Jr NTR
-
స్టార్ హీరోలను మెప్పిస్తున్న యంగ్ డైరెక్టర్స్
సినిమాలో కంటెంట్ బాగుంటే చిన్నా పెద్దా అనే తేడాల్లేవ్. ఆడియన్స్ సూపర్ హిట్ చేస్తున్నారు. అలాగే కథలో బలం ఉందని హీరో–నిర్మాతలు నమ్మితే చాలు చిన్నా పెద్దా తేడాల్లేవ్, అనుభవం లెక్కలోకి రాదు. స్టార్ హీరోలు కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతారు. కథ కోసం బడ్జెట్ కేటాయింపులకు నిర్మాతలు సిద్ధమైపోతారు. ఇలా తమ కలంతో స్టార్ హీరోలను ఒప్పిస్తున్న యువ దర్శకుల జాబితా టాలీవుడ్లో పెరిగిపోతోంది. స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలనే పట్టుదలతో బలమైన కథలు సిద్ధం చేసుకున్నారు కొందరు యువ దర్శకులు. ఆ కథలతో స్టార్ హీరోలను మెప్పించి, సినిమా చేస్తున్న ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం.ఇద్దరు యువ దర్శకులతో... నూటయాభైకి పైగా సినిమాలు చేసిన చిరంజీవి వంటి అగ్రహీరో వరుసగా యువ దర్శకులకు చాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాకు వశిష్ఠ దర్వకత్వం వహిస్తున్నారు. ‘విశ్వంభర’కు ముందు వశిష్ఠ చేసింది ఒక్కటే సినిమా. అదే ‘బింబిసార’. తన ప్రతిభతో మెప్పించి, చిరంజీవి వంటి టాప్ హీరోతో సినిమా చేసే చాన్స్ దక్కించుకున్నారు వశిష్ఠ. అలాగే ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. శ్రీకాంత్ ఓదెల కథను మెచ్చి, ఈ యువ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమాకు హీరో నాని ఓ నిర్మాతగా ఉండటం విశేషం. ‘ప్యారడైజ్’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. సంక్రాంతి తర్వాత... ఇండస్ట్రీకి చాలామంది దర్శకులను పరి చయం చేశారు నాగార్జున. తెలుగు ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్‌గా చెప్పుకునే ‘శివ’ సినిమాతో రామ్‌గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేశారు. ఇంకా నాగార్జున పరిచయం చేసిన దర్శకుల లిస్ట్ చాలానే ఉంది. ఈ విధంగా యువ దర్శకులతో పని చేయడానికి నాగార్జున ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ‘హుషారు, రౌడీబాయ్స్, ఓం భీమ్ బుష్’ సినిమాలు తీసిన దర్శకుడు హర్ష కొనుగంటితో సినిమా చేసే ఆలోచన చేస్తున్నారట నాగార్జున. అలాగే తమిళంలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన నవీన్ అనే దర్శకుడు చెప్పిన కథను కూడా ఓకే చేశారట. ఈ యువ దర్శకులతో నాగార్జున చేయాల్సిన సినిమాలపై సంక్రాంతి తర్వాత ఓ స్పష్టత వస్తుంది. పెద్ది ‘రాజమౌళి, శంకర్’ వంటి ప్రముఖ దర్శకులతో సినిమాలు చేసిన రామ్‌చరణ్ తన తర్వాతి సినిమాను ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు చేతుల్లో పెట్టారు. దర్శకుడిగా బుచ్చిబాబుకు ఇది రెండో సినిమా. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్‌కుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అంతేకాదు... తన రెండో సినిమాకే ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌ను ఒప్పించగలిగారు బుచ్చిబాబు. ‘పెద్ది’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. డీజే టిల్లు దర్శకుడితో... యువ హీరో సిద్ధు జొన్నలగడ్డతో ‘డీజే టిల్లు’ వంటి సూపర్‌హిట్ ఫిల్మ్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యారు విమల్ కృష్ణ. కాగా విమల్ రెడీ చేసిన ఓ కథను అగ్ర హీరో వెంకటేశ్ ఆల్మోస్ట్ ఓకే చేశారట. వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, వీరి కాంబినేషన్లోని సినిమాపై త్వరలోనే ఓ స్పష్టత రానుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. కథ విన్నారా? ‘హాయ్ నాన్న’ సినిమాతో దర్శకుడిగా శౌర్యువ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ప్రేక్షకులను ఆకట్టుకోగలిగారు. ఎన్టీఆర్ కోసం శౌర్యువ్ ఓ కథను సిద్ధం చేశారట. ఈ స్టోరీని ఎన్టీఆర్‌కు వినిపించగా, శౌర్యువ్‌కి అంగీకారం తెలిపారట. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారు శౌర్యువ్. ఫైనల్ కథతో ఎన్టీఆర్‌ను శౌర్యువ్ మెప్పించగలిగితే, దర్శకుడిగా ఆయన కెరీర్ నెక్ట్స్ లీగ్‌లోకి వెళ్తుందని ఊహించవచ్చు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’తో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తారు. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఎన్టీఆర్‌కు ఓ కమిట్మెంట్ ఉంది. కాబట్టి... ఎన్టీఆర్–శౌర్యువ్‌ల కాంబినేషన్ సినిమాకు మరింత సమయం పట్టనుంది. మైల్స్టోన్ ఫిల్మ్‌కెరీర్‌లో మైల్స్టోన్ ఫిల్మ్స్ అంటే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటుంటారు హీరోలు. అలాంటిది తన 75వ సినిమాను ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని భాను భోగవరపు చేతిలో పెట్టారు రవితేజ. తన కథతో తొలి సినిమానే రవితేజతో చేసే చాన్స్ దక్కించుకున్నారు భాను భోగవరపు. ‘మాస్ జాతర’ టైటిల్‌తో రానున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 9న ఈ సినిమా విడుదల కానుంది. ఇలా బలమైన కథలతో స్టార్ హీరోలను మెప్పిస్తున్న మరికొంతమంది దర్శకులు ఉన్నారు. -
ఢీ అంటే ఢీ
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘వార్ 2’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం హృతిక్ రోషన్–ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ మాసీ సాంగ్‌ను ముంబైలో వేసిన ఓ సెట్లో చిత్రీకరించారని బాలీవుడ్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నారట దర్శకుడు అయాన్ ముఖర్జీ.డిసెంబరు రెండో వారంలో చిత్రీకరించే ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో హృతిక్, ఎన్టీఆర్ ఢీ అంటే ఢీ అన్నట్లు ఫైట్ చేస్తారట. ఇది క్లైమాక్స్ ఫైట్ అని, దాదాపు పదిహేను రోజుల పాటు చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని, ఈ ఫైట్ కోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ రూపొందించారని టాక్. ఆదిత్యా చో్రపా నిర్మిస్తున్న ‘వార్ 2’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కియారా అద్వానీ పాత్రకూ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని తెలిసింది. వచ్చే ఏడాది ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. -
తెలుగింటి హీరో... పక్కింటి దర్శకుడు
హీరోయిన్లు ఒకే భాషకు పరిమితం కారనే విషయం తెలిసిందే. హీరోలు, దర్శకులు మాత్రం దాదాపు ఒకే భాషలోనే సినిమాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలకు, దర్శకులకు హద్దులు, సరిహద్దులు లేవని పాన్ ఇండియన్ సినిమాలు చెబుతున్నాయి. దర్శకులు, హీరోలు ఇప్పుడు ఏ భాషలో అయినా సినిమాలు చేస్తున్నారు. కానీ ఈ ట్రెండ్ టాలీవుడ్లో మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. మరి... మన తెలుగింటి హీరోలు... ఏ పక్కింటి దర్శకులతో సినిమాలు చేస్తున్నారో తెలుసుకుందాం. కాంబో రిపీట్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వేసవిలో రిలీజ్ కావొచ్చని టాక్. ఈ చిత్రం తర్వాత చిరంజీవి ఏ దర్శకుడితో సినిమా చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. హరీష్ శంకర్, మారుతి... ఇలా చాలామంది పేర్లు వినిపించాయి. అయితే ఇటీవల ఓ సందర్భంలో తన తర్వాతి చిత్రాల్లో ఒకటి చిరంజీవితో ఉంటుందని, సామాజిక నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని, రచయిత–దర్శకుడు బీవీఎస్ రవి పేర్కొన్నారు. ఈ సినిమాకు బీవీఎస్ రవి కేవలం కథ మాత్రమే ఇస్తున్నారని, దర్శకత్వ బాధ్యతలు మోహన్‌రాజా తీసుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మోహన్ రాజా తెలుగు అయినప్పటికీ చెన్నైలో సెటిల్ అయి, తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇక చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక హీరో చిరంజీవి–దర్శకుడు మోహన్‌రాజా కాంబినేషన్లో ఆల్రెడీ ‘గాడ్ ఫాదర్’ (2022) అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ మలయాళ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా ‘గాడ్ ఫాదర్’ చిత్రం రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. నవీన్‌తో నెక్ట్స్ సోలో హీరోగా నాగార్జున నెక్ట్స్ ఫిల్మ్ ఎవరితో ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కానీ తమిళంలో ‘మూడర్ కూడం, అగ్ని సిరగుగళ్’ సినిమాలు తీసిన దర్శకుడు నవీన్ గత ఏడాది నాగార్జునకు ఓ కథ వినిపించారట. ఈ మూవీకి నాగార్జున కూడా ఓకే చెప్పారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరచే పనిలో నవీన్ బిజీగా ఉన్నారని, ఈ సినిమా విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని భోగట్టా. మరోవైపు ప్రస్తుతం నాగార్జున తమిళ చిత్రం ‘కూలీ’లో ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘కూలీ’ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. అలాగే తమిళ హీరో ధనుష్‌తో కలిసి నాగార్జున ‘కుబేర’ చేస్తున్నారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకుడు. బిజీ బిజీ ప్రభాస్ చాలా చాలా బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా ‘రాజా సాబ్, ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్)’ సినిమాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా సెట్స్‌లోకి వెళ్తారు. కాగా ఇటీవల కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్లో ప్రభాస్ మూడు సినిమాలు కమిట్ అయ్యారు. ఈ చిత్రాల్లో ఒకటి తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో ఉంటుందని తెలిసింది. మరోటి కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ అని ఊహించవచ్చు. ఇంకో సినిమాకు తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇలా... ఓ తమిళ దర్శకుడు, ఓ కన్నడ దర్శకుడితో ప్రభాస్ సినిమాలు చేయనున్నారు. అంతేకాదు... ఇటీవల ప్రభాస్‌కు ఓ హిందీ దర్శకుడు కథ వినిపించారని, ఇప్పటికే ప్రభాస్ కమిటైన సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమాను ప్రకటిస్తారని బాలీవుడ్ భోగట్టా. ‘జైలర్’ దర్శకుడితో...ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘వార్ 2’. హిందీ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరోగా చేస్తున్నారు. ‘వార్ 2’ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా షూట్లో జాయిన్ అవుతారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమయ్యేలా ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేశారు. ముందుగా ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరించి, కొత్త సంవత్సరంలో ఎన్టీఆర్ పాల్గొనే సన్నివేశాల షూట్‌ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారని తెలిసింది. 2026 జనవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. అలాగే తమిళంలో ‘కోలమావు కోకిల, డాక్టర్, జైలర్’ సినిమాలను తీసిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఇటీవల ఎన్టీఆర్‌కు ఓ కథ వినిపించారు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా చేసేందుకు అంగీకరించారని తెలిసింది. అయితే రజనీకాంత్‌తో ‘జైలర్ 2’ చేసిన తర్వాత ఎన్టీఆర్‌తో నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా చేస్తారు. కాబట్టి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది 2026లోనే అని ఊహింవచ్చు. కథ విన్నారా? రామ్‌చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రం జనవరి 10న సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే రామ్‌చరణ్ తర్వాతి చిత్రాలకు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన, సుకుమార్ డైరెక్ట్ చేస్తారు. అయితే ఓ హిందీ దర్శకుడు రామ్‌చరణ్‌కు కథ వినిపించారనే టాక్ కొన్ని రోజులు క్రితం ప్రచారంలోకి వచ్చింది. మరి... ఈ వార్త నిజమేనా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మహాభారతం దర్శకుడితో... హిందీ సీరియల్ ‘మహాభారతం’ చాలా ఫేమస్. ఈ సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్‌ను ‘కన్నప్ప’ కోసం టాలీవుడ్‌కు తెచ్చారు విష్ణు మంచు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు, శరత్‌కుమార్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది. జీబ్రా తమిళంలో కీర్తీ సురేష్‌తో ‘పెంగ్విన్’ సినిమా తీసిన తమిళ దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జీబ్రా’. సత్యదేవ్ ఈ చిత్రంలో హీరోగా నటించగా, కన్నడ నటుడు డాలీ ధనుంజయ మరో లీడ్ రోల్లో నటించారు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈశ్వర్ కార్తీక్‌కు తెలుగులో ఇదే స్ట్రయిట్ సినిమా. ఇతర భాషల దర్శకులతో సినిమాలు చేసే తెలుగు హీరోల జాబితాలో మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
హైదరాబాద్ : సుదర్శన్ థియేటర్లో ‘దేవర’ మూవీ 50 రోజుల వేడుక (ఫొటోలు)
-
'దేవర'కు 50 రోజులు... ఎన్ని కేంద్రాల్లో అంటే..?
ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా దేవర ఆఫ్ సెంచరీ కొట్టేసింది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా పది రోజులు థియేటర్స్‌లో రన్ కావడమే గొప్ప విషయమని చెప్పవచ్చు. ఒక సినిమా హిట్ అయిందని చెప్పుకునేందుకు కలెక్షన్స్ కొలమానం అని చెప్పుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఒక సినిమా 100రోజులు, 50 రోజులు ఆడిందనే మాట వినిపించడమే లేదు. అయితే, దేవర ఆ లోటును పూర్తి చేసింది.దేవర సినిమా 52 కేంద్రాల్లో 50 రోజుల పాటు ఆడిందని మేకర్స్ ఒక పోస్టర్ విడుదల చేశారు. చాలారోజుల తర్వాత ఇలా సెంటర్స్ లిస్ట్ చూడటం జరిగిందని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. నవంబర్ 15న దేవర 50 రోజుల వేడుక చేసుకుంటున్నాడు. దీంతో నేడు థియేటర్స్ అన్నీ మళ్లీ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. అయితే, దేవర సినిమా ఇప్పటికే ఓటీటీలో విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాతో జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీతో పాటు సంగీతం ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి. దేవర పార్ట్2 కూడా ఉందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. -
ఎన్టీఆర్ కోసం ఫ్యాన్స్ వందల కిలోమీటర్ల పాదయాత్ర
తనని ప్రేమించే ఫ్యాన్స్ అంటే జూనియర్ ఎన్టీఆర్‌కు ఎనలేని అభిమానం. ఈ క్రమంలో వారి కుటుంబసభ్యులపై కూడా ఆయన ఎంతో ఆప్యాయత కనబరుస్తుంటారు. అందుకే తారక్ ప్రతి ఆడియో ఫంక్షన్లో అభిమానులు అందరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని, వారి కోసం ఇంటి వద్ద ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు ఉంటారని సూచిస్తాడు. ఫ్యాన్స్‌పై ఆయన చూపించే ఇలాంటి ప్రేమనే నేడు 650 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా చేసింది.కుప్పంలోని గుడుపల్లి మండలానికి చెందిన నలుగురు యువకులు తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్‌కు పాదయాత్ర చేశారు. సోడిగానిపల్లి పంచాయతీ పాళెం గ్రామానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు శివ, హరి, లక్ష్మీపతి, కదిరప్ప పాద యాత్ర ద్వారా హైదరాబాద్ చేరుకుని జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశారు. నవంబర్ 3న వారు తమ ఇంటి నుంచి ప్రయాణించారు. తమ స్వగ్రామం నుంచి హైదరాబాద్‌లోని జూనియర్ ఎన్టీఆర్ నివాసం వరకూ ‘వేసే ప్రతి అడుగు జూనియర్ ఎన్టీఆర్ అన్న కోసం’ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు 650 కిలోమీటర్లు పైగా కాలినడకన హైదరాబాద్ చేరుకుని ఎన్టీఆర్ కలుసుకున్నారు. కుప్పం నుంచి హైదరాబాద్ చేరుకునేందుకు వారికి సుమారు 13 రోజుల సమయం పట్టింది. తారక్‌పై వారు చూపించిన ప్రేమకు కుప్పం జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు శివరాయల్ వారికి సంఘీభావం తెలిపారు.This is why he’s the PEOPLE’S HERO ❤️❤️MAN OF MASSES @Tarak9999 met fans who walked all the way from Kuppam. He spent time with them and made their day with his warmth 😍✨ #ManOfMassesNTR #NTR pic.twitter.com/FmR7vok8w8— Vamsi Kaka (@vamsikaka) November 15, 2024 -
దమ్మున్న హీరోకే 'దేవర' సాధ్యం.. ఆ ఒక్కటి చేసుంటేనా..: పరుచూరి
దేవరతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటించింది. సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ దేవర సినిమాపై రివ్యూ ఇచ్చారు.దమ్మున్న హీరోఆయన తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. 'సినిమాటోగ్రఫీని మెచ్చుకోవాల్సిందే! సంగీతం మరీ అంత గొప్పగా లేదు. డిఫరెంట్ టాక్ వచ్చినా కూడా సినిమా విజయవంతంగా ఆడాలంటే అక్కడ దమ్మున్న హీరో ఉండాలి. అలాంటివారిలో మా చిన్న రామయ్య (జూనియర్ ఎన్టీఆర్) ఒకడు. సముద్రపు దొంగ మంచివాడిగా ఎలా మారాడన్నదే కథ. కథ చిన్నదే..ఇంత చిన్న పాయింట్‌పై ఆధారపడి మూడుగంటల నిడివితో సినిమా తీయడమనేది జోక్ కాదు. ఎక్కువ సన్నివేశాలు సముద్రానికి సంబంధించినవే ఉన్నాయి. ఈ విషయంలో కొరటాల శివ 'స్క్రీన్‌ప్లే మాస్టర్' అనిపించుకున్నాడు. ఈ కథ తారక్‌కు సెట్ కాదేమోననుకున్నా.. కానీ డైరెక్టర్.. ఎన్టీఆర్‌కు తగ్గట్లుగా మూవీ తీసి వసూళ్లు రాబట్టాడు. అలా చేసుంటేనా..!ఇదే కథ హాలీవుడ్లో తీస్తే సూపర్ అంటారు. కథ గొప్పగా లేకపోయినా కథనం బాగుంటే సినిమాలు ఆడతాయనడానికి దేవర ప్రత్యక్ష ఉదాహరణ. ట్విస్టులు బాగున్నాయి. జాన్వీ కపూర్‌తో ఎన్టీఆర్‌కు రొమాంటిక్ సీన్లు, వినోదాత్మక సన్నివేశాలు పెట్టుంటే రూ.1000 కోట్లు ఈజీగా దాటేసేది. తారక్ నటన సహజంగా ఉంది' అని పేర్కొన్నారు.చదవండి: తల్లిని చూసి చిన్నపిల్లాడిలా ఏడ్చిన నిఖిల్.. మరి తేజ సంగతి? -
దేవర సీక్వెల్.. ఆ పాత్ర కోసం కసరత్తులు: దేవర నటుడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన చిత్రం దేవర పార్ట్-1. సముద్రపు బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సెప్టెంబర్ 27న విడుదలైన దేవర ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.అయితే దేవర పార్ట్-2 గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు దేవర నటుడు తారక్ పొన్నప్ప. ఆయన దేవర మూవీలో కీలకపాత్రలో కనిపించారు. ప్రస్తుతం వికటకవి అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవర-2లో యతి పాత్రకు సంబంధించిన ఆసక్తకర విషయాన్ని పంచుకున్నారు.తారక్ పొన్నప్ప మాట్లాడుతూ..' ప్రస్తుతం స్క్రిప్ట్ పనులైతే జరుగుతున్నాయి. దేవర-2 2026లో జనవరిలో ప్రారంభించే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్-2, ప్రశాంత్‌నీల్‌తో సినిమా చేయాల్సి ఉంది. దేవర-2లో కీలకమైన యతి పాత్రపై వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. ఆ పాత్రకు ఎవరనేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఆ పాత్రకు బెస్ట్ పర్సన్ కోసం చూస్తున్నారు. దానికి ఇంకా సమయం పట్టే అవకాశముంది' అని అన్నారు. కాగా.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన వికటకవి వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను జీ5 ఓటీటీ ఇటీవలే ప్రకటించింది. ఈ వెబ్‌సిరీస్‌లో నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనౌన్స్‌చేసింది. డిటెక్టివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. -
సూపర్ హిట్ డైరెక్టర్‌తో 'తారక్' పాన్ ఇండియా సినిమా
ఈ ఏడాదిలో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తారక్ చేతిలో రాబోయే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఆయన దేవర2, వార్2, చిత్రాలతో పాటు ప్రశాంత్ నీల్‌తో కూడా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా మరో స్టార్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తుంది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలిప్కుమార్తో తారక్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జైలర్ వంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన దర్శకుడు నెల్సన్ దిలిప్‌కుమార్.. ఆయనతో సినిమా అంటే మామూలుగా ఉండదంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. వరుస డిజాస్టర్ సినిమాలతో ఉన్న రజనీకాంత్‌కు జైలర్ సినిమాతో నెల్సన్ భారీ విజయానందించారు. ఏడాది క్రితం జైలర్‌తో బాక్సాఫీస్ వద్దకు వచ్చిన ఆయన ఇప్పటికీ ఎలాంటి సినిమా చేస్తారా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి.నెల్సన్ దిలిప్‌కుమార్ డైరెక్ట్ చేసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. డాక్టర్,జైలర్,బీస్ట్ వంటి సినిమాలు సత్తా చాటాయి. ఇప్పుడు తారక్‌తో ఆయన సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తుండంతో ఇరువురి ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. రీసెంట్గా ఆయన నిర్మాతగా 'బ్లడీ బెగ్గర్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో కవిన్ హీరోగా మెప్పించాడు. ఈ సినిమా అనంతరం జైలర్ 2 సీక్వెల్ తెరకెక్కించేపనిలో నెల్సన్ ఉన్నాడు . ఈ ప్రాజెక్ట్ అనంతరం తారక్ కోసం నెల్సన్ ఒక బిగ్ ప్లాన్ వేయనున్నట్లు టాక్. -
దేవర తాండవం.. ఫుల్ వీడియో అదిరిపోయిందిగా!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం దేవర పార్ట్-2. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సముద్రం బ్యాప్‌డ్రాప్‌లో వచ్చిన దేవర బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ నుంచి దేవర తాండవం అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో ఎన్టీఆర్ తన స్టెప్పులతో అదరగొట్టారు. జూనియర్ ఫ్యాన్స్ ఈ ఫుల్ వీడియో సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేయండి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. దేవరలో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.ఓటీటీకి దేవరనవంబర్ 8 నుంచే దేవర ఓటీటీలో సందడి చేయనుంది. ఇప్పటికే స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం దక్షిణాది భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. త్వరలోనే బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం దేవరను అందుబాటులోకి తీసుకురానుంది. -
ఓటీటీలో 'దేవర'.. అధికారిక ప్రకటన వచ్చేసింది
ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా దేవర ఓటీటీ విడుదల విషయంలో అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తారక్ సింగిల్‌గా నటించిన చిత్రాల్లో దేవరనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీతో జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు.దేవర ఓటీటీ విడుదల కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు నెట్‌ఫ్లిక్స్ శుభవార్త చెప్పింది. నవంబర్ 8న తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళంలో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా తెలిపింది. అయితే, హిందీ వర్షన్ మాత్రం నవంబర్ 22న ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రధాన బలంగా నిలిచింది.కథేంటంటే..ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరి లోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ( సైఫ్ అలీ ఖాన్), రాయప్ప( శ్రీకాంత్), కుంజర(షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ(మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. దేవర మాట కాదని భైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా... దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. దీంతో దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం( జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అనేదే మెయిన్ స్టోరీ. -
ఆర్ఆర్ఆర్కు అరుదైన గౌరవం
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన లండన్‌లోని ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ సినిమా హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రదర్శితం కానుంది. వచ్చే ఏడాది మే 11న ఈ మూవీ స్క్రీనింగ్ ఉంటుందని ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ ప్రకటించింది. అలాగే ఈ కార్యక్రమంలో రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి లైవ్ కన్సర్ట్ ఇవ్వనున్నారు.కాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 2022 మార్చి 25న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో (నాటు నాటు పాటకు గాను) ఎమ్ఎమ్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. పలు అంతర్జాతీయ, జాతీయ అవార్డులు కూడా లభించాయి. కాగా ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమా ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో 2019లో ప్రదర్శితమైన విషయం తెలిసిందే. -
ఎన్టీఆర్ 'దేవర'.. ఆ రోజే ఓటీటీకి రానుందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన దేవర రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి ముద్దుల కూతురైన జాన్వీ తనదైన గ్లామర్‌తో అలరించింది.బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం దక్షిణాది ప్రేక్షకులకు ఈ వారం నవంబర్ 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వారంలోనే దేవర ఓటీటీకి వస్తే బాగుంటుందని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. మరోవైపు బాలీవుడ్ ప్రేక్షకులకు నవంబర్ 22 నుంచి అందుబాటులోకి రానుందని టాక్.కాగా.. దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్. శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో మెప్పించారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. యువసుధ, ఎన్టీఆర్ బ్యానర్లపై దేవర సినిమా తెరకెక్కించారు. పార్ట్-2 సూపర్ హిట్ కావడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
ఎన్టీఆర్ బావ మరిది 'నార్నే నితిన్' నిశ్చితార్థం
ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్‌చంద్ర పెళ్లి పీటలెక్కనున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో నేడు నవంబర్ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట.నార్నే నితిన్ నిశ్చితార్థం వేడుకలో ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటు వారి కుమారులు అభయ్, భార్గవ్‌లు సందడిగా కనిపించారు. ఈ కార్యక్రమంలో కల్యాణ్‌రామ్, వెంకటేశ్ పాల్గొన్నారు. కాబోయే వధూవరులను వారు ఆశీర్వదించారు.ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్. 2023లో మ్యాడ్ సినిమాతో ఎన్టీఆర్‌కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆయన రీసెంట్గా ఆయ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. View this post on Instagram A post shared by NTR Trends (@ntrfantrends) -
ఎన్టీఆర్ టాలీవుడ్ ఎంట్రీ.. యంగ్ టైగర్ ట్వీట్ వైరల్!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకున్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, బాలయ్య, హరికృష్ణ ఇలా ఎందరో సూపర్ స్టార్స్ ఉన్నారు. తాజాగా ఈ కుటుంబం నుంచి మరో యంగ్ హీరో ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా అరంగేట్రం చేస్తున్నారు.ఈ సినిమాను వైవీఎస్ చౌదరి తెరకెక్కించనున్నారు. న్యూ టాలెంట్ రోర్స్ పతాకంపై ఆయన సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా వైవీఎస్ చౌదరి ప్రకటించారు. కొత్త హీరో యంగ్ ఎన్టీఆర్‌ను ఆయన పరిచయం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్ట్ చేశారు.ఎన్టీఆర్ తన ట్వీట్లో రాస్తూ..'రామ్ మొదటి అడుగుకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ప్రపంచం నిన్ను ఆదరించడానికి లెక్కలేనన్ని క్షణాలను అందజేస్తుంది. నీకు విజయం తప్పకుండా వస్తుంది. మీ ముత్తాత ఎన్టీఆర్ , తాత హరికృష్ణ , నాన్న జానకిరామ్ అన్నల ప్రేమ, ఆశీస్సులతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్న నమ్మకం నాకుంది' అంటూ పోస్ట్ చేశారు. All the best on the first of many steps Ram. The world of cinema will offer you countless moments to cherish… Wishing you nothing but success! With the Love and blessings of your great grandfather NTR garu, grandfather Harikrishna garu and father Janakiram anna, I’m sure you’ll… pic.twitter.com/Op1jRr6KQ7— Jr NTR (@tarak9999) October 30, 2024 -
'దూకే ధైర్యమా జాగ్రత్త.. దేవర ముంగిట నువ్వెంత'.. ఫియర్ సాంగ్ వచ్చేసింది!
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చి యాక్షన్ చిత్రం 'దేవర'. ఈ మాస్ యాక్షన్ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఈ మూవీ రిలీజై నెల రోజులైనప్పటికీ థియేటర్లలో దూసుకెళ్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి ఫేవరేట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'దూకే ధైర్యమా జాగ్రత్త.. దేవర ముంగిట నువ్వెంత' అంటూ సాగే ఫియర్ సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మీరు కూడా దేవర ఫియర్ ఫుల్ వీడియో సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేయండి. The thumping #FearSong Video is out now! 🔥https://t.co/ifDty3vMEi Let the fear grip every nerve and ignite the madness ❤️🔥#Devara #BlockbusterDevara— Devara (@DevaraMovie) October 29, 2024 -
జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'.. ఆ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది!
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చి యాక్షన్ చిత్రం 'దేవర'. ఈ మాస్ యాక్షన్ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఈ మూవీ రిలీజై నెల రోజులైనప్పటికీ థియేటర్లలో దూసుకెళ్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి ఫేవరేట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. దావూదీ అంటూ సాగే మాస్ సాంగ్ ఫుల్ వీడియోను ఫ్యాన్స్‌కు అందుబాటులోకి వచ్చేసింది. ఈ పాటలో హీరో ఎన్టీఆర్, జాన్వీ కపూర్తన డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. ఇప్పటికే విడుదలైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మీరు కూడా దావూదీ ఫుల్ సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేయండి. -
ఆ.. చుట్టమల్లే పాట వీడియో సాంగ్ వచ్చేసింది..
జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో బ్లాక్‌బస్టర్ అయిన సాంగ్స్‌లో చుట్టమల్లే పాట ముందు వరుసలో ఉంటుంది. ఈ పాటకు థియేటర్లు సైతం ఊ కొడుతూ ఊగిపోయాయి. అంతలా యూత్‌ను పిచ్చెక్కించిన ఈ పాట ఫుల్ వీడియోను శనివారం రిలీజ్ చేశారు. విడుదలైన నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది.ఈ పాటలో తారక్, జాన్వీ కపూర్ల కెమిస్ట్రీ అదిరిపోయింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించాడు. శిల్పరావు గాత్రం ఈ రొమాంటిక్ మెలోడీని మరో లెవల్‌కు తీసుకెళ్లింది. దేవర సినిమా విషయానికి వస్తే సెప్టెంబర్ 27న విడుదలైన ఈ మూవీ రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించారు. -
దేవర ఆయుధ పూజ.. ఫుల్ వీడియో వచ్చేసింది!
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన ఫుల్ యాక్షన్ మూవీ దేవర పార్ట్-1. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటించింది. ఎన్టీఆర్ సరసన తనదైన నటన, డ్యాన్స్‌తో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం దేవర విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతోంది.అయితే తాజాగా దేవర టీమ్ ఆయుధ పూజ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాట ఫుల్ వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేసింది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే యూట్యూబ్‌లో వ్యూస్‌పరంగా దూసుకెళ్తోంది. ఇంకేందుకు ఆలస్యం ఆయుధ పూజ ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ పార్ట్-2 కూడా ఉందని దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు. The most celebrated #AyudhaPooja video song is here! 🔥 https://t.co/LYPF5fA8Se #Devara #BlockbusterDevara— Devara (@DevaraMovie) October 22, 2024 -
'దేవర'కు భారీ లాభాలు.. గ్రాండ్‌గా పార్టీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదుచేసింది. ఈ చిత్రం విజయంతో హీరో ఎన్టీఆర్‌తో పాటు ఆయన అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దేవర వల్ల భారీ లాభాలు రావడంతో వారందరూ గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా గత నెల 27న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ. 509 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు.దేవర విజయం వల్ల థియేటర్ ఓనర్ల నుంచి క్యాంటీన్ నిర్వాహకుల వరకు అందరూ లాభపడ్డారని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ గతంలో చెప్పారు. ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లతో పాటు తాను కూడా సంతోషంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. దేవర వల్ల చాలామంది లాభ పడ్డారని ఆయన అన్నారు. అయితే, ఈ సినిమాను పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లతో కలిసి నాగవంశీ ఒక పార్టీ చేసుకున్నారు. ఈమేరకు వారందరూ దుబాయ్ వెళ్లారట. దేవర విజయంతో భారీ లాభాలు రావడం వల్ల చాలా ఆనందంతో దుబాయ్‌లో సెలబ్రేషన్స్ చేసుకున్నారట.వరల్డ్ వైడ్‌గా మూడు వారాల్లో దేవర సినిమాకు రూ. 509 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికీ దేవర కలెక్షన్ల విషయంలో 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు బాగానే రన్ అవుతున్నాయి. 183 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన దేవర.. ఆ మార్క్‌ను ఎప్పుడో అందుకున్నాడు. మూడు వారాలకే సుమారు రూ. 80 కోట్ల నెట్ కలెక్షన్ల లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. -
భుజాలపై మోసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం దేవర. సెప్టెంబర్ 27 థియేటర్ల ముందుకొచ్చిన ఈ చిత్రం మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అయితే దేవర బ్లాక్‌బస్టర్ హిట్ కావడంపై జూనియర్ ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు చిత్రయూనిట్, అభిమానులపై ప్రశంసలు కురిపించారు. దేవరలో హీరోయిన్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ నటనను కొనియాడారు. తమ పాత్రలకు ప్రాణం పోసి, కథకు జీవం ఇచ్చారన్నారు.అలాగే దేవర డైరెక్టర్ కొరటాల శివతో పాటు మూవీకి పనిచేసిన సాంకేతిక సిబ్బందికి సైతం ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన సంగీతమందిచాడన్నారు. దేవర సినిమాను తమ భుజాలపై మోసి ఇంతటి ఘనవిజయం అందించిన అభిమానులందరికీ రుణపడి ఉంటానని వెల్లడించారు. మీ ప్రేమే నన్ను ఈ స్థాయికి చేర్చిందని ఎన్టీఆర్ ప్రత్యేకంగా లేఖ విడుదల చేశారు. Grateful. pic.twitter.com/YDfLplET7S— Jr NTR (@tarak9999) October 15, 2024 -
యుద్ధానికి సిద్ధం
‘వార్’కి సిద్ధం అవుతున్నారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్‌తో ఆయన యుద్ధం చేయనున్నారు. ఇక ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర:పార్ట్ 1’ గత నెల 27న విడుదలైన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో ‘దేవర’ రెండో భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఒక నెల విరామం తీసుకుని రెండో భాగం పనులు మొదలు పెట్టమని కొరటాల శివకి ఎన్టీఆర్ సూచించారట.ఇక ఎన్టీఆర్ మాత్రం ‘వార్ 2’ చిత్రం షూట్లోపాల్గొనడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వార్ 2’. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. జాన్ అబ్రహాం, కియారా అద్వానీ తదితరుల కాంబినేషన్లో ‘వార్ 2’ని యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారని టాక్.ఇప్పటికే అటు ముంబై ఇటు హైదరాబాద్ షెడ్యూల్స్‌లో హృతిక్–ఎన్టీఆర్‌లపై కాంబినేషన్ సీన్స్ చిత్రీకరించారు మేకర్స్. అయితే ‘దేవర:పార్ట్ 1’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ‘వార్ 2’ షూట్‌కి కాస్త గ్యాప్ ఇచ్చారు. దసరా పండగ తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది యూనిట్. ఈ షెడ్యూల్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ల మధ్య క్లైమాక్స్ ఫైట్‌ని చిత్రీకరించనున్నారట. 2025 ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది. -
'దేవర'లో చూసింది 10 శాతమే.. పార్ట్2పై అంచనాలు పెంచేసిన కొరటాల
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదుచేసింది. సినిమా విడుదలరోజు మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మీద అంతగా ప్రభావం చూపలేదు. ఒక వర్గానికి చెందిన వారు కావాలనే దేవర సినిమాపై దుష్పచారం చేశారని తారక్ అభిమానులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వారు సమర్థవంతంగా అలాంటి ప్రచారాలను తిప్పికొట్టారు. ఇప్పడు సినిమా చూసిన ప్రేక్షకులు దేవర 2 కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా సీక్వెల్ గురించి దర్శకులు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్లు చేశారు. ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.దేవర పార్ట్2లో అసలు మలుపు ఉంది. ఇందులో జాన్వీ కపూర్ పాత్ర ఎవరూ ఊహించలేనంతగా ఉంటుంది. సీక్వెల్లో ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఆమె పాత్రను చూశాక అందరూ ఆశ్చర్యపోతారు. పార్ట్2 మీద నాకు చాలా నమ్మకం ఉంది. తారక్ అభిమానులకు మాటిస్తున్నా.. దేవర పార్ట్1లో మీరు చూసింది కేవలం 10 శాతం మాత్రమే.. సీక్వెల్లో అసలు కథ ఉంది. 100 శాతం చూస్తారు. సీట్ ఎడ్జ్‌లో మిమ్మల్ని కూర్చోపెడుతాం. ఊహించలేనంతగా ట్విస్ట్‌లు ఉంటాయి. కథ ఇప్పటికే పూర్తి అయింది. అందరికీ మంచి ఫీల్ కలిగేలా సినిమా ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నా.' కొరటాల శివ చెప్పారు.దేవర ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద రూ. 466 కోట్లు కలెక్ట్ చేసింది. దేసర సెలవులు కొనసాగుతుండటంతో సులువుగా రూ. 500 కోట్ల మార్క్‌ను దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ మెప్పించగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటించారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. View this post on Instagram A post shared by RAW NTR (@rawntrofficial) -
తగ్గేదేలే అంటోన్న దేవర.. పది రోజుల్లో ఎన్ని కోట్లంటే?
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలి రోజే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రీమియర్ షోలతో కలిపి మొదటి రోజే రూ.170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఇప్పటికే దసరా సెలవులు రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.దేవర విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.466 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని దేవర టీమ్ ట్విటర్ ద్వారా షేర్ చేసింది.మరోవైపు నార్త్ అమెరికాలోనూ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు 5.8 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టింది. త్వరలోనే ఆరు మిలియన్లకు చేరుకోనుంది. ఇక వరుసగా దసరా సెలవులు ఉండడంతో త్వరలోనే రూ.500 కోట్ల మార్క్‌ను దాటేయనుంది.కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు. దేవరలో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. కాగా.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
డ్యాన్స్ టైమ్
ఎన్టీఆర్ డ్యాన్స్ అదరగొడతారు. హృతిక్ రోషన్ డ్యాన్స్ ఇరగదీస్తారు. మరి... ఈ ఇద్దరూ కలిసి ఓపాటకు డ్యాన్స్ చేస్తే థియేటర్స్ దద్దరిల్లేలా ఆడియన్స్ విజిల్స్ వేస్తారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘వార్ 2’ అనే స్పై యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓపాట ఉంటుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి.ఈపాట చిత్రీకరణకు సమయం ఆసన్నమైంది. టైమ్ టు డ్యాన్స్ అంటూ... ఈ నెల మూడో వారంలో ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్లో ఈపాటను ముంబైలో చిత్రీకరించనున్నారట. నృత్యదర్శకురాలు వైభవీ మర్చంట్ ఈ సాంగ్‌కు స్టెప్స్ సమకూర్చనున్నారని భోగట్టా. ఈ మాస్ మసాలా సాంగ్ కోసం సెట్స్ తయారు చేయిస్తున్నారట. ఆదిత్యా చో్ర΄ా నిర్మిస్తున్న ‘వార్ 2’ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది.