Ram Charan And Upasana Daughter Kiln Kaara Receives Special Gift From Jr NTR, Deets Inside - Sakshi
Sakshi News home page

Jr NTR Special Gift To Kiln Kaara: చరణ్‌ కూతురు క్లీంకారకు అదిరిపోయే గిఫ్ట్‌ పంపిన ఎన్టీఆర్‌?

Published Wed, Jul 19 2023 8:09 AM | Last Updated on Wed, Jul 19 2023 9:18 AM

Ram Charan And Upasana Daughter Klin Kaara Gift To Jr Ntr - Sakshi

రామ్‌ చరణ్‌-తారక్‌ వీరిద్దరూ  ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చాటుతూ ఆస్కార్ అవార్డును కొల్లగొట్టారు. RRR సినిమా కంటే ముందు నుంచే వారిద్దరి మధ్య సోదర బంధం ఉంది. ఇద్దరిలో ఎవరిదైనా పుట్టినరోజు వస్తే.. ఇంట్లో వాళ్ల కళ్లు గప్పి.. ఇద్దరం బయటికి చెక్కేస్తామని కూడా వారు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. చరణ్‌ తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడానికి ముందే.. మొదట ఎన్టీఆర్‌కి ఫోన్‌ చేసి తన ఆనందాన్ని షేర్‌ చేసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెర్రీ చెప్పాడు.  అంతలా వారి మధ్య స్నేహం ఉంది కాబట్టే జక్కన్న RRR సినిమా చేయగలిగాడని చెప్పవచ్చు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌-7 ప్రోమోతో వచ్చేసిన నాగార్జున.. ఈ డైలాగ్‌ అర్థం ఇదేనా?)

రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులకు పెళ్లైన 10ఏళ్ల తర్వాత వారు తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంతో పాటు ఫ్యాన్స్‌ కూడా సంతోషంలో ఉన్నారు. ఇప్పటికే ఆ పాపకు క్లీంకార అని పేరు కూడా పెట్టారు. మెగా ఫ్యామిలీతో పాటు ఉపాసన కుటుంబం నుంచి కూడా చెర్రీ దంపతుల గారాల పట్టీకి బహుమతులు భారీగానే అందాయి. అందులో భాగంగగానే జూ. ఎన్టీఆర్‌ కూడా క్లీంకార కోసం ప్రత్యేకమైన కానుకను పంపించారట.

ఆ గిఫ్ట్‌ కూడా తారక్‌ పిల్లలు అభయ్‌, భార్గవ్‌ రామ్‌లు ఎంతో ఇష్టంగా అందించినట్లు తెలుస్తోంది. చరణ్‌,ఉపాసన,క్లీంకార ముగ్గురి పేరుతో ఉన్న  బాంగారు డాలర్స్‌ను అద్భుతమైన డిజైన్‌లో తయారు చేయించి గిఫ్ట్‌గా పంపించారని తెలుస్తోంది. ఈ ప్రచారం నిజమే ఉంటుందని ఫ్యాన్స్‌ కూడా అంటున్నారు. ఎందుకంటే చరణ్‌-తారక్‌ స్నేహ బంధం అలాంటిది.

(ఇదీ చదవండి: 50 దాటేసిన వరలక్ష్మి ... అప్పట్లో ఈ బ్లాక్‌ బస్టర్‌ సినిమా చేసుంటేనా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement