
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోను ట్విటర్‌లో షేర్ చేశారు. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి శ్రీకృష్ణుని పూజలో పాల్గొన్నట్లు ఉపాసన ట్వీట్ చేసింది. క్లీంకారతో పాటు రామ్ చరణ్, చిరంజీవి సతీమణి సురేఖ కూడా పూజల్లో పాల్గొన్నారు.
కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఆ తర్వాత చెర్రీ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో పనిచేయనున్నారు. ఇందులో గ్లోబల్ స్టార్ సరసన జాన్వీకపూర్ నటించనుంది.
Amma & Kaara’s sweet simple puja. #HappyKrishnaJanmashtami 🙏❤️ pic.twitter.com/68LEYJISdy
— Upasana Konidela (@upasanakonidela) August 26, 2024