Ram Charan
-
రామ్‌చరణ్‌తో పోటీపడేంతవాడివా సిద్ధూ...
సిద్ధు జొన్నలగడ్డ చిన్నస్థాయి నుంచి సినీ పరిశ్రమలో స్టార్ బాయ్‌గా ఎదగడం సినీ పరిశ్రమలోని ఔత్సాహిక నటీనటులకు పెద్ద ప్రేరణ. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో హోదా సాధించాడు. అయితే ఇదేమీ అలవోకగా సాధించేసింది కాదు. దాదాపుగా దశాబ్ధంన్నర పాటు పడిన కష్టం దీని వెనుక ఉంది. సీనియర్ హీరో రవితేజలాగా అత్యంత చిన్న స్థాయి పాత్రలు వేస్తూ పెద్ద స్టార్‌గా ఎదిగిన వర్ధమాన హీరోల్లో సిద్ధూ ముందు వరుసలో ఉంటాడు.డీజే టిల్లు 1, 2 భాగాలు సిద్ధూని ఒకేసారి పెద్ద స్టార్‌గా మార్చేశాయి. అతని తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. సిద్ధు జొన్నలగడ్డ డిజె టిల్లు ద్వారా పూర్తిగా వన్‌మ్యాన్ షో చేశాడని చెప్పాలి. ఆ సినిమాలో వెరైటీ మాడ్యులేషన్‌తో యాక్షన్, కామెడీని పండించి సరికొత్త హీరోయిజాన్ని రుచి చూపించిన సిద్ధూ ఆ సినిమాకి కధారచయితగా కూడా వ్యవహరించడం విశేషం. జోష్ సినిమాలో చిన్నపాత్రతో మొదలైన సిద్ధూ జొన్నలగడ్డ కెరీర్ తర్వాత కూడా డాన్ శీను, భీమిలి కబడ్డి జట్టు..లాంటి పలు చిత్రాల్లో అలాంటి పాత్రలతోనే కొనసాగింది. ఆ తర్వాత ఈ యువ హీరో లైఫ్ బిఫోర్ వెడ్డింగ్‌లో తొలిసారిగా ప్రధాన పాత్రలో అరంగేట్రం చేసిన సిద్ధూ హీరోగా మారి గుంటూరు టాకీస్ వంటి ఎ సర్టిఫైడ్ చిత్రాల ద్వారా హిట్స్ దక్కించుకున్నాడు. అదే విధంగా తను నటించిన చిత్రాల్లో కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా కోవిడ్ సమయంలో ధియేటర్లలో విడుదలకు నోచుకోలేక కేవలం ఓటీటీలో మాత్రమే విడుదలైంది.పెద్దలకు మాత్రమే అన్నట్టుగా రూపొందిన ఈ చిత్రం అప్పట్లో రొమాంటిక్ మూవీగా హిట్ టాక్ తెచ్చుకుంది కూడా. ఆ తర్వాత మారిన పరిణామాల్లో సిధ్దూకి డిజె టిల్లు తెచ్చిపెట్టిన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుందనుకున్నారు. యూత్‌లో సిధ్దూకి ఉన్న ఫాలోయింగ్‌ని దృష్టిలో ఉంచుకుని వాలెంటైన్స్ డే సందర్భంగా ధియేటర్లలో విడుదల చేసేశారు కూడా. ఇక్కడ గమనించాల్సిన విశేషం ఏమిటంటే అదే రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ చిత్రం రీ రిలీజ్ కూడా ఉండడం.అప్పట్లో ఆరెంజ్ సినిమా కు విమర్శకుల ప్రశంసలు వచ్చినప్పటికీ కమర్షియల్‌గా ఫ్లాప్ చిత్రంగానే నిలిచింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా రీ రిలీజ్ అదే రోజు సిద్ధూ జొన్నలగడ్డ సినిమా రీ రిలీజ్ ఉండడం సినీ వర్గాల్లో ఆసక్తి నింపాయి. మరో చెప్పుకోదగ్గ విశేషం... నాటి ఆరెంజ్ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ సైతం సంతోష్ అనే చిన్న పాత్రలో నటించాడు. ఆ సినిమాలో హీరో రామ్ చరణ్‌కి పోటీగా హీరోయిన్ ని ప్రేమలో పడేలా చేసే ముగ్గురు అబ్బాయిల్లో ఒకడిగా చేశాడు. ఆసక్తికరంగా... సిద్ధూ ఆరెంజ్ చిత్రాన్ని రూపొందించిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలోనే తదుపరి జాక్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈ వారం ఆసక్తికరంగా, సిద్ధు ’ఇట్స్ కాంప్లికేటెడ్’ (కృష్ణ అండ్ అతని లీల) పేరుతో ఆరెంజ్‌కి పోటీగా విడుదలైంది. ఓ యువ హీరో సినిమా రీ రిలీజ్‌కు నోచుకోవడం కూడా ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. అయితే ముందూ వెనుకా చూసుకోకుండా సిద్ధూ తన సినిమాని రామ్‌చరణ్ సినిమా రీ రిలీజ్ రోజునే విడుదల చేయడంతో ఇప్పుడు వీరిద్దరిని పోలుస్తూ కామెంట్ చేయడం మొదలైంది. మరోవైపు రీరిలీజ్‌లో సిద్ధూ చిత్రం పూర్తిగా చతికిలబడగా రామ్ చరణ్ ఆరెంజ్ అనూహ్యంగా భారీ కలెక్షన్లు సాధించింది.తెలుగు చిత్రసీమలో సిద్ధూ ఎదుగుదల ప్రశంసించదగ్గదే. స్థిరత్వం అంకితభావంతో సినీ పరిశ్రమలో ఒక నటుడి జీవితం ఎలా మారుతుందో చెప్పడానికి సిద్ధూ ఒక ఉదాహరణ. అయితే పెద్దగా అండదండలు లేని హీరోల స్టార్ డమ్ ఎప్పుడూ నిలకడగా ఉండడం తెలుగు చిత్రసీమలో సాధ్యం కాదని సిధ్దూ గుర్తించాలి. అన్ని రకాలుగా తమకన్నా పెద్ద హీరోలతో పోటీ పడే విషయంలో యువ హీరోలు కాస్త వివేకంతో వ్యవహరించాలని సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. -
నాన్నా.. చరణ్ సినిమాకు అలా అడగాల్సిన పనిలేదు: బుచ్చిబాబు
ఉప్పెన(2021) సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు(Buchi Babu Sana). తొలి సినిమాతోనే రూ.100 కోట్లుకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించాడు. అయితే ఈ సినిమా రిలీజై నాలుగేళ్లు అవుతున్నా.. బుచ్చిబాబు నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్(Ram Charan)తో సినిమా చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. రామ్ చరణ్ కెరీర్లో ఇది 16వ సినిమా(RC16). ఇటీవల విడుదలైన గేమ్ ఛేంజర్ చిత్రం డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ అంతా బుచ్చి బాబు సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. తమ హీరోకి ఎలాగైనా బ్లాక్ బస్టర్ అందించాలని కోరుతున్నారు. ఫ్యాన్స్ ఊహించినదానికంటే ఎక్కువ హిట్టే అందిస్తానని చెబుతున్నాడు బుచ్చిబాబు. తాజాగా ఓ ఈవెంట్ రామ్ చరణ్ సినిమాపై బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.బ్రహ్మాజీ ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘బాపు’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన బుచ్చిబాబు మాట్లాడుతూ..‘మా నాన్న రైతు. చాలా కష్టపడి మమ్మల్ని పెంచాడు. వ్యవసాయం గురించి మా నాన్న నాతో ఓ మాట చెప్పాడు. ‘పేకాట ఆడితే డబ్బులు మనకో లేదా పక్కోడికో వస్తాయిరా..కానీ వ్యవసాయం చేస్తే ఎవడికి వస్తాయో తెలియదు..అంతా పోతాయి’ అని అనేవాడు. నిజంగానే ఏడాదంతా కష్టపడితే ఏకరం మీద రైతుకు మిగిలేది కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే. ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది’ అని బుచ్చిబాబు అన్నారు. అలాగే తన నాన్న గురించి మాట్లాడుతూ..‘ఉప్పెన రిలీజ్ సమయంలో మా నాన్న థియేటర్ బయటే నిలబడి ‘సినిమా బాగుందా’ అని వచ్చిన వారందరినీ అడిగేవాడట. ఆయన సినిమా కూడా చూడకుండా థియేటర్‌కు వచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆయన మా నుంచి బౌతికంగా దూరమై ఏడాది అవుతోంది. ప్రస్తుతం నేను చరణ్‌తో తీస్తున్న సినిమా బాగుందా అని ఎవరినీ అడగాల్సిన పని లేదు నాన్నా.. అది కచ్చతంగా హిట్ అవుతుంది’ అని బుచ్చిబాబు ఎమోషనల్‌గా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. -
మరోసారి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న సుకుమార్
-
సుకుమార్ ప్రాజెక్ట్‌లో సరికొత్తగా కనిపించనున్న రామ్‌చరణ్
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించారు హీరో రామ్‌చరణ్(Ram Charan). ‘పుష్ప 1: ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ చిత్రాలతో డైరెక్టర్ సుకుమార్(Sukumar) కూడా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రెండో సినిమా తెరకెక్కనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ కెరీర్లో ఇది 17వ చిత్రంగా రూపొందనుంది.ఈ మూవీలో రామ్‌చరణ్ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారని టాక్. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రంగస్థలం’ (2022) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ తర్వాత వారి కాంబినేషన్లో మరో సినిమా రానుంది. రామ్‌చరణ్ ప్రస్తుతం ‘ఉప్పెన’ మూవీ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత రామ్‌చరణ్, సుకుమార్ మూవీ పట్టాలెక్కుతుందని టాక్. ‘రంగస్థలం’లో చిట్టిబాబుగా పక్కా పల్లెటూరు, ఫుల్ మాస్ పాత్రలో రామ్‌చరణ్‌ని చూపించారు సుకుమార్. తాజా చిత్రంలో అందుకు పూర్తి భిన్నమైన పాత్రలో చరణ్‌ని చూపించనున్నారట.ఈ చిత్రంలో అల్ట్రా స్టైలిష్ అర్బన్ లుక్‌లో కనిపిస్తారట. ‘రంగస్థలం’లో చరణ్‌ని, ‘పుష్ప’ చిత్రాల్లో అల్లు అర్జున్‌ని పక్కా మాస్‌గా చూపించిన సుకుమార్... ఈసారి మాత్రం చరణ్ కోసం పూర్తి అర్బన్ బ్యాక్‌డ్రాప్ కథని సిద్ధం చేస్తున్నారని టాక్. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మికా మందన్నాని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. -
బర్త్ డే స్పెషల్
‘ఉప్పెన’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు(Buchi Babu) సానా ద్వితీయ చిత్రాన్ని హీరో రామ్‌చరణ్(Ram Charan)తో చేసే అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘ఆర్సీ 16’ అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా శనివారం (ఫిబ్రవరి 15) బుచ్చిబాబు బర్త్ డే.ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో ‘ఆర్సీ 16’ యూనిట్ ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకని నిర్వహించారు. రామ్‌చరణ్ కూడా బుచ్చిబాబుతో కలిసి ఉన్న ఫొటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే.. ‘ఆర్సీ 16’ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది.రామ్ చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు బుచ్చిబాబు. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. -
Valentine's Day Special: టాలీవుడ్ బ్యూటిఫుల్ జోడీ రామ్‌చరణ్- ఉపాసన (ఫోటోలు)
-
వారికి మాత్రమే వాలైంటెన్స్ డే.. మీకోసం కాదు: ఉపాసన పోస్ట్ వైరల్
వాలైంటైన్స్ డే సందర్భంగా మెగా కోడలు ఉపాసన కొణిదెల ఆసక్తికర పోస్ట్ చేసింది. ప్రేమికుల దినోత్సవానికి సరికొత్త అర్థం చెబుతూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఫిబ్రవరి 14 కేవలం వారికి మాత్రమేనని సరదా కొటేషన్ రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఉపాసన ఏం రాసిందో మీరు ఓ లుక్కేయండి. మెగా కోడలు ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ నవ్వులు తెప్పిస్తోంది. వాలంటైన్స్ డే అనేది కేవలం 22 ఏళ్ల లోపు ఉన్నవారికి మాత్రమే.. మీరు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు అయితే.. ఆంటీ దయచేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వరకు వేచి చూడండి' అని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. లవర్స్ డే రోజున ఉపాసన చేసిన ఈ సరదా పోస్ట్ నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది. -
ఇన్‌స్టాలో ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్న అల్లు అర్జున్.. ఎవరంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).. ఇప్పుడీ పేరు యావత్ సినీ ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ గుర్తింపు కోసం బన్నీ చాలా కష్ట పడ్డాడు.వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ తనదైన నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘ఐకాన్ స్టార్’ స్థాయికి వచ్చాడు. సినిమాల రికార్డులను బద్దలు కొట్టడమే కాదు.. సోషల్ మీడియాలోనూ బన్నీ రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇన్ స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్‌ని ఫాలో అయ్యేవారి సంఖ్య 28.5 మిలియన్స్‌కి చేరుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించాడు.(చదవండి: మెగా వర్సెస్ అల్లు.. అసలేం జరుగుతుంది?)ఒక్కే ఒక్కరుఇన్స్టాలో బన్నీకి 28.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే.. ఆయన మాత్రం ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నారు. ఆ ఒక్కరు ఎవరంటే అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డినే. ఆమెను మాత్రమే బన్నీ ఫాలో అవుతున్నాడు. ఇన్‌స్టాలో స్నేహరెడ్డికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆమెకు 9.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. బన్నీతో పాటు రామ్ చరణ్, చిరంజీవి, ఉపాసనలను కూడా స్నేహా రెడ్డి ఫాలో అవుతోంది. బన్నీ మాత్రం మొదటి నుంచి ఎవరిని ఫాలో అవ్వడం లేదు. కానీ రామ్ చరణ్ మొన్నటి వరకు అల్లు అర్జున్‌ని ఫాలో అయ్యాడు. సడెన్‌గా ఏం జరిగిందో కానీ.. తాజాగా చరణ్ కూడా బన్నీని అన్ ఫాలో చేశాడు. ప్రస్తుతం చరణ్‌కి ఇన్‌స్టాలో 26 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా.. ఆయన 38 మందిని ఫాలో అవుతున్నారు. అందులో అల్లు శిరీష్,చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ఉన్నారు.బయటపడ్డ విభేధాలుఅల్లు అర్జున్‌ని రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడనే వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఎంతో స్నేహంగా ఉండే బన్నీ, చరణ్‌ల మధ్య ఏం జరిగింది? ఎందుకు అన్ ఫాలో చేశారనే చర్చలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ఇరు కుటుంబాల విభేదాలు ఉన్నాయని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ చేసిన పని.. ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
మెగా వర్సెస్ అల్లు.. అసలేం జరుగుతుంది?
టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. ఇరు కుటుంబాల నుంచి స్టార్స్ ఉన్నారు. అయితే మొన్నటి వరకు మెగా ఫ్యామిలీ అయినా అల్లు ఫ్యామిలీ అయినా ఒకటే అనే భావన అందరిలో ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో ఇరు కుటుంబాల మధ్య మాత్రం కోల్డ్ వార్ నడుస్తోంది. ఆ విషయం ఇండస్ట్రీ వరకే పరిమితం కాకుండా అభిమానుల వరకు చేరింది. దానికి కారణం సోషల్ మీడియా అనే చెప్పాలి. మొన్నటి వరకు ట్విటర్, ఇన్‌స్టా గ్రామ్‌లో అల్లు అర్జున్(Allu Arjun)ని ఫాలో అయినా మెగా హీరోలు.. ఇప్పుడు వరుసగా అన్ ఫాలో అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మెగా మేనల్లుడు సాయి దుర్గాతేజ్ బన్నీని అన్‌ఫాలో చేయడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం మొదలైంది. ఎన్నికల ఫలితాల తర్వాత మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా యుద్ధమే ప్రారంభించారు. ఒకరినొకరు ట్రోల్ చేస్తూనే ఉన్నారు.(చదవండి: మా తాతయ్యను ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పారు: చిరంజీవి ఆసక్తికర కామెంట్స్)ఇక పుష్ప 2 రిలీజ్ సమయంలో మెగా హీరోలెవరూ ఆ సినిమా గురించి మాట్లాడలేదు. ఏ చిన్న సినిమా విజయం సాధించినా మాట్లాడే చిరంజీవి.. పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు ఇప్పటి వరకు ఉన్న చాలా రికార్డులను బద్దలు కొట్టినా.. స్పందించలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు చిరంజీవితో సహా సినీ ప్రముఖులంతా పరామర్శిస్తే.. పవన్ కల్యాణ్, రామ్ చరణ్ మాత్రం తమకు తెలియదన్నట్లుగానే ఉన్నారు. పవన్ కల్యాణ్ అయితే ‘సంధ్య థియేటర్’ ఘటనలో అల్లు అర్జున్‌దే తప్పు అన్నట్లుగా మాట్లాడాడు. అయితే అరెస్ట్ తర్వాత బన్నీ వెళ్లి చిరంజీవిని కలవడంతో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు సమిసిపోయాయని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా రామ్ చరణ్(Ram Charan) ఇన్‌స్టాలో బన్నీని అన్ ఫాలో చేయడంతో అలు మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య ఏం జరుగుతుందనే చర్చలు మొదలయ్యాయి.బన్నీ మాత్రమే..రామ్ చరణ్- బన్నీల మధ్య మంచి స్నేహ బంధం ఉంది. వరుసకు బావ బామ్మర్దులు అయినా..అన్నదమ్ముల్లా కలిసి ఉండేవాళ్లు. చరణ్ కంటే ముందే బన్నీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అతనికి ఇన్‌స్టాలో 28.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే బన్నీ మాత్రం తన సతీమణి స్నేహరెడ్డిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. రామ్ చరణ్ కాస్త ఆలస్యంగా ఇన్‌స్టాలోకి వచ్చినా..26 మిలియన్ల ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన 38 మందిని ఫాలో అవుతున్నాడు. (చదవండి: 'ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆలోచనలా?'.. చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించిన శ్యామల)మొన్నటి వరకు ఆ లిస్ట్‌లో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సడెన్‌గా అన్ ఫాలో చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే అల్లు అర్జున్ ను చరణ్ అన్‌ఫాలో చేసినప్పటికీ, ఆయన తమ్ముడు అల్లు శిరీష్ ని మాత్రం ఫాలో అవుతుండటం గమనార్హం. మరోవైపు మెగా కోడలు ఉపాసన కొణిదెల మాత్రం బన్నీని ఫాలో అవుతోంది. దీంతో చరణ్ - బన్నీ మధ్యే ఏదో సమస్య ఉండి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.చరణ్ స్పందించేనా?ఈ మధ్య సోషల్ మీడియాలో మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్దం నడుస్తోంది. మెగా హీరోలు ఏం మాట్లాడినా.. దానికి అల్లు ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. అలాగే అల్లు ఫ్యామిలీ సరదాగా మాట్లాడినా సరే.. కావాలనే హేళన చేస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల ఓ ఈవెంట్ గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజుపై అల్లు అరవింద్ సరదాగా పంచులేస్తే.. దాన్ని రామ్ చరణ్‌కి ఆపాదించి..అరవింద్‌ని ట్రోల్ చేశారు. అది భరించలేక చివరకు అరవింద్ వివరణ ఇచ్చాడు. తన మేనల్లుడు చరణ్‌తో మంచి రిలేషన్ ఉందని చెప్పాడు. ఇది చెప్పి వారం రోజులు కూడా దాటకముందే బన్నీని చరణ్ అన్‌ఫాలో చేయడం గమనార్హం. మరి ఇది పొరపాటున జరిగిందా లేదా కావాలనే అన్ ఫాలో చేశాడా అనేది తెలియాలి. ఒకవేళ దీనిపై చరణ్ స్పందించపోతే..ఇద్దరి ఫ్యాన్స్ మధ్య మళ్లీ సోషల్ మీడియా వార్ జరుగడం ఖాయం. ఈ ‘అన్ ఫాలో’ గొడవకి ఫుల్ స్టాప్ ఎవరు పెడతారో చూడాలి. -
ఈసారైనా రామ్ చరణ్ కు కొడుకు పుడితే బాగుండు: చిరంజీవి
-
అల్లు అర్జున్ను అన్‌ఫాలో చేసిన రామ్‌చరణ్
ఒకప్పుడు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అంతా ఒకే కుటుంబంలా ఉండేది. ఏ పండగ వచ్చినా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేవాళ్లు. కానీ రానురానూ రెండు కుటుంబాల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. అది ఇటీవల తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో హీరో రామ్‌చరణ్ (Ram Charan) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ను అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ వరుసకు బావ, బావమరిది అవుతారు. బంధువులుగా కంటే స్నేహితుల్లానే ఎక్కువగా కలిసిమెలిసి ఉండేవారు. అన్‌ఫాలో చేసిన చరణ్?సడన్‌గా ఏమైందో ఏమో కానీ బన్నీని రామ్‌చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడు. రామ్‌చరణ్ అన్‌ఫాలో చేసినప్పటికీ అతడి భార్య ఉపాసన మాత్రం ఫాలో అవుతోంది. చరణ్ కంటే ముందు మెగా మేనల్లుడు, హీరో సాయిదుర్గ తేజ్ అల్లు అర్జున్ను అన్‌ఫాలో చేశాడు. బన్నీని వదిలేసిన చరణ్.. అల్లు శిరీష్ (Allu Sirish)ను మాత్రం ఫాలో అవుతుండటం గమనార్హం. అటు అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం తన భార్య స్నేహారెడ్డిని మాత్రమే అనుసరిస్తున్నాడు.దూరమవుతున్న బంధం?ఏపీ ఎన్నికల సమయం నుంచి అల్లు, మెగా కుటుంబాల మధ్య సరైన సత్సంబంధాలు లేవని తెలుస్తోంది. ఇటీవల తండేల్ (Thandel Movie) ఈవెంట్లోనూ అల్లు అరవింద్.. చరణ్ ఫస్ట్ సినిమా యావరేజ్ కంటే తక్కువే ఆడిందని కామెంట్స్ చేశాడు. ఒక్క వారంలోనే దిల్‌రాజు నష్టాలు చూశాడంటూ.. గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు. దీనిపై ట్రోలింగ్ జరగడంతో అల్లు అరవింద్ వివరణ ఇచ్చాడు. రామ్‌చరణ్ తన ఏకైక మేనల్లుడని, తనకు కొడుకులాంటివాడని పేర్కొన్నాడు. ఈ గొడవకు ఫుల్స్టాప్ పెట్టాలని కోరాడు.చదవండి: చరణ్‌కు ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉంది: చిరంజీవి -
చరణ్‌కు ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉంది: చిరంజీవి
తనకు వారసుడు కావాలని మనసులో మాట బయటపెట్టారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఈసారైనా రామ్‌చరణ్ (Ram Charan)కు కొడుకు పుడితే బాగుండు అని ఆకాంక్షించారు. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రహ్మా ఆనందం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. ఇంట్లో ఉన్నప్పుడు నాకు మనవరాళ్లతో ఉన్నట్లుగా అనిపించదు.ఒక్క మగపిల్లాడు లేడులేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఉన్నట్లు అనిపిస్తుంది. చుట్టూ ఆడపిల్లలే.. ఒక్క మగపిల్లాడు లేడు. చరణ్.. ఈసారైనా సరే ఒక మగపిల్లాడిని కనరా.. నా వారసత్వం ముందుకువెళ్లాలని కోరిక. మళ్లీ ఇంకో అమ్మాయిని కంటాడేమోనని నా భయం అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నెట్టింట దుమారం చెలరేగింది. చిరంజీవి వారసుడిని కోరుకోవడం తప్పు లేదు కానీ మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉందనడం కరెక్ట్ కాదని పలువురూ అభిప్రాయపడుతున్నారు. కాగా రామ్‌చరణ్- ఉపాసన దంపతులకు 2023లో క్లీంకార పుట్టింది.సినిమాబ్రహ్మా ఆనందం సినిమా విషయానికి వస్తే.. బ్రహ్మానందం (Brahmanandam), ఆయన కుమారుడు గౌతమ్ తాతామనవడిగా నటించారు. వెన్నెల కిశోర్, ప్రియ వడ్లమాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్, సావిత్ర సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదల కానుంది.రాజకీయాలపై చిరు కామెంట్స్ఈ క్రమంలో ఫిబ్రవరి 11న బ్రహ్మా ఆనందం ప్రీరిలీజ్ ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్లో చిరంజీవి రాజకీయాలు, సినిమాల గురించి మాట్లాడుతూ.. సినిమాల్లో ఉన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండేవాడిని. రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు ఒత్తిడిగా ఫీలయ్యాను. ప్రతి ఒక్కరినీ ఏదో ఒకటి అనాలని తిట్లు రాసుకోవాల్సి వచ్చేది. అది నాకు మరింత ఒత్తిడిగా అనిపించింది. నవ్వడమే మర్చిపోయాను.ఆ సినిమాతో మళ్లీ నవ్వడం ప్రారంభించా..నాలో హాస్య గ్రంథులు పోయాయేమో అనుకున్నాను. సినిమాల్లోకి తిరిగివచ్చాకే మళ్లీ నా పెదాలపై చిరునవ్వు వచ్చింది. ఖైదీ నెంబర్ 150 మూవీతో నవ్వడం ప్రారంభించాను. ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగానే ఉంటూ సినిమాలకు అత్యంత దగ్గరగా ఉంటాను. అయినా సరే చాలామందికి నాపై చాలా అనుమానాలు వస్తున్నాయి. కానీ నేను రాజకీయాల్లోకి వెళ్లను అని క్లారిటీ ఇచ్చారు.చదవండి: రామ్ చరణ్ ఇంటికి తిరిగొచ్చిన 'కుట్టి' -
బాలీవుడ్ వెళ్తున్న రామ్ చరణ్
-
రామ్ చరణ్ ఇంటికి తిరిగొచ్చిన 'కుట్టి'
టాలీవుడ్ హీరో రామ్ చరణ్‌తో పాటు ఆయన సతీమణి జంతు ప్రేమికులు అని తెలిసిందే. కొద్దిరోజుల క్రితం తప్పిపోయిందనుకున్న 'కుట్టి' అనే ఆఫ్రికన్ గ్రే చిలుక తమ చెంతకు చేరడంతో వారు ఎగిరిగంతేశారు. కొద్దిరోజుల క్రితం 'కుట్టి' అనే చిలుక తప్పిపోయిందని ఒక ఫోటోతో సోషల్ మీడియా ద్వారా ఉపాసన తెలిపారు. జుబ్లీహిల్స్ ఏరియాలోని రోడ్డు నంబర్ 25లో ఆఫ్రికన్ కుట్టి తప్పిపోయిందని, ఎక్కడైనా కనిపిస్తే చెప్పండంటూ ఆమె రిక్వెస్ట్ చేశారు. అయితే, ఈ పోస్ట్ చూసిన కొన్ని యానిమల్ ఆర్గనైజేషన్ సభ్యులు ఎలాగైనా వారి చిలుకను ఎతికి అప్పజెప్పాలని పూనుకున్నారు. ఫైనల్‌గా కొందరు ఆ చిలుకను రామ్‌చరణ్ దంపతులకు తిరిగి ఇచ్చారు.గత శనివారం ఓ యువతి ఈ పక్షి కనబడిందంటూ ఓ ఫోటోను ఎనిమిల్ కన్జర్వేషన్ వెల్ఫేర్ సొసైటీ దృష్టికి తీసుకువచ్చింది. దీంతో సదరు సంస్థ ఈ పక్షి వివరాలను తమ గ్రూపులో పోస్ట్ చేశారు. చివరకు ఇది రామ్‌చరణ్ ఇంటి నుంచి తప్పిపోయిన పక్షిగా తేల్చి ఆదివారం వారికి అప్పగించారు. చిలుక కాలి రింగుకు ఉన్న ఐడీ ద్వారా వారు దీనిని గుర్తించారు. అయితే కుట్టి( చిలుక) రామ్ చరణ్ చూడగానే.. ఆయన భుజంపై వాలిపోయింది. ఆ సమయంలో చరణ్ చాలా ఎమోషనల్ అయ్యారు. -
రామ్ చరణ్ సుకుమార్ న్యూ మూవీ అప్డేట్
-
మెగా అభిమానులకు అల్లు అరవింద్ క్షమాపణలు
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. రామ్‌చరణ్ (Ram Charan)ను చులకన చేసి మాట్లాడలేదని, తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేస్తున్నారని వాపోయాడు. సోమవారం జరిగిన తండేల్ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ మధ్య తండేల్ సినిమా ప్రమోషన్స్‌లో నేను రామ్‌చరణ్ స్థాయి తగ్గించానని ట్రోల్ చేశారు. కానీ నేను దిల్ రాజుగారి పరిస్థితి గురించి మాత్రమే మాట్లాడాను. ఏకైక మేనల్లుడుదిల్ రాజు ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు, నష్టాలు, ఇన్కమ్ ట్యాక్సులు అన్నీ అనుభవించారన్నాను. ఇది ఉద్దేశపూర్వకంగా అనలేదు. అయినా దానికి కొందరు మెగా అభిమానులు ఫీలైపోయి నన్ను ట్రోల్ చేశారు. చరణ్ నాకున్న ఏకైక మేనల్లుడు. తను నాకు కొడుకులాంటోడు. నేను చరణ్‌కు ఏకైక మేనమామను. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఉద్దేశపూర్వకంగా నేను ఏదీ అనలేదు. మీ మనోభావాలు దెబ్బతినుంటే క్షమించండి. ఇక్కడితో ఆ విషయాన్ని వదిలేయండి అని అల్లు అరవింద్ కోరాడు.(చదవండి: వాలంటైన్స్ వీక్.. ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు రిలీజ్)ఇంతకీ ఏం జరిగిందంటే?అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించిన లేటెస్ట్ మూవీ తండేల్ (Thandel Movie). ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆయన చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఓ ఈవెంట్లో తన మేనల్లుడు రామ్‌చరణ్ తొలి సినిమా చిరుత సరిగ్గా ఆడలేదని, బిలో యావరేజ్ అని పేర్కొన్నాడు. అందుకే రెండో సినిమాతో హిట్ ఇవ్వాలని మగధీర తీశానన్నాడు. ఈ మూవీతో నష్టపోతానేమోనని భయపడ్డానని, కానీ అది బ్లాక్‌బస్టర్ సక్సెస్ అయిందన్నాడు. అలాగే దిల్ రాజును స్టేజీపైకి ఆహ్వానిస్తూ.. ఆయన వారం రోజుల్లోనే కష్టనష్టాలన్నీ చూశారన్నాడు. గేమ్ ఛేంజర్ వైఫల్యాన్ని అల్లు అరవింద్ తన మాటల్లో ఎత్తిచూపుతున్నాడని, చరణ్‌ను కించపరుస్తున్నాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అల్లు అరవింద్‌పై ట్రోలింగ్అలాగే చిరుత యావరేజ్ కంటే కూడా తక్కువే ఆడిందన్న మాటను మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఈ సినిమా సక్సెస్ అయితే ఫ్లాప్ అంటాడేంటని మండిపడ్డారు. దీంతో అరవింద్‌పై విరుచుకుపడుతూ ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్ గురించి తండేల్ ప్రెస్మీట్లో అల్లు అరవింద్‌కు ప్రశ్న ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ.. ట్రోలింగ్ తన దృష్టికి వచ్చిందని, గమనిస్తున్నానన్నాడు. కానీ దీనిపై కామెంట్ చేయనంటూ తెలివిగా సమాధానం దాటవేశాడు. దీంతో అల్లు అరవింద్ ఉద్దేశపూర్వకంగా రామ్‌చరణ్‌ను, చిరుత సినిమాను చులకన చేస్తూ మాట్లాడారని వివాదం ఊపందుకుంది. తాజాగా అరవింద్.. చరణ్ తన కొడుకులాంటివాడంటూ వివరణ ఇవ్వడంతో ఈ వివాదం సద్దుమణిగినట్లయింది.చదవండి: పెళ్లయి 21 ఏళ్లు.. తల్లి కావాలనుంది.. పద్మప్రియ -
క్రికెట్ స్టేడియంలో సందడి చేసిన హీరో రామ్ చరణ్ (ఫొటోలు)
-
క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. సండే స్పెషల్ అంటూ పోస్ట్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గ్రౌండ్లో అడుగుపెట్టారు. తన క్రికెట్ టీమ్‌తో కలిసి మైదానంలో సందడి చేశారు. మహారాష్ట్రలోని థానేలో ఉన్న దడోజి కొండేవ్ స్డేడియంలో ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో కరచాలనం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఐఎస్‌టీఎల్ టీ10 లీగ్ జరుగుతోంది. ఈ లీగ్‌లో తన టీమ్ ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ బరిలో నిలిచింది. తాజాగా తన టీమ్‌కు మద్దతు తెలిపిందుకు మన స్టార్ హీరో గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చారు.(ఇది చదవండి: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు లవర్స్ డే కానుక.. రొమాంటిక్ చిత్రం రీ రిలీజ్)ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఆర్సీ16 పేరుతో మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్ మూవీతో సినీ ప్రియులను అలరించాడు చెర్రీ. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది. Sunday special at Dadoji Konddev Stadium! 🏟️ Cheering for my team Falcon Risers Hyderabad! 🙌Watch @ispl_t10 live on @DisneyPlusHS & @StarSportsIndia #ISPLT10 #Street2Stadium #NewT10Era #Season2 #DikhaApnaGame #ISPLonJioStar pic.twitter.com/TYuAYjPMBy— Ram Charan (@AlwaysRamCharan) February 9, 2025 -
రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు లవర్స్ డే కానుక.. రొమాంటిక్ చిత్రం రీ రిలీజ్
రామ్ చరణ్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా గ్లోబల్ స్టార్ అభిమానులను రొమాంటిక్ ఎంటర్టైనర్ అలరించనుంది. రామ్ చరణ్- జెనీలియా జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ఆరెంజ్ ఈ నెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆరెంజ్ సినిమా (Orange Movie) రీ రిలీజ్ కానుంది. ఆరెంజ్ సినిమా (Orange Movie) వచ్చి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ ఫిబ్రవరి 14న థియేటర్లలో సినీ ప్రియులను అలరించనుంది. ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా.. హరీశ్ జయరాజ్ సంగీతం అందించాడు.ఈ చిత్రంలో షాజాన్ పదమ్సీ, ప్రభు, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, నాగ బాబు కీలక పాత్రల్లో నటించారు.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఆర్సీ16 పేరుతో మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్ మూవీతో సినీ ప్రియులను అలరించాడు చెర్రీ. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది. -
స్నేహితులతో కలిసి మహాకుంభ మేళాకు ఉపాసన.. పోస్ట్ వైరల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్ మేళాకు వెళ్లారు. తన సోదరి, మరికొందరు స్నేహితులతో కలిసి కుంభమేళాకు వెళ్తున్న ఫోటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం ఆరు గంటలకే ప్రయాగ్ రాజ్ విమానాశ్రయం చేరుకున్నట్లు పోస్ట్‌లో తెలిపింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కొద్ది రోజులు పలువురు సినీ ప్రముఖులు సైతం గంగానదిలో పవిత్రస్నానాలు ఆచరించారు. మూడు లడ్డూలతో కలిసి కుంభ్ మేళాను వెళ్తున్నానంటూ తన ఫ్రెండ్స్‌ను ఉద్దేశించి ఫన్నీగా రాసుకొచ్చింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ16తో బిజీగా ఉన్నారు. ఇటీవల షూటింగ్ సెట్లోని ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నందున రామ్ చరణ్ యాత్రకు వెళ్లలేదు. ఈ ఏడాది సంక్రాంతికి గేమ్ ఛేంజర్ మూవీతో అభిమానులను పలకరించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయింది.యూపీలో జరుగుతున్న కుంభ మేళాకు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. రానా దగ్గుబాటి భార్య మిహీకా బజాజ్ తన తల్లితో కలిసి ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సైతం తన తల్లి మాధవితో కలిసి మహాకుంభ్ మేళాకు హాజరయ్యారు. కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి ఇటీవలే కుంభ్ మేళాలో కనిపించారు. -
'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఎలా తీశారో తెలుసా..?
ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్(Ram charan) ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని రాజమౌళి(Raja mouli) తెరకెక్కించారు. పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయతే, ఇందులో రామ్‌చరణ్ ఎంట్రీ సీన్‌ను ఎలా క్రియేట్ చేశారో ఒక వీడియో ద్వారా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ సన్నివేశం అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుంది. సుమారు 10 నిమిషాల పాటు ఎంతో ఉత్కంఠభరితంగా ఈ సీన్ కొనసాగుతుంది.తారక్ ఎంట్రీ సీన్‌కు ఎంత పాపులారిటీ వచ్చిందో రామ్ చరణ్ ఎంట్రీ కూడా అంతే బజ్‌ను క్రియేట్ చేస్తుంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతారు. సుమారు 900 మంది ఓ పోలీస్‌స్టేషన్ ఎదుట నినాదాలు చేస్తూ ఉంటారు. అయితే, వారిని కట్టడి చేసేందుకు ఎవరూ సాహసించరు. కానీ, పోలీస్ అధికారి అయిన రామ్‌చరణ్ రంగంలోకి దిగి అక్కడి పరిస్థితిని కంట్రోల్ చేస్తారు. రామరాజుగా చరణ్ చూపిన తెగువకు బ్రిటిష్ అధికారులే ఆశ్చర్యపోతారు. ఈ ఒక్క సీన్ క్రియేట్ చేసేందుకు 32 రోజులు పడినట్లు మేకర్స్ చెప్పారు. అలాంటి సీన్‌ను ఎలా క్రియేట్ చేశారో మీరు చూసేయండి. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఎలా తెరకెక్కించారో పూర్తిగా తెలుసుకోవాలంటే.. 'ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్' అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. -
గెట్... సెట్... గో
స్పోర్ట్స్ మూవీస్‌కి ఆడియన్స్‌లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ తరహా సినిమాలు ఏమాత్రం ఆడియన్స్‌కి కనెక్ట్ అయినా బాక్సాఫీస్ స్కోర్స్ (కలెక్షన్స్) కొత్త రికార్డులు సృష్టిస్తాయి. దీంతో వీలైనప్పుడల్లా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ చేస్తుంటారు యాక్టర్స్. ఇలా ప్రస్తుతం సెట్స్‌లో ‘గెట్..సెట్..గో’ అంటూ సిల్వర్ స్క్రీన్ కోసం స్పోర్ట్స్ ఆడుతున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం.పెద్ది... ప్లే స్టార్ట్‘రచ్చ, ఆరెంజ్’... ఇలా కొన్ని సినిమాల్లో రామ్‌చరణ్ క్రికెట్ ఆడిన సన్నివేశాలు చాలా తక్కువ నిడివిలో కనిపిస్తాయి. కానీ ‘పెద్ది’ సినిమాలో మాత్రం ఫుల్ మ్యాచ్ ఆడనున్నారట రామ్‌చరణ్. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్‌చరణ్ క్రికెటర్‌గా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. చివరి రోజు తన కుమార్తె క్లీంకారని సెట్స్‌కి తీసుకొచ్చారు రామ్‌చరణ్.అలాగే ఈ సినిమాలో క్రికెట్‌తోపాటు కబడ్డీ వంటి ఇతర స్పోర్ట్స్ల ప్రస్తావన కూడా ఉంటుందట. జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో దివ్యేందు, జగపతిబాబు, శివరాజ్‌కుమార్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్స్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీని ఈ దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.ఒక మ్యాచ్.... మూడు జీవితాలు!మాధవన్ , నయనతార, సిద్ధార్థ్ లీడ్ రోల్స్‌లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘టెస్ట్’. ఈ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్‌కి శశికాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో క్రికెటర్‌గా నటించారు సిద్ధార్థ్. చక్రవర్తి రామచంద్రన్, శశి కాంత్ నిర్మించిన ఈ మూవీ త్వరలోనే డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుందని కోలీవుడ్ సమాచారం. ఇక 2006లో వచ్చిన హిందీ చిత్రం ‘రంగ్ దే బసంతి’ తర్వాత మళ్లీ 18 సంవత్సరాల అనంతరం మాధవన్ , సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ఇదే.జల్లికట్టు నేపథ్యంలో...తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు. ఈ క్రీడ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. కాగా సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడి వాసల్’ అనే పీరియాడికల్ యాక్షన్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నాలుగు సంవత్సరాల క్రితమే ప్రకటించారు. కానీ వివిధ కారణాల వల్ల సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో ఈ ఏడాది ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని సూర్య, వెట్రిమారన్ ప్లాన్ చేశారు. జనవరిలో సూర్య, వెట్రిమారన్, ఈ చిత్రనిర్మాత కలైపులి .ఎస్ థానుల మధ్య ‘వాడి వాసల్’ గురించిన చర్చలు కూడా జరిగాయి. ఇక ఎప్పట్నుంచో ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ‘వాడి వాసల్’ రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది.మరోసారి బాక్సింగ్ధనుష్ మెయిన్ లీడ్ రోల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’. ఈ మూవీలో అరుణ్ విజయ్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ ఓ బాక్సర్ రోల్ చేస్తున్నారు. కాగా అరుణ్ విజయ్ బాక్సర్‌గా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాక్సర్’ అనే మూవీలో అరుణ్ విజయ్ బాక్సర్‌గా నటించారు. అయితే ‘బాక్సర్’ కంప్లీట్ స్పోర్ట్స్ ఫిల్మ్ కాగా, ‘ఇడ్లీ కడై’ మాత్రం స్పోర్ట్స్‌తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్న మూవీ. ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కా నుంది. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో షాలినీపాండే, సత్యరాజ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.కె–ర్యాంప్‘క’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘కె–ర్యాంప్’. ఈ చిత్రం టైటిల్ లోగోలో ఓ వ్యక్తి ఫుట్‌బాల్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది స్పోర్ట్స్ డ్రామా మూవీ అని ఊహించవచ్చు. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. యుక్తీ తరేజా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వీకే నరేశ్, ‘వెన్నెల’ కిశోర్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.రేస్ రాజాహీరో శర్వానంద్ బైక్ రేసింగ్‌తో బిజీగా ఉన్నారు. శర్వా నంద్ హీరోగా అభిలాష్ కంకర్ డైరెక్షన్లో ‘రేజ్ రాజా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో మోటారు బైకు రేసర్‌గా శర్వానంద్ నటిస్తున్నారు. 1990 నుంచి 2000ల మధ్య కాలంలో జరిగే ఈ స్పోర్ట్స్ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... స్పోర్ట్స్ డ్రామా జానర్లో సినిమాలు చేసిన అనుభవం శర్వానంద్‌కు ఉంది. ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు (2015)’ మూవీలో రన్నింగ్ రేసర్‌గా, ‘పడి పడి లేచే మనసు (2018)’ మూవీలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా శర్వానంద్ నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే.బాక్సింగ్ రౌండ్ 2హీరో ఆర్య, దర్శకుడుపా. రంజిత్ కాంబినేషన్లో వచ్చిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘సార్పట్టై పరంబర’. ఈ మూవీ 2021లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా 2023 మార్చిలో ‘సార్పట్టై పరంబర రౌండ్ 2’ అంటూ సీక్వెల్‌ను ప్రకటించారు. అయితే తొలి భాగం మాదిరి, రెండో భాగాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకుండా థియేటర్స్‌లో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు మేకర్స్. కబడ్డీ... కబడ్డీ..ధృవ్ విక్రమ్ హీరోగా చేస్తున్న మూవీ ‘బైసన్: కాలమాడన్’. మారి సెల్వరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ధృవ్ విక్రమ్ కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అలాగే కబడ్డీ ప్లేయర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి, రాజకీయ నాయకుడిగా మారిన మనత్తి పి. గణేశన్ జీవితం ఆధారంగా ‘బైసన్’ మూవీ రూపొందుతోంని కోలీవుడ్ సమాచారం. అ΄్లాజ్ ఎంటర్టైన్మెంట్, నీలంప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.- ముసిమి శివాంజనేయులు -
షూటింగ్లో బిజీగా రామ్ చరణ్.. సెట్లో క్లీంకార సందడి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ16తో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో చెర్రీ నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన ముద్దుల కూతురు క్లీంకారను ఎత్తుకుని ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.ఈ పోస్ట్ చూసిన ఉపాసన కామెంట్ చేసింది. ఫోమో అంటూ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది. మెగా హీరో వరుణ్ తేజ్ సైతం లవ్ సింబల్ పోస్ట్ చేశాడు. కాగా.. ఈ మూవీ షూటింగ్ తొలి షెడ్యూల్ కర్ణాటకలోని మైసూర్లో జరుగుతోంది. ఇక్కడ రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా తొలిసారిగా రామ్ చరణ్‌తో మూవీని తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
సందీప్ వంగాతో చెర్రీ మూవీ అప్పుడే..! ధూమ్ 4 లో రామ్ చరణ్..!
-
'సాయి పల్లవి'పై నమ్మకం, 'రామ్ చరణ్'పై ప్రేమ.. అల్లు అరవింద్ వ్యాఖ్యలు
నాగచైతన్య- సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన ‘తండేల్’ సినిమా ప్రమోషన్స్ చాలా స్సీడ్గానే జరుగుతున్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ‘లవ్ స్టోరీ’ (2021) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జోడీగా నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చందు మొండేటి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తండేల్ కోసం సాయి పల్లవిని ఎందుకు తీసుకున్నారో చెప్పారు.అమ్మాయిలకు వైట్ స్కిన్ ఉంటే సరిపోదు..వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందిన చిత్రం ‘తండేల్’ అని అల్లు అరవింద్ అన్నారు. లవ్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి యాక్షన్ కూడా ఇందులో ఉంటుంది. తండేల్ రాజు పాత్రలో నాగచైతన్య అద్భుతమైన నటన చూస్తారని ఆయన అన్నారు. ఇదే సమయంలో సాయి పల్లవి గురించి ఆయన ఇలా అన్నారు. 'తండేల్‌లో సాయి పల్లవి ఎంపిక నాదే.. కమర్షియల్‌గా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. బుజ్జితల్లి పాత్ర కోసం ముంబైకి వెళ్లి హీరోయిన్ను తీసుకురాలేదు. అక్కడి నుంచి వచ్చిన అమ్మాయిల స్కిన్ వైట్‌గా ఉండొచ్చు కానీ, ఈ పాత్రకు జీవం తీసుకురాలేరనేది నా అభిప్రాయం. కథలో ఈ పాత్ర చుట్టూ చాలా భావోద్వేగాలు ఉంటాయి. సినిమా చూశాక సాయి పల్లవి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ పాత్ర సాయి పల్లవి అయితే చాలా నిజాయతీగా నటించగలదని అనుకున్నాను. అందరి అంచనాలకు మించి ఆమె వంద శాతం సినిమాకు న్యాయం చేసింది. ఆమెలోని టాలెంట్ అనంతం.' అని చెప్పవచ్చన్నారు.అదీ.. నా అల్లుడిపై ప్రేమరామ్ చరణ్‌తో పాటు గీతా ఆర్ట్స్‌కు మగధీర సినిమా చాలా ప్రత్యేకం. ఈ సినిమాను చరణ్‌తో చేయాలని రాజమౌళినే ఎందుకు కలిశారని అల్లు అరవింద్‌ను బాలీవుడ్ మీడియా ప్రశ్నించింది. నా అల్లుడు (రామ్ చరణ్) మొదటి సినిమా చిరుత యావరేజ్‌గా రన్ అయింది. అలాంటి సమయంలో అతని తర్వాతి సినిమా చేసే ఛాన్స్ నాదే. చరణ్‌కు మంచి హిట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే మంచి దర్శకుడిని సంప్రదించాలని ముందే అనుకున్నాను. చరణ్ సినిమా కోసం ఎంత ఖర్చు అయినా పెట్టేందుకు రెడీగా ఉన్నాను. అలాంటి సమయంలో రాజమౌళిని సంప్రదించాను. అలా మగధీర రావడానికి కారణం అయింది. అలా నా అల్లుడికి పెద్ద హిట్ ఇచ్చాను. అది తనపై నాకున్న ప్రేమ' అంటూ అరవింద్ పేర్కొన్నారు.గతంలో కూడా మగధీర గురించి అల్లు అరవింద్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కోసం అనుకున్నదానికంటే 80 శాతం ఖర్చు అధికమైందని ఆయన అన్నారు. మగధీర కోసం తన దగ్గర ఉన్న మొత్తం డబ్బులను పెట్టానని ఆయన అన్నారు. అయితే, ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్స్‌తో సంబంధం లేకుండా ఆయనే సొంతంగా విడుదల చేశారు. మూవీ విడుదలయ్యాక దానికి మూడింతలు వచ్చిందని ఆయనే అన్నారు. ఒక్కోసారి రిస్క్ చేసి పొగొట్టుకున్న సందర్భాలూ కూడా ఉన్నాయని తెలిపారు. -
ఇండియాలో రిచ్ స్టార్ మన టాలీవుడ్ హీరోనే. .ఏ హీరో ఆస్తి ఎంతంటే..?
ఒకప్పుడు నార్త్ ఇండియా స్టార్స్ అన్ని విధాలుగా మన టాలీవుడ్ తారల కన్నా ముందుండేవారు. వ్యక్తిగత సంపదలో సైతం అక్కడి అగ్రగామి నటులదే పైచేయిగా ఉండేది. ఇటీవలి కాలంలో ఉత్తరాది చిత్రాల రికార్డ్స్‌ను మన టాలీవుడ్ తుడిచిపెడుతున్నట్టే... సంపద విషయంలోనూ వారిని మనవాళ్లు తోసిరాజంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించింది మనీ కంట్రోల్ అనే ఆర్ధిక వ్యవహారాల సంస్థ. ఈ సంస్థ చెబుతున్న ప్రకారం చూస్తే... దక్షిణాదికి చెందిన అత్యంత సంపన్న తార వాస్తవానికి బాలీవుడ్లో చాలా మంది కంటే సంపన్నుడుగా ఉన్నారు. ఆయన ఎవరో కాదు మన టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యంత సంపన్నుడు అని మనీకంట్రోల్ తేల్చి చెప్పింది. సంస్థ విశ్లేషణ ప్రకారం, నాగార్జున నికర ఆస్తుల విలువ 410 మిలియన్లు (రూ.3572 కోట్లకు పైగా) కలిగి ఉన్నారు, తద్వారా దేశంలోనే అత్యంత రిచ్ స్టార్స్‌లో ఒకరుగా నిలిచారు. మన నాగ్ కన్నా ముందున్నది కేవలం షారుఖ్ ఖాన్, జుహీ చావ్లాలు మాత్రమే. అమితాబ్ బచ్చన్ (రూ.3200 కోట్లు), హృతిక్ రోషన్ (రూ3100 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ.2900 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ.2700 కోట్లు) అమీర్ ఖాన్ (రూ1900 కోట్లు) వంటి ఎ–లిస్ట్ బాలీవుడ్ తారల కంటే నాగార్జున ముందున్నారు.నాలుగు దక్షిణాది పరిశ్రమలకు చెందిన నటులలో, నాగార్జున సమకాలీనుడైన చిరంజీవి సైతం నాగ్ తర్వాతి స్థానంలో ఉన్నారు, ఆయన నికర ఆస్తుల విలువ రూ1650 కోట్లు. ఇతర అత్యంత ధనవంతులైన దక్షిణాది తారల్లో రామ్ చరణ్ (రూ1370 కోట్లు), కమల్ హాసన్ (రూ600 కోట్లు), రజనీకాంత్ (రూ500 కోట్లు), జూనియర్ ఎన్టీఆర్ (రూ500 కోట్లు), ప్రభాస్ (రూ250 కోట్లు)...గా ఉన్నారు. నిస్సందేహంగా నాగార్జున తెలుగు సినిమాలలో అత్యంత విజయవంతమైన నటులలో ఒకరు. కానీ, ఆయన సమకాలికులైన చిరంజీవి కన్నా అలాగే నేటి బిగ్ స్టార్స్ అయిన ప్రభాస్ రామ్ చరణ్ కన్నా కూడా ఎలా సూపర్‌రిచ్ అయ్యారు? అంటే వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు స్మార్ట్ వ్యాపార పెట్టుబడుల ద్వారా నాగ్ టాప్ ప్లేస్‌ను సాధించారని సదరు మనీ కంట్రోల్ వెల్లడించింది.నాగార్జున కేవలం సినిమాల నుంచే కాకుండా రియల్ ఎస్టేట్, సినిమా స్పోర్ట్స్ ఫ్రాంచైజీలతో సహా ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా తన దైన మార్క్‌ని చూపారు. టాలీవుడ్‌లోని అతిపెద్ద నిర్మాణ సంస్థలు స్టూడియోలలో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున సొంతం. ఆయన రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థ అయిన ఎన్3 రియల్టీ ఎంటర్‌ప్రైజెస్‌ను కూడా కలిగి ఉన్నారు. దైనిక్ భాస్కర్ ప్రకారం, నాగార్జునకు చెందిన అన్ని రియల్ ఎస్టేట్ వాల్యూ ప్రకారం దాదాపు రూ.900 కోట్లు. అలాగే నాగార్జునకు మూడు స్పోర్ట్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి, ప్రైవేట్ జెట్ అర డజనుకు పైగా లగ్జరీ కార్లు నాగ్ స్వంతం. అయితే ఇవన్నీ పలు సంస్థలు లెక్కగట్టిన విలువలే తప్ప వీటికి ఎటువంటి అధికారిక థృవీకరణ లేదనే విషయం ఇక్కడ గమనార్హం. -
ఓటీటీలో 'గేమ్ ఛేంజర్'.. అనుకున్న దానికంటే ముందే స్ట్రీమింగ్
రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. అయితే, సినిమా విడుదల రోజు నుంచే నెగటివ్ టాక్ రావడంతో భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. కలెక్షన్ల పోస్టర్ విషయంలోనూ తప్పుడు లెక్కలు వేశారంటూ పెద్ద ఎత్తున నెట్టింట ట్రోల్ జరిగిన విషయం తెలిసిందే.సినిమా విడుదలైన నెల రోజుల్లోనే గేమ్ ఛేంజర్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 7న ఈ మూవీ విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. వాస్తవంగా ఈ చిత్రం విడుదలైన 30 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని డీల్ ఉంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్కు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, అనుకున్న సమయం కంటే ముందే గేమ్ ఛేంజర్ చిత్రాన్ని అమెజాన్ విడుదల చేస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే, హిందీ వర్షన్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.కథేంటంటే..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి(ఎస్జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్ అయిన రామ్ నందన్(రామ్ చరణ్).. విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు.ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్ చరణ్) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్ రామ్‌కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్ అధికారిగా తనకున్న పవర్స్‌ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్ల పోస్టర్‌పై దిల్ రాజు కామెంట్స్
రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే రూ. 186 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే, అదంతా ఫేక్ కలెక్షన్స్ అంటూ నిర్మాత దిల్ రాజుపై నెటిజన్లు కామెంట్ చేశారు. ఇదే సమయంలో గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే నాడు కేవలం రూ. 80 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టిందని పలు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ గురించి ఆయన రెస్పాండ్ అయ్యారు.‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ విజయం అందుకోవడంతో డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ పేరుతో మేకర్స్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ నిర్మాత దిల్ రాజుకు ఒక ప్రశ్న ఎదురైంది. సంక్రాంతి పండుగ సమయంలో మీరు రెండు సినిమాలు విడుదల చేస్తే.. ఒక సినిమాకు మొదటిరోజు కలెక్షన్ల వివరాలు మాత్రమే చెప్పి.. రెండో సినిమాకు చాలా పోస్టర్లతో ఆ వివరాలు చెప్పడం వెనుకున్న కారణం ఏంటి అని విలేఖరి ప్రశ్నించారు. అందుకు దిల్ రాజు కాస్త అసహనంగానే ఇలా చెప్పారు. 'ఈ విషయంలో మాకు కొన్ని బలహీనతలు ఉంటాయి. మీకు కూడా (మీడియా) తెలుసు కదా..! మళ్లీ నన్నెందుకు అడుగుతున్నారు. ప్రతి సినిమా కలెక్షన్ల వివరాలు మీ వద్దే ఉంటాయని అందరూ అంటున్నారు. ఇక నుంచి కలెక్షన్ల వివరాలు కూడా మీరే ప్రకటించండి.' అని అసహనంగా దిల్ రాజు అన్నారు. అయితే ఇదే సమయంలో ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా కలెక్షన్స్ పోస్టర్స్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. మేకర్స్ విడుదల చేస్తున్న కలెక్షన్ల పోస్టర్స్‌ను చూసి ప్రేక్షకులు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.pic.twitter.com/NVwAIJW0HG— Out of Commentary (@OutofContestTel) February 1, 2025 -
‘గాంధీ తాత చెట్టు'పై రామ్ చరణ్, ఉపాసన ప్రశంసలు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'(Gandhi Tatha Chettu). పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదల చేశారు మేకర్స్. కాగా ఈ చిత్రం విడుదలై మంచి ప్రశంసలు దక్కించుకుంటుంది. సినిమా అందరి హృదయాలకు హత్తకుంటుంది. మంచి సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించిన సుకృతి వేణి నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. 13 ఏళ్ల అమ్మాయిగా గాంధీ పాత్రలో ఆమె సహజ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీమ్‌ను గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ఆయన సతీమణి ఉపాసనలు ఈ చిత్రం టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సుకృతికి ఆమె నటనకు వస్తున్న రెస్పాన్స్ పట్ల రామ్‌చరణ్(Ram Charan), ఉపాసనలు అభినందనలు తెలియజేశారు. గాంధీ తాత చెట్టు టీమ్‌తో కాసేపు ముచ్చటించారు. రామ్‌చరణ్, ఉపాసనలను కలిసిన వారిలో చిత్ర సమర్పకురాలు శ్రీమతి తబితా సుకుమార్, దర్శకురాలు పద్మ, నిర్మాత సింధు, రాగ్‌మయూర్, భాను ప్రకాష్, నేహాల్ తదితరులు ఉన్నారు.గాంధీ తాత చెట్టు కథేంటి?ఆలూరు గ్రామానికి చెందిన రామచంద్రయ్యకు 15 ఎకరాల పంట భూమి ఉంటుంది. తన తండ్రి నుంచి ఆస్తిగా వచ్చిన ఆ భూమితో పాటు అక్కడే ఉన్న ఓ పెద్ద వేప చెట్టు అంటే అతనికి ప్రాణం.అతని మనవరాలు గాంధీ(సుకృతి వేణి)కి తాత రామచంద్రయ్య అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తాత చెప్పే గాంధీ కథలు విని..ఆయన మార్గంలోనే నడుస్తుంది. స్థానిక మంత్రి చేసిన కుట్ర కారణంగా ఊర్లో ఉన్న చెరకు ఫ్యాక్టరీ మూత పడుతుంది. దీంతో చెరుకు పంట వేసిన రైతులంతా అప్పులపాలవుతారు.అదే సమయంలో ఆ ఊర్లో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించి ఉపాది కల్పిస్తానంటూ వ్యాపారవేత్త సతీష్(రాగ్ మయూర్) రైతులను మభ్యపెడతాడు. ఎక్కువ డబ్బులు వస్తున్నాయనే ఆశతో పంట పండే పొలాలన్ని సతీష్‌కి అమ్మేస్తారు. రామచంద్రయ్య మాత్రం ఫ్యాక్టరీ నిర్మిస్తే తను ప్రాణంగా పెంచుకుంటున్న చెట్టును తొలగిస్తారనే ఉద్దేశంలో స్థలాన్ని అమ్మేందుకు నిరాకరిస్తాడు. అతని కొడుకు మాత్రం స్థలం అమ్మేద్దామంటూ తండ్రితో గొడవపడతాడు. చెట్టుని నరికేస్తారేమోననే దిగులుతో రామచంద్రయ్య చనిపోతాడు. తాత ఇష్టపడిన చెట్టుని ఎలాగైనా రక్షించుకోవాలనుకుంటుంది గాంధీ. దాని కోసం గాంధీ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? గాంధీ మార్గంలోనే వెళ్లి ఊరిని, చెట్టును ఎలా కాపాడింది? అనేదే మిగతా కథ. -
RC16 కి రెహమాన్ బ్రేక్.. ఎలాంటి ఇబ్బంది లేదు
-
#RC16 కి టైటిల్ ఫిక్స్
-
పెద్ది షూటింగ్ షురూ
రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) రూపొందుతున్న సంగతి తెలిసిందే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెలాఖరున హైదరాబాద్‌లోప్రారంభం కానుందని తెలిసింది. హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్లో రామ్‌చరణ్‌తో పాటు ఈ సినిమా ప్రధాన తారాగణం పాల్గొననుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారట.అంతేకాదు... ఈ సినిమాలో ఒకే ఒక్క క్రీడ కాకుండా రెండు మూడు రకాల క్రీడలకు సంబంధించిన ప్రస్తావన ఉంటుందట. ఈ చిత్రంలో రామ్‌చరణ్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. ‘తంగలాన్’ సినిమాకు వర్క్ చేసిన కాస్ట్యూమ్ డిజైనర్ ఏకాంబరంను ఈ సినిమాలో భాగం చేశారు. దీంతో రామ్‌చరణ్ లుక్స్ కొత్తగా ఉండనున్నాయని తెలుస్తోంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుందని తెలిసింది. -
టాలీవుడ్ ను షేక్ చేస్తోన్న రూమర్స్.. మళ్ళీ దిల్ రాజు తో రామ్ చరణ్ సినిమా..
-
దిల్ రాజు కోసం చరణ్ కీలక నిర్ణయం
'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలబడింది. దీంతో దిల్ రాజు (Dil Raju) కోసం చరణ్(Ram charan) ఒక కీలకనిర్ణయం తీసుకున్నారట. కొత్త ఏడాదిలో సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ విన్నర్‌గా వెంకటేశ్ (సంక్రాంతికి వస్తున్నాం) చిత్రం నిలిచింది. సినిమా విడుదలైన రెండో రోజే సుమారు 250కి పైగా స్క్రీన్స్‌ను పెంచారు. తర్వాత బాలకృష్ణ (డాకు మహారాజ్) కూడా మంచి కలెక్షన్సే అందుకుంది. ఇప్పుడు ఎటొచ్చి కూడా రామ్ చరణ్- దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన గేమ్ ఛేంజర్‌కు కష్టాలు తప్పలేదు. ఫైనల్‌గా నిర్మాతకు ఎన్ని కోట్లు నష్టం అనేది తేలాల్సి ఉంది. సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి అనుకున్నంత రిటర్న్ వచ్చేలా లేదని తేలిపోయింది.సుమారు పదేళ్ల క్రితం దిల్ రాజు బ్యానర్లో ఎవడు సినిమాలో రామ్ చరణ్ నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా అనుకున్నంత సమయంలో పూర్తి కాలేదు. కానీ, సినిమా మాత్రం బాక్సాఫీస్ మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కూడా పూర్తి అయ్యేసరికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. దీంతో బడ్జెట్ భారీగా పెరిగింది. అయినప్పటికీ ఖర్చు పెట్టే విషయంలో దిల్ రాజు ఎక్కడా కూడా తగ్గలేదు. సినిమాపై ఆయన పూర్తి నమ్మకంతోనే కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. కానీ గేమ్ ఛేంజర్ రిజల్ట్ మరోలా అయింది. ఈ మూవీతో దిల్ రాజు ఏ మేరకు నష్టాలు భరించబోతున్నారనేది ఇంకా తేలాల్సి ఉంది. (ఇదీ చదవండి: జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరో సినిమాకు నో చెప్పిన సాయిపల్లవి)ఈ సినిమాతో పాటు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కూడా ఆయన నిర్మించారు కాబట్టి కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు. అయితే, రామ్ చరణ్ కూడా దిల్ రాజుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ప్లాన్‌లో ఉన్నారట. ఆయన బ్యానర్లోనే మరో సినిమా చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక మంచి కథతో గేమ్ ఛేంజర్ నష్టాన్ని పూరించాలని చరణ్ ఉన్నారట. కొద్దిరోజుల తర్వాత అధికారికంగా ప్రకటన కూడా రావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ చేతిలో రెండు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వీటిలో మొదట డైరెక్టర్ బుచ్చిబాబు సినిమా ఉంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమా లైన్లో ఉంది. ఈ చిత్రాల తర్వాత తప్పకుండా దిల్ రాజుతో మూవీ ఉంటుందని సమాచారం. -
రామ్ చరణ్ గొప్ప మనసు.. కష్టాల్లో ఉన్న అభిమానికి..
హీరో రామ్ చరణ్ (Ram Charan) గొప్ప మనసు చాటుకున్నాడు. కష్టాల్లో ఉన్న అభిమానికి నేనున్నానంటూ అభయహస్తమిచ్చాడు. చరణ్ అభిమానిగా ఎన్నోసార్లు రక్తదానం చేసిన ఓ వ్యక్తి భార్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్- ఉపాసన దంపతులు అతడికి అండగా నిలబడ్డారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో అతడి భార్యను చేర్పించారు. 17 రోజులపాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. రోజుకో స్పెషలిస్ట్ వచ్చి ఆమె ఆరోగ్యాన్ని పరీక్షించేవారు.అభిమాని భార్యకు వైద్యసాయంఇది చూసిన అభిమాని హాస్పిటల్ బిల్లు ఎంతవుతుందోనని కంగారుపడ్డాడు. కానీ చరణ్ దంపతులు రూపాయి ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ చేయిస్తున్నారని తెలిసి ఎంతగానో సంతోషించాడు. ఈ విషయాన్ని సదరు అభిమాని అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో వెల్లడించాడు. ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంతో పాటు చికిత్స అనంతరం అంబులెన్స్ ఏర్పాటు చేసి మరీ తన భార్యను ఇంటికి క్షేమంగా పంపించాడని చెప్పుకొచ్చాడు. అలాగే షోలో చరణ్.. అభిమానికి రూ.1 లక్ష ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో అందించాడు. ఇది చూసిన నెటిజన్లు చరణ్ మంచి మనసుకు ఫిదా అవుతున్నారు. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమవుతోంది.చదవండి: ఇంటి నుంచి మనోజ్‌ను బయటకు పంపాలంటూ మోహన్‌బాబు ఫిర్యాదు -
'గేమ్ ఛేంజర్' ప్రసారం చేసిన కేబుల్ ఆపరేటర్ ఆరెస్ట్
గేమ్ ఛేంజర్(Game Changer) చిత్రాన్ని తమ లోకల్ ఛానెల్లో (local channel) ప్రసారం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైంది. అయితే, ఈ చిత్రం థియేటర్స్‌లోకి వచ్చి వారం గడవక ముందే కొందరు పైరసీ కాపీని తమ లోకల్ ఛానల్స్‌లలో ప్రసారం చేశారు. ఈ ఘటన ఏపీలో జరిగింది. ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ ఆగ్రహం చెందడమే కాకుండా పోలీసులను ఆశ్రయించింది. దీంతో గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, తాజాగా ఆ ఛానల్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు.గేమ్ ఛేంజర్ విడుదలైన వెంటనే ఈ చిత్రం పైరసీ బారిన పడింది. నెట్టింట ఈ సినిమాకు సంబంధించిన లింకులు భారీగా షేర్ అయ్యాయి. అయితే, కేబుల్ నెట్‌వర్క్‌లో కూడా ఈ చిత్రం ప్రసారం అవతుందని కొందరు స్క్రీన్ షాట్స్ తీసి చిత్ర నిర్మాణ సంస్థకు ట్యాగ్ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. వేలమంది శ్రమ దాగి ఉన్న సినిమాను వారం రోజులు కాకముందే ప్రసారం చేయడంపై చాలామంది ప్రముఖులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. (ఇదీ చదవండి: మహానగరంలో బాలీవుడ్ ప్రముఖలపై జరిగిన దాడులు ఇవే)ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు వారి కష్టాన్ని దెబ్బతీయడమే కాదు.. చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ప్రమాదకరం కూడా. ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.కొందరు ఏకంగా చిత్ర నిర్మాణ సంస్థనే బెదిరించారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే గేమ్ ఛేంజర్ సినిమాని లీక్ చేస్తామంటూ హెచ్చరికలు చేశారు. వారిపై కూడా చిత్రబృందం సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. విడుదలకు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారని, సినిమా విడుదల కాగానే ఆన్లైన్లో లీక్ చేశారని మూవీ టీమ్ ఫిర్యాదులో పేర్కొంది.రామ్ చరణ్- శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. దిల్ రాజు నిర్మించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మొదటి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. గేమ్ ఛేంజర్ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే, ఈ కలెక్షన్లపై కూడా నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. కలెక్షన్ల వివరాలు తప్పుగా చెప్పారని పలువురు నెటిజన్లు విమర్శించారు. -
రామ్ చరణ్‌తో బుచ్చిబాబు సినిమా.. జగపతి బాబు లుక్ చూశారా?
గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన డైరెక్షన్లో చెర్రీ నటించనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి కాగా.. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు. షూట్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ షూట్‌కు సంబంధించిన వీడియోను ట్విటర్ షేర్ చేశారు.ఈ చిత్రంలో తన పాత్ర కోసం మేకోవర్ చేస్తున్న వీడియోను జగపతిబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'చాలాకాలం తర్వాత బుచ్చిబాబు ఆర్సీ 16 కోసం మంచి పని పెట్టాడు..గెటప్ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా అనిపించింది'అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్సీ16గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన దేవర భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.ఈ సినిమాను బుచ్చిబాబు స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతమందిస్తున్నారు.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Chaala Kaalam tharavaatha @BuchiBabuSana #RC16 ki manchi pani pettaadu.. get up choosina tharavaatha Naaku chaala thrupthi ga undhi. pic.twitter.com/aaiQ8HPErp— Jaggu Bhai (@IamJagguBhai) January 16, 2025 -
సంక్రాంతి ప్రత్యేకం
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగతో చిత్ర పరిశ్రమకు ప్రత్యేక అనుబంధం ఉంది. సంక్రాంతి సందర్భంగా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు స్టార్ హీరోలు సైతం పోటీపడుతుంటారు. ఈ సంక్రాంతికి రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సంక్రాంతి పండుగని పురస్కరించుకుని తమ సినిమాల నుంచి ప్రత్యేక పోస్టర్స్, లుక్స్‌ని విడుదల చేశారు పలువురు మేకర్స్. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం... రాజా సాబ్ ఆగయాప్రభాస్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్లో రూపొందుతోన్న ‘రాజా సాబ్’ నుంచి ప్రభాస్ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పండుగ కళ కనిపిస్తున్న ఈ పోస్టర్లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది. షూటింగ్ తుదిదశలో ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.అందమైన లైలాహీరో విశ్వక్ సేన్ లైలాగా మారారు. ఆయన అబ్బాయిగా, అమ్మాయిగా నటించిన చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆకాంక్షా శర్మ హీరోయిన్. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీలో తొలిసారి లైలా అనే అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు విశ్వక్ సేన్. ఈ సినిమా నుంచి లైలాగా విశ్వక్ సేన్ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. జాస్మిన్ వచ్చేశారు‘బబుల్ గమ్’ మూవీ ఫేమ్ రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. ‘కలర్ ఫోటో’ మూవీతో జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ , టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా సాక్షి సాగర్ మదోల్కర్ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఆమె జాస్మిన్ పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొని, పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. సంతానప్రాప్తిరస్తువిక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సంతానప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా నుంచి విక్రాంత్, చాందినిల స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేసింది యూనిట్. ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. -
టీవీల్లో 'గేమ్ ఛేంజర్' ప్రత్యక్షం.. మండిపడ్డ టాలీవుడ్ నిర్మాత
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన చిత్రం గేమ్ ఛేంజర్(Gam Changer Movie). శంకర్(sankar) డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం తొలి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద రూ.186 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.వెంటాడుతున్న పైరసీ..అయితే సినీ ఇండస్ట్రీని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నా వైరస్ పైరసీ. తాజాగా గేమ్ ఛేంజర్‌లో విషయంలోనూ పైరసీ ఇండస్ట్రీని షాకింగ్‌కు గురి చేస్తోంది. ఏకంగా లోకల్ ఛానెల్లో గేమ్ ఛేంజర్‌ను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేయడంతో పైరసీ అంశం మరోసారి టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్( శ్రీనివాస కుమార్) రియాక్ట్ అయ్యారు. వేలమంది శ్రమ దాగి ఉన్న సినిమాను వారం రోజులు కాకముందే ప్రసారం చేయడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎస్కేఎన్ తన ట్విట్లో రాస్తూ.. 'ఇది ఏమాత్రం సహించదగినది కాదు. సినిమా విడుదలై కేవలం 4-5 రోజులు మాత్రమే అయింది. వారం రోజులు కాకముందే సినిమాను స్థానిక కేబుల్ ఛానల్స్, బస్సులలో ప్రసారం చేయడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. సినిమా అనేది కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతల గురించి మాత్రమే కాదు. ఎంతోమంది మూడు, నాలుగు సంవత్సరాల కృషి, వారి అంకితభావం, వేలాది మంది శ్రమ దాగి ఉంది. ఈ సినిమా విజయంపై ఆధారపడిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఈ ప్రభావం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి చర్యలు వారి కష్టాన్ని దెబ్బతీయడమే కాదు.. చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ప్రమాదకరం కూడా. ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాను రక్షించడానికి.. సినీ ఇండస్ట్రీ మెరుగైన భవిష్యత్తు కోసం మనందరం ఐక్యంగా నిలబడి పోరాడుదాం.' అని పోస్ట్ చేశారు. అంతే కాకుండా 'సేవ్‌ది సినిమా' అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశారు.లీక్ చేస్తామంటూ బెదిరింపులు..తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే గేమ్ ఛేంజర్ సినిమాని లీక్ చేస్తామంటూ కొందరు బెదిరించారు. వారిపై చిత్రబృందం సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. విడుదలకు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారని.. సినిమా విడుదల కాగానే ఆన్లైన్లో లీక్ చేశారని మూవీ టీమ్ ఫిర్యాదులో పేర్కొంది.దీనిపై ఆధారాలు సేకరించిన చిత్ర బృందం.. 45 మందితో కూడిన ముఠాపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్‌పై నెగెటివ్ ప్రచారం చేస్తున్న కొన్ని ఖాతాల పైనా కూడా చిత్రబృందం ఫిర్యాదు చేసింది. This is unacceptable. A film that was released just 4-5 days ago being telecasted on local cable channels & Buses raises serious concerns. Cinema is not just about the Hero, director or producers – it’s the result of 3-4 years of hard work, dedication and the dreams of thousands… https://t.co/ukPHIpi6ko— SKN (Sreenivasa Kumar) (@SKNonline) January 15, 2025 -
క్లీంకారతో రామ్ చరణ్.. ఫ్యామిలీతో ఐకాన్ స్టార్ సంక్రాంతి సెలబ్రేషన్స్
ఈ ఏడాది సంక్రాంతి పండుగను సినీతారలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ హీరోలంతా తమ ఫ్యామిలీతో కలిసి పొంగల్ వేడుకలు చేసుకున్నారు. ఈ పండుగ వేళ రామ్ చరణ్ తన ముద్దుల కూతురు క్లీంకారతో దిగిన ఫోటోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.. హ్యాపీ సంక్రాంతి అంటూ షేర్ చేసింది.మరోవైపు అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సంక్రాతి సెలబ్రేషన్స్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. బన్నీతో కలిసి పిల్లలు అయాన్, అర్హతో పండుగ రోజు దిగిన ఫోటోలను షేర్ చేసింది. హ్యాపీ సంక్రాంతి-2025 అంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.సంక్రాంతి సినిమాల సందడి..గేమ్ ఛేంజర్‌కు మిక్స్డ్ టాక్..రామ్ చరణ్-శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంతో అభిమానులను ఆకట్టుకున్నారు.డాకు మహారాజ్‌కు పాజిటివ్ రెస్పాన్స్..నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్‌కు మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ యాక్షన్ సినిమా మాస్ ఆడియన్స్‌ను మెప్పించింది. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో బాలయ్య డైలాగ్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. తొలి రోజు రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది డాకు మహారాజ్. ఈ మూవీ ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు.ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం..అనిల్ రావిపూడి- వెంకటేశ్ కాంబోలో వచ్చిన మరో ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈనెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దిల్ నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
గతేడాది ఒకేచోట సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఈసారి మాత్రం!
ఇంటిల్లిపాదీ కలిసి చేసుకునే పండగ సంక్రాంతి. ఈ పండక్కి ఎవరెక్కడ, ఏ మూలన ఉన్నా సరే ఎలాగోలా వీలు చేసుకుని మరీ ఇంటికి చేరుకుంటారు. అమ్మ చేసే అరిసెలు, చెల్లి వేసే ముగ్గులు, హరిదాసు కీర్తనలు, స్నేహితులతో గాలిపటాలు ఎగరేయడాలు.. కోడిపందేలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కుటుంబ బంధాల్ని రెట్టింపు చేస్తూ ఏడాదికి సరిపడా జ్ఞాపకాల్ని పోగుచేసిస్తుంది సంక్రాంతి.గతేడాది కన్నులపండగ్గా..ఈ పండగను మెగా ఫ్యామిలీ (Mega Family) కూడా ఎప్పుడూ ఘనంగా జరుపుకుంటూ ఉంటుంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు అందరూ ఒక్కచోట చేరుతుంటారు. గతేడాదైతే మెగా కుటుంబమంతా కలిసి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు. బెంగళూరులోని ఫామ్ హోస్లో మెగా అల్లు ఫ్యామిలీ జాలీగా పండగను ఎంజాయ్ చేశారు. చిరంజీవి (Chiranjeevi Konidela), నాగబాబు కుటుంబంతో పాటు అల్లు అరవింద్ కుటుంబం కూడా అక్కడే ఉంది. అల్లు అర్జున్.. భార్య స్నేహ, పిల్లలు అర్హ, అయాన్‌తో కలిసి ఈ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యాడు.గతేడాది మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అల్లు కుటుంబంచదవండి: గేమ్ ఛేంజర్ మూవీకి నా మనసులో ప్రత్యేక స్థానం: రామ్ చరణ్ఈసారి ఎవరింట్లో వారే..కానీ ఈసారి మాత్రం ఎవరింట్లో వారే పండగ జరుపుకున్నట్లు తెలుస్తోంది. అటు చిరంజీవి తన ఇంట్లో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు. ఇటు అల్లు అర్జున్ (Allu Arjun) తన కుటుంబంతో పండగ జరుపుకున్నాడు. ట్రెడిషనల్ డ్రెస్‌లో ముస్తాబైన దిగిన ఫ్యామిలీ ఫోటోను అల్లు స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదంతా చూసిన అభిమానులు రెండు కుటుంబాలు కలిసి పండగ చేసుకుంటే ఎంత చూడముచ్చటగా ఉండేదోనని నిట్టూర్పు విడుస్తున్నారు.క్రిస్మస్ పార్టీకి చరణ్..గతంలో అల్లు అర్జున్ క్రిస్మస్ పార్టీ ఇస్తే దానికి రామ్‌చరణ్- ఉపాసన, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి, శ్రీజ, నిహారిక, వైష్ణవ్‌తేజ్ ఇలా అందరూ హాజరయ్యారు. అలా ఎవరింట్లో ఏ పార్టీ ఉన్నా రెండు కుటుంబాలు కలుసుకునేవి. ఇప్పుడేమో వీరి మధ్య పెద్ద అగాధమే ఏర్పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ దూరం ఇలాగే కొనసాగుతుందా? అని పలువురూ చర్చించుకుంటున్నారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ -
గేమ్ ఛేంజర్ మూవీకి నా మనసులో ప్రత్యేక స్థానం: రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన గేమ్ ఛేంజర్ సినిమా (Game Changer Movie)కు మిక్స్డ్ టాక్ వస్తోంది. అయినా సరే బంపర్ హిట్ అంటూ తొలి రోజే రూ.186 కోట్లు వచ్చాయని ప్రచారం చేశారు. ఓపక్క సినిమాపై ట్రోలింగ్ జరుగుతుంటే మరోపక్క కలెక్షన్లు భారీగా వస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రామ్ చరణ్ (Ram Charan) సోషల్ మీడియా వేదికగా గేమ్ ఛేంజర్ సినిమాపై స్పందించాడు.సినిమా సక్సెస్‌లో వారంతా భాగమయ్యారుతనకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శంకర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. అభిమానులకు, ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గేమ్ ఛేంజర్ సినిమా కోసం మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతున్నందుకు సంతోషంగా ఉంది. సినిమాలో పని చేసిన నటీనటులతో పాటు తెరవెనక పనిచేసిన అందరూ ఈ సినిమా విజయంలో భాగమయ్యారు.మంచి రివ్యూలు ఇస్తున్నందుకు థ్యాంక్స్మీ ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. గేమ్ ఛేంజర్ సినిమాకు మంచి రివ్యూలు ఇస్తున్న మీడియాకు స్పెషల్ థ్యాంక్స్. మా సినిమా మైల్ స్టోన్ అందుకోవడంలో మీ రివ్యూలు కీలక పాత్ర పోషించాయి. పాజిటివిటీతో ముందుకువెళ్దాం. మున్ముందు కూడా మీరు గర్వపడే పాత్రలు చేస్తానని మాటిస్తున్నాను. గేమ్ ఛేంజర్ సినిమాకు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని ఓ లేఖ షేర్ చేశాడు.గేమ్ ఛేంజర్ సినిమా విశేషాలుఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత శంకర్ తెరకెక్కించిన చిత్రం గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్గా నటించారు. తమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మించాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే థియేటర్లలో రిలీజైందో లేదో వెంటనే పైరసీరాయుళ్లు దాన్ని లీక్ చేసి ఆన్లైన్లో వదిలారు. దీని వెనుక సుమారు 45 మందితో కూడిన ఓ ముఠా ఉందని చిత్రయూనిట్ ఆరోపిస్తోంది. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామంటూ బెదిరించిన ముఠా చివరకు అన్నంత పనీ చేసిందట. దీంతో గేమ్ ఛేంజర్ యూనిట్ ఆ 45 మందిపై ఆధారాలతో సహా సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసింది.పాటల కోసమే అన్ని కోట్లు!గేమ్ ఛేంజర్ చిత్రాన్ని దాదాపు రూ.400-450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. సినిమాకు వస్తున్న మిక్స్డ్ టాక్ చూస్తుంటే మూవీ బ్రేక్ ఈవెన్ అవడం కష్టంగానే కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఇకపోతే శంకర్ రేంజ్‌కు తగ్గట్లుగా పాటల కోసం కూడా భారీగా ఖర్చు పెట్టారట. ఈ విషయాన్ని ఓ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజే స్వయంగా వెల్లడించాడు. కేవలం ఐదు పాటల కోసమే రూ.75 కోట్లు పెట్టినట్లు తెలిపాడు. రిహార్సల్స్ కలుపుకుంటే ఇంకా ఎక్కువే అవుతుందన్నాడు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) చదవండి: థియేటర్లలో రిలీజ్‌కు ముందే ఓటీటీ ఫిక్స్.. ఆ టాలీవుడ్ సినిమాలివే! -
'గేమ్ చేంజర్'టీమ్‌కి భారీ షాక్.. ఆన్లైన్లో పైరసీ ప్రింట్ !
సినిమా అనేది కోట్ల బిజినెస్. పెద్ద పెద్ద సినిమాలకు వందల కోట్లు ఖర్చు అవుతుంటాయి. అలాంటి సినిమాను పైరసీ చేసి ఆన్లైన్లో వదులుతున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఈ పైరసీని అడ్డుకునేందుకు చిత్ర పరిశ్రమ చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఆ కేటుగాళ్లను అడ్డుకోలేకపోతుంది. తాజాగా ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాకు కూడా పైరసీ బారిన పడింది. సినిమా రిలీజైన రోజే ఆన్లైన్లో పైరసీ ప్రింట్ లీక్ అయ్యింది. దీనిపై చిత్రబృందం సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసింది.మూడేళ్ల కష్టం.. నిమిషాల్లో లీక్కోట్లకు కోట్ల రూపాయల ఖర్చుచేసి గ్లోబల్ రేంజ్లో ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో మూడేళ్లకు పైగా కష్టపడి చేసిన సినిమా విడుదల రోజు నెట్టింట లీక్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్ నిర్మించిన 'గేమ్ చేంజర్ విడుదల రోజే ఆన్లైన్లో పైరసీ ప్రింట్ లీక్ అయ్యింది. దీని వెనుక సుమారు 45 మందితో కూడిన ఒక ముఠా ఉందని చిత్రబృందం ఆరోపిస్తుంది.డబ్బు కోసం బెదిరింపులు..'గేమ్ చేంజర్' విడుదల ముందు నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులు కొందరికి సోషల్ మీడియా, అలాగే వాట్సాప్‌లలో కొంత మంది నుంచి బెదింపులు వచ్చాయట. తాము అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని గొడవకు దిగారని . 'గేమ్ చేంజర్' విడుదలకు రెండు రోజుల ముందు సినిమాలో కీలక ట్విస్టులను సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. ఇక విడుదలైన తర్వాత హెచ్డీ ప్రింట్ లీక్ చేయడమే కాదు... టెలిగ్రామ్, సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరికీ షేర్ చేశారు.45 మందిపై ఫిర్యాదు'గేమ్ చేంజర్' చిత్ర బృందాన్ని బెదిరించిన, పైరసీ ప్రింట్ లీక్ చేసిన 45 మంది మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసింది టీం. ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి 'గేమ్ చేంజర్' మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేశారా? పైరసీ ప్రింట్ లీక్ చేశారా? లేదంటే వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ కేసును టేకప్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.సోషల్ మీడియా (ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్) పేజీలలో ఒక పథకం ప్రకారం 'గేమ్ చేంజర్' మీద పలువురు నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. సినిమా క్లిప్స్ షేర్ చేయడంతో పాటు కీలకమైన ట్విస్టులు రివీల్ అయ్యేలా చేసి ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేయకుండా చేశారు. సదరు పేజీల మీద కూడా కంప్లైంట్స్ నమోదు చేశారు. త్వరలో ఆ సోషల్ మీడియా పేజీల మీద కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలియచేశారు. -
గేమ్ ఛేంజర్‌కు ఊహించని కలెక్షన్స్ .. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన పొలిటికల్ యాక్షన్ మూవీ గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా ఈనెల 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.తొలి రోజు అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టిన గేమ్ ఛేంజర్.. రెండో రోజు కాస్తా తగ్గనట్లు తెలుస్తోంది. మొదటి రోజు రూ.51 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన రామ్ చరణ్ మూవీ.. రెండవ రోజు రూ. 21.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో రెండు రోజుల్లో కలిపి రూ. 72.5 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్ దూసుకెళ్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రం గేమ్ ఛేంజర్ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాకు తెలుద రాష్ట్రాల్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధిస్తోంది. రెండో రోజు రెండు రాష్ట్రాల్లో రూ. 12.7 కోట్లు, హిందీలో రూ. 7 కోట్లు, తమిళం రూ. 1.7 కోట్లు, కన్నడలో రూ. 10 లక్షలు వసూలు చేసింది. తొలి రోజు తెలుగులో థియేటర్లలో మొత్తం 31.19 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి. ఉదయం షోలకు 20.66 శాతం ఆక్యుపెన్సీతో నడవగా.. సాయంత్రం షోలలో 36.48 శాతానికి పెరిగింది. సంక్రాంతి పండుగ కావడంతో ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముంది.కాగా.. శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ చిత్రంలో అప్పన్న, రామ్ నందన్ పాత్రలతో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో అప్పన్న పాత్రలో అదరగొట్టారు. ఎవరైనా సరే చరణ్ నటనను మెచ్చుకుని తీరాల్సిందే అనేలా చక్కగా నటించారు. ఇప్పటికే అప్పన్న పాత్రకు సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. నిర్మాత దిల్ రాజుతో పాటు దర్శకుడు శంకర్, ఎస్.జె. సూర్య, కియారా అద్వానీ, అంజలికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆపై సాయి దుర్గాతేజ్, ఉపాసన కూడా చరణ్ నటనకు ఫిదా అయ్యారు.రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన తొలి చిత్రం కావడంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2019లో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ (VVR) చిత్రంతో సోలోగా బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగాడు. ఆ సినిమాలో కూడా హీరోయిన్ కియారా అద్వానీ కావడం విశేషం. కాగా... చిత్రంలో కోలీవుడ్ హీరోలు ఎస్జే సూర్య, జయరామ్ కీలకపాత్రలో కనిపించారు. వీరితో పాటు శ్రీకాంత్, సముద్రఖని, అంజలి, నాసర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ కూడా ప్రధాన పాత్రల్లో మెప్పించారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించగా.. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.పాటలకే రూ.75 కోట్లు..దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో కేవలం నాలుగు పాటలకే రూ.75 కోట్లు వెచ్చించినట్లు మేకర్స్ వెల్లడించారు. సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన ఈ సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయి వ్యూస్‌తో గేమ్ ఛేంజర్ సాంగ్స్ దూసుకెళ్తున్నాయి. -
Game Changer: అభిమానులతో రామ్‌చరణ్ సెలబ్రేషన్స్
రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘గేమ్ చేంజర్’ (Game Changer Movie) బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తూ దూసుకెళ్తోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజై భారీ విజయం దిశగా అడుగులేస్తోంది. తొలిరోజున ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. సంక్రాంతి పండుగ సీజన్ కావటంతో రెండో రోజున కూడా వసూళ్ల పరంగా ఇటు సౌత్‌లోనూ.. అటు నార్త్‌లోనూ అదే స్పీడుని గేమ్ చేంజర్ కొనసాగించే అవకాశం ఉంది.డ్యాన్సుల గురించి స్పెషల్‌గా చెప్పాలా!ప్రజా నాయకుడు అప్పన్నగా.. స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ ప్రజా సమస్యలపై పోరాడే కలెక్టర్ రామ్ నందన్గా రెండు పాత్రల్లో చరణ్ చూపించిన పెర్ఫామెన్స్ వేరియేషన్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అలాగే డ్యాన్సుల విషయంలో మెగా పవర్ జోష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కియారా అద్వానీ గ్లామర్ లుక్స్, అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, జయరాం, సునీల్ తదితరుల నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్‌పై ప్రతి సన్నివేశాన్ని ఎంతో గ్రాండియర్‌గా శంకర్ తెరకెక్కించిన తీరు, దిల్‌రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్ మేకింగ్ బాగుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.అభిమానులకు రామ్ చరణ్ కృతజ్ఞతలురామ్ చరణ్‌ను శంకర్ ఎలా ప్రెజంట్ చేస్తారోనని అందరూ ఎంతో ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురుచూశారు. అందరి అంచనాలను అందుకుంటూ గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ సునామీని క్రియేట్ చేస్తోంది. ఈ సక్సెస్‌ను చిత్ర యూనిట్ కంటే అభిమానులే ఘనంగా సెలబ్రేట్ చేసుకోవటం విశేషం. గేమ్ చేంజర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఫ్యాన్స్ రామ్ చరణ్ ఇంటికి చేరుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఫ్యాన్స్‌ను కలిసిన రామ్ చరణ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.చదవండి: హీరోల బాడీగార్డులు కోట్లల్లో సంపాదిస్తారా? ఎట్టకేలకు క్లారిటీ -
గేమ్ ఛేంజర్ సినిమాకు షాక్.. ఇకపై అది లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: గేమ్ ఛేంజర్ సినిమా (Game Changer Movie) స్పెషల్ షోలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపటి నుంచి మార్నింగ్ స్పెషల్ షోలు నిలిచిపోనున్నాయి. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా బెనిఫిట్ షోలను రద్దు చేసి స్పెషల్ షోలకు మాత్రం అనుమతి ఇవ్వడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. దీనిపై పునరాలోచించాలని సూచించింది. దీంతో ప్రభుత్వం స్పెషల్ షోలను రద్దు చేసింది.బెనిఫిట్ షోకు నిరాకరణరామ్చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపునకు, ప్రత్యేక షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కాకపోతే అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోకు మాత్రం అనుమతి నిరాకరించింది. జనవరి 10న తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆరు షోలు వేసుకోవచ్చని పేర్కొంటూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జనవరి 8న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కూరగాయల వ్యాపారి గొర్ల భరత్రాజ్తోపాటు సతీశ్కమాల్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.స్పెషల్ షో కూడా బెనిఫిట్ షోలాంటిదే!దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. గేమ్‌ఛేంజర్ సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతివ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకపక్క బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ, మరోపక్క ప్రత్యేక షోలకు అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించింది. ప్రత్యేక షో కూడా ఒకరకంగా బెనిఫిట్ షో లాంటిదే అని వ్యాఖ్యానించింది. వేకువజాము షోలకు అనుమతి, టికెట్ ధరల పెంపును పునఃసమీక్షించాలని స్పష్టం చేసింది. భవిష్యత్తులో వేకువజాము షోలకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని చెబుతూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మార్నింగ్ స్పెషల్ షోలను రద్దు చేసింది.చదవండి: హీరోల బాడీగార్డులు కోట్లల్లో సంపాదిస్తారా? ఎట్టకేలకు క్లారిటీ -
గేమ్ ఛేంజర్ చూసిన వారికి బిగ్ షాక్..
-
ప్రభాస్ పెళ్లి ఎవరితో.. రివీల్ చేసిన రామ్ చరణ్
ప్రభాస్ (Prabhas) పెళ్లి ఎప్పుడు..? ఆయన చేసుకోబోయే అమ్మాయి ఎవరూ అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి చాలా వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా డార్లింగ్‌కు కాబోయే సతీమణి వివరాలను రామ్ చరణ్ వెళ్లడించారు. బాలకృష్ణ (Balakrishna) నిర్వహించే అన్‌స్టాపబుల్ వేదికగా చరణ్(Ram Charan) ఈ విషయాలు చెప్పనట్లు తెలుస్తోంది. ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ ప్రశ్నించగా రామ్‌చరణ్ రివీల్ చేశారని టాక్ ఉంది.గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అన్‌స్టాపబుల్ షోలో బాలయ్యతో పాటు చరణ్ పాల్గొన్నారు. ఇప్పటికే ఒక భాగం టెలికాస్ట్ అయింది. రెండో భాగం జనవరి 14న విడుదల అవుతుంది. అయితే, ప్రభాస్ పెళ్లి గురించి చరణ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గణపవరానికి చెందిన అమ్మాయిని అతడు పెళ్లి చేసుకోనున్నారని చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ మరో రెండురోజుల్లో ప్రసారం కానుంది. అందులో ప్రభాస్ పెళ్లి విశేషాలు ఏమైనా తెలుపుతారేమో చూడాలి. ఈ వార్త బయటకు రాగానే డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్‌కు రామ్ చరణ్ ఫోన్ చేసి మాట్లాడుతారు. అదే సమయంలో బాలయ్య కూడా సరదాగా పలు విశేషాల గురించి డార్లింగ్‌తో ముచ్చటించారు. చరణ్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రభాస్ అక్కడ పంచుకున్నారు. ఇదే షోలో చరణ్ స్నేహితులు శర్వానంద్, విక్కీ కూడా పాల్గొన్నారు.2025 దసరా లోపు పెళ్లికృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి రీసెంట్గా ప్రభాస్ పెళ్లి గురించి ప్రకటించారు. ప్రభాస్ పెళ్లి త్వరలోనే కచ్చితంగా ఉంటుందని ఆమె తెలిపారు. అమ్మాయి ఎవరు..? డేట్ వంటి వివరాలు చెప్పను గానీ అంటూనే త్వరలో శుభకార్యం తప్పకుండా ఉంటుందని ఆమె అన్నారు. ఈ దసరా నాటికి ప్రభాస్ ఓ ఇంటివాడు అవుతాడని ఆమె ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు చరణ్ మాటలు చూస్తుంటే డార్లింగ్ పెళ్లి త్వరలోనే జరగనుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు) సలార్,కల్కి సినిమాల హిట్‌తో ఉన్న ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుందని ప్రకటించారు. ఈ చిత్రం తర్వాత సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' మూవీ లైనులో ఉంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆయన డైరీలో ఉన్నాయి. -
'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
'గేమ్ ఛేంజర్' మొదటిరోజు కలెక్షన్స్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే, బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటించే ప్రముఖ సంస్థలు కూడా ఇప్పటికే గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ రిలీజ్ చేశాయి. కానీ, వారి ఊహలకు కూడా అందని విధంగా రామ్ చరణ్ సినిమా కలెక్షన్స్ రాబట్టింది. ఈమేరకు దిల్ రాజు నిర్మాణ సంస్థ అధికారికంగా ఒక పోస్టర్‌తో గేమ్ ఛేంజర్ లెక్కల వివరాలను ప్రకటించింది.రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రం తొలిరోజే రూ. 186 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో గేమ్ ఛేంజర్ (Game Changer) చేరిపోయింది. మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా పుష్ప2 రూ. 294 కోట్లతో టాప్ వన్‌లో ఉంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ రూ. 223 కోట్లు, బాహుబలి2 రూ. 210 కోట్లు, కల్కి 2898AD రూ. 191 కోట్లుతో ఉంటే.. గేమ్ ఛేంజర్ రూ. 186 కోట్ల కలెక్షన్స్‌తో టాప్ ఫైవ్‌లో చేరిపోయింది. ఎన్టీఆర్ దేవరకు తొలి రోజు రూ.172 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే.బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల లెక్కలు ఇలా'గేమ్ ఛేంజర్' తొలిరోజు కేవలం రూ. 51 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. గ్రాస్ పరంగా అయితే సుమారు రూ. 80 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.42 కోట్లు రాబట్టినట్లు సమాచారం. హిందీ వర్షన్లో అయితే రూ. 7 కోట్లతోనే ఈ చిత్రం సరిపెట్టుకుంది. తమిళ్ రూ.2.1 కోట్లు, కన్నడ రూ. 10 లక్షలు, మలయాళం రూ. 5 లక్షలు వరకు గేమ్ ఛేంజర్ రాబట్టింది. Sacnilk ప్రకారం గేమ్ ఛేంజర్ దేశవ్యాప్తంగా 17,161 షోలలో 9.39 లక్షల టిక్కెట్లను బుక్ మై షో విక్రయించింది. కేవలం ముందస్తు బుకింగ్‌లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 26.8 కోట్లు ఈ చిత్రం ఆర్జించింది.(ఇదీ చదవండి: ‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ)గేమ్ ఛేంజర్ సినిమా మొదటిరోజే ప్రేక్షకులను నిరుత్సాహ పరచడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద పడింది అనేది అందరి అభిప్రాయం. దీంతో మొదటిరోజు రూ. 100 కోట్లు కూడా దాటడం కష్టం అని భావించారు. అయితే, తాజాగా చిత్ర యూనిట్ మాత్రం రూ. 186 కోట్లు ఫస్ట్ డే రాబట్టినట్లు పోస్టర్ విడుదల చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అపద్దం చేప్పడానికి కూడా ఒక హద్దు అనేది ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఎకంగా రూ. 100 కోట్లు పెంచడం ఏంటయ్యా అంటూ ట్వీట్లు చేస్తున్నారు. కనీసం కాస్త నమ్మేలా కలెక్షన్స్ ప్రకటించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇంకో రూ. 100 కోట్లు కలిపి పుష్ప2 రికార్డ్ బద్దలు అయిపోయిందని పోస్టర్ రిలీజ్ చేసి ఉంటే బాగుండేది కదా అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.King size entertainment unleashes in theatres 🔥#GameChanger takes a blockbuster opening at the BOX OFFICE 💥💥#BlockbusterGameChanger GROSSES 186 CRORES WORLDWIDE on Day 1 ❤🔥Book your tickets now on @bookmyshow🔗 https://t.co/ESks33KFP4Global Star @AlwaysRamCharan… pic.twitter.com/NqiqvscgR8— Sri Venkateswara Creations (@SVC_official) January 11, 2025Bro this is to much lie ki koda limit untadi bro dill raju garu— Balayya USA Fans (@BalayyaUsa) January 11, 2025Sare, ippudu original collections cheppandi...— నాని (@nani_SSMBfan) January 11, 2025Bayata rc midha jalikuda poindhi i poster chusi 😂😂😂— Ⲛ𝐚ᥒꭵ𝑇𝐚𝑟𝐚ķᵀᴹ (@taraknani_) January 11, 2025100 cr fake Ela chesaraa 🙏 only mega ke sadhyam 🙏— NTR ADMIRE 🌊 (@NTRADMIRE) January 11, 2025 -
'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. ఫ్యాన్స్‌లో నిరాశ
రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రం తొలిరోజే కాస్త నెగటివ్ టాక్ రావడంతో అభిమానుల్లో నిరాశ ఎదురైంది. దీంతో కలెక్షన్స్ పరంగా కూడా ఈ చిత్రం అనుకున్నంతగా రాబట్టలేదని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ)'గేమ్ ఛేంజర్' (Game Changer)చిత్రం సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే, తొలిరోజు కేవలం రూ. 51 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. గ్రాస్ పరంగా అయితే సుమారు రూ. 80 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.42 కోట్లు రాబట్టినట్లు సమాచారం. హిందీ వర్షన్లో అయితే రూ. 7 కోట్లతోనే ఈ చిత్రం సరిపెట్టుకుంది. తమిళ్ రూ.2.1 కోట్లు, కన్నడ రూ. 10 లక్షలు, మలయాళం రూ. 5 లక్షలు వరకు గేమ్ ఛేంజర్ రాబట్టింది. Sacnilk ప్రకారం గేమ్ ఛేంజర్ దేశవ్యాప్తంగా 17,161 షోలలో 9.39 లక్షల టిక్కెట్లను బుక్ మై షో విక్రయించింది. కేవలం ముందస్తు బుకింగ్‌లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 26.8 కోట్లు ఈ చిత్రం ఆర్జించింది.గేమ్ ఛేంజర్ చిత్రంలో అప్పన్న, రామ్ నందన్ పాత్రలతో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో అప్పన్న పాత్రకు ఆయన 100 శాతం న్యాయం చేశారు. ఎవరైనా సరే చరణ్ నటనను మెచ్చుకుని తీరాల్సిందే అనేలా చక్కగా నటించారు. ఇప్పటికే అప్పన్న పాత్రకు సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. నిర్మాత దిల్ రాజుతో పాటు దర్శకుడు శంకర్, ఎస్.జె. సూర్య, కియారా అద్వానీ, అంజలికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆపై సాయి దుర్గాతేజ్, ఉపాసన కూడా చరణ్ నటనకు ఫిదా అయ్యారు. ఆయన్ను ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్)ఆరేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలోగా వచ్చిన తొలి చిత్రం గేమ్ ఛేంజర్. 2019లో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ (VVR) చిత్రంతో సోలోగా బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగాడు. ఇందులో కూడా హీరోయిన్ కియారా అద్వానీ కావడం విశేషం. అయితే, అప్పట్లో మొదటిరోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 34 కోట్ల నెట్ సాధించింది. గ్రాస్ పరంగా రూ. 68 కోట్ల వరకు ఓపెనింగ్‌ను క్రియేట్ చేసింది. అయితే, 2022లో ఆర్ఆర్ఆర్ చిత్రం మాత్రం రూ. 133 కోట్ల నెట్ రాబట్టింది. కానీ, గ్రాస్ పరంగా రూ. 232 కోట్లతో ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' రిలీజ్.. ఉపాసన ట్వీట్ వైరల్
మెగా ఫ్యాన్స్ మోస్ట్ అవైటేడ్ చిత్రం గేమ్ ఛేంజర్(Game Changer Movie). శంకర్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళ విడుదలైంది. రిలీజైన తొలి రోజే ఈ మూవీ మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మెగా ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అంటుంటే.. మరికొందరేమో ఫర్వాలేదని కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఈ మూవీపై రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల(Upasana Konidela) ప్రశంసలు కురిపించింది. ఈ సినిమా సక్సెస్ అయినందుకు అభినందనలు తెలిపింది. నువ్వు నిజమైన గేమ్ ఛేంజర్.. లవ్ యూ అంటూ తన భర్తను కొనియాడింది. ఈ మేరకు తన ట్విటర్లో పోస్టర్‌ను షేర్ చేసింది. ఇందులో జాతీయ మీడియాలో వచ్చి గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ టైటిల్స్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. ఈ చిత్రంపై మొదటి నుంచి మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన చిత్రం కావడంతో ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శంకర్ దర్శకత్వం వహించడం ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య, సముద్ర ఖని ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. Congratulations my dearest husband @AlwaysRamCharan You truly are a game changer in every way. Love u 🥰 ❤️❤️❤️❤️❤️ pic.twitter.com/qU6v54rRbh— Upasana Konidela (@upasanakonidela) January 10, 2025 -
గేమ్ ఛేంజర్‌పై ప్రేక్షకుల రివ్యూ.. సినిమా మధ్యలో వెళ్లిపోయామంటూ..!
ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచ సినీ ప్రేమికులను మెప్పించాడు రామ్‌చరణ్ (Ram Charan). ఈ సినిమా తర్వాత ఆచార్య సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు. కిసీ కా భాయ్ కిసీ కా జాన్‌లోని ఏంటమ్మా పాటలో అతిథిగా మెరిశాడు. మోడ్రన్ మాస్టర్స్: ఎస్ ఎస్ రాజమౌళి అనే డాక్యుమెంటరీ చిత్రంలోనూ కనిపించాడు. కానీ హీరోగా చరణ్ నుంచి సినిమా వచ్చి మూడేళ్లవుతోంది. ఇంతకాలం గ్యాప్ తర్వాత గేమ్ ఛేంజర్ (Game Changer Movie)తో ప్రేక్షకుల్ని పలకరించాడు చరణ్. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే సినిమా చూసేసిన జనాలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఎలా ఉందన్న సాక్షి.కామ్ పోల్‌కు పలువురూ ఈ కింది విధంగా స్పందించారు.ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న తీరును గూర్చి అద్బుతమైన కథనం- సైదుల యాదవ్ఔట్డేటెడ్ డైరెక్షన్- రవికుమార్శంకర్ చెత్త డైరెక్షన్. హీరో, శ్రీకాంత్ తప్ప ఎవరికి స్కోప్ లేదు. చెత్త స్ర్క్రీన్ ప్లే- సురేశ్ రాజ్అవుట్ డేటెడ్ డైరెక్టర్, అవుట్ డేటెడ్ స్టోరీ, శంకర్ ని డైరెక్టర్ గా తీసుకుని దిల్ రాజు చాలా తప్పు చేశాడు 🙏🏻🙏🏻. చరణ్ పెర్ఫార్మన్స్ కి ఒక్కసారి చూడొచ్చు 🙏🏻🙏🏻మిగతా సినిమా అంత అస్సాం ఏ, పోయారు మోసం.- అమలశేఖర్ గౌడ్ఈ పండక్కి ఓటీటీలో వేసేస్తే ఫ్యామిలీ మొత్తం చూస్తాం.. వేసేయండి దిల్ రాజు గారు పండగ పూట మీ పేరు చెప్పుకుంటాం- భాస్కర్ కుమార్ప్రొడ్యూసర్ బతుకు చేంజ్ అయిపోయింది అంటా -మహమ్మద్ నూర్మనకు సోషల్ మెసేజ్‌లు నచ్చవు, పుష్ప లాంటి సినిమాలు కావాలి- మల్యాద్రి రెడ్డి బాలసానిఎక్సలెంట్ మూవీ-ముబీన్సినిమా మధ్యలో వచ్చేశా- గిరిగతేడాది గుంటూరు కారం బ్లాక్‌బస్టర్ అయితే ఈసారి గేమ్ ఛేంజర్ కూడా బ్లాక్‌బస్టర్ అయినట్లే!- పవన్ఇలా సినిమా బాగుందని కొందరు కామెంట్లు చేయగా అస్సలు బాగోలేదని ఎక్కువమంది రియాక్ట్ అవుతున్నారు. అసలైన సంక్రాంతి పోటీ మొదలు కాకముందే గేమ్ ఛేంజర్ గేమ్ ఓవర్ అయిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. అటు సాక్షి వాట్సప్ ఛానల్లో పెట్టిన పోలింగ్‌లోనూ మెజారిటీ జనాలు సినిమా బాలేదని అభిప్రాయపడుతున్నారు.గేమ్ ఛేంజర్ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Game Changer: రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. ఇదేదో ముందే చెప్పొచ్చుగా!
ఈ సారి సంక్రాంతికి మూడు సినిమాలు బరిలో దిగుతున్నాయి. అందులో మొదటగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer Movie) నేడే (జనవరి 10న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 12న నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్, జనవరి 14న విక్టరీ వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రాబోతున్నాయి. శుక్రవారం రిలీజైన గేమ్ ఛేంజర్‌కు మిక్స్డ్ టాక్ వస్తోంది.ఆ కారణం వల్లే..డైరెక్టర్ శంకర్ పాత ఫార్ములానే వాడారని కొందరు అంటుంటే.. ఇండియన్ 2 కంటే బెటర్‌గానే ఉందని మరికొందరు అంటున్నారు. ఇకపోతే థియేటర్లో నానా హైరానా పాట (#NaanaaHyraanaaSong) కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. సినిమాలో ఆ పాటనే కనిపించలేదట! దీనిపై గేమ్ ఛేంజర్ టీమ్ స్పందించింది. సాంకేతిక సమస్యల వల్ల ఈ పాటను మూవీలో యాడ్ చేయలేకపోయినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని, జనవరి 14 నుంచి నానా హైరానా సాంగ్‌ను థియేటర్లో ప్లే చేస్తామని పేర్కొంది. కోట్లు పెట్టి తీసింది ఇందుకేనా?చిత్రయూనిట్ నిర్లక్ష్యంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లు ఖర్చుపెట్టింది ఇలా ఎడిటింగ్‌లో తీసేయడానికేనా? చెత్త నిర్ణయాలు.., ఇదేదో ముందే చెప్పొచ్చుగా.. ఈ పాట కోసమే టికెట్ బుక్ చేసుకున్నా.., కనీసం ఆ పాట పెట్టుంటే గేమ్ ఛేంజర్‌పై నెగెటివిటీ కాస్త తగ్గేదేమో.. ఈ ఒక్కటైనా బాగుందని సంతృప్తి చెందేవారేమో అని అభిప్రాయపడుతున్నారు. అభిమానులు మాత్రం.. ఏం పర్లేదు, జనవరి 14 తర్వాత మరోసారి టికెట్లు కొని సినిమా చూస్తామని కామెంట్లు చేస్తున్నారు.గేమ్ ఛేంజర్ విశేషాలు..ఈ ఏడాది రిలీజవుతున్న మొదటి భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. రామ్‌చరణ్, కియారా అద్వానీ (Kiara Advani), అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్జే సూర్య విలన్‌గా నటించాడు. తమన్ సంగీతం అందించాడు. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. భారతీయుడు 2 డిజాస్టర్ తర్వాత శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఫస్ట్ డే ఫస్ట్ ఫోనే సినిమా బాలేదంటూ ఎక్కువ నెగెటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఇదే టాక్ కొనసాగితే సినిమా గట్టెక్కడం కష్టమే!పాటల కోసమే రూ.75 కోట్లుఅసలే సినిమాలోని ఐదు పాటల కోసమే రూ.75 కోట్లు ఖర్చు పెట్టానని గర్వంగా చెప్పుకున్నాడు నిర్మాత దిల్‌రాజు. తీరా థియేటర్లో చూస్తే మెలోడీ సాంగ్ నానా హైరానా వేయనేలేదు. సాంకేతిక సమస్యలంటూ ఏదో సాకు చెప్పారు. నాలుగు రోజుల తర్వాతే థియేటర్లో నానా హైరానా పాట వినిపిస్తుందని సమాధానం చెప్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సాంగ్‌ను ఇంత లైట్ తీసుకోవడం ఏమీ బాగోలేదంటున్నారు చరణ్ ఫ్యాన్స్కథేంటంటే?ఓ నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీతిపరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే యుద్ధమే గేమ్ చేంజర్. గేమ్ ఛేంజర్ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి Everyone's favorite, #NaanaaHyraanaa | #Lyraanaa | #JaanaHairaanSa from #GameChanger has been edited out due to technical challenges encountered during the processing of infrared images in the initial prints. Rest assured, we are diligently working towards adding the song back… pic.twitter.com/N1mQO2GAG6— Game Changer (@GameChangerOffl) January 9, 2025 చదవండి: Game Changer: రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. -
‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ
టైటిల్ : గేమ్ ఛేంజర్‌నటీనటులు: రామ్ చరణ్, కియారా అద్వానీ, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, నాజర్ తదితరులునిర్మాణ సంస్థలు: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్కథ: కార్తీక్ సుబ్బరాజ్‌దర్శకత్వం-స్క్రీన్‌ప్లే: ఎస్. శంకర్‌సంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: తిరువిడుదల: జనవరి 10, 2025సంక్రాంతి టాలీవుడ్‌కి చాలా పెద్ద పండగ. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా పండక్కి మూడు భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. వాటిలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’(Game Chnager Review) నేడు(జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్, పాటలు ఆ అంచనాలను మరింత పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘గేమ్ ఛేంజర్’పై మంచి హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? శంకర్, చరణ్ ఖాతాలో బిగ్ హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి(ఎస్జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్ అయిన రామ్ నందన్(రామ్ చరణ్).. విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు.ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్ చరణ్) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్ రామ్‌కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్ అధికారిగా తనకున్న పవర్స్‌ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..శంకర్(Shankar) అద్భుతమైన ఫిల్మ్ డైరెక్టర్. అందులో డౌటే లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక సందేశం ఇచ్చేలా ఆయన సినిమాలు ఉంటాయి. జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజీ, అపరిచితుడు, రోబో లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలను అందించాడు. అయితే భారతీయుడు 2 రిలీజ్ తర్వాత శంకర్ మేకింగ్‌పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. బలమైన కథలు రాసుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. ఆ ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్(Game Changer Review)పై కూడా పడింది. కానీ మెగా ఫ్యాన్స్‌తో పాటు శంకర్ అభిమానులు కూడా ఈ చిత్రం ఆయనకు కమ్‌బ్యాక్ అవుతుందని ఆశ పడ్డారు. కానీ వారి ఆశ పూర్తిగా నెరవేరలేదనే చెప్పాలి. కార్తీక్ సుబ్బరాజ్ అందించిన రొటీన్ కథను అంతే రొటీన్‌గా తెరపై చూపించాడు. ఈ సినిమా నేపథ్యం అవినీతి రాజకీయ నేతకు, నిఖార్సయిన ఐఏఎస్ అధికారికి మధ్య జరిగే ఘర్షణ అని ట్రైలర్లోనే చూపించారు. అయితే ఆ ఘర్షణను ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. శంకర్ గత సినిమాలను గుర్తు చేసేలా కథనం సాగుతుంది. అలా అని బోర్ కొట్టదు. మదర్ సెంటిమెంట్, తండ్రి ఎపిసోడ్ సినిమాకు ప్లస్ అయిందనే చెప్పాలి.ఎలాంటి సాగదీతలు లేకుండా కథను చాలా సింపుల్‌గా ప్రారంభించాడు. హీరో పరిచయానికి మంచి సీన్ రాసుకున్నాడు. ఇక హీరో కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. రామ్ చరణ్, ఎస్జే సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో హీరోయిన్‌తో వచ్చే లవ్‌ట్రాక్ ఆకట్టుకోకపోగా.. కథకు అడ్డంకిగా అనిపిస్తుంది. కాలేజీ ఎపిసోడ్ వర్కౌట్ కాలేదు. హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్‌కి ప్రేక్షకులు కనెక్ట్ కాకపోవడంతో ఆ సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. కలెక్టర్, మంత్రి మోపిదేవి మధ్య సాగే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి. సీఎం సీటు కోసం మోపిదేవి వేసే రాజకీయ ఎత్తులను ఐఏఎస్ అధికారిగా తనకున్న అధికారాలతో హీరో చెక్ పెట్టడం ఆకట్టుకుంటుంది.ఇంటర్వెల్ సీన్ మాత్రం ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. విరామం ముందు వచ్చే ఓ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే అప్పన్న ఎపిసోడ్ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత కథనం మళ్లీ ఊహకందేలా రొటీన్‌గా సాగుతుంది. మోపిదేవి, రామ్ నందన్ మధ్య సాగే టామ్ అండ్ జెర్రీ వార్ బాగానే ఉన్నా.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోవు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ బెటర్. ఎన్నికల అధికారి తనకున్న పవర్స్‌ని నిజాయితీగా వాడితే ఎలా ఉంటుందనేది తెరపై చక్కగా చూపించారు. క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఈ చిత్రం ద్వారా ఎన్నికల వ్యవస్థకు, రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లకు దర్శకుడు ఇచ్చిన సందేశం మాత్రం బాగుంది. అయితే ఆ సందేశాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా బలంగా చూపించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు.ఎవరెలా చేశారంటే..రామ్ చరణ్(Ram Charan) నటన ఏంటో ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసింది. మరోసారి ఆ రేంజ్ నటనతో ఆకట్టుకున్నాడు. అప్పన్న, రామ్ నందన్ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన చరణ్.. ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అప్పన్న పాత్రలో చరణ్ అద్భుతంగా నటించేశాడు. యాక్షన్, ఎమోషన్ సీన్లలో అదరగొట్టేశాడు. చరణ్ తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర ఎస్జే సూర్యది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పొలిటిషీయన్ బొబ్బిలి మోపిదేవిగా సూర్య తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సూర్యకు, చరణ్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అప్పన్న భార్య పార్వతిగా అంజలి అద్భుతంగా నటించింది. ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ భావోధ్వేగానికి గురి చేస్తుంది. రామ్ నందన్ ప్రియురాలు దీపికగా కియరా అద్వానీ మెప్పించింది. తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. తనదైన అందచందాలతో ఆకట్టుకుంది. బొబ్బిలి సత్యమూర్తిగా శ్రీకాంత్, సైడ్ సత్యంగా సునీల్ ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే సునీల్‌తో పాటు వెన్నెల కిశోర్‌ల కామెడీ మాత్రం సరిగ్గా పండలేదు. బ్రహ్మానందం ఒక్క సీన్లో కనిపిస్తారు. జయరాం, నవీన్ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. తమన్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు వినడం కంటే తెరపై చూస్తే ఇంకా బాగా ఆకట్టుకుంటాయి. శంకర్ మార్క్ గ్రాండ్‌నెస్ ప్రతి పాటలోనూ కనిపించింది. సినిమాటోగ్రఫీ పని తీరు అద్భుతం. ప్రతి ఫ్రేమ్ తెరపై చాలా అందంగా, రిచ్‌గా కనిపిస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో దిల్ రాజు ఎక్కడా వెనకడుగు వేయలేదని సినిమా చూస్తుంటే అర్థమవుతుంది.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
కోలీవుడ్‌లో గేమ్ చేంజ్
సంక్రాంతి అంటే స్టార్ హీరోల చిత్రాలు కనీసం మూడు నాలుగైనా ఉండాలి. అప్పుడే సినీ లవర్స్‌కి అసలైన పండగ. కానీ ఈ పొంగల్‌కి తమిళ తెరపై ఒకే ఒక్క స్టార్ హీరో కనిపించనున్నారు. అది కూడా తెలుగు స్టార్ రామ్‌చరణ్. ‘గేమ్ చేంజర్’ తమిళంలో డబ్ అయి, విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక తమిళంలో అజిత్ ‘విడాముయర్చి’ పొంగల్ రేసు నుంచి తప్పుకుంది. మొత్తంగా తమిళంలో ఆరేడు స్ట్రయిట్ చిత్రాలు పొంగల్‌కి రానున్నాయి. అవి కూడా మీడియమ్ కంటే ఓ మెట్టు ఎక్కువ ఉన్న హీరోలు, ఓ మెట్టు తక్కువ ఉన్న హీరోలవే. హీరోల రేంజ్ పక్కన పెడితే... ఒకవేళ కథాబలం ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకుంటే మీడియమ్ రేంజ్ సినిమా పెద్ద రేంజ్ అయిపోతుంది. మరి... పొంగల్పోటీలో వసూళ్లు కొల్లగొట్టే సినిమా ఏది? అనేది తర్వాత డిసైడ్ అవుతుంది. ఇక ఈ పొంగల్‌కి తెరపైకి రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం...తెలుగు సినిమాకి సంక్రాంతి సీజన్ ఎంత ముఖ్యమో తమిళ ఇండస్ట్రీకి పొంగల్ కూడా అంతే ముఖ్యం. వరుస సెలవులను క్యాష్ చేసుకునే వీలు ఉన్న సీజన్ కాబట్టి భారీ చిత్రాల విడుదలను ప్లాన్ చేస్తుంటారు. ఎప్పటిలానే ఈసారి తెలుగులో భారీ చిత్రాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. సీనియర్ స్టార్ హీరోలు బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి సందడికి రెడీ అయ్యాయి. యంగ్ స్టార్ రామ్‌చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ కూడా ఈ పండగకి రానుంది. అయితే అటు తమిళంలో మాత్రం మీడియమ్ రేంజ్ హీరోల చిత్రాలే విడుదల కానున్నాయి. ఆ మాట కొస్తే... గతేడాది కూడా కోలీవుడ్ పరిస్థితి ఇదే. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ మినహా మిగతావన్నీ ఓ మోస్తరు చిత్రాలే.ఈసారి అజిత్ ‘విడాముయర్చి’ రావాల్సింది కానీ సంక్రాంతి రేసు నుంచి ఆ సినిమా తప్పుకోవడంతో ఇక పొంగల్‌కి పెరియ పడమ్ ఇల్లే (సంక్రాంతికి పెద్ద సినిమా లేదు) అన్నట్లు అయింది. సో... ఉన్నదంతా ‘గేమ్ చేంజర్’ మాత్రమే. అనువాద రూపంలో తమిళ తెరపై ‘గేమ్ చేంజర్’ కనిపించనుంది. ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్ అనిపించుకున్న రామ్‌చరణ్ హీరోగా నటించిన చిత్రం కావడం, తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం కావడం, సక్సెస్ఫుల్ ప్రోడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం కావడంతో ‘గేమ్ చేంజర్’పై తమిళనాడులోనూ భారీ అంచనాలు ఉన్నాయి. సో... ఒక స్టార్ డైరెక్టర్–స్టార్ హీరో–స్టార్ ప్రోడ్యూసర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం కావడంతో కోలీవుడ్ పొంగల్ బాక్సాఫీస్ దగ్గర ఆట అంతా ‘గేమ్ చేంజర్’దే అని చె΄÷్పచ్చు. వేరే పెద్ద చిత్రాలు లేకపోవడంతో ఈ చిత్రానికే ఎక్కువ థియేటర్లు లభించాయి. ‘గేమ్ చేంజర్’కి ఇదో మంచి అవకాశం.10న 3 సినిమాలు ఈ నెల 10న తెలుగులోనూ, అనువాద రూపంలో తమిళ్, హిందీ భాషల్లోనూ ‘గేమ్ చేంజర్’ విడుదల కానుంది. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, ‘దిల్’ రాజు ప్రోడక్షన్ బ్యానర్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ దాదాపు రూ.450 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు సమాచారం. శంకర్ అంటే దాదాపు లార్జ్ స్కేల్ సినిమానే అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘గేమ్ చేంజర్’తోపాటు 10న తమిళంలో విడుదల కానున్న వాటిలో విలక్షణ నటుడు బాల దర్శకత్వంలో అరుణ్ విజయ్ నటించిన ‘వణంగాన్’, మలయాళ నటుడు షానే నిగమ్ తమిళ తెరకు హీరోగా పరిచయం అవుతున్న ‘మద్రాస్క్కారన్’ చిత్రాలు ఉన్నాయి. నిజానికి ‘వణంగాన్’ని సూర్య హీరోగా ప్లాన్ చేశారు బాల.అయితే కొన్ని కారణాల వల్ల అరుణ్ విజయ్‌తో ఈ చిత్రం చేశారు. ఒకవేళ సూర్యతో చేసి ఉంటే... పొంగల్ రేస్‌లో తమిళంలో ఓ స్టార్ ఉండి ఉండేవారు. ఇక ‘మద్రాస్ క్కారన్’ విషయానికొస్తే... గతేడాది ‘రంగోలి’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన వాలీ మోహన్‌దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ యంగ్ హీరో షానే నిగమ్ నటించారు. 11 ఏళ్ల తర్వాత 12న ఇక పొంగల్ రేస్‌లోని తమిళ చిత్రాల్లో చెప్పుకోదగ్గ మాస్ హీరో అంటే విశాల్. ‘మద గజ రాజా’ చిత్రంతో ఈ 12న రానున్నారు విశాల్. ఈ సినిమా 2013లో విడుదల కావాల్సింది. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. చివరికి 11 ఏళ్ల తర్వాత ఈ 12న విడుదల కానుంది. సుందర్.సి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.పొంగల్ రోజున... పండగ రోజున ఆకాశ్ మురళి అనే నూతన హీరో వెండితెరకు పరిచయం కానున్నారు. ‘ఇదయం’ (హృదయం) ఫేమ్ మురళి రెండో కుమారుడే ఆకాశ్ మురళి. ఆల్రెడీ పెద్ద కుమారుడు అథర్వ హీరోగా (తెలుగులో ‘గద్దలకొండ గణేశ్’లో నటించారు) సినిమాలు చేస్తున్నారు. ఇక తమిళంలో ‘బిల్లా, ఆరంభం’ చిత్రాలతో మంచి మాస్ స్టయిలిష్ దర్శకుడు అనిపించుకున్న విష్ణువర్ధన్ నూతన హీరో ఆకాశ్ మురళితో తీసిన ‘నేసి΄్పాయా’ 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ హీరోయిన్గా నటించారు.ఇక పండగ రోజున సీనియర్ హీరో ‘జయం రవి’ ప్రేమించడానికి సమయం లేదంటూ ప్రేక్షకులు ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నిత్యామీనన్ హీరోయిన్గా నటించిన ‘కాదలిక్క నేరమిల్లై’ (ప్రేమించడానికి సమయం లేదు) చిత్రం ఈ 14న విడుదల కానుంది. ఈ చిత్రానికి కృతికా ఉదయనిధి స్టాలిన్ దర్శకత్వం వహించారు.ఇలా పొంగల్ రేసులో తమిళంలో ఐదు చిత్రాలు నిలవగా, వాటిలో విశాల్, ‘జయం’ రవి పేరున్న హీరోలు కాగా... వీరి తర్వాత అరుణ్ విజయ్ కొంచెం చెప్పుకోదగ్గ హీరో కాగా... మిగతా ఇద్దరిలో యువ హీరోలు ఆకాశ్ మురళి, షానే నిగమ్ ఉన్నారు. ఈ ఐదు చిత్రాలే కాకుండా మరో రెండు మూడు చిన్న సినిమాలు కూడా విడుదల కానున్నాయి. సో... ఎలా చూసుకున్నా పొంగల్‌కి తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్న పెద్ద సినిమా ‘గేమ్ చేంజర్’ మాత్రమే. మరి... వసూళ్ల పరంగా ఈ సినిమా ప్రభావం ఇతర చిత్రాలపై ఏ మేరకు ఉంటుంది? పొంగల్పోటీలో బాక్సాఫీస్ హిట్ ఏ సినిమాకి దక్కుతుంది? అనేది మరో వారంలో తెలిసిపోతుంది. గేమ్ చేంజర్‌తో రీ ఎంటర్ కావడం హ్యాపీ ‘సందడే సందడి’తో నిర్మాతగా తెలుగులో ఆదిత్యా రామ్ ప్రయాణం ఆరంభమైంది. ఆ తర్వాత ‘ఖుషీ ఖుషీగా, స్వాగతం, ఏక్ నిరంజన్’ చిత్రాలు నిర్మించారాయన. ‘ఏక్ నిరంజన్’ (2009) తర్వాత మళ్లీ సినిమాలు నిర్మించలేదు. చెన్నైలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. కాగా ‘గేమ్ చేంజర్’ని తమిళంలో విడుదల చేస్తున్నారు ఆదిత్యా రామ్. ‘‘చాలా కాలం తర్వాత ఒక గ్రాండ్ స్కేల్ సినిమాతో వస్తున్నందుకు ఆనందంగా ఉంది. తమిళనాడులో దాదాపు నాలుగువందల స్క్రీన్స్‌లో విడుదల చేస్తున్నాం. రామ్‌చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో వస్తున్న ‘గేమ్ చేంజర్’ ఈ వీకెండ్‌కి పెద్ద సినిమా అవుతుంది. ‘దిల్’ రాజుగారి సినిమాని విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు ఆదిత్యా రామ్. – డి.జి.భవాని‘విడాముయర్చి’ రాకపోవడం నిరుత్సాహమే ‘‘పొంగల్ చాలా పెద్ద పండగ. పైగా ఇది పెద్ద వీకెండ్. పెద్ద హీరోల సినిమాలు రాకపోతే అస్సలు పండగలానే అనిపించదు. తమిళనాడులోని థియేటర్ ఓనర్స్ అందరూ అజిత్ హీరోగా నటించిన ‘విడాముయర్చి’ కోసం ఎదురు చూశారు. హఠాత్తుగా ఈ సినిమా వాయిదా పడటంతో అందరూ నిరుత్సాహపడ్డారు’’ అంటూ తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. -
గేమ్ ఛేంజర్ టిక్కెట్ల విక్రయం...ఏ రాష్ట్రంలో ఎంతంటే...
చిత్రం విడుదలకు కేవలం ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలింది. రిలీజ్‌కు సంబంధించి కౌంట్‌డౌన్ ముగియనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత మరో అద్భుతమైన పాత్రలో తమ ఫేవరెట్ స్టార్‌ని చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఏ పెద్ద స్టార్ సినిమా విడుదల ముందైనా సర్వసాధారణంగా జరిగేవే. అవన్నీ అలా ఉంచితే... ఇటీవల భారీ చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్లు బాగా చర్చకు నోచుకుంటున్నాయి. గత కొంత కాలంగా భారతీయ సినిమాలకు సంబంధించి హిట్స్, ఫ్లాప్స్ అన్నీ వసూళ్లతోనే ముడిపడడంతో ఈ పరిస్థితి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్ గురించి కూడా సినిమా వర్గాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఈ సినిమాకి భారీగా హైప్ వచ్చినప్పటికీ అడ్వాన్స్ టిక్కెట్ల విక్రయం ప్రకారం చూస్తే ఆశించిన స్థాయికి చేరుకోలేదనే చెప్పాలి. భారీ సంచలన చిత్రాల దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ ల కలయికే ఓ సెన్సేషన్ కావడంతో ఈ టాలీవుడ్ పొలిటికల్ థ్రిల్లర్ అందరి దృష్టినీ ఆకర్షించింది, అయితే కనపడుతున్న స్పందన మాత్రం అంచనాల కంటే చాలా తక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఈ సినిమా డైరెక్టరే అని పలువురు భావిస్తున్నారు. ఊహించిన దానికన్నా శంకర్ ప్రేక్షకుల్లో తన పట్ల ఆదరణ తగ్గించుకున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. అదే సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తోందని అభిప్రాయపడుతున్నాయి. నిజానికి ఒకప్పుడు శంకర్ అంటే పెద్ద బ్రాండ్, కానీ ఇటీవల ఈ డిఫరెంట్ సినిమాల ఫిల్మ్ మేకర్ తన క్రేజ్‌ను కోల్పోయాడు. అతని సినిమాలు గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతున్నాయి ఆయన చివరి సినిమా భారతీయుడు 2 ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో మనం చూశాం.కలెక్షన్లలో వ్యత్యాసం..చెబుతోంది అదే...సినిమా విడుదలకు మరో రోజు మిగిలి ఉండగా...గురువారం ఉదయం 10 గంటల నాటికి గేమ్ ఛేంజర్ 1వ రోజు మన దేశంలో దాదాపు 5 లక్షలకు పైగా టిక్కెట్లను విక్రయించిందని సమాచారం. మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్ విలువ 14.83 కోట్ల గ్రాస్ (బ్లాక్ చేసిన సీట్లు మినహా)కు చేరింది. ఇప్పటివరకు దాదాపు 8,000 షోలు లిస్ట్ చేశారు. తర్వాత వాటి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.ఆంధ్రలో టాప్..తమిళనాడులో డ్రాప్...రాష్ట్రాల వారీగా చూస్తే టిక్కెట్ల విక్రయంలో ఆంధ్రప్రదేశ్ భారీ తేడాతో ముందంజలో ఉంది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే గేమ్ ఛేంజర్ మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 8.72 కోట్ల గ్రాస్ టిక్కెట్లను విక్రయించింది. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ 3.06 కోట్లు, కర్ణాటక 1 కోటి ఉన్నాయి. విశేషం ఏమిటంటే తమిళనాట ఇంకా 1 కోటి మార్కును సైతం ఈ సినిమా టచ్ చేయలేదు, విచిత్రంగా తమిళనాడుకు చెందిన టాప్ డైరెక్టర్ శంకర్ సినిమా అయినప్పటికీ అక్కడ ఈ పరిస్థితి ఉండడం షాకింగ్ అనే చెప్పాలి. శంకర్ పట్ల జనాదరణ ఎంతగా తరిగిపోయిందో చెప్పడానికి ఇదొక నిదర్శనంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.గుంటూరు కారం కన్నా..ఘాటు తక్కువే...రామ్ చరణ్ నటించిన సినిమా బుకింగ్స్ విలువ గురువారం ముగిసే సరికి 20 కోట్ల మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు, కానీ అప్పటికీ ముందస్తు అంచనాలను ఇది అందుకోవడం లేదనే చెప్పాలి. ఇంత భారీ చిత్రంగా పేర్కొనని మహేష్ బాబు గుంటూరు కారం సినిమాను సైతం బీట్ చేయడంలో ఇది ఖచ్చితంగా విఫలమవుతుంది, గత సంక్రాంతి సందర్భంగా విడుదలైన గుంటూరు కారం మొదటి రోజు 24.90 కోట్ల గ్రాస్ టిక్కెట్లను విక్రయించింది. -
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ని వదలని సినిమా కష్టాలు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ల కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్(Game Changer) ని వరుసపెట్టి సినిమా కష్టాలు వెన్నాడుతున్నాయి. కొన్ని చోట్ల బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం లాంటి దేశీయ కష్టాల నుంచి అంతర్జాతీయ కష్టాలు కూడా ఈ సినిమాకి తప్పడం లేదు. ఈ సంవత్సరంలో తొలి భారీ–టికెట్ చిత్రంగా విడుదల అవుతున్న గేమ్ ఛేంజర్ రూ.500 కోట్ల కనీస టార్గెట్‌తో వస్తోంది. ఈ సినిమా రాబోయే చిత్రాల విడుదలకు టార్గెట్ సెట్ చేస్తుందని భావిస్తున్న నేపధ్యంలో చుట్టుముడుతున్న కష్టాలు కలెక్షన్స్‌పై సందేహాలు కలిగిస్తున్నాయి. (చదవండి: తెలంగాణలో 'గేమ్ ఛేంజర్' టికెట్ల పెంపుపై విమర్శలు)మన దేశంలో, ఈ చిత్రం దాదాపు రూ. 25 కోట్లతో తొలి రోజు ప్రారంభమవుతుందని ఇది రామ్ చరణ్ సోలో చిత్రానికి అతిపెద్ద ఓపెనింగ్గా నిలుస్తుందని అంచనా. మరోవైపు భారతదేశం వెలుపల తెలుగు చిత్రాలకు అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా మారిన నార్త్ అమెరికా లో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లపై ఆశపెట్టుకుంది. (చదవండి: 'ఆ సాంగ్ చేసినందుకు సిగ్గుపడాలి'.. ఊర్వశి రౌతేలాపై విమర్శలు!)అయితే కంటెంట్ కన్వర్షన్లో జాప్యం కారణంగా, నార్త్ అమెరికాకి సమయానికి కంటెంట్ అప్లోడ్ వైఫల్యానికి దారితీసే పరిస్థితి ఏర్పడిందట. హిందీ తమిళ వెర్షన్లు ఆ భాషల్లో షోలను నిర్ధారిస్తూ, సమయానుకూలంగా అప్లోడ్ చేశారు. అయితే, ఆలస్యం కారణంగా యునైటెడ్ స్టేట్స్‌లోని అతిపెద్ద థియేటర్ చైన్లలో ఒకటైన ఎఎమ్‌సి సినిమా కోసం బుకింగ్‌లను నిలిపివేసిందని తెలుస్తోంది. ప్రారంభ ట్రెండ్ల ప్రకారం, ఉత్తర అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్ షోల టిక్కెట్ల విక్రయాలు 8,5లక్షల్ని దాటాయి పదిలక్షల చేరుకోవడానికి దగ్గరలో ఉన్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల కారణంగా, మొత్తం అమ్మకాలు 7.5లోపునకు పడిపోయాయని సమాచారం. అయితే ఇప్పటికీ మించిపోయింది లేదనీ కంటెంట్ సమయానికి సినిమా థియేటర్లకు చేరుకుంటే, సినిమా ఇప్పటికీ 10లక్షల మార్కును దాటగలదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. పులి మీద పుట్రలా మరోవైపు కొనసాగుతున్న దావానలం గేమ్ ఛేంజర్ ఓవర్సీస్ రికార్డ్ కలెక్షన్స్ ఆశల్ని దహించే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే కార్చిచ్చు కారణంగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో ఈ సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. రేపు(జనవరి 10) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
‘గేమ్ ఛేంజర్’ మూవీ HD స్టిల్స్
-
గేమ్ చేంజర్ బెనిఫిట్ షోకు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: దర్శకుడు శంకర్, హీరో రామ్‌చరణ్ తేజ్ కలయికలో ఈనెల 10న విడుదల కానున్న ‘గేమ్‌చేంజర్’ సినిమా బెనిఫిట్ షోల ప్రదర్శనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఇటీవల పుష్ప–2 సినిమా బెనిఫిట్ షో నేపథ్యంలో నెలకొన్న ఘటనల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టికెట్ ధరల పెంపునకు మాత్రం ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈనెల 10వ తేదీన 6 షోలు ప్రదర్శించుకోవచ్చు. మల్టీప్లెక్స్ థియేటర్లలో ఇప్పటికే అమల్లో ఉన్న టికెట్ ధరపై అదనంగా రూ.150, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100 చొప్పున పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఈనెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చు. ఈ తొమ్మిది రోజుల పాటు మల్టీప్లెక్స్ థియేటర్లలో ఇప్పటికే అమల్లో ఉన్న టికెట్ ధరపై అదనంగా రూ.100, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 చొప్పున పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఈ ధరలు జీఎస్టీతో కలిపి ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, లైసెన్స్ జారీ చేసే అధికారులను ఆదేశించింది. -
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం. జనవరి 10వ తేదీ ఒకరోజు ఉదయం 4 గంటల షో నుంచి 6 షోస్‌కు అనుమతి. మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 150 రూపాయలు పెంపుకు అనుమతి. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 100రూపాయలు పెంపు. అలానే జనవరి 11 నుంచి 5 షోస్‌కు అనుమతి. జనవరి 11 నుంచి మల్టీ ప్లెక్స్ ధర 100 రూపాయలు. సింగిల్ స్క్రీన్ ధర్ 50 రూపాయలు పెంపు. టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణా ప్రభుత్వం బెనిఫిట్ షోస్‌కు మాత్రం అనుమతి నిరాకరించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'గేమ్ చేంజర్' (Game Changer Movie). జనవరి 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్జే సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో కేవలం ఐదు పాటల కోసమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు పెట్టారు. ఓ నిజాయితీ ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీతి పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పోరాటమే గేమ్ ఛేంజర్ కథ. -
పవన్ కల్యాణ్ మానవత్వం లేదా..?
-
గేమ్ చేంజర్ ప్రత్యేకం: అంజలి
‘‘గేమ్ చేంజర్’ చిత్రంలో నాపాత్ర పేరుపార్వతి. మా అమ్మ పేరు కూడాపార్వతి. శంకర్‌గారు ఈ చిత్ర కథ, నాపాత్ర గురించి చెప్పినప్పుడు మా అమ్మే గుర్తుకొచ్చారు. శంకర్‌గారు నా నటన చూసి చాలా చోట్ల మెచ్చుకున్నారు. నా కెరీర్లో ‘గేమ్ చేంజర్’ సినిమా, నాపాత్ర చాలా ప్రత్యేకం’’ అని అంజలి చెప్పారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. అంజలి, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అంజలి విలేకరులతో పంచుకున్న విశేషాలు... ⇒ నేను నటించిన ‘గేమ్ చేంజర్’(తెలుగు), ‘మదగజరాజ’(తమిళ్) సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలవుతుండటంతో హ్యాపీగా ఉంది. ఈ రెండు చిత్రాలకు మంచి స్పందన వస్తుందనే నమ్మకం ఉంది. ‘గేమ్ చేంజర్’లో నేను చే సినపార్వతిపాత్ర ఆడియన్స్ కి చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. నా కెరీర్లో ఇదే బెస్ట్ క్యారెక్టర్. ఈపాత్రతో నాకు జాతీయ అవార్డు వస్తుందని అంటున్నారు. కథ విన్నప్పుడు నాకూ అలానే అనిపించింది. అదే నిజమైతే అంతకంటే గొప్ప సక్సెస్ ఇంకేం ఉంటుంది.⇒ఈ మూవీలో రామ్‌చరణ్ చేసిన అప్పన్న, నేను చేసినపార్వతిల ప్రేమ, వారి బంధం చాలా గొప్పగా ఉంటుంది. అదే ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. చరణ్ సెట్స్‌లో అందరితోనూ బాగా మాట్లాడతారు. ‘దిల్’ రాజుగారి బ్యానర్లో మూడో సినిమా, శంకర్‌గారి దర్శకత్వంలో తొలి సినిమా, రామ్ చరణ్‌గారితో మొదటి సినిమా.. ఇలా అన్ని రకాలుగా ఈ చిత్రం నాకు ప్రత్యేకం. శంకర్, మణిరత్నంగార్ల చిత్రాల్లో నటించాలని అందరికీ ఉంటుంది. శంకర్‌గారి చిత్రంలో ఛాన్స్ రావడం నా అదృష్టం. ‘గేమ్ చేంజర్’ చూసిన చిరంజీవిగారు.. నాపాత్రను మెచ్చుకోవడమే పెద్ద అవార్డులా అనిపిస్తోంది. తమన్ సంగీతానికి మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. -
రామ్ చరణ్ ఫ్యాన్స్ మృతి.. ఎవరూ పట్టించుకోలేదన్న బాధిత కుటుంబాలు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer Movie). శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది.అయితే మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఏపీలోని రాజమండ్రిలో భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో రామ్ చరణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు. శనివారం నిర్వహించిన ఈవెంట్లో గేమ్ ఛేంజర్ టీమ్ అంతా పాల్గొన్నారు.ఇంటికి వెళ్తుండగా విషాదం..అయితే అభిమాన హీరో ఈవెంట్‌కు హాజరైన ఇద్దరు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు ఫ్యాన్స్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ ఢీ కొట్టడంతో మరణించారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.ఎవరూ పట్టించుకోలేదు.. బాధిత కుటుంబాల ఆవేదన..తాము కన్న కుమారులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న తమను ఎవరూ కూడా పరామర్శించలేదని బాధితుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్దకు ఎవరూ రాలేదని.. చాలా నరకం అనుభవించామని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు.బాధితు కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ..' పరామర్శించడానికి ఎవరూ రాలేదండి. ఆదివారమంతా మేము నరకం అనుభవించాం. మమ్మల్ని ఎవరు పట్టించుకున్నా పాపాన పోలేదు. మాకు మేమే వాళ్ల కాళ్లు, వీళ్ల కాళ్లు పట్టుకుని సొంతంగా పోస్టుమార్టం చేయించుకున్నాం. ఏ రాజకీయ నాయకుడు కూడా మా గురించి పట్టించుకోలేదు. మేము ఫోన్ చేసినా ఎవరూ కూడా రెస్పాండ్ కాలేదండి. ఇప్పటి వరకు కూడా ఎవరూ మా వద్దకు రాలేదు. పరామర్శించేదు' అని అన్నారు.సంతాపం ప్రకటించిన రామ్ చరణ్.. రూ.10 లక్షల సాయంఅభిమానుల మృతిపై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆ ఘటన గురించి తెలిసిన వెంటనే అభిమానుల ఇంటికి తన మనుషులను పంపించి ధైర్యం చెప్పించారు. మృతి చెందిన అభిమానుల రెండు కుటుంబాలకు చెరొక ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.రామ్ చరణ్ మాట్లాడుతూ... 'ఈవెంట్ చూసేందుకు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాం. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం. అభిమానుల కుటుంబాలు ఎంత బాధ పడతాయో అర్థం చేసుకోగలను. నాకూ అంతే బాధగా ఉంది. అభిమానుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను' అని అన్నారు.గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్జే సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో కేవలం ఐదు పాటల కోసమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు పెట్టారు. ఓ నిజాయితీ ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీతి పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పోరాటమే గేమ్ ఛేంజర్ కథ. -
గేమ్ ఛేంజర్ ఈవెంట్: మృతుల కుటుంబాలకు రామ్‌చరణ్ ఆర్థిక సాయం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'గేమ్ చేంజర్' (Game Changer Movie). జనవరి 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. శనివారం రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు హాజరయ్యారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ ఢీ కొట్టడంతో మరణించారు.సంతాపం ప్రకటించిన చరణ్అభిమానుల మృతిపై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆ ఘటన గురించి తెలిసిన వెంటనే అభిమానుల ఇంటికి తన మనుషులను పంపించి ధైర్యం చెప్పించారు. మృతి చెందిన అభిమానుల రెండు కుటుంబాలకు చెరొక ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.అర్థం చేసుకోగలనురామ్ చరణ్ మాట్లాడుతూ...''ఈవెంట్ చూసేందుకు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాం. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం. అభిమానుల కుటుంబాలు ఎంత బాధ పడతాయో అర్థం చేసుకోగలను. నాకూ అంతే బాధగా ఉంది. అభిమానుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను'' అన్నారు.సినిమాగేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్జే సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో కేవలం ఐదు పాటల కోసమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు పెట్టారు. ఓ నిజాయితీ ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీతి పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పోరాటమే గేమ్ ఛేంజర్ కథ. -
‘‘ఒరేయ్ పిచ్చోడా .. పవనన్న చెప్తాడంతే రా!’’
ఒక హీరో కోసం జనాలు ఎగబడితే.. అది కొండంత అభిమానం అంటారు. అదే అభిమానం హద్దు మీరితే.. ఇదెక్కడి అభిమానం? అని తిట్టిపోస్తారు. ప్రాణంపోయేంత అభిమానానికి కూడా అది వర్తిస్తుందని మొన్నటి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో చూశాం. అయితే ఈ ఘటనపై స్పందిస్తూ.. ఫ్యాన్స్ విషయంలో బాధ్యతతో వ్యవహరించాలంటూ సినిమావాళ్లకు నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాఠం చెప్పడం చూశాం. అయితే అది చెప్పడం వరకేనని.. ఆచరణలో లేదనేది తాజాగా రుజువైంది.గేమ్ ఛేంజర్ మెగాఈవెంట్కు హాజరైన ఇద్దరు అభిమానులు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ ఘటనపై ఇవాళ(జనవరి 6) ఎక్స్ వేదికగా ఏపీ డిప్యటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. ఘటన తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందని చెబుతూ.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతేకాదు జనసేన తరఫున ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. ఇది మంచి విషయమే. అయితే ఇది ఇక్కడితో ఆగి ఉంటే.. మెగా అభిమానులు సంతృప్తి చెందేవాళ్లు కావొచ్చు. కానీ.. ఈ ఘటనను కూడా రాజకీయం చేయాలని పవన్ అనుకున్నారు. అభిమానులు చనిపోయిన నెపాన్ని.. గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. గత ఐదేళ్లుగా కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్రమైందని.. గత ప్రభుత్వం ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదని.. రోడ్డు బాగు చేస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగిందని.. మెసేజ్ చేశారు. అంతేకాదు పైగా ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా వెళ్లమని చెప్పామంటూ.. వేగంగా వెళ్లి ప్రమాదానికి గురైన ఆ అభిమానులదే తప్పనేలా దుర్మార్గమైన వ్యాఖ్య ఒకటి చేశారు.‘‘సినిమా అంటే టీమ్.. అందరి భాగస్వామ్యం.అల్లు అర్జున్ తరఫున ఎవరో ఒకరు బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉంటే బాగుండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచి వేసింది. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు. మేమంతా అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది. తమ ప్రమేయం లేకుండా తప్పు జరిగి పోయిందని విచారం వ్యక్తం చేయాల్సింది. ఈ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది. అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది. పరామర్శించకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన అర్జున్‌లో ఉంది’’సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు, ప్రభుత్వానిది ఎలాంటి తప్పు లేదని.. అంతా అల్లు అర్జున్, చిత్ర యూనిట్‌దే అని పవన్ మాట్లాడారు. అల్లు అర్జున్ అరెస్ట్ సరైన పరిణామమే అని అర్థం వచ్చేలా మాట్లాడారు. అలాంటప్పుడు ఇప్పుడు రాం చరణ్‌ను అరెస్ట్ చేయిస్తారా?. ఒకవేళ నిజంగా ఆ డిమాండ్ ఒకటి తెర మీదకు(ఆఖరికి సోషల్ మీడియాలో అయినా సరే) వస్తే ప్రభుత్వంలో ఉన్న పవన్ ఏం చేస్తారు?. రోడ్డు ప్రమాదం, అందునా తాను స్వయంగా హాజరైన ఈవెంట్‌కు హాజరై వెళ్తున్న క్రమంలో మరణించిన వాళ్ల పట్ల ఇంత లూస్ టంగ్‌తో మాట్లాడొచ్చా? అనే అభిప్రాయం ఆయన చేసిన ట్వీట్ కామెంట్ సెక్షన్లోనే వ్యక్తం అవుతోంది.(కావాలంటే మీరే పరిశీలించుకోండి.. )నిజానికి.. అభిమానులతో పవన్ వ్యవహరించే తీరు చాలాసార్లు చర్చనీయాంశమైంది. గతంలో ఓపెన్‌గానే ఎన్నోసార్లు వాళ్ల మీద ఆయన చిరాకు ప్రదర్శించారు. ఆఖరికి.. వాళ్లు ఆయన్ని ఆకాశానికెత్తిన సందర్భంలోనూ అసహనం ప్రదర్శించారు. ఇప్పుడు.. చనిపోయింది మెగా అభిమానులు. రాం చరణ్(Ram Charan)ను, ప్రత్యేకించి తనను చూసేందుకు అంత దూరం నుంచి ఆత్రుతగా వచ్చారు. ఆ ఈవెంట్ పవన్ ఎలా మాట్లాడిందో చూశాం.. అభిమానుల్ని, అందునా యువతను రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడింది నిజం కాదా?. సినిమా ఫంక్షన్ లో చొక్కాలు చించుకోకపోతే ఎలా?. బైకు సైలెన్సర్లు తీయకుండా, ఎక్సలేటర్లు రేజ్ చేయకపోతే కిక్కు ఏం ఉంటుంది?ఆ వ్యాఖ్యలతో అభిమానులను ఎంతగా కేరింతలు కొట్టిందో చూశాం కదా!. అసలు ఆ ఈవెంట్ జరిగితే రెండు నిండు ప్రాణాలు పోయేవి కాదుగా!. చనిపోయాక.. చిత్ర నిర్మాత దిల్ రాజు, ఆ వెంటనే గేమ్ చేంజర్‌కు ఏమాత్రం సంబంధం లేదని పవన్ ఆర్థిక సాయం ప్రకటించడం దేనికి?. గత ప్రభుత్వం.. అంటూ ఇంకా ఎంత కాలం నిందలేసి తప్పించుకుంటారు?. ఇక్కడ ఎవరి తప్పు లేకపోవచ్చు. కానీ, అల్లు అర్జున్(Allu Arjun) విషయంలో పవన్ చెప్పినదానిబట్టి.. రాం చరణో, లేదంటే చిత్ర యూనిటో, అంతెందుకు అసలు పవన్ కల్యాణో బాధిత కుటుంబాలను పరామర్శిస్తే సరిపోయేది కదా!. ఇక్కడ మానవతా దృక్పథం లోపించినట్లు పవన్‌కు అనిపించలేదా?. అసలు ఇక్కడ రాజకీయ ప్రస్తావన దేనికి?. అంటే.. పవన్ నీతిపాఠాలు చెప్తారు కాని పాటించరన్నమాట!. హీరోల అభిమానులు ఈ విషయం ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.ఇదీ చదవండి: సీజ్ ద షిప్.. అట్టర్ ప్లాపు! -
Game Changer: కాఫీ కప్పులోనే ఊరి సెట్.. ఆ పాటకే 30 కోట్లు
గేమ్ ఛేంజర్ నుంచి ‘జరగండి’ లిరికల్ వీడియో వచ్చినప్పుడు చూసి నేను కాస్త నిరుత్సాహపడ్డాను. శంకర్ గారి మ్యాజిక్ మిస్ అయిందేంటి? అని డల్ అయ్యాను. కానీ రీసెంట్గా పూర్తి పాటను చూసి షాకయ్యాను. దాదాపు రూ.25-30 కోట్లు ఖర్చు పెట్టి ఈ పాటను తెరకెక్కించారు. కాఫీ కప్పులోనే ఊరి సెట్ వచ్చేలా శంకర్ ప్లాన్ చేశారు. థియేటర్లో ఆ పాట బ్లాస్ట్ అవ్వడం ఖాయం. ఆ ఒక్క పాటకే మనం పెట్టే టికెట్ డబ్బులు సరిపోయాయనిపిస్తుంది. అంతలా శంకర్ గారు మ్యాజిక్ చేశారు’ అన్నారు ప్రముఖ నటుడు ఎస్జే సూర్య. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటించగా, ఎస్ జే సూర్య కీలక పాత్ర పోషించాడు. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్ జే సూర్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ శంకర్ గారు నన్ను గేమ్ చేంజర్(Game Changer) కోసం పిలిచారు. గేమ్ చేంజర్ సెట్లో ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్లాను. నా పర్ఫామెన్స్ చూసి శంకర్ గారు ఇంప్రెస్ అయ్యారు. ఈ సినిమాలో నటనను చూసే నాకు ఇండియన్ 2లో అవకాశం ఇచ్చారు. శంకర్ గారితో పని చేయాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కీ ఉంటుంది. ఆయన ప్రతీ ఒక్క కారెక్టర్‌ను నటించి చూపిస్తారు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే స్క్రీన్ మీద మ్యాజిక్‌లా కనిపిస్తుంది.→ ఈ చిత్రంలో రామ్ చరణ్(Ram Charan) డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎంతో హుందాగా కనిపిస్తారు. అప్పన్న పాత్ర అయితే లైఫ్ టైం గుర్తుండిపోయేలా ఉంటుంది. ఆ అప్పన్న పాత్రలో రామ్ చరణ్ గారు అద్భుతంగా నటించారు.→ నటుడిగా ఓ సినిమా చేస్తున్నప్పుడు నేను దర్శకత్వ విభాగంలో వేలు పెట్టను. నటుడిగా ఉన్నప్పుడు కేవలం నటుడిగానే ఆలోచించాలి. శంకర్(Shankar) గారికి సలహాలు, సూచనలు ఇచ్చే స్థాయి నాకు లేదు. ఆయన చాలా విజనరీ డైరెక్టర్. రాజమౌళి వంటి వారే శంకర్ గారి గురించి గొప్పగా చెప్పారు. ఓ కథను నమ్మి డబ్బులు పెడితే ఇంత బాగా తిరిగి వస్తుందని నమ్మకం కలిగించిందే శంకర్ గారు అని రాజమౌళి సర్ చాలా గొప్ప విషయాన్ని చెప్పారు.→ ఓ నిజాయితీగా ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీత పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే వార్‌ను గేమ్ చేంజర్‌లో చూపిస్తారు. ఈ రెండు పాత్రల మధ్య సీన్లను ఎలా చిత్రీకరించారు.. ఎంత బాగా కథనాన్ని శంకర్ గారు రాశారు అన్నది మీరు థియేటర్లోనే చూడాల్సింది. ఈ చిత్రం అద్భుతంగా ఉండబోతోంది. అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందరినీ అలరించేలా ఈ మూవీ ఉంటుంది.→ గేమ్ చేంజర్ సెట్‌కు వచ్చే ముందు నేను చాలా ప్రిపేర్ అయ్యేవాడిని. దర్శకుడికి ఏం కావాలి?.. సీన్ ఎలా ఉండాలి?.. డైలాగ్ ఎలా చెప్పాలి? అనే విషయంలో చాలా ప్రిపేర్ అయ్యేవాడిని. కానీ డబ్బింగ్ చెప్పే టప్పుడు చాలా కష్టంగా అనిపించింది. నాకు శంకర్ గారు అద్భుతమైన పాత్రను ఇచ్చారు. ఈ కారెక్టర్‌ను నేను చాలా ఎంజాయ్ చేశాను. అందుకే తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పాను. నాకు హిందీ అంతగా రాదు. కానీ డబ్బింగ్ మాత్రం అద్భుతంగా చెప్పాను. నా హిందీ డబ్బింగ్ కోసమైనా మీరంతా రెండో సారి హిందీలో సినిమా చూడాలి (నవ్వుతూ).→ గేమ్ చేంజర్‌లో శంకర్ గారు క్రియేట్ చేసిన ప్రతీ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఇంత వరకు నేను పూర్తి సినిమాను చూడలేదు. కానీ కొన్ని రషెస్ చూశాను. రామ్ చరణ్ గారి సీన్లు, నా సీన్లు అద్భుతంగా వచ్చాయి. మా ఇద్దరి మధ్య ఉండే సీన్లు ఆడియెన్స్‌కు మంచి కిక్ ఇస్తాయి.→ నాకు నటుడిగా చాలా కంఫర్ట్ ఉంది. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు. రాజమండ్రికి వెళ్లినప్పుడు అకిరా నందన్‌ను ఫ్లైట్‌లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. ఒక వేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే.. టైం కలిసి వస్తే..ఖషి2 తెరకెక్కిస్తాను. -
రామ్ చరణ్ స్టెప్స్ కి థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
-
క్లీంకారను అప్పుడే అందరికీ చూపిస్తా!: రామ్‌చరణ్
ఈ సంక్రాంతికి మోత మోగిపోద్ది అంటూ ముగ్గురు హీరోలు ముందుకు వచ్చేస్తున్నారు. రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్'తో జనవరి 10న, నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్'తో జనవరి 12న, వెంకటేశ్ 'సంక్రాంతికి వచ్చేస్తున్నాం'తో జనవరి 14న థియేటర్లలో సందడి చేయనున్నారు. రెండు రోజుల గ్యాప్‌తో వరుసగా మూడు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ముగ్గురూ ప్రమోషన్ల స్పీడు పెంచారు.అన్‌స్టాపబుల్ షోలో గేమ్ ఛేంజర్ టీమ్ఇటీవలే డాకు మహారాజ్ టీమ్ అన్‌స్టాపబుల్ షోకి విచ్చేసింది. దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ జనవరి 3న రిలీజైంది. ఇప్పుడు అన్‌స్టాపబుల్ షోలోకి గేమ్ ఛేంజర్ టీమ్ రానుంది. రామ్‌చరణ్‌తో పాటు, నిర్మాత దిల్ రాజు షోలో సందడి చేశారు. ఈ మేరకు ప్రోమో రిలీజైంది.(చదవండి: ఈ విషయం తెలిసుంటే 'బేబీ జాన్'లో నటించేదానినే కాదు: కీర్తి సురేష్)మనవడు కావాలి!వచ్చీరావడంతోనే చరణ్‌ను చిక్కుల్లో పడేశారు. ఈ ఏడాది మాకొక మనవడు కావాలంటూ తల్లి సురేఖ, నానమ్మ అంజనమ్మ కోరిక కోరారు. దానికి చెర్రీ చిరునవ్వుతోనే సమాధానం దాటవేశాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు.. ఈ ముగ్గురిలో ఎవరితో పార్టీకి వెళ్తావని బాలకృష్ణ అడగ్గా.. వీళ్లెవరితోనూ కాదు, అరవింద్‌తో పార్టీకి వెళ్తానని సమాధానమిచ్చాడు. అనంతరం క్లీంకార పుట్టిన సమయంలోని ఆనందకర క్షణాలను వీడియో వేసి చూపించడంతో చరణ్ భావోద్వేగానికి లోనయ్యాడు. (చదవండి: సంక్రాంతి రేసులో మూడు సినిమాలు.. ఏపీలో టికెట్ ధరలు పెంపు)కూతురికి చరణ్ గోరుముద్దలుక్లీంకారకు చరణే అన్నం తినిపిస్తాడని, అతడు తినిపిస్తే కానీ పాప తినదని అంజనమ్మ చెప్పింది. పొద్దున రెండు గంటలు పాపకే సమయం కేటాయిస్తాను. తను ఎప్పుడైతే నన్ను నాన్న అని పిలుస్తుందో అప్పుడే అందరికీ క్లీంకారను చూపిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఉపాసన అంటే భయమా? అన్న ప్రశ్నకు చరణ్.. నన్ను వదిలేయండంటూ చేతులెత్తి వేడుకున్నాడు. ఫుల్ ఎపిసోడ్ జనవరి 8న ఆహాలో విడుదల కానుంది.సినిమాగేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వాణీ కథానాయిక. అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలోని ఐదు పాటల కోసం ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేశానని నిర్మాత దిల్ రాజు స్వయంగా వెల్లడించాడు. రెండు గంటల 45 నిమిషాల నిడివితో ఈ మూవీ రానుంది. వినయ విధేయ రామ తర్వాత చరణ్- కియారా జంటగా నటిస్తున్న రెండో చిత్రమిది. చదవండి: 'డాకు మహారాజ్'కు తారక్ ఫ్యాన్స్ అన్ స్టాపబుల్ వార్నింగ్ -
సంక్రాంతి రేసులో మూడు సినిమాలు.. ఏపీలో టికెట్ ధరలు పెంపు
కొత్త ఏడాది ప్రారంభంలోనే మూడు టాప్ సినిమాలు విడుదల కానున్నాయి. రామ్ చరణ్ (గేమ్ ఛేంజర్), బాలకృష్ణ (డాకు మహారాజ్), వెంకటేశ్ (సంక్రాంతికి వస్తున్నాం) వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. అయితే, ఏపీలో ఈ చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునే సౌలభ్యం ప్రభుత్వం కల్పించింది. బెనిఫిట్ షోలతో పాటు అదనపు ఆటలకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.గేమ్ ఛేంజర్ టికెట్ ధరలు ఇలారామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో నిర్మాత దిల్ రాజ్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 10న తెల్లవారుజామున ఒంటిగంటకు బెనిఫిట్ షో వేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనికి ఒక్కో టికెట్ ధర రూ.600గా నిర్ణయించింది. అయితే, మొదటి రోజు 4గంటల ఆట నుంచి టికెట్ ధరలు ఇలా ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.175, సింగిల్ థియేటర్స్‌లలో రూ.135 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. ఫస్ట్ డే నాడు ఆరు షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ రోజుకు 5 షోలు ఉండనున్నాయి. పెంచిన ధరలు 23వ తేదీ వరకు ఉంటాయి. 'డాకు మహారాజ్' టికెట్ ధరలునందమూరి బాలకృష్ణ- బాబీ సినిమా 'డాకు మహారాజ్'. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు. జనవరి 12న విడుదల కానున్న మూవీకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో కోసం అనుమతితో పాటు ఒక్కో టికెట్ రూ.500కు విక్రయించేందుకు అనుమతిచ్చింది. రోజుకు ఐదు షోలతో పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.135, సింగిల్ థియేటర్స్‌లలో రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 23 వరకు ఈ ధరలు ఉంటాయి.సంక్రాంతికి వస్తున్నాం టికెట్ ధరలువెంకటేశ్- అనిల్ రావిపూడి హిట్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది. రోజుకు ఐదు షోలు నిర్వహించుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి కల్పించింది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.125, సింగిల్ థియేటర్స్‌లలో రూ.100 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 28 వరకు ఈ ధరలు ఉంటాయి. -
మూలాలు మరచిపోకూడదు: పవన్ కల్యాణ్
‘‘తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్.టి. రామారావుగారిని స్మరించుకుంటున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడికి వచ్చిందంటే దానికి స్ఫూర్తి అక్కినేని నాగేశ్వర రావు, ఎన్.టి. రామారావు, ఘట్టమనేని కృష్ణ, శోభన్ బాబుగార్లు.. ఇలా ఎంతో మంది పెద్దలే. తెలుగు చిత్ర పరిశ్రమ కోసం ఎంతో మంది పెద్దలు శక్తి యుక్తులు ధారపోశారు... వారందరికీ ధన్యవాదాలు. మన మూలాలను మరచిపోకూడదు. పవన్ కల్యాణ్ ఉన్నా, రామ్‌చరణ్ ఉన్నా దానికి మూలం చిరంజీవిగారు. నేనెప్పుడూ మూలాలు మరచిపోను’’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు.రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్గార్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. భారతదేశం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమవైపు చూస్తోందంటే దానికి కారణం శంకర్‌గారు. ‘రంగస్థలం’ చూసి చరణ్‌కి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలని కోరుకున్నా. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్æస్టార్ కాకుండా ఏమవుతాడు. ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ చూస్తే... మంచి సామాజిక సందేశం ఉన్న సినిమా అనిపించింది. సినిమాని సినిమాగానే చూడండి.కిందపడిపోయి, మీద పడిపోయి, తొక్కిసలాటలో హీరోని చూడటం కంటే కూడా... దూరంగా నిలబడి మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిమాండ్ అండ్ సప్లయ్ వల్లే టికెట్ల ధరలు పెంచుతున్నాం. ప్రభుత్వానికి 18 శాతం జీఎస్టీని పన్ను రూపంలో కడుతున్నాం... చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమడం మాకు ఇష్టం లేదు. సినిమాలు తీసేవాళ్లే సినిమాల గురించి మాట్లాడాలి... తీయని వాళ్లు మాట్లాడకూడదు. సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్లు మాకు నచ్చరు. ఎన్డీయే కూటమి (బీజేపీ, టీడీపీ, జనసేన) తరఫున నేను చెబుతున్నా. సినిమాలు తీసేవాళ్లతోనే మేము మాట్లాడతాం... వారినే గుర్తిస్తాం. సినిమా టికెట్ల ధరల పెంపుకోసం హీరోలు ఎందుకు రావాలి? అది మాకు ఇష్టం లేదు.మహా అయితే నిర్మాతలు రండి... లేదా మీ యూనియన్‌తో రండి. మేము ఇచ్చేస్తాం’’ అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘గేమ్ చేంజర్’ అనే టైటిల్‌ని శంకర్‌గారు ఎందుకు పెట్టారో తెలియదు. తెర మీద బహుశా మేము చేసే పాత్ర ఒక గేమ్ చేంజింగ్ అని పెట్టారేమో అనిపిస్తోంది’’ అని చెప్పారు. శంకర్ మాట్లాడుతూ– ‘‘మా అమ్మాయి పెళ్లికి ఆహ్వానించేందుకు పవన్ కల్యాణ్‌గారిని కలిశాను. ఆయనలాంటి మంచి వ్యక్తి మా ‘గేమ్ చేంజర్’ వేడుకకి వచ్చినందుకు థ్యాంక్స్’’ అని చెప్పారు. -
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మెగా హీరో రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ రేట్ల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 10న అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోకు అనుమతిచ్చింది. బెనిఫిట్ షో టికెట్ ధర రూ.600గా నిర్ణయించింది.జనవరి 23 వరకు రోజుకు ఐదు షోలుమొదటి రోజు ఆరు షోలకు అనుమతిచ్చింది. ఈ నెల 11 నుంచి 23వ తేదీ వరకు ఐదు షోలు వేసుకోవచ్చని తెలిపింది. సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ.135 పెంచగా.. మల్టీప్లెక్స్‌లో అదనంగా రూ.175 పెంచుకునేందుకు అంగీకరిచింది. ఈ మేరకు శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.సినిమా..గేమ్ ఛేంజర్ సినిమా (Game Changer Movie) విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ పూర్తి స్థాయిలో నటిస్తున్న చిత్రమిది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. అంజలి ముఖ్య పాత్ర పోషించింది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ జనవరి 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.చదవండి: మా అమ్మ ఎవర్నీ గాయపర్చలేదు, ఈ భారం మోయలేకున్నా!: పవిత్ర కూతురు -
రాజమౌళి, శంకర్ ఇద్దరూ టాస్క్ మాస్టర్లే : రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’(Game Changer). ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటించారు.జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్(Ram Charan) మాట్లాడుతూ.. ‘శంకర్ గారితో సినిమా చేయడం నా అదృష్ణం. ఆర్ఆర్ఆర్ టైంలో ఉన్నప్పుడే దిల్ రాజు గారు నాకు శంకర్ గారి సినిమా గురించి చెప్పారు. శంకర్ గారు కథ చెబుతారు వినండి అని దిల్ రాజు గారు అన్నారు. నేను వెంటనే షాక్ అయ్యాను. శంకర్ గారు చెప్పిన కథ అద్భుతంగా అనిపించింది. ఆయన ప్రతీ విషయంలో ఎంతో పర్టిక్యులర్‌గా ఉంటారు. ప్రతీ దాన్ని ఎంతో పర్ఫెక్ట్గా చేయాలని చూస్తుంటారు. (చదవండి: 72 రోజుల్లోనే షూటింగ్ పూర్తి.. ఐదు నిమిషాలే వృథా!)రాజమౌళి గారు, శంకర్ గారు ఇద్దరూ కూడా టాస్క్ మాస్టర్లే. సెట్లోకి నేను వచ్చినప్పుడు నన్ను కాకుండా నా హెయిర్‌ను చూశారు. ఆయన అనుకున్న దాని కంటే ఓ ఐదు శాతం తగ్గింది. అంత తీక్షణంగా ఆయన ప్రతీ ఒక్క విషయాన్ని పరిశీలిస్తుంటారు. ఆయనతో పని చేయడాన్ని నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఈ చిత్రంలో ఎస్ జే సూర్య గారు అద్భుతంగా నటించారు. కియారా(kiara advani)తో నేను చేసిన డ్యాన్సులు, పాటలు అందరినీ అలరిస్తాయి. మేం డల్లాస్‌లో చేసిన ఈవెంట్‌కు అంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. డల్లాస్‌లో మాకు అపరమితమైన ప్రేమ లభించింది. గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న రాబోతోంది. అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.దిల్ రాజు మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ కోసం ఏదైనా కొత్తగా చేద్దామని డల్లాస్‌లో ఈవెంట్‌ను ప్లాన్ చేశాం. డల్లాస్ ఈవెంట్ బ్లాక్ బస్టర్ అయింది. గేమ్ చేంజర్ చిత్రంలో ఐదు పాటలుంటాయి. ఈ పాటలకు 75 కోట్లు ఖర్చు అయ్యాయి. ఒక్కో పాట పది రోజులకు పైగా చిత్రీకరించారు. అన్నీ కూడా శంకర్ మార్క్‌లోనే ఉంటాయి. నా బ్యానర్లో ఇది 50వ సినిమా. అందుకే ఈ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా భారీ ఎత్తున నిర్మించాలని అనుకున్నాం. ఈ కథ విన్నప్పుడే పెద్ద హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యాను. అప్పుడే ఈ సినిమా రామ్ చరణ్‌కు అయితే బాగుంటుందని అనుకున్నా. ఈ సినిమా కోసం సపోర్ట్ చేసిన ప్రతీ ఆర్టిస్ట్‌కు థాంక్స్’ అని అన్నారు.ఎస్ జే సూర్య మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్‌లో పని చేయడం ఆనందంగా ఉంది. శంకర్ గారు, రామ్ చరణ్ గారితో పని చేయడం నాకు గర్వంగా అనిపిస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్‌గా ఎదిగారు. చాలా మంచి యాక్టర్. ఈ చిత్రంలో ఐఏఎస్ రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. కియారా, రామ్ చరణ్ చేసిన పాటలు, డ్యాన్సులు అదిరిపోతాయి. ఈ చిత్రంలో నేను హిందీలో డబ్బింగ్ చెప్పాను. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. మేం సినిమా గురించి ఎక్కువ మాట్లాడకూడదు. జనవరి 10న ఈ సినిమా ఏంటో మీకు తెలుస్తుంది’ అని అన్నారు. -
గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హీరోయిన్ డుమ్మా.. ఎందుకంటే?
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ (Game Changer Movie) వచ్చేవారమే రిలీజ్ కానుంది. సంక్రాంతి కంటే ముందుగానే జనవరి 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన పాటలకు, ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. శనివారం (జనవరి 4న) ముంబైలో గేమ్ ఛేంజర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు చరణ్, ఎస్జే సూర్య, దిల్ రాజు ఇలా అందరూ విచ్చేశారు. కానీ హీరోయిన్ కియారా మాత్రం ఎక్కడా కనిపించలేదు.ఈవెంట్‌కు డుమ్మా.. ఎందుకంటే?తను ఆస్పత్రిపాలైందని, అందుకే ఈవెంట్‌కు రాలేదని ప్రచారం జరుగుతోంది. దీనిపై కియారా టీమ్ క్లారిటీ ఇచ్చింది. తను బాగానే ఉందని తెలిపింది. నాన్‌స్టాప్‌గా పని చేస్తుండటం వల్ల కియారాను విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారని, అందుకే తను ఈవెంట్‌కు హాజరవలేదని వివరణ ఇచ్చింది.ఐదు పాటల కోసం..ఇదిలా ఉంటే ఈ సమావేశంలో నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర విషయం బయటపెట్టాడు. 'ఈ సినిమాలో ఐదు పాటల కోసం రూ.75 కోట్లు ఖర్చు పెట్టాం. నానా హైరానా పాట కోసం న్యూజిలాండ్‌లో పదిరోజులు షూట్ చేశాం. రా మచ్చా రా పాట కోసం వైజాగ్, అమృత్సర్ వెళ్లాం. రిహార్సల్స్ అన్నీ కలిపితే రూ.75 కోట్ల కన్నా ఇంకా ఎక్కువే అవుతుంది' అని చెప్పుకొచ్చాడు.వీరి కాంబినేషన్లో రెండో మూవీశంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అంజలి, ఎస్జే సూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ రెండు గంటల 45 నిమిషాల నిడివితో రానుంది. వినయ విధేయ రామ తర్వాత చరణ్- కియారా జంటగా నటిస్తున్న రెండో చిత్రమిది. ఇదిలా ఉంటే విజయవాడలో 256 అడుగులతో రామ్ చరణ్ కటౌట్ ఏర్పాటు చేశారు. దేశంలో అతి పెద్ద కటౌట్‌గా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్‌లో ఇది చోటు దక్కించుకుంది. After #Prabhas #Yash Now #Ramcharan Entered SIMPLE and HUMBLE in NORTH Event [#GameChanger] 🔥🔥🔥🔥🔥 pic.twitter.com/BgDeNDIf4k— GetsCinema (@GetsCinema) January 4, 2025 చదవండి: గోవిందాను పెళ్లి చేసుకోవాల్సిందన్న హీరోయిన్.. నటుడి భార్య ఏమందంటే? -
గేమ్ చేంజర్ ను టెన్షన్ పెడుతున్న వెంకీ
-
టీవీలో నాన్నను చూసి మురిసిపోయిన క్లీంకార..వీడియో వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన గారాలపట్టి క్లీంకార(Klin Kaara ) తొలిసారి టీవీలో నాన్నను చూసి మురిసిపోయింది. బుల్లితెరపై నాన్న కనిపించగానే ముద్దు ముద్దుగా మాట్లాడుతూ చరణ్ అలా చూస్తూ ఉండిపోయింది. దీనికి సంబంధించిన వీడియోని రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఎక్స్‌లో పోస్ట్ చేయగా..అది కాస్త వైరల్‌గా మారింది.వీడియోలో ఏముందంటే..?మెగా మనవరాలు క్లీంకార, ఉపాసన కలిసి ఇంట్లో టీవీలో రామ్‌చరణ్(Ram Charan) నటించిన ‘ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’డాక్యుమెంటరీ వీక్షిస్తున్నారు. ఈ సమయంలో తెరపై చరణ్ కనిపించగానే..క్లీంకార మురిసిపోయింది. నాన్నను చూపిస్తూ.. అలా ఉండిపోయింది. అంతేకాదు మా నాన్న అన్నట్లుగా సైగలు చేస్తూ.. హాయ్ చెప్పింది. తన తండ్రిని తొలిసారి బుల్లితెరపై చూసి క్లీంకార ఆనందం వ్యక్తం చేసిందంటూ ఉపాసన ట్వీట్ చేసింది.‘రామ్ చరణ్‌ని చూస్తుంటే గర్వంగా ఉంది. గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. కాగా, ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్గా నటించింది. దిల్ రాజు నిర్మాత. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఓటీటీలో ఆర్ఆర్ఆర్ డ్యాక్యుమెంటరీరాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటుతూ..ఆస్కార్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి పడిన కష్టాన్ని తెలియజేస్తూ ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. ‘ఆర్ఆర్ఆర్-బిహైండ్ అండ్ బియాండ్’(RRR Behind and Beyond)పేరుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తాన్ని ఎలా తీశారో రాజమౌళి వ్యాఖ్యానంతో పాటు టెక్నీషియన్స్ కామెంట్స్ కూడా ఈ డాక్యూమెంటరీలో ఉన్నాయి. Klinkaara excited to see her naana on TV for the first time. ❤️❤️❤️❤️❤️@AlwaysRamCharan sooo proud of u. Eagerly waiting for game changer. ❤️ pic.twitter.com/C8v9Qrv6FP— Upasana Konidela (@upasanakonidela) January 4, 2025 -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. రిలీజ్‌కు ముందే షాక్!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్- రామ్ చరణ్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. గురువారం టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. రిలీజైన గేమ్ ఛేంజర్ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కైతే గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ మూవీ సినీ ప్రియులను అలరించనుంది.రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి నాలుగు పాటలు, టీజర్, ట్రైలర్‌ను విడుదల చేశారు. రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా ప్రమోషన్స్ చేయనున్నారు. ఏపీలోని రాజమండ్రిలో జనవరి 4న భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.అయితే గేమ్ ఛేంజర్ టీమ్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉండగా.. అక్కడ మాత్రం ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. కర్ణాటకలో సినిమాకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. దీంతో అక్కడి ఫ్యాన్స్ కొందరు సినిమా పోస్టర్లపై స్ప్రే కొడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో ఎస్జే సూర్య, సముద్రఖని, శ్రీకాంత్, జయరాం కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాపై మొదటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. View this post on Instagram A post shared by Great India (@greatindiatelugu) -
‘గేమ్ ఛేంజర్’ HD మూవీ స్టిల్స్
-
Game Changer : ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
లుక్కు మారింది.. కిక్కు ఖాయం
సంవత్సరం మారింది... లుక్ మార్చి బాక్సాఫీస్ లెక్కలు కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు కొందరు హీరోలు. ఇందు కోసం కథానుగుణంగా గెటప్ మార్చేశారు. ఇలా సరికొత్త లుక్‌లో తమ అభిమాన హీరోలు కనిపించడానికి అభిమానులకు ఓ కిక్కు అని ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక ఈ ఏడాది స్క్రీన్‌పై ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం.సరికొత్త మహేశ్ మహేశ్‌బాబు కెరీర్లో ఇప్పటివరకు ఇరవై ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. అయితే స్క్రీన్‌పై ఎప్పుడూ కనిపించనంత కొత్తగా మేకోవర్ అయ్యే పనిలో పడ్డారు మహేశ్‌బాబు. రాజమౌళి డైరెక్షన్‌లోని కొత్త సినిమా కోసమే మహేశ్‌బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాలోని లుక్, మేకోవర్ కోసం ఆయన జర్మనీలో కొంత సమయం గడిపారు. గురువారం ఈ సినిమా లాంచ్ జరిగింది. కానీ మహేశ్ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి అండ్ టీమ్. ఈ సినిమాలో మహేశ్ లాంగ్ హెయిర్‌తో, కాస్త గెడ్డంతో కనిపిస్తారని ఇటీవల బయటికొచ్చిన ఆయన ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాజా సాబ్ ప్రభాస్ తొలిసారిగా చేస్తున్న హారర్ మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ రెండు గెటప్స్‌లో ఉన్న లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే ప్రభాస్ కుర్చీలో కూర్చున్న ఓ గెటప్ మాత్రం కొత్తగా అనిపిస్తోంది. అలాగే ప్రభాస్ ఇటీవల ఎక్కువగా రగ్డ్ లుక్‌తో, గెడ్డంతోనే కనిపించారు. కానీ ‘రాజాసాబ్’లో మాత్రం క్లీన్ షేవ్‌తో ఓ గెటప్, కాస్త రగ్డ్ లుక్‌తో మరో గెటప్‌లో కనిపిస్తారు.మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. అయితే విడుదల విషయంలో మార్పు ఉండొచ్చనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అలాగే ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే పోలీస్ యాక్షన్ డ్రామా చిత్రం కమిటయ్యారు ప్రభాస్. ఈ చిత్రంలోనూ ప్రభాస్ ఓ డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారని టాక్. ఆ మేకోవర్ కోసం హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులను సంప్రదిస్తున్నారట సందీప్ రెడ్డి వంగా.రగ్డ్ పెద్ది ‘గేమ్ చేంజర్’ మూవీలో రామ్‌చరణ్ క్లీన్ షేవ్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం గుబురు గడ్డం, కాస్త లాంగ్ హెయిర్‌తో రగ్డ్గా కనిపిస్తున్నారు. చరణ్ ఇలా కొత్తగా మేకోవర్ అయ్యింది తన లేటెస్ట్ మూవీ కోసం అని ఊహించవచ్చు. రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.ఈ సినిమా కోసమే రామ్‌చరణ్ కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇందుకోసం రామ్ చరణ్ విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారని తెలిసింది. ఫిజిక్ విషయంలోనే కాదు... హెయిర్ స్టైల్‌తోనూ చరణ్ కొత్తగా కనిపిస్తారు. ‘పెద్ది’ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరిగింది. ఈ షెడ్యూల్లో సెలిబ్రిటీ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పాల్గొని, రామ్‌చరణ్ హెయిర్ స్టైల్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఆఫీసర్ అర్జున్ సర్కార్ రోల్‌కు తగ్గట్లుగా నాని మౌల్డ్ అవుతుంటారు. తాజాగా అర్జున్ సర్కార్ పాత్ర కోసం నాని కొంత మేకోవర్ అయ్యారు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్ 3’. ఈ మూవీలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఈ చిత్రంలో నాని కొన్ని సీన్స్‌లో ఫుల్ వైట్ హెయిర్‌తో కనిపిస్తారని తెలిసింది. అంటే... ఓ సీనియర్ పోలీసాఫీసర్ లెక్క అన్నమాట. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ‘హిట్ 3’ మే 1న రిలీజ్ కానుంది. అలాగే ‘దసరా’ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఫుల్ వయొలెన్స్‌తో సాగే ఈ చిత్రంలో ఓ ఫిరోషియస్ లుక్‌లో నాని కనిపించనున్నారు. ఇందుకోసం నాని ప్రత్యేకంగా మేకోవర్ కావాల్సి ఉంది. ‘హిట్ 3’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత నాని కొత్త మేకోవర్ స్టార్ట్ అవుతుందని ఊహించవచ్చు.రొమాంటిక్ లవ్‌స్టోరీ గతేడాది వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కాస్త మాసీ లుక్‌లో కనిపించారు హీరో రామ్. తన తాజా చిత్రం కోసం రామ్ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ కోసం లాంగ్ హెయిర్ పెంచారు రామ్. అలాగే బరువు కూడా తగ్గారు. యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్‌లోకి వచ్చే చాన్స్ ఉంది. స్పై డ్రామా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో ఫ్యామిలీ మేన్‌లా కనిపించారు విజయ్ దేవరకొండ. అయితే ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో అందుకు భిన్నంగా కనిపించనున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లుగా తెలిసింది. దీంతో పోలీస్ రోల్‌కు తగ్గట్లుగా షార్ట్ హెయిర్‌తో, కరెక్ట్ ఫిజిక్‌తో కనిపించనున్నారట విజయ్. కాగా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో విజయ్ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఈ సీన్స్‌లో విజయ్ లుక్ రగ్డ్గా... చాలా మాస్‌గా ఉంటుందని సమాచారం. ఇలా ఈ చిత్రంలో విజయ్ రెండు గెటప్స్‌లో కనిపించనున్నారట. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీలో మార్పు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.మాస్ సంబరాలు ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాలో సాయి దుర్గా తేజ్ మేకోవర్ చూశారుగా... మాసీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ మాస్ సినిమా కోసం ఫిజికల్‌గా చాలా హార్డ్‌వర్క్ చేశారు సాయి దుర్గాతేజ్. సిక్స్‌ఫ్యాక్ చేశారు. కేపీ రోహిత్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, దాదాపు రూ. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.లేడీ గెటప్‌లో.. మాసీ లుక్స్‌తో కనిపించే విశ్వక్ సేన్ తొలిసారిగా లైలాగా అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. ఓ అబ్బాయి లేడీ గెటప్‌లో నటించాలంటే స్పెషల్‌గా మేకోవర్ అవ్వాల్సిందే. అలా లైలాగా కనిపించడానికి విశ్వక్ మౌల్డ్ అయ్యారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోను, లైలా అనే అమ్మాయి... ఇలా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు విశ్వక్ సేన్. లెనిన్‌గా... ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ హీరోగా చేయాల్సిన నెక్ట్స్ మూవీపై మరో అధికారిక ప్రకటన రాలేదు. అయితే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరితో అఖిల్ ఓ మూవీ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని, ఆల్రెడీ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని, ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే ఈ సినిమా కథ అనంతపురం నేపథ్యంలో సాగుతుందని, లెనిన్ పాత్ర కోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారని తెలిసింది.పీరియాడికల్ వార్ హీరో నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘స్వయంభూ’. పీరియాడికల్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం నిఖిల్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. చెప్పాలంటే గత ఏడాదిగా ఈ లుక్‌నే మెయిన్టైన్ చేస్తున్నారు నిఖిల్. లాంగ్ హెయిర్‌తో, స్ట్రాంగ్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు నిఖిల్. అంతే కాదు... ఈ సినిమా కోసం నిఖిల్ కొన్ని యాక్షన్ సీన్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ కోవలో మరికొందరు హీరోలు కూడా తమ కొత్త సినిమాల కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
బిగ్‌బాస్ షోకి వెళ్లనున్న రామ్‌చరణ్!
హీరో రామ్‌చరణ్ (Ram Charan) మరోసారి బిగ్‌బాస్ షోకి వెళ్లనున్నాడు. మొన్న తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా వచ్చి సందడి చేశాడు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ (Game Changer Movie) చిత్ర ప్రమోషన్స్ కోసం హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్‌కు వెళ్లనున్నాడట! వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో చరణ్ స్టేజీపై కనిపించనున్నాడంటూ ప్రచారం ఊపందుకుంది.గేమ్ ఛేంజర్ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి వారికి హైప్ ఎక్కించడం కోసం చరణ్ బిగ్‌బాస్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. హోస్ట్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో ముచ్చటించి తన సినిమా ట్రైలర్‌ను చూపించనున్నారట! కాగా సల్మాన్- చరణ్ మధ్య ఇదివరకే స్నేహం ఉంది. (చదవండి: Game Changer: తగ్గిన రామ్ చరణ్ రెమ్యునరేషన్!)సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలోని ఏంటమ్మా పాటలో చరణ్, వెంకటేశ్ స్టెప్పులతో అదరగొట్టారు. సల్లూభాయ్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు చరణ్ ఇంటికి పిలిచి ఆతిథ్యమిస్తుంటాడు. అటు చరణ్ ముంబై వెళ్లినప్పుడు కూడా సల్మాన్ తనను ఇంటికి ఆహ్వానిస్తుంటాడు. వీరిద్దరి కలయిక కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. అంజలి కీలక పాత్ర పోషించింది. ఎస్జే సూర్య విలన్‌గా నటించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 10న విడుదల కానుంది.చదవండి: 'కలెక్టర్‌కి ఆకలేస్తోంది అంటా'... 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ చూసేయండి