
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వార్ 2 (War 2 Movie). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ లభించింది. ఈ మూవీ నుంచి తాజాగా సలాం అనాలి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ పోటాపోటీగా డ్యాన్స్ చేశారు.
ఎనర్జిటిక్ డ్యాన్స్
వీరి ఎనర్జిటిక్ డ్యాన్స్ చూసేందుకు అభిమానులకు రెండు కళ్లు చాలవు. సినిమా సంగతేమో కానీ వీళ్ల డ్యాన్స్ మాత్రం అదిరింది అని కామెంట్లు చేస్తున్నారు. ఈ పాటకు ప్రీతమ్ సంగీతం అందించగా నకాశ్ అజీజ్, యాజిన్ నిజర్ ఆలపించారు. కృష్ణ కాంత్ తెలుగులో లిరిక్స్ సమకూర్చారు. వార్ 2 మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. అక్షయ్ విధాని సహనిర్మాతగా వ్యవహరించారు.