‘రోహిత్‌ కాదు.. భారత్‌ అనాలి’ | Rohit Sharma Says Not to Cheer for Him | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 31 2018 12:30 PM | Last Updated on Wed, Oct 31 2018 7:12 PM

Rohit Sharma Says Not to Cheer for Him - Sakshi

రోహిత్‌ శర్మ

ముంబై : టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. వెస్టిండీస్‌తో మంబై వేదికగా నాలుగోవన్డేలో జరిగిన ఓ ఘటనతో.. అతని అభిమానుల గర్వపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్‌ అద్భుత శతకంతో హిట్‌మ్యాన్‌ పవరేంటో మరోసారి చూపించాడు. ఈ దెబ్బకు భారత్‌ భారీ స్కోర్‌ చేయడం.. విండీస్‌ జట్టంతా కలిసి రోహిత్‌ అన్ని పరుగులు కూడా చేయకపోవడం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో విస్టిండీస్‌ ఇన్నింగ్స్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. (చదవండి : రోహిత్‌ ధమాకా.. రాయుడు పటాకా)

రోహిత్‌ శర్మ బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తుండగా.. స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు రోహిత్‌..రోహిత్‌..రోహిత్‌ అని అరవసాగారు. ఇది విన్న హిట్‌ మ్యాచ్‌ తన టీషర్టుపై ఉన్న ఇండియా అక్షరాలను చూపిస్తూ.. భారత్‌ అని అరవాలని సైగ చేశాడు. అతని సూచన మేరకు అభిమానులు భారత్‌ భారత్‌.. అని అరిచారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్‌ చేస్తూ అతని అభిమానులు.. ‘రోహిత్‌ అభిమానులమైనందుకు గర్వపడుతున్నాం’అని క్యాప్షన్‌గా పేర్కొంటున్నారు. (వాటి కోసం ఎప్పుడూ ఆలోచించను: రోహిత్‌)

ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లోను రోహిత్‌ అదరగొట్టాడు. ఫస్ట్‌ స్లిప్‌లో ఉండి ఏకంగా మూడు క్యాచ్‌లు అందుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం ఈ క్యాచ్‌లపై మాట్లాడుతూ.. ‘ఈ రోజు స్లిప్‌ క్యాచ్‌లు అందుకున్నాను. అలాంటి క్యాచ్‌లు అందుకోవడం చాలా కీలకం. మాములుగా కుల్‌దీప్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ అతన్ని చేతులను అర్థం చేసుకోవడం కష్టం. అదే నెట్స్‌లో సులువుగా అర్థమవుతోంది. అతను గూగ్లీ వేయబోతున్నాడని గ్రహించి స్లిప్‌ ఫీల్డర్‌గా సిద్దంగా ఉన్నాను.’ అని చెప్పుకొచ్చాడు. ఇక విరాట్‌ కోహ్లి అభిమానులు సైతం మ్యాచ్‌ జరుగతుండగా.. అతని సతీమణి, బాలీవుడ్‌ నటి అనుశ్క శర్మ పేరును ప్రస్తావిస్తూ అనుష్కా.. అనుష్కా అని అరవడంతో కోహ్లి థంప్సప్‌ సింబల్‌తో చూపించి ఆనందపరిచాడు.(ధోనిని తీసేయడంలో తప్పులేదు : గంగూలీ)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement