
ఉపాసన కొణిదెల (Upasana Konidela).. రామ్‌చరణ్ సతీమణిగా ఇంటిని చక్కదిద్దడమే కాకుండా అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌లో సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) వైస్ చైర్‌పర్సన్‌గానూ బాధ్యతలు నిర్వహిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఉపాసన మాట్లాడుతూ.. పెళ్లయిన కొత్తలోనే రామ్‌చరణ్, నేను ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. తను నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తాడు. నేనేదైనా చేయాలనుకుంటే అందుకు సహకరిస్తాడు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా నా వెంటే ఉన్నాడు.
మా బంధం బలంగా ఉండటానికి అదే కారణం
అలాగే తను కష్టనష్టాల్లో ఉన్నప్పుడు కూడా నేను తనవైపు నిల్చున్నాను. మా బంధం ధృడంగా ఉండటానికి ఇదే ప్రధాన కారణం. అలాగే మా ఇరు కుటుంబాలు కూడా మా వెన్నంటే ఉన్నాయి. వైవాహిక బంధంలో.. ఎంత బిజీగా ఉన్నా ఒకరికోసం ఒకరు సమయం కేటాయించడం తప్పనిసరి. వారానికి ఒకసారైనా డేట్ నైట్‌కు వెళ్లమని అమ్మ చెప్తూ ఉండేది. మాకు వీలైనంతవరకు దాన్ని ఫాలో అవుతూ ఉంటాం.
వారంలో ఒకరోజు
కాకపోతే బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఆ రోజంతా గడుపుతాం. ఆ రోజు టీవీ, ఫోన్లకు దూరంగా ఉంటాం. మా మధ్య ఏదైనా సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకుంటాం. ఎందుకంటే మాట్లాడుకుంటేనే కదా ఏదైనా తెలిసేది, పరిష్కరించుకోగలిగేది. పెళ్లిళ్లు వర్కవుట్ కావాలంటే ఇవన్నీ చేస్తుండాలి. ఎప్పటికప్పుడు రిలేషన్‌ను బలపర్చుకుంటూ ఉండాలి. మావల్ల కాదని వదిలేస్తే కష్టం అని పేర్కొంది.
ఉపాసన కచ్చితంగా వాళ్ల మధ్యే పెరగాలి
కుటుంబ విలువల గురించి మాట్లాడుతూ.. మా అమ్మ నా బెస్ట్‌ఫ్రెండ్. నేను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే పెరిగాను. నా కూతురు కూడా నాలాగే నానమ్మ-తాతయ్యల దగ్గర పెరగాలని కోరుకుంటున్నాను. గ్రాండ్ పేరెంట్స్ చేతుల్లో పెరగడమనేది అందమైన అనుభవం. కానీ ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కనిపించడం లేదు. నాకు మాత్రం మా అత్త-మామలతో కలిసి ఉండటమే ఇష్టం. మేమంతా ఒకే ఇంట్లో కలిసి ఉండటమే నాకు నచ్చుతుంది.
అదే నా ధీమా
అప్పుడే నా కూతురు వారి దగ్గరి నుంచి కూడా ఎంతో కొంత నేర్చుకుంటుంది. మా అత్త, మామయ్య తనను జాగ్రత్తగా పెంచుతున్నారు. నేను ఇంట్లో లేనప్పుడు తను మంచి చేతుల్లోనే ఉందన్న ధీమా ఉంటుంది. మా అమ్మానాన్న కూడా అంతే ప్రేమ, కేర్ చూపిస్తారు. ఇలా నా కుటుంబసభ్యులందరూ క్లీంకార ఎదుగుదలలో భాగమవుతున్నారు అని ఉపాసన చెప్పుకొచ్చింది.
చదవండి: తోడుగా, నీడగా.. ఐకాన్ స్టార్‌కు భార్య బర్త్‌డే విషెస్