india vs west indies
-
కోహ్లి, రవిశాస్త్రి వల్లే ఇదంతా.. నాకది పునర్జన్మ: రోహిత్ శర్మ
టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లి, రవిశాస్త్రి తనకు పునర్జన్మను ప్రసాదించారని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. వారిద్దరి వల్లే తన రెండో ఇన్నింగ్స్ మొదలైందని.. తనను టాపార్డర్‌కు ప్రమోట్ చేసి ఓపెనర్‌గా అవకాశమిచ్చింది కూడా వారేనంటూ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా 2013లో కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో సిరీస్ సందర్భంగా ముంబై బ్యాటర్ రోహిత్ శర్మ టెస్టుల్లో అడుగుపెట్టాడు.అరంగేట్రంలోనే అద్భుత శతకంతొలి మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగి అరంగేట్రంలోనే అద్భుత శతకం(177)తో ఆకట్టుకున్నాడు. విండీస్‌తో నాటి సిరీస్‌లో జరిగిన ఈ తొలి టెస్టులో ధోని సేన ఏకంగా ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. తన రెండో టెస్టులోనూ శతక్కొట్టి వారెవ్వా అనిపించాడు. కానీ టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు.దాదాపు ఆరేళ్ల పాటు చోటే కరువుఅరంగేట్రం తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు భారత టెస్టు తుదిజట్టులో రోహిత్ శర్మకు స్థానమే కరువైంది. అయితే, 2018-19లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడిన జట్టులో రోహిత్ చోటు దక్కించుకోగలిగాడు. ఈ సిరీస్‌లోనూ అతడు ఆరో స్థానంలోనే బరిలోకి దిగాడు.అలా రీఎంట్రీఇక ఆ తర్వాత వన్డే వరల్డ్‌కప్-2019లో వరుసగా ఐదు సెంచరీలు బాదినా.. టెస్టుల్లో మాత్రం రోహిత్ రాత పెద్దగా మారలేదు. ఈ ఐసీసీ టోర్నీ తర్వాత వెస్టిండీస్‌తో ఆడిన టెస్టు సిరీస్‌లో అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది మేనేజ్మెంట్. అయితే, నాడు ఓపెనర్‌గా ఉన్న కేఎల్ రాహుల్ పరుగులు రాబట్టడంలో విఫలం కావడంతో.. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి, హెడ్‌కోచ్ రవిశాస్త్రి రోహిత శర్మను ఓపెనర్‌గా బరిలోకి దించారు. ఓపెనర్‌గా జట్టులో పాతుకుపోయిన హిట్మ్యాన్అప్పటి నుంచి రోహిత్‌కు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టీమిండియా ఓపెనర్‌గా జట్టులో పాతుకుపోయిన హిట్‌మ్యాన్ కెప్టెన్‌గా ఎదగడమే గాకుండా.. భారత్‌ను ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ)కు చేర్చిన సారథిగానూ ఘనత సాధించాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై టీమిండియాను గెలిపించి.. మరోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ వేటలో జట్టును నిలిపాడు.వాళ్లిద్దరు నాపై నమ్మకం ఉంచారుఈ నేపథ్యంలో కామెంటేటర్ జతిన్ సప్రూనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టెస్టు కెరీర్ రెండో ఇన్నింగ్స్‌లో రవిశాస్త్రి, విరాట్ కోహ్లిలకు నేను చాలా రుణపడిపోయాను. నన్ను టాపార్డర్‌కు ప్రమోట్ చేసింది వాళ్లే. టెస్టుల్లో నన్ను ఓపెనర్‌గా పంపడం అంత సులువు కాదు. అయినా, వాళ్లిద్దరు నాపై నమ్మకం ఉంచారు.తొలి బంతికే అవుటయ్యానునా ఆటను పరిశీలించేందుకు ఓ ప్రాక్టీస్‌మ్యాచ్ ఆడమని చెప్పారు. అయితే, అప్పుడు నేను తొలి బంతికే అవుటయ్యాను. ఇక నాకు ఓపెనర్‌గా ఎలాంటి అవకాశం లేదని నిరాశచెందాను. టెస్టుల్లో ఐదు లేదంటే ఆరో స్థానంలోనైనా.. లేదంటే లోయర్‌ఆర్డర్‌లోనైనా బ్యాటింగ్‌కు వెళ్లాల్సిందేనని ఫిక్సయ్యాను.నమ్మకం నిలబెట్టుకుంటూకానీ రవి భాయ్ టెస్టుల్లో నన్ను ఓపెనర్‌గా పంపాలని భావించాడు. 2015లోనే నాకు ఈ అవకాశం వస్తే బాగుంటుందని చెప్పాడు. అయితే, అప్పుడు అది సాధ్యం కాలేదు. కానీ తర్వాత రవిభాయ్, కోహ్లి వల్ల టెస్టుల్లో ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాను’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. రవిశాస్త్రి, విరాట్ కోహ్లి పట్ల ఈ సందర్భంగా కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా రోహిత్ తదుపరి స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌తో బిజీ కానున్నాడు. చదవండి: రిస్క్ అని తెలిసినా తప్పలేదు.. అతడొక అద్భుతం: రోహిత్ శర్మ While @ImRo45 Rohit’s legacy in test cricket is being discussed - Here’s a little story of his comeback into test cricket .. Also a sneak peek into how @RaviShastriOfc and @imVkohli planned India’s ascendancy in tests. pic.twitter.com/LO0jVtqP7O— Jatin Sapru (@jatinsapru) October 1, 2024 -
గొప్ప మనసు చాటుకున్న ధోని
రాంచీ : టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని గత కొద్ది రోజులగా నిలకడలేమి ఆటతో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ తరహా ఆటతో చివరకు టీ20 జట్టులో చోటు కూడా కోల్పోయాడు. మరోవైపు ధోని బ్యాట్ ఝుళిపించకపోయినా అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అతను ఆడకపోయినా ఆటలోని అతని వ్యూహాలు... మార్క్ కీపింగ్‌తో అభిమానులు తమ గుండెల్లో పదిలంగా ఉంచుకుంటున్నారు. వారి అభిమానాన్ని ఒక్కోలా వ్యక్తపరుస్తున్నారు. ఇటీవల వెస్టిండీస్‌తో చివరి వన్డే సందర్భంగా కేరళ గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం బయట 35 అడుగుల ఎత్తైన ధోని కటౌట్‌ను ఏర్పాటు చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. (చదవండి: 35 అడుగుల ధోని కటౌట్..) ధోని కూడా వారి అభిమానులను అలరిస్తూ సంతోషపరుస్తుంటారు. ఈ నేపథ్యంలో ధోని తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఓ కార్యక్రమానికి వెళ్లొస్తున్న ధోనికి ఓ చిన్నారి అభిమాని కనిపించాడు. వెంటనే ప్రొటోకాల్‌ను సైతం పక్కన పెట్టి ధోని కారులో నుంచే ఆ అభిమానితో ముచ్చటించాడు. షేకాండ్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ధోని భాయ్ గొప్ప మనసంటూ.. అతని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక ధోని వన్డేల్లో 10వేల పరుగుల మైలు రాయి అందుకోవడానికి ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో ధోని 10,174 పరుగులు చేయగా.. ఇందులో వరల్డ్ ఎలెవన్ జట్టు తరపున చేసిన 174 పరుగలున్నాయి. (చదవండి: ధోని ఇక.. కబడ్డీ కబడ్డీ!) ఈ ఏడాది ధోని దారుణంగా విఫలమయ్యాడు. 12 ఇన్నింగ్స్‌లాడిన ధోని కేవలం 252 పరుగులు మాత్రమే చేశాడు. ఈ తరహా ఆటతోనే టీ20ల్లో చోటు కోల్పోయాడు. ఇక ధోనిని జట్టుకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అతని అభిమానులు ఆరోపిస్తుండగా.. ధోనిని పక్కనే పెట్టే ఉద్దేశం లేదని, ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ కోసమే అతనికి విశ్రాంతి ఇచ్చినట్లు సెలక్టర్లు పేర్కొన్నారు. ధోని లాంటి ఆటగాడు లేకపోవడం ఏ జట్టుకైనా లోటేనని హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఇటీవల అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. ( చదవండి: ధోని లేకపోవడం లోటే) RT msdfansofficial: Man with Golden Heart. Just look at the way, he is adoring his little fan. msdhoni SaakshiSRawat#MSDhoni #Dhoni #mahiway pic.twitter.com/WpByIlp0hi — DASA🚩🚩 (@dasa_____) November 13, 2018 -
పాకిస్తాన్‌ను వెనక్కునెట్టిన భారత్
చెన్నై: వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా పొట్టి ఫార్మాట్లో తన విజయాల సంఖ్యను భారత్ మరింత పెంచుకుంది. ఈ క్రమంలోనే టీ20 విజయాల శాతంలో పాకిస్తాన్‌ను వెనక్కునెట్టిన భారత్ రెండో అత్యుత్తమ జట్టుగా నిలిచింది. గత పుష్కరకాలం నుంచి చూస్తే భారత్ ఇప్పటివరకూ 107 టీ20 మ్యాచ్‌లు ఆడగా, అందులో 68 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. మరో 36 మ్యాచ్‌ల్లో ఓటమి చూడగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. దాంతో టీమిండియా విజయాల శాతం 65.23గా నమోదైంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ను అధిగమించింది టీమిండియా. విండీస్‌తో చెన్నై మ్యాచ్‌లో విజయం తర్వాత పాక్‌ను వెనక్కునెట్టింది భారత జట్టు. టీ20ల్లో పాక్ విజయాల శాతం 65.10గా ఉండగా, దాన్ని టీమిండియా బ్రేక్ చేసింది. గత కొంతకాలంగా టీ20ల్లో పాకిస్తాన్ తిరుగులేని జట్టుగా ఎదిగిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగానే ఆ జట్టు ప్రస్తుతం నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగుతోంది. అయితే ఇటీవల కాలంలో వరుసగా సాధిస్తున్న విజయాలు టీమిండియాలో నిలకడను చాటిచెబుతున్నాయి. అంతర్జాతీయ 20ల్లో విజయాల శాతంలో అఫ్గానిస్తాన్ టాప్ ప్లేస్‌లో ఉంది. అఫ్గానిస్తాన్ టీ20లు ఆడటం మొదలు పెట్టిన దగ్గర్నుంచీ చూస్తే విజయాల శాతం 67.24గా ఉంది. -
పరుగుల వీరుల్లో ధావన్ పైపైకి..!
చెన్నై: వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన మూడో టీ20లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ శిఖర్ ధావన్.. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 పరుగులు(అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో) సాధించిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.. విండీస్‌తో మూడో టీ20లో ధావన్ 92 పరుగులతో మెరిశాడు. ఫలితంగా ఈ ఏడాది అంతర్జాతీయ టీ20ల్లో ధావన్ 572 పరుగులతో మూడో స్థానానికి ఎగబాకాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి(641) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. 2016లో విరాట్ కోహ్లి ఈ మార్కును చేరాడు. ఆ తర్వాత స్థానంలో ఫకార్ జమాన్(576-2018) రెండో స్థానంలో ఉండగా, ధావన్ మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను అధిగమించాడు ధావన్. ఈ ఏడాది ఇప్పటివరకూ టీ20ల్లో రోహిత్ సాధించిన పరుగులు 560. ఇక టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో అత్యధిక సార్లు గెలిచిన జాబితాలో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. భారత్ జట్టు మూడుసార్లు 3-0తో టీ20 సిరీస్‌ను గెలవగా, పాకిస్తాన్ ఐదుసార్లు విజయం సాధించింది. ఇక్కడ అప్ఘానిస్తాన్‌తో కలిసి భారత్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, యూఏఈ,వెస్టిండీస్‌లు ఒక్కోసారి మాత్రమే 3-0తో టీ20 సిరీస్‌లను గెలిచాయి. -
‘డబుల్ సెంచరీ’ క్లబ్లో రోహిత్
చెన్నై: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో రెండొందల ఫోర్ల కొట్టిన ఆటగాడిగా రోహిత్ గుర్తింపు సాధించాడు. వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో రోహిత్ ‘డబుల్ సెంచరీ’ ఫోర్ల్ క్లబ్లో చేరిపోయాడు. నిన్న మ్యాచ్‌లో రోహిత్ ఫోర్ మాత్రమే కొట్టి పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన రెండో భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఇక్కడ భారత తరపున విరాట్ ముందున్నాడు. విరాట్ కోహ్లి 214 ఫోర్లతో ఉండగా, రోహిత్ పేరిట 200 ఫోర్లు ఉన్నాయి. కాగా, ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్లలో శ్రీలంక క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్(223) ముందు వరుసలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో అఫ్గానిస్తాన్ ఆటగాడు మొహ్మద్ షెహజాద్(218) నిలిచాడు. ఆపై వరుస స్థానాల్లో కోహ్లి, మార్టిన్ గప్తిల్, రోహిత్ శర్మలు ఉన్నారు. ఇక్కడ గప్తిల్, రోహిత్‌లు సంయుక్తంగా నాల్గో స్థానంలో ఉన్నారు. చెన్నై టీ20లో భారత్ ఆఖరి బంతికి గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. విండీస్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్ల తేడాతో ఛేదించి సిరీస్‌ను ఘనంగా ముగించింది. ఇక్కడ చదవండి: ఆఖరి బంతికి ముగించారు -
టి20 సిరీస్ భారత్ సొంతం
-
చెన్నై టీ20లో భారత్ విజయం
చెన్నై: చెన్నై వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. అఖరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్‌లో విండీస్ నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని చేధించిన భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇప్పటికే 2-0తో ఆధిక్యంతో సిరీస్‌ను సొంతం చేసుకున్న రోహిత్ సేన ఈ మ్యాచ్ విజయంతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ధాటిగా ఆడింది. బ్రేవో(43 నాటౌట్), పూరన్ (53 నాటౌట్)లు చేలరేగడంతో విండీస్ భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్లో 13 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ పాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ కూడా17 పరుగులు చేసి థామస్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన పంత్‌తో కలిసి ధావన్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. చివర్లో భారత్ పంత్(38 బంతుల్లో 58 పరుగులు), ధావన్(62 బంతుల్లో 92 పరుగులు) వికెట్లు కోల్పోయినప్పటికీ.. చివరి బంతి వరకు సాగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. -
మ్యాచ్‌లో ధోని లేకపోయినా..
చెన్నై: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనిని అక్కడి అభిమానులు తమ వాడిగా ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. పలు నగరాల్లోని ధోని అభిమానుల్లో చాలా మంది ఐపీఎల్లో ఆయన సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలని కోరుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న ధోని అభిమానులు తమ అభిమాన క్రికెటర్‌పై గల ఇష్టాన్ని పలు సందర్భాల్లో, పలు రూపాల్లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా విండీస్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌కు హాజరైన ధోని అభిమానులు అతడిపై వారికి గల అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. మ్యాచ్ జరుగుతుంది చెన్నై కావడంతో.. నేటి మ్యాచ్‌లో ధోని లేకపోయినప్పటికీ.. చాలా మంది ధోని పేరుతో ఉన్న టీ షర్ట్‌లను ధరించి మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చారు. -
విండీస్‌తో టీ20: ధావన్ హాఫ్ సెంచరీ
సాక్షి, చెన్నై : భారత్, వెస్టిండీస్ మధ్య జరగునున్న చివరి టీ-20 మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో ఇది వరకే సొంత చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగింది. సిరీస్ క్లీన్‌స్వీప్ కోసం భారత్ ప్రయత్నిస్తుండగా.. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన విండీస్ చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అప్డేట్స్ : భారత ఆటగాళ్లు ధావన్, పంత్‌లు విండీస్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ధావన్ హాఫ్ సెంచరీతో చెలరేగగా, పంత్ కూడా ధాటిగా ఆడుతూ.. స్కోర్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. 14 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలంటే 36 బంతుల్లో 52పరుగులు చేయాల్సి ఉంది. ధాటిగా ఆడుతున్న కేఎల్ రాహుల్ థామస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఫోర్లతో చెలరేగిన రాహుల్ 10 బంతుల్లో 17 పరుగులు చేశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ పాల్ బౌలింగ్‌లో జౌటయ్యాడు. 2.3 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 13 పరుగులు చేసింది. చెన్నైలో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. గత రెండు మ్యాచ్‌లను ఓడి సిరీస్ కోల్పోయిన విండీస్ జట్టు ప్రారంభం నుంచి ధాటిగా ఆడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఓపెనర్ ఎస్డీ హోప్ 24 పరుగులు చేసి ఔటవ్వగా.. మరో ఓపెనర్ హెట్మెయర్ 26 పరుగులకు ఔటయ్యాడు. వన్ డౌన్లో వచ్చిన డీఎం బ్రావో ఒకవైపు నిలకడగా ఆడుతుండగా.. నాలుగో స్థానంలో వచ్చిన రామ్‌దిన్ 15 పరుగులు చేసి సుందర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజ్‌లోకి వచ్చిన నికోలస్ పూరన్ వస్తూనే ధాటిగా ఆడటం ప్రారంభించాడు. మరోవైపు బ్రావో కూడా జోరు పెంచాడు. పూరన్ నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 25 బంతుల్లో 53 పరుగులు చేయగా.. బ్రావో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు కలిసి అజేయంగా ఐదో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీయగా.. సుందర్ ఒక వికెట్ పడగొట్టాడు. చాహల్ ఓ మోస్తరుగా రాణించగా.. మిగతా బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. టీమిండియాకు 182 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చెలరేగి ఆడిన విండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ 24 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ఎన్ పూరన్, బ్రావో ధాటిగా ఆడుతుండటంతో విండీస్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. 17 ఓవర్లు ముగిసేసరికి కరేబియన్లు మూడు వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేశారు. ప్రస్తుతం బ్రావో 26 బంతుల్లో 30 పరుగులు, పూరన్ 14 బంతుల్లో 29 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన విండీస్.. 15 పరుగులు చేసిన రామ్‌దిన్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి విండీస్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. ప్రస్తుతం బ్రావో 15 పరుగులు, ఎన్ పూరన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. 11 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ రెండు వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. ప్రస్తుతం బ్రేవో 12 పరుగులతో, డీ రామ్‌దిన్ ఏడు పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. వెస్టిండీస్ కోల్పోయిన రెండు వికెట్లను చాహల్ తన ఖాతాలో వేసుకున్నాడు. 53 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన విండీస్, హోప్ (24) ఔట్ ఐదు ఓవర్లు ముగిసే లోపు విండీస్ స్కోర్ : 38/0. హోప్ (17), హెట్మేర్ (16) భారత్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, దినేష్ కార్తిక్, కృనాల్ పాండ్యా, సుందర్, భువనేశ్వర్ కుమార్, కలీల్, చహల్ విండీస్ : వెస్టిండీస్: షై హోప్, దెనెష్ రామ్‌దిన్(కీపర్), షిమ్రన్ హెట్మేర్, కీరన్ పొలార్డ్, డర్రెన్ బ్రావో, నికోలస్ పూరన్, కరోల్స్ బ్రాత్‌వైట్(కెప్టెన్), ఫబైన్ అలెన్, కీమో పాల్, ఖార్రే పిర్రే, ఓషెన్ థామస్. -
రోహిత్‌ను ఊరిస్తున్న టీ20 రికార్డు
చెన్నై:అంతర్జాతీయ టీ20ల్లో నాలుగు శతకాలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్ రికార్డును తన పేరిట లిఖించుకున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను మరో రికార్డు ఊరిస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డు సాధించడానికి రోహిత్ 69 పరుగుల దూరంలో ఉన్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా ఆదివారం వెస్టిండీస్‌తో జరగబోయే ఆఖరి టీ20లో రోహిత్ ఈ రికార్డును సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గఫ్తిల్(2271) అందరికంటే ముందు ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో రోహిత్(2203) కొనసాగుతున్నాడు. గత టీ20లో శతకం సాధించిన రోహిత్ శర్మ.. పలు రికార్డులను బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో గఫ్తిల్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలంటే.. విండీస్‌తో ఆఖరి టీ20లో రోహిత్‌కు మరో 69 అవసరం. భీకరఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ.. ఆ రికార్డును అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇక్కడ చదవండి: రోహితారాజువ్వ కెప్టెన్సీలోనూ రో‘హిట్టే’ -
మూడో టీ20: సిద్దార్థ్ కౌల్‌కు అవకాశం
ముంబై : వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి భారత్ సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నై వేదికగా జరిగే మూడో టీ20కి ప్రధాన పేసర్లు ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, చైనామన్ కుల్దీప్ యాదవ్‌లకు టీమ్ మేనేజ్మెంట్ విశ్రాంతిని కల్పించింది. అలాగే యువబౌలర్ సిద్దార్థ్ కౌల్‌కు అవకాశం కల్పించింది. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ట్వీట్ చేసింది. రంజీల్లో పంజాబ్ తరపున కౌల్ అద్బుతంగా రాణించడంతో సెలక్టర్లు అవకాశం కల్పించారు. ఇక భారత్ తరపున మూడు అంతర్జాతీయ వన్డేలు, 2 టీ20లు ఆడిన కౌల్.. వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయనప్పటికి టీ20ల్లో 3 వికెట్లు తీశాడు. నవంబర్ 21 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగానే ఈ ముగ్గురు బౌలర్లకు విశ్రాంతి కల్పించినట్లు తెలుస్తోంది. ఈ పర్యటన దృష్ట్యానే సిరీస్‌కు ముందే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. UPDATE: Umesh Yadav, Jasprit Bumrah & Kuldeep Yadav rested for 3rd Paytm #INDvWI T20I in Chennai@sidkaul22 added to India's squad Details - https://t.co/hqzMTMT8rZ pic.twitter.com/tbdbLBfwEI — BCCI (@BCCI) November 9, 2018 -
ఉప్పల్ టెస్ట్.. టికెట్ డబ్బులు వాపస్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు టికెట్లు కొనుగోలు చేసిన వారికి శుభవార్త. గత నెల 12 నుంచి 16 వరకు జరగాల్సిన ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే (అక్టోబర్–14) ముగిసింది. దీంతో 15, 16వ తేదీల్లో మ్యాచ్ వీక్షించాలనుకున్న ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. కాగా... ఆ రెండు రోజుల కోసం ముందుగానే టికెట్లు తీసుకున్న ప్రేక్షకులకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వనుంది. ఈ మేరకు హెచ్‌సీఏ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీని కోసం ఈ నెల 10న ఉదయం గం. 10 నుంచి సాయంత్రం గం. 6 వరకు జింఖానా గ్రౌండ్స్‌లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. నాలుగో, ఐదో రోజు మ్యాచ్ టికెట్లు కొన్న వారు ఒరిజినల్ మ్యాచ్ టికెట్లతో పాటు బ్యాంక్ అకౌంట్ వివరాలతో కౌంటర్ వద్ద సంప్రదించాలి. ఆన్లైన్ ద్వారా కొన్న వారికి ఆన్లైన్ ద్వారానే చెల్లింపు చేయనున్నారు. మొత్తం మ్యాచ్ వీక్షించేందుకు సీజన్ టికెట్ తీసుకున్న వారికి ఇది వర్తించదు. -
ఎయ్ పొలార్డ్.. ఏందీ తొండాట!
లక్నో: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఘనవిజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో విండీస్ ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారత స్పీడ్‌స్టార్ జస్ప్రీత్ బుమ్రా వేసిన 11 ఓవర్లో విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ తన అతి తెలివిని ప్రదర్శించాడు. బుమ్రా వేసిన నాలుగో బంతిని పొలార్డ్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. అది బ్యాట్ అంచుకు తగిలి అక్కడే గాల్లోకి లేచింది. (చదవండి: అద్భుతం.. ఒకే ఓవర్లో 43 పరుగులు!) ఈ క్యాచ్ అందుకోవడానికి బుమ్రా వెళ్లగా పొలార్డ్ అతని దృష్టిని మరల్చేలా చేయిని కదిపాడు. అయినా క్యాచ్ అందుకున్న బుమ్రా పొలార్డ్ వైపు ఆగ్రహంగా చూశాడు. అతను మాత్రం నవ్వుతూ క్రీజును వదిలాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. పొలార్డ్ ఏందీ తొండాట అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక ఐపీఎల్లో బుమ్రా, పొలార్డ్ ఒకే జట్టు ( ముంబై ఇండియన్స్) ఆటగాళ్లేనన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ అద్భుత సెంచరీతో చెలరేగడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. అనంతరం ఈ భారీ లక్ష్యచేధనలో తడబడ్డ విండీస్ 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రం చేయగలిగింది. దీంతో భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. (చదవండి: నా పేరు కైఫ్... కైఫ్... కైఫ్!) pic.twitter.com/kIEUHDq3ye — Mushfiqur Fan (@NaaginDance) November 6, 2018 -
రెండో టీ20లో టీమిండియా ఘన విజయం
-
రెండో టీ20లో టీమిండియా ఘన విజయం
లక్నో : భారతరత్న అటల్‌బిహారీ వాజ్‌పేయి క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్-వెస్టిండీస్ రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 71 పరుగులతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో విండీస్ వెనకబడింది. భారత బౌలర్ల ధాటికి పర్యాటక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేయగలిగింది. ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. కార్లోస్ బ్రాత్‌వైట్ 15, ఒషానే థామస్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 2-0 తో సొంతం చేసుకుంది. (ఆపసోపాలతో... ఐదు వికెట్లతో) -
భారత్‌తో రెండో టీ20.. విండీస్ లక్ష్యం 196
లక్నో : భారతరత్న అటల్‌బిహారీ వాజ్‌పేయి క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్-వెస్టిండీస్ రెండో టీ20లో టీమిండియా బ్యాట్స్‌మెన్ చెలరేగారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 111 (8x4, 7x6, బంతులు 61) పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 41 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. రోహిత్, ధావన్‌లు తొలి వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన రిషభ్‌పంత్ 5 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. లోకేష్‌రాహుల్ 26 పరుగులతో రోహిత్‌తో పాటు నాటౌట్‌గా నిలిచాడు. (చదవండి : కోహ్లి రికార్డుకు చేరువలో రోహిత్) (చదవండి : మ్యాచ్‌కు ముందు రోజే స్టేడియం పేరు మార్పు) -
కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్
లక్నో: పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన మార్కుతో దూసుకుపోతున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. వెస్టిండీస్ జరుగుతున్న రెండో టీ20లో కోహ్లి(2,102)ని రోహిత్ అధిగమించాడు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మ జట్టు భారత క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తొలి వన్డేలో గెలిచిన రోహిత్ బృందం.. రెండో టీ20లో సైతం గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా. రోహిత్ శర్మ(2,203) రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2,171 పరుగులతో మూడో స్థానంలో, న్యూజిలాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్ మెకల్లమ్ 2,140 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, కోహ్లి ఐదో స్థానంలో ఉన్నాడు. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
లక్నో: భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ-20లో భారత్ విజయం సాధించి సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని విండీస్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. భారత జట్టులో ఉమేష్ యాదవ్‌కు బదులుగా భువనేశ్వర్ కుమార్ ఆడుతుండగా, వెస్టిండీస్ జట్టులో నికోలస్ పూరన్ చేరాడు. జట్ల వివరాలు : వెస్టిండీస్: షై హోప్, దెనెష్ రామ్‌దిన్(కీపర్), షిమ్రన్ హెట్మేర్, కీరన్ పొలార్డ్, డర్రెన్ బ్రావో, నికోలస్ పూరన్, కరోల్స్ బ్రాత్‌వైట్(కెప్టెన్), ఫబైన్ అలెన్, కీమో పాల్, ఖార్రే పిర్రే, ఓషెన్ థామస్. భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధవన్, లోకేశ్ రాహుల్, రిషబ్ పంత్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్(కీపర్), కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్. -
కోహ్లి రికార్డుకు చేరువలో రోహిత్
లక్నో: పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన మార్కుతో దూసుకుపోతున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా నిలిచేందుకు స్వల్ప దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును అధిగమించేందుకు సిద్ధమవుతున్నాడు. మరో 11 పరుగులు చేస్తే కోహ్లి(2,102)ని రోహిత్ అధిగమిస్తాడు. ప్రస్తుతం 2,092 పరుగులతో ఉన్న రోహిత్ శర్మ.. వెస్టిండీస్ జరుగునున్న రెండో టీ20లో కోహ్లిని దాటే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మ జట్టు భారత క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టాడు. ఈ క్రమంలోనే తొలి వన్డేలో గెలిచిన రోహిత్ బృందం.. రెండో టీ20లో సైతం గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈరోజు(మంగళవారం) ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగునుంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా. పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2,171 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్ మెకల్లమ్ 2,140 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, కోహ్లి నాల్గో స్థానంలో ఉన్నాడు. -
మ్యాచ్‌కు ముందు రోజే స్టేడియం పేరు మార్పు
లక్నో: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ మంగళవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగనుంది. అయితే మ్యాచ్‌కు ముందు రోజు సోమవారం సాయంత్రమే మ్యాచ్ జరగాల్సిన స్టేడియం పేరును మార్చేశారు. లక్నోలో కొత్తగా నిర్మితమైన ఇకానా అంతర్జాతీయ స్టేడియం పేరును దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరుమీదుగా ‘భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ అంతర్జాతీయ స్టేడియం’గా మార్చేశారు. స్టేడియం పేరు మార్పుపై ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ విమర్శలు చేస్తోంది. యోగి ప్రభుత్వం సొంతంగా ప్రజలకు ఏమీ చేయడం లేదని ఎస్పీ అధికార ప్రతినిధి సునిల్ సింగ్ ఆరోపించారు. ప్రజల కోసం ఏం చేయకుండా ప్రదేశాలు, నగరాల పేర్లు మారుస్తూ ఉన్నారని విమర్శించారు. -
‘మా సీనియర్ క్రికెటర్లకు సిగ్గుండాలి’
ఆంటిగ్వా: టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్‌కు పలువురు వెస్టిండీస్ సీనియర్ క్రికెటర్లు గైర్హాజరీ కావడంతో ఆ జట్టు మాజీ ఆటగాడు కార్ల్ హూపర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఒక పటిష్టమైన జట్టును ఢీకొట్టేందుకు వెళ్లేటప్పుడు సీనియర్ క్రికెటర్లు డుమ్మా కొట్టడం అనేది చాలా సిగ్గుచేటన్నాడు. చాలామందికి విండీస్ తరపున ఆడాలనే ఉద్దేశం లేకపోవడంతోనే వారు ఏదొక వంకతో దూరమవుతున్నారంటూ విమర్శించాడు. ‘వెస్టిండీస్ తరపున ఆడాలనే ఉద్దేశమే వారికి లేదు. కొద్దిరోజులుగా వారు వ్యవహరిస్తున్న తీరుతోనే అది స్పష్టమవుతోంది. దానికి వారు సిగ్గుపడాలి. సీనియర్లు జట్టులో లేకపోవడంతో టీ20ల్లో వెస్టిండీస్‌ని ఓడించడం భారత్‌కి చాలా సులువు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లకి అనుభవం తక్కువ. వారు కుదురుకునేందుకు కొంత సమయం పడుతుంది. కుర్రాళ్లలో ప్రతిభ ఉంది.. కానీ.. నిలకడగా మాత్రం రాణించలేకపోతున్నారు' అని కార్ల్ హూపర్ పేర్కొన్నాడు. వెస్టిండీస్ జట్టు భారత్‌తో వన్డే సిరీస్ ఆడే సమయంలో క్రిస్‌గేల్ అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. మూడేళ్లుగా వెస్టిండీస్ బోర్డు, సీనియర్ క్రికెటర్ల మధ్య జీతాల విషయమై విభేదాలు కొనసాగుతుండటంతో.. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు వారు ఆసక్తి కనబర్చడం లేదు. ఈ క్రమంలో సీనియర్ క్రికెటర్లకి అసలు వెస్టిండీస్ జాతీయ జట్టుకు ఆడాలనే శ్రద్ధే లేదంటూ హూపర్ తాజాగా ధ్వజమెత్తాడు. భారత్‌తో సిరీస్‌కు గేల్ దూరం -
20 పరుగుల దూరంలో ధావన్
లక్నో: ఇటీవల కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్.. అంతర్జాతీయ టీ20ల్లో వెయ్యి పరుగుల క్లబ్లో చేరేందుకు స్వల్ప దూరంలో నిలిచాడు. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో 980 పరుగులు చేసిన ధావన్.. మరో 20 పరుగులు చేస్తే వెయ్యి పరుగుల మైలురాయిని అందుకుంటాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మూడు పరుగులు చేసి నిరాశపరిచిన ధావన్.. ఈరోజు(మంగళవారం) జరుగనున్న రెండో టీ20ల్లో వెయ్యి పరుగుల మార్కును చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకూ అంతర్జాతీయ టీ20ల్లో వెయ్యి పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మలు మాత్రమే ఉన్నారు. ఇక భారత తరపున వేగవంతంగా వెయ్యి పరుగులు సాధించిన ఆటగాళ్లలో కోహ్లి ముందువరుసలో ఉన్నాడు. ఓవరాల్‌గా కోహ్లి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి ఫాస్టెస్ రికార్డును రెండు రోజుల క్రితం పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజమ్ అధిగమించిన సంగతి తెలిసిందే. కోహ్లి 27 ఇన్నింగ్స్‌ల్లో వేగవంతంగా వెయ్యి పరుగులు సాధిస్తే, బాబర్ అజమ్ 26 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ ఘనతను అందుకున్నాడు. -
కెప్టెన్సీలోనూ రో‘హిట్టే’
కోల్‌కతా: ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలక ఆటగాడిగా తనదైన ముద్రవేసిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ.. కెప్టెన్సీలోనూ తిరుగులేదని నిరూపించుకుంటున్నాడు. ఇటీవల ఆసియాకప్ సాధించిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్.. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుదైన ఘనతను సాధించాడు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చిన క్రమంలో విండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌కు సారథిగా ఎంపికైన రోహిత్ శర్మ ఈ ఫార్మాట్లో అత్యధిక విజయాల ఘనతను అందుకున్నాడు. కెప్టెన్‌గా తొలి పది టీ20 మ్యాచ్‌లకు సారథ్య వహించిన జాబితాలో రోహిత్ అగ్రస్థానంలో నిలిచాడు. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత విజయం సాధించిన తర్వాత రోహిత్ ఈ ఘనతను సాధించాడు. ఇప్పటివరకూ రోహిత్ పది అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా అందులో తొమ్మింది విజయాలు నమోదు చేశాడు. ఫలితంగా మొదటి పది టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన లిస్ట్ ప్రకారం చూస్తే అత్యంత సక్సెస్ ఫుల్ రేసులో రోహిత్ ముందువరుసలో నిలిచాడు. ఈ క్రమంలోనే షోయబ్ మాలిక్, మైకేల్ క్లార్క్, అస్కార్ అప్ఘాన్, సర్పరాజ్ అహ్మద్‌ల రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఈ నలుగురు తొలి పది అంతర్జాతీయ టీ20లకు గాను ఎనిమిదేసి మ్యాచ్‌ల్లో విజయం సాధించిన కెప్టెన్లు కాగా, వారిని రోహిత్ అధిగమించాడు. మరొకవైపు తొమ్మిది వన్డేలకు కెప్టెన్‌గా చేసిన రోహిత్ ఏడు విజయాలను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. మరో రికార్డుకు చేరువలో రోహిత్.. -
తొలి టి20లో భారత్ విజయం
-
ఎంఎస్ ధోని తర్వాత దినేశ్ కార్తీకే
కోల్‌కతా: టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ అరుదైన ఘనతను సాధించాడు. ఓవరాల్ టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రెండో వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్ నిలిచాడు. వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ మూడు క్యాచ్‌లను అందుకున్నాడు. ఫలితంగా టీ20ల్లో ఎంఎస్ ధోని తర్వాత అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్‌గా దినేశ్ గుర్తింపు సాధించాడు. రామ్‌దిన్, హెట్‌మైర్, రోవ్మాన్ పావెల్ క్యాచ్‌లను దినేశ్ కార్తీక్ పట్టాడు. దాంతో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ సంగక్కార(142) రికార్డును దినేశ్ కార్తీక్ బ్రేక్ చేశాడు. ప్రస్తుతం దినేశ్ కార్తీక్ 143 క్యాచ్‌లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, ఎంఎస్ ధోని 151 క్యాచ్లలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో కమ్రాన్ అక్మల్(123), దినేశ్ రామ్‌దిన్(120)వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.విండీస్ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దినేశ్ కార్తీక్(31 నాటౌట్; 34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), కృనాల్ పాండ్యా(21 నాటౌట్;9 బంతుల్లో 3 ఫోర్లు)లు విజయంలో ముఖ్యభూమిక పోషించారు.