Klin Kaara Konidela
-
షూటింగ్లో బిజీగా రామ్ చరణ్.. సెట్లో క్లీంకార సందడి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ16తో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో చెర్రీ నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన ముద్దుల కూతురు క్లీంకారను ఎత్తుకుని ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.ఈ పోస్ట్ చూసిన ఉపాసన కామెంట్ చేసింది. ఫోమో అంటూ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది. మెగా హీరో వరుణ్ తేజ్ సైతం లవ్ సింబల్ పోస్ట్ చేశాడు. కాగా.. ఈ మూవీ షూటింగ్ తొలి షెడ్యూల్ కర్ణాటకలోని మైసూర్లో జరుగుతోంది. ఇక్కడ రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా తొలిసారిగా రామ్ చరణ్‌తో మూవీని తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
క్లీంకారను అప్పుడే అందరికీ చూపిస్తా!: రామ్‌చరణ్
ఈ సంక్రాంతికి మోత మోగిపోద్ది అంటూ ముగ్గురు హీరోలు ముందుకు వచ్చేస్తున్నారు. రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్'తో జనవరి 10న, నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్'తో జనవరి 12న, వెంకటేశ్ 'సంక్రాంతికి వచ్చేస్తున్నాం'తో జనవరి 14న థియేటర్లలో సందడి చేయనున్నారు. రెండు రోజుల గ్యాప్‌తో వరుసగా మూడు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ముగ్గురూ ప్రమోషన్ల స్పీడు పెంచారు.అన్‌స్టాపబుల్ షోలో గేమ్ ఛేంజర్ టీమ్ఇటీవలే డాకు మహారాజ్ టీమ్ అన్‌స్టాపబుల్ షోకి విచ్చేసింది. దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ జనవరి 3న రిలీజైంది. ఇప్పుడు అన్‌స్టాపబుల్ షోలోకి గేమ్ ఛేంజర్ టీమ్ రానుంది. రామ్‌చరణ్‌తో పాటు, నిర్మాత దిల్ రాజు షోలో సందడి చేశారు. ఈ మేరకు ప్రోమో రిలీజైంది.(చదవండి: ఈ విషయం తెలిసుంటే 'బేబీ జాన్'లో నటించేదానినే కాదు: కీర్తి సురేష్)మనవడు కావాలి!వచ్చీరావడంతోనే చరణ్‌ను చిక్కుల్లో పడేశారు. ఈ ఏడాది మాకొక మనవడు కావాలంటూ తల్లి సురేఖ, నానమ్మ అంజనమ్మ కోరిక కోరారు. దానికి చెర్రీ చిరునవ్వుతోనే సమాధానం దాటవేశాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు.. ఈ ముగ్గురిలో ఎవరితో పార్టీకి వెళ్తావని బాలకృష్ణ అడగ్గా.. వీళ్లెవరితోనూ కాదు, అరవింద్‌తో పార్టీకి వెళ్తానని సమాధానమిచ్చాడు. అనంతరం క్లీంకార పుట్టిన సమయంలోని ఆనందకర క్షణాలను వీడియో వేసి చూపించడంతో చరణ్ భావోద్వేగానికి లోనయ్యాడు. (చదవండి: సంక్రాంతి రేసులో మూడు సినిమాలు.. ఏపీలో టికెట్ ధరలు పెంపు)కూతురికి చరణ్ గోరుముద్దలుక్లీంకారకు చరణే అన్నం తినిపిస్తాడని, అతడు తినిపిస్తే కానీ పాప తినదని అంజనమ్మ చెప్పింది. పొద్దున రెండు గంటలు పాపకే సమయం కేటాయిస్తాను. తను ఎప్పుడైతే నన్ను నాన్న అని పిలుస్తుందో అప్పుడే అందరికీ క్లీంకారను చూపిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఉపాసన అంటే భయమా? అన్న ప్రశ్నకు చరణ్.. నన్ను వదిలేయండంటూ చేతులెత్తి వేడుకున్నాడు. ఫుల్ ఎపిసోడ్ జనవరి 8న ఆహాలో విడుదల కానుంది.సినిమాగేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వాణీ కథానాయిక. అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలోని ఐదు పాటల కోసం ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేశానని నిర్మాత దిల్ రాజు స్వయంగా వెల్లడించాడు. రెండు గంటల 45 నిమిషాల నిడివితో ఈ మూవీ రానుంది. వినయ విధేయ రామ తర్వాత చరణ్- కియారా జంటగా నటిస్తున్న రెండో చిత్రమిది. చదవండి: 'డాకు మహారాజ్'కు తారక్ ఫ్యాన్స్ అన్ స్టాపబుల్ వార్నింగ్ -
టీవీలో నాన్నను చూసి మురిసిపోయిన క్లీంకార..వీడియో వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన గారాలపట్టి క్లీంకార(Klin Kaara ) తొలిసారి టీవీలో నాన్నను చూసి మురిసిపోయింది. బుల్లితెరపై నాన్న కనిపించగానే ముద్దు ముద్దుగా మాట్లాడుతూ చరణ్ అలా చూస్తూ ఉండిపోయింది. దీనికి సంబంధించిన వీడియోని రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఎక్స్‌లో పోస్ట్ చేయగా..అది కాస్త వైరల్‌గా మారింది.వీడియోలో ఏముందంటే..?మెగా మనవరాలు క్లీంకార, ఉపాసన కలిసి ఇంట్లో టీవీలో రామ్‌చరణ్(Ram Charan) నటించిన ‘ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’డాక్యుమెంటరీ వీక్షిస్తున్నారు. ఈ సమయంలో తెరపై చరణ్ కనిపించగానే..క్లీంకార మురిసిపోయింది. నాన్నను చూపిస్తూ.. అలా ఉండిపోయింది. అంతేకాదు మా నాన్న అన్నట్లుగా సైగలు చేస్తూ.. హాయ్ చెప్పింది. తన తండ్రిని తొలిసారి బుల్లితెరపై చూసి క్లీంకార ఆనందం వ్యక్తం చేసిందంటూ ఉపాసన ట్వీట్ చేసింది.‘రామ్ చరణ్‌ని చూస్తుంటే గర్వంగా ఉంది. గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. కాగా, ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్గా నటించింది. దిల్ రాజు నిర్మాత. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఓటీటీలో ఆర్ఆర్ఆర్ డ్యాక్యుమెంటరీరాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటుతూ..ఆస్కార్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి పడిన కష్టాన్ని తెలియజేస్తూ ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. ‘ఆర్ఆర్ఆర్-బిహైండ్ అండ్ బియాండ్’(RRR Behind and Beyond)పేరుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తాన్ని ఎలా తీశారో రాజమౌళి వ్యాఖ్యానంతో పాటు టెక్నీషియన్స్ కామెంట్స్ కూడా ఈ డాక్యూమెంటరీలో ఉన్నాయి. Klinkaara excited to see her naana on TV for the first time. ❤️❤️❤️❤️❤️@AlwaysRamCharan sooo proud of u. Eagerly waiting for game changer. ❤️ pic.twitter.com/C8v9Qrv6FP— Upasana Konidela (@upasanakonidela) January 4, 2025 -
క్లీంకార ఫోటో షేర్ చేసిన ఉపాసన.. బాల్యం గుర్తొస్తోందంటూ..
రామ్‌చరణ్ సతీమణి ఉపాసన.. తమ గారాలపట్టి క్లీంకార ఫోటో షేర్ చేసింది. ముత్తాత (ఉపాసన తాతయ్య), తాతయ్య (ఉపాసన తండ్రి)తో కలిసి అపోలో ఆస్పత్రిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం జరిగిన పవిత్రోత్సవాల్లో చిన్నారి పాల్గొందని తెలిపింది. ఉపాసన ఎమోషనల్తాత చంకనెక్కిన క్లీంకారను చూస్తుంటే తన చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయంది. అలాగే ఈ గుడి తనకెంతో ప్రత్యేకమని పేర్కొంది. అలాగే ఈ ఆనందకర క్షణాలను వెలకట్టలేనని పోస్ట్ కింద రాసుకొచ్చింది. ఇక ఉపాసన షేర్ చేసిన ఫోటోలో క్లీంకార ముఖం స్పష్టంగా కనిపించకూడదని కాస్త బ్లర్ చేసింది.ఇంత పెద్దగా అయిపోయిందా?ఇది చూసిన అభిమానులు.. ఈ చిట్టితల్లిని ఇంకెప్పుడు చూస్తామో అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో క్లీంకార అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే రామ్‌చరణ్- ఉపాసన దంపతులకు 11 ఏళ్ల తర్వాత కూతురు పుట్టింది. 2023 జూన్‌లో జన్మించిన తన ముద్దుల మనవరాలికి చిరంజీవి క్లీంకార అని నామకరణం చేశారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: కడుపులో బిడ్డకు గ్యారెంటీ ఇవ్వమన్నారు: స్టెల్లా ఎమోషనల్ -
శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో క్లీంకార.. ఉపాసన పోస్ట్ వైరల్!
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి శ్రీకృష్ణుని పూజలో పాల్గొన్నట్లు ఉపాసన ట్వీట్ చేసింది. క్లీంకారతో పాటు రామ్ చరణ్, చిరంజీవి సతీమణి సురేఖ కూడా పూజల్లో పాల్గొన్నారు.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. ఆ తర్వాత చెర్రీ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో పనిచేయనున్నారు. ఇందులో గ్లోబల్ స్టార్ సరసన జాన్వీకపూర్ నటించనుంది. Amma & Kaara’s sweet simple puja. #HappyKrishnaJanmashtami 🙏❤️ pic.twitter.com/68LEYJISdy— Upasana Konidela (@upasanakonidela) August 26, 2024 -
కూతురికి రామ్‌చరణ్ బహుమతి.. ఆ గిఫ్ట్‌కు మగధీరతో లింక్!
రామ్‌చరణ్‌ను హీరోగా అందలం ఎక్కించిన సినిమా మగధీర. ఈ మూవీ చరణ్ జీవితంలోనే ఒక మైలురాయి వంటిది. ఇందులో కాళభైరవగా మెప్పించిన చెర్రీ గుర్రం స్వారీ చేస్తాడు. సినిమా అయిపోయాక తను స్వారీ చేసిన గుర్రాన్ని మర్చిపోలేక ఇంటికి తీసుకుపోయాడు. దానికి కాజల్ అని పేరు పెట్టుకుని తన ఫాంలో పెంచుతున్నాడు. ఈ ఒక్కటే కాదు అతడి ఫామ్‌హౌస్‌లో దాదాపు 15 గుర్రాలున్నాయి.గుర్రాలంటే ఇష్టందీని గురించి రామ్ చరణ్ ఇటీవల ఓ వేదికపై మాట్లాడుతూ.. 'నాకు మూగజీవాలంటే ఎంతో ఇష్టం. అలా నా ఫామ్‌హౌస్‌లో పెంచుకుంటున్న గుర్రాలపై ఎనలేని ప్రీతి. మగధీరలో నేను ఎక్కిన గుర్రం పేరు బాద్షా. షూటింగ్ అయిపోయాక ఆ గుర్రం కావాలని రాజమౌళిని అడిగి ఇంటికి తెచ్చేసుకున్నాను. ఈ మధ్యే అది బిడ్డకు జన్మనిచ్చింది. దాన్ని నా కూతురికి బహుమతిగా ఇచ్చాను. ఇంత చిన్నవయసులోనే క్లిన్‌కారా ఆ చిన్న గుర్రంపై ఎక్కి స్వారీ చేసేందుకు ప్రయత్నిస్తోంది.సినిమా..గుర్రపు స్వారీ విషయంలో నాది, నా కూతురి అభిరుచి ఒకేలా ఉంది' అని చరణ్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. కియారా అద్వానీ, ఎస్జే సూర్య, సముద్రఖని, అంజలి, జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ క్రిస్మస్కు విడుదల కానుంది.చదవండి: యానిమల్.. టైటిల్ చూస్తే తెలియట్లేదా?: బాలీవుడ్ నటుడు -
పారిస్ వీధుల్లో మనవరాలు క్లీంకారతో చిరంజీవి సందడి (ఫోటోలు)
-
భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్
మెగా హీరో రామ్ చరణ్ తన భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టాడు. అవును మీరు విన్నది నిజమే. తాజాగా ఈమె పుట్టినరోజు జరుపుకొంది. ఈ సందర్భంగా చాలామంది ఉపాసనకు విషెస్ చెప్పాడు. ఇకపోతే బర్త్ డే వేడుకల్ని చరణ్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసిన చెర్రీ.. కొత్త పేరు ఏంటనేది రివీల్ చేశాడు.(ఇదీ చదవండి: సితార పాప బర్త్ డే.. మహేశ్, నమ్రత స్పెషల్ విషెస్)రామ్ చరణ్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ సంగతేమో గానీ గత కొన్నాళ్లలో మెగా కోడలు ఉపాసన కూడా అంతకు మించిన క్రేజ్ సంపాదించారు. గతేడాది కూతురికి జన్మనిచ్చిన ఉపాసన.. ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీని చూసుకుంటూ మరోవైపు బిజినెస్ వ్యవహారాలు కూడా నిర్వర్తిస్తున్నారు. తాజాగా బర్త్ డే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు.ఇక పుట్టినరోజు ఫొటోని పోస్ట్ చేసిన చరణ్.. ఉపాసనని 'కారా మమ్మీ' అని రాసుకొచ్చాడు. నేరుగా ఉపాసన అని పిలవకుండా క్లీంకార తల్లి అని ఫన్నీగా సంభోదించాడు. దీనికి రిప్లై ఇచ్చిన ఉపాసన.. 'థ్యాంక్యూ మిస్టర్ సీ. నీ సెల్ఫీ స్కిల్స్ మాత్రం సూపర్' అని రాసుకొచ్చింది. ఇదిప్పుడు మెగాఫ్యాన్స్ని తెగ నచ్చేస్తోంది. ప్రస్తుతం చరణ్ 'గేమ్ ఛేంజర్' చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబరులో రిలీజ్ కావొచ్చు.(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
Klin Kaara Photos: గ్రాండ్‌గా క్లీంకార ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Klin Kaara Photos: మెగా మనవరాలు క్లీంకార ఫస్ట్ బర్త్ డే.. క్యూట్ ఫొటోలు
-
ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ క్యూట్ ఫొటో
మెగా హీరో రామ్ చరణ్ నుంచి ఫాదర్స్ డే స్పెషల్ ఫొటో వచ్చేసింది. ఇప్పటికే కూతురు క్లీంకార బుడిబుడి అడుగులు వేస్తుండగా.. తాజాగా ఆమెని ఎత్తుకుని, అలా గాల్లోకి ఎగరేస్తూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ చూస్తుంటే చరణ్- క్లీంకార మధ్య బాండింగ్ చూస్తుంటే మచ్చటేస్తోంది.(ఇదీ చదవండి: Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి)2012లో రామ్ చరణ్‌కి పెళ్లవగా.. గతేడాది జూన్‌లో కూతురు పుట్టింది. ఈమెకు క్లీంకార అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఇప్పటివరకు ముఖాన్ని చూపించకుండా దాచేశారు. సైడ్ లేదా బ్యాక్ నుంచి తీసిన కొన్ని ఫొటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. అలా ఇప్పుడు ఫాదర్స్ డే సందర్భంగా చరణ్-క్లీంకార ఫొటో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్‌కి తెగ నచ్చేస్తోంది.(ఇదీ చదవండి: ఊహించని పనిచేసి షాకిచ్చిన హీరో విశ్వక్ సేన్) -
12 ఏళ్లు పూర్తి.. మెగా కోడలు ఉపాసన పోస్ట్ వైరల్
మెగా కోడలు ఉపాసన మరో క్యూట్ ఫొటోతో వచ్చేసింది. రామ్ చరణ్‌తో పెళ్లి జరిగి 12 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే మెగా జంటకు అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో వాళ్లందరికీ ధన్యవాదాలు చెబుతూ సింపుల్ అండ్ క్యూట్ పోస్ట్ పెట్టింది. అయితే థ్యాంక్స్ చెప్పడంతో పాటు కూతురు క్లీంకాక లేటెస్ట్ ఫొటోని కూడా ఇందులో జోడించింది. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?)2012లో రామ్ చరణ్, ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. తొలుత ఈ జంట గురించి సోషల్ మీడియాలో రకరకాల మాటలు వినిపించాయి. కానీ రానురాను మెగా ఫ్యామిలీలోనే చరణ్-ఉపాసన.. వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్ అయిపోయారు. వీళ్లకు గతేడాది జూన్‌లో కూతురు పుట్టింది. ఈ బుజ్జాయికి క్లీంకార అని పేరు పెట్టుకున్నారు.పుట్టినప్పటి నుంచి కూతురు ముఖం మాత్రం ఉపాసన బయటపెట్టట్లేదు. ఇప్పుడు కూడా తను, చరణ్.. కూతురిని నడిపిస్తున్నట్లు వెనక నుంచి ఉన్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది. అంటే మెగా మనవరాలు బుడిబుడి అడుగులు వేసేస్తుందని ఈ పోస్ట్‌తో ఉపాసన చెప్పకనే చెప్పేసింది.(ఇదీ చదవండి: కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ఉపాసన ఇంటికి చేరిన బుజ్జి.. క్లీంకార కోసం స్పెషల్ గిఫ్ట్
సలార్‌తో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన ప్రభాస్.. కల్కి 2898 ఏడీ చిత్రంతో మరోసారి రికార్డులు తిరగరాసేందుకు సిద్ధమవుతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 27న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.ఉపాసన ఇంటికి బుజ్జిఅయితే సినిమా రిలీజ్‌కు ముందే బుజ్జి అండ్ భైరవ అనే యానిమేషన్ సిరీస్ లాంచ్ చేశారు. ఇందులో బుజ్జి, భైరవ పాత్రలను పరిచయం చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ సిరీస్‌కు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా బుజ్జి ఉపాసన ఇంటికి చేరింది. అదెలాగంటారా? కల్కి 2898 ఏడీ చిత్రయూనిట్ బుజ్జిని పోలి ఉన్న చిన్న బొమ్మను, పాత్రల స్టిక్కర్స్‌ను రామ్‌చరణ్- ఉపాసనల కూతురు క్లీంకారకు బహుమతిగా ఇచ్చింది. చిత్రయూనిట్‌కు థ్యాంక్స్వాటితో క్లీంకార ఆడుకుంటున్న ఫోటోను ఉప్సీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అయితే కూతురు ముఖం కనిపించకుండా ఆ ఫోటో తీసింది. తనకు ఈ బహుమతి పంపినందుకు హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు స్వప్న దత్, ప్రింయాక దత్‌లకు కృతజ్ఞతలు తెలియజేసింది.చదవండి: Bujji And Bhairava Review: యానిమేటెడ్ సిరీస్ ఎలా ఉందంటే.. -
డిప్రెషన్లో ఉపాసన, అత్తారింటికి వెళ్లిన రామ్‌చరణ్ (ఫోటోలు)
-
తిరుమలలో రామ్ చరణ్ కూతురు 'క్లీంకార' ఫేస్ రివీల్
తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్‌చరణ్ , ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా తన కుటుంబంతో పాటు తిరుమల చేరుకున్నారు. కుమార్తె క్లీంకారతో కలిసి స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు ముద్దల కూతురు ఫోటో రివీల్ అయింది. శ్రీనివాసుని సన్నిధి నుంచి వారు వస్తుండగా అక్కడ ఉన్న కొందరు మీడియా వారు క్లీంకార ఫోటోను తీయడం జరిగింది. అది కాస్త అభిమానులకు చేరువ కావడంతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. గతేడాది జూన్ 20న జన్మించిన క్లీంకార ఫేస్‌ను ఇప్పటి వరకు ఎక్కడా కూడా రివీల్ కాకుండా వారు జాగ్రత్తపడ్డారు. కానీ నేడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో కొందరు ఫోటోలు తీశారు. అవి కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by TIRUMALA DEVASTANAM OFFICIAL (@anandanilayam_) -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు (మార్చి 27) 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుమల వెళ్లారు. పుట్టినరోజు నాడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఉపాసనతో పాటుగా చరణ్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో వెంకన్న సేవలో వారు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. వారితోపాటు తన కూతురు క్లిన్ కారను కూడా శ్రీనివాసుడి సన్నిధికి తీసుకుకొచ్చారు. దీంతో ఆలయం వద్ద రామ్‌చరణ్‌ను చూసేందుకు భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో ఆయనకు అభిమానులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. -
Klin Kaara Beach Photos: క్లీంకారకు బీచ్‌ని పరిచయం చేసిన రామ్‌చరణ్.. ఫొటోలు వైరల్
-
'అమ్మా, నాన్నతో తొలిసారి అలా'.. ఉపాసన పోస్ట్ వైరల్!
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీ సరసన కనిపించనుంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన రామ్ చరణ్ లుక్ నెట్టింట తెగ వైరలైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. చెర్రీ డిఫరెంట్ చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే షూటింగ్‌కు కాస్తా విరామం లభించండంతో గ్లోబల్ స్టార్ ఫ్యామిలీతో కలిసి చిల్ అయ్యారు. వైజాగ్ సముద్ర తీరాన తన ముద్దుల కూతురు, భార్య ఉపాసనతో కలిసి ఎంజాయ్ చేశారు. క్లీంకారతో ఎత్తుకుని బీచ్‌లో ఆడుకుంటున్న దృశ్యాలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. ఈ వీడియోను ఉపాసన తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. వైజాగ్ మా హృదయాలను దోచేసింది.. క్లీంకారతో ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇదే వీడియోలో మెగా అభిమానులు రామ్ చరణ్‌ను గజమాలతో సత్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ఉపాసన.. చరణ క్లీంకారం!
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే ఈ జంటకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో మెగా వారసురాలు ఇంట్లోకి అడుగుపెట్టింది. తన ముద్దుల మనవరాలికి మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా పెట్టారు. క్లీంకారగా నామకరణం చేశారు. ఉపాసన-రామ్ చరణ్ లవ్ స్టోరీ.. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, ఉపాసన చిన్నప్పటి నుంచి స్నేహితులు. 2010లో విడుదలైన ‘ఆరెంజ్’ సినిమా తర్వాత వీరిద్దరూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 5 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు కుటుంబాల అంగీకారంతో జూన్ 14, 2012న వివాహం చేసుకున్నారు. అపోలో హాస్పిటల్ ఛైర్మన్, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసనకు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం ఆమె ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తున్నారు. తాజాగా ఇవాళ వాలెంటైన్స్ డే సందర్భంగా అరుదైన ఫోటోను పంచుకుంది. వాలెంటైన్ డేను పురస్కరించుకుని ఉపాసన తాజాగా పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా లవ్ సింబల్ జతచేస్తూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు లవ్లీ కపుల్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రెండు రోజుల క్రితమే తన సిస్టర్ అనుశ్ పాల కుటుంబంతో దిగిన పిక్స్‌ను పంచుకున్నారు. ట్విన్ సిస్టర్స్‌ను కలిసిన క్లీంకార అంటూ పోస్ట్ చేసింది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా హీరోయిన్గా నటిస్తోంది. ♾️❤️ pic.twitter.com/ZkNd6GeKwW — Upasana Konidela (@upasanakonidela) February 14, 2024 -
ట్విన్ సిస్టర్స్‌ను కలిసిన మెగా వారసురాలు.. ఫోటో వైరల్!
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే ఈ జంటకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో మెగా వారసురాలు ఇంట్లోకి అడుగుపెట్టింది. తన ముద్దుల మనవరాలికి మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా పెట్టారు. క్లీంకారగా నామకరణం చేశారు. పాప జన్మించిన శుభవేళ మెగా ఫ్యామిలీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఉపాసన తాజాగా పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి రామ్ చరణ్ దంపతులు ఈ ఫోటోకు పోజులిచ్చారు. ఇందులో ఆమె తన సిస్టర్ అనుశ్ పాల, ఆమె భర్త కూడా ఉన్నారు. అయితే ఈ ఫోటోలో అనుశ్ పాల దంపతులు తమ ట్విన్ డాటర్స్‌ను చేతుల్లో పట్టుకుని కనిపించారు. వీరంతా కలిసి ఓ ఫంక్షన్లో ఈ ఫోటో దిగినట్లు తెలుస్తోంది. ఉపాసన తన ఫోటోను పోస్ట్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేసింది. తన ట్వీట్లో రాస్తూ..'మేము అద్భుతమైన ముగ్గురిని మీకు పరిచయం చేస్తున్నా. వీరంతా పవర్ పఫ్ గర్ల్స్. క్లీంకార తన ఇద్దరు సిస్టర్స్ ఆరా పుష్ప ఇబ్రహీం, రైకా సుచరత ఇబ్రహీంలతో కలిసిపోయింది.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన మెగాఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. Introducing the awesome threesome - power puff girls🩷 Klinkaara Konidela is joined by her 2 sisters Ayraa Pushpa Ebrahim & Ryka Sucharita Ebrahim pic.twitter.com/ChUodsLuwN — Upasana Konidela (@upasanakonidela) February 12, 2024 -
క్లింకార కేర్ టేకర్ ఎవరో తెలుసా ?
-
అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన
మెగా కోడలు ఉపాసన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. చిరంజీవి కొడుకు రామ్‌చరణ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత మెగా ఫ్యాన్స్‌కి బాగా సుపరిచితురాలు అయిపోయింది. ఈమెకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుంటాయి కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడిన సందర్భాలు మాత్రం చాలా తక్కువని చెప్పొచ్చు. అలాంటిది తాజాగా ఓ బుక్ లాంచ్ సందర్భంగా ఉపాసన ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులోనే చరణ్‌తో బాండింగ్, కూతురు క్లీంకార గురించి పలు సంగతుల్ని చెప్పుకొచ్చింది. అందుకే ఇన్నాళ్లకు.. పదేళ్ల తర్వాత తల్లిదండ్రులు అయ్యారు కదా, ఎలా ఫీలవుతున్నారు? అని అడగ్గా.. 'అందరూ తల్లి కావడం గ్రేట్ అనుకుంటారు. నేను మాత్రం డబుల్ గ్రేట్ అని ఫీల్ అవుతున్నా. ఇంకా ఎప్పుడు బిడ్డకు జన్మనిస్తారు లాంటి మాటలు నా వరకు వచ్చాయి. ఏమైనా సమస్య ఉందా అని కూడా మాట్లాడుకున్నారు. అయితే మేం అన్ని విధాల సిద్ధంగా ఉన్నప్పుడే బిడ్డని కనాలని అనుకున్నాం. అందుకే ఇన్నేళ్లు పట్టింది' అని ఉపాసన చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాడెవరో తెలుసా?) చరణ్‌కి నాకు బౌండ్రీస్ ఇక భర్త చరణ్‌తో బాండింగ్ గురించి అడగ్గా.. 'రామ్ ఎప్పుడూ కూడా 'ప్రేమలో పడకు, ప్రేమలో ఎదుగుదాం' అని అంటుంటాడు. అలానే మేం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం, గౌరవించుకుంటాం, మా ఇద్దరి మధ్య హద్దులు(బౌండరీస్) కూడా ఉంటాయి. కెరీర్ విషయంలో ఒకరి దానిలో మరొకరం కల్పించుకోం. కానీ వ్యక్తిగత జీవితం విషయానికొచ్చేసరికి మాత్రం ఒక్కటిగా ఉంటాం' అని ఉపాసన చెప్పుకొచ్చింది. 2012లో రామ్ చరణ్-ఉపాసన పెళ్లి జరిగింది. అప్పట్లో వీళ్ల జంటపై ట్రోల్స్ వచ్చాయి. కానీ రానురాను ఉపాసన.. మెగా ఫ్యాన్స్‌కి బాగా సుపరిచితురాలైపోయింది. ఇప్పడు చరణ్ ని ఎంత అభిమానిస్తారో.. ఉపాసనని కూడా మెగా అభిమానులు అంతే అభిమానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె చెప్పిన మాటలు ఫ్యాన్స్ మధ్య డిస్కషన్‌కి కారణమయ్యాయి. (ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌కి ఏడుపు ఒకటే తక్కువ.. అంతా ఆ హిందీ మూవీ వల్లే!) -
క్లీంకారకు కేర్ టేకర్‌గా సావిత్రి.. ఆమె జీతం ఎంతో తెలిస్తే..
రామ్ చరణ్- ఉపాసనల గారాల పట్టి క్లీంకార జన్మించిన సమయం నుంచి మెగాఫ్యామిలీకి బాగా కలిసొచ్చిందని అందరూ చెబుతున్న మాట. రామ్ చరణ్ RRR చిత్రానికి ఆస్కార్ అవార్డు దక్కితే తాజాగా చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. మెగా ప్రిన్సెస్ రాకతో వారి కుటుంబంలో ఎప్పుడూ సందడిగానే ఉంది. దీంతో వారి ఫ్యాన్స్ కూడా సంబరపడిపోతుంటారు. తాజాగా మెగా వారసురాలు అయిన క్లీంకారను చూసుకునేందుకు నానీ (కేర్ టేకర్ లేదా ఆయా)ను నియిమించుకున్నట్లు నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. ఆమె పేరు సావిత్రి కాగా, గతంలో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ కుమారుడు అయిన తైమూర్‌కు సావిత్రి కేర్ టేకర్‌గా పనిచేసింది. ఆపై షాహిద్ కపూర్ ఇంట్లో కూడా ఆమె కేర్ టేకర్‌గా కొనసాగింది. ఇప్పుడు మెగా ప్రిన్సెస్ అయిన క్లీంకార ఆలనా పాలనా చూసుకునేందుకు సావిత్రిని వారు నియిమించుకున్నారట. చాలా రోజుల క్రితమే రామ్ చరణ్ సొంత ఇంటిని నిర్మించుకుని షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన గేమ్ ఛేంజర్‌తో పాటు పలు ప్రాజెక్ట్‌ల వల్ల ఎప్పుడూ షూటింగ్ బిజీలో ఉంటారు. ఉపాసన కూడా ఆపోలో ఆస్పత్రిలో తన బాధ్యతలను నిర్వర్తించడంలో నిత్యం బిజీగానే ఉంటారు. ఆ సమయంలో క్లీంకార కూడా ఎప్పుడూ ఉపాసన వెంటే ఉంటుంది. దీంతో పాపను చూసుకునేందుకు సావిత్రి అయితే బాగుంటుందని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కూతురి కోసం లక్షలు లక్షలు వెచ్చించి ఇంట్లోనే కొత్త ప్రపంచాన్ని నిర్మించారు ఉపాసన. చిన్నపిల్లలను సరిగ్గా అర్థం చేసుకుంటూ వారి ఆలనా పాలనను చూసుకునే సామర్థ్యం సావిత్రిలో ఉందని గతంలో కరీనా కపూర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. దీంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయింది. ప్రస్తుతం క్లీంకారకు కేర్‌టేకర్‌గా ఉన్న సావిత్రికి నెలకు లక్షన్నర జీతం ఇస్తున్నట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం ముంబైలోని ఒక ఆలయానికి రామ్‌చరణ్ దంపతులు వెళ్లారు. అప్పుడు ఓ పర్సనల్ పని మీద ముంబై వచ్చారని చరణ్ టీమ్ మెంబర్ ఒకరు తెలిపారు. అప్పుడు సావిత్రి కూడా వారితో ఉండటం గమనించవచ్చు. మరొక కార్యక్రమంలో కూడా క్లీంకారతో ఆమె కనిపించడంతో మెగా వారసురాలికి కేర్ టేకర్‌గా సావిత్రి ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై రామ్ చరణ్ దంపతులు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
క్లీంకారపై స్పెషల్ సాంగ్.. విన్నారా?
రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు పెళ్లైన 11 ఏళ్లకు బుజ్జాయి పుట్టింది. గతేడాది జూన్‌లో జన్మించిన ఈ పాపాయికి క్లీంకార అని నామకరణం చేశారు. ఇదేదో అల్లాటప్పాగా పెట్టిన పేరు కాదు! లలితా సహస్రనామాల నుంచి తీసుకున్న పదం. 'క్లీంకార' అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుందని, ఆ పేరులోనే శక్తివంతమైన వైబ్రేషన్ ఉందని మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వెనుక సీక్రెట్ బయటపెట్టాడు. ఇక క్లీంకార పుట్టినప్పటినుంచి మెగా ఫ్యామిలీ ప్రతి పండగను మరింత వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే సంక్రాంతిని ఎంతో గ్రాండ్‌గా జరుపుకున్నారు.హైదరాబాద్‌లో కాకుండా బెంగళూరులో వేడుకలు జరుపుకున్నారు. మెగా, అల్లు ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. ఇదిలా ఉంటే క్లీంకార గురించి ఓ పాట రెడీ చేశారు మెగా ఫ్యాన్స్. దీన్ని సంక్రాంతి కానుకగా ఉపాసన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహవీర్ ఎల్లందర్ కంపోజ్ చేసిన ట్యూన్‌కు తగ్గట్లుగా బెల్లంకొండ శ్రీధర్ లిరిక్స్ రాశాడు. దీన్ని ధనంజయ్ అద్భుతంగా ఆలపించాడు. చదవండి: పెళ్లి తర్వాత భర్తతో హీరోయిన్ సంక్రాంతి వేడుకలు -
క్లీంకార తొలి సంక్రాంతి సెలబ్రేషన్స్.. మెగా ఫ్యామిలీ అంతా అక్కడికి షిఫ్ట్
మెగా ఫ్యామిలీ అంతా ఈసారి సంక్రాంతిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోనున్నారు. చరణ్ కూతురికి ఇదే తొలి పండగ కావడంతో గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తున్నారు. అయితే ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా హైదరాబాద్‌లో కాకుండా మరో చోట జరగనున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: ‘సైంధవ్’మూవీ రివ్యూ) గతేడాది జూన్‌లో రామ్ చరణ్-ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టింది. ఆమెకు క్లీంకార అని పేరు పెట్టుకున్నారు. ఈ పాపకు ఇప్పుడు జరగబోయే సంక్రాంతి ఫస్ట్ టైమ్. కాబట్టి ఈసారి బెంగళూరులోని ఫామ్ హౌస్‌లో సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే చరణ్ దంపతులు, అకీరా నందన్ తదితరులు హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ఇకపోతే చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే షెడ్యూల్ జరుగుతోంది. సంక్రాంతి కాబట్టి చిన్న విరామం తీసుకున్నారు. పండగ ముగిసిన తర్వాత మళ్లీ షూటింగ్ బిజీలో పడిపోతాడు. మరోవైపు చిరు కూడా తన కొత్త మూవీ బిజీలో ఉన్నారు. ఇకపోతే ఈసారి బెంగళూరులో జరిగే సంక్రాంతి వేడుకలకు దాదాపు మెగా హీరోలందరూ కూడా హాజరుకానున్నారని సమాచారం. (ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?) Man Of Masses #RamCharan off 🛫 for Sankranti Occasion with Family ❤️ Visuals from Hyderabad Airport. pic.twitter.com/n0EWvUOFgK — Ujjwal Reddy (@MEHumanTsunaME) January 13, 2024 -
రామ్ చరణ్‌పై ఉపాసన ప్రశంసలు.. పోస్ట్ వైరల్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీకి జోడిగా కనిపించనుంది. అయితే ప్రస్తుతం షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చిన రామ్ చరణ్ ఫ్యామిలీ ఫుల్ టైమ్ గడిపేస్తున్నారు. ఇటీవలే ముంబై వెళ్లిన చెర్రీ దంపతులు శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. తొలిసారిగా తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి ఆలయంలో పూజలు నిర్వహించారు. అంతేకాకుండా మహారాష్ట్ర సీఎంను కలిసి రామ్ చరణ్ దంపతులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. (ఇది చదవండి: మనోజ్-మౌనికల కొత్త వ్యాపారం.. నాలుగున్నరేళ్లుగా సీక్రెట్‌గా..) అయితే ప్రస్తుతం సినీతారలంతా క్రిస్మస్ ఫెస్టివల్ మూడ్‌లో ఉన్నారు. ఇప్పటికే మెగా కుటుంబసభ్యులంతా కలిసి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఉపాసన- రామ్ చరణ్ సైతం తమ గారాలపట్టి క్లీంకారతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుటుంబంతో కలిసి పండుగ జరుపకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. Merry Christmas ❤️❤️❤️@AlwaysRamCharan Best dad 🤗 pic.twitter.com/fKnkZIVQ6z — Upasana Konidela (@upasanakonidela) December 26, 2023 -
బిడ్డతో కలిసి తొలిసారి ఆలయానికి వెళ్లిన రామ్ చరణ్ దంపతులు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తొలిసారి బిడ్డతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి ముంబైలోని శ్రీ మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు. తమ కుమార్తె క్లీంకారతో కలిసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. (ఇది చదవండి: పరారీలో రైతుబిడ్డ.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్!) ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది మెగా దంపతులకు ఆహ్వానం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు. కాగా.. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో గేమ్ ఛేంజర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. (ఇది చదవండి: బిగ్‌బాస్ రన్నరప్ గొప్పమనసు.. కుటుంబంతో కలిసి ఏం చేశాడంటే?) -
ఇటలీలో వాలిపోయిన మెగా ఫ్యామిలీ.. క్లీంకార విషయంలో పెద్ద పొరపాటు!
మెగా హీరో వరుణ్ తేజ్- నటి లావణ్య త్రిపాఠిల పెళ్లికి అంతా సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ఈ జంట మూడు ముళ్ల బంధంలో ఒక్కటి కానున్నారు. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట నవంబర్ 1న ఈ జంట ఏడు అడుగులు వేయబోతున్నారు. తమ్ముడి పెళ్లి కోసం అందరికంటే ముందుగా రామ్ చరణ్-ఉపాసన ఇటలీ చేరుకుని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇటీవలే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి సైతం ఇటలీ చేరుకున్నారు. (ఇది చదవండి: కొత్తింటికి చేరిన భగవంత్ కేసరి భామ.. భర్తతో కలిసి పూజలు!) తాజాగా మెగాస్టార్ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీ వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్-ఉపాసన తమ ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో మెగా ఫ్యామీలితో పాటు ఉపాసన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇరు కుటుంబాల సభ్యులు కలిసి ఒకే ఫోటోలో కనిపించారు. కొణిదెల- కామినేని ఫ్యామిలీ ఇన్ వన్ ఫ్రేమ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్లీంకార ఫేస్ రివీల్! అయితే ఈ ఫోటోలో నెటిజన్స్ మెగా మనవరాలు క్లీంకార వైపే ఆసక్తి చూపారు. ఆ ఫోటోకు ఓ స్విమ్మింగ్ ఫూల్ ముందు పోజులివ్వడంతో నీటిలో రివర్స్‌లో కనిపిస్తున్న క్లీంకార ఫేస్‌ను ఉపాసన కవర్ చేయలేదు. దీంతో ఇది చూసిన నెటిజన్స్ ఉపాసన మేడం.. మీరు క్లీంకార ఫేస్‌ను నీటిలో కవర్ చేయడం మరిచిపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ క్లీంకారను చూసినంత ఆనందంలో మునిగిపోయారు. (ఇది చదవండి: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్.. టాలీవుడ్ స్టార్ హీరోనే యజమాని!) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
కూతురితో బతుకమ్మ ఆడిన ఉపాసన, వీడియో వైరల్
తీరొక్క పూలతో చేసే బతుకమ్మ పండగ అంటే ఆడబిడ్డలకు చెప్పలేనంత సంబరం. ఆడపిల్లలకే కాదు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఈ బతుకమ్మ అంటే ఎంతో ఇష్టం. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండగను వేడుకగా చేసుకుంటారు. నిన్న(అక్టోబర్ 22) సద్దుల బతుకమ్మ.. ఆ రోజు అంతా పెద్ద బతుకమ్మలు చేసి, దాని చుట్టూ చేరి ఆడిన త్వాత వచ్చే ఏడాదికి మళ్లీ రావమ్మా అని సాగనంపారు. బతుకమ్మ సెలబ్రేషన్స్‌లో మెగా ఫ్యామిలీ సామాన్యులేనా సెలబ్రిటీలు సైతం బతుకమ్మను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఈ పండగను రెట్టింపు సంతోషంగా జరుపుకుంది. క్లీంకార పుట్టిన తర్వాత ఇదే తొలి బతుకమ్మ పండగ కావడం విశేషం. సేవ సమాజ్ బాలికా నిలయంలో చిన్నారులతో కలిసి వేడుక చేసుకున్నాఉ. ఉపాసన కూడా వారితో కలిసి బతుకమ్మ ఆడటమే కాకుండా క్లీంకారను ఎత్తుకుని వారితో కలిసి డ్యాన్స్ చేసింది. కుటుంబం బలాన్నిస్తుందంటూ పోస్ట్ 'జనాలు నాకు శక్తినిస్తే, కుటుంబం బలాన్నిస్తుంది. ఎంతో ప్రత్యేకమైన దసరా పండగ రోజు అర్థవంతమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన శక్తిని మనలో నింపుకుందాం.. సానుకూల దృక్పథాన్ని పెంచుదాం. మా అమ్మమ్మ ఆచరించే సాంప్రదాయాలను దసరా సజీవంగా ఉంచుతోంది. బాలికా నిలయంలో దసరా వేడుక చేసుకుని సంతోషాన్ని పంచుకున్నాం' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్, వైష్ణవ్ తేజ్ కూడా ఉన్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: అడివి శేష్ నా ముఖం మీదే అడిగాడు: రానా దగ్గుబాటి -
బిడ్డతో తొలిసారి ఫారిన్ టూర్‌కు చెర్రీ దంపతులు.. పెళ్లి కోసమేనా?
ఈ ఏడాది జూన్‌లో మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత చెర్రీ- ఉప్సీ జంట బిడ్డకు స్వాగతం పలకడంతో మెగా ఫ్యామిలీలో పాటు ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. తన ముద్దుల మనవరాలి పేరును క్లీంకారగా మెగాస్టార్ చిరంజీవి పరిచయం చేశారు. (ఇది చదవండి: అక్కినేని ఇంట తీవ్ర విషాదం..) అయితే క్లీంకార పుట్టిన తర్వాత రామ్ చరణ్-ఉపాసన సంతోషంలో మునిగిపోయారు. బిడ్డ పుట్టాక మొదటిసారి ఫారిన్ ట్రిప్‌కు బయలుదేరారు. తమ గారాల కూతురు క్లీంకారతో కలిసి విమానాశ్రయంలో కెమెరాల కంటికి చిక్కారు. తమ అభిమాన జంటను ఎయిర్‌పోర్ట్‌లో చూసిన ఫ్యాన్స్ మొబైల్స్ ద్వారా క్లిక్‌మనిపించారు. ప్రస్తుతం రామ్ చరణ్- ఉపాసన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ ఫోటోల్లో రామ్ చరణ్ తన పెట్ రైమ్‌ను ఎత్తుకుని కనిపించగా.. క్లీంకారను ఉపాసన తన చేతుల్లో పట్టుకుని కనిపించింది. అయితే ఈ జంట ఇటలీ వేకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. సినిమాలకు కాస్తా విరామం లభించడంతో ట్రిప్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఇటీవలే మెగా ఇంట్లో వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠిల ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మెగా ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు. వీరిద్దరి పెళ్లి వేడుక కూడా ఇటలీలోనే జరగనున్నట్లు గతంలో ఉపాసన చేసిన పోస్ట్‌లో వెల్లడించింది. అయితే వరుణ్- లావణ్య పెళ్లి కోసమే ఇటలీ వెళ్తున్నారా? లేదా వ్యక్తిగత ట్రిప్ కోసమా? అనేది తెలియాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ అతని జంటగా కనిపించనుంది. (ఇది చదవండి: ఓటీటీలో దూసుకెళ్తోన్న చిన్న సినిమా.. ఏకంగా టాప్-5లో!) Klinkara's Mom dad 😍 Megapowerstar #Ramcharan @upasanakonidela papped at airport off too family trip @AlwaysRamCharan pic.twitter.com/cHmwISRQ1H — ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 18, 2023 Klinkara's Mom dad 😍 Megapowerstar #Ramcharan @upasanakonidela papped at airport off too family trip@AlwaysRamCharan pic.twitter.com/tO4QZwndIq — ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 18, 2023 -
మెగా ఇంట్లో సందడి.. ఈ సారి ప్రత్యేకత ఏంటో తెలుసా?
మెగా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ ఏడాది వినాయకచవితి మెగా ఫ్యామిలీకి మరింత స్పెషల్. ఎందుకంటే తొలిసారిగా మెగా వారసురాలితో ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ ఏడాది జూన్‌లో మెగా ఇంట్లోకి వారసురాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్- ఉపాసన దంపతులకు బేబీ పుట్టింది. అపోలో ఆస్పత్రిలో ఉపాసన బిడ్డకు జన్మినిచ్చింది. మెగా వారసురాలు అడుగుపెట్టిన సందర్భంగా ఫ్యాన్స్‌తో పాటు కుటుంబసభ్యులు సైతం ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. (ఇది చదవండి: వినాయకచవితి స్పెషల్.. ఈ సాంగ్స్ లేకపోతే సందడే ఉండదు!) తన మనవరాలి పేరును మెగాస్టార్ దంపతులు రివీల్ చేశారు. కొణిదెల క్లీంకారగా నామకరణం చేస్తున్నట్లు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజాగా క్లీంకారతో కలిసి ఈ ఏడాది వినాయకచవితిని సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్, ఉపాసన తమ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇవీ చూసిన మెగా ఫ్యాన్స్ సైతం తాము అభిమానించే ఫ్యామిలీకి వినాయకచవితి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! 🙏 ఈ సారి ప్రత్యేకత ... చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం 😍😊 Happy Ganesh Chaturthi to ALL ! Celebrating the… pic.twitter.com/FeaFOtDdhd — Chiranjeevi Konidela (@KChiruTweets) September 18, 2023 (ఇది చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్) రామ్ చరణ్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! ఈ సారి ప్రత్యేకత ... చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
పూజలో పాల్గొన్న మెగా వారసురాలు.. ఉపాసన పోస్ట్ వైరల్!
మెగా కోడలు ఉపాసన కొణిదెల తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. ఈ ఏడాది జూన్‌లో మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన బిడ్డకు క్లీంకారగా నామకరణం చేస్తున్నట్లు మెగాస్టార్ రివీల్ చేశారు. చాలా ఏళ్ల తర్వాత మెగా ఇంట్లోకి వారసురాలు అడుగుపెట్టడంతో పెద్ద పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్యాన్స్‌తో పాటు కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ప్రస్తుతం తన బిడ్డతో కలిసి మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. (ఇది చదవండి: గిఫ్ట్‌గా వంద కోట్ల లగ్జరీ విల్లా.. స్వర్గాన్ని తలపిస్తున్న షారుక్ సౌధం! ) తాజాగా తన ముద్దుల కూతరు క్లీంకారతో కలిసి తొలిసారిగా వరలక్ష్మీ పూజలో పాల్గొన్న ఫోటోను షేర్ చేసింది. ఇంతకు మించి మరేది అడగలేను.. క్లీంకారతో మొదటి వరలక్ష్మీ వ్రతం పూజ అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోలో క్లీంకార ఫేస్ కనపడకుండా కవర్ చేసింది ఉపాసన. ఈ ఫోటో చూసిన మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మా చిట్టి తల్లి కామెంట్స్ కూడా పెడుతున్నారు. మరికొందరేమో క్లీంకార ఫేస్ చూడాలని ఆసక్తిగా ఉందంటూ పోస్ట్ చేస్తున్నారు. ఏదేమైనా క్లీంకార రాకతో మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. కాగా.. ఇటీవలే ఒంటరి మహిళల కోసం అపోలో ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఉచిత సేవలందిస్తున్నట్లు ఉపాసన ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: పెళ్లిపై కాంచన నటి ఆసక్తికర కామెంట్స్.. గట్టిగానే కౌంటర్! ) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
చిరంజీవి బర్త్‌డే.. కూతురు ఫొటో పోస్ట్ చేసిన చరణ్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. దీంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, సెలబ్రిటీలు చాలామంది ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. చిరు అంటే తమకు ఎంత ఇష్టమనేది పేరాలు పేరాలుగా రాస్తున్నారు. అయితే చిరు కొడుకు రామ్ చరణ్ మాత్రం అందరి కంటే కాస్త స్పెషల్ విషెస్ చెప్పి ఆకట్టుకున్నాడు. (ఇదీ చదవండి: రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా?) చిరంజీవి ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు మనవరాలితో సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులు కూతురు క్లీంకార ఇంకా చిన్నపిల్లనే కాబట్టి ఆమె.. తాత చిరంజీవికి విషెస్ చెప్పలేదు. దీంతో కూతురు తరఫున రామ్ చరణ్.. మెగాస్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. మనవరాలిని చిరు ఆడిస్తున్న ఫొటోని ఇన్ స్టాలో షేర్ చేశాడు. 'హ్యాపీయెస్ట్ బర్త్ డే టూ అవర్ డియరెస్ట్ చిరుత(చిరు తాత). మా, కొణిదెల ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన కొత్త మెంబర్ నుంచి బోలెడంత లవ్' అని రామ్ చరణ్ పోస్ట్ పెట్టాడు. కూతురు ఫొటోని షేర్ చేసినప్పటికీ ఫేస్ రివీల్ చేయకుండా చరణ్ జాగ్రత్తపడ్డాడు. ఏదైతేనేం ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ లైకులు కొట్టి తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) (ఇదీ చదవండి: రీఎంట్రీలో చిరంజీవి ఆ తప్పులు చేస్తున్నారా?) -
రామ్ చరణ్- ఉప్సీల బిడ్డను చూశారా.. ఎంత క్యూట్‌గా ఉందో!
ఈ ఏడాది మెగా ఇంట్లో పండుగ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే దాదాపు రామ్ చరణ్, ఉపాసనకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత వారసురాలు జన్మించింది. జూన్ 20న జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఉపాసన బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్‌లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నారి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. గత నెలలోనే నామకరణం ఈవెంట్ కూడా గ్రాండ్‌గా జరిగింది. తన మనవరాలి పేరును మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. క్లీంకారగా రామ్,ఉప్సీల బిడ్డకు పేరు పెట్టారు. అయితే క్లీంకార పుట్టాక మెగా ఫ్యామిలీతో పాటు ఉపాసన తల్లిదండ్రులు సైతం మనవరాలితో టైం స్పెండ్ చేస్తున్నారు. క్లీంకార పుట్టాక తొలిసారిగా ఇండిపెండెన్స్ డే వేడుకలను తాత, అమ్మమ్మతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ ఫోటోల్లో మెగా వారసురాలు ఫోటో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజే తమ బిడ్డ రూపాన్ని మెగా అభిమానులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నారు. అంతేకాకుండా క్లీంకార భారత జెండాను ఆవిష్కరిస్తూ తొలి ఇండిపెండెన్స్ డే రోజే అమ్మమ్మతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఇది అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మెగా ప్రిన్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో ఏకంగా అన్నయ్య రామ్ చరణ్ ఫేస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
మనవరాలికి మెగాస్టార్ దంపతుల స్పెషల్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?
ఈ ఏడాది మెగా ఇంట్లో పెద్ద పండగే జరిగింది. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత మెగా వారసురాలు అడుగుపెట్టడంతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. జూన్ నెలలో రామ్ చరణ్ భార్య ఉపాసనకు బేబీ జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెగాస్టార్ తన మనవరాలి పేరును ప్రకటించారు. గతనెలలో నామకరణం ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు. (ఇది చదవండి: రామ్ చరణ్- ఉపాసన బిడ్డకు ఆ పేరు.. అసలు కారణం ఇదేనా?) అయితే మెగా వారసురాలికి వచ్చిన గిఫ్ట్‌లపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ బిడ్డకు ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఖరీదైన గిఫ్ట్ పంపినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తలను మెగా ఫ్యామిలీ కొట్టిపారేసింది. అయితే దాదాపు 11 ఏళ్ల తర్వాత ఇంట్లో అడుగుపెట్టిన మెగా వారసురాలికి మెగాస్టార్ ఏ గిఫ్ట్ ఇచ్చారనే విషయంపై ఎక్కడా కూడా చర్చ జరగలేదు. కానీ తన మనవరాలికి చిరంజీవి దంపతులు ఓ చిరు కానుక ఇచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ దంపతులు తమ మనవరాలు క్లీంకారకు ఆంజనేయస్వామి రూపంతో ఉన్న బంగారు డాలర్స్‌ను అందమైన డిజైన్‌తో తయారు చేయించి ఇచ్చినట్లు ఉపాసన వెల్లడించింది. మెగా ఫ్యామిలీ హనుమాన్ భక్తులు అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి ఆంజనేయస్వామిని ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే తన మనవరాలికి ఇష్టదైవాన్నే ప్రతిరూపంగా బహుమతిగా ఇచ్చారు. ఇకపోతే ఉపాసన తల్లిదండ్రులు బంగారు ఉయలను గిఫ్ట్‌గా ఇచ్చినట్లుగా తెలుస్తోంది..!! కాగా.. ప్రస్తుతం మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్‌లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నారి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. గత నెల ఇక కుమార్తెతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్న ఈమె.. తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (ఇది చదవండి: అతనిలో నాకు నచ్చింది అదే.. లవర్‌పై శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్!) ప్రెగ్నెన్సీ జర్నీపై ఉపాసన మాట్లాడుతూ.. 'ప్రతి తల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఓ ఎమోషనల్ జర్నీ. బిడ్డకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆ తల్లిదండ్రులు ఎంతో తల్లడిల్లిపోతారు. అదే బిడ్డ తిరిగి ఆరోగ్యంగా మారితే వాళ్ల సంతోషానికి అవధులుండవు. అలాంటి మధుర క్షణాలు.. పిల్లల పేరెంట్స్ కు అందిస్తున్న డాక్టర్స్ కు నా తరఫున ధన్యవాదాలు. నా ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది నాకు సలహాలు ఇచ్చేవారు' అని అన్నారు. -
తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్‌లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నారి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. గత నెల నామకరణం ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఇక కుమార్తెతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్న ఈమె.. తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలానే ఒంటరి తల్లుల కోసం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ప్రెగ్నెన్సీ జర్నీ 'ప్రతి తల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఓ ఎమోషనల్ జర్నీ. బిడ్డకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆ తల్లిదండ్రులు ఎంతో తల్లడిల్లిపోతారు. అదే బిడ్డ తిరిగి ఆరోగ్యంగా మారితే వాళ్ల సంతోషానికి అవధులుండవు. అలాంటి మధుర క్షణాలు.. పిల్లల పేరెంట్స్ కు అందిస్తున్న డాక్టర్స్ కు నా తరఫున ధన్యవాదాలు. నా ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది నాకు సలహాలు ఇచ్చేవారు' (ఇదీ చదవండి: కీర్తి చెల్లిగా చేస్తే.. ఈమె తల్లి చిరుకు హీరోయిన్గా చేసింది!) నాకు బాధేసింది 'నా వరకు పర్లేదు కానీ కొందరు మహిళలకు ఇలాంటి అండ దొరకదు. అది తెలిసి నేను చాలా బాధపడ్డాను. మరీ ముఖ్యంగా సింగిల్ మదర్స్ కు ఇలాంటి విషయాల్లో సపోర్ట్ ఉండదు. కాబట్టి వీకెండ్స్ లో నా ఆస్పత్రిలో ఒంటరి తల్లులకు ఉచితంగా ఓపీడీ చికిత్స అందించబోతున్నాం. ఇలాంటి ఓ ఎమోషనల్ జర్నీలో నా వంతు సహాయం అందించడానికి రెడీగా ఉన్నాను. ఇది చాలామందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా' అని ఉపాసన చెప్పుకొచ్చింది. క్లీంకార రాకతో రామ్ చరణ్-ఉపాసన దంపతులకు 2012లో పెళ్లయింది. అయితే ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేకపోవడంతో అభిమానుల దగ్గర మిగతా వాళ్ల వరకు చాలా కామెంట్స్ చేశారు. వాటన్నింటికీ ఎండ్ కార్డ్ వేస్తూ గతేడాది డిసెంబరులో ఉపాసన ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించారు. ఈ జూన్ లో పాపకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీతోపాటు ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీలయ్యారు. ప్రస్తుతం అందరూ పాపతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) (ఇదీ చదవండి: వరుస రీమేక్స్‌పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి) -
మనవరాలు ఇంటికి వచ్చిన శుభవేళ... ఉపాసన తల్లి ఏం చేసిందంటే?
వారసురాలి రాకతో మెగా కుటుంబం ఉబ్బితబ్బిబ్బవుతోంది. భార్య ఉపాసన గర్భంతో ఉన్నప్పుడే క్లీంకార ఎన్నో సంతోషాలను, అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని మురిసిపోయాడు రామ్‌చరణ్. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ రావడం, ప్రపంచవ్యాప్తంగా తన నటనకు ప్రశంసలు దక్కడం, ఈ శుభసూచకాలన్నీ తన కూతురు వల్లే జరిగాయని మురిసిపోయాడు. క్లీంకార పుట్టిన తర్వాత వారి సంతోషం రెట్టింపయింది. ఇకపోతే చిరంజీవికి కోకాపేటలో ఉన్న ఆస్తుల రేట్లు పెరగడాన్ని కూడా క్లీంకారతో ముడిపెడుతున్నారు మెగా అభిమానులు. క్లీంకార అడుగుపెట్టిన వేళావిశేషం.. చిరు కుటుంబానికి అన్నీ కలిసొస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారి ఉపాసన పుట్టింటికి వెళ్లినట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరలవుతోంది. ఈ క్రమంలో ఉపాసన తల్లి శోభన మనవరాలి కోసం ఘనమైన ఏర్పాట్లు చేసిందట! తన మనవరాలిని ఇంట్లోకి తీసుకొచ్చేముందు పనివాళ్లతో దిష్టి తీయించిందట! అంతేకాదు, దిష్టి తీసిన పనివాళ్లకు ఏకంగా రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఓ వార్త వైరలవుతోంది. తర్వాత కూతురిని ఇంట్లోకి తీసుకెళ్లిన ఆమె మనవరాలితో ఆడుకుందట! అయినా దిష్టి తీసినందుకు వందలు, వేలు ఇస్తారు, అంతేకానీ ఇలా లక్షల్లో డబ్బు ఇవ్వడమేంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మెగా అభిమానులు మాత్రం.. తన మనవరాలు తొలిసారి ఇంటికి వచ్చిన శుభ సందర్భంలో పనివాళ్లకు బహుమతి ఇచ్చిందనుకోవచ్చుగా.. అని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా మెగా మనవరాలు క్లీంకార మాత్రం అప్పుడే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది! చదవండి: రూ.2 లక్షలిస్తా.. కమిట్మెంట్ ఇస్తావా? అని అడిగాడు: హీరోయిన్ లలిత్ మోదీతో బ్రేకప్.. క్లారిటీ ఇచ్చేసిన సుష్మితా సేన్ -
క్లీంకార గురించి చిరంజీవి చెప్పిందే నిజం అయిందా.. కలిసొచ్చిన వేల కోట్లు
హైదరాబాద్ చరిత్రలోనే కోకాపేట భూముల ధరలు రికార్డ్ బద్దలవుతున్నాయి. కోకాపేట నియోపోలీస్ భూములు వేలంలో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయి. ప్లాట్ నెం.10లో 3.6 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేసింది. అక్కడ ఎకరాకు అత్యధికంగా రూ.100 కోట్లకుపైనే వేలం పలికింది. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా కోకాపేట వైపు చూసింది. ఈ వేలం అనంతరం మెగాస్టార్ చిరంజీవి పేరు ఒక విషయంలో వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: మా నాన్న ఎలా ఉంటాడో తెలియదు.. ఏడ్చేసిన ధనరాజ్) చిరంజీవికి కోకాపేటలో ల్యాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. కానీ అక్కడ ఎన్ని ఎకరాల భూమి ఉందనే విషయం మాత్రం అధికారికంగా తెలియదు. గతంలో రాఖీ పండగ కానుకగా తన చెల్లెలు ఇద్దరికీ కోకాపేట భూములను రాసి ఇచ్చేలా సురేఖ చేసిందని ఆయన చెప్పారు. చిరంజీవి కొన్ని ఏళ్ల క్రితం వ్యవసాయం చేయడం కోసం అక్కడ కొంత భూమిని కొన్నారు. ఐతే అక్కడ వ్యవసాయం చేసే పరిస్థితులు లేకపోవడంతో ఆ భూములను అలాగే వదిలేశారు. అయితే ఆ భూమిలోని కొంత మొత్తాన్ని తన ఆడబడుచులకు ఇద్దామని సురేఖ సలహా ఇచ్చారని ఆయన గతంలో తెలిపారు. అంతేకాదు ఆ సమయంలో సురేఖానే భూమి రిజిస్ట్రేషన్ పనులు చేయించారని ఆయన చెప్పారు. చిరంజీవికి రాఖీ కట్టిన సమయంలో గిఫ్ట్‌గా ఆ భూమి తాలూకా ఆస్థి పత్రాలను చెల్లెళ్లకు సురేఖ ఇప్పించారని పేర్కొన్నారు. ఈ విషయాన్నీ స్వయంగా చిరంజీవినే మహిళా దినోత్సవం రోజున వెల్లడించారు. చెల్లెళ్లకు గిఫ్ట్‌గా ఇచ్చిన సమయంలో అక్కడ ఎకరం భూమి సుమారు రూ. 30 కోట్లుగా ఉండేది. ఇదే నిజం అయితే.. కోకాపేటలో చిరంజీవికి సుమారు 20 ఎకరాల భూమి ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగేది. ఆయన కొన్న సమయానికి ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి లేదు. అలాంటి సమయంలో వ్యవసాయం చేసేందుకు కొంత భూమిని ఆయన కొన్నారు. ఇప్పుడు నగరం విస్తరిస్తుంది. దీంతో సిటీకి అందుబాటులో ఉన్న అన్ని ఏరియాల్లోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అలా కోకాపేటలోని చిరంజీవికి చెందిన భూమలు ఇప్పుడు భారీ ధరనే పలకనున్నాయి. (ఇదీ చదవండి: బాధలో ఉన్నాం.. దయచేసి ఇలాంటి పని చేయకండి: నటి) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు చిరంజీవికి అక్కడ 20 ఎకరాల భూమి ఉంటే దాని విలువ రూ. 1500 కోట్ల పైమాటే. ఇదంతా రామ్ చరణ్ తనయ క్లీంకార వచ్చిన వేళా విశేషం అంటూ మెగాస్టార్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. గతంలో చిరంజీవి కూడా క్లీంకార జాతకం చాలా బాగుందని, తను ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి వృద్ధి చెందుతుందని చెప్పిన విషయం తెలిసిందే. -
క్లీంకారకు విలువైన కానుకను ఇచ్చిన ఐకాన్ స్టార్
క్లీంకార.. పుట్టుకతోనే ఆమె పేరు మార్మోగిపోయింది. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత బిడ్డ జన్మించడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు ఓ రేంజ్లో జరిగాయి. చరణ్-ఉపాసనల ఆనందానికైతే అవధుల్లేకుండా పోయాయి. కూతురి కోసం ఇంట్లో రకరకాల మార్పులు చేశారు. ఇటీవలే క్లీంకార బారసాల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. చెర్రీ గారాలపట్టికి విలువైన బహుమతులు కూడా వచ్చాయి. ఆ తర్వాత కూడా గిఫ్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ క్లీంకారకు బంగారు డాలర్స్‌ను అద్భుతమైన డిజైన్‌లో తయారు చేయించి బహుమతిగా పంపినట్లు ఓ వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే! తాజాగా అల్లు అర్జున్ క్లీంకారకు ఓ విలువైన కానుకను అందించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. బన్నీ బంగారు పలకు బహుమతిగా ఇచ్చాడట. ఇప్పుడే పలకేంటి అనుకుంటున్నారేమో? పలక అంటే రాసుకునేది కాదు.. క్లీంకార పేరు, ఆమె పుట్టిన వివరాలు వచ్చేలా పలకపై బంగారు అక్షరాలు వచ్చేలా డిజైన్ చేయించాడట! ఐకాన్ స్టార్ ఐడియా కొత్తగా ఉందని మురిసిపోతున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇకపోతే చరణ్- ఉపాసన దంపతులకు జూన్ 20న క్లీంకార జన్మించింది. జూన్ 30న ఆమె బారసాల చేసి పాపాయికి క్లీంకార అని నామకరణం చేశారు. ఈ పేరును లలిత సహస్రనామం నుంచి తీసుకున్నారు. 'క్లీంకార' అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఆ పేరుకి శక్తివంతమైన వైబ్రేషన్ ఉంది అని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చెప్పుకొచ్చాడు. చదవండి: తన ఇంటిని చూపిస్తూ కంటతడి పెట్టుకున్న శివజ్యోతి -
మెగా ప్రిన్సెస్ క్లీంకారపై సాయి తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
మెగా ప్రిన్సెస్ క్లీంకార ఎలా ఉంటుంది? తండ్రి రామ్ చరణ్‌లా ఉంటుందా? లేక తల్లి ఉపాసనలా ఉంటుందా? చిరంజీవి పోలికలు వచ్చాయా? లేవా?.. మెగా అభిమానుల మనసుల్లో మెదలుతున్న ప్రశ్నలివి. క్లీంకార జన్మించి నెల రోజులు దాటినా.. ఇప్పటికీ ఆమె ముఖాన్ని మాత్రం బాహ్య ప్రపంచానికి చూపించలేదు. కొన్ని ఫోటోలు, వీడియోలను వదిలినా.. కూతురి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు ఉపాసన-రామ్ చరణ్. దీంతో క్లీంకార ఎలా ఉందనే క్యూరియాసిటీ మెగా ప్యాన్స్‌లో మరింత పెరిగింది. ఫోటోలను షేర్ చేయండంటూ సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్-ఉపాసలను వేడుకుంటున్నారు. అయినా కూడా ఇప్పటికీ మెగా ప్రిన్సెస్ ఫోటోలు బయటకు రాలేదు. అయితే తాజాగా క్లీంకారకు ఎవరి పోలీకలు వచ్చాయో చెప్పేశాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. క్లీంకార ప్రస్తావన వచ్చింది. ‘క్లీంకారకు తండ్రి పోలికలు వచ్చాయి. అచ్చం రామ్ చరణ్‌లాగే ఉంటుంది. కళ్లు చాలా బాగున్నాయి. నాకు చాలా నచ్చాయి. కూతురు తండ్రి పోలీకలతో పుడితే అదృష్టం అంటారు. క్లీంకార విషయంలో అదే జరిగింది’అని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. (చదవండి: టాలీవుడ్లో టాప్ వన్ హీరో, టాప్ వన్ హీరోయిన్ ఎవరంటే..?) -
మెగా ప్రిన్సెన్స్ 'క్లీంకార' ఫస్ట్ వీడియో.. చరణ్ చేతుల్లో అలా!
మెగా ప్రిన్సెస్ సందడి మొదలై, అప్పుడే నెలరోజులు అయిపోయింది. ఈ రోజు(జూలై 20) ఉపాసన పుట్టినరోజు. ఈ క్రమంలోనే అందరూ ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. రామ్‌చరణ్ మాత్రం ఈ రోజుని ఇంకాస్త స్పెషల్‌గా ఉండేలా ప్లాన్ చేశాడు. తన భార్య పుట్టినరోజు, కూతురు పుట్టి నెల పూర్తయిన సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. రామ్ చరణ్ షేర్ చేసిన వీడియోలో.. చాలా అద్భుతమైన విజువల్స్‌ని చూపించారు. 2012లో చరణ్-ఉపాసన పెళ్లి వీడియో బిట్‌తో పాటు చరణ్, ఉపాసన మాట్లాడిన విజువల్స్ కూడా ఉన్నాయి. దాదాపు 3 నిమిషాలున్న ఈ వీడియోలో ఉపాసన డెలివరీ రోజు ఆస్పత్రిలో, నామకరణం రోజు ఇంట్లో ఏం జరిగిందనేది చూపించారు. ఆపరేషన్ థియేటర్ లోపలికి చరణ్ వెళ్లడం, కూతురిని బయటకు తీసుకురావడం.. కుటుంబ సభ్యులు అందరూ ఆ పాపని చూసి మురిసిపోవడం లాంటి వాటిని ఈ వీడియోలో బ్యూటీఫుల్‌గా క్యాప్చర్ చేశారు. చివరగా ఉపాసన పాపని ఎత్తుకున్నట్లు చూపించి ఈ వీడియోని ఎండ్ చేశారు. ఏదేమైనా 'క్లీంకార' ఫస్ట్ వీడియో మాత్రం బ్యూటీఫుల్‌గా ఉంది. రామ్‌చరణ్ మాట్లాడుతూ 'క్లీంకార పుట్టే టైంలో మా అందరిలోనూ ఏదో తెలియని టెన్షన్. అంతా సరిగ్గా జరగాలని మేం అందరూ ప్రార్థిస్తున్నాం. అందుకు తగినట్టే అన్నీ అనుకూలంగా పాప ఈ లోకంలోకి అడుగు పెట్టిందని భావిస్తున్నా. పాప పుట్టిన ఆ క్షణం నా మనసుకి ఆహ్లాదంగా, చాలా సంతోషంగా అనిపించింది. పాప రాకకు పట్టిన 9 నెలల సమయం, అప్పుడు జరిగిన ప్రాసెస్ అంతా తలుచుకుని హ్యాపీగా ఫీలయ్యాం' అని అన్నారు. ఇదే వీడియోలో ఉపాసన కొణిదెల మాట్లాడుతూ.. 'మా పాప ద్రవిడ సంస్కృతిలో భాగం కావాలని కోరుకున్నాను. ఆమె పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగులు ఇవ్వొద్దు. అలాంటి వాటిని వారే స్వయంగా సాధించుకోవాలనేది నా అభిప్రాయం. పిల్లల పెంపకంలో ఇవెంతో కీలకం. జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి' అని చెప్పారు. (ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్) -
చరణ్ కూతురు క్లీంకారకు అదిరిపోయే గిఫ్ట్ పంపిన ఎన్టీఆర్
రామ్ చరణ్-తారక్ వీరిద్దరూ ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చాటుతూ ఆస్కార్ అవార్డును కొల్లగొట్టారు. RRR సినిమా కంటే ముందు నుంచే వారిద్దరి మధ్య సోదర బంధం ఉంది. ఇద్దరిలో ఎవరిదైనా పుట్టినరోజు వస్తే.. ఇంట్లో వాళ్ల కళ్లు గప్పి.. ఇద్దరం బయటికి చెక్కేస్తామని కూడా వారు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. చరణ్ తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ముందే.. మొదట ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి తన ఆనందాన్ని షేర్ చేసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెర్రీ చెప్పాడు. అంతలా వారి మధ్య స్నేహం ఉంది కాబట్టే జక్కన్న RRR సినిమా చేయగలిగాడని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్-7 ప్రోమోతో వచ్చేసిన నాగార్జున.. ఈ డైలాగ్ అర్థం ఇదేనా?) రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పెళ్లైన 10ఏళ్ల తర్వాత వారు తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంతో పాటు ఫ్యాన్స్ కూడా సంతోషంలో ఉన్నారు. ఇప్పటికే ఆ పాపకు క్లీంకార అని పేరు కూడా పెట్టారు. మెగా ఫ్యామిలీతో పాటు ఉపాసన కుటుంబం నుంచి కూడా చెర్రీ దంపతుల గారాల పట్టీకి బహుమతులు భారీగానే అందాయి. అందులో భాగంగగానే జూ. ఎన్టీఆర్ కూడా క్లీంకార కోసం ప్రత్యేకమైన కానుకను పంపించారట. ఆ గిఫ్ట్ కూడా తారక్ పిల్లలు అభయ్, భార్గవ్ రామ్‌లు ఎంతో ఇష్టంగా అందించినట్లు తెలుస్తోంది. చరణ్,ఉపాసన,క్లీంకార ముగ్గురి పేరుతో ఉన్న బాంగారు డాలర్స్‌ను అద్భుతమైన డిజైన్‌లో తయారు చేయించి గిఫ్ట్‌గా పంపించారని తెలుస్తోంది. ఈ ప్రచారం నిజమే ఉంటుందని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. ఎందుకంటే చరణ్-తారక్ స్నేహ బంధం అలాంటిది. (ఇదీ చదవండి: 50 దాటేసిన వరలక్ష్మి ... అప్పట్లో ఈ బ్లాక్ బస్టర్ సినిమా చేసుంటేనా?) -
మెగా ప్రిన్సెస్ కోసం స్పెషల్ రూమ్.. ఎంత బాగుందో..
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవల ఓ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు క్లీంకార అనే నామకరణం చేశారు. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చడంతో తొలి నుంచి ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. డెలీవరీ సమయంలో కూడా రామ్ చరణ్‌తో పాటు మెగా ఫ్యామిలీ అంతా పక్కనే ఉన్నారు. బారసాల కార్యక్రమాన్ని కూడా ఎంతో గ్రాండ్‌గా నిర్వహించారు. మెగా ఫ్యామిలీ ఇంట ఇప్పటికీ ఆ పండుగ వాతావరణం కొనసాగుతూనే ఉంది. తన ముద్దుల తనయ విషయంలో ఉపాసన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కుమార్తె చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ఇంటీరియర్ సిద్ధం చేయించారు. ఈ మేరకు ప్రముఖ ఆర్కిటెక్ట్ పవిత్రా రాజారామ్ నేతృత్వంలో క్లీంకార కోసం ఓ స్పెషల్ రూమ్‌ని డిజైన్ చేయించారు. అమ్రాబాద్ ఫారెస్ట్, వేదిక్ హీలింగ్ అంశాలను ప్రేరణగా తీసుకొని అత్యుత్తమ వాతావరణంలో చిన్నారి పెరిగేలా ఈ ఇంటీరియర్‌ను సిద్దం చేయించినట్లు ఉపాసన పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోని ట్వీటర్లో షేర్ చేస్తూ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో తన కూతురిని పెంచడానికి ఎంతో ఆనందిస్తున్నానని రాసుకొచ్చింది. Can’t tell u how much I enjoyed giving birth & raising my klin Kaara in these lovely spaces inspired by the Amrabad Forest & Vedic healing. Thank you Pavitra Rajaram 🤗 pic.twitter.com/Yaki3DWiNL — Upasana Konidela (@upasanakonidela) July 14, 2023 -
అప్పుడే కైంకారా కోసం ఇంత అద్భుతమైన ఇల్లా..?
-
మెగా ప్రిన్సెస్ పేరుకి ఉన్న అర్ధం ఏంటంటే..
-
రామ్ చరణ్- ఉపాసన బిడ్డకు ఆ పేరు.. అసలు కారణం ఇదేనా?
మెగా ఇంట్లో ఈ ఏడాది పండగ వాతావరణం నెలకొంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత మెగా వారసురాలు అడుగుపెట్టింది. జూన్ 20న రామ్ చరణ్ భార్య ఉపాసన పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకున్నారు. తాజాగా మెగా వారసురాలి బారసాల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. (ఇది చదవండి: రామ్ చరణ్ -ఉపాసన బిడ్డకు ఖరీదైన గిఫ్ట్.. స్పందించిన మెగా టీం!) ఈ వేడుకలో తన మనవరాలి పేరును మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్-ఉప్సీల బిడ్డ పేరును క్లీంకార అంటూ రివీల్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ వేడుకలో ఉపాసన తల్లిదండ్రులు పాల్గొన్నారు. అయితే మెగా వారసురాలి పేరుపై ఉపాసన మదర్ శోభన కామినేని ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేసింది. ఉపాసన బిడ్డ పేరును ప్రస్తావిస్తూ ఫోటోలను షేర్ చేసింది. మొదట ఉపాసన పుట్టినప్పుడు ఈ పేరునే పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఉపాసన బిడ్డకు ఈ పేరు పెట్టడంతో చాలా సంతోషంగా ఉందని వెల్లడించింది. ఉపాసన రిప్లై ఈ పోస్ట్ చూసిన ఉపాసన కూడా స్పందించింది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో తన తల్లి శోభన పోస్ట్‌ను షేర్ చేసింది. లవ్ యూ మామ్ అంటూ మదర్‌కు ధన్యవాదాలు తెలిపింది. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేశాడు.. ఎందుకో తెలిస్తే) View this post on Instagram A post shared by Shobana Kamineni (@shobanakamineni) -
రామ్‌చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్- ఉపాసన దంపతులకు పుట్టిన పాపాయికి పేరు పెట్టేశారు. 'క్లీంకార కొణిదెల' అని నామకరణం చేశారు. అలానే బారసాల కూడా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుక పూర్తయిన తర్వాత పాపాయి ఊయల్లో ఉన్న ఫొటోని తాత అయిన మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. తన మనవరాలి పేరు వెనక సీక్రెట్ కూడా ఆయనే బయటపెట్టేశారు. పేరు వెనక సీక్రెట్ రామ్ చరణ్- ఉపాసన కూతురు పేరుని లలిత సహస్రనామం నుంచి తీసుకున్నారు. 'క్లీంకార' అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఆ పేరుకి శక్తివంతమైన వైబ్రేషన్ ఉంది అని మెగాస్టార్ చిరంజీవినే స్వయంగా తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఎదుగుతున్నకొద్దీ ఈ లక్షణాలన్నింటినీ ఆమె తన వ్యక్తిత్వంలో ఇముడ్చుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పాప డీటైల్స్ ఇవే రామ్ చరణ్- ఉపాసన 2012లో పెళ్లి చేసుకున్నారు. ఇది జరిగిన 11 ఏళ్లకు అంటే గతేడాది ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ఉపాసన చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కూడా ఉపాసన బేబీ బంప్ తో చాలాసార్లు బయట కనిపించింది. జూన్ 20న హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో ఉపాసనకు డెలివరీ అయింది. ఇప్పుడు పుట్టిన పాపకు పేరు పెట్టారు. దీంతో మెగాఫ్యాన్స్ ఈ పేరుని వైరల్ చేస్తున్నారు. And the baby’s name is ‘Klin Kaara Konidela ‘.. Taken from the Lalitha Sahasranama Nama.. ‘Klin Kaara’ represents an Embodiment of Nature.. Encapsulates the supreme power of divine Mother ‘Shakthi’ .. and has a powerful ring and vibration to it .. All of us are sure the… pic.twitter.com/vy3I0jaS4o — Chiranjeevi Konidela (@KChiruTweets) June 30, 2023 (ఇదీ చదవండి: హీరోయిన్ సంఘవి ఇప్పుడెలా ఉందో చూశారా? రీఎంట్రీపై క్లారిటీ!) -
రామ్ చరణ్ - ఉపాసన బిడ్డ పేరు ఇదే.. మెగాస్టార్ ట్వీట్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయినరోజు నుంచి మెగాఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొణిదెల వారి ఇంట ఈనెల 20న మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. దీంతో మెగా ఇంట నేటివరకు కూడా సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. పాప పుట్టినరోజు నుంచి ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో ఏ పేరు పెట్టబోతున్నారనే చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా మనవరాలి పేరును చిరంజీవి ట్వీట్ చేశారు. మా ఇంటి మహాలక్ష్మి పేరు 'క్లీంకార కొణిదెల'(Klin Kara Konidela) అంటూ పోస్ట్ చేశారు. ఈ మేరకు ఓ ఫోటోను మెగాస్టార్ ట్విటర్లో పోస్ట్ చేస్తూ మనవరాలి పేరును వెల్లడించారు. ఆ ఫోటోలో చిరంజీవి దంపతులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలవుతోంది. Klin Kaara Konidela 😍@AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/8emWJoJcra — Chiranjeevi Konidela (@KChiruTweets) June 30, 2023 And the baby’s name is ‘Klin Kaara Konidela ‘.. Taken from the Lalitha Sahasranama Nama.. ‘Klin Kaara’ represents an Embodiment of Nature.. Encapsulates the supreme power of divine Mother ‘Shakthi’ .. and has a powerful ring and vibration to it .. All of us are sure the… pic.twitter.com/vy3I0jaS4o — Chiranjeevi Konidela (@KChiruTweets) June 30, 2023