మహిళల టీ20 ఆసియా కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మహిళల సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ఈ మల్టీనేషనల్ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుండగా.. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా మహిళలతో తలపడుతున్న భారత జట్టునే దాదాపుగా సెలక్టర్లు ఎంపిక చేశారు. శ్రేయాంక పాటిల్, సజన సజీవన్, ఆశా శోభన వంటి క్రికెటర్లను సెలక్టర్లు కొనసాగించారు. ఇక ఈ టోర్నమెంట్‌లో భారత్ గ్రూపు-ఎలో పాకిస్తాన్, యూఏఈ, నేపాల్‌తో పాటు ఉంది.
భారత్ తమ తొలి మ్యాచ్‌లో జూలై 19న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు జూలై 21న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత తమ చివరి గ్రూపు మ్యాచ్‌లో జూలై 23న నేపాల్‌తో భారత్ తలపడనుంది. కాగా శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నఈ టోర్నీ జూలై 19న యూఏఈ -నేపాల్ మ్యాచ్‌తో ప్రారంభం కానుంది.
ఆసియాకప్‌కు భారత మహిళల జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (డబ్ల్యుకె), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్
రిజర్వ్ జాబితా: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్
Comments
Please login to add a commentAdd a comment