
కృష్ణాష్టమి అనగానే అందరూ రాధ, గోపికలుగా తయారై తెగ సందడి చేశారు. హీరోయిన్ అదా శర్మ (Adah Sharma) కూడా అందంగా ముస్తాబైంది. అయితే చేతిలో వేణువు పట్టుకుంది. ఊరికే ఫోటో కోసమే అలా స్టిల్ ఇచ్చిందనుకునేరు. కానే కాదు, ఫ్లూట్‌తో అద్భుతంగా ఓ పాట ట్యూన్ వినిపించింది. ఇది చూసిన అభిమానులు.. మీరు మల్టీటాలెంటెడ్ అని మెచ్చుకుంటున్నారు. కాగా అదా శర్మ.. లాక్‌డౌన్‌లో ఫ్లూట్ నేర్చుకుంది.
సినిమాల విషయానికి వస్తే..
అదా శర్మ.. 1920 అనే హారర్ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. హార్ట్ ఎటాక్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తెలుగులో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, కల్కి, సీ.డీ: క్రిమినల్ ఆర్ డెవిల్ వంటి చిత్రాల్లో నటించింది. ద కేరళ స్టోరీ మూవీతో సెన్సేషన్ అయిన అదా చివరగా తుమ్‌కో మేరీ కసమ్ మూవీలో కనిపించింది.