మహిళల ఆసియా కప్ 2024లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. గ్రూప్-బిలో భాగంగా నిన్న (జులై 24) జరిగిన మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ మలేసియాపై.. శ్రీలంక థాయ్‌లాండ్‌పై ఘన విజయాలు సాధించాయి. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో మలేసియాపై బంగ్లాదేశ్ 114 పరుగల తేడాతో.. రాత్రి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై శ్రీలంక 10 వికెట్ల తేడాతో ఘన విజయాలు నమోదు చేశాయి. ఈ గెలుపులతో గ్రూప్-బి టాపర్లు అయిన శ్రీలంక, బంగ్లాదేశ్ సెమీస్‌కు క్వాలిఫై అయ్యాయి. మలేసియా, థాయ్‌లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
మరోవైపు గ్రూప్-ఏ సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఈ గ్రూప్ నుంచి భారత్, పాకిస్తాన్ సెమీస్‌కు అర్హత సాధించాయి. రేపు జరుగబోయే తొలి సెమీఫైనల్లో భారత్.. బంగ్లాదేశ్‌ను.. పాకిస్తాన్ శ్రీలంకను ఢీకొంటాయి. రేపు మధ్యాహ్నం భారత్ మ్యాచ్, రాత్రి పాకిస్తాన్ మ్యాచ్ జరుగనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచే జట్ల మధ్య జులై 28న అంతిమ సమరం జరుగుతుంది.
బంగ్లా-మలేసియా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేయగా..ఛేదనలో చేతులెత్తేసిన మలేసియా 20 ఓవర్లలో 77 పరుగులకు పరిమితమై దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ థాయ్‌లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేయగా.. పాకిస్తాన్ ఆడుతూ పాడుతూ వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment