వడోదర వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 115 పరుగుల తేడాతో భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పరుగులు వరద పారించారు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్లీన్ డియోల్ (103 బంతుల్లో 115; 16 ఫోర్లు) కెరీర్‌లో తొలి సెంచరీ సాధించగా... జోరుమీదున్న ఓపెనర్ స్మృతి మంధాన (53; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), మరో ఓపెనర్ ప్రతీక రావల్ (76; 10 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్‌లో జెమీమా రోడ్రిగ్స్ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో అదరగొట్టారు.
ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు సాధించింది. తద్వారా వన్డేల్లో భారత్ తమ అత్యధిక స్కోరును సమం చేసింది. 2017లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారత జట్టు 358 పరుగులే సాధించింది. అంతేకాకుండా మరో అరుదైన రికార్డు కూడా భారత్ తమ ఖాతాలో వేసుకుంది.
తొలి జట్టుగా..
మహిళల వన్డే క్రికెట్‌లో వెస్టిండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉండేది. 2011లో లీసెస్టర్ వేదికగా విండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు 9 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో ఇంగ్లండ్ ఆల్‌టైమ్ రికార్డును మన అమ్మాయిలు బ్రేక్ చేశారు.
మాథ్యూస్ సెంచరీ వృథా..
359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఓపెనర్, కెప్టెన్ హేలీ మాథ్యూస్ (109 బంతుల్లో 106; 13 ఫోర్లు) శతకం సాధించింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 3, దీప్తి శర్మ, టిటాస్, ప్రతీక తలా 2 వికెట్లు తీశారు. కాగా ఇరు జట్ల మధ్య మూడో వన్డే డిసెంబర్ 27న ఇదే వేదికలో జరగనుంది.
చదవండి: IND vs AUS: ఆసీస్‌తో నాలుగో టెస్టు.. గిల్, నితీశ్ రెడ్డిపై వేటు! వారికి ఛాన్స్?
Comments
Please login to add a commentAdd a comment