
లక్నో: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనదైన మార్కుతో దూసుకుపోతున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. అంతర‍్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా నిలిచేందుకు స్వల్ప దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును అధిగమించేందుకు సిద్ధమవుతున్నాడు. మరో 11 పరుగులు చేస్తే కోహ్లి(2,102)ని రోహిత్ అధిగమిస్తాడు. ప్రస్తుతం 2,092 పరుగులతో ఉన్న రోహిత్ శర్మ.. వెస్టిండీస్ జరుగునున్న రెండో టీ20లో కోహ్లిని దాటే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మ జట్టు భారత క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టాడు. ఈ క్రమంలోనే తొలి వన్డేలో గెలిచిన రోహిత్ బృందం.. రెండో టీ20లో సైతం గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈరోజు(మంగళవారం) ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగునుంది.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా. పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2,171 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్ మెకల్లమ్ 2,140 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, కోహ్లి నాల్గో స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment