breaking news
Asia Cup
-
కాంట్రాక్టు చింపేయండి! రెచ్చిపోయిన మాజీ పాక్ ప్లేయర్
-
‘మా ఆటగాళ్లంతా ఒక్కో ట్రోఫీతో సమానం’
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. చాంపియన్ టీమ్‌కు ట్రోఫీ ఇవ్వకుండా నిలిపివేసిన ఘటన గతంలో ఎన్నడూ చూడలేదని అతను అన్నాడు. అయితే తాము ఈ విషయాన్ని పట్టించుకోమని, ట్రోఫీ లేకపోవడం వల్ల తమ విజయం విలువ ఏమాత్రం తగ్గదని సూర్య వ్యాఖ్యానించాడు. ‘ఒక క్రికెట్ అభిమానిగా, ఆపై ఆటగాడిగా ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదు. ఎంతో కష్టపడి విజేతగా నిలిచి సంపాదించిన ట్రోఫీని ఆటగాళ్లకు ఇవ్వకపోవడం ఏమిటి? దానిని అందుకునేందుకు మాకు పూర్తి అర్హత ఉంది. అయితే ట్రోఫీల గురించే మాట్లాడాల్సి వస్తే మా డ్రెస్సింగ్‌రూమ్‌లోనే ఇలాంటి 14 ట్రోఫీలు ఉన్నాయి. ఈ ఆసియా కప్ గెలుపు ప్రయాణంలో మా ఒక్కో ఆటగాడు, సహాయక సిబ్బంది ఒక్కో ట్రోఫీతో సమానం. పాకిస్తానీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించరాదనే విషయం మాకు ఎవరూ చెప్పలేదు. మా జట్టు సభ్యులంతా మైదానంలో కలిసి తీసుకున్న నిర్ణయమిది’ అని సూర్యకుమార్ స్పష్టం చేశాడు. మరోవైపు పహల్గాం దాడిలో మృతి చెందిన కుటుంబాల సంక్షేమం కోసం తాను ఆసియా కప్‌లో 7 మ్యాచ్‌ల ద్వారా అందుకున్న మ్యాచ్ ఫీజు మొత్తాన్ని (రూ. 28 లక్షలు) విరాళంగా ఇస్తున్నట్లు సూర్యకుమార్ ప్రకటించాడు. నఖ్వీ తీసుకెళ్లిపోయాడు! ఫైనల్ ముగిసిన తర్వాత బహుమతి ప్రదానోత్సవానికి వేదికను ఏర్పాటు చేశారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, పాకిస్తాన్ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి కూడా అయిన మొహసిన్ నఖ్వీ అక్కడే ఉన్నాడు. అయితే పహల్గాం దాడి సమయంలో నఖ్వీ సోషల్ మీడియాలో భారత్‌కు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశాడు. దాంతో అతడి చేతుల మీదుగా ట్రోఫీని అందుకోబోమని భారత జట్టు ముందే ఏసీసీకి సమాచారం అందించింది. దాంతో ప్రత్యామ్నాయంగా వేదికపై ఉన్న ఇతర అధికారుల నుంచి అందించవచ్చని నిర్వాహకులు భావించారు. అయితే నఖ్వీ వేదికపై ఉన్నంత సేపు తాము అక్కడికి వెళ్లమని భారత్ స్పష్టం చేసింది. అయితే నిబంధనల ప్రకారం ఏసీసీ అధ్యక్షుడి హోదాలో తానే ట్రోఫీ ఇస్తానంటూ నఖ్వీ మొండితనం ప్రదర్శించాడు. దాంతో చివరకు భారత్ కప్ అందుకోకుండానే కార్యక్రమం ముగిసింది. అయితే ఆశ్చర్యకరంగా, ఎవరూ ఊహించని విధంగా నఖ్వీ సన్నిహితులు కొందరు అక్కడ ఉన్న ఆసియా కప్ ట్రోఫీని తమతో పాటు తీసుకెళ్లిపోయారు. అనంతరం భారత జట్టు మొత్తం వేదిక వద్ద చేరి ఊహాత్మకంగా ట్రోఫీ చేతిలో ఉన్నట్లుగా నటిస్తూ సంబరాలు చేసుకుంది. బీసీసీఐ ఆగ్రహం... నఖ్వీ ప్రవర్తనపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘నఖ్వీ పాకిస్తాన్ రాజకీయ నాయకుడు కూడా. అందుకే ఆయన నుంచి ట్రోఫీ తీసుకోవద్దని భారత్ నిర్ణయించింది. కానీ ఆయన తనతో పాటు ట్రోఫీని, పతకాలను కూడా తీసుకెళ్లమని దానర్థం కాదు. అవన్నీ వీలైనంత త్వరగా భారత్‌కు వస్తాయని నమ్ముతున్నాం. నవంబరులో జరిగే ఐసీసీ సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడి ప్రవర్తనపై మేం చాలా గట్టిగా నిరసన వ్యక్తం చేయనున్నాం’ అని సైకియా వెల్లడించారు. మరోవైపు టోర్నీలో భారత జట్టు ప్రవర్తన క్రికెట్‌ను అగౌరవపర్చినట్లుగా ఉందని పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా అన్నాడు. టోర్నీ ఆరంభానికి ముందు వేర్వేరు సందర్భాల్లో తనతో కరచాలనం చేసిన సూర్యకుమార్... జనం మధ్యలోకి వచ్చేసరికి మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వలేదని సల్మాన్ విమర్శించాడు. తిలక్ వర్మకు ఘన స్వాగతం... అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ సోమవారం రాత్రి నగరానికి తిరిగొచ్చాడు. శంషాబాద్ విమానాశ్రయంలో అతనికి అభిమానులు, తెలంగాణ స్పోర్ట్ అథారిటీ అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. ‘నేను క్రీజ్‌లోకి వచ్చిన సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్లు ఎన్నో వ్యాఖ్యలు చేశారు. అయితే నా బ్యాట్‌తోనే వారికి సమాధానం చెప్పాలని భావించా. అనుకున్నట్లుగానే చెలరేగిపోయా. నా ఆట తర్వాత మైదానంలో వారెవరూ కనిపించలేదు. మరో మాట అనే అవకాశం వారికి లేకుండా పోయింది. స్టేడియంలో అభిమానులు వందేమాతరంతో హోరెత్తించడంతో మరింత కసిగా చెలరేగిపోయా’ అని తిలక్ మ్యాచ్ తర్వాత వ్యాఖ్యానించాడు. -
ప్రధాని మోదీ ట్వీట్ పై PCB చీఫ్ మోషిన్ నఖ్వీ అక్కసు
-
పట్టు బట్టిన పీసీబీ చైర్మెన్.. ఊహించని షాకిచ్చిన భారత్
ఆసియాకప్-2025 విజేతగా టీమిండియా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దాయాది పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. తొమ్మిదో సారి ఆసియాకప్ టైటిల్‌ను ముద్దాడింది. ప్రత్యర్ధి నిర్ధేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది.భారత విజయంలో మిడిలార్డర్ బ్యాటర్, హైదరాబాదీ తిలక్ వర్మ (53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 పరుగులు నాటౌట్) కీలక పాత్ర పోషించాడు. లక్ష్య చేధనలో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ తన అద్బుత ఇన్నింగ్స్‌తో ఛాంపియన్‌గా నిలిపాడు.అతడితో పాటు సంజూ శాంసన్(24), శివమ్ దూబే(33) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. బుమ్రా, వరుణ్, అక్షర్ తలా రెండు వికెట్లు సాధించారు.ట్రోఫీని నిరాకరించిన భారత్.. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత హైడ్రామా చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసి 45 నిమిషాల సమయం దాటినా బహుమతి ప్రదానోత్సవం జరగలేదు. దాంతో ఏం జరిగిందనే అంశంపై చర్చ మొదలైంది. భారత జట్టు విజేత ట్రోఫీని స్వీకరించే విషయంలో వివాదం నెలకొనడమే అందుకు కారణమని తేలింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్‌ను అందుకునేది లేదని టీమిండియా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్-చైర్మన్ ఖలీద్ అల్ జరూని, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మెన్ అమీనుల్ ఇస్లాం ట్రోఫీని అందించడానికి ముందుకొచ్చారు. అందుకు టీమిండియా కూడా అంగీకరించింది. కానీ మొహసిన్ నఖ్వీ మాత్రం తనే స్వయంగా ట్రోఫీ అందిస్తాని పట్టుబట్టాడు. దీంతో భారత్ ప్రేజెంటేషన్ వేడుకునే కాకుండా ఏకంగా ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించింది. దెబ్బకు పీసీబీ చైర్మెన్‌తో పాటు పాక్ ఆటగాళ్లు షాకయ్యారు.కేవలం పాక్ ఆటగాళ్లు మాత్రమే రన్నరప్ మెడల్స్‌ను అందుకున్నారు. భారత్ నుంచి తిలక్, దూబే, అభిషేక్ మాత్రం స్పాన్సర్ల నుంచి తమ వ్యక్తిగత బహుమతులు అందుకున్నారు. అయితే ఫైనల్ వేడుక ముగిసిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవతున్నాయి.Big Breaking 🚨🚨Team India refuses to accept the Asia Cup 2025 Trophy 🏆 from Pakistan interior minister and ACC Chairman Mohsin Naqvi.Someone just picked up the trophy and walked off the ground.Another Embarrassing Moment for 🇵🇰Video 📷#INDvsPAK #AsiaCupFinal #Tilak pic.twitter.com/h4CrRZgcUF— Globally Pop (@GloballyPop) September 28, 2025చదవండి: ‘ఠాకూర్’ జితాదియా... -
భారత్‌కు విజయ 'తిలకం'
దాదాపు 18 ఏళ్ల క్రితం... టి20 వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి భారత్ జగజ్జేతగా నిలిచింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మరోసారి చిరకాల ప్రత్యర్థితో ఆఖరి సమరంలో గెలిచే అవకాశం వచ్చింది... వరల్డ్ చాంపియన్‌గా తమ స్థాయికి తగిన అంచనాలతో భారత్ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. గత రెండు మ్యాచ్‌ల ఫలితాలు చూస్తే టీమిండియాకు విజయం అతి సులువు అనిపించింది. పాక్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత లక్ష్యం మరీ చిన్నదిగా కనిపించింది. కానీ అనూహ్యంగా మ్యాచ్‌లో మలుపులు, ఉత్కంఠ, ఉద్వేగాలు... అన్నీ కలగలిసి మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు వెళ్లింది. సంజు సామ్సన్, శివమ్ దూబేలు తలా ఓ చేయి వేయగా... హైదరాబాద్ ఆటగాడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ అసలైన హీరోగా అవతరించాడు.ఒత్తిడిని అధిగమించి అద్భుత షాట్లతో చివరి వరకు నిలిచిన తిలక్ చిరస్మరణీయ ఆటతో భారత జట్టును ఆసియా కప్ విజేతగా నిలిపాడు. ఎన్ని టైటిల్స్ గెలిచినా ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి సాధించే ట్రోఫీలో కిక్కే వేరు అని మరోసారి రుజువైంది. దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా టోర్నీ చరిత్రలో 9వ సారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. సాహిబ్జాదా ఫర్హాన్ (38 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, ఫఖర్ జమాన్ (35 బంతుల్లో 46; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 58 బంతుల్లో 84 పరుగులు జోడించారు. పాక్ కేవలం 33 పరుగులకే చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (4/30) ఆకట్టుకోగా... బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తిలక్ వర్మ (53 బంతుల్లో 69 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా... శివమ్ దూబే (22 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజు సామ్సన్ (21 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించారు. రాణించిన ఓపెనర్లు... భారత్‌తో ఆడిన సూపర్–4 మ్యాచ్ తరహాలోనే ఈసారి కూడా పాక్ ఇన్నింగ్స్ జోరుగా మొదలైంది. ఓపెనర్లు ఫర్హాన్, ఫఖర్ పదునైన షాట్లతో సరైన పునాది వేశారు. ముఖ్యంగా ఫర్హాన్ దూకుడు ప్రదర్శిస్తూ బుమ్రా ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టాడు. పవర్‌ప్లేలో 45 పరుగులు చేసిన జట్టు... తర్వాతి 4 ఓవర్లలో 42 పరుగులు రాబట్టడంతో 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 87 పరుగులకు చేరింది. గత మ్యాచ్‌లో భారత్‌పై పాక్ తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 91 పరుగులు సాధించింది. 35 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఫర్హాన్‌ను వరుణ్‌ను అవుట్ చేయడంతో పాక్ తొలి వికెట్ కోల్పోయింది. మూడో స్థానంలో వచ్చిన సయీమ్ అయూబ్ (14) ఈసారి రెండంకెల స్కోరు చేయగలిగాడు. 12.4 ఓవర్లలో జట్టు స్కోరు 113/1 వద్ద నిలిచింది. ఈ దశలో మరో 44 బంతులు మిగిలి ఉండగా పాక్ భారీ స్కోరు సాధించడం ఖాయమనిపించింది. అయితే భారత బౌలర్లు చెలరేగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పాక్ బ్యాటర్లు ఎవరూ కనీసం క్రీజ్‌లో నిలవలేక చెత్త షాట్లతో వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. వరుసగా నాలుగు ఓవర్లలో ఒక్కో వికెట్ చొప్పున అయూబ్, హారిస్ (0), ఫఖర్, తలత్ (1) వెనుదిరిగారు. ఆ తర్వాత ఒకే ఓవర్లో మూడు వికెట్లతో కుల్దీప్ పాక్ పని పట్టాడు. అతడిని ఎదుర్కోలేక సల్మాన్ (8), అఫ్రిది (0), ఫహీమ్ (0) అవుటయ్యారు. మిగిలిన రెండు వికెట్లు తీసేందుకు భారత్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. 39 బంతుల వ్యవధిలో పాక్ చివరి 9 వికెట్లు చేజార్చుకుంది! కీలక భాగస్వామ్యాలు... ఛేదనలో భారత్ ఆరంభంలో తడబడింది. అద్భుత ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ (5)ను నిలువరిచడంలో పాక్ సఫలం కాగా... కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1), శుబ్‌మన్ గిల్ (12) కూడా విఫలమయ్యారు. దాంతో స్కోరు 20/3కి చేరింది. ఈ దశలో తిలక్, సామ్సన్ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. నాలుగో వికెట్‌కు 50 బంతుల్లో 57 పరుగులు జత చేసిన అనంతరం సామ్సన్ వెనుదిరిగాడు. అయితే తిలక్, దూబే భాగస్వామ్యంలో జట్టు గెలుపు దిశగా పయనించింది. వీరిద్దరు 40 బంతుల్లోనే 60 పరుగులు జోడించడంతో జట్టు విజయం దాదాపుగా ఖాయమైంది. విజయానికి 10 పరుగుల దూరంలో దూబే అవుటైనా... తిలక్, రింకూ సింగ్ (4 నాటౌట్) కలిసి మ్యాచ్‌ను ముగించారు. తిలక్ వర్మపరుగులు 69 బంతులు 53 1x 27 2 x 3 4 x 3 6 x 4 స్ట్రయిక్‌రేట్ 130.18 బుమ్రా అలా... భారత్‌తో గత మ్యాచ్‌లో పాక్ బౌలర్ రవూఫ్ యుద్ధంలో భారత విమానాలు నేలకూలినట్లుగా సైగలు చేస్తూ తమ దుర్బుద్ధిని ప్రదర్శించాడు. దీనిపై అతనికి ఐసీసీ జరిమానా కూడా విధించింది. ఫైనల్లో చక్కటి బంతితో రవూఫ్‌ను బుమ్రా బౌల్డ్ చేశాడు. వెంటనే బుమ్రా కూడా అదే తరహాలో విమానం నేలను ఢీకొట్టినట్లుగా సైగ చేస్తూ రవూఫ్‌ను సాగనంపడంతో స్టేడియం హోరెత్తిపోయింది. ‘క్రీడా మైదానంలో ఆపరేషన్ సిందూర్... ఫలితం మాత్రం ఒక్కటే... భారత్ విజయమే... మన క్రికెటర్లకుఅభినందనలు’. –నరేంద్ర మోదీ, భారత ప్రధాని స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫర్హాన్ (సి) తిలక్ వర్మ (బి) వరుణ్ 57; ఫఖర్ (సి) కుల్దీప్ (బి) వరుణ్ 46; అయూబ్ (సి) బుమ్రా (బి) కుల్దీప్ 14; హారిస్ (సి) రింకూ (బి) అక్షర్ 0; సల్మాన్ (సి) సామ్సన్ (బి) కుల్దీప్ 8; తలత్ (సి) సామ్సన్ (బి) అక్షర్ 1; నవాజ్ (సి) రింకూ (బి) బుమ్రా 6; అఫ్రిది (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; ఫహీమ్ (సి) తిలక్ వర్మ (బి) కుల్దీప్ 0; రవూఫ్ (బి) బుమ్రా 6; అబ్రార్ అహ్మద్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 146. వికెట్ల పతనం: 1–84, 2–113, 3–114, 4–126, 5–131, 6–133, 7–134, 8–134, 9–141, 10–146. బౌలింగ్: శివమ్ దూబే 3–0–23–0, బుమ్రా 3.1–0–25–2, వరుణ్ చక్రవర్తి 4–0–30–2, అక్షర్ పటేల్ 4–0–26–2, కుల్దీప్ యాదవ్ 4–0–30–4, తిలక్ వర్మ 1–0–9–0. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) రవూఫ్ (బి) ఫహీమ్ 5; గిల్ (సి) రవూఫ్ (బి) ఫహీమ్ 12; సూర్యకుమార్ (సి) సల్మాన్ (బి) అఫ్రిది 1; తిలక్ వర్మ (నాటౌట్) 69; సామ్సన్ (సి) ఫర్హాన్ (బి) అబ్రార్ 24; శివమ్ దూబే (సి) అఫ్రిది (బి) ఫహీమ్ 33; రింకూ సింగ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–7, 2–10, 3–20, 4–77, 5–137. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0–20–1, ఫహీమ్ 4–0–29–3, నవాజ్ 1–0–6–0, రవూఫ్ 3.4–0–50–0, అబ్రార్ 4–0–29–1, అయూబ్ 3–0–16–0. -
Asia Cup Ind vs Pak: ఆఖరి పోరాటం
ఆసియా కప్ మొదలై 41 సంవత్సరాలు...వన్డే ఫార్మాట్లో 14 సార్లు, టి20 ఫార్మాట్లో 2 సార్లు టోర్నీ జరిగింది. ఓవరాల్‌గా భారత్ 8 సార్లు విజేతగా నిలిచింది. కానీ ఒక్క సారి కూడా భారత్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగలేదు. తాజా టోర్నీలో పాక్ జట్టు ప్రదర్శన, తడబాటును చూస్తే ఈ సారి కూడా అది సాధ్యం కాదని అనిపించింది. కానీ పడుతూ లేస్తూ పాక్ ఎట్టకేలకు తుది పోరుకు అర్హత సాధించగా...మరో వైపు చక్కటి ఫామ్, అజేయమైన రికార్డుతో ఎదురుగా భారత్ నిలిచింది. గత రెండు మ్యాచ్‌ల ఫలితం, ఆపై సూర్యకుమార్ వ్యాఖ్యలు చూస్తే ఇరు జట్ల మధ్య ‘వైరం’ అనే మాటలో అర్థం లేదు! అయితే టి20 ఫార్మాట్లో అనూహ్య ఫలితాలు కొత్త కాదు. టీమిండియా తమ జోరును కొనసాగిస్తూ ఏకపక్ష ఆటతో 9వ సారి చాంపియన్‌గా నిలుస్తుందా... లేక పాకిస్తాన్ పాఠాలు నేర్చుకొని కొత్త తరహా ఆటతో పోటీనిస్తుందా అనేది ఆసక్తికరం. ఫలితం ఎలా ఉన్నా అభిమానులకు వరుసగా మూడో ఆదివారం క్రికెట్ పండగ ఖాయం. దుబాయ్: ఆసియా కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ తమ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సన్నద్ధమైంది. సరిగ్గా రెండేళ్ల క్రితం వన్డే ఫార్మాట్లో ఈ టోర్నీలో విజేతగా నిలిచిన భారత్...ఇప్పుడు టి20 ఫార్మాట్లో టైటిల్‌కు గురి పెట్టింది. నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌తో టీమిండియా తలపడుతుంది. వరుసగా ఆరు విజయాలతో సత్తా చాటిన సూర్యకుమార్ సేన సహజంగానే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఇదే జోరు మరో మ్యాచ్‌లో కొనసాగిస్తే ట్రోఫీ మన జట్టు ఖాతాలో పడుతుంది. మరో వైపు పాకిస్తాన్ జట్టు అన్ని రంగాల్లో బలహీనంగా ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్లపైనే చివరి వరకు శ్రమించి గట్టెక్కిన ఆ జట్టు భారత్‌ను నిలువరించడం అంత సులువు కాదు. దాయాది జట్టు చేతిలో లీగ్, సూపర్–4 దశలో ఎదురైన ఓటములు వారికి వాస్తవాన్ని చూపించాయి కూడా. అయితే ఆ జట్టు సంచలనాన్ని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఆసియా’లో ఎవరిది పైచేయి కానుందో చూడాలి. సూర్య ఫామ్‌పై ఆందోళన... శ్రీలంకపై చివరి లీగ్ మ్యాచ్‌లో బుమ్రా, దూబేలకు విశ్రాంతినిచ్చినా...ఫైనల్ పోరుకు వారిద్దరు తిరిగి రావడం ఖాయం. ఇది మినహా మిగతా జట్టులో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చు. వరుస విజయాల్లో భాగంగా ఉన్న ప్రధాన ఆటగాళ్లనే మేనేజ్మెంట్ కొనసాగించే అవకాశం ఉంది. అయితే సూపర్–4 దశలో జట్టులో పలు లోపాలు కనిపించాయి. భారత్ విజయావకాశాలు అభిషేక్ శర్మ ఇచ్చే అసాధారణ ఆరంభంపైనే ఆధారపడి ఉన్నాయనడంలో సందేహం లేదు. టోర్నీ టాపర్‌గా 309 పరుగులు చేసిన అతడు 200కు పైగా స్ట్రైక్‌రేట్‌తో అదరగొడుతున్నాడు. మరో ఎండ్‌లో గిల్ (115 పరుగులు)నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. అభిషేక్ దూకుడు ఈ లోటును తెలియనివ్వలేదు. ఈ సారైనా వైస్ కెప్టెన్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాలని భారత్ కోరుకుంటోంది. మిడిలార్డర్లో పాండ్యా తన స్థాయికి తగినట్లు చెలరేగలేదు. అయితే తిలక్, సామ్సన్‌లు రాణించడం సానుకూలాంశం. గత మ్యాచ్‌లో వీరిద్దరి ప్రదర్శన నమ్మకాన్ని పెంచింది. బౌలింగ్‌లో ఆకట్టుకుంటున్న దూబే బ్యాటింగ్‌లోనూ ధాటిని ప్రదర్శించాల్సి ఉంది. అన్నింటికి మించి కెపె్టన్ సూర్యకుమార్ ఫామ్ జట్టులో ఆందోళన పెంచుతోంది. ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 71 పరుగులే చేశాడు. అదీ తన సహజశైలికి భిన్నంగా 108 స్ట్రైక్‌రేట్ మాత్రమే ఉండటం అనూహ్యం. వచ్చే వరల్డ్ కప్ జట్టును నడిపించడం ఖాయమని భావిస్తున్న ప్లేయర్ ఇలా విఫలం కావడం ఇబ్బంది పెడుతోంది. ఫైనల్లోనైనా అతను చెలరేగాల్సి ఉంది. బౌలింగ్‌లో బుమ్రా మరోసారి కీలకం కానుండగా, పాండ్యా కూడా రాణించడం అవసరం. అయితే మరోసారి మన స్పిన్ బలగంపై జట్టు ఆధారపడుతోంది. ఆరుకంటే తక్కువ ఎకానమీతో అత్యధికంగా 11 వికెట్లు తీసిన కుల్దీప్ను ఎదుర్కోవడం పాక్ బ్యాటర్లకు మళ్లీ కష్టమే. అక్షర్, వరుణ్ కూడా ప్రత్యర్థిని కట్టిపడేయగలరు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, గిల్, సామ్సన్, తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా. పాకిస్తాన్: సల్మాన్ (కెప్టెన్ ), ఫర్హాన్, ఫఖర్, అయూబ్, తలత్, హారిస్, అఫ్రిది, నవాజ్, ఫహీమ్, రవూఫ్, అబ్రార్. -
సూర్యకుమార్‌పై ఐసీసీ చర్య
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో పాకిస్తాన్‌పై విజయాన్ని భారత సైనికులకు అంకితం ఇస్తున్నట్లుగా భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన ప్రకటనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పందించింది. ఈ వ్యాఖ్య రాజకీయపరమైనదని, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ అతనిపై చర్య తీసుకుంది. సూర్యకుమార్ మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాగా విధించింది. సెప్టెంబర్ 14న లీగ్ దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ‘పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు మేం అండగా ఉంటాం. మా విజయం భారత సైనికులకు అంకితం’ అని సూర్య వ్యాఖ్యానించాడు. క్రీడల్లో ఆర్మీ ప్రస్తావన తీసుకురావడాన్ని ప్రశ్నిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీకి ఫిర్యాదు చేసింది. గతంలోనూ రాజకీయపరమైన, గాజాపై ఇజ్రాయిల్ దాడివంటి అంశాలపై క్రికెటర్లు స్పందించకుండా ఐసీసీ ఆంక్షలు పెట్టిన విషయాన్ని పీసీబీ తమ ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ విచారణ జరిపారు. రిఫరీ ముందు హాజరైన సూర్యకుమార్ తాను ఎలాంటి తప్పూ చేయలేదని సమాధానమిచ్చాడు. సూర్య వివరణపై విభేదించిన రిఫరీ ఇక ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరిస్తూ 30 శాతం జరిమానా విధించారు. ఈ శిక్షపై బీసీసీఐ అప్పీల్ చేసినట్లు సమాచారం. అయితే మళ్లీ ఎప్పుడు విచారణ జరుగుతుందనే విషయంలో స్పష్టత లేదు. ఇక్కడా కూడా సూర్యదే తప్పని నిర్ధారణ అయితే శిక్ష మరింత పెరుగుతుంది. ఫర్హాన్‌కు హెచ్చరికతో సరి! సూపర్–4 దశలో భారత్‌తో మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు హారిస్ రవూఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ ప్రవర్తన గురించి బీసీసీఐ చేసిన ఫిర్యాదుపై కూడా రిచర్డ్సన్ విచారణ జరిపారు. ప్రేక్షకుల వైపు చూస్తూ యుద్ధంలో భారత విమానాలు కూలినట్లుగా, వాటి సంఖ్య ఆరు అన్నట్లుగా రవూఫ్ పదే పదే సైగలు చేశాడు. తాను కూడా తప్పేమీ చేయలేదని, ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకే అలా చేశానని రవూఫ్ ఇచ్చిన వివరణతో కూడా సంతృప్తి చెందని రిఫరీ అతనికి కూడా 30 శాతం జరిమానా విధించారు. అయితే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఏకే–47 తరహాలో బ్యాట్‌ను ఎక్కు పెట్టి సంబరాలు చేసుకున్న ఫర్హాన్‌పై మాత్రం ఎలాంటి చర్య తీసుకోలేదు. తాను అలా చేయడంలో ఎలాంటి దురుద్దేశం లేదని, తాను ఉండే ప్రాంతంలో ఏదైనా సంబరాల సమయంలో ఇలా గన్ను సరదాగా ఎక్కు పెడతారని అతను చెప్పాడు. గతంలో ధోని, కోహ్లి కూడా మైదానంలో ఇలాంటిదే చేసిన విషయాన్ని కూడా అతను గుర్తు చేశాడు. దాంతో ఫర్హాన్‌ను రిఫరీ కేవలం హెచ్చరికతో వదిలి పెట్టారు. -
భారత్ ‘సూపర్’ విజయం
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో లీగ్‌తో పాటు ‘సూపర్–4’ దశను భారత్ అజేయంగా ముగించింది. శుక్రవారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ ‘సూపర్ ఓవర్’లో శ్రీలంకపై విజయం సాధించింది. సూపర్ ఓవర్లో 5 బంతులు ఆడిన లంక 2 పరుగులకే పరిమితం కాగా... భారత్ తొలి బంతికే 3 పరుగులు సాధించి గెలిచింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌తో భారత్ టైటిల్ కోసం తలపడనుంది. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. టోర్నీలో వరుసగా మూడో అర్ధ సెంచరీ నమోదు చేసిన అభిషేక్ ఈసారి గత మ్యాచ్లకంటే వేగంగా 22 బంతుల్లోనే ఆ మార్క్‌ను అందుకోవడం విశేషం. మిడిలార్డర్లో తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), సంజు సామ్సన్ (23 బంతుల్లో 39; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా కీలక పరుగులు సాధించడంతో జట్టు భారీ స్కోరు నమోదు చేయగలిగింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 42 బంతుల్లో 66 పరుగులు జోడించారు. అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు సాధించింది. పతుమ్ నిసాంక (58 బంతుల్లో 107; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత సెంచరీతో సత్తా చాటగా, కుషాల్ పెరీరా (32 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 70 బంతుల్లోనే 127 పరుగులు జోడించి విజయంపై ఆశలు రేపారు. అయితే చివర్లో భారత బౌలర్లు కట్టడి చేయడంతో లంక విజయలక్ష్యం చేరలేకపోయింది. ఛేదనలో తొలి ఓవర్లోనే కుశాల్ మెండిస్ (0) అవుటైనా...నిసాంక, పెరీరా కలిసి శ్రీలంక ఇన్నింగ్స్‌ను నడిపించారు. భారత బౌలర్లందరినీ సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఫలితంగా 10 ఓవర్లలో జట్టు స్కోరు 114 పరుగులకు చేరింది. అయితే గెలుపు దిశగా సాగుతున్న సమయంలో తక్కువ వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. నిసాంక పోరాడినా...జట్టును గెలుపుతీరం చేర్చడంలో విఫలమయ్యాడు. హర్షిత్ వేసిన ఆఖరి ఓవర్లో లంక విజయానికి 12 పరుగులు అవసరం కాగా...11 పరుగులే వచ్చాయి. ఈ మ్యాచ్‌లో బుమ్రా, శివమ్ దూబేలకు విశ్రాంతినిచ్చిన భారత్ తుది జట్టులో అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణాలకు చోటు కల్పించింది. స్కోరు వివరాలు : భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) కమిందు (బి) అసలంక 61; గిల్ (సి అండ్ బి) తీక్షణ 4; సూర్యకుమార్ (ఎల్బీ) (బి) హసరంగ 12; తిలక్ వర్మ (నాటౌట్) 49; సామ్సన్ (సి) అసలంక (బి) షనక 39; పాండ్యా (సి) అండ్ (బి) చమీరా 2; అక్షర్ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 202. వికెట్ల పతనం: 1–15, 2–74, 3–92, 4–158, 5–162. బౌలింగ్: తుషార 4–0–43–0, తీక్షణ 4–0–36–1, చమీరా 4–0–40–1, హసరంగ 4–0–37–1, షనక 2–0–23–1, అసలంక 2–0–18–1. శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) వరుణ్ (బి) హర్షిత్ 107; కుశాల్ మెండిస్ (సి) గిల్ (బి) పాండ్యా 0; కుషాల్ పెరీరా (స్టంప్డ్) సామ్సన్ (బి) వరుణ్ 58; అసలంక (సి) గిల్ (బి) కుల్దీప్ 5; కమిందు (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 3; షనక (నాటౌట్) 22; లియనాగె (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1–7, 2–134, 3–157, 4–163, 5–191. బౌలింగ్: పాండ్యా 1–0–7–1, అర్ష్ దీప్ 4–0–46–1, హర్షిత్ 4–0–54–1, అక్షర్ 3–0–32–0, కుల్దీప్ 4–0–31–1, వరుణ్ 4–0–31–1. -
టీమిండియా అజేయంగా ముగించేనా? నేడు శ్రీలంకతో ‘సూపర్–4’ మ్యాచ్
దుబాయ్: ఆసియాకప్ టి20 టోర్నీ ‘సూపర్–4’ దశలో భాగంగా నేడు శ్రీలంకతో భారత జట్టు ఆడనుంది. ఈ టోర్నీ ఆరంభం నుంచి అజేయంగా సాగుతున్న టీమిండియా... గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో... ‘సూపర్–4’ దశ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఇప్పటికే ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ బృందం తుదిపోరుకు ముందు శ్రీలంకతో మ్యాచ్‌ను ప్రాక్టీస్‌గా వినియోగించుకోనుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత జట్టుకు గట్టి పోటీ ఎదురవలేదు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతుంటే ... బౌలింగ్‌లో కుల్దీప్, బుమ్రా రాణిస్తున్నారు. మిగిలిన వాళ్లు కూడా మంచి టచ్‌లో ఉండటంతో ప్రత్యర్థికి మరోసారి కష్టాలు తప్పకపోవచ్చు. గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన లంక... ‘సూపర్–4’ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఫైనల్‌కు దూరమైంది. రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
సూర్య... అలాంటి వ్యాఖ్యలొద్దు
దుబాయ్: ప్రస్తుతం ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లు ఏకపక్షంగా జరుగుతున్నాయి. కానీ ఆరోపణలు, ఫిర్యాదులే పోటాపోటీగా సాగుతున్నాయి. ‘షేక్‌హ్యాండ్’ తిరస్కరణపై సలసల ఉడికిపోతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇంకో అడుగు ముందుకేసి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఫిర్యాదు చేసింది. లీగ్ దశలో పాక్‌పై గెలుపు అనంతరం విజయాన్ని పహల్గాంలో ఊచకోతకు గురైన బాధితులకు అంకితమిస్తున్నట్లు సూర్య వ్యాఖ్యానించాడు. క్రీడల్లో రాజకీయ ప్రభావిత అంశాల ప్రస్తావనపై పీసీబీ ఫిర్యాదు చేసింది. దీన్ని విచారించిన మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడవద్దని భారత కెప్టెన్‌కు సూచించారు. అయితే బుధవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పాకిస్తాన్ క్రికెటర్లు హరిస్ రవూఫ్, సాహిబ్జాదా ఫర్హాన్‌లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ఇ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ నెల 21న సూపర్–4 దశలో జరిగిన మ్యాచ్ సందర్భంగా రవూఫ్ తన చేతులతో భారత యుద్ధ విమానాలు కూలినట్లుగా సంజ్ఞలు చేశాడు. అప్పుడే మైదానంలోని భారత అభిమానులు కోహ్లి... కోహ్లి... అంటూ బిగ్గరగా ఆరిచారు. 2022లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో రవూఫ్ బౌలింగ్‌ను చిత్తు చేస్తూ కోహ్లి మ్యాచ్ విన్నింగ్ సిక్స్‌లతో అలరించిన సందర్భాన్ని పాక్ బౌలర్‌కు గుర్తు చేశారు. ఓపెనర్ సాహిబ్జాదా తన అర్ధసెంచరీ పూర్తవగానే బ్యాట్‌ను గన్లా ఫైరింగ్ చేస్తూ రెచ్చగొట్టాడు. ఈ నేపథ్యంలోనే భారత బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై నేడు మ్యాచ్ రిఫరీ తన నిర్ణయాన్ని వెలువరించనున్నారు. -
పాక్ స్పిన్నర్ చిల్లర వేషాలు.. చావుదెబ్బ కొట్టిన హసరంగా
-
ఫైనల్లో భారత్
అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్... ఆపై పదునైన బౌలింగ్... వెరసి ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బ్యాటింగ్‌లో కాస్త తడబాటు కనిపించినా, చివరకు బంగ్లాదేశ్‌ను ఓడించడంలో టీమిండియా సఫలమైంది. టోర్నీలో వరుసగా ఐదో మ్యాచ్ గెలిచిన మన జట్టు దర్జాగా ఫైనల్లోకి ప్రవేశించింది. గత మ్యాచ్‌లో శ్రీలంకపై స్ఫూర్తిదాయ ఆటను కనబర్చిన బంగ్లాదేశ్ ఈసారి టీమిండియా ముందు నిలవలేకపోయింది. ఇక భారత్‌తో తుది పోరుతో అమీతుమీ తలపడే జట్టేదో నేడు తేలనుంది. విరామం లేకుండా వరుసగా రెండో రోజు ఆడనున్న బంగ్లాదేశ్... పాకిస్తాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో విజేతకు ఫైనల్ బెర్త్ ఖాయమవుతుంది. దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. ‘సూపర్–4’ దశలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) మరో మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగగా... హార్దిక్ పాండ్యా (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ హసన్ (51 బంతుల్లో 69; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. ఇద్దరు మినహా మిగతా బంగ్లా బ్యాటర్లంతా కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా... బుమ్రా, వరుణ్ చెరో 2 వికెట్లు తీశారు. మధ్య ఓవర్లలో తడబాటు... భారత ఇన్నింగ్స్ తొలి మూడు ఓవర్లలో ప్రశాంతత... ఒకే ఒక ఫోర్‌తో 17 పరుగులే వచ్చాయి! 7 పరుగుల వద్ద అభిషేక్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ జాకీర్ వదిలేయడం కూడా కలిసొచ్చిoది. అయితే పవర్‌ప్లేలో మిగిలిన 3 ఓవర్లలో అభిషేక్ విశ్వరూపం చూపించగా, గిల్ కూడా ధాటిని ప్రదర్శించాడు. నసమ్ వేసిన నాలుగో ఓవర్లో గిల్ వరుసగా 4, 6 కొట్టగా చివరి బంతిని అభిషేక్ సిక్స్ బాదాడు. ముస్తఫిజుర్ వేసిన ఐదో ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టిన అభిషేక్...సైఫుద్దీన్ వేసిన తర్వాతి ఓవర్లో 4 ఫోర్లు బాదాడు. ఈ మూడు ఓవర్లలో కలిపి 55 పరుగులు రావడంతో పవర్‌ప్లేలో స్కోరు 72 పరుగులకు చేరింది. అయితే పవర్‌ప్లే తర్వాత భారత్ అనూహ్యంగా తడబడింది. ఒక వైపు 25 బంతుల్లోనే అభిషేక్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... మరోవైపు ఆరు పరుగుల వ్యవధిలో గిల్, శివమ్ దూబే (2) అవుటయ్యారు. జోరు మీదున్న అభిషేక్ ఇన్నింగ్స్ కూడా దురదృష్టవశాత్తూ రనౌట్‌తో ముగిసింది. ముస్తఫిజుర్ వేసిన బంతిని సూర్యకుమార్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడగా... ఫీల్డర్ ఆపిన విషయాన్ని గుర్తించని అభిషేక్ చాలా ముందుకు దూసుకొచ్చాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసినా లాభం లేకపోగా, అదే ఓవర్లో సూర్య కూడా అవుటయ్యాడు. తిలక్ వర్మ (5) విఫలం కాగా, 22 బంతుల పాటు భారత్‌కు బౌండరీనే రాలేదు! ఈ దశలో పాండ్యా దూకుడు జట్టుకు కాస్త మెరుగైన స్కోరును అందించింది. అయితే చివరి 11 బంతుల్లో టీమిండియా ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. అక్షర్ (15 బంతుల్లో 10) బంతులు వృథా చేయగా... ప్రధాన బ్యాటర్ సంజు సామ్సన్‌కు ఆడే అవకాశమే ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. టపటపా... ఛేదనలో బంగ్లాదేశ్ దూకుడు ప్రదర్శించలేకపోయింది. సైఫ్ మినహా ఎవరూ ప్రభావం చూపలేదు. అక్కడక్కడ కొన్ని చక్కటి షాట్లు ఆడినా బ్యాటింగ్ బృందం సమష్టిగా విఫలమైంది. ఆరంభంలోనే తన్జీద్ (1) వెనుదిరగడంతో సైఫ్, పర్వేజ్ (21) కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 30 బంతుల్లో 42 పరుగులు జోడించారు. పవర్‌ప్లేలో జట్టు 44 పరుగులు చేసింది. అయితే కుల్దీప్ తన తొలి ఓవర్లోనే పర్వేజ్‌ను అవుట్ చేయడంతో పతనం మొదలైంది. ఆ తర్వాత బంగ్లా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 22 పరుగుల వ్యవధిలో ముగ్గురు ప్రధాన బ్యాటర్లు అవుట్ కావడంతో గెలుపుపై జట్టు ఆశలు కోల్పోయింది. మరో ఎండ్‌లో సైఫ్ పోరాడినా లాభం లేకపోయింది. 36 బంతుల్లో సైఫ్ అర్ధ సెంచరీని అందుకున్నాడు. బంగ్లా 18 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లు కోల్పోయింది.150 అంతర్జాతీయ టి20ల్లో ముస్తఫిజుర్ వికెట్ల సంఖ్య. బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షకీబ్ అల్ హసన్ (149)ను అతను అధిగమించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (రనౌట్) 75; గిల్ (సి) తన్జీద్ (బి) రిషాద్ 29; దూబే (సి) తౌహీద్ (బి) రిషాద్ 2; సూర్యకుమార్ (సి) జాకీర్ (బి) ముస్తఫిజుర్ 5; పాండ్యా (సి) తన్జీద్ (బి) సైఫుద్దీన్ 38; తిలక్ (సి) సైఫ్ (బి) తన్జీమ్ 5; అక్షర్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–77, 2–83, 3–112, 4–114, 5–129, 6–168. బౌలింగ్: తన్జీమ్ 4–0–29–1, నసుమ్ 4–0–34–0, ముస్తఫిజుర్ 4–0–33–1, సైఫుద్దీన్ 3–0–37–1, రిషాద్ 3–0–27–2, సైఫ్ 2–0–7–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: సైఫ్ హసన్ (సి) అక్షర్ (బి) బుమ్రా 69; తన్జీద్ (సి) దూబే (బి) బుమ్రా 1; పర్వేజ్ (సి) అభిషేక్ (బి) కుల్దీప్ 21; తౌహీద్ (సి) అభిషేక్ (బి) అక్షర్ 7; షమీమ్ (బి) వరుణ్ 0; జాకీర్ (రనౌట్) 4; సైఫుద్దీన్ (సి) తిలక్ (బి) వరుణ్ 4; రిషాద్ (సి) తిలక్ (బి) కుల్దీప్ 2; తన్జీమ్ (బి) కుల్దీప్ 0; నసుమ్ (నాటౌట్) 4; ముస్తఫిజుర్ (సి) అక్షర్ (బి) తిలక్ 6; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 127. వికెట్ల పతనం: 1–4, 2–46, 3–65, 4–74, 5–87, 6–109, 7–112, 8–112, 9–116, 10–127. బౌలింగ్: పాండ్యా 2–0–14–0, బుమ్రా 4–0–18–2, వరుణ్ 4–0–29–2, కుల్దీప్ 4–0–18–3, అక్షర్ 4–0–37–1, దూబే 1–0–10–0, తిలక్ 0.3–0–1–1. -
భారత్‌కు ఎదురుందా!
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు అలవోక విజయాలతో దూసుకెళుతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో సైతం ఎలాంటి పోటీ ఎదురవలేదు. లీగ్ దశ, సూపర్–4లోనూ పాక్‌పై టీమిండియా దాదాపు ఏకపక్ష విజయాల్నే సాధించింది. ఇపుడు బంగ్లాదేశ్ వంతు వచ్చింది. భారత్ ప్రస్తుతమున్న ఫామ్‌కు, జోరుకు బంగ్లాదేశ్ బ్రేక్ వేయడం అసాధ్యమనుకోవాలి. అయితే ఫలితాన్ని పక్కనబెట్టి పోటీ ఏమాత్రం ఇస్తుందనేదే వేచి చూడాలి. మరోవైపు ‘సూపర్–4’లో శ్రీలంకను ఓడించిన బంగ్లాదేశ్ కూడా రెట్టించిన ఉత్సాహంతో దుర్బేధ్యమైన భారత్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ‘సూపర్–4’లో బోణీ కొట్టిన ఇరు జట్ల మధ్య ఈ పోరు జరుగుతుండటంతో పైచేయి సాధించేందుకు భారత్ తహతహలాడుతోంది. ఆల్‌రౌండ్ సత్తాతో... బ్యాటింగ్, బౌలింగ్‌లో టీమిండియా ఆటగాళ్లకు ఎదురేలేదు. పాక్‌తో గత మ్యాచ్‌లో ఫీల్డింగ్ లోపాలు మినహా ఏ విభాగంలో మెరుగవ్వాల్సిన అవసరమైతే లేనేలేదు. బాల్య మిత్ర ద్వయం శుబ్‌మన్, అభిషేక్ శర్మలు అలవోకగా పరుగులు బాదేస్తున్నారు. సారథి సూర్యకుమార్, తిలక్ వర్మ, సంజూ సామ్సన్, హార్దిక్ పాండ్యాల నుంచి శివమ్ దూబే, ఎనిమిదో స్థానంలో అక్షర్ పటేల్ వరకు పరుగులు సాధించగలరు. ఇక బౌలింగ్‌లో భారత్ స్పిన్‌కు ప్రత్యర్థులే చిత్తవుతున్నారు. కుల్దీప్, వరుణ్, అక్షర్‌లతో పాటు పార్ట్ టైమ్ బౌలర్ దూబే కూడా ప్రత్యర్థి బ్యాటర్ల పనిపడుతున్నాడు. ఇలా అన్ని విభాగాల్లోనూ అగ్రశ్రేణిగా ఉన్న టీమిండియాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎదుర్కోవడం ముమ్మాటికి కష్టమనే చెప్పాలి. దీంతో ఈ టోర్నీలో భారత్‌కు వరుసగా ఐదో విజయం ఏమంత కష్టం కానేకాదు! సర్వశక్తులు ఒడ్డినా... టి20ల్లో అజేయమైన శక్తిగా ఎదిగిన భారత్‌ను ఓడించడం బంగ్లాదేశ్ లాంటి జట్లకైతే అసాధ్యం. సర్వశక్తులు ఒడ్డినా సరే పాక్ కంటే మెరుగైన పోటీ ఇవ్వగలదేమో కానీ గెలుపుపై మాత్రం ఆశలైతే పెట్టుకోలేదు. బ్యాటింగ్‌లో టాపార్డర్ బ్యాటర్లు సైఫ్ హసన్, తంజిద్ హసన్, కెప్టెన్ లిటన్ దాస్‌లు రాణిస్తున్నారు. తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకిర్ అలీలు మిడిలార్డర్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వగలరు. ఇక బౌలింగ్‌లో ముస్తఫిజుర్ కీలకం. మెహదీ హసన్, షోరిఫుల్ ఇస్లామ్, నసుమ్ అహ్మద్‌లు కూడా పిచ్ సహకరిస్తే ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలరు. 16 భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇప్పటివరకు 17 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు జరిగాయి. 16 మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా... ఒక్క మ్యాచ్‌లో మాత్రమే బంగ్లాదేశ్ నెగ్గింది. 2019లో ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై బంగ్లాదేశ్ ఏకైక విజయాన్ని అందుకుంది. -
ఆసియా కప్‌లో ‘6-0’ సంజ్ఞ వివాదం.. హారిస్ రవూస్పై పాక్ రక్షణ మంత్రి ప్రశంసలు
ఇస్లామాబాద్: ఆసియా కప్‌లో పాకిస్థాన్ పేసర్ హారిస్ రవూఫ్ ‘6-0’అని సంజ్ఞ చేయడం వివాదస్పదంగా మారింది. అయితే, హారిస్ రవూస్ అలా సంజ్ఞ చేయడాన్ని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సమర్ధించాడు. భారత్‌తో అలా వ్యవహరించడం సరైందేనంటూ ట్వీట్ చేశాడు. ‘హారిస్ రవూఫ్ వారితో సరిగ్గా వ్యవహరిస్తున్నావు. దీన్ని ఇలాగే కొనసాగించండి. భారత్ 6-0ని మరచిపోదు. ప్రపంచం కూడా గుర్తుంచుకుంటుంది’ అంటూ ట్వీట్ చేశారు.గత ఆదివారం జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ చెలరేగి బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఒకానొక సమయంలో భారత్ బ్యాట్స్‌మెన్ దెబ్బకు పాక్ పేసర్ హారిస్ రవూఫ్ సహనం కోల్పోయి.. ‘6-0’ సంకేతంతో విమానాలు కూలుతున్నట్లు సంజ్ఞ చేశాడు. ఈ సంకేతానికి కారణంగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా వారు భారత ఆరు ఫైటర్ జెట్లను కూల్చేశారట. కానీ, ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అంతర్జాతీయ వేదికలపై పాక్ పరువు పోగొట్టుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి.ఈ సంఘటనపై పాక్ కాలమిస్ట్ అయాబ్ అహ్మద్ చేసిన పోస్ట్‌ను ఖవాజా ఆసిఫ్ రీపోస్టు చేస్తూ కామెంట్స్ చేశారు. జెంటిల్మెన్ గేమ్ ఇలాంటి సంజ్ఞలు క్రీడా ఆచారాలకు విరుద్ధమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
వక్ర బుద్ధి మారదా..? మరో వివాదంలో ఆసియా కప్
-
టీమిండియాపై పాక్ ఇక మీదైనా గెలవాలంటే.. ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు
ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా చేతిలో పాకిస్థాన్ జట్టు రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి.. చావో రేవో అనే పరిస్థితికి చేరింది. ఈ ఓటములను పాక్ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ను తిట్టిపోస్తూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నారు. ఈ తరుణంలో పాక్ క్రికెట్ మాజీ దిగ్గజం, పాకిస్తాన్ తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (Pakistan Tehreek-e-Insaf) అధినేత ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.భారత్‌తో క్రికెట్ మ్యాచ్‌లో ఇకనైనా గెలవాలంటే.. ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్, పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ నక్వీ ఓపెనర్లుగా బ్యాటింగ్ చేయాలని, అంపైర్లుగా మాజీ చీఫ్ జస్టిస్ ఫయాజ్ ఈసా, ఎలక్షన్ కమిషనర్ రాజా ఉంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. అలాగే.. థర్డ్ ఎంపైర్‌గా ఇస్లామాబాద్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ సర్ఫరాజ్ డోగర్ ఉండాలని సూచించారు. పీసీబీ రాజకీయాల వల్లే పాక్ జట్టుకు ఈ పరిస్థితి వచ్చిందంటూ వెటకారంగా పై వ్యాఖ్యలు చేశారాయన. ఆసియా కప్‌లో భారత్ చేతిలో పాక్ జట్టు ఓటమిపై(Pak Lost To India) ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఇలాగైతే భారత్ చేతిలో ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటాం అంటూ వ్యాఖ్యానించారు. క్రికెట్లో ప్రణాళిక, నిబద్ధత లేకుండా గెలుపు ఊహించలేం అని అన్నారాయన. ఇష్టుల్ని సెలక్టర్లుగా పెట్టడం, గ్రూప్‌ల రాజకీయాలు, దేశవాళీ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేయడం.. కీలక స్థానాల్లో అర్హతలేని వారిని పెట్టడం వల్లే పతనం అయ్యిందనన్నారు. నఖ్వీ అసమర్థత, బంధుప్రీతి(నెపోటిజం) వల్లే పీసీబీకి ఈ దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. పీసీబీ రాజకీయాలకు పుల్‌స్టాప్ పడాలని, ఆటగాళ్లు తమ తలపొగరు తగ్గించుకోవాలని.. టాలెంట్ ఉన్న క్రీడాకారులను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని సూచించారు. పాక్ మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్(Ex PM Imran Khan) పలు కేసుల్లో అరెస్టై రావల్పిండి అడియాలా జైలులో ఉన్నారు. దీంతో ఇమ్రాన్ తరఫున ఆయన సోదరి అలీమా ఖాన్ సోమవారం ఈ ప్రకటన చేశారు. పీసీబీతో పాటు పాక్‌లో ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు అన్యాయంగా, పక్షపాతంగా పనిచేస్తున్నాయని ఆరోపిస్తున్నారాయన. పాక్ ఎన్నికల్లో పీటీఐ ఓడిపోలేదని.. ఆర్మీ చీఫ్ మునీర్ రాజకీయ నేతలతో చేతులు కలిపి మోసం చేశారని నిందిస్తున్నారాయన. పాక్ క్రికెట్‌ను మలుపు తిప్పిన ఆటగాడిగా ఇమ్రాన్ ఖాన్‌కు ఓ పేరుంది. ఆల్ రౌండర్ అయిన ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలోనే 1992లో పాకిస్తాన్ ప్రపంచ కప్ నెగ్గింది. 88 టెస్ట్ మ్యాచ్‌లు, 175 వన్డేలు ఆడిన ఆయన ఎన్నో విజయాలను అందించారు. తన సారథ్యంలోనే పాక్ జట్టును అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయికి తీసుకెళ్లారు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించి, కొత్త తరం క్రికెటర్లను పరిచయం చేశారు. ఈ సేవలకు గుర్తింపుగానే 2010లో ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం ఆయనకు దక్కింది. 1996లో పాకిస్తాన్ తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) పార్టీని స్థాపించి రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. 2018 సాధారణ ఎన్నికల్లో విజయంతో ప్రధానమంత్రి పదవి చేపట్టారు. అయితే.. 2022లో విశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయి.. పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2024 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో పీటీఐని పోటీ చేయకుండా అప్పటి కోర్టులు, ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. అయినప్పటికీ వాళ్లు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. అయితే కౌంటింగ్‌లో తొలి రౌండ్లలో వాళ్లు ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. ఆపై ఇంటర్నెట్, ఫోన్ సర్వీసులను ఆపేసి గందరగోళం సృష్టించి మరీ ఫలితాలు తారుమారు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో ఆ సమయంలో అంతర్జాతీయ సమాజం నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.ఇదీ చదవండి: పాక్‌కు డెడ్‌చీప్‌గా అప్పులు ఇస్తున్న దేశం ఏదో తెలుసా? -
మళ్లీ చితక్కొట్టి...
వారం రోజుల వ్యవధిలో వేదిక కూడా మారలేదు... భారత జట్టు మళ్లీ తమ స్థాయి ఏమిటో ప్రదర్శించింది... పాకిస్తాన్‌పై సంపూర్ణ ఆధిక్యం కనబరుస్తూ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది... ముందుగా చక్కటి బౌలింగ్‌తో సాధారణ స్కోరుకే పాక్‌ను పరిమితం చేసిన టీమిండియా... ఆ తర్వాత అలవోకగా గెలుపు తీరాన్ని చేరింది. అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్ భారత్ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈసారి ‘షేక్‌హ్యాండ్’పై చర్చ జరగాల్సిన అవసరమే రాకుండా తమ ఆటతోనే ప్రత్యర్థికి పదునుగా జవాబిచ్చింది. దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీ సూపర్–4 దశలో భారత్ శుభారంభం చేసింది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు) చెలరేగి భారత్ విజయాన్ని సులువు చేశారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 59 బంతుల్లోనే 105 పరుగులు జోడించడం విశేషం. సూపర్–4 దశలో తమ తర్వాతి మ్యాచ్‌లో బుధవారం బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. ఫర్హాన్ అర్ధ సెంచరీ... భారత్‌తో జరిగిన గత మ్యాచ్‌తో పోలిస్తే ఈసారి పాక్‌కు ఎంతో మెరుగైన ఆరంభం లభించింది. కానీ దానిని సది్వనియోగం చేసుకొని భారీ స్కోరు సాధించడంలో జట్టు విఫలమైంది. బుమ్రా ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన ఫఖర్ జమాన్ (15) ఎక్కువ సేపు నిలవకపోయినా, మరో ఓపెనర్ ఫర్హాన్ చక్కటి షాట్లు ఆడాడు. బుమ్రా వరుస రెండు ఓవర్లలో ఫర్హాన్ రెండేసి ఫోర్లు కొట్టడం విశేషం. పవర్‌ప్లేలో జట్టు 55 పరుగులు సాధించింది. ఆ తర్వాతా ధాటిని కొనసాగిస్తూ పాక్ బ్యాటర్లు ఒకదశలో 13 బంతుల వ్యవధిలో 4 సిక్సర్లు బాదారు. 10.2 ఓవర్లలో 93/1 స్కోరుతో పాక్ పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే సయీమ్ అయూబ్ (21) అవుటయ్యాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. భారత బౌలర్లు పట్టు బిగించడంతో పరుగులు చేయడానికి బ్యాటర్లు తీవ్రంగా శ్రమించారు. వరుసగా 33 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు! ఐదు పరుగుల వ్యవధిలో హుస్సేన్ తలత్ (10), ఫర్హాన్ అవుట్ కాగా, మొహమ్మద్ నవాజ్ (19 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్)లో దూకుడు లోపించింది. 7–16 మధ్య 10 ఓవర్లలో పాక్ 3 వికెట్లు కోల్పోయి 66 పరుగులే చేసింది. అయితే చివరి 4 ఓవర్లలో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 పరుగులు సాధించి గౌరవప్రదంగా ముగించింది. ఫహీమ్ అష్రఫ్ (8 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించాడు. మెరుపు బ్యాటింగ్... ఛేదనలో భారత ఓపెనర్లు అభిషేక్, గిల్ ఒకరితో మరొకరు పోటీ పడుతూ చెలరేగిపోయారు. తొలి బంతికే సిక్సర్‌తో అభిషేక్ జోరు మొదలు పెట్టగా, తర్వాతి రెండు ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టి గిల్ తానేంటో చూపించాడు. అయూబ్ ఓవర్లో మరో మూడు ఫోర్లు వచ్చాయి. వీరిద్దరి దూకుడుతో భారత్ పవర్‌ప్లేలో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69 పరుగులు రాబట్టింది. అబ్రార్ ఓవర్లో 2 సిక్స్‌లు బాదిన అభిషేక్ 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఎట్టకేలకు భారీ భాగస్వామ్యం తర్వాత 18 పరుగుల వ్యవధిలో గిల్, సూర్యకుమార్ (0), అభిషేక్ వెనుదిరిగారు. సామ్సన్ (13) కూడా తొందరగానే అవుటైనా... తిలక్ వర్మ (19 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా (7 నాటౌట్) కలిసి మ్యాచ్‌ను ముగించారు.గత మ్యాచ్ తరహాలోనే ఈ సారి కూడా ఇరు జట్ల కెప్టెన్లు టాస్ సమయంలో కరచాలనం చేసుకోలేదు. తమ టీమ్ షీట్లను కూడా ఇద్దరూ రిఫరీ పైక్రాఫ్ట్కే అందించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఎలాంటి ‘షేక్ హ్యాండ్’లు లేకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. నాలుగు క్యాచ్‌లు నేలపాలు... భారత్ పేలవ ఫీల్డింగ్ కూడా పాక్ ఈ స్కోరు చేయడానికి కారణమైంది. అనూహ్యంగా మన ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేశారు. వీటిలో మూడు అతి సులువైనవి కాగా, ఒకటి కాస్త కష్టసాధ్యమైంది. అభిషేక్ శర్మ రెండు క్యాచ్‌లు (ఫర్హాన్ 0, 32 వద్ద), కుల్దీప్ (అయూబ్ 4 వద్ద), గిల్ (ఫహీమ్ 6 వద్ద) వదిలేయడం చూసి ఫీల్డింగ్ కోచ్ దిలీప్ తలపట్టుకున్నాడు! పాకిస్తాన్ మారదు! గత మ్యాచ్‌లో భారత జట్టు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంతో పాటు యుద్ధం, సైనికుల ప్రస్తావన తీసుకొచ్చి క్రీడలతో రాజకీయాలు చేసిందని పాక్ వైపు నుంచి విమర్శలు వచ్చాయి. అయితే తాము మాత్రం అలాంటి రెచ్చగొట్టే పనులు, సైగలను తగ్గించుకోమని వారు చూపించారు. 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఫర్హాన్ బ్యాట్‌ను ఏకే–47 గన్ తరహాలో ఎక్కు పెట్టి పేలుస్తున్నట్లుగా సంబరాలు చేసుకున్నాడు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ సైగ వారి ఆలోచనాధోరణిని చూపించింది. స్కోరు వివరాలుపాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫర్హాన్ (సి) సూర్యకుమార్ (బి) దూబే 58; ఫఖర్ (సి) సామ్సన్ (బి) పాండ్యా 15; అయూబ్ (సి) అభిషేక్ (బి) దూబే 21; హుస్సేన్ (సి) వరుణ్ (బి) కుల్దీప్ 10; నవాజ్ (రనౌట్) 21; సల్మాన్ (నాటౌట్) 17; ఫహీమ్ (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–21, 2–93, 3–110, 4–115, 5–149. బౌలింగ్: పాండ్యా 3–0–29–1, బుమ్రా 4–0–45–0, వరుణ్ చక్రవర్తి 4–0–25–0, కుల్దీప్ యాదవ్ 4–0–31–1, అక్షర్ 1–0–8–0, శివమ్ దూబే 4–0–33–2. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) రవూఫ్ (బి) అబ్రార్ 74; గిల్ (బి) ఫహీమ్ 47; సూర్యకుమార్ (సి) అబ్రార్ (బి) రవూఫ్ 0; తిలక్ (నాటౌట్) 30; సామ్సన్ (బి) రవూఫ్ 13; పాండ్యా (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–105, 2–106, 3–123, 4–148. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 3.5–0–40–0, అయూబ్ 3–0–35–0, అబ్రార్ 4–0–42–1, రవూఫ్ 4–0–26–2, ఫహీమ్ 4–0–31–1. -
44 ఏళ్ల వయసులో సత్తా చాటి...
అబుదాబీ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఒమన్ బ్యాటర్ ఆమిర్ కలీమ్ భారత్‌పై అర్ధ సెంచరీ చేశాడు. ఈ ఫిఫ్టీ పూర్తవడంతోనే అదేదో సెంచరీ లేదంటే డబుల్ సెంచరీ చేసినంతగా సంబరాలు చేసుకున్నాడు. డగౌట్లో ఉన్న సహచరులు కూడా అతనికి చప్పట్లతో జేజేలు పలికారు. ఇది మనకు ‘ఓవరాక్షన్’లా కనిపించింది. చేసిన అర్ధ శతకానికే ఏంటీ సంబరాలు అనిపించింది. కానీ అసలు సంగతి మరొకటి ఉంది. ఎందుకంటే అతనేమీ టి20లు ఆడే రెగ్యులర్ యువ క్రికెటర్ కాదు. 44 ఏళ్ల వెటరన్! అంతేకాదు. ఓ రిటైర్డ్ క్రికెటర్ కూడా! ఆట వదిలేసి కోచింగ్ బాట పట్టిన కలీమ్ తిరిగొచ్చి యువకుడిలా చెలరేగడమే గొప్ప విశేషం. ఈ విశేషం తాలుకూ సంబరాలే ఆ చిందులు! కోచింగ్‌లో టైటిల్ కొన్ని నెలల క్రితం థాయ్‌లాండ్‌లో జరిగిన అండర్–19 ప్రపంచకప్ డివిజన్–2 ఆసియా క్వాలిఫయర్స్‌లో ఒమన్ యువజట్టు టైటిల్ గెలిచింది. ఈ జట్టును తీర్చిదిద్దింది మరెవరో కాదు... ఆమిర్ కలీమ్. అలా కోచ్‌గా సక్సెస్ అయ్యాడు. కానీ అతని జాతీయ క్రికెట్లో సంక్షోభం తలెత్తింది. ఏకంగా 11 మంది ఒమన్ ఆటగాళ్లు మస్కట్‌లో ఎమర్జింగ్ ఆసియా కప్‌కు ముందు వైదొలిగారు. అమెరికా, కరీబియన్లలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో పాల్గొన్న తమకు బోర్డు ప్రైజ్‌మనీ ఇవ్వకపోవడంతో కెప్టెన్ అఖిబ్ ఇలియాస్, మాజీ కెప్టెన్ జీషాన్ మక్సూద్ సహా 11 మంది ఒమన్‌కు ఆడేందుకు ససేమిరా అన్నారు. దీంతో ఒమన్ క్రికెట్ బోర్డు తమ మాజీ క్రికెటర్, ప్రస్తుత అండర్–19 జట్టుకు కోచ్ అయిన ఆమిర్ కలీమ్‌ను ఆడేందుకు పిలిచింది. దీంతో అతను రిటైర్మెంట్ను పక్కనబెట్టి ఆడేందుకు సై అన్నాడు. భారత్‌పై మెరుపు ఫిఫ్టీ అలా ఒమన్ క్రికెట్ జట్టును సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు వచి్చన కలీమ్ వయసు సహకరించకపోయినా... క్రికెట్‌పై అంకితభావంతో ఆటగాడిగా మళ్లీ మైదానంలో చెమటోడ్చాడు. అబుదాబీలోని జాయెద్ క్రికెట్ స్టేడియంలో పటిష్టమైన భారత బౌలింగ్‌ను ఎదుర్కొన్న తీరు ఆకట్టుకుంది. ఈ వెటరన్ క్రికెటర్ తమ కెప్టెన్ జతిందర్ సింగ్‌తో ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేశాడు. భారత బౌలర్లపై దూకుడుగా ఆడి బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. ఇటీవల కోచ్‌గా మార్గదర్శనం చేసిన చేతులతోనే తాజాగా సెంచరీ చేసిన ఆనందం కట్టలు తెగడంతో అంతగా సంబరాల్లో మునిగితేలాడు. ఓపెనర్‌గా వచ్చిన కలీమ్ 18వ ఓవర్‌గా నిలబడటం గొప్ప విశేషం. అంతేకాదు భారత శిబిరాన్ని కూడా తన మెరుపు బ్యాటింగ్‌తో కాసేపు వణికించాడు. ఉద్యోగం కోసం కరాచీ నుంచి... పాకిస్తాన్‌కు చెందిన కలీమ్‌కు క్రికెట్ అంటే ఇష్టం. కానీ ఉపాధి కోసం పొట్టచేతపట్టుకొని కరాచీ నుంచి 2004లో ఒమన్ బాటపట్టాడు. అక్కడ డెలివరీ సెక్షన్లో లోడింగ్, అన్లోడింగ్ చేసే హమాలీగా పనిచేశాడు. వేడి వాతావరణ పరిస్థితుల మధ్య చెమట చిందించిన కలీమ్ తర్వాత రెస్టారెంట్లో పనికి కుదిరాడు. భారత సంతతికి చెందిన రెస్టారెంట్ యజమాని కెకె మోహన్‌దాస్‌కు క్రికెట్ అంటే పిచ్చి అభిమానం. స్థానికంగా ఓ క్రికెట్ క్లబ్‌ను ఆయన నడిపిస్తున్నాడు. ఇది తెలుసుకున్న కలీమ్ తన క్రికెట్ జిజ్ఞాసను యజమానికి వివరించాడు. ఓ అవకాశం ఇవ్వాలని అభ్యర్థించాడు. అతని ఉత్సాహాన్ని గమనించిన మోహన్‌దాస్ కొత్త కిట్ కొనిచ్చి ప్రోత్సహించాడు. అలా భారత సంతతి యజమాని ప్రోత్బలంతో ఆమిర్ కలీమ్ 2012లో ఒమన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ప్రస్తుత కెప్టెన్ జతిందర్ సింగ్‌తో కలిసి 13 ఏళ్ల పాటు ఒమన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇద్దరు కూడా ఓ పూట జాబ్ చేసుకుంటూనే క్రికెట్‌ను కొనసాగించారు. ఇన్నేళ్లుగా రాని గుర్తింపు ఈ ఒక్క మ్యాచ్ (భారత్)తో కలీమ్‌కు వచ్చింది. – సాక్షి క్రీడా విభాగం -
‘నో షేక్ హ్యాండ్’ తర్వాత మరో సమరం
దుబాయ్: ఆసియా కప్‌లో సరిగ్గా వారం రోజుల తర్వాత మళ్లీ భారత్, పాకిస్తాన్ మధ్య మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టోర్నీ సూపర్–4 దశలో భాగంగా జరిగే పోరులో ఇరు జట్లు మళ్లీ తలపడుతున్నాయి. ఏకపక్షంగా సాగిన గత మ్యాచ్‌లో భారత్ అలవోక విజయం సాధించి తమ స్థాయిని ప్రదర్శించింది. అయితే ఓటమి అనంతరం పాక్ క్రికెటర్లతో మన ఆటగాళ్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చేందుకు నిరాకరించడం, తదనంతర పరిణామాల్లో పాక్ తీవ్ర అసంతృప్తి ప్రదర్శించి వివాదానికి దారి తీయడం జరిగాయి. ఈ నేపథ్యంలో దాయాది జట్ల పోరు సహజంగానే ఆసక్తిని రేపుతోంది. లీగ్ దశలో పాక్ ఆటతీరు చూస్తే టీమిండియాకు మళ్లీ ఎదురు ఉండకపోవచ్చు. దుబాయ్‌లో రికార్డు, పరిస్థితి బట్టి చూస్తే టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. మరో వైపు పాక్ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఐసీసీ ఈ మ్యాచ్‌కు కూడా ఆండీ పైక్రాఫ్ట్‌నే రిఫరీగా ఎంపిక చేయడం విశేషం. అక్షర్ దూరం! ఒమన్‌తో మ్యాచ్‌లో భారత్ ఇద్దరు కీలక ఆటగాళ్లు బుమ్రా, వరుణ్ చక్రవర్తిలకు విశ్రాంతినిచ్చింది. వీరిద్దరు పాక్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి రావడం ఖాయం. అయితే ఫీల్డింగ్ చేస్తూ తలకు దెబ్బ తగిలిన అక్షర్ పటేల్ ఆడటం సందేహంగానే ఉంది. కాబట్టి అర్ష్ దీప్, హర్షిత్ రాణాలలో ఒకరు తమ స్థానాన్ని నిలబెట్టుకోవచ్చు. మిగతా తుది జట్టు కూర్పులో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అభిషేక్ శర్మ దూకుడును నిలువరించడం పాక్‌కు కష్టం కావచ్చు. అయితే వైస్ కెప్టెన్ శుబ్‌మన్ వరుస వైఫల్యం ఒక్కటే జట్టులో ఆందోళన కలిగించే అంశం. మూడు మ్యాచుల్లోనూ అతను విఫలమయ్యాడు. గత మ్యాచ్‌లో పరిస్థితిని బట్టి నెమ్మదిగా ఆడినా...సత్తా చాటే స్థాయి సామ్సన్‌కు ఉంది. సూర్యకుమార్, పాండ్యా, దూబే, తిలక్ వర్మ బ్యాటింగ్ పదును కలిసొస్తే టీమిండియాకు ఎదురుండదు. బుమ్రా, కుల్దీప్, వరుణ్‌లు ప్రత్యర్థిని కుప్పకూల్చగల సమర్థులు. గెలిపించేదెవరు! బలహీన జట్లపై కూడా వంద పరుగులు దాటేందుకు పాకిస్తాన్ తిప్పలు పడుతోంది. ఇలాంటి స్థితిలో భారత్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్నా... అది అంత సులువు కాదు. ప్రధాన బ్యాటర్ అయిన అయూబ్ మూడు మ్యాచ్‌లలో డకౌట్ కాగా, ఒక్కరు కూడా దూకుడుగా ఆడలేకపోతున్నారు. అసలు ఏ బ్యాటర్ నుంచి కూడా టి20 తరహా మెరుపులు రావడం లేదు. ఫర్హాన్, హసన్, హారిస్ ప్రభావం చూపకపోగా, కెప్టెన్ సల్మాన్ ఆగాలో కూడా అలాంటి ధాటి లేదు. బౌలింగ్‌లో షాహిన్ అఫ్రిది మాత్రమే కాస్త ఫర్వాలేదనిపిస్తుండగా... మిగతా బౌలర్లలో ఎలాంటి పదును లేదు. రవూఫ్, అబ్రార్‌లను భారత్ సునాయాసంగా ఎదుర్కోగలదు. ఈ స్థితిలో పాక్ ఎలా కోలుకుంటుందో చూడాలి. -
భారత్ అజేయంగా...
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో లీగ్ దశను భారత్ అజేయంగా ముగించింది. అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి తమతో తలపడిన చిన్న జట్టు ఒమన్‌పై సునాయాస విజయాన్ని అందుకుంది. బ్యాటర్ల పట్టుదలతో ఒమన్ కొంత పోరాడగలిగినా... టీమిండియా ముందు అది సరిపోలేదు. శుక్రవారం జరిగిన ఈ గ్రూప్ ‘ఎ’ పోరులో భారత్ 21 పరుగులతో గెలుపొందింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (45 బంతుల్లో 56; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... అభిషేక్ శర్మ (15 బంతుల్లో 38; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (18 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ఒమన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆమిర్ కలీమ్ (46 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), హమ్మద్ మీర్జా (33 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. టోర్నీలో నేటి నుంచి సూపర్–4 దశ పోటీలు ప్రారంభం అవుతున్నాయి. తొలి పోరులో శ్రీలంకతో బంగ్లాదేశ్ తలపడనుండగా ... ఆదివారం పాకిస్తాన్‌ను భారత్ ఎదుర్కొంటుంది. రాణించిన అభిషేక్, తిలక్... శుబ్‌మన్ గిల్ (5) త్వరగానే వెనుదిరిగినా... అభిషేక్ మరోసారి తనదైన రీతిలో దూకుడుగా ఆడుతూ శుభారంభం అందించాడు. షకీల్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను నదీమ్ ఓవర్లో మరో మూడు ఫోర్లు బాదాడు. సామ్సన్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లేలో భారత్ 60 పరుగులు చేసింది. అయితే రామనంది వేసిన ఓవర్లో ముందు అభిషేక్ అవుట్ కాగా... రెండు బంతుల తర్వాత దురదృష్టవశాత్తూ హార్దిక్ పాండ్యా (1) రనౌటయ్యాడు.సామ్సన్ కొట్టిన షాట్‌కు బంతి బౌలర్ చేతికి తాకుతూ స్టంప్స్‌ను పడగొట్టడంతో పాండ్యా వెనుదిరగాల్సి వచ్చింది. ఒకదశలో నాలుగు బంతుల వ్యవధిలో 2 ఫోర్లు, సిక్స్ బాదిన అక్షర్‌ను వెంటనే వెనక్కి పంపడంతో ఒమన్సఫలమైంది. శివమ్ దూబే (5) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోగా, తన సహజశైలికి భిన్నంగా ఆడిన సామ్సన్ 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.మరో వైపు క్రీజ్‌లో ఉన్నంత సేపు తిలక్ ధాటిని ప్రదర్శించాడు. అయితే వరుసగా వికెట్లు పడుతూ ప్రధాన బ్యాటర్లంతా వెనుదిరిగినా కూడా ఇతరులకు అవకాశం ఇచ్చేందుకు కెప్టెన్ సూర్యకుమార్ మాత్రం చివరి వరకు బ్యాటింగ్‌కు రాలేదు! కలీమ్, మీర్జా అర్ధసెంచరీలు... భారీ లక్ష్య ఛేదనలో ఒమన్‌కు సరైన ఆరంభం దక్కింది. ఓపెనర్లు జతీందర్, కలీమ్ జాగ్రత్తగా ఆడి తొలి 6 ఓవర్లలో 44 పరుగులు రాబట్టారు. ఎట్టకేలకు తొలి వికెట్‌కు 52 బంతుల్లో 56 పరుగుల భాగస్వామ్యం తర్వాత కుల్దీప్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కూడా భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంలో ఒమన్ సఫలమైంది. ఈ క్రమంలో 38 బంతుల్లో కలీమ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఒమన్ బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడారు. కలీమ్‌కు తోడు మీర్జా కూడా ధాటిని ప్రదర్శించాడు. 55 బంతుల్లోనే వీరిద్దరు 93 పరుగులు జత చేయడం విశేషం. 30 బంతుల్లో మీర్జా అర్ధ సెంచరీ సాధించగా... ఆ తర్వాత చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోయి ఒత్తిడిలో ఒమన్ ఓటమి దిశగా పయనించింది.1 అంతర్జాతీయ టి20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అర్ష్ దీప్ సింగ్ గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు అంతర్జాతీయ టి20 క్రికెట్లో 25 మంది బౌలర్లు 100 వికెట్ల మైలురాయిని దాటారు. ఈ జాబితాలో రషీద్ ఖాన్ (173 వికెట్లు) ‘టాప్’లో ఉన్నాడు. స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) శుక్లా (బి) రామనంది 38; గిల్ (బి) ఫైసల్ 5; సామ్సన్ (సి) బిష్త్ (బి) ఫైసల్ 56; పాండ్యా (రనౌట్) 1; అక్షర్ (సి) శుక్లా (బి) కలీమ్ 26; దూబే (సి) జతీందర్ (బి) కలీమ్ 5; తిలక్ (సి) జిక్రియా (బి) రామనంది 29; హర్షిత్ (నాటౌట్) 13; అర్ష్ దీప్ (రనౌట్) 1; కుల్దీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–6, 2–72, 3–73, 4–118, 5–130, 6–171, 7–176, 8–179. బౌలింగ్: షకీల్ 3–0–33–0, ఫైసల్ 4–1–23–2, నదీమ్ 1–0–19–0, రామనంది 4–0–32–2, శ్రీవాస్తవ 2–0–23–0, జిక్రియా 3–0–23–0, కలీమ్ 3–0–31–2. ఒమన్ ఇన్నింగ్స్: జతీందర్ (బి) కుల్దీప్ 32; కలీమ్ (సి) పాండ్యా (బి) హర్షిత్ 64; హమ్మద్ (సి) (సబ్) రింకూ (బి) పాండ్యా 51; జిక్రియా (నాటౌట్) 0; శుక్లా (సి) (సబ్) రింకూ (బి) అర్ష్ దీప్ 1; రామనంది (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–56, 2–149, 3–154, 4–155. బౌలింగ్: పాండ్యా 4–0–26–1, అర్ష్ దీప్ 4–0–37–1, హర్షిత్ 3–0–25–1, కుల్దీప్ 3–0–23–1, అక్షర్ 1–0–4–0, దూబే 3–0 –31–0, తిలక్ 1–0–8–0, అభిషేక్ 1–0–12–0. -
మరో ‘ప్రాక్టీస్’ మ్యాచ్!
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో వరుసగా రెండు విజయాలతో తమ స్థాయిని ప్రదర్శిస్తూ అలవోకగా ‘సూపర్–4’ దశకు అర్హత సాధించిన భారత జట్టు తమ సాధనకు పదును పెడుతోంది. ఈ క్రమంలో గ్రూప్ ‘ఎ’లో నేడు జరిగే నామమాత్రపు చివరి లీగ్ మ్యాచ్‌లో ఒమన్‌తో ఆడనుంది. తొలి మ్యాచ్‌లో యూఏఈని 57కు ఆలౌట్ చేసిన టీమిండియా... రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 130 పరుగులకే పరిమితం చేసింది. ఏకపక్షంగా సాధించిన ఈ విజయాల కారణంగా మన బ్యాటర్లందరికీ బరిలోకి దిగే అవకాశమే పెద్దగా రాలేదు. ఈ రెండు మ్యాచ్‌లు కలిపి అభిõÙక్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే మాత్రమే బ్యాటింగ్ చేయగలిగారు. సామ్సన్, హార్దిక్ పాండ్యాలకు ఏమాత్రం బ్యాటింగ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది. దాంతో ఒమన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిస్తే జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. అదే జరిగితే మన దుర్బేధ్యమైన టీమ్‌ను నిలువరించడం ఒమన్‌కు సాధ్యం కాదు. భారత బౌలింగ్ కూడా చాలా పటిష్టంగా ఉంది.అయితే అందరూ ‘సూపర్–4’కు ముందు తగిన ప్రాక్టీస్‌ను ఆశిస్తున్నారు. ఈ టోర్నీలో ఏకైక మ్యాచ్‌లో అబుదాబిలో ఆడుతున్న సూర్యకుమార్ బృందం... ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో సాధన చేసే అవకాశం లేదు. అందుకే ఈ మ్యాచ్ జట్టుకు కావాల్సిన ప్రాక్టీస్‌ను అందించవచ్చు. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్మెంట్ తుది జట్టులో ఏమైనా మార్పులు చేస్తుందేమో చూడాలి. చిన్న జట్టు కాబట్టి బుమ్రాకు విశ్రాంతినిచ్చి అర్ష్ దీప్ సింగ్ లేదా హర్షిత్ రాణాలలో ఒకరిని ఆడించే అవకాశం కూడా ఉంది. మరోవైపు తొలిసారి ఆసియా కప్‌లో ఆడుతున్న ఒమన్ నుంచి ఆశించేదేమీ లేదు. పాకిస్తాన్, యూఏఈలతో ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా జట్టు బ్యాటింగ్ కుప్పకూలింది. చెప్పుకోదగ్గ ఆటగాళ్లు కూడా ఒక్కరూ లేరు. -
‘సూపర్–4’కు పాకిస్తాన్
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో రెండో విజయంతో పాకిస్తాన్ ‘సూపర్–4’ దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాక్ 41 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ (36 బంతుల్లో 50; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఇతర ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. సయీమ్ అయూబ్ (0) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ డకౌటై అంతర్జాతీయ టి20ల్లో ఈ చెత్త రికార్డును నెలకొల్పిన మూడో పాకిస్తానీ ఆటగాడిగా నిలిచాడు. ఫర్హాన్ (5), కెపె్టన్ సల్మాన్ ఆగా (27 బంతుల్లో 20), హసన్ (3), ఖుష్దిల్ (4), హారిస్ (18) ప్రభావం చూపలేకపోయారు. చివర్లో షాహిన్ అఫ్రిది (14 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో పాక్ మెరుగైన స్కోరు సాధించింది. యూఏఈ బౌలర్లలో జునేద్ సిద్దిఖీ 4 వికెట్లు పడగొట్టగా, సిమ్రన్‌జీత్ సింగ్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం యూఏఈ 17.4 105 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ చోప్రా (35 బంతుల్లో 35; 1 ఫోర్, 1 సిక్స్) రాణించగా, ధ్రువ్ పరాశర్ (20) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, రవూఫ్, అబ్రార్ అహ్మద్ రెండు వికెట్లు చొప్పున తీశారు. నేడు జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌తో శ్రీలంక తలపడుతుంది. -
Asia Cup: గట్టెక్కిన బంగ్లాదేశ్
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో బంగ్లాదేశ్ కీలక విజయాన్ని అందుకుంది. ‘సూపర్–4’ రేసులో తమకు పోటీగా వచ్చే అవకాశం ఉన్న అఫ్గానిస్తాన్‌పై పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో బంగ్లా 8 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌ను ఓడించింది. ముందుగా బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్ తన్జీద్ హసన్ (31 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తన్జీద్, మరో ఓపెనర్ సైఫ్ హసన్ (28 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి తొలి వికెట్‌కు 40 బంతుల్లో 63 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత అఫ్గాన్ స్పిన్నర్లు నూర్ అహ్మద్ (2/23), రషీద్ ఖాన్ (2/26) బంగ్లా బ్యాటర్లను కట్టి పడేసి తొలి నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ దశలో తౌహీద్ హృదయ్ (20 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కొంత పోరాడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. గుర్బాజ్ (31 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఒమర్జాయ్ (16 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా...ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. చివర్లో రషీద్ ఖాన్ (11 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) గెలిపించేందుకు ప్రయత్నించినా ... 11 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన దశలో అతను అవుట్ కావడంతో అఫ్గాన్ ఓటమి ఖాయమైంది. ముస్తఫిజుర్ రహమాన్ 3 వికెట్లు పడగొట్టగా... నసుమ్ అహ్మద్, రిషాద్ హుస్సేన్ చెరో 2 వికెట్లు తీశారు. నేడు జరిగే మ్యాచ్‌లో యూఏఈతో పాకిస్తాన్ ఆడుతుంది. -
రాహుల్ గాంధీపై షాషిద్ అఫ్రిది ప్రశంసలు
ఇస్లామాబాద్: పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్‌గాంధీ తన చర్చల ద్వారా అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్లు మాత్రం (బీజేపీని ఉద్దేశిస్తూ).. మరో ఇజ్రాయెల్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉన్న ఒక్క ఇజ్రాయెల్ సరిపోదా? అని దుయ్యబట్టారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆసియాకప్‌లో భారత్-పాక్‌లు తలపడ్డాయి. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేశారు. దీంతో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించారని వారిపై తగు చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు పాక్ ప్రస్తుత ఆటగాళ్లు,మాజీ ఆటగాళ్లు భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ క్రమంలో పాకిస్తాన్ మీడియా సంస్థ సామ్మాటీవీ ఆసియాకప్‌పై నిర్వహించిన ప్యానల్ డిస్కషన్లో షాహిద్ అఫ్రిది పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మాత్రం పాజిటివ్ మైండ్‌సెట్ కలిగిన నాయకుడు. సమస్యల పరిష్కారం కోసం సంభాషణే మార్గమని ఆయన నమ్ముతారు. కానీ బీజేపీ మాత్రం ఘర్షణ, విభజన వైపు మొగ్గుచూపుతుంది. ఇప్పటికే ప్రపంచంలో ఒక ఇజ్రాయెల్ ఉంది. అది మత, భూభాగ, రాజకీయ వివాదాలతో నిండిన దేశం. మరొక ఇజ్రాయెల్‌ను సృష్టించాలన్నదే మీ ఉద్దేశమా? అని ప్రశ్నిస్తూ ఒక ఇజ్రాయెల్ చాలదా? ఇంకొకటి కావాలా?’ అంటూ షాహిద్ అఫ్రిది వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను అస్త్రంగా పలువురు బీజేపీ నేతలు రాహుల్‌గాంధీపై దుమ్మెత్తిపోస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి.. ఎక్స్ వేదికగా.. రాహుల్ గాంధీకి ఇప్పుడు కొత్త ఫ్యాన్‌బాయ్ దొరికాడు. అవమానానికి గురైన పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ! అంటూ పేర్కొన్నారు. మరో బీజేపీ నేత షెహ్జాద్ పూనావాలా కూడా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. భారత్‌ను ద్వేషించే ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ. కాంగ్రెస్‌లో మిత్రులను కనుగొంటారు. జార్జ్ సోరస్ నుంచి షాహిద్ అఫ్రిదీ వరకు... ఐఎస్సీ అంటే ‘ఇస్లామాబాద్ నేషనల్ కాంగ్రెస్’ అని దుయ్యబట్టారు. 🚨This is Fear From Indian Army & Leadership.Operation Sindoor they will never forget. pic.twitter.com/p77IwsCSiz— Lt Colonel Vikas Gurjar 🇮🇳 (@Ltcolonelvikas) September 16, 2025 -
జిత్తులమారి పాక్... దొంగ ఏడుపులు
-
తగిన శాస్త్రి జరిగింది! పాక్ సీట్ చింపిన భారత్
-
‘షేక్ హ్యాండ్’ లేదు!
సాధారణంగా టాస్ వేసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు చేతులు కలపడం ఆనవాయితీ. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కానీ, ఒక చిరునవ్వు కానీ వివాదానికి, అనవసరపు చర్చకు దారి తీసే అవకాశం ఉంది. అందుకే కావచ్చు అటు సూర్యకుమార్ యాదవ్ గానీ ఇటు సల్మాన్ ఆగా కానీ అందుకు సాహసించలేదు. ‘షేక్ హ్యాండ్’ ఇవ్వకుండా, కనీసం ఒకరివైపు మరొకరు చూడకుండా ఇద్దరూ చెరో వైపునకు వెళ్లిపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోకుండా వెళ్లిపోయారు. టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన కెప్టెన్ల సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడు, పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీకి సూర్యకుమార్ షేక్ హ్యాండ్ ఇవ్వడం మన అభిమానులకు అసంతృప్తిని కలిగించింది. ఆ ఒక్క విజువల్‌ను మళ్లీ మళ్లీ చూపిస్తూ సోషల్ మీడియాలో అంతా సూర్యను, బీసీసీఐని ఆడుకున్నారు. దాంతో ఈసారి అతను కూడా జాగ్రత్త పడ్డాడు! -
అసలు సమరానికి సమయం
సరిహద్దు ఉద్రిక్తతలు, విభేదాలు, వివాదాలు, విమర్శలు ఎన్ని ఉన్నా క్రికెట్ మైదానానికి వచ్చే సరికి ఈ మ్యాచ్ ఫలితంపై అందరి దృష్టీ పడుతుంది... బలాబలాల మధ్య ఆకాశమంత అంతరం ఉన్నా ఆసక్తి విషయంలో ఎక్కడా లోటుండదు. ఆటగాళ్లు మారినా, వేదికలు మారినా అభిమానుల్లో ఈ పోరు కొత్త ఉత్సాహాన్ని రేపుతుంది.దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్‌లో జరిగే మ్యాచ్‌లో నేడు తలపడనున్నాయి. పహల్గావ్ ఘటనను దృష్టిలో ఉంచుకొని మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ ఎన్నో వైపులనుంచి పిలుపులు వచ్చినా క్రికెటర్లు, నిర్వాహకులు, ప్రసారకర్తలు తమ పని తాము చేసుకుంటూ మ్యాచ్‌కు బహుళ ప్రచారాన్ని కల్పిస్తున్నారు. దుబాయ్: ఆసియా కప్ లీగ్ దశలో మొత్తం 12 మ్యాచ్‌లు జరుగుతాయి. మిగతా 11 మ్యాచ్‌లపై ఆసక్తి, ప్రేక్షకుల స్పందన చూస్తే అతి పేలవం. టోర్నీని నిలబెట్టగలిగే, భాగస్వాములకు కాస్త ఆర్థిక పుష్టి అందించే మ్యాచ్ ఏదైనా ఉందంటే అది భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే పోరు మాత్రమే. గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ తర్వాత ఈ రెండు టీమ్‌లు ఈ ఫార్మాట్లో తలపడటం ఇదే మొదటిసారి. భారత్ తరఫున సీనియర్లు రోహిత్, కోహ్లి నిష్క్రమించగా...పాక్ జట్టుకు బాబర్, రిజ్వాన్ దూరమయ్యారు. దాంతో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు తమ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. ఆసియా కప్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లో యూఏఈని భారత్ చిత్తు చేయగా...ఇదే తరహాలో ఒమన్‌పై పాక్ విజయం సాధించింది. అదే జట్టుతో... టోర్నీ తొలి పోరులో తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగిన భారత్ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఆ మ్యాచ్‌లో బౌలర్లంతా ఆకట్టుకోగా, ఓపెనర్లకు మినహా మిగతావారికి బ్యాటింగ్ అవకాశమే రాలేదు. అభిషేక్ శర్మ మరోసారి విధ్వంసకర బ్యాటింగ్‌కు సై అంటుండగా, మరో ఓపెనర్ గిల్ కూడా పాక్‌పై చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. గిల్ ఇప్పటి వరకు పాకిస్తాన్‌పై ఒక్క టి20 మ్యాచ్ కూడా ఆడలేదు. పాక్‌పై ఇప్పటి వరకు 20 పరుగులు దాటలేకపోయిన సూర్యకుమార్ యాదవ్ కూడా లెక్క సరి చేసేందుకు సిద్ధమయ్యాడు. సంజు, తిలక్, దూబే, హార్దిక్‌లతో విధ్వంసకర లైనప్ టీమిండియాకు భారీ స్కోరును అందించగలదు. ఆల్‌రౌండర్‌గా అక్షర్ తన విలువ చూపిస్తే పాక్‌కు ఇబ్బంది తప్పదు. బుమ్రా ప్రమాదకర బౌలింగ్‌ను పాక్ బ్యాటర్లు ఏమాత్రం ఎదుర్కోగలరనేది సందేహమే. పాండ్యా, దూబేల రూపంలో ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉండటంతో రెండో పేసర్ అవసరం జట్టుకు లేదు. కుల్దీప్, వరుణ్‌లను ప్రత్యర్థిని పూర్తిగా కట్టిపడేయగల సమర్థులు. పిచ్, వాతావరణం దుబాయ్‌లో సాధారణంగా భారీ స్కోర్లు నమోదు కావు. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు కూడా మంచి ప్రభావం చూపే అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్షసూచన లేదు కానీ క్రికెటర్లు తీవ్రమైన ఎండలను తట్టుకోవాల్సి ఉంది. తుది జట్లు (అంచనా)భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, గిల్, సామ్సన్, తిలక్, శివమ్ దూబే, పాండ్యా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, వరుణ్. పాకిస్తాన్: సల్మాన్ ఆగా (కెప్టెన్), ఫర్హాన్, అయూబ్, ఫఖర్, హసన్, హారిస్, నవాజ్, ఫహీమ్, అఫ్రిది, ముఖీమ్, అబ్రార్ -
ఆసియాకప్ మహిళల హాకీ ఫైనల్లో భారత్
హాంగ్జౌ (చైనా): భారత మహిళల హాకీ జట్టు ఆసియా కప్ టోర్నమెంట్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ‘సూపర్–4’ దశ చివరి మ్యాచ్‌లో శనివారం డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌తో పోరును భారత జట్టు 1–1 గోల్స్‌తో ‘డ్రా’ చేసుకుంది. భారత్ తరఫున బ్యూటీ డుంగ్ డుంగ్ 7వ నిమిషంలో గోల్ సాధించింది. చివరి క్వార్టర్ వరకు ఆధిక్యాన్ని కొనసాగించిన టీమిండియా... విజయం సాధించడం ఖాయమే అనుకుంటుండగా... 58వ నిమిషంలో కోబయకావా షిహో గోల్‌తో జపాన్ స్కోరు సమం చేసింది. ఇరు జట్ల మధ్య గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్ సైతం ‘డ్రా’గానే ముగిసింది. మరో మ్యాచ్‌లో చైనా 1–0 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై గెలవడంతో టీమిండియా ఫైనల్‌కు అర్హత సాధించింది. దీంతో ‘సూపర్–4’ దశలో మూడు మ్యాచ్‌లాడిన భారత్ ఒక విజయం, ఒక పరాజయం, ఒక ‘డ్రా’తో 4 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంతో ఫైనల్లో అడుగుపెట్టింది. నేడు జరగనున్న ఫైనల్లో చైనాతో భారత్ తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధిస్తుంది. -
చిక్కుల్లో ఆసియా కప్
-
ధనాధన్... ఫటాఫట్
అంతర్జాతీయ టి20ల్లో భారత్‌కు, ఇతర జట్లకు మధ్య ఉన్న స్థాయీభేదం ఏమిటో మరోసారి కనిపించింది. వరల్డ్ చాంపియన్ టీమిండియా ముందు పసికూనలా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టు పూర్తిగా తేలిపోయింది. ఫలితంగా ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్ భారీ గెలుపుతో సత్తా చాటింది. భారత బౌలర్ల ధాటికి 79 బంతుల్లోనే యూఏఈ ఇన్నింగ్స్ ముగియగా, లక్ష్యాన్ని ఛేదించేందుకు మన జట్టుకు 27 బంతులే సరిపోయాయి. కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే కలిసి 7 వికెట్లతో ప్రత్యర్థిని పడగొట్టగా... అభిషేక్ శర్మ జోరుతో లాంఛనం ముగిసింది. ఇక అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమరంలో ఆదివారం పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుది. దుబాయ్: ఆసియా కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఘన విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో యూఏఈని చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. అలీషాన్ (17 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), వసీమ్ (22 బంతుల్లో 19; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. కుల్దీప్ యాదవ్ (4/7), శివమ్ దూబే (3/4) బౌలింగ్‌లో చెలరేగారు. అనంతరం భారత్ 4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి గెలిచింది. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో మొత్తం 46 పరుగులు వచ్చాయి! అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా... శుబ్‌మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (7 నాటౌట్) కలిసి మ్యాచ్‌ను ముగించారు. కుల్దీప్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో ఆడుతుంది. అబుదాబి లో నేడు జరిగే గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో హాంకాంగ్‌తో బంగ్లాదేశ్ ఆడుతుంది. టపటపా... యూఏఈ ఇన్నింగ్స్ తొలి 21 బంతుల్లో 26 పరుగులు... ఇందులో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో అలీషాన్ ఒక్కడే 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత బుమ్రా వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో కెప్టెన్ వసీమ్ మూడు ఫోర్లు బాది 12 పరుగులు రాబట్టాడు. ఈ రెండు సందర్భాలు మినహా యూఏఈ ప్రదర్శనలో చెప్పుకోవడానికేమీ లేదు. భారత బౌలర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంతో యూఏఈ బ్యాటర్లు పరుగులు చేయడంలో తీవ్ర తడబాటు కనిపించింది. సింగిల్ కూడా తీయడం కష్టంగా మారిపోవడంతో పాటు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 26/0 నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తర్వాతి 32 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేసిన టీమ్ సగం వికెట్లు కోల్పోవడంతో స్కోరు 50/5కి చేరింది. వీటిలో కుల్దీప్ ఒకే ఓవర్లో తీసిన మూడు వికెట్లు ఉన్నాయి. అనంతరం తర్వాతి 25 బంతుల్లో 7 పరుగులే చేసిన జట్టు మరో ఐదు వికెట్లు చేజార్చుకుంది. వీటిలో దూబే ఒకే ఓవర్లో తీసిన రెండు వికెట్లు ఉన్నాయి. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2, బుమ్రా 4 ఫోర్లు ఇవ్వగా... మిగతా నలుగురు బౌలర్లు కలిపి 55 బంతుల్లో ఒక్క ఫోర్ ఇవ్వకుండా ఒక సిక్స్ మాత్రం (అక్షర్ బౌలింగ్‌లో) ఇచ్చారు! 2024 టి20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత తొలిసారి భారత్ తరఫున టి20 మ్యాచ్ బరిలోకి దిగిన బుమ్రా... ఆరేళ్ల తర్వాత మొదటిసారి పవర్‌ప్లేలో మూడు ఓవర్లు వేశాడు. స్కోరు వివరాలు యూఏఈ ఇన్నింగ్స్: అలీషాన్ (బి) బుమ్రా 22; వసీమ్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 19; జోహెబ్ (సి) కుల్దీప్ (బి) వరుణ్ 2; రాహుల్ చోప్రా (సి) గిల్ (బి) కుల్దీప్ 3; ఆసిఫ్ ఖాన్ (సి) సామ్సన్ (బి) దూబే 2; కౌశిక్ (బి) కుల్దీప్ 2; ధ్రువ్ (ఎల్బీ) (బి) దూబే 1; సిమ్రన్‌జిత్ (ఎల్బీ) (బి) అక్షర్ 1; హైదర్ అలీ (సి) సామ్సన్ (బి) కుల్దీప్ 1; జునైద్ (సి) సూర్యకుమార్ (బి) దూబే 0; రోహిద్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (13.1 ఓవర్లలో ఆలౌట్) 57. వికెట్ల పతనం: 1–26, 2–29, 3–47, 4–48, 5–50, 6–51, 7–52, 8–54, 9–55, 10–57. బౌలింగ్: పాండ్యా 1–0–10–0, బుమ్రా 3–0– 19–1, అక్షర్ 3–0–13–1, వరుణ్ 2–0–4–1, కుల్దీప్ 2.1–0–7–4, దూబే 2–0–4–3. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) హైదర్ (బి) జునైద్ 30; గిల్ (నాటౌట్) 20; సూర్య కుమార్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 60. వికెట్ల పతనం: 1–48. బౌలింగ్: హైదర్ అలీ 1–0–10–0, రోహిద్ 1–0–15–0, ధ్రువ్ 1–0–13–0, జునైద్ 1–0–16–1, సిమ్రన్‌జిత్ 0.3–0–6–0. 27 ఛేదనలో బంతుల పరంగా భారత్‌కు ఇదే అతి వేగవంతమైన విజయం. గతంలో 39 బంతుల్లో స్కాట్లాండ్పై లక్ష్యాన్ని ఛేదించింది. -
ఆసియా కప్ టోర్నీలో నేడు భారత్ తొలి మ్యాచ్
-
Asia Cup: గంభీర్ గుండాగిరి! ఫైర్ అయిన అయ్యర్
-
భారత్‌ను ఆపతరమా!
వన్డే, టి20 ఫార్మాట్లు కలిపి ఇప్పటి వరకు ఆసియా కప్ 16 సార్లు జరిగింది. వీటిలో 8 సార్లు విజేతగా నిలిచిన భారత్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఫార్మాట్ ఏదైనా ఇప్పుడు టీమిండియా ఫామ్ చూస్తే ఎదురులేని జట్టుగా కనిపిస్తోంది. విధ్వంసకర బ్యాటర్లు, పదునైన బౌలర్లతో నిండిన సూర్యకుమార్ బృందం టైటిల్ గెలవకపోతేనే ఆశ్చర్యపోవచ్చు! ఎనిమిది దేశాల ఈ టోర్నీలో భారత్‌కు మిగతా జట్లు ఎంత వరకు పోటీనిస్తాయనేది సందేహమే. ఈ నేపథ్యంలో కొంత విరామం తర్వాత క్రికెట్ అభిమానులకు కొత్త సీజన్లో మళ్లీ పూర్తి వినోదానికి ఆసియా కప్‌తో తెర లేస్తోంది. దుబాయ్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన సరిగ్గా ఆరు నెలల తర్వాత ఎడారి దేశంలో మరో పెద్ద టోర్నీకి రంగం సిద్ధమైంది. ఎనిమిది టీమ్‌లు పాల్గొంటున్న ఆసియా కప్ టి20 టోర్నీ నేడు మొదలవుతోంది. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌తో హాంకాంగ్ ‘ఢీ’కొంటుండగా... భారత్ తమ తొలి మ్యాచ్‌లో బుధవారం ఆతిథ్య యూఏఈతో తలపడుతుంది. నిజానికి ఈ టోర్నీ భారత్‌లోనే జరగాల్సింది. అయితే పాకిస్తాన్ మన దేశంలో ఆడే అవకాశం లేదని తేలడంతో తటస్థ వేదికకు మార్చారు.దుబాయ్, అబుదాబిలలో మ్యాచ్‌లు నిర్వహిస్తుండగా... ఆతిథ్య హక్కులు మాత్రం బీసీసీఐ చేతుల్లోనే ఉన్నాయి. 2023లో వన్డే ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్‌లో భారత్ విజేతగా నిలిచింది. సిరాజ్ (6/51) ధాటికి శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలగా, భారత్ 6.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. వచ్చే ఏడాది ఆరంభంలో టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈసారి ఫార్మాట్‌ను టి20కి మార్చారు. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రెండు గ్రూపులుగా... ఆసియా కప్‌లో ఎనిమిది జట్లు ఆడటం ఇదే మొదటిసారి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నేరుగా అర్హత సాధించగా... ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రీమియర్ కప్ పేరుతో నిర్వహించిన టోర్నీలో టాప్–3లో నిలిచిన యూఏఈ, ఒమన్, హాంకాంగ్ టోర్నీకి అర్హత పొందాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్‌తో పాటు పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ ఉండగా... గ్రూప్ ‘బి’లో అఫ్గానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ తలపడుతున్నాయి. ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని మిగతా మూడు జట్లతో తలపడుతుంది. ప్రతీ గ్రూప్‌లోని టాప్–2 టీమ్‌లు సూపర్–4కు అర్హత సాధిస్తాయి. ఇక్కడా మిగతా మూడు జట్లతో ఆడిన తర్వాత టాప్–2 ఫైనల్ చేరతాయి. అంతా ఆ మ్యాచ్ కోసమే... పహల్గాం ఉగ్రదాడి తర్వాతి పరిణామాలను బట్టి చూస్తే భారత్, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరగడం అసాధ్యంగా అనిపించింది. అయితే చివరకు భారత ప్రభుత్వం పాక్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియాకు అనుమతి ఇచ్చింది. బలాబలాలపరంగా ఇరు జట్ల మధ్య ఆకాశమంత వ్యత్యాసం ఉన్నా...ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక్కసారిగా ఈ పోరుపై ఆసక్తి పెరిగింది.భారత్, పాక్ గ్రూప్ దశలో ఈ నెల 14న (ఆదివారం) తలపడతాయి. సంచలన ఫలితాలు లేకపోతే ఇరు జట్ల మధ్య టోర్నీలో మరో రెండు మ్యాచ్‌లు (ఫైనల్ సహా) జరిగే అవకాశం కూడా ఉంది. దాయాది దేశాల మధ్య గతంలో ఎప్పుడూ ఆసియా కప్ ఫైనల్ జరగలేదు! కొత్త కుర్రాళ్లతో... భారత్‌తో పోలిస్తే బలహీనంగా ఉన్నా... ఇతర టీమ్‌లు కొన్ని అనూహ్య ఫలితాలను ఆశిస్తున్నాయి. పైగా కొందరు ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన కూడా టోర్నీలో కీలకం కానుంది. బాబర్, రిజ్వాన్‌లను తప్పించిన పాకిస్తాన్ జట్టు సల్మాన్ ఆఘా సారథ్యంలో కొత్తగా కనిపిస్తోంది. ముక్కోణపు టోర్నీని గెలవడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. బంగ్లా ఇటీవలే లంకపై సిరీస్ విజయం సాధించింది. ఒమన్‌కు ముంబై మాజీ క్రికెటర్ సులక్షణ్ కులకర్ణి కోచ్‌గా వ్యవహరిస్తుండగా, హాంకాంగ్, యూఏఈ జట్లు తమ కెపె్టన్లు ముర్తజా, వసీమ్‌లపై ఆధారపడుతున్నాయి. పాక్ లెఫ్టార్మ్ పేసర్ సల్మాన్ మీర్జా, అఫ్గానిస్తాన్ స్పిన్నర్ ఘజన్ఫర్ కొత్తగా చూడదగ్గ ఆటగాళ్లు. -
సింగపూర్‌పై 12–0తో గెలిచి ‘సూపర్–4’ దశకు భారత్
హాంగ్జౌ (చైనా): ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ లీగ్ దశను భారత జట్టు అజేయంగా ముగించింది. సింగపూర్ జట్టుతో సోమవారం జరిగిన పూల్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 12–0 గోల్స్‌తో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నవ్‌నీత్ కౌర్ (14వ, 20వ, 28వ నిమిషాల్లో), ముంతాజ్ ఖాన్ (2వ, 32వ, 39వ నిమిషాల్లో) మూడు గోల్స్ చొప్పున చేశారు. నేహా (11వ, 38వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించింది. లాల్రెమ్సియామి (13వ నిమిషంలో), ఉదిత (29వ నిమిషంలో), షరి్మలా (45వ నిమిషంలో), రుతుజా (53వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. థాయ్‌లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 11–0తో నెగ్గిన భారత్... జపాన్‌తో రెండో మ్యాచ్‌ను 2–2తో ‘డ్రా’ చేసుకుంది. పూల్ ‘బి’లో భారత్, జపాన్ జట్లు ఏడు పాయింట్లతో సమంగా నిలిచినా... ఎక్కువ గోల్స్ చేసిన భారత్‌కు అగ్రస్థానం ఖాయమైంది. జపాన్‌కు రెండో స్థానం దక్కింది. పూల్ ‘బి’ నుంచి భారత్, జపాన్... పూల్ ‘ఎ’ నుంచి చైనా, దక్షిణ కొరియా జట్లు ‘సూపర్–4’ దశకు అర్హత సాధించాయి. బుధవారం జరిగే ‘సూపర్–4’ మ్యాచ్‌ల్లో కొరియాతో భారత్; జపాన్‌తో చైనా తలపడతాయి. ‘సూపర్–4’ మ్యాచ్‌లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత పొందుతాయి. విజేత జట్టు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ టోరీ్నకి అర్హత సాధిస్తుంది. -
జోరుగా టీమిండియా సాధన
దుబాయ్: ఆసియాకప్ టి20 టోర్నమెంట్ కోసం భారత జట్టు ముమ్మర సాధన చేస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ)లో మంగళవారం నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుండగా... బుధవారం ఆతిథ్య యూఏఈతో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. టోర్నీలో భాగంగా ఈ నెల 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత జట్టు... ఐసీసీ అకాడమీలో జోరుగా ప్రాక్టీస్‌లో పాల్గొంది. ఫిట్నెస్ డ్రిల్స్ సందర్భంగా శుబ్‌మన్ గిల్ ఆకట్టుకోగా... సూర్యకుమార్ యాదవ్, సంజు సామ్సన్, జితేశ్ శర్మ, తిలక్ వర్మ, అభిõÙక్ శర్మ నెట్స్‌లో సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఇంగ్లండ్ పర్యటన అనంతరం భారత జట్టు ఆడనున్న తొలి మ్యాచ్ ఇదే కాగా... భారత టెస్టు సారథి గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ వంటి వాళ్లు కాస్త విరామం అనంతరం మైదానంలోకి అడుగుపెట్టారు. గతేడాది టి20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత బుమ్రా ఈ ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. పేస్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, దూబే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణను పర్యవేక్షించాడు. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో భారత జట్టు ఎనిమిదిసార్లు ఆసియాకప్ ట్రోఫీ చేజిక్కించుకుంది. -
భారత్, జపాన్ మ్యాచ్ ‘డ్రా’
హాంగ్జౌ (చైనా): ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారీ విజయంతో శుభారంభం చేసిన భారత జట్టు... డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌తో రెండో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. తొలి మ్యాచ్‌లో 11–0 గోల్స్ తేడాతో థాయ్‌లాండ్‌ను చిత్తుచేసిన సలీమా టెటె సారథ్యంలోని టీమిండియా... శనివారం జపాన్‌తో రెండో మ్యాచ్‌ను 2–2తో ‘డ్రా’గా ముగించింది. పూల్ ‘బి’లో భాగంగా జరిగిన ఈ పోరులో చివరి క్షణాల్లో నవ్‌నీత్ కౌర్ గోల్ చేసి జట్టును గట్టెక్కించింది. భారత్ తరఫున రుతుజ (30వ నిమిషంలో), నవ్‌నీత్ కౌర్ (60వ నిమిషంలో) చెరో గోల్ సాధించగా... జపాన్ తరఫున హిరోకా మురయామా (10వ నిమిషంలో), చికో ఫుజిబయాషి (58వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేసుకున్నారు. పూల్ ‘బి’లో భాగంగా శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో థాయ్‌లాండ్ 2–1 గోల్స్ తేడాతో సింగపూర్‌పై విజయం సాధించింది. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో సోమవారం సింగపూర్‌తో భారత్ తలపడనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటుండగా... ఒక్కో పూల్ నుంచి ఉత్తమ ప్రదర్శన చేసిన రెండు జట్లు... సూపర్–4 దశకు అర్హత సాధించనున్నాయి. అందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఈ నెల 14న ఫైనల్ జరుగుతుంది. అందులో గెలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరగనున్న మహిళల వరల్డ్‌కప్‌నకు నేరుగా అర్హత సాధించనుంది. -
భారత్ భారీ విజయం
హాంగ్జౌ (చైనా): ప్రపంచ కప్ బెర్త్ సాధించడమే లక్ష్యంగా... ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో బరిలోకి దిగిన భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. థాయ్‌లాండ్ జట్టుతో శుక్రవారం జరిగిన పూల్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో సలీమా టెటె సారథ్యంలోని టీమిండియా 11–0 గోల్స్ తేడాతో గెలిచింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముంతాజ్ ఖాన్ (7వ, 49వ నిమిషాల్లో), ఉదిత (30వ, 52వ నిమిషాల్లో), బ్యూటీ డుంగ్‌డుంగ్ (45వ, 54వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. సంగీత కుమారి (10వ నిమిషంలో), నవ్‌నీత్ కౌర్ (18వ నిమిషంలో), లాల్రెమ్సియామి (18వ నిమిషంలో), షర్మిలా దేవి (57వ నిమిషంలో), రుతుజా (60వ నిమిషంలో) టీమిండియాకు ఒక్కో గోల్ అందించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత జట్టు విరామ సమయానికి 5–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఓవరాల్‌గా తమకు లభించిన తొమ్మిది పెనాల్టీ కార్నర్లలో ఐదింటిని గోల్స్‌గా మలిచిన భారత జట్టు నాలుగింటిని వృథా చేసింది. మరోవైపు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 30వ స్థానంలో ఉన్న థాయ్‌లాండ్ జట్టుకు ఒక్క పెనాల్టీ కార్నర్ కూడా దక్కలేదు. పూల్ ‘బి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో జపాన్ 9–0తో సింగపూర్ జట్టును ఓడించగా... పూల్ ‘ఎ’లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో దక్షిణ కొరియా 9–0తో చైనీస్ తైపీపై, చైనా 8–0తో మలేసియాపై విజయం సాధించాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జపాన్‌తో భారత్; థాయ్‌లాండ్‌తో సింగపూర్ తలపడతాయి. -
ప్రపంచ కప్ బెర్త్ లక్ష్యంగా...
హాంగ్జౌ (చైనా): సీనియర్ గోల్‌కీపర్ సవితా పూనియా... స్టార్ డ్రాగ్ ఫ్లికర్ దీపిక గైర్హాజరీలో.. ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. నేటి నుంచి ఈనెల 14వ తేదీ వరకు జరిగే ఈ మెగా టోర్నీలో భారత జట్టు శుక్రవారం పూల్ ‘బి’లోని తమ తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో ఆడుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ తొమ్మిదో స్థానంలో... థాయ్‌లాండ్ 30వ స్థానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ భారీ విజయంపై గురి పెట్టింది. పూల్ ‘బి’లో భారత్, థాయ్‌లాండ్‌లతోపాటు జపాన్ (12వ ర్యాంక్), సింగపూర్ (31వ ర్యాంక్) జట్లున్నాయి. శుక్రవారం థాయ్‌లాండ్‌తో మ్యాచ్ తర్వాత... శనివారం జపాన్‌తో, సోమవారం సింగపూర్‌తో భారత్ ఆడుతుంది. పూల్ ‘ఎ’లో చైనా, దక్షిణ కొరియా, మలేసియా, చైనీస్ తైపీ జట్లున్నాయి. లీగ్ దశ ముగిశాక రెండు పూల్ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ ‘సూపర్–4’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్–4’ మ్యాచ్‌లు ముగిశాక టాప్–2లో నిలిచిన రెండు జట్లు ఫైనల్లో టైటిల్ కోసం పోటీపడతాయి. ఆసియా కప్ విజేత జట్టుకు వచ్చే ఏడాది బెల్జియం–నెదర్లాండ్స్ వేదికగా జరిగే ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు నేరుగా అర్హత లభిస్తుంది. చీలమండ గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్న మాజీ కెపె్టన్, గోల్‌కీపర్ సవితా పూనియా స్థానంలో గోల్ కీపింగ్ బాధ్యతలు బిచ్చూదేవి, బన్సారి సోలంకి తీసుకుంటారు. దీపిక లేని లోటును డిఫెన్స్‌లో ఉదిత, నిక్కీ ప్రధాన్, మనీషా చౌహాన్, ఇషిక, సుమన్ దేవి భర్తీ చేయాల్సి ఉంటుంది. నేహా, కెప్టెన్ సలీమా టెటె, లాల్రెమ్సియామి, షర్మిలా దేవి, సునెలితా టొప్పో, వైష్ణవిలతో భారత మిడ్‌ఫీల్డ్ పటిష్టంగా ఉంది. ఫార్వర్డ్ శ్రేణిలో నవ్‌నీత్ కౌర్, సంగీత, ముంతాజ్ ఖాన్, బ్యూటీ డుంగ్‌డుంగ్, రుతుజా, సాక్షి సత్తా చాటాల్సి ఉంటుంది. ఈ టోర్నీ భారత చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్‌కు కూడా పరీక్షగా నిలువనుంది. ఇటీవల యూరోపియన్ అంచె ప్రొ లీగ్‌లో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన కనబరిచింది. ప్రొ లీగ్‌లో భారత జట్టు 100 కంటే ఎక్కువ పెనాల్టీ కార్నర్లను సమర్పించుకోగా.. బెల్జియంతో జరిగిన పోరులో ఏకంగా 17 పెనాల్టీ కార్నర్లు ఉన్నాయి. 1985లో మొదలైన ఈ టోర్నీలో భారత జట్టు రెండుసార్లు (2004, 2017) చాంపియన్‌గా, రెండుసార్లు (1999, 2009) రన్నరప్‌గా నిలిచింది. మూడుసార్లు (1993, 2013, 2022) మూడో స్థానాన్ని పొందిన టీమిండియా ... రెండుసార్లు (1989, 2007) నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. -
గెలిచి నిలిచిన భారత్
రాజ్‌గిర్ (బిహార్): సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో ఆతిథ్య భారత జట్టు ఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. మలేసియా జట్టుతో గురువారం జరిగిన ‘సూపర్–4’ దశ రెండో మ్యాచ్‌లో భారత్ 4–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున మన్‌ప్రీత్ సింగ్ (17వ నిమిషంలో), సుఖ్జీత్ సింగ్ (19వ నిమిషంలో), శిలానంద్ లాక్రా (24వ నిమిషంలో), వివేక్ సాగర్ ప్రసాద్ (38వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.మలేసియా జట్టుకు షఫీక్ హసన్ (2వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ఈ మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా ‘సూపర్–4’ పట్టికలో భారత్ నాలుగు పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. బుధవారం డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాతో జరిగిన ‘సూపర్–4’ తొలి మ్యాచ్‌ను భారత్ 2–2తో ‘డ్రా’ చేసుకుంది. శుక్రవారం విశ్రాంతి దినం తర్వాత... శనివారం చైనాతో జరిగే చివరి ‘సూపర్–4’ మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’ చేసుకున్నా పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. గురువారం జరిగిన ‘సూపర్–4’ మరో మ్యాచ్‌లో చైనా 3–0 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాను ఓడించింది. ప్రస్తుతం చైనా, మలేసియా మూడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో... కొరియా ఒక పాయింట్‌తో నాలుగో స్థానంలో ఉంది. మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. మ్యాచ్ మొదలైన రెండు నిమిషాలకే మలేసియా హసన్ గోల్‌తో ఖాతా తెరిచింది. అయితే భారత్ వెంటనే తేరుకుంది. సమన్వయంతో ఆడుతూ మలేసియా గోల్‌పోస్ట్‌పై ఎడతెరిపి లేకుండా దాడులు నిర్వహించింది. రెండో క్వార్టర్లో భారత్ దాడులకు ఫలితం లభించింది. ఏడు నిమిషాల వ్యవధిలో భారత్ మూడు గోల్స్ చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత అదే జోరు కొనసాగించిన టీమిండియా ప్రత్యర్థి జట్టుకు మరో గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు ఆరు పెనాల్టీ కార్నర్లు లభించగా... ఒక పెనాల్టీ కార్నర్‌ను భారత్ గోల్‌గా మలిచింది. లేదంటే మరింత తేడాతో మలేసియాపై భారత్‌కు విజయం దక్కేది. -
భారత్‌ను ఆదుకున్న మన్దీప్
రాజ్‌గిర్ (బిహార్): లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత పురుషుల హాకీ జట్టుకు ఆసియా కప్‌లో తొలిసారి గట్టిపోటీ ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా జట్టుతో బుధవారం జరిగిన ‘సూపర్–4’ దశ మ్యాచ్‌ను భారత్ 2–2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగించింది. మ్యాచ్ ముగియడానికి ఏడు నిమిషాలు ఉన్నాయనగా మన్దీప్ సింగ్ గోల్ చేసి భారత్‌ను ఓటమి బారి నుంచి తప్పించాడు. గోల్స్ చేసేందుకు వచ్చిన పలు అవకాశాలను వృథా చేసుకున్న భారత జట్టు చివరకు విజయం బదులు ‘డ్రా’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఎనిమిదో నిమిషంలో హార్దిక్ సింగ్ చేసిన గోల్‌తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే కొరియా జట్టు రెండు నిమిషాల తేడాలో రెండు గోల్స్ చేసి భారత్‌కు షాక్ ఇచి్చంది. 12వ నిమిషంలో జిహున్ యాంగ్ గోల్‌తో స్కోరును 1–1తో సమం చేసిన కొరియా... 14వ నిమిషంలో హైయోన్హాంగ్ కిమ్ గోల్‌తో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఒకదశలో భారత్‌కు ఓటమి తప్పదేమోనని అనిపించినా... 53వ నిమిషంలో మన్దీప్ సింగ్ గోల్ చేసి భారత్‌ను ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తమకు లభించినా ఆరు పెనాల్టీ కార్నర్లను వృథా చేసుకుంది. అంతకుముందు చైనాతో జరిగిన మరో ‘సూపర్–4’ మ్యాచ్‌లో మలేసియా 2–0తో గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో కొరియాతో చైనా; మలేసియాతో భారత్ తలపడతాయి. -
‘రోహిత్ శర్మ ఇంకో పదేళ్లు ఆడాలి’
కెప్టెన్‌గా టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత రోహిత్ శర్మ (Rohit Sharma) సొంతం. 2024లో టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన హిట్‌మ్యాన్.. 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రూపంలో మరో టైటిల్ సాధించాడు.అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్తద్వారా మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni- 3) తర్వాత భారత్‌కు అత్యధిక ఐసీసీ టైటిళ్లు అందించిన సారథిగా రోహిత్ చరిత్రకెక్కాడు. ఇక 2024లో వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పాడు.ప్రస్తుతం వన్డేల్లో కెప్టెన్ కొనసాగుతున్న 38 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా పదిహేనేళ్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మ గురించి టీమిండియా యువ పేసర్ ఖలీల్ అహ్మద్ (Khaleel Ahmed) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ శర్మ ఇంకో పదేళ్లు క్రికెట్ ఆడాలి‘‘భారత క్రికెట్ మంచి కోసం రోహిత్ శర్మ ఇంకో పదేళ్లు క్రికెట్ ఆడాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. 2019లో మేము రాజ్‌కోట్ వేదికగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడుతున్నపుడు.. నేను సరిగ్గా బౌల్ చేయలేకపోయాను. కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాను.అప్పుడు డ్రెసింగ్‌రూమ్‌లో రోహిత్ భయ్యా నాతో ప్రత్యేకంగా మాట్లాడాడు. జట్టులోని సభ్యులంతా వెళ్లిపోయిన తర్వాత.. నా దగ్గరికి వచ్చి.. నేనెలా ఆడాలో చెప్పాడు. నాలో ఉన్న నైపుణ్యాల గురించి నాకంటే ఎవరికీ ఎక్కువగా తెలియదని.. నా సామర్థ్యాలను నేనే బయపెట్టాలని చెప్పాడు.ఇలాంటి కెప్టెన్లు అరుదుమేము స్టేడియం వీడి వెళ్తున్నపుడు అభిమానులంతా రోహిత్ భయ్యాను చూసి సంతోషంతో కేకలు వేస్తుంటే.. ‘ఏదో ఒకరోజు నీకు కూడా ఇలాంటి ఆనందకర సమయం వస్తుంది’ అని నాతో అన్నాడు. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండాలని చెప్పాడు.ఇలాంటి కెప్టెన్లు అరుదు. ప్రతి మ్యాచ్ తర్వాత భాయ్ నాతో మాట్లాడుతూ.. నా తప్పొప్పులను ఓపికగా వివరించాడు. ఇంత మంచి మనసు ఉన్నవాళ్లు కూడా ఇక్కడ ఉంటారా? అనిపించింది. రిషభ్ పంత్‌తో కూడా భయ్యా ఇలాగే ఉంటాడు.పూర్తి ఫిట్గావ్యక్తిగా, కెప్టెన్‌గా ఆయనకు ఆయనే సాటి. నిజంగా ఆరోజు రోహిత్ భయ్యా స్థానంలో వేరే వాళ్లుంటే అంత ఓపికగా నాతో మాట్లాడేవారే కాదు. ఈ మధ్య జాతీయ క్రికెట్ అకాడమీలో భయ్యాను కలిశాను. ఆయన పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. నిజంగా ఇలాంటి కెప్టెన్లు టీమిండియాకు అవసరం. ఆయన ఇంకో పదేళ్లు ఆడితే బాగుంటుంది’’ అని ఖలీల్ అహ్మద్ రెవ్‌స్పోర్ట్స్‌తో పేర్కొన్నాడు.రోహిత్ కెప్టెన్సీలో అరంగేట్రంకాగా 2018లో మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకోగా.. అతడి స్థానంలో రోహిత్ శర్మ ఆసియా వన్డే కప్ టోర్నీలో టీమిండియా సారథిగా వ్యవహరించాడు. అప్పుడే ఖలీల్ అహ్మద్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 11 వన్డేలు, 18 టీ20లు ఆడిన ఖలీల్ అహ్మద్.. ఆయా ఫార్మాట్లలో 15, 16 వికెట్లు తీశాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ గతేడాది చివరగా టీమిండియాకు ఆడాడు.చదవండి: అవకాశం రాకుంటే.. నేనూ యూఎస్‌కు వెళ్లిపోయేవాడిని: టీమిండియా స్టార్ -
నేను.. రోహిత్ ఘోరంగా ఢీకొట్టుకున్నాం.. ఆరోజు ధోని ఫైర్: కోహ్లి
భారత క్రికెట్లో ఈ ముగ్గురు ఆటగాళ్లు ఎవరివారే ప్రత్యేకం. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనుడు. విరాట్ కోహ్లి (Virat Kohli).. టెస్టుల్లో టీమిండియాను అగ్రపథాన నిలిపిన సారథి.. సచిన్ టెండుల్కర్ తర్వాత అత్యధిక సెంచరీల వీరుడిగా చెరగని రికార్డు..రోహిత్ శర్మ (Rohit Sharma).. హిట్‌మ్యాన్‌గా గుర్తింపు.. వన్డే, టీ20లలో తిరుగులేని బ్యాటర్.. కెప్టెన్‌గా భారత్‌కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన నాయకుడు. అయితే, కోహ్లి, రోహిత్ తొలినాళ్లలో ధోని సారథ్యంలోనే ఆడారు. అతడి నాయకత్వంలోనే రోహిత్ ఓపెనర్‌గా ప్రమోట్ అయితే.. కోహ్లి నాడు భవిష్య కెప్టెన్‌గా ఎదిగాడు.నాడు పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్ఆసియా టీ20 కప్-2025 సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ముగ్గురికి సంబంధించిన ఓ పాత ఘటన తాజాగా వైరల్ అవుతోంది. ఆసియా వన్డే కప్-2012లో భాగంగా నాడు టీమిండియా పాకిస్తాన్‌తో తలపడింది. ఆరోజు 231/2తో పటిష్టంగా ఉన్న పాక్ జట్టు.. భారీ స్కోరు దిశగా పయనిస్తుండగా.. కోహ్లి- రోహిత్ వల్ల తప్పిదం జరిగింది.ఒకరినొకరు ఢీకొట్టుకుని కిందపడిపోయారుటీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో..38 ఓవర్ తొలి బంతిని ఉమర్ అక్మల్ బౌండరీ దిశగా తరలించాడు. బంతిని ఆపే క్రమంలో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి- రోహిత్ బలంగా ఒకరినొకరు ఢీకొట్టుకుని కిందపడిపోయారు. ఫలితంగా పాక్‌కు అదనంగా మరో రెండు పరుగులు.. మొత్తంగా త్రీ రన్స్ వచ్చాయి.ధోనికి చాలా కోపం వచ్చిందిదీంతో కెప్టెన్ ధోని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటన గురించి 2020లో అశ్విన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి మాట్లాడాడు. ‘‘ఆరోజు ఎంఎస్ ఏమాత్రం సంతోషంగా లేడు. అప్పుడు తనకి చాలా కోపం వచ్చింది. వాళ్లు భారీ భాగస్వామ్యాలు నెలకొల్పుతున్నారు. మన వల్ల అదనపు పరుగులు కూడా వస్తున్నాయి.అప్పుడు వాళ్లకు ఒక్క పరుగే రావాల్సింది. కానీ మనం మూడు ఇచ్చాము. ఇర్ఫాన్ బంతి వెంట నెమ్మదిగా పరిగెడుతూ ధోని వైపు త్రో చేశాడు. అప్పుడు ఎంఎస్.. ‘అసలు వీళ్లిద్దరు అలా ఎలా ఢీకొట్టుకున్నారు. మూడు పరుగులు ఎలా ఇచ్చారు’ అన్నట్లుగా ముఖంలో భావాలు పలికించాడు.ఆరోజు నేను మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. రోహిత్ డీప్ స్వ్కేర్ లెగ్‌లో ఉన్నాడు. ఇద్దరమూ బంతిని పట్టుకోవాలని పరిగెత్తాము. ఇంతలో నా తల కుడి భాగం అతడి భుజానికి బలంగా తాకింది. అప్పటికి అదేమీ సీరియస్ అనిపించలేదు.కానీ ఐదు నిమిషాల తర్వాత అసలేం జరిగిందో మాకు అర్థమైంది’’ అని కోహ్లి గుర్తుచేసుకున్నాడు. కాగా నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. ఛేజింగ్ ‘కింగ్’ భారీ సెంచరీఇక లక్ష్య ఛేదనలో ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లి 148 బంతుల్లో 183 పరుగులు సాధించి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. సచిన్ టెండుల్కర్తో కలిసి రెండో వికెట్‌కు 133 పరుగులు జోడించిన కోహ్లి.. రోహిత్‌తో కలిసి 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా.. ఆరు వికెట్లు మిగిలి ఉండగానే.. 48 ఓవర్లలో భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. నాటి మ్యాచ్‌లో కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.చదవండి: తప్పుకొన్న తిలక్ వర్మ.. జట్టులోకి గుంటూరు కుర్రాడు -
భారత్‌కు రెండో విజయం
రాజ్‌గిర్ (బిహార్): వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత పురుషుల హాకీ జట్టుకు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. భారీ విజయాలు సాధిస్తుందనుకున్న చోట భారత జట్టు మరోసారి గోల్ తేడాతోనే గట్టెక్కింది. ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన పూల్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 3–2 గోల్స్ తేడాతో జపాన్ జట్టును ఓడించింది. వరుసగా రెండో విజయం నమోదు చేసుకున్న భారత జట్టు ‘సూపర్–4’ దశకు మరింత చేరువైంది. చైనాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4–3తో గెలిచింది. జపాన్‌తో జరిగిన పోరులో భారత్ తరఫున మన్దీప్ సింగ్ (4వ నిమిషంలో) ఒక గోల్ చేయగా... కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (5వ నిమిషంలో, 46వ నిమిషంలో) రెండు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. జపాన్ జట్టుకు కొసె కవాబె (38వ, 59వ నిమిషంలో) రెండు గోల్స్ అందించాడు. పూల్ ‘ఎ’లో భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... చెరో మ్యాచ్‌లో గెలిచిన చైనా, జపాన్ మూడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. నేడు జరిగే చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో కజకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో చైనా 13–1 గోల్స్ తేడాతో కజకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. -
హర్మన్‌ప్రీత్ ‘హ్యాట్రిక్’
రాజ్‌గిర్ (బిహార్): అంచనాలకు తగ్గట్టు ఆడకపోయినా... ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత జట్టుకు శుభారంభం లభించింది. శుక్రవారం మొదలైన ఈ టోర్నీలో భాగంగా జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4–3 గోల్స్ తేడాతో చైనా జట్టును ఓడించింది. భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (20వ, 33వ, 47వ నిమిషాల్లో) ‘హ్యాట్రిక్’ నమోదు చేసి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. మరో గోల్‌ను జుగ్రాజ్ సింగ్ (18వ నిమిషంలో) అందించాడు. చైనా తరఫున షిహావో డు (12వ నిమిషంలో), బెన్హాయ్ చెన్ (35వ నిమిషంలో), జీషెంగ్ గావో (41వ నిమిషంలో) ఒక్కోగోల్ చేశారు. ఈ మ్యాచ్‌లో నమోదైన మొత్తం ఏడు గోల్స్ పెనాల్టీ కార్నర్ల ద్వారానే రావడం విశేషం. హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. హర్మన్‌ప్రీత్‌కు 200 డాలర్ల చెక్‌ను హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అందజేశారు. తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న చైనాపై భారత్ భారీ విజయం సాధిస్తుందని ఆశించినా... ప్రత్యర్థి జట్టు నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. భారత జట్టు తమకు లభించిన 11 పెనాల్టీ కార్నర్లో కేవలం నాలుగింటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. చైనా జట్టుకు ఆరు పెనాల్టీ కార్నర్లు రాగా, మూడింటిని లక్ష్యానికి చేర్చింది. తొలి రోజు జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో మలేసియా 4–1తో బంగ్లాదేశ్ జట్టుపై... డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా 7–0తో చైనీస్ తైపీపై... జపాన్ 7–0తో కజకిస్తాన్‌పై విజయం సాధించాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో చైనీస్ తైపీతో బంగ్లాదేశ్; మలేసియాతో దక్షిణ కొరియా తలపడతాయి. భారత జట్టు తమ తదుపరి మ్యాచ్‌ను ఆదివారం జపాన్ జట్టుతో ఆడుతుంది. -
ప్రపంచ ‘బెర్త్’ లక్ష్యంగా...
రాజ్‌గిర్ (బిహార్): వచ్చే ఏడాది బెల్జియం–నెదర్లాండ్స్ వేదికగా జరిగే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించాలనే లక్ష్యంతో... నేడు మొదలయ్యే ఆసియా కప్‌లో భారత పురుషుల హాకీ జట్టు బరిలోకి దిగనుంది. ఆసియా కప్ విజేత జట్టు ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత పొందుతుంది. శుక్రవారం మొదలయ్యే ఆసియా కప్ పూల్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో చైనాతో భారత్ తలపడుతుంది. ఇటీవల జరిగిన యూరోపియన్ అంచె ప్రొలీగ్‌లో భారత్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. 8 మ్యాచ్‌లాడితే ఏకంగా ఏడింట పరాజయాన్నే మూటగట్టుకుంది. అయితే తాజా ఆసియా కప్ పరిస్థితులను ఐరోపా జట్లు, పరిస్థితులతో పోల్చలేం. కానీ అక్కడ తలెత్తిన లోటుపాట్లను మాత్రం ఇక్కడా కొనసాగిస్తే మాత్రం మూల్యం తప్పదు. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలో భారత్ డిఫెన్స్‌లో దుర్భేద్యంగా మారాలి. పెనాల్టీ కార్నర్లను గోల్‌గా మలిచే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. గోల్‌కీపింగ్ కూడా పటిష్టం కావాలి. రిటైరైన దిగ్గజ గోల్‌కీపర్ శ్రీజేశ్ స్థానంలో ఆడుతున్న కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా ఇంకా చాలా మెరుగవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇలా అన్ని రంగాల్లో మెరుగైతేనే మేటి జట్లను నిలువరించగలం. యూరోపియన్ అంచెలో ఎదురైన పరాజయాల భారాన్ని తగ్గించుకోగలం. మిడ్‌ఫీల్డ్‌లో రాజిందర్ సింగ్, రాజ్ కుమార్ పాల్, మన్‌ప్రీత్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్లు మరింత బాధ్యత కనబరిస్తేనే ఆసియా కప్‌లో ప్రత్యర్థి జట్లపై పైచేయి సాధిస్తాం. ఆసియా కప్‌లో భారత్, చైనాలున్న పూల్ ‘ఎ’లో జపాన్, కజకిస్తాన్ మిగతా జట్లు కాగా... పూల్ ‘బి’లో దక్షిణ కొరియా, మలేసియా, బంగ్లాదేశ్, చైనీస్ తైపీ జట్లున్నాయి. -
ఆసియాకప్ పుట్టింది ఇలా.. తొలి టైటిల్ ఎవరిదంటే?
ఆసియా దేశాల మధ్య క్రికెట్ సమరానికి సమయం ఆసన్నమవుతోంది. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్లో మొత్తం 8 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఇందుకోసం ఆయా జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఈ క్రమంలో ఈ ఆసియాకప్ ఎప్పుడు మొదలైంది? ఈ ఖండాంతర టోర్నీలో భారత జట్టు రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.సెప్టెంబర్ 13.. 1984న ఒక కొత్త వన్డే టోర్నమెంట్ క్రికెట్ ప్రపంచానికి పరిచయమైంది. అదే ఆసియా కప్. దక్షిణాసియా పొరుగు దేశాలైన భారత్, పాకిస్తాన్, శ్రీలంకల మధ్య క్రికెట్, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచేందుకు 19 సెప్టెంబర్, 1983న ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ను స్ధాపించారు. ఈ ఏసీసీనే ఆసియాకప్ పుట్టుకకు కారణమైంది. తొలి టైటిల్ మనదే..ఆసియాకప్ తొలి ఎడిషన్‌కు యూఏఈలోని షార్జా అతిథ్యమిచ్చింది. అయితే ఈ టోర్నీలో 1983 ఐసీసీ ప్రూడెన్షియల్ ప్రపంచ కప్ విజేతగా నిలిచిన టీమిండియా పాల్గొనడంతో మరింత ప్రాధన్యత సంతరించుకుంది. అయితే ఈ టోర్నీకి 1983 ప్రపంచ కప్ గెలిచిన పూర్తి జట్టును బీసీసీఐ పంపలేదు. కపిల్ దేవ్, కె శ్రీకాంత్, సయ్యద్ కిర్మాణి, మోహిందర్ అమర్నాథ్ వంటి ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. వారి స్దానంలో మనోజ్ ప్రభాకర్, చేతన్ శర్మ, సురీందర్ ఖన్నా వంటి ఆటగాళ్లు మాత్రం తొట్ట తొలి ఆసియాకప్‌లో భాగమమయ్యారు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సునీల్ గావస్కర్ సారథ్యంలోని భారత బృందం అద్బుతం చేసింది.ఈ మ్యాచ్‌లో శ్రీలంకను ఏకంగా 10 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. అయితే తొలి ఎడిషన్‌లో కేవలం శ్రీలంక, భారత్, పాక్ జట్లు మాత్రమే తలపడ్డాయి. ఫైనల్లో పాక్‌ను చిత్తు చేసిన భారత్ తొట్ట తొలి ఆసియాకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.ఏకైక జట్టుగా శ్రీలంక..ఇప్పటివరకు 16 ఆసియాకప్‌లు జరిగితే అన్ని టోర్నీలో ఆడిన ఆడిన ఏకైక జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇక భారత్, పాకిస్తాన్‌లు చెరో 15 సార్లు ఆసియాకప్‌లో పాల్గొన్నాయి. శ్రీలంకతో క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్న కారణంగా 1986 టోర్నమెంట్‌ను భారత్ బహిష్కరించింది. అనంతరం భారత్ వేదికగా 1990-91 ఆసియాకప్‌ను పాక్ బాయ్‌కట్ చేసింది. ఇదే కారణంతో 1993లో ఆసియాకప్‌ను నిర్వహించలేదు. బంగ్లాదేశ్ కూడా 15 సార్లు ఆసియాకప్‌లో భాగమైంది.ఐసీసీ జోక్యం..కాగా 2015లో ఆసియాకప్‌నకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. టోర్నీ నిర్వహించే ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఐసీసీ అధికారాలు తగ్గించింది. ఇకపై ఆసియాకప్ రెండేళ్లకోసారి వన్డే, టి20 ఫార్మాట్లో రొటేషన్ పద్దతిలో జరుగుతుందని తెలిపింది.ఐసీసీ టోర్నీలకు అనుగుణంగా ఆసియాకప్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఫలితంగా 2016లో ఆసియాకప్‌ను తొలిసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు సన్నాహక టోర్నమెంట్‌గా అది ఉపయోగపడింది. మొట్టమొదటి ఆసియాకప్ టీ20 టోర్నీ టైటిల్‌ను కూడా టీమిండియానే కైవసం చేసుకుంది.తిరుగులేని భారత్..1984 నుంచి 2023 వరకు 16 సార్లు ఆసియా కప్‌ను నిర్వహించారు. 2022 లో చివరిసారిగా టీ20 ఫార్మాట్లో నిర్వహించగా, నాడు ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది. అయితే ఈ టోర్నీలో భారత జట్టుకు మాత్రం ఘనమైన రికార్డు ఉంది. ఇక ఆసియాకప్ చరిత్రలో భారత్ అత్యధికంగా ఎనిమిది సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అందులో 7 సార్లు వన్డే ఫార్మాట్లో టైటిల్‌ను సొంతం చేసుకోగా.. ఒక్కసారి టీ20 ఫార్మాట్లో టీమిండియా విజేతగా నిలిచింది. ఇక భారత్ తర్వాత శ్రీలంక ఆరు సార్లు, పాకిస్తాన్ రెండుసార్లు ఈ ట్రోఫీని ముద్దాడాయి.చదవండి: Asia Cup 2025: 'ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం -
Asia Cup: భారత జట్టు ఇదే
న్యూఢిల్లీ: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును గురువారం ప్రకటించారు. 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు జార్ఖండ్‌కు చెందిన 23 ఏళ్ల సలీమా టెటె సారథ్యం వహిస్తుంది. సెప్టెంబరు 5 నుంచి 14వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీకి చైనాలోని హాంగ్జౌ నగరం ఆతిథ్యమిస్తుంది. గ్రూప్ ‘బి’లో జపాన్, థాయ్‌లాండ్, సింగపూర్ జట్లతో కలిసి భారత్‌కు చోటు లభించింది.సెప్టెంబరు 5న థాయ్‌లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్... 6న జపాన్‌తో, 8న సింగపూర్‌తో పోటీపడుతుంది. గ్రూప్ ‘ఎ’లో చైనా, చైనీస్ తైపీ, దక్షిణ కొరియా, మలేసియా జట్లున్నాయి. ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం–నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆసియా కప్‌లో భారత జట్టు రెండుసార్లు (2004, 2017) చాంపియన్‌గా, రెండుసార్లు రన్నరప్‌గా (1999, 2009) నిలిచింది. భారత మహిళల హాకీ జట్టు: బన్సరీ సోలంకి, బిచ్చూ దేవి ఖరీబమ్ (గోల్ కీపర్లు), మనీషా చౌహాన్, ఉదిత, జ్యోతి, సుమన్ దేవి థౌడమ్, నిక్కీ ప్రధాన్, ఇషిక చౌధరీ (డిఫెండర్లు), నేహా, వైష్ణవి విఠల్ ఫాల్కే, సలీమా టెటె, షర్మిలా దేవి, లాల్రెమ్సియామి, సునీలితా టొప్పో (మిడ్ ఫీల్డర్లు), నవ్‌నీత్ కౌర్, రుతుజా పిసాల్, బ్యూటీ డుంగ్‌డుంగ్, ముంతాజ్ ఖాన్, దీపిక, సంగీత కుమారి (ఫార్వర్డ్స్).ఇదీ చదవండి: రజత పతకాలు నెగ్గిన రీనా, ప్రియ సమోకోవ్ (బల్గేరియా): ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో గురువారం భారత్‌కు రెండు రజత పతకాలు లభించాయి. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో రీనా (55 కేజీలు), ప్రియ (76 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలను గెల్చుకున్నారు. ప్రియ 0–4తో నదియా సొకోలవ్స్కా (ఉక్రెయిన్) చేతిలో, రీనా 2–10తో ఎవరెస్ట్ లెడెకర్ (అమెరికా) చేతిలో పరాజయం పాలయ్యారు.మరోవైపు 72 కేజీల విభాగంలో కాజల్ ఫైనల్లోకి దూసుకెళ్లి స్వర్ణ పతకం కోసం పోరాడనుంది. సెమీఫైనల్లో కాజల్ 13–6తో జాస్మిన్ (అమెరికా)పై విజయం సాధించింది. 50 కేజీల విభాగంలో శ్రుతి... 53 కేజీల విభాగంలో సారిక కాంస్య పతకాల కోసం పోటీపడనున్నారు. సెమీఫైనల్స్‌లో సారిక 0–10తో అనస్తాసియా పొలాస్కా (ఉక్రెయిన్) చేతిలో... శ్రుతి 0–11తో రింకా ఒగావా (జపాన్) చేతిలో ఓడిపోయారు. -
భారత్, పాక్ పోరుకు రాజముద్ర
ఒకవైపు పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారతీయుల్లో తీవ్ర ఆగ్రహం... మన దేశంలో ఉన్న పాక్ జాతీయులను వెంటనే వెనక్కి పంపడంతో పాటు అన్ని రకాల సంబంధాలు తెంచుకుంటూ ప్రభుత్వ స్పందన... ఇలాంటి స్థితిలో శత్రుదేశం పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు... స్వయంగా టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ తటస్థ వేదికల్లో కూడా ఆడకూడదంటూ వ్యాఖ్యలు ... వెటరన్ ఆటగాళ్ల ‘వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్’లో పాక్‌తో రెండు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగకుండా తప్పుకున్న భారత బృందంపై ప్రశంసలు...మరోవైపు ‘ఆ మ్యాచ్’ కోసమేనా అన్నట్లుగా ఆసియా కప్ వేదిక భారత్ నుంచి యూఏఈకి మారడం... కొద్ది రోజులకే షెడ్యూల్ విడుదల... జోరుగా ప్రచారం మొదలు పెట్టిన ప్రసారకర్తలు... భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కు 10 సెకన్ల ప్రకటనకు రూ. 16 లక్షల రేటు... చూస్తుండగానే టోర్నీలో పాల్గొనే జట్ల ప్రకటన... అయినా సరే చివరి నిమిషంలో మ్యాచ్ రద్దు కావచ్చని, లేదా భారత్ ఆడకుండా పాయింట్లు ఇవ్వవచ్చని చర్చ... కానీ అలాంటి అవసరం లేదని తేలిపోయింది. ఇప్పుడు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి భారత్, పాక్ పోరుకు ఆమోద ముద్ర వేసింది. న్యూఢిల్లీ: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరిగే మ్యాచ్ నిర్వహణపై ఉన్న సందేహాలు తొలగిపోయాయి. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌ను చూసేందుకు అమితోత్సాహంతో సిద్ధం కావచ్చు! ఆసియా కప్‌లో పాక్‌తో తలపడేందుకు కేంద్ర ప్రభుత్వం మన జట్టుకు అనుమతి ఇచ్చింది. ఇతర దేశాలు కూడా పాల్గొంటున్న ‘మల్టీలేటరల్ ఈవెంట్’ కావడంతో ఈ మ్యాచ్‌లో ఆడటంపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం లేదని ప్రకటించింది. టోర్నీ షెడ్యూల్ ప్రకారం చూస్తే ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ మ్యాచ్‌లపై ఉన్న ఆసక్తి, ప్రాధాన్యతను బట్టి చూస్తే తాజా ప్రకటనతో వాణిజ్యపరంగా భాగస్వాములందరూ సంతోషించే నిర్ణయం వెలువడటం విశేషం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేసింది. మార్గదర్శకాలతో స్పష్టత... భారత్, పాకిస్తాన్ మధ్య నిజానికి 2012–13 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కానీ ఇరు జట్లు ఐసీసీ టోర్నీలైన వన్డే, టి20 వరల్డ్ కప్‌లు, చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ మ్యాచ్‌లలో తలపడుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ ప్రకటనలో కొత్తగా పేర్కొన్న అంశం ఏమీ లేదు. అయితే దీనికే మరింత స్పష్టతనిస్తూ అధికారికంగా మార్గదర్శకాలు జారీ చేసింది. సరిహద్దు దేశాల మధ్య ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో క్రీడా సంబంధాల విషయంలో కేంద్రం వీటిని ప్రకటించింది. ‘క్రీడలకు సంబంధించి పాకిస్తాన్‌తో ఎలా వ్యవహరించాలనే విషయంపై ప్రభుత్వం తమ విధానాన్ని వెల్లడిస్తోంది. ఇరు జట్ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవు. మన జట్టు అక్కడికి వెళ్లి ఆడేందుకు లేదా ఆ జట్టు ఇక్కడికి వచ్చే ఆడేందుకు కూడా అనుమతించేది లేదు. అయితే పలు ఇతర జట్లతో ముడిపడి ఉన్న టోర్నీల విషయంలో ఆయా క్రీడల అంతర్జాతీయ సంఘాల నిబంధనలను, మన ఆటగాళ్లను కూడా దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. భారత్ పెద్ద ఈవెంట్ల వేదికగా మారుతున్న అంశాన్ని కూడా చూడాలి. కాబట్టి ఇలాంటి ఈవెంట్లలో పాక్ ఆడుతున్నా సరే మన జట్టు పాల్గొనవచ్చు. భారత్ ఆతిథ్యం ఇచ్చే ఇలాంటి టోర్నీల్లో కూడా పాకిస్తాన్ ఆడేందుకు అభ్యంతరం లేదు’ అని కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనలో పేర్కొంది. అధికారుల కోసం వీసా సడలింపులు... భవిష్యత్‌లో కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్ కూడా నిర్వహించాలని ఆశిస్తున్న నేపథ్యంలో మన దేశానికి అత్యుత్తమ వేదికగా గుర్తింపు రావాలని కూడా కేంద్రం భావిస్తోంది. అందుకే వివిధ క్రీడా ఈవెంట్ల సమయంలో వీసాలు జారీ చేసే విషయంపై కూడా ప్రకటనలో వివరంగా పేర్కొంది. ‘క్రీడాకారులు, అధికారులు, సాంకేతిక సిబ్బందితో పాటు అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులకు వారి అధికారిక పర్యటన సమయం, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని వీసాలు జారీ చేస్తాం. ఇది గరిష్టంగా ఐదేళ్లు ఉంటుంది. టోర్నీల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి వచ్చే అధికారులకు ఇబ్బంది లేకుండా తమ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఇది ఉపకరిస్తుంది’ అని కేంద్రం వెల్లడించింది. -
Asia Cup 2025: పాక్ అవుట్.. భారత జట్టు ఇదే
స్వదేశంలో ఈనెల 29 నుంచి జరిగే ఆసియాకప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును బుధవారం ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు ‘డ్రాగ్ ఫ్లికర్’ హర్మన్‌ప్రీత్ సింగ్ నాయ కత్వం వహిస్తాడు. సెప్టెంబరు 7వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో ఎనిమిది దేశాలు పోటీపడతాయి. విజేతగా నిలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం–నెదర్లాండ్స్‌లలో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది.టైటిల్ పోరు బాట ఇలాచైనాతో ఈనెల 29న జరిగే గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌తో భారత్ తమ టైటిల్ వేటను మొదలుపెడుతుంది. అనంతరం ఆగస్టు 31న జపాన్‌తో, సెప్టెంబరు 1న కజకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా, మలేసియా, చైనీస్ తైపీ, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు ‘సూపర్–4’ దశకు చేరుకోనున్నాయి. ‘సూపర్–4’లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెప్టెంబరు 7న టైటిల్ కోసం తలపడతాయి. ఇదిలా ఉంటే.. భారత్‌లో జరిగే ఈ ఆసియాకప్ టోర్నీ నుంచి పాకిస్తాన్ వైదొలిగింది. ఆ జట్టు స్థానంలో బంగ్లాదేశ్ గ్రూప్-‘బి’లో చేరింది.భారత పురుషుల హాకీ జట్టు: కృషన్ పాఠక్, సూరజ్ కర్కేరా (గోల్ కీపర్లు), సుమిత్, జర్మన్‌ప్రీత్ సింగ్, సంజయ్, హర్మన్‌ప్రీత్ సింగ్, జుగ్రాజ్ సింగ్, అమిత్ రోహిదాస్ (డిఫెండర్లు), రాజిందర్ సింగ్, రాజ్‌కుమార్ పాల్, హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్ (మిడ్‌ఫీల్డర్లు), మన్దీప్ సింగ్, శిలానంద్ లాక్రా, అభిషేక్, సుఖ్జీత్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్ (ఫార్వర్డ్స్). -
వైస్ కెప్టెన్‌గా గిల్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో బ్యాటర్‌గా అసాధారణ ప్రదర్శన కనబర్చడంతో పాటు నాయకుడిగా కూడా సత్తా చాటిన శుబ్‌మన్ గిల్ ఇప్పుడు టి20ల్లో కూడా పునరాగమనం చేశాడు. దాదాపు ఏడాది కాలంగా ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉన్న గిల్‌ను ఇప్పుడు జట్టులోకి ఎంపిక చేయడంతో పాటు వైస్ కెప్టెన్సీ కూడా ఇచ్చి భవిష్యత్తులో అతడిని అన్ని ఫార్మాట్లలో సారథిగా చూడాలనుకుంటున్నట్లు బీసీసీఐ సందేశం ఇచ్చింది. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత బుమ్రా మళ్లీ టి20ల్లో ఆడనుండగా... అనూహ్యంగా హర్షిత్ రాణా, జితేశ్ శర్మలకు చోటు దక్కింది. ఐపీఎల్లో అద్భుతంగా ఆడిన శ్రేయస్ అయ్యర్, ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌లను కూడా ఎంపిక చేయకుండా ఆసియా కప్ కోసం టీమిండియాను సెలక్టర్లు ప్రకటించారు.ముంబై: ఆసియా కప్ టి20 టోర్నీలో పాల్గొనే భారత పురుషుల క్రికెట్ జట్టును అజిత్ అగార్కర్ నాయకత్వంలో సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని 15 మంది సభ్యుల జట్టుకు శుబ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. మరో ఐదుగురు ఆటగాళ్లను రిజర్వ్‌లుగా ఎంపిక చేశారు.సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఆసియా కప్ టోర్నీ జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చిలో భారత్‌లో జరిగే టి20 వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా దాదాపు 20 మ్యాచ్‌లు ఆడనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుంటూ జట్టును ఎంపిక చేశారు. కీపర్‌గా జితేశ్‌కు చాన్స్... శుబ్‌మన్ గిల్ ఏడాది క్రితం తన చివరి టి20 ఆడాడు. శ్రీలంకతో జరిగిన ఆ సిరీస్‌లో అతను వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ఆ తర్వాత టెస్టులు, వన్డేల కారణంగా టి20లు ఆడలేదు. ఇప్పుడు తాజాగా ఇంగ్లండ్‌తో టెస్టుల్లో చూపించిన ఫామ్‌తో పాటు ఐపీఎల్లో కూడా రాణించడంతో సెలక్టర్లు అతడిని మళ్లీ జట్టులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే వన్డే జట్టుకు కూడా వైస్ కెప్టెన్‌గా ఉన్న అతను మున్ముందు కెప్టెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దూకుడు మీదున్న అభిషేక్ శర్మతో కలిసి అతను ఓపెనింగ్ చేస్తాడు. గిల్ రాకతో తుది జట్టులో సంజు సామ్సన్‌కు చోటు దక్కడం కష్టమే. అందుకే ఫినిషింగ్‌కు తగినవాడిగా భావిస్తూ వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మను ఎంపిక చేశారు. బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మకు ఢోకా లేకుండా పోయింది. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత టి20లు ఆడని బుమ్రా, కుల్దీప్ ఈ కీలక టోర్నీతో మళ్లీ బరిలోకి దిగుతున్నారు. ఇతర బౌలర్లు వరుణ్ చక్రవర్తి, అర్‡్షదీప్ సింగ్ మరో చర్చకు తావు లేకుండా జట్టులో నిలిచారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబేల రూపంలో ముగ్గురు ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. హర్షిత్‌కు మరో అవకాశం ఐపీఎల్లో 604 పరుగులు సాధించడంతో పాటు పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చిన శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ ఫార్మాట్లో సెలక్టర్లు అతనిపై నమ్మకం ఉంచట్లేదు. అభిషేక్ మెరుపు బ్యాటింగ్ కారణంగా జైస్వాల్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇప్పటికే ముగ్గురు స్పిన్నర్లు ఉండటంతో సుందర్‌ను కూడా ఎంపిక చేయకుండా స్పెషలిస్ట్ బ్యాటర్‌గా రింకూ సింగ్‌ను తీసుకున్నారు. పేసర్ హర్షిత్ రాణా ఎంపిక మాత్రం అనూహ్యం. ఏకైక టి20 ఆడిన అతను ఐపీఎల్‌లోనూ రాణించలేదు. అయితే ప్రసిధ్ కృష్ణతో పోలిస్తే కాస్త బ్యాటింగ్ చేయగలగడం అతనికి సానుకూలంగా మారింది. భారత టి20 జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్), గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్, సామ్సన్, తిలక్, దూబే, హార్దిక్, జితేశ్, అక్షర్, రింకూ సింగ్, కుల్దీప్, హర్షిత్, బుమ్రా, అర్ష్ దీప్, వరుణ్ చక్రవర్తి. రిజర్వ్: ప్రసిధ్ కృష్ణ, సుందర్, రియాన్ పరాగ్, జురేల్, యశస్వి జైస్వాల్. ఇంగ్లండ్‌లో మా అంచనాలకు మించి రాణించి గిల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. నాయకత్వ లక్షణాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గిల్, జైస్వాల్ లేకపోవడం వల్లే అభిషేక్ శర్మ, సామ్సన్ జట్టులోకి వచ్చారనే విషయం మర్చిపోవద్దు. అభిషేక్‌ను పక్కన పెట్టే పరిస్థితి లేదు కాబట్టి దురదృష్టవశాత్తూ జైస్వాల్‌కు స్థానం దక్కలేదు. బుమ్రాకు మళ్లీ విశ్రాంతినిచ్చే విషయంలో ఎలాంటి ప్రణాళికలు లేవు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీలో రాణించడంతోనే జితేశ్‌ను ఎంపిక చేశాం. శ్రేయస్ విషయంలో అతని తప్పుగానీ, మా తప్పుగానీ లేదు. ఎవరి స్థానంలో అతడిని తీసుకుంటాం? తన అవకాశం కోసం అతను ఎదురు చూడాల్సిందే. – అజిత్ అగార్కర్, చీఫ్ సెలక్టర్ -
ఆసియా కప్ హాకీ టోర్నీ మస్కట్ ‘చాంద్’ ఆవిష్కరణ
రాజ్‌గిర్ (బిహార్): ఈ నెలాఖరులో భారత్ ఆతిథ్యమిచ్చే ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నీకి సంబంధించి కనువిందు చేసే ‘మస్కట్’ను ఆదివారం ఆవిష్కరించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధికారిక మస్కట్‌గా ‘చాంద్’ (చందమామ)ను ఆవిష్కరించారు. భారత దివంగత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ ప్రాక్టీస్ స్ఫూర్తితో పాటు బిహార్‌లోని ప్రఖ్యాత వాల్మీకి టైగర్ రిజర్వ్‌లోని పులుల శౌర్యానికి ప్రతీకగా ‘చాంద్’ను ఆవిష్కరించినట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) తెలిపింది. ఫ్లడ్‌లైట్లు కాదు కదా... కనీసం పూర్తిస్థాయి వీధి దీపాలు లేని ఆ రోజుల్లో చందమామ పంచిన వెన్నెల వెలుగుల్లోనే ధ్యాన్‌చంద్ తన ప్రాక్టీస్‌ను పూర్తి చేసేవారు. ఆ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఆయన పుట్టిన రోజున (ఆగస్టు 29) మొదలయ్యే ఆసియా కప్ టోర్నీకి ‘చాంద్’ మస్కట్‌ను ఖరారు చేశారు. సెపె్టంబర్ 7 వరకు రాజ్‌గిర్‌లోని స్టేడియంలో ఈ టోర్నీ జరుగుతుంది. ఆసియా దేశాలు పాల్గొనే ఈ టోర్నీలో మొదట్లో ఆసక్తి కనబరిచిన దాయాది పాకిస్తాన్ జట్టు చివరకు వైదొలగింది. పాకిస్తాన్ స్థానంలో బంగ్లాదేశ్ బరిలోకి దిగనుంది. ఆసియా కప్ టోర్నీ విజేత వచ్చే ఏడాది ఆగస్టులో బెల్జియం–నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది. 16 జట్లు పోటీపడే ప్రపంచకప్ టోర్నీకి ఇప్పటికే ఆస్ట్రేలియా, స్పెయిన్, అర్జెంటీనా, జర్మనీ, న్యూజిలాండ్ జట్లు అర్హత సాధించాయి. -
పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడటమేంటి?.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: ఆసియా కప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరగబోయే క్రికెట్ మ్యాచ్‌పై ఎంఐఎం అధినేత, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్తం, నీళ్లు కలిసి ప్రవహించలేవు.. పాకిస్తాన్‌తో భారత్ క్రికెట్ ఎలా ఆడుతుంది అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మ్యాచ్‌కు బీసీసీఐ ఎలా అనుమతి ఇచ్చింది అంటూ నిలదీశారు.ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జాతీయ మీడియా పోడ్ కాస్ట్లో మాట్లాడుతూ..‘నీళ్ళు, రక్తం కలిసి ప్రవహించలేవని.. చర్చలు, ఉగ్రవాదం కలిసి సాగలేవని ప్రధానమంత్రి మోదీ స్వయంగా చాలా సార్లు చెప్పారు. ఇలా మాట్లాడి.. మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్‌తో ఎలా క్రికెట్ ఆడుతారు. దుబాయ్‌లో పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నామని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. నేను ఈ మ్యాచ్‌ను చూడను. పాక్‌తో భారత్.. వాణిజ్య సంబంధాలను తెంచుకున్నారు, గగనతలాన్ని మూసివేశారు. కానీ, మీరు క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నారా? ప్రశ్నించారు. పాక్‌తో ఆడటానికి కేంద్రం ఎలా అనుమతి ఇస్తుంది. భారతదేశంలో క్రికెట్ అనేది ఒక వ్యామోహం. క్రికెట్ ప్రతీ దాన్ని స్తంభింపజేస్తుంది అని అన్నారు.ఇదే సమయంలో పహల్గాం ఉగ్రవాద దాడిలో ప్రజలు వారి కుటుంబ సభ్యుల ముందే చనిపోయారు. ఈ దాడి నన్ను తీవ్రంగా బాధించింది. ఈ ఘటన చాలా దారుణం. భార్యాపిల్లల ముందే తమ వారిని ఎవరైనా హత్య చేయడం బాధాకరం. ఇంత దారుణం జరిగినప్పుడు పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడటంలో అర్థం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం మ్యాచ్‌కు అనుమతి ఇస్తుంది?. పాక్, భారత్ మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు.అలాగే, హిందూ ఉగ్రవాదం అనేదే లేదు అని హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనకు ప్రతిస్పందిస్తూ.. మహాత్మా గాంధీని ఎవరు చంపారు? ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను ఎవరు చంపారు?. మహాత్మా గాంధీని ఎవరు చంపారో అమిత్ షా మర్చిపోయి ఉండవచ్చు అంటూ వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో భద్రతా లోపానికి జవాబుదారీతనం వహించాలి. భారీ సైనిక ఉనికి ఉన్నప్పటికీ ఉగ్రవాదులు ఎలా ప్రవేశించారు?. పౌరులను ఎలా హత్య చేయగలిగారు?. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటికీ ఉగ్రవాద నిరోధక చర్యలు విఫలమయ్యాయి’ అని విమర్శించారు. -
మేటి జట్టుతో ఆడినపుడే...
బెంగళూరు: ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా వంటి మేటి జట్టుతో తలపడితే లోపాలు సవరించుకొని మరింత మెరుగయ్యే అవకాశం ఉంటుందని భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ నెల 29 నుంచి రాజ్‌గిర్ వేదికగా పురుషుల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ ప్రారంభం కానుండగా... అంతకుముందు భారత జట్టు ఆ్రస్టేలియాలో పర్యటిస్తోంది. ఈ టూర్లో భాగంగా పెర్త్‌లోని హాకీ స్టేడియంలో ఆతిథ్య ఆ్రస్టేలియాతో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. దీని కోసం శుక్రవారం బెంగళూరు నుంచి జట్టు ఆ్రస్టేలియాకు పయనమైంది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ... ‘ఆ్రస్టేలియా వంటి బలమైన ప్రత్యర్థితో వారి సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడటం సవాలుతో కూడుకున్నది. ఆసియా కప్ ప్రారంభానికి ముందు ఇలాంటి క్లిష్టమైన సిరీస్ ఆడనుండటం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మేమంతా ఇలాంటి సన్నద్ధతే కోరుకున్నాం. ఆసియా కప్ కోసం జట్టును సిద్ధం చేసుకునేందుకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది. బలమైన ప్రత్యర్థితో తలపడినప్పుడే మన లోపాలు బయటపడతాయి. వాటిని ఎలా అధిగమించాలో మార్గాలు వెతికి మరింత మెరుగైన ప్రదర్శన చేయవచ్చు. జట్టు మొత్తం సమష్టిగా రాణించాలని భావిస్తున్నాం. ఈ సన్నద్ధత ఆసియా కప్‌లో తప్పక ఉపయోగపడుతుంది’ అని అన్నాడు. ఆగస్టు 15, 16, 19, 21న పెర్త్‌లో భారత్, ఆ్రస్టేలియా మధ్య హాకీ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రదర్శన ఆధారంగా ఆసియాకప్ తుది జట్టు కూర్పు ఉండనుంది. మెరుగైన ఆటతీరు కనబర్చిన ప్లేయర్లనే ఆసియాకప్‌నకు ఎంపిక చేయనున్నారు. ప్రస్తుత జట్టులో అటు అనుభవజ్ఞు, ఇటు యువకులు ఉండటంతో... ఆ్రస్టేలియాపై వారి ఆటతీరును అంచనా వేసిన తర్వాతే ఆసియాకప్‌నకు జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ టోర్నీలో సత్తా చాటిన జట్టు వరల్డ్‌కప్‌నకు నేరుగా అర్హత సాధించనుంది. -
చైనా చేతిలో భారత్ పరాజయం
జిద్దా (సౌదీ అరేబియా): ఆసియా కప్ పురుషుల బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో భారత్ 69–100 పాయింట్ల తేడాతో చైనా జట్టు చేతిలో ఓటమి చవిచూసింది. తొలి క్వార్టర్లో భారత్ 14 పాయింట్లు, చైనా 29 పాయింట్లు... రెండో క్వార్టర్లో భారత్ 17 పాయింట్లు, చైనా 24 పాయింట్లు... మూడో క్వార్టర్లో భారత్ 17 పాయింట్లు, చైనా 22 పాయింట్లు... చివరిదైన నాలుగో క్వార్టర్లో భారత్ 21 పాయింట్లు, చైనా 25 పాయింట్లు స్కోరు చేశాయి. భారత్ తరఫున అరవింద్ ముత్తు కృష్ణన్ 16 పాయింట్లు, సహజ్ సెఖోన్ 14 పాయింట్లు, ప్రణవ్ ప్రిన్స్ 14 పాయింట్లు సాధించారు. చైనా తరఫున మింగ్‌జువాన్ జు, జియాజి జావో 17 పాయింట్ల చొప్పున... షుయెపెంగ్ చెంగ్, జున్‌జీ వాంగ్ 13 పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. నాలుగు జట్లను గ్రూప్ ‘సి’లో రెండు మ్యాచ్‌ల్లో ఓడిన టీమిండియా నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలకు దాదాపుగా తెరపడింది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను శనివారం ఆతిథ్య సౌదీ అరేబియాతో ఆడుతుంది. -
ఏడు స్థానాలు ఎగబాకి...
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీకి అర్హత సాధించిన భారత మహిళల జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ పురోగతి సాధించింది. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఏడు స్థానాలు ఎగబాకి 63వ ర్యాంక్‌లో నిలిచింది. గత రెండేళ్లలో భారత జట్టుకిదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. 2023 ఆగస్టులో టీమిండియా 61వ స్థానంలో నిలిచింది. 2013లో భారత జట్టు తమ అత్యుత్తమ ర్యాంక్ (49)ను అందుకుంది. థాయ్‌లాండ్‌లో ఇటీవల జరిగిన ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ అజేయంగా నిలిచింది. భారత్... మంగోలియాపై 13–0తో... 4–0తో తిమోర్ లెస్టెపై, 5–0తో ఇరాక్‌పై, చివరి మ్యాచ్‌లో 2–1తో థాయ్‌లాండ్‌పై గెలిచింది. ‘టాప్’ ర్యాంక్‌లో స్పెయిన్ మరోవైపు యూరోపియన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన స్పెయిన్ జట్టు వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించింది. ‘టాప్’ ర్యాంక్‌లో ఉన్న అమెరికాను స్పెయిన్ రెండో స్థానానికి నెట్టేసింది. స్వీడన్ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని మూడో ర్యాంక్‌కు చేరుకోగా... యూరోపియన్ టైటిల్ నిలబెట్టుకున్న ఇంగ్లండ్ ఒక స్థానం పురోగతి సాధించి నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. -
అహ్మదాబాద్‌లో ఆసియా కప్ అండర్–17 క్వాలిఫయర్స్ టోర్నీ
న్యూఢిల్లీ: ఆసియా కప్ అండర్–17 ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్ టోర్నీకి భారత్ కూడా ఓ వేదికైంది. ఆసియా కప్–2026 కోసం నిర్వహించే క్వాలిఫయర్స్‌కు ఏడు దేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఇందులో భారత్ కూడా ఉంది. భారత్‌కు సంబంధించిన పోటీలను ఈ నవంబర్ 22 నుంచి 30 వరకు అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిసింది. పాల్గొనే మొత్తం 38 దేశాల జట్లను ఏడు గ్రూప్‌లుగా విభజిస్తారు. మూడు గ్రూప్‌ల్లో ఆరేసి జట్లు, నాలుగు గ్రూప్‌ల్లో ఏడేసి జట్లు ఉంటాయి. దీనికి సంబంధించిన ‘డ్రా’ను రేపు తీయనున్నారు. ఈ ఏడు గ్రూప్‌ల విజేత జట్లు సౌదీ అరేబియాలో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఇంతకుముందే 9 జట్లకు డైరెక్ట్ ఎంట్రీ లభించింది. ఈ ఏడాది ఖతర్‌లో జరిగిన అండర్–17 ప్రపంచకప్‌లో తలపడటం ద్వారా 9 జట్లకు ఈ అవకాశం లభించింది. ఆసియాకప్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత్ కూడా వేదికవడం పట్ల అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే హర్షం వ్యక్తం చేశారు.అండర్–17 ఫిఫా ప్రపంచకప్ నిర్వహించే సత్తా తమకు ఉందని ఏఎఫ్సీ క్వాలిఫయర్స్ ద్వారా నిరూపించుకుంటామని చెప్పారు. అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలకు తీసిపోని విధంగా తీర్చిదిద్దిన స్టేడియంలో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
యూఏఈలో ఆసియా కప్!
న్యూఢిల్లీ/ఢాకా: భారత్‌లో జరగాల్సిన ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించేందకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. ఢాకాలో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో బీసీసీఐ ఈ మేరకు చర్చించినట్లు తెలిసిది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే ఏసీసీ వెల్లడించనుంది. ఏసీసీలోని మొత్తం 25 సభ్య దేశాలు ఈ మీటింగ్‌లో పాల్గొన్నాయి. మొదట్లో ఈ సమావేశానికి బీసీసీఐ గైర్హాజరైనట్లు మీడియాలో వార్తలొచ్చాయి. కానీ భారత బోర్డు నుంచి సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వర్చువల్‌గా (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) పాల్గొన్నట్లు బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి.‘ఆసియా కప్‌ను యూఏఈలో నిర్వహించనున్నాం. టీమిండియా మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడనుంది. షెడ్యూల్‌పై చర్యలు ఇంకా జరుగుతున్నాయి’ అని ఏసీసీ వర్గాలు వెల్లడించాయి. ఏసీసీ చైర్మన్ మోసిన్ నఖ్వీ మాట్లాడుతూ 25 సభ్య దేశాలన్నీ పాల్గొన్నాయని, బీసీసీఐతో సంప్రదింపులు పూర్తయిన వెంటనే తుది షెడ్యూలును త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు. పూర్తిగా క్రికెట్ క్రీడ, అనుబంధ, సభ్యదేశాల్లో ఆట గురించే తప్ప ఇతరత్రా రాజకీయ అంశాలేవీ చర్చించలేదని ఆయన చెప్పారు. బీసీసీఐ భౌతికంగా పాల్గొనకపోవడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘అది అసలు సమస్యే కాదు. ఎందుకంటే నేను కూడా సింగపూర్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో భౌతికంగా పాల్గొనలేదు’ అని అన్నారు. సెపె్టంబర్లో రెండు వారాల్లోనే ఈ టి20 టోర్నీని ముగించే ప్రణాళికల్లో బీసీసీఐ ఉంది. ఎందుకంటే ఆ నెలాఖరి వారంలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్ మొదలు కానుంది. భారత్‌లో ఎందుకు జరగడం లేదు? భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి. ఫిబ్రవరిలో జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం భారత్‌లో ఈ సారి ఆసియా కప్‌ను టి20 ఫార్మాట్లో నిర్వహించాలనుకున్నారు. అయితే పాక్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌ల్ని దుబాయ్‌లో ఆడింది. ఆ సందర్భంలోనే ఇకపై పాక్ కూడా తమ మ్యాచ్‌ల్ని తటస్థ వేదికైన శ్రీలంక, లేదంటే యూఏఈలో ఆడుతుందని ఈ మేరకు ఒప్పందం కూడా జరిగింది. అయితే ఇటీవలే పాక్ వైఖరిలో మార్పు వచ్చింది. భారత్‌లో ఆడేందుకు సై అంటూ సంకేతాలిచ్చింది. సాక్షాత్తూ పాకిస్తాన్ క్రీడాశాఖ మంత్రే ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ భారత్‌లో పహల్గామ్లో ఉగ్రమూకల ఊచకోత అనంతరం భద్రతా దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో యుద్ధవాతావరణ పరిస్థితులు తలెత్తాయి. చివరకు కాల్పుల విరమణతో ఉద్రిక్తతలకు తెరపడింది. అయితే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురై నెలలు గడవకముందే పాక్ ఆటగాళ్లను భారత్‌లోకి అనుమతిస్తే వచ్చే సమస్యలు, విమర్శలను ముందే గుర్తించిన బీసీసీఐ తమ ఆతిథ్యాన్ని యూఏఈలో ఇచ్చేందుకు సిద్ధపడింది. -
పట్టుదల...పోరాటం...అద్భుతం
జనవరి 2022... ఆతిథ్య దేశం హోదాలో భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు ఆసియా కప్‌లో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అయితే ఒక్కసారిగా ప్రపంచాన్ని తలకిందులు చేసిన కోవిడ్ మహమ్మారి ప్రభావం ఈ జట్టుపై కూడా పడింది. చైనీస్ తైపీతో తొలి మ్యాచ్ సమయానికి కోవిడ్ కారణంగా మన జట్టుకు కనీసం 13 మంది ప్లేయర్లు కూడా అందుబాటులో లేకుండా పోయారు. దాంతో నిబంధనల ప్రకారం మొదటి మ్యాచ్ నుంచే కాకుండా మొత్తం టోర్నీ నుంచి టీమ్ తప్పుకోవాల్సి వచ్చింది. క్వాలిఫయింగ్ పోటీలు లేని సమయంలో 2003లో చివరిసారిగా ఆసియా కప్‌కు నేరుగా అర్హత సాధించిన మన జట్టు ఈసారి ఎంతో ఉత్సాహంతో, పట్టుదలతో సొంతగడ్డపై ఆసియా కప్‌కు సన్నద్ధమైంది. అయితే అనూహ్య పరిణామాలు ఎదురు కావడం మన మహిళలకు ఇది తీరని వేదన మిగిల్చింది. ఇప్పుడు మూడున్నరేళ్ల తర్వాత క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటి మన మహిళలు దర్జాగా ఆసియా కప్‌కు అర్హత సాధించారు. అయితే గత టోర్నీ, ప్రస్తుత క్వాలిఫికేషన్‌కు మధ్య ఎంతో పోరాటం ఉంది. సవాళ్లు, ప్రతికూలతలు అధిగమించి అమ్మాయిలు సాధించిన ఈ గెలుపునకు ఎంతో ప్రత్యేకత ఉంది. సాక్షి క్రీడా విభాగం : ఆసియా కప్‌లో ఆడకుండానే బరి నుంచి తప్పుకోవడం మొదలు ఇప్పుడు అర్హత సాధించడం వరకు భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. సరైన దిశా నిర్దేశం లేకుండా, అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) తమ బాధ్యతను మరిచి పట్టించుకోకపోవడంతో అనాథలా కనిపించింది. అసలు జాతీయ జట్టు ఉందనే విషయాన్ని కూడా అంతా మర్చిపోయారు. ఒకటా, రెండా ఎన్నో పరిణామాలు మహిళల ఫుట్‌బాల్ పతనానికి దారి తీశాయి. అండర్–17 జట్టు కోచ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, ‘శాఫ్’ టోర్నీ సెమీస్‌లో నేపాల్ చేతిలో పరాజయం, అండర్–17 వరల్డ్ కప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓడి నిష్క్రమణ, ఆసియా క్రీడల్లో చివరి స్థానం, ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో ఆఖరి స్థానం, పేరుకే ఇండియన్ ఉమెన్ లీగ్ ఉన్నా కనీస సౌకర్యాలు కల్పించలేని ఫెడరేషన్... ఇలా మహిళల జట్టుకు సమస్యలు నిర్విరామంగా సాగుతూనే వచ్చాయి. ఇలాంటి స్థితి నుంచి పైకి లేచి మన టీమ్ ఆసియా కప్‌కు అర్హత సాధించడం చిన్న విషయమేమీ కాదు. నాలుగు మ్యాచ్‌లలో నాలుగూ గెలవడం అసాధారణ ప్రదర్శనగా చెప్పవచ్చు. ముఖ్యంగా కొంత మంది ప్లేయర్లకు వ్యక్తిగతంగా కూడా ఇది ఎంతో ప్రత్యేక ఘనత. అందుకే థాయ్‌లాండ్‌తో మ్యాచ్ గెలవగానే వారంతా కన్నీళ్లపర్యంతమయ్యారు. వారి భావోద్వేగాలను నిలువరించడం ఎవరి వల్లా కాలేదు. వరుసగా కోచ్‌ల మార్పు... భారత మహిళల జట్టుకు ఎదురైన ఇటీవలి అనుభవాలు చూస్తే టీమ్ ఎలా నడుస్తోందో అర్థమవుతుంది. సంవత్సరాల తరపడి స్వయంగా ఫెడరేషన్ నిర్వహించే లీగ్‌లో కూడా ఆట జరుగుతుందా లేదా అనే సందేహాలు, జాతీయ శిబిరానికి వెళ్లినా తర్వాతి రోజు కోచ్ వస్తాడా లేదా అనుమానం, అసలు మహిళలుగా తమకు కనీస భద్రత కూడా ఉంటుందా లేదా అని పరిస్థితిని వారు దాటుకుంటూ వచ్చారు. ఏఐఎఫ్ఎఫ్ వరుసగా కోచ్‌లను మారుస్తూ పోయింది. డెనర్‌బై, సురేన్ ఛెత్రి, ఛోబా దేవి, సంతోష్ కశ్యప్, జోకిమ్ అలెగ్జాండర్సన్... ఇలా కోచ్‌లు రావడం, పోవడం జరిగిపోయాయి. చివరకు క్రిస్పిన్ ఛెత్రి చేతుల్లోకి కోచింగ్ బాధ్యతలు వచ్చాయి. అతనికి అసిస్టెంట్‌గా పీవీ ప్రియను తీసుకున్నారు. ఆసియా కప్ కోసం మన జట్టు థాయ్‌లాండ్‌లో అడుగు పెట్టినప్పుడు కూడా ఎలాంటి అంచనాలు లేవు. 2022లో కోవిడ్ కారణంగా టోర్నీకి దూరమైన జట్టులో ఉన్నవారిలో చాలామంది ఈ సారి కూడా టీమ్‌లో ఉన్నారు. నాటి గాయం వారి మనసుల్లో ఇంకా మిగిలే ఉంది.కోచ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ వివాదం వచ్చినప్పుడు అండర్–17 టీమ్‌లో భాగమైన హేమమ్ షిల్కీ దేవి, లిండా కోమ్, మార్టినా తోక్చోమ్ ఇప్పుడు సీనియర్ టీమ్‌లో ఉన్నారు. పురుషుల ఫుట్‌బాల్ జట్టు చిత్తుగా ఓడిన సందర్భాల్లోనూ వార్తల్లో ఉంటుండగా... మహిళల టీమ్‌ను అసలు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి స్థితిలో వారు తమ పోరాటాన్ని మొదలు పెట్టారు. పటిష్ట ప్రత్యర్థి ని పడగొట్టి... మంగోలియాపై 13–0తో, తిమోర్ లెస్టెపై 4–0తో, ఆపై ఇరాక్‌పై 5–0తో ఘన విజయం... అంచనాలకు భిన్నంగా చక్కటి ప్రదర్శనతో మన మహిళలు వరుసగా మూడు విజయాలు సాధించారు. అయితే సరే ఆసియా కప్ క్వాలిఫికేషన్‌పై ఇంకా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే చివరి లీగ్‌లో ఆతిథ్య థాయ్‌లాండ్ ప్రత్యరి్థగా ఎదురైంది. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో మనకంటే ఎంతో ముందుండటం మాత్రమే కాదు, ఈ టీమ్ గత రెండు ‘ఫిఫా’ వరల్డ్ కప్‌లు కూడా ఆడింది. పైగా పెద్ద సంఖ్యలో విదేశీ ఆటగాళ్లు ఉండటంతో పాటు ప్రముఖ జపాన్ కోచ్ ఫుటోషీ ఐకెడా కోచింగ్ ఇస్తున్నాడు. మనకంటే బలమైన థాయ్‌లాండ్ జట్టు ఆరంభంలోనే దూకుడుగా ఆడి గోల్‌పోస్ట్‌పై దాడులు చేస్తూ ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే భారత్ పదునైన డిఫెన్స్‌తో వాటిని నిలువరించగలిగింది. తాము ఇంత కాలంగా పడిన ఆవేదన, చేసిన పోరాటం వారిలో ఒక్కసారిగా స్ఫూర్తి నింపినట్లుంది. అంతే... ఆ తర్వాత జట్టులో ఒక్కసారిగా కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రత్యర్థి ఎవరనేది పట్టించుకోకుండా చివరి వరకు పట్టు విడవకుండా చెలరేగిన జట్టు విజయాన్ని అందుకుంది.అన్ని రకాలుగా సన్నద్ధమై...మ్యాచ్ ముగిశాక సంగీత బస్ఫోర్ ఆనందానికి హద్దుల్లేవు. రెండు గోల్స్‌తో ఆమె ఈ చిరస్మరణీయ విజయంలో కీలకపాత్ర పోషించింది. కోవిడ్ కారణంగా 2022 ఆసియా కప్‌కు జట్టుకు దూరంగా కాగా, అంతకుముందే గాయంతో సంగీత టోర్నీ నుంచి తప్పుకుంది. 2019 నుంచి జట్టులో ప్రధాన సభ్యురాలిగా ఉన్న ఆమె ఆపై కోలుకోవడానికి ఏడాది పట్టింది. అదే సమయంలో ఆమె తండ్రిని కూడా కోల్పోయింది. సీనియర్ ప్లేయర్ అయిన తనకు భవిష్యత్తులో మళ్లీ ఎప్పుడు ఈ స్థాయిలో విజయానందం వరిస్తుందో అంటూ ఆమె ఆనందభాష్పాలు రాల్చింది. టోర్నీకి ముందు తమదైన రీతిలో ప్లేయర్లు సన్నద్ధమయ్యారు. మనీషా కళ్యాణ్, జ్యోతి చౌహాన్, తెలంగాణ ప్లేయర్ గుగులోత్ సౌమ్య యూరోపియన్ క్లబ్స్ ట్రయల్స్‌కు వెళ్లి కాంట్రాక్ట్‌లు పొంది తమ ఆటకు పదును పెట్టారు. మిగిలిన వారు ఐ–లీగ్‌లో బరిలోకి దిగి సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టారు. ఈ విజయం కచ్చితంగా ఏఐఎఫ్ఎఫ్ది మాత్రం కాదు. తమ శక్తి, స్వేదం, కన్నీళ్లు ధారబోసిన 23 మంది మహిళా ఫుట్బాలర్లదే. వచ్చే ఏడాది ఆసియాకప్‌లో కూడా ఇదే రీతిలో సత్తా చాటితే వరల్డ్ కప్‌లో పాల్గొనే స్వప్నం కూడా సాకారమవుతుంది. -
సత్తా చాటిన భారత అమ్మాయిలు
చియాంగ్ మై (థాయిలాండ్): భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు అసలు సమయంలో చెలరేగింది. క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటి ఆసియా కప్‌కు అర్హత సాధించింది. 2003 తర్వాత మన మహిళలు ఆసియా కప్ నేరుగా అర్హత సాధించడం ఇదే తొలిసారి. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–1 గోల్స్ తేడాతో ఆతిథ్య జట్టు థాయిలాండ్‌ను ఓడించింది. భారత్ తరఫున సంగీత బస్ఫోర్ రెండు గోల్స్ (28వ నిమిషం, 78వ నిమిషం) సాధించడం విశేషం. థాయిలాండ్ తరఫున చట్‌చవాన్ రాడ్థాంగ్ ఏకైక గోల్ (47వ నిమిషం) నమోదు చేసింది.ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల మధ్య గోల్ వ్యత్యాసం కూడా (+22) కూడా సమానంగా ఉండటంతో ఇరు జట్లూ తప్పనిసరిగా గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగాయి. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో భారత్‌కంటే 24 స్థానాలు ముందున్న థాయిలాండ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అయితే మన అమ్మాయిల పట్టుదలకు విజయం వరించింది. గతంలో భారత్ ఎప్పుడూ థాయిలాండ్‌ను ఓడించలేదు. క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్ ‘బి’ నుంచి ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ భారత మహిళలు విజయం సాధించి అగ్రస్థానంతో ముందంజ వేయడం విశేషం. టోర్నీలో గత మూడు మ్యాచ్‌లలో ఇరాక్, మంగోలియా, తిమోర్ లెస్ట్లను భారత్ ఓడించింది. ఆసియా కప్ టోర్నీ 2026లో ఆస్ట్రేలియాలో జరుగుతుంది. -
సెప్టెంబర్ 10 నుంచి ఆసియా కప్..! భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా?
సెప్టెంబర్‌లో ఆసియా కప్.. భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా?క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆసియాకప్-2025 సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ జూలై మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.వాస్తవానికి టీ20 ఫార్మాట్లో జరగనున్న ఈ మెగా ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో జరిగిన ఒప్పందం ప్రకారం.. పాక్ తమ మ్యాచ్‌లను యూఏఈలో ఆడనుంది. కానీ ఇప్పుడు మ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య రాజీకీయ ఉద్రిక్తలు మరింత పెరిగాయి.దీంతో ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ పాల్గోంటుందా? ఒకవేళ పాల్గోన్న భారత్ దాయాది జట్టుతో ఆడుతుందా అన్నది ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉంది. ఈ విషయాలపై మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ మెగా టోర్నీలో పాల్గోనే ఆరు జట్లలో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఎఈ ఉన్నాయి.ప్రభుత్వం నిర్ణయమే ఫైనల్..కాగా పాకిస్తాన్‌తో ఉద్రిక్తల కారణంగా ఆసియాకప్ నుంచి వైదొలగాలని భారత్ నిర్ణయించుకుందని తొలుత వార్తలు వినిపించాయి. ఈ వార్తలను కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించారు. అవన్నీ ఆ వాస్తవమని, తాము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని సైకియా కొట్టిపారేశారు. తాజాగా మరో బీసీసీఐ సీనియర్ ఆధికారి కూడా ఇదే విషయాన్ని స్ఫష్టం చేశారు."ఆసియాకప్‌లో పాల్గోకపోవడం లేదా మ్యాచ్‌లను బాయ్‌కట్ చేయడం గురుంచి ఎటువంటి చర్చ కూడా జరగలేదు. ఐసీసీ ఈవెంట్లలో మేము పాకిస్తాన్‌తో ఆడుతాము. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మేము నడుచుకుంటాము.ఒకవేళ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ రాకపోతే అందుకు తగ్గట్టు నిర్ణయం తీసుకుంటాము. ఈ టోర్నీకి సంబంధించి రాబోయే రోజుల్లో మాకు ఒక క్లారిటీ వస్తోంది" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్‌తో పేర్కొన్నారు. -
ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. ? వైరలవుతున్న సోనీ స్పోర్ట్స్ పోస్టర్
ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగాల్సిన ఆసియా కప్-2025 కోసం టోర్నీ అధికారిక ప్రసారదారు సోనీ స్పోర్ట్స్ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక టీ20 జట్లకు చెందిన కెప్టెన్లు సూర్యకుమార్ యాదవ్, నజ్ముల్ శాంటో, చరిత్ అసలంక మాత్రమే ఉన్నారు. ఈ పోస్టర్లో పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం లేకపోవడం సోషల్‌మీడియాలో చర్చలకు తావిచ్చింది. ఆసియా కప్ నుంచి పాక్ వైదొలిగిందని ప్రచారం మొదలైంది.పహల్గాం ఉదంతం, తదనంతర పరిణామాల్లో (ఆపరేషన్ సిందూర్) భారత్, పాక్ మధ్య అప్పటివరకు ఉన్న తేలికపాటి సంబంధాలు కూడా తెగిపోయిన విషయం తెలిసిందే. క్రీడలు సహా అన్ని అంశాల్లో భారత్ పాక్‌తో సంబంధాలు తెంచుకుంది. క్రికెట్‌కు సంబంధించి ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లో, అదీ తటస్థ వేదికల్లో మాత్రమే భారత్ పాక్‌తో మ్యాచ్‌లు ఆడే విషయం పరిశీలనలో ఉంది. వాస్తవానికి క్రికెట్లో కూడా భారత్ పాక్‌తో పూర్తి స్థాయి సంబంధాలు తెంచుకోవాలని భారతీయుల నుంచి ఒత్తిడి ఉంది.ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పాకిస్తాన్‌కు చెందిన మంత్రి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహిసిన్ నఖ్వీ ఉండటంతో భారత్ ఆసియా కప్ నుంచి కూడా వైదొలుగుతుందని పలు నివేదికలు తెలిపాయి.మరికొన్ని నివేదికలేమో భారత్ తమ దేశ క్రికెట్ బోర్డు (బీసీసీఐ) పరపతిని ఉపయోగించి పాకిస్తాన్నే ఆసియా కప్ నుంచి వైదొలిగేలా చేస్తుందని చెప్పాయి. తాజాగా సోనీ స్పోర్ట్స్ పాక్ ప్రాతినిథ్యం లేని పోస్టర్‌ను విడుదల చేయడంతో ఇదే నిజమైదేంమోనని అనిపిస్తుంది. మొత్తానికి సోనీ స్పోర్ట్స్ విడుదల చేసిన ఆసియా కప్ పోస్టర్ భారత్, పాక్‌ల మధ్య మరోసారి అగ్గి రాజేసేలా ఉంది.కాగా, ఆసియా కప్ 2025పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ టోర్నీ యొక్క ఖచ్చితమైన వివరాలు, వేదికలు, షెడ్యూల్ గురించి ఏసీసీ ఎలాంటి సమాచారం ఇవ్వ లేదు. ఏసీసీ అధ్యక్షుడిగా పాక్‌కు చెందిన వ్యక్తి ఉన్నా, తమ దేశ భాగస్వామ్యంపై ఇప్పటివరకు స్పందించలేదు. కొద్ది రోజుల కిందట టోర్నీని భారత్‌లో కాకుండా యూఏఈలో నిర్వహిస్తారని కూడా ప్రచారం జరిగింది.2031 వరకు ఏసీసీ ఈవెంట్స్ హక్కులను దక్కించుకున్న సోనీ స్పోర్ట్స్సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (SPNI) 2024 నుండి 2031 వరకు అన్ని ఏసీసీ టోర్నమెంట్ల మీడియా హక్కులను $170 మిలియన్ల బేస్ ధరకు దక్కించుకుంది. ఇది మునుపటి సైకిల్ కంటే 70% ఎక్కువ. ఆశ్చర్యకరంగా మీడియా హక్కుల కోసం పోటీ బిడ్డింగ్ జరగలేదు. జియోస్టార్ మధ్యలో వైదొలిగింది. -
భారత్ 13 మంగోలియా 0
చియాంగ్ మాయ్ (థాయ్‌లాండ్): ఆసియా కప్–2026 మహిళల ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 13–0 గోల్స్ తేడాతో మంగోలియా జట్టును చిత్తు చేసింది. భారత్ తరఫున ప్యారీ జక్సా ఐదు గోల్స్ (29వ, 45వ, 46వ, 52వ, 55వ నిమిషాల్లో)తో అదరగొట్టగా... తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ (20వ, 59వ నిమిషాల్లో), ప్రియదర్శిని సెల్లాదురై (73వ, 86వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. సంగీత (8వ నిమిషంలో), రింపా హల్దర్ (67వ నిమిషంలో), మాళవిక (71వ నిమిషంలో), గ్రేస్ డాంగ్మె (75వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. గోల్స్ పరంగా ఆసియా కప్ చరిత్రలోనే భారత జట్టుకిది అతిపెద్ద విజయం కావడం విశేషం. 1997లో, 2005లో గ్వామ్ జట్టుపై భారత్ 10–0 గోల్స్ తేడాతో గెలిచింది. తాజా ఫలితంతో భారత జట్టు తమ రికార్డును మెరుగుపర్చుకుంది. గత సీజన్లో ‘భారత ఉత్తమ ఫుట్‌బాల్ క్రీడాకారిణి’ అవార్డు గెల్చుకున్న సౌమ్య అందించిన పాస్‌ను లక్ష్యానికి చేర్చి సంగీత భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత రింపా క్రాస్ పాస్‌ను హెడర్ షాట్‌తో సౌమ్య గోల్‌గా మలిచింది. విరామ సమయానికి ముందు ప్యారీ జక్సా రెండు గోల్స్ చేయడంతో భారత్ తొలి అర్ధభాగం ముగిసేసరికి 4–0 తో ముందంజ వేసింది. రెండో అర్ధభాగంలో భారత్ మరింత దూకుడును పెంచింది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను ఈనెల 29న తిమోర్ లెస్టె జట్టుతో ఆడుతుంది. చివరిసారి భారత జట్టు 2003లో ఆసియా కప్ ప్రధాన టోర్నీలో ఆడింది. -
ఆసియా కప్ 2025 వాయిదా
జూన్ 6 నుంచి శ్రీలంకలో జరగాల్సిన మహిళల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2025 వాయిదా పడింది. ప్రతికూల వాతావరణం మరియు ఆరోగ్య పరిస్థితులు కారణంగా టోర్నీని వాయిదా వేస్తున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సోమవారం (జూన్ 2) ప్రకటించింది. టోర్నీని వాయిదా వేయాలని ఆతిథ్య బోర్డు (శ్రీలంక) అధ్యక్షుడు షమ్మీ సిల్వా ఏసీసీకి లేఖ రాశాడు. ఈ లేఖను పరిగణలోకి తీసుకొని ఏసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శ్రీలంకలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు వాతావరణం అనుకూలంగా లేదని, ఆ ప్రాంతంలో చికున్‌గున్యా వ్యాప్తి చెందుతుందని సిల్వా తన లేఖలో పేర్కొన్నాడు. టోర్నీ తదుపరి షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని ఏసీసీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ వెల్లడించాడు.కాగా, ఏసీసీ మహిళల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023లో తొలిసారి జరిగింది. హాంగ్‌కాంగ్ వేదికగా నాడు జరిగిన టోర్నీలో భారత్ ఏ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్ ఏను 31 పరుగుల తేడాతో ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక ఏ జట్లతో పాటు యూఏఈ, నేపాల్, థాయ్‌లాండ్, మలేసియా జట్లు పాల్గొంటాయి. -
ఆసియా కప్, బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసుకోనున్న టీమిండియా..?
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది స్వదేశంలో (సెప్టెంబర్) జరగాల్సిన ఆసియా కప్‌ను రద్దు చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ టోర్నీలో పాకిస్తాన్ పాల్గొనాల్సి ఉండటంతో ఈ మేరకు నిర్ణయించినట్లు ఓ ప్రముఖ వార్త సంస్థ తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండబోవని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.🚨 LIKELY NO ASIA CUP 2025 🚨- Asia Cup 2025 remains under a cloud because of the terror attack in Pahalgam. (Sahil Malhotra/TOI). pic.twitter.com/dji5zdwc5T— Tanuj (@ImTanujSingh) May 2, 2025కాగా, ఈ ఏడాది ఆసియా కప్‌లో భారత్, పాక్ సహా 8 జట్లు పాల్గొనాల్సి ఉంది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగుతుందని ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) నిర్ణయించింది. ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగాల్సి ఉంది. ఈ టోర్నీకి భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నేరుగా అర్హత సాధించగా.. హాంగ్‌కాంగ్, ఒమన్, యూఏఈ 2024 ఏసీసీ ప్రీమియర్ కప్ ద్వారా క్వాలిఫై అయ్యాయి.🚨 NO INDIA-BANGLADESH SERIES 🚨- Team India Unlikely to tour Bangladesh for the White ball series in August due to cross border tension. (Sahil Malhotra/TOI). pic.twitter.com/qsBdZO7ccE— Tanuj (@ImTanujSingh) May 2, 2025బంగ్లాదేశ్ పర్యటన కూడా రద్దు..?అక్రమ చోరబాట్లు, సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ బంగ్లాదేశ్ పర్యటనను కూడా క్యాన్సిల్ చేసుకోనుందని సమాచారం. ఎఫ్టీపీ ప్రకారం ఈ ఏడాది ఆగస్ట్‌లో భారత్ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ పర్యటన రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.షెడ్యూల్ ప్రకారం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లు ఆడాల్సి ఉంది. ఈ పర్యటనలో తొలుత వన్డే సిరీస్ జరుగనుంది. ఆగస్ట్ 17న తొలి వన్డే, 20న రెండో వన్డే ఢాకా వేదికగా జరగాల్సి ఉంది. ఆతర్వాత ఆగస్ట్ 23న మూడో వన్డే, 26న తొలి టీ20 చట్టోగ్రామ్‌లో జరగాల్సి ఉన్నాయి. చివరి రెండు టీ20లు ఆగస్ట్ 29, 31 తేదీలోల ఢాకాలో జరగాల్సి ఉన్నాయి.కాగా, ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. పాకిస్తాన్‌కు తగు రీతిలో బుద్ధి చెబుతుంది. సింధు జలాల ఒప్పందం సహా చాలా విషయాల్లో భారత్ పాక్‌ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. పాక్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌ల రద్దును కొనసాగించింది. ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ చానెళ్లను, ఆ దేశ జర్నలిస్ట్‌లను బ్యాన్ చేసింది. పాక్‌కు అప్పు ఇవ్వొద్దని ఐఎంఎఫ్‌కు సూచించింది. -
తొలిసారి ఆసియా కప్ బరిలో ఒమన్
న్యూఢిల్లీ: ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంట్లో ఈసారి 8 జట్లు పాల్గొననున్నాయి. ఒమన్ జట్టు తొలిసారి ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించింది. గత ఏడాది జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రీమియర్ కప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలువడం ద్వారా యూఏఈ, ఒమన్ జట్లు ఆసియా కప్ టోర్నీకి అర్హత పొందాయి. ఈ రెండు జట్లతోపాటు హాంకాంగ్ జట్టు కూడా ఆసియా కప్‌లో ఆడనుంది. 2026లో టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యలో ఈసారి ఈ టోర్నీని టి20 ఫార్మాట్లో నిర్వహిస్తారు. 2023 వన్డే ప్రపంచకప్‌నకు ముందు జరిగిన ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లో నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరిగే అవకాశమున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వర్గాలు వెల్లడించాయి. ఆసియా కప్ ఆతిథ్య హక్కులు భారత్ వద్ద ఉన్నప్పటికీ... తటస్థ వేదికపై టోర్నీ జరగనుంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లకుండా... దుబాయ్‌లోనే అన్నీ మ్యాచ్‌లు ఆడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో పాకిస్తాన్ జట్టు కూడా భారత్‌లో పర్యటించబోమని గతంలోనే వెల్లడించింది. దీంతో ఆసియా కప్‌ను యూఏఈ, శ్రీలంకలో నిర్వహించనున్నారు. ఆసియా కప్ చరిత్రలో భారత్ 8 సార్లు విజేతగా నిలిచి విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. -
ఈ ఏడాది మరో మూడు భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లు
భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లు ఈ ఏడాది మరిన్ని జరిగే అవకాశం ఉంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్‌ను షెడ్యూల్ చేసింది. ఈసారి ఈ కాంటినెంటల్ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. ఇందులో మొత్తం 19 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో భారత్, పాక్ మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. సెప్టెంబర్ రెండు, నాలుగు వారాల మధ్యలో ఈ టోర్నీ జరుగుతుంది.ఈ టోర్నీ మొదట భారత్‌కు కేటాయించబడింది. అయితే, భారత్-పాక్‌ల మధ్య సత్సంబంధాలు లేని కారణంగా ఈ టోర్నీని తటస్థ వేదికపై నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. ప్రస్తుతానికి వేదిక ఖరారు కానప్పటికీ.. యూఏఈ లేదా శ్రీలంకలో టోర్నీ నిర్వహించే అవకాశం ఉంది. ఈ టోర్నీ 2025 ఎడిషన్‌లో భారత్, పాక్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ పాల్గొంటాయి. ఉపఖండం నుండి నేపాల్ ఒక్కటే ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.గత ఎడిషన్లోలాగా, ఈ ఏడాది ఆసియా కప్‌లో కూడా ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించబడతాయి. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉండటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు సూపర్ ఫోర్ దశకు చేరుకుంటాయి. ఈ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్‌కు చేరతాయి. భారత్, పాకిస్తాన్ గ్రూప్ దశలో ఓసారి.. సూపర్ ఫోర్ రౌండ్లో మరోసారి.. ఫైనల్లో మూడోసారి తలపడే అవకాశం ఉంది.కాగా, 2031లో ముగిసే ప్రస్తుత సైకిల్లో నాలుగు ఆసియా కప్‌లు జరుగనున్నాయి. 2025 ఎడిషన్ (19 మ్యాచ్‌లు) తర్వాత, 2027 ఎడిషన్ బంగ్లాదేశ్‌లో (13 మ్యాచ్‌లు) వన్డే ఫార్మాట్లో జరుగుతుంది. ఆతర్వాత పీసీబీ ఆతిథ్యం ఇచ్చే టోర్నీ టీ20 ఫార్మాట్లో (19 మ్యాచ్‌లు) జరుగుతుంది. చివరిగా, 2031 ఎడిషన్ వన్డే ఫార్మాట్లో (13 మ్యాచ్‌లు) శ్రీలంకలో జరుగుతుంది. -
నేడు అండర్–19 మహిళల ఆసియాకప్ ఫైనల్ – బంగ్లాదేశ్‌తో భారత్ ఢీ
ఆసియాకప్ అండర్–19 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో యువ భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత జట్టు ఆదివారం కౌలాలంపూర్‌లో జరగనున్న తుది పోరులో బంగ్లాదేశ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. నిక్కీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు ‘సూపర్ ఫోర్’ చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయంతో ఫైనల్‌కు అర్హత సాధించగా... మరోవైపు బంగ్లాదేశ్ ఈ టోర్నీ లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి తుది పోరుకు చేరింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో సమష్టిగా రాణిస్తున్న యువ భారత జట్టు... ఆఖరి సమరంలోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తొలిసారి నిర్వహిస్తున్న ఈ టోర్నీ కి మలేసియా ఆతిథ్యమిస్తోంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష ఫుల్ ఫామ్‌లో ఉండగా... కెపె్టన్ నిక్కీ ప్రసాద్, కమలిని, మిథిల, ఐశ్వరి కూడా మంచి టచ్‌లో ఉన్నారు. ఇక బౌలింగ్‌లో ఆయుషి శుక్లా, షబ్నమ్, పరుణిక, ధ్రుతి కీలకం కానున్నారు. -
మెరిసిన త్రిష... భారత్ ఘనవిజయం
కౌలాలంపూర్: ఆసియా కప్ అండర్–19 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్ ‘సూపర్ ఫోర్’ దశలో భారత్ శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. 81 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 12.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 86 పరుగులు సాధించి నెగ్గింది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (46 బంతుల్లో 58 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో అదరగొట్టింది. కమలిని (0), సనిక చాల్కె (1) వెంటవెంటనే అవుటైనా కెపె్టన్ నిక్కీ ప్రసాద్ (14 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ త్రిష టీమిండియాను విజయతీరాలకు చేర్చింది. అంతకుముందు బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 80 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 3 వికెట్లు, సోనమ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. నేడు జరిగే మరో ‘సూపర్ ఫోర్’ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడుతుంది -
Ind vs Pak: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్
జూనియర్ ఆసియా కప్ అండర్–19 మహిళల టీ20 క్రికెట్ టోర్నమెంట్(ACC Women's U-19 Asia Cup)లో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా కౌలాలాంపూర్ వేదికగా భారత జట్టు ఆదివారం పాకిస్తాన్‌తో తలపడింది. అద్భుత ఆట తీరుతో చిరకాల ప్రత్యర్థిని ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.అదరగొట్టిన సోనమ్ యాదవ్ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. కోమల్ ఖాన్ (24; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... యువ భారత బౌలర్లలో సోనమ్ యాదవ్ తన కోటా 4 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది.PC: ACCకమలిని మెరుపు ఇన్నింగ్స్‌అనంతరం భారత జట్టు 7.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 68 పరుగులు చేసింది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (0) డకౌట్ కాగా... వికెట్ కీపర్ కమలిని మెరుపు ఇన్నింగ్స్‌తో పాక్ బౌలర్లపై విరుచుకుపడింది. 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 44 పరుగులతో అజేయంగా నిలిచింది.మరో 73 బంతులు మిగిలుండగానేమరో ఎండ్ నుంచి సనికా చాల్కే (19 నాటౌట్; 3 ఫోర్లు) కమలినికి సహకారం అందించింది. వీరిద్దరు ఆఖరి వరకు అజేయంగా ఉండి జట్టును విజయ తీరాలకు చేర్చారు. కమలిని భారీ షాట్లతో విరుచుకుపడటంతో మరో 73 బంతులు మిగిలుండగానే గెలిచింది. పాక్‌పై భారత్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కమలినికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇక తదుపరి మ్యాచ్‌లో భారత జట్టు మంగళవారం నేపాల్‌తో తలపడనుంది. కాగా జూనియర్ ఆసియా కప్ అండర్–19 మహిళల టీ20 క్రికెట్ టోర్నీకి మలేషియా ఆతిథ్యం ఇస్తోంది.చదవండి: WPL: మినీ వేలంలో పదహారేళ్ల ప్లేయర్‌పై కనక వర్షం.. ఎవరీ కమలిని? -
చైనాపై భారత్‌దే పైచేయి
మస్కట్: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత మహిళల హాకీ జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుసగా రెండోసారి జూనియర్ ఆసియా కప్ చాంపియన్‌గా టీమిండియా నిలిచింది. మూడుసార్లు చాంపియన్ చైనా జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో జ్యోతి సింగ్ నాయకత్వంలోని భారత జట్టు ‘షూటౌట్’లో 3–2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఫలితంగా విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో భారత్ తరఫున సాక్షి రాణా, ఇషిక, సునెలిత టొప్పో సఫలమయ్యారు. ముంతాజ్ ఖాన్, కనిక సివాచ్ విఫలమయ్యారు. చైనా తరఫున గువోటింగ్ హావో, లియు టాంగ్జీ సఫలంకాగా... వాంగ్ లిహాంగ్, లి జింగీ, దన్దన్ జువో విఫలమయ్యారు. ముగ్గురు చైనా ప్లేయర్ల షాట్లను భారత గోల్‌కీపర్ నిధి నిలువరించి టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. ఫైనల్ చేరుకునే క్రమంలో లీగ్ దశలో చైనా చేతిలో మాత్రమే ఓడిపోయిన భారత జట్టుకు టైటిల్ పోరులోనూ గట్టిపోటీ ఎదురైంది. తొలి 29 నిమిషాల వరకు రెండు జట్లు ఖాతా తెరువలేకపోయాయి. 30వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను చైనా జట్టు సద్వినియోగం చేసుకుంది. టాన్ జిన్జువాంగ్ గోల్ చేయడంతో మాజీ చాంపియన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 41వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను కనిక సివాచ్ గోల్‌గా మలచడంతో భారత్ స్కోరును 1–1తో సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయడానికియత్నించినా ఫలితం లేకపోయింది. -
ఆసియా కప్-2024కు భారత జట్టు ప్రకటన.. తెలుగు ప్లేయర్లకు చోటు
న్యూఢిల్లీ: జూనియర్ మహిళల ఆసియా కప్‌లో పాల్గొననున్న భారత అండర్–19 జట్టులో తెలంగాణకు చెందిన గొంగడి త్రిష, కేసరి ధృతి, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి షబ్నమ్ చోటు దక్కించుకున్నారు. కౌలాలాంపూర్ వేదికగా ఈ నెల 15 నుంచి 22 వరకు జూనియర్ మహిళల ఆసియా కప్ జరగనుంది.సెలెక్షన్ కమిటీ గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. నికీ ప్రసాద్ భారత జట్టుకు సారథ్యం వహించనుండగా... సనికా చాల్కె వైస్ కెపె్టన్‌గా వ్యవహరించనుంది. అండర్–19 ప్రపంచకప్‌లో ఆడిన అనుభవం ఉన్న త్రిషతో పాటు మహిళల ఐపీఎల్లో గుజరాత్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న షబ్నమ్ ఇందులో చోటు దక్కించుకున్నారు.నలుగురు స్టాండ్‌బై ఆటగాళ్లను ప్రకటించగా... అందులో తెలంగాణ అమ్మాయి గుగులోత్ కావ్యశ్రీ కూడా ఉంది. ఈ టోరీ్నలో పాకిస్తాన్, నేపాల్‌తో కలిసి భారత్ జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి పోటీ పడుతోంది. బంగ్లాదేశ్, శ్రీలంక, మలేసియా గ్రూప్ ‘బి’లో ఉన్నాయి. టోర్నీ ఆరంభ పోరులో ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత జట్టు తలపడుతుంది. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు సూపర్–4కు అర్హత సాధించనున్నాయి. అందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఈ నెల 22 జరగనున్న ఫైనల్లో తలపడనున్నాయి. భారత జట్టు: నికీ ప్రసాద్ (కెప్టెన్), సనికా చాల్కె (వైస్ కెపె్టన్), గొంగడి త్రిష, కమలిని, భావిక అహిరె, ఈశ్వరి అవాసరె, మిథిలా వినోద్, జోషిత, సోనమ్ యాదవ్, పరుణిక సిసోడియా, కేసరి ధృతి, ఆయుషి శుక్లా, అనందిత కిషోర్, షబ్నమ్, నందన. స్టాండ్‌బైలు: హర్లీ గాలా, హ్యాపీ కుమారి, గుగులోత్ కావ్యశ్రీ, గాయత్రి. -
సెమీఫైనల్లో భారత్
మస్కట్: డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల హాకీ జట్టు జూనియర్ ఆసియా కప్ టోర్నీలో సెమీఫైనల్స్‌కు చేరింది. తద్వారా జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి కూడా అర్హత సంపాదించింది. ఆసియా టైటిల్ వేటలో భారత్ రెండు అడుగుల దూరంలో ఉంది. గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 9–0 గోల్స్ తేడాతో థాయ్‌లాండ్‌పై ఏకపక్ష విజయం సాధించింది. భారత ఫార్వర్డ్ ప్లేయర్ దీపిక అద్భుతంగా రాణించింది. ఆమె నాలుగు (28వ, 31వ, 35వ, 55వ నిమిషాల్లో) గోల్స్ చేయగా, కనిక సివాచ్ (23వ, 25వ, 40వ నిమిషాల్లో) మూడు గోల్స్ అందించింది. మిగతా వారిలో సాక్షి రాణా (17వ నిమిషంలో), లాల్రిన్పుయి (27వ నిమిషంలో), గోల్స్ చేశారు. భారత్ తొలి అర్ధభాగం (రెండు క్వార్టర్లు) ముగిసేసరికే 5–0తో మ్యాచ్‌ను శాసించేస్థితిలో నిలిచింది. మూడు, నాలుగో క్వార్టర్లలో మరో నాలుగు గోల్స్ సాధించింది. మూడో క్వార్టర్ మొదలైన నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేయడం ద్వారా దీపిక, కాసేపటికే మూడో గోల్ సాధించిన కనిక ‘హ్యాట్రిక్స్’ నమోదు చేశారు. శనివారం జరిగే సెమీఫైనల్లో జపాన్‌తో భారత్; చైనాతో దక్షిణ కొరియా తలపడతాయి. -
ఆసియా కప్ ఫైనల్లో భారత్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్
ఏసీసీ అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్లో భారత్‌పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా బంగ్లాదేశ్ ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి బంగ్లాదేశ్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. యుద్ధజిత్ గుహా, చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కిరణ్ చోర్మలే, కేపీ కార్తికేయ, ఆయుశ్ మాత్రే తలో వికెట్ దక్కించుకున్నారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో రిజాన్ హొసేన్ (47) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మొహమ్మద్ షిహాబ్ జేమ్స్ (40), ఫరీద్ హసన్ ఫైసల్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం 199 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. అజీజుల్ హకీమ్ తమీమ్ (3/8), ఇక్బాల్ హొసేన్ ఎమోన్ (3/24), అల్ ఫహద్ (2/34), మరూఫ్ మ్రిద (/36), రిజాన్ హొసేన్ (1/14) దెబ్బకు 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. భారత ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (1), వైభవ్ సూర్యవంశీ (9) దారుణంగా విఫలమయ్యారు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మొహమ్మద్ అమాన్ (26), హార్దిక్ రాజ్ (24), కేపీ కార్తికేయ (21), అండ్రే సిద్దార్థ్ (20), చేతన్ శర్మ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
భారత్ X బంగ్లాదేశ్
దుబాయ్: అండర్–19 ఆసియా కప్ టోర్నమెంట్ చరిత్రలో యువ భారత్ హాట్ ఫేవరెట్. ఇప్పటివరకు 8 టైటిల్స్ గెలిచింది. గత ఏడాదీ గెలిచే దారిలో బంగ్లాదేశ్ అడ్డుకుంది. దీంతో 2023 టోర్నీలో భారత అండర్–19 టీమ్ సెమీఫైనల్లో నిష్క్రమించింది. ఇప్పుడు ఆ సెమీస్ పరాభవానికి బదులు తీర్చుకునే అవకాశం వచ్చి0ది. డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌ను అమీతుమీలో కంగు తినిపించి తొమ్మిదోసారి విజేతగా నిలిచేందుకు యువ భారత్ తహతహలాడుతోంది. ఆదివారం జరిగే ఫైనల్లో బంగ్లాపై విజయమే లక్ష్యంగా భారత కుర్రాళ్ల జట్టు బరిలోకి దిగుతోంది. టోర్నీలో పాక్‌తో తొలి మ్యాచ్ ఓడాక భారత్ వరుస విజయాలు సాధించింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న యువ జట్టు వరుసగా జపాన్‌పై ఏకంగా 211 పరుగుల తేడాతో, యూఏఈపై పది వికెట్ల తేడాతో, సెమీఫైనల్లో లంకపై 7 వికెట్ల తేడాతో ఇలా ప్రతీజట్టుపై భారీ విజయాలనే నమోదు చేసింది. 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్‌లో అదరగొడుతున్నాడు. ఆయుశ్ మాత్రేతో కలిసి చక్కని శుభారంభాలు ఇస్తున్నాడు. ఈ టోర్నీలో ఆయుశ్ 175 పరుగులు చేయగా, వైభవ్ 167 పరుగులతో నిలకడను ప్రదర్శించారు. నేడు జరిగే తుది పోరులోనూ వీళ్లిద్దరు మరో శుభారంభం ఇస్తే భారత్ ట్రోఫీ గెలిచేందుకు సులువవుతుంది. మరోవైపు బంగ్లాదేశ్ బౌలింగ్ అస్త్రాలతో ప్రత్యర్థుల్ని కట్టిపడేస్తోంది. సెమీఫైనల్లో పాక్‌ను 116 పరుగులకే కుప్పకూల్చింది. బౌలర్లు ఫహాద్, ఇక్బాల్ హసన్ ఎమన్ ఇద్దరు ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఇద్దరు చెరో 10 వికెట్లతో జోరు మీదున్నారు. బ్యాటింగ్‌లో కెప్టెన్ అజీజుల్ హకీమ్, కలామ్ సిద్ధిఖీ, అబ్రార్ ఫామ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే టైటిల్ పోరు భారత్ బ్యాటింగ్, బంగ్లా బౌలింగ్ మధ్య రసవత్తరంగా జరగనుంది. -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
భారత్ అండర్-19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో సెమీఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన సూర్యవంశీ.. భారత్ అండర్-19 జట్టు తరఫున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున అతి చిన్న వయసులో అండర్-19 గేమ్ ఆడిన వైభవ్.. 13 సంవత్సరాల, 254 రోజుల వయసులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ (36 బంతుల్లో 67; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడి భారత జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించినందుకు గాను వైభవ్‌ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఈ మ్యాచ్‌లో భారత్.. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ కాగా.. వైభవ్ రెచ్చిపోవడంతో భారత్ 21.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.మరోవైపు ఇవాళే (డిసెంబర్ 6) జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 37 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 22.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డిసెంబర్ 8న జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్ భారత్‌ను ఢీకొంటుంది.వరుసగా రెండు హాఫ్ సెంచరీలు..అండర్-19 ఆసియా కప్‌లో వైభవ్ వరసగా రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన వైభవ్.. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ద శతకం (43 బంతుల్లో 76 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు).. తాజాగా మరో ఆర్ద శతకం సాధించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. మెగా వేలం తర్వాతే వైభవ్ ఎక్కువ వార్తల్లో ఉంటున్నాడు. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా కూడా వైభవ్ రికార్డు నెలకొల్పాడు. -
‘ఆసియా’ యువ భారత్‌దే
మస్కట్: ఒకే విజయంతో యువ భారత జట్టు రెండు లక్ష్యాలను సాధించింది. పురుషుల అండర్–21 ఆసియా కప్ హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత జట్టు టోర్నీని అజేయంగా ముగించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో బుధవారం జరిగిన ఫైనల్లో శర్దానంద్ తివారి సారథ్యంలోని టీమిండియా 5–3 గోల్స్ తేడాతో గెలుపొందింది. తద్వారా ఈ టోర్నీ టైటిల్‌ను ఐదోసారి సొంతం చేసుకుంది. గతంలో భారత జట్టు 2004, 2008, 2015, 2023లలో ఈ టైటిల్‌ను సాధించింది. తాజా విజయంతో భారత జట్టు వచ్చే ఏడాది జరిగే జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి కూడా అర్హత సాధించింది. ఇదే టోర్నీలో గతంలో రెండుసార్లు ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించిన భారత జట్టు మూడోసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. భారత్ తరఫున అరిజిత్ సింగ్ హుండల్ ఏకంగా నాలుగు గోల్స్ (4వ, 18వ, 47వ, 54వ నిమిషాల్లో) సాధించగా... దిల్‌రాజ్ సింగ్ (19వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. పాకిస్తాన్ జట్టు తరఫున సూఫియాన్ ఖాన్ (30వ, 39వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... హన్నాన్ షాహిద్ (3వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో జపాన్ 2–1తో మలేసియాను ఓడించింది. పాకిస్తాన్, జపాన్, మలేసియా జట్లు కూడా వచ్చే ఏడాది జరిగే జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందాయి. పాక్‌తో జరిగిన తుది పోరులో భారత జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. మూడో నిమిషంలో హన్నాన్ చేసిన గోల్‌తో పాకిస్తాన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వెంటనే తేరుకున్న భారత జట్టు మరుసటి నిమిషంలోనే గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేసింది. 14 నిమిషాల తర్వాత భారత్ రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం పాక్ పోరాడి మూడో క్వార్టర్ ముగిసేసరికి మరో రెండు గోల్స్ చేసి భారత ఆధిక్యాన్ని 3–4కి తగ్గించింది. చివరి క్వార్టర్లో భారత్ జోరు కొనసాగించి ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి 5–3తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న టీమిండియా ఆసియా కప్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు ఆరు పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఇందులో టీమిండియా నాలుగింటిని సది్వనియోగం చేసుకొని, రెండింటిని వృథా చేసింది. మరోవైపు పాక్ జట్టు సంపాదించిన రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచింది. -
IPL 2025: ఆ యువ ఆటగాడి విషయంలో సీఎస్కే తప్పు చేసిందా..?
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై యువ ఆటగాడు ఆయుశ్ మాత్రే పేరు క్రికెట్ సర్కిల్స్‌లో బాగా నానింది. మాత్రే టాలెంట్‌కు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని ముగ్దుడయ్యాడని బాగా ప్రచారం జరిగింది. మెగా వేలానికి ముందు సీఎస్కే మాత్రేను ట్రయిల్స్‌కు కూడా పిలిచిందని సోషల్‌మీడియా కోడై కూసింది. అయితే చివరకు మాత్రేను మెగా వేలంలో సీఎస్కే కాని మరే ఇతర ఫ్రాంచైజీ కాని పట్టించుకోలేదు. ఈ 17 ఏళ్ల రైట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ వేలంలో అన్ సోల్డ్‌గా మిగిలిపోయాడు.ఇదంతా సరే, ఇప్పుడు మాత్రే ప్రస్తావన ఎందుకనుకుంటున్నారా..? సీఎస్కే ఆశ చూపించి పట్టించుకోకుండా వదిలిపెట్టిన మాత్రే, ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో మాత్రే ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసి 3 వికెట్లు తీశాడు. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో మాత్రే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (67 నాటౌట్; 1/19) ఇరగదీశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.మాత్రే తాజా ప్రదర్శనల నేపథ్యంలో ఇతన్ని ఎందుకు వదులుకున్నామా అని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తుండవచ్చు. మాత్రే వద్ద బంతిని బలంగా బాదే సామర్థ్యం ఉండటంతో పాటు మాంచి బ్యాటింగ్ టెక్నిక్ కూడా ఉంది. ఇతను సీఎస్కేలో ఉంటే ఓపెనర్‌గా అద్భుతాలు చేసే ఆస్కారం ఉండేది. ఏది ఏమైనా సీఎస్కే మాత్రేను దక్కించుకోలేకపోవడం అన్ లక్కీనే అని చెప్పాలి. మరోవైపు మాత్రే సహచరుడు, ఓపెనింగ్ పార్ట్నర్ వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. సూర్యవంశీని ఆర్ఆర్ 1.1 కోట్లకు సొంతం చేసుకుంది.ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా (13) సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు. మాత్రేలానే సూర్యవంశీ కూడా మంచి హిట్టర్. ఇంకా చెప్పాలంటే మాత్రే కంటే బలమైన హిట్టర్. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ మాత్రేతో కలిసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ 46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేశాడు. సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్ వేస్తాడు. -
పసికూనపై విరుచుకుపడిన టీమిండియా... భారీ విజయం
అండర్-19 ఆసియా కప్‌లో టీమిండియా భారీ విజయం సాధించింది. పసికూన జపాన్‌తో ఇవాళ (డిసెంబర్ 2) జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో భారత్ 211 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. కెప్టెన్ మొహమ్మద్ అమాన్ అజేయ సెంచరీతో (122) కదంతొక్కగా.. ఓపెనర్ ఆయుశ్ మాత్రే మెరుపు అర్ద సెంచరీతో (29 బంతుల్లో 54; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగాడు. మిడిలార్డర్ బ్యాటర్ కేపీ కార్తికేయ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, సిక్స్) రాణించగా.. స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 23, ఆండ్రీ సిద్దార్థ్ 35, నిఖిల్ కుమార్ 12, హర్వంశ్ సింగ్ 1, హార్దిక్ రాజ్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. జపాన్ బౌలర్లలో కీఫర్ యమమోటో లేక్, హ్యూగో కెల్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్లెస్ హింజే, ఆరవ్ తివారి చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జపాన్.. భారత బౌలర్లు యుధాజిత్ గుహ (7-3-9-1), హార్దిక్ రాజ్ (8-2-9-2), చేతన్ శర్మ (8-0-14-2), కేపీ కార్తికేయ (10-1-21-1) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. జపాన్ ఇన్నింగ్స్‌లో హ్యూగో కెల్లీ (50), చార్లెస్ హింజే (35 నాటౌట్), నిహార్ పర్మార్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, ఈ మ్యాచ్‌లో ముందు పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. -
వికెట్ తీసిన ఆనందంలో అతి చేశాడు.. మైదానంలో నుంచి మోసుకెళ్లారు..!
వికెట్ తీసిన ఆనందంలో బౌలర్లు సంబురాలు చేసుకోవడం సహజమే. అయితే ఓ బౌలర్ శృతి మించిన సంబురాలు అతన్ని మైదానంలో నుంచి మోసుకెళ్లేలా చేశాయి. వివరాల్లోకి వెళితే.. అండర్-19 ఆసియా కప్ టోర్నీలో ఆదివారం నేపాల్, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నేపాల్ బౌలర్ యువరాజ్ ఖాత్రి వికెట్ తీసిన ప్రతిసారి అతి సంబురాలు చేసుకున్నాడు. A twist of fate 🫣When luck smiles and frowns at the same time 🤕 🙆♂️#SonySportsNetwork #AsiaCup #NewHomeOfAsiaCup pic.twitter.com/OmPn5KepPu— Sony Sports Network (@SonySportsNetwk) December 2, 2024ఓసారి సౌతాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంషిలా షూ తీసి చెవి దగ్గర ఫోన్లా పెట్టుకోగా.. మరోసారి తనను అభినందించేందుకు వచ్చిన సహచరులకు దొరకకుండా పరుగులు పెట్టాడు. ఇలా చేసే క్రమంలో యువరాజ్ కాలు మడత పడింది. నడవలేని స్థితిలో ఉన్న యువరాజ్‌ను మైదానంలో నుంచి భుజాలపై మోసుకెళ్లారు. ఈ తంతుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో యువరాజ్ 4 వికెట్లతో మెరిసినా నేపాల్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 45.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 28.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.ఇదిలా ఉంటే, దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. టోర్నీలో భాగంగా ఇవాళ భారత్ జపాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా.. కెప్టెన్ మొహమ్మద్ అమాన్ సెంచరీ చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఛేదనలో పూర్తిగా చేతులెత్తసిన జపాన్ 44 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో జపాన్ గెలవాలంటే 36 బంతుల్లో 231 పరుగులు చేయాల్సి ఉంది. -
Asia Cup 2024: శతక్కొట్టిన కెప్టెన్.. టీమిండియా భారీ స్కోర్
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భాగంగా జపాన్‌తో ఇవాళ (డిసెంబర్ 2) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి జపాన్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. కెప్టెన్ మొహమ్మద్ అమాన్ అజేయ సెంచరీతో (118 బంతుల్లో 122; 7 ఫోర్లు) కదం తొక్కాడు. కేపీ కార్తికేయ (57), ఆయుశ్ మాత్రే (54) అర్ద సెంచరీలతో రాణించారు. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ 23 పరుగులకే పరిమితమయ్యాడు. భారత ఇన్నింగ్స్‌లో ఆండ్రీ సిద్దార్థ్ 35, నిఖిల్ కుమార్ 12, హర్వన్ష్ సింగ్ 1, హార్దిక్ రాజ్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. జపాన్ బౌలర్లలో కీఫర్ యమమోటో లేక్, హ్యూగో కెల్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్లెస్ హింజే, ఆరవ్ తివారి చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడింది. గత శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన భారత్ 47.1 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. ఈ టోర్నీలో భారత్, పాక్, జపాన్, యూఏఈ జట్లు గ్రూప్-ఏలో తలపడుతున్నాయి. ఇవాళే జరుగుతున్న మరో గ్రూప్-ఏ మ్యాచ్‌లో పాకిస్తాన్, యూఏఈ జట్లు ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. షాజైబ్ ఖాన్ (132), మొహమ్మద్ రియాజుల్లా (106) సెంచరీల మోత మోగించారు. -
భారత్ X పాకిస్తాన్
దుబాయ్: ఆసియా కప్ అండర్–19 వన్డే క్రికెట్ టోర్నీలో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. యూఏఈలో జరుగుతున్న ఈ టోర్నీలో నేడు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో యువ భారత జట్టు తలపడుతుంది. ఉదయం గం. 10:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరగనున్న ఈ లీగ్ పోరులో శుభారంభం చేయాలని మొహమ్మద్ అమాన్ సారథ్యంలోని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటి వరకు 10 సార్లు జరిగిన ఈ టోర్నీలో ఎనిమిదిసార్లు విజేతగా నిలిచిన యువ భారత్... ఈసారి కూడా టైటిల్ నెగ్గాలనే లక్ష్యంతో ఉంది. ఇటీవల ఐపీఎల్ మెగా వేలంలో రూ.1.10 కోట్లకు అమ్ముడుపోయిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో అఫ్గానిస్తాన్‌పై బంగ్లాదేశ్; నేపాల్ జట్టుపై శ్రీలంక విజయం సాధించాయి. -
యువ ఆటగాళ్ల ఆసియా సమరం
దుబాయ్: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అండర్–19 ఆసియా కప్ 11వ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో 8 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీ పడుతున్నాయి. పాకిస్తాన్, యూఏఈ, జపాన్‌తో కలిసి భారత జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగుతుండగా... శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ గ్రూప్ ‘బి’లో ఉన్నాయి. ఈ టోర్నీలో మొత్తం 15 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. బంగ్లాదేశ్ డిఫెండింగ్ చాంపియన్‌గా ఉంది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో అఫ్గానిస్తాన్... శ్రీలంకతో నేపాల్ తలపడతాయి. దుబాయ్, షార్జాలలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఏసీసీ ఆసియా కప్‌ను 10 సార్లు నిర్వహించగా... అందులో ఎనిమిదిసార్లు భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. డిసెంబర్ 8న జరగనున్న తుది పోరుతో టోర్నమెంట్ ముగుస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు సాధించేందుకు ఆటగాళ్లకు ఈ టోర్నీ ఎంతో ఉపయోగపడనుంది. గతంలో అండర్–19 స్థాయిలో మెరుపులు మెరిపించి... ఆ తర్వాత గ్లోబల్ స్టార్స్‌గా ఎదిగిన ప్లేయర్లు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం యువ భారత జట్టుకు మొహమ్మద్ అమాన్ సారథ్యం వహిస్తుండగా... కిరణ్ చోర్మలే వైస్ కెపె్టన్‌గా వ్యవహరించనున్నాడు. టోర్నీలో భాగంగా భారత జట్టు శనివారం తమ తొలి పోరులో పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది. అనంతరం డిసెంబర్ 2న జపాన్‌తో, 4న ఆతిథ్య యూఏఈతో మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ దశ ముగిశాక రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. భారత అండర్–19 జట్టు: మొహమ్మద్ అమాన్ (కెపె్టన్), కిరణ్ చోర్మలే (వైస్ కెపె్టన్), ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ, ఆండ్రీ సిద్ధార్్థ, కేపీ కార్తికేయ, ప్రణవ్ పంత్, హార్దిక్ రాజ్, నిఖిల్ కుమార్, హర్వంశ్ సింగ్, అనురాగ్, ఇనాన్, సమర్థ్ నాగరాజ్, యుధాజిత్ గుహ, చేతన్ శర్మ. -
‘ఆసియా క్రికెట్’ మ్యాచ్‌లన్నీ ఆ నెట్‌వర్క్‌లోనే లైవ్ స్ట్రీమింగ్..!
భారత్‌కు చెందిన సోనీ పిక్చర్స్ నెట్వర్క్ (ఎస్పీఎన్ఐ) ఆసియా క్రికెట్‌కు సంబంధించి ప్రత్యేక మీడియా హక్కుల్ని దక్కించుకుంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)తో సోనీ సంస్థ ఎనిమిదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది (2024) నుంచి 2031 సీజన్ ముగిసేదాకా ఏసీసీ ఆధ్వర్యంలో జరిగే పురుషులు, మహిళల ఆసియా కప్, అండర్–19 ఆసియా కప్, ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్ మ్యాచ్‌లను సోనీ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.ఈ ఒప్పందంలో టెలివిజన్ ప్రసార హక్కులతో పాటు డిజిటల్, ఆడియో మాధ్యమాలకు సంబంధించిన హక్కులు కూడా కలిసి ఉన్నాయి. అయితే ఈ ఒప్పందం విలువ బయటికి వెల్లడించకపోయినప్పటికీ గతంకంటే 70 శాతం ఎక్కువని ఏసీసీ ప్రకటించింది. ఇది ఆసియా క్రికెట్ టోర్నీలకు ఉన్న ఆదరణను తెలియజేస్తోందని ఓ ప్రకటనలో తెలిపింది.ఏసీసీ అధ్యక్షుడు జై షా మాట్లాడుతూ ‘క్రికెట్ నైపుణ్యానికి ఆసియా కప్ మూలస్తంభంలా నిలుస్తోంది. మా కొత్త మీడియా భాగస్వామి సోనీ ప్రపంచ శ్రేణి కవరేజీతో ప్రపంచ వ్యాప్తంగా మరెంతో మంది క్రికెట్ వీక్షకుల్ని సంపాదిస్తుందన్న నమ్మకం ఉంది. పెరిగిన మీడియా హక్కుల విలువతో ఆసియా సభ్యదేశాల్లో మౌళిక సదుపాయాల అభివృద్ధి, క్షేత్రస్థాయిలో క్రికెట్ కార్యక్రమాలు కూడా పెరుగుతాయి’ అని విశ్వాసం వెలిబుచ్చారు. సోనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ దాయాదులు భారత్, పాక్ సహా ఏసీసీ మ్యాచ్‌లు తమ వీక్షకులకు మరింత వినోదాన్ని పంచుతాయని అన్నారు. -
భారత జట్టు ప్రకటన.. 13 ఏళ్ల కుర్రాడికి చోటు
యూఏఈ వేదికగా జరగనున్న అండర్-19 ఆసియాకప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు ఉత్తరప్రదేశ్ మిడిలార్డర్ బ్యాటర్ మహ్మద్ అమాన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అదే విధంగా ఈ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. బిహార్‌కు చెందిన 13 ఏళ్ల సూర్యవంశీ క్రికెట్లో దూసుకుపోతున్నాడు. వైభవ్ ఇప్పటికే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో బిహార్ తరపున వైభవ్ ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అతి పిన్న వయససులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో డెబ్యూ చేసిన ఎనిమిదవ ప్లేయర్‌గా వైభవ్ నిలిచాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు రంజీ మ్యాచ్‌లు ఆడిన సూర్యవంశీ..87 పరుగులు చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన యూత్ టెస్ట్ సిరీస్‌లో వైభవ్ కేవలం 58 బంతుల్లో సెంచరీ చేసి సత్తాచాటాడు.రెడ్ బాల్ క్రికెట్లో తన సత్తాను నిరూపించుకున్న ఈ యువ క్రికెటర్.. ఇప్పుడు వైట్ బాల్ క్రికెట్లో దుమ్ములేపేందుకు సిద్దమయ్యాడు. ఈ టోర్నీలో భారత జట్టు గ్రూప్‌లో-ఎలో ఉంది. ఈ గ్రూపులో టీమిండియాతో పాటు పాకిస్తాన్, జపాన్, ఆతిథ్య యూఏఈ ఉన్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌లో నవంబర్ 30న దుబాయ్ వేదికగా పాకిస్తాన్ అండర్-19 టీమ్‌తో తలపడనుంది.భారత అండర్-19 జట్టుఆయుష్ మ్హత్రే, వైభవ్ సూర్యవంశీ, సి ఆండ్రీ సిద్దార్థ్, మొహమ్మద్. అమన్ (కెప్టెన్), కిరణ్ చోర్మలే (వైస్ కెప్టెన్), ప్రణవ్ పంత్, హర్వాన్ష్ సింగ్ పంగాలియా (వికెట్ కీపర్), అనురాగ్ కవ్డే (వికెట్ కీపర్), హార్దిక్ రాజ్, ఎండి. ఈనాన్, కెపి కార్తికేయ, సమర్థ్ నాగరాజ్, యుధాజిత్ గుహా, చేతన్ కుమార్, నిఖిల్నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌లు: సాహిల్ పరాఖ్, నమన్ పుష్పక్, అన్మోల్జీత్ సింగ్, ప్రణవ్ రాఘవేంద్ర, డి దీపేష్చదవండి: ఆ నలుగురు నా కొడుకు కెరీర్‌ను నాశనం చేశారు: శాంసన్ తండ్రి -
IND A Vs AFG A: టీమిండియాకు బిగ్ షాక్.. సెమీస్‌లో అఫ్గాన్ చేతిలో ఓటమి
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో భారత్-ఎ జట్టు ప్రయాణం ముగిసింది. అల్ఎమరత్ వేదికగా అఫ్గానిస్తాన్-ఎతో జరిగిన రెండో సెమీఫైనల్లో 20 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత బ్యాటర్లలో రమణ్‌దీప్ సింగ్(64) ఆఖరి వరకు పోరాడినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. రమణ్‌దీప్, బదోని(31) మినహా మిగితా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. అఫ్గాన్ బౌలర్లలో ఘజన్ఫర్,రహమన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్లు జుబైద్ అక్బారిక్, సెదిఖుల్లా అటల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ భారత బౌలర్లను ఊచకోత కోశారు. సెదిఖుల్లా(52 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు) జుబైద్ (41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో రసిఖ్ దార్ సలామ్ 3 వికెట్లు పడగొట్టగా.. అకిబ్ ఖాన్ ఒక్క వికెట్ సాధించాడు. కాగా ఆదివారం జరగనున్న ఫైనల్లో శ్రీలంక, అఫ్గాన్ జట్లు తలపడనున్నాయి. -
IND A Vs AFG A: అఫ్గాన్ బ్యాటర్ల విధ్వంసం.. భారత్ టార్గెట్ ఎంతంటే?
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో ఒమన్ వేదికగా భారత్-ఎతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్-ఎ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది.అఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్లు జుబైద్ అక్బారిక్, సెదిఖుల్లా అటల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ భారత బౌలర్లను ఊచకోత కోశారు. సెదిఖుల్లా(52 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు) జుబైద్ (41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 137 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. వీరద్దరితో పాటు కరీం జనత్( 20 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో రసిఖ్ దార్ సలామ్ 3 వికెట్లు పడగొట్టగా.. అకిబ్ ఖాన్ ఒక్క వికెట్ సాధించాడు.చదవండి: IPL 2025: 'ధోని వారసుడు అతడే.. వేలంలోకి వస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే' Sediqullah hit two birds with ZERO stones! ⚡@ACBofficials #MensT20EmergingTeamsAsiaCup2024 #INDvAFG #ACC pic.twitter.com/MNdGmFiNgb— AsianCricketCouncil (@ACCMedia1) October 25, 2024 -
భారత్ వర్సెస్ అఫ్గాన్ సెకెండ్ సెమీస్.. తుది జట్లు ఇవే
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో సెకెండ్ సెమీఫైనల్‌కు రంగం సిద్దమైంది. రెండో సెమీఫైనల్లో భాగంగా అల్ అమెరత్(ఒమన్) వేదికగా భారత్-ఎ, అఫ్గానిస్తాన్-ఎ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన అఫ్గాన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. అన్షుల్ కాంబోజ్, ప్రభ్సిమ్రాన్ సింగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు అఫ్గానిస్తాన్ మాత్రం ఏకంగా నాలుగు మార్పులు చేసింది. బిలాల్ సమీ, మహమ్మద్ ఇషాక్, అల్లా గజన్ఫర్, జుబైద్ అక్బరీ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్లు కూడా ఆజేయంగా నిలిచాయి. అదే జోరును సెమీస్‌లో కనబరచాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.తుది జట్లుఇండియా-ఎ : ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, నెహాల్ వధేరా, రమణదీప్ సింగ్, నిశాంత్ సింధు, అన్షుల్ కాంబోజ్, రాహుల్ చాహర్, రసిఖ్ దార్ సలామ్, ఆకిబ్ ఖాన్ఆఫ్ఘనిస్తాన్-ఎ: సెదిఖుల్లా అటల్, జుబైద్ అక్బరీ, దర్విష్ రసూలీ(కెప్టెన్), మహ్మద్ ఇషాక్(వికెట్ కీపర్), కరీం జనత్, షాహిదుల్లా కమల్, షరాఫుద్దీన్ అష్రఫ్, అబ్దుల్ రెహమాన్, అల్లా గజన్ఫర్, కైస్ అహ్మద్, బిలాల్ సమీ -
Asia T20 Cup 2024: ఆయుశ్ బదోని ఆడుతూ పాడుతూ.. తిలక్ సేన హ్యాట్రిక్ విజయం
ACC Mens T20 Emerging Teams Asia Cup 2024 India A vs Oman: వర్ధమాన టీ20 జట్ల ఆసియా కప్ టోర్నీలో భారత్-‘ఎ’ జట్టు హ్యాట్రిక్ కొట్టింది. ఒమన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆతిథ్య జట్టు విధించిన 141 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఆయుశ్ బదోని (51)విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. టాపార్డర్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ(15 బంతుల్లో 34), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ తిలక్ వర్మ(30 బంతుల్లో 36 నాటౌట్) రాణించారు. ఇక ఈ ఆసియా టోర్నమెంట్లో అంతకు ముందు గ్రూప్-బిలో భాగంగా పాకిస్తాన్, యూఏఈలపై తిలక్ సేన విజయం సాధించింది.స్కోర్లుటాస్: ఒమన్.. తొలుత బ్యాటింగ్ఒమన్ - 140/5(20)భారత్ - ఏ- 146/4(15.2)ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆయుశ్ బదోనిరాణించిన భారత బౌలర్లు.అల్ అమెరత్ వేదికగా ఒమన్ జట్టుతో బుధవారం నాటి మ్యాచ్‌లో తిలక్ సేన.. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఒమన్‌ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేసింది.ఒమన్ బ్యాటర్లలో ఓపెనర్లు కెప్టెన్ జతిందర్ సింగ్(17), ఆమిర్ ఖలీం(13) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కరణ్ సోనావాలే కేవలం ఒక్క పరుగే చేశాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను మిడిలార్డర్ బ్యాటర్లు తీసుకున్నారు. వసీం అలీ 24, మహ్మద్ నదీం 41, హమద్ మీర్జా 28(నాటౌట్) పరుగులతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఒమన్ ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.కాగా ఒమన్ ఓపెనర్లలో జతిందర్ సింగ్ వికెట్‌ను నిషాంత్ సంధు.. ఆమిర్ ఖలీం వికెట్‌ను ఆకిబ్ ఖాన్ తీయగా.. రమణ్‌దీప్ సింగ్ కరణ్ సోనావాలేను అవుట్ చేశాడు. మిగతా భారత బౌలర్లలో సాయి కిషోర్ వసీం అలీ, రాసిక్ సలాం మహ్మద్ నదీం వికెట్లను దక్కించుకున్నారు.సెమీస్లోఇక ఈ ఆసియా టోర్నీలో గ్రూప్-బిలో ఉన్న భారత-‘ఎ’ జట్టు ఇప్పటికే పాకిస్తాన్-‘ఎ’, యూఏఈలపై గెలుపొంది సెమీస్ చేరింది. ఒమన్‌పై గెలిచి హ్యాట్రిక్ సాధిస్తే గ్రూప్-బి టాపర్‌గా నిలుస్తుంది. ఇదే గ్రూపులో ఉన్న పాకిస్తాన్ సైతం టాప్-4కు అర్హత సాధించింది. మరోవైపు.. గ్రూప్-ఏ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. చదవండి: Sikandar Raza: పరుగుల విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ.. రోహిత్ రికార్డు బ్రేక్ -
నేడే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. గెలుపెవరది?
వరల్డ్ క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజే వేరు. దాయాదుల పోరు ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అటు సీనియర్ జట్లు అయినా, ఇటు జూనియర్ టీమ్స్ అయినా రైవలరీ మాత్రం ఒకటే. ఎమర్జింగ్ ఆసియా కప్ 2024లో భాగంగా ఆక్టోబర్ 19న భారత్-ఎ, పాకిస్తాన్-ఎ జట్లు తలపడనున్నాయి. ఒమన్‌లోని అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్లో శనివారం సాయంత్రం 7:00 గంటలకు దాయాదుల పోరు షురూ కానుంది.ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ ఈవెంట్లో భారత జట్టు యువ సంచలనం హైదరాబాదీ తిలక్ వర్మ సారథ్యం వహించనున్నాడు. అభిషేక్ శర్మ, ప్రభుసిమ్రాన్ సింగ్, ఆయూష్ బదోని వంటి యువ ఆటగాళ్లు భారత జట్టులో భాగమయ్యారు. మరోవైపు పాకిస్తాన్ జట్టుకు యువ ప్లేయర్ మహ్మద్ హ్యారీస్ నాయకత్వం వహించనున్నాడు. గతేడాది అతడి నేతృత్వంలోనే పాక్ జట్టు ఎమర్జింగ్ ఆసియాకప్ ఛాంపియన్స్‌గా నిలిచింది. తుది జట్లు(అంచనా)భారత్ A: అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రాన్ సింగ్, తిలక్ వర్మ, ఆయుష్ బడోని, నెహాల్ వధేరా, నిశాంత్ సింధు, రమణదీప్ సింగ్, రసిఖ్ సలామ్, వైభవ్ అరోరా, సాయి కిషోర్, రాహుల్ చాహర్పాకిస్థాన్ A: మహ్మద్ హారీస్, యాసిర్ ఖాన్, హైదర్ అలీ, ఒమైర్ యూసుఫ్, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్), ఖాసిం అక్రమ్, షానవాజ్ దహానీ, సుఫియాన్ ముఖీమ్, మహ్మద్ ఇమ్రాన్, అబ్బాస్ అఫ్రిది, అహ్మద్ డానియాల్ -
Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్..
ఏసీసీ ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. మొదటి మ్యాచ్‌లోనే దాయాది పాకిస్తాన్‌తో ఇండియా-ఎ జట్టు తలపడనుంది. ఆక్టోబర్ 19న మస్కట్‌లోని అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్లో చిరకాల ప్రత్యర్ధిలు మధ్య పోరు జరగనుంది.ఇరు జట్లకు ఇదే మొదటి మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టోర్నీని శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇక ఈ టోర్నీలో భారత జట్టుకు యువ ఆటగాడు, హైదరాబాదీ తిలక్ వర్మ సారథ్యం వహించనున్నాడు. ఇండియా జట్టులో తిలక్‌తో పాటు యువ సంచలనం అభిషేక్ శర్మకు చోటు దక్కింది.అదే విధంగా ఐపీఎల్లో అదరగొట్టిన యువ ఆటగాళ్లు ఆయుష్ బదోని (లక్నో సూపర్ జెయింట్స్), రమన్‌దీప్ సింగ్ (కేకేఆర్), ప్రభ్సిమ్రాన్ సింగ్ (పంజాబ్ కింగ్స్), నేహాల్ వదేరా (ముంబై ఇండియన్స్), అనుజ్ రావత్ (ఆర్సీబీ) కూడా భారత జట్టుకు ఎంపికయ్యారు.మరోవైపు పాకిస్తాన్ జట్టుకు యువ ప్లేయర్ మహ్మద్ హ్యారీస్ నాయకత్వం వహించనున్నాడు. గతేడాది అతడి నేతృత్వంలోనే పాక్ జట్టు ఎమర్జింగ్ ఆసియాకప్ ఛాంపియన్స్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి తమ సత్తాచాటేందుకు హ్యారీస్ ఉవ్విళ్లరూతున్నాడు.ఫైనల్ ఎప్పుడంటే?కాగా ఆక్టోబర్ 18న హాంకాంగ్, చైనా మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక ఉన్నాయి.గ్రూప్-బీతో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ జట్లు ఉన్నాయి. గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుతాయి. అక్టోబర్ 25న సెమీస్, అక్టోబర్ 27న ఫైనల్ జరగనుంది.లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?ఎమర్జింగ్ ఆసియాకప్ మ్యాచ్‌లను భారత్‌లో ఫ్యాన్‌కోడ్ యాప్ లేదా వెబ్సైట్లో వీక్షించవచ్చు.భారత్ ఎ: తిలక్ వర్మ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, అన్షుల్ కాంబోజ్, హృతిక్ షోకీన్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా సలాం, సాయి కిషోర్, రాహుల్ చాహర్పాకిస్థాన్ ఎ: మహ్మద్ హారిస్ (కెప్టెన్/వికెట్ కీపర్), అబ్బాస్ అఫ్రిది, ఖాసిమ్ అక్రమ్, అహ్మద్ డానియాల్, షానవాజ్ దహానీ, మహ్మద్ ఇమ్రాన్, హసీబుల్లా ఖాన్ (వికెట్-కీపర్), యాసిర్ ఖాన్, జమాన్ ఖాన్, అరాఫత్ మిన్హాస్, సుఫియాన్ ముఖిమ్, మెహ్రాన్ ముఖిమ్ , అబ్దుల్ సమద్, ఒమైర్ యూసుఫ్ -
భారత్ మొదలుపెట్టింది, అప్పటి నుంచి మాకు ఈ గతి పట్టింది: పాక్ మాజీ కెప్టెన్
సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘెర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో పాక్ దారుణంగా విఫలమై 146 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (448/6) చేసిన పాక్.. ఓవరాక్షన్ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి తగిన మూల్యం చెల్లించుకుంది. పైగా ఈ మ్యాచ్‌లో పాక్ ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా లేకుండా బరిలోకి దిగింది. పిచ్‌ను అంచనా వేయడంలో దారుణంగా విఫలమైన పాక్ మేనేజ్మెంట్ ఏకంగా నలుగురు స్పెషలిస్ట్ పేసర్లను బరిలోకి దించి చేతులు కాల్చుకుంది. పై పేర్కొన్న కారణాలన్నింటినీ తమకు అనుకూలంగా మార్చుకున్న బంగ్లాదేశ్ పాక్‌ను వారి సొంతగడ్డపై చావుదెబ్బకొట్టింది. టెస్ట్‌ల్లో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది తొలి విజయం. పాక్‌ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టు బంగ్లాదేశే కావడం మరో విశేషం.బంగ్లా చేతిలో ఘోర పరాజయం నేపథ్యంలో ఆ దేశ మాజీలు పాక్ జట్టును తూర్పారబెడుతున్నారు. షాహిద్ అఫ్రిది, రమీజ్ రజా.. ఇలా ప్రతి ఒక్కరు పాక్ జట్టుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. చాలామంది పాక్ వ్యూహాలను తప్పుబడుతున్నారు. రమీజ్ రజా లాంటి వారైతే పాక్ జట్టు ఎంపికనే ఘోర తప్పిదమని మండిపడుతున్నాడు. రావల్పిండి లాంటి స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌పై నలుగురు ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేయడంలో అంతర్యమేమిటని ప్రశ్నించాడు. జట్టులో ఒక్క స్పిన్నర్‌ను కూడా ఎంపిక చేయనప్పుడే పాక్ ఓడిందని అన్నాడు. పాక్ కోల్పోయిన 16 వికెట్లలో బంగ్లా స్పిన్నర్లు తొమ్మిదింటిని పడగొట్టారని గుర్తు చేశాడు.పాక్ దారుణ ఓటమి అంశాన్ని రమీజ్ రజా టీమిండియాతో ముడిపెట్టాడు. భారత్ వల్లే సుదీర్ఘ ఖ్యాతి కలిగిన పాక్ పేస్ బౌలింగ్ అటాక్ లయ తప్పిందని అన్నాడు. గతేడాది ఆసియా కప్‌లో టీమిండియా బ్యాటర్లు పాక్ బౌలర్లపై పైచేయి సాధించారు. అప్పటి నుంచి ఆ జట్టు పేస్ బౌలింగ్ విభాగం సర్వ సాధారణంగా మారిపోయిందని అన్నాడు. అప్పడే పాక్ పేస్ బౌలింగ్ పతనం ప్రారంభమైందని తెలిపాడు. నాటి నుంచి పాక్ పేసర్ల రహస్యాలు బహిర్గతమై మిగతా బ్యాటర్లు సులువుగా ఎదుర్కొంటున్నారని అన్నాడు. పాక్ ఓటమికి రమీజ్ టీమిండియాను కారణంగా చూపించడంపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. మరికొందరేమో భారత్ దెబ్బ పడితే ఇలాగే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.కాగా, బంగ్లాతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 30న ఇదే వేదికగా జరుగనుంది.స్కోర్ వివరాలు..పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 448/6 (సౌద్ షకీల్ 141, మొహమ్మద్ రిజ్వాన్ 171 నాటౌట్, హసన్ మహమూద్ 2/70)బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 565 (ముష్ఫికర్ అహ్మద్ 191, షడ్మాన్ ఇస్లాం 93, నసీం షా 3/93)పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 146 (మొహమ్మద్ రిజ్వాన్ 51, మెహిది హసన్ 4/21)బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 30/0 (జకీర్ హసన్ 15 నాటౌట్) -
వచ్చే ఏడాది భారత్‌లో ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీ
పురుషుల ఆసియాకప్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. టి20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించనున్నారు. 2026లో స్వదేశంలో జరిగే టి20 ప్రపంచకప్‌కు ముందుగా ఈ టోర్నీ నిర్వహిస్తారు. గతంలోనూ 2023 వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా పాకిస్తాన్లో ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లో నిర్వహించారు. అయితే భారత్ అక్కడికి వెళ్లేందుకు నిరాకరించడంతో ‘హైబ్రిడ్ మోడల్’తో భారత్ ఆడిన మ్యాచ్‌ల్ని శ్రీలంకలో ఏర్పాటు చేశారు. ఫైనల్లో శ్రీలంకపై గెలిచి భారత్ విజేతగా నిలిచింది. అనంతరం 2027 ఆసియా కప్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుంది. అదే ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో బంగ్లాలో వన్డే ఫార్మాట్లో ఆసియాకప్ జరుగనుంది. ఈ రెండు టోరీ్నల్లోనూ భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లతో పాటు టెస్టు హోదా దక్కని ఒక ఆసియా జట్టు పాల్గొంటుందని ఆసియా క్రికెట్ మండలి తెలిపింది. -
భారత్ వేదికగా ఆసియాకప్-2025.. పాకిస్తాన్ వస్తుందా?
పురుషుల ఆసియాకప్-2025కు భారత్ ఆతిథ్యమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈసారి టీ20 ఫార్మాట్లో ఆసియాకప్ జరగనుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ తాజాగా 2024 నుంచి 2027 కాలానికి గాను స్పాన్సర్షిప్ హక్కుల కోసం ఐఈవోఐ(IEOI)లను ఆహ్వానించింది. దీని ప్రకారం ప్రకారం వచ్చే ఏడాది ఆసియాకప్ భారత్‌లో జరగనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా గతేడాది వన్డే ఫార్మాట్లో జరిగిన ఆసియాకప్‌కు పాకిస్తాన్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత్ వంతు. అదే విధంగా ఆసియాకప్-2026(వన్ఢే ఫార్మాట్)కు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనుంది. ఇక ఈ రిపోర్ట్ ప్రకారం భారత్ వేదికగా జరిగే ఆసియాకప్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గోనున్నాయి. భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నేరుగా ఆర్హత సాధించగా.. మరో జట్టు క్వాలిఫియర్స్ ఆరో జట్టుగా టోర్నీలో అడుగుపెడుతుంది. అదే విధంగా మొత్తం 13 మ్యాచ్‌లో ఈ ఈవెంట్లో జరగనున్నాయి. ఆసియాకప్-2023(వన్డే ఫార్మాట్) విజేతగా భారత్ నిలవగా.. అంతకుముందు ఆసియాకప్-2022(టీ20 ఫార్మాట్) ఛాంపియన్స్‌గా శ్రీలంక నిలిచింది.పాక్ వస్తుందా?వన్డే ప్రపంచకప్-2023లో తలపడేందుకు భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ మరోసారి తమ దాయాది గడ్డపై అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. అయితే వాస్తవానికి గతేడాది ఆసియాకప్‌కు పాకిస్తాన్ ఒంటరిగానే ఆతిథ్యమివ్వాల్సింది. కానీ భారత జట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరిచిండంతో హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీ జరిగింది.భారత్ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు కూడా పాక్‌ను ఆతిథ్యమివ్వనుంది. కానీ మరోసారి తమ జట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ సిద్దంగా లేదు. ఆసియాకప్ మాదిరిగానే హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఇంక ఈ విషయంపై ఎటువంటి స్పష్టత లేదు. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనేందుకు టీమిండియా తమ దేశానికి రాకపోతే.. పాక్ ఆసియాకప్‌లో తలపడేందుకు భారత్‌కు వస్తుందో లేదో వేచి చూడాలి. -
టీమిండియాకు షాకిచ్చిన శ్రీలంక.. ఆసియా కప్ ఫైనల్లో జయకేతనం
ఆసియా కప్ 2024 ఫైనల్లో శ్రీలంక టీమిండియాకు షాకిచ్చింది. ఇవాళ (జులై 28) జరిగిన ఫైనల్లో భారత్‌పై 8 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. స్మృతి మంధన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (16 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో కవిష దిల్హరి 2, ప్రబోధిని, సచిని నిసంసల, చమారి అటపట్టు తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. చమారీ అటపట్టు (43 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), హర్షిత సమరవిక్రమ (51 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కవిష దిల్హరి (16 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) చెలరేగడంతో మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే (2 వికెట్ల నష్టానికి) విజయతీరాలకు చేరింది. భారత బౌలర్లలో దీప్తి శర్మకు ఏకైక వికెట్ లభించింది. ఈ టోర్నీలో ఆది నుంచి ఆజేయంగా నిలిచిన భారత్ చివరి మెట్టుపై బోల్తా పడింది. -
Asia Cup Final: రాణించిన స్మృతి.. చెలరేగిన జెమీమా, రిచా ఘోష్
మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్ చేసింది. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. స్మృతి మంధన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు) మెరుపు అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో జెమీమా రోడ్రిగ్స్ (16 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) చెలరేగి ఆడారు. షఫాలీ వర్మ (16), ఉమా చత్రీ (9), హర్మన్‌ప్రీత్ కౌర్ (11) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. పూజా వస్త్రాకర్ 5, రాధా యాదవ్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో కవిష దిల్హరి 2, ప్రబోధిని, సచిని నిసంసల, చమారి అటపట్టు తలో వికెట్ పడగొట్టారు. తుది జట్లు..శ్రీలంక: విష్మి గుణరత్నే, చమారి అటపట్టు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిష దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(వికెట్‌కీపర్), హాసిని పెరీరా, సుగందిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసలభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రీ, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్‌కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్ -
Asia Cup Final: టాస్ గెలిచిన టీమిండియా.. తుది జట్లు ఇవే..!
మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో ఇవాళ (జులై 28) భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. డంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక ఓ మార్పు చేయగా.. భారత్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. లంక జట్టులో అచిని కులసూర్య స్థానంలో సచిని నిసంసల తుది జట్టులోకి వచ్చింది. కాగా, సెమీఫైనల్లో భారత్.. బంగ్లాదేశ్‌పై, శ్రీలంక.. పాకిస్తాన్‌పై విజయాలు సాధించి ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే.తుది జట్లు..శ్రీలంక: విష్మి గుణరత్నే, చమారి అటపట్టు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిష దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(వికెట్‌కీపర్), హాసిని పెరీరా, సుగందిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసలభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రీ, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్‌కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్ -
భారీ విజయంతో ఫైనల్లోకి భారత్
దంబుల్లా: బౌలర్ల క్రమశిక్షణకు బ్యాటర్ల సహకారం తోడవడంతో... భారత మహిళల జట్టు ఆసియా కప్ టి20 టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది. లీగ్ దశలో సంపూర్ణ ఆధిపత్యంతో నాకౌట్‌కు చేరిన టీమిండియా... శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. మహిళల ఆసియాకప్‌లో భారత జట్టు తుదిపోరుకు చేరడం ఇది తొమ్మిదోసారి కాగా.. టి20 ఫార్మాట్లో నిర్వహించిన ఐదుసార్లూ ఫైనల్లో అడుగుపెట్టింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. కెపె్టన్ నిగార్ సుల్తానా (32), షోర్ణా అక్తర్ (19 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక, రాధ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు స్మృతి మంధాన (39 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు, ఒక సిక్సర్), షఫాలీ వర్మ (26 నాటౌట్) రాణించారు. ఆదివారం జరిగే ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జట్టుతో భారత్ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టును ఓడించింది. రేణుక అదుర్స్ మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ఏదీ కలిసిరాలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ దిలారా అక్తర్ (6)ను అవుట్ చేసిన రేణుక, తన తదుపరి ఓవర్లో ఇస్మా (8)ను పెవిలియన్‌కు పంపించింది. ఆరో ఓవర్లో ముర్షిదా ఖాతూన్ (4) కూడా వెనుదిరిగింది. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి బంగ్లా 25/3తో నిలిచింది. ఈ మూడు వికెట్లు రేణుక ఖాతాలోకే వెళ్లాయి. ఇక అక్కడి నుంచి బంగ్లా మహిళల జట్టు కోలుకోలేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరే చేసింది. ఇద్దరే కొట్టేశారు స్వల్ప లక్ష్యఛేదనలో భారత ఓపెనర్లు చెలరేగిపోయారు. స్మృతి, షఫాలీ విజృంభణతో 11 ఓవర్లలోనే భారత జట్టు విజయం సాధించింది. భారత అమ్మాయిలు అదరగొట్టిన చోట బంగ్లా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీంతో స్మృతి ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్న మంధాన .. నాకౌట్ మ్యాచ్‌ల్లో నాలుగో హాఫ్ సెంచరీ తన పేరిట లిఖించుకుంది. అలాగే పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగుల జాబితాలో రెండోస్థానానికి చేరింది. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: దిలారా అక్తర్ (సి) ఉమ (బి) రేణుక 6; ముర్షిదా ఖాతూన్ (సి) షఫాలీ (బి) రేణుక 4; ఇస్మా తన్జీమ్ (సి) తనూజ (బి) రేణుక 8; నిగార్ సుల్తానా (సి) దీప్తి (బి) రాధ 32; రుమానా (బి) రాధ 1; రాబియా ఖాన్ (సి) షఫాలీ (బి) పూజ 1; రీతు మోనీ (స్టంప్డ్) రిచా (బి) దీప్తి 5; షోర్ణా (నాటౌట్) 19; నహిద (బి) రాధ 0; మారుఫా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 80. వికెట్ల పతనం: 1–7, 2–17, 3–21, 4–30, 5–33, 6–44, 7–80, 8–80. బౌలింగ్: రేణుక 4–1–10–3, పూజ 4–0–25–1, తనూజ 4–0–16–0, దీప్తి 4–0–14–1, రాధ 4–1–14–3. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (నాటౌట్) 26; స్మృతి (నాటౌట్) 55; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 83. బౌలింగ్: మారుఫా 2–0– 17–0, నహిద 3–0–34–0, జహనారా ఆలమ్ 3–0–17–0, రాబియా ఖాన్ 2–0–10–0, రుమానా అహ్మద్ 1–0–5–0.9 మహిళల ఆసియాకప్‌లో (వన్డే, టి20 ఫార్మాట్ కలిపి) భారత జట్టు ఫైనల్ చేరడం ఇది తొమ్మిదోసారి. ఇందులో ఏడుసార్లు ట్రోఫీ గెలుచుకుంది. 2018లో రన్నరప్‌గా నిలిచింది.1 టి20 క్రికెట్లో రెండుసార్లు 20వ ఓవర్ మెయిడెన్ వేసిన తొలి బౌలర్‌గా రాధ యాదవ్ రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా పురుషుల క్రికెట్లో ఎనిమిది మంది, మహిళల క్రికెట్లో తొమ్మిది మంది బౌలర్లు ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను మెయిడెన్ చేశారు.3 టి20ల్లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం ఇది మూడోసారి. ఇటీవల దక్షిణాఫ్రికాపై 85 పరుగుల లక్ష్యాన్ని అజేయంగా ఛేదించిన భారత్.. 2019లో వెస్టిండీస్‌పై 104 పరుగుల టార్గెట్‌ను వికెట్ కోల్పోకుండా అధిగమించింది.2 మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో స్మృతి మంధాన (3433) రెండోస్థానానికి దూసుకెళ్లింది. సూజీ బేట్స్ (4348; న్యూజిలాండ్) టాప్ ర్యాంక్‌లో ఉంది. -
సెమీస్‌కు క్వాలిఫై అయిన శ్రీలంక, బంగ్లాదేశ్.. భారత ప్రత్యర్థి ఎవరంటే..?
మహిళల ఆసియా కప్ 2024లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. గ్రూప్-బిలో భాగంగా నిన్న (జులై 24) జరిగిన మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ మలేసియాపై.. శ్రీలంక థాయ్‌లాండ్‌పై ఘన విజయాలు సాధించాయి. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో మలేసియాపై బంగ్లాదేశ్ 114 పరుగల తేడాతో.. రాత్రి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై శ్రీలంక 10 వికెట్ల తేడాతో ఘన విజయాలు నమోదు చేశాయి. ఈ గెలుపులతో గ్రూప్-బి టాపర్లు అయిన శ్రీలంక, బంగ్లాదేశ్ సెమీస్‌కు క్వాలిఫై అయ్యాయి. మలేసియా, థాయ్‌లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మరోవైపు గ్రూప్-ఏ సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఈ గ్రూప్ నుంచి భారత్, పాకిస్తాన్ సెమీస్‌కు అర్హత సాధించాయి. రేపు జరుగబోయే తొలి సెమీఫైనల్లో భారత్.. బంగ్లాదేశ్‌ను.. పాకిస్తాన్ శ్రీలంకను ఢీకొంటాయి. రేపు మధ్యాహ్నం భారత్ మ్యాచ్, రాత్రి పాకిస్తాన్ మ్యాచ్ జరుగనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచే జట్ల మధ్య జులై 28న అంతిమ సమరం జరుగుతుంది.బంగ్లా-మలేసియా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేయగా..ఛేదనలో చేతులెత్తేసిన మలేసియా 20 ఓవర్లలో 77 పరుగులకు పరిమితమై దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ థాయ్‌లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేయగా.. పాకిస్తాన్ ఆడుతూ పాడుతూ వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. -
Asia Cup 2024: టీమిండియా హ్యాట్రిక్ విజయం.. సెమీస్‌కు అర్హత
మహిళల ఆసియా కప్ 2024 ఎడిషన్‌లో టీమిండియా సెమీఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నిన్న (జులై 23) పసికూన నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్ ఫోర్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (81), దయాలన్ హేమలత (47) రాణించగా.. ఆఖర్లో జెమీమా రోడ్రిగెజ్ (28 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడంది. నేపాల్ బౌలర్లలో సీతా రనా మగర్ 2 వికెట్లు పడగొట్టగా.. కబిత జోషి ఓ వికెట్ దక్కించుకుంది.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. భారత బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీప్తి శర్మ (4-0-13-3), రేణుకా సింగ్ (4-1-15-1), తనూజా కన్వర్ (4-1-12-0), అరుంధతి రెడ్డి (4-0-28-2), రాధా యాదవ్ (3-0-12-2) నేపాల్‌ను ముప్పుతిప్పలు నెట్టారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. 18 పరుగులు చేసిన సీతా టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో అగ్రస్థానంతో ముగించింది. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో పాకిస్తాన్ యూఏఈపై ఘన విజయం సాధించి, గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఏ జట్టు ఇప్పటివరకు అధికారికంగా సెమీస్‌కు క్వాలిఫై కాలేదు. రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించిన శ్రీలంక గ్రూప్ టాపర్‌గా ఉండగా.. థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేసియా వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచే జట్టుతో భారత్ సెమీస్‌లో పోటీపడనుంది. పాక్.. గ్రూప్-బి టాపర్‌ను సెమీస్‌లో ఢీకొట్టనుంది. భారత్ సెమీఫైనల్ మ్యాచ్ జులై 26న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ సెమీస్ మ్యాచ్ అదే రోజు రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. -
నేడు (జులై 23) టీమిండియాతో నేపాల్ 'ఢీ'
మహిళల ఆసియా కప్ 2024లో ఇవాళ (జులై 23) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో పాకిస్తాన్, యూఏఈ పోటీపడనుండగా.. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో నేపాల్ టీమిండియాను ఢీకొంటుంది.వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ప్రస్తుత ఎడిషన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. పసికూన నేపాల్‌తో ఇవాళ తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించి, గ్రూప్-ఏ నుంచి టాపర్‌గా ఉంది. నేటి మ్యాచ్‌లో భారత్ నేపాల్‌పై గెలుస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది.గ్రూప్-ఏ నుంచి ఇవాళ జరుగబోయే మరో మ్యాచ్‌లో పాకిస్తాన్, యూఏఈ తలపడనున్నాయి. యూఏఈ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై చిట్టచివరి స్థానంలో ఉండగా.. పాక్ భారత్ చేతిలో ఓడి యూఏఈపై గెలిచి రెండో స్థానంలో కొనసాగుతుంది. ఈ గ్రూప్ నుంచి మూడో స్థానంలో ఉన్న నేపాల్.. యూఏఈపై విజయం సాధించినప్పటికీ ఆ జట్టు రన్‌రేట్ చాలా తక్కువగా ఉంది. ఒకవేళ నేపాల్ భారత్‌పై గెలిచినా సెమీస్‌కు అర్హత సాధించలేదు. గ్రూప్-ఏ నుంచి భారత్, పాక్ సెమీస్‌కు చేరడం దాదాపుగా ఖరారైనట్లే.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో శ్రీలంక టాపర్‌గా కొనసాగుతుంది. శ్రీలంక ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. థాయ్‌లాండ్, బంగ్లాదేశ్ చెరో మ్యాచ్‌లో విజయం సాధించి రెండు,మూడు స్థానాల్లో ఉండగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన మలేసియా చివరి స్థానంలో నిలిచింది. -
Asia Cup 2024: బంగ్లా బౌలర్ల విజృంభణ.. తొలి విజయం నమోదు
మహిళల ఆసియా కప్ 2024లో బంగ్లాదేశ్ తొలి విజయం నమోదు చేసింది. థాయ్‌లాండ్‌తో నిన్న (జులై 22) జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా 10 మ్యాచ్‌ల్లో ఓటమి అనంతరం బంగ్లాదేశ్‌కు లభించిన తొలి విజయం ఇది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.బంగ్లా బౌలర్ల విజృంభణటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన థాయ్‌లాండ్.. బంగ్లా బౌలర్లు విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. రబేయా ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు నాలుగు వికెట్లు పడగొట్టగా.. రీతూ మోనీ, సబికున్ నహార్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. థాయ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ బూచాథమ్ (40), లవోమీ (17), రోస్నన్ కనో (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 17.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా విజయం సాధించింది. ఓపెనర్ ముర్షిదా ఖాతూన్ (50) అర్ద సెంచరీతో రాణించగా.. దిలార అక్తెర్ 17, ఇష్మా తంజిమ్ 16 పరుగులు చేశారు. థాయ్ బౌలర్లలో పుత్తావాంగ్, ఫన్నిట మాయా తలో వికెట్ దక్కించుకున్నారు. బంగ్లా తమ తదుపరి మ్యాచ్‌లో మలేషియాతో తలపడనుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. శ్రీలంక చేతుల్లో ఓడింది. ప్రస్తుతం గ్రూప్-బి పాయింట్ల పట్టికలో శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా వరుస స్థానాల్లో ఉన్నాయి. గ్రూప్-ఏ విషయానికొస్తే.. భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి గ్రూప్ టాపర్‌గా కొనసాగుతుండగా.. పాకిస్తాన్, నేపాల్, యూఏఈ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టీమిండియా ఇవాళ (జులై 23) రాత్రి జరుగబోయే మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడనుంది. -
చమరి అటపట్టు సూపర్ సెంచరీ
ఆసియా కప్ మహిళల టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా దంబుల్లాలో సోమవారం మలేసియాతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక 144 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా శ్రీలంక 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. కెప్టెన్ చమరి అటపట్టు (69 బంతుల్లో 119 నాటౌట్; 14 ఫోర్లు, 7 సిక్స్‌లు) తన టి20 కెరీర్లో మూడో సెంచరీ సాధించింది. మలేసియా 19.5 ఓవర్లలో 40 పరుగులకే కుప్పకూలింది. -
Asia Cup 2024: పసికూనపై పాక్ ప్రతాపం
మహిళల ఆసియా కప్‌లో పాకిస్తాన్ తొలి విజయం సాధించింది. నేపాల్‌తో నిన్న (జులై 21) జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్.. పసికూన నేపాల్‌పై విరుచుకుపడింది. నేపాల్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని పాక్ 11.5 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా గ్రూప్-ఏలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ గ్రూప్‌లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మైదానంలో పాదరసంలా కదిలారు. పాక్ ఆటగాళ్లు ముగ్గురు నేపాల్ బ్యాటర్లను రనౌట్ చేశారు. సైదా ఇక్బాల్ 2, ఫాతిమా సనా ఓ వికెట్ పడగొట్టారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో కబిత జోషి (31 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సీతా రనా మగర్ 26, పూజా మహతో 25, కబిత కన్వర్ 13 పరుగులు చేశారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్.. ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు గుల్ ఫెరోజా (35 బంతుల్లో 57; 10 ఫోర్లు), మునీబా అలీ (34 బంతుల్లో 46 నాటౌట్; 8 ఫోర్లు) నేపాల్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నారు. ఇవాళ (జులై 22) శ్రీలంక, మలేసియా.. బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ మధ్య మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత్.. తమ తదుపరి మ్యాచ్‌లో (జులై 23) నేపాల్‌తో తలపనుంది. -
రిచా ఘోష్ ఊచకోత.. టీమిండియా ఖాతాలో మరో విజయం
మహిళల ఆసియా కప్ 2024లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. యూఏఈతో ఇవాళ (జులై 21) జరిగిన మ్యాచ్‌లో భారత్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగా.. యూఏఈ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది.రిచా ఘోష్ ఊచకోత.. హర్మన్ మెరుపు హాఫ్ సెంచరీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. హర్మన్‌ప్రీత్ కౌర్ (47 బంతుల్లో 66; 7 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (29 బంతుల్లో 64 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్) మెరుపు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడటంతో భారీ స్కోర్ చేసింది. ఆఖరి ఓవర్లో రిచా ఘోష్ ఆకాశమే హద్దుగా చెలరేగి చివరి ఐదు బంతులను బౌండరీలుగా మలిచింది. ఫలితంగా టీమిండియా టీ20ల్లో తొలిసారి 200 పరుగుల మార్కును దాటింది. భారత ఇన్నింగ్స్‌లో హర్మన్, రిచాతో పాటు షఫాలీ వర్మ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, సిక్స్) కూడా రెచ్చిపోగా.. స్మృతి మంధన (9 బంతుల్లో 13), దయాలన్ హేమలత (4 బంతుల్లో 2), జెమీమా రోడ్రిగెజ్ (13 బంతుల్లో 14 పరుగులు) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. యూఏఈ బౌలర్లలో కవిష ఎగోడగే 2, సమైరా ధర్నిధర్కా, హీనా హోచ్చందనీ తలో వికెట్ దక్కించుకున్నారు.మూకుమ్మడిగా దాడి చేసిన టీమిండియా బౌలర్లు202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఏఈ.. భారత బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 123 పరుగులకే పరిమితమైంది. దీప్తి శర్మ 2, రేణుక సింగ్, తనుజా కన్వర్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.తిరుగులేని భారత్ఈ టోర్నీలో గ్రూప్-ఏలో పాకిస్తాన్, నేపాల్, యూఏఈలతో పోటీపడుతున్న భారత్.. వరుసగా రెండు విజయాలతో గ్రూప్ టాపర్‌గా కొనసాగుతుంది. నేపాల్, పాక్ చెరో మ్యాచ్‌లో ఓడిపోయి రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన యూఏఈ ఆఖరి స్థానంలో నిలిచింది.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో థాయ్‌లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా పోటీపడుతున్నాయి. థాయ్‌లాండ్, శ్రీలంక ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్‌లో గెలిచి ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్, మలేషియా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
Asia Cup 2024: టీమిండియా భారీ స్కోర్.. పొట్టి ఫార్మాట్లో తొలిసారి..!
మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా యూఏఈతో ఇవాళ (జులై 21) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (47 బంతుల్లో 66; 7 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (29 బంతుల్లో 64 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్), షఫాలీ వర్మ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, సిక్స్) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రిచా ఘోష్ చివరి ఐదు బంతులను బౌండరీలుగా తరలించింది. ఫలితంగా టీమిండియా టీ20ల్లో తొలిసారి 200 పరుగుల మార్కును దాటింది. భారత బ్యాటర్ల ధాటికి యూఏఈ బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కవిష ఎగోడగే 2, సమైరా ధర్నిధర్కా, హీనా హోచ్చందనీ తలో వికెట్ దక్కించుకున్నారు. భారత ఇన్నింగ్స్‌లో స్మృతి మంధన (9 బంతుల్లో 13), దయాలన్ హేమలత (4 బంతుల్లో 2), జెమీమా రోడ్రిగెజ్ (13 బంతుల్లో 14 పరుగులు) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. -
శ్రీలంక, థాయిలాండ్ విజయం
దంబుల్లా: మహిళల ఆసియా కప్ టోరీ్నలో శనివారం శ్రీలంక, థాయిలాండ్ జట్లు విజయాలు నమోదు చేశాయి. మాజీ చాంపియన్ బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో శ్రీలంక ఓడించింది. ముందుగా బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. కెపె్టన్ నిగార్ సుల్తానా (59 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. అనంతరం లంక 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 114 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విష్మీ గుణరత్నే (48 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేయగా...హర్షిత సమరవిక్రమ (31 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించింది. మరో మ్యాచ్‌లో థాయిలాండ్ 22 పరుగుల తేడాతో మలేసియాపై విజయం సాధించింది. ముందుగా థాయిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ననపట్ కొంచరోంకయ్ (35 బంతుల్లో 40; 6 ఫోర్లు) కీలక పరుగులు సాధించింది. ఆ తర్వాత మలేసియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులే చేయగలిగింది. వాన్ జూలియా (53 బంతుల్లో 52; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించినా మిగతావారంతా విఫలమయ్యారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా నేడు జరిగే తమ రెండో మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో భారత్ తలపడుతుంది. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి జరిగే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. తమ తొలి పోరులో పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. -
IND Vs PAK: మనదే పైచేయి
దంబుల్లా: డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆసియా కప్ టి20 క్రికెట్ టోరీ్నలో శుభారంభం చేసింది. పాకిస్తాన్‌పై తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ మరో విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. సిద్రా అమీన్ (35 బంతుల్లో 25; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టగా... రేణుక, శ్రేయాంక పాటిల్, పూజ వస్త్రకర్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 14.1 ఓవర్లలో 3 వికెట్లకు 109 పరుగులు చేసింది. స్మృతి మంధాన (31 బంతుల్లో 45; 9 ఫోర్లు), షఫాలీ వర్మ (29 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 57 బంతుల్లోనే 85 పరుగులు జోడించారు. టపటపా... భారత మహిళల పదునైన బౌలింగ్ ముందు పాక్ ఏమాత్రం నిలవలేకపోయింది. పూజ తన తొలి రెండు ఓవర్లలో 2 వికెట్లు తీసి ప్రత్యరి్థని నిలువరించగా, పవర్‌ప్లే ముగిసేసరికి పాక్ 37 పరుగులు చేసింది. కెప్టెన్ నిదా దార్ (8) ప్రభావం చూపలేకపోగా, రేణుక వరుస బంతుల్లో రెండు వికెట్లతో పాక్‌ను దెబ్బ కొట్టింది. ఈ దశలో తుబా, ఫాతిమా పోరాడి 25 బంతుల్లో 35 పరుగులు జత చేశారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్...రాధ ఓవర్లో ఫాతిమా రెండు సిక్స్‌లు బాదడంతో 100 పరుగులు దాటింది. 47 పరుగుల వ్యవధిలో పాక్ చివరి 6 వికెట్లు చేజార్చుకుంది. ఒకే ఓవర్లో 21 పరుగులు... ఛేదనలో భారత ఓపెనర్లు షఫాలీ, స్మృతి దూకుడుగా ఆడారు. వరుసగా మూడు ఓవర్లలో రెండేసి ఫోర్లు రాగా...తుబా ఓవర్లో స్మృతి రెండు ఫోర్లు, షఫాలీ ఒక సిక్స్ బాదారు. ఫలితంగా 6 ఓవర్లలోనే స్కోరు 57 పరుగులకు చేరింది. ఆ తర్వాత తుబా వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో స్మృతి చెలరేగింది. ఏకంగా ఐదు ఫోర్లు (4, 0, 4, 1 వైడ్, 4, 4, 4) బాదడంతో 21 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత 17 పరుగుల వ్యవధిలో స్మృతి, షఫాలీతో పాటు హేమలత (14) కూడా వెనుదిరిగినా...హర్మన్ (5 నాటౌట్), జెమీమా (3 నాటౌట్) కలిసి లాంఛనం పూర్తి చేశారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో నేపాల్ ఆరు వికెట్ల తేడాతో యూఏఈ జట్టుపై విజయం సాధించింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫేరోజా (సి) హర్మన్ (బి) పూజ 5; మునీబా (సి) రోడ్రిగ్స్ (బి) పూజ 11; సిద్రా (సి) రాధ (బి) రేణుక 25; ఆలియా (సి) రోడ్రిగ్స్ (బి) శ్రేయాంక 6; నిదా (సి) హేమలత (బి) దీప్తి 8; తుబా (సి) రాధ (బి) దీప్తి 22; ఇరమ్ (ఎల్బీ) (బి) రేణుక 0; ఫాతిమా (నాటౌట్) 22; అరూబ్ (రనౌట్) 2; నష్రా (సి) రిచా (బి) దీప్తి 0; సాదియా (బి) శ్రేయాంక 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్) 108. వికెట్ల పతనం: 1–9, 2–26, 3–41, 4–59, 5–61, 6–61, 7–92, 8–94, 9–94, 10–108. బౌలింగ్: రేణుక 4–0–14–2, పూజ 4–0–31–2, దీప్తి శర్మ 4–0–20–3, రాధ 4–0–26–0, శ్రేయాంక పాటిల్ 3.2–0–14–2. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ (బి) అరూబ్ 40; స్మృతి (సి) ఆలియా (బి) అరూబ్ 45; హేమలత (సి) తుబా (బి) నష్రా 14; హర్మన్ (నాటౌట్) 5; జెమీమా (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (14.1 ఓవర్లలో 3 వికెట్లకు) 109. వికెట్ల పతనం: 1–85, 2–100, 3–102. బౌలింగ్: సాదియా 2.1–0–18–0, ఫాతిమా 2–0–15–0, నిదా 1–0–10–0, తుబా 2–0–36–0, నష్రా 4–0–20–1, అరూబ్ 3–0–9–2. -
Asia Cup 2024: పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్
మహిళల ఆసియా కప్ టోర్నీలో టీమిండియా ఘనంగా బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. రేణుకా శర్మ (4-0-14-2), దీప్తి శర్మ (4-0-20-3), పూజా వస్త్రాకర్ (4-0-31-2), శ్రేయాంక పాటిల్ (3.2-0-14-2) ధాటికి 19.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అమీన్ (25), తుబా హసన్ (22), ఫాతిమా సనా (22), మునీబా అలీ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. గుల్ ఫేరోజా (5), అలియా రియాజ్ (6), నిదా దార్ (8), జావిద్ (0), అరూబ్ షా (2), నశ్రా సంధు (0), సదియా ఇక్బాల్ (0) నిరాశపరిచారు. అనంతరం ఛేదనకు దిగిన భారత్.. 14.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత ఓపెనర్లు షఫాలీ వర్మ 40, స్మృతి మంధన 45, దయాలన్ హేమలత 14 పరుగులు చేసి ఔట్ కాగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ (5), జెమీమా రోడ్రిగెజ్ (3) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుంది. ఈ మ్యాచ్ జులై 21న జరుగనుంది. కాగా, ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో యూఏఈపై నేపాల్ 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ విజయం నేపాల్‌ను ఆసియా కప్‌లో మొదటిది. -
Asia Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే
మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీ శ్రీలంకలోని డంబుల్లా వేదికగా ఇవాళ (జులై 19) ప్రారంభమైంది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో యూఏఈపై నేపాల్ విజయం సాధించింది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.తుది జట్లు..భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, శ్రేయంక పాటిల్, రేణుకా ఠాకూర్ సింగ్పాకిస్తాన్: సిద్రా అమీన్, గుల్ ఫిరోజా, మునీబా అలీ(వికెట్‌కీపర్), నిదా దార్(కెప్టెన్), అలియా రియాజ్, ఇరామ్ జావేద్, ఫాతిమా సనా, తుబా హసన్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా -
చరిత్ర సృష్టించిన నేపాల్ క్రికెట్ టీమ్
నేపాల్ మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ టీ20 టోర్నీలో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. డంబుల్లా (శ్రీలంక) వేదికగా యూఏఈతో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నేపాల్ 2012, 2016 ఎడిషన్లలో ఆసియా కప్‌లో పాల్గొన్నప్పటికీ ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. టోర్నీ చరిత్రలో తొలి విజయం సాధించడంతో నేపాల్ ఆటగాళ్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. విన్నింగ్ రన్ కొట్టగానే నేపాల్ ఆటగాళ్లంతా మైదానంలో చేరి సంబురాలు చేసుకున్నారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.HISTORY CREATED BY NEPAL....!!!- Nepal won their first ever match in Women's Asia Cup history. 🫡 pic.twitter.com/V8CwPaybqe— Johns. (@CricCrazyJohns) July 19, 2024కాగా, మహిళల ఆసియా కప్ 2024 టోర్నీ ఇవాల్టి నుంచే ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో యూఏఈ, నేపాల్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేయగా.. నేపాల్ 16.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.సత్తా చాటిన ఇందు బర్మాటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. నేపాల్ కెప్టెన్ ఇందు బర్మా (4-0-19-3) సత్తా చాటడంతో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. నేపాల్ బౌలర్లు తలో చేయి వేయడంతో యూఏఈ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. షబ్నమ్ రాయ్, కబిత జోషి, క్రితిక తలో వికెట్ పడగొట్టారు. యూఏఈ ఇన్నింగ్స్‌లో ఇషా రోహిత్ ఓఝా (10), సమైరా ధర్నిధర్కా (13), కవిష ఎగోడగే (22), ఖుషి శర్మ (36) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.చెలరేగిన సంజనా116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. ఓపెనర్ సంజనా ఖడ్కా (45 బంతుల్లో 72 నాటౌటగ్; 11 ఫోర్లు) చెలరేగడంతో సునాయాసంగా విజయం సాధించింది. యూఏఈ బౌలర్లలో కవిష 3 వికెట్లతో సత్తా చాటినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ టోర్నీలో ఇవాళ మరో మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఆ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. -
భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ
మహిళల టీ20 ఆసియా కప్-2024కు శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. జూలై 19న దంబుల్లా వేదికగా యూఏఈ - నేపాల్ మహిళల మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. కాగా ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు క్రికెట్ అభిమానులకు శ్రీలంక క్రికెట్ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది.టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లకు ప్రేక్షకులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వాలని శ్రీలంక క్రికెట్ నిర్ణయించింది. "మహిళల ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇస్తున్నందకు చాలా సంతోషంగా ఉంది. మహిళల క్రికెట్ ఆదరణ పెంచేందుకు అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నామని శ్రీలంక క్రికెట్ వైస్ ప్రెసిడెంట్ రవిన్ విక్రమరత్నే తెలిపారు. ఈయనే ఆసియాకప్ టోర్నమెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు.ఇక ఆసియా సింహాల పోరులో భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో జూలై 19న దంబుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానుల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు శ్రీలంక క్రికెట్ ఉచిత ప్రవేశం కల్పించడంతో పెద్ద ఎత్తున ఇరు జట్ల ఫ్యాన్స్ మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంకు తరలి రానున్నారు. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఎలో భారత్, పాకిస్తాన్, యూఏఈ, నేపాల్ ఉండగా.. గ్రూపు-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్,మలేషియా, థాయ్‌లాండ్ ఉన్నాయి. ఇక ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఆసియాకప్‌కు భారత మహిళల జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (డబ్ల్యుకె), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్రిజర్వ్ జాబితా: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్ -
ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. పాక్‌తోనే తొలి మ్యాచ్
మహిళల టీ20 ఆసియా కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మహిళల సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ఈ మల్టీనేషనల్ టోర్నమెంట్లో భారత మహిళల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుండగా.. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మహిళలతో తలపడుతున్న భారత జట్టునే దాదాపుగా సెలక్టర్లు ఎంపిక చేశారు. శ్రేయాంక పాటిల్, సజన సజీవన్, ఆశా శోభన వంటి క్రికెటర్లను సెలక్టర్లు కొనసాగించారు. ఇక ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూపు-ఎలో పాకిస్తాన్, యూఏఈ, నేపాల్‌తో పాటు ఉంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో జూలై 19న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు జూలై 21న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత తమ చివరి గ్రూపు మ్యాచ్‌లో జూలై 23న నేపాల్‌తో భారత్ తలపడనుంది. కాగా శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నఈ టోర్నీ జూలై 19న యూఏఈ -నేపాల్ మ్యాచ్‌తో ప్రారంభం కానుంది.ఆసియాకప్‌కు భారత మహిళల జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (డబ్ల్యుకె), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్రిజర్వ్ జాబితా: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్ -
పాక్‌తో భారత్ తొలిపోరు
న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల జట్టు ఆసియా కప్ టి20 టైటిల్ వేటను ఆరంభించనుంది. జూలై 19 నుంచి 28 వరకు శ్రీలంకలోని దంబుల్లా నగరంలో ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, నేపాల్... గ్రూప్ ‘బి’లో శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, మలేసియా జట్లున్నాయి. జూలై 19న పాకిస్తాన్‌తో మ్యాచ్ అనంతరం భారత జట్టు 21న యూఏఈతో, 23న నేపాల్‌తో ఆడతాయి. రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరతాయి. టాప్–10లో స్మృతి, హర్మన్‌ప్రీత్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ టాప్–10లో ఉన్నారు. గతవారం మూడో స్థానంలో ఉన్న స్మృతి ఒక స్థానం పడిపోయి నాలుగో ర్యాంక్‌లో నిలువగా... హర్మన్‌ప్రీత్ రెండు స్థానాలు ఎగబాకి తొమ్మిదో ర్యాంక్‌కు చేరుకుంది. -
ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్
దుబాయ్: ఈ ఏడాది మహిళల ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 19 నుంచి 28 వరకు దంబుల్లాలో ఈ టోర్నీ జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. చివరిసారి 2022లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ టోర్నిలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఏడోసారి విజేతగా నిలిచింది. క్రితంసారి ఏడు జట్లు పాల్గొనగా... ఈసారి ఎనిమిది జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, నేపాల్... గ్రూప్ ‘బి’లో శ్రీలంక, బంగ్లాదేశ్, మలేసియా, థాయ్‌లాండ్ జట్లున్నాయి. భారత్ తమ మూడు లీగ్ మ్యాచ్‌లను వరుసగా యూఏఈ (జూలై 19న), పాకిస్తాన్ (జూలై 21న), నేపాల్ (జూలై 23న) జట్లతో ఆడుతుంది. జూలై 26న సెమీఫైనల్స్... జూలై 28న ఫైనల్ జరుగుతాయి. -
ఒక్క గోల్, ఒక్క పాయింట్ లేకుండానే ఓటమితో ముగించిన టీమిండియా
దోహా: ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. గ్రూప్ ‘బి’లో భాగంగా సిరియాతో జరిగి న చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో సునీల్ ఛెత్రి నాయకత్వంలోని టీమిండియా 0–1 గోల్ తేడాతో ఓడిపోయింది. సిరియా తరఫున ఆట 76వ నిమిషంలో ఒమర్ ఖిరిబిన్ ఏకైక గోల్ చేసి తమ జట్టును గెలిపించాడు. ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క గోల్ కూడా చేయకుండానే, ఒక్క విజయం కూడా లేకుండా ని్రష్కమించింది. తొలి మ్యాచ్‌లో భారత్ 0–2తో ఆస్ట్రేలియా చేతిలో, రెండో మ్యాచ్‌లో 0–3తో ఉజ్బెకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. ఏడు పాయింట్లతో ఆస్ట్రేలియా, ఐదు పాయింట్లతో ఉజ్బెకిస్తాన్ ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించాయి. -
మళ్లీ ఓడిన భారత్.. వరుసగా రెండో పరాజయం
ఆసియా కప్ పురుషుల ఫుట్‌బాల్ టోర్నీలో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా దోహాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 0–3 గోల్స్ తేడాతో ఉజ్బెకిస్తాన్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత జట్టుకు నాకౌట్ దశకు అర్హత సాధించే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. ఈనెల 23న జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో సిరియాతో భారత్ ఆడుతుంది. -
34 ఏళ్ల నిరీక్షణకు తెర.. బంగ్లాదేశ్ రియల్ హీరో అతడే
అండర్-19 ఆసియాకప్ 2023లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఛాంపియన్స్‌గా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో యూఏఈను 160 పరుగుల తేడాతో చిత్తు చేసిన బంగ్లా జట్టు.. తొలిసారి ఆసియాకప్ టైటిల్‌ను ముద్దాడింది. సీనియర్ జట్టుకు కూడా సాధ్యం కానిది జూనియర్ బంగ్లా టైగర్స్ చేసి చూపించారు. దీంతో తమ 34 ఏళ్ల నిరీక్షణకు తెరదించారు. 1989 నుంచి ఆసియాకప్ టైటిల్ కోసం పోరాడతున్న బంగ్లా అండర్-19 జట్టు ఎట్టకేలకు సాధించింది. కాగా సెమీస్‌లో భారత్ వంటి పటిష్ట జట్టును ఓడించి మరి బంగ్లాదేశ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అతడే రియల్ హీరో.. బంగ్లాదేశ్ తొలిసారి అండర్-19 ఆసియాకప్ విజేతగా నిలవడంలో ఆ జట్టు హెడ్ కోచ్ స్టువర్ట్ లాది కీలక పాత్ర. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ లా గతేడాది జూలైలో బంగ్లా అండర్-19 జట్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి బంగ్లా యువ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. అతడి నేతృత్వంతో యువ క్రికెటర్లు మరింత రాటుదేలారు. ఆసియాకప్ టోర్నీకి ముందు దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ బంగ్లా యువ జట్టు అదరగొట్టింది. కాగా గతంలో బంగ్లా సీనియర్ జట్టుకు హెడ్‌కోచ్‌గా స్టువర్ట్ లా పనిచేశారు. 2011 నుంచి 2012 వరకు ఏడాది పాటు బంగ్లా ప్రధాన కోచ్‌గా లా కొనసాగారు. అతడి పర్యవేక్షణలో తమీమ్ ఇక్భాల్, ముష్ఫికర్ రహీం వంటి వారు వరల్డ్‌క్లాస్ క్రికెటర్లగా ఎదిగారు. అదే విధంగా అతడు శ్రీలంక, వెస్టిండీస్ జట్ల హెడ్‌కోచ్‌గా కొనసాగారు. ఇక అతడి నేతృత్వంలోని బంగ్లా జట్టు దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్-19 వరల్డ్‌కప్‌లోనూ అద్భుతాలు సృష్టించే ఛాన్స్ ఉంది. వీరే ఫ్యూచర్ స్టార్స్.. ఈ ఆసియాకప్ టోర్నీతో బంగ్లా జట్టుకు అషికర్ రెహ్మాన్ షిబ్లీ రూపంలో యువ సంచలనం దొరికాడు. ఈ టోర్నీ ఆసాంతం అషికర్ రెహ్మాన్ ఓపెనర్‌గా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షిబ్లీ... 255 పరుగులతో టోర్నీ టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. యూఏఈతో జరిగిన ఫైనల్లో కూడా షిబ్లీ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు ఇక్బాల్ హుస్సేన్ ఎమోన్, అరిఫుల్ ఇస్లాం కూడా సంచలన ప్రదర్శన కనబరిచారు. కచ్చితంగా వీరిముగ్గురూ అతి త్వరలోనే బంగ్లా జాతీయ జట్టులో కన్పించనున్నారు. చదవండి: IPL 2024: నిన్న రోహిత్... తాజాగా సచిన్ గుడ్‌బై... ముంబై ఇండియన్స్‌లో ఏమవుతోంది? -
ఈనెల 10న భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్
ఇటీవలికాలంలో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ల సంఖ్య బాగా పెరిగింది. వన్డే వరల్డ్‌కప్, అంతకుమందు ఆసియాకప్ టోర్నీల్లో టీమిండియా పాక్‌తో తలపడింది. ఈ రెండు టోర్నీలకు ముందు (2023, జులై) ఇరు దేశాల ఎమర్జింగ్ జట్లు ఆసియా కప్ ఫైనల్లో తలపడ్డాయి. రసవత్తరంగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్‌పై పాక్ 128 పరుగుల తేడాతో గెలుపొంది ఛాంపియన్‌గా నిలిచింది. అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్-పాక్‌లు మరోసారి తలపడనున్నాయి. ఈనెల 10న దాయాది జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. వన్డే ఫార్మాట్లో సాగనున్న ఈ టోర్నీ ఇవాల్టి (డిసెంబర్ 8) నుంచే మొదలైంది. టోర్నీలో భాగంగా ఇవాళ భారత్, ఆఫ్ఘనిస్తాన్.. నేపాల్, పాకిస్తాన్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ టోర్నీలో భారత్, పాక్‌తో పాటు మొత్తం ఎనిమిది జట్లు (ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, యూఏఈ, శ్రీలంక, జపాన్) పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ తొలి దశలో భారత్ మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. డిసెంబర్ 8న ఆఫ్ఘనిస్తాన్, 10న పాకిస్తాన్, 12న నేపాల్ జట్లతో యంగ్ ఇండియా తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ డిసెంబర్ 17న జరుగుతుంది. ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగనున్నాయి. భారత అండర్-19జట్టు: అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), అరవెల్లి అవనీష్ రావు (వికెట్‌కీపర్), సౌమీ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), మురుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్ (వికెట్‌కీపర్), ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారీ -
టోలీచౌకీ కుర్రాడు.. అదరగొట్టేశాడు: రాజమౌళి ట్వీట్ వైరల్!
ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను టీమిండియా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లతో శ్రీలంకను ఊచకోత కోసిన హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్‌పై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. నగరంలోని టోలీచౌకి బాయ్ ఆరు వికెట్లతో అద్భుతమైన బౌలింగ్ చేశాడంటూ కొనియాడారు. సిరాజ్‌ను ప్రశంసిస్తూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేయడంతో పాటు ట్వీట్ చేశారు. (ఇది చదవండి: అలాంటి వాళ్లను పెడితే బిగ్‌బాస్ ఎవరూ చూడరు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్) రాజమౌళి ట్వీట్ రాస్తూ.. 'సిరాజ్ మియాన్, మన టోలీచౌకీ కుర్రాడు ఆసియా కప్ ఫైనల్లో 6 వికెట్లతో మెరిశాడు. అంతే కాకుండాతన బౌలింగ్‌లో బౌండరీని ఆపడానికి లాంగ్-ఆన్కి పరిగెత్తి అందరి హదయాలను గెలిచాడు.' అంటూ పోస్ట్ చేశారు. రాజమౌళి చేసిన ట్వీట్‌ను చూసిన అభిమానులు సైతం సిరాజ్ ఘనతను ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఆసియాకప్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా వికెట్లేమీ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించింది. Siraj Miyan, Our Tolichowki boy shines at the Asia Cup final with 6 wickets…👌🏽👌🏽👌🏽👏🏻👏🏻👏🏻 And has a big heart, running to long-on to stop the boundary off his own bowling… 🤗🤗🤗 — rajamouli ss (@ssrajamouli) September 17, 2023 -
Asia Cup Final: శ్రీలంకను మట్టికరిపించిన భారత్.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం
శ్రీలంకను మట్టికరిపించిన భారత్.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం 2023 ఆసియా కప్ టైటిల్‌ను భారత్ ఎగరేసుకుపోయింది. ఇవాళ జరిగిన ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఆతిథ్య శ్రీలంకను మట్టికరిపించింది. తద్వారా ఎనిమిదో ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (23), శుభ్‌మన్ గిల్ (27) టీమిండియాను విజయతీరాలక చేర్చారు. అంతకుముందు మహ్మద్ సిరాజ్ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. టార్గెట్ 51.. 3 ఓవర్లలో భారత్ స్కోర్ 32/0 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ వేగంగా లక్ష్యం దిశగా సాగుతుంది. 3 ఓవర్లలో భారత్ వికెట్లు నష్టపోకుండా 32 పరుగులు చేసింది. గిల్ (18), ఇషాన్ (13) క్రీజ్‌లో ఉన్నారు. నిప్పులు చెరిగిన సిరాజ్.. 50 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా పేసర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మహ్మద్ సిరాజ్ (7-1-21-6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) తనవంతుగా రాణించడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా (5-1-23-1) కూడా ఓ వికెట్ పడగొట్టాడు. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక 40 పరుగుల వద్ద శ్రీలంక ఎనిమిదో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టడంతో వెల్లలగే (8) ఔటయ్యాడు. సిరాజ్ ఆన్ ఫైర్.. 6 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. కుశాల్ మెండిస్‌ను (17) క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా ఈ ఇన్నింగ్స్‌లో తన ఆరో వికెట్‌ను పడగొట్టాడు. సిరాజ్ 5.2 ఓవర్లలో ఓ మెయిడిన్ వేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. సిరాజ్‌కు ఐదు వికెట్లు శ్రీలంక జట్టు 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మహ్మద్ సిరాజ్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టి శ్రీలంక నడ్డి విరిచాడు. ఐదో ఓవర్ నాలుగో బంతికి సిరాజ్.. షనక (0)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. నిప్పులు చెరిగిన సిరాజ్.. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తొలి బంతికి నిస్సంకను (2) ఔట్ చేసిన సిరాజ్.. మూడు, నాలుగు, ఆరు బంతులకు సమరవిక్రమ (0), అసలంక (0), ధనంజయ డిసిల్వ (4)లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో శ్రీలంక 12 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన సిరాజ్ సిరాజ్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి శ్రీలంకను భారీ దెబ్బకొట్టాడు. తొలి బంతికి నిస్సంకను ఔట్ చేసిన సిరాజ్.. మూడు, నాలుగు బంతులకు సమరవిక్రమ (0), అసలంక (0)లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో శ్రీలంక 8 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన సిరాజ్ సిరాజ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంకను భారీ దెబ్బకొట్టాడు. తొలి బంతికి నిస్సంకను ఔట్ చేసిన సిరాజ్.. మూడో బంతికి సమరవిక్రమను (0) ఎల్బీడబ్ల్యూ చేశాడు. దీంతో శ్రీలంక 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక 8 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో జడేజా క్యాచ్ అందుకోవడంతో నిస్సంక (2) ఔటయ్యాడు. కుశాల్ మెండిస్ (5), సమరవిక్రమ క్రీజ్‌లో ఉన్నారు. మొదలైన మ్యాచ్.. తొలి ఓవర్లోనే వికెట్ వర్షం కారణంగా భారత్-శ్రీలంక ఫైనల్ మ్యాచ్ 40 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. బుమ్రా వేసిన తొలి ఓవర్లోనే శ్రీలంక వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ మూడో బంతికే కేఎల్ రాహుల్ వికెట్ల వెనుక అద్భుతమైన క్యాచ్ పట్టి కుశాల్ పెరీరాను (0) పెవిలియన్‌కు సాగనంపాడు. భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆసియా కప్-2023 ఫైనల్ మ్యాచ్ కొలొంబో వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 17) జరుగనుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక, భారత్ జట్లు చెరో మార్పు చేశాయి. శ్రీలంకకు సంబంధించి తీక్షణ స్థానంలో దుషన్ హేమంత జట్టులోకి రాగా.. భారత జట్టులో అక్షర్ పటేల్ స్థానాన్ని వాషింగ్టన్ సుందర్ భర్తీ చేశాడు. కాగా, మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు వర్షం ప్రారంభంకావడంతో మ్యాచ్ ఆలస్యమైంది. తుది జట్లు.. టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ శ్రీలంక: కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరన W . W W 4 W! 🥵 Is there any stopping @mdsirajofficial?! 🤯 The #TeamIndia bowlers are breathing 🔥 4️⃣ wickets in the over! A comeback on the cards for #SriLanka? Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Lr7jWYzUnR — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
వన్డేల్లో అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
అంతర్జాతీయ వన్డేల్లో ఆఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో వరుసగా రెండు సార్లు హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా ముజీబ్ నిలిచాడు. ఆసియాకప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌వికెట్‌గా ఔటైన ముజీబ్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆఫ్గాన్ ఇన్నింగ్స్ 45 ఓవర్ వేసిన తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మరి ముజీబ్ హిట్‌వికెట్‌గా ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌తో ఆడిన వన్డేలో కూడా ముజీబ్ హిట్ వికెట్‌గానే వెనుదిరిగాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లా చేతిలో 89 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్ ఓటమి పాలైంది. అదే విధంగా ఈ విజయంతో బంగ్లాదేశ్ తమ సూపర్- ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఇక మంగళవారం లాహోర్‌లో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ గెలిస్తే మాత్రం బంగ్లాదేశ్‌తో కలిసి ఈ మూడు జట్లు రెండు పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. ఈ సమయంలో మెరుగైన రన్‌రేట్ ఉన్న రెండు జట్లు ‘సూపర్–4’ దశకు అర్హత సాధిస్తాయి. చదవండి: Asia Cup 2023: ఆసియాకప్ మ్యాచ్‌లపై నీలినీడలు.. ఇది నాకు ముందే తెలుసు! చెత్త కారణాలు చెప్పారు -
నేపాల్‌తో మ్యాచ్.. శార్ధూల్‌పై వేటు! షమీకి ఛాన్స్!
ఆసియాకప్-2023లో భాగంగా సెప్టెంబర్ 4న నేపాల్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పసికూనపై గెలిచి సూపర్-4లో అడుగుపెట్టాలని భారత జట్టు భావిస్తోంది. కాగా శనివారం పాకిస్తాన్‌తో జరగాల్సిన భారత తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో భారత ఖాతాలో ఒక్కపాయింట్ వచ్చి చేరింది. ఈ క్రమంలో నేపాల్‌పై భారత్ విజయం సాధిస్తే 3 పాయింట్లతో సూపర్-4కు అర్హత సాధిస్తుంది. బ్యాటింగ్‌కు మంచి ఛాన్స్.. ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో రద్దైనప్పటికీ భారత బ్యాటింగ్ టాపర్డర్ మాత్రం తమ ఆటతీరుతో తీవ్ర నిరాశపరిచారు. వారు తిరిగి మళ్లీ ట్రాక్‌లోకి రావడానికి నేపాల్‌తో మ్యాచ్ మంచి అవకాశం. నేపాల్‌పై అద్భుతమైన ప్రదర్శన చేసి ఆత్మవిశ్వాసంతో సూపర్-4లో ఆటగాళ్లు రాణించవచ్చు. పాకిస్తాన్‌పై టాపర్డర్ విఫలమైనప్పటికీ హార్దిక్ పాండ్యా(87) ఇషాన్ కిషన్(82) మాత్రం కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరి ఆటతీరుకు అంతా ఫిదా అయిపోయారు. శార్ధూల్‌పై వేటు.. షమీకి ఛాన్స్ ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో షమీకి కాదని శార్థూల్ ఠాకూర్ రూపంలో బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు జట్టు మెన్జ్మెంట్ అవకాశం ఇచ్చింది. మెనెజ్‌మెంట్ నమ్మకన్ని శార్ధూల్ నిలబెట్టకోలేకపోయాడు. బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చినప్పటికీ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో నేపాల్‌తో మ్యాచ్‌కు శార్ధూల్‌ను పక్కన పెట్టి షమీకి ఛాన్స్ ఇవ్వాలని జట్టు మెన్‌జెమెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేపాల్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్ బౌలర్ ఓవరాక్షన్.. బుద్దిచెప్పిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్ -
Asia Cup 2023 IND VS PAK: చరిత్ర సృష్టించిన పాక్ పేసర్లు
ఆసియా కప్-2023లో భాగంగా పల్లెకెలె వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 2) జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ పేస్ త్రయం (షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్) చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ (వన్డే ఫార్మాట్) చరిత్రలో 10కి 10 వికెట్లు (ఓ మ్యాచ్‌లో) తీసిన తొలి పేస్ బౌలింగ్ అటాక్‌గా రికార్డుల్లోకెక్కింది. ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో ఓ ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పేసర్లే తీయడం ఇదే మొదటిసారి. 39 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. గతంలో ఎన్నడూ పేసర్లే మొత్తం 10 వికెట్లు తీసింది లేదు. కాగా, నేటి మ్యాచ్‌లో పాక్ పేసర్లు షాహీన్ అఫ్రిది (10-2-35-4), నసీం షా (8.5-0-36-3), హరీస్ రౌఫ్ (9-0-58-3) టీమిండియాను ముప్పుతిప్పలు పెట్టారు. ఈ త్రయం భారత బ్యాటర్లను ఓ ఆట ఆడుకున్నారు. టీమిండియాపై ఈ ముగ్గురు స్పష్టమైన ఆధిపత్యం కనబర్చారు. ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (90 బంతుల్లో 87; 7 ఫోర్లు, సిక్స్) ఆదుకోకపోయుంటే భారత పరిస్థితి దారుణంగా ఉండేది. ఇషాన్, హార్దిక్‌లతో పాటు ఆఖర్లో బుమ్రా కూడా బ్యాట్ ఝులిపించడంతో భారత్ 266 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసి ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్ ముగిసాక వర్షం మొదలుకావడంతో పాక్ ఇన్నింగ్స్ ప్రారంభంకాలేదు. వర్షం కారణంగా మ్యాచ్‌ను కుదించాల్సి వస్తే 40 ఓవర్లలో 239 పరుగులు, 30 ఓవర్లలో 203, 20 ఓవర్లకు 155 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఛేదించాల్సి ఉంటుంది. -
శ్రీలంక గడ్డపై భారత జట్టు
కాండీ: ఆసియా కప్‌లో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు బుధవారం శ్రీలంకకు చేరుకుంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఆరు రోజుల ప్రత్యేక శిక్షణ శిబిరం ముగిసిన తర్వాత టీమిండియా లంకకు బయల్దేరింది. నేరుగా విమానంలో కొలంబోలో దిగిన రోహిత్ శర్మ బృందం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాండీకి చేరుకుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని బ్యాటర్ కేఎల్ రాహుల్ మినహా ఇతర జట్టు సభ్యులంతా ఒకేసారి లంక గడ్డపై అడుగు పెట్టారు. రాహుల్ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆసియా కప్‌లో భాగంగా శనివారం పల్లెకెలె మైదానంలో జరిగే తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. గురువారం శ్రీలంకకు చేరుకునే పాకిస్తాన్ ఒకరోజు విశ్రాంతి అనంతరం మ్యాచ్ బరిలోకి దిగనుండగా... సోమవారం పల్లెకెలె మైదానంలోనే నేపాల్‌ను భారత్ ఎదుర్కొంటుంది. -
‘ఆసియా’ పోరుకు రంగం సిద్దం
ముల్తాన్: ప్రపంచ కప్ పోరుకు ముందు మరో ప్రధాన టోర్నీకి రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే ప్రతిష్టాత్మక ఆసియా కప్ సమరంలో ఆరు జట్లు తమ సత్తాను పరీక్షించుకోనున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు వరల్డ్ కప్‌కు ముందు ఇది ట్రయల్‌గా ఉపయోగపడనుండగా... వరల్డ్ కప్ బరిలో లేని నేపాల్ ఆరో టీమ్‌గా తన ఉనికిని ప్రదర్శించే ప్రయత్నం చేయ నుంది. అన్నీ జట్లూ సహజంగానే టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా... ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే సమరాలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. కనీసం రెండు సార్లు ఇరు జట్లు తలపడే అవకాశం ఉండగా, ఫైనల్ చేరితే మరోసారి దాయాదుల మధ్య పోరును చూడవచ్చు. నేడు సొంతగడ్డపై జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టు రోహిత్ కుమార్ సారథ్యంలోని నేపాల్‌తో తలపడుతుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న కొలంబోలో జరుగుతుంది. ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచే రెండేసి జట్లు ముందంజ వేస్తాయి. సూపర్–4 దశలో మిగిలిన మూడు టీమ్‌లను ఎదుర్కొన్న తర్వాత టాప్–2 టీమ్‌లు ఫైనల్లో తలపడతాయి. ఫేవరెట్‌గా రోహిత్ బృందం... ఏడాది క్రితం కూడా యూఏఈలో ఆసియా కప్ జరగ్గా అప్పుడు రాబోయే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని టి20 ఫార్మాట్లో నిర్వహించారు. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్‌కు సరిగ్గా నెల రోజుల ముందు వన్డే ఫార్మాట్లో ఈ టోర్నమెంట్ జరగబోతోంది. అన్ని రకాలుగా పటిష్టంగా ఉన్న భారత్ సహజంగానే ఫేవరెట్‌గా కనిపిస్తుండగా... వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగుతోంది. భారత్ తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న క్యాండీలో పాకిస్తాన్ జట్టుతో ఆడుతుంది. అనంతరం సెప్టెంబర్ 4న నేపాల్‌తో రెండో మ్యాచ్‌లో తలపడుతుంది. భారత జట్టు ఇటీవల ప్రదర్శన, వ్యక్తిగతంగా ఆటగాళ్ల రికార్డులు, టీమ్ కూర్పును బట్టి చూస్తే భారత్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా గట్టి పోటీనిచ్చే స్థితిలో ఉండగా, అఫ్గానిస్తాన్ కూడా సంచలనాలు ఆశిస్తోంది. అధికారికంగా ఆసియా కప్ నిర్వహణ హక్కులు పాకిస్తాన్ బోర్డుకే ఉన్నాయి. అయితే పాకిస్తాన్‌కు వెళ్లేందుకు భారత్ అంగీకరించకపోవడంతో హైబ్రీడ్ మోడల్లో టోర్నీని నిర్వహిస్తున్నారు. మొత్తం 13 మ్యాచ్‌లలో 4 మాత్రమే పాకిస్తాన్లో జరుగుతుండగా, శ్రీలంక 9 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. శ్రీలంకలో జరిగే మ్యాచ్‌లకు వాన కొంత అంతరాయం కలిగించే అవకాశం ఉంది. -
భారత మహిళల హాకీ జట్టుకు టైటిల్
సలాలా (ఒమన్): మహిళల హాకీ ఆసియా కప్ ఫైవ్స్ (ఐదుగురు ఆడే) టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. తద్వారా 2024 ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందింది. సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 7–2 గోల్స్ తేడాతో థాయ్‌లాండ్ జట్టును ఓడించింది. భారత్ తరఫున జ్యోతి, మరియానా కుజుర్ రెండు గోల్స్ చొప్పున సాధించగా... కెప్టెన్ నవ్‌జ్యోత్ కౌర్, మోనికా టొప్పో, మహిమా చౌదరీ ఒక్కో గోల్ చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన జట్లు తలపడే తొలి హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ వచ్చే జనవరి 24 నుంచి 27 వరకు మస్కట్‌లో జరుగనుంది. -
అందుకే చాహల్‌కు జట్టులో చోటివ్వలేదు.. ఆ విషయంలో కుల్దీప్ బెటర్!
ఆసియాకప్ 2023కు భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. ఈ మెగా టోర్నీ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపికచేశారు. సుదీర్ఘ కాలంగా గాయాలతో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. మరోవైపు ఇప్పటి వరకు ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయని హైదరాబాదీ తిలక్ వర్మకు కీలకమైన ఆసియా కప్ జట్టులో చోటు దక్కడం గమానార్హం. ఇక టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చహల్‌కు ఆసియాకప్ జట్టులో చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్యర్యపరిచింది. అతడి స్ధానంలో కుల్దీప్ యాదవ్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపారు. ఈ క్రమంలో చాహల్‌ను కాదని కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు ఎంచుకున్నారనే దానిపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. కుల్దీప్ బ్యాట్‌తో కూడా రాణించగలడని, అందుకే చహల్‌ను కాదని అతడిని ఎంపిక చేశారని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. "విండీస్ సిరీస్‌లో సంజు శాంసన్ ఎక్కువ పరుగులు చేసి ఉంటే అతడు ఖచ్చితంగా ఈ జట్టులో ఉండేవాడు. అలాగే చాహల్ కూడా వికెట్లు పడగొట్టి ఉంటే జట్టులో అవకాశం దక్కి ఉండేది. అయితే కొన్ని సార్లు జట్టును బ్యాలెన్స్ చేయాలంటే కొంతమందిపై వేటుపడక తప్పదు. కుల్దీప్కు లోయార్డర్‌లో బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. ఈ కోణంలోనే సెలక్టర్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కుల్దీప్ చైనామన్ బౌలర్ కూడా కావడం అతడికి కలిసొచ్చింది. అందుకే చహల్‌ను కాదని కుల్దీప్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారాని" గవాస్కర్ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చదవండి: Yuzvendra Chahal: అందుకే అతడికి జట్టులో చోటివ్వలేదు.. స్పందించిన చహల్! అప్పుడు రోహిత్.. -
కారు కొంటే ఉచితంగా శ్రీలంక టూర్.. ఆసియా కప్ మ్యాచ్‌లు చూసే అవకాశం!
ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ తమ కార్లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. కంపెనీకి చెందిన కార్లపై భారీ డిస్కౌంట్లతో పాటు ఉచితంగా శ్రీలంక వెళ్లి ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌లు చూసే అవకాశాన్ని కూడా పొందవచ్చని వోక్స్వ్యాగన్ తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. భారీ డిస్కౌంట్లు వోక్స్వ్యాగన్ తైగూన్ మోడల్ కారు కొనాలనుకునేవారికి ఏకంగా రూ.1.60 లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నట్లు కంపెనీ వెబ్ సైట్ లో వెల్లడించింది. ఇందులో రూ. లక్ష క్యాష్ డిస్కౌంట్ కాగా రూ.60,000 ఎక్స్చేంజ్ బోనస్. అయితే ఈ ఆఫర్ 1.5 లీటర్ వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే వోక్స్వ్యాగన్ వర్చుస్ మోడల్ కార్లపై కూడా తగ్గింపును అందుబాటులో ఉంచింది. ఈ మోడల్ కార్లకు గరిష్ఠంగా రూ.1.40 లక్షల తగ్గింపును పొందవచ్చని స్పష్టం చేసింది. ఇందులోనూ రూ. లక్ష క్యాష్ డిస్కౌంట్ కాగా రూ.40,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉంటుందని పేర్కొంది. తైగూన్ లాగే ఇది కూడా 1.5 లీటర్ వేరియంట్‌కే వర్తిస్తుంది. శ్రీలంక టూర్ వోక్స్వ్యాగన్ తమ తైగూన్, వర్చుస్ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లతోపాటు ఉచితంగా శ్రీలంక వెళ్లే అవకాశాన్ని కూడా గెలుచుకోవచ్చని ప్రకటించింది. ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి అఫీషియల్ పార్ట్నర్గా ఉన్న వోక్స్వ్యాగన్ ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ మధ్య తమ కార్లు కొలుగోలు చేసిన కస్టమర్లు ఉచితంగా శ్రీలంక వెళ్లి అక్కడ జరిగే ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించే అవకాశాన్ని పొందవచ్చని పేర్కొంది. డిస్కౌంట్లు, ఇతర ఆఫర్ల గురించి పూర్తి వివరాల కోసం దగ్గరలోని డీలర్‌ను సంప్రదించవచ్చు. -
పిల్ల బచ్చాలను పంపమని మేమడిగామా..? టీమిండియాపై పాక్ కెప్టెన్ అతి వ్యాఖ్యలు
శ్రీలంక వేదికగా కొద్ది రోజుల కిందిట జరిగిన ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ ఏసియా కప్-2023 ఫైనల్లో పాకిస్తాన్-ఏ టీమ్.. యువ భారత జట్టుపై 128 పరుగుల తేడాతో గెలుపొంది, ఆసియా ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఈ గెలుపు తర్వాత కొందరు నెటిజన్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డును విమర్శించడం మొదలుపెట్టారు. పాక్ సీనియర్ జట్టుతో (అనుభవం+వయసు) ఆసియా కప్ బరిలోకి దిగిందని, ఫైనల్లో ఓడిన భారత్ యువ జట్టుతో పోరాడిందని కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లపై తాజాగా పాక్-ఏ జట్టు కెప్టెన్ మహ్మద్ హరీస్ స్పందించాడు. తమ గెలుపును ఒప్పుకోని వారికి హరీస్ చురకలంటించాడు. అంతర్జాతీయ అనుభవం లేని యువ భారత జట్టును ఆసియా కప్‌కు పంపమని తాము బీసీసీఐని అడగలేదని, అనుభవజ్ఞులున్నారంటున్న తమ జట్టులో ఒకరిద్దరూ మాత్రమే 10 లోపు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారని కౌంటరిచ్చాడు. మాకు పదుల సంఖ్యలో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంటే, ఆసియా కప్ బరిలోకి దిగిన భారత ఆటగాళ్లకు వందల సంఖ్యలో (260 మ్యాచ్‌లు) ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది కదా అని ఎదురుదాడికి దిగాడు. పెద్ద వయసు వారిని బరిలోకి దించామని అంటున్నారు.. భారత్-ఏ టీయ్ యావరేజ్ వయసు 20.80 అయితే, పాక్-ఏ జట్టు సగటు వయసు 23.20 అని, వయసు రిత్యా ఇది పెద్ద తేడా కాదని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. వాస్తవానికి బీసీసీఐ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ అనుభవం కూడా లేని యువ భారత జట్టును ఎమర్జింగ్ ఆసియా కప్‌కు పంపింది. అదే పాక్ మాత్రం అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న ఏడుగురు ఆటగాళ్లను బరిలోకి దించింది. కెప్టెన్ సహా ఆ జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు పాక్ టీ20 జట్టులో కీలక సభ్యులుగా ఉన్నారు. ఎలాగైనా ఆసియా కప్ గెలవాలనే కుయుక్తితో పీసీబీ ఉద్దేశపూర్వకంగానే సీనియర్ జట్టును బరిలోకి దించిందన్న ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు యువకులతో కూడిన జట్టే అయినా భారత్ ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించింది. ఫైనల్ వరకు చేరింది. అయితే ఫైనల్లో కొన్ని తప్పిదాల కారణంగా పాక్‌కు మ్యాచ్ అప్పగించింది. కెప్టెన్ యశ్ ధుల్, సాయి సుదర్శన్, నికిన్ జోస్, నిషాంత్ సింధు, మానవ్ సుతార్, హర్షీత్ రాణా, హంగార్గేకర్ అద్భుతంగా రాణించారు. ఫైనల్లో తయ్యాబ్ తాహిర్ సెంచరీ చేయడంతో పాక్ 352 పరుగుల భారీ స్కోర్ చేయగా, ఛేదనలో తడబడిన భారత్ 224 పరుగులకు ఆలౌటైంది. -
టీమిండియాకు బ్యాడ్ న్యూస్... ఆసియా కప్‌కు ఆ ఇద్దరు స్టార్స్ దూరం
-
IND VS PAK Final: పాక్ బ్యాటర్ విధ్వంసకర శతకం.. టీమిండియా ముందు భారీ లక్ష్యం
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్-ఏ.. భారత-ఏ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కొలొంబో వేదికగా ఇవాళ (జులై 23) మధ్యాహ్నం మొదలైన తుది సమరంలో టాస్ గెలిచిన భారత్.. పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌కు ఓపెనర్లు సైమ్ అయూబ్ (51 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాహిబ్జాదా ఫర్హాన్ (62 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన తయ్యబ్ తాహిర్ (71 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో అయూబ్, ఫర్హాన్, తాహిర్‌లతో పాటు ఒమైర్ యూసఫ్ (35), ముబాసిర్ ఖాన్ (35) కూడా రాణించారు. ఖాసిం అక్రమ్ (0), కెప్టెన్ మహ్మద్ హరీస్ (2), మెహ్రన్ ముంతాజ్ (13) విఫలం కాగా.. మహ్మద్ వసీం జూనియర్ (17), సూఫియాన్ ముఖీమ్ (4) నాటౌట్‌గా నిలిచారు. 14 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. భారత బౌలర్లలో హంగార్గేకర్, రియాన్ పరాగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, మానవ్ సుతార్, నిషాంత్ సింధు తలో వికెట్ దక్కించుకున్నారు. భారత బౌలరల్లో నిషాంత్ (5.30) మినహా అందరూ 6 అంతకంటే ఎక్కువ ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. హర్షిత్ రాణా 6 ఓవర్లలో 51 పరుగులు, హంగార్గేకర్ 6 ఓవర్లలో 48, అభిషేక్ శర్మ 9 ఓవర్లలో 54, యువ్‌రాజ్ సింగ్ దోడియా 7 ఓవర్లలో 56, మానవ్ సుతార్ 9 ఓవర్లలో 68, రియాన్ పరాగ్ 4 ఓవర్లలో 24.. ఇలా ప్రతి భారత బౌలర్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. బ్యాటర్లకు స్వర్గధామమైన పిచ్‌పై టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం పెద్ద తప్పిదమని విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యర్ధి భారీ టార్గెట్ నిర్ధేశించినప్పటికీ బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని, టీమిండియా బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉందని, ఎలాగైనా తామే గెలుస్తామని భారత అభిమానులు సోషల్‌మీడియా వేదికగా యువ భారత జట్టుకు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. -
పాకిస్తాన్‌తో భారత్ ఫైనల్ పోరు.. తుది జట్లు ఇవే
ఆసియా ‘ఎమర్జింగ్’ కప్ టోర్నీ తుది పోరుకు సర్వం సిద్దమైంది. కొలంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత-ఏ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సెమీఫైనల్లో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగింది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం తమ జట్టులో ఒక మార్పు చేసింది. అమాద్ బట్ స్ధానంలో మెహ్రాన్ ముంతాజ్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు: ఇండియా ఎ: సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, నికిన్ జోస్, యష్ ధుల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, నిశాంత్ సింధు, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మానవ్ జగ్దూసకుమార్ సుతార్, యువరాజ్‌సింగ్ దోడియా, హర్షిత్ రాణా, రాజ్వర్ధన్ హంగర్గేకర్ పాకిస్తాన్ ఎ: సయీమ్ అయూబ్, తయ్యబ్ తాహిర్, మహ్మద్ హారీస్ (కెప్టెన్), సాహిబ్జాదా ఫర్హాన్, ఒమైర్ యూసుఫ్ (వైస్ కెప్టెన్), ఖాసిం అక్రమ్, ముబాసిర్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, మెహ్రాన్ ముంతాజ్, అర్షద్ ఇక్బాల్, సుఫియాన్ ముఖీమ్ చదవండి: IND vs BAN: కొంచెం మర్యాదగా ప్రవర్తించాలి.. అది మంచి పద్దతి కాదు! టీమిండియా కెప్టెన్‌పై సీరియస్ -
భారత్-పాకిస్తాన్ ఫైనల్ పోరు.. ఏ జట్టు ఫేవరేట్ అంటే?
ఆసియా ‘ఎమర్జింగ్’ కప్ టోర్నీ తుది పోరుకు రంగం సిద్ధమైంది. కొలంబోలో నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ తలపడుతుంది. బలాబలాలను బట్టి చూస్తే యశ్ ధుల్ నాయకత్వంలోని భారత జట్టే ఫేవరెట్‌గా ఉంది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. టోర్నీలో చెరో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన ధుల్, సాయి సుదర్శన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో కూడా నిశాంత్ సింధు 10 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ టీమ్‌ను చూస్తే పలువురు ఆటగాళ్లు మొహమ్మద్ వసీమ్, కెప్టెన్ మొహమ్మద్ హారిస్, ఫర్హాన్, అర్షద్ ఇక్బాల్‌లకు ఇప్పటికే సీనియర్ టీమ్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో వీరు చెలరేగితే టీమిండియా తీవ్ర పోటీ ఎదురువ్వక తప్పదు. తుది జట్లు(అంచనా): భారత్: సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, యశ్ ధుల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, నికిన్ జోస్, నిశాంత్ సింధు, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, రాజవర్ధన్ హంగర్గేకర్, యువరాజ్ పాకిస్తాన్: సయీమ్ అయూబ్, తయ్యబ్ తాహిర్, మహ్మద్ హారీస్ (కెప్టెన్), సాహిబ్జాదా ఫర్హాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసిం అక్రమ్, ముబాసిర్ ఖాన్, అమద్ బట్, మహ్మద్ వసీం జూనియర్, అర్షద్ ఇక్బాల్, సుఫియాన్ ముఖీమ్ చదవండి: IND vs WI: అశ్విన్‌తో అట్లుంటది మరి.. విండీస్ కెప్టెన్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్ -
ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాక్.. నాడు సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్..!
కొలొంబో వేదికగా రేపు (జులై 23) జరుగబోయే 2023 ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. జులై 21న జరిగిన సెమీఫైనల్లో భారత్.. బంగ్లాదేశ్‌ను, పాకిస్తాన్.. శ్రీలంకను ఓడించి ఫైనల్‌కు చేరాయి. ఫైనల్ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. కాగా, ఇదే ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నీలో భారత్-పాక్‌లు గతంలో కూడా ఓసారి ఫైనల్లో తలపడ్డాయి. సరిగ్గా 10 ఏళ్ల క్రితం, 2013లో సింగపూర్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత అండర్-23 జట్టును.. పాక్ అండర్-23 టీమ్ ఢీకొట్టింది. నాటి సమరంలో భారత్.. పాక్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి, ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. India will face Pakistan in the Emerging Asia Cup final tomorrow! The last time they met was in 2013 when India won the Trophy under Suryakumar Yadav. KL Rahul won the Player of the match award in the final for scoring 93* runs. pic.twitter.com/Kj8FhqpuNZ — Johns. (@CricCrazyJohns) July 22, 2023 నాడు పాక్‌ను మట్టికరిపించిన భారత జట్టుకు ప్రస్తుత టీమిండియా సభ్యుడు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించగా.. ప్రస్తుత భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ నాటి ఫైనల్లో అజేయమైన 93 పరుగులు చేసి, పాక్‌ను ఓడించడంలో ప్రధానపాత్ర పోషించాడు. సూర్య, కేఎల్ రాహుల్‌తో పాటు నాటి యంగ్ ఇండియాలో ప్రస్తుత భారత జట్టు సభ్యుడు అక్షర్ పటేల్, ప్రస్తుత యూఎస్ఏ ఆటగాడు స్మిత్ పటేల్ ఉన్నారు. అలాగే నాటి పాక్ జట్టులో ప్రస్తుత పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఉన్నారు. నాటి మ్యాచ్ విషయానికొస్తే.. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 47 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (7) విఫలం కాగా.. మహ్మద్ రిజ్వాన్ (21), ఉమర్ వహీద్ (41), 10, 11వ నంబర్ ఆటగాళ్లు ఉస్మాన్ ఖాదిర్ (33), ఎహసాన్ ఆదిల్ (20 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో బాబా అపరాజిత్ 3, సందీప్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెరో 2 వికెట్లు, సందీప్ వారియర్, అంకిత్ బావ్నే తలో వికెట్ పడగొట్టారు. 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. కేఎల్ రాహుల్ (107 బంతుల్లో 93 నాటౌట్; 11 ఫోర్లు, సిక్స్), మన్‌ప్రీత్ జునేజా (51 నాటౌట్) రాణించడంతో 33.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయం సాధించింది. -
'నువ్వు మొదలెట్టావ్.. నేను పూర్తి చేశా; లెక్క సరిపోయింది'
ఎమర్జింగ్ ఆసియా కప్ 2023లో ఇండియా-ఏ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం బంగ్లాదేశ్-ఏతో జరిగిన సెమీఫైనల్లో ఇండియా-ఏ జట్టు 51 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. ఈ సంగతి పక్కనబెడితే సెమీఫైనల్ సందర్భంగా ఇండియా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఎక్కడా తగ్గలేదు. మొదట టీమిండియా బ్యాటింగ్ సమయంలో వికెట్ పడ్డ ప్రతీసారి బంగ్లా ఆటగాళ్లు టీమిండియా బ్యాటర్లపై ఏదో ఒక కామెంట్ చేస్తూ పెవిలియన్ సిగ్నల్ చూపించారు. ఒక్కసారి అంటే ఏదో అనుకోవచ్చు.. పదే పదే అదే చర్యకు పాల్పడుతూ శ్రుతి మించారు. ఇదంతా టీమిండియా ఆటగాళ్లు గమనిస్తూనే వచ్చారు. మాకు టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం అన్నట్లుగా సైలెంట్‌గా ఉన్నారు. ఇక బంగ్లా ఇన్నింగ్స్ సమయంలో ఇండియా- ఏ ఆటగాళ్లు కూడా ఏమాత్రం తగ్గలేదు. బంగ్లా వికెట్ కోల్పోయిన ప్రతీసారి గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లా సీనియర్ బ్యాటర్ సౌమ్యా సర్కార్, ఇండియా-ఏ ఆటగాడు హర్షిత్ రానాల మధ్య మాటల యుద్దం చోటుచేసుకోవడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 26వ ఓవర్ యువరాజ్‌సిన్హ్ దోదియా వేశాడు. ఆ ఓవర్లో రెండో బంతిని సౌమ్యా సర్కర్ షాట్ ఆడే ప్రయత్నంలో ఇన్సైడ్ ఎడ్జ్ అయి స్లిప్‌లో ఉన్న నికిన్ జోస్‌కు దొరికిపోయాడు. కీలక వికెట్ కావడంతో ఇండియా-ఏ ఆటగాళ్లు సంబరాలు మొదలుపెట్టారు. అయితే హర్షిత్ రానా సౌమ్యా సర్కర్ మొహం ముందు గట్టిగా అరుస్తూ పంచ్‌లు గుద్దుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది నచ్చిన సౌమ్యా సర్కార్ హర్షిత్ రానాతో గొడవకు దిగాడు. ఇద్దరు మాటమాట అనుకున్నారు. అంపైర్ వచ్చేలోపే ఇద్దరు దూషణకు దిగారు. ఇంతలో ఆటగాళ్లు వచ్చి ఇద్దరిని విడదీసే ప్రయత్నం చేశారు. సాయి సుదర్శన్ వచ్చి సౌమ్యా సర్కార్‌ను వెళ్లమంటూ పక్కకు తీసుకెళ్లాడు. అయితే పెవిలియన్ వెళ్తున్న సమయంలోనూ సౌమ్యా సర్కార్ హర్షిత్ రానాపై మాటల యుద్దం కొనసాగించాడు. అయితే హర్షిత్ రానా ఇంత వైల్డ్‌గా రియాక్ట్ అవ్వడానికి ఒక కారణం ఉంది. టీమిండియా బ్యాటింగ్ సమయంలో యష్‌దుల్ ఔటైన సందర్భంలో సౌమ్యా సర్కార్ అసభ్యకర వ్యాఖ్యలు చేసి శ్రుతి మించాడు. ఇది మనసులో పెట్టుకున్న హర్షిత్ రానా సౌమ్యా సర్కార్ ఔటవ్వగానే బదులు తీర్చుకున్నాడు. ''నువ్వు మొదలుపెట్టావ్..నేను పూర్తి చేశా.. లెక్క సరిపోయింది'' అంటూ కామెంట్ చేయడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. India vs Bangladesh - never short of some heat 🔥 . .#EmergingAsiaCup2023 #INDAvBANA pic.twitter.com/xxnMx8Arez — FanCode (@FanCode) July 21, 2023 చదవండి: దురదృష్టవంతుల లిస్ట్‌లో బెయిర్ స్టో.. ఏడో క్రికెటర్‌గా Lionel Messi: మెస్సీనా మజాకా.. క్లబ్‌లు మారినా గోల్స్ మాత్రం ఆగడం లేదుగా -
ఆసియా కప్-2023 ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్..
ACC Mens Emerging Teams Asia Cup 2023: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023 ఫైనల్లో పాకిస్తాన్ జట్టు అడుగుపెట్టింది. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో అతిథ్య శ్రీలంకను 60 పరుగులు తేడాతో చిత్తు చేసిన పాకిస్తాన్.. తుది పోరుకు అర్హత సాధించింది. 323 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 45.4 ఓవర్లలో 262 పరుగులకే ఆలౌటైంది. పాకిస్తాన్ బౌలర్లలో ఆర్షద్ ఇక్భాల్ 5 వికెట్లతో చెలరేగగా.. ముబాసిర్ ఖాన్,సుఫియాన్ ముఖీమ్ తలా రెండు వికెట్లు సాధించారు. శ్రీలంక బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో(97),సహన్ అరాచ్చిగే(97) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 322 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో ఒమర్ యూసఫ్(88), మహ్మద్ హారిస్(52), ముబాసిర్ ఖాన్(42) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఆఖరిలో బౌలర్ మహ్మద్ వసీం(24) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో లహిరు సమరకోన్,ప్రమోద్ మదుషన్, కరుణ్ రత్నే తలా రెండు వికెట్లు సాధించగా.. వెల్లలగే, సహన్ అరాచ్చిగే చెరో వికెట్ పడగొట్టాడరు. ఇక జూన్ 23న కొలంబో వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో భారత్ లేదా బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ తలడపడనుంది. చదవండి: IND vs WI: అయ్యో రోహిత్.. అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదుగా! వీడియో వైరల్ -
టీమిండియా సెలెక్టర్లకు విషమ పరీక్ష.. ఛాలెంజ్ విసురుతున్న మరో ఓపెనర్..!
ఇటీవలికాలంలో అదిరిపోయే ప్రదర్శనలతో భారత క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన కొందరు క్రికెటర్లలో 21 ఏళ్ల చెన్నై కుర్రాడు సాయి సుదర్శన్ ప్రథముడు. గత ఐపీఎల్ సీజన్‌తో వెలుగులోకి వచ్చిన సాయి.. ఆ సీజన్లో వరుసగా 22, 62, 53, 19, 20, 41, 43, 96 స్కోర్లు (8 మ్యాచ్‌ల్లో 141.41 స్ట్రయిక్ రేట్‌తో 51.71 సగటున 3 అర్ధసెంచరీల సాయంతో 362 పరుగులు) చేసి సత్తా చాటాడు. ఐపీఎల్-2023లో సాయి మెరిసినప్పటికీ, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్ల ఆసాధారణ ప్రదర్శన అతనిని డామినేట్ చేసింది. అయితే అంతటితో ఆగని సాయి.. ఆ తర్వాత జరిగిన తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లోనూ రెచ్చిపోయాడు. ఈ దేశవాలీ లీగ్‌లో 90, 14, 7, 83, 41 స్కోర్లు చేసిన సాయి.. ఈ లీగ్‌లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 172.5 స్ట్రయిక్‌రేట్‌తో 64.20 సగటున 2 అర్ధసెంచరీ సాయంతో 321 పరుగులు చేశాడు. ఈ వరుస సక్సెస్‌లతో సాయికి టీమిండియా నుంచి పిలుపు అందుతుందని అంతా అనుకున్నారు. అయితే అప్పటికే శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్లతో టీమిండియా యంగ్ ఓపెనర్ల బెంచ్ బలంగా ఉండటంతో సాయికి అవకాశం దక్కలేదు. అయితే, ఈ సీజన్లోనే ఎలాగైనా టీమిండియా సెలెక్టర్ల నుంచి పిలుపు అందుకోవాలని పట్టుదలగా ఉండిన సాయి.. ప్రస్తుతం జరుగుతున్న ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023లో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 100 స్ట్రయిక్‌రేట్‌తో 170 సగటున సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 170 పరుగులు చేశాడు. నిన్న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీతో చెలరేగిన సాయి, ఈ సారి మాత్రం భారత సెలెక్టర్లకు గట్టి ఛాలెంజ్ విసిరాడు. టీమిండియాలో చోటు కోసం తనను తప్పక పరిగణలోకి తీసుకోవాలని బ్యాట్‌తో సవాల్ చేశాడు. సాయి ఆడిన ఈ ఇన్నింగ్స్ చూసి భారత సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. అసలే ఉన్నవాళ్లకు అవకాశాలు లేక సతమతమవుతుంటే కొత్తగా సాయి తయారయ్యాడేంట్రా అని అనుకుంటున్నారు. ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ అయ్యే లోగా సాయి మరో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడితే ఏం చేయాలో తెలియక వారు లోలోన మధన పడుతున్నారు. మొత్తానికి యువ ఓపెనర్ల విషయం భారత సెలెక్టర్లను విషమ పరీక్షలా మారింది. -
Asia Cup 2023: జులై 23న భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్..!
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 టోర్నీలో నిన్న (జులై 19) భారత్-ఏ, పాక్-ఏ జట్ల మధ్య గ్రూప్ దశ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో యువ భారత్ 8 వికెట్ల తేడాతో పాక్ సేనను మట్టికరిపించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో రాణించి, అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత హంగార్గేకర్ (5/42), మానవ్ సుతార్ (3/36) బంతితో విజృంభించగా.. ఆతర్వాత ఐపీఎల్ హీరో సాయి సుదర్శన్ (110 బంతుల్లో 104 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అతనికి నికిన్ జోస్ (53), కెప్టెన్ యశ్ ధుల్ (21 నాటౌట్), అభిషేక్ శర్మ (20) సహకరించారు. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్, పాక్‌లు ఇదివరకే సెమీస్‌కు చేరాయి. కాగా, ఇదే టోర్నీలో భారత్, పాక్‌లు మరోసారి తలపడే అవకాశం ఉంది. ఇదివరకే సెమీస్‌కు చేరిన భారత్, పాక్‌లు ఈ గండాన్ని అధిగమిస్తే ఫైనల్లో మరోసారి ఎదురెదురుపడే ఛాన్స్ ఉంది. రేపు (జులై 21) తొలి సెమీఫైనల్లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు.. రెండో సెమీఫైనల్లో భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజేతలు జులై 23న కొలొంబో వేదికగా జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో ఆటగాళ్ల ఫామ్ దృష్ట్యా శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే భారత్, పాక్‌లకే ఫైనల్‌కు చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సో.. ఇదే ఆసియా కప్‌లో భారత్-పాక్‌లు మరోసారి తలపడటం ఖాయం. సెమీఫైనల్ (తొలి సెమీస్ ఉదయం 10 గంటలకు), ఫైనల్ మ్యాచ్‌లు ఆయా తేదీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతాయి. -
పాక్‌తో మ్యాచ్.. సంచలన స్పెల్‌తో మెరిసిన సీఎస్కే బౌలర్
ఎమర్జింగ్ ఆసియా కప్ 2023లో బుధవారం ఇండియా-ఏ, పాకిస్తాన్-ఏ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ ఏదైనా చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నాయంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. అది జూనియర్ లేదా సీనియర్ మ్యాచ్ కావొచ్చ.. ఉత్కంఠ మాత్రం గ్యారంటీగా ఉంటుంది. తాజాగా మ్యాచ్‌లో సీఎస్కే పేసర్.. యువ బౌలర్ రాజ్‌వర్దన్ హంగర్గేకర్ సంచలన స్పెల్‌తో మెరిశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో పాటు మెయిడెన్ చేయడం విశేషం. పాక్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ హంగర్గేకర్ వేశాడు. ఓవర్లో రెండో బంతికి సయీమ్ అయూబ్‌ను డకౌట్గాపెవిలియన్ చేర్చాడు. మూడు డాట్‌బాల్స్ అనంతరం ఆఖరి బంతికి ఒమెర్ యూసఫ్ కూడా ద్రువ్ జురేల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. అలా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి పాక్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం పాకిస్తాన్-ఏ జట్టు 36 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఖాసిమ్ అక్రమ్ 26, ముబాసిర్ ఖాన్ 17 పరుగులతో ఆడుతున్నారు. ఎవరీ రాజ్‌వర్దన్ హంగర్గేకర్? నవంబర్ 10, 2002లో జన్మించిన రాజ్‌వర్దన్ హంగర్గేకర్ ప్రస్తుతం ఇండియా-ఏ టీమ్‌లో ప్రామిసింగ్ క్రికెటర్‌గా ఉన్నాడు. తన ఫాస్ట్ బౌలింగ్‌తో అనతి కాలంలోనే డొమెస్టిక్ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2020-21 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్ర తరపున హంగర్గేకర్ దేశవాలీ టి20 క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత లిస్ట్-ఏలోనూ అరంగేట్రం చేసిన రాజ్‌వర్దన్ హంగర్గేకర్ ఇప్పుడిప్పుడే దేశవాలీలో సత్తా చాటుతున్నాడు. 2022 ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్‌కు హంగర్గేకర్ జట్టులో చోటు సంపాదించాడు. తన ప్రదర్శనతో ఆకట్టుకున్న హంగర్గేకర్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి పడింది. సీఎస్కే 2022 ఐపీఎల్ వేలంలో అతన్ని కొనుగోలు చేసింది. ఇక 31 మార్చి 2023న రాజ్‌వర్దన్ హంగర్గేకర్ సీఎస్కే తరపున ఐపీఎల్లో ఆడాడు. అయితే మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వ్యవహరించాడు. Pace is Pace Yaar, right? 😉 Hangargekar with two wickets early in the game!#INDvPAK #LIVEonFanCode pic.twitter.com/WCqF7vO4bS — FanCode (@FanCode) July 19, 2023 చదవండి: ధోనిని ముప్పుతిప్పలు పెట్టిన కివీస్ టాప్-3 బౌలర్, కట్‌చేస్తే సూపర్‌మార్కెట్ ఓనర్‌గా Ishan Kishan: 'ఇవ్వడానికి ఏం లేదు.. బర్త్‌డే గిఫ్ట్ నువ్వే మాకు ఇవ్వాలి' -
ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్.. కోహ్లిని గుర్తు చేసుకున్న యువ క్రికెటర్లు
భారత్-పాకిస్తాన్ల మధ్య ఏ క్రీడలో అయినా, ఏ స్థాయి మ్యాచ్ అయినా భారీ అంచనాలు కలిగి ఉంటుందన్న విషయం తెలిసిందే. దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్ అయితే, దాని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. క్రికెటర్లతో పాటు అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు లోనవుతారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 ద్వారా ఇరు దేశాల క్రికెటర్లు, అభిమానులకు మరోసారి ఆ భావోద్వేగానుభూతికి లోనయ్యే అవకాశం దొరికింది. టోర్నీలో భాగంగా రేపు (జులై 19) భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు తలపడనున్నాయి. కొలొంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్ కోసం యువ భారత క్రికెటర్లు, పాకిస్తాన్ ఆటగాళ్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా రాణించి, అభిమానుల మనసుల్లో చిరకాలం కొలువుండిపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. భారత-ఏ క్రికెటర్లయితే తమ ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లి చివరిసారి పాకిస్తాన్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తుచేసుకుంటూ తాము కూడా అదే స్థాయి ఇన్నింగ్స్ ఆడాలని కలలు కంటున్నారు. నేపాల్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ (87) స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. తన దృష్టిలో ఆసియా కప్-2022లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్ అని అన్నాడు. మరో భారత-ఏ జట్టు సభ్యుడు రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి ముఖంలో, కళ్లలో కనిపించిన కసి అత్యద్భుతమని కొనియాడాడు. నేపాల్‌తో మ్యాచ్‌లో రాణించిన సాయి సుదర్శన్ మాట్లాడుతూ.. ఆసియా కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ బౌలింగ్ కోహ్లి కొట్టిన ఓ షాట్ సూపర్ హ్యూమన్ షాట్ అని అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురు యువ క్రికెటర్లు రేపు పాక్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లిలా చెలరేగాలని అనుకుంటున్నట్లు తెలిపారు. -
Asia Cup 2023: రేపే భారత్-పాక్ సమరం
ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 టోర్నీలో రేపు (జులై 19) భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు కత్తులు దూసుకోనున్నాయి. గ్రూప్-బిలోని ఆఖరి మ్యాచ్‌లో ఈ ఇరు జట్లు ఎదురెదురుపడనున్నాయి. కొలొంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాక్‌లు గ్రూప్ దశలో చెరి రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పరంగా సమంగా ఉన్నాయి. అయితే పాక్ (2.875)తో పోలిస్తే భారత్ (3.792)కు మెరుగైన రన్‌రేట్ ఉండటంతో ప్రస్తుతానికి యంగ్ ఇండియా గ్రూప్ టాపర్‌గా ఉంది. గ్రూప్ దశలో భారత్, పాక్‌లు.. యూఏఈ, నేపాల్ జట్లపై విజయాలు సాధించాయి. మరోవైపు గ్రూప్-ఏలో రసవత్తర పోరు సాగుతుంది. ఆప్ఘనిస్తాన్ ఆడిన 2 మ్యాచ్‌ల్లో విజయాలతో గ్రూప్ టాపర్‌గా ఉండగా.. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు 2 మ్యాచ్‌ల్లో చెరో మ్యాచ్ గెలిచి గ్రూప్‌లో రెండో బెర్తు కోసం పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్‌లో ఒమన్ ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పోటీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఏ, గ్రూప్-బిలో టాపర్లుగా ఉన్న రెండు జట్లు సెమీఫైనల్లో తలపడతాయి. గ్రూప్-ఏలో భాగంగా ఇవాళ (జులై 18) బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు.. శ్రీలంక- ఒమన్ జట్లు తలపడనున్నాయి. రేపు భారత్-పాక్ మ్యాచ్‌తో పాటు నేపాల్-యూఏఈ మ్యాచ్ కూడా జరుగనుంది. కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో యువ భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. యూఏఈపై 8 వికెట్ల తేడాతో, నేపాల్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. యూఏఈపై బౌలర్లలో హర్షిత్ రాణా (4), నితీష్ రెడ్డి (2), మానవ్ సుతార్ (2), అకాశ్ సింగ్ (1) రాణించగా.. బ్యాటింగ్‌లో కెప్టెన్ యశ్ ధుల్ అజేయ శతకంతో (108) మెరిశాడు. నికిన్ జోస్ (41 నాటౌట్) పర్వాలేదనిపించాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌లో నిషాంత్ సింధు (4), హంగార్గేకర్ (3), హర్షిత్ రాణా (2), మానవ్ సుతార్ (1) రాణించగా.. బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్ (58 నాటౌట్), అభిషేక్ శర్మ (87) దృవ్ జురెల్ (21 నాటౌట్) మెరిశారు. -
శతక్కొట్టిన యశ్ ధుల్.. ఆసియా కప్‌లో టీమిండియా బోణీ
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. యూఏఈతో ఇవాళ (జులై 14) జరిగిన మ్యాచ్‌లో భారత్-ఏ.. యూఏఈ-ఏపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ యశ్ ధుల్ అజేయమైన సూపర్ సెంచరీతో (84 బంతుల్లో 108; 20 ఫోర్లు, సిక్స్) మెరిసి, టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అతనికి నికిన్ జోస్ (41 నాటౌట్) సహకరించాడు. ఫలితంగా భారత్.. మరో 23.3 ఓవర్లు మిగిలుండగానే విజయఢంకా మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. హర్షిత్ రాణా (4/41), నితిశ్ రెడ్డి (2/32), మానవ్ సుథార్ (2/28), ఆకాశ్ సింగ్ (1/10) ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూఏఈ ఇన్నింగ్స్‌లో అయాన్ష్ శర్మ (38), కెప్టెన్ చిదంబరం (46), అలీ నసీర్ (10), మొహమ్మద్ ఫరాజుద్దీన్ (35), జష్ గియనాని (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. శతక్కొట్టిన యశ్ ధుల్.. నిరాశపరచిన సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ 176 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత-ఏ.. యశ్ ధుల్ సెంచరీతో మెరవడంతో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది (26.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి). ఓపెనర్లు, ఐపీఎల్-2023 స్టార్లు సాయి సుదర్శన్ (8), అభిషేక్ శర్మ నిరాశపరిచినప్పటికీ, యశ్ ధుల్.. నికిన్ జోస్ సహకారంతో టీమిండియాను గెలిపించాడు. యూఏఈ బౌలర్లలో జవాదుల్లా, అలీ నసీర్ తలో వికెట్ పడగొట్టారు. నేపాల్‌ను మట్టికరిపించిన పాక్.. ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో పాకిస్తాన్-ఏ.. నేపాల్-ఏపై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. 37 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ కాగా.. పాక్ 32.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నేపాల్ ఇన్నింగ్స్‌లో సోంపాల్ కామీ (75) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పాక్ బౌలర్లు షానవాజ్ దహానీ (5/38), మహ్మద్ వసీం జూనియర్ (4/51) విజృంభించారు. పాక్ ఇన్నింగ్స్‌లో తయ్యబ్ తాహిర్ (51) టాప్ స్కోరర్ కాగా.. నేపాల్ బౌలర్లు లలిత్ రాజబంశీ (3/50), పవన్ సర్రాఫ్ (2/15) రాణించారు. -
'జై షా పాకిస్తాన్ వెళ్లడమేంటి?.. దాయాదుల మ్యాచ్ అక్కడే'
ఆసియా కప్ 2023 నిర్వహణపై ఒక స్పష్టత వచ్చింది. పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్, బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడు జై షా.. సోమవారం భేటీ కావడం ఆసక్తి కలిగించింది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్‌కు తాను అంగీకరించినట్లు జకా అష్రఫ్ మీడియాకు వెల్లడించాడు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న ఆసియా కప్‌లో శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు, పాకిస్తాన్లో నాలుగు మ్యాచ్‌లు షెడ్యూల్ చేశారు. మ్యాచ్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ శుక్రవారం విడుదలయ్యే అవకాశముంది. భారత్ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. ఈ విషయం పక్కనబెడితే పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు టీమిండియా త్వరలో వెళ్లనుందని.. ముందస్తుగా బీసీసీఐ సెక్రటరీ జై షా పాక్‌కు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తారంటూ వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తల్లో నిజం లేదని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. పీటీఐతో మాట్లాడిన ఆయన.. ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు శ్రీలంకలోని డంబుల్లా స్టేడియం వేదిక కానుందని పేర్కొన్నారు. ''బీసీసీఐ కార్యదర్శి జై షా, పీసీబీ ప్రతినిధి జాకా అష్రఫ్ సమావేశం తర్వాత ఆసియా కప్ పై స్పష్టత వచ్చింది. మా కార్యదర్శి జై షా, పీసీబీ చైర్మన్ జాకా అష్రఫ్ ను కలిశారు. ఆసియా కప్ షెడ్యూల్ ఖరారైంది. పాకిస్థాన్ లో నాలుగు లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. ఆ తర్వాత 9 మ్యాచ్ లు శ్రీలంకలో జరుగుతాయి. అందులో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కూడా ఉంటుంది. ఒకవేళ ఈ రెండు టీమ్స్ ఫైనల్లో తలపడితే ఆ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే జరుగుతుంది" అని అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. ఇండియన్ టీమ్ పాకిస్థాన్ రాబోతోందన్న మీడియా వార్తలను ఆయన ఖండించారు. భారత జట్టే కాదు.. చర్చల కోసం జై షా కూడా పాకిస్థాన్ వెళ్లడం లేదని అరుణ్ ధుమాల్ తేల్చి చెప్పాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు తమ స్వదేశంలో నేపాల్ తో మాత్రమే ఆడనుంది. ఈ మ్యాచ్ కాకుండా ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్.. బంగ్లాదేశ్, శ్రీలంక.. శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మధ్య కూడా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉపఖండంలో 2016 తర్వాత జరుగుతున్న తొలి ఆసియా కప్ ఇదే. ఆ ఏడాది బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వగా.. తర్వాత 2018, 2022లలో యూఏఈలో జరిగింది. చదవండి: జై షాను కలిసిన పీసీబీ చైర్మన్.. ఆసియా కప్‌కు గ్రీన్ సిగ్నల్ WCC Suggests ICC: 'వరల్డ్‌కప్ తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను తగ్గించండి' -
జై షాను కలిసిన పీసీబీ చైర్మన్.. ఆసియా కప్‌కు గ్రీన్ సిగ్నల్
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆసియా క్రికెట్ కౌన్సిల్ పర్యవేక్షిస్తోంది. ఈసారి ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్లో జరగనుంది. శ్రీలంక, పాకిస్తాన్‌లు ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌లు పాకిస్తాన్లో.. మరో తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి. ఇటీవలే పీసీబీ చైర్మన్‌గా ఎన్నికైన జకా అష్రఫ్.. ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్‌ను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఒక మెట్టు దిగిన జకా అష్రఫ్ తాను అలా అనలేదని.. ఆసియాకప్ టోర్నీని పాకిస్తాన్లో నిర్వహించి ఉంటే బాగుండేదని మాత్రమే అన్నట్లుగా పేర్కొన్నాడు. అయితే ఆసియా కప్ షెడ్యూల్ ఇప్పటివరకు విడుదల కాకపోవడానికి పీసీబీనే పరోక్ష కారణం. హైబ్రీడ్ మోడల్‌ను ఒకసారి ఒప్పుకోవడం.. మరోసారి తిరస్కరించడం.. వరల్డ్‌కప్‌తో ముడిపెట్టడంతో అసలు ఆసియా కప్ జరుగుతుందా అన్న అనుమానం కలిగింది. తాజాగా పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్.. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడు జై షాతో భేటి అయ్యాడు. సోమవారం రాత్రి ఇద్దరు దుబాయ్‌లో కలుసుకొని ఆసియా కప్ గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించడంపై తమకు అభ్యంతరం లేదని స్వయంగా పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్ జైషాకు వెల్లడించారు. దీంతో ఆసియా కప్ నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ శుక్రవారం ఆసియా కప్ 2023 పూర్తి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఇదే విషయమై పీసీబీ చీఫ్ మాట్లాడుతూ.. ''జై షాతో మీటింగ్ మంచి ఆరంభం. ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్లో నిర్వహించడం మాకు ఓకే. ఇక రానున్న కాలంలో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మైత్రి బంధం బలపడే అవకాశముంది. రిలేషన్స్‌ను పెంచుకుంటూ ముందుకు సాగుతాం'' అంటూ తెలిపాడు. చదవండి: Wimbledon 2023: సంచలనం.. నెంబర్ వన్ స్వియాటెకు షాకిచ్చిన స్వితోలినా -
మరో యూ టర్న్.. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ పాల్గొనడంపై నీలినీడలు!
దాదాపు పుష్కర కాలం తర్వాత వన్డే ప్రపంచకప్‌కు భారత్ అతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మెగా టోర్నీకు ఐసీసీ షెడ్యూల్ ఖారారు చేయడంతో.. ఈ ఈవెంట్లో పాల్గోనే ఆయా జట్లు తమ సన్నహాకాలను కూడా ప్రారంభించాయి. అయితే ప్రపంచకప్ విషయంలో అందరిది ఒక లెక్క. తనొదక లెక్క అన్నట్లుగా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాత్రం పాల్గొంటుందా..? లేదా..? అన్నది ఇంకా అనుమానంగానే ఉంది. తమ జట్టును భారత్‌కు పంపించడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు ఆ దేశ ప్రభుత్వం సైతం పూటకో మాట మారుస్తోంది. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ క్రీడా శాఖామంత్రి ఎహ్సాన్ మజారీ కీలక వాఖ్యలు చేశాడు. ఆసియాకప్ ఆడేందుకు టీమిండియా తమ దేశానికి రాకపోతే పాకిస్తాన్ జట్టు సైతం భారత్‌కు వెళ్లదని అతడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. వాస్తవానికి ఈ ఏడాది ఆసియాకప్ పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉంది. కానీ పాకిస్తాన్‌కు భారత జట్టును పంపించేందుకు బీసీసీఐ నిరాకరించడంతో.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ శ్రీలంక, పాకిస్తాన్ వేదికలగా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఏసీసీ ఇంకా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ఎహ్సాన్ మజారీ విలేకురల సమావేశంలో మాట్లాడుతూ.. "పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) నా మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. కాబట్టి భారత్ ఆసియా కప్ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో ఆడాలని డిమాండ్ చేస్తే.. భారత్‌లో జరిగే మేము కూడా అదే అదే డిమాండ్ చేస్తాము" అని అతను పేర్కొన్నాడు. అతడు చేసిన వాఖ్యలు మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. ఉన్నతస్థాయి కమిటీ.. ఇక ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ పాల్గోనడంపై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో నేతృత్వంలోని ఈ కమిటీ.. ప్రపంచకప్ కోసం భారత్‌లో పాక్ పర్యటించే విషయంపై నిర్ణయం తీసుకోనుంది. ఈ కమిటీ లో ఎహ్సాన్ మజారీ కూడా సభ్యునిగా ఉన్నాడు. 11 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ భారత్-పాకిస్తాన్లకు సంబంధించిన అన్ని అంశాలపై ఈ కమిటీ చర్చించి తుది నివేదికను ప్రధానికి అందించనుంది. ఇక షెడ్యూల్ ప్రకారం చిరకాల ప్రత్యర్థులు పాకిస్తాన్, భారత్ జట్లు అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. చదవండి: BAN W vs IND W: బంగ్లాదేశ్‌తో తొలి టీ20.. ఆంధ్ర స్పిన్నర్ ఎంట్రీ! -
నా గురించి ట్వీట్లు చేస్తుంటారు... అదేదో డైరెక్ట్‌గా చెప్పొచ్చు కదా! అంతకంటే..
ఐపీఎల్-2023లో ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైన క్రికెటర్ రియాన్ పరాగ్. 2019లో క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన ఈ అసోం ఆల్‌రౌండర్ ఆరంభం నుంచే పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. తాజా ఎడిషన్‌లోనూ వైఫల్యాల పరంపర కొనసాగించాడు. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు వరుస మ్యాచ్‌లలో తేలిపోయాడు. దీంతో మేనేజ్మెంట్ రియాన్‌కు కేవలం ఏడు మ్యాచ్‌లలో మాత్రమే అవకాశమిచ్చింది. అయితే, రియాన్ పరాగ్ మాత్రం వచ్చిన కాసిన్ని అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆడిన ఏడు మ్యాచ్‌లలో అతడు సాధించిన మొత్తం పరుగులు 78. అత్యధిక స్కోరు 20. ఆసియా కప్ ఆడే జట్టులో ఆటలో విఫలమైనప్పటికీ మైదానంలో అతి చేష్టల వల్ల ఓవరాక్షన్ ప్లేయర్‌గా ముద్రపడ్డాడు రియాన్ పరాగ్. నెటిజన్ల చేతిలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఈ క్రమంలో ఎమర్జింగ్ ఆసియా కప్-2023 నేపథ్యంలో ఇండియా- ఏ జట్టులో అతడు స్థానం సంపాదించడంతో మరోసారి ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ తనపై వస్తున్న విమర్శలు, వ్యంగ్యాస్త్రాల గురించి స్పందించాడు. ‘‘తాము కష్టపడి సంపాదించిన డబ్బు మనకోసం వెచ్చించి మ్యాచ్ చూడటానికి వస్తారు. అలాంటపుడు వాళ్లను నిరాశపరిస్తే కొంతమంది తిట్టుకుంటారు. నేరుగా నాకే మెసేజ్ చేయొచ్చు కదా మరికొంత మంది మనల్ని ద్వేషిస్తారు. వాళ్ల కోపంలో అర్థం ఉంది. నేను ఆ విషయం అర్థం చేసుకోగలను. కానీ కొంతమంది మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు సోషల్ మీడియాలో నన్ను విమర్శిస్తూ పోస్టులు పెడుతుంటారు. ట్వీట్లు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లు నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయొచ్చు కదా! ‘‘నువ్వు ఇలా ఆడుతున్నావు. ఈ విషయంలో నిన్ను నువ్వు మార్చుకోవాలి. టెక్నిక్‌లో మార్పులు చేసుకోవాలి. అలా అయితే నీ ఆట మెరుగుపడుతుంది’’ అని నాకు సలహాలు ఇవ్వొచ్చు కదా! సోషల్ మీడియాలో పోస్టులు చేసే సమయం కంటే ఇదేమీ ఎక్కువ టైమ్ తీసుకోదు. నిజంగా నాకు ఎవరైనా అలాంటి సలహాలు, సూచనలు ఇస్తే ఇష్టం’’ అంటూ రియాన్ పరాగ్ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ ట్విటర్లో షేర్ చేసింది. ఎమర్జింగ్ ఏసియా కప్-2023 భారత- ఏ జట్టు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ(వైస్ కెప్టెన్), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, యశ్ ధుల్(కెప్టెన్), రియాన్ పరాగ్, నిశాంత్ సంధు, ప్రభ్‌షిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), మానవ్ సుతార్, యువరాజ్‌సిన్హ్ దోడియా, హర్షిత్ రానా, ఆకాశ్ సింగ్, నితీశ్ కుమార్‌రెడ్డి, రాజ్‌వర్దన్ హంగ్రేకర్. స్టాండ్ బై ప్లేయర్లు: హర్ష్ దూబే, నేహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రేద్కార్. చదవండి: కీలక ప్రకటన చేయనున్న సౌరవ్ గంగూలీ MS Dhoni: ధోనికి హెలికాప్టర్ షాట్ నేర్పించింది అతడే! 42 ఆసక్తికర విషయాలు.. -
తండ్రి కష్టం ఊరికే పోలేదు.. టీమిండియాకు ఎంపికైన తెలుగు కుర్రాడు
విశాఖ స్పోర్ట్స్: ఐదేళ్ల ప్రాయంలో ప్లాస్టిక్ బ్యాట్‌తో సరదాగా బంతితో ఆడటం మొదలుపెట్టిన కె.నితీశ్‌కుమార్ రెడ్డి.. నేడు ఎమర్జింగ్ ఆసియా కప్ వన్డే టోర్నీలో ఆడేందుకు భారత్–ఏ జట్టుకు ఎంపికయ్యాడు. చిరుప్రాయం నుంచే విశాఖ డివిజన్ క్లబ్ లీగ్స్‌లో సీనియర్ల ఆటను చూస్తూ వారి లాగే ఆడాలంటూ కలగనే వాడు నితీశ్. తండ్రి ముత్యాలరెడ్డి ఉద్యోగం సైతం విడిచి పెట్టి.. కుమారుడి క్రికెట్ కెరీర్‌కే ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహించారు. కోచ్‌ల శిక్షణలో నితీశ్ అంచెలంచెలుగా జిల్లా స్థాయి నుంచి రంజీ స్థాయికి ఎదిగాడు. కుడిచేతి వాటం బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తించి రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఆంధ్రా జట్టుకు ఆల్‌రౌండర్‌గా మారాడు. ఏసీఏ అకాడమీ వైపు అడుగులు.. నితీశ్‌కుమార్ వీడీసీఏ శిబిరాల నుంచి అండర్–12, 14 గ్రూపుల్లో జిల్లాకు ఆడటం మొదలుపెట్టాడు. నార్త్‌జోన్‌కు ఆడే సమయంలో అప్పటి జాతీయ జట్టు సెలక్టర్ ఎం.ఎస్.కె.ప్రసాద్ నితీశ్ ప్రతిభను గుర్తించారు. ఆయన ప్రోత్సాహంతో కడపలోని ఏసీఏ అకాడమీలో శిక్షణకు అవకాశం లభించింది. విజయ్ మర్చంట్ ట్రోఫీలో రికార్డు ఆంధ్రా తరఫున ఆడుతున్న నితీశ్ నాగాలాండ్‌తో జరిగిన పోటీలో ఏకంగా 345 బంతుల్లోనే 441 పరుగులు సాధించడం విశేషం. విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఏకంగా 26 వికెట్లు తీయడమే కాకుండా 176.41 సగటుతో 1,237 పరుగులు చేసి టోరీ్నలో రికార్డును నమోదు చేశాడు. ఇదే నితీశ్‌కు 2017–18 సీజన్లో బీసీసీఐ అండర్–16 ఉత్తమ క్రికెటర్‌గా జగన్మోహన్ దాలి్మయా అవార్డును సాధించిపెట్టింది. ఏసీఏ నుంచి బీసీసీఐ అవార్డు పొందిన తొలి క్రికెటర్ నితీశ్ కావడం.. విశాఖ క్రీడాకారులకు నూతనోత్తేజం ఇచ్చింది. అరంగేట్రం ఇలా.. నితీశ్ రంజీ ట్రోఫీలో ఆంధ్రా తరఫున తొలిసారిగా 2020లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మొదలెట్టాడు. విజయ్ హాజారే ట్రోఫీలో ఆంధ్రా తరఫున 2021లో ఆడాడు. అదే ఏడాది సీజన్లోనే సయ్యద్ ముస్తక్ ఆలీ ట్రోఫీలో పొట్టి ఫార్మాట్లో ఆడాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేశాడు. శ్రీలంకలో జూలై 13 నుంచి ప్రారంభం కానున్న ఈ టోరీ్నలో ఐదు దేశాల ఏ జట్లతో పాటు నేపాల్, ఒమన్, యూఏఈ సీనియర్ జట్లు ఆడనున్నాయి. ఐపీఎల్ అరంగేట్రం.. నితీశ్ కుమార్ 2023 సీజన్లో ఐపీఎల్ అరంగ్రేటం చేశాడు. 20 లక్షలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ నితీశ్‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్లో నితీశ్ 2 మ్యాచ్‌లు ఆడాడు. బ్యాటింగ్ చేసే అవకాశం దక్కని నితీశ్.. 5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. చాలా ఆనందంగా ఉంది అప్పుడు నా వయసు పన్నెండేళ్లు. అండర్–12లో టోర్నీలు ఆడే స్థాయికి చేరుకున్నాను. ఆ సమయంలోనే నాన్నకు విశాఖ నుంచి బదిలీ అయింది. నాన్న ఉదయపూర్ వెళ్లినా నా క్రికెట్ కెరీర్ గురించే ఆలోచించేవారు. ఈ క్రమంలో ఉద్యోగం మానేసి ఇక్కడకు వచ్చేశారు. అప్పుడు మా వాళ్లు కొందరు నాన్న ఏంటి ఇలా చేశారు అన్నారు. అయినా వారి మాటలను పట్టించుకోకుండా నన్ను ప్రోత్సహించారు. ఏసీఏ తరఫున తొలి క్రికెటర్‌గా బీసీసీఐ ఉత్తమ క్రికెటర్ అవార్డు అందుకోవడంతో నాలో ఆత్మ విశ్వాసం పెంచింది. అన్ని ఫార్మాట్లలో మేటి టోర్నీలో ఆడటంతో పాటు ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున క్రీజ్‌లోకి వచ్చి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాన్న చాలా సంతోíÙంచారు. భారత్–ఏ తరఫున ఎమర్జింగ్ ఆసియా కప్‌కు ఎంపిక చేసిన 15 మంది జట్టులో స్థానం సాధించడం ఆనందంగా ఉంది. జాతీయ జట్టులో స్థానమే లక్ష్యంగా మరింత సాధన చేస్తా. – నితీశ్‌కుమార్ రెడ్డి -
ఇండియా-ఏ జట్టులో ఓవరాక్షన్ ప్లేయర్.. అభిమానుల ట్రోల్స్
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023కి భారత్ జట్టును ప్రకటించింది. వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి జూనియర్ క్రికెట్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ఇండియా- ఏ జట్టును ఎంపిక చేసింది. మరో నలుగురికి స్టాండ్ బై ప్లేయర్లుగా అవకాశమిచ్చింది. కాగా ఈ టోర్నీకి రియాన్ పరాగ్ కూడా ఎంపికయ్యాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడుతున్న రియాన్ పరాగ్ తన చర్యలతో ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు ''ఆడేది తక్కువ.. ఓవరాక్షన్ ఎక్కువ'' రియాన్ పరాగ్‌పై అభిమానుల ధోరణి ఇలానే ఉంటుంది. మనం కూడా ఇదివరకు చాలాసార్లు చూశాం. అందుకే అతనిపై ఓవరాక్షన్ ప్లేయర్ అనే ముద్ర ఉంది. ఇక ఐపీఎల్ 2023 ఏడు మ్యాచ్‌లాడి 78 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలోనే రియాన్ పరాగ్‌పై అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురిపించారు. ఓవరాక్షన్ ప్లేయర్‌ను ఎందుకు ఎంపిక చేశారు అంటూ కామెంట్ చేశారు. జూలై 13 నుంచి 23 వరకు టోర్నీ.. జూలై 13 నుంచి జూలై 23 వరకు శ్రీలంకలోని కొలంబోలో ఎమర్జింగ్ ఆసియా కప్-2023 నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో గ్రూప్-బిలో భారత్‌తో పాటు.. నేపాల్, యూఏఈ, పాకిస్తాన్- ఏ జట్లు.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్- ఏ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఇరు గ్రూపులలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో గ్రూప్-ఏ టాపర్‌తో గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు తొలి సెమీ ఫైనల్లో.. గ్రూప్-బి టాపర్‌తో గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టు రెండో సెమీ ఫైనల్లో తలపడతాయి. జూలై 23న ఈ టోర్నీ ఫైనల్ జరుగనుంది. ఎమర్జింగ్ ఏసియా కప్-2023 భారత- ఏ జట్టు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ(వైస్ కెప్టెన్), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, యశ్ ధుల్(కెప్టెన్), రియాన్ పరాగ్, నిశాంత్ సంధు, ప్రభ్‌షిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), మానవ్ సుతార్, యువరాజ్‌సిన్హ్ దోడియా, హర్షిత్ రానా, ఆకాశ్ సింగ్, నితీశ్ కుమార్‌రెడ్డి, రాజ్‌వర్దన్ హంగ్రేకర్. స్టాండ్ బై ప్లేయర్లు: హర్ష్ దూబే, నేహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రేద్కార్. కోచింగ్ స్టాఫ్: సితాంశు కొటక్(హెడ్‌కోచ్), సాయిరాజ్ బహూతులే (బౌలింగ్ కోచ్), మునిష్ బాలి(ఫీల్డింగ్ కోచ్). Riyan Parag after selection be like 😅#RiyanParag pic.twitter.com/IxlHQIhG8r — Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) July 4, 2023 Riyan Parag scored a 33(45) in a tough wicket and is the 2nd highest scorer in the first Innings of the match between East zone and Central Zone #DuleepTrophy pic.twitter.com/a7SDXUNXFu — ' (@riyanparagfc_) June 29, 2023 Riyan Parag selected in India A squad Meanwhile me : pic.twitter.com/jiWU96Qnt3 — CHINMOY RAY (@ChinmoyRay07) July 4, 2023 చదవండి: Asia Cup- India A: ఆసియా కప్-2023 జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌రెడ్డికి చోటు #ZIMVsSCO: హతవిధి.. జింబాబ్వే కొంపముంచిన స్కాట్లాండ్ -
ఆసియా కప్-2023 జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌రెడ్డికి చోటు
ACC Men’s Emerging Teams Asia Cup 2023: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023కి భారత్ జట్టును ప్రకటించింది. వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి జూనియర్ క్రికెట్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ఇండియా- ఏ జట్టును ఎంపిక చేసింది. మరో నలుగురికి స్టాండ్ బై ప్లేయర్లుగా అవకాశమిచ్చింది. ఎనిమిది ఆసియా దేశాల మధ్య ఇండియా- ఏ జట్టుకు యశ్ ధుల్ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. అభిషేక్ శర్మ అతడి డిప్యూటీగా ఎంపికయ్యాడు. తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్‌రెడ్డి సైతం జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ టీమ్‌కి సితాంషు కొటక్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు. శ్రీలంకలో.. జూలై 13 నుంచి జూలై 23 వరకు శ్రీలంకలోని కొలంబోలో ఎమర్జింగ్ ఆసియా కప్-2023 నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో గ్రూప్-బిలో భారత్‌తో పాటు.. నేపాల్, యూఏఈ, పాకిస్తాన్- ఏ జట్లు.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్- ఏ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఇరు గ్రూపులలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఆరోజు ఫైనల్ ఇందులో గ్రూప్-ఏ టాపర్‌తో గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు తొలి సెమీ ఫైనల్లో.. గ్రూప్-బి టాపర్‌తో గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టు రెండో సెమీ ఫైనల్లో తలపడతాయి. జూలై 23న ఈ టోర్నీ ఫైనల్ జరుగనుంది. ఇదిలా ఉంటే తొలిసారి నిర్వహించిన మహిళల ఎమర్జింగ్ ఆసియా కప్ విజేతగా భారత జట్టు అవతరించిన విషయం తెలిసిందే. ఫైనల్లో బంగ్లాదేశ్-ఏ జట్టును చిత్తు చేసి భారత మహిళల- ఏ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఎమర్జింగ్ ఏసియా కప్-2023 భారత- ఏ జట్టు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ(వైస్ కెప్టెన్), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, యశ్ ధుల్(కెప్టెన్), రియాన్ పరాగ్, నిశాంత్ సంధు, ప్రభ్‌షిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), మానవ్ సుతార్, యువరాజ్‌సిన్హ్ దోడియా, హర్షిత్ రానా, ఆకాశ్ సింగ్, నితీశ్ కుమార్‌రెడ్డి, రాజ్‌వర్దన్ హంగ్రేకర్. స్టాండ్ బై ప్లేయర్లు: హర్ష్ దూబే, నేహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రేద్కార్. కోచింగ్ స్టాఫ్: సితాంశు కొటక్(హెడ్‌కోచ్), సాయిరాజ్ బహూతులే (బౌలింగ్ కోచ్), మునిష్ బాలి(ఫీల్డింగ్ కోచ్). చదవండి: Ashes: ‘బజ్‌బాల్’తో బొక్కబోర్లా.. ఇంగ్లండ్‌కు భారీ షాక్.. సిరీస్ మొత్తానికి..