ్ బ్రియాన్ లారాపై వేటు వేయనున్నట్లు సమాచారం. అతడి నేతృత్వంలో ఎస్ఆర్హెచ్ జట్టు ఈ ఏడాది సీజన్లో తీవ్ర నిరాశ పరిచింది. ఐపీఎల్ 2023లో 14 మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ.. కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. కొత్త కెప్టెన్, కొత్త హెడ్‌కోచ్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ తమ స్ధాయికి తగ్గట్టు రాణించలేకపోయింది. ఈ క్రమంలో లారాను తప్పించాలని ఎస్ఆర్హెచ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విండీస్ క్రికెట్ జట్టును చక్కదిద్దే బాధ్యతను కూడా లారా తీసుకోవడంతో.. అతడు కూడా ఐపీఎల్ వైపు అంత మొగ్గు చూపకపోతునున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విండీస్ హెడ్ కోచ్ ఆండీ కోలీతో పాటు బ్రియాన్ లారా కూడా టీమ్‌కి సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. ఎస్ఆర్హెచ్ హెడ్‌కోచ్‌గా వీరేంద్ర సెహ్వాగ్ ప్రస్తుత పరిస్ధితులను బట్టి చూస్తే కచ్చితంగా వచ్చే ఏడాది సీజన్లో సన్‌రైజర్స్‌కి కొత్త హెడ్‌కోచ్ వచ్చే అవకాశం ఉంది. అయితే తమ జట్టు హెడ్‌కోచ్ పదవి కోసం టీమిండియా మాజీ ఓపెనర్‌ను వీరేంద్ర సెహ్వాగ్‌ను సన్‌రైజర్స్ యాజమాన్యం సంప్రదించినట్లు తెలుస్తోంది. అతడి సమాధానం కోసం ఎస్ఆర్హెచ్ ఎదురుచూస్తున్నట్లు సమాచారం. గతంలో సెహ్వాగ్ పంజాబ్ కింగ్స్‌కు మెంటార్‌గా నాలుగు సీజన్ల పాటు పనిచేశాడు. అదే విధంగా ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అడిన అనుభవం కూడా సెహ్వాగ్ ఉంది. ఈ క్రమంలోనే అతడిని తమ జట్టు కోచింగ్ పగ్గాలు అప్పజెప్పాలని ఎస్ఆర్హెచ్ భావిస్తోంది. కానీ అభిమానులు మాత్రం డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కి 2009లో టైటిల్ అందించిన ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ని హెడ్ కోచ్‌గా నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. చదవండి: Ind Vs WI 2nd Test: ధోని భయ్యా లేడు కదా.. ఇలాగే ఉంటది! ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి! వాళ్లకు కూడా.. -
20 లక్షలు పెట్టాడు.. గూస్బంప్స్ వచ్చాయి! ఏకంగా కోటి 70 లక్షలు.. కళ్లెమ్మట నీళ్లు..
India Vs West Indies T20 Series- Tilak Varma: ‘‘మీరన్నట్లు టీమిండియాకు ఎంపిక కావడం ఆషామాషీ విషయం కాదు. చిన్నప్పటి నుంచి తనకు క్రికెట్ అంటే ఆసక్తి . పదకొండేళ్ల వయసులో నా దగ్గరికి వచ్చి నాన్న క్రికెటర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు. మనం మిడిల్‌క్లాస్ కదా ఎట్లరా మరి అనుకున్నాం. సరేలే చూద్దాం అని చెప్పా. అయితే, చదువును మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని చెప్పాను. తన టాలెంట్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. మాకు లీగల్ అకాడమీ దగ్గరగా ఉండేది. అందుకే సలాం భయాశ్ దగ్గర శిక్షణకు వెళ్లాడు. అలా ముందుడుగు పడింది. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ అండర్-14 కెప్టెన్ కూడా అయ్యాడు. చెన్నైలో ఆడాడు. అప్పటి నుంచి మాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. అండర్-16లో జూనియర్స్‌లో తిలక్‌కు అవకాశం వచ్చింది. నిజానికి మా దగ్గర బ్యాట్స్ కొనలేని పరిస్థితి ఉండేది. కోచ్ అండతోనే అలాంటపుడు కోచ్ అండగా నిలిచారు. టాలెంట్ ఉంది కదా నేను చూసుకుంటాను అని చెప్పారు. మనం కూడా కష్టపడాలి అని ఫిక్స్ అయ్యాం. అలా అలా.. ఎదుగుతూ వచ్చాడు. ఇక అండర్-19 వరల్డ్‌కప్ టీమ్‌కు సెలక్ట్ కావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత ఏడాది గ్యాప్‌లో ఐపీఎల్. వేలం జరుగుతున్నపుడు మేమంతా ఇంట్లో ఉన్నాం. తిలక్ రంజీ ఆడేందుకు వెళ్లాడు. మావాడు బేస్‌ప్రైస్ 20 లక్షలు పెట్టాడు. హైదరాబాద్ వాళ్లు రేటు పెంచారు. ఆ తర్వాత చెన్నై కూడా వచ్చింది. రాజస్తాన్ రాయల్స్ కూడా పోటీ పడింది. తర్వాత ముంబై ఇండియన్స్ ఎంట్రీ ఇచ్చింది. మాకు నోట మాట రాలేదు.. కళ్లెమ్మట నీళ్లు అప్పటికి 50 లక్షలు అంటేనే మేము ఆశ్చర్యంలో మునిగిపోయాం. గూస్బంప్స్ వచ్చేశాయి. తర్వాత చెన్నై వాళ్లు 70 అన్నారు. మాకు నోట మాట రాలేదు. అలా కోటి దాకా వెళ్లింది. పెరుగుతూనే ఉంది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కళ్లెంట నీళ్లు వచ్చాయి. ముంబై వాళ్లు ఏకంగా 1.7 కోట్లు అన్నారు. మా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి’’ అంటూ హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ తండ్రి నంబూరి నాగరాజు భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుమారుడు టీమిండియాకు ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వరల్డ్‌కప్ టోర్నీలో రాణించి కాగా హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ దేశవాళీ క్రికెట్లో అదరగొట్టి.. వరల్డ్‌కప్‌లోనూ రాణించి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్-2022 వేలంలో జట్లన్నీ అతడి కోసం పోటీ పడగా.. ముంబై ఇండియన్స్ రూ. 1.7 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన తిలక్ కోసం ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఈ మేర ఖర్చుపెట్టడం అందరినీ విస్మయపరిచింది. అయితే.. ఫ్రాంఛైజీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు ఈ యువ బ్యాటర్. తన అరంగేట్రం సీజన్లోనే 14 మ్యాచ్‌లు ఆడి 397 పరుగులతో పైసా వసూల్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక ఇక ఐపీఎల్-2023లో 11 ఇన్నింగ్స్ ఆడి 343 పరుగులు సాధించాడు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు గానీ.. లేదంటే అతడి ఖాతాలో మరిన్ని పరుగులు చేరేవే!! ఈ క్రమంలో తిలక్ వర్మకు టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో అతడికి స్థానమిచ్చారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ తిలక్ తల్లిదండ్రులను పలకరించగా.. పుత్రోత్సాహంతో పొంగిపోయారు. సాధారణ ఎలక్ట్రిషియన్ కుటుంబంలో జన్మించిన తిలక్ వర్మ ఈ స్థాయికి ఎదగడంలో గల కష్టం గురించి చెప్పుకొచ్చారు. చదవండి: Ind Vs Pak: సూర్యకుమార్‌కు 32, నాకింకా 22 ఏళ్లే.. అతడితో పోలిక ఎందుకు: పాక్ బ్యాటర్ ఓవరాక్షన్ -
పాతికేళ్లకే ఇషాన్ ఇన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టాడా! కోహ్లికి కూడా సాధ్యం కానివి..
Ishan Kishan Net worth 2023: టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ పుట్టిన రోజు నేడు(జూలై 18). ఈ జార్ఖండ్ ప్లేయర్ నేటితో 25వ వసంతంలో అడుగుపెట్టాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు సహచర ఆటగాళ్లు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి పాతికేళ్ల ఇషాన్ కెరీర్, కింగ్ కోహ్లికి ఇంత వరకు సాధ్యం కాని విధంగా సాధించిన రెండు రికార్డులు, నెట్‌వర్త్ గురించి తెలుసుకుందామా?! బిహారీ కుర్రాడు బిహార్‌లోని పాట్నాలో 1998లో జన్మించాడు ఇషాన్ కిషన్. చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అతడు అంచెలంచెలుగా ఎదిగి అండర్-19 వరల్డ్‌కప్ ఆడే స్థాయికి ఎదిగాడు. తొలుత గుజరాత్ లయన్స్‌కు 2016లో ఢాకాలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో ఆరు ఇన్నింగ్స్ ఆడి 73 పరుగులు సాధించాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో జార్ఖండ్ తరఫున 799 పరుగులతో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచి అందరి దృష్టి ఆకర్షించాడు. తద్వారా ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కించుకున్న ఇషాన్.. 2017లో గుజరాత్ లయన్స్‌కు ఆడాడు. ఈ క్రమంలో మరుసటి ఏడాది ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ ఇషాన్‌ను 6.2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఇషాన్ కిషన్ దశ తిరిగింది. ఆరంభ సీజన్లో కొన్ని గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. గుర్తుండిపోయే ఇన్నింగ్స్ నాడు కేకేఆర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. ఇక ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్ అతడికి ఏకంగా రికార్డు స్థాయిలో 15.25 కోట్లు చెల్లించి సేవలు వినియోగించుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్ల తర్వాత ఇషాన్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో 2021లో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇక అదే వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చిన ఇషాన్.. వెస్టిండీస్-2023 పర్యటనలో భాగంగా టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. కింగ్ కోహ్లికి ఇంతవరకు సాధ్యం కానివి.. ఇషాన్ సాధించిన రికార్డులు ►ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలిచిన రెండు సందర్భాల్లో(2019, 2020) ఇషాన్ ఆ జట్టులో సభ్యుడు. తద్వారా.. ఆరంభం నుంచి ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న రన్‌మెషీన్ విరాట్ కోహ్లికి సాధ్యం కాని ఘనత ఇషాన్ సొంతమైంది. ►ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున 14 వన్డేలు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఖాతాలో ఏకంగా ఓ ద్విశతకం ఉంది. బంగ్లాదేశ్‌పై చెలరేగి వన్డే ఫార్మాట్లో అత్యంత వేగంగా 210 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా ఇషాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా కింగ్ కోహ్లికి వన్డేల్లో అత్యధిక స్కోరు: 183. నెట్‌వర్త్ ఎంతంటే! చిన్న వయసులోనే స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన ఇషాన్ ప్రధాన ఆదాయ వనరు ఆటే! టీమిండియా బ్యాటర్‌గా, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇషాన్ బ్రాండ్ వాల్యూ కూడా ఎక్కువే. పలు బ్రాండ్స్‌ను ఎండార్స్ చేస్తున్న ఈ యువ క్రికెటర్ యాడ్స్ ద్వారా బాగానే సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ నికర ఆస్తి విలువ దాదాపు రూ. 60 కోట్లుగా ఉన్నట్లు అంచనా. 2016- 17లో గుజరాత్ లయన్స్ తరఫున రెండేళ్లు 35 లక్షల చొప్పున, 2018, 19, 20, 21 సీజన్లలో ముంబై ఇండియన్స్‌కు ఆడి ఏడాదికి 6.2 కోట్ల రూపాయల చొప్పున, 2022, 23 ఎడిషన్లలో 15.25 కోట్ల మేర ఆర్జించాడు. విలాసవంతమైన కార్లు ఇషాన్ కిషన్‌కు గ్యారేజ్‌లో లగ్జరీ కార్లు దర్శనమిస్తాయి. సుమారు 92 లక్షల విలువ చేసే ఫోర్ట్ ముస్టాంగ్, 1.05 కోట్ల మేర ధర పలికే మెర్సిడెజ్ బెంజ్ సి-క్లాస్, 72 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఇషాన్ కార్ల జాబితాలో ఉన్నాయి. ఇక ఇషాన్ తండ్రి ప్రణవ్ కుమార్ పాండే బిల్డర్ అన్న విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. చదవండి: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఆసియాకప్‌కు స్టార్ ఆటగాడు దూరం! చరిత్ర సృష్టించిన పాక్ బ్యాటర్.. డబుల్ సెంచరీతో..! -
ఐపీఎల్ కింగ్.. నాకు అతడే ఆదర్శం.. భజ్జూ పా సైతం..: రింకూ సింగ్
ఐపీఎల్-2023లో సత్తా చాటిన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ కల త్వరలోనే నెరవేరనుంది. టీమిండియా జెర్సీ ధరించాలన్న అతడి ఆశ తీరనుంది. కాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లతో చెలరేగిన రింకూ.. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 474 పరుగులు సాధించాడు. కేకేఆర్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచిన రింకూ.. ఈ సీజన్లో అత్యధిక రన్స్ స్కోర్ చేసిన వీరుల జాబితాలో టాప్-10(తొమ్మిదో స్థానం)లో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికవుతాడని భావించినప్పటికీ అతడికి మొండి చేయి ఎదురైంది. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్, ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మలకు విండీస్ విమానం ఎక్కే అవకాశమిచ్చారు సెలక్టర్లు. దీంతో రింకూకు అన్యాయం జరిగిందని అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఆసియా క్రీడల రూపంలో అతడికి లక్కీ ఛాన్స్ వచ్చింది. చైనా వేదికగా సెప్టెంబరు 28 నుంచి ఆరంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌కు ఎంపిక చేసిన భారత ద్వితీయ శ్రేణి పురుషుల జట్టులో రింకూకు స్థానం లభించింది. దీంతో టీమిండియాకు ఆడాలన్న అతడి ఆశయం నెరవేరనుంది. ఇదిలా ఉంటే.. రెవ్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో రింకూ తన రోల్‌మోడల్ ఎవరో రివీల్ చేశాడు. ‘‘సురేశ్ రైనా నాకు ఆదర్శం. భయ్యాతో నేను కాంటాక్ట్‌లో ఉంటాను. ఐపీఎల్ కింగ్ తను. ఎల్లప్పుడూ నాకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటాడు. నా కెరీర్ ఇలా సాగడంలో తన సహాయం ఎంతో ఉంది. భజ్జూ పా(హర్భజన్ సింగ్) కూడా నాకు సాయం చేశాడు. వాళ్లిద్దరు నాకు అండగా నిలిచారు. వాళ్లకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఇలాంటి స్టార్ ఆటగాళ్లు మనతో మాట్లాడితే మనకు మోటివేషన్ లభిస్తుంది’’ అని ఉత్తరప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల రింకూ చెప్పుకొచ్చాడు. యూపీకి చెందిన సురేశ్ రైనా టీమిండియా స్టార్ బ్యాటర్‌గా ఎదిగాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్బుత ఆట తీరుతో మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన విషయం తెలిసిందే. ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివం దూబే, ప్రభ్‌షిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్). స్టాండ్‌బై ప్లేయర్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్. చదవండి: వచ్చేస్తున్నానని వాళ్లకు చెప్పండి: బుమ్రా భావోద్వేగం.. బీసీసీఐ స్పందన టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఆసియాకప్‌కు స్టార్ ఆటగాడు దూరం! -
MS Dhoni: ధోని బర్త్‌డే.. రవీంద్ర జడేజా ఎమోషనల్ ట్వీట్! వైరల్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు నేడు(జూలై 7). నేటితో మిస్టర్ కూల్ 42వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఈ రాంచి డైనమైట్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ రవీంద్ర జడేజా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా సీఎస్కే సారథి ధోనితో జడ్డూకు ప్రత్యేక అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. జడ్డూ కోసం తన స్థానం త్యాగం చేసి జడేజా సీఎస్కేలో చేరిననాటి నుంచే ధోని పెద్దన్నలా అతడికి అండగా నిలిచాడు. గతేడాది కెప్టెన్సీ వదులుకుని జడ్డూను తన వారసుడిగా ప్రకటించి పగ్గాలు అప్పగించాడు. ఇందులో భాగంగా మొదటి రిటెన్షన్ ఆప్షన్ జడ్డూ ఉండాలని తన స్థానాన్ని త్యాగం చేశాడు. అయితే, అంతకుముందు సారథిగా అనుభవం లేని జడ్డూ కారణంగా సీఎస్కే ఐపీఎల్-2022లో దారుణంగా వైఫల్యం చెందింది. మధ్యలోనే జడ్డూ పగ్గాలు వదిలేయడంతో ధోని మళ్లీ నాయకుడై ముందుండి నడిపించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈసారి ఏకంగా చాంపియన్ ఇదిలా ఉంటే.. అనూహ్య రీతిలో పుంజుకున్న ధోని సేన ఐపీఎల్-2023లో ఏకంగా చాంపియన్‌గా నిలిచింది. తద్వారా ఐదోసారి ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది. ఇక రిజర్వ్ డే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఫోర్ బాది సీఎస్కేను విజయతీరాలకు చేర్చిన జడ్డూను ధోని అభినందించిన తీరును అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు. ఆనంద భాష్పాలతో ధోని తీవ్ర భావోద్వేగానికి గురైన ధోని జడ్డూ ఎత్తుకుని విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు, జడ్డూకు ధోనికి పడట్లేదు అంటూ జరిగిన ప్రచారానికి ఒక్క దెబ్బతో ఫుల్స్టాప్ పెట్టాడు. ఇక టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత జడ్డూ సైతం.. మహీ భాయ్ నీకోసం ఏమైనా చేస్తా అంటూ ప్రేమను చాటుకున్నాడు. తాజాగా ధోని బర్త్‌డేను పురస్కరించుకుని..‘‘2009 నుంచి ఇప్పటి వరకు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఎలాంటి అవసరం వచ్చినా.. సలహాలు, సూచనలు కావాలన్నా నేను మొదటగా సంప్రదించే వ్యక్తి(My Go To Man). పుట్టినరోజు శుభాకాంక్షలు మహీ భాయ్. మళ్లీ నిన్ను త్వరలోనే ఎల్లో జెర్సీలో చూడాలి’’ అని ట్వీట్ చేసిన రవీంద్ర జడేజా #respect జతచేశాడు. ప్రస్తుతం జడ్డూ ట్వీట్ లైకులు, షేర్లతో వైరల్‌గా మారింది. చదవండి: కీలక ప్రకటన చేయనున్న సౌరవ్ గంగూలీ My go to man since 2009 to till date and forever. Wishing you a very happy birthday mahi bhai.🎂see u soon in yellow💛 #respect pic.twitter.com/xuHcb0x4lS — Ravindrasinh jadeja (@imjadeja) July 7, 2023 -
నా గురించి ట్వీట్లు చేస్తుంటారు... అదేదో డైరెక్ట్‌గా చెప్పొచ్చు కదా! అంతకంటే..
ఐపీఎల్-2023లో ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైన క్రికెటర్ రియాన్ పరాగ్. 2019లో క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన ఈ అసోం ఆల్‌రౌండర్ ఆరంభం నుంచే పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. తాజా ఎడిషన్‌లోనూ వైఫల్యాల పరంపర కొనసాగించాడు. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు వరుస మ్యాచ్‌లలో తేలిపోయాడు. దీంతో మేనేజ్మెంట్ రియాన్‌కు కేవలం ఏడు మ్యాచ్‌లలో మాత్రమే అవకాశమిచ్చింది. అయితే, రియాన్ పరాగ్ మాత్రం వచ్చిన కాసిన్ని అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆడిన ఏడు మ్యాచ్‌లలో అతడు సాధించిన మొత్తం పరుగులు 78. అత్యధిక స్కోరు 20. ఆసియా కప్ ఆడే జట్టులో ఆటలో విఫలమైనప్పటికీ మైదానంలో అతి చేష్టల వల్ల ఓవరాక్షన్ ప్లేయర్‌గా ముద్రపడ్డాడు రియాన్ పరాగ్. నెటిజన్ల చేతిలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఈ క్రమంలో ఎమర్జింగ్ ఆసియా కప్-2023 నేపథ్యంలో ఇండియా- ఏ జట్టులో అతడు స్థానం సంపాదించడంతో మరోసారి ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ తనపై వస్తున్న విమర్శలు, వ్యంగ్యాస్త్రాల గురించి స్పందించాడు. ‘‘తాము కష్టపడి సంపాదించిన డబ్బు మనకోసం వెచ్చించి మ్యాచ్ చూడటానికి వస్తారు. అలాంటపుడు వాళ్లను నిరాశపరిస్తే కొంతమంది తిట్టుకుంటారు. నేరుగా నాకే మెసేజ్ చేయొచ్చు కదా మరికొంత మంది మనల్ని ద్వేషిస్తారు. వాళ్ల కోపంలో అర్థం ఉంది. నేను ఆ విషయం అర్థం చేసుకోగలను. కానీ కొంతమంది మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు సోషల్ మీడియాలో నన్ను విమర్శిస్తూ పోస్టులు పెడుతుంటారు. ట్వీట్లు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లు నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయొచ్చు కదా! ‘‘నువ్వు ఇలా ఆడుతున్నావు. ఈ విషయంలో నిన్ను నువ్వు మార్చుకోవాలి. టెక్నిక్‌లో మార్పులు చేసుకోవాలి. అలా అయితే నీ ఆట మెరుగుపడుతుంది’’ అని నాకు సలహాలు ఇవ్వొచ్చు కదా! సోషల్ మీడియాలో పోస్టులు చేసే సమయం కంటే ఇదేమీ ఎక్కువ టైమ్ తీసుకోదు. నిజంగా నాకు ఎవరైనా అలాంటి సలహాలు, సూచనలు ఇస్తే ఇష్టం’’ అంటూ రియాన్ పరాగ్ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ ట్విటర్లో షేర్ చేసింది. ఎమర్జింగ్ ఏసియా కప్-2023 భారత- ఏ జట్టు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ(వైస్ కెప్టెన్), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, యశ్ ధుల్(కెప్టెన్), రియాన్ పరాగ్, నిశాంత్ సంధు, ప్రభ్‌షిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), మానవ్ సుతార్, యువరాజ్‌సిన్హ్ దోడియా, హర్షిత్ రానా, ఆకాశ్ సింగ్, నితీశ్ కుమార్‌రెడ్డి, రాజ్‌వర్దన్ హంగ్రేకర్. స్టాండ్ బై ప్లేయర్లు: హర్ష్ దూబే, నేహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రేద్కార్. చదవండి: కీలక ప్రకటన చేయనున్న సౌరవ్ గంగూలీ MS Dhoni: ధోనికి హెలికాప్టర్ షాట్ నేర్పించింది అతడే! 42 ఆసక్తికర విషయాలు.. -
కీలక ప్రకటన చేయనున్న సౌరవ్ గంగూలీ
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ తన 51వ జన్మదినమైన జులై 8న ఓ ప్రత్యేకమైన ప్రకటన చేయనున్నట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని దాదా తన ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా షేర్ చేశాడు. ఇందులో లీడింగ్ విత్ అంటూ డైరీలో రాస్తున్న తన ఫోటోను షేర్ చేస్తూ.. జూలై 8న నా పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రత్యేక ప్రకటన చేస్తున్నాను, వేచి ఉండండి అంటూ క్యాప్షన్ జోడించాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. పుట్టిన రోజు గంగూలీ ఏం ప్రకటించబోతున్నాడో అని క్రికెట్ ఫాలోవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదా.. శుభవార్త చెబుతాడా లేక ఏదైనా బాంబు పేలుస్తాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. గంగూలీ గురించి తెలిసినవారైతే.. దాదా తన రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేయబోతున్నాడని అంటున్నారు. మరి గంగూలీ రేపు ఏ ప్రత్యేకమై ప్రకటన చేస్తాడో వేచి చూడాలి. కాగా, ప్రస్తుతం గంగూలీ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్‌గా విధుల నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాదా ఆధ్వర్యంలో ఈ ఏడాది ఐపీఎల్లో డీసీ చివరి స్థానంలో నిలిచింది. తన జమనాలో టీమిండియాను విజయవంతంగా ముందుండి నడిపించిన దాదా.. ఐపీఎల్లో తన జట్టుకు న్యాయం చేయలేకపోయాడు. ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత కాస్త విరామం తీసుకున్న టీమిండియా.. జులై 12 నుంచి విండీస్‌తో వరస సిరీస్‌లతో బిజీ కానుంది. విండీస్ పర్యటనలో భారత్ తొలుత టెస్ట్ సిరీస్ (2 టెస్ట్‌లు), ఆతర్వాత వన్డే (3 వన్డేలు), టీ20 సిరీస్ (5 టీ20లు)లు ఆడుతుంది. ఈ మూడు సిరీస్‌ల కోసం భారత సెలక్టర్లు మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు. విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ. వన్డే సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, చహల్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్. టీ20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. విండీస్ పర్యటన వివరాలు.. జులై 12-16- తొలి టెస్ట్, డొమినికా జులై 20-24- రెండో టెస్ట్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్‌టౌన్ జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్‌టౌన్ ఆగస్ట్ 1- మూడో వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 4- తొలి టీ20, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 6- రెండో టీ20, గయానా ఆగస్ట్ 8- మూడో టీ20, గయానా ఆగస్ట్ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా ఆగస్ట్ 13- ఐదో టీ20, ఫ్లోరిడా -
తండ్రి కష్టం ఊరికే పోలేదు.. టీమిండియాకు ఎంపికైన తెలుగు కుర్రాడు
విశాఖ స్పోర్ట్స్: ఐదేళ్ల ప్రాయంలో ప్లాస్టిక్ బ్యాట్‌తో సరదాగా బంతితో ఆడటం మొదలుపెట్టిన కె.నితీశ్‌కుమార్ రెడ్డి.. నేడు ఎమర్జింగ్ ఆసియా కప్ వన్డే టోర్నీలో ఆడేందుకు భారత్–ఏ జట్టుకు ఎంపికయ్యాడు. చిరుప్రాయం నుంచే విశాఖ డివిజన్ క్లబ్ లీగ్స్‌లో సీనియర్ల ఆటను చూస్తూ వారి లాగే ఆడాలంటూ కలగనే వాడు నితీశ్. తండ్రి ముత్యాలరెడ్డి ఉద్యోగం సైతం విడిచి పెట్టి.. కుమారుడి క్రికెట్ కెరీర్‌కే ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహించారు. కోచ్‌ల శిక్షణలో నితీశ్ అంచెలంచెలుగా జిల్లా స్థాయి నుంచి రంజీ స్థాయికి ఎదిగాడు. కుడిచేతి వాటం బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తించి రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఆంధ్రా జట్టుకు ఆల్‌రౌండర్‌గా మారాడు. ఏసీఏ అకాడమీ వైపు అడుగులు.. నితీశ్‌కుమార్ వీడీసీఏ శిబిరాల నుంచి అండర్–12, 14 గ్రూపుల్లో జిల్లాకు ఆడటం మొదలుపెట్టాడు. నార్త్‌జోన్‌కు ఆడే సమయంలో అప్పటి జాతీయ జట్టు సెలక్టర్ ఎం.ఎస్.కె.ప్రసాద్ నితీశ్ ప్రతిభను గుర్తించారు. ఆయన ప్రోత్సాహంతో కడపలోని ఏసీఏ అకాడమీలో శిక్షణకు అవకాశం లభించింది. విజయ్ మర్చంట్ ట్రోఫీలో రికార్డు ఆంధ్రా తరఫున ఆడుతున్న నితీశ్ నాగాలాండ్‌తో జరిగిన పోటీలో ఏకంగా 345 బంతుల్లోనే 441 పరుగులు సాధించడం విశేషం. విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఏకంగా 26 వికెట్లు తీయడమే కాకుండా 176.41 సగటుతో 1,237 పరుగులు చేసి టోరీ్నలో రికార్డును నమోదు చేశాడు. ఇదే నితీశ్‌కు 2017–18 సీజన్లో బీసీసీఐ అండర్–16 ఉత్తమ క్రికెటర్‌గా జగన్మోహన్ దాలి్మయా అవార్డును సాధించిపెట్టింది. ఏసీఏ నుంచి బీసీసీఐ అవార్డు పొందిన తొలి క్రికెటర్ నితీశ్ కావడం.. విశాఖ క్రీడాకారులకు నూతనోత్తేజం ఇచ్చింది. అరంగేట్రం ఇలా.. నితీశ్ రంజీ ట్రోఫీలో ఆంధ్రా తరఫున తొలిసారిగా 2020లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మొదలెట్టాడు. విజయ్ హాజారే ట్రోఫీలో ఆంధ్రా తరఫున 2021లో ఆడాడు. అదే ఏడాది సీజన్లోనే సయ్యద్ ముస్తక్ ఆలీ ట్రోఫీలో పొట్టి ఫార్మాట్లో ఆడాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేశాడు. శ్రీలంకలో జూలై 13 నుంచి ప్రారంభం కానున్న ఈ టోరీ్నలో ఐదు దేశాల ఏ జట్లతో పాటు నేపాల్, ఒమన్, యూఏఈ సీనియర్ జట్లు ఆడనున్నాయి. ఐపీఎల్ అరంగేట్రం.. నితీశ్ కుమార్ 2023 సీజన్లో ఐపీఎల్ అరంగ్రేటం చేశాడు. 20 లక్షలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ నితీశ్‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్లో నితీశ్ 2 మ్యాచ్‌లు ఆడాడు. బ్యాటింగ్ చేసే అవకాశం దక్కని నితీశ్.. 5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. చాలా ఆనందంగా ఉంది అప్పుడు నా వయసు పన్నెండేళ్లు. అండర్–12లో టోర్నీలు ఆడే స్థాయికి చేరుకున్నాను. ఆ సమయంలోనే నాన్నకు విశాఖ నుంచి బదిలీ అయింది. నాన్న ఉదయపూర్ వెళ్లినా నా క్రికెట్ కెరీర్ గురించే ఆలోచించేవారు. ఈ క్రమంలో ఉద్యోగం మానేసి ఇక్కడకు వచ్చేశారు. అప్పుడు మా వాళ్లు కొందరు నాన్న ఏంటి ఇలా చేశారు అన్నారు. అయినా వారి మాటలను పట్టించుకోకుండా నన్ను ప్రోత్సహించారు. ఏసీఏ తరఫున తొలి క్రికెటర్‌గా బీసీసీఐ ఉత్తమ క్రికెటర్ అవార్డు అందుకోవడంతో నాలో ఆత్మ విశ్వాసం పెంచింది. అన్ని ఫార్మాట్లలో మేటి టోర్నీలో ఆడటంతో పాటు ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున క్రీజ్‌లోకి వచ్చి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాన్న చాలా సంతోíÙంచారు. భారత్–ఏ తరఫున ఎమర్జింగ్ ఆసియా కప్‌కు ఎంపిక చేసిన 15 మంది జట్టులో స్థానం సాధించడం ఆనందంగా ఉంది. జాతీయ జట్టులో స్థానమే లక్ష్యంగా మరింత సాధన చేస్తా. – నితీశ్‌కుమార్ రెడ్డి -
విండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. రింకూ సింగ్ ఏడి..?
ఐపీఎల్ 2023లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్‌కు విండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టులో చోటు ఖాయమని మీడియా మొత్తం కోడై కూసిన విషయం తెలిసిందే. అయితే మీడియా కథనాలను కాని, రింకూ సింగ్ ప్రదర్శనను కాని పరిగణలోకి తీసుకోని భారత సెలెక్షన్ కమిటీ అతనికి మొండిచేయి చూపించింది. అతని స్థానంలో మిడిలార్డర్ బ్యాటర్ కోటాలో తిలక్ వర్మకు చోటు కల్పించింది. మరో మిడిలార్డర్ బ్యాటర్‌గా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చింది. ఐపీఎల్లో రింకూతో సరిసాటిగా రాణించిన యశస్వి జైస్వాల్‌ని కూడా ఎంపిక చేసింది. If Rinku Singh doesn't play for India, it's Indias Loss!! Keep Going @rinkusingh235 🦁pic.twitter.com/mahZ9pdMAB — KKR Bhakt 🇮🇳 ™ (@KKRSince2011) July 5, 2023 యువకులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తామని ఊదరగొట్టే భారత సెలెక్టర్లు, సీనియర్ల గైర్హాజరీలోనూ రింకూ సింగ్ లాంటి టాలెంటెడ్ ఆటగాడికి చోటు కల్పించకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. రింకూను.. మరో సంజూ శాంసన్‌లా (అవకాశాలు ఇవ్వకుండా) తయారు చేస్తారంటూ కామెంట్లు చేస్తున్నారు. రింకూ సూపర్ ఫామ్‌లో ఉన్నప్పుడు అవకాశం ఇవ్వలేదంటూ సెలెక్టర్లపై దుమ్మెత్తిపోస్తున్నారు. Rinku Singh is the most loved cricketer at the moment. Everyone is angry about his exclusion. pic.twitter.com/jkqRALYPK1 — R A T N I S H (@LoyalSachinFan) July 5, 2023 పాపం రింకూ.. అంటూ సోషల్‌మీడియా వేదికగా సానుభూతి చూపిస్తున్నారు. రింకూను ఎంపిక చేయకపోవడం టీమిండియాకే నష్టమని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు భారత క్రికెట్లో ఇది సర్వసాధారణమని.. సెలెక్టర్లు టాలెంటెడ్ యువతకు అవకాశాలు ఇస్తే ఆశ్చర్యపోవాలి కాని, ఇలా జరిగితే పెద్ద విశేషమేమి కాదంటున్నారు. రింకూను ఎంపిక చేయకపోవడంపై అతని ఐపీఎల్ జట్టు కేకేఆర్ కూడా స్పందించింది. Justice for Rinku Singh 💔😞#WIvIND #RinkuSingh pic.twitter.com/6GRHR62sGx — Shreyas Aryan (@Ariyen34) July 5, 2023 Knowing BCCI, you might see Rinku Singh getting picked in Tests before the T20I side. — Silly Point (@FarziCricketer) July 5, 2023 రింకూ స్లిప్‌లో క్యాచ్ పడుతున్న ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. నథింగ్ స్లిప్పింగ్ థ్రూ అంటూ కామెంట్ చేసింది. కాగా, 25 ఏళ్ల రింకూ సింగ్ (ఉత్తర్‌ప్రదేశ్) ఇటీవల ముగిసిన ఐపీఎల్లో పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి తన జట్టును గెలిపించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో రింకూ 14 మ్యాచ్‌లు ఆడి 59.25 సగటున 149.53 స్ట్రయిక్‌రేట్‌తో 474 పరుగులు సాధించాడు. ఇందులో 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇదే సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకూ ఆడిన ఇన్నింగ్స్ (యశ్ దయాల్వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు) సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరచిపోలేడు. History created by Rinku Singh. What a finish. pic.twitter.com/NDAiGjQVoI — Johns. (@CricCrazyJohns) April 9, 2023 విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. -
IPL 2023: ఫ్రీగా చూపించినా.. వేల కోట్లు సంపాదించారు!
ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్ ప్రకటనల ఆదాయం భారీ వృద్ధిని సాధించింది. ఏకంగా రూ.10,120 కోట్లు ఆర్జించింది. ఇందులో బీసీసీఐ, ఫ్రాంచైజీ యజమానులు, ప్రసారకర్తలు నేరుగా 65 శాతం ఆర్జించగా, మిగిలిన 35 శాతం ఆదాయం పరోక్షంగా వచ్చినట్లు ఓ నివేదిక పేర్కొంది. రూ. 4700 కోట్లు మార్కెట్ పరిశోధన, విశ్లేషణ సంస్థ ‘రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్’ ప్రచురించిన నివేదిక ప్రకారం.. ముఖేష్ అంబానీకి చెందిన స్ట్రీమింగ్ రైట్స్ హోల్డర్ జియోసినిమా (JioCinema), టీవీ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ ప్రకటనల ద్వారా రూ. 4700 కోట్లు ఆర్జించాయి. రూ. 1450 కోట్లు ఫ్రాంచైజీలకు, రూ. 430 కోట్లు బీసీసీఐకి దక్కాయి. బీసీసీఐ, ఫ్రాంచైజీలు, బ్రాడ్కాస్టర్లు.. ప్రకటనల మొత్తం ఆదాయంలో 65 శాతం ప్రత్యక్షంగా ఆర్జించగా మిగిలిన 35 శాతం పరోక్ష ఆదాయం అంటే సోషల్ మీడియా, సాంప్రదాయ మీడియా, ఇతర ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వచ్చిందని నివేదిక పేర్కొంది. ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లకూ.. ఐపీఎల్ 2023లో డ్రీమ్ 11 వంటి ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లు రూ.2,800 కోట్లు ఆర్జించాయని నివేదిక పేర్కొంది. 2022 సీజన్లో రూ. 2,250 కోట్లు ఉన్న వీటి స్థూల ఆదాయం 24 శాతం పెరిగింది. కాగా ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ గత ఏడాది జూన్‌లో రిలయన్స్ జియో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇదీ చదవండి: Nokia 110 4G/2G: నోకియా చిన్న ఫోన్ రూ. 1,699లకే.. యూపీఐ పేమెంట్లూ చేసుకోవచ్చు! -
Viral Video: మరోసారి మంచి మనసు చాటుకున్న ధోని
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి మంచి మనసును చాటుకున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదో సారి ఛాంపియన్‌గా నిలబెట్టిన ధోని.. అనంతరం మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుని ఫామ్‌హౌస్‌లో తన కుటుంబంతో సేద తీరుతున్నాడు. కొద్ది రోజుల కిందట ఫ్లయిట్లో క్యాండీ క్రష్ ఆడుతూ వార్తల్లో నిలిచిన ధోని.. తాజాగా మరోసారి టాక్ ఆఫ్ ది సోషల్‌మీడియాగా మారాడు. ధోని సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. Dhoni dropping his security in gate 😍🤌❤️@MSDhoni #MSDhoni #WhistlePodu pic.twitter.com/vhVMKqn49w — DHONI Era™ 🤩 (@TheDhoniEra) July 2, 2023 ఈ వీడియోలో ధోని నడుచుకుంటూ వెళ్తున్న తన ఫామ్‌హౌస్ సెక్యూరిటి గార్డ్‌కు బైక్‌పై లిఫ్ట్ ఇస్తూ కనిపించాడు. ధోని తనే స్వయంగా బైక్ నడుపుకుంటూ గార్డ్‌ను గేట్ దగ్గర దిగబెట్టాడు. ఆ సమయంలో గేట్ వద్ద ఉన్న కొందరు అభిమానులు మొబైల్లో ఈ సన్నివేశాన్ని బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇది చూసి ధోని అభిమానులు.. తలా మంచితనం మరోసారి ప్రపంచానికి తెలిసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. మనసున్న మారాజు మా ధోని అంటూ ఆకాశానికెత్తుతున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన ఐపీఎలే ధోనికి ఆఖరిదని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఐదో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన అనంతరం ధోని ఈ ప్రచారాన్ని కొట్టిపారేశాడు. తనకు మరో ఐపీఎల్ సీజన్ ఆడే ఓపిక ఉందంటూ సంకేతాలు పంపాడు. మరి, ధోని ఐపీఎల్ 2024 ఆడతాడో లేక ఆఖరి నిమిషంలో రిటైర్మెంట్ ప్రకటిస్తాడో వేచి చూడాలి. -
ఐపీఎల్-2024లో ఆడనున్న పాకిస్తాన్ బౌలర్.. అది ఎలా అంటే?
పాకిస్తాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్టార్ బౌలర్లలో మహ్మద్ అమీర్ ఒక్కడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా 2020 డిసెంబర్లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి అనూహ్యంగా అమీర్ తప్పుకున్నాడు. అయితే పీసీబీ చైర్మెన్ రమీజ్ రజా తప్పకోవడంతో అమీర్ మళ్లీ పాకిస్తాన్ తరపున క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు కొన్ని నెలల కిందట వార్తలు వినిపించాయి. కానీ అమీర్ పాకిస్తాన్‌కు కాకుండా ఐపీఎల్లో ఆడేందుకు అస్త్రాలను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా 2008 ఐపీఎల్ సీజన్ తర్వాత ఏ ఒక్క పాక్ ఆటగాడు కూడా క్యాష్‌రిచ్ లీగ్‌లో ఆడటంలేదు. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తల కారణంగా పాక్ ప్లేయర్లపై ఐపీఎల్లో నిషేధం విధించారు. అయితే అమీర్ మరి ఎలా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడని మీకు సందేహం కలగవచ్చు. యూకే పౌరసత్వం పొందనున్న అమీర్ అమీర్ 2016లో బ్రిటిష్ యువతి, లాయర్ నర్జీస్ ఖాన్ని వివాహం చేసుకున్నాడు. అమీర్ ప్రస్తుతం ఆమెతో కలిసి ఇంగ్లండ్‌లోనే ఉంటున్నాడు. అతడు 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత పూర్తిగా పాకిస్తాన్ నుంచి ఇంగ్లండ్‌కు మకాం మార్చాడు. ఈ క్రమంలో 2024లో బ్రిటీష్ పాస్‌పోర్ట్‌తో పాటు, యూకే పౌరసత్వం పొందనున్నట్లు సమాచారం. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ తన ఐపీఎల్ ఎంట్రీపై ఓ క్లారిటీ ఇచ్చాడు. "నేను ముందుగా ఇంగ్లండ్‌కు ఆడాలనుకోవడంలేదు. ఎందుకంటే ఇప్పటికే నేను పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ స్ధాయిలో ప్రాతినిధ్యం వహించాను. ఐపీఎల్ గురించి ఇంకా ఆలోచించలేదు. నేను బ్రిటన్ నుంచి నా పాస్‌పోర్ట్ పొందడానికి ఇంకా ఒక సంవత్సరం సమయం ఉంది. ఇప్పటికైతే ఒక్కో అడుగు వేయాలని అనుకుంటున్నా" అని అమీర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఐపీఎల్లో ఆడనందుకు రివార్డు.. ఆ ముగ్గురికీ బోనస్ -
ఐపీఎల్లో ఆడనందుకు రివార్డు.. ఆ ముగ్గురికీ బోనస్
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగం కావాలని ప్రపంచంలో ప్రతీ ఒక్క క్రికెటర్ కోరుకుంటాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే విధంగా ఎంతోమంది అనామకులను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కూడా ఐపీఎల్‌కు ఉంది. ఇటువంటి క్యాష్‌రిచ్ లీగ్‌లో భాగమయ్యే అవకాశాన్ని ఏ ఆటగాడు వదులుకోవడానికి ఇష్టపడడు. కానీ బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్ కంటే తమ జాతీయ జట్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఐపీఎల్ ఆఫర్‌ను వదులుకున్న బంగ్లాదేశ్ ఆటగాళ్లు షకీబ్ అల్హసన్, లిటన్ దాస్, టాస్కిన్ అహ్మద్‌లకు ఆ దేశ క్రికెట్ రివార్డు ప్రకటించింది. ఈ ముగ్గురికీ కలిపి 65 వేల డాలర్లు (దాదాపు 53 లక్షలు) బీసీబీ రివార్డుగా ఇవ్వనుంది. కాగా ఐపీఎల్ 2023 మినీ వేలంలో బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ని బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లకు కొనుగోలు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. అయితే ఐర్లాండ్‌తో టెస్టు సిరీస్ కారణంగా షకీబ్ అల్హసన్ ఐపీఎల్-2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అదే విధంగా లిటన్ దాస్ కూడా ఐర్లాండ్ సిరీస్ కారణంగా ఈ ఏడాది సీజన్ ఫస్ట్‌హాఫ్‌లో ఆడలేదు. ఆ తర్వాత ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ఆడేందుకు వచ్చిన కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడి స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడిని రూ.50 లక్షలకు కేకేఆరే సొంతం చేసుకుంది. మరోవైపు గాయం కారణంగా ఐపీఎల్ సెకెండ్ హాఫ్‌కు దూరమైన లక్నో ఫాస్ట్ బౌలర్ స్ధానంలో టాస్కిన్ అహ్మద్‌కు ఆ ఫ్రాంచైజీ నుంచి పిలుపు వచ్చిందంట. అయితే బంగ్లా క్రికెట్ బోర్డు అనుమతి ఇవ్వకపోవడంతో లక్నో ఆఫర్‌ను టస్కిన్ అహ్మద్ తిరష్కరించినట్లు సమాచారం. ఇక వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్‌ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యారు. చదవండి: ఆ రెండు మ్యాచులు గెలిస్తే.. వరల్డ్ కప్ టీమిండియాదే: సునీల్ గవాస్కర్ -
పచ్చగడ్డి.. పులి.. సింహం! అవును.. నువ్వు గాడిదవే! మా కోహ్లి ఎప్పటికీ కింగే!
గడ్డి నీలంగా ఉందని గాడిద.. పులితో చెప్పింది! లేదు లేదు.. గడ్డి పచ్చగా ఉంది.. పులి జవాబు.. రెండిటి మధ్య మాటా మాటా పెరిగింది.. దీంతో గాడిద, పులి కలిసి అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్లాయి. అపుడు.. గాడిద గట్టిగా అరవడం మొదలుపెట్టింది.. మహారాజా గడ్డి నీలం రంగులోనే ఉంది. అవును.. నిజమే గడ్డి నీలంగానే ఉంది.. సింహం బదులిచ్చింది. గాడిదకు ఎక్కడలేని సంతోషం వచ్చింది. కానీ పులి మాత్రం వెనక్కి తగ్గలేదు. గడ్డి పచ్చగానే ఉందనే వాదనకు దిగింది. గాడిదను శిక్షించమని సింహాన్ని కోరింది. కానీ.. సింహం అనూహ్య ప్రకటన చేసింది. పులిని శిక్షించాల్సిందిగా ఆదేశించింది. వాదోపవాదాల అనంతరం ఐదేళ్ల పాటు మౌనంగా ఉండాలని పులిని సింహం ఆదేశించడంతో గాడిద ఆనందంగా గంతులేసుకుంటూ వెళ్లిపోయింది. పులి.. సింహం వేసిన శిక్షను ఆమోదించింది. అయితే, అంతకంటే ముందు.. ‘‘మహారాజా.. గడ్డి పచ్చగానే ఉంటుంది కదా!’’ అని సింహాన్ని అడిగింది. అవునని సింహం బదులిచ్చింది. మరి మీరు నన్నెందుకు శిక్షిస్తున్నారు అని అడిగింది. ఇందుకు బదులిస్తూ.. ‘‘అసలు గడ్డితో నీకేం పని? అది పచ్చగా ఉందా? నీలంగా ఉందా? అన్న విషయం నీకెందుకు? నీలాంటి తెలివైన జంతువులు అసలు ఈ విషయాల గురించి పట్టించుకోవడమే తప్పు. అలాంటిది నా దగ్గరకు వచ్చి నా సమయం కూడా వృథా చేశావు. అందుకే నీకు శిక్ష విధించాను’’ అని పులి సందేహాన్ని తీర్చింది. ఇందులో నీతి ఏమిటంటే.. టైమ్‌ను ఎంత చెత్తగా వేస్ట్ చేస్తామో తెలుసుకోవడం! నిజాన్ని అంగీకరించని మూర్ఖులతో ఏళ్లకు ఏళ్లు వాదించినా ప్రయోజనం ఉండదు. ఇది తప్పు.. ఇది ఒప్పు అని వాళ్లకు ఎన్ని సాక్ష్యాలు చూపించినా వారి వారి ఊహాగానాలు, ఏకపక్ష అభిప్రాయాలు మారవు. అసలు మనం చెప్పే విషయాలను అర్థం చేసుకునే స్థాయి వాళ్లకు ఉండదు. అహంకారంతో వాళ్ల కళ్లు మూసుకుపోతాయి. తాము చెప్పింది, చేసిందే సరైందనే ఈగోతో ఉంటారు. అలాంటి వాళ్లతో మాట్లాడి సమయం వృథా చేయడం వేస్ట్!! అఫ్గనిస్తాన్ బౌలర్, లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ నవీన్-ఉల్-హక్ ఇన్‌స్టాలో పంచుకున్న వీడియోలో ఉన్న నీతికథ ఇది. కాగా ఐపీఎల్-2023లో ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా నవీన్.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో గొడవకు దిగిన విషయం తెలిసిందే. మ్యాచ్ సందర్భంగా చెలరేగిన భావోద్వేగాలను అదుపుచేసుకోలేని ఈ యువ ఆటగాడు.. ఆట అయిపోయిన తర్వాత ఇరు జట్లు పరస్పరం కరచాలనం చేసుకునే కోహ్లి ఏదో అనగానే అతడి చేతిని విసిరికొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వివాదానికి దారి తీయగా.. లక్నో మెంటార్ గౌతం గంభీర్ జోక్యంతో గొడవ మరింత పెద్దదైంది. ఈ క్రమంలో మైదానాన్ని వీడిన తర్వాత కోహ్లి, నవీన్ ఒకరినొకరు ఉద్దేశిస్తూ నర్మగర్భ పోస్టులతో సోషల్ మీడియా వార్‌కు తెరతీశారు. ఈ నేపథ్యంలో కోహ్లిని కించపరిచే విధంగా వ్యవహరించాడంటూ నవీన్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు కింగ్ కోహ్లి ఫ్యాన్స్. ఎక్కడ మ్యాచ్ జరిగినా కోహ్లి నామస్మరణతో అతడిని టీజ్ చేశారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో నవీన్ మాట్లాడుతూ.. కోహ్లినే గొడవ మొదలుపెట్టాడని పేర్కొన్నాడు. ఆ తర్వాత నవీన్‌పై ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ క్రిప్టిక్ పోస్ట్‌తో ముందుకు వచ్చాడు నవీన్ ఉల్ హక్. ఇది కోహ్లి ఫ్యాన్స్‌ను ఉద్దేశించే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, కింగ్ అభిమానులు ఈ వీడియోపై కూడా తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ‘‘అవును నువ్వు గాడిదవే! నీతో వాదించడం మా కింగ్ తప్పే. అయినా ఇక్కడ మా స్టార్ పులిలాంటి వాడు కాదు.. సింహం లాంటోడు.. ఆ సింహం అడవికి రాజైతే.. మా కోహ్లి రికార్డుల రారాజు. అది గుర్తుపెట్టుకో!’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందుకు నవీన్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి!! చదవండి: WC 2023: గొప్ప బ్యాటర్వే! కానీ నీకసలు బుర్ర లేదు.. View this post on Instagram A post shared by Naveen ul haq Murid (@naveen_ul_haq) -
ఎందుకిలా చేశావు ధోని భయ్యా! మిస్టర్ కూల్ ఆన్సర్‌తో దిమ్మతిరిగిపోయింది!
MS Dhoni- IPL 2023: మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నైపుణ్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మాస్టర్‌మైండ్‌తో ఊహించని రీతిలో ఫీల్డింగ్ సెట్ చేసి.. ఓడిపోతామనుకున్న మ్యాచ్‌లోనూ గెలిపించడంలో తనకు తానే సాటి. అందుకే ఈ మిస్టర్ కూల్ టీమిండియాతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ అత్యంత విజయవంతమైన సారథిగా పేరొందాడు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహేంద్రుడు.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఏకంగా ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక యువ ఆటగాళ్లకు రోల్ మోడల్ అయిన ధోని గురించి టీమిండియా బ్యాటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి మిస్టర్ కూల్ కెప్టెన్సీని హైలైట్ చేశాయి. నమ్మశక్యంకాని రీతిలో ఇటీవల రాజ్ షమన్ పాడ్‌కాస్ట్‌లో వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది ఐపీఎల్లో జరిగిన సంఘటన గురించి చెబుతాను. నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షార్ట్ థర్డ్‌మ్యాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న వ్యక్తికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాను. నమ్మశక్యంకాని రీతిలో అవుట్ కావడంతో వెంటనే వెనక్కి తిరిగి చూడగా.. సదరు ఫీల్డర్ ఉండాల్సిన చోట కాకుండా వేరే చోట ఉన్నట్లు అనిపించింది. నిజానికి అతడు మరికాస్త కుడివైపునకు నిల్చోవాల్సింది. అది చూసి నేను షాకయ్యా. వెంకటేశ్ అయ్యర్ భయ్యా ఎందుకిలా చేశావు? మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ విషయం గురించి ధోనిని అడిగాను. ‘‘భయ్యా. ఇలా ఎందుకు చేశారు?’’ అన్నపుడు.. నేను షాట్ కొట్టగానే ఫీల్డింగ్ అలా సెట్ చేసినట్లు చెప్పాడు. అందుకు నేను వావ్ అనకుండా ఉండలేకపోయాను. అసలు అంత తక్కువ సమయంలో అలా ఎలా ఆలోచిస్తారో అర్థంకాక తలపట్టుకున్నా. నిజానికి క్రికెట్లో యాంగిల్స్ గురించి అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎవరిని ఎక్కడ ప్లేస్ చేస్తే అనుకున్న ఫలితం రాబట్టగలమో తెలుస్తుంది. ధోని స్ట్రెంత్ అదే’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2023లో వెంకటేశ్ అయ్యర్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఆడిన 14 మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా 404 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో అతడి అత్యధిక స్కోరు 104. ఇక ధోని సారథ్యంలోని సీఎస్కే రిజర్వ్ డే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఐదోసారి చాంపియన్‌గా అవతరించింది. చదవండి: చరిత్ర సృష్టించిన షాహీన్ అఫ్రిది.. పొట్టి క్రికెట్లో తొలి బౌలర్‌గా రికార్డు 42 మ్యాచ్‌ల వరకు ఒక్కసారి కూడా లేదు.. ఆతర్వాత వరుసగా 3 సార్లు 'ఆ ఘనత' -
కేకేఆర్ బౌలర్ ఊచకోత.. తొమ్మిదో నంబర్లో వచ్చి విధ్వంసకర శతకం
దులీప్ ట్రోఫీ-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ హర్షిత్ రాణా విధ్వంసం సృష్టించాడు. తొమ్మిదో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చి ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. భారీ షాట్లతో విరుచుకుపడి సూపర్ సెంచరీ సాధించాడు. కేవలం 86 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న నార్త్ జోన్ జట్టు భారీ స్కోర్ చేసింది. హర్షిత్ కంటే ముందు ఇదే ఇన్నింగ్స్‌లో మరో ఐపీఎల్ ఆటగాడు కూడా శతక్కొట్టాడు. సీఎస్కే ఆటగాడు నిశాంత్ సింధు (150) భారీ శతకం బాదాడు. వీరిద్దరి కంటే ముందు సీఎస్కేకే చెందిన మాజీ ప్లేయర్ ధృవ్ షోరే (135) కూడా సెంచరీ చేశాడు. ఫలితంగా నార్త్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 540/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో ఈ స్కోర్ నమోదైంది. ఇదిలా ఉంటే, 21 ఏళ్ల హర్షిత్ రాణాను 2022 ఐపీఎల్ మెగా వేలంలో కేకేఆర్ సొంతం చేసుకుంది. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, అడపాదడపా బ్యాటింగ్ చేసే హర్షిత్.. ఐపీఎల్లో 8 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్టు పడగొట్టాడు. -
సీఎస్కే ప్లేయర్ సూపర్ సెంచరీ
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సభ్యుడిగా ఉన్న ఆటగాడు దులీప్ ట్రోఫీ-2023లో సూపర్ సెంచరీతో మెరిశాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్ ఆటగాడు నిశాంత్ సింధు (111 నాటౌట్) అద్భుతమైన శతకం బాదాడు. రెండో రోజు ఆటలో (ఇవాళ) నిశాంత్ సెంచరీ మార్కును అందుకున్నాడు. అంతకుముందు తొలి రోజు ఆటలో ధృవ్ షోరే (135) సెంచరీ చేశాడు. రెండో రోజు తొలి సెషన్ సమయానికి (103 ఓవర్లు) నార్త్ జోన్ 6 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. నిశాంత్‌కు జతగా పుల్కిత్ నారంగ్ (39) క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, ఐపీఎల్-2023 వేలంలో నిశాంత్ సింధును చెన్నై సూపర్ కింగ్స్ 60 లక్షల ధరకు కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్లో అతని ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. 2022 అండర్-19 వరల్డ్‌కప్‌లో కనబర్చిన అద్భుతమైన ప్రదర్శన కారణంగా నిశాంత్‌కు ఐపీఎల్ ఆఫర్ వచ్చింది. నాటి వరల్డ్‌కప్ ఫైనల్లో నిషాంత్ వీరోచితంగా పోరాడి హాఫ్ సెంచరీ సాధించాడు. నిషాంత్ దేశవాళీ క్రికెట్లో ఇప్పటివరకు 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు (2 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు), 7 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 8 టీ20లు ఆడాడు. -
భీకర ఫామ్‌లో సాయి సుదర్శన్.. విండీస్ టూర్‌కు ఎంపిక..?
ఐపీఎల్ 2023లో మొదలైన సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) పరుగుల ప్రవాహం, ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కూడా కొనసాగుతోంది. గడిచిన 10 ఇన్నింగ్స్‌ల్లో 53, 19, 20, 47, 43, 96 (ఐపీఎల్ ఫైనల్), 86, 90, 64 నాటౌట్, 7 పరుగులు చేసిన సాయి.. ఇవాళ (జూన్ 25) దిండిగుల్ డ్రాగన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ 41 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. తద్వారా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అతని జట్టు లైకా కోవై కింగ్స్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో సాయి సుడిగాలి ఇన్నింగ్స్ చూశాక కొందరు నెటిజన్లు ఆసక్తికర పోస్ట్‌లు చేస్తున్నారు. త్వరలో జరుగనున్న విండీస్ సిరీస్‌లో భారత టీ20 జట్టుకు సాయిని ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారత టీ20 జట్టుకు ఎంపిక కావడానికి ఓ ఆటగాడు ఇంతకంటే ఏం నిరూపించుకోవాలని తమిళ తంబిలు ప్రశ్నిస్తున్నారు. టీ20 జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ సాయి ఆల్‌రౌండర్ అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, ఇతని ప్లేయింగ్ స్టయిల్, కంసిస్టెన్సీ, భారీ షాట్లు ఆడగల సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని టీమిండియాకు ఎంపిక చేయాలని కోరుతున్నారు. యశస్వి, రుతురాజ్ లాంటి వారికి అవకాశం ఇచ్చారు, వారికంటే సాయి ఏమాత్రం తీసిపోడని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, సాయి సుదర్శన్‌కు టీ20లతో పాటు లిస్ట్-ఏ, ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ మెరుగైన రికార్డు ఉంది. 21 ఏళ్ల సాయి సుదర్శన ఇప్పటివరకు 26 టీ20ల్లో 129.75 స్ట్రయిక్ రేట్లో 859 పరుగులు (5 హాఫ్ సెంచరీలు).. 11 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 60.36 సగటున 664 పరుగులు (3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు).. 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో 47.66 సగటున 572 పరుగులు (2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ) చేశాడు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం! ఈసారి మా ఆశలు వమ్ము చేయొద్దు ప్లీజ్!
Sanju Samson Comeback In Team India: కేరళ క్రికెటర్ సంజూ శాంసన్‌కు తిరిగి భారత జట్టులో చోటు దక్కడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పుడు తమకు సంతోషంగా ఉందని, ఈసారి సంజూ కెరీర్ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న సంజూ శాంసన్ 2015లో జింబాబ్వేతో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే, భారత జట్టు సమీకరణలు, ఇతరత్రా కారణాల వల్ల చాలా సందర్భాల్లో సంజూకు నిరాశే ఎదురైంది. ఇందుకు తోడు నిలకడలేమి ప్రదర్శన అతడి అవకాశాలకు గండికొట్టింది. అదే సమయంలో ఇతర యువ ఆటగాళ్లు రేసులోకి దూసుకురావడంతో సంజూ శాంసన్ అవకాశాల కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి. గాయం బారిన పడి ఈ క్రమంలో టీ20 అరంగేట్రం తర్వాత దాదాపు ఆరేళ్లకు అంతర్జాతీయ వన్డే ఆడాడు. ఇక చివరిసారిగా.. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో టీ20 సిరీస్ నేపథ్యంలో జాతీయ జట్టుకు ఎంపికైన సంజూ తొలి మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. ఇక రెండో మ్యాచ్ సమయానికి గాయం బారిన పడటంతో జట్టులో చోటు కోల్పోయాడు. తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇక ఆ తర్వాత ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్ నాయకుడిగా జట్టును ముందుకు నడిపిన సంజూ.. 14 మ్యాచ్‌లలో 362 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో తొలిసారి సంజూకు చోటు దక్కింది. గ్రేడ్ ‘సీ’ ఆటగాళ్ల జాబితాలో అతడిని చేర్చింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో ఏడాదికి కోటి రూపాయల వార్షిక వేతనం అందుకోనున్న సంజూ శాంసన్.. సుదీర్ఘ కాలం తర్వాత మరోసారి జట్టుకు ఎంపికయ్యాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈసారి మాత్రం దీంతో సంజూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ‘‘ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈసారి మాత్రం తగ్గేదేలేదు! మా ఆశలను వమ్ము చేయొద్దు సంజూ! ప్లీజ్ ఈసారి బాగా ఆడాలి’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక విండీస్‌తో వన్డే సిరీస్ తుది జట్టులో సంజూ పేరు ఉంటుందో లేదో చూడాలి!! ఇక సంజూ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 11 వన్డేల్లో 330 పరుగులు, 17 టీ20 మ్యాచ్‌లలో 301 పరుగులు సాధించాడు.కాగా జూలై 12 నుంచి టీమిండియా వెస్టిండీస్ పర్యటన మొదలుకానుంది. వెస్టిండీస్‌తో వన్డేలకు టీమిండియా రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేష్ కుమార్. చదవండి: అప్పుడు జట్టులో చోటే కరువు.. ఇప్పుడు వైస్ కెప్టెన్‌గా.. నువ్వు సూపర్ ‘హీరో’! నక్క తోక తొక్కిన భారత ఆటగాడు! మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ Excited for This Series 😍 Sanju Samson peak is yet to Come https://t.co/6hjWiLSXvB — AV!29 (@SprotsLover29) June 23, 2023 Rahane is back as Vice-captain in the test and Sanju Samson is back in the ODI squad. something to cheer for.. #IndianCricketTeam — Siddharth (@siddies10) June 23, 2023 -
అప్పుడు ధోని బాగా ఫీలయ్యాడు.. కానీ అక్కడ జడ్డూ ఉన్నాడు కదా: సీఎస్కే సీఈవో
ఐపీఎల్-2023 ఛాంపియన్స్‌గా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే గుజరాత్ టైటాన్స్ జరిగిన ఫైనల్లో గోల్డన్ డక్‌గా వెనుదిరిగిన వెంటనే ధోని చాలా బాధ పడ్డాడని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపాడు. కాగా ఫైనల్ మ్యాచ్ కీలక సమయంలో అంబటి రాయుడు ఔటైన తర్వాతి బంతికే ధోని పెవిలియన్ చేరాడు. దీంతో ఒక్క సారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఈ క్రమంలో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆఖరి బంతికి ఫోర్ బాది తన జట్టును ఛాంపియన్స్‌గా నిలిపాడు. తాజాగా ఇదే విషయంపై కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. "ఫైనల్ మ్యాచ్‌లో మా విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 38 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో రాయుడు వరుసగా రెండు సిక్స్‌లు, ఫోర్ బాది మ్యాచ్‌ను మా వైపు మలుపు తిప్పాడు. అతడు అదే ఓవర్లో నాలుగో బంతికి ఔటయ్యాడు. దీంతో మా విజయానికి 14 బంతుల్లో 21 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ధోని క్రీజులోకి వచ్చాడు. అయితే అతడు ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌కు చేరాడు. మేమంతా షాక్‌కు గురయ్యాం. గోల్డన్ డక్‌గా వెనుదిరగడం ఎంఎస్‌ను కూడా భాదించింది. ఇంత దగ్గరగా వచ్చి ఓడిపోతామో ఏమో అన్న భయం ధోని కళ్లలో కన్పించింది. కానీ క్రీజులో ఇంకా జడేజా ఉన్నాడు కాబట్టి మేము నమ్మకంతోనే ఉన్నాం. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా.. తొలి బంతిని జడ్డూ సిక్స్‌గా మలచడం మాకు మరింత నమ్మకం కలిగించింది. ఆఖరి బంతిని కూడా ధోని తనదైన స్ట్రైల్లో బౌండరీ పంపించాడు అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Ashes 2nd Test: అతడిని పక్కన పెట్టి స్టార్క్‌ను తీసుకు రండి: ఆసీస్ మాజీ కెప్టెన్ -
కోహ్లి మీద అసూయతోనే గంభీర్ అలా చేశాడు: పాక్ మాజీ క్రికెటర్
ఐపీఎల్-2023 సందర్భంగా ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి- లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ మధ్య జరిగిన గొడవపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ స్పందించాడు. విరాట్‌పై అసూయతోనే గౌతీ వాగ్వాదానికి దిగినట్లు అనిపించిందన్నాడు. ఏదేమైనా ఓ క్రికెటర్‌గా ఇలా ఇద్దరు ఆటగాళ్లు మైదానంలోనే తగువు దిగడం తనను బాధించిందన్నాడు. కాగా లక్నో వేదికగా ఆర్సీబీతో మ్యాచ్‌లో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా కోహ్లి- అఫ్గనిస్తాన్ పేసర్ నవీన్- ఉల్- హక్ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన అనంతరం పరస్పరం కరచాలనం చేసుకునే సమయంలోనూ నవీన్ కోహ్లితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో గొడవ పెద్దది కాగా గౌతం గంభీర్ జోక్యం చేసుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లి- నవీన్ గొడవ.. కోహ్లి- గంభీర్ మధ్య అగ్గిరాజేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొంతమంది విరాట్‌కు మద్దతునివ్వగా.. మరికొందరు గౌతీకి అండగా నిలిచారు. ఈ క్రమంలో ఈ విషయంపై తాజాగా స్పందించిన అహ్మద్ షెహజాద్.. గౌతీ కావాలనే గొడవకు దిగినట్లు అనిపించిందని పేర్కొన్నాడు. ‘‘ఓ ప్రేక్షకుడిగా, ఆటగాడిగా.. ఆ దృశ్యాలు నన్ను కలచివేశాయి. నాకైతే.. కోహ్లి మీద అసూయతోనే గౌతం గంభీర్ గొడవ పెద్దది చేశాడనిపించింది. ఎన్నో రోజులుగా సమయం కోసం వేచి చూసి మరీ వివాదానికి తెరలేపినట్లు... విరాట్‌ను వివాదంలోకి లాగేందుకు వాగ్వాదానికి దిగాడేమో అన్నట్లు అనిపించింది. అయినా, ఆటగాళ్ల మధ్య గంభీర్ తలదూర్చాల్సిన అవసరం ఏమిటో నాకింకా అర్థం కాలేదు’’ అని నాదిర్ అలీ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించాడు. ఆటలో ఇవన్నీ సహజమేనని.. ఇందులో కోహ్లి తప్పేం లేదని టీమిండియా స్టార్‌ను సమర్థించాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో తలపడిన తొలి సందర్భంలో సొంతగడ్డపై ఆర్సీబీని లక్నో ఓడించగా.. రెండోసారి పోరులో ఆర్సీబీ..లక్నోను చిత్తు చేసింది. ఇక బెంగళూరు ఫ్రాంఛైజీ ప్లే ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. లక్నో టాప్-4లో నిలిచింది. అయితే, ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో భారీ తేడాతో ఓటమి పాలై ఇంటిబాట పట్టింది. చదవండి: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులోకి ఎవరూ ఊహించని ఆటగాడు! ODI WC 2023: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి భారత జట్టులోకి ధోని! -
ఆడపడుచు అడ్డుపడినా! జడ్డూ భార్య రివాబా బ్యాగ్రౌండ్ తెలుసా? వందల కోట్లు!
Who is Rivaba Jadeja? Networth: రవీంద్ర జడేజా.. టీమిండియా ప్రధాన ఆల్‌రౌండర్.. ఆసియా కప్-2022 సందర్భంగా గాయపడ్డ జడ్డూ పునరాగమనంలో అదరగొట్టాడు. ముఖ్యంగా స్వదేశంలో ఆస్ట్రేలియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 టెస్టు సిరీస్‌లో దుమ్ములేపాడు. అద్భుత ప్రదర్శనతో.. మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఇక ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌ను చాంపియన్‌గా నిలపడంలోనూ జడేజా కీలక పాత్ర పోషించాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో బౌండరీ బాది జట్టును విజయతీరాలకు చేర్చి.. సొంతగడ్డపై సత్తా చాటాడు. కాగా ఈ గెలుపుతో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై ఐదోసారి చాంపియన్‌గా నిలవగా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా జడ్డూను ధోని పైకెత్తి సెలబ్రేట్ చేసుకోవడం, ఆ తర్వాత జడ్డూ భార్య రివాబా భర్త కాళ్లకు నమస్కరించి అతడిని ఆత్మీయంగా హత్తుకోవడం హైలైట్‌గా నిలిచాయి. సంప్రదాయ చీరకట్టుతో.. చిరునవ్వు నిండిన మోముతో నిండైన రూపంతో కనిపించిన రివాబా భర్త ఆశీర్వాదం తీసుకోవడం అభిమానులకు కన్నులపండుగ చేసింది. ఇంతకీ జడ్డూ భార్య రివాబా గురించి మీకు తెలుసా? ఆమె బ్యాగ్రౌండ్, ప్రొఫెషన్, నికర ఆస్తి.. తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం! రాజ్‌కోట్ అమ్మాయి రివాబా సింగ్ సోలంకి 1990, నవంబరు 2న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జన్మించింది. ఆమె తండ్రి హర్దేవ్ సింగ్ సోలంకి వ్యాపారవేత్త. తల్లి ప్రఫుల్లాబా సోలంకి భారత రైల్వేస్‌లో ఉద్యోగిని. రాజ్‌కోట్‌లోని ఆత్మీయ యూనివర్సిటీలో రివాబా మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అలా పరిచయమై జడేజా సోదరి నైనాబాకు రివాబా స్నేహితురాలు. ఓ పార్టీలో నైనా.. రివాబాను జడేజాకు పరిచయం చేసింది. ఈ క్రమంలో ప్రేమలో పడ్డ జడ్డూ- రివాబాల నిశ్చితార్థం 2016 ఫిబ్రవరి 5న జరిగింది. జడేజాకు చెందిన రెస్టారెంట్లో బంధువుల సమక్షంలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. అదే ఏడాది ఏప్రిల్ 17న వివాహ బంధంలో అడుగుపెట్టారు. వీరికి 2017లో కూతురు జన్మించింది. ఆడపడుచు, మామ వ్యతిరేక ప్రచారం చేసినా రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో రివాబా బీజేపీలో చేరింది. భర్త ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే టికెట్ సంపాదించారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబరులో జామ్‌నగర్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆడపడుచు నైనాబా, మామ అనిరుద్ సింగ్ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా వారిని పన్నెత్తి మాట కూడా అనలేదు. భర్త జడేజా అండగా నిలవడంతో ఇంటి పోరును జయించి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. రివాబా, జడేజా నెట్‌వర్త్ ఎంత? DNA నివేదిక ప్రకారం.. రివాబా సోలంకి జడేజా ఆస్తి విలువ 64.3 కోట్ల రూపాయలు అని సమాచారం. సొంతంగా ఆమె 57.60 లక్షల విలువైన ఆస్తులు కలిగి ఉంది. ఇక గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఏ గ్రేడ్‌లో ఉన్న జడ్డూకు ఈ ఏడాది ప్రమోషన్ లభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న అతడికి బీసీసీఐ ఏడాదికి రూ. 7 కోట్లు చెల్లిస్తుంది. కాగా జడేజాకు గుజరాత్లో పలు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన ఆటగాడిగా ఉన్న జడ్డూ ఏటా 16 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భారత స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నికర ఆస్తి రూ. 120 కోట్లుగా పలు నివేదికలు అంచనా వేశాయి. ఆరు ఇండ్లు జడేజా- రివాబా దంపతులకు రాజ్‌కోట్, అహ్మాదాబాద్, జామ్‌నగర్‌లో కలిపి ఆరు ఇండ్లు ఉన్నాయి. ఇక వీరి గ్యారేజ్‌లో ఫోక్స్‌వ్యాగన్ పోలో జీటీ, ఫోర్డ్ ఎండీవర్, ఆడి క్యూ 7 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. చదవండి: ధోనికి పిల్లనిచ్చిన అత్తగారు! ఆ కంపెనీ సీఈఓ.. రూ. 800 కోట్ల సామ్రాజ్యం! 20 లక్షలు అనుకుంటే ఏకంగా కోటీశ్వరుడయ్యాడు! జూబ్లీహిల్స్‌లో బంగ్లా, కార్లు.. తగ్గేదేలే! Ravindra Jadeja's wife touched Jadeja's feet after the victory last night.#MSDhoni𓃵 #CSKvsGT #IPL2023Final pic.twitter.com/nNp6RAWUhR — Bhadohi Wallah (@Mithileshdhar) May 30, 2023 -
అలా అయితే వేలంలో నన్నెవరూ కొనుగోలు చేయరు.. అయినా సిగ్గెందుకు?: ధోని
ప్రశ్న: ప్రతి ఏడాది జట్టును ప్లే ఆఫ్స్ వరకు ఎలా తీసుకురాగలుగుతున్నావు? జవాబు: ఒకవేళ ఆ సీక్రెట్ ఏమిటో అందరి ముందు చెప్పేస్తే.. వేలంలో నన్నెవరూ కొనుగోలు చేయరు! ప్రశ్న: అవునూ.. చాలా మంది క్రికెటర్లు మీ సంతకంతో ఉన్న జెర్సీలు అడుగుతారెందుకో? జవాబు: బహుశా.. నేను రిటైర్ అయి పోతున్నానని వాళ్లు అనుకుంటున్నారేమో! ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాను కదా! ఇక పొట్టి ఫార్మాట్‌కు కూడా గుడ్ బై చెప్తానని భావిస్తున్నట్లున్నారు. ప్రశ్న: నీకు వయసు మీద పడిందనుకుంటున్నవా? ముసలోడివయ్యావా? జవాబు: అంతేగా! నిజాన్ని ఒప్పుకోవడానికి సిగ్గు పడాల్సిన అసవరం లేదు. ప్రశ్న: నిన్ను మళ్లీ యెల్లో జెర్సీలో చూడగలమా? జవాబు: రిటైర్మెంట్ ప్రకటను ఇదే అత్యుత్తమ సమయం. అయితే.. మరో సీజన్ ఆడాలంటే 9 నెలల పాటు కఠినశ్రమకు ఓర్చుకోవాల్సి ఉంటుంది. కనీసం మరొక్క ఎడిషన్ అయినా ఆడతాననే భావిస్తున్నా! ఐపీఎల్-2023 సందర్భంగా కామెంటేటర్ హర్షా భోగ్లే- చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మధ్య జరిగిన సరదా సంభాషణలు ఇవి. ఇందుకు సంబంధించిన వీడియోలు తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా క్యాష్ రిచ్ లీగ్ పదహారో ఎడిషన్ ధోనికి చివరిదన్న వార్తల నేపథ్యంలో.. మిస్టర్ కూల్ ఆటను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున మైదానాలకు తరలివచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధోని నామస్మరణతో అభిమానం చాటుకున్నారు. ఇక గతేడాది పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ధోని సేన.. ఈసారి ఏకంగా చాంపియన్‌గా అవతరించింది. పదోసారి ప్లే ఆఫ్స్ చేరిన జట్టుగా చరిత్ర సృష్టించిన చెన్నై.. ఫైనల్లో గుజరాత్‌ను ఓడించింది. వర్షం కారణంగా రిజర్వ్ డే జరిగిన మ్యాచ్‌లో డీఎల్ఎస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తద్వారా ఐదోసారి విజేతగా నిలిచి ముంబై ఇండియన్స్ పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. అదే విధంగా ధోని ఖాతాలో అత్యధిక సార్లు జట్టును గెలిపించిన నాయకుడిగా అరుదైన ఘనత వచ్చి చేరింది. ముంబై సారథి రోహిత్ తర్వాత ఈ ఫీట్ నమోదు చేసిన కెప్టెన్‌గా ధోని రికార్డు సాధించాడు. చదవండి: ఇలా ఔటవ్వడం చూసుండరు.. శనిలా వెంటాడిన నాన్‌స్ట్రైక్ బ్యాటర్ "7 Best MS Dhoni-Harsha Bhogle Interactions"😂❤️ (A Thread) pic.twitter.com/19yhD8p21Q — 🏆×3 (@thegoat_msd_) June 21, 2023 -
థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్
Hardik Pandya and Natasa Stankovic Holiday: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా హాలీడే మూడ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2023 తర్వాత దొరికిన విరామ సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించాడు. ఈ క్రమంలో భార్య నటాషా, కొడుకు అగస్త్యతో కలిసి థాయ్‌లాండ్‌లో వాలిపోయాడు. ఫుకెట్‌లో కుటుంబంతో కలిసి సెలవులను ఆస్వాదిస్తున్నాడు. భార్యా, కొడుకుతో స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడుతూ సేదతీరుతున్నాడు. నచ్చిన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఏనుగులకు అరటిపండ్లు తినిపిస్తూ ఈ ముగ్గురూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతున్న ఫొటోలు, వీడియోలను హార్దిక్ భార్య నటాషా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో అగస్త్య ఏనుగులకు అరటిపండ్లు తినిపిస్తున్న దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. రన్నరప్‌తో సరి కాగా ఐపీఎల్-2023లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరుకుంది. అయితే, అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుదిపోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ధోని సేన ఐదోసారి చాంపియన్‌గా అవతరించగా... వరుసగా రెండోసారి విజేతగా నిలవాలనుకున్న టైటాన్స్‌కు నిరాశే మిగిలింది. విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ సారథిగా! ఇక క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్ ముగిసిన తర్వాత టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో తలపడింది. దీంతో ప్రధాన ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తదితరులు ఇంగ్లండ్‌కు వెళ్లగా.. హార్దిక్ పాండ్యాకు కావాల్సినంత విశ్రాంతి లభించింది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన రోహిత్ సేన.. జూలై 12 నుంచి వెస్టిండీస్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సుదీర్ఘ విరామం అనంతరం హార్దిక్ పాండ్యా మరోసారి మైదానంలో దిగనున్నాడు. విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు పాండ్యా సారథ్యం వహించే అవకాశం ఉంది. చదవండి: స్కాట్లాండ్ ప్లేయర్ విధ్వంసం; ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం కనీస ధర 350 కోట్లేనా!.. బీసీసీఐ ఎందుకిలా? View this post on Instagram A post shared by Nataša Stanković Pandya 🧡 (@natasastankovic__) -
పాపం.. జడేజా హర్ట్ అయి ఉంటాడు.. సీఎస్కే సీఈఓ కామెంట్స్ వైరల్
Ravindra Jadeja- MS Dhoni: ‘‘అతడు బ్యాటింగ్ చేయడానికి వెళ్లే సమయానికి దాదాపు 5-10 బంతులో మిగిలి ఉన్న సమయంలో.. కొన్నిసార్లు షాట్లు ఆడగలడు. లేదంటే మిస్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, తన తర్వాత ధోని బ్యాటింగ్‌కు రావాల్సి ఉంటుందని తనకు తెలుసు. కాబట్టి ఒక్కోసారి తనకు రెండు- మూడు బంతులు మాత్రమే ఆడే ఛాన్స్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ధోని మైదానంలో అడుగుపెట్టగానే ప్రేక్షకులు అతడి నామస్మరణ మొదలుపెట్టడం సహజం. అంతేగాక ధోని రాక కోసం ఒక్కోసారి జడేజా తొందరగా అవుట్ కావాలని కోరుకుంటారు కూడా! బహుశా ఈ విషయం జడేజా మనసును గాయపరిచి ఉండొచ్చు. అలాంటి సమయంలో ఏ ఆటగాడైనా అలాగే ఫీల్ అవుతాడు. ఒత్తిడిలో కూరుకుపోతాడు. కానీ ఈ విషయం గురించి ఒక్కసారి కూడా అతడు మాకు కంప్లైంట్ చేయలేదు. తను ఆ ట్వీట్ చేసినప్పటికీ ఆ విషయం గురించి మా దగ్గర ప్రస్తావించలేదు’’ అని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ అన్నాడు. ధోనిపై ప్రేమ.. జడ్డూ మనసుకు గాయం సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విషయంలో అభిమానుల ప్రేమ.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కొన్నిసార్లు బాధపెట్టిన మాట వాస్తవమేనని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023 ధోనికి చివరిదన్న వార్తల నేపథ్యంలో ఎక్కడ చూసినా ధోని నామస్మరణే సాగింది. చెన్నై సొంతమైదానం అనే కాకుండా ఇతర స్టేడియాల్లో కూడా సీఎస్కే మ్యాచ్ ఉందంటే ధోని పేరుతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. జడ్డూ ట్వీట్‌పై అభిమానుల ఆగ్రహం ఇక బ్యాటింగ్ ఆర్డర్లో జడ్డూ తర్వాత ధోని ఎంట్రీ ఇచ్చే నేపథ్యంలో ఫ్యాన్స్ ఒక్కోసారి.. జడేజాను తొందరగా అవుట్ అవ్వాలంటూ కామెంట్లు చేశారు. ధోని మీద వారికున్న ప్రేమ.. జడేజాకు ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో మనసు చిన్నబుచ్చుకున్న ఈ స్పిన్ ఆల్‌రౌండర్.. జట్టును గెలిపించి అవార్డు అందుకున్న సందర్భంలో.. ‘‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరో ఇప్పటికైనా తెలిసిందా?’’అన్న అర్థంలో ట్వీట్ చేశాడు. దీంతో జడేజాపై సీఎస్కే అభిమానులు కూడా విరుచుకుపడ్డారు. ధోని మీద ఆప్యాయత చూపినంత మాత్రాన నిన్ను తక్కువ చేసినట్లు కాదని.. అయినా నువ్వు ఇలా ఎలా ఆలోచిస్తావంటూ చివాట్లు పెట్టారు. ధోనిని అవమానించావంటూ మండిపడ్డారు. ఫైనల్లో బౌండరీ బాది అయితే, ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో బౌండరీ బాది జడేజా.. సీఎస్కేను విజయతీరాలకు చేర్చిన తర్వాత ధోని భయ్యా కోసం ఏదైనా చేస్తా అంటూ అతడు చేసిన ట్వీట్ అభిమానుల కోపాన్ని చల్లార్చింది. నిజంగానే జడ్డూకు ధోని అంటే ఎంత ప్రేమో అని ఫ్యాన్స్ మురిసిపోయారు. ఈ నేపథ్యంలో జడేజా క్రిప్టిక్ పోస్ట్‌పై తాజాగా స్పందించిన కాశీ విశ్వనాథన్ ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో వ్యాఖ్యానించాడు. జడ్డూ స్థానంలో ఎవరున్నా హర్ట్ అవడం సహజమని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023 విజేతగా నిలిచిన ధోని సారథ్యంలోని సీఎస్కే ఐదోసారి ట్రోఫీ గెలిచింది. చదవండి: Ind Vs WI: విండీస్‌కు కష్టాలు! సందిగ్దంలో టీమిండియాతో టెస్టు సిరీస్! ధోనికి పిల్లనిచ్చిన అత్తగారు! ఆ కంపెనీ సీఈఓ.. రూ. 800 కోట్ల సామ్రాజ్యం! M.O.O.D! 🤗 Ravindra Jadeja 🤝 MS Dhoni#TATAIPL | #Final | #CSKvGT | @imjadeja | @msdhoni pic.twitter.com/uggbDA4sFd — IndianPremierLeague (@IPL) May 29, 2023 Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
ధోనికి పిల్లనిచ్చిన అత్తగారు! ఆ కంపెనీ సీఈఓ.. రూ. 800 కోట్ల సామ్రాజ్యం!
Meet Sheila Singh, MS Dhoni's CEO mother-in-law: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరే ఓ ఎమోషన్. టీమిండియా దిగ్గజ కెప్టెన్‌గా నీరాజనాలు అందుకుంటున్న మిస్టర్ కూల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నాడు. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఐదోసారి చాంపియన్‌గా నిలిపి తనలో సత్తా ఇంకా తగ్గలేదని మరోసారి చాటిచెప్పాడు. రెండు చేతులా సంపాదిస్తున్న ధోని సారథిగా టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోని.. తనకున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడంలోనూ ముందే ఉంటాడు. వివిధ బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న ఈ జార్ఖండ్ డైనమైట్.. యాడ్స్ రూపంలో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. పిల్లనిచ్చిన అత్త.. సీఈఓగా.. 800 కోట్లు! అంతేకాదు.. ఇప్పటికే పలు వ్యాపార సంస్థలలో పెట్టుబడి పెట్టిన మహేంద్రుడు.. వినోద రంగంలోనూ కాలుమోపిన విషయం తెలిసిందే. ధోని ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పేరిట ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేశాడు. మరి కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరో తెలుసా? ధోనికి పిల్లనిచ్చిన అత్తగారు షీలా సింగ్ అట! డీఎన్ఏ నివేదిక ప్రకారం.. తన ప్రొడక్షన్ హౌజ్‌లో కుటుంబ సభ్యులకు పెద్దపీట వేయాలని భావించిన ఎంఎస్.. భార్య సాక్షి సింగ్, ఆమె తల్లి షీలా సింగ్‌కు కీలక బాధ్యతలు అప్పగించాడు. దక్షిణాదిలో తమ బ్యానర్‌పై పలు సినిమాలు నిర్మిస్తున్న ధోని ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ విలువ దాదాపు 800 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ కంపెనీలో సాక్షి బిగ్గెస్ట్ షేర్‌హోల్డర్‌గా ఉన్నట్లు సమాచారం. వియ్యంకులు ఒకేచోట పనిచేశారు! కాగా సాక్షి తండ్రి ఆర్కే సింగ్, ధోని తండ్రి పాన్ సింగ్‌తో కలిసి గతంలో ఒకే చోట పనిచేశారట. బినాగురి అనే టీ కంపెనీలో వారు సహోద్యోగులు అని సమాచారం. ఆ సమయంలో గృహిణిగా ఇంటి బాధ్యతలు నిర్వర్తించిన షీలా సింగ్.. అల్లుడు ధోని విజ్ఞప్తి మేరకు కూతురితో కలిసి బిజినెస్‌వుమెన్‌గా అవతారమెత్తినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ధోని నెట్‌వర్త్ దాదాపు 1030 కోట్ల మేర ఉంటుందని పలు నివేదికలు అంచనా వేశాయి. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌లో సూపర్ హిట్ ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో సీఎస్కే సారథిగా ఉన్న ధోని ఇప్పటి వరకు ఆ జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించాడు. ఇక టీమిండియా ఫినిషర్‌గా పలు చిరస్మరణీయ విజయాలు అందించిన ధోని.. తన కెరీర్లో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 4876, వన్డేల్లో 10773, టీ20లలో 1617 పరుగులు సాధించాడు. 2020 ఆగష్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మిస్టర్ కూల్.. ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే ధోని- సాక్షి 2010, జూలై 4న వివాహ బంధంతో ఒక్కటి కాగా.. 2015 ఫిబ్రవరి 6న వీరికి కూతురు జివా జన్మించింది. చదవండి: Ind Vs WI: ఆ ముగ్గురు దూరం.. యువ సంచలనం ఎంట్రీ! 20 లక్షలు అనుకుంటే ఏకంగా కోటీశ్వరుడయ్యాడు! జూబ్లీహిల్స్‌లో బంగ్లా, కార్లు.. తగ్గేదేలే! -
టీమిండియా ఎంట్రీ పక్కా! రింకూ షర్ట్‌లెస్ ఫొటోపై గిల్ సోదరి కామెంట్.. వైరల్
India Vs West Indies 2023: ఐపీఎల్-2023లో దుమ్ములేపాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టి కేకేఆర్‌ను గెలిపించిన తీరు హైలైట్‌గా నిలిచింది. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురిసింది. ఇక తాజా సీజన్లో మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడిన రింకూ.. 149.52 స్ట్రైక్‌రేటుతో 474 పరుగులు సాధించాడు. కేకేఆర్ ఫినిషర్‌గా అద్భుతంగా రాణించిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ ఖాతాలో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా తన నైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకున్న రింకూ త్వరలోనే టీమిండియా అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఈ యూపీ బ్యాటర్ టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా ఎంట్రీ పక్కా ఈ నేపథ్యంలో.. ‘‘మా హీరో రింకూ టీమిండియా ఎంట్రీ పక్కా’’ అంటూ అతడి పేరును ప్రస్తావిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతడి మాల్దీవ్స్ టూర్ ఫొటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గిల్ సోదరి కామెంట్ వైరల్ ఇందులో తన కండలు చూపిస్తూ షర్ట్‌లెస్‌గా ఉన్న రింకూ ఫొటోకు.. టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సోదరి షానీల్ ఇచ్చిన రిప్లై హైలైట్ అవుతోంది. రింకూ పోస్ట్‌పై స్పందిస్తూ.. ‘‘ఓ హీరో’’ అని షానిల్ కామెంట్ చేసింది. ఈ పోస్ట్ తాజాగా మరోసారి నెట్టింట చర్చనీయాంశంగా మారింది. కాగా ఐపీఎల్-2023 టోర్నీ ముగిసిన తర్వాత రింకూ మాల్దీవుల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక శుబ్‌మన్ సోదరి షానిల్ గిల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్రమించేలా అద్భుత రీతిలో గిల్ ఆడటంతో షానిల్ పేరును ప్రస్తావిస్తూ కొంతమంది ఆకతాయిలు దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో ఏకంగా ఢిల్లీ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. షానిల్ను ఉద్దేశించి అసభ్యకర కామెంట్లు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇదిలా ఉంటే జూలై 12 నుంచి టీమిండియా వెస్టిండీస్ పర్యటన మొదలుకానుంది. చదవండి: 20 లక్షలు అనుకుంటే ఏకంగా కోటీశ్వరుడయ్యాడు! జూబ్లీహిల్స్‌లో బంగ్లా, కార్లు.. తగ్గేదేలే! శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం! వచ్చే సీజన్లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా! రోహిత్ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్‌ను చేసిందంటే.. -
ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్‌కు ధోని బహుమతి
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత సారధి మహేంద్రసింగ్ ధోని ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు, ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్భాజ్‌కు ఓ బహుమతి పంపాడు. ధోని తాను సంతకం చేసిన సీఎస్కే జెర్సీని గుర్భాజ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయాన్ని గుర్భాజ్ తన ఇన్‌స్టా ఖాతా ద్వారా వెల్లడించాడు. ధోని పంపిన గిఫ్ట్‌ను పట్టుకుని ఫోటోకు పోజిస్తూ.. తాను అడిగిన బహుమతిని పంపినందుకు ధోనికి కృతజ్ఞతలు తెలిపాడు. భారత్ నుంచి ఈ గిఫ్ట్ పంపినందుకు థ్యాంక్స్ మాహీ సర్ అని ఇన్‌స్టా పేజీలో రాసుకొచ్చాడు. కాగా, ఐపీఎల్ 2023లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన గుర్భాజ్.. ఆ సీజన్ ప్రారంభానికి ముందు తనకు ధోనితో కలిసి లేక ధోనికి ప్రత్యర్ధిగా ఆడాలని కోరిక ఉందని తెలిపాడు. ఆ సీజన్లోనే గుర్భాజ్ కోరిక తీరింది. గుర్భాజ్ టీమ్ కేకేఆర్.. సీఎస్కేతో ఓ మ్యాచ్ ఆడింది. అయితే ఆ మ్యాచ్‌లో గుర్భాజ్ విఫలమయ్యాడు. 4 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో విఫలమైనా గుర్భాజ్ ఐపీఎల్ 2023 సీజన్ మొత్తంలో ఓ మోస్తరుగా రాణించాడు. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన గుర్భాజ్.. 20.64 సగటున, 133.53 స్ట్రయిక్ రేట్‌తో 227 పరుగులు చేశాడు. గుర్భాజ్ ఈ సీజన్లో వికెట్ల వెనుక కూడా అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్యాచ్‌తో జనాలు గుర్భాజ్‌ను ధోనితో పోల్చడం మొదలుపెట్టారు. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటం, వికెట్ల వెనుక చురుకుగా ఉండటంతో ఆఫ్ఘన్ అభిమానులు గుర్భాజ్‌ను ఆఫ్ఘన్ కా ధోని అని పిలుచుకుంటారు. ఇదిలా ఉంటే, తన అభిమానించే వారికి సంతకం చేసిన జెర్సీ పంపించడం ధోనికి అలవాటే. 2022లో పాక్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్‌కు కూడా ధోని ఇలాగే సైన్డ్ జెర్సీని బహుమతిగా పంపాడు. -
శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం! వచ్చే సీజన్లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా!
IPL 2024- Shubman Gill: ఐపీఎల్-2023లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్. గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ హ్యాండ్సమ్ బ్యాటర్ 17 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 890 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా మూడు సెంచరీలు, 4 అర్ధ శతకాలు ఉండటం విశేషం. టోర్నీ ఆసాంతం అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన ఈ పంజాబ్ క్రికెటర్ అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఆరెంజ్ క్యాప్‌తో పాటు మరెన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను మరోసారి ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా భవిష్యత్ కెప్టెన్ ఇక మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా ఓపెనర్‌గా తన స్థానం సుస్థిరం చేసుకున్న 23 ఏళ్ల శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గిల్ భవిష్యత్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉందంటూ ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు అతడి నైపుణ్యాలను కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న సీజన్లో అతడు గుజరాత్ టైటాన్స్ గుడ్ బై చెప్పనున్నట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఐపీఎల్-2024లో గిల్ కొత్త జట్టుకు మారనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గిల్ ఎందుకు టైటాన్స్‌ను వీడాలనుకుంటున్నాడు? గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2022 సీజన్లో క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గతంలో కెప్టెన్సీ అనుభవం లేని టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను సారథిగా నియమించగా.. అరంగేట్ర సీజన్లోనే జట్టును విజేతగా నిలిపి చరిత్ర సృష్టించాడతడు. తాజా ఎడిషన్‌లోనూ గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చి సత్తా చాటాడు పాండ్యా. ఇక 29 ఏళ్ల పాండ్యా ప్రస్తుతం భారత పరిమిత ఓవర్ల కెప్టెన్ అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్నీ అనుకూలిస్తే అతడు మరో 7-8 ఏళ్ల పాటు గుజరాత్ సారథిగా కూడా కొనసాగుతాడనడంలో సందేహం లేదు. పంజాబ్ లేదంటే సన్‌రైజర్స్ కెప్టెన్‌గా! అదే జరిగితే.. కీలక బ్యాటర్‌గా ఉన్న శుబ్‌మన్ ఆటగాడిగా కొనసాగుతాడే తప్ప కెప్టెన్ అయ్యే అవకాశాలు తక్కువ. ఈ నేపథ్యంలో అతడు గుజరాత్‌ను వీడి కొత్త జట్టులో చేరాలనుకుంటున్నట్లు సమాచారం. కెప్టెన్ కావాలని ఆశ పడుతున్న శుబ్‌మన్.. సొంత రాష్ట్రానికి చెందిన పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ లేదంటే.. సరైన సారథి కోసం ఎదురు చూస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడాలని భావిస్తున్నాడట. ఇప్పట్లో గుజరాత్ టైటాన్స్ పగ్గాలు చేపట్టే అవకాశం లేదు కాబట్టి ఫ్రాంఛైజీతో తెగదెంపులు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడట. రోహిత్, హార్దిక్ మాదిరే! ముంబై బ్యాటర్ అయిన రోహిత్ శర్మ సొంత జట్టు ముంబై ఇండియన్స్‌కు సారథిగా కొనసాగుతుండగా.. హార్దిక్ పాండ్యా సైతం స్వరాష్ట్ర ఫ్రాంఛైజీ కెప్టెన్న్ఘున్నాడు. వీళ్ల మాదిరే తాను సైతం పంజాబ్ జట్టు నాయకుడు కావాలని గిల్ ఆశపడుతున్నాడట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న తలంపుతో సూపర్ ఫామ్‌లో ఉన్నపుడే తనకున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలన్నదే గిల్ సంకల్పమట. ఏదేమైనా గుజరాత్ టైటాన్స్ టాప్ బ్యాటర్‌గా ఉన్న శుబ్‌మన్ ఆ జట్టును వీడితే మాత్రం వాళ్లకు కష్టాలు తప్పవు. ఒకవేళ నిజంగానే గిల్ టైటాన్స్‌తో బంధం తెంచుకుంటాడా? లేదంటే అదే ఫ్రాంఛైజీతో కొనసాగుతాడా అన్న అంశంపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఊహాగానాలు తప్పవు!! చదవండి: రోహిత్ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్‌ను చేసిందంటే.. 2014లో పెళ్లి.. ఇంత పెద్ద కూతురు ఎలా? హీరోయిన్లా ఉంది! ఎంతైనా.. -
IPL 2023: నిజంగానే ఆరోజు ఓవరాక్షన్ చేశాను! నా ప్రవర్తన వల్ల..
IPL 2023 RCB Vs LSG: టీమిండియా క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ ఆవేశ్ ఖాన్.. ఆర్సీబీతో మ్యాచ్‌లో తన ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తాను అలా హెల్మెట్ విసిరి ఉండాల్సింది కాదన్నాడు. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయానని.. ఏదేమైనా అలా అతి చేయడం తప్పేనని అంగీకరించాడు. కాగా ఐపీఎల్-2023లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తొలిసారి తలపడిన మ్యాచ్‌లో లక్నో అనూహ్య రీతిలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓటమి తప్పదు అనుకున్న తరుణంలో ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో లక్నో జయకేతనం ఎగురవేసింది. హెల్మెట్ తీసి నేలకేసి కొట్టి చిన్నస్వామి స్టేడియంలో ఈ దృశ్యాన్ని చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ హృదయాలు ముక్కలు కాగా.. ఆ సమయంలో క్రీజులో ఉన్న ఆవేశ్ ఖాన్ ఓవర్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. హెల్మెట్ తీసి నేలకేసి కొట్టి దూకుడు ప్రదర్శించాడు. దీంతో ఆవేశ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో అతడిని దారుణంగా ట్రోల్ చేశారు. ఇక బీసీసీఐ సైతం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మందలించింది. మొదటి తప్పిదం కాబట్టి ఈసారికి వదిలేస్తున్నామంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేశ్ ఖాన్ ఈ విషయంపై స్పందించాడు. నా ప్రవర్తన వల్ల.. ఆ ఘటన తర్వాత తాను ఓవరాక్షన్ చేయకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపపడ్డాడు. ‘‘హెల్మెట్ విసరడం కాస్త ఓవర్ అయ్యింది. ఈ ఘటన కారణంగా సోషల్ మీడియాలో నాపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. నిజానికి గెలిచామన్న సంతోషంలో నేనలా చేశానే తప్ప ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. ఆ క్షణంలో అలా జరిగిపోయిందంతే! కానీ మైదానం వీడిన తర్వాతే నేనేం చేశానో నాకు తెలిసి వచ్చింది. ఆ విషయంలో ఇప్పటికీ నేను చింతిస్తున్నాను. అలా ఎందుకు చేశానన్న బాధ వెంటాడుతూనే ఉంది’’ అని ఆవేశ్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్‌నకు చేరుకున్న లక్నో.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజా సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ చాంపియన్‌గా నిలవగా.. గుజరాత్ టైటాన్స్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవనంత మాత్రాన.. కెప్టెన్సీ నుంచి తొలగిస్తారా? ఇలా చేస్తే.. 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు! 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win! A roller-coaster of emotions in Bengaluru 🔥🔥 Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT — IndianPremierLeague (@IPL) April 10, 2023 -
రూ. లక్ష ఇవ్వాల్సిందే! అక్కడుంది హార్దిక్ కదా! 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి మరీ..
Hardik Pandya Wedding Unseen Video: పెళ్లంటే సందళ్లు.. ఆటపాటలు.. వదినామరదళ్లు- బావాబామ్మర్దుల సరదాలు.. వధూవరులు, వారి కుటుంబాలను దగ్గర చేసేందుకు ఆడే చిలిపి ఆటలు.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, భవిష్యత్ కెప్టెన్‌గా ఎదుగుతున్న హార్దిక్ పాండ్యా వివాహ వేడుకలో ఇలాంటి సన్నివేశాలెన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా అందులోని వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో వెలుగులోకి వచ్చిన పాండ్యా అనతికాలంలోనే భారత పేస్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. సెర్బియన్ మోడల్ నటాషా స్టాంకోవిక్‌ను ప్రేమించిన అతడు.. 2020లో ఆమెను పెళ్లాడాడు. అప్పటికే నటాషా గర్భవతి కాగా.. వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఈ క్రమంలో 2023 ఫిబ్రవరి 14న హిందూ, క్రిస్టియన్ వివాహ పద్ధతిలో కొడుకు అగస్త్య సమక్షంలో అంగరంగా వైభవంగా హార్దిక్- నటాషాలు మరోసారి వివాహం చేసుకున్నారు. ఈ వేడుకలో భాగంగా హార్దిక్ పాండ్యా వదిన, నటాషా తోటికోడలు ఫాంకురి శర్మ(కృనాల్ పాండ్యా భార్య) .. ‘‘జూతా చురాయి(పాదరక్షలు దాచిపెట్టడం)’’ పేరిట మరిదిని ఆటపట్టించింది. అడిగినంత డబ్బు కానుకగా ఇస్తేనే బూట్లు ఇస్తానంటూ మెలిక పెట్టింది. ఈ సందర్భంగా లక్ష రూపాయలు ఇవ్వాలని హార్దిక్‌ను డిమాండ్ చేసింది. అయితే, ఇందుకు స్పందించిన హార్దిక్.. లక్ష కాదు ఏకంగా ఐదు లక్షలు ఇస్తానంటూ వదినమ్మను ఖుషీ చేశాడు. వెంటనే డబ్బును ఫాంకురి అకౌంట్‌కు బదిలీ చేయాలంటూ తమ వాళ్లకు చెప్పాడు. అయినప్పటికీ.. ఫాంకురి ఆటపట్టించడం మానలేదు. డబ్బు పూర్తిగా ట్రాన్స్ఫర్ అయిన తర్వాతే షూస్ ఇస్తానని చెప్పింది. అలా సరదాగా సాగిన ఈ వేడకకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా ఐపీఎల్-2023లో తమ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. కానీ ఆఖరి మెట్టుపై చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో ఓటమిపాలు కావడంతో డిపెండింగ్ చాంపియన్ గుజరాత్ ఈసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే.. హార్దిక్ ప్రస్తుతం వెస్టిండీస్‌తో సిరీస్‌కు సిద్ధమయ్యే పనిలో ఉన్నాడు. చదవండి: 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు! Ameeri ho to aisi ho. Hardik Pandya jitna ameer hona hai life me pic.twitter.com/qyHvfkxFWq — CS Rishabh (Professor) (@ProfesorSahab) June 18, 2023 -
సచిన్, ధోని, కోహ్లి, రోహిత్.. రుతురాజ్ కూడా వీళ్ల బ్యాచ్‌లో చేరిపోయాడు..!
టీమిండియా యంగ్ క్రికెటర్, నయా మిస్టర్ కూల్, ధోని శిష్యుడు రుతురాజ్ గైక్వాడ్ తన గురువు ధోని, క్రికెట్ దిగ్గజం సచిన్, రన్ మెషీన్ విరాట్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మల జాబితాలో చేరిపోయాడు. పై పేర్కొన్న నలుగురు దిగ్గజాలలా రుతురాజ్‌కు కూడా పాదాభివందనం చేసే ఫ్యాన్స్ దొరికారు. ఇలా అనడం కంటే రుతురాజ్ అభిమానుల పాదాభివందనం నోచుకునే స్థాయికి ఎదిగాడనడం కరెక్ట్ అవుతుందేమో. ప్రస్తుతం జరుగుతున్న మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్)లో ఓ మ్యాచ్ సందర్భంగా ఓ ప్రేక్షకుడు (రుతురాజ్ వీరాభిమాని) మైదానంలోకి ప్రవేశించి, రుతురాజ్ కాళ్లను మొక్కాడు. సీఎస్కే ఫ్యాన్స్ ఆర్మీ ఈ సీన్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరలవుతుంది. A fan touched the feet of Ruturaj Gaikwad in Maharashtra Premier league 💛#WhistlePodu #Yellove #CSK pic.twitter.com/pA3RNUcjGk — CSK Fans Army™ (@CSKFansArmy) June 18, 2023 ఎంపీఎల్-2023లో పునేరీ బప్పా ఫ్రాంచైజీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్.. కొల్హాపూర్ టస్కర్స్‌తో జరిగిన ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో 27 బంతులను ఎదుర్కొన్న రుతు.. 5 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 237.04 స్ట్రయిక్ రేట్‌తో 64 పరుగులు సాధించాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో పునేరీ బప్పా టీమ్.. కొల్హాపూర్ టస్కర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇటీవలే తన చిన్ననాటి స్నేహితురాలు ఉత్కర్ష పవార్‌ను మనువాడిన రుతురాజ్.. కొల్హాపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో తన భార్య జెర్సీ నంబర్‌తో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్ సందర్భంగానే అభిమాని రుతురాజ్‌కు పాదాభివందనం చేశాడు. ఇదిలా ఉంటే, రుతురాజ్ గైక్వాడ్ తన కామ్ బిహేవియర్ కారణంగా తరుచూ ఎంఎస్ ధోనితో పోల్చబడుతుంటాడు. అలాగే అతనికి ధోనిలా అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని సురేశ్ రైనా లాంటి సీనియర్ క్రికెటర్ ప్రశంసించాడు. తాజాగా ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలోనూ రుతురాజ్ తన గురువు బాటలో నడుస్తుండటంతో అభిమానులంతా ఇతన్ని ధోనితో పోలుస్తున్నారు. కొందరు రుతురాజ్‌ను టీమిండియా భవిష్యత్తు కెప్టెన్‌గా అభివర్ణిస్తున్నారు. -
దినేష్ కార్తీక్‌కు బిగ్ షాక్ ఇవ్వనున్న ఆర్సీబీ.. అతడితో పాటు!
ఐపీఎల్-2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. కనీసం ఈ సీజన్లోనైనా ఛాంపియన్స్‌గా నిలుస్తుందని భావించిన అభిమానులకు.. ఆర్సీబీ మరోసారి నిరాశ మిగిల్చింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం ఏడింటిలో గెలిచి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సీజన్‌కు ముందు తమ జట్టులో ప్రక్షాళనకు ఆర్సీబీ సిద్దమైనట్లు తెలుస్తోంది. . ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న మినీ వేలంలో పక్కా ప్రణాళికలతో రావాలని ఆర్సీబీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది సీజన్లో పేలవ ప్రదర్శన కనబరిచిన దినేష్ కార్తీక్‌కు ఆర్సీబీ గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-16వ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన డికే..11.67 సగటుతో కేవలం 140 పరుగులు మాత్రమే చేశాడు. అతడి స్ధానంలో మరో యువ వికెట్ కీపర్‌ను తీసుకోవాలని బెంగళూరు భావిస్తున్నట్లు సమాచారం. అతడితో పాటు విదేశీ ఆటగాళ్లు వనిందూ హసరంగా, జోష్ హాజిల్ వుడ్, ఫిన్ అలెన్‌ను కూడా విడిచిపెట్టాలని ఆర్సీబీ ఫ్రాంచైజీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో హసరంగాను రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆ సీజన్లో పర్వాలేదనపించినప్పటికీ.. ఈ ఏడాది మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. మరోవైపు జోష్ హజెల్‌వుడ్‌ను 7.75 కోట్లకు సొంతం చేసుకుంది. అతడు గాయం కారణంగా ఈ ఏడాది సీజన్లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతడి ఫిట్నెస్ దృష్ట్యా వచ్చే సీజన్‌కు ముందు సాగనింపాలని ఆర్సీబీ భావిస్తోంది. చదవండి: గత ఆరేడేళ్ల నుంచి చూస్తున్నా.. సెలక్టర్లకు కొంచెం కూడా తెలివి లేదు: భారత మాజీ క్రికెటర్ -
లక్నో ఆల్‌రౌండర్ సిక్సర్ల సునామీ.. తడిసి ముద్ద అయిన లార్డ్స్ మైదానం
టీ20 బ్లాస్ట్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ (ఐపీఎల్) ఆల్‌రౌండర్, ఎస్సెక్స్ ఫాస్ట్ బౌలర్, ఆసీస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్ విశ్వరూపం ప్రదర్శించాడు. నిన్న (జూన్ 18) మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్‌లో సామ్స్ 24 బంతుల్లో 8 సిక్సర్లు, 2 బౌండరీల సాయంతో 67 పరుగులు చేశాడు. సామ్స్ సిక్సర్ల సునామీలో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం తడిసిముద్ద అయ్యింది. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సామ్స్.. ఆ తర్వాత 3 బంతుల్లో వరుసగా 2 సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టి ఔటయ్యాడు. సామ్స్‌కు జతగా డేనియల్ లారెన్స్ (30 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మైఖేల్ పెప్పర్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్సెక్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం మిడిల్సెక్స్ భారీ లక్ష్య ఛేదనకు దిగగా వర్షం అంతరాయం కలిగించింది. 12.3 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఎస్సెక్స్ను విజేతగా ప్రకటించారు. ఆ సమయానికి మిడిల్సెక్స్ 2 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ సమీకరణల ప్రకారం మిడిల్సెక్స్ లక్ష్యానికి ఇంకా 22 పరుగులు వెనుకపడి ఉండింది. దీంతో అంపైర్లు ఎస్సెక్స్ను విజేతగా ప్రకటించారు. మిడిల్సెక్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ స్టీఫెన్ ఎస్కినాజీ (28), ర్యాన్ హిగ్గిన్స్ (32) ఓ మోస్తరు పరుగులు చేయగా.. జో క్రాక్నెల్ (36 నాటౌట్), మ్యాక్స్ హోల్డన్ (6 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లోనూ సత్తా చాటిన డేనియల్ సామ్స్ ఓ వికెట్ దక్కంచుకోగా.. డేనియల్ లారెన్స్ మరో వికెట్ పడగొట్టాడు. కాగా, 31 ఏళ్ల డేనియల్ సామ్స్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడినప్పుడు బాగా పాపులర్ అయ్యాడు. 2022 సీజన్లో అతను ఎంఐ తరఫున 11 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. 2023 వేలంలో సామ్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 75 లక్షలకు కొనుగోలు చేసింది. గత సీజన్లో అతను లక్నో తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. -
ఇరగదీస్తున్న సామ్ కర్రన్.. ఈసారి బంతితో విజృంభణ
టీ20 బ్లాస్ట్-2023లో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ ఇరగదీస్తున్నాడు. ఈ సీజన్లో పలు మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో రాణించిన కర్రన్.. నిన్న (జూన్ 16) సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతితో (4-0-26-5) చెలరేగాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహించిన సర్రే టీమ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. విల్ జాక్స్ (60), ఆఖర్లో క్రిస్ జోర్డాన్ (12 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. సోమర్సెట్ బౌలర్లలో బెన్ గ్రీన్ 4, డేవీ 3, మ్యాట్ హెన్రీ, వాన్ డెర్ మెర్వ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన సోమర్సెట్.. సామ్ కర్రన్ (5/26), క్రిస్ జోర్డాన్ (2/31), అట్కిన్సన్ (1/19) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమై, ఓటమిపాలైంది. సోమర్ సెట్ ఇన్నింగ్స్‌లో టామ్ బాంటన్ (53), టామ్ అబెల్ (39) పర్వాలేదనిపించారు. ఐపీఎల్లో 18.50 కోట్లు పెడితే తేలిపోయాడు.. ఇక్కడేమో ఇరగదీస్తున్నాడు ఐపీఎల్ 2023లో సామ్ కర్రన్‌పై పంజాబ్ కింగ్స్ 18.50 కోట్ల పెట్టుబడి పెడితే, అందులో పావు భాగానికి కూడా న్యాయం చేయలేకపోయాడు. అక్కడ బ్యాట్‌తో బంతితో తేలిపోయిన కర్రన్ స్వదేశంలో జరిగే టీ20 బ్లాస్ట్‌లో మాత్రం రెండు విభాగాల్లోనూ ఇరగదీస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యచ్‌లు ఆడిన కర్రన్.. ఓ ఫైఫర్ సాయంతో 12 వికెట్లు పడగొట్టి, బ్యాటింగ్‌లో 3 అర్ధసెంచరీల సాయంతో 252 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో కర్రన్ చేసింది తక్కువ పరుగులే అయినా, పలు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అలాగే కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి, తన జట్టు విజయాలకు దోహదపడ్డాడు. చదవండి: 546 పరుగులతో బంగ్లా గెలుపు.. 21వ శతాబ్దంలో అతిపెద్ద విజయం -
'టైటిల్ గెలిచిన మత్తులో ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యాం'
ఐపీఎల్ 16వ సీజన్ విజేతగా సీఎస్కే నిలిచిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది సీఎస్కే ఐదో ఐపీఎల్ టైటిల్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా సీఎస్కే విజయంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ డెవాన్ కాన్వే చాలా రోజులకు ఒక ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ''టైటిల్ గెలిచిన సంతోషంలో చాలా వైల్డ్‌గా సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అలా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయిన మాలో చాలా మంది ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యాం. మొయిన్ అలీ ఫ్యామిలీతో పాటు.. డ్వేన్ ప్రిటోరియస్ కూడా తర్వాతి రోజు వెళ్లారు. మా బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమోన్స్ కూడా ఫ్లైట్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు. మేమంతా ఒక రూమ్‌లో కూర్చొని సెలబ్రేట్ చేసుకోగా.. ధోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ధోనితో కలిసి గడిపిన సమయాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం.'' అంటూ తెలిపాడు. చదవండి: బ్రిజ్‌భూషణ్‌పై చార్జ్‌షీట్ దాఖలు 'నా సక్సెస్‌లో సగం క్రెడిట్ కేన్మామదే' -
'నా సక్సెస్‌లో సగం క్రెడిట్ కేన్మామదే'
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ ఒక సంచలనం. ముఖ్యంగా సీఎస్కేతో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో సాయి సుదర్శన్ 47 బంతుల్లోనే 96 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకముందు ముంబై ఇండినయ్స్తో జరిగిన క్వాలిఫయర్-2లోనూ 43 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్లో ఆడే అవకాశం తక్కువగా వచ్చినప్పటికి అందివచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకున్నాడు సాయి సుదర్శన్. ఓవరాల్‌గా ఈ సీజన్లో సాయి సుదర్శన్ 8 ఇన్నింగ్స్‌లు ఆడి 362 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్ఎపీల్ 2023)లో బిజీగా ఉన్న సాయి సుదర్శన్ పీటీఐకి ఇంటర్య్వూ ఇచ్చాడు. తన సక్సెస్‌లో సగం క్రెడిట్ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌దే అని తెలిపాడు. ఇక కేన్ విలియమ్సన్ ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే సీజన్లో తొలి మ్యాచ్‌లోనే గాయపడిన కేన్ విలియమ్సన్ స్వదేశానికి వెళ్లిపోయాడు. ''నా షాట్ల ఎంపికలో కొత్తదనం కనిపిస్తుంటే అది కేన్ విలియమ్స్‌న్ వల్లే. గాయంతో కేవలం ఒక్క మ్యాచ్‌కు మాత్రమే పరిమితమయి స్వదేశానికి వెళ్లినప్పటికి కేన్ మామతో నిత్యం టచ్‌లో ఉన్నా. బ్యాటింగ్‌లో టిప్స్‌తో పాటు కొంత ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవాడు. అంతేకాదు ఒక గేమ్‌లో ఇన్నింగ్స్ డీప్‌గా ఎలా ఆడాలనేదానిపై.. లిమిటేషన్స్ లేకుండా ఆటపై పట్టు ఎలా సాధించాలనే దానిపై సూచనలు ఇచ్చాడు. ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సమయంలో అతను ఎంపిక చేసుకున్న షాట్స్‌ను గమనించేవాడిని. అతను మూడు ఫార్మాట్లలోనూ ఆడగల సమర్థుడు. అలాంటి ప్లేయర్ నుంచి బ్యాటింగ్‌లో బెటర్‌గా ఆడడం ఎలా అని నేర్చుకోవడం నాకు పెద్ద విషయం. ఇక మాథ్యూ వేడ్ పాడిల్, స్కూప్ షాట్స్ ఎలా ఆడాలో నేర్పించాడు.'' అంటూ తెలిపాడు. Sai Sudharsan said, "even when Kane Williamson left Gujarat Titans after injury, he was in regular touch with me, providing valuable feedback. He was telling me how to take the game deeper and how to maximise our abilities with our limitations". (To Indian Express). pic.twitter.com/1TjCD0pGqf — Mufaddal Vohra (@mufaddal_vohra) June 14, 2023 చదవండి: కౌంటీల్లో సరికొత్త చరిత్ర.. 501 పరుగుల టార్గెట్‌ను ఊదేశారు 'బూడిద' కోసం 141 ఏళ్లుగా.. 'యాషెస్' పదం ఎలా వచ్చిందంటే? -
నవీన్ ఉల్ హక్ కరెక్ట్ కాబట్టి అతనిపై వైపే నిలబడ్డా.. కోహ్లితో వివాదంపై గంభీర్ కామెంట్స్
ఐపీఎల్ 2023 సందర్భంగా విరాట్ కోహ్లితో చోటు చేసుకున్న వివాదంపై గౌతమ్ గంభీర్ తొలిసారి స్పందించాడు. నాటి తన ప్రవర్తనను గంభీర్ సమర్ధించుకున్నాడు. నాటి ఉదంతంలో నవీన్ తప్పేమీ లేదని.. తన దృష్టిలో నవీన్ చేసింది కరెక్ట్ కాబట్టి, అతనికి అండగా నిలబడ్డాడని, మెంటార్‌గా అది నా కనీస బాధ్యత అని వివరణ ఇచ్చాడు. ఒకవేళ ఆ సందర్భంలో కోహ్లి చేసింది కరెక్ట్ అయ్యుంటే, అతని పక్షాన నిలబడేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదని తెలిపాడు. ఆట ఏదైనా ప్రతి ఆటగాడు గెలవాలని కోరుకోవడం సహజమని.. అందుకోసం ఎవరు కూడా హద్దులు దాటాల్సి పని లేదని హితవు పలికాడు. తన దృష్టిలో ఏ ఆటగాడైనా ఒకటేనని.. ధోనితో అయినా విరాట్‌తో అయినా తన అనుబంధం ఒకటేలా ఉంటుందని.. కోహ్లితో జరిగిన వాగ్వాదం మైదానానికే పరిమితం అని వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాడు. పరాయి దేశ ఆటగాడికి అండగా నిలబడి, స్వదేశీ ఆటగాడితో వాగ్వాదానికి దిగాడని వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. తన దృష్టిలో మన, పరాయి బేధాలు లేవని, ఎవరిది కరెక్ట్ అనిపిస్తే వారి పక్షాన నిలబడతానని అన్నాడు. కాగా, ఐపీఎల్ 2023లో లక్నో-ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత నవీన్-విరాట్ మధ్య.. మ్యాచ్ అనంతరం గంభీర్-కోహ్లిల మధ్య వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా గంభీర్-కోహ్లిలు బాహాబాహీకి దిగినంత పనిచేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ గంభీర్, కోహ్లిలకు జరిమానా కూడా విధించింది. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి.. గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
IPL 2024: పాంటింగ్‌కు గుడ్‌బై.. ఢిల్లీ హెడ్ కోచ్‌గా గంగూలీ!
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడు స్ధానాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో భర్తీ చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక 2018 నుంచి ఢిల్లీ ప్రధాన కోచ్‌గా ఉన్న పాంటింగ్.. జట్టుకు ట్రోఫీని అందించడంలో విఫలమయ్యాడు. అదే విధంగా ఈ ఏడాది సీజన్లో అయితే ఢిల్లీ మరి చెత్త ప్రదర్శన కనబరిచింది. 4 మ్యాచ్‌ల్లో కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించింది. ఈ నేపధ్యంలోనే పాంటింగ్‌ను సాగనంపాలని ఢిల్లీ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గంగూలీ విషయానికి వస్తే.. దాదా ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్‌గా ఉన్నాడు. గంగూలీ 2019 ఐపీఎల్ ఎడిషన్‌లో మెంటార్‌గా ఢిల్లీ జట్టుతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 2019, 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆప్స్ చేరడంలో గంగూలీ కీలక పాత్ర పోషించాడు. అప్పుడు ఢిల్లీ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. అయితే ఈ వార్తలపై ఢిల్లీ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. చదవండి: WTC Final: కొంచెం ఆలోచించండి.. కోచ్‌గా ద్రవిడ్ జీరో: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన అంబటి రాయుడు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. అంబటి రాయుడితో పాటు సీఎస్కే ఫ్రాంచైజీ ఓనర్ ఎన్.శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్ కూడా సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల తమ జట్టు గెలిచిన ఐపీఎల్ 2023 ట్రోఫీని సీఎంకు చూపించారు. ఈ సందర్భంగా ఏపీలో క్రీడారంగం అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు సీఎం జగన్‌కు అంబటి రాయుడు వివరించారు. వారి సూచనల మేరకు పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఐపీఎల్లో అంబటి రాయుడు ప్రాతినిధ్యం వహించిన సీఎస్కే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించి, ఐదో సారి విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫైనల్ మ్యాచ్ ఆడి రాయుడు ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలికాడు. కాగా, రాయుడు.. సీఎం జగన్ కలవడం ఇటీవలికాలంలో ఇది రెండోసారి. ఐపీఎల్ ఫైనల్‌కు ముందు కూడా రాయుడు ఓసారి సీఎంను కలిశారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై రాయుడు సీఎం జగన్‌తో చర్చించారు.- మిడుతూరి జాన్ పాల్, సాక్షి వెబ్ డెస్క్ చదవండి: ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు -
Rahane Birthday: ఐపీఎల్ 2023తో బజ్ గేమ్ మొదలుపెట్టిన రహానే
టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే ఇవాళ (జూన్ 6) 35వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా బీసీసీఐ అతనికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. టీమిండియాకు రహానే కాంట్రిబ్యూషన్‌ను అంకెల రూపంలో (192 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 8268 పరుగులు, 15 సెంచరీలు) తెలియజేస్తూ ఓ ట్వీట్ చేసింది. అంతర్జాతీయ క్రికెట్లోకి జింక్స్ రీఎంట్రీ.. వయసు పైబడటం, ఆటలో వేగం లేకపోవడం, ఫామ్ కోల్పోవడం, యువ ఆటగాళ్ల ఎంట్రీతో అవకాశాలు రాకపోవడం వంటి వివిధ కారణాల చేత దాదాపుగా రిటైర్మెంట్ ప్రకటించే స్టేజ్ వరకు వెళ్లిన జింక్స్ (రహానే ముద్దు పేరు).. ఐపీఎల్-2023తో అనూహ్యంగా ఫ్రేమ్‌లోకి వచ్చాడు. ఎవరో గాయపడటంతో సీఎస్కేలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబైకర్.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, ఏకంగా టీమిండియా టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. 1️⃣9️⃣2️⃣ intl. matches 8️⃣2️⃣6️⃣8️⃣ intl. runs 1️⃣5️⃣ intl. centuries 💯 Here's wishing @ajinkyarahane88 a very happy birthday. 🎂👏🏻 #TeamIndia pic.twitter.com/162jbQlk2z — BCCI (@BCCI) June 6, 2023 అంతే కాకుండా కేఎల్ రాహుల్ గాయపడటంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత తుది జట్టులో కూడా చోటు కన్ఫర్మ్ చేసుకున్నాడు. 2022 జనవరిలో సౌతాఫ్రికాలో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన జింక్స్.. దాదాపు ఏడాదిన్నర తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేయనున్నాడు. ఐపీఎల్ 2023లో రహానే 2.0.. ఐపీఎల్ 2023లో ఆడే అవకాశాన్ని అనూహ్య పరిణామాల మధ్య దక్కించుకున్న జింక్స్.. ఈ సీజన్లో తనలోని కొత్త యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. రహానే 2.0గా ఫ్యాన్స్‌ను మెప్పించాడు. జిడ్డు బ్యాటర్ అన్న అపవాదును చెరిపివేస్తూ.. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంతో పాటు తన జట్టులో విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్ మొత్తం ఎదురుదాడే లక్ష్యంగా బరిలోకి దిగిన జింక్స్.. 11 ఇన్నింగ్స్‌ల్లో 172.49 స్ట్రయిక్‌రేట్‌తో 2 అర్ధసెంచరీల సాయంతో 326 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన ఆధారంగానే అతను టెస్ట్ జట్టులో చోటు కొట్టేశాడు. ఐపీఎల్ 2023తో బజ్ గేమ్ మొదలెట్టిన రహానే ఇదే ప్రదర్శనను డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. చదవండి: WTC Final: రోహిత్ శర్మకు గాయం..? టీమిండియా అభిమానుల ఆందోళన -
అదే జరిగితే CSK గెలిచేదే కాదు..!
-
IPL 2024: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిపై వేటు..?
ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు (రూ. 18.5 కోట్లు) సామ్ కర్రన్‌ను పంజాబ్ కింగ్స్ వదిలించుకోనుందా.. ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఐపీఎల్-2023లో సామ్ కర్రన్ నుంచి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పంజాబ్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోనుందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సైతం పరోక్షంగా సమర్ధించాడు. ఐపీఎల్ 2024 వేలానికి ముందు పంజాబ్.. కర్రన్‌ను తప్పక వదించుకోవాలని భావిస్తుంటుందని అన్నాడు. కర్రన్.. సీఎస్కే తరఫున అడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు పంజాబ్ తరఫున ఆడలేదని, అతనిపై పెట్టిన పెట్టుబడికి కనీస న్యాయం కూడా చేయలేదని తెలిపాడు. టీ20 వరల్డ్‌కప్-2022లో కర్రన్ ప్రదర్శన చూసి పంజాబ్ యాజమాన్యం తొందరపడిందని , అతనిపై వెచ్చించిన సొమ్ముతో నలుగురు నిఖార్సైన ఆల్రౌండర్లను సొంతం చేసుకొని ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. కర్రన్‌పై వెచ్చించిన సొమ్ములో పంజాబ్ కనీసం 50 శాతం కూడా రాబట్టలేకపోయిందని, అతనిపై భారీ అంచనాలే పంజాబ్‌ను వరుసగా తొమ్మిదో సారి ప్లే ఆఫ్స్‌కు చేరనీయకుండా చేశాయని తెలిపాడు. గత సీజన్లో కర్రన్‌కు కొత్త బాల్ అప్పజెప్పిన పంజాబ్.. అర్షదీప్‌కు అన్యాయం చేసిందని, అర్షదీప్ ఫెయిల్యూర్‌కు ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. కొత్త బంతితో కర్రన్ అద్భుతంగా చేయగలిగినప్పటికీ... భారత పిచ్‌లు అందుకు సహకరించవని అన్నాడు. కాగా, గత ఐపీఎల్ సీజన్లో కర్రన్ 13 ఇన్నింగ్స్‌ల్లో 135.96 స్ట్రయిక్ రేట్‌తో 276 పరుగులు చేసి, 10 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. -
శుభమన్ గిల్, రవీంద్ర జడేజా వద్దు ఇంగ్లాండ్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..!
-
జడేజా ఐపీల్ ఫైనల్లో వాడిన బ్యాట్ ఎవరికీ ఇచ్చాడో తెలుసా..!
-
క్రికెటర్ ని పెళ్ళాడుతున్న రుతురాజ్ గైక్వాడ్..!
-
ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా యువ ఓపెనర్.. ఫోటోలు వైరల్
టీమిండియా యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ ఓ ఇంటివాడయ్యాడు. శనివారం తన చిరకాల స్నేహితురాలు, మహారాష్ట్ర మాజీ క్రికెటర్ ఉత్కర్ష పవార్‌ను రుతు పెళ్లాడాడు. వీరిద్దరి వివాహం ముంబైలోని ఓ పంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను రుత్‌రాజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా వీరిద్దరూ తమ పెళ్లికి ముందు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇక ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఐపీఎల్-2023 చాంపియన్‌గా నిలిచిన తర్వాత సీఎస్కే ఆటగాళ్లు తమ భాగస్వాములతో కలిసి ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ సమయంలో రుతురాజ్ కూడా ఉత్కర్షతో కలిసి ఫోటోలు దిగాడు. అనంతరం సీఎస్కే కెప్టెన్ ధోనితో కూడా ఫోటో దిగడంతో ఈ జంట వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. కాగా రుతు మాదిరే ఉత్కర్ష సైతం క్రికెటర్. ఉత్కర్ష పవార్ 1998 అక్టోబర్ 13న మహారాష్ట్రలోని పుణేలో జన్మించింది. మహారాష్ట్ర తరఫున దేశవాలీ క్రికెట్ కూడా ఆడింది. 10 మ్యాచ్‌లు ఆడిన ఆమె 5 వికెట్ల పడగొట్టింది. క్రికెట్‌పై ఆసక్తితో ఉత్కర్ష 11 ఏళ్ల నుండే ఆడటం మొదలుపెట్టింది. ఇక ప్రస్తుతం ఆమె.. పుణెలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ సైన్సెస్ విధ్యను అభ్యసిస్తున్నట్లు సమాచారం. కాగా రుత్‌రాజ్ గైక్వాడ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ENG VS IRE One Off Test: ఆడటమే కాదు, ఏకంగా తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్ల ఘనత -
మోహిత్ కి పాండ్య పాఠాలు చెప్పడం ఏంటి ..!
-
T20 Blast: నవీన్ ఉల్ హక్‌ను చెడుగుడు ఆడుకున్న అనామక బ్యాటర్లు
ఐపీఎల్-2023లో ఓవరాక్షన్ చేసి (కోహ్లితో వివాదం) వార్తల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్ పేస్ బౌలర్ నవీన్ ఉల్ హక్‌ను ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో అనామక బ్యాటర్లు ఉతికి ఆరేశారు. లీసెస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నవీన్‌ను నిన్న (జూన్ 1) జరిగిన మ్యాచ్‌లో డెర్బిషైర్ బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు. ఈ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లు వేసిన నవీన్.. ఏకంగా 42 పరుగులు సమర్పించుకున్నాడు. నవీన్‌ను ముఖ్యంగా సెంచరీ హీరో వేన్ మ్యాడ్సన్ (61 బంతుల్లో 109 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) ఉతికి ఆరేశాడు. ఎడాపెడా బౌండరీలు బాది నవీన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. మ్యాడ్సన్తో పాటు థామస్ వుడ్ (24 బంతుల్లో 37; 7 ఫోర్లు), బ్రూక్ గెస్ట్ (20 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన డెర్బీషైర్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లీసెస్టర్‌షైర్ బౌలరల్లో నవీన్‌తో పాటు ముల్దర్ (3-0-34-0), విల్ డేవిస్ (3-0-36-0) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. పార్కిన్సన్ (2/36), రెహాన్ అహ్మద్ (2/20), అకెర్మన్ (1/16) వికెట్లు పడగొట్టారు. అనంతరం 190 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన లీసెస్టర్‌షైర్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి 2 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. నిక్ వెల్చ్ (20 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్), రిషి పటేల్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కొలిన్ అకెర్మన్ (38 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), రెహాన్ అహ్మద్ (14 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) లీసెస్టర్షైర్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. డెర్బీ బౌలర్లలో జాక్ చాపెల్ 2, మార్క్ వ్యాట్, జార్జ్ స్క్రిమ్షా, లూయిస్ రీత్ తలో వికెట్ పడగొట్టారు. -
వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియాకు మరో గుడ్ న్యూస్.. అతడు కూడా వచ్చేస్తున్నాడు!
వన్డే ప్రపంచకప్-2023కు ముందు భారత జట్టుకు మరో గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా భారత జట్టుకు దూరంగా ఉన్న స్టార్ ఓపెనర్ కేఎల్ రాహల్.. మరో రెండు వారాల్లో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో తన పునరవాసాన్ని(శిక్షణ) ప్రారంభించినున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్‌కు సారధ్యం వహించిన రాహుల్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. దీంతో గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అనంతరం లండన్‌లో రాహుల్ సర్జరీ చేసుకున్నాడు. సర్జరీ తర్వాత రాహుల్ తన భార్య అతియా శెట్టితో కలిసి ఊతకర్రల సాయంలో లండన్ వీధుల్లో నడుస్తూ కన్పించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ప్రస్తుతం రాహుల్ క్రచెస్(ఊతకర్రలు) లేకుండా నడవడం ప్రారంభించినట్లు సమాచారం. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం.. ఇక గాయం కారణంగా రాహల్ ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు దూరమయ్యాడు. అతడి స్థానాన్ని వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌తో బీసీసీఐ సెలక్షన్ కమిటీ భర్తీ చేసింది. అదే విధంగా ఆసియాకప్-2023కు కూడా రాహుల్ దూరమైనట్లే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అతడు పూర్తిఫిట్‌నెస్ సాధించాడనికి మరో మూడు నెలల సమయం పట్టనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కేఎల్ మళ్లీ వన్డే వరల్డ్‌కప్‌తో మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు రోడ్డు ప్రమాదంలో గాయ పడ్డ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా ఈ మెగా టోర్నీతోనే రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. వీరిద్దరితో పాటు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ప్రపంచకప్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు ఆ ఇద్దరంటే భయం పట్టుకుంది: పాంటింగ్ -
ధోని మోకాలి ఆపరేషన్ సక్సెస్
చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని మోకాలికి ఇవాళ (జూన్ 1) జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైందని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ వెల్లడించారు. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో నేటి ఉదయం ధోనికి సర్జరీ జరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ధోని ఫిట్‌గా ఉన్నాడని, మరో రెండు రోజుల పాటు అతను ఆసుపత్రిలోనే ఉంటాడని పేర్కొన్నారు. సర్జరీ అనంతరం తాను ధోనితో మాట్లాడానని.. శస్త్రచికిత్స గురించి వివరించలేను కానీ అది కీ-హోల్ ఆపరేషన్ అని మాత్రం చెప్పగలనని వివరించారు. మొత్తంగా ధోనికి జరిగిన ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని తెలిపారు. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్-2023లో మహీ మోకాలి సమస్యతో బాధపడిన విషయం తెలిసిందే. సీఎస్కే టైటిల్ గెలిచిన 48 గంటల్లోనే ధోని ఆసుపత్రిలో చేరాడు. తాజాగా శస్త్ర చికిత్స సైతం విజయవంతంగా పూర్తి చేసుకుని మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ కానున్నాడు. గతంలో టీమిండియా యువ వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌కు ఆపరేషన్ చేసిన స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దిన్షా పార్దివాలానే ధోని సైతం (41) సర్జరీ చేశారు. ఆసుపత్రిలో ధోనితో పాటు అతని భార్య సాక్షి ఉన్నారు. ఇదిలా ఉంటే, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్స్‌లో ధోని సేన 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదో ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. సాహా (54), సాయి సుదర్శన్ (96) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేయగా.. ఛేదనలో సీఎస్కే 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది. రుతురాజ్ (26), కాన్వే (47), శివమ్ దూబే (32 నాటౌట్), రహానే (27), రాయుడు (19), జడేజా (15 నాటౌట్) తలో చేయి వేసి సీఎస్కేను గెలిపించారు. చదవండి: ప్రపంచంలోకెల్లా సంపన్నమైన క్రికెట్ బోర్డు.. జెర్సీ స్పాన్సర్ చేసే నాథుడే లేడా..? -
ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..!
-
IPL సీజన్లో స్విగ్గిలో అత్యధికంగా చికెన్ బిర్యానీ ఆర్డర్..!
-
మహి అన్న కోసం ఏదైనా చేస్తా టచ్ చేస్తున్న జడేజా మాటలు..!
-
CSK అభిమానులకు జడేజా భార్య ట్రీట్ ..!
-
ఆటోగ్రాఫ్ ఇవ్వని ధోని బతిమాలుకున్న చాహర్..!
-
గెలిచిన CSK.. పండగ చేసుకుంటున్న పాకిస్థాన్ ఫాన్స్ ..!
-
ఫైనల్ లో జడేజా బాటింగ్ పై సురేష్ రైనా కామెంట్స్
-
ఐపీఎల్ దెబ్బకి లక్షన్నర మొక్కలు..!
-
#SKY: టీ20 మాస్టర్‌క్లాస్ చూశాను! నా కళ్ల ముందే.... వారెవ్వా!
IPL 2023- Suryakumar Yadav: ముంబై ఇండియన్స్ బ్యాటర్, టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల జల్లు కురిపించాడు. వాంఖడే స్టేడియంలో మాస్టర్‌క్లాస్ టీ20 సెంచరీ తనకు కనులవిందు చేసిందని పేర్కొన్నాడు. అద్భుత ఇన్నింగ్స్ చూసిన ఆ సమయంలో ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యానని తెలిపాడు. కాగా ఐపీఎల్-2023 ఆరంభంలో సూర్యకుమార్ యాదవ్ స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డాడు. అయితే, ఆ తర్వాత బ్యాట్ ఝులిపించిన సూర్య కీలక మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్‌కు విజయాలు అందించాడు. తొలి సెంచరీ ఇక లీగ్ దశలో మే 12న వాంఖడే స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సూర్య ఆడిన ఇన్నింగ్స్ అన్నింటిలోకి హైలైట్‌గా నిలిచింది. 49 బంతుల్లో 103 పరుగులతో అజేయంగా నిలిచిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.. ఐపీఎల్లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్‌లో ముంబై 27 పరుగుల తేడాతో గుజరాత్‌పై గెలుపొందగా.. సూర్య ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. నాటి జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్. టీ20 మాస్టర్‌క్లాస్ చూశాను ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘వాంఖడే మైదానంలో నా కళ్ల ముందు సూర్యకుమార్ బాదిన ఆ సెంచరీ అద్భుతం. టీ20 మాస్టర్‌క్లాస్ చూశాను. టీ20 భవిష్యత్ ఆశాకిరణం కనిపించింది. ఆరోజు సూర్య ఇన్నింగ్స్ అమోఘం. అసలు ఇది నిజంగా జరిగిందా లేదా అనే సందేహంలో ఉండిపోయా. ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయా’’ అంటూ మంజ్రేకర్.. సూర్యను ఆకాశానికెత్తాడు. కాగా ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ చేరిన ముంబై ఇండియన్స్.. క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. తద్వారా టోర్నీ నుంచి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. ఇక రిజర్వ్‌డే (మే 29) నాటి ఫైనల్లో గుజరాత్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి చాంపియన్‌గా అవతరించింది. అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్ పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023 సీజన్లో సూర్య 16 ఇన్నింగ్స్‌లలో కలిపి 605 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు అర్థ శతకాలు , ఒక సెంచరీ ఉంది. అత్యధిక స్కోరు 103 నాటౌట్. చదవండి: SL Vs AFG: లంకతో వన్డే సిరీస్.. అఫ్గనిస్తాన్‌కు ఊహించని షాక్! ఆనందంలో సీఎస్కే ఆల్‌రౌండర్.. సర్ జడేజాకు థాంక్స్! పోస్ట్ వైరల్ A 💯 that wowed teammates, fans and opponents alike 🤩 Take a bow #SuryakumarYadav 👏#MIvGT #IPLonJioCinema | @surya_14kumar pic.twitter.com/kwUuMfTGKz — JioCinema (@JioCinema) May 12, 2023 -
ఆనందంలో సీఎస్కే ఆల్‌రౌండర్.. సర్ జడేజాకు థాంక్స్! పోస్ట్ వైరల్
IPL 2023 Winner CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ అజయ్ మండల్ ఆనందంలో మునిగితేలుతున్నాడు. ‘సర్ జడేజా’, సీఎస్కేకు ధన్యవాదాలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇందుకు కారణమేమిటంటే.. ఐపీఎల్-2023 ఫైనల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రిజర్వ్‌డేకు వాయిదా పడింది. చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య మే 29 నాటి రిజర్వ్‌డే మ్యాచ్‌లోనూ వరుణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. జడ్డూ మ్యాజిక్ ఈ క్రమంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో 214 పరుగులు భారీ స్కోరు నమోదు చేసింది. అయితే, సీఎస్కే లక్ష్య ఛేదనకు దిగిన కాసేపటికే వర్షం మొదలుకావడం.. ఎంతకూ తెరిపినివ్వకపోవడంతో అర్ధరాత్రి వరకు వేచి చూశారు. వరణుడు కరుణించడంతో సుమారు 12.05 గంటల ప్రాంతంలో మళ్లీ మ్యాచ్‌ను మొదలుపెట్టారు. ఈ క్రమంలో డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో చెన్నై విజయలక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్దేశించారు. ఈ క్రమంలో చెన్నై బ్యాటర్లు తలా ఓ చేయి వేయగా.. ఆఖరి రెండు బంతుల్లో విజయానికి 10 పరుగులు అవసరమైన వేళ రవీంద్ర జడేజా మ్యాజిక్ చేశాడు. విన్నింగ్ షాట్ ఆడిన బ్యాట్ లభిస్తే తొలి బాల్‌కు సిక్సర్ బాదిన జడ్డూ.. మలి బంతిని బౌండరీకి తరలించి చెన్నైకి చిరస్మరణీయ విజయం అందించాడు. సీఎస్కే ఐదోసారి చాంపియన్‌గా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. మరి.. జడ్డూ విన్నింగ్ షాట్ ఆడిన బ్యాట్ బహుమతిగా లభిస్తే ఎవరైనా ఎగిరి గంతేయాల్సిందే కదా! చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి టైటిల్ విజేతగా నిలపడంలో కీలకంగా వ్యవహరించిన జడ్డూ.. ఆ బ్యాట్‌ను అజయ్ మండల్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీంతో అజయ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు అతడు. సీఎస్కేకు థాంక్స్ ‘‘సర్ రవీంద్ర జడేజా.. ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరమైన వేళ సర్ జడేజా చేసిన అద్భుతం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ ఇన్నింగ్స్ తర్వాత జడేజా ఆ బ్యాట్‌ను నాకు ఆశీర్వాదంగా అందించాడు. జడ్డూ భాయ్‌తో డ్రెసింగ్ రూం షేర్ చేసుకునే అవకాశమిచ్చిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ధన్యవాదాలు’’ అంటూ అజయ్ హార్ట్ ఎమోజీలు జతచేశాడు. కాగా దేశవాళీ క్రికెట్లో ఛత్తీస్‌గఢ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 27 ఏళ్ల అజయ్ జాదవ్ మండల్‌ను.. సీఎస్కే ఐపీఎల్-2023 మినీ వేలంలో కొనుగోలు చేసింది. ఈ లెఫ్టాండర్ ఆల్‌రౌండర్ కోసం రూ. 20 లక్షలు వెచ్చించింది. అయితే, అజయ్‌కు ఈసారి అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. టైటిల్ విజేత అయిన జట్టులో భాగమవడంతో పాటు జడేజా అందించిన బ్యాట్ రూపంలో మంచి బహుమతి మాత్రం లభించింది. చదవండి: #MS Dhoni: ఆ ఒక్క ఫోన్ కాల్ వల్లే ఇలా! అది నిజంగా విచారకరం.. అయితే సీఎస్కేకు ఫైనల్లో అడ్వాంటేజ్ అంటూ ట్వీట్! నీకెందుకంత అక్కసు? మరి ముంబై అయితే.. Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
#MS Dhoni: ఆ ఒక్క ఫోన్ కాల్ వల్లే ఇలా! అది నిజంగా విచారకరం.. అయితే
IPL 2023 Winner CSK: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ డ్వేన్ బ్రావోకు చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు దశాబ్ద కాలం పాటు చెన్నై ఫ్రాంఛైజీతో కొనసాగిన బ్రావో.. జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. 2011లో సీఎస్కేకు తొలిసారి ప్రాతినిథ్యం వహించిన అతడు.. 2011, 2018, 2021 సీజన్లలో ధోని సేన టైటిల్ విజేతగా నిలపడంలో కీలకంగా వ్యవహరించాడు. అదే విధంగా 2014 నాటి చాంపియన్స్ లీగ్ గెలిచిన ధోని సేనలో బ్రావో సభ్యుడు కూడా! అంతేగాక క్యాష్ రిచ్‌లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కూడా ఈ రైట్ ఆర్మ్ పేసర్ ముందు వరుసలో నిలిచాడు. 161 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 183 వికెట్లు తీయడంతో పాటుగా.. 1560 పరుగులు సాధించాడు. సీఎస్కే బౌలింగ్ కోచ్‌గా ఇలా సీఎస్కేతో అనుబంధం పెనవేసుకున్న డ్వేన్ బ్రావో గతేడాది ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిని బౌలింగ్ కోచ్ నియమిస్తూ తమతోనే కొనసాగేలా చేసింది ఫ్రాంఛైజీ. ఇక సీఎస్కే ముఖచిత్రమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనినే ఇందుకు ప్రధాన కారణం అంటున్నాడు బ్రావో. ధోని నుంచి వచ్చిన ఆ ఒక్క కాల్ వల్లే ‘‘ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు! విజయవంతమైన ఐపీఎల్ కెరీర్‌కు గతేడాది రిటైర్మెంట్ ప్రకటించడం నా జీవితంలో విచారకరమైన సమయం. అయితే, ఆటగాడిగా తప్పుకున్నప్పటికీ ఐపీఎల్లో కొనసాగాలని నా నుదుటి రాతలో రాసిపెట్టింది. మహేంద్ర సింగ్ ధోని.. స్టీఫెన్ ఫ్లెమింగ్ నుంచి వచ్చిన ఒ్క ఫోన్ కాల్ నన్ను కోచింగ్ స్టాఫ్‌లో భాగం చేసింది. నా క్రికెట్ కెరీర్లో ముందుకు సాగేందుకు ఇదే సరైన దిశ అనిపించింది. కంగ్రాట్స్ ఆ దేవుడు.. క్రికెటర్‌గా నాకు ప్రసాదించిన నైపుణ్యాలను ఇకపై ఎలా కొనసాగించాలా అని ఆలోచిస్తున్న సమయంలో కోచ్‌గా కొత్త అవతారం ఎత్తడం.. అది కూడా ఐపీఎల్ హిస్టరీలో విజయవంతమైన చరిత్ర ఉన్న జట్టుకు కోచ్‌గా ఉండటం అద్భుతం’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా తన మనసులోని మాటను పంచుకన్న బ్రావో.. సీఎస్కే బౌలర్లు దీపక్ చహర్, మతీశ పతిరణ, రాజ్యవర్థన్ హంగార్కర్, రవీంద్ర జడేజా తదితరులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఐపీఎల్-2023 విజేత చెన్నై సూపర్‌కింగ్స్‌కు విజయోత్సవాలకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. చదవండి: Dhoni: అత్యంత చెత్త రికార్డు.. అయినా అండగా! నన్ను సరైన మార్గంలో నడిపిస్తారని తెలుసు మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకో? హార్దిక్‌ను ఏకిపారేసిన గావస్కర్..పైగా.. View this post on Instagram A post shared by Dwayne Bravo aka SIR Champion🏆🇹🇹 (@djbravo47) -
Ruturaj Gaikwad: ప్రేమ పెళ్లి చేసుకోనున్న రుతు? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే!
Ruturaj Gaikwad's fiance- Who is Utkarsha Pawar?: టీమిండియా బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. జూన్ 3న అతడి వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2023లో అదరగొట్టిన ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023కి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. త్వరలోనే వివాహం.. అందుకే అయితే, ఆఖరి నిమిషంలో తాను తప్పుకోనున్నట్లు రుతురాజ్ బీసీసీఐకి తెలిపినట్లు వార్తలు వినిపించాయి. తన వివాహం కారణంగా లండన్‌కు ఆలస్యంగా వెళ్తానని చెప్పినట్లు సమాచారం. అయితే, ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో రిస్క్ తీసుకోలేమని భావించిన కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచన మేరకు రుతు స్థానంలో యశస్వి జైశ్వాల్‌ను లండన్‌కు పంపారు సెలక్టర్లు. ఇప్పటికే అతడు అక్కడ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాడు. ఇదిలా ఉంటే.. రుతురాజ్ పెళ్లి వార్తల నేపథ్యంలో వధువు ఎవరా అన్న అంశంపై ఆరా తీస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఆమె గురించి ఆసక్తికర అంశాలు.. ఉత్కర్షతో రుతు (PC: IPL) ఇంతకీ ఉత్కర్ష ఎవరు? ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఐపీఎల్-2023 చాంపియన్‌గా నిలిచిన తర్వాత సీఎస్కే ఆటగాళ్లు తమ భాగస్వాములతో కలిసి ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ సమయంలో రుతురాజ్ గైక్వాడ్ పక్కన నిల్చున్న అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె పేరు ఉత్కర్ష పవార్. రుతు మాదిరే ఉత్కర్ష సైతం క్రికెటర్. 1998, అక్టోబరు 13న జన్మించిన ఆమె.. క్రికెటర్ అని సమాచారం. మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ 24 ఏళ్ల ఆల్‌రౌండర్.. ఇటీవల వుమెన్ సీనియర్ వన్డే ట్రోఫీలోనూ భాగమైంది. ఉత్కర్ష ఉన్నత విద్యనభ్యసించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ప్రేమలో! ఆమె.. పుణెలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ సైన్సెస్ స్టూడెంట్ అని సమాచారం. కాగా రుతురాజ్ దేశవాళీ క్రికెట్లో ప్రస్తుతం ముంబై జట్టుకు సారథ్యం వహిస్తున్న తెలిసిందే. ఇక తనలాగే క్రికెటర్ అయిన ఉత్కర్షతో రుతు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2023లో అదరగొట్టాడు ఇరు కుటుంబాల అంగీకారంతోనే వీరి పెళ్లి జరుగనున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో 15 ఇన్నింగ్స్ ఆడి 590 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 92. సీఎస్కే మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(15 ఇన్నింగ్స్‌లో 672 పరుగులు) తర్వాత రుతు.. చెన్నై తరఫున అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఇక రుతురాజ్ పెళ్లి వార్త తెలియడంతో అతడి అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చదవండి: Dhoni: అత్యంత చెత్త రికార్డు.. అయినా అండగా! నన్ను సరైన మార్గంలో నడిపిస్తారని తెలుసు మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకో? హార్దిక్‌ను ఏకిపారేసిన గావస్కర్..పైగా.. One of partners and partnerships! 💛🫂#CHAMPION5 #WhistlePodu #Yellove 💛 pic.twitter.com/KEqKmh75Gq — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 Happy smiles with the pride! 🦁📸#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/ktSQByUqgr — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
దెయ్యం పట్టిందారా! దెబ్బకు జడుసుకున్నారు.. వీడియో వైరల్
IPL 2023 Winner CSK- Viral Video: మనకు ఇష్టమైన ఆటగాళ్లు అద్బుత విజయాలు సాధించినా.. ఏదేని క్రీడలో మనకు నచ్చిన జట్టు గెలిచినా సంబరాలు చేసుకోవడం సహజం. చాలా మంది కూర్చున్న చోటు నుంచి ఎగిరి గంతేయడం.. పక్కనోళ్లను కౌగించుకోవడం.. మహా అయితే వీధి మొత్తం స్వీట్లు పంచడం చేస్తారు. కానీ ఇక్కడ ఓ కుర్రాడు ‘భయంకర’ రీతిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. అతడి దెబ్బకు రూమ్మేట్స్ జడుసుకుని పరుగులు తీశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఐపీఎల్-2023 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా రిజర్వ్ డే (మే 29) నాటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో గెలుపొందింది. నరాలు తెగే ఉత్కంఠ అయితే, ఆఖరి ఓవర్లో మాత్రం నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. చివరి ఓవర్లో చెన్నై గెలవాలంటే 13 పరుగులు అవసరం కాగా మోహిత్ శర్మ అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. వరుసగా యార్కర్లు సంధిస్తూ మొదటి నాలుగు బంతుల్లో 0,1,1,1 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో గుజరాత్ శిబిరంలో ఆశలు చిగురించాయి. రెండు బంతుల్లో చెన్నై విజయ సమీకరణం 10 పరుగులుగా మారిన వేళ.. సీఎస్కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్బుతం చేశాడు. 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో చివరి ఓవర్ ఐదో బంతిని సిక్సర్‌గా మలిచిన జడ్డూ.. ఆఖరి బంతికి 4 బాదాడు. దీంతో 171 పరుగులు సాధించిన సీఎస్కే టైటాన్స్‌పై విజయం సాధించి ఐదోసారి చాంపియన్ అయింది. దెయ్యం పట్టిందారా? వైరల్ వీడియో దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఇందులో భాగంగా ట్యాబ్‌లో మ్యాచ్ చూస్తున్న ఓ కుర్రాడు చేసుకున్న వైల్డ్ సెలబ్రేషన్ నెట్టింట వైరల్ అవుతోంది. సీఎస్కే గెలుపొందడంతో సంతోషం పట్టలేక అరుపులు, కేకలతో పక్కనున్న వాళ్లను బెంబేలెత్తించాడు. తన రూమ్మేట్స్ను పరుగులు పెట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇది చూసిన వాళ్లు.. ‘‘దెయ్యం పట్టిందారా బాబు! ఏమిటా అరుపులు.. వామ్మో నీ దెబ్బకు పక్కనున్న వాళ్లు జడుసుకున్నారు. అక్కడ గెలిచినోళ్లు కూడా అంతగా సెలబ్రేట్ చేసుకోలేదు కదరా?!’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి! ఇవి కూడా చదవండి: అత్యంత చెత్త రికార్డు.. అయినా అండగా! నన్ను సరైన మార్గంలో నడిపిస్తారని తెలుసు మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకో? హార్దిక్‌ను ఏకిపారేసిన గావస్కర్..పైగా.. Congratulations CSK.. Csk fan reaction on csk win on the last ball 💛. CSK CSK CSK 💪 Mahendra Singh Dhoni#CSKvGT #IPL2023final #MSDhoni𓃵 #Jadeja #MSDhoni #GTvsCSK #CSKvsGT #Dhoni #earthquake #IPL2023 #HardikPandya #jayshah pic.twitter.com/YCHiL6M7I7 — Tulip Siddiq (@SiddiqTulip) May 30, 2023 -
Dhoni: అత్యంత చెత్త రికార్డు.. అయినా అండగా! నన్ను సరైన మార్గంలో నడిపిస్తారని తెలుసు
IPL 2023- MS Dhoni- Tushar Deshpande: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు ముంబై బౌలర్ తుషార్ దేశ్‌పాండే. పదహారో ఎడిషన్ సందర్భంగా తొలిసారి ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్‌గా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. 3.2 ఓవర్లలో ఏకంగా 51 పరుగులు సమర్పించుకుని పరోక్షంగా చెన్నై ఓటమికి కారణమయ్యాడు. అయినప్పటికీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తుషార్‌కు వరుస అవకాశాలు ఇచ్చాడు. అయితే, కొన్ని మ్యాచ్‌లలో సీఎస్కే విజయానికి దోహదం చేసినప్పటికీ.. గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో మరోసారి చెత్త బౌలింగ్‌తో విమర్శల పాలయ్యాడు ఈ రైట్ ఆర్మ్ పేసర్. తుషార్ దేశ్‌పాండే (PC: IPL) ఫైనల్ మ్యాచ్‌లోనూ చెత్తగా తన 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి.. ఏకంగా 56 పరుగులు ఇచ్చాడు. కీలక మ్యాచ్‌లో చెత్త గణాంకాలు నమోదు చేసి జట్టుకు భారం అనిపించుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో బ్యాటర్ల మెరుపుల కారణంగా చెన్నై ఫైనల్లో గెలిచి చాంపియన్‌గా అవతరించడంతో తుషార్‌ను పెద్దగా పట్టించుకోలేదు ఫ్యాన్స్. అదే ఏ కాస్త తేడా జరిగినా.. అతడిని ఏకిపారేసేవారే! అదృష్టవశాత్తూ బతికిపోయాడు తుషార్. ధారాళంగా పరుగులు సమర్పించుకుంటాడన్న అపఖ్యాతి మూటగట్టుకున్న అతడు.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ సీజన్లో 16 మ్యాచ్‌లలో తుషార్ మొత్తంగా 564 పరుగులు ఇచ్చి 9.92 ఎకానమీతో 21 వికెట్లు తీశాడు. ఓ సైనికుడిలా ఆయన ఏం చెబితే అదే పాటించా ఇన్ని మైనస్‌లు ఉన్నా ధోని అతడిని వెనకేసుకురావడం వల్లే తుషార్ దాదాపు ప్రతి మ్యాచ్‌లో తుదిజట్టులో చోటు దక్కించుకోగలిగాడు. ఈ నేపథ్యంలో ధోనిని ఉద్దేశించి తుషార్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘‘మన రాత బాగోలేనపుడు మనల్ని సరైన మార్గంలో నడిపించే వ్యక్తి ఉంటే ఎంతో బాగుంటుంది. ధోని భయ్యా నాకు అన్నివేళలా అండగా నిలబడ్డాడు. వైఫల్యాలు ఎదురైనపుడు ధైర్యం చెప్పాడు. ఓ సైనికుడిలా ఆయన ఏం చెబితే అదే పాటించా. ఆయన చెప్పిన మార్గంలో నడిచాను. ఆయన నన్నెపుడూ సరైన మార్గంలోనే నడిపిస్తారని నాకు తెలుసు’’ అంటూ 28 ఏళ్ల తుషార్ దేశ్‌పాండే భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకో? హార్దిక్‌ను ఏకిపారేసిన గావస్కర్..పైగా.. Wrestlers Protest: ఆమె మైనర్ కాదంటూ వీడియో! మండిపడ్డ స్వాతి.. వెంటనే అది చాలా పెద్ద తప్పు.. అంబటి రాయుడికి అన్యాయం చేశారు: కుంబ్లే Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకో? హార్దిక్‌ను ఏకిపారేసిన గావస్కర్..పైగా..
IPL 2023 Final CSK Vs GT- Winner CSK: ‘‘ఆఖరి ఓవర్లో మొదటి 3-4 బంతులు అతడు అద్బుతంగా బౌల్ చేశాడు. కానీ ఏంటో అనూహ్యంగా మధ్యలో హార్దిక్ పాండ్యా వచ్చాడు. అతడితో ఏదో మాట్లాడాడు. నిజానికి ఓ బౌలర్ మంచి రిథమ్, లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నపుడు అతడిని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు. అతడు సరైన దిశలో పయనిస్తున్నపుడు అనవసరంగా సలహాలు ఇవ్వడం ఎందుకు? దూరం నుంచి చూసి మనం.. అతడు అలా బౌల్ చేస్తున్నాడు. ఇలా బౌల్ చేస్తున్నాడు అని విశ్లేషణలు చేస్తూ ఉంటాం. సదరు బౌలర్ ఫామ్‌లో ఉన్నపుడు ఎవరైనా అంత వరకే ఆగిపోవాలి. అంతేగానీ.. అతడి దగ్గరికి వెళ్లి సలహాలు, సూచనలు ఇవ్వడం సరికాదు. పాండ్యా అక్కడికి వెళ్లగానే ఒక్కసారిగా మోహిత్ ముఖమే మారిపోయింది. అతడు బిత్తరచూపులు చూడటం మొదలుపెట్టాడు. ఆ వాటర్ బాటిల్ ఎందుకో’’ అని టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. హార్దిక్ పాండ్యా చేసిన పనేమీ బాగా లేదని విమర్శలు గుప్పించాడు. కాగా ఐపీఎల్-2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ తలపడిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా రిజర్వ్ డే అయిన సోమవారం(మే 29) జరిగిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో సీఎస్కే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఐదోసారి ట్రోఫీ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవాలనుకున్న డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లింది. ఇక వర్షం కారణంగా లక్ష్య ఛేదనలో 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో గుజరాత్ పేసర్ మోహిత్ శర్మ చేతికి బంతినిచ్చాడు కెప్టెన్ పాండ్యా. అప్పటికి శివం దూబే, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో మొదటి బంతిని పర్ఫెక్ట్ యార్కర్‌గా మలిచిన మోహిత్.. దూబేకు పరుగు తీసే అవకాశం ఇవ్వలేదు. రెండో బాల్ కూడా యార్కరే. ఈసారి దూబే ఒక పరుగు తీయగలిగాడు. ఇక మూడో బంతికి కూడా అద్భుతమైన యార్కర్ సంధించి సీఎస్కే అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. నాలుగో బంతి కూడా సేమ్. ఈ క్రమంలో చెన్నై విజయసమీకరణం 2 బంతుల్లో 10 పరుగులుగా మారింది. జడ్డూ క్రీజులో ఉన్నాడు. ప్రేక్షకుల్లో నరాలు తెగే ఉత్కంఠ. అంతలో హార్దిక్ పాండ్యా వచ్చి మోహిత్‌తో ముచ్చటించాడు. ఆ తర్వాతి బంతిని జడ్డూ సిక్సర్‌గా మలిచాడు. విజయానికి ఒక్క బంతికి నాలుగు పరుగులు కావాల్సిన తరుణంలో జడ్డూ బౌండరీ బాది సీఎస్కేను చాంపియన్‌గా నిలిపాడు.ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ ఆఖరి ఓవర్ హైడ్రామా గురించి ఇండియా టుడేతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: సీఎస్కేకు ఫైనల్లో అడ్వాంటేజ్ అంటూ ట్వీట్! నీకెందుకంత అక్కసు? మరి ముంబై అయితే.. Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
సీఎస్కేకు ఫైనల్లో అడ్వాంటేజ్ అంటూ ట్వీట్! నీకెందుకంత అక్కసు? మరి ముంబై అయితే..
IPL 2023 Winner CSK: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌పై చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు మండిపడుతున్నారు. సీఎస్కేపై అంత అక్కసు ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చెన్నై స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంటే ఇలాగే మాట్లాడేవాడివా అంటూ ట్రోల్ చేస్తున్నారు. సొంత రాష్ట్ర జట్టుపై అభిమానం ఉండటంలో తప్పులేదని.. కానీ అది ఇతరులను తక్కువ చేసే విధంగా మాత్రం ఉండకూడదంటూ హితవు పలుకుతున్నారు. కాగా ఐపీఎల్-2023 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రిజర్వ్ డే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది ధోని సేన. డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసి పదహారో ఎడిషన్ చాంపియన్‌గా అవతరించింది. ఒక్కొక్కరికి మూడు ఓవర్లు నిజానికి మే 28(ఆదివారం)న జరగాల్సిన ఈ మ్యాచ్ ఎడతెరిపిలేని వర్షం కారణంగా మరుసటి రోజుకు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, సోమవారం కూడా వరుణుడు అడ్డు తగలడంతో లక్ష్య ఛేదనలో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 214 పరుగుల భారీ స్కోరు చేయగా.. చెన్నై విజయసమీకరణాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్దేశించారు అంపైర్లు. అదే విధంగా ఒక్కో బౌలర్ కేవలం 3 ఓవర్ల్ బౌల్ చేసేందుకు అనుమతినిచ్చారు. జడ్డూ విన్నింగ్ షాట్ ఈ క్రమంలో టార్గెట్ ఛేదనలో భాగంగా సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(26), డెవాన్ కాన్వే (47) శుభారంభం అందించగా.. శివం దూబే(32- నాటౌట్), అజింక్య రహానే (27), అంబటి రాయుడు (8 బంతుల్లో 19) తలా ఓ చెయ్యి వేశారు. ఆఖరి రెండు బంతుల్లో చెన్నై గెలుపునకు 10 పరుగుల అవసరమైన వేళ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వరుసగా 6,4 బాది చిరస్మరణీయ విజయం అందించాడు. దీంతో క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఐదోసారి ట్రోఫీ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్‌తో చెన్నై సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో సీఎస్కేతో పాటు ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. మ్యాచ్ ముగిసి రోజులు గడుస్తున్నా.. సోషల్ మీడియాలో సందడి కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇర్ఫాన్ పఠాన్ చేసిన ట్వీట్ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించింది. ఇంతకీ అతడేమన్నాడంటే.. సీఎస్కేకు అడ్వాంటేజ్‌గా మారింది ‘‘వర్షం కారణంగా కుదించిన మ్యాచ్‌లో సీఎస్కే షమీ బౌలింగ్‌లో బ్యాటింగ్ మొదలెట్టింది. నాలుగు ఓవర్ల రెగ్యులర్ కోటాలో రషీద్, మోహిత్ ఒక్కో ఓవర్ కోల్పోవాల్సి వచ్చింది. లీగ్ టాప్ వికెట్ టేకర్లలో ముగ్గురు 18 బంతులు వేసేందుకే పరిమితమయ్యారు. అందులో ఇద్దరు వికెట్లు తీయలేకపోయారు. అది సీఎస్కేకు ప్రయోజనం చేకూర్చింది’’ అని ఇర్ఫాన్ పఠాన్ మంగళవారం ట్విటర్లో పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘షమీ/రషీద్, మోహిత్ కలిసి 3 ఓవర్లలో 54 బంతులు వేశారు. సీఎస్కే 108 పరుగులు సాధించింది. ఒకవేళ వాళ్లు పూర్తిస్థాయిలో బౌలింగ్ చేసినా 145 పరుగులు చేసేది. మ్యాచ్ 20 ఓవర్లపాటు జరిగినా సీఎస్కే 19వ ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించేది. మనకు అసలు ఈ ఉత్కంఠ రేపే మ్యాచ్ చూసే అవకాశమే వచ్చేది కాదు. అయినా, నీకెందుకు అంత అక్కసు ఇర్ఫాన్ పఠాన్’’ అని ఏకిపారేస్తున్నారు. కాగా గుజరాత్‌కు చెందిన ఇర్ఫాన్ 2003లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. 2012లో భారత్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. చదవండి: అది చాలా పెద్ద తప్పు.. అంబటి రాయుడుకి అన్యాయం చేశారు: కుంబ్లే In the curtailed shortened final, of Shami/Rashid & Mohit - 3 overs of 54b they bowled CSK scored 109 runs. So if they had bowled csk would have scored 145 runs leaving only 71 to score of remaining 8. That means if we had a full game, we could have ended the game in 19 overs… — Prabhu (@Cricprabhu) May 30, 2023 Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్,నెట్‌వర్త్ గురించి తెలుసా?
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచే తనకు చివరి మ్యాచ్ అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఈ సందర్బంగా అంబటి రాయుడు ఏం చేయబోతున్నాడు. అతని ఆస్తి, నికర విలువ ఎంత అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. (యాపిల్ లవర్స్ బీ రెడీ: రూ. 8,900కే యాపిల్ ఐప్యాడ్) ఫ్యాన్స్ అభిమానంగా రాయుడు అని పిలుచుకునే ఆల్ రౌండర్‌గా అత్యుత్తమ ప్రదర్శనతో భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. భారత క్రికెట్ జట్టులో రైట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ,రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా క్రికెట్లోకి ప్రవేశించాడు. 2010లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి సుదీర్ఘకాలం అంటే 2017 దాకా ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2013 సీజన్లో ఐపీఎల్ టైటిల్ సాధనలోనూ, ఆ తరువాత 2018లో సీఎస్కే జట్టులోకి మారిన తరువాత 2018, 2021లో టైటిల్ గెలిచిన కీలక ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. (IPL 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్‌వర్త్ ఎంతో తెలుసా?) నికర విలువు అంబటి రాయుడు మొత్తం నికర విలువ దాదాపు రూ. 50 కోట్లు. సంవత్సరానికి రూ 7 కోట్లకు పైనే. ఐపీఎల్ ద్వారా లభించిన ఫీజు 6.25కోట్లు. లగ్జరీ కార్ల విలువ 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు. అలాగే బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కోటి దాకా ఆర్జిస్తాడనేది తాజా నివేదికలద్వారా తెలుస్తోంది. (CSK ఓనరు, నికర విలువ ఎంత? ఈ విషయాలు తెలుసా?) అంబటి రాయుడు ఇల్లు కార్లు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో లగ్జరీ డిజైనర్ ఇల్లు ఉంది. అలాగే దేశవ్యాప్తంగా అనేక రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వికారాబాద్ అనంతగరిలో రిసార్ట్ బిజినెస్, సిద్దిపేట వైపు ఫార్మింగ్ బిజినెస్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. అధిక బ్రాండ్ వాల్యుయేషన్ కారణంగా గత కొన్నేళ్లుగా అంబటి రాయుడు నికర విలువ 40 శాతం పెరిగిందట. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా రాయుడి నికర ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుందనేది నిపుణుల మాట. వ్యవసాయ చేసుకుంటూ ఫామ్‌హౌస్‌లో ఎక్కువ సమయం గడుపుతానని ఒక ఇంటర్వ్యూలో అంబటి చెప్పినప్పటికీ ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పిన తరువాత ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న నేపథ్యంలో రాజకీయాల్లో చేరతాడనే ఊహాగానాలున్నాయి. కార్లు : రూ. 1.5 నుంచి 2 కోట్లు అంబటి రాయుడు కార్ల కలెక్షన్ చాలా చిన్నది. అయినా ఆడి కారుతోపాటు ప్రపంచంలోని ది బెస్ట్ లగ్జరీ కార్లు కొన్ని అంబటి రాయుడు సొంతం. కరియర్ 2004 అండర్-19 ప్రపంచకప్‌లో అంబటి రాయుడు కెప్టెన్ ఇంగ్లండ్‌పై అజేయంగా 177 పరుగులు చేసి టైటిల్ సాధించాడు వయసు కేవలం 16 ఏళ్లు. ఇక అప్పటినుంచి మరో సచిన్ పేరు తెచ్చుకున్నాడు.తరువాత హైదరాబాద్ దేశవాళీ జట్టుకు ఎంపిక, కేవలం 17 సంవత్సరాల వయస్సులో నే ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు . భారత జట్టులో ఎంపికై 2013లో జింబాబ్వేపై మ్యాచ్‌లో రావడం 63 పరుగులతో అజేయంగా పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో 203 ఐపీఎల్ మ్యాచులాడిన రాయుడు. 127.26 స్ట్రైక్‌రేట్‌తో 4,329 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1985, సెప్టెంబర్ 23న గుంటూరులో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు అంబటి రాయుడు. 1992లో మూడో తరగతి చదువుతున్నప్పుడే రాయడిని తండ్రి హైదరాబాద్‌లోని విజయ్ పాల్ క్రికెట్ అకాడమీలో చేర్చించారు. 14 ఫిబ్రవరి 2009న తన స్నేహితురాలు విద్యను పెళ్లి చేసుకున్నాడు రాయుడు. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
అది చాలా పెద్ద తప్పు.. అంబటి రాయుడికి అన్యాయం చేశారు: కుంబ్లే
భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు అంబటి రాయుడు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023 ఫైనల్ అనంతరం తన ఐపీఎల్ కెరీర్‌కు రాయుడు ముగింపు పలికాడు. కాగా ఐపీఎల్లో రాయుడు ఆరు టైటిల్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు టైటిల్స్ ముంబై ఇండియన్స్ తరపున సాధించగా.. మరో మూడు టైటిల్స్ సీఎస్కే తరపున గెలుచుకున్నాడు. ఇక ఐపీఎల్ విషయాన్ని పక్కన పెడితే.. రాయుడి వంటి అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆటగాడికి బీసీసీఐ మాత్రం అన్యాయం చేసిందనే చెప్పుకోవాలి. భారత్ తరపున రాయుడు కేవలం 55 వన్డేలు, ఆరు టీ20లు మాత్రమే ఆడాడు. 2018-19 మధ్య కాలంలో భారత జట్టులో నాలుగో స్థానంలో సరైన ఆటగాడు లేని లోటు సృష్టంగా కన్పించింది. Throw back to an india -A game which was almost 2 decades ago.. when you see that 99% of the guys you have played with are either commentators, coaches,mentors and some politicians..you realise that it’s been quite a journey but the end is near.. 😂 pic.twitter.com/qm7iX7HCrV— ATR (@RayuduAmbati) May 3, 2023 ఈ సమయంలో రాయుడు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతంగా రాణించాడు. దీంతో భారత జట్టు కష్టాలు తీరి పోయాయి అని, నాలుగో స్ధానానికి సరైన ఆటగాడు దొరికాడని అంతా భావించారు. ఇదే సమయంలో 2019 వన్డే ప్రపంచకప్‌లో రాయుడు అడుతాడని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటుచేసుకుంది. 2019 వన్డే ప్రపంచకప్‌కు రాయుడును కాదని ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ క్రమంలో తనను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర నిరాశ చెందిన రాయుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. అయితే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ భారత్ తరపున ఆడే అవకాశం రాలేదు. ఇక ఇదే విషయంపై తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పందించాడు. "రాయుడు 2019 ప్రపంచకప్ ఆడాల్సింది. అందులో ఎలాంటి సందేహం లేదు. అది సెలక్షన్ కమిటీతో పాటు జట్టు మేనెజ్మెంట్ చేసిన పెద్ద తప్పు. అతడిని నాలుగో స్థానం కోసం సిద్ధం చేశారు. అటువంటిది ఆ తర్వాత జట్టులో స్థానం లేకుండా చేశారు. అది చాలా ఆశ్చర్యం కలిగించింది" అని ఐపీఎల్ ఫైనల్ తర్వాత జియో సినిమాలో మాట్లాడుతూ కుంబ్లే పేర్కొన్నాడు. కాగా ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లి, హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఉన్నారు. చదవండి: WTCFinal2023: ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన ఆ ఐదుగురు! ఫోటోలు వైరల్ -
కోకిలాబెన్ హాస్పిటల్‌కు వెళ్లనున్న ధోని.. ఎందుకంటే?
ఐపీఎల్-2023 విజేతగా చెన్నైసూపర్ కింగ్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ను మట్టికరిపించిన సీఎస్కే.. ఐదోసారి ఛాంపియన్స్‌గా అవతరించింది. ఇక ఇది ఇలా ఉండగా.. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో తన మోకాలి గాయానికి సంబంధించి పలు టెస్టులు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతరం తన మెకాలికి సర్జరీ చేసుకునున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా ధోని ఈ ఏడాది సీజన్ ఆరంభం నుంచి మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో నడవడానికి కూడా ధోని ఇబ్బంది పడ్డాడు. చెపాక్‌లో జరిగిన సీఎస్కే ఆఖరి హోం లీగ్ మ్యాచ్ అనంతరం ధోని.. స్టేడియం మొత్తం తిరిగుతూ అభిమానులకు అభివాదం చేశాడు. ఈ క్రమంలో దోని తన మెకాలికి ఓ క్యాప్(నీ క్యాప్) పెట్టుకుని తిరిగడం కన్పించింది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది.అయినప్పటికీ ఓ వైపు నొప్పిని భరిస్తునే. . ఒక్క మ్యాచ్‌కు కూడా దూరం కాకుండా తన జట్టును ఛాంపియన్స్‌గా మిస్టర్ కూల్ నిలిపాడు. ఇక వచ్చే ఏడాది సీజన్లో కూడా ధోని మళ్లీ కన్పించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఫైనల్ మ్యాచ్ అనంతరం ఐపీఎల్ నుంచి ధోని తప్పుకుంటాడని అంతా భావించారు. కానీ వచ్చే ఏడాది సీజన్‌కు మరో 9 నెలల సమయం ఉంది కాబట్టి.. త్వరలోనే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ధోని మ్యాచ్ అనంతరం చెప్పాడు. అయితే ఆడేందుకు తన శరీరం సహకరిస్తే కచ్చితంగా కొనసాగుతానని ధోని పేర్కొన్నాడు. చదవండి: #MS Dhoni On Retirement: నా కళ్లు చెమర్చాయి.. రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయం.. కానీ! ధోని భావోద్వేగం -
#IPL2023: 292 డాట్‌బాల్స్.. లక్షకు పైగా మొక్కలు
ఐపీఎల్ 16వ సీజన్లో ప్లేఆఫ్ మ్యాచ్‌ల ప్రారంభానికి ముందు స్పాన్సర్ టాటాతో కలిసి బీసీసీఐ సరికొత్త కార్యచరణ రూపొందించింది. ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో నయోదయ్యే ప్రతీ డాట్‌బాల్‌కు 500 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్ ముగిసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో సీఎస్కే విజేతగా నిలిచి ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది. కాగా ప్లేఆఫ్ మ్యాచ్‌ల సమయంలో డాట్ బాల్ స్థానంలో గ్రీన్ ట్రీ ఇమేజ్ గ్రాఫిక్ ఉపయోగించారు. మరి ప్లేఆఫ్స్ దశలో ఆడిన మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో నమోదైన డాట్‌బాల్స్‌కు ఎన్ని మొక్కలు నాటనున్నారో ఇప్పుడు చూద్దాం. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు 40 ఓవర్లలో మొత్తం 84 డాట్ బాల్స్ వేశారు. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు చేసిన మొత్తం డాట్ బాల్స్ సంఖ్య 96.ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 2వ క్వాలిఫయర్ మ్యాచ్‌లో కేవలం 67 డాట్ బాల్స్ వచ్చాయి. అలాగే చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొత్తం డాట్ బాల్స్ 45. అంటే 4 మ్యాచ్‌ల నుంచి మొత్తం 292 డాట్ బాల్స్ ఉన్నాయి. అంటే 292 x 500 లెక్కన బీసీసీఐ మొత్తం 1 లక్షా 46 వేల మొక్కలు నాటనుంది. దీని ద్వారా గ్రీన్ డాట్ ప్రచారంలో ఐపీఎల్ హరిత విప్లవానికి శ్రీకారం చుట్టడం విశేషం. పర్యావరణం పట్ల బీసీసీఐ బాధ్యతగా వ్యవహరిస్తూ ఈ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో దీనిపై చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. డాట్ బాల్‌కు మొక్కలు నాటాలన్న నిర్ణయంతో క్రికెట్ అభిమానుల మెప్పు పొందుతోంది బీసీసీఐ. చదవండి: '45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే వేటు తప్పదు' లండన్ చేరుకున్న రోహిత్ శర్మ.. టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ -
అచ్చం నాలాగే.. రాయుడుకు ఆ అలవాటు లేదు
-
గిల్లో అద్బుతమైన టాలెంట్ ఉంది.. కచ్చితంగా లెజెండ్స్ సరసన చేరుతాడు: కపిల్ దేవ్
ఐపీఎల్-2023లో టీమిండియా యువ ఓపెనర్ , గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాడు దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్లో 890 పరుగులు చేసిన గిల్.. ఆరెంజ్ క్యాప్ విన్నర్‌గా నిలిచాడు. తన అద్భుత ఇన్నింగ్స్‌లతో మరోసారి ప్రపంచ క్రికెట్‌కు తన టాలెంట్ ఎంటో చూపించాడు. Shubman Gill's performance this season has been nothing short of unforgettable, marked by two centuries that left an indelible impact. One century ignited @mipaltan's hopes, while the other dealt them a crushing blow. Such is the unpredictable nature of cricket! What truly… pic.twitter.com/R3VLWQxhoT — Sachin Tendulkar (@sachin_rt) May 28, 2023 ఈ ఏడాది ఐపీఎల్లో గిల్ మూడు సెంచరీలతో పాటు నాలగు హాఫ్‌సెంచరీలు సాధించాడు. అదే విధంగా ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా గిల్ నిలిచాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన గిల్‌పై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ తన ఆటతీరుతో ఎంతోమంది గొప్ప ఆటగాళ్లను గుర్తుచేస్తున్నాడని కపిల్ దేవ్ కొనియాడాడు. అయితే గిల్ మరింత మెరుగుపడడానికి మరో ఏడాది సమయం అవసరమని కపిల్‌దేవ్ అభిప్రయపడ్డాడు. "భారత్ క్రికెట్ ప్రపంచానికి ఎంతోమంది లెజెండ్స్‌ను పరిచయం చేసింది. వారిలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, ధోని, విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పుడు శుబ్‌మన్ గిల్ కూడా వారి అడుగుజాడల్లో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. Memorable one pic.twitter.com/2jnfJz6Kqr — Shubman Gill (@ShubmanGill) May 30, 2023 కానీ ఇప్పుడే అతడిని ఆకాశానికి ఎత్తేయకూడదు అనుకుంటున్నాను. గిల్లో అద్భుతమైన టాలెంట్ ఉంది. కానీ అతడికి ఇంకా మరింత మెచ్యూరిటీ కావాలి. అతడు వచ్చే ఏడాది సీజన్లో కూడా ఇలాగే ఆడితే.. కచ్చితంగా గొప్ప ఆటగాళ్ల జాబితాలోకి చేరుతాడు. అతడు మరింత మెరుగుపడడానికి మరో ఏడాది సమయం అవసరమని" ఏబీపీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌దేవ్ పేర్కొన్నాడు. Shubman Gill bags four awards but misses on the most precious Trophy 😐 📷: Jio Cinema #ShubmanGill #GujaratTitans pic.twitter.com/XFtIzAXnrw — CricTracker (@Cricketracker) May 30, 2023 చదవండి: IRE vs ENG: ఐర్లాండ్‌తో ఏకైక టెస్టు.. ఇంగ్లండ్ తుది జట్టు ఇదే! స్టార్ క్రికెటర్ వచ్చేశాడు -
IPL 2024కి రెడీ 41 ఏళ్ళ వయసు ఆయన తగ్గేదేలే ..!
-
ఏడాది క్రితం సరిగ్గా అదే రోజు ఇది RR కాదు CSK
-
CSK IPL ట్రోఫీ కి ప్రత్యేక పూజలు..!
-
ధోని నోట రిటైర్మెంట్ మాట ఎప్పటికి క్లారిటీ వచ్చింది..
-
CSK వద్దనుకుంది GT కొనుక్కుంది 20 లక్షలు తీసుకుని చెన్నై పై రెచ్చి పోయడుగా ....
-
'అచ్చం నాలాగే.. రాయుడుకు ఆ అలవాటు లేదు'
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ అనంతరం సీఎస్కే స్టార్ అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా సీఎస్కేలో అంబటి రాయుడు కీలకపాత్ర పోషించాడు. గతంలో సీఎస్కే టైటిల్స్ సాధించడంలోనూ రాయుడు పాత్ర కీలకం. కాగా తన చివరి ఐపీఎల్ మ్యాచ్‌లోనూ రాయుడు తన ఇంపాక్ట్ చూపించాడు. వర్షంతో 15 ఓవర్లలో 171 పరుగుల టార్గెట్ ఫిక్స్ చేయడంతో సీఎస్కే బ్యాటర్స్ వేగంగా ఆడేందుకే ప్రయత్నించారు. ఈ క్రమంలో రాయుడు ఐదో స్థానంలో వచ్చి 8 బంతుల్లో రెండో సిక్సర్లు, ఒక ఫోర్‌తో 19 పరుగుల దనాధన్ ఇన్నింగ్స్ ఆడి ఔటయ్యాడు. అయితే రాయుడు మెరుపు ఇన్నింగ్స్ సీఎస్కే లక్ష్యాన్ని కరిగించిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో అంబటి రాయుడుపై సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రశంసల వర్షం కురిపించాడు. రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడుతో తన అనుబంధాన్ని ధోని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాడు. ''మైదానంలో ఉన్నప్పుడు 100 శాతం శ్రమించడం రాయుడు లక్షణం. మేమిద్దరం ఒకప్పుడు ఇండియా ‘ఎ’ తరఫున కలిసి ఆడాం. అటు పేస్‌ను, ఇటు స్పిన్‌ను సమర్థంగా ఆడగల నైపుణ్యం అతని సొంతం. అతను జట్టు కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయగలడని నేను ఎప్పుడైనా నమ్మేవాడిని. నాలాగే రాయుడుకు కూడా ఎక్కువగా ఫోన్ వాడే అలవాటు లేదు'' అని ధోని అన్నాడు. కాగా 2010లో ముంబై ఇండియన్స్ తరఫున.. ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.. తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌కు మారాడు. ముంబై ట్రోఫీ గెలిచిన మూడు సందర్భాల్లో ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న రాయుడు.. మొత్తంగా ఆరో టైటిల్‌తో తన ఐపీఎల్ కెరీర్ ముగించాడు. కాగా 37 ఏళ్ల అంబటి రాయుడు తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో 203 మ్యాచ్‌లాడి 4348 పరుగులు సాధించాడు. ఆరుసార్లు.. విజేతగా నిలిచిన జట్లలో భాగమై ట్రోఫీలను ముద్దాడాడు. అదే విధంగా ఆటగాడిగా టీమిండియా సారథి రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. చదవండి: #MSDhoni: దాయాది అభిమానులే మెచ్చుకునేలా! -
ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ పై వికెట్ల తేడాతో గెలిచిన చెన్నయ్ సూపర్ కింగ్స్
-
#MSDhoni: దాయాది అభిమానులే మెచ్చుకునేలా!
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే విజేతగా నిలవడంపై దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఈ సీజన్ మొత్తం ధోని నామస్మరణతోనే మార్మోగిపోయింది. సీఎస్కే ఎక్కడ మ్యాచ్ ఆడినా అభిమానులు తండోపతండాలుగా వచ్చేవారు. దీనికి ప్రధాన కారణం సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని. ధోని భజన మరీ ఎక్కువైపోయిందన్నా పర్లేదు.. కానీ ఒక విషయం మాత్రం తప్పక తెలుసుకోవాల్సిందే. సీఎస్కే విజేతగా నిలవడంపై మన దేశ అభిమానులే కాదు.. దాయాది దేశం పాకిస్తాన్ అభిమానులు కూడా తెగ సంతోషపడిపోయారు. సీఎస్కే ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత పాకిస్తాన్లో కొన్నిచోట్ల క్రికెట్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవడం కనిపించింది. ధోని కటౌట్స్తో వీధుల్లో తిరుగుతూ భారీ ఎత్తున కేక్ కటింగ్స్ నిర్వహించారు. ఈ చర్యతో వైరం అనేది దేశాల మధ్యే కానీ ఆటపై కాదని తెలియజేశారు. ఇక పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రమీజ్ రజా, సక్లెయిన్ ముస్తాక్, షోయబ్ అక్తర్, సయీద్ అన్వర్ సహా మరికొంతమంది సీఎస్కే టీమ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇక ధోని టైటిల్ గెలిచిన అనంతరం మాట్లాడుతూ కాస్త ఎమోషన్‌కు గురయ్యాడు. రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం అనిపించినప్పటికి వచ్చే సీజన్ ఆడాలా వద్దా అనే దానిపై మరో ఏడు, ఎనిమిది నెలల్లో తుది నిర్ణయం తీసుకుంటా. అప్పటికి శరీరం సహకరించి ఫిట్‌గా ఉంటే అభిమానుల కోసం మరో ఐపీఎల్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ పేర్కొన్నాడు. చదవండి: ఒక్క ఆటోగ్రాఫ్ కోసం బతిమాలించుకున్నాడు! -
ఒక్క ఆటోగ్రాఫ్ కోసం బతిమాలించుకున్నాడు!
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సీఎస్కే ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జడేజా ఆఖర్లో వచ్చి సిక్స్, ఫోర్‌తో సీఎస్కేకు విజయాన్ని అందించాడు. కాగా సీఎస్కే ఐపీఎల్ టైటిల్ గెలవడం ఇది ఐదోసారి. ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన జాబితాలో ముంబై ఇండియన్స్‌తో కలిసి సీఎస్కే సమంగా నిలిచింది. ఈ విషయం పక్కనబెడితే.. ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం ధోని, దీపక్ చహర్ల మధ్య జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీపక్ చహర్ తన షర్ట్‌పై ఆటోగ్రాఫ్ అడిగితే తొలుత ఇవ్వడానికి ధోని నిరాకరించడం వైరల్‌గా మారింది. అయితే చహర్ ధోనిని బతిమిలాడడంతో చివరకు షర్ట్‌పై తన సంతకం చేశాడు. అయితే ఇదంతా సరదా కోసం మాత్రమే. ఎందుకంటే చహర్ అడిగినప్పుడు స్పందించని ధోని.. మళ్లీ చిరునవ్వుతో అతని జెర్సీపై సంతకం చేయడం.. ఆ తర్వాత స్వయంగా ధోనినే చహర్‌ను హగ్ చేసుకోవడం కనిపించింది. ఈ ఇద్దరి మధ్య ఎంత మంచి రిలేషన్షిప్ ఉందనేది దీన్నబట్టే అర్థమవుతుంది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ క్యాచ్‌ను దీపక్ చహర్ మిస్ చేసిన సంగతి తెలిసిందే. మూడు పరుగుల వద్ద లభించిన లైఫ్‌తో గిల్ 39 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా చహర్ క్యాచ్ మిస్ చేయడంతోనే ధోని అతనికి ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నిరాకరించాడని అభిమానులు కామెంట్ చేశారు. MS Dhoni when Deepak Chahar came for Autograph. Their bond is so cute.#ChennaiSuperKings #MSDhoni𓃵 #csk pic.twitter.com/3ggKY2mAFM — MS Dhoni Fan (@dhonizero7) May 30, 2023 చదవండి: డానిల్ మెద్వెదెవ్కు షాక్.. ఐదోసారి కలిసి రాని 'ఫ్రెంచ్' -
ఐపీఎల్లో అదరగొట్టాడు.. శ్రీలంక జట్టులో చోటు కొట్టేశాడు!
స్వదేశంలో ఆఫ్గానిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ సిరీస్‌లో భాగంగా ఆఫ్గాన్‌తో మూడు వన్డేలు ఆడనుంది. అయితే ప్రస్తుతం తొలి రెండు వన్డేలకు మాత్రమే జట్టును శ్రీలంక సెలక్టర్లు ఎంపికచేశారు. ఈ జట్టుకు దాసున్ షనక నాయకత్వం వహించనున్నాడు. ఇక ఈ జట్టులో ఐపీఎల్-2023లో అదరగొట్టిన పేసర్ మతీషా పతిరానాను చోటుదక్కింది. ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచడంతో పతిరానాకు సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ ఏడాది క్యాష్‌రిచ్ లీగ్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన జూనియర్ మలింగా.. 12 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆఫ్గాన్ సిరీస్‌తో పతిరానా వన్డేల్లో శ్రీలంక తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. గతేడాది ఆగస్టులో ఇదే ఆఫ్గాన్ జట్టుపై టీ20ల్లో పతిరానా డెబ్యూ చేశాడు. మరోవైపు లంక టెస్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నేకు ఛానాళ్ల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కింది. దిముత్ కరుణరత్నే 2021లో చివరిసారిగా వన్డేల్లో లంక తరపున ఆడాడు. అదేవిధంగా స్టార్ పేసర్ దుష్మంత చమీర కూడా ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. చమీర గాయం కారణంగా గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ వన్డే వరల్డ్‌కప్-2023 క్వాలిఫియర్స్ సన్నహాకాల్లో భాగంగా జరగనుంది. సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో టాప్-8 శ్రీలంక లేకపోవడంతో క్వాలిఫియర్స్ ఆడనుంది. ఈ క్వాలిఫియర్ రౌండ్ మ్యాచ్‌లు జూన్ 18 నుంచి జింబాబ్వే వేదికగా జరగనున్నాయి. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొనున్నాయి. వీటిలో రెండు జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ఆఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు లంక జట్టు: దసున్ షనక (కెప్టెన్), కుసల్ మెండిస్, పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, దుషాన్ హేమంత, చమిక కరుణరత్నే, పతిరున హేమంత, చమిక కరుణరత్నే, చమీరా, మతీషా పతిరానా, కుమారా, రజితా చదవండి: IPL 2023: సీఎస్కే గెలవగానే.. జడేజా భార్య రివాబా ఏం చేసిందంటే? వీడియో వైరల్ -
సీఎస్కే గెలవగానే.. జడేజా భార్య రివాబా ఏం చేసిందంటే? వీడియో వైరల్
ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందించిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోరులో.. 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించి సీఎస్కే ఛాంపియన్స్‌గా నిలిచింది. ఆఖరి రెండు బంతుల్లో పది పరుగులు చేయాల్సి ఉండగా.. జడేజా ఓ సిక్స్, ఫోర్ బాది సీఎస్కేను ఐదోసారి ఛాంపియన్స్‌గా నిలిపాడు. ఇక ఈ ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు ఇరు జట్ల ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా నరేంద్ర మోదీ స్టేడియానికి వచ్చారు. ఇందులో జడేజా భార్య, జామ్ నగర్ నార్త్ ఎమ్మెల్యే రివాబా జడేజా కూడా ఉంది. భావోద్వేగానికి లోనైన రివాబా.. ఇక జడేజా చివరి బంతికి ఫోరు బాది జట్టును గెలిపించగానే అభిమానులతో పాటు ఆటగాళ్ల కుటంబ సభ్యులు కూడా ఆనందంలో మునిగి తేలిపోయారు. ఈ క్రమంలో స్టాండ్స్ నుంచి మ్యాచ్‌ను వీక్షిస్తున్న రివాబా భావోద్వేగానికి లోనయ్యంది. పట్టరాని సంతోషంలో రివాబా కన్నీరు పెట్టుకుంది. అనంతరం మైదానంలోకి వచ్చిన ఆమె జడేజా పాదాలకు దండం పెట్టింది. ఆ తర్వాత జడేజాను కౌగిలించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా మ్యాచ్ ప్రజేంటేషన్ అనంతరం ఐపీఎల్ ట్రోఫీతో జడేజా ఫ్యామిలీ కెమెరాలకు పోజులిచ్చారు. ఆ తర్వాత సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనితో కూడా వీరు ఫోటోలు దిగారు. చదవండి: ఇటువంటి అద్భుతాలు సర్ జడేజా ఒక్కడికే సాధ్యం.. చాలా సంతోషంగా ఉంది: రైనా Ravindra Jadeja's wife touched Jadeja's feet after the victory last night.#MSDhoni𓃵 #CSKvsGT #IPL2023Final pic.twitter.com/nNp6RAWUhR — Bhadohi Wallah (@Mithileshdhar) May 30, 2023 -
ఐపీఎల్ విక్టరీ: ఈ మిరాకిల్ నీకే సాధ్యం,చెన్నైకి రా సెలబ్రేట్ చేసుకుందాం!
సాక్షి,ముంబై: ఐపీఎల్ 2023 టైటిల్ గెల్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఫ్రాంచైజీ ఓనర్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఇండియా సిమెంట్స్ వైస్ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ ప్రశంసలు కురిపించారు. ఈ అద్భుతం లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని మాత్రమే సాధ్యమంటూ కితాబిచ్చారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించి జట్టును ఆయన అభినందించారు. ఈ మేరకు మంగళవారు ఉదయం ఆయన ధోనితో మాట్లాడారు. “అద్భుతమైన కెప్టెన్ మీరు. అద్భుతం చేసారు. మీరు మాత్రమే చేయగలరు. మీ టీంని చూసి గర్విస్తున్నాను అంటూ ఆయన ధోనీని అభినందనల్లో ముంచెత్తారు. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్ ) అంతేకాదు గత కొన్ని రోజులుగా బ్యాక్-టు-బ్యాక్ షెడ్యూల్‌తో అలిసిపోయారు.. విశ్రాంతి తీసుకోండి అంటూ ధోనీకి సలహా ఇచ్చారు. విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు జట్టుతో పాటు చెన్నైకి రావాలని కూడా ఆయన ఆహ్వానించారు. (ఐపీఎల్ చాంపియన్ సీఎస్కే ఓనరు, నికర విలువ ఎంత? విషయాలు తెలుసా?) Mr N Srinivasan, former Chairman of the ICC, former President of BCCI and TNCA, Mrs. Chitra Srinivasan and Mrs Rupa Gurunath present @msdhoni with a special memento commemorating the very special 200th 👏#TATAIPL | #CSKvRR | @ChennaiIPL pic.twitter.com/nixs6qsq2P — IndianPremierLeague (@IPL) April 12, 2023 మరిన్ని బిజినెస్ వార్తల కోసం సాక్షిబిజినెస్ -
CSK ఓనరు, నికర విలువ ఎంత? ఈ విషయాలు తెలుసా?
ఐపీఎల్ 2023 టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ను దక్కించుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్‌పై ఘన విజయం సాధించింది. సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చివరి ఓవర్లో పది పరుగులు కావాల్సిన సమయంలో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి జట్టును ఛాంపియన్‌గా మార్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఇండియ ఫస్ట్ స్పోర్ట్స్ యునికార్న్ ఎంటర్‌ప్రైజ్‌గా అవతరించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత నిలకడగా నిలిచిన జట్టుగా పేరొందిన సీఎస్కేకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.ఈ క్రమంలో సీఎస్కే యాజమాని ఎవరు, పెట్టుబడి, నికర విలువ ఎంత అనేది విశేషంగా మారింది. ఎన్ శ్రీనివాసన్ సీఎస్కే టీం యజమాని, ప్రముఖ పారిశశ్రామికవేత్త ఎన్ శ్రీనివాసన్. ఈయనకు క్రికెట్‌తో అనుబంధం చాలా సుదీర్ఘమైందే. అంతర్జాతీయ క్రికెట్ సర్క్యూట్లో పాపులర్ నేమ్. పలు నివేదికల ప్రకారం ప్రస్తుతం నికర నికర విలువ రూ.720 కోట్లుగా తెలుస్తోంది. (IPL 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్‌వర్త్ ఎంతో తెలుసా?) ప్రాథమిక విద్య మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ఎన్ శ్రీనివాసన్ చెన్నైలోని లయోలా కాలేజీలో గ్రాడ్యుయేషన్ (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్) చేశారు. అమెరికాలోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందారు. (ఐపీఎల్ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్‌వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు) క్రికెట్ పరిచయం బీసీసీఐ కార్యదర్శిగా పనిచేసిన తర్వాత, శ్రీనివాసన్ 2011లో బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ తర్వాత బాధ్యతలు స్వీకరించారు. 2014లో శ్రీనివాసన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ ఎంపిక కావడంతో జగ్మోహన్ దాల్మియా నియమితులయ్యారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ) మాజీ ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్. 2008 సంవత్సరంలో సీఎస్కేను కొనుగోలు చేశారు. దేశంలోని సిమెంట్ పరిశ్రమలో పాపులర్ అయిన ఇండియా సిమెంట్ ఓనర్ కూడా. బీసీసీఐ చీఫ్‌గా , ఐసీసీ మాజీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్) 2016 Born Kids will Never Realise How Combination of Indian Captain MS Dhoni and BCCI President N. Srinivasan Was 💙🇮🇳 pic.twitter.com/t0APYnCvOm — Junaid Khan (@JunaidKhanation) March 29, 2023 చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు శ్రీనివాసన్ 2008లో చెన్నై ఫ్రాంచైజీని (చెన్నై సూపర్ కింగ్స్) సుమారు రూ. 752 కోట్లకు కొనుగోలు చేయడంతో జెంటిల్మన్ గేమ్‌తో ఆయన రిలేషన్ మరింత బలపడింది. ఫ్రాంచైజీ విలువ ఇప్పుడు దాదాపు సుమారు రూ. 7443 కోట్లుగా ఉంది. ప్రొఫెషనల్ జర్నీ చెన్నైకి చెందిన సిమెంట్ తయారీ కంపెనీ ఇండియా సిమెంట్స్‌కి కో ఫౌండర్ తండ్రి నారాయణస్వామి తరువాత 1989లో శ్రీనివాసన్ వైస్-ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించారు. బొగ్గు ,ముడిసరుకు ధరలపెరుగుదల కారణంగా మార్చి 31, 2023తో ముగిసిన త్రైమాసికంలో రూ.218 కోట్ల నష్టాన్ని నివేదించింది. ఈక్రమంలోనే తిరునెల్వేలిలో 600 ఎకరాల భూమిని డబ్బు ఆర్జించే దిశగా సంస్థ ఉందని, ఈ ఏడాది (2023)వడ్డీతో సహా రూ. 500 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించాలని భావిస్తున్నట్టు శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఐపీఎల్ విజేతగా నిలివడంతో మార్కెట్లో ఇండియా సిమెంట్స్ షేర్ 3 శాతం లాభపడి. 199.50 వద్ద ముగిసింది. Attended the Platinum Jubilee celebrations of India Cements Ltd in Chennai today. India cement has played a crucial role in India’s growth under the leadership of N. Srinivasan Ji. Congratulated the entire team and also released a special postal stamp on this occasion. pic.twitter.com/xpWWj990Ye — Amit Shah (@AmitShah) November 12, 2022 ఇలాంటి ఇంట్రస్టింగ్ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి సాక్షి బిజినెస్ -
బ్యాటింగ్ చేసేది గిల్ అయితే కీపింగ్ చేసేది ధోని...
-
ఐపీఎల్ 2023: ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ టైటిల్ ఎవరిదో తెలుసా?
సాక్షి, ముంబై: రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించిన ఐపీఎల్ 2023 గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సాగిన ఫైనల్ పోరుతో ముగిసింది. ఎంస్ ధోనీ నేతృత్వంలోని సీఎస్కే టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఫుడ్ సరఫరా సంస్థ స్విగ్గి కీలక విషయాన్ని వెల్లడించింది. ఐపీఎల్ సీజన్లో ట్రోఫీ బిర్యానీ గెల్చుకుంది, బిర్యానీ ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ టైటిల్‌ను గెలుచుకుంది అంటూ ట్విట్ చేసింది. ఈ ఐపీఎల్ సీజన్లో బిర్యానీ ఆర్డర్ల వివరాలను స్విగ్గీ తాజాగా ప్రకటించింది. నిమిషానికి 212 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు వెల్లడించింది. ఎక్కువ మంది ఆర్డర్ చేసింది బిర్యానీనే అని, 12 మిలియన్లకు పైగా ఆర్డర్స్ వచ్చాయని పేర్కొంది. ఆర్డర్ చేసిన ప్రతి వెజ్ బిర్యానీకి, దేశవ్యాప్తంగా 20 నాన్-వెజ్ బిర్యానీలే. తొలి మ్యాచ్ నుంచి గ్రాండ్ ఫినాలే వరకు టోర్నీలో కేవలం క్రికెటర్సే కాదు స్విగ్గీ యూజర్లు కూడా నెక్ట్స్ లెవల్ అనిపించుకున్నారు. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్) ఈ సీజన్లో అత్యంత వేగవంతమైన డెలివరీ కేవలం 77 సెకన్లు. ఇది కోల్‌కతాలో జరిగింది. ఈ క్రికెట్ సీజన్లో 12 మిలియన్లకు పైగా ఆర్డర్లతో ఫుడ్ లీడర్ బోర్డ్‌లో ఆధిపత్యం బెంగుళూరు టాప్‌లో నిలిచింది.అలాగే ఢిల్లీకి చెందిన ఒక వినియోగదారు ఈ సీజన్లో అత్యధికంగా 701 సమోసాలను ఆర్డర్ చేశారు. అత్యధిక సింగిల్ ఆర్డర్ రూ.26,474. కాగా ఐపీఎల్ సీజన్ ఫీవర్‌ను క్యాష్ చేసుకున్న ఫుడ్ డెలివరీ సంస్థ రకరకాల ట్వీట్లతో సందడి చేసింది. చిత్ర విచిత్ర కామెంట్లతో ట్విట్టర్ లో నెటిజన్లను ఆకర్షించింది. కొన్నింటిపై ట్రోల్స్‌ను కూడా ఎదుర్కొంది. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా పదే పదే ఆగిపోతుండటంపై ‘అసలు ఆకాశంలో ఎవరు ఉల్లిగడ్డలు కోస్తున్నారబ్బా ఫన్నీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (IPL 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్‌వర్త్ ఎంతో తెలుసా?) మరిన్ని బిజినెస్ వార్తలు కోసం చదవండి సాక్షి బిజినెస్ -
ఇటువంటి అద్భుతాలు సర్ జడేజా ఒక్కడికే సాధ్యం.. చాలా సంతోషంగా ఉంది: రైనా
ఐపీఎల్-2023 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తుదిపోరులో 5 వికెట్ల తేడాతో(డక్‌వర్త్‌లూయిస్ పద్దతిలో) విజయం సాధించిన సీఎస్కే.. ఐదో సారి ఛాంపియన్స్‌గా నిలిచింది. ఇక ఆఖరి బంతికి ఫోర్ కొట్టి సీఎస్కేను ఛాంపియన్స్‌గా నిలిసిన రవీంద్ర జడేజాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా చేరాడు. జడ్డూను పొగడ్తలతో రైనా ముంచెత్తాడు. అసాధ్యాలను సుసాధ్యం చేసే సత్తా సర్ జడేజాకు ఒక్కడికే ఉందని రైనా కొనియాడు. కాగా సీఎస్కే విజయానికి ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసిన మొహిత్ శర్మ తొలి నాలుగు బంతులకే కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆఖరి రెండు బంతులకు 10 పరుగులు అవసరమవ్వగా.. జడ్డూ వరుసగా సిక్స్, ఫోర్ బాది గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ నేపథ్యంలో జియో సినిమాతో రైనా మాట్లాడుతూ.. "రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ కొట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. మొహిత్ తొలి నాలుగు బంతులను అద్బుతంగా వేశాడు. అటువంటి బౌలర్‌కు జడ్డూ వరుసగా సిక్స్, ఫోర్ బాది తన జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. తీవ్రమైన ఒత్తిడిలో కూడా జడ్డూ తన మాస్టర్‌క్లాస్‌ను ప్రదర్శించాడు. అందుకే ఎంఎస్ ధోని కూడా జడేజాను ఎత్తుకుని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇటువంటి అద్భుతాలు సర్జడేజాకు ఒక్కడే సాధ్యం. ఇది చారిత్రాత్మక విజయం. ఈ క్షణాన్ని దేశం మొత్తం గర్వించింది. మొత్తం పసుపు రంగుగా మారిపోయింది" అని పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: అదరగొట్టిన గిల్.. ఎన్ని అవార్డులు వచ్చాయంటే? మొత్తం ప్రైజ్‌మనీ ఎంతంటే? -
ధోనికి జడేజాకు మధ్య విబేధాలు ఇంకా ప్రూఫ్స్ కావాలా ....!
-
వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్
సాక్షి, ముంబై: ఐపీఎల్ 2023లో చెన్నై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసుకున్నసంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ డక్ వర్త్ లూయిస్ పద్దతిన 5 వికెట్ల తేడాతో విజయం . ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో జడేజా (6 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 15 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. (IPL 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్‌వర్త్ ఎంతో తెలుసా?) ముఖ్యంగా చివరి 2 బంతులకు 10 పరుగులు చేయాల్సిన ఉండగా, చెలరేగిన జడేజా వరుసగా 6, 4 కొట్టి జట్టుకు మర్చిపోలేని విజయాన్ని అందించాడు. జడ్డూ బాయ్ పెర్ఫామెన్స్‌కు ఫిదా అయిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భావోద్వేగానికి గురవడమే కాదు..ఎన్నడూ లేని విధంగా మ్యాచ్‌ను గెలిపించిన జడేజాను ఎత్తుకొని సంబరాలు చేసుకున్నాడు మిస్టర్ కూల్. (ఐపీఎల్ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్‌వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు) దీనికితోడు భర్త ప్రతిభకు ముగ్ధురాలైన జడేజా భార్య భర్త కాళ్లకు దణ్నం పెట్టి, గట్టిగా కౌగిలించుకుని మరీ మురిసిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Long live true love and patriarchy #IPLFinals #RavindraJadeja #Rajputboy pic.twitter.com/KXuY3kywGv — History Of Rajputana (@KshatriyaItihas) May 29, 2023 దీనిపై ఏఐ ఆర్టిస్ట్ సాహిద్ కూడా సెలబ్రేట్ చేశారు. ఇటీవలి కాలంలో అనేకమంది సినీ, రాజకీయ సెలబ్రిటీలు, క్రీడాకారుల ఫోటోలను ఆకర్షణీయంగా మల్చిన సాహిద్ ఇపుడు జడేజాను ఎంచుకోవడం విశేషం. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ వారెవ్వా జడేజా అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by SAHID (@sahixd) -
తలా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా...
-
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. తొలి ఆటగాడిగా
ఐపీఎల్-2023కు సోమవారంతో శుభం కార్డు పడింది. ఈ ఏడాది సీజన్ ఛాంపియన్స్‌గా చెన్నైసూపర్ కింగ్స్ నిలిచింది. ధోని సారధ్యంలోని సీస్‌ఎస్‌కే ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది. మరోవైపు వరుసగా రెండోసారి ఛాంపియన్స్‌గా నిలవాలన్న గుజరాత్ టైటాన్స్ కలనెరవలేదు. ఈసారి గుజరాత్ రన్నరప్‌గా నిలిచింది. ఇక ఈ సీజన్లో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఆరెంజ్ క్యాప్‌ను క్యాప్ నెగ్గిన అతి పిన్న వయస్కుడిగా గిల్ (23 ఏళ్ల 263 రోజులు) రికార్డులెక్కాడు. గతంలో ఈ రికార్డు చెన్నైసూపర్ కింగ్స్ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ పేరిట ఉండేది. 2021 సీజన్లో గైక్వాడ్ 24 ఏళ్ల వయస్సులో ఈ ఘనత సాధించాడు. తాజా సీజన్‌తో రుత్‌రాజ్ రికార్డును బ్రేక్‌చేశాడు. ఇక ఈ ఓవరాల్‌గా ఐపీఎల్-2023లో మరికొన్ని అరుదైన రికార్డులు నమోదయ్యాయి. అవి ఏంటో ఓ సారి పరిశీలిద్దాం. నమోదైన రికార్డులు ఇవే.. ►ఐపీఎల్లో 250 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా సీఎస్కే కెప్టెన్ ధోని రికార్డు నెలకొల్పాడు. 2008 నుంచి మొదలుకొని ధోని వరుసగా 16 సీజన్లు ఆడాడు. 226 మ్యాచ్‌ల్లో అతను కెప్టెన్‌గా చేశాడు. రోహిత్ శర్మ (243), దినేశ్ కార్తీక్ (242), విరాట్ కోహ్లి (237), రవీంద్ర జడేజా (226) టాప్–5లో ఉన్నారు. ►ఐపీఎల్–2023లో అత్యధిక సెంచరీలు(12) నమోదయ్యాయి. గత ఐపీఎల్ సీజన్లో అత్యధికంగా 8 సెంచరీలు వచ్చాయి. ►గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఐపీఎల్ సీజన్లో 37 సార్లు ఆయా జట్లు 200 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించాయి. గత సీజన్లో 18 సార్లు 200 అంతకంటే ఎక్కువ పరుగులు వచ్చాయి. ►564 ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన తుషార్ దేశ్‌పాండే నిలిచాడు. ఈ సీజన్లో తుషార్ 16 మ్యాచ్‌లు ఆడి 564 పరుగులు ఇచ్చి 21 వికెట్లు పడగొట్టాడు. గతంలో ఈ రికార్డు ప్రసిధ్ కృష్ణ (551 పరుగులు; 2022 సీజన్) పేరిట ఉంది. ► ఇప్పటి వరకు జరిగిన 16 ఐపీఎల్ ఫైనల్స్‌లో ఏడుసార్లు ఛేజింగ్ చేసిన జట్టు చాంపియన్‌గా అవతరించింది. తొమ్మిదిసార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజేతగా నిలిచింది. ►ఐపీఎల్ టైటిల్‌ను అత్యధికంగా ఐదుసార్లు గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ (2013, 2015, 2017, 2019, 2020) జట్టు పేరిట ఉన్న రికార్డును చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011, 2018, 2021, 2023) సమం చేసింది. ►ఇప్పటి వరకు జరిగిన 16 ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్‌ల్లో ఏ జట్టు కూడా ఒక్కసారీ ఆలౌట్ కాలేదు. ►6 మొత్తం 16 ఐపీఎల్ ఫైనల్స్‌లో ఆరుసార్లు ఆయా జట్లు 200 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించాయి. చదవండి: IPL 2023: చాంపియన్‌గా చెన్నై.. గిల్ సరికొత్త చరిత్ర! అవార్డులు, ప్రైజ్‌మనీ పూర్తి వివరాలు ఇవే.. Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
అదరగొట్టిన గిల్.. ఎన్ని అవార్డులు వచ్చాయంటే? మొత్తం ప్రైజ్‌మనీ ఎంతంటే?
ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ తుది మెట్టు మీద బోల్తా పడింది. అహ్మదాబాద్ వేదికగా చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ ఓటమి పాలైంది. దీంతో ఈ ఏడాది రన్నరప్‌గా హార్దిక్ సేన నిలిచింది. అయితే ఈ ఏడాది సీజన్లో గుజరాత్ స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 17 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 890 పరుగులతో ఈ ఏడాది సీజన్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా టాప్ రన్ స్కోరర్‌గా నిలిచిన గిల్.. ఈ ఏడాది ఐపీఎల్లో ఏఏ అవార్డులు గెలుచుకున్నాడో ఓసారి పరిశీలిద్దాం. గిల్ సొంతం చేసుకున్న అవార్డులు ఇవే.. ►ఈ ఏడాది సీజన్లో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో గిల్ అగ్ర స్థానంలో ఉండడంతో ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. దీంతో గిల్ ప్రైజ్‌మనీ రూ. 10లక్షలు సొంతంచేసుకున్నాడు. ►అదే విధంగా గేమ్ ఛేంజర్ ఆఫ్‌ది సీజన్ అవార్డు కూడా గిల్‌కే దక్కింది. ఈ అవార్డు రూపంలో గిల్‌కు రూ. 10 లక్షలు లభించింది. ►ఈ సీజన్లో అత్యంత విలువైన ఆటగాడిగా కూడా గిల్ ఎంపికయ్యాడు. అవార్డు రూపంలో గిల్ రూ.10 లక్షలు ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు. ►ఈ ఏడాది సీజన్లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. దీంతో అతడికి ప్రైజ్‌మనీ రూపంలో రూ.10 లక్షలు దక్కించుకున్నాడు. ఓవరల్‌గా అవార్డుల రూపంలో గిల్ రూ. 40 లక్షలు సొంతంచేసుకున్నాడు. చదవండి: ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ ఆటగాడు వచ్చేస్తున్నాడు -
మహీ అన్న.. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే: జడేజా ట్వీట్ వైరల్
#MS Dhoni- Ravnidra Jadeja: ఐపీఎల్-2023 ఫైనల్.. అసలే వర్షం.. అప్పటికే ఓరోజు వాయిదా పడ్డ మ్యాచ్.. కనీసం రిజర్వ్ డే అయినా వరుణుడు కరుణిస్తాడా లేదా అన్న సందేహాలు.. పర్లేదు వాతావరణం బాగానే ఉంది.. ఆట మొదలైంది.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. సాయి అద్బుత ఇన్నింగ్స్ సాయి సుదర్శన్ తుపాన్ ఇన్నింగ్స్(47 బంతుల్లో 96 పరుగులు) కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు స్కోరు బోర్డుపై ఉంచగలిగింది. అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఫలితం ఏమవుతుందోనన్న ఆందోళన నడుమ అర్ధరాత్రి మ్యాచ్ మళ్లీ మొదలైంది. డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు అంపైర్లు. ఈ నేపథ్యంలో లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై గెలుపొందాలంటే 171 పరుగులు సాధించాలి. కాన్వే అదరగొట్టాడు సీజన్ ఆసాంతం అదరగొట్టిన సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(16 బంతుల్లో 26 పరుగులు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ డెవాన్ కాన్వే (25 బంతుల్లో 47 పరుగులు) శుభారంభమే అందించారు. వన్‌డౌన్ బ్యాటర్ శివం దూబే తన వంతు పాత్ర పోషించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక నాలుగో స్థానంలో వచ్చిన అజింక్య రహానే 13 బంతుల్లోనే 27 పరుగులు సాధించాడు. ఆతర్వాతి స్థానంలో బ్యాటింగ్ చేసిన అంబటి రాయుడు 8 బంతుల్లో 19 రన్స్ తీశాడు. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ ధోని గోల్డెన్ డక్‌గా వెనుదిరగగా.. రవీంద్ర జడేజా మరోసారి మ్యాజిక్ చేశాడు. జడ్డూ విన్నింగ్ షాట్.. ఐదోసారి చాంపియన్‌గా చెన్నై చెన్నై గెలవాలంటే ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. మోహిత్ శర్మ మొదటి నాలుగు బంతులు కట్టుదిట్టంగా వేశాడు. వరుసగా 0, 1,1,1.. మొత్తంగా మూడు పరుగులే వచ్చాయి. సీఎస్కే ఐదోసారి చాంపియన్‌గా నిలవాలంటే ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో జడేజా ఉన్నాడు. నరాలు తెగే ఉత్కంఠ.. పదిహేనో ఓవర్ ఐదో బంతిని సిక్సర్‌గా మలిచిన జడ్డూ.. ఆఖరి బంతికి ఫోర్ బాదాడు. విన్నింగ్ షాట్‌తో చెన్నైని ఫైవ్‌స్టార్ చేశాడు. అంతే.. సూపర్ కింగ్స్ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. సారథి ధోని అయితే ఏకంగా జడ్డూను ఎత్తుకుని మరీ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఏంటీ విభేదాలా? మహీ అన్న కోసం ఏమైనా చేస్తా! కీలక మ్యాచ్‌లలో చెన్నైని గెలిపించిన జడేజా.. ఐపీఎల్-2023 ఫైనల్లోనూ అద్భుతం చేసి జట్టును విజయతీరాలకు చేర్చి ధోనికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. కాగా ధోని- జడేజా మధ్య విభేదాలంటూ గత కొంతకాలంగా వదంతులు వ్యాపిస్తున్న తరుణంగా రవీంద్ర జడేజా తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. జడ్డూ, తన భార్య రివాబా ట్రోఫీతో ధోనితో కలిసి ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. ‘‘ఇది కేవలం ఏకైక వీరుడు, ధీరుడు ఎంఎస్ ధోని కోసమే చేశాం. మహీ అన్నా.. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే’’ అంటూ ధోనిపై ప్రేమను కురిపించాడు. వేలల్లో రీట్వీట్లు, మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో రవీంద్ర జడేజా ట్వీట్ దూసుకుపోతోంది. వీరి మధ్య పొరపొచ్చాలు లేవని ఇప్పటికైనా ఇలా చెప్పారంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు. చదవండి: ఇంతకంటే నాకింకేం కావాలి.. జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు: అంబటి రాయుడు We did it for ONE and ONLY “MS DHONI.🏆 mahi bhai aapke liye toh kuch bhi…❤️❤️ pic.twitter.com/iZnQUcZIYQ — Ravindrasinh jadeja (@imjadeja) May 30, 2023 M.O.O.D! 🤗 Ravindra Jadeja 🤝 MS Dhoni#TATAIPL | #Final | #CSKvGT | @imjadeja | @msdhoni pic.twitter.com/uggbDA4sFd — IndianPremierLeague (@IPL) May 29, 2023 Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 𝙒𝙚 𝙬𝙖𝙣𝙩 𝙩𝙤 𝙙𝙚𝙙𝙞𝙘𝙖𝙩𝙚 𝙩𝙝𝙞𝙨 𝙏𝙞𝙩𝙡𝙚 𝙑𝙞𝙘𝙩𝙤𝙧𝙮 𝙩𝙤 𝙈𝙎 𝘿𝙝𝙤𝙣𝙞 💛 Men of the moment @imjadeja & @IamShivamDube recap #CSK's glorious win in the #TATAIPL 2023 #Final 👌🏻👌🏻 - By @ameyatilak Full Interview 🎥🔽 #CSKvGT https://t.co/kDgECPSeso pic.twitter.com/yp09HKKCSn — IndianPremierLeague (@IPL) May 30, 2023 -
ఐపీఎల్ 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్‌వర్త్ ఎంతో తెలుసా?
క్రికెట్ దిగ్గజం ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2023 టైటిల్‌ను చేజిక్కించుకుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో విజేతగా నిలిచి అభిమానులను ఉర్రూత లూగించింది టీం. దీంతో ప్రశంసల వెల్లువ కురుస్తోంది. The interaction you were waiting for 😉 MS Dhoni has got everyone delighted with his response 😃 #TATAIPL | #Final | #CSKvGT | @msdhoni pic.twitter.com/vEX5I88PGK — IndianPremierLeague (@IPL) May 29, 2023 భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో, క్రికెట్ కరియర్లో అనేక రికార్డులను నమోదుచేసిన ధోని కేవలం గ్రౌండ్‌లోనే కాదు, వెలుపల కూడా తగ్గేదేలే అంటూ పెర్ఫెక్ట్ బిజినెస్‌మేన్‌లా సక్సెస్‌పుల్‌గా దూసుకుపోతున్నాడు మాజీ కెప్టెన్ పలు పెట్టుబడులు ప్రసిద్ధ బ్రాండ్ ఎండార్స్మెంట్లతో ఇండియాలో టాప్ రిచెస్ట్ ప్లేయర్‌గా ఉన్నాడు. ఎంఎస్ ధోని నికర విలువ ఎంత? అంచనాల ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నికర విలువ దాదాపు రూ. 1040 కోట్లు. వార్షిక వేతనం, 50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అనేక రకాలు పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తో పాటు, ఐపీఎల్ రెమ్యునరేషన్‌తో కలిపి మొత్తం ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెటర్లలో ఒకడు. ఐపీఎల్ టీం సీఎస్కే ద్వారా రూ. 12 కోట్ల ఆదాయం వస్తోంది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం గత పదహారు సీజన్లలో ఐపీఎల్ ద్వారా రూ. 178 కోట్లకు పైగా సంపాదించాడు. ఒక విధంగా చెప్పాలంటే అతని మొత్తం సంపాదనలో ఇది చిన్న మొత్తమే. ఖటాబుక్, కార్స్ 24, షాకా హ్యారీ, గరుడ ఏరోస్పేస్ వంటి అనేక వాటిలో ఇన్వెస్టర్‌గా ఉన్నాడు. ఇంకా ఫిట్నెస్, యాక్టివ్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ సెవెన్లో మెజారిటీ వాటాదారు.సేంద్రీయ వ్యవసాయం, డ్రోన్లు, క్రీడా దుస్తులు, జిమ్ బిజినెస్.. ఇలా మొత్తం కలిపి ప్రతీ ఏడాది రూ. 4 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. కోకా కోలా, ఇండియా సిమెంట్స్, డ్రీమ్ 11, గోడాడీ , రీబాక్ వంటి బ్రాండ్లు ఎంఎస్ ఖాతాలో ఉన్నాయి. దీంతోపాటు ఫుట్‌బాల్ టీమ్ చెన్నైయిన్ ఎఫ్‌సి, హాకీ టీమ్ రాంచీ రేస్ , మహి రేసింగ్ టీమ్ ఇండియాలో వాటాలున్నాయి. (ఐపీఎల్ 2023: ముంబై ఇండియన్స్ ద్వారా అంబానీల సంపాదన ఎంతో తెలుసా?) ధోని సాక్షి ధోని లగ్జరీ లైఫ్ స్టైల్ ధోనీ, అతని భార్య సాక్షి ధోనీ ఇద్దరూ లగ్జరీ వస్తువులు, ఇళ్లతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. జార్ఖండ్‌లోని రాంచీలో వీరికి ఒక భారీ ఫామ్‌హౌస్ ఉంది. ఇక్కడే ధోనీ సాక్షి, వారి కుమార్తె జీవాతో నివసిస్తున్నారు, దీని ధర రూ. 10 కోట్ల కంటే ఎక్కువ. దీంతోపాటు జంటకు డెహ్రాడూన్‌లో రూ. 17.8 కోట్ల ఇల్లు కూడా ఉంది. ఇక ధోనికి కార్లు, బైక్‌లపై ఉండే పప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. కళ్లు చెదిరే కలెక్షన్ అతని సొంతం. హమ్మర్ హెచ్2, ఆడి క్యూ7, మిత్సుబిషి పజెరో ఎస్ఎఫ్ఎక్స్, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్, మహీంద్రా స్కార్పియో, ఫెరారీ 599 జిటిఓ, జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్, నిస్సాన్ జోంగా, పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ ఆమ్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ, హిందుస్తాన్ అంబాటోరోస్, రోల్స్ రాయ్టోర్ల లాంటి ఉన్నాయి. (ఐపీఎల్ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్‌వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు) ఇది కాకుండా ధోని జీవితం ఆధారంగా తీసిన హిట్ మూవీ 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' ద్వారా దాదాపు రూ. 30 కోట్లు సంపాదించాడు. ఈ మూవీలో రీల్ ధోని పాత్రను దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోషించారు. కెప్టెన్ కూల్‌గా పాపులర్ అయిన ధోని, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా తన ప్రతిభను చాటుకున్నాడు. అయితే అన్నిరకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న ధోనీ ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే -
ఇంతకంటే నాకింకేం కావాలి.. జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు: అంబటి రాయుడు
IPL 2023- Ambati Rayudu: ‘‘అవును.. ఐపీఎల్ కెరీర్ అద్భుతంగా ముగిసింది. ఇంతకంటే నాకింకేం కావాలి. అసలు ఇది నమ్మశక్యంగా లేదు. ఇది నిజంగా అదృష్టమనే చెప్పాలి’’ అని టీమిండియా మాజీ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు హర్షం వ్యక్తం చేశాడు. It feels so great to finally hold the trophy for a sixth time..been a great night for csk and also me personally… pic.twitter.com/Il5RNDGJwr — ATR (@RayuduAmbati) May 30, 2023 కాగా 2010లో ముంబై ఇండియన్స్ తరఫున.. ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.. తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌కు మారాడు. ముంబై ట్రోఫీ గెలిచిన మూడు సందర్భాల్లో ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న రాయుడు.. మొత్తంగా ఆరో టైటిల్‌తో తన ఐపీఎల్ కెరీర్ ముగించాడు. 2 great teams mi nd csk,204 matches,14 seasons,11 playoffs,8 finals,5 trophies.hopefully 6th tonight. It’s been quite a journey.I have decided that tonight’s final is going to be my last game in the Ipl.i truly hav enjoyed playing this great tournament.Thank u all. No u turn 😂🙏 — ATR (@RayuduAmbati) May 28, 2023 చెన్నై ఐదోసారి.. రాయుడు ఖాతాలో ఆరు ఐపీఎల్-2023 ఫైనల్‌కు ముందు తాను క్యాష్ రిచ్ లీగ్‌కు గుడ్ బై చెప్పనున్నట్లు అంబటి రాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా చెన్నై- గుజరాత్ టైటాన్స్ మధ్య మే 28న జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్‌డేకు మారింది. ఈ క్రమంలో సోమవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్‌ను ఓడించి చెన్నై ఐదోసారి చాంపియన్‌గా అవతరించింది. pic.twitter.com/rwUaptbvSr — ATR (@RayuduAmbati) May 30, 2023 ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఐదుసార్లు చాంపియన్ జట్టులో సభ్యుడిగా ఉన్న అంబటి రాయుడు ఖాతాలో మరో టైటిల్ చేరింది. దీంతో రాయుడు ఉద్వేగానికి లోనయ్యాడు. తనకు ఇంతకంటే గొప్ప బహుమతి ఏదీ ఉండదని వ్యాఖ్యానించాడు. In life and sport ups and downs are a constant part. We need to be positive and keeping working hard and things will turn around.. results are not always a measure of our effort. So always keeping smiling and enjoy the process.. pic.twitter.com/1AYAALkGBM — ATR (@RayuduAmbati) April 28, 2023 మా నాన్న వల్లే చెన్నై విజయానంతరం కామెంటేటర్ హర్షా భోగ్లేతో అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘‘ఇక నేనిలాగే జీవితాంతం చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోవచ్చు. గత 30 ఏళ్లుగా హార్డ్‌వర్క్ చేస్తున్నా. నా ప్రయాణంలో నాకు సహాయసహకారాలు అందించిన నా కుటుంబానికి, ముఖ్యంగా మా నాన్నకు ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ల మద్దతు లేకుండా ఇదంతా సాధ్యమయ్యేదే కాదు. నాకు ఇంతకంటే ఇంకేం కావాలి’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఈ సీజన్లో అంబటి రాయుడు మొత్తంగా 12 ఇన్నింగ్స్‌లలో కలిపి 158 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్ మ్యాచ్‌లో 8 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేశాడు. Photo Credit : AFP రోహిత్ శర్మ తర్వాత రాయుడు ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, రెండు సిక్సర్లు ఉన్నాయి. కాగా 37 ఏళ్ల అంబటి రాయుడు తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో 4348 పరుగులు సాధించాడు. ఆరుసార్లు.. విజేతగా నిలిచిన జట్లలో భాగమై ట్రోఫీలను ముద్దాడాడు. అదే విధంగా ఆటగాడిగా టీమిండియా సారథి రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. కాగా రిజర్వ్ డే మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో సీఎస్కే 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. చదవండి: జడేజాను ఎత్తుకుని ధోని సెలబ్రేషన్! ఇంతకంటే ఏం కావాలి? వీడియో వైరల్ ఇలా జరగాలని రాసి పెట్టి ఉందంతే! ధోని చేతిలో ఓడినా బాధపడను: హార్దిక్ Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
జడేజాను ఎత్తుకుని ధోని సెలబ్రేషన్! ఇంతకంటే ఏం కావాలి? వీడియో వైరల్
IPL 2023 Winner CSK- MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరే ఓ ఎమోషన్.. బ్యాటింగ్ చేసినా చేయకపోయినా మైదానంలో తలా ఉంటే చాలు.. అదే మహా భాగ్యం అన్నట్లు మురిసిపోయే అభిమానులకు లెక్కేలేదు. సాధారణంగా భావోద్వేగాలను ఎక్కువగా బయటపెట్టని ఈ మిస్టర్ కూల్ ఐపీఎల్-2023 ఫైనల్ సందర్భంగా మాత్రం ఉద్వేగానికి లోనయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం నాటి తుదిపోరులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫోర్ బాది జట్టుకు విజయం అందించగానే ధోని కళ్లల్లో ఆనంద భాష్పాలు కనిపించాయి. విన్నింగ్ షాట్ కొట్టగానే జడ్డూ డగౌట్ దిశగా పరిగెత్తుకు రాగా.. ఒక్కసారిగా అతడిని ఎత్తుకున్నాడు ధోని. విభేదాలంటూ వార్తలు సంతోషం పట్టలేక తన తమ్ముడిలాంటి జడేజాను అభినందిస్తూ తనదైన స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. కాగా ధోని- జడేజా మధ్య విభేదాలు తలెత్తాయంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యాన్స్‌కు కౌంటర్ ఇచ్చిన జడ్డూ ఓ మ్యాచ్‌లో తలా.. జడ్డూపై సీరియస్ కావడం.. ధోనికి ఇదే చివరి సీజన్ అన్న వార్తల నేపథ్యంలో సొంత జట్టు అభిమానులే ధోని కోసం జడేజా త్వరగా అవుటవ్వాలని కోరుకోవడం వంటి పరిణామాల నడుమ.. ఇప్పటికైనా.. ‘‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఎవరో తెలుసుకోండి’’ అంటూ జడేజా ఫ్యాన్స్‌కు కౌంటర్ ఇవ్వడం సందేహాలకు తావిచ్చింది. నచ్చిన దారిలో వెళ్లమన్న రివాబా ఈ నేపథ్యంలో జడేజా వేరే ఫ్రాంఛైజీకి మారే ఆలోచనలో ఉన్నాడంటూ వదంతులు వ్యాపించాయి. ఒక సందర్భంలో జడ్డూ భార్య రివాబా సైతం భర్తకు అండగా.. ‘‘నీకు నచ్చిన దారిలో వెళ్లు’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వీటిని మరింత బలపరిచాయి. మీరిలాగే కలిసి ఉండాలి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ధోని.. జడ్డూను ఆత్మీయంగా హత్తుకుని ఎత్తుకున్న దృశ్యాలు అభిమానులకు కనుల విందుగా మారాయి. ‘మీరెప్పుడూ ఇలాగే ఉండాలి. మీ గురించి వచ్చిన వార్తలు వట్టి వదంతులే అని తేలిపోవాలని కోరుకుంటున్నాం’’ అంటూ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోను ట్రెండ్ చేస్తున్నారు. నెట్టింట వీడియో వైరల్ ధోని- జడ్డూ అనుబంధానికి అద్దం పట్టినట్లుగా ఉన్న ఈ వీడియో మిలియన్‌కు పైగా వ్యూస్‌తో దూసుకుపోతూ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా సోమవారం రిజర్వ్ డే మ్యాచ్‌లోనూ వర్షం అడ్డుపడిన కారణంగా డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో విజేతను నిర్ణయించారు. విన్నింగ్ షాట్ కొట్టిన జడ్డూ నరేంద్ర మోదీ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 214 పరుగుల భారీ స్కోరు చేసింది. వరుణుడి కారణంగా సీఎస్కే 15 ఓవర్లలో 171 పరుగులు చేయాల్సి ఉండగా.. జడేజా ఫోర్ బాది చెన్నైకి విజయం అందించాడు. దీంతో ఐదోసారి ట్రోఫీ అందుకున్న సూపర్‌కింగ్స్ సంబరాలు అంబరాన్నంటాయి. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన చెన్నై ఓపెనర్ డెవాన్ కాన్వే(25 బంతుల్లో 47 పరుగులు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక టోర్నీ ఆసాంతం అద్భుత బ్యాటింగ్‌తో మూడు శతకాలు నమోదు చేసిన గుజరాత్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అత్యధిక పరుగుల వీరుడి(890)గా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అదే జట్టుకు చెందిన మహ్మద్ షమీ అత్యధిక వికెట్ల(28)తో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. M.O.O.D! 🤗 Ravindra Jadeja 🤝 MS Dhoni#TATAIPL | #Final | #CSKvGT | @imjadeja | @msdhoni pic.twitter.com/uggbDA4sFd — IndianPremierLeague (@IPL) May 29, 2023 Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
చెన్నై పాంచ్ పటాకా
-
నెట్ ప్రాక్టీస్‌లో కోహ్లి.. లండన్‌కు పయనం కానున్న ఆ ఐదుగురు!
WTC Final 2023- Ind Vs Aus: లండన్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం భారత ఆటగాళ్లు ఇంగ్లండ్‌లో కసరత్తు మొదలుపెట్టారు. స్టార్ బ్యాటర్ కోహ్లి ట్రెయినింగ్ సెషన్లో పాల్గొన్నాడు. లెఫ్టార్మ్ సీమర్ ఉనాద్కట్, ఉమేశ్ యాదవ్, సిరాజ్, వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌లు కాసేపు ఎక్సర్సైజ్ చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, యువ సంచలనం యశస్వి జైస్వాల్ తాజాగా ఇంగ్లండ్ చేరుకోగా... మంగళవారం నుంచి వీరిద్దరు ప్రాక్టీస్ మొదలుపెడతారు. కాగా జూన్ 7-11 వరకు ఇంగ్లండ్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. టీమిండియా- ఆస్ట్రేలియా ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఈ మెగా మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల బోర్డులు ఫైనల్‌కు సంబంధించిన జట్లను ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు భారత ఆటగాళ్లు లండన్‌కు చేరకుని ప్రాక్టీస్ షురూ చేశారు. ఐదోసారి చాంపియన్‌గా చెన్నై.. ఆలస్యంగా ఆ ఐదుగురు ఇక ఐపీఎల్-2023 ఫైనల్ ముగించుకున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (సీఎస్కే), అజింక్య రహానే(సీఎస్కే) సహా గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు మహ్మద్ షమీ, శుబ్‌మన్ గిల్, కేఎస్ భరత్ కాస్త ఆలస్యంగా యూకేకు బయల్దేరనున్నారు. కాగా క్యాష్ రిచ్ లీగ్ పదహారో ఎడిషన్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించిన విషయం తెలిసిందే. వర్షం ఆటంకం కారణంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సోమవారం జరిగిన రిజర్వ్ డే మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై గెలుపొందింది. డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో విజయం సాధించి ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది ధోని సేన. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే భారత జట్టుతో వచ్చే నెల 7 నుంచి 11 వరకు ఓవల్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు.పక్కటెముకల్లో నొప్పితో ఐపీఎల్ టోర్నీ మధ్యలో నుంచి స్వదేశానికి వెళ్లిపోయిన పేస్ బౌలర్ జోష్ హాజల్‌వుడ్ (ఆర్సీబీ)కు 15 మందితో కూడిన ఆసీస్ జట్టులో చోటు లభించింది. అయితే ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్, బ్యాటర్ రెన్షాలకు స్థానం దక్కలేదు. 32 ఏళ్ల హాజల్‌వుడ్ 59 టెస్టులు ఆడి 222 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, హాజల్‌వుడ్, నాథన్ లయన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, ఇంగ్లిస్. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్. స్టాండ్ బై ప్లేయర్లు: సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైశ్వాల్, ముకేశ్ కుమార్ చదవండి: చాంపియన్‌గా చెన్నై.. గిల్ సరికొత్త చరిత్ర! అవార్డులు, ప్రైజ్‌మనీ పూర్తి వివరాలు ఇవే.. రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయం.. కానీ! నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి: ధోని ఇలా జరగాలని రాసి పెట్టి ఉందంతే! ధోని చేతిలో ఓడినా బాధపడను: హార్దిక్ #TeamIndia members begin their preparations for the #WTC23 at Arundel Castle Cricket Club. pic.twitter.com/2kvGyjWNF7 — BCCI (@BCCI) May 29, 2023 -
ఇలా జరగాలని రాసి పెట్టి ఉందంతే! ధోని చేతిలో ఓడినా బాధపడను: హార్దిక్
IPL 2023 Final CSK Vs GT- Winner Chennai: ఐపీఎల్-2023 ఫైనల్.. వేదిక అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం.. గుజరాత్ టైటాన్స్ సొంత మైదానం.. వర్షం కారణంగా.. లీగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రిజర్వ్‌డేకు మ్యాచ్ వాయిదా.. సీజన్ ఆరంభంలో ఇక్కడే చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి శుభారంభం చేసిన గుజరాత్.. ఫైనల్లోనూ అదే ఫలితం పునరావృతం చేసి వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవాలని భావించింది. ఒకవేళ వరణుడి కారణంగా మ్యాచ్ రద్దైపోయినా.. టేబుల్ టాపర్‌గా ఉన్న తమనే విజయం వరిస్తుందని కాస్త ధీమాగానే కనిపించింది.. అయితే, సోమవారం వర్షం తెరిపినిచ్చింది. టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సాయి సుదర్శన్ ఒంటరి పోరాటం సీఎస్కే ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. వృద్ధిమాన్ సాహా హాఫ్ సెంచరీ(54)తో మెరవగా.. శతకాల ధీరుడు శుబ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో మాత్రం 39 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ జట్టును ఆదుకునే బాధ్యతను తీసుకున్నాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేశాడు. సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయినా.. గుజరాత్ 214 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి వరుణడి అడ్డంకి కారణంగా సీఎస్కే లక్ష్యం 15 ఓవర్లకు 171 పరుగులుగా నిర్దేశించారు అంపైర్లు. జడ్డూ ఆఖరి బంతికి ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఫోర్ బాది రవీంద్ర జడేజా చెన్నైని విజయతీరాలకు చేర్చాడు. దీంతో ధోని సేన ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. రెండోసారి టైటిల్ గెలవాలన్న టైటాన్స్ ఆశలపై నీళ్లు చల్లింది. గెలుపోటముల్లో ఒక్కటిగా ఉంటాం ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. తమ జట్టును చూసి గర్వపడుతున్నట్లు తెలిపాడు. గెలవడానికి శాయశక్తులా కృషి చేశామని.. గెలుపోటములలో తాము కలిసే ఉంటామని పేర్కొన్నాడు. తమ ఓటమికి సాకులు వెతకదలచుకోలేదన్న పాండ్యా.. సీఎస్కే అద్భుతంగా ఆడి చాంపియన్‌గా నిలిచిందని ప్రశంసించాడు. అయితే, తమ జట్టులోని యువ ఆటగాడు సాయి సుదర్శన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని.. ఫైనల్ మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించి ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం అంత తేలికేమీ కాదని తమిళనాడు బ్యాటర్‌ను కొనియాడాడు. మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ.. ఇలా ప్రతి ఒక్కరు జట్టును గెలిపించేందుకు పాటుపడ్డారని పాండ్యా పేర్కొన్నాడు. రాసి పెట్టి ఉందంతే! ఓడినా బాధపడను ఇక సీఎస్కే కెప్టెన్, తన రోల్‌మోడల్ ధోని గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ధోని భాయ్‌ని ఇలా చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలా జరగాలని రాసి పెట్టి ఉందంతే! నేను ఒకవేళ ఓడిపోవాల్సి వస్తే అదీ ధోని చేతిలో అయితే అస్సలు బాధపడను. మంచివాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. నాకు తెలిసిన అత్యంత మంచి వ్యక్తులలో ధోని ఒకడు. ఆ దేవుడు నా వైపు ఉంటాడని అనుకున్నా. కానీ ఈరోజు ధోనిదే అయింది’’ అని హార్దిక్ పాండ్యా ఎమోషనల్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో గెలుపొంది ఐదోసారి చాంపియన్ అయింది. అహ్మదాబాద్ మ్యాచ్‌లో 25 బంతుల్లో 47 పరుగులు సాధించిన చెన్నై ఓపెనర్ డెవాన్ కాన్వే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయం.. కానీ! నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి: ధోని చాంపియన్‌గా చెన్నై.. గిల్ సరికొత్త చరిత్ర! అవార్డులు, ప్రైజ్‌మనీ పూర్తి వివరాలు ఇవే.. We are not crying, you are 🥹 The Legend continues to grow 🫡#TATAIPL | #Final | #CSKvGT | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/650x9lr2vH — IndianPremierLeague (@IPL) May 30, 2023 𝙄𝘾𝙊𝙉𝙄𝘾! A round of applause for the victorious MS Dhoni-led Chennai Super Kings 👏🏻👏🏻#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/kzi9cGDIcW — IndianPremierLeague (@IPL) May 29, 2023 -
IPL 2023: చెన్నై కొంటుందనుకున్నాడు.. కానీ అలా జరుగలేదు! ఫైనల్లో అదే జట్టుపై
IPL 2023 Final CSK Vs GT- Who Is Sai Sudharsan- His Best Innings: ‘సాయి సుదర్శన్ ప్రత్యేకమైన ఆటగాడు. టి20 ఫార్మాట్కైతే సరిగ్గా సరిపోతాడు. సాధ్యమైనంత తొందరగా అతడిని తమిళనాడు జట్టులోకి తీసుకు రండి’... భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జూలై, 2021లో చెప్పిన ప్రశంసాపూర్వక మాట ఇది. ఆ ఏడాది తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అతను అద్భుత బ్యాటింగ్‌తో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అశ్విన్ మాట విన్నట్లుగా తమిళనాడు సెలక్టర్లు అతడిని జట్టులోకి ఎంపిక చేయగా... నవంబర్, 2021లోనే అతను తన తొలి దేశవాళీ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత గత రెండేళ్లలో అతని ఆట మరింత మెరుగైంది. 21 ఏళ్ల సుదర్శన్ మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటి ప్రస్తుతం ఆ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. Photo Credit : AFP చెన్నై తీసుకోలేదు.. తన ప్రదర్శన, గుర్తింపు కారణంగా 2022 ఐపీఎల్ వేలంలో తనను చెన్నై జట్టు తీసుకుంటుందని సుదర్శన్ ఆశించాడు. కానీ అది జరగలేదు. చివరకు అతని కనీస విలువ రూ. 20 లక్షలకు గుజరాత్ టైటాన్స్ తీసుకుంది. విజయ్‌శంకర్‌కు గాయం కావడంతో తొలి మ్యాచ్ ఆడే అవకాశం రాగా, మొత్తం సీజన్లో 5 మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. అయితే అతని మెరుపులు ఆకట్టుకున్నాయి. Photo Credit : AFP విలియమ్సన్ తప్పుకోవడంతో ముఖ్యంగా రబడ బౌలింగ్‌లో కొట్టిన హుక్‌షాట్ బౌండరీ అతని ఆత్మవిశ్వాసాన్ని చూపించింది. సాయి బ్యాటింగ్‌ను నమ్మిన టీమ్ యాజమాన్యం ఈసారి కూడా కొనసాగించింది. ఈ ఏడాది కూడా విలియమ్సన్ గాయంతో తప్పుకోవడంతో తనకు అందివచ్చిన అవకాశాన్ని అతను సమర్థంగా వినియోగించుకున్నాడు. ఢిల్లీపై అర్ధసెంచరీ చేసిన మ్యాచ్‌లో నోర్జే వేసిన 144 కిలోమీటర్ల బంతిని వికెట్ల వెనుకవైపు సిక్సర్‌గా మలచడం హైలైట్‌గా నిలిచింది. Photo Credit : AFP సెంచరీ చేజారినా.. కోల్‌కతాపై కూడా మరో అర్ధ సెంచరీ సాధించిన అతను ఈ సీజన్లో 51.71 సగటు, 141.41 స్ట్రయిక్‌రేట్‌తో 362 పరుగులు సాధించడం విశేషం. ముంబైతో రెండో క్వాలిఫయర్‌లో చివర్లో వేగంగా పరుగులు చేయలేక ‘రిటైర్డ్ అవుట్’గా వెళ్లడంతో అతని దూకుడుపై సందేహాలు తలెత్తాయి. అయితే సోమవారం అతను దానిని పటాపంచలు చేశాడు. సెంచరీ చేజారినా...ఐపీఎల్లో ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ ఇన్నింగ్స్‌లలో ఒకటి ఆడాడు. Photo Credit : AFP తల్లిదండ్రులు కూడా సుదర్శన్ ఇంట్లోనే క్రీడలు ఉన్నాయి. అథ్లెట్ అయిన తండ్రి భరద్వాజ్ భారత్ తరఫున దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనగా, తల్లి ఉష జాతీయ వాలీబాల్‌లో తమిళనాడు జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ప్రస్తుతం స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా పని చేస్తోంది. వివిధ వయో విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో అతను దూసుకొచ్చాడు. Photo Credit : AFP తల్లి పర్యవేక్షణలో 2019–20 అండర్–19 చాలెంజర్ ట్రోఫీలో యశస్వి జైస్వాల్, తిలక్‌వర్మ, రవి బిష్ణోయ్, ప్రియమ్ గార్గ్ అతని ఇండియా ‘ఎ’ జట్టు సహచరులు. ఆరంభంలోనే ఫిట్‌నెస్‌పై అంతగా దృష్టి పెట్టని సాయి తల్లి పర్యవేక్షణలో పూర్తి ఫిట్‌గా మారడం కూడా అతని కెరీర్‌కు మేలు చేసింది. Photo Credit : AFP చెన్నైపై తన మెరుపు బ్యాటింగ్‌తో 2022లో టైటాన్స్ రూ.20 లక్షలకు తీసుకున్న తర్వాత జరిగిన 2023 తమిళనాడు ప్రీమియర్ లీగ్ వేలంలో సుదర్శన్‌కు రూ. 21.60 లక్షలు దక్కడం విశేషం. సీఎస్కేకే చెందిన జూనియర్ సూపర్ కింగ్స్ టీమ్ సభ్యుడిగా 2018లో సుదర్శన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లగా, ఆ టీమ్‌కు అంబటి రాయుడు మెంటార్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు అదే చెన్నైపై తన మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగడం కొసమెరుపు! ఈ సందర్భంగా రికార్డుల మోత మోగించాడు సాయి సుదర్శన్. –సాక్షి క్రీడా విభాగం చదవండి: రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయం.. కానీ! నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి: ధోని చాంపియన్‌గా చెన్నై.. గిల్ సరికొత్త చరిత్ర! అవార్డులు, ప్రైజ్‌మనీ పూర్తి వివరాలు ఇవే.. High praise for our young Titan 👏🏻💙 https://t.co/Kep0fr6Pgl — Gujarat Titans (@gujarat_titans) May 29, 2023 Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయం.. కానీ! నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి: ధోని
IPL 2023 Winner CSK- Emotional MS Dhoni Comments: ‘‘ఎదురుచూపులకు సమాధానం చెప్పే సమయం.. నా రిటైర్మెంట్ ప్రకటనకు ఇంతకంటే గొప్ప సందర్భం ఉండదు. నాపై అంతులేని ప్రేమాభిమానాలు, ఆప్యాయతా అనురాగాలు చూపించిన చూపించిన అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నా. అయితే, మరో తొమ్మిది నెలల పాటు ఇలాంటి కఠిన శ్రమకోర్చి.. ఐపీఎల్ వచ్చే సీజన్లోనూ కొనసాగాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పనే. కెరీర్ కొనసాగించేందుకు నా శరీరం ఏ మేరకు సహకరిస్తుందన్న అంశం మీదే అంతా ఆధారపడి ఉంది. నా నిర్ణయం ఏమిటనేది ప్రకటించడానికి మరో 6-7 నెలల సమయం ఉంది. నాపై ప్రేమ చూపిస్తున్న వాళ్లందరికీ నా తరఫున మంచి బహుమతి అందించాలని అనుకుంటున్నా. ఆ గిఫ్ట్ ఇవ్వాలంటే నేను కష్టపడక తప్పదు’’ అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. Photo Credit : AFP అంతా బాగుంటే మళ్లీ వస్తా ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పేందుకు ఇదే సరైన సమయం అంటూనే.. తన అభిమానులకు తప్పకుండా మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తానని 41 ఏళ్ల ధోని మాట ఇచ్చాడు. శరీరం సహకరిస్తే తప్పకుండా ఐపీఎల్లో కొనసాగుతానని చెప్పకనే చెప్పాడు. ఐపీఎల్-2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో.. వర్షం అడ్డంకి కారణంగా రిజర్వ్ డే అయిన సోమవారం నాటి మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం సీఎస్కే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. Photo Credit : AFP తద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఐదోసారి చాంపియన్‌గా నిలిచి.. ముంబై ఇండియన్స్ పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. చెన్నైని ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిపిన ధోని.. రోహిత్ శర్మ సరసన నిలిచాడు. ఈ నేపథ్యంలో ఫైనల్లో విజయానంతరం ధోని మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. Photo Credit : AFP కెరీర్లో చివరి అంకం.. నా కళ్లు చెమర్చాయి ‘‘నా కెరీర్లో ఇది చివరి అంకం. మొదటి మ్యాచ్ నుంచే నేను మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి నా నామస్మరణతో అభిమానులు నాపై ప్రేమను కురిపించారు. వాళ్ల అభిమానానికి నా కళ్లు చెమర్చాయి. డగౌట్లో కూర్చుని ఉన్నపుడు.. ఈ ప్రత్యేకమైన, అందమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించాను. Photo Credit : AFP చెన్నైలో నా ఆఖరి మ్యాచ్ ఆడినపుడు కూడా ఇదే భావన. అయితే, సాధ్యమైనంత వరకు నేను తిరిగి రావడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. వాళ్ల ప్రేమ వెలకట్టలేనిది’’ అని ధోని.. ఫ్యాన్స్ పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. Photo Credit : AFP చదవండి: చాంపియన్‌గా చెన్నై.. గిల్ సరికొత్త చరిత్ర! అవార్డులు, ప్రైజ్‌మనీ పూర్తి వివరాలు ఇవే.. ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక స్కోరు.. అన్క్యాప్డ్ ప్లేయర్‌గా చరిత్ర Thala happy and so are we ✨💥pic.twitter.com/WfT3VybSUt — Chennai Super Kings (@ChennaiIPL) May 29, 2023 5️⃣INALLY THE CELEBRATIONS! 🥳#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/I8fl6siQ2e — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
చాంపియన్‌గా చెన్నై.. గిల్ సరికొత్త చరిత్ర! అవార్డులు, ప్రైజ్‌మనీ పూర్తి వివరాలు ఇవే..
IPL 2023 Winner CSK: మహేంద్ర సింగ్ ధోని మంత్రజాలం ఐపీఎల్లో మరోసారి అద్భుతంగా పని చేసింది. తనకే సాధ్యమైనరీతిలో సాధారణ ఆటగాళ్లతోనే జట్టును నడిపించిన అతను ఐదో ట్రోఫీతో సగర్వంగా నిలిచాడు. ఐపీఎల్-2023 ఫైనల్లో 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అక్కడక్కడా తడబడినా చివరకు సీఎస్కే గెలుపు సొంతం చేసుకుంది. Photo Credit : IPL Twitter మోహిత్ శర్మ వేసిన చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా, తొలి 4 బంతుల్లో అతను 3 పరుగులే ఇచ్చాడు. దాంతో గుజరాత్ గెలుస్తున్నట్లుగా అనిపించింది. అయితే తర్వాతి రెండు బంతులను జడేజా 6, 4గా మలచి సూపర్ కింగ్స్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు. వరుసగా రెండో ఏడాది చాంపియన్‌గా నిలవాలని భావించిన గుజరాత్ టైటాన్స్ చివరకు రన్నరప్‌గా సంతృప్తి చెందింది. సాధారణంగా 215 పరుగుల లక్ష్యం అసాధ్యంగా కనిపించినా... వర్షం అంతరాయంతో ఓవర్లు తగ్గడం, చేతిలో 10 వికెట్లు ఉండటం కూడా చెన్నైకి మేలు చేసింది. చివరిదిగా భావిస్తున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ధోని తొలి బంతికే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగా... ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు తన కెరీర్లో ఆరో టైటిల్‌తో ఘనమైన ముగింపునిచ్చాడు. Photo Credit : IPL Twitter మొత్తం ప్రైజ్‌మనీ: ►రూ. 46 కోట్ల 50 లక్షలు Photo Credit : IPL Twitter ►విజేత జట్టుకు: రూ. 20 కోట్లు ►రన్నరప్ జట్టుకు: రూ. 13 కోట్లు ►మూడో స్థానం: రూ. 7 కోట్లు -(ముంబై ఇండియన్స్) ►నాలుగో స్థానం: రూ. 6 కోట్ల 50 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్) Photo Credit : IPL Twitter ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్) ►శుబ్‌మన్ గిల్ (890 పరుగులు; 17 మ్యాచ్‌లు) సెంచరీలు: 3, అర్ధ సెంచరీలు: 4 ►ఐపీఎల్ టోర్నీలో ఆరెంజ్ క్యాప్ నెగ్గిన పిన్న వయస్కుడిగా గిల్ (23 ఏళ్ల 263 రోజులు) గుర్తింపు పొందాడు. ►ప్రైజ్‌మనీ: రూ. 15 లక్షలు Photo Credit : IPL Twitter పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) ►మొహమ్మద్ షమీ (28 వికెట్లు; 17 మ్యాచ్‌లు) ►ప్రైజ్‌మనీ: రూ. 15 లక్షలు Photo Credit : IPL Twitter ఇతర అవార్డులు, ప్రైజ్‌మనీ: ►ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: యశస్వి జైశ్వాల్(రాజస్తాన్ రాయల్స్- రూ. 10 లక్షలు) ►సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: గ్లెన్ మాక్స్వెల్ (ఆర్సీబీ- రూ. 10 లక్షలు) ►మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: శుబ్‌మన్ గిల్ (రూ. 10 లక్షలు) ►గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్: శుబ్‌మన్ గిల్ (రూ. 10 లక్షలు) ►క్యాచ్ ఆఫ్ ది సీజన్: రషీద్ ఖాన్ (రూ. 10 లక్షలు) ►ఫెయిర్ ప్లే అవార్డు:ఢిల్లీ క్యాపిటల్స్ ►సీజన్లో అత్యధిక ఫోర్లు: శుబ్‌మన్ గిల్ (రూ. 10 లక్షలు) ►లాంగెస్ట్ సిక్స్ ఆఫ్ ది సీజన్ : ఫాఫ్ డుప్లెసిస్ (రూ. 10 లక్షలు) ►బెస్ట్ పిచ్, గ్రౌండ్ ఆఫ్ ది సీజన్: ఈడెన్ గార్డెన్స్, వాంఖడే స్టేడియం (రూ. 50 లక్షలు) చదవండి: 550 పరుగుల మార్క్ దాటాడు.. ఎవరికి సాధ్యం కాని చెత్త రికార్డు Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 5️⃣INALLY THE CELEBRATIONS! 🥳#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/I8fl6siQ2e — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
IPL 2023: చెన్నై ఫైవ్ స్టార్... ఐదోసారి చాంపియన్‌గా సూపర్‌కింగ్స్
IPL 2023 Winner CSK- అహ్మదాబాద్: ఐపీఎల్–2023లో చెన్నై సూపర్ కింగ్స్ చాంపియన్‌గా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో చెన్నై 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ కోల్పోగా... వృద్ధిమాన్ సాహా (39 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) శుబ్‌మన్ గిల్ (20 బంతుల్లో 39; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసి గెలిచింది. కాన్వే (25 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్ దూబే (21 బంతుల్లో 32 నాటౌట్; 2 సిక్స్‌లు) రాణించారు. సమష్టి బ్యాటింగ్ ప్రదర్శన... 42 బంతుల్లో 67, 42 బంతుల్లో 64, 33 బంతుల్లో 81... తొలి మూడు వికెట్లకు వరుసగా గుజరాత్ భాగస్వామ్యాలివి. జట్టులోని టాప్–4 తమ వంతుగా కీలకపాత్ర పోషించడంతో భారీ స్కోరు సాధ్యమైంది. సాహా, గిల్ ఇద్దరూ దూకుడుగా ఆడుతూ ఈ సీజన్లో మరోసారి జట్టుకు శుభారంభం అందించారు. తుషార్ వేసిన రెండో ఓవర్లోనే 3 పరుగుల వద్ద గిల్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను దీపక్ చహర్ వదిలేసి గుజరాత్‌కు మేలు చేశాడు. చహర్ ఓవర్లో సాహా సిక్స్, 2 ఫోర్లు కొట్టగా... తుషార్, తీక్షణ ఓవర్లలో గిల్ వరుసగా మూడేసి ఫోర్లు బాది జోరు ప్రదర్శించాడు. 21 పరుగుల వద్ద సాహా ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను కూడా చహర్ వదిలేయడం టైటాన్స్‌కు మరింత కలిసొచ్చింది. ఎట్టకేలకు ధోని మెరుపు స్టంపింగ్‌తో గిల్ వెనుదిరగ్గా, 36 బంతుల్లో సాహా అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ వెంటనే సాహా అవుట్ కాగా, సుదర్శన్ దూకుడు కొనసాగింది. తీక్షణ ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన అతను పతిరణ ఓవర్లో వరుసగా 2 ఫోర్లు కొట్టి 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరుకున్నాడు. తుషార్ వేసిన తర్వాతి ఓవర్లో అతను మరింత చెలరేగిపోయాడు. తొలి నాలుగు బంతుల్లో అతను 6, 4, 4, 4 కొట్టడం విశేషం. తుషార్ తర్వాతి ఓవర్లోనూ టైటాన్స్ 18 పరుగులు రాబట్టింది. పతిరణ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 6, 6 కొట్టి 96కు చేరిన సుదర్శన్ తర్వాతి బంతికి దురదృష్టవశాత్తూ ఎల్బీగా దొరికిపోయి సెంచరీ చేజార్చుకున్నాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 21 నాటౌట్; 2 సిక్స్‌లు) ధాటి గుజరాత్‌ను మరింత పటిష్ట స్థితికి చేర్చింది. శుభారంభం... వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం చెన్నై విజయలక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్ణయించారు. ఛేదనను చెన్నై ఘనంగా ప్రారంభించింది. దూకుడుగా ఆడిన ఓపెనర్లు రుతురాజ్, కాన్వే 4 ఓవర్ల పవర్‌ప్లే ముగిసేసరికి 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో స్కోరును 52 పరుగులకు చేర్చారు. అయితే పవర్‌ప్లే తర్వాత చెన్నైని నియంత్రించడంలో బౌలర్లు సఫలమయ్యారు. నాలుగు పరుగుల తేడాతో వీరిద్దరు వెనుదిరిగారు. అయితే రుతురాజ్ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), రహానే (13 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అంబటి రాయుడు (8 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా ఓ చేయి వేసి జట్టును గెలుపు దిశగా నడిపించారు. జడేజా ఆఖరి బంతికి ఫోర్ బాది చెన్నైని విజేతగా నిలిపాడు. 15 ఓవర్లకు కుదింపు... రిజర్వ్ డే అయిన సోమవారం కూడా వాన మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. సరైన సమయానికే ఆరంభమై గుజరాత్ పూర్తి 20 ఓవర్లు ఆడింది. అయితే చెన్నై ఇన్నింగ్స్‌లో 3 బంతులకు 4 పరుగులు చేసిన తర్వాత మొదలైన వర్షం సుదీర్ఘ సమయం పాటు తెరిపినివ్వలేదు. వర్షం తగ్గినా, ప్రధాన పిచ్ పక్కన ఉన్న మరో పిచ్ ఆరకపోవడంతో సమస్యగా మారింది. దానిని ఆరబెట్టేందుకు గ్రౌండ్స్‌మన్ అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు అర్ధరాత్రి 12.05 గంటలకు మ్యాచ్ మళ్లీ మొదలైంది. చెన్నై ఇన్నింగ్స్‌ను 15 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 171 పరుగులుగా నిర్దేశించారు. పవర్‌ప్లేను 4 ఓవర్లకు పరిమితం చేయగా, ఒక్కో బౌలర్ గరిష్టంగా 3 ఓవర్లు మాత్రం వేసేందుకు అనుమతించారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) ధోని (బి) చహర్ 54; గిల్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 39; సుదర్శన్ (ఎల్బీ) (బి) పతిరణ 96; పాండ్యా (నాటౌట్) 21; రషీద్ (సి) రుతురాజ్ (బి) పతిరణ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–67, 2–131, 3–212, 4–214, బౌలింగ్: దీపక్ చహర్ 4–0–38–1, తుషార్ 4–0–56–0, తీక్షణ 4–0–36–0, జడేజా 4–0–38–1, పతిరణ 4–0–44–2. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) రషీద్ (బి) నూర్ 26; కాన్వే (సి) మోహిత్ (బి) కాన్వే 47; దూబే (నాటౌట్) 32; రహానే (సి) విజయ్‌శంకర్ (బి) మోహిత్ 27; రాయుడు (సి) అండ్ (బి) మోహిత్ 19; ధోని (సి) మిల్లర్ (బి) మోహిత్ 0; జడేజా (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15 ఓవర్లలో 5 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–74, 2–78, 3–117, 4–149, 5–149. బౌలింగ్: షమీ 3–0–29–0, పాండ్యా 1–0–14–0, రషీద్ 3–0–44–0, నూర్ 3–0–17–2, లిటిల్ 2–0–30–0, మోహిత్ శర్మ 3–0–36–3. Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
550 పరుగుల మార్క్ దాటాడు.. ఎవరికి సాధ్యం కాని చెత్త రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్ తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో చెత్త గణాంకాలను నమోదు చేశాడు. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు బౌలింగ్ వేసిన తుషార్ దేశ్‌పాండే 56 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పాండే బౌలింగ్‌ను సాయి సుదర్శన్, సాహాలు చీల్చి చెండాడారు. తుషార్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో సాయి సుదర్శన్ ఒక సిక్స్, మూడు ఫోర్లు సహా 20 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలోనే తుషార్ దేశ్‌పాండే చెత్త రికార్డులు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో వికెట్ లేకుండా అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా ఫెర్గూసన్‌తో కలిసి దేశ్‌పాండే నిలిచాడు. తొలి స్థానంలో షేన్ వాట్సన్-ఆర్సీబీ.. 4 ఓవర్లలో 61/0 (2016 ఫైనల్లో ఎస్ఆర్హెచ్తో), రెండో స్థానంలో లోకీ ఫెర్గూసన్ కేకేఆర్.. 4 ఓవర్లలో 56/0(2021 సీఎస్కేతో ఫైనల్లో) ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో చెత్త రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న అత్యంత చెత్త బౌలర్‌గా తుషార్ దేశ్‌పాండే రికార్డులకెక్కాడు. ఈ సీజన్లో తుషార్ దేశ్‌పాండే 9.92 ఎకానమీ రేటుతో 564 పరుగులు సమర్పించుకొని ఓవరాల్‌గా తొలి స్థానంలో నిలిచాడు. తుషార్ తర్వాత 2022 సీజన్లో ప్రసిద్ కృష్ణ 8.28 ఎకానమీతో 551 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. 2020 ఐపీఎల్ సీజన్లో కగిసో రబాడ 8.34 ఎకానమీతో 548 పరుగులు సమర్పించుకొని మూడో స్థానంలో, సిద్దార్థ్ కౌల్ 2018లో 8.28 ఎకానమీతో 547 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా.. ఐదోస్థానంలో డ్వేన్ బ్రావో 2018లో 9.96 ఎకానమీతో 533 పరుగులు సమర్పించుకున్నాడు. Most runs conceded by a bowler in an IPL season: 564 - Tushar Deshpande, 2023 (Eco 9.92) 551 - Prasidh Krishna, 2022 (8.28) 548 - Kagiso Rabada, 2020 (8.34) 547 - Siddarth Kaul, 2018 (8.28) 533 - Dwayne Bravo, 2018 (9.96)#GTvCSK #IPL2023Finals pic.twitter.com/wZTuTZlE3V — Bharath Seervi (@SeerviBharath) May 29, 2023 చదవండి: ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక స్కోరు.. అన్క్యాప్డ్ ప్లేయర్‌గా చరిత్ర -
ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక స్కోరు.. అన్క్యాప్డ్ ప్లేయర్‌గా చరిత్ర
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ సీఎస్కేతో జరిగిన ఫైనల్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లోనే 8 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే కేవలం నాలుగు పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకున్నప్పటికి తన మెరుపులతో ఆకట్టుకున్నాడు. Photo: IPL Twitter అయితే సాయి సుదర్శన్ తన ఇన్నింగ్స్‌ను నిధానంగా ఆరంభించినప్పటికి అసలు సమయంలో తనలోని డేంజరస్ బ్యాటర్‌ను వెలికి తీశాడు. సాహా ఔటైన తర్వాత గేర్ మార్చిన సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన తుషార్ దేశ్‌పాండేకు చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో ఒక సిక్సర్ సహా మూడు ఫోర్లు కలిపి 20 పరుగులు పిండుకున్నాడు. 31 బంతుల్లో అర్థసెంచరీ సాధించిన సాయి సుదర్శన్.. తర్వాతి 16 బంతుల్లోనే 46 పరుగులు చేయడం విశేషం. ఈ క్రమంలో సాయి సుదర్శన్ ఐపీఎల్లో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. Photo: IPL Twitter ► ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా సాయి సుదర్శన్ చరిత్రకెక్కాడు. ఇంతకముందు మనీష్ పాండే 2014 ఐపీఎల్ ఫైనల్లో కేకేఆర్ తరపున పంజాబ్ కింగ్స్‌పై 94 పరుగులు చేశాడు. 2012 ఫైనల్లో సీఎస్కేపై కేకేఆర్ తరపున మన్విందర్ బిస్లా 89 పరుగులు చేశాడు. అయితే రజత్ పాటిదార్(ఆర్సీబీ తరపున 112 నాటౌట్ వర్సెస్ కేకేఆర్) సెంచరీ చేసినప్పటికి అది ఫైనల్ మ్యాచ్ కాదు.. ఎలిమినేటర్‌లో పాటిదార్ సెంచరీ చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. అయితే ఫైనల్లో అన్క్యాప్డ్ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఘనతను సాయి సుదర్శన్ దక్కించుకున్నాడు. Photo: IPL Twitter ► ఇక ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన బ్యాటర్‌గా సాయి సుదర్శన్ మూడో స్థానంలో నిలిచాడు. ఇంతకముందు షేన్ వాట్సన్ 117 పరుగులు నాటౌట్(2018లో ఎస్ఆర్హెచ్తో ఫైనల్లో) తొలి స్థానంలో, రెండో స్థానంలో సీఎస్కే తరపున వృద్ధిమాన్ సాహా 115 పరుగులు పంజాబ్ కింగ్స్ తరపున, 2014లో కేకేఆర్‌పై ఫైనల్లో, మురళీ విజయ్ 95 పరుగులు(సీఎస్కే), మనీష్ పాండే(94 పరుగులు, కేకేఆర్) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ► ఐపీఎల్ ఫైనల్లో 50 ప్లస్ స్కోరు చేసిన రెండో యంగెస్ట్ బ్యాటర్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. ఇవాళ సీఎస్కేతో ఫైనల్లో (47 బంతుల్లో 96 పరుగులు) 21 ఏళ్ల 226 రోజుల వయసులో సుదర్శన్ ఈ ఫీట్ సాధించాడు. తొలి స్థానంలో మనన్ వోహ్రా 2014లో 20 ఏళ్ల 318 రోజుల వయసులో; శుబ్‌మన్ గిల్ 22 ఏళ్ల 37 రోజుల వయసులో(2021లో సీఎస్కేతో జరిగిన ఫైనల్లో కేకేఆర్ తరపున) మూడో స్థానంలో, రిషబ్ పంత్ 23 ఏళ్ల 37 రోజుల వయసులో(2020లో ముంబై ఇండియన్స్‌తో ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున) నాలుగో స్థానంలో ఉన్నాడు. Sai Sudharsan masterclass in the IPL 2023 Final. pic.twitter.com/SiRywPhOqz — Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2023 చదవండి: శుబ్‌మన్ గిల్ చరిత్ర.. టీమిండియా తరపున రెండో బ్యాటర్‌గా -
శుబ్‌మన్ గిల్ చరిత్ర.. టీమిండియా తరపున రెండో బ్యాటర్‌గా
ఐపీఎల్ 16వ సీజన్ శుబ్‌మన్ గిల్‌కు ఎప్పటికి గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. గుజరాత్ టైటాన్స్ రెండోసారి టైటిల్ కొడుతుందో లేదో తెలియదు కానీ గిల్‌కు మాత్రం కెరీర్లో బెస్ట్ టోర్నీగా మిగిలిపోతుంది. సోమవారం సీఎస్కేతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నాలుగో సెంచరీ బాదుతాడని గుజరాత్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికి ధోని సూపర్ ఫాస్ట్ స్టంపింగ్‌కు 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో గిల్ ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది. ఈ క్రమంలో ఆరెంజ్ క్యాప్ అందుకోనున్ను శుబ్‌మన్ గిల్ ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు అందుకున్న రెండో భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ సీజన్లో గిల్ 17 మ్యాచ్‌లు ఆడి 890 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు సహా నాలుగు అర్థశతకాలు ఉన్నాయి. ఇక ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కింగ్ కోహ్లి పేరిట ఉంది. 2016 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరపున కోహ్లి 973 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఐపీఎల్ సీజన్లలోనూ కోహ్లి చేసిన పరుగులే అత్యుత్తమం. ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా.. తొలి టీమిండియా బ్యాటర్‌గానూ కోహ్లి తొలి స్థానంలో ఉన్నాడు. కోహ్లి, గిల్ తర్వాత జాస్ బట్లర్ 863 పరుగులు(రాజస్తాన్ రాయల్స్, 2022), డేవిడ్ వార్నర్ 848 పరుగులు(ఎస్ఆర్హెచ్, 2016), కేన్ విలియమ్సన్ 735 పరుగులు(ఎస్ఆర్హెచ్, 2018) వరుసగా ఉన్నారు. ఇక ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక బౌండరీలు బాదిన జాబితాలోనూ గిల్ చోట సంపాదించాడు. ఐపీఎల్ 16వ సీజన్లో గిల్ గుజరాత్ టైటాన్స్ తరపున 118 బౌండరీలు బాదాడు. ఓవరాల్ జాబితాలో గిల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక జాస్ బట్లర్ 128 బౌండరీలతో(రాజస్తాన్ రాయల్స్, 2022లో) తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి 122 బౌండరీలు(ఆర్సీబీ, 2016లో), డేవిడ్ వార్నర్ 119 బౌండరీలు(ఎస్ఆర్హెచ్, 2016లో) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. Brief but looking dangerous - Shubman Gill was in the mood tonight.#TATAIPL #CSKvGT #IPLonJioCinema #IPLFinal pic.twitter.com/B1IeAqAHCL— JioCinema (@JioCinema) May 29, 2023 చదవండి: సూపర్‌ఫాస్ట్ స్టంపింగ్; చహర్ వదిలినా ధోని వదల్లేదు -
సూపర్‌ఫాస్ట్ స్టంపింగ్; చహర్ వదిలినా ధోని వదల్లేదు
సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని తన కీపింగ్ టైమింగ్ ఎంత ఫాస్ట్‌గా ఉంటుందో మరోసారి రుచి చూపించాడు. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో గిల్‌ను ధోని స్టంపౌట్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ జడేజా వేశాడు. అయితే ఇన్నింగ్స్ ఆరంభంలో గిల్ మూడు పరుగుల వద్ద ఉన్నప్పుడు దీపక్ చహర్ క్యాచ్ వదిలేశాడు. దీంతో ఒక లైఫ్ లభించడంతో 39 పరుగులతో గిల్ ధాటిగా ఆడుతున్నాడు. జడ్డూ వేసిన ఆఖరి బంతిని షాట్ ఆడేందుకు ముందుకు వచ్చాడు. మాములుగానే అలర్ట్‌గా ఉండే ధోని ఈసారి మరింత వేగంగాగా స్పందించాడు. అలా గిల్ క్రీజు దాటాడో లేదో.. ఇలా ధోని బంతిని అందుకొని టక్కున స్టంప్స్ ఎగురగొట్టాడు. అలా చహర్ క్యాచ్ వదిలేసి గిల్‌కు లైఫ్ ఇచ్చినా ధోని తన స్మార్ట్ స్టంపింగ్‌తో పెవిలియన్ పంపించాడు. Photo: IPL Twitter అయితే ధోని స్టంపౌట్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పటికి.. గిల్ మాత్రం డీఆర్ఎస్ కోరాడు. అయితే రివ్యూలో గిల్‌కు నిరాశే మిగిలింది. జడ్డూ బంతి వేయడమే ఆలస్యం.. గిల్ మిస్ చేసి ఫ్రంట్‌ఫుట్ దాటడం.. బంతి అందుకున్న ధోని గిల్ వెనక్కి వచ్చే లోపే సూపర్‌ఫాస్ట్‌గా బెయిల్స్ ఎగురగొట్టడం కనిపించింది. అంతే గిల్ ఔట్ అని బిగ్స్క్రీన్పై కనిపించింది. Still the world's best 'keeper'#EnoughSaid pic.twitter.com/zhgMJEcFUj — JioCinema (@JioCinema) May 29, 2023 MS Dhoni - still the fastest hand behind the stumps. pic.twitter.com/57xOM77nEh — Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2023 Treatment effect 😭 pic.twitter.com/oVDj2RYN7h — Mohammad Junaid (@MDJunaid4377067) May 29, 2023 చదవండి: 'మాకంటే ఎక్కువగా బాధపడ్డారు.. ఇవాళ ఎంటర్టైన్ చేస్తాం' -
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ధోని.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా ధోని రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరగుతున్న ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు బరిలోకి దిగిన ధోని.. ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోని తర్వాత ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (243), ఆర్సీబీ వికెట్‌కీపర్ దినేశ్ కార్తీక్ (242), ఆర్సీబీ విరాట్ కోహ్లి (237), సీఎస్కే రవీంద్ర జడేజా (225), పంజాబ్ సారధి శిఖర్ ధవన్ (217), సీఎస్కే మాజీ ప్లేయర్లు సురేశ్ రైనా (205), రాబిన్ ఉతప్ప (205), అంబటి రాయుడు (203), రాజస్థాన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (197) వరుసగా 2 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. ఇక ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధోని తొలుత బౌలింగ్ ఎంచకున్నాడు. క్వాలిఫియర్-1 ఆడిన జట్టుతోనే సీఎస్కే తుదిపోరులో కూడా బరిలోకి దిగింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా ఎటువంటి తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. చదవండి: IPL 2023 Final: 'మాకంటే ఎక్కువగా బాధపడ్డారు.. ఎంటర్టైన్ చేసి తీరుతాం' -
'మాకంటే ఎక్కువగా బాధపడ్డారు.. ఎంటర్టైన్ చేసి తీరుతాం'
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ మొదలైంది. వాస్తవానికి ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే అయిన సోమవారానికి వాయిదా పడింది. అయితే ఇవాళ కూడా మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానం కలిగింది. కానీ వర్షం లేకపోవడంతో టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. కాగా టాస్ అనంతరం సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''వర్షం పడే సూచనలు ఉండడంతో ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక క్రికెటర్‌గా మంచి ఆట ఆడాలని అనుకుంటాం. నిన్న(ఆదివారం) జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌ల భాగంగా మేం మొత్తం డ్రెస్సింగ్ రూంకే పరిమితమయ్యాం. అయితే మాకంటే ఎక్కువగా బాధపడింది అభిమానులు. నిన్నటి మ్యాచ్ కోసం రాత్రంతా ఎదురుచూసి నిరాశగా వెనుదిరిగారు. అయితే ఇవాళ వాళ్లకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కలుగుతుందని చిన్న నమ్మకం. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉంటే ఐదు ఓవర్లు మ్యాచ్ ఆడే అవకాశాలుంటాయనుకున్నాం. కానీ దేవుడి దయవల్ల ఇవాళ 20 ఓవర్ల కోటా గేమ్ జరిగేలా ఉంది. అలా జరిగితేనే టోర్నీకి సరైన ముగింపు ఉంటుంది. ఇక క్వాలిఫయర్-1 ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం.'' అంటూ తెలిపాడు. 🚨 Toss Update 🚨 Chennai Super Kings win the toss and elect to field first against Gujarat Titans. Follow the match ▶️ https://t.co/WsYLvLrRhp#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/HYMcLKhfKy — IndianPremierLeague (@IPL) May 29, 2023 చదవండి: IPL 2023 Final: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సీఎస్కే అప్డేట్స్ వర్కింగ్ డే రోజున ఐపీఎల్ ఫైనల్.. ఉద్యోగుల సిక్‌లీవ్స్ కష్టాలు! -
IPL 2023 Final: గెలిపించిన జడేజా.. ఐపీఎల్16వ సీజన్ విజేత సీఎస్కే
ఐపీఎల్ 16వ సీజన్ విజేతగా సీఎస్కే నిలిచింది. వర్షం కారణంగా 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని విధించగా.. సీఎస్కే నిర్ణీత 15 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరమైన దశలో జడేజా ఆఖరి రెండు బంతుల్లో సిక్సర్, ఫోర్ కొట్టి సీఎస్కేను గెలిపించాడు. అంతకముందు ఓపెనర్లు రుతురాజ్ 26, డెవాన్ కాన్వే 47 పరుగులతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత శివమ్ దూబే 32 నాటౌట్, రహానే 27 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక చివర్లో జడేజా ఆరు బంతుల్లో 16 పరుగులు నాటౌట్ తన విలువేంటో మరోసారి చాటిచెబుతూ సీఎస్కేను ఐదోసారి చాంపియన్‌గా నిలిపాడు. ఈ విజయంతో ఐదోసారి టైటిల్ అందుకున్నసీఎస్కే ముంబై ఇండియన్స్‌తో కలిసి సమంగా నిలిచింది. ధోని గోల్డెన్ డక్.. ఐదో వికెట్ కోల్పోయిన సీఎస్కే గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో సీఎస్కే 150 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే 25, జడేజా రెండు పరుగులతో ఆడుతున్నారు. 12 ఓవర్లలో సీఎస్కే 133/3 12 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే మూడు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. శివమ్ దూబే 25, అంబటి రాయుడు 9 పరుగులతో ఆడుతున్నారు. టార్గెట్ 171.. వంద పరుగులు దాటిన సీఎస్కే 171 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే వంద పరుగుల మార్క్‌ను దాటింది. 10 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. అజింక్యా రహానే 26, శివమ్ దూబే 8 పరుగులతో ఆడుతున్నారు. నూర్ అహ్మద్ దెబ్బ.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు ధాటిగా ఆడుతున్న సీఎస్కేను నూర్ అహ్మద్ దెబ్బ తీశాడు. ఓపెనర్లు రుతురాజ్, కాన్వే రూపంలో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. సీఎస్కే విజయానికి 48 బంతుల్లో 93 పరుగులు కావాలి. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే.. రుతురాజ్ ఔట్ 26 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. 6 ఓవర్లలో సీఎస్కే 72/0 ఆరు ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. కాన్వే 22 బంతుల్లో 44 పరుగులతో వేగంగా ఆడుతుండగా.. రుతురాజ్ 25 పరుగులతో సహకరిస్తున్నాడు. దంచుతున్న రుతురాజ్, కాన్వే.. 4 ఓవర్లో సీఎస్కే 52/0 171 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. రుతురాజ్ 23, కాన్వే 29 పరుగులతో ధాటిగా ఆడుతున్నారు. టార్గెట్ 171.. 2 ఓవర్లలో సీఎస్కే 24/0 2 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 11, డెవాన్ కాన్వే 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో సీఎస్కే టార్గెట్ 15 ఓవర్లలో 171 గంటన్నర పాటు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు టార్గెట్‌ను కుదించారు. 15 ఓవర్లలో సీఎస్కే టార్గెట్ 171 పరుగులుగా నిర్ధేశించారు. వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి సీఎస్కే వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. టార్గెట్ 215.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం గుజరాత్ టైటాన్స్, సీఎస్కే మధ్య ఫైనల్మ్యాచ్కు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. సీఎస్కే ఇన్నింగ్స్ ప్రారంభమైన తొలి ఓవర్లో నాలుగు బంతులు పడగానే వర్షం మొదలైంది. ప్రస్తుతం సీఎస్కే వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ మెరుపులు.. సీఎస్కే టార్గెట్ 215 సీఎస్కేతో జరుగుతున్న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. సాయి సుదర్శన్ (47 బంతుల్లో 96 పరుగులు, 8 ఫోర్లు, ఆరు సిక్సర్లు) నాలుగు పరుగలతో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికి మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ సాహా 54 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. గిల్ 39, పాండ్యా 21 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో పతీరానా రెండు వికెట్లు తీయగా.. జడేజా, దీపక్ చహర్‌లు చెరొక వికెట్ తీశారు. 18 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 182/2 18 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 79, పాండ్యా 8 పరుగుతో క్రీజులో ఉన్నారు. సాయి సుదర్శన్ ఫిఫ్టీ.. గుజరాత్ 16 ఓవర్లలో 153/2 సీఎస్కేతో ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు దిశగా సాగుతుంది. సాయి సుదర్శన్ 32 బంతుల్లో ఫిఫ్టీ సాధించడంతో గుజరాత్ 16 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 57, పాండ్యా ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నాడు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్.. సాహా(54)ఔట్ 54 పరుగులు చేసిన సాహా దీపక్ చహర్ బౌలింగ్‌లో కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో గుజరాత్ 131 పరుగులు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. సాయి సుదర్శన్ 36, పాండ్యా క్రీజులో ఉన్నారు. 12 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 109/1 12 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. సాహా 48, సాయి సుదర్శన్ 20 పరుగులతో ఆడుతున్నారు. ధోని సూపర్ స్టంపింగ్.. గిల్(39) ఔట్ సీఎస్కేతో ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ధోని సూపర్‌ఫాస్ట్ స్టంపింగ్‌కు గిల్ వెనుదిరగాల్సి వచ్చింది. 39 పరుగులు చేసిన గిల్ జడ్డూ బౌలింగ్‌లో షాట్ ఆడే ప్రయత్నంలో ముందుకు వచ్చాడు. అంతే ధోని సూపర్‌ఫాస్ట్‌గా బంతిని అందుకొని వికెట్లను గిరాటేయడంతో గిల్ స్టంపౌట్ అయ్యాడు. ప్రస్తుతం గుజరాత్ వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. 3 ఓవర్లలో గుజరాత్ స్కోరు 24/0 మూడు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. సాహా 20, గిల్ 4 పరుగులుతో ఆడుతున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు మ్యాచ్‌కు వర్షం ముప్పు అంతలా కనిపించడం లేదు. టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ 🚨 Toss Update 🚨 Chennai Super Kings win the toss and elect to field first against Gujarat Titans. Follow the match ▶️ https://t.co/WsYLvLrRhp#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/HYMcLKhfKy — IndianPremierLeague (@IPL) May 29, 2023 ఇరుజట్లు ఇప్పటివరకు నాలుగుసార్లు తలపడగా.. గుజరాత్ టైటాన్స్ మూడుసార్లు.. సీఎస్కే ఒకసారి విజయం సాధించాయి. ఇక ఫైనల్లో సీఎస్కే గెలిచి ఐదోసారి ఛాంపియన్‌గా నిలుస్తుందా లేక గుజరాత్ టైటాన్స్ రెండోసారి విజేతగా నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. -
వర్కింగ్ డే రోజున ఐపీఎల్ ఫైనల్.. ఉద్యోగుల సిక్‌లీవ్స్ కష్టాలు!
ఐపీఎల్ 16వ సీజన్‌కు ఆదివారంతోనే(మే 28న) శుభం కార్డు పడాల్సింది. కానీ వర్షం కారణంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే అయిన సోమవారానికి(మే 29) వాయిదా పడింది. మ్యాచ్‌కు ఈరోజు కూడా వర్షం ముప్పు ఉన్నప్పటికి అది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ విషయం సంతోషం కలిగించేదే అయినా.. సోమవారం వర్కింగ్ డే కావడంతో ఉద్యోగం చేసే కొంతమంది క్రికెట్ ప్రేమికులు మాత్రం తమ బాస్‌కు ఏం కారణం చెప్పి తొందరగా ఆఫీస్ నుంచి బయటపడాలా అని ఆలోచిస్తున్నారు. సోమవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండడంతో ఆలోగా ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే నైట్‌షిఫ్ట్ సహా లేట్‌నైట్ వర్క్ చేసేవాళ్లు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు సిక్‌లీవ్స్ కోసం అప్లై చేసుకుంటున్నారు. ఇక జియో సినిమా కూడా ఐపీఎల్ ఫైనల్ విషయమై ఒక ఫన్నీ మీమ్‌ను షేర్ చేసింది. హెచ్ఆర్ ఉద్యోగి ముందు కుప్పలుతెప్పలుగా సిక్ లీవ్ లెటర్స్ ఉండడం.. ఆమె దానిపై సంతకాలు చేస్తుండడం కనిపించింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వాస్తవానికి మరి ఇంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కానీ.. ఐపీఎల్ ఫైనల్ కావడంతో సాయంత్రం పనిచేసే ఆఫీసుల్లో మాత్రం ఉద్యోగుల నుంచి ఇలాంటి కారణాలు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరిగి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఎప్పటిలాగే ఫుల్ ఎంజాయ్ చేసి సోమవారం కాస్త లేట్ అయినా ఆఫీస్‌కు వెళ్లేవారు. స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూడలేనివాళ్లు ఫైనల్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేయాలని తమ ప్రణాళికలు రచించుకున్నారు. కొందరు పబ్‌లు, బార్లకు వెళ్లి మందు తాగుతూ మ్యాచ్ చూస్తూ చిల్ అవుదామనుకున్నారు. ఇంకొందరు ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఐపీఎల్ ఫైనల్ చూస్తూ ఆనందంగా గడిపేయాలనుకున్నారు. కానీ వరుణుడు వారి ఆశలకు గండికొట్టాడు. దీంతో సోమవారానికి మ్యాచ్ వాయిదా పడింది. కానీ సోమవారం వారంలో మొదటి పని దినం కావడం.. రోజంతా మీటింగ్స్ ఉంటాయన్న కారణంతో ఎక్కడ మ్యాచ్ మిస్ అవుతామేమోనన్న భయం సగటు క్రికెట్ అభిమానికి ఉంటుంది కదా..! Office HR depts across the country dealing with sick leave requests today...#IPLFinal #IPLonJioCinema pic.twitter.com/A0mmlS14xH — JioCinema (@JioCinema) May 29, 2023 ✌🏽No sick leaves, show this to your manager to wind up your work by 6:30 PM today! 🙏🏽#IPLonJioCinema #IPLFinal #GTvCSK #Dhoni pic.twitter.com/Pfzz3XMI60 — JioCinema (@JioCinema) May 29, 2023 చదవండి: పన్నెండులో తొమ్మిదిసార్లు.. క్వాలిఫయర్-1 విజేత #GTvsCSK: ఫైనల్ మ్యాచ్ వాయిదా.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి -
IPL 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్‌వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 తుదిపోరులో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్,ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో అహ్మదాబాద్, నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. ఐపీఎల్ పదహారవ సీజన్ విజేత ఎవరనే ఉత్కంఠకు తోడు భారీ వర్షం మరింత టెన్షన్ రేపింది..చివరికి టైటిల్‌ను సీఎస్కే ఎగురేసుకపోయింది. ఇది ఇలా ఉంటే ఐపీఎల్లో 2022లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఓనరు ఎవరు, ఆదాయం ఎంత అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. (ఐపీఎల్ ఫైనల్ విన్నర్ ఎవరంటే! ఆనంద్ మహీంద్ర కామెంట్, వైరల్ ట్వీట్) ఐపీఎల్ 2022 లక్నో ,అహ్మదాబాద్ టీమ్‌లు ఎంట్రీ ఇచ్చాయి. 25 అక్టోబర్ 2021 ఏర్పాటైన అహ్మదాబాద్ ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్ (జీటీ)ని యూరప్‌కు చెందిన ఫ్రెంచ్ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్స్ రూ. 5625 కోట్లకు కొనుగోలు చేసింది. దీని చైర్మన్ స్టీవ్ కోల్ట్స్. స్టీవ్స్ స్విట్జర్లాండ్‌కు చెందిన బ్యాంకర్. ఈ కంపెనీ క్రీడలతో పాటు పెట్టుబడి బ్యాంకింగ్ , బ్రోకరేజ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. (3 వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్‌మేకర్ స్పందన ఇది!) సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ పెద్ద అమెరికన్-ఫ్రెంచ్ ఈక్విటీ సంస్థ, 133 బిలియన్ యూరోల విలువైన ఆస్తులున్నాయి. దీని భారత కరెన్సీలో రూ. 11.98 లక్షల కోట్లకు పైగా ఉంది, ఇది క్రికెట్ లీగ్‌లోని మెజారిటీ ఐపీఎల్ జట్టు యజమానుల నికర విలువ కంటే చాలా పెద్దది. ఐపీఎల్ బిడ్ గెలిచిన తర్వాత, ముంబై ఇండియన్స్ మాజీ స్టార్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంచుకుంది. అలాగే స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. (వదినా మరదళ్లతో అట్లుంటది: వారి హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 21 లక్షలు) కాగా ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్కే గెలిచి అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్‌తో టై చేసింది.. 2022 అరంగేట్రంలో అదరగొట్టి అన్ని అంచనాలను అధిగమించి మరీ టైటిల్ దక్కించుంది జీటీ. -
ధోని చివరి మ్యాచ్ వాన గండం తప్పదా...!
-
15 ఏళ్లుగా ఆడుతూనే ఉన్నాడు.. అయినా ప్రతిసారీ ధోని గురించే ఎందుకు? జీవితాంతం..
IPL 2023- MS Dhoni: ‘‘ఇప్పటికే అతడు పదిహేనళ్లపాటు ఐపీఎల్ ఆడాడు. అయినా.. మనం ప్రతిసారి ధోని గురించే ఎందుకు మాట్లాడాలి? ధోని తన పని తాను చేశాడు. ఇంకా మనం తన నుంచి ఆశించడానికి ఏం మిగిలి ఉంది? జీవితాంతం అతడు ఐపీఎల్ ఆడుతూనే ఉండాలా?’’ అని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ అసహనం వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన మిస్టర్ కూల్.. ఐపీఎల్లో సీఎస్కేను నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిపాడు. తలా ఒక్క షాట్ ఆడినా చాలు ఇక ఐపీఎల్-2023 ధోనికి చివరి సీజన్ అన్న వార్తల నేపథ్యంలో ఆరంభ మ్యాచ్ నుంచే ఎక్కడ చూసినా తలా మేనియా కొనసాగుతోంది. ప్రత్యర్థి జట్ల సొంత మైదానంలోనూ ప్రేక్షకులు ధోనికి మద్దతుగా నిలవడం చూశాం. ధోని ఒక్క షాట్ ఆడినా చాలు.. ప్రత్యక్షంగా చూడాలంటూ కేవలం తలా కోసమే మైదానానికి పోటెత్తిన ఫ్యాన్స్‌కు లెక్కేలేదు. తన అద్భుతమైన వ్యూహాలతో అంచనాలు లేని జట్టును ఐపీఎల్-2023 ఫైనల్‌కు తీసుకువచ్చిన 41 ఏళ్ల ధోని రిటైర్మెంట్ గురించి క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్‌కు సైతం ఈ విషయం గురించి ప్రశ్న ఎదురుకాగా అతడు ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. జీవితాంతం ఆడలేడు కదా! ‘‘ధోని ఇప్పటికే ఐపీఎల్లో చేయాల్సిందంతా చేశాడు. తను జీవితాంతం ఆడుతూ ఉండలేడు కదా! అది ఎప్పటికీ జరగని పని. తను ఆడుతూ ఉండాలని కోరుకోవడం కంటే కూడా.. ఈ 15 ఏళ్లలో అతడు క్రికెట్‌కు చేసిన సేవలకు కృతజ్ఞతా భావం చాటుకోవడం అత్యంత ముఖ్యం. కెప్టెన్ ఎలా ఉండాలో చూపించాడు వచ్చే సీజన్లో ధోని ఆడతాడా లేడా అన్న విషయం చెప్పలేం. నిజానికి ఈ ఏడాది ధోని భారీగా పరుగులు రాబట్టలేకపోయినా.. జట్టును ఫైనల్‌కు చేర్చి.. కెప్టెన్ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. క్రికెట్లో నాయకుడి పాత్ర ఏమిటో చాటిచెప్పాడు’’ అని కపిల్ దేవ్ ఏబీపీ న్యూస్‌తో వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2023లో చెన్నై- గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. వర్షం కారణంగా.. ఈ క్రమంలో ఆదివారం (మే 28) మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం అడ్డంకిగా మారింది. వరుణుడు కరుణించకపోవడంతో ఫైనల్ మ్యాచ్‌ను రిజర్వ్ డేకు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సోమవారం చెన్నై- గుజరాత్ టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఒకవేళ ఈరోజు కూడా వర్షం కొనసాగి.. మ్యాచ్ రద్దయితే.. టేబుల్ టాపర్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా సేన (గుజరాత్) చాంపియన్‌గా అవతరిస్తుంది. చదవండి: ఐపీఎల్ ఫైనల్.. స్టేడియం వద్ద వాతావారణం ఎలా ఉందంటే? రోహిత్ శర్మతో కలిసి లండన్‌కు యశస్వి.. తిలక్ వర్మ రియాక్షన్.. వైరల్ Smash and Walk!🔥#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni pic.twitter.com/bRNoZwdrOI — Chennai Super Kings (@ChennaiIPL) May 29, 2023 -
IPL 2023 Final: విన్నర్ ఎవరంటే! ఆనంద్ మహీంద్ర కామెంట్,వైరల్ ట్వీట్
సాక్షి, ముంబై: ప్రస్తుతం ఎక్కడ ఐపీఎల్ 2023 ఫైనల్ చర్చ నడుస్తోంది. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న తుదిపోరు ఆదివారం వాయిదా పడటంతో ఈ ఫీవర్మరింత పెరిగింది. అయితే పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఆనంద్ మహీంద్రా ఐపీఎల్ విన్నర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంట్ అఫైర్స్ నుండి జోక్స్ వరకు తన అభిప్రాయాలను నిక్కచ్చిగా ప్రకటించే మహీంద్రా ఆదివారం(మే 28) నాటి ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆశ్చర్యకర కమెంట్స్ చేశారు. (వదినా మరదళ్లతో అట్లుంటది: వారి హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 21 లక్షలు) గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, క్రికెట్ ఐకాన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మధ్య కీలకమైన ఎంపిక చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఏ జట్టుకు మద్దతు అని అడిగారు సరే, శుబ్‌మన్ గిల్ ప్రతిభను నమ్ముతున్నాను. అతను మరింత రాణించాలను కుంటున్నా. కానీ తాను మాత్రం ఎంఎస్ ధోనీకి ఫ్యాన్నే అంటూ.. ఈ ఫైనల్ పోరులో కప్పు అతనిదే అన్నట్టు కమెంట్ చేశారు. చివరికి అత్యుత్తమ జట్టును గెలిపిద్దా అంటూ ట్వీట్‌చేశారు. ఈ ట్వీట్ ఇప్పటిదాకా 237.5 వేల లైక్స్‌ను సాధించింది. 2021లో ఆస్ట్రేలియాపై తన అద్భుతమైన ప్రదర్శనకు ముగ్ధుడైన ఆనంద్ మహీంద్రా మహీంద్రా థార్ ఎస్‌యూవీని శుభ్‌మాన్ గిల్‌కు బహుమతిగా ఇచ్చారు. (కేవీపీ పెట్టుబడి డబుల్ ధమాకా: పదేళ్లదాకా ఆగాల్సిన పనిలేదు!) డోంట్ మిస్ టు క్లిక్ హియర్: సాక్షిబిజినెస్ కాగా వర్షం కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2023 టైటిల్ పోరులో, గుజరాత్ టైటాన్స్, చెన్నైసూపర్ కింగ్స్ అహ్మదాబాద్ వేదికగా రిజర్వ్ డే సోమవారం జరగనున్న మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రాజేస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్లో 60.79 సగటుతో శుభ్‌మన్ గిల్ పరుగులు చేసిన ఆటగాడు, 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతను మొత్తం 851 పరుగులు చేశాడు. శుభ్‌మాన్ గిల్ సిక్సర్ మోత మోగించి సూపర్ ఫెర్ఫామెన్స్తో విరాట్ కోహ్లీ, ఎం ధోని, యువరాజ్ సింగ్ , సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు దక్కించుకున్నాడు. (3వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్‌మేకర్ స్పందన ఇది!) I was asked which team I’m supporting in tonight’s #IPL2023Final Well, I’m a believer in Shubhman’s talents & would like to see them flower tonight BUT I’m a bigger fan of #MSDhoni & can’t help but hope for him to blaze a trail of glory tonight. 😊So let the best team win…! — anand mahindra (@anandmahindra) May 28, 2023 -
ధోని అంటే ఇంత అభిమానమా? రాత్రంతా రోడ్లపై పడుకుని! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో భాగంగా ఆదివారం గుజరాత్, చెన్నై మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. భారీ వర్షం కారణంగా ఆట సాధ్యం కాకపోవడంతో ఐపీఎల్ ఫైనల్‌ను రిజర్వ్ డే(సోమవారం)కు వాయిదా వేశారు. ఇక ఆదివారం ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. వరుణడు ఎప్పటికీ కరుణించకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనికి ఇదే చివరిమ్యాచ్ అని వార్తలు వినిపిస్తుండంతో.. అతడి అభిమానులు దేశం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. అయితే మ్యాచ్ వాయిదా పడడంతో ఫ్యాన్స్ నానా అవస్థలు పడ్డారు. తమ ఆరాధ్య క్రికెటర్ ఆడే మ్యాచ్‌ను సోమవారమైనా చూసేందుకు అహ్మదాబాద్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది సీఎస్కే ఫ్యాన్స్ ఆదివారం రాత్రం రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌లో నిద్రించారు. మరికొంత మంది బయట రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై కూడా నిద్రపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాగా మ్యాచ్ జరగనున్న అహ్మదాబాద్‌లో ప్రస్తుతం వాతావారణం పొడిగా ఉంది. ఎండ బాగా కాస్తోంది. మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. చదవండి: WTC Final- Virat Kohli: ఇంగ్లండ్‌లో ఉన్నపుడు ఇలా! అదే ఇండియాలో అయితే! కోహ్లి ఫొటో వైరల్! It is 3 o'clock in the night when I went to Ahmedabad railway station, I saw people wearing jersey of csk team, some were sleeping, some were awake, some people, I asked them what they are doing, they said we have come only to see MS Dhoni @IPL @ChennaiIPL #IPLFinal #Ahmedabad pic.twitter.com/ZJktgGcv8U — Sumit kharat (@sumitkharat65) May 28, 2023 -
ఐపీఎల్ ఫైనల్.. స్టేడియం వద్ద వాతావారణం ఎలా ఉందంటే?
భారీ వర్షం కారణంగా ఆదివారం(మే28) జరగాల్సిన IPL 2023 ఫైనల్ రిజర్వేడే సోమవారంకు వాయిదా పడిన విషయం విధితమే. ఈ టైటిల్ పోరులో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నైసూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే రిజర్వ్‌డే రోజు సోమవారం కూడా వర్షం కురిసే అవకాశం ఉండడంతో.. కనీసం ఈ రోజునైనా మ్యాచ్ జరగుతుందా లేదా అన్న ఆందోళన అభిమానులలో నెలకొంది. కాగా ప్రస్తుతం మ్యాచ్ జరగున్న అహ్మదాబాద్‌లో ప్రస్తుత వాతావారణం ఎలా ఉందో తెలుసుకుందాం. వాతావరణం ఎలా ఉందంటే? ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఎండ బాగా కాస్తోంది. పొడివాతావరణం ఉంది. ఉదయం నుంచి ఎటువంటి వర్షం కురవలేదు. అహ్మదాబాద్‌లో ప్రస్తుతం ఉష్ణోగ్రత 35డిగ్రీలగా ఉంది. అక్కడ వాతావరణంకు సంబంధించిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వాతావరణం బాగా ఉన్నప్పటికీ సాయంత్రంకు ఎలా మారుతుందో వేచి చూడాలి. ఇక ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే సోమవారం నాడు వర్షం కురిసే అవకాశం 40 శాతం మాత్రమే మాత్రమే ఉన్నట్లు అక్కడ వాతావరణ శాఖ వెల్లడించింది. కాబట్టి మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. చదవండి: WTC Final 2023: రోహిత్ శర్మతో కలిసి లండన్‌కు యశస్వి.. తిలక్ వర్మ రియాక్షన్.. వైరల్ Wether is clearl at Ahmedabad. Time 3:12 pm Its Hot sunny 🌞 #IPL2023Final #weather #Ahmedabad pic.twitter.com/J7v9V3ZCt2 — Vikram (@Vikram47467061) May 29, 2023 Today’s weather in Ahmedabad pic.twitter.com/0Uirdwp1sq — Yash MSdian ™️ 🦁 (@itzyash07) May 29, 2023 -
ఐపీఎల్ ఫైనల్ వాయిదా.. ఆ ముగ్గురి ప్రయాణం మరింత ఆలస్యం
లండన్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే.ఇక ఇప్పటికే రెండు బ్యాచ్‌లగా లండన్‌కు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతోంది. అయితే మూడో బ్యాచ్‌గా లండన్‌కు వెళ్లాల్సిన శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ.. అజింక్యా రహానే, శ్రీకర్ భరత్ ఇప్పుడు కాస్త ఆలస్యంగా పయనం కానున్నారు. ఎందుకంటే ఐపీఎల్-2023ల ఫైనల్ రిజర్వ్‌డేకు వాయిదా పడడంతో వీరి ప్రయాణం ఆలస్యం కానుంది. గిల్, షమీ, భరత్ గుజరాత్ జట్టులో భాగం కాగా.. జడేజా, రహానే సీఎస్కే తరపున ఆడుతున్నాడు. వాస్తవానికి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం ముగిసిన వెంటనే వీరు ఐదుగురు సోమవారం లేదా మంగళవారం ఇంగ్లండ్‌కు బయలుదేరాల్సింది. కానీ ఇప్పుడు ఫైనల్ సోమవారం జరగనుండడంతో గిల్, షమీ ,జడేజా, రహానే, భరత్ మంగళవారం లేదా బుధవారం ఇంగ్లండ్‌కు పయనం కానున్నారు. కాగా వీరిముగ్గురు కాస్త ముందుగా ఇంగ్లండ్‌కు చేరివుంటే అక్కడి పరిస్ధితులను అలవాటు పడేందుకు వీలుగా ఉండేది. కానీ వీరి ప్రయాణం ఆలస్యం కావడంతో.. ఎక్కువగా ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా లేదు. అయితే గిల్, షమీ ,జడేజా త్రయం మాత్రం భారత జట్టులో చాలా కీలకం. కాగా జాన్7 నుంచి ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. చదవండి: WTC Final 2023: రోహిత్ శర్మతో కలిసి లండన్‌కు యశస్వి.. తిలక్ వర్మ రియాక్షన్.. వైరల్ -
IPL 2023 Final: ధోని సేనకు శుభ సూచకం
వర్షం కారణంగా గుజరాత్, చెన్నై జట్ల మధ్య నిన్న జరగాల్సిన ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే అయిన నేటికి (మే 29) వాయిదా పడిన నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇది ఓ రకంగా ధోని సేనకు శుభ సూచకమని చెప్పాలి. గడిచిన 15 ఐపీఎల్ సీజన్లలో 12 సీజన్ల ఫైనల్ మ్యాచ్‌లు ఆదివారం రోజున జరిగాయి. ప్రస్తుత సీజన్ ఫైనల్ మ్యాచ్ కూడా ఆదివారానికే షెడ్యూల్ అయినప్పటికీ వర్షం వల్ల అది సోమవారానికి వాయిదా పడింది. నాన్ సండే రోజు జరిగిన మూడు ఫైనల్స్‌లో రెండు సీఎస్కే (2011 ఆర్సీబీతో శనివారం, 2021 కేకేఆర్‌తో శుక్రవారం), ఒకటి ముంబై (2020, డీసీతో మంగళవారం) గెలిచాయి. మూడింట రెండు ఫైనల్స్ సీఎస్కే గెలవడంతో ఆ జట్టు అభిమానులు నాన్ సండే (సోమవారం) రోజు ఐపీఎల్-2023 ఫైనల్స్ జరగడాన్ని శుభ సూచకంగా భావిస్తున్నారు. తమ కొరకే వరుణుడు ఆదివారం మ్యాచ్ జరగకుండా చేశాడని ఫీలవుతున్నారు. #QuickByte: Non-Sunday finals in the IPL ⬇️ 2011: CSK vs RCB (Sat, 28 May) 2020: MI vs DC (Tue, 10 Nov) 2021: CSK vs KKR (Fri, 15 Oct) 2023: CSK vs GT (Mon, 29 May)#IPL2023Finals #CSKvGT pic.twitter.com/lyy7gZCz7E — Cricket.com (@weRcricket) May 28, 2023 సెంటిమెంట్లు బలంగా ఫాలో అయ్యే సీఎస్కే అభిమానులకు ఈ ఈక్వేషన్ అదనపు మనో ధైర్యాన్ని ఇస్తుంది. ఈ సీజన్లో సీఎస్కే తప్పక టైటిల్ గెలుస్తుందని వారు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఏది జరిగినా తమ మంచి కోసమేనని, ఈసారి ఎలాగైనా ధోని సారధ్యంలో సీఎస్కే టైటిల్ గెలవాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఇక, సండే, నాన్ సండే సెంటిమెంట్‌ను పెడితే.. వాస్తవానికి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫాలోవర్స్ కోసం సెలవు దినమైన ఆదివారం రోజు నిర్వహిస్తారు. షెడ్యూల్ కుదరక, అనివార్య కారణాల వల్ల ఐపీఎల్ ఫైనల్స్ నాన్ సండే రోజు నిర్వహించాల్సి వచ్చిందే తప్ప, దీని వెనుక ఎలాంటి మతలబు లేదు. ఏది ఏమైనా ఎవరి సెంటిమెంట్లు వారికి ఉంటాయి కాబట్టి వాటిని గౌరవించాల్సి ఉంది. మరోవైపు ఫైనల్ మ్యాచ్ పని దినమైన సోమవారానికి వాయిదా పడటంతో మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు టికెట్లు కొనుగోలు ఉద్యోగస్తులు తెగ ఫీలైపోతున్నారు. వర్కింగ్ డే కావడం, అదీ సోమవారం కావడంతో తప్పనిసరిగా ఆఫీస్‌కు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. ఎంతో శ్రమ కోర్చి బ్లాక్‌లో టికెట్లు కొంటే, తీరా పరిస్థితి ఇలా తయారైందని బాధపడుతున్నారు. చదవండి: IPL 2023: 'రిజర్వ్ డే'కు ఫైనల్ మ్యాచ్.. ధోని రిటైర్మెంట్కు సంకేతమా..? -
గుజరాత్ గ్రేట్ చెన్నై తోపు ...
-
గిల్ దున్నేస్తున్నాడు .. ఇక ఛాంపియన్ CSK
-
ఐపీల్ ప్రైజ్ మనీ ఎన్ని కోట్లు అంటే ..
-
IPL 2023 Final: రుతురాజ్‌ను చూసి వణిపోతున్న గుజరాత్ టైటాన్స్
వర్షం కారణంగా గుజరాత్, చెన్నై జట్ల మధ్య నిన్న జరగాల్సిన ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే (మే 29)కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా, సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను చూసి మాత్రం గుజరాత్ టైటాన్స్ వణికిపోతుంది. అందుకు కారణం గుజరాత్‌పై రుతురాజ్‌కు ఉన్న రికార్డు. ఈ సీఎస్కే ఓపెనర్ ఐపీఎల్లో గుజరాత్‌తో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 4 అర్ధ సెంచరీలు బాదాడు. క్వాలిఫయర్-1లో 44 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 60 పరుగులు చేసిన రుతు.. ఈ సీజన్ ఓపెనర్‌లో 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అంతకుముందు సీజన్లో తొలి మ్యాచ్‌లో 48 బంతుల్లో 73 పరుగులు చేసిన గైక్వాడ్.. ఆ తర్వాతి మ్యాచ్‌లో 49 బంతుల్లో 53 పరుగులు చేశాడు. మొత్తంగా రుతురాజ్ ఐపీఎల్లో గుజరాత్‌తో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 4 అర్ధసెంచరీలు సాధించి 278 పరుగులు స్కోర్ చేశాడు. ఐపీఎల్లో మరే ఆటగాడు గుజరాత్‌పై ఇన్ని పరుగులు చేయలేదు. రుతురాజ్ తర్వాత విరాట్ కోహ్లి అత్యధికంగా గుజరాత్‌పై 232 పరుగులు సాధించాడు. నేటి ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇదే రికార్డు గుజరాత్ బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఒకవేళ మ్యాచ్ పూర్తి ఓవర్లు సాధ్యపడితే, రుతురాజ్‌ను ఔట్ చేయడం వారికి తలకు మంచిన పనే అవుతుంది. ఈ సీజన్ క్వాలిఫయర్-1 మినహాంచి, గత సీజన్లో రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్‌నే విజయం వరించినప్పటికీ, రుతురాజ్ విషయంలో వారికి ప్రత్యేక ప్రణాళికలు లేకపోతే మూల్యం తప్పించుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత లీగ్‌లో ఏడో టాప్ స్కోరర్‌గా (15 మ్యాచ్‌ల్లో 146.88 స్ట్రయిక్ రేట్‌తో 564 పరుగులు, 4 హాఫ్‌సెంచరీలు) ఉన్న రుతురాజ్‌ను గుజరాత్ బౌలర్లు ఎలా కంట్రోల్ చేస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, ఇవాళ జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌కు మరోసారి వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. అహ్మదాబాద్‌లో ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం వేళ జల్లులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించేందుకు విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తారు. 20 ఓవర్ల నుంచి 15 ఓవర్లు లేదా 10 ఓవర్లు లేదా 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరిపేందుకు కృషి చేస్తారు. చివరకు అదీ సాధ్యం కాకపోతే చివరి ప్రయత్నంగా ‘సూపర్ ఓవర్’తోనైనా ఫలితాన్ని తేల్చేందుకు చూస్తారు. అయితే దానికీ అవకాశం లేకపోతే మాత్రం లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. అప్పుడు గుజరాత్ టైటాన్స్ చాంపియన్‌గా నిలుస్తుంది. చదవండి: IPL 2023: 'రిజర్వ్ డే'కు ఫైనల్ మ్యాచ్.. ధోని రిటైర్మెంట్కు సంకేతమా..? -
IPL 2023: 'రిజర్వ్ డే'కు ఫైనల్ మ్యాచ్.. ధోని రిటైర్మెంట్కు సంకేతమా..?
ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్‌కు (మే 29, రిజర్వ్ డే) ముందు చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు యావత్ భారత క్రికెట్ అభిమానులకు ఓ భయం పట్టుకుంది. ఈ సీజన్‌తోనే ధోని తన ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలుకుతాడేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచే తలాకు ఆఖరిదవుతుందేమోనని కలత చెందుతున్నారు. ధోని రిటైర్మెంట్ విషయంలో ఫ్యాన్స్‌కు ఉన్న భయాల వెనుక ఓ బలమైన కారణం ఉంది. ధోని.. తన అంతర్జాతీయ కెరీర్‌లోని చివరి మ్యాచ్‌ను రిజర్వ్ డే రోజునే ఆడాడు. 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో షెడ్యూల్ ప్రకారం న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డేకు (జులై 10) వాయిదా పడింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడింది. ఏడాది అనంతరం 2020, ఆగస్ట్ 15వ తేదీన ధోని అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించాడు. Déjà Vu? 📸: IPL#MSDhoni #India #CSK pic.twitter.com/4cW5RlhFBb — CricTracker (@Cricketracker) May 28, 2023 తాజాగా ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రిజర్వ్ డే కు వాయిదా పడటంతో అభిమానులు భయపడుతున్నారు. ధోని తన అంతర్జాతీయ క్రికెట్‌కు ఎలాగైతే వీడ్కోలు పలికాడో, ఐపీఎల్‌కు కూడా అలాగే రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమోనని దిగులుపడుతున్నారు. తలా లేని ఐపీఎల్‌ను ఊహించుకోలేమంటూ వాపోతున్నారు. ధోని అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన చివరి మ్యాచ్‌ను, ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌ను కంపేర్ చేసుకుంటూ తెగ ఫీలైపోతున్నారు. ధోనికి అంతర్జాతీయ క్రికెట్లో చివరి మ్యాచ్ (వన్డే) 350వదని, ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ అతనికి 250వదని చెప్పుకుంటూ ధోని రిటైర్మెంట్పై నిర్ధారణకు వచ్చేశారు. ధోని రిటైర్మెంట్కు లెక్కలు కూడా అనుకూలిస్తున్నాయంటూ సోషల్‌మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, గుజరాత్-చెన్నై జట్ల మధ్య నిన్న (మే 28) జరగాల్సిన ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే (మే 29)కు వాయిదా పడిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే, లీగ్ దశలో టేబుల్ టాపర్ అయిన గుజరాత్‌ను విజేతగా ప్రకటిస్తారు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. సాయంత్రం వేళ జల్లులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం. చదవండి: IPL 2023 Final: మళ్లీ అదే రోజు గెలవాలని రాసి పెట్టిందేమో.. వరుణుడు కూడా సహకరించాడు..! -
IPL 2023 Final: చెన్నై ఓడిపోతుందని ముందే డిసైడ్ చేసేశారు..!
గుజరాత్-చెన్నై జట్ల మధ్య నిన్న (మే 28) జరగాల్సిన ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే (మే 29)కు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు స్టేడియంలోని జెయింట్ స్క్రీన్‌పై కనిపించిన ఓ ఆసక్తిర దృశ్యం ఇంటర్నెట్ను షేక్ చేసింది. అదేంటంటే.. "చెన్నై సూపర్ కింగ్స్ రన్నరప్" అని బిగ్ స్క్రీన్‌పై కొద్ది సెకెన్ల పాటు ప్రదర్శించబడింది. ఇది చూసిన అభిమానులు వెంటనే స్క్రీన్ షాట్ తీసి సోషల్‌మీడియాలో వైరల్ చేశారు. సెకెన్ల వ్యవధిలో ఈ న్యూస్ దావనంలా వ్యాపించింది. ధోని ఈ సారి ఎలాగైనా టైటిల్ సాధిస్తాడని గంపెడాశలు పెట్టుకున్న సీఎస్కే అభిమానులు ఇది చూసి అవాక్కయ్యారు. మ్యాచ్ జరగకుండానే తమను రన్నరప్‌గా ఎలా డిసైడ్ చేస్తారని మండిపడ్డారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా జరిగిందా అని అనుమానాలు వ్యక్తం చేశారు. Well, it seems like Mother Nature is having a grand time playing with the emotions of cricket fans today! As for that viral 'RUNNER UP CSK' image, it's almost as if someone hit the "upload" button prematurely and revealed the climactic twist of the match. Perhaps it's a… pic.twitter.com/R8fL02nGHe — Sandeep Nandlal (@ishsagar) May 28, 2023 అయితే స్క్రీన్ టెస్టింగ్‌లో భాగంగా ఇలా జరిగినట్లు నిర్వహకులు ప్రకటించడంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఏదైనా ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇరు జట్లకు సంబంధించి విన్నర్, రన్నరప్ డిక్లేరేషన్‌ను చెక్ చేసి చూసుకోవడం సంబంధిత విభాగం వారి విధుల్లో భాగంగా జరుగుతుందని నిర్వహకులు వివరణ ఇచ్చారు. రన్నరప్ సీఎస్కే అనే కాకుండా, సీఎస్కే విన్నర్ అనే డిక్లేరేషన్‌ను కూడా చెక్ చేశారని పేర్కొన్నారు. అలాగే గుజరాత్‌కు కూడా విన్నర్, రన్నరప్ డిక్లేరేషన్‌ను చెక్ చేశారని తెలిపారు. ఇది కేవలం స్క్రీన్ టెస్టింగ్‌లో భాగంగా జరిగిందేనని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే, ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు వరకు వాతావరణం ప్రశాంతంగా ఉండింది. టాస్కు సమయం ఆసన్నమవుతున్న వేళ మొదలైన వర్షం, భారీ వర్షంగా మారి, మ్యాచ్ సాధ్యపడకుండా చేసింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నేటికి వాయిదా వేశారు. ఈ రోజు (రిజర్వ్ డే) కూడా వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోతే, లీగ్ దశలో టేబుల్ టాపర్ అయిన గుజరాత్‌ను విజేతగా ప్రకటిస్తారు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. సాయంత్రం వేళ జల్లులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం. చదవండి: IPL 2023 Final: మళ్లీ అదే రోజు గెలవాలని రాసి పెట్టిందేమో.. వరుణుడు కూడా సహకరించాడు..! -
IPL 2023 Final: మళ్లీ అదే రోజు గెలవాలని రాసి పెట్టి ఉందేమో.. వరుణుడు కూడా సహకరించాడు..!
గుజరాత్-చెన్నై జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే (మే 29)కు వాయిదా పడిన విషయం తెలిసిందే. యాదృచ్చికమో ఏమో తెలీదు కానీ, సరిగ్గా ఇదే రోజే గతేడాది ఐపీఎల్ (2022) ఫైనల్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలుపొంది, అరంగేట్రం సీజన్లోనే టైటిల్ నెగ్గింది. వరుణుడి ఆటంకం కారణంగా (షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2023 ఫైనల్ మే 28న జరగాల్సి ఉంది) సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ అదే రోజు టైటిల్ గెలిచే అవకాశం గుజరాత్‌కు వచ్చింది. రిజర్వ్ డేకు కూడా వర్షం ముప్పు పొంచి ఉండటంతో ఈసారి కూడా గుజరాత్‌కే టైటిల్ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మళ్లీ అదే రోజు (మే 29) టైటిల్ గెలవాలని వారికి రాసి పెట్టిందో ఏమో, అన్నీ వారికి అనుకూలంగా జరుగుతున్నాయి. మరోవైపు మ్యాచ్ పూర్తిగా జరిగినా లేక అరకొరగా సాధ్యపడినా గుజరాత్‌కే గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయంటూ గుజరాత్ అభిమానులు ప్రచారం చేసుకుంటున్నారు. చెన్నైతో పోలిస్తే తమ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని, శుభ్‌మన్ గిల్ భీకర ఫామ్ కొనసాగిస్తాడని.. లీగ్ టాప్-3 వికెట్టేకర్లు షమీ, రషీద్, మోహిత్ మరోసారి సత్తా చాటుతారని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు గత రికార్డులు, లక్ కూడా తమకే అనుకూలంగా ఉన్నాయంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి గుజరాత్ అభిమానులు ప్రచారం చేసుకున్నట్లుగా హార్ధిక్ సేన గెలుస్తుందో, లేక మెజారిటీ శాతం అభిమానుల కోరిక ప్రకారం సీఎస్కే టైటిల్ గెలుస్తుందో వేచి చూడాలి. కాగా, నిబంధనల ప్రకారం రిజర్వ్ డే రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే, లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే (గుజరాత్) విజేతగా ప్రకటిస్తారు. చదవండి: IPL 2023 Final: 'రిజర్వ్ డే'కు కూడా వర్షం ముప్పు.. వాన పడిందా..! -
వాన వచ్చె... వాయిదా పడె
-
IPL 2023 Final: 'రిజర్వ్ డే'కు కూడా వర్షం ముప్పు.. వాన పడిందా..!
వర్షం కారణంగా నేటికి (మే 29) వాయిదా పడిన ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్.. రిజర్వ్ డే రోజు కూడా సజావుగా సాగే పరిస్థితి కనబడటం లేదు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. మ్యాచ్‌కు వేదిక అయిన అహ్మదాబాద్‌లో ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం వేళ జల్లులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే నిన్నటి లాగా భారీ వర్షం కురవకపోవచ్చని సమాచారం. ఇదిలా ఉంటే, ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించేందుకు విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తారు. 20 ఓవర్ల నుంచి 15 ఓవర్ల లేదా 10 ఓవర్ల లేదా 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరిపేందుకు కృషి చేస్తారు. చివరకు అదీ సాధ్యం కాకపోతే చివరి ప్రయత్నంగా ‘సూపర్ ఓవర్’తోనైనా ఫలితాన్ని తేల్చేందుకు చూస్తారు. అయితే దానికీ అవకాశం లేకపోతే మాత్రం లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. అప్పుడు గుజరాత్ టైటాన్స్ చాంపియన్‌గా నిలుస్తుంది. కాగా, ఐపీఎల్ 2023 ఫైనల్స్‌కు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చేరిన విషయం తెలిసిందే. చదవండి: పన్నెండులో తొమ్మిదిసార్లు.. క్వాలిఫయర్-1 విజేత -
IPL Final: వాన వచ్చె... వాయిదా పడె
ఐపీఎల్–2023 విజేత ఎవరో తేలేందుకు మరో రోజు వేచి చూడాల్సిందే. ఫైనల్ కోసం మైదానంలో లక్షకు పైగా ఉన్న అభిమాన సందోహం సరిపోదన్నట్లుగా నేనూ ఉన్నానంటూ వరుణ దేవుడు వచ్చేయడంతో అంతా మారిపోయింది. టాస్ సమయానికి అరగంట ముందు మొదలైన వాన నిరంతరాయంగా కురవడంతో ఆటకు ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. ఎంత ఎదురు చూసినా వర్షం తెరిపినివ్వలేదు. దాంతో ఆదివారం జరగాల్సిన తుది పోరును సోమవారానికి వాయిదా వేయక తప్పలేదు. రిజర్వ్ డే అయిన నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ట్రోఫీ కోసం తలపడతాయి. అన్నట్లు సోమవారం కూడా 10 శాతం వర్ష సూచన ఉంది. అయితే ఏమాత్రం వర్షసూచన లేని ఆదివారమే ఇలా జరిగితే సోమవారం ఏం జరుగుతుందనేది ఆసక్తికరం! అహ్మదాబాద్: ఐపీఎల్ తాజా సీజన్లో మొత్తం 73 మ్యాచ్‌లు జరిగాయి. ఒక మ్యాచ్ వర్షం బారిన పడి రద్దు కాగా, మరో మ్యాచ్‌లో వర్షం ఆటంకం కలిగించినా ఒక్క బంతి కూడా వృథా కాలేదు. కానీ అసలైన అంతిమ సమరం సమయానికి మాత్రం వరుణుడు పూర్తి ప్రతాపం చూపించాడు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఫైనల్ పోరుకు అడ్డుగా నిలిచాడు. మండు వేసవిలో అహ్మదాబాద్‌లో వర్షం అంటే అలా కొద్దిసేపు వచ్చి పోయే చినుకుల్లా అందరూ భావించినా ఆదివారం మాత్రం అలా జరగలేదు. చివరకు ఫైనల్ మ్యాచ్ నేటికి వాయిదా పడింది. సాయంత్రం 6.30 సమయంలో స్వల్పంగా వాన మొదలైంది. ఆ తర్వాతి నుంచి తగ్గుతూ, పెరుగుతూ వచ్చింది. కవర్లు కప్పడం, తొలగించడం మళ్లీ మళ్లీ జరిగాయి. 9 గంటల సమయంలో మాత్రం వాన పూర్తిగా తగ్గిపోయింది. దాంతో అంపైర్లతో పాటు ఇరుజట్ల ఆటగాళ్లు, కోచ్‌లు మైదానంలోకి వచ్చారు. అంతా పిచ్‌ను, అవుట్‌ఫీల్డ్‌ను పరిశీలించడంతో పాటు వామప్ కూడా మొదలైంది. అయితే ఒక్కసారిగా వాన జోరందుకోవడంతో అంతా పరుగెడుతూ గ్రౌండ్ వీడారు. ఆ తర్వాత దాదాపు రెండు గంటల పాటు వేచి చూసినా ఫలితం కనిపించలేదు. రాత్రి 9.30కి ఆట ఆరంభమైతే పూర్తి ఓవర్లు సాగేవి. ఆపై ఓవర్ల కోతతోనైనా మ్యాచ్ నిర్వహించాలని అంపైర్లు ప్రయత్నించారు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ ఆడాలన్నా అర్ధరాత్రి 12.06కు ఆట ఆరంభం కావాలి. దానికి కనీసం గంట ముందుగా వాన ఆగిపోవాలి. అయితే అనుకున్న సమయానికి వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ వాయిదా పడింది. ఇరు జట్ల కోచ్‌లు స్టీఫెన్ ఫ్లెమింగ్, ఆశిష్ నెహ్రాల ‘షేక్ హ్యాండ్’తో అధికారికంగా ఖాయమైంది. నేడు వాన కురిస్తే... ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఎలాగైనా ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. 20 ఓవర్ల నుంచి 15 ఓవర్ల లేదా 10 ఓవర్ల లేదా 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరపాల్సిందే. చివరకు అదీ సాధ్యం కాకపోతే రాత్రి. గం. 1.20 సమయంలో ‘సూపర్ ఓవర్’తోనైనా ఫలితాన్ని తేలుస్తారు. అయితే దానికీ అవకాశం లేకపోతే మాత్రం లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. అప్పుడు గుజరాత్ టైటాన్స్ చాంపియన్‌గా నిలుస్తుంది. -
#GTvsCSK: ఫైనల్ మ్యాచ్ వాయిదా.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి
సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం(మే 28న) ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ 16వ సీజన్ ముగిసిపోవాలి. కానీ వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రిజర్వ్‌డేకు వాయిదా పడింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మధ్యాహ్నం నుంచి ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కనీసం టాస్ కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. రాత్రి 11 దాటినా వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఐపీఎల్ చరిత్రలో ఒక ఫైనల్ మ్యాచ్ వాయిదా పడడం ఇదే తొలిసారి. వర్షం కారణంగా పలు సీజన్లలో మ్యాచ్‌లు రద్దు కావడం లేదా ఓవర్లు కుదించి ఆడడం జరిగింది. కానీ గత 15 సీజన్లలో ఏ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడింది లేదు.. రిజర్వ్ డేకు వాయిదా పడింది లేదు. ఇక ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. ఫైనల్మ్యాచ్ చూద్దామని వచ్చిన అభిమానులకు వరుణుడి కారణంగా తీవ్ర నిరాశే మిగిలింది. రాత్రి 9 గంటల తర్వాత అభిమానులు ఒక్కొక్కరిగా స్టేడియం నుంచి వెళ్లిపోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The #Final of the #TATAIPL 2023 has been moved to the reserve day on 29th May - 7:30 PM IST at the Narendra Modi Stadium, Ahmedabad. Physical tickets for today will be valid tomorrow. We request you to keep the tickets safe & intact. #CSKvGT pic.twitter.com/d3DrPVrIVD — IndianPremierLeague (@IPL) May 28, 2023 Fans leave the Narendra Modi Stadium. A sad end to what could have been an amazing Sunday. #IPLFinals to be played tomorrow it seems. #Ahmedabad #IPL2023Final #CskvsGttickets #MSDhoni𓃵 #rain pic.twitter.com/vGlfVQzBb9 — 7 & 18 & 45 (@Tamil_paiyan_01) May 28, 2023 చదవండి: #IPL2023Final: డ్యూటీ చేస్తున్న పోలీస్ అధికారిపై మహిళ దౌర్జన్యం -
#IPL2023Final: డ్యూటీ చేస్తున్న పోలీస్ అధికారిపై మహిళ దౌర్జన్యం
ఐపీఎల్ 2023 ఫైనల్ ఆదివారం సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరగాల్సి ఉన్నప్పటికి వర్షం కారణంగా కనీసం టాస్ కూడా పడలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మ్యాచ్ జరుగుతుందా అన్న అనుమానం కూడా కలుగుతుంది. సోమవారం మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉన్నప్పటికి వర్షం పడే అవకాశం 60శాతం ఉన్నట్లు వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ విషయం పక్కనబెడితే.. స్టేడియంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై ఒక మహిళా అభిమాని దౌర్జన్యం చేసింది. ఏదో విషయమై ఇద్దరి మధ్య వాదన జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సదరు మహిళ పోలీసు అధికారిపై చేయి చేసుకుంది. ఆ తర్వాత అతన్ని కింద పడేసి ఇష్టం వచ్చినట్లుగా తన్నింది. అయితే ఆ అధికారి మాత్రం ఆమెను ఏమనకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుండగా మరోసారి మహిళ తన కాలితో అతన్ని తన్నడం అక్కడి కెమెరాలకు చిక్కింది. పక్కనే ఉన్నవాళ్లు గొడవను చూస్తూ ఆనందిస్తున్నారే తప్ప ఒక్కరు కూడా అడ్డుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. This woman slapped and hit this male officer like anything and the helpless guy couldn't do anything. Is this woman empowerment? Worst Fanbase Ever 🤮🤮@ChennaiIPL #CSKvGT #GTvCSK #Rain #Ahmedabad pic.twitter.com/lH8N0bsSL5 — Harshit 🇮🇳 (@Imharshit_45) May 28, 2023 చదవండి: దిక్కుమాలిన వర్షం.. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే పడాలా! -
దిక్కుమాలిన వర్షం.. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే పడాలా!
కరోనాతో రెండేళ్ల పాటు ఐపీఎల్ చాలా చప్పగా సాగింది. స్టేడియాల్లో ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో ఆటగాళ్లు కూడా కాస్త బోర్ ఫీలయ్యారు. అయితే ఐపీఎల్ 16వ సీజన్ ఆ సీన్‌ను మొత్తం రివర్స్ చేసేసింది. ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మంది వీక్షించిన సీజన్‌గా ఐపీఎల్ 2023 చరిత్రకెక్కనుంది. కారణం దాదాపు అన్ని మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగడం.. స్టేడియాల్లోకి పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతించడం.. ధోని లాంటి ఆటగాళ్ల కోసం ఈ సీజన్‌ను టీవీల్లోనూ చాలా మంది ఎంజాయ్ చేయడం కనిపించింది. అలా దాదాపు రెండు నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 16వ సీజన్‌కు నేటితో తెరపడనుంది. ఆదివారం(మే 28న) ఫైనల్లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. సీఎస్కే ఐదోసారి కప్పు కొడుతుందా లేక గుజరాత్ వరుసగా రెండోసారి టైటిల్‌ను నిలబెట్టుకుంటుందా అనేది పక్కనబెడితే మాకు మాత్రం ఫుల్ కిక్కు ఖాయం అని అభిమానులు భావించారు. కానీ అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు శనిలాగా తయారయ్యాడు. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించాలని మధ్యాహ్నం నుంచే స్టేడియం ముందు ప్రేక్షకులు బారులు తీరారు. అదే సమయంలో వరుణుడు కూడా తన ప్రతాపాన్ని చూపించాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో టాస్ కూడా ఆలస్యం అయింది. మ్యాచ్ సమయం గంట దాటినా వర్షం జోరు మాత్రం తగ్గడం లేదు. పూర్తి మ్యాచ్ కాకపోయినా కనీసం ఐదు ఓవర్ల ఆట అయినా సాధ్యపడుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉన్నప్పటికి సోమవారం కూడా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మ్యాచ్ జరగకుండానే టైటిల్ విజేతను ప్రకటిస్తారేమోనని అభిమానులు బాధపడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే లీగ్‌లో టాపర్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలుస్తుంది. అలా చూస్తే ఇది సీఎస్కేకు నష్టం మిగిల్చే అంశం. ధోనికి చివరి ఐపీఎల్ అని భావిస్తున్న వేళ వర్షం కారణంగా ఇలా జరిగితే మాత్రం సీఎస్కే అభిమానులకు మింగుడుపడని అంశమే. అయితే ఐపీఎల్ 16వ సీజన్లో ఏ మ్యాచ్‌కు అడ్డుపడని వరుణుడు ఫైనల్ మ్యాచ్‌కు ఇలా చేయడం ఏంటని అభిమానులు తెగ ఫీలవుతున్నారు. ఏదో కాసేపు పడి వర్షం ఆగిపోతుందనుకుంటే పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు. దిక్కుమాలిన వర్షం.. ఇన్ని రోజులు లేని వర్షం ఇప్పుడే పడాలా.. అంటూ అభిమానులు కామెంట్ చేశారు. Narendra Modi Stadium leaks rainwater from one side of the stadium and crowd had to leave that area. #CSKvsGT #rain #IPL2023Final pic.twitter.com/0MlxDDxH4g— Silly Context (@sillycontext) May 28, 2023 Rain stoppedToss at 9:10#CSKvGT #IPLFinals #IPL2023Final #Ahmedabad #rain #MSDhoni #Ahmedabad pic.twitter.com/YEyDQef1hm— proper thought. (@ThoughtProper) May 28, 2023 -
పన్నెండులో తొమ్మిదిసార్లు.. క్వాలిఫయర్-1 విజేత
దాదాపు రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 16వ సీజన్‌కు ఇవాళ్టితో శుభం కార్డు పడనుంది. పది జట్లు పోటీ పడితే ఆఖరికి రెండు జట్లు ఫైనల్లో అడుగుపెట్టాయి. ఆదివారం(మే 28న) గుజరాత్ టైటాన్స్, సీఎస్కేలు ఫైనల్లో తలపడుతున్నాయి.ఐదోసారి ఛాంపియన్స్‌గా నిలవాలని సీఎస్కే భావిస్తుంటే.. వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్‌ను చేజెక్కించుకోవాలని గుజరాత్ పట్టుదలతో ఉంది. అయితే గడిచిన 15 సీజన్లలో చాలా సందర్భాల్లో క్వాలిఫయర్-1లో గెలిచి ఫైనల్‌కు చేరిన జట్టు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవడం విశేషం. 2011 నుంచి 12 సీజన్లలో తొమ్మిదిసార్లు క్వాలిఫయర్-1లో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లిన జట్లే కప్పు కొట్టాయి. గత రికార్డుల ప్రకారం 2011 నుంచి ఇప్పటివరకు 9 సార్లు క్వాలిఫైయర్-1 విజేతనే ట్రోఫీని సొంతం చేసుకుంది. కేవలం మూడు సార్లు మాత్రమే క్వాలిఫైయర్-2 టీమ్ చాంపియన్‌గా నిలిచింది. అలా చూస్తే ఈసారి గుజరాత్ టైటాన్స్‌దే కప్ అని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ ధోనీ సేనను తక్కువ అంచనా వేయలేం. ఐదోసారి కప్ గెలుస్తుందని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. అయితే క్వాలిఫైయర్ 1 పోరులో అనూహ్యంగా సీఎస్కే చేతిలో ఓడిన గుజరాత్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో పంజా విసిరింది. చాంపియన్ ఆటతో బలమైన ముంబై ఇండియన్స్‌ను 62 రన్స్‌తో చిత్తు చేసింది. సొంతగడ్డపై గుజరాత్ అవకాశాలను కొట్టిపారేయలేం. కానీ, మిస్టర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన తెలివైన వ్యూహాలతో మ్యాచ్‌ను చెన్నై వైపు తిప్పగల దిట్ట. దాంతో, విజేతగా నిలిచేది ఎవరో ఫస్ట్ ఇన్నింగ్స్‌తో దాదాపు తెలుస్తుంది. 2011 నుంచి విజేతలను ఒకసారి పరిశీలిస్తే.. ఐపీఎల్ 2011 – ఆర్సీబీ కప్పు ఆశలపై సీఎస్కే నీళ్లు చల్లింది. వరుసగా రెండోసారి సీఎస్కే చాంపియన్‌గా నిలిచింది (క్వాలిఫయర్-1 విజేత) ఐపీఎల్ 2012 – కోల్‌కతా నైట్ రైడర్స్ తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది.(క్వాలిఫయర్-1 విజేత) ఐపీఎల్ 2013 – ఫైనల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది.(క్వాలిఫయర్-2 విజేత) ఐపీఎల్ 2014 – కోల్‌కతా నైట్ రైడర్స్ రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ముంబై ఇండియన్స్‌పై గెలుపొందింది.(క్వాలిఫయర్-1 విజేత) ఐపీఎల్ 2015 – ఫైనల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది.(క్వాలిఫయర్-1 విజేత) ఐపీఎల్ 2016 – డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలిసారి కప్పు కొట్టింది. ఫైనల్లో కోహ్లీసేన ఓటమి పాలైంది.(క్వాలిఫయర్-2 విజేత) ఐపీఎల్ 2017 – ముంబై ఇండియన్స్ ఫైనల్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌పై గెలిచి ట్రోఫీ అందుకుంది.(క్వాలిఫయర్-2 విజేత) ఐపీఎల్ 2018 – చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచింది.(క్వాలిఫయర్-1 విజేత) ఐపీఎల్ 2019 – ముంబై ఇండియన్స్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచింది.(క్వాలిఫయర్-1 విజేత) ఐపీఎల్ 2020 – ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ముంబై ఇండియన్స్ ఐదోసారు ట్రోఫీని ముద్దాడింది.(క్వాలిఫయర్-1 విజేత) ఐపీఎల్ 2021 – చెన్నై సూపర్ కింగ్స్ ట్రోఫీ అందుకుంది. ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తు చేసింది.(క్వాలిఫయర్-1 విజేత) ఐపీఎల్ 2022 – క్వాలిఫైయర్ 1లో గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఆరంగేట్రం సీజన్లోనే చాంపియన్‌గా నిలచింది. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది.(క్వాలిఫయర్-1 విజేత) చదవండి: ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు -
IPL 2023 Final: వర్షం కారణంగా మ్యాచ్ సోమవారానికి వాయిదా
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఆదివారం సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నా వర్షంతో కనీసం టాస్ వేయడానికి వీలు పడలేదు. మధ్యలో ఒక పది నిమిషాలు తెరిపినివ్వడంతో మ్యాచ్ జరుగుతుందని అభిమానులు సంతోషపడ్డారు. కానీ కాసేపటికే వరుణుడు మళ్లీ జోరందుకున్నాడు. అప్పటినుంచి రాత్రి 11 గంటలయినా ఎంతకు తగ్గకపోవడంతో మ్యాచ్ రిఫరీ సైమన్ డౌల్.. అంపైర్లతో చర్చించి మ్యాచ్‌ను సోమవారానికి(మే 29) వాయిదా వేస్తున్నట్లు తెలిపాడు. ఇక సోమవారం కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ జరగకుంటే తొలుత 5 ఓవర్లు మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. అదీ సాధ్యపడకపోతే సూపర్ ఓవర్ ద్వారా ఫలితం వచ్చేలా చేస్తారు. సూపర్ ఓవర్ కూడా సాధ్యపడకపోతే మ్యాచ్‌ను రద్దు చేసి లీగ్ స్టేజీలో గ్రూప్ టాపర్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా ప్రకటిస్తారు. The #Final of the #TATAIPL 2023 has been moved to the reserve day on 29th May - 7:30 PM IST at the Narendra Modi Stadium, Ahmedabad. Physical tickets for today will be valid tomorrow. We request you to keep the tickets safe & intact. #CSKvGT pic.twitter.com/d3DrPVrIVD — IndianPremierLeague (@IPL) May 28, 2023 వర్షం కారణంగా టాస్ ఆలస్యం ఐపీఎల్ 16వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం (మే 28న) అహ్మదాబాద్ వేదికగా ఫైనల్లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కానుంది. ► ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌కు వేళైంది. విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, పదోసారి ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ పోరులో ఢీ కొంటున్నాయి. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా ఇరుజట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. దాంతో, పాండ్యా సేన రెండోసారి ట్రోఫీని ముద్దాడుతుందా? లేదా సీఎస్కే ఐదోసారి కప్పును ఎగరేసుకుపోతుందా? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. -
ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు
టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నైసూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్-2023 ఫైనల్ అనంతరం ఈ క్యాష్‌రిచ్ లీగ్ నుంచి తప్పుకోనున్నట్లు రాయుడు తెలిపాడు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఆదివారం రాయుడు వెల్లడించాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరగనున్న తుదిపోరులో చెన్నైసూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఇక 2010లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన రాయుడు.. ఇప్పటివరకు 202 మ్యాచ్‌లు ఆడాడు. 2010 నుంచి 2017 సీజన్ వరకు ముంబైఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం 2018 సీజన్లో చెన్నైసూపర్‌కింగ్స్ జట్టులోకి రాయుడు చేరాడు. 2013, 2015,2017 సీజన్లో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టులో రాయుడు భాగంగా ఉన్నాడు. "ముంబై, సీఎస్కే వంటి రెండు అద్భుతమైన జట్లకు ప్రాతినిద్యం వహించినందుకు చాలా గర్వంగా ఉంది. 204 మ్యాచ్‌లు, 14 సీజన్లు, 11 ప్లేఆఫ్‌లు, 8 ఫైనల్స్, 5 ట్రోఫీలు నా కెరీర్లో ఉన్నాయి. ఈ రోజు ఆరో టైటిల్ సాధిస్తాని ఆశిస్తున్నాను. ఈ ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాను. నా ఈ అద్భుతప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు. మళ్లీ యూ టర్న్ తీసుకోను" అంటూ ట్విటర్లో రాయుడు పేర్కొన్నాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 202 మ్యాచ్‌లు ఆడిన రాయుడు.. 4329 పరుగులు సాధించాడు. అతడి కెరీర్లో ఒక సెంచరీ ఉంది. చదవండి: IPL 2023 Final: అప్పుడు అంచనాలే లేవు.. కానీ ఇప్పుడు! అచ్చం ధోనిలాగే.. 2 great teams mi nd csk,204 matches,14 seasons,11 playoffs,8 finals,5 trophies.hopefully 6th tonight. It’s been quite a journey.I have decided that tonight’s final is going to be my last game in the Ipl.i truly hav enjoyed playing this great tournament.Thank u all. No u turn 😂🙏 — ATR (@RayuduAmbati) May 28, 2023 -
స్కూటీపై చక్కర్లు; ఆ ఇద్దరు గుజరాత్ బలం.. జాగ్రత్త
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా మరికొద్ది గంటల్లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో తలపడనున్నాయి. మరి ఫైనల్లో ఎవరు విజేత అనేది ఆసక్తికరంగా మారింది. సీఎస్కే ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచి ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేస్తుందా లేక గుజరాత్ టైటాన్స్ రెండోసారి టైటిల్ గెలుస్తుందా అనేది చూడాలి. ఈ విషయం పక్కనబెడితే.. గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రా ఫైనల్ మ్యాచ్‌కు ముందు అహ్మదాబాద్‌లోని నరేంద్ర స్టేడియంలో స్కూటీపై చక్కర్లు కొట్టడం వైరల్‌గా మారింది, పైగా నెహ్రాకు తోడుగా స్కూటీపై మోహిత్ శర్మ, రషీద్ ఖాన్లు కూడా ఉండడం ఆసక్తి కలిగించింది. కాగా ఈ వీడియోనూ జియో సినిమా స్వయంగా ట్విటర్లో షేర్ చేస్తూ.. ''గుజరాత్ టైటాన్స్ ON Their Way To #IPLFinal Like..'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక గుజరాత్ టైటాన్స్‌కు బౌలింగ్ పెద్ద బలం అని చెప్పొచ్చు. పర్పుల్‌క్యాప్ రేసులో గుజరాత్ టైటాన్స్ నుంచే ముగ్గురు బౌలర్లు ఉండడం విశేషం. మహ్మద్ షమీ 28 వికెట్లతో టాప్‌లో ఉండగా.. రషీద్ ఖాన్ 27, మోహిత్ శర్మ 24 వికెట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీడియో చూసిన అభిమానులు.. ''ఆ ఇద్దరు గుజరాత్ టైటాన్స్‌కు బలం.. కాస్త జాగ్రత్త'' అంటూ కామెంట్ చేశారు #GujaratTitans on their way to the #IPLFinal like... pic.twitter.com/nldijNxMR8 — JioCinema (@JioCinema) May 27, 2023 చదవండి: సీఎస్కే ఐదోసారి కొడుతుందా లేక గుజరాత్ డబుల్ ధమాకానా? -
ధోనిని ఆరాధించే వాళ్లలో ఒకడు.. కానీ టాస్ సమయంలో! పాండ్యాకు..
IPL 2023 Final CSK Vs GT: ‘‘మహేంద్ర సింగ్ ధోనిని ఆరాధించే చాలా మందిలో హార్దిక్ పాండ్యా కూడా ఒకడు. తనే ఈ విషయాన్ని స్వయంగా ఎన్నోసార్లు చెప్పాడు. మ్యాచ్ ఆరంభంలో టాస్ సమయంలో ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ.. ఎంతో స్నేహంగా కనిపించవచ్చు. కానీ ఒక్కసారి మ్యాచ్ ప్రారంభమైన తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. హార్దిక్ పాండ్యా చెప్పినట్లు కెప్టెన్‌గా తానేం నేర్చుకున్నాడో వ్యూహాల రూపంలో అమలు చేయాల్సి ఉంటుంది’’ అని టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ అన్నాడు. ఐపీఎల్-2023 ఎక్కడ, ఎలా మొదలైందో అక్కడే ముగియనుంది. నువ్వా- నేనా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టైటిల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ ఆదివారం (మే 28)అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో మాస్టర్ మైండ్ ధోని ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడతాడా? లేదంటే హార్దిక్ పాండ్యా గత సీజన్ ఫలితాన్ని పునరావృతం చేసి డిఫెండింగ్ చాంపియన్‌ను విజేతగా నిలబెడతాడా? అన్న చర్చ జరుగుతోంది. అప్పుడు అంచనాలే లేవు ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సారథిగా హార్దిక్ పాండ్యా ఏం నేర్చుకున్నాడో నిరూపించుకునే సమయం ఇదేనని పేర్కొన్నాడు. ‘‘గతేడాది తొలిసారిగా హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టినపుడు.. అతడి నుంచి ఏం ఆశించాలో, సారథిగా అతడి ఆటను ఎలా అంచనా వేయాలో కూడా చాలా మందికి అర్థం కాలేదు. అచ్చం ధోనిలాగే ఎందుకంటే పాండ్యా మోస్ట్ ఎగ్జైటింగ్ క్రికెటర్. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జట్టును ఏకంగా టైటిల్ విజేతగా నిలిపాడు. నిజానికి జట్టులో ధోని ఎలాంటి వాతావరణం కల్పిస్తాడో పాండ్యా కూడా అచ్చం అలాగే తమ ఆటగాళ్లను ప్రోత్సహించాడు. గుజరాత్ డ్రెసింగ్రూంలోనూ సీఎస్కే మాదిరి వాతావరణం కల్పించాడు. ఈ విషయంలో హార్దిక్ పాండ్యాకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే’’ అని గావస్కర్ పేర్కొన్నాడు. మిస్టర్ కూల్‌కు ఇదే ఆఖరి సీజన్? కాగా గతేడాది టేబుల్ టాపర్‌గా నిలిచి చాంపియన్‌గా నిలిచిన గుజరాత్.. ఈసారి కూడా అగ్రస్థానంతో లీగ్ దశను ముగించింది. విజయాల శాతంలో మెరుగ్గా ఉన్న పాండ్యా వరుసగా రెండోసారి ట్రోఫీ గెలవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. మిస్టర్‌కూల్‌కు ఇదే ఆఖరి సీజన్ అన్న వార్తల నడుమ తమ సారథి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని సీఎస్కే కూడా ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్లు పోటీకి సిద్ధమైంది. చదవండి: గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించిన సచిన్.. ఏమన్నాడంటే? 𝗔𝗟𝗟 𝗦𝗘𝗧! 👏 👏 It's time for the 𝗙𝗜𝗡𝗔𝗟 Showdown! 👍 👍#TATAIPL | #Final | #CSKvGT | @ChennaiIPL | @gujarat_titans pic.twitter.com/LXrtHxPDb4 — IndianPremierLeague (@IPL) May 28, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });