ఐపీఎల్-2023లో ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైన క్రికెటర్ రియాన్ పరాగ్. 2019లో క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన ఈ అసోం ఆల్‌రౌండర్ ఆరంభం నుంచే పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. తాజా ఎడిషన్‌లోనూ వైఫల్యాల పరంపర కొనసాగించాడు. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు వరుస మ్యాచ్‌లలో తేలిపోయాడు.
దీంతో మేనేజ్‌మెంట్ రియాన్‌కు కేవలం ఏడు మ్యాచ్‌లలో మాత్రమే అవకాశమిచ్చింది. అయితే, రియాన్ పరాగ్ మాత్రం వచ్చిన కాసిన్ని అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆడిన ఏడు మ్యాచ్‌లలో అతడు సాధించిన మొత్తం పరుగులు 78. అత్యధిక స్కోరు 20.
ఆసియా కప్ ఆడే జట్టులో
ఆటలో విఫలమైనప్పటికీ మైదానంలో అతి చేష్టల వల్ల ఓవరాక్షన్ ప్లేయర్‌గా ముద్రపడ్డాడు రియాన్ పరాగ్. నెటిజన్ల చేతిలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఈ క్రమంలో ఎమర్జింగ్ ఆసియా కప్-2023 నేపథ్యంలో ఇండియా- ఏ జట్టులో అతడు స్థానం సంపాదించడంతో మరోసారి ట్రోల్స్ మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ తనపై వస్తున్న విమర్శలు, వ్యంగ్యాస్త్రాల గురించి స్పందించాడు. ‘‘తాము కష్టపడి సంపాదించిన డబ్బు మనకోసం వెచ్చించి మ్యాచ్ చూడటానికి వస్తారు. అలాంటపుడు వాళ్లను నిరాశపరిస్తే కొంతమంది తిట్టుకుంటారు.
నేరుగా నాకే మెసేజ్ చేయొచ్చు కదా
మరికొంత మంది మనల్ని ద్వేషిస్తారు. వాళ్ల కోపంలో అర్థం ఉంది. నేను ఆ విషయం అర్థం చేసుకోగలను. కానీ కొంతమంది మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు సోషల్ మీడియాలో నన్ను విమర్శిస్తూ పోస్టులు పెడుతుంటారు.
ట్వీట్లు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లు నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయొచ్చు కదా! ‘‘నువ్వు ఇలా ఆడుతున్నావు. ఈ విషయంలో నిన్ను నువ్వు మార్చుకోవాలి. టెక్నిక్‌లో మార్పులు చేసుకోవాలి. అలా అయితే నీ ఆట మెరుగుపడుతుంది’’ అని నాకు సలహాలు ఇవ్వొచ్చు కదా!
సోషల్ మీడియాలో పోస్టులు చేసే సమయం కంటే ఇదేమీ ఎక్కువ టైమ్ తీసుకోదు. నిజంగా నాకు ఎవరైనా అలాంటి సలహాలు, సూచనలు ఇస్తే ఇష్టం’’ అంటూ రియాన్ పరాగ్ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ ట్విటర్‌లో షేర్ చేసింది.
ఎమర్జింగ్ ఏసియా కప్-2023 భారత- ఏ జట్టు
సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ(వైస్ కెప్టెన్), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, యశ్ ధుల్(కెప్టెన్), రియాన్ పరాగ్, నిశాంత్ సంధు, ప్రభ్‌షిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), మానవ్ సుతార్, యువరాజ్‌సిన్హ్ దోడియా, హర్షిత్ రానా, ఆకాశ్ సింగ్, నితీశ్ కుమార్‌రెడ్డి, రాజ్‌వర్దన్ హంగ్రేకర్.
స్టాండ్ బై ప్లేయర్లు: హర్ష్ దూబే, నేహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రేద్కార్.
చదవండి: కీలక ప్రకటన చేయనున్న సౌరవ్ గంగూలీ
MS Dhoni: ధోనికి హెలికాప్టర్ షాట్ నేర్పించింది అతడే! 42 ఆసక్తికర విషయాలు..
Comments
Please login to add a commentAdd a comment