
‘థామా’లో తడ్‌కాపాత్రలో తన తడాఖా చూపిస్తానంటున్నారు రష్మికా మందన్నా. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న హారర్, మిస్టరీ అండ్ లవ్‌స్టోరీ మూవీ ‘థామా’. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ ‘థామా’ ఈ దీపావళికి రిలీజ్ కానుంది.
కాగా అతీంద్రియ శక్తులతో కూడిన ఈ హారర్ రొమాంటిక్ చిత్రంలోని ప్రధానపాత్రధారుల ఫస్ట్‌లుక్స్‌తోపాటుగా, ఈ సినిమాలోని వారిపాత్రల పేర్లను మేకర్స్ రిలీజ్ చేశారు. అలోక్‌పాత్రలో ఆయుష్మాన్ ఖురానా, తడ్‌కాపాత్రలో రష్మికా మందన్నా, యాక్షసాన్ గా నవాజుద్దీన్ , రామ్ బజాజ్ గోయెల్‌గా పరేశ్ రావల్ నటిస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు. కాగా ‘థామా’కి చెందిన తాజా వీడియో ‘థామా వరల్డ్’ పేరుతో నేడు విడుదలవుతోంది.