breaking news
Cinema News
-
'ఓజీ 2'లో సుభాష్ చంద్రబోస్ ఎలిమెంట్?
పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఓజీ-2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ చిత్రాన్ని ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్‌తో చర్చలు, మ్యూజిక్ సిట్టింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కథలో ఈసారి ఊహించని మలుపులు ఉండనున్నాయని ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. జపాన్ నుంచి వచ్చిన విలన్, ఓజీ గురించి వెదుకుతాడట. అనంతరం అతడికి, ఓజాస్ గంభీరాకు మధ్య జరిగే యుద్ధమే పార్ట్-2 కథ అని చాలామంది భావిస్తున్నారు. కానీ అంతకుమించి మరో ఆసక్తికరమైన ట్విస్ట్ కూడా ఉందని సమాచారం. ఓజీ కథ 1940లలో మొదలై, 1973 ప్రాంతంలో సాగి 1993లో ముగిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్లో మరోసారి 1940ల కాలాన్ని టచ్ చేస్తూ, ఆ కాలంలో సుభాష్ చంద్రబోస్ ఎలిమెంట్‌ను జోడించినట్టు తెలుస్తోంది. అయితే గంభీరాకు, బోస్‌కు కథలో ప్రత్యక్ష లింక్ లేకపోయినా, దర్శకుడు సుజీత్ మాత్రం ఈ కథలో ఓ చిన్న మేజిక్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ చిత్రాన్ని పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఆయనే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న దీక్ష ముగిసిన వెంటనే ఈ సినిమా లాంచింగ్ జరగనుందని సమాచారం. -
వారణాసి తర్వాత గ్లోబల్ స్టార్‌గా మహేష్.. తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో?
సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసి షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో ఆయన చేసే తదుపరి సినిమాలపై టాలీవుడ్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. మరో నాలుగు నెలల్లో వారణాసి మేజర్ షెడ్యూల్స్ పూర్తవుతాయి. అనంతరం మహేష్ ఎలాంటి విరామం తీసుకోకుండా వెంటనే కొత్త ప్రాజెక్టులను లైన్లో పెట్టాలని నిర్ణయించుకున్నారని సమాచారం. సాధారణంగా పెద్ద సినిమాలు పూర్తయిన తర్వాత హీరోలు కొంతకాలం విశ్రాంతి తీసుకుంటారు. మహేష్ కూడా అంతే. తనకు సమయం దొరికితే వెంటనే తన ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు. అక్కడే కొంతకాలం విశ్రాంతి తీసుకుంటారు. కానీ మహేష్ ఈసారి భిన్నమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారట. వారణాసి లాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత కూడా ఆయన బ్రేక్ తీసుకోకుండా కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోని పలువురు క్రేజీ దర్శకులు మహేష్ కోసం సరికొత్త కథలను సిద్ధం చేసుకుని సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు దర్శకులు మహేష్‌కు లైన్స్ వినిపించినట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. వాటిలో కమర్షియల్ ఎంటర్టైనర్ల నుంచి కంటెంట్ ఓరియెంటెడ్ కథల వరకు మహేష్ దగ్గరకు వచ్చాయని తెలుస్తోంది. ఇప్పుడు మహేష్ చేయాల్సిన పని నెక్స్ట్ సినిమా కోసం వీరిలో ఒక దర్శకుడిని ఫైనల్ చేయడమే. రాజమౌళి సినిమా తర్వాత వచ్చే ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది. అందుకే కథల ఎంపికలో మహేష్ ఎంతో జాగ్రత్త వహిస్తున్నారు. ఆయన ఇమేజ్‌కు సరిపోయేలా, గ్లోబల్ రీచ్ వచ్చేలా ఉండే కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అలాగే వారణాసితో మహేష్ గ్లోబల్ స్టార్ అవుతారని అంచనా. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రాలు కూడా గ్లోబల్ రేంజ్‌లోనే ఉండే అవకాశం ఉంది. -
‘ప్రైమేట్’ రివ్యూ : అలాంటివాళ్లు చూడకూడని సినిమా
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ప్రైమేట్’ ఒకటి. ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. భయం... మనిషిని, మనిషి ఆలోచనలను ఎలాంటి స్థితిలోనైనా ఏ క్షణమైనా ఆపేయగల ఏకైక భావోద్వేగం ఈ భయం. ఎంతటి ధైర్యవంతులైనా, దమ్మున్నవారైనా ఈ భయమనేది ఒక్కసారి కలిగితే పరిగెత్తాల్సిందే. ఆ నేపథ్యంలో ఎన్నో సినిమాలను ఇప్పటికే మనం చూశాం. కానీ ఈ ‘ప్రైమేట్’ సినిమా కొంత విభిన్నం. ప్రైమ్ వీడియో వేదికగా ఈ చిత్రం స్టీమ్ అవుతోంది. మొదటి పది నిమిషాలు వదిలేస్తే మిగతా ప్రతి నిమిషం ప్రేక్షకుడిని భయంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుందీ సినిమా. అందుకే భయపడేవారు, అనారోగ్యంగా ఉన్నవారు ఈ సినిమాకి దూరంగా ఉండడమే మంచిది. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం. హవాయి కొండ ప్రాంతంలో లూసీ కుటుంబం ఓ చింపాజీతో పాటు ఉంటుంది. చింపాంజీని తమ కన్నబిడ్డలకన్నా మమకారంగా పెంచుకుంటుంటారు. చింపాంజీని బెన్ అని పిలుచుకుంటారు. ఓ రోజు ఎక్కడ నుండో వచ్చిన మంగూస్ అనుకోకుండా బెన్ని కరిచి వెళ్ళగా దానికి ర్యాబిస్ వ్యాధి సోకుతుంది. దాంతో బెన్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటుంది. ఇవేమీ తెలియని లూసీ తన స్నేహితులను చిన్న పార్టీ కోసం ఇంటికి పిలుస్తుంది. ఇంతలో పిచ్చి పట్టిన బెన్ ఏమో లూసీ స్నేహితులలో ఒకరిని అత్యంత కిరాతకంగా దాడి చేసి, చంపేస్తుంది. దీంతో బిత్తరపోయి భయపడ్డ లూసీ బృందం స్విమ్మింగ్ పూల్‌లో దూకేస్తుంది. ర్యాబిస్ సోకిన చింపాంజీకి నీళ్ళంటే అలర్జీ కాబట్టి వాళ్ళ దగ్గరకు రావాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటుంది. మరి... నీళ్ళలో ఉన్న లూసీ బృందం బెన్ చేతికి చిక్కుతుందా? లేక లూసీవాళ్ళు తప్పించుకుంటారా? అన్న విషయాన్ని మాత్రం ‘ప్రైమేట్’ సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా సూపర్ థ్రిల్లింగ్. అందుకే భయపడేవారు, అనారోగ్యం ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని చూడకూడదు. థ్రిల్లింగ్ జోనర్ ఇష్టపడేవాళ్ళకి ఈ సినిమా ఓ ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు. ప్రేక్షకుడు సినిమా మొత్తం కన్నార్పకుండా కూర్చోబెట్టే స్క్రీన్‌ప్లేతో కూడుకున్నదీ సినిమా. మస్ట్ వాచ్ ఫర్ థ్రిల్లింగ్ లవర్స్. – హరికృష్ణ ఇంటూరు -
'వారణాసి'లో అంటార్కిటికా షెడ్యూల్ రద్దు?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం వారణాసి. ఈ మూవీలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వారణాసి చిత్రానికి సంబంధించి అత్యంత క్లిష్టమైన షెడ్యూల్‌గా భావించిన అంటార్కిటికా షూటింగ్ ఇక జరగదని సమాచారం. ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రాంతమైన అంటార్కిటికాలో కీలకమైన కొన్ని ఎపిసోడ్స్‌ను చిత్రీకరించాలని దర్శకుడు రాజమౌళి ముందుగా నిర్ణయించారు. టైటిల్ గ్లింప్స్‌లో దాని గురించిన చిన్న రిఫరెన్స్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ ప్రణాళికను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో విపరీతమైన చలి, ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులతో పాటు ఈ షెడ్యూల్‌కి కావాల్సిన భారీ బడ్జెట్ వంటి పరిమితుల కారణంగా ఈ షెడ్యూల్‌ను రద్దు చేసినట్టు సమాచారం. ముందు అక్కడ షూటింగ్ చేసి కొత్త రికార్డు సృష్టించాలని రాజమౌళి అనుకున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఆలోచనను వదిలేసినట్టు తెలుస్తోంది. దానికోసం హైదరాబాద్‌లోనే ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నారని సమాచారం. అనంతరం దానిని అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా తెరపై అంటార్కిటికా మంచు ఖండాన్ని అద్భుతంగా చూపించే అవకాశం ఉంది. రాజమౌళి తాజాగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం.. వారణాసి చిత్రానికి సంబంధించిన మేజర్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కీలకమైన యాక్షన్ సన్నివేశాలన్నీ కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం కథను కలుపుతూ సాగే చిన్న చిన్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి మొత్తం షూటింగ్ ముగుస్తుందని ఆయన స్పష్టం చేశారు. -
తన ఆరోగ్య సమస్యను బయటపెట్టిన హీరో విష్ణు విశాల్
సినీ నటుడు విష్ణు విశాల్ తన ఆరోగ్య సమస్యను బహిరంగంగా వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఆయన అలసటగా, నీరసంగా కనిపించడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. మొదట షూటింగ్ ఒత్తిడి కారణమని అంతా అనుకున్నారు. కానీ విష్ణు విశాల్ స్వయంగా నిజమైన కారణాన్ని చెప్పాడు. తన మాటల్లోనే.. నా ముఖం అలసిపోయినట్లు చాలామంది గమనించారు. దానికి కారణం నేను 3-4 సంవత్సరాలుగా 'ఆటోఇమ్యూన్ వ్యాధి'తో బాధపడుతున్నాను. వైద్యులు సూచించిన మందులు తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నా తొలి ప్రాధాన్యత ఆరోగ్యానికే ఇస్తున్నానని తెలిపారు. Humbly sharing this with gratitude and love 🙏#GattaKusthi2 pic.twitter.com/FCR9n782RA— VISHNU VISHAL - VV (@TheVishnuVishal) June 25, 2026ఈ ప్రకటనతో ఆయన అభిమానులు మరింత మద్దతు వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే తన ఆరోగ్యం మెరుగుపడుతుందని, సినిమా ప్రమోషన్లు యథావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. విష్ణు విశాల్ నటించిన గట్ట కుస్తీ 2 సినిమా వచ్చేనెల 3న థియేటర్లలో విడుదల కానుంది. గతంలో వచ్చిన గట్ట కుస్తీ తెలుగులోనూ మట్టి కుస్తీగా పేరుతో వచ్చిన విషయం తెలిసిందే. -
సౌత్ సినీ పరిశ్రమపై తమన్నా విమర్శలు
సౌత్ సినీ పరిశ్రమలో దశాబ్దానికి పైగా అనుభవం సొంతం చేసుకున్న హీరోయిన్ తమన్నా. ఈమె తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. తమన్నా మాట్లాడుతూ.. సౌత్ సినిమాలలో మహిళలను చూసే కోణంలో ఒకింత పురుషాధిక్యత కనిపిస్తుంది. హీరోయిన్లను గౌరవప్రదంగా కాకుండా ఎక్కువగా గ్లామర్ కోణంలోనే చూపిస్తారు. అయితే బాలీవుడ్లో మాత్రం నటన లేదా గ్లామర్ ఏదో ఒకటి ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. కానీ సౌత్‌లో ఈ రెండింటినీ సమతుల్యం చేయాల్సి వస్తుందని ఆమె అభిప్రాయపడింది. తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు పరిశ్రమలోని చాలా మందికి ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకంటే.. తమన్నా కెరీర్లో టాలీవుడ్, కోలీవుడ్ రెండింటిలోనూ ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. స్టార్ స్టేటస్, భారీ పారితోషికంతో పాటు అభిమానుల నుంచి ఆదరణ కూడా వచ్చింది. ఇవన్నీ ఆమెకు దక్షిణాదే ఇచ్చాయి. కానీ ఇప్పుడు తనకు అవకాశాలు తగ్గడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని కొందరు విమర్శిస్తున్నారు. గతంలో రాధికా ఆప్టే, తాప్సీ పన్ను వంటి హీరోయిన్లు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తమన్నా కూడా అదే జాబితాలో చేరిందని సినీ వర్గాలు అంటున్నాయి. -
'హైదరాబాద్ నా రెండో ఇల్లు'.. హాట్‌టాపిక్‌గా భాగ్యశ్రీ ప్రేమ పుకార్లు
నటి భాగ్యశ్రీ బోర్సే మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హీరో రామ్ పోతినేనితో ఆమె డేటింగ్లో ఉందనే వార్తలు గతంలోనే వినిపించాయి. ఇప్పుడు ఆ పుకార్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. తాజాగా లెనిన్ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా భాగ్యశ్రీ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కారణమయ్యాయి. 'ఔరంగాబాద్ నా మొదటి ఇల్లు, కానీ హైదరాబాద్ నా రెండో ఇల్లుగా మారిపోయింది' అని ఆమె చెప్పుకొచ్చింది. తనకు హైదరాబాద్‌లో ఇప్పటికే ఒక ఇల్లు కూడా ఉందని చెప్పడం నెటిజన్లను ఆకర్షించింది. ఈ విషయంలో భాగ్యశ్రీ తన నివాసం గురించే మాట్లాడినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం 'అది రామ్ పోతినేని ఇల్లు కావచ్చు' అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. యాంకర్ 'తెలుగు హీరోల్ని పెళ్లి చేసుకున్న తర్వాత చాలామంది హీరోయిన్లు హైదరాబాద్‌లోనే శాశ్వతంగా స్థిరపడతారు' అని అంటే.. దానికి భాగ్యశ్రీ సిగ్గుపడటం పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్టైంది. రామ్, భాగ్యశ్రీ కలిసి నటించిన ‘ఆంధ్ర కింగ్’ సినిమా సమయంలోనే వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే ప్రచారం మొదలైంది. అప్పట్లో ఆ సినిమా ప్రమోషన్ కోసం ఇద్దరూ కలిసి అమెరికా కూడా వెళ్లారు. అయితే అప్పట్లో ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ స్పందించారు. రామ్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని ఒక నటుడిగా ఆయన అంటే తనకు ఎంతో గౌరవం అని చెప్పింది. ఆయన డెడికేషన్ చూసి ఎంతో నేర్చుకున్నాను. అంతకు మించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.ఇన్నాళ్లకు మళ్లీ ఈ ప్రేమ పుకార్లు తెరపైకి రావడం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. భాగ్యశ్రీ బోర్సే చేసిన 'హైదరాబాద్ నా రెండో ఇల్లు' వ్యాఖ్యతో రామ్‌తో ఉన్న ప్రేమ పుకార్లు మళ్లీ హాట్‌టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియాలో ఈ జంటపై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. -
విమర్శించిన నోటితోనే 'గురూజీ' అని సంబోధించిన బండ్ల గణేష్
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన వ్యాఖ్యలతో, సోషల్ మీడియా పోస్ట్‌తో హాట్ టాపిక్‌గా మారారు. ఒకప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, ఇప్పుడు “థాంక్యూ గురూజీ.. మీ ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఆదర్శకుటుంబం సినిమా సెట్లో త్రివిక్రమ్‌ని బండ్ల గణేష్ కలిసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసిన బండ్ల గణేష్, ఆయన ఆరోగ్యం, ఆనందం, విజయాలు కొనసాగాలని మనసారా ప్రార్థించారు. గతంలో ‘భీమ్లా నాయక్’ ఈవెంట్ సందర్భంగా బండ్ల గణేష్, త్రివిక్రమ్‌ను బూతు పదజాలంతో విమర్శలు చేసినట్టు అప్పట్లో ఓ ఆడియో వైరల్ అయింది. ఆ ఫంక్షన్‌కి బండ్ల గణేష్‌ను పిలవలేదు. దానికి కారణం త్రివిక్రమే అని ఆ టైమ్‌లో ఓ పవన్ కళ్యాణ్ అభిమానితో బండ్ల గణేష్ మాట్లాడిన ఆడియో కాల్ లీక్ అయి సంచలనం సృష్టించింది. ఆ ఆడియోలో త్రివిక్రమ్‌ను ఉద్దేశించి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశాడు బండ్ల గణేష్. నన్ను ఈవెంట్‌కు రాకుండా త్రివిక్రమ్ అడ్డుకున్నాడు, చూసుకుందాం అంటూ రెచ్చిపోయాడు. అయితే ఇప్పుడు అదే త్రివిక్రమ్‌ను 'గురూజీ' అని సంబోధిస్తూ కృతజ్ఞతలు తెలపడం నెటిజన్లలో చర్చనీయాంశమైంది. ఇటీవల మెగా ఫ్యామిలీకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌కు దగ్గరైన బండ్ల గణేష్, చిరంజీవి ‘మెగా 158’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ - గణేష్ చాలా సన్నిహితంగా కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్‌తో కూడా కలిసిపోవడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. -
రాజమౌళి-చరణ్ కాంబినేషన్ రిపీట్?
టాలీవుడ్లో పుకార్లకు కొదవలేదు. రోజూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. అందులో చాలా వరకు తప్పులే అవుతాయి. తాజాగా మూడు పెద్ద సినిమాలపై ప్రచారాలు మొదలయ్యాయి. వాటిపై దాదాపు ఒకేసారి క్లారిటీ కూడా వచ్చేసింది. గతంలో మగధీర, ఆర్ఆర్ఆర్ వంటి భారీ హిట్ సినిమాల తర్వాత రాజమౌళి- రామ్ చరణ్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే రాజమౌళి సన్నిహిత వర్గాల ప్రకారం.. ప్రస్తుతం రాజమౌళి తదుపరి చేసే చిత్రంపై ఆలోచించే పరిస్థితిలో లేడట. సాధారణంగా తను చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాతే కొత్త ప్రాజెక్ట్‌పై రాజమౌళి నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి మహేష్ బాబుతో వారణాసి సినిమా పూర్తయిన తర్వాతే ఆయన నెక్ట్స్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక చరణ్‌తో సినిమా అనేది పూర్తిగా పుకారే. బింబిసార చిత్ర దర్శకుడు వశిష్ఠతో మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభరపై కూడా ఓ కొత్త రూమర్ మొదలైంది. ప్రస్తుతం బాబి దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాతే విశ్వంభర విడుదల అవుతుందనే ప్రచారం జరిగింది. దాంతో విశ్వంభర టీమ్ సభ్యులు దీన్ని ఖండించారు. డేట్ ఫిక్స్ చేయనప్పటికీ ఈ ఏడాదిలోనే విశ్వంభర విడుదల అవుతుందని వారు స్పష్టత ఇచ్చారు. ఇక విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా కథ, స్క్రీన్‌ప్లేలో మార్పులు జరుగుతున్నాయని, ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం లేదని ప్రచారం జరిగింది. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడు. అయితే ఈ సినిమా యూనిట్లో కొందరు వ్యక్తులు ఈ ఏడాదిలోనే ఈ చిత్రం రిలీజ్ అవుతుందని తెలిపారు. -
రజనీ Vs మాజీ అల్లుడు.. ఆసక్తికర పోరు
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్-2 చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ ఏడాది దీపావళికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక మరోవైపు రజనీ మాజీ అల్లుడు ధనుష్ తన 55వ చిత్రాన్ని కూడా దీపావళి టార్గెట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే.. కోలీవుడ్ బాక్సాఫీస్ బరిలో రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. అంటే ఒకప్పుడు మామఅల్లుళ్లు.. ఇప్పుడు బాక్సాఫీస్ బరిలో తలపడబోతున్నారన్నమాట.నిజానికి జైలర్-2 సినిమా ఈపాటికే రిలీజ్ అవ్వాల్సింది. అయితే రీషూట్స్ కారణంగా సినిమా పలుమార్లు డిలే అవుతూ వచ్చింది. ఇక అలా వాయిదాలు పడుతూ ఆకరికి దీపావళి బరిలో విడుదలకు రెడీ అవుతోంది. అయితే అటు ధనుష్ మాత్రం తన సినిమా ప్రారంభం నుంచి అక్టోబర్ నెల రిలీజ్ టార్గెట్ గానే తన సినిమాను రెడీ చేస్తున్నాడు.ఈ విషయంలో ప్రాక్టికల్‌గా చూసుకుంటే సూపర్‌స్టార్ రజనీకాంత్ స్టార్ డమ్‌తో ధనుష్ పోటీ పడే అవకాశం లేదు. కానీ వీళ్ల మధ్య ఉన్న పాత బంధం కారణంగా ఈ బాక్సాఫీస్ క్లాష్ అందర్నీ ఆకర్షించే అవకాశం ఉంది. అయితే రజనీకాంత్ సినిమా రంగంలో ఉన్నప్పుడు ధనుష్ తన సినిమాని థియేటర్లలోకి తెచ్చేంత సాహసం చేయడంటున్నారు మరికొంతమంది. ధనుష్ సినిమాలన్నీ కూ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతాయి. దాంతో బరిలో రజనీకాంత్ ఉన్నా ధనుష్ తగ్గకపోవచ్చని అంటున్నారు మరికొంతమంది. చూడాలి ఈ ఆసక్తికర పోరులో చివరికి ఏమౌతుందో.రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను ధనుష్ 2004లో వివాహం చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో వారి 18 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడిచి 2022లో విడిపోతున్నట్టు ప్రకటించారు. అనంతరం 2024లో కోర్టు వీళ్లకు అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. -
ఆమె దుస్తుల ధర రూ.40వేలు.. కానీ చెప్పులు రూ.1 లక్ష పైనే!
బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ ఎప్పుడూ తన స్టైల్‌తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. తాజాగా అమీర్ ఖాన్ సూపర్‌హిట్ మూవీ లగాన్ విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక స్క్రీనింగ్ జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే కరీనా కపూర్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.హీరోయిన్లు ధరించే దుస్తులు, యాక్ససిరీస్ ఎప్పుడూ ఆకర్షిస్తాయి. కేవలం చెప్పులు, వాచీల కోసం లక్షలు ఖర్చుచేసే నటీనటులున్నారు మన దగ్గర. తాజాగా కరీనా కపూర్ తన దుస్తులు, యాక్ససిరీస్తో ఆకట్టుకుంది. అమీర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ 'లగాన్' వేడుకకు సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా కొంతమంది వచ్చారు. అయితే ఈ ఈవెంట్లో కరీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ వేడుకలో బెబో తన గ్లామరస్ లుక్‌తో, గులాబీ రంగు సూట్లో మెరిసింది. ఈ అందమైన పింక్ సిల్క్ సూట్‌ను ‘ఏకాయ్ బనారస్’ అనే బ్రాండ్‌కు చెందినది. దీని ధర రూ. 40,975. ప్రముఖ ఆర్టిస్ట్ అమృతా షేర్-గిల్ కళాఖండాల స్ఫూర్తితో దీన్ని డిజైన్ చేశారు. ఈ సాంప్రదాయ దుస్తులు కంఫర్ట్‌తో పాటు వింటేజ్ లుక్‌ను అందించాయి. అంతటితో ఆగితే అమెను బాలీవుడ్ బెబో అని ఎందుకంటారు? తన లుక్‌ను మరింత ఎలివేట్ చేయడానికి కరీనా ‘అక్వాజురా’ అనే బ్రాండ్‌కు చెందిన ఖరీదైన హీల్స్ ధరించింది.అయితే ఆమె ధరించిన డ్రెస్ కంటే కూడా ఈ హీల్స్ చాలా కాస్ట్లీ అట. ఈ ఇంపోర్టెడ్ హీల్స్ అసలు ధర 835 యూరోలు. అంటే అది మన దేశ కరెన్సీలో దాదాపు 91,874 రూపాయలు. ఎందుకు అంత ధర అంటే.. ఇది 30 రకాల విడిభాగాలను జతచేసి తయారు చేసిన హ్యాండ్ మేడ్ షూ అట. అందుకే ఈ షూ అంత రేటు అని తెలుస్తోంది. కాగా ఇండియాలో ఈ బ్రాండ్‌కు చెందిన ఇలాంటి డిజైనర్ శాండల్స్ ధర రూ. 99,650 నుండి రూ. 1,54,500 వరకు ఉంటాయి. ఇలా కరీనా కపూర్ ఈ వేడుకలో ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేసింది. -
విజయ్ దర్శకుడితో సూర్య కొత్త సినిమా!
సూర్య మంచి జోరు మీద ఉన్నారని చెప్పవచ్చు. ఈయన ఇంతకుముందు నటించిన రెట్రో చి త్రం కమర్శియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఆయన నటించిన కరుప్పు చిత్రం సంచలన విజయాన్ని సాధించి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆయన హీరోగా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ప్రస్తుతం ఈయన మలయాళ దర్శకుడు జీతు మాధవన్ దర్శకత్వంలో తన 47వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా నజ్రియా నటిస్తున్నారు.తర్వాత టీజే.జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్.వినోద్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయడానికి సూర్య రెడీ అవుతున్నట్లు సామాజక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈయన ఇటీవల జననాయకన్ చిత్రాన్ని చేశారు. తమిళనాడు సీఎం విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదల కావలసి ఉంది. దీంతో హెచ్.వినోద్ తర్వాత చిత్రం ఏమిటన్న ప్రశ్నకు సూర్య హీరోగా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.అయితే ఆయన ఇటీవలే సొంత నిర్మాణ సంస్ధను ప్రారంభించి తన శిష్యుల్లో ఒకరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఆయన దర్శకత్వంలో సూర్య హీరోగా చిత్రం ఉంటుందని ఈ చిత్రానికి కథా చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది సూర్య నటించే 49వ చిత్రం అవుతుంది. ఈ రేర్ కాంబో షురూ అయితే చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటాయని చెప్పవచ్చు. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమానార్హం. -
నేపాలీ గ్యాంగ్స్‌పై ఆర్జీవీ కన్ను?
హైదరాబాద్‌తో పాటు కొన్ని ఇతర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో నేపాలీ గ్యాంగ్స్ సృష్టించిన హత్యలు, దోపిడీలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసిన ఘటనతో ఈ నేపాలీ ముఠాల ఆగడాలు మరింతగా వెలుగులోకి వచ్చాయి. దాంతో ఈ పరిణామాలపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దృష్టి పడింది. ఎప్పుడూ రియల్ లైఫ్ కథలను తనదైన శైలిలో సినిమాగా మలచడంలో ఆసక్తి చూపుతుంటాడు వర్మ. తాజాగా ఈ దర్శకుడు నేపాలీ ముఠాల కథను తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడని సమాచారం. దీనికి సంబంధించి సరైన పాయింట్ కోసం ఆయన వెతుకుతున్నాడని తెలుస్తోంది. గతేడాది తన సూపర్ హిట్ చిత్రం 'సత్య' సినిమాను మళ్లీ చూశాడు వర్మ. అనంతరం ఎందుకు దానిని బెంచ్‌మార్క్‌గా పెట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకపై తన ప్రతిభకు తగ్గ గొప్ప సినిమాలు తీస్తానని ప్రతిజ్ఞ కూడా చేశాడు. అయితే ఆ తర్వాత తాను ప్రకటించిన 'సిండికేట్' సహా పలు ఇతర ప్రాజెక్టులు సైతం కార్యరూపం దాల్చలేదు. -
సినిమాల్లోకి కత్రినా కైఫ్ రీఎంట్రీ..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మళ్లీ సినిమాల్లోకి అడుగుపెడుతున్నారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో, కొన్ని మీడియా సంస్థల్లో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారాన్ని ఆమె టీమ్ పూర్తిగా ఖండించింది. ఆ వార్తలు నిజం కాదని తేల్చేసింది.కొడుకు విహాన్ కౌశల్ జననం తర్వాత కత్రినా పూర్తిగా తన కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చింది. గత రెండేళ్లుగా కత్రినా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తన భర్త విక్కీ కౌశల్, కొడుకు విహాన్‌తో విహార యాత్రలు చేస్తూ ఆ ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఆనందిస్తోంది.తాజాగా 2027 ద్వితీయార్థంలో వెండితెరపైకి తిరిగి వస్తారనే ఊహాగానాలు నెట్టింట వైరల్ అయ్యాయి. అలాగే ఓటీటీ ప్రాజెక్ట్‌తో అడుగుపెడతారనే వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని ఆమె టీమ్ స్పష్టం చేసింది. ఆ వార్తలు నిజం కాదని తేల్చేసింది. దాంతో రీఎంట్రీ లేదని తేలిపోయింది. ఇక తన నటనతో పాటు వ్యాపార రంగంలో కూడా కత్రినా విజయవంతంగా రాణిస్తున్నారు. ఆమె సొంత కాస్మోటిక్స్ బ్రాండ్ ‘కే బ్యూటీ’ భారతీయ మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, వ్యాపార రంగంతో పాటు తన వ్యక్తిగత జీవితంలో కూడా కత్రినా బిజీగా ఉన్నారు. -
ప్రభాస్‌తో ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా దర్శకుడు ఆదిత్య ధర్ కలయికపై వార్తలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ గురించి ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. వాళ్లిద్దరూ కలిశారనేది నిజం. కొన్ని ఐడియాస్ షేర్ చేసుకున్నారనేది కూడా నిజం. కానీ ఈ కాంబినేషన్ పై ఎలాంటి కన్ ఫర్మేషన్ లేదు. ఇదే విషయాన్ని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు దర్శకుడు సందీప్ వంగాతో స్పిరిట్ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు ఫౌజీ సెట్స్ పై ఉంది. వాటితో పాటు కల్కి-2 సినిమా పనులు కూడా కొనసాగుతున్నాయి. అనంతరం సలార్-2 కూడా లైన్లో ఉంది. ఇలాంటి బిజీ షెడ్యూల్ మధ్య ప్రభాస్ మరో కొత్త ప్రాజెక్ట్‌కు కాల్షీట్లు కేటాయించే పరిస్థితి లేదు. ఇక ఆదిత్య ధర్ విషయానికి వస్తే.. ఆయనకు ఇప్పటికే జియోతో మరో చిత్రానికి కమిట్మెంట్ ఉంది. జీ స్టూడియోస్ కూడా ఆయనతో కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఓటీటీలో విడుదలైన ధురంధర్-2 (ది రివెంజ్) రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ ఫ్రాంచైజీ ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అందువల్ల ప్రభాస్ – ఆదిత్య ధర్ కాంబినేషన్ పై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. వీళ్ల మధ్య ఎలాంటి కథా చర్చలు జరగలేదు. కానీ కొన్ని నిర్మాణ సంస్థలు మాత్రం వీళ్లను కలిపే ప్రయత్నం చేస్తున్నాయన్నది మాత్రం నిజం. -
రెండేళ్లుగా ఖాళీ.. పిచ్చిదానిలా ప్రవర్తించినా సరే..: దీప్తి ఎమోషనల్
దీప్తి సునయన.. ఒకప్పుడు యూట్యూబ్‌లో సెన్సేషన్.. కవర్ సాంగ్స్, డబ్ స్మాష్‌తో పాపులర్ అయిన ఈ బ్యూటీ తెలుగు బిగ్‌బాస్ రెండో సీజన్లో పాల్గొంది. అమాయకత్వం, చిలిపితనంతో అభిమానులను సంపాదించుకున్న ఈ నటి అప్పట్లో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్‌తో ప్రేమలో పడింది. కొన్నేళ్లపాటు కలిసిమెలిసి ఉన్న వీరిద్దరూ 2022లో బ్రేకప్ చెప్పుకున్నారు. అప్పటినుంచి ఎవరి దారి వారు చూసుకున్నారు.టైంపాస్ చేస్తున్న దీప్తిఇటీవలే షణ్ముఖ్ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి కొత్తింట్లో కొత్త జీవితం ప్రారంభించాడు. మరోపక్క ఈ మధ్యే ఓ ప్రైవేట్ సాంగ్ చేశాడు. అలాగే ఓ సినిమా కూడా చేస్తున్నాడు. ఇటు దీప్తి సునయన మాత్రం పనిని పక్కనపెట్టేసి జాలీగా ఎంజాయ్ చేస్తోంది. ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తోంది. మధ్యమధ్యలో గుళ్లుగోపురాలు కూడా తిరుగుతోంది. అయితే ఆమె ఏ ప్రాజెక్టులు చేయకపోయినా తనపై ప్రేమను అలాగే కొనసాగిస్తున్న అభిమానులకు తాజాగా కృతజ్ఞతలు తెలిపిందీ బ్యూటీ.ఏం చేశానని ఇంత ప్రేమ?'గత 10 ఏళ్లుగా మీరు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. నేను ఎలా ఉన్నా ప్రేమించారు. పిచ్చిగా ప్రవర్తించినా ఇష్టపడ్డారు. ప్రతిదానిలో నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంతటి స్వచ్ఛమైన ప్రేమను పొందేందుకు నేను ఏం చేశానో నాకే తెలీదు. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నిజం చెప్పనా.. నాకు పని చేయడానికి ఒంట్లో శక్తి లేదు. రెండేళ్లుగా విశ్రాంతి తీసుకోవడంలోనే గడిపేశాను. అయినా మీరు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మళ్లీ వర్క్‌లో బిజీ అవమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీరిచ్చే ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది.ఆ ప్రయత్నంలోనే ఉన్నా..నేను ఎందుకిలా డీలా పడిపోయానో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. నేను మళ్లీ పూర్తి ఉత్సాహంతో మీ ముందు నిలబడతాను. నేను ఏ పనీ చేయకపోయినా సరే.. నన్ను ప్రేమిస్తున్నందుకు, నాపై నమ్మకం ఉంచినందుకు, నాకోసం నిలబడినందుకు థాంక్యూ సో మచ్' అని దీప్తి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు.చదవండి: వరుస కష్టాలు.. నాకే ఎందుకిలా జరుగుతోంది?: శ్రీజ కొణిదెల -
భారతీరాజా, రజనీకాంత్ మధ్య వివాదం ఏంటి? అసలేం జరిగింది?
దిగ్గజ దర్శకుడు భారతీరాజా(84) మరణంతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడు సీఎం విజయ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు ఆయనకు నివాళులుల అర్పించారు. మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఈ క్రమంలో భారతీరాజాకు సంబంధించిన కొన్ని విషయాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో ప్రధానంగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఆయనకు ఉన్న వివాదం గురించి చర్చిస్తున్నారు.భారతీరాజా దర్శకత్వం వహించిన తొలిచిత్రం '16 వయదినిలే' (తెలుగులో 'పదహారేళ్ల వయసు') లో రజనీకాంత్ ప్రధాన పాత్ర పోషించాడు. 1977లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత దాదాపు పదేళ్లు గ్యాప్ తీసుకొని కోడి పరాకుత్తు(1988) అనే మూవీతోనూ ప్రేక్షకులను అలరించారు. ఇలా రెండు సినిమాలు తీసినప్పటికీ విరిద్దరి మధ్య దాదాపు ఐదు దశాబ్దాలుగా సైద్ధాంతిక విభేధాలు ఉన్నాయి. రజనీకాంత్‌పై పలుమార్లు భారతీరాజా బహిరంగంగా విమర్శలు చేశారు. అసలు రజనీకాంత్‌ది అసలు తమిళనాడు కాదని.. ఆయన కర్ణాటక వ్యక్తి అంటూ ఆరోపణలు చేశాడు.కావేరీ జలవివాదంతో మొదలు.. రజనీకాంత్, భారతీరాజాల మధ్య ఒప్పుడు మంచి అనుబంధం ఉండేది. అయితే 2002లో జరిగిన కావేరి జలవివాదమే వీరిద్దరిని దూరం చేసింది. అప్పట్లో కావేరి జలాల కోసం తమిళ నటీనటులంతా కర్ణాటకకు వ్యతిరేకంగా దీక్ష చేశారు. ఈ నిరసనలకు భారతీరాజా న్యాయకత్వం వహించారు. అయితే శాంతియుతంగా చేపట్టిన నిరసనలు కాస్త ఘర్షణకు దారి తీసింది. కొంతమంది పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిని రజనీకాంత్ బహిరంగంగా ఖండించాడు. తమిళనటులు చేపట్టిన దీక్షకు కూడా మద్దతు ప్రకటించలేదు. అదే భారతీరాజా కోపానికి కారణం అయింది. కావేరీ ఉద్యమ కమిటీ కన్వినర్‌గా ఉన్న భారతీరాజా.. తమిళ ప్రజలకు రజనీకాంత్ ద్రోహం చేస్తున్నాడని బహిరంగంగా ఆరోపించాడు. ఆయనను సూపర్ స్టార్‌గా చేసిన తమిళప్రజలకు వెన్నుపోటు పొడిచాడంటూ తీవ్ర విమర్శలు చేశాడు. ఒకానొక దశలో అసలు రజనీకాంత్ తమిళవాడు కాదనీ, కర్ణాటకకు చెందిన వ్యక్తి అని ఆరోపించాడు.రజనీ రాజకీయ ఎంట్రీపై కూడా.. ఇక రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్తలు వచ్చినప్పుడు కూడా భారతీరాజా ఆయనపై విమర్శలు చేశాడు. తమిళనాడు రాజకీయాల్లో ఎవరైనా పాల్గొనవచ్చని, కానీ రాష్ట్ర నాయకత్వం మాత్రం తమిళనాడుకు చెందిన వారి చేతుల్లోనే ఉండాలని ఆయన వాదించారు. కొన్ని సందర్భాల్లో సూపర్‌స్టార్ పేరును నేరుగా ప్రస్తావించకుండా, రజనీకాంత్ రాజకీయ ప్రవేశం కోసం పెరుగుతున్న డిమాండ్‌ను భారతిరాజా తీవ్రంగా ఖండించాడు. రాజకీయాల్లోకి రావాలని బయటివారిని ప్రజలు 'యాచించకూడదు' అని సూచించారు. అలాగే 2018లో జరిగిన ఐపీఎల్ నిరసన వివాద సమయంలోనూ రజనీకాంత్‌ని ‘కర్ణాటక కాషాయ రాయబారి’అని విమర్శించాడు. చివరిదశలో ఇలా.. భారతీరాజా ఎన్ని సార్లు విమర్శలు చేసినా రజనీకాంత్ మాత్రం ఆయనను ఎప్పుడు ఒక్క మాట అనలేదు. ఒకే ఒక్కసారి మాత్రం ఓ ఈవెంట్లో.. భారతీరాజాని నేను గొప్ప దర్శకుడు అని ఒప్పుకుంటాను, పొగుడుతాను కానీ ఆయన మాత్రం నన్ను నటుడిగా గుర్తించరు అని కౌంటర్ వేశారు రజనీకాంత్. భారతీరాజా కూడా తన మాటలతో కొన్ని సందర్భాల్లో రజనీకాంత్‌ని ఇబ్బంది పెట్టానని ఒప్పుకున్నాడు. అయితే తాను ఎన్ని మాటలు అన్నా..ఆయన ఒక్కసారి కూడా తిరిగి అనలేదని..అది అతని గొప్పదనం అని పొగిడాడు. ‘నేను అతడిని చాలా బాధపెట్టాను. కానీ అతను అదంతా మర్చిపోయి నాపై ఆప్యాయత చూపించాడు. అతనికి ప్రతీకార మనస్తత్వం లేదు. అతను గొప్ప వ్యక్తి’ అని ఓ ఇంటర్వ్యూలో భారతీరాజా అన్నాడు. అలా తమిళనాడులో భారతీరాజా – రజినీకాంత్ వివాదం చాలా ఏళ్ళు నడిచింది. చివరి దశలో మాత్రం భారతీరాజాని రజని పలుమార్లు కలుసుకొని ఒకర్నొకరు అభినందించుకున్నారు. -
వరుస కష్టాలు.. నాకు ఎందుకింత క్షోభ?: శ్రీజ కొణిదెల
మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల తన కష్టాలపై తొలిసారి పెదవి విప్పింది. చాలాకాలంపాటు తను అనుభవించిన బాధను బయటకు చెప్పుకుంది. ఎట్టకేలకు ఆ బాధ నుంచి బయటకు వచ్చేశానంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. "నాకే ఎందుకిలా జరుగుతోంది? ఎందుకింత బాధ అనుభవిస్తున్నాను? ఒకదాని వెంట మరొకటి వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయేంటి? నేనేం పాపం చేశానని ఇంత క్షోభ అనుభవిస్తున్నాను? అని చాలారోజులు నాలో నేనే మథనపడ్డాను. ఆలోచనల్లో క్లారిటీనేను బాధితురాలిని అని బాధపడుతూ కూర్చున్న నేను నెమ్మదిగా ఆ భావన నుంచి బయటకు వచ్చాను. మన జీవితమేంటి.. ఇలా ఉంది! అని బాధపడటానికి బదులుగా దాన్ని మార్చుకునేందుకు ఏం చేయగలం? అని తెలుసుకోవడమే అసలైన మార్పు అని తెలుసుకున్నాను. 'సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్' వల్ల నాలో ఆ మార్పు మొదలైంది. నా ఆలోచనల్లో క్లారిటీ వచ్చింది. జీవితం ప్రశాంతంగా మారింది. నేనేంటో తెలుసుకున్నాను.తప్పు తెలుసుకున్నా..ఒకప్పుడు నా లైఫ్‌లో జరిగిన తప్పులే నా గుర్తింపును నిర్ధారించాయనుకున్నాను. కానీ, అది తప్పని తెలుసుకున్నాను. బాధ నాలో ఒక భాగమే కానీ, అదే జీవితం కాదని తెలిసొచ్చింది. మనిషిలో ఇంకా ఎన్నో లేయర్స్ ఉంటాయి. వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉంటుంటే చాలా బాగుంది" అని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు గుండె లోతుల్లో బాధను అనుభవించిన తాను ఇప్పుడు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నానంది. ఈ పోస్ట్‌కు నిహారిక కొణిదెల స్పందిస్తూ.. "మై సూపర్ ఉమెన్" అని కామెంట్ పెట్టింది.పెళ్లిశ్రీజ కొణిదెల 2007వ సంవత్సరంలో శిరీష్ భరద్వాజ్‌ను పెళ్లి చేసుకుంది. ఏడాది తిరిగేలోపు వీరికి కూతురు నివృతి జన్మించింది. కానీ కొంతకాలానికే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 2011లో భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టి పుట్టింటికి తిరిగొచ్చేసింది. 2014లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. 2016లో నటుడు కల్యాణ్ దేవ్‌ను రెండో పెళ్లి చేసుకుంది శ్రీజ. వీరికి 2018లో కూతురు నవిష్క జన్మించింది. కానీ ఈ దాంపత్య జీవితం కూడా ఎంతోకాలం సాగలేదు. 2022లో వీరు విడిపోయారు. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) చదవండి: R సెంటిమెంట్.. భారతీరాజా గురించి ఈ విషయాలు తెలుసా? -
తీరని కలగానే మిగిలిపోయింది: సెలబ్రిటీల భావోద్వేగం
చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు భారతీరాజా (84) ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. గత కొన్నినెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం (జూన్ 10న) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి పలువురు తారలు భారతీరాజా పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.వెలకట్టలేనిదిభారతీయ సినిమా ఒక గొప్ప దర్శకుడిని కోల్పోయింది. పల్లెటూరి మట్టి వాసనను, మానవ సంబంధాల సౌందర్యాన్ని, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను భారతీరాజా తెరపై అందమైన కవిత్వంగా మలిచారు. ఆయన చిత్రాలు లక్షలాది హృదయాలను తాకాయి. ఎంతోమంది దర్శకనిర్మాతలకు స్ఫూర్తినిచ్చాయి.పలు జాతీయ అవార్డులు అందుకున్న పద్మశ్రీ గ్రహీత భారతీరాజాగారు ఇండియన్ సినిమాకు అందించిన సేవలు వెలకట్టలేనిది. ఆయన దర్శకత్వంలో ఆరాధన మూవీలో పులిరాజుగా పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం, అభిరుచి నాపై ఎంతో ప్రభావం చూపాయి. ఆయన మనతో లేకపోయినా ఆయన తీసిన సినిమాలు మన మధ్య ఎప్పటికీ నిలిచి ఉంటాయి. 'ఇయక్కునార్ ఇమయం' (దర్శక దిగ్గజం) భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి, స్నేహితులకు ఇదే నా ప్రగాఢ సానుభూతి.- చిరంజీవి Indian cinema has lost one of its greatest storytellers, #Bharathiraja garu.He transformed the fragrance of village soil, the beauty of human relationships, the innocence of love, and the emotions of ordinary people into timeless cinematic poetry. His films touched millions of… pic.twitter.com/MdoUfpztji— Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2026 కలగానే మిగిలిపోయింది: ఖుష్బూమనందరికీ ఎంతో ఇష్టమైన లెజెండరీ దర్శకుడు భారతీరాజా ఇక లేరనే విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన మరణం తమిళ చిత్రపరిశ్రమకు తీరని లోటు. ఆయన సినిమాలు ఒక బెంచ్‌మార్క్‌ను సెట్ చేశాయి. భవిష్యత్తులో రాబోయే చిత్రాలకు దిశానిర్దేశంగా పని చేస్తాయి. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరి కోసం ఆయన గొప్ప వారసత్వాన్ని వదిలి వెళ్లారు. నన్ను రెండు జడలతో చూపించాలని, కలిసి సినిమా చేద్దామని ఎప్పుడూ అంటుండేవారు. ఇప్పుడది తీరని కలగానే మిగిలిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.- ఖుష్బూ Devastated to know that our most beloved, loved and respected Director, the legendary #BharathiRaaja avl is no longer with us. His demise is a gloomy cloud in tamil cinema. His films have been bench marks and shall continue to be the actual school of film making. He leaves behind… pic.twitter.com/p5a6yhn95y— KhushbuSundar (@khushsundar) June 10, 2026ఆయన శైలి ప్రత్యేకం : పవన్ కల్యాణ్ప్రముఖ దర్శకులు భారతీరాజా గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా గారు తనదైన ముద్ర వేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను, టీనేజర్స్ కి ఉండే ఆకర్షణలు లాంటివి చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ ఇప్పటికీ చూడదగ్గ విధంగా ఉంటుంది. ఆ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అన్నయ్య చిరంజీవితో ‘ఆరాధన’ చిత్రం రూపొందించారు. అందులో ‘అరె ఏమైంది...’ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. సున్నితమైన ప్రేమ, సెంటిమెంట్ కథలే కాకుండా ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’ లాంటి థ్రిల్లర్స్ తోను ప్రేక్షకులను మెప్పించారు. భారతీరాజా గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.- పవన్ కల్యాణ్నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిఒక శకం ముగిసింది: విశాల్'భారతీరాజా గారితో కలిసి పనిచేసిన ప్రతి క్షణాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆయన మనల్ని విడిచి వెళ్లారన్న వార్త వినడం ఎంతో దిగ్భ్రాంతికరం. తమిళ సినిమా ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చిన దార్శనికుడు ఆయన. మన గ్రామాలు, ప్రజలు, భావోద్వేగాలలోని అంతరార్థాన్ని వెండితెరపై మరెవరూ చూపించలేనంత అద్భుతంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా, దశాబ్దాల తరబడి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసేలాంటి పాత్రలను అందించారు. ఆయన సినిమాలు ఎన్నో తరాల దర్శకులకు, నటులకు, సినీ ప్రేమికులకు స్ఫూర్తినిచ్చాయి. ఆయన సృష్టించిన ప్రతి ఫ్రేమ్ ద్వారా ఆయన వారసత్వం సజీవంగా నిలిచి ఉంటుంది.సృజనాత్మక దర్శకులుగా తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకునే వారికి ఆయన కృషి ఒక నిదర్శనంగా, చలనచిత్ర నిర్మాణంలో ఒక 'బైబిల్' (మార్గదర్శి)గా నిలుస్తుంది. ఆయన మరణంతో ఒక శకం ముగిసింది. తమిళ సినిమా గొప్ప కథకులలో ఒకరిని కోల్పోయింది. మీతో కలిసి పనిచేసిన ప్రతి క్షణాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ముఖ్యంగా #PandiyaNaadu చిత్రంలో తండ్రీకొడుకులుగా కలిసి పనిచేసినప్పుడు మీతో గడిపిన సమయం నాకు ఎన్నో పాఠాలను నేర్పింది.ఈ గొప్ప చిత్ర పరిశ్రమలో నేను కూడా ఒక భాగమేనన్న భావనను ఆ క్షణాల్లో మీరు నాకు కలిగించారు. ఎప్పుడూ ఉత్సాహభరితమైన చిరునవ్వుతో, యువకుడిలాంటి ఉత్సాహంతో మీరు వ్యవహరించిన తీరు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది' అని విశాల్ ట్వీట్ చేశారు. అలాగే దర్శకుడిగా తన మొదటి సినిమా టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. Shocking and sad to hear the news about our legendary filmmaker, Iyakunarimayam Bharathiraja sir passing away and leaving us all this morning. A visionary who changed the landscape of Tamil cinema forever, he brought the soul of our villages, our people and our emotions to the…— Vishal (@VishalKOfficial) June 10, 2026 గొప్ప పాఠాలుహిమాలయాల అంత ఎత్తుకు ఎదిగిన దర్శకుడా.. మీకు ముగింపు లేదు.. ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదిగారు. మీ పనితనం, సినిమాలే మాకు విలువైన పాఠాలు.- కాయల్ దేవరాజ్இயக்குனர் இமயமே! நீ சரியவில்லை;இன்னும் நீ உயரமான இடத்தை நோக்கி சஞ்சரிக்க சென்றுள்ளாய்! என்றும் உன் படைப்புகள் எங்களுக்கு பாடங்கள்!#LegendaryDirector #Bharathiraaja #RIPBharathiraaja Sir pic.twitter.com/ZoP6ozrmAf— Actor Kayal Devaraj (@kayaldevaraj) June 10, 2026 A director who found poetry in the soil, truth in silence, and soul in every frame. Sharing screen space with Bharathiraja Sir in Thudarum was an honour I will cherish forever.Rest in peace, Sir. Your legacy will continue to inspire generations, and your presence will be deeply… pic.twitter.com/9yP88mLtCO— Mohanlal (@Mohanlal) June 10, 2026 Our @ikamalhaasan sir pays his last respects to ace director and his friend Mr #bharathiraja after he passes away.#ripbharathiraja #kamalhaasan pic.twitter.com/WZtuTMcOku— Kamal Haasan’s Diehard Kamalians (@DiehardKamalian) June 10, 2026இயக்குநர் பாரதிராஜாவுக்கு நடிகர் ரஜினிகாந்த் அஞ்சலி | RIPBharathiraja | Rajinikanth |#RIPBharathiraja | #Rajinikanth | #IyakkunarImayam | #IyakkunarImayamBharathiraja pic.twitter.com/3NnjefQ9OL— Ilaya Bharatham (@IBharatham) June 10, 2026 చదవండి: దర్శకుడు భారతీరాజా కన్నుమూత -
పనివాళ్లు మనుషులు కారా?: నటి ఆగ్రహం
పనివాళ్లు మనుషులు కారా? వాళ్లకు హెయిర్ కట్ చేస్తే సొమ్మేమైనా అరిగిపోతుందా? అని మండిపడుతోంది బాలీవుడ్ నటి సంధ్య మృదుల్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేసింది. నటి తల్లి తన ఇంట్లో పని చేసే ఓ యువతిని సెలూన్‌కు తీసుకెళ్లి జుట్టు కట్ చేయించాలనుకుంది. కానీ అందుకు ఒకటీరెండు సెలూన్లు అసలు అంగీకరించనేలేదట! డబ్బులు ఎక్కువిస్తామన్నా సరే ససేమీరా కుదరదని తేల్చి చెప్పేశాయట!బెదిరించినా, బతిమాలినా..ఈ విషయం విని సంధ్యకు ఒళ్లు మండిపోయింది. ఆ ఆక్రోశాన్నే తను సామాజిక మాధ్యమాల్లో వెళ్లగక్కింది. 'అమ్మ.. తన ఇంట్లో పనిమనిషికి మంచి హెయిర్ కట్ చేయించాలనుకుంది. దగ్గర్లో ఒక సెలూన్‌కు తీసుకెళ్లింది. కానీ వాళ్లు చేయమన్నారు. మరో సెలూన్‌కు వెళ్లగా వాళ్ల దగ్గరా అదే సమాధానం. ఎందుకు చేయరని ప్రశ్నించింది. కావాలంటే ఎక్కువ డబ్బులిస్తానని అభ్యర్థించింది. అయినప్పటికీ వాళ్లు కుదరదని వెనక్కు పంపించేశారు. ఇంకా ఏ కాలంలో ఉన్నాం?ఇదంతా చూసి ఆ పనిమనిషి మనసు నొచ్చుకుంది. చివరకు ఒక సెలూన్ వాళ్లు ఒప్పుకోవడంతో ఆమెకు హెయిర్ కట్ చేయించి తనను అమ్మ లంచ్‌కు తీసుకెళ్లింది. అసలు మనం ఇంకా ఏ కాలంలో ఉన్నాం? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? పనివాళ్లు సెలూన్స్‌కు రాకూడదా? వాళ్లేమైనా అంటరానివాళ్లా? వాళ్లను లోపలకు రానివ్వకపోవడానికి వీరికేం హక్కుంది? నిజంగా ఇది చాలా బాధ కలిగిస్తోంది. ఇక్కడ తప్పు కేవలం సెలూన్లది, అందులో పనిచేసేవారిదే కాదు.. మనది కూడా! ఇకనైనా మారండిమనలో చాలామంది పనివాళ్లను అన్నిచోట్లా అడుగుపెట్టనివ్వరు, కనీసం లిఫ్ట్ కూడా ఎక్కనివ్వరు. ఇలాంటి నీచమైన కండీషన్స్ పెట్టే మనుషులు మారాల్సిన సమయం ఆసన్నమైందని నా అభిప్రాయం' అని ఆవేదన వ్యక్తం చేసింది. 'పనివాళ్లు మన ఇంటిని, మన కుటుంబాలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. అలాంటివారికి మనమిచ్చే గౌరవం ఇదా? హెయిర్ కట్ చేయించుకోవాలనుకున్న 26 ఏళ్ల అమ్మాయిని ఇంత బాధపెట్టాలా? అని క్యాప్షన్ ఇచ్చింది. సంధ్య చివరగా తమిళంలో 'పరాశక్తి' సినిమాలో ఇందిరా గాంధీగా నటించింది. View this post on Instagram A post shared by Sandhya Mridul (@sandymridul) చదవండి: విషాదం.. దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత -
సినీ దిగ్గజం భారతీరాజా కన్నుమూత
సినీ దిగ్గజం భారతీరాజా (84) ఇక లేరు. అనారోగ్యంతో బుధవారం వేకువజామున ఆయన కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు బంధువులు తెలిపారు. భారతీరాజా మృతితో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ, ఇతర రంగాల ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఒకప్పుడు భారతీయ సినిమాల్లో పల్లె అంటే స్టూడియోలో వేసిన సెట్లు.. పచ్చని పొలాలు అంటే పెయింట్ చేసిన బ్యాక్‌డ్రాప్‌లు. కానీ ఆ నిర్వచనాన్నే మార్చిన దర్శకుడు భారతీరాజా. కెమెరాను నేరుగా గ్రామాల్లోకి తీసుకెళ్లి.. పల్లె మనుషుల ప్రేమ, బాధ, ఆవేదన, తిరుగుబాటును వెండితెరపై ఆవిష్కరించిన సినీ సృష్టికర్త ఆయన. మట్టి వాసనను, ప్రకృతి అందాలను, సాధారణ మనుషుల జీవితాలను సినిమాకు ప్రధాన పాత్రలుగా మార్చిన దర్శకుడిగా భారతీరాజా భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తమిళ సినిమాను కొత్త దారిలో నడిపించిన ఆయన ప్రభావం తెలుగు సహా దక్షిణ భారత సినిమా మొత్తంపైనా కనిపించింది.సినిమాల్లోకి రాకముందు భారతీరాజా హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. అయితే కళలపై ఉన్న మక్కువ ఆయనను సినీ ప్రపంచంలోకి తీసుకొచ్చింది. ఎన్నో కష్టాలు, నిరీక్షణల తర్వాత దర్శకుడిగా మారిన ఆయన, గ్రామీణ కథలను చూపించే విధానాన్నే మార్చేశారు. అప్పటి వరకు సెట్లలో నిర్మించిన కృత్రిమ గ్రామాలే ఎక్కువగా కనిపించేవి. కానీ భారతీరాజా మాత్రం కెమెరాను నిజమైన పల్లెల్లోకి తీసుకెళ్లారు. మట్టి వాసన, పల్లె మనుషుల భాష, వారి ఆనందాలు, బాధలు అన్నింటినీ సహజత్వంతో చూపించారు. అందుకే ఆయనను తమిళ సినీ ప్రపంచం ప్రేమగా "దర్శకుల హిమాలయం"గా అభివర్ణించింది.భారతీరాజా చిత్రాల్లో ప్రేమకథలు ఉంటాయి.. కానీ అవి కేవలం ప్రేమ చుట్టూ తిరిగేవి కావు. కుల వివక్ష, సామాజిక అసమానతలు, మహిళల సమస్యలు, గ్రామీణ జీవన విధానం, కుటుంబ బంధాలు వంటి అంశాలను కూడా ఆయన బలంగా ప్రస్తావించారు. ప్రేక్షకుడు సినిమా చూస్తున్నాడనే భావన కంటే, ఒక నిజ జీవితాన్ని చూస్తున్నాననే అనుభూతిని కలిగించడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉండేది.దర్శకుడిగా మాత్రమే కాదు.. నటుడిగానూ భారతీరాజా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇటీవలి కాలంలో ఆరోగ్య సమస్యలతో బాధపడిన భారతీరాజా, తన కుమారుడు మనోజ్ భారతీరాజా మరణంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అయినప్పటికీ సినిమాపై ప్రేమను మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. కెరీర్ చివరి దశలో పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. తండ్రి, తాత, గ్రామ పెద్ద.. ఇలాంటి పాత్రల్లో ఆయన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడిగా ఎంత సహజత్వాన్ని చూపించారో, నటుడిగానూ అంతే సహజమైన అభినయంతో మెప్పించారు.భారతీరాజా మరో గొప్ప సేవ ఏమిటంటే.. కొత్త ప్రతిభను వెలికితీయడం. ఆయన చిత్రాల ద్వారా అనేక మంది నటులు, సాంకేతిక నిపుణులు సినీ రంగానికి పరిచయమయ్యారు. తర్వాత వారు భారతీయ సినీ పరిశ్రమలో అగ్రస్థానాలకు చేరుకున్నారు. ఒక దర్శకుడిగా మాత్రమే కాకుండా, ఒక గురువుగా కూడా ఆయన వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుంది.కెరీర్భారతీరాజా.. 1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో జన్మించారు. కన్నడ దర్శకుడు పుట్టన్న కనగళ్ దగ్గర అసిస్టెంట్‌గా చేరి తన కెరీర్ ఆరంభించారు. పలువురు దర్శకుల దగ్గర పని చేసిన ఈయన 1977లో '16 వయిదినిలే' అనే తమిళ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. కిళక్కేపోగుమ్ రైలు, సిగప్పురోజాక్కళ్, టిక్ టిక్ టిక్, ముదల్ మరియాదై, కరుత్తమ్మ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. తమిళ సినిమాల్లో గ్రామీణ జీవన విధానాన్ని సహజత్వంతో చూపించడం మూలంగా ఆయనను “దర్శక ఇమయం”గా అభిమానులు పిలుస్తారు.తెలుగులోనూ..తెలుగులో సీతాకోక చిలుక, కొత్త జీవితాలు, ఆరాధన, జమదగ్ని చిత్రాలు తెరకెక్కించారు. సీతాకోక చిలుక మూవీకిగానూ నంది అవార్డు అందుకున్నారు. మంగమ్మగారి మనవడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించారు. తన సినిమాల ద్వారా రాధ, రాధికా శరత్‌కుమార్, రేవతి, కార్తీక్ సహా పలువురు నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. భారతీరాజా దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ అనేక సినిమాలు చేశారు.ఆరు జాతీయ అవార్డులుఆరు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులతో పాటు పలు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా తమిళ సినీ పరిశ్రమలో తన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను అలరించారు. భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. భారతీయ సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారతీరాజాను 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. -
'సూపర్ గర్ల్' రిలీజ్ ఎప్పుడంటే?
డీసీ స్టూడియోస్ నిర్మిస్తున్న హాలీవుడ్ మూవీ సూపర్ గర్ల్ జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మిల్లీ ఆల్కాక్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కొత్త డీసీ సినిమాటిక్ యూనివర్స్‌లో కీలక చిత్రంగా రూపొందింది. ఈ మూవీ వివరాలను నిర్మాత జేమ్స్ గన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ.. సూపర్ మ్యాన్‌తో పోలిస్తే సూపర్ గర్ల్ జీవితం ఎంతో కఠినమైనదని తెలిపారు. ప్రేమతో కూడిన కుటుంబంలో పెరిగిన సూపర్ మ్యాన్‌కు విశ్వంలోని మంచితనంపై నమ్మకం కలిగుండటం సులభమైంది. కానీ తన గ్రహం నాశనమవడం, తల్లిదండ్రుల మరణాన్ని కళ్లారా చూసిన సూపర్ గర్ల్‌కు అలాంటి నమ్మకం ఏర్పడటం అంత సులభం కాదన్నారు. ముఖ్యంగా సినిమాలో నటి కారా జోర్ ఎల్ వ్యక్తిగత వేదన, మానసిక సంఘర్షణలు, ప్రతీకారం, న్యాయం మధ్య జరిగే పోరాటం ప్రధానాంశాలుగా ఉంటాయన్నారు. తన పెంపుడు కుక్క క్రిప్టోను కాపాడేందుకు సూపర్ గర్ల్ చేసే అంతరిక్ష ప్రయాణం కథలో కీలకంగా మారుతుందన్నారు. ఈ చిత్రాన్ని వార్నర్స్ బ్రదర్స్ సంస్థ 3డీ ఫార్మాట్లలో ఇంగ్లీష్, తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోందని చెప్పారు. -
‘డబ్బు లేకుండా సినిమా తీశాం!’
“మొదటి నుంచి నాకు సినిమానే వ్యసనం. సాహిత్య సృజనతో పాటు సినిమా మీదే సమయమంతా గడిపేశాను. జేబులో రూపాయి డబ్బు లేకున్నా, స్నేహసంపదే అండగా సినిమాలు తీయగలిగాను” అని ప్రముఖ రచయిత, ‘భద్రం కొడుకో’ సహా పలు అవార్డు చిత్రాలను అందించిన సినీ దర్శకుడు అక్కినేని కుటుంబరావు అన్నారు. ‘భద్రం కొడుకో’ (1991) చిత్రం నుంచి ఇప్పటి దాకా ఒక హిందీ సినిమాతో సహా 8 సినిమాలు, కొన్ని టెలీ ఫిల్ములు తీయగలగడానికి అదే కారణమంటూ తన మనోభావాలను ఆత్మీయంగా పంచుకున్నారు. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు గెల్చుకున్న ‘భద్రం కొడుకో’ చిత్రం లాంటి బాలల చిత్రాల రూపకల్పనకు ఆ రోజుల్లో తాము పడ్డ అవస్థలనూ, అండగా నిలిచిన మిత్రుల స్నేహసౌశీల్యాన్నీ కుటుంబరావు మరోసారి నెమరువేసుకున్నారు.“ఈ తరం పిల్లలకు ఏ అనుబంధాలు, ఆత్మీయతలు లేకుండా పెంచుతున్నాం. జీవితంలోని పోరాటాలు, కష్టసుఖాలు, సమాజంలోని మంచీ చెడూ ఏదీ వాళ్ళకు తెలీదు. అది ఇవాళ్టి సమాజంలో, పెంపకంలోని తప్పు. నిజానికి, ఇవాళ పెద్దవాళ్ళ మనసులు పెళుసు బారిపోయాయి. తమకు నచ్చితేనో, ఉపయోగం ఉంటేనో తప్ప మనం ఏం చెప్పినా, చూపినా వినరు. కానీ, మనం సరిగ్గా చెబితే ఏది చెప్పినా పిల్లలు వింటారు. అది గుర్తించాలి” అని ‘భద్రం కొడుకో’, ‘పాతనగరంలో పసివాడు’ (1999), ‘గులాబీలు’ (2005) సహా తెలుగులో అనేక బాలల చిత్రాలను రూపొందించిన అక్కినేని కుటుంబరావు అభిప్రాయపడ్డారు.నేటికీ ఉరకలేసే పసిమనసు ఉత్సాహంఅక్కినేని కుటుంబరావుకు ఎనిమిది పదులు దాటిన సందర్భంలో ఆయనకు సంబంధించిన మూడు కొత్త పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా ఈ అనుభవాలు, అభిప్రాయాలు, జ్ఞాపకాల తలపోతకు హైదరాబాద్ రవీంద్రభారతి సమావేశ మందిరం వేదిక అయింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు ఈ సభకు పెద్దయెత్తున హాజరయ్యారు. ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ – ఛాన్సలర్ ఆచార్య ఎన్. గోపి సభకు ముఖ్య అతిథిగా వచ్చి, పుస్తకాలను ఆవిష్కరించారు. ‘అక్కినేని కుటుంబరావు సినిమా చిత్రాలు’, ‘అక్కినేని కుటుంబరావు కథలు’, అలాగే ఆయన సాహిత్యంపై ప్రముఖులు రాసిన సమీక్షలు, విశ్లేషణలు, కొన్ని ఇంటర్వ్యూల సమాహారంగా ‘పదుగురాడిన మాటలు’ పుస్తకాలు మూడింటి ఆవిష్కరణ జరిగింది. ఆచార్య గోపి తన ప్రసంగంలో కుటుంబరావుతో చిరకాలంగా ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని సభికులతో పంచుకున్నారు. సుదీర్ఘకాల స్నేహితుడైన అక్కినేని కుటుంబరావు ఆనాటి నుంచి ఈనాటి దాకా అదే ఉత్సాహంతో రచనలు చేస్తూ, సినిమాలు తీస్తూనే ఉండడాన్ని అభినందించారు.విశిష్ట అతిథిగా సభకు హాజరైన తెలంగాణ భాషా – సాంస్కృతిక శాఖ సంచాలకులు, కవి, రచయిత ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ, కథ, నవలా రచయితగా, సినీ దర్శకుడిగా విశేష సృజన చేసిన కుటుంబరావును అభినందించారు. చిన్న చిన్న కథలుగా రాసినా, వాటిని ఆసక్తికరంగా తీర్చిదిద్దే ఆయన ప్రత్యేకతను ప్రస్తావించారు. రెండు, మూడు కథలను మచ్చుకు ఉదాహరణగా పేర్కొన్నారు. అక్కినేని కుటుంబరావు వామపక్ష భావజాలం ఆయన రచన పేర్లలోనూ కనపడుతుందన్నారు.‘నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్’ సంపాదకులు, కవి – రచయిత కె. ఆనందాచారి, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత – సినీ విమర్శకులు వారాల ఆనంద్, సాహిత్య – సామాజిక విశ్లేషకులు డాక్టర్ జతిన్ కుమార్‌లు సభలో వక్తలుగా పాల్గొన్నారు. సినీ రంగంలో కుటుంబరావు కృషినీ, ఆయన తీసిన సినిమా ప్రత్యేకతనూ వారాల ఆనంద్ వివరించారు. ఇవాళ్టికీ పసిపిల్లల లాంటి స్వచ్ఛమైన మనసుతో ఉండడం వల్లే కుటుంబరావు ఎనిమిది పదులు దాటినట్టు కనిపించరనీ, అదే ఉత్సాహంతో సృజనాత్మక కృషి సాగించగలుగుతున్నారనీ పేర్కొన్నారు.సమకాలంలో సీరియస్‌గా చదవాల్సిన అక్కినేని సాహిత్యంవిశేష క్షేత్ర పర్యటన, వ్యక్తిగత అనుభవాలను కలగలిపి ఎంతో శ్రమించి కుటుంబరావు సృజించిన సాహిత్యం తాలూకు విశిష్టతను ఆనందాచారి తన ప్రసంగంలో ప్రస్తావించారు. “రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులపై నిర్బంధాలు కొనసాగుతున్న విషాద, వర్తమాన సందర్భం ఇది. ఈ పరిస్థితుల రీత్యా కుటుంబరావు రాసిన నవలలు ఇప్పుడు మరింత విలువైనవి. మరోసారి ప్రత్యేకంగా అధ్యయనం చేయదగినవి. ‘పదుగురాడు మాటలు’ పుస్తకంలోని 28 వ్యాసాలూ ప్రముఖుల మాటల్లో ఆయన రచనల ప్రత్యేకతను విశ్లేషించాయి” అని కుటుంబరావు రచనల సామాజిక భూమికను వివరించారు.జతిన్ కుమార్ ప్రసంగిస్తూ, అక్కినేని కుటుంబరావు ప్రసిద్ధ కథ ‘పసివాడితనం’ మొదలు తాజా కథల సంపుటిలోని 16 కథలూ పాఠకులను ఎలా ఆలోచనల్లోకి నెడతాయో వివరించారు. “పాఠకులను నిద్రపోనివ్వని కథలివి. సామాన్యుల వైపు బలంగా నిలబడ్డ కుటుంబరావు వామపక్ష భావజాలం ఈ కథల్లో కనిపిస్తుంది. ఈ కథల్లో అనేకం కుటుంబరావు స్వయంగా చూసినవీ, అనుభవించినవీ. ‘సొంత ఇల్లు’, ‘బండి’ లాంటి అనేక కథలు నిడివి రీత్యా చూడడానికి చిన్నవే అయినా, అవి కలిగించే అనుభూతులు పెద్దవి. అందుకే, ఒక రకంగా ఇవి కథలు కాదు... అనుభూతులు అనాలి. వీటిని చదువుతుంటే, ఒకసారి టీచర్‌గా, మరోసారి విదూషకుడిగా, ఇంకోసారి గొప్ప రచయితగా కుటుంబరావు కనిపిస్తారు. ప్రతి కథ చాలా సీరియస్‌గా చదవాల్సిన కథలు” అంటూ తనదైన శైలిలో సరళంగా, సభికులను ఆకట్టుకొనేలా జతిన్ కుమార్ విశ్లేషించారు.అప్పట్లో... 30 పైసల నేలటికెట్లో...అక్కినేని కుటుంబరావు తన స్పందన ప్రసంగంలో అందరికీ కృతజ్ఞతలు చెబుతూ, తాను హైదరాబాద్‌కు వచ్చిన తొలినాళ్ళ జీవిత గమనం తాలూకు ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకువెళ్ళారు. “అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలనే లక్ష్యంతో కేవలం ఎస్.ఎస్.ఎల్.సి. చదివి, జీవనం కోసం 1963లో హైదరాబాద్‌కు వచ్చాను. ఈ 63 ఏళ్ళ ప్రయాణంలో ఎందరో స్నేహితులు. విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఎన్. గోపి, ఇతర మిత్రులు 1965 నుంచి నాకు తెలుసు. అప్పట్లో ప్రతి ఆదివారం కలిసేవాళ్ళం. వాళ్ళ మాటలు, స్నేహమే నాకు ఓ విశ్వవిద్యాలయంగా మారింది. డబ్బు లేక ఉద్యోగం బాటపట్టాను అనుకుంటున్న నేను, జేబులో డబ్బులో లేకపోయినా చదువు బాటలో పయనిస్తున్న వాళ్ళను చూసి, కలసి ఎంతో నేర్చుకున్నా.అప్పట్లో నాకు రోజుకు 2 రూపాయలు జీతం. నెలకు 60 రూపాయలు. అందులో 30 రూపాయలు ఊళ్ళోని అమ్మానాన్నలకు పంపితే, 20 రూపాయల్లో ఇక్కడ ఇంటి అద్దె, తిండి అంతా గడిచేది. మిగిలిన పది రూపాయలతో స్నేహితులందరితో కలసి, 30 పైసల నేల టికెట్‌తో ఎన్ని సినిమాలకు వెళ్ళేవాళ్ళమో లెక్కలేదు. ఇటీవల నా తాజా నవల రాస్తున్నప్పుడు గోపి సహా ఆ మిత్రులు, ఆ సంగతులు అన్నీ మరోసారి ఆలోచనల్లో నుంచి అక్షరాల్లోకి వచ్చాయి.నాకు చలం రచనలంటే పిచ్చి. ఆరేడు తరగతుల్లోనే తన అభిమాన రచయిత సినారెకు ఉత్తరాలు రాస్తే, ఆయన జవాబులు ఇచ్చారని గోపి ఓ సారి చెప్పారు. అది ప్రేరణగా తీసుకొని, నా అభిమాన రచయిత చలానికి ఉత్తరం రాస్తే మూడు రోజుల్లో జవాబు వచ్చింది. అక్కడ నుంచి రచయిత గుడిపాటి వెంకట చలానికీ, నాకూ మధ్య కొన్నేళ్ళపాటు ఎన్నో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. వాటిలో కొన్ని అప్పట్లో ఓ పత్రిక ప్రచురించింది” అని కుటుంబరావు చెప్పుకొచ్చారు.ఒక సినిమా... 39 మంది నిర్మాతలు... ఓ నేషనల్ అవార్డ్!“చిన్నప్పటి నుంచి నా ఆదర్శాలు రెండే. ఒకటి - కుటుంబం మొత్తాన్నీ పైకి తీసుకురావాలి, రెండు - స్నేహితులందరితో ఎప్పటికీ స్నేహంగా ఉండాలి. మొదటి విషయం మాటెలా ఉన్నా, రెండో ఆదర్శాన్ని మాత్రం ఇప్పటికీ పాటిస్తున్నా. అందుకే, నాకు పరిచయమైన వాళ్ళెవరూ నాకు స్నేహితులు కాకుండా పోరు. నా అసలైన సంపద స్నేహసంపదే! గోపి, ముత్యంరెడ్డి, ఇలా ఎంతో మంది స్నేహితులే నన్ను ఎంతో ఎడ్యుకేట్ చేశారు. వాళ్ళ వల్లే నేను పురోగతిలోకి వచ్చా. నేను సినిమాలు తీయగలిగింది కూడా ఆ స్నేహితుల వల్లే!రవి, ముత్యం రెడ్డి, శ్రీనివాస్... ఇలా ఎంతోమంది నా ప్రతి సినిమా వెనకాల ఉన్నారు. ఇవాళ అంతర్జాతీయ చిత్రకారుడిగా ఎదిగిన లక్ష్మణ్ ఏలే ఆర్థిక ప్రయోజనం లేకపోయినా, అప్పటి నుంచి ఇప్పటి దాకా నా ప్రతి సినిమాకూ కళాదర్శకుడిగా పనిచేయడం కేవలం సినిమా మీద ప్రేమతోనే! స్నేహపరిమళంతోనే!! ముత్యంరెడ్డి ప్రధాన కారకుడిగా ‘భద్రం కొడుకో’ సినిమా అలా వచ్చిందే. ఆ సినిమాకు ఏకంగా 39 మంది నిర్మాతలు. డబ్బులు వెనక్కిరావు, తిరిగి ఇవ్వలేనని చెప్పినా, తలా పాతిక వేలు పెట్టుబడిగా పెట్టి ఆ సినిమా తీయించారు. ఇవాళ అలా ఇచ్చేవారు ఎవరూ ఉండరు. నిజానికి, ఆ సినిమా నిర్మించడమే తప్ప, దర్శకత్వం నేను చేయాలనుకోలేదు. కానీ, అనుకోకుండా నేనే డైరెక్షన్ కూడా చేయాల్సి వచ్చింది. ఇక అక్కడ నుంచి నా సినిమా ప్రయాణం ఇప్పటి దాకా సాగుతూ వచ్చింది” అని అవార్డు చిత్రాల అక్కినేని కుటుంబరావు తన గుండె లోతుల్లోని భావాలను పంచుకున్నారు.ప్రభుత్వం ఇవాళ్టికీ సబ్సిడీ ఇవ్వని ఆ అవార్డ్ ఫిల్మ్!“మంచి సినిమాలకు ప్రోత్సాహం అందిస్తామని ప్రభుత్వాలు చెబుతాయి కానీ, ఆచరణలో అది జరగదు” అంటూ కుటుంబరావు మంచి సినిమాల రూపకల్పనలో ఉన్న కష్టాలు, ఎదురైన అనుభవాలను సైతం సభాముఖంగా చెప్పుకొచ్చారు. “జేబులో రూపాయి లేకపోయినా, సినిమా మీద ఇష్టంతో కష్టపడి ‘భద్రం కొడుకో’ తీశాం. అయితే, అప్పట్లో సినిమాకు అవార్డులు, రివార్డుల రూపంలో కొంత డబ్బులు కూడా వచ్చాయి. అప్పులు చేసి, వడ్డీలకు తెచ్చి ఆర్థికంగా అండగా నిలబడిన మిత్రులకు వారి డబ్బు వెనక్కి ఇవ్వగలిగాం. కానీ, అన్ని సినిమాలూ అలా కావు కదా! కొన్ని సినిమాలకు మాత్రం ప్రభుత్వాలు ఇస్తామని ప్రకటించిన సబ్సిడీలు సైతం రాలేదు.ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు హైదరాబాద్‌ను శాశ్వత కేంద్రంగా చేసిన తొలిరోజులవి. ఆసారి హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తెలుగు నుంచి ఒక్క సినిమా కూడా ఎంట్రీ లేదు. ఆ సందర్భంలో ప్రభుత్వ పెద్దలు పిలిచి మరీ, పిల్లల సినిమాలు తీయాలన్నారు. అప్పుడలా ఆరుగురు మిత్రులను నిర్మాతలుగా కలుపుకొని, కష్టపడి తీసిందే – ‘పాత నగరంలో పసివాడు’ (1999). ఆ తరువాతి చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మా సినిమాయే అంతర్జాతీయ పోటీ విభాగానికి వెళ్ళిన తొలి తెలుగు సినిమా అయ్యింది. అలాగే, కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సహా పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలకు వెళ్ళింది.అయితే, ఎంతో కష్టపడి ఆ సినిమా తీసి, అంత చేస్తే... ఇవ్వాల్సిన రూ. 35 లక్షల సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనే లేదు. అదేమంటే కనీసం 11 థియేటర్లలో కమర్షియల్ రిలీజ్ చేస్తేనే ప్రభుత్వ సబ్సిడీ ఇస్తామంటూ ఆఖరికి మెలికపెట్టారు. కమర్షియల్ పాటలు, అసభ్యమైన డైలాగులతో సినిమాలు తీస్తే కానీ అది కుదరని పని. బాలల సినిమాను అలా తీయగలమా? ఫిల్మ్ క్లబ్బులకూ, ఫెస్టివల్స్కూ పరిమితమయ్యే బాలల చిత్రాలను ఆ స్థాయిలో కమర్షియల్ రిలీజ్ చేయడం సాధ్యమేనా? అయితేనేం, ఇలాంటి కష్టాల మధ్యనే అయిదారు బాలల సినిమాలు తీయగలిగాను” అంటూ అక్కినేని కుటుంబరావు తన సినిమా అనుభవాలను సభాముఖంగా పంచుకున్నారు.కుటుంబరావు జీవన సహచరి – ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా ఈ సభా కార్యక్రమ నేపథ్యం వివరించారు. సభ మొదటిలో అతిథుల స్వాగతం నుంచి చివరలో ఆత్మీయ బృందానికి పుస్తకాలు అందించడం దాకా ఓల్గా ఆత్మీయత కనపడింది. ఆమె సోదరుడు – సాహిత్య, సినీజీవి రవి మారుతి మొత్తం సభా నిర్వహణను స్వయంగా చూసుకున్నారు.కుటుంబరావు సినిమాలకు కళా దర్శకుడిగా వ్యవహరించిన ప్రఖ్యాత చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే, సినీ రంగంలోనూ కృషి చేస్తున్న రచయిత్రి చైతన్య పింగళి, ప్రముఖ కవులు ఆశారాజు, శిఖామణి, యాకూబ్, సీనియర్ జర్నలిస్టులు వేమన వసంతలక్ష్మి, సుధాకర్, రచయిత్రులు ప్రమీలా హరగోపాల్, భండారు విజయ, సమ్మెట ఉమాదేవి, సమ్మెట విజయ, శివలక్ష్మి తదితర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరవడంతో రవీంద్రభారతి సమావేశ మందిరం సాహిత్య – సినీ వాతావరణంతో కళకళలాడింది. సభ ముగిసిన తర్వాత కూడా సాహితీ ప్రియులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ, కుటుంబరావును అభినందిస్తూ, అక్కడే చాలా సమయం గడపడం కుటుంబరావు – ఓల్గా జంట సంపాదించుకున్న స్నేహసంపదకు నిండైన తార్కాణంగా నిలిచింది.-రెంటాల జయదేవ -
కల్కి 2పై ప్రభాస్ ఫోకస్.. నాగ్ అశ్విన్ ఆసక్తికర అప్డేట్
ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన రాజాసాబ్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందకపోవడంతో ప్రభాస్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రాలను సమాంతరంగా పూర్తి చేసే పనిలో ప్రభాస్ ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ కల్కి 2పై కూడా ఫోకస్ పెట్టాడు. తాజాగా సింగ్ గీతం సినిమా ప్రమోషన్లలో దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొన్నాడు. ఆ ఈవెంట్లో కల్కి 2 గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇప్పటికే కల్కి 2 చిత్రీకరణ ప్రారంభమైంది. జూలై నుంచి నిరంతరాయంగా షూటింగ్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని నాగ్ అశ్విన్ చెప్పడంతో ప్రభాస్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం అన్నీ అనుకున్నట్టు జరిగితే కల్కి 2 చిత్రం 2027 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే నాగ్ అశ్విన్ మాత్రం దీనిపై ఎలాంటి డెడ్‌లైన్ పెట్టుకోలేదని స్పష్టం చేశారు. ఇక ఫౌజీ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. స్పిరిట్ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా టీమ్ ప్రకటించారు. ఈ రెండు థియేటర్లలోకి వచ్చిన తర్వాతే కల్కి 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాతే సలార్ 2 రానుంది. -
విజయ్ చివరి సినిమా.. రిలీజ్ కానట్లేనా?
విజయ్ ముఖ్యమంత్రి కాకముందు నటించిన చివరి చిత్రం జననాయకన్. పూజాహెగ్డే నాయకిగా నటించిన ఇందులో మమిత బైజు కీలక పాత్రను పోషించారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీ ఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం జననాయకన్. ఈ చిత్రం జనవరి 9వ తేదీన విడుదల కావలసి ఉంది. అయితే సెన్సార్ సమస్యల కారణంగా విడుదల కాలేదు. కారణాలేమైనా ఆ చిత్రం చిక్కు ముడి వీడలేదు. విజయ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. దీంతో జననాయకన్ చిత్రానికి మంచి రోజులు వస్తాయని అందరూ భావించారు. చిత్ర నిర్మాత కూడా జననాయకన్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది అని మీడియాకు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్రానికి ఇప్పటి వరకు సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు సరికదా, చిత్రం ఇంటర్నెట్లో అనధికారికంగా విడుదలై తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీ సంస్థ చిత్ర ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో సమస్య మరింత జటిలమైంది. మరోపక్క జననాయకన్ చిత్రం వ్యవహారంలో ముఖ్యమంత్రి విజయ్‌ని మౌనం పాటించాల్సిదిగా కేంద్ర ప్రభుత్వం ఆ దేశించిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో చిత్ర డిస్ట్రిబ్యూటర్లలో నిర్లిప్తత నెల కొంది. ఈ విషయం ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి వెళ్లిందని, ఆయన డిస్ట్రిబ్యూటర్ల వద్ద తీసుకున్న అడ్వాన్న్స్ను తిరిగి ఇచ్చేయాల్సిందిగా చెప్పినట్లు సమాచారం. అయితే ఆయన నిర్ణయం డిస్ట్రిబ్యూటర్లను సంతృప్తి పరుస్తుందా ? ఇక జననాయకన్ను తెరపై చూసే అవకా శం లేదా ? అనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో జననాయకన్ చిత్రానికి దారేది అనే ప్రశ్న ఎదురవుతోంది. -
తెలంగాణలో 'పెద్ది' టికెట్ ధరల పెంపు.. ఒక్కో టికెట్ ఎంతంటే?
మెగా అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెద్ది సినిమా టికెట్ ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జూన్ 4 నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీఫ్లెక్స్‌లలో రూ.125 పెంచుకునేందుకు అనుమతిలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా జూన్ 3న రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోకి అనుమతిచ్చింది. స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధర గరిష్ఠంగా రూ.600 వరకూ ఉండవచ్చని పేర్కొంది. ఈ మూవీకి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఏపీలో ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా సాగుతున్నాయి. అక్కడ సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 పెంచుకునేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ధరలు రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి. మరోవైపు ప్రీయమిర్స్ టికెట్ ధరను ఏకంగా రూ.600గా నిర్ణయించారు. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ కాగా.. మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. సూపర్ హిట్ కాదు.. ఏకంగా బ్లాక్‌బస్టర్ కానుందని ఇప్పటికే ఫిక్సయిపోయారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనున్న విషమం తెలిసిందే.ఇక “పెద్ది” సినిమాలో ఓ రీమిక్స్ సాంగ్ ఉందంటూ ప్రచారం జోరుగా సాగింది. అదే మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరిలోని 'అబ్బనీ తియ్యనీ దెబ్బ' పాట ఈ సినిమాలో ఉందంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు బుచ్చిబాబు స్పష్టత ఇచ్చారు. ఆ పాటను సినిమాలో రీమిక్స్ చేయలేదు. ఒక సన్నివేశంలో రేడియోలో వినిపించేలా ప్లాన్ చేశాం. కానీ ప్రేక్షకులు కథ నుంచి బయటకు వచ్చే ప్రమాదం ఉండటంతో దాన్ని మ్యూట్ చేసేశామని బుచ్చిబాబు తెలిపారు. -
సీఎం విజయ్‌తో విజయ్ ఆంటోనీ, ఆర్జే బాలాజీ భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను సినీ హీరో విజయ్ ఆంటోనీ, ఇటీవల హీరో సూర్యతో ‘కరుప్పు’ చిత్రం చేసి హిట్‌కొట్టిన దర్శకుడు ఆర్జే బాలాజీ మంగళవారం వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా తమ సీఎంతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. సీఎం విజయ్‌తో గడిపిన సమయం ఎంతో ప్రేరణాత్మకంగా అనిపించింది. ఆయన పాజిటివిటీ, ఎనర్జీ ఎప్పటిలాగే అద్భుతంగా ఉన్నాయి. ప్రజలకు సేవ చేస్తూ సమాజంలో అర్థవంతమైన మార్పు తీసుకురావడానికి కావాల్సిన శక్తి ఆయనకు లభించాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ఆర్జే బాలాజీ మాట్లాడుతూ.. విజయ్ను ముఖ్యమంత్రిగా కలవడం నమ్మశక్యం కాని అనుభూతి. ఆయన చూపే ప్రేమలో ఏమాత్రం మార్పు లేదు. ఎప్పటిలాగే ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా ఉన్నారని అన్నారు. ‘కరుప్పు’ కథను మొదట విజయ్‌కే చెప్పినట్టు బాలాజీ గతంలో వెల్లడించారు. అయితే విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో సినిమా ఆలస్యమవుతుందన్న భావనతో సూర్యతో ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళనాట ఆ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ మూవీ తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలైంది. తమిళనాడులో ఈ చిత్రాన్ని జనం ఎగబడి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రూ.300 కోట్ల వసూళ్లు మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. చాన్నాళ్ల తర్వాత ఈ మూవీతో సూర్యకు హిట్ దక్కింది. -
కమెడియన్ని హేళన చేశా.. ఆయన మాటలకు ఏడుపాగలేదు
దివంగత తమిళ హాస్య నటుడు కుమారిముత్తును వెక్కిరించి తప్పు చేశానంటోంది సీనియర్ నటి ఊర్వశి. సినీ ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలుగా రాణిస్తున్న ఈ నటి ఎంతోమంది యాక్టర్లతో కలిసి పని చేసింది. సహాయక పాత్రలతో పాటు కామెడీ పాత్రలు కూడా ఇట్టే చేయగలదు. అలా ఎంతోమంది కమెడియన్లతో కలిసి నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ కుమారిముత్తును అవమానించిన విషయం గురించి చెప్తూ భావోద్వేగానికి లోనైంది.ఆయనలా నటించా..ఒక సినిమాలో కుమారిముత్తుతో కలిసి నటించాను. ఆయనలా సరిగా కళ్లు కనిపించనట్లుగా యాక్ట్ చేయమన్నారు. నేనలాగే చేశాను. నా పాత్ర చూసి ప్రేక్షకులు ఎంతగానో నవ్వుకున్నారు. అయితే తర్వాత మాత్రం అది తప్పని తెలిసొచ్చింది. కుమారిముత్తు చాలా మంచి మనిషి. ఒకరోజు ఆయన్ని సరదాగా పలకరిస్తూ ఒకప్పుడు నువ్వు ఏమవ్వాలనుకున్నావు? అని అడిగాను.చదువు లేదుఅందుకాయన.. నేను పెద్దగా చదువుకోలేదు. చదువుకుంటే బాగుండేదని చాలాసార్లు అనిపించింది. చదువు లేకపోవడం వల్ల నేను కోరుకున్న ఏ ఉద్యోగమూ చేయలేకపోయాను. పోలీస్ అవ్వాలని ఆశపడ్డాను. కానీ చదువు లేదు, పైగా నాకు చూపు సరిగా కనిపించదు. ఒకసారి ఏమైందంటే డ్రైవింగ్ నేర్చుకుందామని క్లాసెస్‌కు వెళ్లాను. అక్కడ ఇన్స్ట్రక్టర్ నా కళ్లపై కుళ్లు జోకులు వేశాడు. రెండు కళ్లు బాగా కనిపిస్తున్నవాళ్లే సరిగా నడపలేకపోతున్నారు. నువ్వు చూస్తే గుడ్డివాడికి ఏమాత్రం తక్కువ కాదన్నట్లే ఉన్నావు.. అలాంటిది డ్రైవింగ్ నేర్చేసుకుందామని వచ్చావా? అని హేళన చేశాడు. అప్పుడే డిసైడయ్యా..ఇక నువ్వు కూడా సినిమాలో నాలాగా సరిగా కళ్లు కనిపించనట్లు యాక్ట్ చేశావ్ అన్నాడు. అంతే.. అతడి మాటలు నా మనసుకు గట్టిగా తాకాయి. వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాను. బయటకు వెళ్లి మనసారా ఏడ్చేశాను. కొన్ని క్షణాలపాటు నవ్వుకోవడం కోసం ఎదుటివారిని హేళన చేయకూడదని నేర్చుకున్నాను. అయితే ఆ కంటి సమస్యే తన కడుపు నింపుతుందని కుమారిముత్తు అనేవాడు అని ఊర్వశి చెప్పుకొచ్చింది.చదవండి: డోలారే సాంగ్ షూటింగ్లో రష్మిక మందన్నా ప్రెగ్నెంట్? -
డోలారే.. సాంగ్ షూటింగ్లో మాధురి ప్రెగ్నెంట్?
కొన్ని పాటలు ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతాయి. అలాంటిదే డోలారే డోలారే సాంగ్. 'దేవదాసు' సినిమాలోని ఈ పాట అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ బ్లాక్‌బస్టర్ హిట్టే.. ఇందులో హీరోయిన్లు ఐశ్వర్యరాయ్, మాధురీ దీక్షిత్ పోటీపడుతున్నట్లుగా డ్యాన్స్ చేశారు. ఒకరిని మించి మరొకరు తమ ఎనర్జీ, స్వాగ్తో అబ్బుపరిచారు. అయితే ఈ పాట షూటింగ్ చేసే సమయానికి మాధురీ దీక్షిత్ ప్రెగ్నెంట్ అని కొన్ని రోజులుగా పలు కథనాలు తెరపైకి వస్తున్నాయి. డోలారే సాంగ్..అందుకు కారణం లేకపోలేదు. దివంగత కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వద్ద పని చేసిన డ్యాన్సర్ రుబీనా ఖాన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డోలారే సాంగ్ షూటింగ్ చేసేటప్పుడు మాధురి దీక్షిత్ నాలుగు నెలల గర్భవతి అని పేర్కొంది. దాంతో సోషల్ మీడియాలో నటి ప్రెగ్నెన్సీ గురించి చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో వాటిపై తాజాగా మాధురి దీక్షిత్ స్పందించింది. నేను ప్రెగ్నెంట్ కాదుమాధురి మాట్లాడుతూ.. ''దేవదాసు' సినిమా 2002 జూలై 12న విడుదలైంది. అదే ఏడాది మే నెలలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్లోనూ ప్రదర్శితమైంది. ఆ మరుసటి ఏడాది అంటే 2003 మార్చి 17న నాకు కొడుకు అరిన్ జన్మించాడు. కాబట్టి మీరే లెక్కేయండి.. షూటింగ్ టైంలో నేను ప్రెగ్నెంట్ ఏంటి? ఇకపోతే ఆ సమయంలో నేను భారత్‌కు, అమెరికాకు తరచూ ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. పెళ్లయ్యాక అమెరికాకు..అందులోనూ ఇక్కడన్నీ నైట్ షూట్సే ఉన్నాయి. దానివల్ల నా ఆరోగ్యం కాస్త దెబ్బ తింది, అలసటకు లోనయ్యాను. అంతే తప్ప ఇంకేం లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా మాధురీ దీక్షిత్.. డాక్టర్ శ్రీరామ్ నేనేను 1999లో పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత అమెరికాకు మకాం మార్చింది. అయితే అప్పటికే సంతకం చేసిన సినిమాల కోసం తరచూ భారత్‌కు వచ్చి షూటింగ్ పూర్తి చేసేది. సినిమాఅలా చివరగా దేవదాసు చేసి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మాధురి- శ్రీరామ్ దంపతులకు కుమారులు అరిన్, ర్యాన్ సంతానం. కొంతకాలం ఫ్యామిలీ లైఫ్‌ను ఆస్వాదించాక తిరిగి సినిమాల్లో అడుగుపెట్టింది మాధురి. చివరగా భూల్ భులయ్యా 3లో కనిపించింది. ప్రస్తుతం ఆమె నటించిన 'మా బెహన్' ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 4న నేరుగా విడుదల కానుంది.చదవండి: నా కలలు ఛిద్రం.. ఈ ముగింపు ఊహించలేదు: విఘ్నేశ్ శివన్ -
నా గర్భస్రావానికి సీఎం విజయ్‌నే కారణం: బుల్లితెర నటి
తమిళనాడులో జల్లికట్టు ఆందోళన ద్వారా పాపులర్ అయిన బుల్లితెర నటి జూలీకి హీరో విజయ్ అంటే గిట్టదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఆయన్ను విమర్శిస్తూ ప్రచారం చేసింది. విజయ్‌కు వ్యతిరేకంగా చెన్నై మెరీనా బీచ్‌లో అనుమతి లేకుండా నిరసన తెలిపి వివాదంలో చిక్కుకుంది. అయితే దళపతి అభిమానులు, తమిళ వెట్రి కళగం (టీవీకే) కార్యకర్తల ట్రోలింగ్ వల్ల తాను నరకయాతన అనుభవించానంటోంది జూలీ. ట్రోలింగ్..తాజాగా ఓ ఇంటర్వ్యూలో జూలీ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేకపోతున్నాను. నన్ను దారుణంగా విమర్శించిన కొందరి పేర్ల వివరాలతో సహా మార్చిలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. అప్పుడు ఎన్నికల సమయం కావడంతో దాన్ని పక్కనపెట్టారు. ఇప్పుడు చూస్తే రివర్స్‌లో నాపైనే రూ.15 లక్షల కిడ్నీ స్కామ్ ఆరోపణలు చేస్తున్నారు. నన్ను ఏదో ఒక కేసులో ఇరికించాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.గర్భస్రావానికి ఆయనే కారణంమరోవైపు వీళ్ల ట్రోలింగ్ వల్ల నాకు మానసిక ప్రశాంతత లేకుండా పోయింది. కడుపులో బిడ్డను కూడా కోల్పోయాను. నా గర్భస్రావానికి సీఎం విజయ్ అన్నయే కారణం. ప్రత్యక్షంగా తన ప్రమేయం లేకపోయినా పరోక్షంగా ఆయన హస్తం ఉంది. నన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నవారిని ఒక్క మాట చెప్పి అదుపు చేసుంటే నేను నా బిడ్డను కోల్పోయేదాన్నే కాదు.ప్రజలపై దృష్టి పెట్టండినన్ను, నా భర్తను అనరాని మాటలంటున్నారు. మీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఒక మహిళ జీవితాన్నే నాశనం చేస్తారా? సోషల్ మీడియా వల్లే విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడని అంటున్నారు కదా.. ఆయన తనకు వ్యతిరేకంగా మాట్లాడినవారిపై దాడులు చేయించడానికి బదులుగా ప్రజల కోసం ఏం చేయాలన్నదానిపై దృష్టి పెడితే బాగుంటుంది అని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇది అనైతికంజూలీ కామెంట్స్‌పై నటి అంబిక అసహనం వ్యక్తం చేసింది. ప్రెగ్నెన్సీ విషయంలో నీకు జరిగినదానికి చింతిస్తున్నాను. కానీ నువ్వు చెప్పేది అనైతికంగా ఉంది. నీ గర్భస్రావానికి సీఎం విజయ్ ఎలా కారణమవుతాడు? ముందు నీ మాట తీరు మార్చుకో.. సీఎం, పీఎసం స్థానంలో ఉన్నవారిని ఎలా గౌరవించాలో నేర్చుకో అని చురకలంటించింది.బుల్లితెరకాగా జూలీ తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్లో పాల్గొంది. ఆ తర్వాత బిగ్‌బాస్ అల్టిమేట్ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. ఒడి విలయదు పాప అనే షోకి వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది. నాన్ సిరితల్ చిత్రంలో యాక్ట్ చేసింది. ఈ ఏడాది జనవరిలో మొహ్మద్ ఇక్రీమ్‌ను పెళ్లాడింది.చదవండి: హీరోయిన్ కాజల్‌కు ఎంత కష్టమొచ్చింది? -
నా కలలు చిదిమేశారు, జీర్ణించుకోలేకపోతున్నా: విఘ్నేశ్
వరుస బ్లాక్‌బస్టర్స్‌తో స్పీడుమీదున్న ప్రదీప్ రంగనాథన్‌కు ఎల్ఐకే (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) పెద్ద షాకే ఇచ్చింది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా అతడి భార్య, హీరోయిన్ నయనతార నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఊహించని ఈ ఫలితానికి విఘ్నేశ్ విస్తుపోయాడు. కనీసం రూ.200-300 కోట్లు వసూలు చేస్తుందనుకున్నానని బాధపడ్డాడు.నెగెటివ్ టాక్థియేటర్లలో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎల్ఐకేపై ఎందుకు నెగెటివిటీ ప్రచారం చేశారో తెలియడం లేదు కానీ సినిమా అదిరిపోయిందని పలువురు అతడికి మెసేజ్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు విక్కీ. 'ఆన్లైన్లో ఎల్ఐకే మూవీపై వచ్చిన నెగెటివిటీ చూసి దీన్ని థియేటర్లలో చూడటం మిస్ అయ్యాం అని చాలామంది మెసేజ్‌లు పెడుతున్నారు.కలలు నాశనంపెద్ద తలకాయల అండదండలు లేని చిన్న సినిమాలపై కొందరు విశ్లేషకులు తమ అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. తమ రివ్యూలతో ప్రేక్షకుల్ని సినిమా చూడనివ్వకుండా నిరాశపరుస్తున్నారు. దర్శకుల కలల్ని ఆదిలోనే చిదిమేస్తున్నారు. ఫస్ట్ వీకెండ్ బలంగానే ఉన్నప్పటికీ ఈ నెగెటివ్ ప్రచారం సినిమాను దెబ్బకొట్టింది. సినిమా ఫలితాన్ని నేనిప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. ఎల్ఐకే అనేది ఒక విభిన్నమైన తమిళ చిత్రం. ఆ కష్టం ఎవరికీ కనపడదుదీనికి ప్రేక్షకుల నుంచి మరింత ఆదరణ రావాల్సింది. ఇలాంటి సినిమా తెరకెక్కించడం వెనక ఉన్న కష్టాన్ని ఎవరూ గుర్తించరు. ఈ సినిమాను రూపొందించి, రిలీజ్ చేయడం వరకు ఎన్నో సవాళ్లను అధిగమించి థియేటర్లవరకు తీసుకొచ్చాను. కానీ, దానికి చివరకు ఇలాంటి ముగింపు రావడం కలిచివేసింది. అయినా కొన్ని గొప్ప సినిమాలు ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఆదరణకు నోచుకోవు.. కానీ, తర్వాతి కాలంలో అవే క్లాసిక్ చిత్రాలుగా పరిగణించబడతాయి. భవిష్యత్తులో నా సినిమాకు కూడా అలాంటి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను' అని విఘ్నేశ్ ఎమోషనల్ లేఖను పంచుకున్నాడు.చదవండి: ప్రముఖ సింగర్ ఇక లేరు -
కాజల్‌కు ఎంత కష్టమొచ్చింది?
ఒక్కసారి డౌన్ అయితే మళ్లీ పైకి లేవడానికి సమయం పడుతుంది. ఒక్కోసారి అది కూడా జరగకపోవచ్చు. నయనతార వంటి సీనియర్ హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా తమ లెగసీని కొనసాగిస్తున్నారు. కాజల్ అగర్వాల్ వంటి కొందరు మాత్రం కెరీర్ పరంగా కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. కాజల్ ఇంతకుముందు పాన్ ఇండియా హీరోయిన్గా రాణించింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రముఖ హీరోలతో జతకట్టిన ఈ ఉత్తరాది భామ 2020లో గౌతమ్ కిచ్లును పెళ్లాడింది. వీరికి ఒక బాబు కూడా జన్మించాడు. స్లిమ్ అయిన కాజల్ఆ సమయంలో సినిమాలకు కొంత విరామం ఇచ్చిన కాజల్ ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్లీ బిజీ అవాలని చూస్తోంది. అందుకే అనేక కసరత్తులు చేస్తూ స్లిమ్ అయిపోయింది. అయితే అవకాశాలు అరుదుగా వస్తున్నప్పటికీ గుర్తింపయితే రావట్లేదు. ఏడాదికి ఒకటి రెండు చిత్రాల్లోనే నటిస్తోంది కానీ బిజీగా మాత్రం లేదు. హిందీలో రామాయణం, ద ఇండియా స్టోరి మూవీస్ చేస్తోంది. కమల్ హాసన్ ఇండియన్ 3 ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియని పరిస్థితి. అందుకోసమే కసరత్తులుతాజాగా ఈ బ్యూటీ ఒక తెలుగు చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇకపోతే పూర్వవైభవాన్ని పొందాలని తహతహలాడుతున్న ఈ బ్యూటీ తనను తాను ప్రచారం చేసుకునే పనిలో పడింది. గతకొద్దిరోజులుగా ప్రతిరోజూ ఫోటోషూట్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అవి నెట్టింట వైరలవుతుండగా అవకాశాల కోసమే ఈ ఫోటో సెషన్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి తన కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందో? లేదో? చూడాలి!చదవండి: ప్రముఖ గాయని సుమన్ ఇక లేరు -
ప్రముఖ గాయని సుమన్ ఇక లేరు
ప్రముఖ గాయని సుమన్ కల్యాణ్‌పూర్ (89) ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం (మే 31న) సాయంత్రం ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. చివరి రోజుల్లో ఆమె తన పాటలు వింటూ కాలం గడిపారు. గాయని మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, సినీతారలు సంతాపం ప్రకటిస్తున్నారు.ఎవరీ గాయని?సుమన్ కళ్యాణ్పూర్ 1937 జనవరి 28న ఢాకాలో జన్మించారు. 1950ల ప్రారంభంలో సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు. మరాఠి, హిందీతో పాటు పలు భాషల్లోనూ పాటలు ఆలపించారు. నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్ బైఠే.. (బాత్ ఏక్ రాత్ కీ మూవీ), ఆజ్ కల్ తేరే మేరె ప్యార్‌కే చర్చే హర్ జబాన్ పర్ (బ్రహ్మచారి), తుమ్నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే (రాజ్‌కుమార్) వంటి ఎన్నో గీతాలకు ఆమె ప్రాణం పోశారు. ఆమె గొంతు లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌ను పోలి ఉండటంతో అభిమానులు ఆమెను మరో లత అని పిల్చుకునేవారు. ఆరు దశాబ్దాలుగా సంగీత ప్రపంచానికి సేవలందించిన సుమన్‌ను భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. -
అవార్డుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు: ఇళయరాజా
సంగీత రంగంలో రారాజుగా వెలుగుతున్న సంగీతదర్శకుడు ఇళయరాజా. తమిళం, తెలుగు మొదలగు భాషల్లో తన ఖ్యాతిని చాటిన ఈయన సంగీత పయనం 50 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం, ఆదివారం.. రెండు రోజులపాటు చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో సంగీత కచేరి బ్రహ్మాండంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ ‘‘నేను అవార్డుల కోసం వేచి చూసే వ్యక్తిని కాదు. నేను నడిచినా, మాట్లాడినా సాధననే’’ అని ఇళయరాజా పేర్కొన్నారు. సంగీత కచేరిఈ వేదికపై తన ఇద్దరు మనవళ్ల మధ్య కూర్చుని ఇళయరాజా సంతోషంగా కనిపించారు. ముందుగా విదేశీ సంగీత కళాకారులు సింపోనిని వాయించారు. అనంతరం ఇళయరాజా గతంలో సంగీతం అందించిన పాటలను శ్రోతల కోసం వాయించారు. ఇళయరాజా 'పుదియ వార్పుగళ్' చిత్రంలోని 'ఇదయం పోగుదే..' అనే పాటను రూపొందించిన విధానం గురించి, దానికి వాడిన సింపోని గురించి వివరించారు. అతిథులుఈ కార్యక్రమంలో ఇళయరాజా వారసులు యువన్ శంకర్‌రాజా, కార్తీక్రాజాలతో పాటు దర్శకుడు మిష్కిన్, కార్తీక్ సుబ్బరాజ్, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, దర్శకుడు ఆర్వీ.ఉదయకుమార్, మారి సెల్వరాజ్, విఘ్నేశ్ శివన్, నటుడు సిద్ధార్ధ్, పార్తీబన్, సంతానభారతి, ముఖ్యమంత్రి విజయ్ తల్లి శోభ పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది సంగీత ప్రియులు ఆనందంతో తరించారు. -
‘పెద్ది’ ప్రచారం కోసం ఆపరేషన్ వాయిదా
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పెద్ది’. ఈ సినిమా ప్రచారం మధ్యలో ఆయన చేతికి కట్టుతో కనిపించడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. దాంతో చాలామంది ఇది సర్జరీ జరిగిన తర్వాతి పరిస్థితి అనుకున్నారు. అయితే ఈ విషయంపై చరణ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాను ఇప్పటివరకు ఎలాంటి ఆపరేషన్ చేయించుకోలేదని, తాత్కాలికంగా నొప్పి తగ్గించుకునేందుకు మాత్రమే కట్టు కట్టారని తెలిపారు. పెద్ది సినిమా రిలీజ్ తర్వాతే సర్జరీ చేయించుకుంటానని చరణ్ స్పష్టం చేశారు. కాగా ‘పెద్ది’లో పహిల్వాన్ పాత్రలో చరణ్ కనిపిస్తునన్నాడు. దానికోసం నిజమైన మల్లయోధులను తెప్పించి పెద్ది’లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ సీన్ షూటింగ్లో ఒక పట్టుపట్టినప్పుడు ఆయన చేతికి చిన్నపాటి గాయం అయ్యింది. ప్రస్తుతం ఆ నొప్పిని భరిస్తూనే, చరణ్ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఓవర్సీస్కి కంటెంట్‌ను కూడా పంపించేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల పెంపు కోసం ప్రత్యేక జీవో కూడా విడుదలైంది. ప్రీమియర్ షోకు రూ.600 అదనంగా వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. రిలీజ్ రోజు నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లో రూ.100, మల్టీప్లెక్సులో రూ.125 పెంపు అనుమతించారు. దాంతో ప్రస్తుతం అందరి దృష్టి తెలంగాణ ప్రభుత్వంపై ఉంది. టికెట్ రేట్ల పెంపుపై వివాదాలు కొనసాగుతున్న వేళ, ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో వస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. -
మహేష్ బాబాయ్ నాకు చాలా ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడు
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ శ్రీనివాస మంగాపురం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. జయకృష్ణ డెబ్యూ విషయంలో మహేష్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడట. సినిమా కంటెంట్, ఎమోషన్ అన్నింటినీ దగ్గరుండి గమనించి, తన ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడని జయకృష్ణ స్వయంగా వెల్లడించాడు. మహేష్ ఇచ్చిన సూచనలు ఈ సినిమాకు చాలా హెల్ప్ అయ్యాయని జయకృష్ణ చెబుతున్నాడు. శ్రీనివాస మంగాపురం గురించి జయకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా లోతైన ఎమోషన్ కలిగిన సినిమా. నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇది సరైన కథ అని పేర్కొన్నాడు. ఈ సినిమాలో రవీనా టాండన్ కూతురు రాషా తడానీ హీరోయిన్గా నటిస్తోంది. కృష్ణ జయంతి సందర్భంగా ఈరోజు సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు. ఈ చిత్రం జులై 9న థియేటర్లలో విడుదల కానుంది. తాతయ్య ఆశీస్సులు నాతో ఉంటాయి‘‘తాతయ్య కృష్ణగారు నాకు దేవుడితో సమానం. ఆయన ఎక్కడ ఉన్నా తన ఆశీస్సులు నాతో ఉంటాయని నమ్ముతున్నాను. తాతయ్య పుట్టినరోజు సందర్భంగా మీ అందర్నీ కలవడం హ్యాపీగా ఉంది. హీరో అవ్వాలనే ఆలోచనకు ప్రేరణ మా బంగారు తాతయ్య (కృష్ణ సోదరుడు–నిర్మాత ఆదిశేషగిరి రావు). అలాగే మా బాబాయ్ మహేశ్‌బాబుకి నేను డైహార్డ్ ఫ్యాన్‌ని. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను లాంచ్ చేసి, ఫీడ్‌బ్యాక్ ఇస్తూ, నన్ను ప్రోత్సహిస్తున్న మా బాబాయ్‌కి థ్యాంక్స్. ఈ సందర్భంగా మా నాన్న రమేశ్బాబుగారిని తలచుకుంటున్నాను. మా తాతగారితో ‘అగ్నిపర్వతం’, బాబాయ్ మహేశ్‌బాబుగారితో ‘రాజకుమారుడు’ చేశారు దత్తుగారు. ఇప్పుడు నన్ను హీరోగా పరిచయం చేస్తున్న ఆయనకు రుణపడి ఉంటాను.కిరణ్, అజయ్ భూపతి, రాషా, రాఘవేంద్ర రావు, జయకృష్ణ, అశ్వినీదత్, ఆదిశేషగిరి రావు ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ‘‘ఈ సినిమా నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు రాషా. ‘‘కృష్ణగారు నిజమైన సూపర్‌స్టార్. ఆయన చేసినంత రిస్క్ ఏ హీరో కూడా చేసి ఉండరు. ఆ కృష్ణగారి క్వాలిటీస్ జయకృష్ణలో ఉన్నాయి. జయకృష్ణ పెద్ద హీరో అవుతాడని దర్శకుడు అజయ్ భూపతి అన్నారు. ‘‘కృష్ణగారిలాగే జయకృష్ణ కూడా తన ప్రతిభను చూపించాడు’’ అని పేర్కొన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్. ‘‘జయకృష్ణ న్యూయార్క్‌లో ఫిల్మ్ కోర్సు చదివాడు. ఈ సినిమాతో జయకృష్ణ హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది’’ అని తెలిపారు ఆదిశేషగిరి రావు. ‘‘శ్రీనివాస మంగాపురం’ అని పేరు పెట్టడమే ఈ సినిమా మొదటి విజయం’’ అన్నారు దర్శక–నిర్మాత కె. రాఘవేంద్ర రావు. -
చెల్లి ఇంటి కోసం డబ్బు సాయం చేసిన కాజోల్
దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ కొంతకాలంగా యూట్యూబ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. తన వంటమనిషి దిలీప్‌తో కలిసి రకరకాల వీడియోలు చేస్తోంది. అతడిని వెంటేసుకుని సెలబ్రిటీల హోంటూర్స్ కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి తనీషా ముఖర్జీ ఇంటిని సందర్శించింది ఫరా. ముంబైలో ఉన్న ఈ ఇంట్లో అడుగుపెడితే కోల్‌కతాకు వెళ్లినట్లుగానే ఉందని అబ్బురపడిపోయింది.14 ఏళ్లుగా ముంబైలో..ఇలాంటి ఇల్లు ముంబైలో ఎక్కడా ఉండదని కితాబిచ్చింది. ఇక తనీషా మాట్లాడుతూ.. ఈ ఇంట్లోని సామాను చాలామటుకు తన తల్లి ఇంటి నుంచి వచ్చినవే అని పేర్కొంది. 14 ఏళ్ల క్రితం ముంబైలో అడుగుపెట్టానని, తర్వాత ఇక్కడే సెటిలైపోయానంది. ఈ ఇంటి కోసం మీ అక్క, హీరోయిన్ కాజోల్ ఏమైనా సాయం చేసిందా? అని ఫరా ఆతృతగా అడిగింది. అందుకు తనీషా అవునని బదులిచ్చింది. తను చెక్‌లపై సంతకం చేసి ఇచ్చేదని, అలా డబ్బు సాయం చేసిందని పేర్కొంది.తెలుగులోనూ..బాలీవుడ్ సెలబ్రిటీలు తనూజ- షోము ముఖర్జీల సంతానమే కాజోల్, తనీషా. తక్కువ కాలంలోనే కాజోల్ స్టార్ హీరోయిన్గా రాణించింది. కానీ, తనీషా ఆ స్టార్డమ్ అందుకోలేకపోయింది. ష్, సర్కార్, వన్ టూ త్రీ, సర్కార్ రాజ్, కోడ్ నేమ్ అబ్దుల్ వంటి పలు హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో కంత్రి మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసింది. హిందీ బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.చదవండి: బోల్డ్ వీడియో.. తప్పయిపోయింది, క్షమించండి: నటుడి కూతురు -
బోల్డ్ వీడియో.. డబ్బు కోసం కాదు, క్షమించండి: నటుడి కూతురు
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ప్రముఖ నటుడి కూతురు చేస్తున్న పని అలాగే ఉంది. అసలే ఇది డిజిటల్ యుగం. సెలబ్రిటీలు చిన్న పొరపాటు చేస్తే చాలు దాన్ని భూతద్దంలో పెట్టి మరీ ట్రోల్ చేస్తుంటారు. అలాంటిది ఒక వీడియోను కావాలనే సబ్స్క్రిప్షన్స్ మెంబర్స్ కోసం పోస్ట్ చేయడమేంటో, అది వైరల్ అవడంతో తప్పయిందంటూ క్షమాపణలు చెప్పడమేంటో తనకే తెలియాలి! ఇంతకీ ఏం జరిగిందో చూసేద్దాం..బోల్డ్ వీడియోమలయాళ నటుడు కృష్ణ కుమార్‌కు నలుగురు కూతుర్లు సంతానం. వీరిలో అహానా, ఇషాని కృష్ణలు యాక్టర్స్‌గా చెలామణీ అవుతున్నారు. దియా, హన్సికలు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లుగా ఫేమస్ అయ్యారు. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బులు పెట్టి సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారి కోసం ప్రత్యేకంగా ఫోటోలు, వీడియోలు వదులుతున్నారు. అలా హన్సిక కూడా కాస్త బోల్డ్ వీడియో ఒకటి తన సబ్స్క్రైబర్ల కోసం పోస్ట్ చేసింది. డబ్బు కోసం దిగజారాలా?అది కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియోకు ముందు తన ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ధర రూ.299గా ఉంటే ఆ వీడియో తర్వాత రూ.399గా ధర ఫిక్స్ చేసింది. దీంతో డబ్బు కోసం ఇంతకు దిగజారాలా? ఇలాంటి వీడియోలు పెట్టాలా? అని జనం తిట్లదండకం అందుకున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న హన్సిక.. పొరపాటు జరిగింది, క్షమించండి అంటూ ఓ లేఖ వదిలింది. 'ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఫీచర్ కింద మూడు వారాల క్రితం ఓ వీడియో షేర్ చేశాను. బుద్ధి లేక, నిర్లక్ష్యంగా ఆ పని చేశాను. అందుకు నెల రోజులుగా బాధపడుతున్నాను.ఐదు నిమిషాల్లో డిలీట్.. అయినా!అసలు ఆ వీడియో ఎందుకు పోస్ట్ చేశానో నాకే అర్థం కావడం లేదు. తప్పు జరిగిపోయింది. కేవలం పోస్ట్ చేసిన ఐదు నిమిషాల్లోనే దాన్ని డిలీట్ చేశాను. కానీ, అప్పటికే కొందరు దాన్ని రికార్డు చేసి వైరల్ చేశారు. డబ్బు కోసం, పబ్లిసిటీ కోసం ఇలా చేశానని కొందరు దారుణంగా మాట్లాడుతున్నారు. నాకు నిజంగా అలాంటి ఉద్దేశం లేదు. 20 ఏళ్లకే నా బాగోగులు నేను చూసుకునేంత సంపాదించడం మొదలుపెట్టాను. చాలా భయపడ్డా..ఎన్నో ఏళ్లుగా మీరందరూ నాపై, నా కుటుంబంపై ప్రేమాభిమానాలు కురిపిస్తూనే ఉన్నారు. కాబట్టి కొత్తగా నేను పబ్లిసిటీ కోసం పాకులాడాల్సిన అవసరం లేదు. అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే.. నేను, నా సోదరి ఏడాదికాలంగా ఓ మ్యూజిక్ వీడియో కోసం ఎంతగానో కష్టపడ్డాం. అందులో నేను యాక్ట్ చేశాను. ఈ వివాదం చెలరేగిన మూడు రోజులకే ఆ పాట రిలీజైంది. నా వల్ల తనకు ఇబ్బంది కలుగుతుందేమోనని చాలా భయపడ్డాను. అదృష్టవశాత్తూ అలాంటిదేం జరగలేదు.భరించలేకున్నా..ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అయింది నేను, నా కుటుంబం. దీనికితోడు ఆన్లైన్లో వేధింపులు, విద్వేషపూరిత కామెంట్లు మరింత బాధిస్తున్నాయి. విమర్శించకూడదని నేను అనడం లేదు, కానీ ఆ విమర్శలు హద్దులు దాటుతున్నాయి. వారి కంటెంట్ కోసం నన్ను వాడుకుంటున్నారు. నా బాధ వారికి సంతోషంగా ఉంది. మనుషులు అవతలివారిని ఇట్టే ద్వేషిస్తారని ఈ సంఘటన వల్లే తెలిసొచ్చింది. పూర్తిగా ఎత్తేయాలనుకున్నా..నేను సింపతీ కోసం ఇదంతా చెప్పడం లేదు. నా మనసులో భారాన్ని దించుకోవడానికి చెప్తున్నాను. మరి సబ్స్క్రిప్షన్ ధర ఎందుకు పెంచావని అడుగుతున్నారు. నిజానికి ఈ సబ్‌స్క్రిప్షన్‌ను పూర్తిగా ఎత్తేయాలనుకున్నాను. కానీ, దానివల్ల ఈ వివాదం మరింత ముదురుతుందనిపించింది. ఈ సమయంలో కొత్త సబ్స్క్రైబర్లను తగ్గించాలన్న ఉద్దేశంతోనే ధర పెంచాను.క్షమించండిఈ వివాదం తర్వాత సబ్స్క్రిప్షన్ ద్వారా వచ్చిన డబ్బు మొత్తాన్ని సామాజిక సేవకు వినియోగిస్తాను. అందులో ఒక్క రూపాయి కూడా నేను వాడను. నేను చేసిన పిచ్చి పని వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఈ సమయంలో నాకు అండగా ఉన్న కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులకు థాంక్స్' అని హన్సిక రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Hansika Krishna 🐣 (@hansubeeeey) చదవండి: నాన్న కొడతాడేమోనని భయంతో చెప్పలేదు: రామ్‌చరణ్ -
సెలబ్రిటీలను అన్‌ఫాలో చేసిన కరణ్.. కారణమేంటో తెలుసా?
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ చేసిన ఓ అనూహ్యమైన పని ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షారూఖ్ ఖాన్, ఆలియా భట్, కరీనా కపూర్, అనన్య పాండే.. ఇలా పలువురు తారలను అన్‌ఫాలో అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.టైం వేస్ట్దీనిపై కరణ్ జోహార్ స్పందిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఎక్కువ సమయం గడుపుతున్నాను. ఈ కారణంగా నా విలువైన సమయం వృథా అవుతోంది. దీన్ని తగ్గించుకునేందుకే అన్‌ఫాలో అయ్యాను. ఇది జాతీయస్థాయి వార్త కాదు, కేవలం డిజిటల్ డీటాక్స్ మాత్రమే.. మీ వ్యూస్, క్లిక్స్ కోసం మరేదైనా విషయాన్ని చూసుకోండి అని పేర్కొన్నారు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.75 కోట్ల మంది ఫాలోవర్స్ ఉండగా ఆయన మాత్రం 49 మందినే ఫాలో అవుతున్నారు.చదవండి: జూన్‌లో రిలీజయ్యే సినిమాల జాబితా -
హీరో అజిత్ తల్లి కన్నుమూత
చెన్నై: తమిళ స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అతడి తల్లి మోహిణి మణి (84) చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న అజిత్.. తల్లి మరణవార్త తెలియగానే వెంటనే చెన్నై బయల్దేరారు. మూడేళ్ల క్రితం అజిత్ తండ్రి సుబ్రమణి కూడా వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. అజిత్ తల్లి మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.అజిత్ కుమార్ తల్లి మోహిని ఇక లేరనే వార్త నన్ను ఎంతగానో కలచివేసింది. తల్లిని కోల్పోయిన అజిత్‌కు ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.- కమల్ హాసన్ சகோதரர் திரு. அஜித்குமார் அவர்களின் தாயார் திருமதி. மோகினி மணி அவர்கள் மறைந்த செய்தி அறிந்து வருத்தமடைந்தேன். அன்புத் தாயை இழந்து தவிக்கும் அஜித்குமாருக்கும் அவரது குடும்பத்தாருக்கும் எனது மனமார்ந்த ஆறுதல்களைத் தெரிவித்துக்கொள்கிறேன்.— Kamal Haasan (@ikamalhaasan) May 30, 2026 డియర్ అజిత్.. మీ అమ్మగారు చనిపోయారని తెలిసి చింతిస్తున్నాను. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి విషాదకర సమయంలో మీరు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అమ్మగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను- రాధికా శరత్‌కుమార్Dear #ajith so sorry to hear of the passing of your mother. Condolences to the family and pray for strength in this sad phase of your life.🙏🙏may she be in peace.— Radikaa Sarathkumar (@realradikaa) May 30, 2026 చదవండి: జూన్‌లో విడుదలయ్యే సినిమాల జాబితా -
జూన్ బాక్సాఫీస్: పెద్దితో పాటు ఆ సినిమాలదే హవా!
ఈసారి బాక్సాఫీస్ వద్ద సమ్మర్ హవా పెద్దగా కనిపించలేదు. పెద్ద సినిమాలన్నీ అటు షూటింగ్స్ పూర్తి కాక, ఇటు ఐపీఎల్ రావడంతో వాయిదాలు ప్రకటించాయి. దీంతో వేసవిలో చిన్న, డబ్బింగ్ సినిమాల జోరే ఎక్కువగా కనిపించింది. అయినప్పటికీ టాలీవుడ్ బాక్సాఫీస్ ఎక్కువగా బోసిపోయే కనిపించింది. ఇప్పుడు రామ్‌చరణ్ 'పెద్ది'తో మరోసారి బాక్సాఫీస్ కళకళలాడేందుకు సిద్ధమైంది. మరి పెద్దితోపాటు జూన్‌లో థియేటర్లలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దాం..⇒ జూన్ 4- పెద్దిరామ్చరణ్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయిక. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.⇒ జూన్ 5 - హై జవానీ తో ఇష్క్ హోనా హై (హిందీ మూవీ)బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'హై జవానీతో ఇష్క్ హోనా హై'. మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. హీరో వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 5న రిలీజవుతోంది.⇒ జూన్ 11- సింగ్ గీతంలెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ సినిమా 'సింగ్ గీతం'. అయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ జూన్ 11న విడుదలవుతోంది.⇒ జూన్ 19 - మా ఇంటి బంగారండైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత సమంత ప్రధాన పాత్రలో నటించిన తొలి చిత్రం 'మా ఇంటి బంగారం'. సామ్ భర్త రాజ్ ఈ చిత్రానికి కథ అందించగా, ఓ బేబీ ఫేమ్ నందిని రెడ్డి డైరెక్ట్ చేసింది. ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 19న బంగారం థియేటర్లలోకి వస్తోంది.⇒ జూన్ 19 - ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు'కోరుకున్న ప్రియుడు', 'పెళ్లి' వంటి సినిమాలతో హీరోగా అప్పట్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు వడ్డే నవీన్. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు' మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ద్వారా కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వడ్డే నవీన్ హీరోగా నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.⇒ జూన్ 19- దీవానాశుభం ఫేమ్ హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన చిత్రం 'దీవానా'. స్మేహ మణిమేగలై కథానాయిక. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీ 'మా ఇంటి బంగారం'తో పోటీపడుతూ జూన్ 19న రిలీజవుతోంది.⇒ జూన్ 19 - కాక్టైల్ 2 (హిందీ మూవీ)షాహిద్ కపూర్ హీరోగా, కృతి సనన్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం కాక్టైల్ 2. ఇది 2012లో వచ్చిన కాక్టైల్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. జూన్ 19న విడుదలవుతోంది.⇒ జూన్ 26- లెనిన్నాగార్జున చిన్న కుమారుడు, హీరో అఖిల్ అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లెనిన్. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ మూవీ రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాతోనైనా అఖిల్ హిట్ కొడతాడని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అన్నట్లు ఈ చిత్రం నెలాఖరులో జూన్ 26న రిలీజవుతోంది.⇒ జూన్ 26- వెల్కమ్ టు ద జంగిల్ (హిందీ చిత్రం)ఇది వెల్కమ్ సినిమా ఫ్రాంచైజీలో వస్తున్న మూడో భాగం. ఇందులో అక్షయ్ కుమార్, సంజయ్ దత్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఇకపోతే జూన్ 22న స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజు ఉంది. ఈ క్రమంలో జూన్ 19న ఆయన చివరి మూవీ జన నాయకన్ను రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. మరి ఈసారైనా సెన్సార్ ఆటంకాలు దాటుకుని జన నాయకన్ విడుదలవుతుందో, లేదో చూడాలి! -
'కూతురి పెళ్లికి తప్పక రండి'.. మోదీకి ఖుష్బూ ఆహ్వానం
ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆమె కూతురు అవంతిక పెళ్లి పీటలెక్కనుంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీని ఖుష్బూ కుటుంబం శుక్రవారం ఢిల్లీలో కలిసింది. తమ కూతురు పెళ్లికి రావాల్సిందిగా కోరుతూ ఖుష్బూ- సుందర్ దంపతులు మోదీకి శుభలేఖ అందించారు. ఖుష్బూ దంపతుల వెంట కూతురు అవంతిక, ఆమెకు కాబోయే భర్త శ్రవణ్ శ్రీనివాసన్ సైతం ఉన్నారు. ఈ ఫోటోను ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.మోదీకి రుణపడి ఉంటాం'నా కుటుంబంతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశాను. శ్రవణ్ శ్రీనివాసన్‌తో జరగబోయే నా కూతురి పెళ్లికి తప్పక హాజరవాల్సిందిగా కోరుతూ శుభలేఖను అందించాను. కాబోయే దంపతులను ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. బిజీ షెడ్యూల్లోనూ మోదీ మాకు సమయం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. థాంక్యూ ప్రధానమంత్రిగారు' అని ఖుష్బూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఫ్యామిలీఇది చూసిన అభిమానులు ఖుష్బూ ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయని తెలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఖుష్బూ- సుందర్ దంపతులకు అవంతిక, ఆనందిత అని ఇద్దరు కూతుర్లు సంతానం. ఆనందిత నిర్మాతగా వ్యవహరిస్తుండగా, అవంతిక యాక్టింగ్‌పై దృష్టి సారించింది. మలయాళంలో ఆరంభం అనే సినిమాలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
అభిమానిని పట్టించుకోని పూజా.. ఆమె సమాధానమిదే!
సౌత్‌లోని స్టార్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే ఒకరు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రముఖ హీరోలతో జతకట్టిందీ బ్యూటీ. తెలుగులోనే ఆమెకు ఎక్కువ హిట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ నిరాశపర్చినా మంచి గుర్తింపయితే తీసుకొచ్చింది. విజయ్‌తో రెండోసారి జతకట్టిన జననాయకన్ మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ సెన్సార్ సమస్యల కారణంగా ఇప్పటివరకు ఈ సినిమా రిలీజవనేలేదు. ఎలాగైనా సరే జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వీడియో వైరల్ఇకపోతే పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. ఇకపోతే ఇటీవల ఓ యువకుడు పూజాతో సెల్ఫీ కోసం ప్రయత్నిస్తుంటే ఆమె పట్టించుకోలేదని ఓ వీడియో వైరలయింది. దానిపై తాజా ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ.. సినిమా వాళ్లకు జీవితాన్నిస్తోంది ప్రేక్షకులేనంది. పరిస్థితుల కారణంగా కొన్ని సమయాల్లో అభిమానులను పట్టించుకోకపోవచ్చని, అలాగని తామేదో పొగరు చూపిస్తున్నట్లు అర్థం కాదని తెలిపింది. ఇంకా చెప్పాలంటే అభిమానులే తమ దేవుళ్లు అని పేర్కొంది. View this post on Instagram A post shared by STARGAZE 🧿 (@stargazeoffiical) -
దృశ్యం 3లో నర్స్.. నిజ జీవితంలో డాక్టర్
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాం! ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు ట్రెండు మారింది. ఓపక్క యాక్టింగ్ చేస్తూనే మరోపక్క మెడిసిన్ పూర్తి చేస్తున్నారు తారలు. కొందరైతే డాక్టరయ్యాక కూడా యాక్టర్ అవొచ్చని నిరూపిస్తున్నారు. అలాంటివారి జాబితాలోకే వస్తుంది నటి శ్రద్ధా గోకుల్. ఈమె మలయాళ దృశ్యం 3 మూవీలో నర్సుగా కనిపించింది. కానీ నిజ జీవితంలో ఈమె మాత్రం నర్సు కాదు, ఏకంగా వైద్యురాలు.. తనగురించే ఈ ప్రత్యేక కథనం..చైల్డ్ ఆర్టిస్ట్‌గా..మలయాళ నటి శ్రద్ధా గోకుల్‌కు సినిమాలు కొత్తేం కావు. చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చింది. 'హలో కుట్టిచేతన్' అనే మలయాళ సీరియల్లో వర్ష పాత్రలో కనిపించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అప్పట్లోనే మంచి మార్కులు కొట్టేసింది. ఇది కేవలం పిల్లల కోసమే డిజైన్ చేసిన సీరియల్. ఈ సీరియల్ కంటే ముందు సూపర్ డ్యాన్సర్ జూనియర్ అనే డ్యాన్స్ షోలో పాల్గొంది శ్రద్ధా.చదువు నిర్లక్ష్యం చేయొద్దని..సీరియల్స్‌లో క్లిక్ అవడంతో దుల్కర్ సల్మాన్ 'పట్టం పోలే' మలయాళ మూవీలో నటించే ఛాన్స్ చేజిక్కించుకుంది. తర్వాత సినిమా అవకాశాలు రాలేదని కాదు కానీ చదువును నిర్లక్ష్యం చేయొద్దనుకుంది. నటనకు బ్రేక్ ఇచ్చేసి చదువుపైనే దృష్టి సారించింది. ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్ పూర్తి చేసింది. అనంతరం కేరళ తిరువనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసింది.రీఎంట్రీతను సినిమాల్లోకి వస్తుందని మళ్లీ ఊహించలేదు. కానీ అనుకోకుండా కొచ్చిలో ఓ ఆడిషన్‌కు వెళ్లింది. అక్కడ సెలక్ట్ అవడంతో జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన 'వళతు వశతె కల్లాన్' మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో చిన్న పాత్రే అయినా బాగా క్లిక్ అయింది. దాంతో జీతూ జోసెఫ్ ఆమెకు దృశ్యం 3లో ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో డాక్టర్ శ్రద్ధా గోకుల్ నర్సుగా కనిపించింది.యాక్టింగ్, మెడిసిన్.. రెండింటినీ వదిలేయాలని లేదు. డెర్మటాలజీ విభాగంలో పీజీ చేయాలనుంది. దానికోసం ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నాను. అలాగే నాకు డ్యాన్సింగ్, యాక్టింగ్ రెండూ చాలా ఇష్టం. మంచి అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను.- శ్రద్ధా గోకుల్ View this post on Instagram A post shared by Shraddha Gokul (@shraddhagokul) చదవండి: కుటుంబమంతా చనిపోవాలనుకున్నాం.. ఒంటిపై కిరోసిన్ పోశా..: శివకుమార్ -
ఈ గుండెని తాకిపో తాతా: తారక్ ఎమోషనల్ పోస్ట్
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు 103వ జయంతి నేడు (మే 28). ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవడు, హీరో జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. కాసేపు అక్కడే కూర్చుని తాతతో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వీడియో వైరల్జూనియర్ ఎన్టీఆర్ రాక నేపథ్యంలో అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని హీరోకు షేక్ హ్యాండ్ ఇవ్వబోయి కిందపడ్డాడు. దీంతో తారక్.. అతడిని పైకి లేపి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.గుండె తల్లడిల్లుతోందిజూనియర్ ఎన్టీఆర్.. తాతను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలోనూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను' అంటూ ఓ పోస్ట్ షేర్ చేశారు. pic.twitter.com/eQQ1DFqBdu— Jr NTR (@tarak9999) May 28, 2026 He cares. 🥹❤️ pic.twitter.com/J5HpAai5Lh— appie 🎀 (@fizz_nandamuri) May 28, 2026 -
ఆ హీరోయిన్ల కాళ్లు పట్టుకున్న ఊర్వశి.. ఇక చాలు!
సెలబ్రిటీలకు ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉంటుంది. ఎవరి హీరో/ హీరోయిన్ వారికి గొప్ప! అయినా మా అభిమాన తారయే గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో రకరకాల పోస్టులు, ఫోటోలు, వీడియోలు పెడుతూ ఉంటారు. అలా ఏఐ (కృత్రిమ మేధ) సాయంతో సృష్టించిన ఫోటో ఒకటి బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కంటపడింది.ఆ హీరోయిన్ల కాళ్లకు నమస్కరిస్తూ..అందులో ఐశ్వర్యరాయ్‌ను గ్లోబల్ బ్యూటీగా పేర్కొనగా ఆ తర్వాతి కేటగిరీలో దీపిక పదుకొణె, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్ ఉన్నారు. చివరగా ఆలియా భట్, కరీనా కపూర్, కత్రినా కైఫ్, ఊర్వశి రౌతేలా ఉన్నారు. చిట్టచివరి కేటగిరీలో ఉన్న వీళ్లందరూ తమపై ఉన్న హీరోయిన్ల ముందు మోకరిల్లి వారి పాదాలు నమస్కరిస్తున్నట్లుగా ఫోటో సృష్టించారు. ఈ ఫోటోపై ఊర్వశి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. విషం చిమ్మడం ఆపండి'ప్రతి నటికి తనకంటూ సొంత జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో ఎంతో కష్టపడుతుంది. అలాంటి మహిళల్ని పోలుస్తూ ఫ్యాన్ వార్ సృష్టించడం వల్ల ఒరిగేదేం ఉండదు. అది కేవలం నెగెటివిటీని మాత్రమే వ్యాపింపజేస్తుంది. దానికి బదులుగా టాలెంట్‌ను గుర్తించండి, ఎదుగుదలను ప్రోత్సహించండి, దయతో ప్రవర్తించడం నేర్చుకోండి. ఇలా విషం చిమ్మడం ఆపేయండి' అని ఊర్వశి కోరింది. ఇది చూసిన అభిమానులు.. నటీనటులకు ఇలా ర్యాంకింగ్ ఇస్తూ ఒకర్ని తక్కువ, మరొకర్ని ఎక్కువ చూడం కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు. ఐటం సాంగ్స్‌తో పాపులర్ఎవరి ప్రతిభ వారిదేనని, ఇలా పోల్చడం మంచిది కాదని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఊర్వశి రౌతేలా.. నటిగా కన్నా ఐటం సాంగ్స్‌తోనే ఎక్కువ ఫేమస్ అయింది. ఈమె తెలుగులో 'వాల్తేరు వీరయ్య' మూవీలో 'బాసూ.. వేర్ ఈజ్ ద పార్టీ', ఏజెంట్లో 'వైల్డ్ సాలా', 'బ్రో'లో 'మై డియర్ మార్కండేయ', 'స్కంద'లో 'కల్ట్ మామా' సాంగ్స్‌లో హుషారుగా స్టెప్పులేసింది. చివరగా జాట్ మూవీలోనూ 'టచ్ కియా' పాటలో అదరగొట్టింది.చదవండి: పాతిక వేల సాయం.. దాని విలువ ఇప్పుడు రూ.5 కోట్లు: దర్శకుడు -
'కరుప్పు' రిజెక్ట్ చేసిన విజయ్‌కు థాంక్స్.. ఎందుకంటే?
స్టార్ హీరో సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది కరుప్పు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో త్రిష కథానాయిక. ఈ చిత్రం తెలుగులో వీరభద్రుడు పేరిట విడుదలైంది. ఇక ఈ సినిమా కోసం తొలుత హీరో విజయ్ను అనుకున్నానని డైరెక్టర్ గతంలోనే చెప్పాడు. 2021లోనే విజయ్ను కలిసి కథ చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు వీలైతే వెంటనే షూటింగ్ మొదలుపెట్టేద్దాం అన్నారు. వర్కవుట్ కాలేకానీ, అంత హడావుడిగా సినిమా స్టార్ట్ చేయలేనని బాలాజీ వెనకడుగు వేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలుసుకున్నారు కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. పైగా విజయ్ తననుంచి ఫ్యామిలీ స్టోరీ ఆశించాడని, అయినప్పటికీ కరుప్పు కథ నచ్చడం తనకు చాలా సంతోషంగా అనిపించిందన్నాడు. తాజాగా మరోసారి ఈ విషయం గురించి బాలాజీ ఓపెనయ్యాడు. రాజకీయాల్లోకి వెళ్లడంతో..నిజానికి ఈ మూవీనే విజయ్ చివరి సినిమా అయ్యుండేది. మేము రెండుమూడుసార్లు చర్చలు కూడా జరిపాం. ఏది తన చివరి చిత్రం అయితే బాగుంటుందని మాట్లాడుకున్నాం. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమా నుంచి తప్పుకున్నారు. ఆయన చెప్పిన కారణాలు సమంజసంగా అనిపించాయి. సార్, మీ నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తాను. థాంక్యూ సో మచ్ అని చెప్పాను. ఆయన నాతో సినిమా చేయాలనుకోవడమే నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అది చాలు!అందుకే థాంక్స్తర్వాత నిర్మాతలు సూర్యను కలవమని అడిగారు. ఆయనకు కూడా స్క్రిప్ట్ ఎంతగానో నచ్చింది. సూర్య ఇచ్చిన చిన్నపాటి సలహాలతో కథలో కొంత మార్పులు చేసి సినిమా మీ ముందుకు తీసుకొచ్చాం. ఇకపోతే ఈ సినిమా కథ చెప్పినప్పుడు విజయ్ నన్ను కొన్ని ప్రశ్నలడిగారు. దానివల్లే కథను మరింత మెరుగుపర్చుకున్నాను. అందుకే విజయ్ సినిమా చేయకపోయినప్పటికీ అతడికి థాంక్స్ చెప్పాను అని తెలిపాడు. మే 15న విడుదలైన కరుప్పు రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.చదవండి: ఏజ్ బార్ అంటూ కామెంట్స్.. నటి కౌంటర్ -
పాతిక వేల సాయం.. ఇప్పుడు దాని విలువ రూ.5 కోట్లు
'ఎస్వీ కృష్ణారెడ్డిగారు లేకపోతే నేను దర్శకుడిగా ఎదిగేవాడిని కాదు' అంటున్నాడు డైరెక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డి. ఈయన దర్శకత్వంలో శ్రీకాంత్, లయ జంటగా నటిస్తున్న చిత్రం 'మిస్టర్ మిడిల్ క్లాస్'. ఈ సినిమా టీజర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఇద్దర్నీ మర్చిపోలేనుఈ సందర్భంగా జి. నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మా అమ్మానాన్న తర్వాత నేను మర్చిపోలేని వ్యక్తులు ఇద్దరే.. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి.. వీరికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. కృష్ణారెడ్డి దగ్గర పని చేయకపోయుంటే నేను దర్శకుడిని అయ్యేవాడినే కాదు. నా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన చెప్తాను.. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాను. ఒకసారి డ్యామ్ ఎత్తేసరికి మా పంటపొలం కొట్టుకుపోయింది. పొలమంతా నీటమునిగింది. ఇప్పుడు దాని విలువ రూ.5 కోట్లుఆ సమయంలో నాకు ఎస్వీ కృష్ణారెడ్డి రూ.25 వేలు సాయం చేశారు. ఆ డబ్బు మా నాన్నకు ఇస్తే మళ్లీ పొలం బాగు చేయించాడు. ఆ 9 ఎకరాల పొలం నేడు రూ.5 కోట్లు విలువ చేస్తుంది అని చెప్పుకొచ్చాడు. మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా విషయానికి వస్తే ఇందులో గోవిందుడిగా రాజేంద్రప్రసాద్ కనిపించబోతున్నాడు.చదవండి: వయసు ముదిరిపోతోందని ట్రోల్స్.. గట్టి కౌంటర్ ఇచ్చిన నటి -
ఏజ్‌బార్ అయ్యావంటూ ట్రోల్.. ఏదీ శాశ్వతం కాదన్న నటి
పెళ్లి కచ్చితంగా చేసుకోవాలా? అంటే ఎవరిష్టం వారిది! అందులోనూ కొందరు సెలబ్రిటీలు వయసు దాటిపోతున్నా లెక్క చేయకుండా తమకు నచ్చినప్పుడే మ్యారేజ్ లైఫ్‌లో అడుగుపెడుతుంటారు. మరికొందరేమో పెళ్లి చేసుకోకపోతే జరిగే నష్టమేం లేదంటూ సింగిల్‌గానే బతికేస్తుంటారు. బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి చెల్లెలు, నటి షమితా శెట్టి కూడా 47 ఏళ్లొచ్చినా సింగిల్ లైఫ్‌యే బిందాస్ అంటూ బతికేస్తోంది.ఏజ్ షేమింగ్వారి మానాన వాళ్లు బతుకుంటే కొందరు అనవసరంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. అలా ఓ వ్యక్తి షమిత వయసును ఉద్దేశిస్తూ కించపరిచేలా మాట్లాడాడు. నువ్వు ముసలిదానివైపోతున్నావ్.. ఒకప్పటిలా లేవని హేళన చేశాడు. ఆ కామెంట్‌కు సోషల్ మీడియా వేదికగా కౌంటరిచ్చింది షమిత. అవును, కాలంతో పాటు అన్నీ మారుతుంటాయి. అందుకు నేను కూడా అతీతురాలిని కాదు. పెళ్లయ్యుంటే ఈపాటికి..జీవితంలో వయసు పెరిగేకొద్దీ మార్పులు జరగడం అనేది చాలా సహజసిద్ధమైన ప్రక్రియ. అందంతోపాటు ఏదీ శాశ్వతంగా ఉండదు. కానీ ఈ వయసులోనూ నేను చాలా ఫిట్‌గా, సంతోషంగా ఉన్నాను. అది ఆ దేవుడు ఇచ్చిన వరం.. నాకదే చాలు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. మరో నెటిజన్ ఆమె పెళ్లి గురించి ట్రోల్ చేశాడు. నువ్వు సరైన సమయంలో పెళ్లి చేసుకుని ఉండుంటే ఈపాటికి నీకు పిల్లలు పుట్టి నీ అంత అయ్యేవారు అని సెటైర్ వేశాడు. అన్‌ఫాలో చేయ్అందుకు షమిత స్పందిస్తూ.. అసలు మీరు పెళ్లి చేసుకుని ఏం సాధించారు? అయినా మీలాంటివారు మాలాంటి ఒంటరి మహిళల్ని ఎందుకు ఫాలో అవుతారు? మీ పురుషాధిక్య ఆలోచనల్ని మాపై రుద్దడానికా? మమ్మల్ని అవమానించడానికా? దయచేసి నాకో సాయం చేయు.. వెంటనే నన్ను అన్‌ఫాలో చేయు అని కోరింది. షమితా శెట్టి.. మొహబ్బతే, క్యాష్ వంటి పలు హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో 'పిలిస్తే పలుకుతా' మూవీలో కథానాయికగా నటించింది. హిందీ బిగ్‌బాస్ 3, 15వ సీజన్లలో పాల్గొంది. ద టెనంట్ (2023) సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది.చదవండి: ఆ ఆరు సినిమాల్లో పెద్ది ఫస్ట్ ప్లేస్: జగపతిబాబు -
డ్యూడ్ హీరోయిన్‌తో ప్రదీప్ మూవీ.. కాకపోతే ఓ ట్విస్ట్!
ఇప్పుడు దర్శకులు, నటులు నిర్మాతలుగా మారుతున్న తరుణం. విజయాలకు దూరమవుతున్న నటులు సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి సక్సెస్ అయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు. దర్శకులుగా ఉన్నత స్థాయికి చేరుకున్న వారు కూడా సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి తమ శిష్యులకు, ఇతర నూతన దర్శకులకు అవకాశాలు కల్పిస్తుంటారు. తాజాగా దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. 2019లో దర్శకుడిగా పరిచయమై రవిమోహన్ హీరోగా కోమాలి అనే చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టారు.హీరోగానూ సక్సెస్ఆ తరువాత హీరోగా రంగప్రవేశం చేసి స్వీయ దర్శకత్వంలో లవ్‌టుడే పేరుతో మూవీ చేసి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత డ్రాగన్ చిత్రంలో హీరోగా నటించి సంచలన విజయాన్ని అందుకున్నారు. అదే విధంగా ఈయన కథానాయకుడిగా నటించిన డ్యూడ్ ఘన విజయాన్ని సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నిర్మించిన ఎల్ఐకే చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. నిర్మాతగా..ఇకపోతే మళ్లీ మెగాఫోన్ పట్టుకొనేందుకు రెడీ అయిన ప్రదీప్ రంగనాథన్ తానే హీరోగా ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థలో చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన సడెన్‌గా సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి చిత్ర షూటింగ్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి దర్శకుడు ఎవరు? కథానాయకుడు ఎవరు? అన్న వివరాలు వెలువడలేదుగానీ హీరోయిన్గా మమితాబైజు నటిస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రదీప్ డ్యూడ్ మూవీలో మమిత హీరోయిన్ అన్న విషయం తెలిసిందే! -
త్వరలోనే హీరో అర్జున్ దాస్ పెళ్లి?
సౌత్‌లో తన గంభీరమైన గొంతు, సీరియస్ యాక్టింగ్‌తో విలన్‌గా, హీరోగా పలు కీలక పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ దాస్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన ఒక నటితో ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే రహస్యంగా నిశ్చితార్థం జరగబోతుందని ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలపై అర్జున్ దాస్ టీమ్ వెంటనే స్పందించింది. అర్జున్ దాస్ పెళ్లి గురించి వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని స్పష్టం చేసింది. అయితే ఇంతకుముందు ఆయనకు హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మితో ప్రేమ వ్యవహారం నడిచిందని, అనంతరం బ్రేకప్ కూడా జరిగిందంటూ రూమర్స్ వినిపించాయి. అయితే అందులో నిజం లేదని, తాము స్నేహితులం మాత్రమేనని ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది. అటు అర్జున్ కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా? అన్న ప్రశ్నకు అసలు పెళ్లే చేసుకోను అని బదులిచ్చాడు.ఆ సమయంలోనే దాదాపు నెల రోజుల పాటు తాను డిప్రెషన్లోకి వెళ్లిపోయానంటూ అర్జున్ దాస్ ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. దాంతో చాలామంది ఈ రెండింటినీ కలిపి చూశారు. అయితే వాటిపై ఎటువంటి అధికారిక క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఆ తర్వాత కొంత కాలానికి ఆ కథనాలు కాస్త సద్దుమణిగాయి. అయితే అంతలోనే ఇప్పుడు మరో నటితో అర్జున్ దాస్ పెళ్లి అంటూ ప్రచారం మొదలైంది. కానీ ఈసారి అతడి టీమ్ మాత్రం వెంటనే స్పందించి పుకార్లకు చెక్ పెట్టింది. హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమాతో అర్జున్ దాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ చిత్రం తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం సౌత్‌లో మోస్ట్ బిజీ ఆర్టిస్టుగా అర్జున్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
ఒక్కొక్కర్ని కొడతాను చూడు.. మాస్ యాక్షన్‌లో సమంత
సమంత లాంగ్ గ్యాప్ తర్వాత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సమంత భర్త రాజ్ నిడిమోరు క్రియేట్ చేశారు. నేడు ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇక ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సమంత పెద్దగా మాట్లాడలేదు. తన టీమ్‌కి ఎక్కువ అవకాశమిచ్చింది. తాను మాట్లాడిన కొన్ని మాటలు కూడా ఇంగ్లీష్‌లోనే మాట్లాడింది. ఈ సినిమాపై ప్రేక్షకుల స్పందనకు ధన్యవాదాలు తెలిపింది. అనంతరం తన భర్త రాజ్ గురించి మాట్లాడుతూ 'రాజ్‌తో ఇప్పటివరకు ఎలాంటి వాదన జరగలేదు. ఆయన చాలా పర్ఫెక్ట్' అని ప్రశంసించింది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి హీరోయిన్ చేసే పోరాటం, సాహసాలు ప్రధానంగా చూపించారు. సమంతకు ప్రత్యేకమైన బ్యాక్‌స్టోరీ కూడా జోడించారు. యాక్షన్ సీన్స్‌లో సమంత తన స్టంట్స్‌తో ఆకట్టుకుంది. 'ఒక్కొక్కర్ని కొడతాను చూడు.. ప్రేమతో అబ్బా' అనే డైలాగ్ ట్రైలర్లో బాగా పేలింది.ఈ చిత్రానికి సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలం ఇచ్చింది. ట్రైలర్ ద్వారా సినిమా కథ ఎలా ఉంటుందో దాదాపుగా స్పష్టమైంది. ఇక మిగిలిన ఆసక్తికరమైన మలుపులు వెండితెరపై చూడాల్సిందే. -
స్టార్ హీరోలకు అచ్చొచ్చిన త్రిష.. వాళ్లందరికీ లక్కీ ఛార్మ్!
హీరోయిన్ త్రిషకు 43 ఏళ్ల వయసొచ్చినా అందం, చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. కొత్త హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. తాజాగా కరుప్పుతో బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అయితే కొంతకాలంగా త్రిష పేరు అటు రాజకీయాల్లో, ఇటు ఫిల్మీదునియాలో మారుమోగిపోతోంది. హీరో విజయ్- త్రిష ప్రేమలో ఉన్నారని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది.లక్కీ చార్మ్ఇటీవల విజయ్ భార్యతో విడాకులకు సిద్ధపడటం.. సీఎంగా గెలిచాక త్రిషతో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఈ ప్రేమాయణం నిజమని అందరికీ అర్థమైపోయింది. పైగా తను కూడా రాజకీయాల్లో అడుగుపెడుతుందని మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే తమిళ స్టార్ హీరోలకు త్రిష బాగా అచ్చొచ్చిందట. అందుకు కారణం.. విజయ్, అజిత్, సూర్యల కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో తనే హీరోయిన్. ఈ ఆసక్తికర విషయాన్ని ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాన్ని త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తిరిగి పంచుకుంది.విజయ్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం 'లియో'. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో త్రిష కథానాయిక. 2023లో దసరాకి ముందు విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.600 కోట్లకు పైగా రాబట్టి విజయ్ కెరీర్లో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డుకెక్కింది.అజిత్: హీరో అజిత్ 'గుడ్బ్యాడ్ అగ్లీ' ద్వారా తన కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు. 2025లో విడుదలైన ఈ సినిమాలోనూ త్రిషయే కథానాయిక. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది.సూర్య: కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న సూర్య ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'కరుప్పు'. ఈ ఏడాది మే 15న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ.250 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇందులోనూ త్రిషయే కథానాయిక. అలా త్రిష నటించిన పై మూడు సినిమాలు భారీ కలెక్షన్ల రికార్డులతో ఆయా హీరోల కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. దీంతో ఆమెను లక్కీ ఛార్మ్ అని కొనియాడుతున్నారు.చదవండి: 30 ఏళ్ల తర్వాత ఆపద్బాంధవుడు హీరోయిన్ రీఎంట్రీ -
30 ఏళ్ల తర్వాత ఆపద్బాంధవుడు హీరోయిన్ రీఎంట్రీ
ఒకప్పుడు తన అందంతో, హావభావాలతో, అద్భుతమైన డ్యాన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది మీనాక్షి శేషాద్రి. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన ఈమె తెలుగులో చిరంజీవి సరసన 'ఆపద్బాంధవుడు' చిత్రంలో నటించింది. అవురా అమ్మకు చెల్ల పాటలో ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అయితే మీనాక్షి పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేసి అమెరికా వెళ్లిపోయింది. 30 ఏళ్ల తర్వాత స్వదేశానికి..అక్కడ డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేసి ఎంతోమందికి నాట్యం నేర్పించింది. దాదాపు 30 ఏళ్లపాటు అమెరికాలో ఉన్న ఈ నటి కొన్ని నెలల క్రితమే భారత్‌కు తిరిగి వచ్చేసింది. తనకు సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుందన్న కోరికను మీనాక్షి శేషాద్రి ఆమె సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. 'నన్ను అభిమానిస్తున్న అందరికీ నమస్కారం.. మీ ప్రేమానురాగాలకు, మీరు అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు. 30 ఏళ్ల తర్వాత నా కర్మభూమికి తిరిగొచ్చేశాను.అలాంటి పాత్రలు చేయాలనుందిఇప్పుడు ముంబైలో ఉంటున్నాను. సానుకూల దృక్పథం, ఆశ, ప్యాషన్‌తో మరోసారి చలనచిత్రపరిశ్రమలో అడుగుపెడుతున్నాను. చిన్న, పెద్ద, ప్రధాన పాత్ర అని తేడా లేకుండా మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. సినిమాలతో పాటు ఓటీటీ షోలు, వెబ్‌సిరీస్‌లైనా చేసేందుకు రెడీగా ఉన్నాను. చాలెంజింగ్ రోల్స్ చేయాలనుంది. నేను భారత్ తిరిగి వచ్చాక అనేక ఆఫర్లు వచ్చాయి. ఏదో నిరూపించుకోవాలని కాదుకానీ అందులో కొన్ని ఏమంత ఎగ్జయిటింగ్‌గా లేవు. మరికొన్నేమో ముందుకు కదల్లేవు. అయినా సరే ఎటువంటి టీమ్, ఏజెన్సీ లేకుండా నేనే అంతా మేనేజ్ చేసుకుంటున్నాను. నేను ఏదో నిరూపించుకోవడానికి రీఎంట్రీ ఇవ్వడం లేదు. నా కుటుంబసభ్యుల ఎంకరేజ్మెంట్ వల్లే ఇక్కడున్నాను. నాకు సంతోషాన్నిచ్చేదే సినిమా.. అందుకే మళ్లీ ఇండస్ట్రీలో భాగం అవాలని కోరుకుంటున్నాను' అని నటి చెప్పుకొచ్చింది.కెరీర్మీనాక్షి శేషాద్రి హిందీలో.. హీరో, పైసా యే పైసా, దిల్వాలా, స్వాతి, జుర్మ్, దామిని, గంగా జమున సరస్వతి వంటి అనేక చిత్రాల్లో నటించింది. చివరగా స్వామి వివేకానంద (1998) బయోపిక్‌లో కనిపించింది. ఆ తర్వాత ఘాయల్: వన్స్ ఎగైన్ మూవీలో ఫ్లాష్‌బ్యాక్‌లో తళుక్కుమని మెరిసింది. మరి మీనాక్షి ఇప్పుడెలాంటి సినిమాలు ఎంపిక చేసుకుంటుందో చూడాలి!చదవండి: కదిలే రైలుపై నేను, విజయ్.. ఆరోజు చనిపోయేవాళ్లం: విలన్ -
హీరోయిన్ ఇంట పెళ్లి సంబరాలు..
మలయాళ హీరోయిన్ రజిషా విజయన్ తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే! రవితేజ రామారావు ఆన్ డ్యూటీలో రజిషా కథానాయికగా నటించింది. తెలుగులో డబ్ అయిన కర్ణన్, జై భీమ్, సర్దార్, బైసన్ వంటి చిత్రాలతోనూ ఇక్కడ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సర్దార్ 2లో నటిస్తోంది. తాజాగా తను ఓ శుభవార్త చెప్పింది. హీరోయిన్ ఇంట పెళ్లి వేడుకతన సోదరి అంజూష పెళ్లిపీటలెక్కినట్లు వెల్లడించింది. అచ్యుతన్ సురేశ్‌ను పెళ్లాడినట్లు తెలిపింది. ఈ మేరకు పెళ్లికూతురితో కలిసి దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కళ్లు మూసి తెరిచేలోపే నా చిన్నపాప పెళ్లికూతురైపోయింది. నువ్వెప్పటికీ నా కుందనపుబొమ్మవే.. అని క్యాప్షన్ ఇచ్చింది.కెరీర్కేరళకు చెందిన విజయన్- షీల దంపతుల కూతుర్లే రజీషా, అంజుషా. రజీషా విజయన్ టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించింది. అనురాగ కరిక్కిన్ వేళ్లం చిత్రంతో మలయాళ వెండితెరపై కథానాయికగా పరిచయమైంది. ఈ మూవీకిగానూ ఉత్తమనటిగా కేరళ ఫిలిం అవార్డు గెలుచుకుంది. జూన్, కళంకావల్, మస్కిష్క మరణం.. ఇలా మలయాళంలో అనేక సినిమాలు చేసింది. View this post on Instagram A post shared by Rajisha Vijayan (@rajishavijayan) View this post on Instagram A post shared by Sajith & Sujith (@sajithandsujith) చదవండి: ఆరోజు ఏమాత్రం తేడా వచ్చినా నాతోపాటు విజయ్ ప్రాణాలు పోయేవి: విలన్ -
ఆరోజు ఏమాత్రం తేడా వచ్చినా విజయ్, నేను చనిపోయేవాళ్లం!
సినిమాల్లో కామెడీ, డ్యాన్సులే కాదు యాక్షన్ సీన్లు కూడా ఉంటాయి. ఈ ఫైట్ సీన్ల కోసం హీరో, విలన్లు కొన్నిసార్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి షూట్ చేస్తుంటారు. అలాంటి ఓ సంఘటనను విలన్ అభిమన్యు సింగ్ గుర్తు చేసుకున్నాడు. ఈయన తెలుగులో రక్తచరిత్ర, గబ్బర్‌సింగ్, పండగ చేస్కో, అమర్ అక్బర్ ఆంటోని, ఓజీ వంటి చిత్రాల్లో నటించాడు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశాడు.కేరళలో ఫైట్ సీన్తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమిళంలో నా మొదటి సినిమా విజయ్ హీరోగా నటించిన వేలాయుధం (2011). ఈ మూవీలోని ఓ ఫైట్ సీన్ కోసం మేము ఆరు గంటలపాటు ప్రయాణించి కేరళలోని కోయంబత్తూరు వెళ్లాం. అక్కడ చిన్న హోటల్లో బస చేశాం. అక్కడినుంచి సుమారు గంటన్నరపాటు ప్రయాణిస్తే ఒక చిన్న రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడే మా షూటింగ్.. అప్పటికే ఒక రైలును రెడీ చేసి పెట్టారు. కదిలే రైలుపై..ఆరు రోజులపాటు ఫైట్ సీన్ షూట్ జరిగింది. ఏడో రోజు రైలుపై ఎక్కి పోట్లాడుకునే సీన్ చిత్రీకరించాలి. రైలు పట్టాలపై ఆగి ఉన్నప్పుడు దానిపై ఎక్కి విజయ్, నేను రిహార్సల్స్ చేశాం. కెమెరా ఆన్ చేయగానే రైలు కదులుతుందన్నారు. నాకు భయమేసింది. కదిలే ట్రైన్‌పై మనమెలా ఫైట్ చేయగలమని అడిగాను. అందుకతడు.. మనం పోట్లాడుకోం, ఒకరినొకరు కాపాడుకుంటాం అని బదులిచ్చాడు. చూస్తుండగానే రైలు వేగం పుంజుకుంది.గుండె ఆగిపోయినంత పని!70-80 కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. మా ఇద్దరితోపాటు కెమెరామెన్ ఒక్కడే ఉన్నాడు. ఇంతలో ఎదురుగా బ్రిడ్జి కనిపించింది. అప్పుడు నా గుండె అరచేతిలోకి వచ్చింది. పొరపాటున కాలు జారితే 2500 అడుగుల లోయలో పడి చనిపోవడం ఖాయం. కాలు జారి పడేటప్పుడు మరో మనిషి చేయి పట్టుకుని లాగుతాం.. అప్పుడు విజయ్ ప్రాణాలకు కూడా ప్రమాదమే.. అదృష్టవశాత్తూ అలాంటిదేం జరగలేదు. విజయవంతంగా షూట్ పూర్తి చేశాం. ఆయన భయం లేకుండా..కానీ, నాకు వారం రోజులపాటు సరిగా నిద్రపట్టలేదు. ఏదైనా జరగరానిది జరిగి ఉంటే అన్న ఊహే నా వెన్నులో వణుకు పుట్టించింది. అదే సమయంలో విజయ్ వంటి స్టార్ హీరో ఏమాత్రం భయం లేకుండా, సేఫ్టీ చర్యలు తీసుకోకుండా ధైర్యంగా ఉంటే నేనెందుకు ఇంతలా వణికిపోతున్నాను అనిపించింది. ఏదేమైనా ఆరోజు చావు అంచుల నుంచి మేమిద్దరం తప్పించుకున్నాం అని అభిమన్యు సింగ్ చెప్పుకొచ్చాడు.చదవండి: నన్ను చెప్పుతో కొట్టాడు.. ఆ అవమానం వల్లే..: బండ్ల గణేశ్ -
ఇండస్ట్రీలో పెద్దమనిషి నన్ను చెప్పుతో కొట్టాడు: బండ్ల గణేశ్
కమెడియన్‌గా, నిర్మాతగా టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు బండ్ల గణేశ్. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అతడు ఇటీవలే రీఎంట్రీ ప్రకటించాడు. చిరంజీవి- బాబీ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లు వెల్లడించాడు. అలాగే నిర్మాతగానూ సినిమాలు చేయనున్నట్లు తెలిపాడు. తాజాగా నటుడు రాజా రవీంద్ర పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న బండ్ల గణేశ్ ఒక చేదు సంఘటన తన జీవితాన్ని ఎలా మార్చిందో చెప్పుకొచ్చాడు.ఘోరమైన అవమానంబండ్ల గణేశ్ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో ఒక పెద్దమనిషి నన్ను ఎంతో అవమానించాడు. ఆ సంఘటన నా జీవితాన్నే మలుపు తిప్పింది. ఆయన మంచి వ్యక్తే.. కానీ ఆరోజు ఎందుకలా చేశాడో తెలీదు. అయితే ఆయన కోపమే నాకు వరంగా మారింది. అసలేం జరిగిందంటే.. ఆ రోజు హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య చనిపోయింది. నేను, ఇంకో యాక్టర్ సెట్లో సాయంత్రం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. సారీ చెప్పినా..నేను ఊరికే కూర్చుని సార్.. సార్ అని పిలిచినందుకు ఆ పెద్ద మనిషి సడన్‌గా నన్ను చెప్పుతో కొట్టాడు. దేవుడి మీద ఒట్టు.. ఆయన ఏ టెన్షన్లో ఉన్నాడో కానీ చెప్పు తీసుకుని కొట్టాడు. రెండు రోజుల తర్వాత సారీరా.. ఏమనుకోకు, వేరేవాళ్ల మీద కోపం నీమీద చూపించాను అని సంజాయిషీ ఇచ్చుకున్నాడు. ఎంతైనా నేను బలహీనుడిని కాబట్టే కదా నాపై ప్రతాపం చూపించాడు.ఛాలెంజ్ఆరోజు ఆయనలా కొట్టిన వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. నా దగ్గర డబ్బు లేదనే కదా నన్ను చెప్పుతో కొట్టాడు.. ఆయన కంటే ఎక్కువ డబ్బు సంపాదించి చూపిస్తా.. లేకపోతే నా పేరు గణేశే కాదు అని నాకు నేనే సవాల్ విసురుకున్నాను. అలా నా జీవితాన్ని మార్చుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే బండ్ల గణేశ్ తక్కువకాలంలోనే సక్సెస్ఫుల్ నిర్మాతగా రాణించి కోట్లు కూడబెట్టాడు.చదవండి: మళ్లీ సినిమాల్లోకి ఉదయనిధి స్టాలిన్? -
అందుకే ఆ హీరోకు తల్లిగా నటించా: భాగ్యశ్రీ
హీరోలకు ఎంత వయసొచ్చినా హీరో పాత్రలు చేస్తూనే ఉంటారు. కానీ, హీరోయిన్ల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఒక వయసొచ్చాక లేదా పెళ్లయ్యాక వారికి వచ్చే ఆఫర్లు, పాత్రలు కాస్త భిన్నంగానే ఉంటాయి. అలా ఒకప్పటి హీరోయిన్ భాగ్యశ్రీ తాజాగా మరాఠి చిత్రంలో తనకంటే కాస్త చిన్నవాడైన హీరోకి తల్లిగా నటించింది.హీరోకు తల్లిగా..రితేశ్ దేశ్ ముఖ్.. మరాఠా కింగ్ శివాజీగా నటించిన తాజా చిత్రం 'రాజా శివాజీ'. ఇందులో శివాజీ తల్లి జీజాబాయిగా భాగ్యశ్రీ యాక్ట్ చేసింది. ఈ సినిమా రూ.100 కోట్లపైనే కలెక్షన్స్ రాబట్టింది. అయితే వయసులో తనకంటే కేవలం 10 ఏళ్ల చిన్నవాడైన హీరోకు తల్లిగా నటించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీని గురించి భాగ్యశ్రీ స్పందిస్తూ.. 'శివాజీ వంటి మహాయోధుల కథలను చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం. ఆ ప్రశంస మర్చిపోలేనుఅలాంటి సినిమాలో నటించే ఛాన్స్ వస్తే తిరస్కరించగలమా? పైగా జీజాబాయి కూడా యంగ్ మదరే! ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ సంతోశ్ శివన్ సర్ నన్ను పిలిచి.. సారీ, మీరు చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. అందుకని నా కెమెరాతో మిమ్మల్ని కాస్త వయసుపైబడినదానిలా చూపిస్తాను అన్నారు. ఆ ప్రశంస నా మనసును తాకింది' అని చెప్పుకొచ్చింది.సినిమారాజా శివాజీ సినిమా విషయానికి వస్తే.. రితేశ్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆయన భార్య జెనీలియాతో పాటు నిర్మాత జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఈ మూవీలో సంజయ్‌దత్, అభిషేక్ బచ్చన్, మహేశ్ మంజ్రేకర్, సచిన్ ఖేడ్కర్, ఫర్దీన్ ఖాన్, జెనీలియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. భాగ్యశ్రీ విషయానికి వస్తే.. 1989లో మైనే ప్యార్ కియా సినిమాతో వెండితెరపై కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. హిందీలో అనేక సినిమాలు చేసింది.చదవండి: కేన్స్ సంబరాలకు వీడ్కోలు -
90% మార్కులతో పాసైనా పొడిచేదేం లేదు: పూరీ జగన్నాథ్
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన ‘పూరీ మ్యూజింగ్స్’ తాజా ఎపిసోడ్లో ప్రస్తుత విద్యా విధానం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఫ్యూచర్ ఎడ్యుకేషన్' అనే అంశంపై మాట్లాడుతూ.. నేటి స్కూళ్లు పిల్లలపై అధిక ఒత్తిడి పెంచి వారిని డిప్రెషన్లోకి నెడుతున్నాయి. ప్రస్తుత విద్యావిధానం కేవలం మార్కులు, ఎగ్జామ్స్, కాంపిటీషన్ మీద దృష్టి పెట్టి విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. పిల్లలకు చిన్న వయసులోనే నైతిక విలువలు,సమయపాలన, సర్వైవల్ స్కిల్స్ నేర్పాలి. అలాగే డిజిటల్ డిసిప్లిన్, మెడిటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుత విద్యా విధానంలో 90% మార్కులు తెచ్చుకున్నా ఆ విద్యార్థికి జీవితంలో దాని ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ క్యారెక్టర్, మనోస్థైర్యం, సంస్కారం నేర్పితే వారు మంచి పౌరులుగా తయారవుతారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలను ప్రస్తావిస్తూ.. ప్రతి సంవత్సరం 13,000–15,000 మంది విద్యార్థులు అకాడమిక్ ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువు కంటే సంస్కారం ముఖ్యం. భవిష్యత్ విద్యావ్యవస్థ పిల్లలకు మనోస్థైర్యం, నైతిక విలువలు, స్వీయ నియంత్రణ నేర్పేలా ఉండాలని పూరీ జగన్నాథ్ కోరుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. పూరి-విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా చాలా కాలం క్రితమే మొదలు పెట్టారు. దానికి ‘స్లమ్ డాగ్ ’(Slum Dog) అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారు. కానీ దానికి సంబంధించిన ఎలాంటి గ్లింప్స్ లేదా ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటివరకు విడుదల కాలేదు. దాని తరువాత సూర్య – పూరి జగన్నాధ్ కాంబినేషన్ ఫైనల్ కావడం సినీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పూరి స్టైల్ లో సూర్యను ఎలా చూపిస్తారో, ఎలాంటి మాస్ ఎంటర్టైనర్ వస్తుందో చూడాలి. -
లుక్ కోసం ప్లాస్టిక్ సర్జరీ.. అవికా గోర్ ఏమన్నారంటే..?
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో చిన్న వయసులోనే స్టార్డమ్ అందుకున్న నటి అవికా గోర్. ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ..తొలి చిత్రంతోనే భారీ హిట్‌ని అందుకుంది. ఆ తర్వాత ఇక్కడ వరుస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. గతేడాదిలో పెళ్లి కూడా చేసుకుంది. అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ అవికాను ఇంకా ‘చిన్నారి పెళ్లికూతురు’గానే చూస్తారు. తాజాగా ఈ బ్యూటీ ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అందమైన లుక్ కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే పుకార్లపై స్పందించింది. లుక్ కోసం తాను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోలేదని స్పష్టం చేసింది.మొటిమల కోసం ట్రీట్మెంట్ తీసుకున్నాలుక్ కోసం నేనెప్పుడు ట్రీట్మెంట్ తీసుకోలేదు. నా జీవితంలో ఒకే ఒక్కసారి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నా. అది కూడా మొటిమలు పోగోట్టుకోవడానికి. టీనేజ్‌లో నా ముఖంపై చాలా మొటిమలు ఉండేవి. వాటిని తొలగించుకునేందుకు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నా. అది కూడా సరిగా వర్కౌట్ అవ్వలేదు(నవ్వుతూ). ఇప్పటికీ నా ముఖంపై మొటిమలు ఉన్నాయి. సర్జరీలు ఏం చేసుకోలేదు కానీ..స్కీన్ పాడవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నా. నేనే కాదు ప్రతి ఒక్క నటీనటులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. నేను 7 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చా. చిన్నప్పటి నుంచే మేకప్ వేసుకోవాల్సి వచ్చింది. అందుకే సన్‌స్క్రీన్ ఎక్కువగా వాడేదాన్ని.అమ్మ తిట్టేది.. లుక్ కోసం ట్రీట్మెంట్ కాదు..కనీసం నా హెయిర్ కట్ చేసుకుంటా అని చెప్పిన అమ్మ తిట్టేది. ఇక టాటూ వేసుకుంటా అన్నప్పుడు అయితే పెద్ద గొడవే జరిగింది. అలాంటిది నేను లుక్ కోసం ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటా? వయసు పెరిగేకొద్ది మన ముఖంలో మార్పులు వస్తాయి. నేను చిన్నప్పటి నుంచే అందరికి తెలియడంతో పెద్దయ్యాక నా ముఖంలో వచ్చిన మార్పులు చూసి సర్జరీ చేయించుకుందనే పుకార్లను సృష్టించారు. అంతేకాదు నేను బరువు పెరిగి తగ్గడం వల్ల కూడా ఇలాంటి పుకార్లకు కారణం అయింది. అందులో ఏమాత్రం వాస్తవం లేదు’ అని అవికా స్పష్టం చేసింది. -
హీరో పక్కన నీ ఏడుపేంటి?.. దృశ్యం నటిపై ట్రోలింగ్
ఎస్తర్ అనిల్.. మలయాళంలో అనేక సినిమాలు చేసినప్పటికీ దృశ్యం నటిగానే ఎక్కువ ఫేమస్. దృశ్యం మూడు భాగాల్లోనూ హీరో చిన్న కూతురిగా నటించింది. మలయాళంతో పాటు తెలుగు దృశ్యం మూవీలోనూ యాక్ట్ చేసింది. ఇకపోతే మోహన్‌లాల్ దృశ్యం 3 ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే! ఈ సినిమా ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఏడ్చేసిన దృశ్యం నటిఇక సినిమా రిలీజైనరోజు చిత్రయూనిట్ థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకుల రెస్పాన్స్ కళ్లారా చూసింది. ఈ సమయంలో మోహన్‌లాల్ పక్కనే కూర్చున్న ఎస్తర్ సంతోషంతో ఏడ్చేసింది. తనకు తెలియకుండా వస్తున్న కన్నీళ్లను తుడుచుకునే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వీడియో కింద ఓ నెటిజన్ ఎస్తర్‌కు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. నటి కౌంటర్డియర్.. ఆయన కెరీర్లో ఇలాంటివి చాలా చూశాడు.. ఇంతకంటే పెద్ద విజయాలు కూడా అందుకున్నాడు. కానీ, నువ్వేంటి? ఆయన పక్కన ఇలా ఏడుస్తూ కూర్చున్నావ్? అని సెటైర్ వేశాడు. ఈ కామెంట్ ఎస్తర్ కంట పడింది. దాన్ని అలాగే చూసి వదిలేయలేదు. మధ్యలో నీకేంటి సమస్య? అని రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు అతడికి బాగా బుద్ధి చెప్పావ్ అని నటికి సపోర్ట్ చేస్తున్నారు.చదవండి: 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఎవరూ గుర్తుపట్టట్లే.. ఇంకెందుకు బతకడం?: నటి -
ఎవరూ గుర్తుపట్టట్లేదు, ఇంకెందుకు బతికున్నా?: నటి ఆవేదన
ఒకప్పుడు చేతినిండా అవకాశాలతో బిజీగా ఉండి ఇప్పుడు ఒక్క ఛాన్స్ కోసం చెప్పులరిగేలా తిరుగుతోంది బుల్లితెర అనిత కన్వాల్. ఒకప్పుడు సక్సెస్‌ను ఎంజాయ్ చేసిన నటి ఇప్పుడీ సైలెన్స్‌ను భరించలేకపోతోంది. బనేగి ఆప్నీ బాత్, సోన్‌పరి, సాసురాల్ జెండా పూల్ వంటి సీరియల్స్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు బుల్లితెర ఇండస్ట్రీలో రాణించింది. అదే బాధతాజాగా ఆమె తన కష్టాలను ఓ ఇంటర్వ్యూలో ఏకరువు పెట్టింది. అనిత కన్వాల్ మాట్లాడుతూ.. 'నలభై ఏళ్లు ఇక్కడ పని చేశానన్నమాటే కానీ నన్నెవరూ గుర్తుపట్టడం లేదు. అదే బాధగా అనిపిస్తూ ఉంటుంది. అయినా ఆడిషన్లకు వెళ్తున్నాను. నా పేరు అనిత కన్వాల్.. మీరెవరూ పుట్టకముందు నుంచే నేను ఈ ఇండస్ట్రీలో యాక్ట్ చేస్తున్నాను అని నా గురించి పరిచయం చేసుకోగానే అందరూ సైలెంట్ అయిపోతున్నారు. నా ఇగో పక్కనపెట్టి మరీ ఆడిషన్స్ ఇస్తున్నాను. నా టైం బాగోలేదేమో!కానీ ఎవరూ నన్ను సెలక్ట్ చేసుకునేందుకు ఇష్టపడటం లేదు. గతంలో టీవీలో ఎక్కువ కనిపించావు అన్న సాకు చెప్పేవారు. కానీ ఇప్పుడు టీవీలోనూ కనిపించక ఎనిమిదేళ్లవుతోంది. అయినా ఇప్పుడు బుల్లితెరపై పనిచేసేవాళ్లంతా ఓటీటీ ప్రాజెక్టుల్లోనూ భాగమవుతున్నారుగా! బహుశా నా టైమ్ బాగోలేనట్లుంది. ఒకేసారి 13 సీరియల్స్ చేసిన రోజులున్నాయి. అలాంటి నన్ను అందరూ మర్చిపోయారు. ఎందుకు బతికున్నా?అసలు నేనెందుకు బతికున్నాను? అని కూతురితో చెప్పుకుంటూ బాధపడ్డాను. టీవీలో ఎన్నో రకాల పాత్రలు చేశాను, ఎన్నో అవార్డులు పొందాను. కానీ, ఇప్పుడు ఖాళీ చేతులతో నిలబడ్డాను. నాపై నాకే అసహ్యం వేస్తోంది. నాకు వయసు పెరిగింది, ఒప్పుకుంటాను. కానీ నాకేమీ పడుచు పిల్ల పాత్ర ఇవ్వమని అడగడం లేదుగా.. 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రలే ఇవ్వమంటున్నాను. నా వయసులో ఉన్నవాళ్లందరికీ పని దొరుకుతున్నప్పుడు నాకెందుకివ్వరు?దేవుడిని తీసుకెళ్లిపోమంటున్నా..నేను దేనికీ పనికారానా? అన్న ఆత్మనూన్యతా భావం నాలో ఎక్కువవుతోంది. అప్పుడప్పుడు ఆ దేవుడిని నన్ను తీసుకెళ్లిపోమని వేడుకుంటున్నాను. నేను చాలా ప్రొఫెషనల్. 40 ఏళ్ల కెరీర్లో ఎన్నడూ సెట్‌కు లేట్‌గా వెళ్లలేదు. మా అమ్మ చావుబతుకుల మధ్య ఉంటే కూడా నేను షూటింగ్ చేశాను. నా సీన్ పూర్తి చేసుకుని హాస్పిటల్ వెళ్లాను. అలాంటి నాకు ఇలాంటి దుస్థితి వచ్చింది' అని అనిత చెప్పుకొచ్చింది. ఈ నటి.. గీతాంజలి, కబీ హా కబీ నా, ముజ్సే దోస్తీ కరోగే, ద హ్యాంగ్‌మ్యాన్ వంటి చిత్రాల్లోనూ నటించింది.చదవండి: ఇద్దరు భామలతో రామ్‌చరణ్ ఐటం సాంగ్ -
నువ్వు లేని లోటు ఎవరూ భర్తీ చేయలేరు: నాగ్ ఎమోషనల్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. డబ్బింగ్ చిత్రాల నిర్మాత, నెల్లూరు డిస్ట్రిబ్యూర్ గుజ్జలపూడి హరి (46) గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్‌గా హరి ఎన్నో సినిమాలను పంపిణీ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది ఆయనే!డబ్బింగ్ సినిమాలువిశాల్, తమన్నా జంటగా నటించిన ఒక్కడొచ్చాడు చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. విశాల్ తమిళంలో నిర్మించిన పలు సినిమాలను తెలుగులో 'హరి వెంకటేశ్వర పిక్చర్స్' బ్యానర్‌పై విడుదల చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, శ్రేష్ఠ మూవీస్‌కు చెందిన పలు చిత్రాలను నెల్లూరులో పంపిణీ చేశారు.25 ఏళ్లకు పైగా పరిచయంహరి మరణంపై హీరో నాగార్జున విచారం వ్యక్తం చేశాడు. 'హరి మరణవార్త విని షాకయ్యాను. ఆయన ఇక లేడన్న విషయం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. మా పరిచయం 25 సంవత్సరాలకు పైగా సాగింది. అక్కినేని కుటుంబానికి ఆయన ఒక పిల్లర్‌లా అండగా నిలబడ్డారు. మా జీవితాల్లో ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరు. తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక మంచి మనిషిని, గొప్ప డిస్ట్రిబ్యూటర్ను కోల్పోయింది' అని ట్వీట్ చేశాడు. Deeply saddened and shocked lby the passing of Gujjalapudi Hari Kumar. Our association goes back over 25 years, A pillar of support for the Akkineni family, his presence will be irreplaceable in our lives.The Telugu film industry has lost a fine distributor and a wonderful soul.… pic.twitter.com/CcxEEwyLoe— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 24, 2026 చదవండి: క్షమాపణలు చెప్పిన రామ్‌చరణ్ -
ఇద్దరు భామలతో 'పెద్ది' స్టెప్పులు.. ఐటం సాంగ్ చూశారా?
రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయిక. బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీ నుంచి వరుస సర్ప్రైజ్లు వదులుతున్నారు. మొన్న ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత స్పెషల్ సాంగ్ 'హల్లల్లల్లో హల్లో..' ప్రోమో వదిలారు. తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇద్దరు హీరోయిన్లతో డ్యాన్స్ఈ ఐటం సాంగ్‌లో శృతి హాసన్ స్పెషల్ అట్రాక్షన్‌గా మెరిసింది. ఇక పెద్ది.. అటు శృతి హాసన్‌తో, ఇటు జాన్వీ కపూర్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులేశాడు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా అనంత్ శ్రీరామ్ లిరిక్స్ సమకూర్చాడు. సింగర్ రక్షిత సురేశ్ ఎంతో హుషారుగా ఆలపించింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. ఇక పెద్ది విషయానికి వస్తే.. శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చదవండి: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్‌చరణ్ -
అందుకే ఛావా రిజెక్ట్ చేశా: బాలీవుడ్ నటుడు
గతేడాది వచ్చిన "ఛావా" సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసుకుంది. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ ఛత్రపతి శంబాజీ మహారాజ్‌గా, రష్మిక ఏసుబాయిగా ప్రధాన పాత్రల్లో నటించారు. అక్షయ్ ఖన్నా ఔరంగజేబు పాత్రలో మెప్పించాడు. అయితే ఔరంగజేబు రోల్‌కు అక్షయ్ మొదటి ఛాయిస్ కాదు, అతడి కంటే ముందు నటుడు రణ్‌దీప్ హుడాను సంప్రదించారు.అందుకే నో చెప్పా..ఈ విషయం గురించి రణ్‌దీప్ హుడా మాట్లాడుతూ.. అప్పటికే నేను స్వతంత్ర్య వీర్ సావర్కర్ సినిమా కోసం చాలా సన్నబడ్డాను. ఆ సమయంలో ఔరంగజేబు పాత్ర కోసం సరిపోతాననిపించలేదు. పైగా వీర్ సావర్కర్ సినిమాకు సంబంధించి ఓ కోర్టు కేసు కూడా ఎదుర్కొంటున్నాను. ఛావాలో హిందూ-ముస్లింకి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఈ కథలో ఇరుక్కుని ఇబ్బందులు పడాలనుకోలేదు, ఆ దారిలో అసలు నడవాలనుకోలేదు అని చెప్పాడు. ఇకపోతే లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఛావా చిత్రం రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.చదవండి: క్షమాపణలు చెప్పిన రామ్‌చరణ్ -
రెండేళ్ల కిందటే గ్రీన్ సిగ్నల్.. సూర్య కెరీర్లోనే అత్యధికం!
సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కరుప్పు (తెలుగులో వీరభద్రుడిగా విడుదలైంది). త్రిష హీరోయిన్గా నటించిన ఇందులో ఆర్జే.బాలాజీ ప్రతినాయకుడిగా నటించడంతో పాటు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. న్యాయస్థానం, అవినీతికి పాల్పడే న్యాయవాదులు, న్యాయం కోసం బాధితులు పడే అవస్థలు, గ్రామ దేవతలు ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందు చాలా ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంది. అంతేకాదు ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చింది. అయితే మూవీ రిలీజయ్యాక ఫస్ట్ షో నుంచే సక్సెస్ టాక్ తెచ్చుకుంది.సూర్య కెరీర్లోనే అత్యధికంమే 15న తెరపైకి వచ్చిన కరుప్పు చిత్రం వారం దాటినా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం వారం రోజుల్లోనే రూ.200 కోట్ల మైలురాయిని చేరుకుంది. అలాగే సూర్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డుకెక్కింది. సూర్య శనివారం ఈ చిత్ర విజయానందాన్ని మీడియాతో పంచుకున్నారు. రెండేళ్ల క్రితం అరగంట, ముప్పావు గంటలో తీసుకున్న నిర్ణయం ఈ చిత్రం. దర్శకుడు ఆర్జే.బాలాజీ విజన్యే ఈ సినిమా. ఇటీవలి కాలంలో జనం నుంచి ఇంత స్పందన చూడలేదు. రాజీ పడలేదుప్రతి చిత్రానికి ఏదో ఒక విమర్శ వస్తుంటుంది. అయితే ఈ చిత్రానికి అంతటా ప్రేమ మాత్రమే లభించడంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిర్మాతలు ఎస్ఆర్.ప్రకాశ్, ఎస్ఆర్.ప్రభు చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. పిల్లల నుంచి పెద్దలు వరకూ చూసి ఆనందించడంతో థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు పడుతుండటం ఆనందంగా ఉంది అన్నారు. #Karuppu MEGA BLOCKBUSTER 🔥🔥🔥🔥 @Suriya_offl ❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥 pic.twitter.com/CeTOaOdawY— RJ Balaji (@RJ_Balaji) May 21, 2026 చదవండి: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్‌చరణ్ -
క్షమాపణలు చెప్పిన రామ్‌చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ 'పెద్ది' సినిమా రిలీజ్ కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా, తాజాగా భోపాల్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్ నోరు జారడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడ్డాడు. దీంతో వెంటనే తన తప్పు సరిదిద్దుకుంటూ ఎక్స్ (ట్విటర్) వేదికగా క్షమాపణలు చెప్పాడు.ఏం జరిగింది?'పెద్ది కీ ఆవాజ్' పేరుతో భోపాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రామ్‌చరణ్, జాన్వీ కపూర్, ఏఆర్ రెహమాన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడున్న హోస్ట్ రామ్‌చరణ్‌తో ర్యాపిడ్ ఫైర్ ఆడించాడు. కొంతమంది క్రికెటర్ల పేర్లను ప్రస్తావిస్తూ వారి గురించి ఒక్కమాటలో చెప్పాలన్నాడు. అలా సచిన్, ధోని, కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ క్రికెటర్స్ గురించి ఒక్క లైన్లోనే పొగడ్తలు కురిపించాడు. చివరగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరు ప్రస్తావించాడు యాంకర్.వీడియో క్లిప్ వైరల్ఇక్కడే చరణ్ తప్పులో కాలేశాడు. 'నేను బుమ్రాకు పెద్ద అభిమానిని. నాకు ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. ఆయన మనదేశంలో ఫుట్‌బాల్ ఆటను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు' అని బదులిచ్చాడు. ఈ వీడియో క్లిప్పింగ్ నెట్టింట వైరల్‌గా మారింది. క్రికెటర్‌ను ఫుట్‌బాల్ ఆటగాడిగా పేర్కొనడంతో చరణ్‌ను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అటు హోస్ట్ కూడా ఈ తప్పిదాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడంతో అతడిపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.క్షమించండిదీంతో చరణ్ ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెడుతూ క్షమాపణలు చెప్పాడు. 'కొన్నిసార్లు నేను పేర్ల విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటాను. అంతమంది జనం, హడావుడి మధ్యలో అనుకోకుండా పొరపాటు దొర్లింది. అందుకు బుమ్రా గారిని క్షమించమని కోరుతున్నాను. నేను నిజంగా ఆయన ఆటకు వీరాభిమానిని. ఆయనపై నాకెంతో గౌరవం ఉంది. ఆయన సాధించిన విజయాలు ప్రతి భారతీయుడు గర్వించదగ్గవి' అని ట్వీట్ చేశాడు. Uff… I’m genuinely so forgetful with names sometimes.Apologies to @Jaspritbumrah93 Ji for the mix-up - it was a genuine human error in the middle of all the excitement and the crowd 🙏🏼I truly respect you and I am a huge fan of your game. You make every Indian feel proud when…— Ram Charan (@AlwaysRamCharan) May 23, 2026Context - pic.twitter.com/yK0YIH6V7d— Film Culture (@CinemasHive) May 23, 2026 చదవండి: ఈ సినిమా రిలీజ్లు ఎప్పుడు? -
అల్లు అర్జున్ కుమారుడికి స్టార్ క్రికెటర్ సర్ప్రైజ్ గిఫ్ట్
ఓ సినీమా స్టార్‌తో ఓ క్రికెట్ స్టార్ కలిసిన అరుదైన క్షణం అభిమానులను ఉత్సాహపరిచింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్‌ను కలిశారు. ఐపీఎల్(IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడుతున్న అయ్యర్‌ను బన్నీ అభినందించారు. వీరిద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ బన్నీ కుమారుడు అల్లు అయాన్‌కు ఓ ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇచ్చారు. తన సంతకంతో కూడిన క్రికెట్ జెర్సీని అయాన్‌కు బహుమతిగా అందించారు. ఇక ఈ గిఫ్ట్‌పై అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. వెంకటేశ్ అయ్యర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 'ప్రతిభావంతుడైన యువ భారత క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌ని ఈ రోజు కలవడం చాలా ఆనందంగా ఉంది. అల్లు అయాన్‌కు తన సంతకంతో కూడిన ప్రత్యేకమైన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చినందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ భవిష్యత్తు ప్రయత్నాలన్నింటికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ బన్నీ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline)ఈ భేటీతో అల్లు అర్జున్ అభిమానులు, క్రికెట్ లవర్స్ ఇద్దరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్స్‌తో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
చరణ్ డాన్స్‌తో వాటి అందం రెట్టింపు అయింది: ఏఆర్ రెహమాన్
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తున్నాయి. మొదట విడుదలైన “చికిరి.. చికిరి” పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించంది. “రయ్.. రయ్.. రారా” పాట కూడా భారీ హిట్ అయింది. తాజాగా విడుదలైన స్పెషల్ మాస్ సాంగ్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాటల్లో ఏదీ తన ఫేవరెట్ సాంగ్ కాదని ఈ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పష్టం చేశారు. ఎందుకంటే ఆయన అభిప్రాయం ప్రకారం, తనకు అత్యంత ఇష్టమైనవి ఈ చిత్రంలోని ఇంకా విడుదల కాని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లోని సాంగ్స్ అని తెలిపారు. ఈ సినిమాలో కీలకమైన రెండు మాంటేజ్ సాంగ్స్ ఉన్నాయట. వాటిలో ఒకటి అత్యంత ఎమోషనల్‌గా ఉంటుందని దర్శకుడు బుచ్చిబాబు కూడా ఓ ఇంటర్వూలో ధృవీకరించారు.రామ్‌చరణ్ గురించి రెహమాన్ మాట్లాడుతూ.. నేను పాటలు కంపోజ్ చేసినప్పుడు అవి బాగానే ఉన్నాయి. కానీ ఆ పాటలకు చరణ్ డాన్స్ చేసిన తర్వాత వాటి అందం రెట్టింపు అయింది. రీ-రికార్డింగ్ సమయంలో చరణ్ పెర్ఫామెన్స్ చూసి ఆశ్చర్యపోయాను. సినిమాలో బెస్ట్ పార్ట్ చరణ్ యాక్టింగ్ అని అన్నారు. కాగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'పెద్ది'లో జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంచి. -
పెళ్లయ్యాక సినిమాలకు దూరం.. విడాకుల తర్వాత రీఎంట్రీ
బుల్లితెర నుంచి వెండితెరకు ప్రయాణం సాగించినవారిలో హీరోయిన్ భామ ఒకరు. ఈమె అసలు పేరు రేఖిత ఆర్.కురుప్. నేడు (మే 23న) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..టీవీ నుంచి వెండితెరపైకి..కేరళలోని కొట్టాయం జిల్లాలో పుట్టి పెరిగింది భామ. డిగ్రీ వరకు చదువుకున్న ఈ బ్యూటీ మొదట బుల్లితెరపై మెరిసింది. సూర్య టీవీ ఛానల్లో తాళి అనే ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. తర్వాత ఓ ఆల్బమ్‌లోనూ యాక్ట్ చేసింది. సరిగ్గా అదే సమయంలో మలయాళ దర్శకుడు లోహితదాస్ ఆమెను చూశాడు. నివేద్యం సినిమాతో భామను కథానాయికగా పరిచయం చేశాడు. తెలుగులోనూ..ఫస్ట్ సినిమా క్లిక్ అవడంతో భామకు ఆఫర్లు క్యూ కట్టాయి. మలయాళంలో వరుస సినిమాలు చేసుకుంటూ పోయింది. అదే సమయంలో ఎల్లం అవన్ సేయల్ ద్వారా తమిళంలో, మొదలశాలతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మంచివాడు (2011) అనే ఒకే ఒక్క చిత్రంలో నటించింది. తనలో మంచి సింగర్ కూడా దాగుంది.సింగిల్ మదర్‌గా..2020లో వ్యాపారవేత్త అరుణ్ జగదీశ్‌ను పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలు పక్కనపెట్టేసింది. ఇంతలోనే ఈ జంటకు కూతురు గౌరి పుట్టింది. దంపతుల మధ్య విభేదాలు రావడంతో భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది. ప్రస్తుతం భామ సింగిల్ పేరెంట్‌గా కూతురిని పోషిస్తోంది. గతేడాది (2025) సుమతి వలవు చిత్రంతో సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.చదవండి: భర్తతో కలిసి ట్రోఫీ గెలిచిన వాసంతి -
నాగార్జునకు చిన్న కొడుకు సర్ప్రైజ్.. అదేంటో చూసేయండి!
మొదటి అడుగు ఎవరికైనా ప్రత్యేకమే.. కింగ్ నాగార్జున నటించిన మొదటి సినిమా విక్రమ్. ఈ మూవీ విడుదలై నేటి (మే 23)కి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తండ్రికి ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు చిన్న కుమారుడు, హీరో అఖిల్. అఖిల్ కథానాయకుడిగా నటించిన 'లెనిన్' మూవీ టీజర్ వదిలారు. ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.తండ్రికి సర్ప్రైజ్'నా సినీ జీవితం మొదలైన రోజు అఖిల్ నాకో చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు. చూస్తుంటే చాలా హాయిగా ఉంది. మీరూ చూడండి, మనోడు వస్తున్నాడు' అని రాసుకొచ్చాడు. లెనిన్ టీజర్ విషయానికి వస్తే.. 'ఏమంటివి ఏమంటివి...' అన్న ఎన్టీఆర్ డైలాగ్‌తో వీడియో మొదలైంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే రంగస్థల కళాకారిణిగా ఆ డైలాగ్‌ను స్టేజీపై చెప్తుంది. పల్లె పరిమళంఎన్టీఆర్ అంత కాకపోయినా బానే చెప్పావని మెచ్చుకున్నాడు హీరో అఖిల్. ఇద్దరూ పల్లెటూరి యాసలో డైలాగులు చెప్తూ మెప్పించారు. టీజర్ అయితే అదిరిపోయింది. ఈసారి అఖిల్ చాలా కొత్తగా ట్రై చేశాడని, హిట్టు గ్యారెంటీ అని అభిమానులు అప్పుడే ఫుల్ ఖుషీ అవుతున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 26న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు. Today, May 23rd నా సిని జీవితం మొదలైన రోజు Akhil నాకో చిన్న surprise ఇచ్చాడు చూస్తుంటే చాలా హాయి గా ఉంది మీరు చూడండి. 👉🏽 https://t.co/QG2BFis2XTమనోడు వస్తున్నాడు…. #ManoduVasthunnadu #LeninOnJune26th— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 23, 2026 -
అమ్మకు క్యాన్సర్.. సినిమాల వల్ల చాలా కోల్పోయా: హీరోయిన్
ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్ వంటి చిత్రాలతో తెలుగులో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ స్నేహ ఉల్లాల్. అయితే ఆమె కెరీర్ మొదలైంది మాత్రం హిందీ సినిమాతోనే.. లక్కీ: నో టైమ్ ఫర్ లవ్ (2005) చిత్రంతో వెండితెరపై తన ప్రయాణం ఆరంభించింది. ఒక్క సినిమాతోనే తన దశ తిరిగిపోయింది. తెలుగు, హిందీలో వరుస ఆఫర్లు అందుకుంది. మధ్యలో సినిమాలు వదిలేసింది. 16 ఏళ్లకే ఎంట్రీరెండేళ్ల క్రితమే మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్నేహా ఉల్లాల్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నేను సినిమాల్లో అడుగుపెట్టే సమయానికి నా వయసు 16 ఏళ్లే! అప్పుడే పదో తరగతి పూర్తి చేసి కాలేజీలో చేరాను. అక్కడ సల్మాన్ సోదరి అర్పిత ఖాన్ ఫ్రెండ్స్ నన్ను చూశారు. వారు లక్కీ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లారు. బహుశా ఆ సమయంలోనే నా గురించి చెప్పి ఉంటారు. అమ్మకు క్యాన్సర్అలా ఆ మూవీ టీమ్ నన్ను కలిసింది. ఆ సమయంలో మా ఇంట్లో పరిస్థితి బాగోలేదు. అమ్మ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటోంది. అందరి ముఖంలోనూ విషాదమే ఉంది. ఈ సినిమా ఛాన్స్ ద్వారా అందరికీ కాస్త ఉపశమనం కలిగించాలనుకున్నాను. పైగా అమ్మకు ప్రయాణాలంటే భలే ఇష్టం. షూటింగ్స్ కోసం తనను వెంట తీసుకుని వెళ్లొచ్చని సినిమా ఒప్పుకున్నాను.చాలా కోల్పోయా..ఈ మూవీ రిలీజయ్యాక నాపై బోలెడంత ప్రేమ కురిపించారు. ఈ ఇండస్ట్రీ నాకెంతిచ్చిందో అంతకంటే ఎక్కువే తీసుకుంది. నా కాలేజీ లైఫ్, స్వేచ్ఛను హరించేసింది. 16 ఏళ్ల నుంచి సడన్‌గా పెద్దదాన్నయిపోయాను. టీనేజ్‌ను మిస్ అయ్యాను. అయితే చిన్నప్పటి నుంచే నాకు చాలా ఆఫర్లు చవ్చాయి. ఒమన్ నుంచి భారత్‌కు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక వాణిజ్య ప్రకటనలో నటించమని అడిగారు. ఆ భయంతో దూరంకానీ ఇండస్ట్రీపై ఉన్న భయంతో వాటిని దూరం పెట్టాను. ఇంట్లోవాళ్లు కూడా ఇండస్ట్రీ అసభ్యకరంగా ఉంటుందని భయపెట్టారు. పైగా నేనంత గ్లామర్‌గా కూడా ఉండనని నా అభిప్రాయం. అందుకే ఎక్కువ సినిమాలు చేయలేదు. ఇప్పుడు మంచి పాత్రలు ఎంచుకుని మళ్లీ బాలీవుడ్లో బిజీ అవాలని ఉంది' అని స్నేహ ఉల్లాల్ చెప్పుకొచ్చింది.చదవండి: అమ్మ సలహాతో పెళ్లికి ముందు సహజీవనం: నటి -
త్రిష రాజకీయాల్లోకి రావాలి.. తనకు ఆ అర్హత ఉంది: నటి
ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే గెలుపు రుచి చూశారు దళపతి విజయ్. పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలవడంతో పాటు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి సంచలనం సృష్టించారు. అయితే విజయ్ సీఎం అయినప్పటి నుంచి ఆయన వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఓపక్క భార్యకు విడాకులు ఇస్తూనే.. మరోపక్క హీరోయిన్ త్రిషతో సన్నిహితంగా మెదులుతున్నారు.తప్పేముంది?ఈ క్రమంలో త్రిష కూడా రాజకీయాల్లోకి రాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై నటి వనితా విజయకుమార్ స్పందించింది. త్రిష రాజకీయాల్లోకి వస్తే తప్పేంటని ప్రశ్నించింది. పాలిటిక్స్‌లో అడుగుపెట్టేందుకు కావాల్సిన అన్ని అర్హతలు తనకు ఉన్నాయని త్రిషను వెనకేసుకొచ్చింది. పైగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత చదివిన స్కూల్లోనే త్రిష కూడా చదువుకుందని గుర్తు చేసింది. రాజకీయాల్లోకి రావాలితను ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుందని, జనంతో ఎలా మమేకం అవాలి? ఎదుటివారితో ఎంత గౌరవంగా మెదలాలనే విషయాలు తనకు బాగా తెలుసని పేర్కొంది. త్రిష లాంటి వారు రాజకీయాల్లోకి వస్తేనే బాగుంటుందని అభిప్రాయపడింది. మరి నిజంగా త్రిష పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇస్తుందా? కేవలం సినిమాలకే పరిమితమవుతుందా? అన్నది రానున్న రోజుల్లో చూడాలి!చదవండి: అందుకే 20 ఏళ్లుగా ఆయనతో నటించలేదు: ఊర్వశి -
పెళ్లికి ముందు సహజీవనం.. అమ్మ సలహానే..: నటి
ప్రేమను ఒప్పుకునే పెద్దలు చాలా అరుదు.. కానీ ఈ తల్లి మాత్రం నటి ప్రేమను ఒప్పుకోవడమే కాదు, సహజీవనం చేయమని సలహా ఇచ్చిందట! లివ్- ఇన్ రిలేషన్‌లోనూ ఇద్దరి మధ్య ప్రేమ అలాగే ఉంటే అప్పుడు పెళ్లి చేసుకోమని సెలవిచ్చిందట! ఈ విషయాన్ని బుల్లితెర నటి తేజస్వి ప్రకాశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.బిగ్‌బాస్ షోలో లవ్ షురూహిందీ బిగ్‌బాస్ 15వ సీజన్లో కరణ్ కుంద్రా- తేజస్వి ప్రకాశ్ ప్రేమలో పడ్డారు. అప్పటినుంచి ఇప్పటివరకు జంటగానే కొనసాగుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న దేశి బ్లింగ్ అనే రియాలిటీ షోలో కరణ్- తేజస్వి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ జంట ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. కరణ్ మాట్లాడుతూ.. తేజస్వి- నేను ప్రేమించుకునే విషయంలో ఆమె తండ్రికి ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఆమె తల్లి మాత్రం కాస్త డౌట్ పడింది. తేజస్విని తాను నమ్మలేనంది. నన్ను ఒకసారి ఆలోచించుకోమని చెప్పింది అన్నాడు.తల్లి ఐడియానే..ఇంతలో తేజస్వి మాట్లాడుతూ.. మా ఇద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఉందని తలిస్తేనే ముందడుగు వేయమంది. నాతో కరణ్ జీవితాంతం కలిసుండగలడో, లేదో చెక్ చేసుకోమంది. అందుకే పెళ్లి చేసుకోవడానికి ముందు కలిసుండమని అమ్మ సలహా ఇచ్చింది. నిజానికి ఇలాంటి ఐడియాను ఎవరూ ఒప్పుకోరు. కానీ, మా అమ్మ మాత్రం కలిసి జీవించమని, అప్పుడు కూడా ఇద్దరం బాగానే ఉంటే పెళ్లి చేసుకోమని చెప్పింది అని గుర్తు చేసుకుంది. మరి ఐదేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న ఈ జోడీ ఎప్పుడు పెళ్లిపీటలెక్కుతుందో చూడాలి!చదవండి: కేన్స్ ముగింపు వేడుకల్లో ఐష్ -
ఆ కారణం వల్లే ఆయనతో 20 ఏళ్లుగా నటించలేదు!
తలైవా తలైవి (తెలుగులో సార్ మేడమ్) వంటి హిట్ చిత్రం తర్వాత పాండిరాజ్ కథ, కథనం, దర్శకత్వం వహించిన సినిమా పరిమళ అండ్ కో. జయరాం, ఊర్వశి ప్రధాన పాత్రలు పోషించారు. డ్యాన్స్ మాస్టర్ శాండి, దర్శకుడు మిస్కిన్, యోగిబాబు, సంతోష్ శోభన్, సంజనా కృష్ణమూర్తి, అనంతిక, జీకేఎం తమిళ్ కమరన్ ముఖ్యపాత్రలు పోషించారు. సంతోషించా..తాజాగా చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఊర్వశి మాట్లాడుతూ.. చాలా చిత్రాల్లో కథే హీరో అనే నమ్మకం కలుగుతుందన్నారు. పరిమళ అండ్ కో సినిమా కథ మొదట వినగానే అలాంటి భావనే కలిగిందన్నారు. ఇందులో జయరాం నటిస్తున్నారని తెలియగానే సంతోషంగా అనిపించిందని పేర్కొన్నారు. తామిద్దరం ఇంతకుముందు 20కి పైగా చిత్రాల్లో కలిసి నటించామన్నారు. కానీ తర్వాత ఇద్దరి ఆసక్తులు వేరవడంతో చాలా గ్యాప్ వచ్చిందని తెలిపారు.అదే కారణం..పలు అవకాశాలు వచ్చినప్పటికీ తనకు నచ్చిన కథ జయరాంకు నచ్చకపోవడం, ఆయనకు నచ్చింది తనకు నచ్చకపోవడం జరిగిందన్నారు. దాంతో తామిద్దరం కలిసి నటించి దాదాపు 20 సంవత్సరాలు అయిందన్నారు. ఈ సినిమాను పాండిరాజ్ చాలా వేగంగా పూర్తి చేశారని ఊర్వశి తెలిపారు. -
పవర్ఫుల్ లుక్‌లో రషీన్, పోస్టర్ రిలీజ్
ప్రముఖ నటుడు రషీన్ రహమాన్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించాడు. 1987లో రాగలీల సినిమాతో పరిచయమై భారత్ బంద్, ప్రియతమా, బిల్లా, సింహ వంటి సినిమాల్లో తనదైన శైలిలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. మే 23న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ Production No. 1 నుంచి ఒక ప్రత్యేక బర్త్‌డే పోస్టర్ ను లాంచ్ చేశారు.ఆ పోస్టర్ ద్వారా ఆయన పాత్ర వ్యక్తిత్వాన్ని, అందులోని మిస్టరీని ప్రేక్షకులకు పరిచయం చేశారు. రహమాన్ పవర్ఫుల్ లుక్‌లో కనిపించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. -
ఎన్టీఆర్ అభిమానుల నిరీక్షణ వృథా
జూ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఒక భారీ సర్ప్రైజ్ ఉంటుందని ఎదురుచూశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న మైథలాజికల్ ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్'ను అధికారికంగా ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే దానిపై సితార ఎంటర్టైన్మెంట్స్ తరఫున నిర్మాత నాగవంశీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఆయన ఎక్స్ హ్యాండిల్లో మాత్రం ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. "త్వరలోనే సెట్స్‌పై కలుద్దాం" అంటూ పోస్టు పెట్టారు. అదే సమయంలో 'డ్రాగన్ గ్లింప్స్' వీడియోను కూడా ట్యాగ్ చేశారు. ఈ పరిణామంతో తారక్ అభిమానులు నిరాశ చెందారు. ఆయన పుట్టినరోజు నాడు 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్ ప్రకటిస్తారని అభిమానులు ఆశించారు. దానికోసం వారు పదేపదే నాగవంశీ సోషల్‌మీడియా హ్యాండిల్‌ను తనిఖీ కూడా చేశారు. 'గాడ్ ఆఫ్ వార్' కోసం వందలాది పోస్టులు కూడా చేశారు. కానీ ఆ సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. డ్రాగన్ గ్లింప్స్ విడుదల సమయంలో మరో సినిమా ప్రకటించడం వల్ల ఆ ప్రాజెక్ట్‌పై ఉన్న బజ్ తగ్గిపోతుందనే ఆలోచనతో నాగవంశీ వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. అందుకే 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్‌ను మరో మంచి రోజున ప్రకటించాలని నిర్ణయించినట్టు టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం పుట్టినరోజు సందర్భంగా ఈ పెద్ద ప్రాజెక్ట్ ప్రకటించకపోవడం వల్ల నిరాశ చెందుతున్నారు. -
ఒకే ఒక్క ఫ్లాప్.. జ్యోతిక ముఖంపైనే తలుపేసిన బాలీవుడ్
జ్యోతిక సౌత్‌లో స్టార్ హీరోయిన్ అవడానికి ముందు బాలీవుడ్లో ట్రై చేసింది. డోలి సజాకే రఖ్నా (1998) చిత్రంతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది. అక్షయ్ ఖన్నా హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. తొలి సినిమాయే కలిసిరాకపోవడంతో బాలీవుడ్ తనకు మరో అవకాశమివ్వకుండా తలుపులు మూసేసింది. దాంతో తమిళంలో ట్రై చేసింది. తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్గా రాణించింది.ప్రేమ- పెళ్లిఅయితే కెరీర్ ప్రారంభంలోనే ప్రేమలో పడింది జ్యోతిక. 'పూవెల్లం కెట్టుప్పార్' సినిమాలో సూర్యతో కలిసి నటించగా.. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత వీరు జంటగా నాలుగు సినిమాల్లో యాక్ట్ చేయగా ఆ ప్రేమబంధం మరింత బలపడింది. 2006 సెప్టెంబర్ 11న తమ ప్రేమను వైవాహిక బంధంతో పదిలపర్చుకున్నారు. ఈ జంటకు కూతురు దియా, కుమారుడు దేవ్ సంతానం.ఆదరించని బాలీవుడ్పెళ్లయ్యాక కొంత గ్యాప్ తీసుకున్న ఈ హీరోయిన్ తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈసారి బాలీవుడ్ నుంచే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు పొమ్మన్న బాలీవుడే ఈసారి రారమ్మని ఎర్ర తివాచీ పరుస్తోంది. దీని గురించి జ్యోతిక మాట్లాడుతూ.. నా ఫస్ట్ హిందీ చిత్రం ఆడనందుకు బాలీవుడ్ నా ముఖంపైనే తలుపేసింది. తమిళంలో కూడా నా మొదటి సినిమా ఆడలేదు. కానీ ఇక్కడ నా పనితనాన్ని మెచ్చి వరుస అవకాశాలిచ్చారు. అదే అక్కడికీ, ఇక్కడికీ తేడా!అదే ప్లస్, మైనస్అయితే అప్పటికీ, ఇప్పటికీ బాలీవుడ్లో చాలా మార్పు వచ్చింది. మహిళల కోసం ప్రత్యేకంగా కథలు రాస్తున్నారు. దక్షిణాదిలో ఇంకా ఆ దిశగా పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు. ఈ లెక్కన ప్రతి ఇండస్ట్రీలో ప్లస్సులు, మైనస్సులు ఉన్నాయి అంది. కాగా జ్యోతిక నటించిన సిస్టమ్ సినిమా మే 22న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.చదవండి: డ్రాగన్ గ్లింప్స్ ఆల్‌టైమ్ రికార్డ్ -
రికార్డు సృష్టించిన జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం డ్రాగన్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. తారక్ బర్త్‌డే సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి డ్రాగన్ గ్లింప్స్ వదిలారు. సాధారణంగా గ్లింప్స్ అనగానే చాలా తక్కువ నిడివితో ఉన్న వీడియోను వదులుతారు. కానీ డ్రాగన్ యూనిట్ అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఏకంగా నాలుగు నిమిషాల నిడివితో గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో కథ గురించి, హీరో ఉన్న సామ్రాజ్యం గురించి చూపించారు. అలాగే విలన్స్‌ను హైలైట్ చేశారు.గ్లింప్స్ రికార్డుఎన్టీఆర్ను క్రూరమైన పాత్రలో చూపించారు. 'పొరపాటున కూడా నా కలలోకి రావొద్దు' అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ గ్లింప్స్ వీడియో అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. కేవలం 24 గంటల్లోనే రికార్డు వ్యూస్ రాబట్టింది. అన్ని భాషల్లో కలుపుకుని ఏకంగా 64 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఏ గ్లింప్స్ వీడియోకు 24 గంటల్లో ఇంత పెద్ద మొత్తంలో వ్యూస్ రాలేదంటూ పోస్టర్ వదిలింది. ఇది చూసిన తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.సినిమాడ్రాగన్ విషయానికి వస్తే.. రుక్మిణి వసంత్ కథానాయికగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. బిజు మీనన్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, అషుతోష్ రానా, అన్షుమాన్ పుష్కర్, సిద్దాంత్ గుప్తా, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ మూవీ 2027 జూన్ 11న విడుదల కానుంది. Records were never safe from #DRAGON 🐉🔥#DragonGlimpse pic.twitter.com/6omRXL8JCb— Dragon (@DragonMovieOffl) May 20, 2026 చదవండి: ఆ ఇద్దరు హీరోయిన్లకు పొగరు: డ్యాన్సర్ -
ఆ ఇద్దరికీ పొగరు.. ఆ ఒక్క హీరోయిన్ మాత్రం!
సెలబ్రిటీలు సెట్లో ఎలా ఉంటారనేది వారితో కలిసి పనిచేసినవారికే ఎక్కువ తెలుస్తుంది. ఎంతోమంది తారలతో కలిసి పని చేసిన బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్ రుబీనా ఖాన్.. ఆ అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. కొందరు గొప్ప స్టార్స్ అయినా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని, మరికొందరు మాత్రం పొగరు, అహంకారం చూపించేవారంటోంది.నేలపై కూర్చుని కబుర్లుఆమె మాట్లాడుతూ.. 'సంజయ్ దత్, అజయ్ దేవ్‌గణ్, జాకీ ష్రాఫ్, మిథున్ చక్రవర్తి వంటి పలువురు సెలబ్రిటీలు ఎన్నడూ తాము పెద్ద స్టార్స్ అని అహంకారం చూపించలేదు. డ్యాన్సర్లను ఫ్రెండ్స్‌లా చూసేవారు. మాధురి దీక్షిత్ అయితే మాలాంటి డ్యాన్సర్లతో నేలపై కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పేది, జోక్స్ వేస్తుండేది. తాను పెద్ద సూపర్ స్టార్, మేము కేవలం డ్యాన్సర్స్ మాత్రమే అని ఎన్నడూ అనుకోలేదు.డ్యాన్సర్ రుబీనా ఖాన్మొదట్లో గర్వం..అయితే హీరోయిన్లు మమతా కులకర్ణి, దివ్య భారతి మాత్రం కెరీర్ ప్రారంభంలో కొంత గర్వం చూపించేవారు. అలా అని వారిని నేను తప్పుపట్టడం లేదు. డ్యాన్స్ చేసేటప్పుడు తోపులాటకు గురవకుండా ఉండేందుకు డ్యాన్సర్లను కాస్త దూరంగా నిలబడమని అడిగేవారు. అదే సమయంలో వాళ్లను కాస్త విసిగించాలని మేము కావాలనే తప్పులు చేస్తూ టేక్స్ తీసుకునేవాళ్లం. అలా కొన్నిసార్లు కావాలనే తుంటరి పని చేసేవాళ్లం.అరికాళ్లకు బొబ్బలుప్రేమ్ సినిమా షూటింగ్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. అందులోని ఓ పాటను తీవ్రమైన ఎండలో చిత్రీకరించారు. కాళ్లకు చెప్పులు లేకుండా డ్యాన్స్ చేయాలి. ఆ సాంగ్ పూర్తయ్యే సమయానికి మా డ్యాన్సర్లందరికీ కాళ్లకు బొబ్బలు వచ్చాయి. అప్పట్లో మా పారితోషికం ఎలా ఉండేదంటే.. సాధారణ దుస్తులకు ఒక రేటు, పొట్టి బట్టలకు మరో రేటు ఉండేది. ఏం మారలేదుదుస్తుల సైజు చిన్నవైనప్పుడు కొన్నిసార్లు డబుల్ పారితోషికం ఇచ్చేవారు. నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదట్లో రోజుకు రూ.175 ఇచ్చేవారు. ఈ రేటు ఏమంత మారలేదు. 25 ఏళ్ల క్రితం ఏదైనా వాణిజ్య ప్రకటనలో డ్యాన్స్ చేస్తే రూ.3500 ఇచ్చేవారు. ఇప్పటికీ కొన్ని నిర్మాణ సంస్థలు పైసా పెంచకుండా అంతే మొత్తాన్నిస్తున్నాయి' అని రుబీనా చెప్పుకొచ్చింది.చదవండి: ధనుష్ కంటే అతడు 100 రెట్లు నయం: మిస్కిన్ -
ధనుష్ కంటే అతడు 100 రెట్లు నయం: దర్శకుడు
సౌత్‌లోని స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు. యాక్షన్, ఎమోషన్స్.. అన్నింటినీ ఈజీగా హ్యాండిల్ చేయగలడు. తక్కువకాలంలోనే అగ్ర హీరోగా ఎదిగాడు. అయితే అలాంటి ధనుష్ కంటే కూడా ఆయన తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా గొప్ప నటుడు అంటున్నాడు తమిళ దర్శకుడు మిస్కిన్. ధనుష్ కంటే అతడు వంద రెట్లు నయమని పేర్కొన్నాడు. కస్తూరి రాజా కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం హబిబి. మీరా కతిరవన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ను మే 17న చెన్నైలో రిలీజ్ చేశారు. ఎవరో కూడా తెలీదుఈ కార్యక్రమానికి మిస్కిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. కస్తూరి రాజా చాలా బాగా నటిస్తాడు. మొదటిసారి ఓ సినిమాలో అతడిని చూసినప్పుడు ఆయన ఎవరనేది కూడా నాకు తెలీదు. కానీ, ఎక్కడో చూసినట్లుగా అనిపించేది. ఈయన ధనుష్ కంటే అద్భుతంగా నటిస్తాడు. అలా అని నాకు ధనుష్ అంటే ఇష్టం లేదనుకోకండి!నచ్చేవి కావుమొదట్లో కస్తూరి రాజా (దర్శకుడిగా) చేసిన సినిమాలు నాకస్సలు నచ్చేవి కావు. అన్నీ పనికిరాని సినిమాలే చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను తన సినిమాలకు ఎంచుకునేవాడు. నెమ్మదిగా తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకున్నాడు. బాగానే డబ్బు సంపాదించాడు. కొన్నిసార్లు నేను నా ఆత్మసంతృప్తి కోసం ఏదైనా సినిమా చేసినప్పుడు నష్టాలు వచ్చేవి. అలాంటప్పుడు వెంటనే నా అప్పు తీర్చుకునేందుకు, జేబు నింపుకునేందుకు కమర్షియల్ మూవీ చేసి ఆ లోటు భర్తీ చేసుకుంటాను అని చెప్పుకొచ్చాడు. కాగా కస్తూరి రాజా, ఈషా, మాళవిక మనోజ్ ప్రధాన పాత్రలు పోషించిన హబిబి చిత్రం మే 28న విడుదల కానుంది.చదవండి: సినీ ఇండస్ట్రీలో ఖుష్బూ చిన్న కూతురు -
సినీ రంగంలోకి ఖుష్బూ చిన్న కూతురు
సినీ రంగంలో వారసుల ఎంట్రీ ఎప్పటినుంచో ఉంది. ఆ వరుసలో ఇప్పుడు దర్శకుడు సుందర్ సి- నటి ఖుష్బూ దంపతుల కూతురు చేరింది. ఖుష్బూ దంపతులకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో అవంతిక ఇటీవలే కథానాయికగా పరిచయమైంది. తాజాగా ఆనందిత నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. నిర్మాతగా..అవ్నీ మూవీస్ అధినేత కుష్బూ సుందర్, బెంజ్ మీడియా అధినేత సీసీఎస్ అరుణ్‌కుమార్ కలిసి నిర్మిస్తున్న డబుల్ ఆక్యుపెన్సీ చిత్రానికి ఆనందిత సుందర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలను నిర్వహిస్తోంది. ఈ చిత్రం ద్వారా అశ్విన్ కందస్వామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంతోష్, రేష్మా వెంకటేష్, సంయుక్తా విశ్వనాథ్, వీనోద్ కిషన్, వీటీవీ.గణేశ్, భగవత పేరుమాళ్, బోస్ వెంకట్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. రెండు సినిమాలు..చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒక వ్యక్తిలో రెండు ఆత్మలు చోటు చేసుకుంటాయని, అవి మరో ఇద్దరితో చేసే ప్రేమాయణం అనే ఫాంటసీ కథాంశంతో రూపొందించిన చిత్రం డబుల్ ఆక్యుపెన్సీ అని చెప్పారు. వినోదాన్ని జోడించి యూత్ ఫుల్ ఎంటర్టెయినర్గా రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు. ఈ చిత్రానికి సంతోష్‌కుమార్ చక్రవర్తి చాయాగ్రహణం, శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందించారు. ఆనందిత సుందర్.. మీసయ్య మురుక్కు సీక్వెల్ సినిమాకు సైతం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది. గతంలో ఎంతో బొద్దుగా ఉన్న ఆనందిత.. ఇప్పుడు సన్నజాజి తీగలా మారిపోయింది. View this post on Instagram A post shared by anandita (@anisundar_) -
మంచు మనోజ్‌కి మరో కీలక పాత్ర.. ఆ సీనియర్ హీరోతో ఢీ
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ పాత్రలతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా మరో భారీ చిత్రంలో నటించబోతున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమాలో ఆయనను ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. ఇప్పటికే భైరవం, మిరాయి వంటి చిత్రాల్లో విలన్‌గా కనిపించి మెప్పించిన మనోజ్, ఈసారి బాలయ్యతో కలిసి తెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో నటించారు.ఈ చిత్రంలో విలన్ పాత్రలో మనోజ్ కనిపించనున్నాడని సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియాలో అధికారికంగా మనోజ్ ఎంట్రీని ప్రకటిస్తూ..'మీ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది'అని పేర్కొన్నారు. ఇది ఆయనకు మనోజ్‌తో మొదటి కాంబినేషన్. గోపీచంద్ గతంలో బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు. ఇక ఎప్పట్లానే ఈ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం. -
రామ్‌కు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో చై మూవీ!
ఆనందం, రన్, సండైకోళి (పందెం కోడి), పయ్యా (ఆవారా), అంజాన్ (సికిందర్) వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు లింగుస్వామి. నిర్మాతగానూ పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ఈయన ఇటీవల మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి. సండైకోళి చిత్రంతో విశాల్‌కు సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన లింగుస్వామి ఇటీవల దానికి సీక్వెల్‌గా పందెం కోడి 2 చిత్రాన్ని చేశారు. అది అంచనాలను అందుకోలేకపోయింది. చిన్న గ్యాప్ తర్వాత..ఆ తర్వాత టాలీవుడ్ హీరో రామ్పోతినేని కథానాయకుడిగా ది వారియర్ చిత్రాన్ని చేశారు. కానీ ఈ మూవీ కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో చిన్న గ్యాప్ తీసుకున్న ఈయన సంగీత దర్శకుడు విద్యాసాగర్ వారసుడిని హీరోగా పరిచయం చేయడానికి సిద్ధం అయ్యారు. అయితే ఆ చిత్రం ఏమైందో గానీ తాజాగా నాగచైతన్యతో మూవీ చేయబోతున్నట్లు సమాచారం. సినిమాఇది మంచి యాక్షన్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా ఉంటుందని సమాచారం. ఈ మధ్య తండేల్ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న నాగ చెతన్య ప్రస్తుతం వృషకర్మ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తమిళంలో వెంకట్ ప్రభు డైరెక్షన్లో కస్టడీ సినిమా చేసి చేతులు కాల్చుకున్న చై.. లింగుసామితో సినిమా చేస్తాడా? లేదా? చూడాలి! -
ఫ్రెండ్స్‌ని పరిచయం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ పేర్ల అర్థమిదే!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో కొత్త అతిథులు వచ్చి చేరాయి. రెండు అందమైన రామచిలుకలు తారక్‌తో కలిసి ఆడుకుంటున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్ తన బర్త్‌డే (మే 20) సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వాటికి అసాహి, యూహి అని పేర్లు పెట్టినట్లు తెలిపాడు. ఇవి జపనీస్ పేర్లు. అసాహి అంటే సూర్యోదయం, యూహి అంటే సూర్యాస్తమయం అని అర్థం. జపాన్ దేశంపై తనకున్న ప్రేమతోనే పెంపుడు పక్షులకు జపనీస్ పేర్లు పెట్టినట్లు వెల్లడించాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.తారక్ కెరీర్ మొదలైందిలా..దివంగత నటుడు ఎన్టీరామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాత ఎన్టీఆర్ నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాలనటుడిగా తొలిసారి తెరపై కనిపించాడు. నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా మారాడు. స్టూడెంట్ నెం.1, ఆది, అల్లరి రాముడు, సింహాద్రి, ఆంధ్రావాలా, యమదొంగ, అదుర్స్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, ఆర్ఆర్ఆర్.. ఇలా అనేక హిట్ చిత్రాల్లో నటించాడు. సినిమాచివరగా తెలుగులో దేవర: పార్ట్ 1తో హిట్ అందుకున్నాడు. హృతిక్ రోషన్ వార్ 2 మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జూన్‌లో విడుదల కానుంది. అలాగే తారక్ చేతిలో దేవర 2 కూడా ఉంది.చదవండి: జైల్లోనే పెళ్లిరోజు.. దర్శన్ భార్య ఎమోషనల్ పోస్ట్ -
ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి రాజీనామా.. ఆ కారణం వల్లే..
తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవి నుంచి ఏషియన్ మూవీస్ అధినేత, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ వైదొలిగారు. ఈ మేరకు ఛాంబర్ ప్రతినిధులకు మంగళవారం రాత్రి ఈమెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.నావల్ల కాదు'కొందరు కార్యవర్గ సభ్యులను మెప్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గి నేను పని చేయలేను. అలాగే నాకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. ఛాంబర్ ఎప్పుడూ ఏకాభిప్రాయంతో నడవాలి. ప్రస్తుతం అలా జరగడం లేదు' అని ఫిలిం ఛాంబర్‌కు రాసిన లేఖలో సునీల్ నారంగ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. సునీల్ నారంగ్ రాజీనామాను ఫిలిం ఛాంబర్ ఆమోదించింది.అసలేంటి వివాదం?ఇటీవల టాలీవుడ్లో పర్సంటేజీ (కమిషన్) విధానంపై వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే! సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా పర్సంటేజీ సిస్టమ్ అమలు చేయాలని ఎగ్జిబిటర్లు కోరగా అగ్రనిర్మాతలు అంగీకరించడం లేదు. కొన్ని రోజులుగా థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు జరుగుతున్న పర్సంటేజీ వివాదమే సునీల్ రాజీనామాకు ప్రధాన కారణమని తెలుస్తోంది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామాతెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారవేత్త సునీల్ నారంగ్ రాజీనామా చేశారు.ఆయన సమర్పించిన రాజీనామా లేఖను ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిశీలించి ఆమోదించింది. pic.twitter.com/0HUtwHeKFC— Telangana State Film Chamber Of Commerce (@TelanganaFilm) May 20, 2026 చదవండి: ఆస్పత్రిలో అమితాబ్? -
రిలేషన్లో వన్ టైం చీటింగ్ తప్పేం కాదు: రకుల్
తెలిసో తెలియకో ఏదో ఒకసారి చీటింగ్ చేస్తే తప్పేం కాదంటోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అలా అని మోసం చేయడాన్ని తాను సమర్థించడం లేదని చెప్తోంది. రకుల్ కథానాయికగా నటించిన తాజా చిత్రం 'పతీ పత్నీ ఔర్ వో దో'. ఇటీవల రిలీజైన ఈ హిందీ సినిమా ఇప్పటివరకు రూ.30 కోట్లకు పైగా రాబట్టింది. పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. మోసం చేస్తే?ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో ఆయుష్మాన్ ఖురానా, హీరోయిన్లు సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు పార్ట్నర్ మోసం చేస్తే ఒప్పుకుంటారా? అన్న ప్రశ్నకు ముగ్గురూ విభిన్నంగా స్పందించారు. మొదటగా సారా అలీ ఖాన్.. మోసం చేయడం సరికాదు, కానీ మోసం జరిగితే మాత్రం కచ్చితంగా సారీ చెప్పాలి అంది. దానికి రకుల్ కూడా అవునని వంత పాడింది. అయితే ఆయుష్మాన్ ఖురానా మాత్రం పెళ్లయ్యాక ప్రత్యేక షరతులుంటాయి. మానవ సహజంఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి, దానికి బాధపడుతూ నిజాయితీగా సారీ చెప్పినప్పుడు క్షమించేయడమే ఉత్తమం. మనిషన్నాక చిన్నపాటి పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. వాటిని పెద్దగా చూడకూడదు. అయితే పొరపాట్లు చేయడమే పనిగా పెట్టుకోవడం మాత్రం సరికాదు అన్నాడు. అలాగైతే ఒకసారి చీట్ చేస్తే క్షమించేయొచ్చా? అని సారా అడగ్గా కుదరదని రకుల్ బదులిచ్చింది.అది సరికాదుకానీ, అంతలోనే మళ్లీ మాట మార్చేసింది. 'ఎవరైనా అనుకోకుండా పొరపాటు చేస్తే మాత్రం క్షమించేయొచ్చు. ఎందుకంటే జీవితం చాలా పెద్దది. ఒక్క పొరపాటు చేసినందుకు జీవితాంతం అవతలి వ్యక్తిని క్షమించకుండా ఉండటం కరెక్ట్ కాదు. అలా అని ఇది నా జీవితానికి, నా భర్తకు వర్తించదు' అని రకుల్ పేర్కొంది.చదవండి: జైలులో పెళ్లిరోజు.. ఏదేమైనా నీ చేయి వదలను: దర్శన్ భార్య -
ఆస్పత్రిలో అమితాబ్? మౌనంగా ఉంటే ఇలాగే రెచ్చిపోతారు!
లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఆస్పత్రిపాలయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. శనివారం సాయంత్రం కడుపునొప్పితో బాధపడుతున్న బిగ్‌బీ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరాడని, అప్పటినుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్నాడని సదరు వార్తల సారాశం. దీంతో అభిమానులు బిగ్‌బీకి ఏమైందని ఆందోళన చెందుతున్నారు.అసలేమైంది?కాగా బిగ్‌బీకి కూలీ సినిమా (1983) చిత్రీకరణ సమయంలోనే కడుపు నొప్పి సమస్యలు మొదలయ్యాయి. దీంతో ఆయన నిజంగానే ఆస్పత్రిలో ఉన్నాడా? అని ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. అయితే ఈ ప్రచారం అంతా ఉట్టిదేనని తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ప్రతి ఆదివారంలాగే మొన్నటి ఆదివారం కూడా తన నివాసం బయటకు వచ్చి అభిమానులకు ఆప్యాయంగా నమస్కరించాడు. భయం మటుమాయంఅందుకు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఎప్పటిలాగే నా శ్రేయోభిలాషలను కలిసేందుకు నేను ఇంటి నుంచి బయటకు వస్తాను. ఆ సమయంలో నాలో ఒక ప్రశ్న తలెత్తింది. వారు నిజంగానే బయట ఉన్నారా? ఒకవేళ ఉన్నా నన్ను కలవడానికి వచ్చారా? లేదా హేళన చేసేందుకు వచ్చారా? అని ఒకింత భయం వేసింది. కానీ బయటకు వస్తుండగానే వారి కేరింతలు నాలోని భయాన్ని మటుమాయం చేశాయి. నాలో సంతోషాన్ని రెట్టింపు చేశాయి. పిల్లలు, పెద్దలు.. ఇలా అందర్నీ చూసేసరికి మనసుకు తేలిక. నిజంగా నేనెంత అదృష్టవంతుడిని అని రాసుకొచ్చాడు.మౌనంగా ఉంటేనే..ఇక రొటీన్ చెకప్‌లో భాగంగానే అమితాబ్ ఆస్పత్రికి వెళ్లి వచ్చాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బిగ్‌బీ.. బుధవారం నాడు తన బ్లాగ్‌లో హిందీలో ఓ పద్యం రాసుకొచ్చాడు. 'గద్ద మౌనంగా ఉన్నప్పుడే రామచిలకలు మాట్లాడటం మొదలుపెడతాయి. నచ్చిన విందు ఆరగిస్తాయి. బ్రెడ్డు, ధాన్యపు గింజలు నోట్లో పడగానే కాకుల్లా అరవడం మొదలుపెడతాయి' అని దాని సారాంశం. బహుశా తన ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్స్‌పై బిగ్‌బీ ఇలా కౌంటరిచ్చాడేమో! ప్రస్తుతం బిగ్‌బీ కల్కి 2898 ఏడీ సీక్వెల్లో కనిపించనున్నాడు.చదవండి: జైల్లోనే దర్శన్ పెళ్లిరోజు.. భార్య ఎమోషనల్ పోస్ట్ -
రామ్‌కు నో చెప్పిన పుష్ప విలన్!
ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు తొలిసారి దర్శకత్వం వహిస్తున్న మూవీ వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాను ఆయన సోదరుడు కృష్ణ పోతినేని నిర్మించనున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ ప్రకటించారు. ఈ మూవీలో రామ్ వీర పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకోసం స్పెషల్‌గా మేకోవర్ కూడా అయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.హీరోయిన్ సరే, విలన్ ఎవరు?అలాగే నటీనటుల ఎంపికపైనా రామ్ దృష్టి సారించాడట! ఈ మూవీలోని హీరోయిన్ పాత్రకు కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టిని సంప్రదించినట్లు తెలుస్తోంది. విలన్ పాత్ర కోసం మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, తమిళ నటుడు, దర్శకనిర్మాత ఎస్జే సూర్యలను అనుకుంటున్నారట. కాకపోతే పుష్ప తర్వాత ఫహద్ ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రస్తుతం తెలుగులో రెండు స్ట్రయిట్ సినిమాలు చేస్తున్న అతడు రామ్ సినిమాను రిజెక్ట్ చేసినట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరి రామ్‌కు జోడీగా శ్రీనిధి, విలన్‌గా ఎస్జే సూర్య నటిస్తారేమో చూడాలి! -
జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద అభిమానుల సందడి
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే నేడు (మే 20). ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు ఆయన నివాసానికి చేరుకున్నారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. బాణసంచా కాలుస్తూ హీరో పుట్టినరోజును పండగలా సెలబ్రేట్ చేశారు. ఇక తనకోసం వచ్చిన అభిమానులను ఎన్టీఆర్ నవ్వుతూ పలకరించాడు. వారిని పలకరిస్తూ అభివాదం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.డ్రాగన్ గ్లింప్స్ రిలీజ్ఇకపోతే ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా డ్రాగన్ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. దాదాపు 4 నిమిషాల నిడివితో ఉన్న ఈ వీడియోలో తారక్ బరువు తగ్గి, గంభీరమైన లుక్‌తో కనిపించాడు. ప్రశాంత్ నీల్ టేకింగ్, తారక్ డైలాగ్స్.. గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. రవి బస్రూర్ సంగీతం సినిమాకు మరింత ఆకర్షణ తీసుకువచ్చింది. డ్రాగన్ మూవీలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ 2027 జూన్ 11న విడుదల కానుంది. #DRAGON. The Dragon meet #jrntr #ntrneel #dragon pic.twitter.com/XIYI5U1PzX— Teja M (@TejaM112720) May 19, 2026చదవండి: డ్రాగన్ గ్లింప్స్ రిలీజ్ -
అదే తన లక్ష్యం అంటున్న డ్యూడ్ హీరోయిన్
మలయాళం, తమిళ, తెలుగు భాషల్లో నటిస్తూ క్రేజీ కథానాయికగా రాణిస్తోంది హీరోయిన్ మమితా బైజు. మలయాళంలో నటించిన ప్రేమలు చిత్రంతో అందరి దృష్టిని తనవైపు ఆకర్షించింది. ఆ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి దక్షిణాదిలో ట్రెండింగ్ హీరోయిన్గా వెలుగొందుతోంది. ఇటీవల డ్యూడ్ మూవీతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఈమె విజయ్‌తో కలిసి నటించిన జననాయకన్ (తెలుగులో జన నాయకుడు) చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. అదే నా లక్ష్యంఅలాగే సూర్యకు జంటగా నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే అశోక్ సెల్వన్‌కు జంటగా నటించిన ఇరండు విధానం చిత్రం కూడా విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రాలు విడుదలైన తర్వాత మమితా బైజు క్రేజ్ వేరేగా ఉంటుందని భావించవచ్చు. ఇటీవల ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నా అభిమానుల గుండెల్లో నిలిచిపోయే చిత్రాలను చేయాలన్నదే నా లక్ష్యం. అలా ఒక ప్రేమైక కుటుంబాన్ని తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఏదో ఒక రోజున నా జరిగిన కాలం గుర్తుకు వస్తే ఆనందం కలగాలి. అందుకోసమే నా ఈ ప్రయాణం' అని మమిత పేర్కొంది. -
‘డ్రాగన్’ గ్లింప్స్ రిలీజ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పవర్ఫుల్ ట్రీట్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ మొత్తం సినిమా కంటెంట్ ఎలా ఉండబోతోందనే క్లారిటీ ఇచ్చేసినట్లు అయింది. ‘సలార్’, ‘కేజీఎఫ్’ లాంటి భారీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్, తన మార్క్ ఏమాత్రం తగ్గకుండానే ఈ గ్లింప్స్ కట్ చేశాడు.ఇక తారక్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి 11.30 గంటల తర్వాత డ్రాగన్ సినిమా గ్లింప్స్ వచ్చింది. 4.28 నిమిషాల నిడివి గల ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ స్లిమ్ లుక్ ఆకట్టుకుంది. సింపుల్‌గా సినిమా కథ, ఆ ప్రపంచంలోని పాత్రలను పరిచయం చేశారు. ఈ గ్లింప్స్‌లో తారక్ చెప్పిన డైలాగ్స్ అభిమానులను అలరించేలా ఉన్నాయి. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం ఫ్యాన్స్ అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి. పవర్‌ఫుల్‌గా సాగిన ఈ గ్లింప్స్ సినిమా మీద భారీ అంచనాలను రేపుతోంది.కాగా డ్రాగన్ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ షూటింగ్ షెడ్యూల్లు వరుసగా వాయిదాలు పడటంతో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నట్టు డ్రాగన్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఓ కీలకమైన పాత్రలో అనిల్ కపూర్ నటిస్తున్నారు. కథను మలుపు తిప్పే మరో లీడ్ రోల్లో నటించనున్నారంటూ శ్రుతీహాసన్, రష్మికా మందన్నా, కాజోల్... వంటి వార్ల పేర్లు వినిపించాయి. తాజాగా ఆలియా భట్ పేరు తెరపైకి వచ్చింది. కాగా.. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియో గ్లింప్స్‌ను మీరు కూడా చూసేయండి. -
నిజ జీవిత స్ఫూర్తితో పుట్టిన ‘పెద్ది’
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమా టైటిల్ వెనక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పెద్దిరాజు అనే వ్యక్తి నుంచి ఈ టైటిల్ పుట్టిందని ఆయన తెలిపారు. పెద్దిరాజు తాపీ పని చేస్తూనే క్రికెట్, బాస్కెట్‌బాల్ బాగా ఆడేవారు. తనది పేద కుటుంబం కావడంతో ఎవరు డబ్బు ఇస్తే వాళ్ల తరఫున ఆడేవాడట. ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొంది కథను రాసుకున్నానని బుచ్చిబాబు చెప్పారు. అయితే ఈ సినిమా బయోపిక్ కాదు. నిజజీవితం నుంచి స్ఫూర్తిపొంది, దానికి కొంత ఫిక్షన్ కూడా జోడించి కథను రూపొందించానని ఆయన స్పష్టం చేశారు. అలా టైటిల్ కోసం పెద్దిరాజు పేరులోని ‘పెద్ది’ అనే పదాన్ని ఎంచుకున్నాను.ఇది కోడి రామ్మూర్తి బయోపిక్ అని, జూ.ఎన్టీఆర్ కోసం రాసిన కథ అని వస్తున్న పుకార్లను బుచ్చిబాబు ఖండించారు. ఉప్పెన రిలీజ్‌కు ముందే ఈ కథ రాసుకున్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. మొదట ఈ సినిమాను గోదావరి యాసలో తీద్దామనుకున్నాను. అయితే ఇప్పటికే రామ్ చరణ్ తన గురువు సుకుమార్ దర్శకత్వంలో చేసిన 'రంగస్థలం' ఆ నేపథ్యమే కావడంతో తన సినిమా ‘పెద్ది’ కోసం విజయనగరం బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నానని దర్శకుడు వెల్లడించారు. మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్‌లో శృతిహాసన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ‘పెద్ది’ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం సందడి చేయనుంది. -
ఐదుగురు పిల్లల్ని దత్తత తీసుకున్న మనోజ్
హీరో మంచు మనోజ్ "ఐక్యధైర్య సేన సమితి" పేరిట కొత్త ట్రస్ట్ ప్రారంభించాడు. ఈసారి బర్త్‌డే సెలబ్రేషన్స్ కంటే ముందు సేవకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపాడు. మార్చి 20న మనోజ్ పుట్టినరోజు.. ఈ క్రమంలోనే శనివారం (మార్చి 17) నాడు కొత్త ట్రస్ట్‌ను ప్రారంభిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 'ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఎవరు మన పక్కనున్నారు? ఎవరు మానవత్వంతో వ్యవహరించారనేది జీవితం గుర్తు చేస్తుంది.అలాంటి వారికోసం..ఈ మానవత్వం, సేవా స్ఫూర్తి ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. అది ఎల్లప్పుడూ మాలో అంతర్భాగంగా ఉంది. అవసరంలో ఉన్నవారికోసం మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈరోజు మాలో ఉన్న స్ఫూర్తికి ఒక పేరు పెట్టి, మాతో కలిసి నడిచేందుకు మరిన్ని హృదయాలను ఆహ్వానించాలనుకుంటున్నాము.మానవత్వం కోసం..ముఖ్యంగా మౌనిక ప్రేరేపించిన ఆలోచనతో నేడు ఐక్యధైర్యసేనా సమితిని ప్రారంభిస్తున్నాం. ఐక్య అంటే ఐకమత్యం. మానవత్వం కోసం అందరూ ఏకం కావడం. దేవుడు మాకు ప్రసాదించినదాన్ని సేవ ద్వారా నలుగురికీ పంచుకోవాలనుకుంటున్నాము. రక్తదానం, అత్యవసర సహాయం వంటివి అవసరమైనచోట ఐక్య సంస్థ నిలబడుతుంది. ఇది రాజకీయం కాదు, అలాగే ఈ సంస్థ మాది మాత్రమే కాదు, మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరిదీ..కొత్త ఆశఒక గొప్ప లక్ష్యం కోసం హృదయాలు ఏకమైనప్పుడు జీవితాలు మారడమే కాదు... ఆశ మళ్లీ జీవం పోసుకుంటుంది అని ట్వీట్ చేశాడు. ఈ ట్రస్ట్ ద్వారా మొదటగా ఐదు మంది పిల్లలను దత్తత తీసుకున్నట్లు మనోజ్ ప్రకటించాడు. ఈరోజు నుంచి వారి బాధ్యతలు తనవేనని హామీ ఇచ్చాడు. Before celebrating birthdays, me and my wife @BhumaMounika wanted to begin with service.Life’s journey has taught us that beyond every high and low, what truly matters is humanity and the people who stand beside us.This spirit of service did not begin today. It has always… pic.twitter.com/p6gg3HqljP— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 17, 2026 చదవండి: పేరెంట్స్ విడాకులు.. వరలక్ష్మి అడిగిన ఒక్క ప్రశ్న వల్లే.. -
పేరెంట్స్ విడాకులు.. వరలక్ష్మి అడిగిన ఒక్క ప్రశ్న వల్లే..!
సినీ రంగంలో డేరింగ్ అండ్ డాషింగ్ నటీమణుల్లో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఒకరు. తనకున్న గుండెధైర్యం మధ్యలో వచ్చింది కాదు, చిన్నప్పటినుంచే ఉంది. చిన్నతనంలోనే తల్లిదండ్రుల విడాకులను కళ్లారా చూసింది. తల్లి చాయా దేవి కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఎదురు తిరిగింది. ఆమె కొత్త జీవితం మొదలుపెట్టేందుకు కారణమైంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం..పేరెంట్స్ విడాకులుశరత్కుమార్, చాయా దేవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి వరలక్ష్మి, పూజ అని ఇద్దరు ఆడపిల్లలు సంతానం. కొంతకాలానికి మనస్పర్థల కారణంగా శరత్‌కుమార్ దంపతులు విడిపోయారు. అప్పుడు వరలక్ష్మి వయసు పదిహేనేళ్లే.. తనకేం అర్థం కాలేదు. తమవైపు నుంచి ఏదైనా తప్పుందా? ఉంటే దాన్ని సరిదిద్దుకుంటాం కదా అనుకుంది. నెమ్మదిగా పరిస్థితిని అర్థం చేసుకుంది. తల్లికి అండగా నిలబడింది. ఒక్క ప్రశ్నతో తల్లిలో మార్పుఅయితే విడాకుల బాధ నుంచి చాయాదేవి అంత సులువుగా బయటకు రాలేదు. ఒకరోజు ఏడుస్తూనే కూర్చున్న తల్లి దగ్గరకు వెళ్లింది వరలక్ష్మి. జీవితాంతం ఇలాగే ఏడుస్తూ ఉండిపోతావా? జరిగిందేదో జరిగిపోయిందని ముందుకు కదుల్తావా? అని ప్రశ్నించింది. ఆ ఒక్క ప్రశ్న తల్లిని ఆలోచనలో పడేసింది. తనెందుకు బాధపడుతూ ఉన్నచోటే ఆగిపోవాలని తలచింది. సొంతంగా బిజినెస్ ప్రారంభించింది. సంపాదించడం మొదలుపెట్టింది.మళ్లీ పెళ్లి చేయాలని..అయితే తల్లికి మళ్లీ పెళ్లి చేయాలని మ్యాట్రిమోనీలోనూ వరుడిని వెతికారు వరలక్ష్మి, పూజ. కానీ చాయా దేవి అందుకు ఇష్టపడలేదు. కేవలం పిల్లల పెంపకం, బిజినెస్.. ఈ రెండింటిపైనే దృష్టి పెట్టింది. తల్లి మాట కాదనలేక సైలెంట్ అయిపోయారు. తల్లితో విడాకుల కారణంగా మొదట్లో తండ్రిపై కోపం, బాధ కలిగాయని, కానీ గొడవపడుతూ కలిసుండటం కన్నా విడిపోవడమే మంచిదని తర్వాత అర్థమైందని నటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఎవరినీ దగ్గరకు రానివ్వనుఇంకా మాట్లాడుతూ.. చిన్నతనంలోనే ఒంటరితనాన్ని అనుభవించడం వల్ల ఎవరినీ తన దగ్గరకు రానివ్వనంది. అనుబంధాలపై పెద్దగా అటాచ్మెంట్ లేదంది. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటే మనం జీవించలేమని, మన కోసం ఎవరో వచ్చి కంటతడి పెట్టరని పేర్కొంది. ఇతరులను గాయపరచకుండా మనం ఏం చేసినా తప్పులేదంది. శరత్‌కుమార్ రెండో పెళ్లివరలక్ష్మీ శరత్ కుమార్ మొదట్లో కథానాయికగా రంగప్రవేశం చేసినా, ఆ తర్వాత వచ్చిన, నచ్చిన పాత్రలు చేస్తూ ఆల్‌రౌండర్‌గా మారింది. ఇటీవల దర్శక, నిర్మాతగా కూడా అవతారమెత్తింది. కాగా శరత్‌కుమార్, చాయా దేవి 1984లో పెళ్లి చేసుకున్నారు. 2000వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాది నటి రాధికను పెళ్లి చేసుకున్నాడు. శరత్- రాధిక దంపతులకు కుమారుడు రాహుల్ సంతానం.చదవండి: త్రిష కోసమే ఆ పని చేశా.. చెప్పడానికే ఎంతో భయంగా ఉంది: చిన్మయి -
త్రిష కోసం ఆ పనిచేశా.. చెప్పాలంటే భయంగా ఉంది!
చిన్మయి శ్రీపాద.. పాటలు పాడటమే కాదు, ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్తూ ఉంటుంది. అలా కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) సినిమాలో త్రిషకు కూడా తనే గొంతు అరువిచ్చింది. కానీ, ఈ విషయాన్ని బయటకు చెప్పడానికి భయమేసిందంటోంది చిన్మయి. ఈమేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.నిజంగా భయపడ్డా..'మీకు ఈ విషయం ఎలా చెప్పాలా? అని నన్ను నేను సిద్ధం చేసుకోవడం కాస్త విచిత్రంగా ఉంది. కరుప్పు సినిమాలో త్రిషకు నేనే డబ్బింగ్ చెప్పాను. ఆ మాట చెప్పేందుకు నేను నిజంగా భయపడ్డాను. ఆర్జే బాలాజీ నాకు చాలాకాలంగా తెలుసు. అతడు, అతడి భార్య ఎంతో మంచివాళ్లు. బాలాజీ ఎంతో పట్టుదల, ధృడ సంకల్పంతో ముందుకు సాగే వ్యక్తి. తన కలలను సాకారం చేసుకోవడానికి ఎంతగానో శ్రమిస్తాడు. నాకు అతడి గురించి, అతడి కుటుంబం గురించి బాగా తెలుసు. అందుకే అతడి గురించి భయపడ్డాను. వెక్కివెక్కి ఏడ్చా..గతంలో లియో సినిమా(త్రిష కోసం డబ్బింగ్ చెప్పినందుకు) విషయంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈసారి అతడికి ఎలాంటి వ్యతిరేకతలు ఎదురవుతాయోనని ఆందోళన చెందాను. ఆ మూవీలో కొన్ని సీన్స్‌కు డబ్బింగ్ చెప్పేటప్పుడు వెక్కివెక్కి ఏడ్చిన విషయం నాకు బాగా గుర్తుంది. నా పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. గతంలో జరిగిందంతా మళ్లీ నా కళ్లముందు కదులుతున్నట్లే అనిపించింది.థాంక్యూ బాలాజీఏదేమైనా ఈ సినిమాలో త్రిషకు డబ్బింగ్ చెప్పే అవకాశాన్నిచ్చినందుకు థాంక్యూ బాలాజీ. నా సొంతగడ్డపై ఎటువంటి బెరుకు లేకుండా, తర్వాత ఏం జరుగుతోందనన్న భయం లేకుండా నా పని నేను ధైర్యంగా చేసుకునే శక్తిని ఆ కరుప్పు సామి ఇస్తాడని ఆశిస్తున్నాను. ఏళ్ల తరబడి పని చేసుకోకుండా నిషేధించబడ్డ నాకు, నాలాంటి బాధితులను దేవుడు అనుగ్రహించుగాక!' అంటూ #KaruppuBlockbuster అనే ట్యాగ్ జత చేసింది చిన్మయి.చిన్మయిపై బ్యాన్2018లో మీటూ ఉద్యమ సమయంలో డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న రాధా రవిపై చిన్మయి శ్రీపాద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో తమిళనాడులోని 'సౌత్ ఇండియన్ సినీ, టెలివిజన్ ఆర్టిస్ట్స్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్' (SICTADAU) చిన్మయి సభ్యత్వాన్ని రద్దు చేసి నిషేధం విధించింది. ఆమెపై బ్యాన్ ఉన్నప్పటికీ లోకేశ్ కగనరాజ్ లియో (2023) మూవీలో త్రిషకు డబ్బింగ్ చెప్పే అవకాశాన్ని చిన్మయికి ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి కరుప్పులో త్రిషకు తనే డబ్బింగ్ చెప్పింది. Strange I am readying myself saying this... I was genuinely afraid this time, of sharing that I dubbed in Karuppu. I have known R J Balaji a long time - he and his wife, are such lovely people and RJB himself, is someone whose entire life is such a story of grit,…— Chinmayi Sripaada (@Chinmayi) May 16, 2026 చదవండి: విజయ్- త్రిషలపై చీప్ ప్రశ్న.. రాజాసాబ్ బ్యూటీ ఆగ్రహం -
విజయ్-త్రిషలపై చీప్ ప్రశ్న.. మండిపడ్డ రాజాసాబ్ బ్యూటీ
నువ్వు తలుచుకుంటే అవుద్ది సామీ... ఇది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే కాదు, విజయ్ జీవితంలో జరిగిన అద్భుతం. రాజకీయాల కోసం సినిమాలు వదిలేసిన ఆయన.. సీఎం అవాలన్న కసితో పని చేశాడు. మొదటి ప్రయత్నంలోనే తిరుగులేనివాడిలా గెలుపు పతాకం ఎగరవేశాడు. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆయన ప్రయాణాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అనుచిత ప్రశ్నఇదే సమయంలో సీఎం విజయ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కొందరు హీరోయిన్ త్రిష పేరును కూడా లాగుతున్నారు. తాజాగా ఓ ఈవెంట్‌కు వెళ్లిన హీరోయిన్ మాళవిక మోహనన్‌ను సైతం అటువంటి ఇబ్బందికర ప్రశ్నలడిగారు. ఈమధ్య త్రిష ఎక్కడికి వెళ్తే విజయ్ అక్కడికి వెళ్తున్నారు. ఆయనతో కలిసి ప్రయాణించడం ఎలాగో మీకేమైనా ఐడియా ఉందా? అని అడిగారు. ఈ ప్రశ్న విని చిర్రెత్తిపోయిన మాళవిక.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? అంటూ మండిపడింది. సంచలనం కోసం..ఈ విషయంలో పలువురు నెటిజన్లు మాళవికకు మద్దతుగా నిలబడ్డారు. తాజాగా ఈ వివాదంపై మాళవిక సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 'నేను ఒక ఈవెంట్‌కు వెళ్లాను. నాకు తమిళనాడు మీడియా, జర్నలిస్టులపై అపారమైన గౌరవం ఉంది. కానీ, వారిలో కొందరు సంచలనం కోసం పదేపదే ఇబ్బందికర, అసహ్యమైన ప్రశ్నలడిగారు. విజయ్ నాకు ఏడేళ్లుగా పరిచయం. అద్భుతంఆయనపై నాకెంతో గౌరవం ఉంది. తనను నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. నటుడి నుంచి నాయకుడిగా ఎదిగిన ఆయన ప్రయాణం ఒక అద్భుతమనే చెప్పాలి. ఇక చెప్పొచ్చేదేంటంటే.. భవిష్యత్తులో జరిగే మీడియా సమావేశాల్లో అయినా అందరి గౌరవమర్యాదలు కాపాడుతూ, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేసింది.సినిమామాళవిక మోహనన్ 2013లో తన సినీకెరీర్ ప్రారంభించింది. సొంత భాష అయిన మలయాళంలో పట్టం పోలే చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. విజయ్‌తో కలిసి మాస్టర్ సినిమాలో నటించింది. ది రాజాసాబ్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళంలో సర్దార్ 2, పాకెట్ నోవెల్ అని రెండు సినిమాలు చేస్తోంది. I went for an event yesterday, and while I have the utmost regard for all the journalists and members of the Tamil Nadu media, a couple of them persistently asked some very distasteful questions that were completely unnecessary and sensational.Thalapathy Vijay is someone I’ve…— Malavika Mohanan (@MalavikaM_) May 16, 2026 చదవండి: టాలీవుడ్లో స్పెషల్ ఎంట్రీ -
భక్తి పాట రాసిన హీరో శివకార్తికేయన్
తమిళ స్టార్ శివకార్తికేయన్‌కు ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అవుతోందని చెప్పవచ్చు. ఈయన కథానాయకుడిగా నటిస్తూనే నిర్మాతగా ఎస్కే ప్రొడక్షన్స్ పతాకంపై పలు వైవిధ్యమైన కథా చిత్రాలను నిర్మిస్తూ, ఇతరులు నిర్మించిన మంచి కంటెంట్‌తో కూడిన చిత్రాలను విడుదల చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. అలా ఈయన ఇటీవల నిర్మించిన తాయ్‌కిళవి చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. హీరోగా, నిర్మాతగా విజయాలను అందుకుంటున్న ఈయనలో మంచి గాయకుడు, గీత రచయిత కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడీయన ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్ రంగంలోకి అడుగు పెట్టారు. వేలుమ్ మయిలుమ్ అంటూ సాగే భక్తిరస పాటకు లిరిక్స్ అందించారు. ఈ ప్రైవేట్ మ్యూజికల్‌కు నివాస్ కే. ప్రసన్న సంగీతాన్ని అందించి, పాడారు. దీన్ని తాయ్ కిళవి ఫేమ్ శివకుమార్ మురుగేశన్ డైరెక్ట్ చేశాడు. ఇలాంటి ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్‌లు ఈ సంస్థ నుంచి మరిన్ని వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇకపోతే శివకార్తికేయన్.. మురుగేశన్ దర్శకత్వంలో 'సెయోన్' చిత్రంలో నటిస్తున్నారు. -
చిరు లీక్స్.. 'పెద్ది' ట్రయిలర్‌కి ముందే పెంచేసిన హైప్
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి చేసే లీక్స్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తన సినిమాలే కాదు, ఇతర సినిమాల సంగతుల్ని కూడా అప్పుడప్పుడూ బయటపెడుతుంటారు. ఈసారి రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా ట్రయిలర్ విషయాలు ముందుగానే చెప్పేశారు. తాజాగా పెద్ది ట్రయిలర్‌ను చిరంజీవితో పాటు కొంతమంది మీడియా వ్యక్తులకు చూపించారు. ఆ విషయం అందరూ గోప్యంగానే ఉంచారు. అయితే మెగాస్టార్ మాత్రం ట్రయిలర్‌లోని ఓ కీలక డైలాగ్‌ను లీక్ చేశారు. “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్” అనే డైలాగ్ ట్రయిలర్లో ఉంటుందని వెల్లడించారు. “సారీ బుచ్చి.. ట్రయిలర్ చూశాక కంట్రోల్ తప్పింది” అంటూ హాస్యంగా కొనసాగించారు. అంతేకాదు పెద్ది సినిమా ట్రయిలర్ 3 నిమిషాల నిడివి కలిగి ఉందని కూడా చిరంజీవి బయటపెట్టారు. చరణ్, దర్శకుడు బుచ్చిబాబు, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ముగ్గురూ తమ బెస్ట్ ఇచ్చారని ఆయన ప్రశంసించారు. ఆడియన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగానే ట్రయిలర్ ఉంటుంది. అంతా కలిసి రఫ్ఫాడించారని మెగాస్టార్ ట్రయిలర్‌పై ఉన్న హైప్‌ను అమాంతం పెంచేశారు. ఈ నెల 18న రిలీజ్ కానున్న పెద్ది ట్రయిలర్‌పై చిరంజీవి చేసిన ఈ లీక్స్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఆయన రివ్యూ వల్ల ట్రయిలర్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. -
రవిని వదిలేస్తున్నా.. ట్రోలింగ్ తట్టుకోలేక సింగర్ బ్రేకప్!
తమిళ హీరో రవి మోహన్.. భార్య ఆర్తితో తెగదెంపులు చేసుకుని సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. విడాకులు మంజూరు కాకముందే సింగర్‌తో షికార్లు చేస్తుండటంతో వీరిపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సింగర్ కెనీషా ఫ్రాన్సిస్యే.. రవిమోహన్ దంపతుల విడాకులకు కారణమని ఆమెను నెటిజన్లు దుయ్యబట్టారు.వదిలేస్తున్నా..ఇటీవల మీన్కులతి భగవతి ఆలయ ఉత్సవాల్లో రవితో కలిసి కెనీషా స్టేజ్ షేర్ చేసుకోవడంపై తీవ్రంగా విమర్శించారు. ఈ ఆన్లైన్ ట్రోలింగ్‌తో కలత చెందిన కెనీషా సంచలన నిర్ణయం తీసుకుంది. రవిని వదిలేస్తున్నా.. అతడిని కాపాలనుకోవడం నా మూర్ఖత్వం అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. రవి- ఆర్తిల 15 ఏళ్ల వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడానికి తాను కారణం కాదని, తమది కేవలం స్నేహబంధం మాత్రమేనని వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాకు, మ్యూజిక్కు గుడ్‌బై చెబుతూ.. చెన్నై వదిలి వెళ్లిపోతున్నట్లు ప్రకటించింది.నావల్ల కావట్లేదుఈ పోస్ట్‌తో వీరి ప్రేమ ముగిసినట్లేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి దీనిపై రవి మోహన్ ఏమని స్పందిస్తాడో చూడాలి! దీనికంటే ముందు కూడా కెనీషా తన గతాన్ని గురించి చెప్తూ భావోద్వేగానికి లోనైంది. నాలుగేళ్ల వయసులో ఇంట్లో వేధింపులకు గురయ్యానంది. 18 ఏళ్లకే పెళ్లి చేయగా భర్త కూడా టార్చర్ పెట్టాడంది. వివాహమైన నాలుగు నెలలకే గర్భం దాల్చినప్పటికీ అతడి చిత్రహింసల వల్ల బిడ్డను కోల్పోయానంది. తర్వాత అమ్మను కోల్పోవడం.. అనంతరం అల్జీమర్స్ (మతిమరుపు)తో బాధపడుతున్న నాన్నను కోల్పోవడం తనను కుంగతీశాయంది.స్నేహం మాత్రమే..ఆ సమయంలో బార్‌కు వెళ్లి పాటలు పాడటం మొదలుపెట్టానంది. ఒక ఆడియోలాంచ్లో రవిమోహన్ కలిశాడని, అక్కడే తమకు పరిచయం ఏర్పడగా స్నేహానికి దారి తీసిందని తెలిపింది. అయితే అతడి కుటుంబాన్ని విడగొట్టాలన్న ఉద్దేశం తనకెప్పుడూ లేదని పేర్కొంది. ఇంతలోనే ఈ ట్రోలింగ్ తన వల్ల కావడం లేదని.. తన ప్రేమను ఎవరూ నమ్మడం లేదంటూ అతడిని వదిలేస్తున్నానని కెనీషా పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Keneeshaa (@keneeshaa1) చదవండి: అర్ధరాత్రి నడిరోడ్డుపై దీనస్థితిలో పావలా శ్యామల -
కేన్స్ వేదికపై మన సినీ ప్రమోషన్!
ఫ్రాన్స్‌లో ఏటా జరిగే ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కేన్స్ చలనచిత్రోత్సవం ఈసారి కూడా సందడిగా సాగుతోంది. మే నెల 12న మొదలైన ఈ ఏటి 79వ కాన్ చలనచిత్రోత్సవంలో పలువురు అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొంటున్నారు. ఫ్రెంచ్ పీరియడ్ – కామెడీ చిత్రం ‘ది ఎలక్ట్రిక్ కిస్’తో ఆరంభమైన ఈ వేడుకలో భారత ప్రభుత్వం సైతం మన దేశీయ సినీ పరిశ్రమను అంతర్జాతీయంగా మరింత మందికి చేరువ చేసేందుకు ‘భారత్ పెవిలియన్’ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సారథ్యంలోని ‘నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్’, అలాగే వందేళ్ళ సుదీర్ఘ చరిత్ర గల ప్రతిష్ఠాత్మక భారతీయ వ్యాపార సంఘం ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (ఫిక్కీ) సమష్టిగా వివిధ భారతీయ సినిమాల ప్రమోషన్‌కు ఈ ‘భారతీయ పెవిలియన్’ ద్వారా వేదికను కల్పిస్తున్నాయి.తెలుగు నుంచి సోషియో - ఫ్యాంటసీగా...వివిధ దేశాల సినీ రంగాలకు ఏర్పాటు చేసిన పెవిలియన్ల లానే భారతీయ సినీ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా పెట్టిన ‘భారత్ పెవిలియన్’లో మే 15, శుక్రవారం ఓ తెలుగు సినిమా ప్రమోషన్ కూడా జరగడం విశేషం. ‘ది గేమ్ ఆఫ్ సాంగ్’ (ఆటాడిన పాట) అనే తెలుగు చిత్రం టీజర్, పోస్టర్ విడుదల అక్కడ జరిపారు. నక్షత్రం ప్రొడక్షన్స్ పతాకంపై అవంతిక నక్షత్రం ఈ చిత్రాన్ని నిర్మించగా, ప్రముఖ కథా, నవలా రచయిత వేణు నక్షత్రం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. కాన్ ఫిలిం ఫెస్టివల్లో ‘లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్’ (ఎల్ఐఎఫ్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ అయిన క్యారీ సాహ్ని చేతుల మీదుగా ఈ సినిమా టీజర్, పోస్టర్‌ను ఆవిష్కరించి, సభికులకు ప్రదర్శించారు. సోషియో- ఫ్యాంటసీ జానర్లో రూపొందిన ఈ ‘ఆటాడిన పాట’లో అభినవ్ గోమఠం, స్వాతీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు.“ఇదో వినూత్న ప్రయోగం. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి అయింది. తెలుగులో రూపొందించిన ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషల్లోకి కూడా అనువాదం చేస్తున్నాం” అని రచయిత, దర్శకుడు వేణు నక్షత్రం తెలిపారు. ఈ చిత్రానికి రాహుల్ మాచినేని ఛాయాగ్రహణం, టి.ఆర్. సెల్వకుమార్ కూర్పు, కార్తీక్ కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. ‘భారత్ పెవిలియన్’లో జరిగిన ఈ చిత్ర కార్యక్రమానికి హాజరైన పలువురు సినీ ప్రముఖులు ప్రయోగాత్మకంగా నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను ఆసక్తిగా గమనించారు. టీజర్‌ను ఆవిష్కరించిన క్యారీ సాహ్ని సహా పలువురు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహణకు సహకరించిన డైరెక్టర్ శర్వి, తదితర మిత్రులు, ఆహూతులకు వేణు నక్షత్రం ధన్యవాదాలు తెలిపారు.గుజరాతీ చిత్ర పరిశ్రమ సైతం...వివిధ భారతీయ భాషా చిత్రాలు అంతర్జాతీయంగా తమను తాము మార్కెట్ చేసుకొనేందుకు కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారత్ పెవిలియన్ వేదికను కల్పిస్తోంది. ఇప్పటికే పలు భారతీయ భాషా చిత్ర పరిశ్రమలు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. హిందీ టీవీ నుంచి గుజరాతీ చిత్రసీమలో ప్రముఖ నటిగా ఎదిగి, గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్ ప్రెస్’ (2023) ద్వారా జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న మానసీ పారేఖ్ ఈసారి కాన్‌లో గుజరాతీ సినిమా పక్షాన జోరుగా ప్రచారం చేస్తూ, రకరకాల ఫ్యాషన్ దుస్తులతో ఫోటోలు దిగుతూ, అందరినీ ఆకర్షిస్తున్నారు. నిరుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని ముఖ్య పాత్రగా చేసుకొని, అతి తక్కువ బడ్జెట్లో నిర్మాణమై, కనివిని ఎరుగని వసూళ్ళతో గుజరాతీ సినీ పరిశ్రమ వైపు దేశమంతా తిరిగి చూసేలా చేసిన సోషియో-ఫ్యాంటసీ ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ చిత్ర దర్శకుడు సహా పలువురు ఆ పరిశ్రమ నుంచి అక్కడ సందడి చేస్తున్నారు. ఈ మే 23 వరకు మరో వారం రోజుల పాటు ఈ కాన్ చలనచిత్రోత్సవం సాగనున్నందున తెలుగు చిత్రసీమతో పాటు ఇతర భారతీయ భాషల నుంచి మరెన్ని విశేషాలు చోటుచేసుకుంటాయో చూడాలి. -
రామ్‌చరణ్ చేతికి గాయం? హీరోకు ఏమైంది?
గేమ్ ఛేంజర్‌తో భారీ డిజాస్టర్‌ను మూటగట్టుకున్న రామ్‌చరణ్ ఈసారి పెద్దితో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేశాయి. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 4న విడుదల కానుంది. అయితే అప్పటివరకు గ్యాప్ లేకుండా భారీ ఈవెంట్లు ప్లాన్ చేసింది చిత్రయూనిట్. బ్యాండేజ్‌తో చరణ్?మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్‌తో ఈ ప్రమోషన్స్ జర్నీ మొదలు కానుంది. పలు నగరాల్లో అనేక ఈవెంట్లను ఏర్పాటు చేశారు. చివరగా జూన్ 2న హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఫంక్షన్ జరగనుంది. ఈ క్రమంలోనే ముంబై వెళ్లిన రామ్‌చరణ్ చేతికి బ్యాండేజ్‌తో కనిపించాడు. శుక్రవారం నాడు ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ హకీం ఆలిం సెలూన్‌కు వెళ్లాడు చరణ్. చరణ్‌కు ఏమైంది?అనంతరం బయటకు వస్తుండగా అతడి కుడి చేతికి సపోర్ట్ బ్రేస్ (రిస్ట్ బ్యాండేజ్) ఉంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో చరణ్‌కు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే షూటింగ్లో చరణ్ చేతికి చిన్న గాయమైందని, దాన్నుంచి త్వరగా కోలుకోవడానికే ఈ బ్యాండేజ్ ధరించాడని తెలుస్తోంది. #RamCharan - MAINTAINING HOLLYWOOD STAR LEVEL OF LOOKS - and Ram Charan is absolutely owning that long hair look🔥#ramcharan 💥 pic.twitter.com/SJ5IW73K9j— ROYAL BHARAT (INDIAN)🇮🇳 (@royal_mogile) May 16, 2026 చదవండి: స్క్రిప్ట్ చదివే అలవాటే లేదు: సల్మాన్ ఖాన్ -
సూర్యకు భారీ పారితోషికం.. త్రిషకు మాత్రం ఇదే చివరిసారి!
కోలీవుడ్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "కరుప్పు". తెలుగులో ఈ మూవీ 'వీరభద్రుడు' పేరిట విడుదలైంది. మే 14న విడుదల కావాల్సిన ఈ సినిమా ఒకరోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. దీన్ని ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మించారు. సినిమా పాజిటివ్ టాక్ అందుకుంటున్న నేపథ్యంలో ఎవరెవరు ఎంత పారితోషికం తీసుకున్నారో చూసేద్దాం...పారితోషికంకోలీవుడ్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం హీరో సూర్య రూ.45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట! త్రిష రూ.5 కోట్లు, ఆర్జే బాలాజీ రూ.4 కోట్లు పుచ్చుకోగా కమెడియన్ యోగిబాబు రూ.2 కోట్లు వెనకేసినట్లు తెలుస్తోంది. నటుడు ఇంద్రన్స్ రూ.80 లక్షలు అందుకున్నాడని సమాచారం. స్వసికకు రూ.40 లక్షలు, జార్జ్ మరియన్‌కు రూ.30 లక్షలు ముట్టజెప్పారని భోగట్టా!తర్వాతి నుంచి..ప్రస్తుతం రూ.5 కోట్లతో సరిపెట్టుకున్న త్రిష తన తర్వాతి సినిమాకు మాత్రం పారితోషికం రెట్టింపు చేసిందని ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్- రజనీకాంత్ మూవీలో యాక్ట్ చేసేందుకుగానూ ఏకంగా రూ.12 కోట్లు డిమాండ్ చేసినట్లు వినికిడి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ బ్యూటీని సినిమాలో పెట్టుకునేందుకు అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు సైతం రెడీ అంటున్నారట! ఈ లెక్కన త్రిష తక్కువ పారితోషికం తీసుకున్న చివరి తమిళ సినిమాగా 'వీరభద్రుడు' మిగిలిపోనుందన్నమాట!చదవండి: వీరభద్రుడు మూవీ రివ్యూ -
అబ్బే.. స్క్రిప్ట్ చదివే అలవాటు నాకెక్కడిది?: సల్మాన్ ఖాన్
బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ చిత్రపరిశ్రమకు ఎన్నో ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్బస్టర్లు అందించాడు. తన కెరీర్లో ఎన్నో విజయాలు చూసిన ఈ స్టార్ హీరోకు అసలు స్క్రిప్ట్ చదివే అలవాటే లేదట! ఈ విషయాన్ని తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ మాట్లాడుతూ.. నా జీవితం మొత్తంలో ఒక్కసారి కూడా స్క్రిప్ట్ చదివిందే లేదు. కొన్నిసార్లు నేనే స్క్రిప్ట్ రాశాను కానీ ఎన్నడూ చదివిన పాపాన పోలేదు అని నవ్వుతూ చెప్పాడు. అదన్నమాట సంగతి!గతంలోనూ సల్మాన్ ఈ విషయాన్ని చూచాయగా చెప్పాడు. తనకు కథ కన్నా దాని స్వభావం, అందులోని కమర్షియల్ అంశాలే ముఖ్యమన్నాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కొందరు అతడి నిజాయితీని మెచ్చుకుంటున్నారు. మరికొందరేమో అందుకే సల్మాన్ వరుస వైఫల్యాలు అందుకుంటున్నారని, ఇకనైనా ఈ ధోరణి మార్చుకుని మంచి కథలు ఎంచుకుంటే తిరిగి ట్రాక్ ఎక్కుతాడని హితవు పలుకుతున్నారు.సినిమాప్రస్తుతం సల్మాన్ ఖాన్ మాతృభూమి సినిమా చేస్తున్నాడు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ మూవీలో సైనికాధికారిగా నటిస్తున్నాడు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నాడు. దీనికి మొదట బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పలు కారణాల వల్ల దాన్ని మాతృభూమిగా మార్చారు. అలాగే సల్మాన్.. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో ఓ మూవీ చేస్తున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఈద్‌కు విడుదల కానుంది. -
దేశవ్యాప్తంగా రయ్ రయ్‌మంటూ ‘పెద్ది’ ప్రచారం!
రామ్ చరణ్- బుచ్చిబాబు సాన కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ ‘పెద్ది’. ఈ సినిమాకు సంబంధించిన ప్రచారం రయ్ రయ్ మంటూ మొదలుకానుంది. ఇప్పటివరకు నిశ్శబ్దంగా సాగిన ప్రమోషన్లు మే 18 నుంచి వేగం అందుకోనున్నాయి. జూన్ 2 వరకు దశలవారీగా భారీ ఈవెంట్లు ప్లాన్ చేసినట్లు యూనిట్ ప్రకటించింది. ముందుగా మే 18న ముంబయిలో ట్రైలర్ లాంచ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి చరణ్ హాజరవుతాడు. ఆ తర్వాత మే 22న హైదరాబాద్ ఉప్పల్‌లో మరో భారీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్ చేశారు. దీనికి కూడా చరణ్ హాజరవుతాడు. ఆ మరుసటి రోజు, అంటే మే 23న భోపాల్‌లో స్పెషల్ సాంగ్ రిలీజ్ జరగనుంది. మొదట భోపాల్‌లోనే ట్రైలర్ లాంచ్ చేయాలని అనుకున్నారు కానీ ప్లాన్ మార్చి అక్కడ పాట విడుదలకు నిర్ణయించారు. శృతిహాసన్, చరణ్‌పై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్‌ను భోపాల్‌లో రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ ఈవెంట్‌కు చరణ్ హాజరవ్వడం లేదట. శృతిహాసన్ మాత్రమే పాల్గొననుందని సమాచారం. ఇక తదుపరి ప్రచార కార్యక్రమాల విషయానికి వస్తే.. మే 24న బెంగళూరులో, మే 28న ఢిల్లీలో, మే 30న చెన్నైలో ఈవెంట్లు జరుగుతాయని సమాచారం. జూన్ 1న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఓ ప్రత్యేక కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారట. అలాగే జూన్ 2న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. జూన్ 3న ప్రీమియర్స్‌తో ‘పెద్ది’ సందడి థియేటర్లలో మొదలవనుంది. ప్రస్తుతానికి యూనిట్ అనుకుంటున్న ప్రమోషనల్ ప్లాన్ ఇదే. అయితే రాబోయే రోజుల్లో ఈ షెడ్యూల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇందులో చరణ్ ఎన్ని ఈవెంట్లకు హాజరవుతాడనే అంశంపై కూడా త్వరలోనే స్పష్టత రానుంది. మొత్తంగా, మే 18 నుంచి జూన్ 2 వరకు దేశవ్యాప్తంగా ‘పెద్ది’ ప్రచారం రయ్ రయ్‌మంటూ సాగనుంది. అభిమానుల్లో ఆసక్తి పెంచేలా యూనిట్ వ్యూహాత్మకంగా కార్యక్రమాలను అమలు చేస్తోంది. చరణ్-జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
శర్వానంద్–శ్రీను వైట్ల క్రేజీ కాంబో.. హీరోయిన్గా మానస!
శర్వానంద్ వరుస విజయాలతో దూసుకుపోతూ ఇప్పుడు కామెడీ కింగ్ శ్రీను వైట్లతో కొత్త ప్రాజెక్ట్‌ను ఖరారు చేశారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో కూడిన ఈ సినిమా వినోదానికి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ జోడించబోతున్నట్లు సమాచారం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర నిర్మాణంలో జులై 2026 నుంచి షూటింగ్ ప్రారంభమై వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రంలో శర్వానంద్ సరసన నటించబోయే హీరోయిన్గా మొదట పూజా హెగ్డే, మమితా బైజు వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చినా తాజా సమాచారం ప్రకారం ‘మిస్ ఇండియా’ రన్నరప్ మానస వారణాసి ఎంపికైనట్లు టాలీవుడ్ టాక్. ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాలో తన నటనతో మానస మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో మానస, శర్వాతో జోడీ కట్టడం ఫ్రెష్ ఫీల్‌ను తెస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తుది దశలో ఉంది. త్వరలోనే హీరోయిన్‌తో పాటు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 1960ల నాటి పీరియడ్ డ్రామా ‘భోగి’ షూటింగ్లో శర్వానంద్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఉత్తర తెలంగాణ - మహారాష్ట్ర ప్రాంతాలతో ముడిపడిన ఈ పీరియాడిక్ స్టోరీని పాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తున్నారు. ఇందులో రోహిత్ పాఠక్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 'భోగి' చిత్రం ఆగష్టు 28, 2026న థియేటర్లలో విడుదల కానుంది. -
ప్రభాస్ vs వివేక్ ఒబెరాయ్.. 'స్పిరిట్'కి సందీప్ వంగా వైలెంట్ ట్రీట్
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'స్పిరిట్'. ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. త్వరలోనే ఒక కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్, విలన్ పాత్రధారి వివేక్ ఒబెరాయ్ మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అయితే కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసమే సుమారు రెండు నెలల పాటు సుదీర్ఘంగా షూటింగ్ జరగనుందని సమాచారం. సందీప్ వంగా గతంలో 'యానిమల్'లో హీరో-విలన్ పోరాట సన్నివేశాలను ఎంత పవర్‌ఫుల్‌గా చూపించాడో అందరికీ తెలిసిందే. అదే తరహాలో 'స్పిరిట్'లో కూడా యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకంగా రెండు నెలల సమయం కేటాయించారు. దాంతో ఈ సినిమా ఎంత భారీ స్థాయిలో తెరకెక్కుతుందో తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన సరసన త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. -
Avika Gor: ఇండియా వదిలి వెళ్లిపోతున్న మరో హీరోయిన్
తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటి అవికా గోర్. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. భర్త మిలింద్ చంద్వానీ వృత్తిపరమైన అవకాశాల కారణంగా ఈ జంట భారతదేశాన్ని విడిచి బ్యాంకాక్‌లో శాశ్వతంగా స్థిరపడనుంది. దాదాపు ఏడేళ్ల ప్రేమ తర్వాత 2025 సెప్టెంబర్‌లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు తమ వైవాహిక జీవితాన్ని మరింత ప్రశాంతంగా, కొత్త వాతావరణంలో గడపాలని నిర్ణయించుకున్నారు. తాజాగా అవికా గోర్ ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ తన భర్త మిలింద్ చంద్వానీతో కలిసి బ్యాంకాక్‌కు శాశ్వతంగా మారిన విషయాన్ని వెల్లడించింది. మేము బ్యాంకాక్‌కు మారిపోయాం. అక్కడే ఒక ఇల్లు కూడా కొనుగోలు చేశాం. దాన్ని నా అభిరుచులకు అనుగుణంగా సెట్ చేసుకుంటున్నానను. ఈ మార్పు వెనుక ప్రధాన కారణం మిలింద్కు అక్కడ లభిస్తున్న మెరుగైన వృత్తి అవకాశాలే. ఇద్దరం పరస్పరం చర్చించి, ఒకరి కెరీర్‌ను మరొకరు గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె వివరించింది. మేము చాలా కాలంగా కలిసి ఉన్నాం. ఎప్పుడూ ఒకరి కెరీర్ ఎంపికలకు మరొకరు అండగా నిలుస్తామని అవికా స్పష్టం చేసింది.అయితే దేశం విడిచి వెళ్లినంత మాత్రాన అవికా తన సినీ కెరీర్‌ను వదులుకోవడం లేదు. షూటింగ్స్ ఉన్నప్పుడు బ్యాంకాక్ నుండి ముంబై లేదా హైదరాబాద్‌కు రావడం పెద్ద సమస్య కాదని ఆమె స్పష్టం చేసింది. గతంలోనూ తరచూ ప్రయాణాలు చేసిన అనుభవం ఉండటంతో ఈ మార్పు తన కెరీర్‌పై కూడా ప్రభావం చూపదని అవికా నమ్మకం. హీరోయిన్లు ఇండియా వదిలి వెళ్లిపోవడం కొత్తేం కాదు. ఇప్పటికే చాలామంది విదేశాల్లో సెటిల్ అయ్యారు. కొన్నేళ్ల కిందట ఇలియానా కూడా ఇండియా నుంచి అమెరికా వెళ్లి సెటిలైపోయింది. ఇప్పుడు అవికా గోర్ వంతు. -
Hero Venkat Exclusive Interview: OGలో పవన్‌ని కాలర్ పట్టుకుని..
-
రామ్ చరణ్ 'పెద్ది' గాయాల కథ
పెద్ది సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ ఊహించని విధంగా గాయపడిన విషయం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. కంటికి దెబ్బ తగిలిన వెంటనే అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చిన్నపాటి సర్జరీ చేసి ఇంటికి పంపించారు. ఒక్క రోజు విశ్రాంతి తీసుకుని చరణ్ మళ్లీ వెంటనే సెట్స్‌లో జాయిన్ కావడం అతడి ప్రొఫెషనలిజాన్ని చూపించింది. కంటిపైన ప్లాస్టర్‌తో చరణ్ కనిపించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అభిమానులు ఎంతో బాధపడ్డారు. అయితే తాజాగా ఆ గాయానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకొచ్చాయి. చాలామంది అది క్రికెట్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో చరణ్‌కి బాల్ తగిలి గాయమైందని అనుకున్నారు. కానీ నిజానికి పహిల్వాన్ గెటప్‌లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఏదో బరువైన వస్తువు కంటికి తగిలి గాయం జరిగింది. ఆ గాయం ఇప్పటికీ చరణ్ కంటి పైభాగంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అది బయటపడింది. చరణ్‌కి ఇది మాత్రమే కాదు, జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు, 'చికిరి చికిరి' పాట షూటింగ్ సమయంలో కూడా గాయాల పాలయ్యాడని సమాచారం. ఇక పెద్ది విషయానికి వస్తే.. రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘పెద్ది’పై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ట్రయిలర్ రిలీజ్‌కానుంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ట్రయిలర్‌పైనే ఉంది. ముఖ్యంగా చరణ్ మూడో లుక్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
అలీకి అన్నం పెట్టిన... దాసరి 5 వేలు!
“ఇప్పటికి 1200కు పైగా సినిమాల్లో నటించిన నేను నా తొలి రోజుల్లో పడ్డ కష్టాలను ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ రోజుల్లో నా లాంటి ఎంతోమంది కళాకారులకు అన్నం పెట్టి ఆదరించి, అవకాశాలిచ్చి ఆదుకున్న పెద్ద వ్యక్తి దాసరి” అని ప్రముఖ నటుడు అలీ గుర్తు చేసుకున్నారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తెలుగు దర్శకుడిగా వినుతికెక్కిన బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్గీయ దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ‘వంశీ ఇంటర్నేషనల్’ సంస్థ, దాని అధినేత వంశీ రామరాజు హైదరాబాద్‌లో తెలుగు ‘డైరెక్టర్స్ డే’ జరిపారు. త్యాగరాయగానసభలో జరిగిన ఆ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న అలీ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళారు.అప్పట్లో మద్రాసులో ఏటా డిసెంబర్ 31న దాసరి గారు అయ్యప్ప పూజ నిర్వహించేవారు. సినీ రంగంలోని ప్రముఖుల మొదలు సామాన్యుల దాకా అందరూ దాసరి ఇంట్లోని ఆ పూజకు హాజరయ్యేవారు. పూజయ్యాక అక్కడే అందరికీ భోజన ప్రసాదాలు. అంతేకాకుండా, ప్రతి ఒక్కరికీ రూ. 2 నుంచి రూ. 5 వేల దాకా వేర్వేరు మొత్తాల్లో డబ్బులున్న కవర్లు పంచేవారు. ఎవరికి ఏ మొత్తం ఉన్న కవర్ అందుతున్నది అదృష్టం. కొత్త సంవత్సరం రాబోయే ముందు దాసరి చేతుల మీదుగా అలా డబ్బులు అందుకోవడం శుభసూచకంగా అందరూ భావించేవారు. ముఖ్యంగా, జరుగుబాటు కష్టంగా ఉన్న సామాన్య సినీ కార్మికులు, కళాకారులు అందరూ అధిక మొత్తం డబ్బులున్న కవర్ తమ చేతికి వస్తే బాగుండని ఆశ పడుతుండేవారు.‘వంశీ – దాసరి… ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డు అందుకున్న నటుడు అలీ మాట్లాడుతూ, “పరిశ్రమలో అవకాశాల కోసం కష్టపడుతున్న తొలి రోజుల్లో నేను కూడా దాసరి గారి అయ్యప్ప పూజకు వెళ్ళాను. ప్రసాదం తీసుకున్నాక, దాసరి గారి చేతుల మీదుగా నూతన సంవత్సర శుభాకాంక్షల కవర్ తీసుకున్నాను. బయటకొచ్చి చూస్తే, ఏకంగా రూ.5 వేలున్నాయి అందులో అలా అదృష్టం నన్ను వరించింది. అప్పట్లో నెలకు రెండు పూటలా భోజనానికి మెస్ టికెట్ల కార్డు రూ. 170 కట్టాలి. దానికి కూడా కష్టపడుతున్న నాకు దాసరి వరాలిచ్చిన దేవుడిలా కనిపించారు. ఆ డబ్బుల్లో రూ. 4 వేలు తీసుకెళ్ళి, అప్పటికప్పుడు మెస్ లో కట్టేసి, ఆ డబ్బులకు సరిపడా మెస్ టికెట్ల కార్డులు తీసుకున్నాను. అంటే, ఆ రూ. 4 వేలకు సరిపడా రోజుల దాకా నాకు మద్రాసులో భోజనానికి ఢోకా లేకుండా చేసింది – గురువు గారు దాసరి గారి చేతి చలవే! నాలుగు వేలు పోగా, మిగిలిన వెయ్యి రూపాయలు ఊళ్ళో ఉన్న మా అమ్మ గారికి పంపించాను. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను” అన్నారు.హీరోగా అలీ డేట్లడిగిన దాసరి!నటుడిగా ఎదిగి, హీరోగా ‘యమలీల’తో ఘన విజయం అందుకున్న తర్వాత దాసరితో ఎదురైన మరో అనుభవాన్ని కూడా అలీ పంచుకున్నారు. “కమెడియన్‌గా గుర్తింపు పొందాక ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో హీరోగా ‘యమలీల’తో కమర్షియల్ హిట్ సాధించడం మరో పెద్ద విజయం. ఆ సినిమా సూపర్ హిట్టయిన రోజుల్లో ఒకసారి హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో దాసరి నన్ను చూశారు. ప్రత్యేకంగా నన్ను పిలిచి, అభినందించారు. దాసరి గారి మాతృమూర్తి కన్నుమూసి అప్పటికి కొద్ది కాలమైంది. మదర్ సెంటిమెంట్ నిండిన ‘యమలీల’కు ఆయన బాగా కనెక్టయ్యారు. ‘పిక్చర్ చాలా బాగుందయ్యా. ముఖ్యంగా, అమ్మ పాత్రతో నీ సెంటిమెంట్ సీన్లు చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నీలో ఇంత మంచి నటుడున్నాడనీ, హీరో మెటీరియల్ ఉందని నేను గుర్తించలేదు. నువ్వు డేట్స్ ఇస్తే, నిన్ను హీరోగా పెట్టి ఓ మంచి సినిమా చేస్తా’ అన్నారు దాసరి గారు. నా ఆనందానికి అవధులు లేవు. ఉబ్బితబ్బిబ్బై ‘మీరు ఎప్పుడంటే అప్పుడు చేద్దాం గురువు గారూ’ అన్నాను. కానీ, ఆ తరువాత ఆయన రాజకీయాలు వగైరాతో బిజీ అయిపోవడంతో ఆ ఛాన్స్ తప్పిపోయింది. అనుకున్న ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు” అని అలీ ఆ సంగతులు వివరించారు.“తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీలతో పాటు నేపాలీ భాషలోనూ నటించే అదృష్టం నాకు దక్కింది. తెలుగు నటులమైన నన్ను, బ్రహ్మానందం గారిని అక్కడి నేపాలీ ప్రేక్షకులు గుర్తుపట్టి, అభిమానించడం మరపురాని విషయం. ఇప్పటికి 1200కి పైగా సినిమాల్లో నటించాను. మరో రెండేళ్ళలో 2028లో సినీ రంగంలో నాకు 50 ఏళ్ళు నిండుతాయి. గతంలో బెస్ట్ కమెడియన్, బెస్ట్ హీరో, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్... ఇలా అనేక అవార్డులు వంశీ సంస్థ నుంచి అందుకున్నా, ఇప్పుడు ఇలాంటి సమయంలో వంశీ సంస్థ నుంచి దాసరి గారి పేరిట ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అని గుర్తింపు పొందడం సంతోషంగా ఉంది” అని ఆయన తన ఆనందానుభూతిని పంచుకున్నారు.ఇద్దరు కమెడియన్లను కలిపిన అమ్మ ప్రేమ!మరో ప్రముఖ నటుడు శివారెడ్డి సైతం ఈ సందర్భంగా దాసరి గొప్పదనాన్ని గుర్తు చేసుకున్నారు. “సినీ రంగానికి గురువు లాంటి పెద్దాయన పేరు మీద నాకు ‘నవరస నటుడు’ అంటూ అవార్డుతో అభినందించడం ఎంతో సంతోషంగా ఉంది. అలీ గారికి వారి అమ్మ అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలుసు. అలీ గారినీ, నన్నూ కలిపిన అతి పెద్ద బంధం కూడా అమ్మ ప్రేమ. అమ్మ అనేది రెండక్షరాలే అయినా, ఆ పదంలోని ఆత్మీయత, అనుబంధం అందరికీ ఒకటే. ఆయన నాకు అన్న లాంటివాడే కాదు... సినీ రంగంలోనూ, వ్యక్తిగతంగానూ దేవుడు. నాకు ఆదర్శప్రాయుడు. ఇవాళ ఆయన ఇంటి పక్కనే నేనూ నివసిస్తున్నాను. అది అక్షరాలా అలీ అన్న చలవే” అని శివారెడ్డి వ్యాఖ్యానించారు.ప్రముఖ సాహితీవేత్త వోలేటి పార్వతీశం సభాధ్యక్షులుగా, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మొత్తం 35 మంది ప్రతిభావంతులను అవార్డులతో సముచిత రీతిన సత్కరించడం విశేషం.వివిధ రంగాల్లోని ప్రతిభకు పట్టం!‘ఆపరేషన్ సిందూర్’ లాంటి అంశాన్ని తీసుకొని, ‘వందే భారత్’ చలనచిత్రాన్ని రూపొందించిన దర్శక – నిర్మాత మల్లం రమేశ్‌కు ‘సెన్సేషనల్ ఫిల్మ్’ అవార్డు అందజేశారు. తెలుగునాట రాష్ట్ర ప్రభుత్వాల నంది, గద్దర్ అవార్డులు రెంటినీ పొందిన తొలి జర్నలిస్టు అయిన డాక్టర్ రెంటాల జయదేవకు ప్రత్యేకంగా ‘ఉత్తమ సినీ విమర్శకుడు – చరిత్రకారుడు’ అవార్డును అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేసి, గౌరవించారు. అలాగే, మరో సీనియర్ జర్నలిస్ట్, సినీ గ్రంథ రచయిత, సినీ రచయిత పులగం చిన్నారాయణకు ‘బెస్ట్ ఫిల్మ్ జర్నలిస్ట్’ అవార్డునిచ్చారు.సినీ రంగంతో పాటు సంగీతం, సాహిత్యం, విద్య, వైద్యం, సేవా రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ‘వంశీ – దాసరి గ్లోబల్ అవార్డు’లను అలీ, శివారెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు. అలాగే, ప్రవాస రాష్ట్ర – భారతీయ సంస్థల ప్రతినిధులతో పాటు, ఆదర్శ దంపతులను సైతం ప్రత్యేకంగా గుర్తించి గౌరవించారు.డైరెక్టర్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన దర్శక సమ్రాట్!1972లో స్థాపితమైన వంశీ సంస్థ ఇప్పటికి 54 ఏళ్ళుగా సాంస్కృతిక రంగంలో ఉంటూ, వివిధ దేశాలకు సైతం విస్తరించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పటికే 3 విశ్వవిద్యాలయాల్లో తమ సంస్థ పక్షాన ప్రతిభావంతుల్ని గుర్తించేలా స్వర్ణపతకాలు ఏర్పాటుచేసినట్టు వంశీ రామరాజు వివరించారు. సాహితీ, సినీ రంగాల్లో మరపురాని సేవలు అందించిన మహామహుల్ని క్రమం తప్పకుండా స్మరించుకోవడానికి సంస్థ సాగిస్తున్న కృషిని వోలేటి పార్వతీశం ప్రశంసించారు. “దాసరి కన్నా ముందు ఎందరో దిగ్గజ దర్శకమూర్తులు లేకపోలేదు. వారు ఆణిముత్యాల లాంటి సినిమాలు అందించనూ లేకపోలేదు. కానీ, దర్శకుడికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం తెచ్చి, డైరెక్టర్ పేరు మీద సినిమా చూడాలనే ఆసక్తిని ప్రేక్షకులలో కలిగించిన దిగ్దర్శకుడు దాసరి. కౌటుంబిక కథలు, సన్నివేశాలు, సామాన్యంగా అనిపించే, వినిపించే టైటిల్స్‌తోనే అఖండ విజయాలు సాధించిన దర్శక సమ్రాట్ ఆయన” అని పార్వతీశం విశ్లేషించారు.కళాత్మకత... కమర్షియాలిటీల మేళవింపు!‘సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం’ ఉపకులపతి డాక్టర్ వెలుదండ నిత్యానందరావు సోదాహరణ పూర్వక విశ్లేషణ సాగిస్తూ, “కుటుంబ ఇతివృత్తాలు, వ్యంగ్యం నిండిన డైలాగులు, నూతన ప్రతిభాన్వేషణ, వేగవంతమైన సినీ రూపకల్పన... దాసరి ప్రత్యేకత. ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’ లాంటి చిత్రాల్లో కథావస్తు స్వీకరణలో ఆయన చూపిన కొత్తదనం కనిపిస్తుంది. ‘మేఘసందేశం’ చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన ‘ఆకులో ఆకునై...’ లాంటి గీతాన్ని సందర్భోచితంగా వాడుకోవడం దర్శకుడి కళాత్మకతను తెలియబరుస్తుంది. అందుకే దాసరి అటు కళాత్మకతకు, ఇటు వాణిజ్య అంశాల్ని మేళవించిన అపురూప దర్శకుడు. ఒకప్పుడు ‘వంశీ – బర్కిలీ’ అవార్డు పొందిన ఆయన ఆ పైన తన పేరు మీదే ‘దాసరి – వంశీ’ అవార్డులిచ్చే స్థాయికి ఎదగడం, 150 సినిమాలకు దర్శకత్వం వహించడం అసాధారణం” అని పేర్కొన్నారు. 1987లో ‘ఉదయం’ పత్రికతో దాసరి సృష్టించిన సంచలనాన్ని ప్రస్తావిస్తూ, తాను ఎం.ఏ. విద్యార్థిగా ఉన్న రోజుల్లో తన తొలినాళ్ళ సాహితీ వ్యాసాలెన్నో ఆ పత్రికలోనే వచ్చాయని వైస్ – ఛాన్సలర్ గుర్తు చేసుకున్నారు.ఈ అవార్డుల ప్రదానోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని, వివిధ రంగాల ప్రతిభావంతులను గుర్తించడానికి ప్రభుత్వం, తెలుగు విశ్వవిద్యాలయం ఎప్పుడూ ముందుంటాయని నిత్యానందరావు తెలియజేయడం విశేషం. ఎంతైనా, ఆయనే అన్నట్టు “యోగ్యులనూ, అర్హులనూ గౌరవించి, సత్కరిస్తే... అది వారిని గౌరవించినట్టు కాదు... మనల్ని మనం గౌరవించుకున్నట్టు!”- రెంటాల జయదేవ -
రామ్ చరణ్ 'పెద్ది' ట్రయిలర్ రెడీ.. మూడో లుక్‌పై సస్పెన్స్
రామ్ చరణ్- బుచ్చిబాబు సాన కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు లుక్స్ విడుదలయ్యాయి. మొదట పల్లెటూరి క్రికెటర్‌గా, ఆ తర్వాత పహిల్వాన్ గెటప్‌లో కనిపించిన చరణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ రెండింటికీ అదనంగా మూడో లుక్ కూడా ఉందన్న విషయం ఇటీవలే ప్రచారంలోకి వచ్చింది. కానీ దాన్ని మాత్రం చిత్రబృందం రహస్యంగా ఉంచుతోంది. తాజా సమాచారం ఏంటంటే పెద్ది సినిమా ట్రయిలర్ కట్ ఇప్పటికే రెడీ అయింది. దాన్ని ఈ నెల మూడో వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ట్రయిలర్లో మూడో లుక్‌ను చూపిస్తారా లేక సినిమా విడుదలయ్యాక థియేటర్లోనే చూడాలా అనేది ప్రస్తుతానికి మాత్రం సస్పెన్స్. దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటివరకు ఈ సినిమా కథాంశంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ ట్రయిలర్లో మాత్రం కథను కొంతవరకు టచ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పెద్ది సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏఆర్ రెహమాన్ రీ-రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శృతిహాసన్ ఓ ఐటెం సాంగ్ చేసింది. ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘పెద్ది’పై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ట్రయిలర్‌పైనే ఉంది. ముఖ్యంగా చరణ్ మూడో లుక్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
జైలర్-2 తెలుగు హక్కులపై భారీ చర్చ
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్-2 సినిమాకు తెలుగు హక్కుల ధరను రూ.60 కోట్లుగా మేకర్స్ నిర్ణయించారు. జైలర్ చిత్రం తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో దాని సీక్వెల్‌కు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం. జైలర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఆ విజయాన్ని బట్టి సీక్వెల్‌కు భారీ రేట్లు చెప్పడం సహజమేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే జైలర్‌కు ముందు, ఆ తర్వాత రజనీకాంత్‌కు తెలుగులో పెద్ద విజయాలు లేకపోవడం గమనార్హం. రజనీకాంత్ నటించిన 'కూలి' చిత్రం తెలుగు రైట్స్ రూ.52 కోట్లకు (జీఎస్టీతో కలిపి) అమ్ముడయ్యాయి. వేట్టయాన్ సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చాయి. కానీ పెద్దగా కలెక్షన్లు మాత్రం రాలేదు. ఈ లెక్కలన్నీ పరిశీలించి జైలర్-2కు రూ.60 కోట్ల రేటు ఫిక్స్ చేశారు. దాంతో జైలర్-2కు ఇంత మొత్తానికి బిజినెస్ జరుగుతుందా అనే చర్చ మొదలైంది.జూన్ 12న థియేటర్లలోకి రానున్న జైలర్-2కు ముందు రామ్ చరణ్ 'పెద్ది' సినిమా విడుదల కానుంది. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయితే జైలర్-2కు థియేటర్లు దొరకడం కష్టమవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల చివరి రేటు అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉండే అవకాశం ఉంది. తమిళ దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్లో విగ్రహాల స్మగ్లింగ్ చేసే సిండికేట్‌కు ఎదురెళ్లే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌గా రజనీకాంత్ కనిపించనున్నారు. ఈ కథలో ఎస్జే సూర్య కొత్త విలన్‌గా పరిచయం కానున్నారు. -
'పెద్ది'లో చరణ్ మూడో లుక్..? మెగా అభిమానులకు సర్ ప్రైజ్!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం పెద్ది. పెద్దిపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లుక్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో చరణ్‌కు మూడో లుక్ కూడా ఉందని తెలుస్తోంది. కానీ దాన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నారట. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఫిట్నెస్ ట్రయినర్ వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి.పెద్ది సినిమా తొలి టీజర్లో చరణ్ పల్లెటూరి క్రికెటర్‌గా కనిపించాడు. ఇటీవల పెద్ది పహిల్వాన్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ రెండూ మాత్రమే కాకుండా చరణ్‌కు ఈ చిత్రంలో మరో లుక్ కూడా ఉందనేది తాజా సమాచారం. ఈ మూడో లుక్ మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరికీ పెద్ద సర్ప్రైజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.ఇక ఇదిలా ఉంటే.. మరోవైపు పెద్ది విడుదల తేదీపై సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు జూన్ చివరి వారం రిలీజ్ అని ప్రకటించాడు. కానీ ఇప్పుడు కొత్త ఊహాగానం చెలరేగుతోంది. టాక్సిక్ విడుదల వాయిదా పడటంతో ఆ తేదీకి, అంటే జూన్ 4వ తేదీకి పెద్ది వస్తుందనే ప్రచారం మొదలైంది.చరణ్-జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ధురంధర్-3 కాదు.. కొత్త కాన్సెప్ట్‌తో రణ్వీర్–ఆదిత్య ధర్ ?
దురంధర్ నుంచి వచ్చిన రెండు భాగాలూ ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. అయితే దానికి కొనసాగింపుగా దురంధర్-3 వుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ రణ్వీర్ సింగ్, దర్శకుడు ధర్ ఇద్ధరూ మాత్రం కలుస్తున్నారు.అవును.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ వెంటనే మరో చిత్నాన్ని చేయబోతున్నాడని సమాచారం. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇది దురంధర్-3 మాత్రం కాదట. మరో కొత్త సబ్జెక్ట్‌తో వీరిద్దరూ మరోసారి మన ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైయ్యాయి. వచ్చే ఏడాది మార్చి నెలలో సెట్స్‌పైకి వెల్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం.ఇటీవల ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్ ఇద్దరూ కలిశారు. ఆదిత్య తన దగ్గర ఉన్న కథను రణ్‌వీర్‌కు చెప్పాడట. కథ నచ్చడంతో రణ్వీర్ వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది. దీంతో దర్శకుడు ఈ పాయింట్‌ను ఫుల్ లెంగ్త్ స్క్రిప్ట్‌గా తయారు చేసే పనిలో ఉన్నాడు. ఆదిత్య ధర్ దగ్గర ఇప్పటికే ‘ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ’, ఒక స్పోర్ట్స్ డ్రామా కథలు రెడీగా ఉన్నాయి. కానీ వీటిని పక్కన పెట్టి మరో కొత్త కథతో రణ్వీర్తో సినిమా చేయాలని నిర్ణయించారు. -
#కింగ్ 100.. 'శివ' లుక్‌తో నాగార్జున
టాలీవుడ్ కింగ్ నాగార్జున తన వందో సినిమాను ఎంతో ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పేదరికం నుంచి సంపన్నుడిగా ఎదిగిన ఫార్ములా కథతో సాగనుందని తెలుస్తోంది. ఇందులో నాగ్ ఒక షేడ్‌లో 25 ఏళ్ల యువకుడిలా కనిపించనున్నారని సమాచారం. దాని కోసం చిరంజీవి ఆచార్యలో, రజనీకాంత్ కూలీలో వాడిన అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారట. అంటే దాదాపు శివ సినిమాలో నాగార్జున ఎలా కనిపించారో, అదే వింటేజ్ లుక్‌ను ఈ పాత్రలో మళ్లీ చూపించనున్నారు.ఆచార్య వచ్చిన సమయంలో ఈ టెక్నాలజీ ఖరీదైనది. కానీ ఇప్పుడు ఏఐ అందుబాటులోకి రావడంతో ఖర్చు తగ్గింది, దాంతో వాడకం చాలా సులభమైంది. ఇక దీంతో నాగార్జున వందో సినిమా మరింత ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రంలో టబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. నాగార్జున-టబు జంట 28 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించనుంది. గతంలో వీరిద్దరూ నటించిన నిన్నే పెళ్ళాడతా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. చివరిగా వీరు ఆవిడా మా ఆవిడే చిత్రంలో నటించారు. ప్రస్తుతం టబు షూటింగ్లో పాల్గొంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 75 శాతం పూర్తయింది. దసరా తర్వాత విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే టైటిల్ నుంచి రిలీజ్ డేట్ వరకు ఏదీ ఇప్పట్లో ప్రకటించే ఉద్దేశం లేదు. సినిమా పూర్తయిన తర్వాతే ప్రచారం మొదలుపెట్టాలని నాగ్ నిర్ణయించారు. ఇలా నాగార్జున తన వందో చిత్రంపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. -
20 వంద కోట్ల హిట్స్.. అక్షయ్ కుమార్ అరుదైన ఘనత
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారతీయ సినిమా చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు. అక్షయ్ తన కెరీర్లో ఏకంగా 20 సినిమాలతో 100 కోట్ల నెట్ వసూళ్లు సాధించాడు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి నటుడిగా నిలిచారు. ఖాన్ త్రయం అయిన షారూక్, సల్మాన్, అమీర్లను ఈ విషయంలో మించి అక్షయ్ ముందంజలో నిలిచాడు. ఇక ఈ వరుసలో అక్షయ్ తర్వాత స్ధానంలో సల్మాన్ ఖాన్ 18 సినిమాలతో ఉన్నాడు. ఇలా అజయ్ దేవగన్ 16 సినిమాలతో మూడో స్థానంలో, షారూక్ ఖాన్ 10 సినిమాలతో నాలుగో స్థానంలో, రణ్వీర్ సింగ్ 9 సినిమాలతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. 2012లో హౌస్‌ఫుల్ 2తో తొలిసారిగా 100 కోట్ల క్లబ్లో అక్షయ్ అడుగుపెట్టాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. కరోనా తర్వాత కూడా ఆయన నటించిన ఆరు సినిమాలు వంద కోట్ల మార్కును దాటాయి. తాజాగా విడుదలైన బూత్ బంగ్లాతో ఈ సంఖ్య 20కి చేరింది. రజనీకాంత్, విజయ్, ప్రభాస్ వంటి స్టార్లు కూడా 100 కోట్ల క్లబ్లో ఉన్నారు. కానీ అక్షయ్ స్థాయిలో వరుసగా ఇంత పెద్ద సంఖ్యలో సినిమాలు డెలివర్ చేయలేదు. ఎందుకంటే, హీరోలంతా ఏడాదికి లేదా రెండేళ్లకు ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు. అక్షయ్ మాత్రమే ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తూ ఇలా రికార్డులు సృష్టిస్తున్నాడు. -
నన్ను ఎగతాళి చేశారు.. నేషనల్ అవార్డ్‌తో సమాధానం చెప్పా
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం 'కర' ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ధనుష్‌కు ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచిన 'పొల్లాదవన్' సినిమాలో ఉపయోగించిన బైక్ నంబర్ ప్లేట్‌ను జ్ఞాపికగా అందించారు. దాంతో ధనుష్ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ మలుపు తిరిగిన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పొల్లాదవన్' నా కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాకు ముందు నన్ను చూసి చాలా మంది చాలా బక్కగా ఉన్నావని ఎగతాళి చేసేవారు. కానీ 'పొల్లాదవన్'లో నేను మొదటిసారి సిక్స్ ప్యాక్‌తో కనిపించినప్పుడు ప్రేక్షకులు చప్పట్లతో, ఈలలతో నన్ను స్వాగతించారు. నా జీవితంలో అది మర్చిపోలేని క్షణం. మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. భగవద్గీతలో చెప్పినట్లుగా 'యద్భావం తద్భవతి'. మనం ఏదైనా బలంగా నమ్మితే, దాన్ని సాధించగలం.నా కెరీర్ ప్రారంభ రోజులైన "2002-03 సమయంలో నాకు జాతీయ అవార్డు వస్తుందని ఎవరైనా అంటే అందరూ నవ్వుకునేవారు. కానీ నాకు నా మీద నమ్మకం ఉంది. ఏదో ఒకరోజు ఆ అవార్డు నా చేతిలో ఉంటుందని గట్టిగా నమ్మాను. చివరకు అదే జరిగిందని ధనుష్ అన్నారు. తన పట్టుదల, కృషికి ప్రతిఫలంగా 2010లో ఆడుకాలం, 2019లో అసురన్ చిత్రాలకు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు. అంతేకాదు, నిర్మాతగా కూడా కాక ముట్టై, విసారణై వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇక 'కర' సినిమా విషయానికి వస్తే ధనుశ్, మమిత బైజు జంటగా నటించారు. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేస్తున్నారు. కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతమందించారు. -
కాజల్ రెడీ.. రకుల్ ఇంకా వెయిటింగ్!
నందమూరి బాలకృష్ణ సినిమా నుంచి నయనతార తప్పుకోవడంతో తాజాగా కాజల్ అగర్వాల్‌ను ఆ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారు. దీంతో కాజల్ మరోసారి మెయిన్ లీడ్‌గా టాలీవుడ్లో అడుగుపెడుతోంది. పెళ్లయ్యాక, బిడ్డకు జన్మనిచ్చినా కాజల్ సినిమాలు చేయడం ఆపలేదు. భగవంత్ కేసరి, సత్యభామ, కన్నప్ప వంటి చిత్రాల్లో కాజల్ నటించింది. ఇక ఇప్పుడు మరోసారి ప్రధాన పాత్రతో వస్తోంది. ఇది తనకు రీఎంట్రీ లాంటిదే.అయితే రకుల్ ప్రీత్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. టాలీవుడ్లో ఆమెకు పెద్ద గ్యాపే వచ్చింది. ఆ మద్య వచ్చిన ఇండియన్-2తో మళ్లీ తన ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని ఆశించింది. కానీ ఆ అవకాశాలు ఫలించలేదు. ఆ సినిమా తర్వాత ఆమెకు సౌత్‌లో కొత్త ప్రాజెక్టులు ఏమాత్రం దొరకలేదు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో మాత్రం రకుల్ పలు సినిమాలు చేసింది. మంచి ప్రాజెక్టు దొరికితే సౌత్‌లో తిరిగి అడుగుపెట్టాలని చూస్తోంది. కొత్త ఏడాదిలో సౌత్‌లోకి రీఎంట్రీ చేస్తానని రకుల్ ప్రకటించింది. కానీ ఎందుకో ఇప్పటివరకు ఆ ప్రకటనకు సంబంధించిన ప్రాజెక్టు ఏదీ వెలుగులోకి రాలేదు. -
సీనియర్ హీరోతో తొలిసారి కీర్తి సురేష్
సంక్రాంతి టార్గెట్‌గా దర్శకుడు అనీల్ రావిపూడి మరో కొత్త సినిమాను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే వెంకటేశ్, కల్యాణ్‌రామ్ హీరోలుగా ఫిక్స్ అయ్యారు. ఇక హీరోయిన్ల ఎంపిక కూడా వేగంగా పూర్తి చేశారు. కల్యాణ్‌రామ్ సరసన కృతిశెట్టిని హీరోయిన్గా తీసుకున్న మేకర్స్, తాజాగా వెంకటేశ్ సరసన కీర్తి సురేష్‌ను లాక్ చేశారు. కీర్తి సురేష్ ఇప్పటివరకు యువ హీరోలతోనే ఎక్కువగా నటించింది. కానీ వెంకటేశ్ లాంటి సీనియర్ హీరో సరసన ఫుల్ లెంగ్త్ హీరోయిన్గా నటించడం ఆమె కెరీర్లో ఇదే తొలిసారి. ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించే అవకాశం ఉంది. అనీల్ రావిపూడి హీరోయిన్లను ఒప్పించడంలో ప్రత్యేకత కలిగిన దర్శకుడు. ఇటీవల వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం కోసం నయనతారను ప్రచారానికి ఒప్పించారు. ఇప్పుడు కీర్తి సురేష్‌ను వెంకీ సరసన హీరోయిన్గా తీసుకోవడం అనీల్‌కు పెద్ద సవాల్ కాదు. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ గ్యాప్‌లో విజయ్ దేవరకొండతో చేస్తున్న రౌడీ జనార్థన సినిమాను పూర్తి చేసి, వెంటనే వెంకీతో కొత్త ప్రాజెక్ట్‌లో చేరనుంది కీర్తి. వచ్చే సంక్రాంతి రేసులో ఈ సినిమా ఎలా దూసుకెళ్తుందో చూడాలి. -
మెగా కాంపౌండ్ నుంచి మరో బ్యానర్?
మొదట గీతా ఆర్ట్స్, ఆ తరువాత అంజనా ప్రొడక్షన్స్, కొణెదల ప్రొడక్షన్ కంపెనీ, వి-మెగా పిక్చర్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, పింక్ ఎలిఫెంట్, గీతాఆర్ట్స్-2 అంటూ మెగా కాంపౌండ్‌లో ఇప్పటికే చాలా బ్యానర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నాయి. మరికొన్ని పాక్షికంగా పనిచేస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా గీతాఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద నిర్మాణ సంస్థగా కొనసాగుతోంది. ఇది చిత్ర పరిశ్రమలో అగ్రగామి నిర్మాణ సంస్థలలో ఒకటి.అయితే తాజాగా ఈ లిస్ట్‌లోకి అదనంగా మరో బ్యానర్ వచ్చి చేరేలా ఉంది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, నటుడు అల్లు శిరీశ్ ఓ కొత్త బ్యానర్‌ను స్థాపించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. శిరీశ్ ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. దాంతో ఇప్పుడు కెరీర్ పరంగా కూడా కొత్త దశలోకి ఎంటరయ్యే ప్లాన్స్‌లో ఉన్నాడని తెలుస్తోంది.శిరీశ్ ఇప్పటికే ఓవైపు నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఓవైపు గీతాఆర్ట్స్, మరోవైపు గీతాఆర్ట్స్-2 వంటి నిర్మాణ సంస్థలున్నప్పటికీ శిరీశ్ ఎందుకీ దిశగా ఆలోచిస్తున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. కాగా 38 ఏళ్ల శిరీశ్‌కు కెరీర్లో ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదు.చివరగా బడ్డీ అనే సినిమాలో కనిపించాడు. ఈ నేపథ్యంలో రెండేళ్లుగా సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చాడు. దాంతో అతడు నిర్మాతగా మారే అవకాశం ఉందంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. -
ముంబైకి అల్లు అర్జున్… పుకార్ల వెనుక నిజం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబయిలో సెటిల్ అవుతున్నాడనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయంపై గత రెండు రోజులుగా వరుస కథనాలు వచ్చాయి. దీనికి కారణం, బన్నీ నిజంగానే ముంబయికి షిఫ్ట్ అవ్వడమే. కానీ ఇందులో సగం మాత్రమే నిజం అని తాజా సమాచారం. అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం బన్నీ తమిళ దర్శకుడు అట్లీతో చేస్తున్న ‘రాకా’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రధాన షూటింగ్ మొత్తం ముంబయిలోని ఓ స్టూడియోలో జరుగుతోంది. కీలకమైన ఈ షెడ్యూల్ కారణంగా హైదరాబాద్, ముంబయి మధ్య ప్రయాణం కష్టంగా ఉండటంతో, తాత్కాలికంగా ముంబయిలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఇదే సమయంలో బన్నీ ముంబయిలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడని, అక్కడే శాశ్వతంగా సెటిల్ అవ్వబోతున్నాడని పుకార్లు చెలరేగాయి. కానీ నిజానికి బన్నీ ముంబయిలో ఫ్లాట్ కొనలేదు. కేవలం కొన్ని రోజుల పాటు ఉండటానికి లీజు కింద తీసుకున్నాడని సమాచారం. ఈ విషయాన్ని బన్నీ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ కూడా స్పష్టం చేశారు. ‘రాకా’ షూటింగ్ పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ తిరిగి హైదరాబాద్‌కి వస్తాడు. ఇక బన్నీ, అట్లీతో 'రాకా' సినిమా తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అనిరుధ్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కూడా ఒక సినిమా చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బన్నీ ముంబయిలో ఉన్నది నిజమే కానీ అక్కడే శాశ్వతంగా సెటిల్ మాత్రం అవ్వడం లేదు. -
కెరీర్ పీక్‌లో సంయుక్త… పెళ్లి వార్తలతో హడావిడి
సినీ ఇండస్ట్రీలో మరోసారి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు చర్చనీయాంశమయ్యాయి. గతంలోనూ ఆమె పెళ్లి గురించి రూమర్లు గట్టిగా వినిపించాయి. అయితే ఆ సమయంలో సంయుక్త స్వయంగా స్పందించింది. తన పెళ్లి వార్తలను పక్కన పెట్టాలని, నటిగా తన పనిని మాత్రమే గమనించాలని కోరింది. అయితే తాజాగా మళ్లీ సంయుక్తపై పెళ్లి పుకార్లు గుప్పుమంటున్నాయి. 30 ఏళ్ల ఈ మలయాళీ నటి ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేస్తూ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. ఇక ఈ సమయంలోనే తను పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. కానీ కొంతమంది మాత్రం రష్మిక మందన్న తరహాలో సంయుక్త కూడా పెళ్లి చేసుకొని తన కెరీర్ కొనసాగిస్తుందని అంటున్నారు. త్వరలోనే ఆమె నిఖిల్‌తో కలిసి నటించిన ‘స్వయంభు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతోపాటు ‘బ్లాక్ గోల్డ్’ అనే మరో ప్రాజెక్ట్‌లోనూ నటిస్తోంది. కాగా తాజా పెళ్లి పుకార్లపై సంయుక్త మీనన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
కరుణాకరన్ రీ-ఎంట్రీ.. బెల్లంకొండతో క్రేజీ హీరోయిన్
‘తొలి ప్రేమ, హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్’ వంటి చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన దర్శకుడు కరుణాకరన్. చాలా కాలం తర్వాత మళ్లీ తెరపైకి వచ్చారు. ఆయన దర్శకత్వంలో బెల్లంకొండ గణేశ్ హీరోగా కొత్త సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు వీవీ వినాయక్ ప్రత్యేక అతిథిగా హాజరై, క్లాప్ కొట్టారు. ‘‘న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీగా రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా కరుణాకరన్ శైలిలో సున్నితమైన, ఎమోషనల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది.ఈ చిత్రానికి జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ మాటలు రాస్తున్నాడు. కామెడీ సన్నివేశాల్లో కరుణాకరన్‌కు ప్రత్యేకమైన స్టయిల్ ఉండగా, అనుదీప్‌కు కూడా హాస్యంలో మంచి పట్టుంది. వీరి కలయికతో వినోదం మరింత పెరిగే అవకాశం ఉంది. సంగీతం అందించబోతున్నది భీమ్స్. ఈ సినిమాలో బెల్లంకొండ గణేశ్ సరసన ఓ క్రేజీ హీరోయిన్ను తీసుకోవాలని యూనిట్ నిర్ణయించింది. హీరోయిన్ ఎంపికతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత వెయిట్ యాడ్ కానుంది. కరుణాకరన్, అనుదీప్ కలయికలో రాబోతున్న ఈ సినిమా వినోదభరితంగా ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి. బెల్లంకొండ గణేశ్ కెరీర్లో కూడా ఇది కీలక ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉంది. -
రూ.4500 జీతానికి పని చేస్తున్న స్టార్ హీరో కొడుకు
ఆ యువకుడి తండ్రి ఓ స్టార్ హీరో. కోట్ల ఆస్తి ఉంది. సినిమాల్లోకి వస్తానంటే.. దర్శకనిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కడతారు. కానీ ఇవన్నీ వదులుకోని ఓ సాధారణ యువకుడిలా జీవితం గడుపుతున్నాడు. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు అరవ్ భాటియా. 24 ఏళ్ల వయసు ఉన్న ఈ యువకుడు.. అనుకుంటే ఈ పాటికే హీరో అయిపోయేవాడు. కానీ నటన అంటే ఆయనకు ఇష్టం లేదు. ఫ్యాషన్ రంగంలో రాణించాలనేది ఆయన కల. అందుకే ప్రస్తుతం ఆ ఫీల్డ్‌లో రూ. 4500 జీతానికి పని చేస్తున్నాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ వెల్లడించారు.‘అరవ్కి పని చేయడం ఇష్టం. సినిమా రంగంలోకి రావాలనుకోవట్లేదు. ప్రస్తుతానికి అతనికి ఎలాంటి ప్లాన్స్ లేవు కానీ ఫ్యాషన్ రంగంలోకి వెళ్లాలనుకుంటున్నాడు. ఇప్పటికే ఆ ఫీల్డ్‌లో రూ. 4500 జీతానికి పని చేస్తున్నాడు. గ్రామాలు తిరుగుతూ ఫ్యాషన్‌పై అధ్యయనం చేస్తున్నాడు. హీరో కొడుకునని ఎక్కడ చెప్పుకోడు. నేను కూడా వాడిని సినిమాల్లోకి రావాలని ఫోర్స్ చేయను. తనకు నచ్చిన పని చేసుకోమని చెబుతాను. తండ్రిగా వాడికి ఎలాంటి క్లాసులు తీసుకోని కానీ.. ‘ఎవరికీ హానీ చేయొద్దు.. బాధ పెట్టొద్దు’ అని మాత్రం చెబుతాను’ అని అక్షయ్ చెప్పుకొచ్చాడు. -
బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి 'రహ్మాన్ డకాయత్' అడుగులు
‘ధురంధర్-1’లో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా పోషించిన రహ్మాన్ డకాయత్ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పాత్రతో అక్షయ్‌కు ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది. దీంతో ఈ సీనియర్ నటుడు తన రెండో ఇన్నింగ్స్‌ను మరింత జోరుగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు.తాజా సమాచారం ప్రకారం.. టాలీవుడ్ నుంచి అక్షయ్ ఖన్నాకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. అది దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి వచ్చిన ఆఫర్ అని సినీ వర్గాల్లో ఓ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. విక్టరీ వెంకటేశ్‌తో తీస్తున్న సినిమా సెట్స్‌పై ఉంది. అలాగే జూ.ఎన్టీఆర్ హీరోగా ఓ మైథలాజికల్ కథను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రెండిటిలో ఏదో ఒక సినిమా కోసం అక్షయ్ ఖన్నా పేరు పరిశీలనలో ఉందని సమాచారం.అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటిస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ.. టాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఖచ్చితమని తెలుస్తోంది. ఎందుకంటే బాలీవుడ్ నటులు ఇప్పుడు టాలీవుడ్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సంజయ్ దత్, ఇమ్రాన్ హష్మి వంటి పలువురు నటులు ఇప్పటికే తెలుగు ప్రాజెక్టుల్లో నటించారు. మరికొందరు బాలీవుడ్ నటులు కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి అక్షయ్ ఖన్నా లాంటి ప్రతిభావంతుడైన నటుడిని టాలీవుడ్ వదులుకోదు. ఆయనకు మంచి పాత్రలు దక్కడం ఖాయం. -
జూ. ఎన్టీఆర్ 'డ్రాగన్' రూమర్స్‌కు చెక్ పెడతారా?
జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'డ్రాగన్'పై ఊహాగానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమా టైటిల్ నుంచి మొదలుకొని దాని కథ, షూటింగ్ షెడ్యూల్, నటీనటులు, ఇలా ఏ అంశంపై కూడా స్పష్టత లేకపోవడంతో అభిమానులు, సినీ వర్గాలు చర్చల్లో మునిగిపోయాయి. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు వాయిదా పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఒక దశలో కథనే పూర్తిగా మార్చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ అనిశ్చితి మధ్య ఎన్టీఆర్ బాడీ బిల్డింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే దానిపై కూడా విమర్శలు చెలరేగాయి.ఇటీవలే మళయాళ నటుడు టొవినో థామస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి అధికారికంగా బయటపడింది. అతడు ఎన్టీఆర్ సోదరుడి పాత్ర చేయాల్సిందని సమాచారం. అయితే తాజాగా ఆ పాత్ర కోసం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌ను సంప్రదిస్తున్నారనే కథనాలు వస్తున్నాయి. సినిమాలో మరో కీలక పాత్ర కోసం ఆలియా భట్‌ను కూడా సంప్రదించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్-ఆలియా మధ్య ఓ పాట కూడా ఉంటుందనే ప్రచారం ఉంది. ఈ సినిమాను 'గోల్డెన్ ట్రయాంగిల్' నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్ కలిసే ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఒకప్పుడు ఇది మాదకద్రవ్యాల ఉత్పత్తికి అతిపెద్ద కేంద్రం. ఈ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని 'డ్రాగన్' వస్తోందని అంటున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా అప్డేట్స్ వస్తాయని ప్రచారం జరుగుతోంది. టీజర్ వస్తుందనే మాటలు వినిపిస్తున్నా, అభిమానులు మాత్రం టీజర్ సంగతి పక్కనపెడితే, కనీసం టైటిల్, రిలీజ్ డేట్ చెప్పండి చాలు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. డ్రాగన్ చుట్టూ నడుస్తున్న ఊహాగానాలు, ప్రచారాల్లో కొన్నింటికి వచ్చే నెలలో తెరపడే అవకాశం ఉంది. ఎన్టీఆర్ బర్త్‌డే కానుకగా సినిమా టైటిల్, రిలీజ్ డేట్ లేదా టీజర్ రూపంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
'డెకాయిట్'లో హీరోయిన్ మార్పు నిర్ణయం సరైనదేనా?
కొన్ని నెలల క్రితం 'డెకాయిట్' చిత్రంలో హీరోయిన్గా ఎంపికైన శృతి హాసన్ అనుకోకుండా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అయితే తను స్వచ్ఛందంగా తప్పుకుందా లేక డెకాయిట్ టీమ్ తొలగించిందా అన్నది స్పష్టంగా తెలియదు. కానీ ఆ పాత్రకు ఆమెకు సంబంధం లేకుండా పోయింది. వెంటనే ఆ స్థానంలో మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్నారు.అయితే ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత, మృణాల్ పోషించిన "సరస్వతి" పాత్రపై చర్చలు మొదలయ్యాయి. శృతి అభిమానులు ఈ పాత్రను ఆమె మరింత బాగా పోషించి ఉండేదంటున్నారు. కానీ తెరపై మృణాల్ నటన చూసిన ప్రేక్షకులు మాత్రం ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేసిందని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో డెకాయిట్ టీమ్ తీసుకున్న నిర్ణయాన్ని వంద శాతం సమర్థిస్తున్నారు.నటనలో శృతిని తక్కువ చేసి చూడలేం. తను కూడా ఈ పాత్రను బాగా చేసి ఉండేది. కానీ ప్రేక్షకులు ఆమెను తెరపై చూడలేకపోయారు. ఆ అవకాశాన్ని మృణాల్ చాలా బాగా సద్వినియోగం చేసుకుంది. సినిమాలో శృతి లేని లోటును మృణాల్ తీర్చిందనే చెప్పాలి. మొత్తానికి శృతి హాసన్ ఒక మంచి పాత్రను మిస్ అయింది. అదే సమయంలో మృణాల్ ఠాకూర్ తన కెరీర్లో మరో బలమైన పాత్రను సంపాదించుకుని ఆ పాత్రకు న్యాయం చేసింది. -
విజయ్ జననాయగన్ లీక్ సీన్స్ కలకలం
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన భారీ చిత్రం 'జననాయగన్' పైరసీ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ సినిమా నుంచి దాదాపు గంటకు పైగా కంటెంట్ లీక్ కావడంతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఫుల్ సినిమానే లీక్ అయినప్పటికీ వెంటనే దానిని అడ్డుకోవడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యారు. అయితే కొన్ని క్లిప్పులు మాత్రం వాట్సాప్ ఫార్వార్డుల రూపంలో విస్తృతంగా వ్యాపించాయి. కాగా లీక్ అయిన వీడియోలు చూసి కొంతమంది సోషల్‌మీడియా జనాలు రివ్యూలు చెబుతున్నారు. అయితే లీక్ సీన్స్‌లోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదంగా మారాయి. తమిళ దర్శకుడు-నటుడు అమీర్ తమను ఉగ్రవాదులుగా చూపించారు. ఇదేనా మీ రాజకీయం?.. అంటూ ప్రశ్నించారు. సినిమాలో ఇలాంటి రాజకీయ కోణం ఎక్కువగా ఉండటంతోనే ఇంతకాలం సెన్సార్ క్లియర్ కాలేకపోయిందని అమీర్ అనుమానం వ్యక్తం చేశారు. కానీ సగటు సినీ అభిమానులు మాత్రం లీక్ సీన్స్‌లను ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో రాజకీయంగా ఈ లీకేజీ వ్యవహారం విజయ్ పాపులారిటీని మరింత పెంచుతుందనే చర్చ కూడా నడుస్తోంది. అయితే విజయ్ స్టార్ పవర్ వల్ల లీక్ క్లిప్పులు పాపులారిటీని పెంచినా, నిర్మాతలు మాత్రం భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. -
చరణ్ సినిమా.. ఆదిత్య ధర్–భన్సాలీ పేర్ల హడావిడి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లైనప్‌పై బాలీవుడ్ నుంచి వరుసగా లీకులు వస్తున్నాయి. ఇప్పటివరకు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉందనే క్లారిటీ ఉండగా, తాజాగా ఆదిత్య ధర్ – సంజయ్ లీలా భన్సాలీ పేర్లు వినిపించడం ఆసక్తికరంగా మారింది. ధురంధర్-2 వంటి సూపర్ హిట్ తర్వాత ఆదిత్య ధర్ ఒక మల్టీస్టారర్ కథను సిద్ధం చేస్తున్నాడని, అందులో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కథ చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. అయితే ఇప్పుడు చరణ్ పేరు మరోసారి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ – చరణ్ కాంబోపై కూడా వార్తలు వస్తున్నాయి. అటవీ నేపథ్యంలో హిస్టారికల్ అడ్వెంచర్ కథను భన్సాలీ తెరకెక్కించే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. గతంలో ‘మహారాజా సుహేల్ దేవ్’ అనే ప్రాజెక్ట్‌పై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అయితే అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోపై చర్చ మొదలవడంతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే దర్శకుడు సుకుమార్, చరణ్‌తో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం వల్లే ఈ గాసిప్పులు ఎక్కువయ్యాయి. చరణ్ బర్త్‌డే సందర్భంగా ఏదైనా ప్రకటన వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దాంతో బాలీవుడ్ వైపు నుంచి వరుసగా ఇలాంటి లీకులు వస్తున్నాయి. -
ధురంధర్ నటుడికి రూ.1 కోటి? అసలు నిజమిదే!
గత ఐదు నెలలుగా 'ధురంధర్' సినిమా పేరు మారుమోగిపోతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ బ్లాక్‌బస్టర్ కాగా రెండో భాగం అంతకు మించిన ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద పారిస్తోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులందరికీ మంచి గుర్తింపు లభించింది.రూ.1 కోటి రెమ్యునరేషన్ఈ క్రమంలో 'ధురంధర్'లో హైజాకర్ జహూర్ మిస్త్రీగా యాక్ట్ చేసిన నటుడు వివేక్ సిన్హ గురించి ఓ వార్త వైరలవుతోంది. అతడు ఈ చిత్రానికిగానూ ఏకంగా రూ.1 కోటి పారితోషికం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్‌పై తాజాగా వివేక్ సిన్హ స్పందించాడు. 'తమ్ముళ్లూ.. నాకు రూ.60 లక్షలు, రూ.80 లక్షలు, ఏకంగా రూ.1 కోటి ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ఒట్టేసి చెప్తున్నా, నాకంత డబ్బు ఇవ్వలేదు. అనవసరంగా ఏదేదో ప్రచారం చేయకండి.ఎప్పుడో ఖర్చయిందిఅలా అని నాకు మొత్తానికే డబ్బు ఇవ్వలేదని కాదు. నేను అనుకున్నంత పారితోషికం ఇచ్చారు. కానీ మీరనుకునేంత కాదు. నాకు ఇచ్చినదంతా ఎప్పుడో ఖర్చు పెట్టేశాను కూడా! నేను ముంబైలో ఉంటాను కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువే.. కాబట్టి ఎవరికీ సాయం చేసే పరిస్థితిలో నేను లేను. నాకు ఇలాగే మంచి అవకాశాలు రావాలని కోరుకోండి. అప్పుడు నేను బాగా సంపాదించగలను.. మీకు తిరిగి సాయం చేయగలను' అని వివేక్ సిన్హ తెలిపాడు. View this post on Instagram A post shared by vivek sinha (ज़हूर मिस्त्री) (@viveksinhaactor)చదవండి: సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బూతు కంటెంట్? క్లారిటీ ఇచ్చిన నటి -
సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బూతు కంటెంట్.. క్లారిటీ ఇచ్చిన నటి
ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రిప్షన్ గోల ఎక్కువైపోయింది. చాలామంది సబ్స్క్రిప్షన్ అనగానే అక్కడేదో బూతు కంటెంట్ ఉంటుందని భావిస్తున్నారు. తన దగ్గర మాత్రం అలాంటివి ఆశించొద్దంటోంది మలయాళ నటి అన్నా రేష్మ రాజన్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. నా అకౌంట్లో సబ్స్క్రిప్షన్ మోడల్‌ను రెండేళ్ల క్రితమే ప్రారంభించాను. దాని ద్వారా మీ అందరితో కనెక్ట్ అయ్యాను. సబ్స్క్రిప్షన్ వల్ల నా రీల్స్, ఫోటోలు మీకు ముందుగానే వస్తాయి. ఏదో ఊహించొద్దుఅలాగే మీరు నాతో కాస్త ఎక్కువగా కనెక్ట్ అవొచ్చు. అంతే తప్ప సబ్స్క్రిప్షన్ అంటే అక్కడేదో బూతు కంటెంట్ ఉంటుందని కాదు. కేవలం క్వాలిటీ, సృజనాత్మకత, గౌరవప్రదమైన సంభాషణలు మాత్రమే ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ఏదో ఊహించి రాకండి. కేవలం వృత్తిపరమైన విషయాలు మాత్రమే ఉంటాయని మీకు క్లియర్‌గా చెప్తున్నా అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు మంచి పని చేశావని మెచ్చుకుంటున్నారు. సినిమాకొందరు నెటిజన్లు మాత్రం.. నీ రీల్స్, ఫోటోలు ముందుగా చూడటానికి సబ్స్క్రిప్షన్ దేనికో? అని సెటైర్లు వేస్తున్నారు. కాగా నటి అన్నా రాజన్.. 2017లో 'అంగమలి డైరీస్' మూవీలో మలయాళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రంలో పృథ్వీరాజ్ భార్యగా నటించింది. మలయాళంలో పలు సినిమాలు చేసిన ఈ నటి ప్రస్తుతం జైలర్ 2లో నటిస్తోంది. తమిళంలో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం! View this post on Instagram A post shared by Anna raajan (@annaspeeks) చదవండి: మైండ్ బ్లాక్ అయ్యే సిరీస్.. ఓటీటీలో ఎప్పుడంటే? -
ఆ బాధ నాకే ఎక్కువ తెలుసు..: విజయ్ దేవరకొండ
ఒక సినిమా రూపుదిద్దుకోవడం వెనక వందలాది మంది కష్టం దాగి ఉంటుంది. ఆ మూవీ రిలీజై ఆదరణ పొందినప్పుడు వారి శ్రమకు తగ్గ ఫలితం దక్కినట్లు లెక్క! కానీ రిలీజ్‌కు ముందే పైరసీ బారిన పడితే వారి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఈ పైరసీ అతిపెద్ద భూతంగా మారింది. తాజాగా విజయ్ చివరి మూవీ జననాయగణ్ సినిమాకు లీకుల బెడద తప్పలేదు.జననాయగణ్ లీక్థియేటర్లలో విడుదలవడానికి ముందే ఈ చిత్రంలో అనేక సన్నివేశాలను ఆన్లైన్లో లీక్ చేశారు. దీనిపై చిత్రనిర్మాణ సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరైనా ఆ పైరసీ వీడియోలు చూసినా, షేర్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామంది. ఇక ఎంతోమంది సెలబ్రిటీలు జన నాయగణ్కు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా గళం విప్పుతున్నారు.ఆ బాధ అనుభవించా..తాజాగా హీరో విజయ్ దేవరకొండ సైతం ఈ విషయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 'జననాయగణ్ సినిమా లీక్ అయిందన్న విషయం తెలిసి నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే సినిమా లీకైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు.. కెరీర్ తొలినాళ్లలోనే ఆ బాధను, నష్టాన్ని చవిచూశాను. మనల్ని టార్గెట్ చేయడంతో మన ఆశలన్నీ అడియాసలైపోతాయి. నేను కేవలం నా గురించి మాత్రమే చెప్పడం లేదు. నటులు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా సినిమాలో భాగమైన ఎంతోమందికి ఇదే వర్తిస్తుంది.ఎంత దిగజారుతున్నారు?ప్రస్తుత సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. అలాగే దీని వెనక ఉన్న వ్యక్తులను గుర్తించాలి. అది గనక చేయలేకపోతే అది వ్యవస్థ వైఫల్యమే అవుతుంది. అవతలివారికి హాని చేయడానికి మనుషులు ఎంత దిగజారుతున్నారు? అనేదానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న జననాయగణ్ మూవీ టీమ్‌కు నా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది' అని ట్వీట్ చేశాడు.టాక్సీవాలాకాగా విజయ్ దేవరకొండ కెరీర్ తొలినాళ్లలో టాక్సీవాలా సినిమా చేశాడు. ఈ మూవీ కూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే లీక్ అయింది. అది చూసి విజయ్ మానసిక క్షోభ అనుభవించాడు. తన పనైపోయిందని గదిలో కూర్చుని ఏడ్చాడు. ఏదైతే అదైందని, సినిమా రిలీజ్ చేద్దామని పట్టుబట్టాడు. అలా పైరసీ జరిగిన సినిమాను థియేటర్లలో విడుదల చేసి మరీ హిట్టు కొట్టాడు. The #JanaNayagan leak makes me angry.I’ve experienced personally the pain and sense of loss when something like this happens, early in my career. You feel like a target, you feel a loss of hope, it’s not just about me, there are co-actors, directors, producers, and so many who…— Vijay Deverakonda (@TheDeverakonda) April 11, 2026 చదవండి: డెకాయిట్‌కు ఊహించని కలెక్షన్స్.. తొలిరోజు ఎంతంటే? -
డెకాయిట్ 1st డే కలెక్షన్స్: శేష్ కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్..
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం డెకాయిట్. ప్రేమకథ, యాక్షన్ మేళవించి ఉన్న చిత్రాన్ని షానియల్ డియో డైరెక్ట్ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. సునీల్ నారంగ్ సహనిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఫస్ట్ డే కలెక్షన్స్భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం తొలిరోజు మంచి వసూళ్లు రాబట్టింది. ఏకంగా రూ.15 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఇంత భారీ ఓపెనింగ్స్ రావడం అడివి శేష్ కెరీర్లో ఇదే మొదటిసారి! మరి మొదటిరోజే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిన డెకాయిట్ రానున్నరోజుల్లో ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి!సినిమా కథతక్కువ కులానికి చెందిన హరి (అడివి శేష్)ని అగ్రకులానికి చెందిన సరస్వతి (మృణాల్ ఠాకూర్) ప్రేమిస్తుంది. కానీ, కులం కారణంగా ఇద్దరూ విడిపోతారు. ఈ క్రమంలో ఓ కేసులో అబద్ధపు సాక్ష్యం చెప్పి హరిని జైలుకు పంపిస్తుంది సరస్వతి. 13 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన హరి తర్వాత అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను కేసులో ఇరికించిన సరస్వతిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఇంతలో హరి, సరస్వతికి డబ్బు సమస్య వస్తుంది. మరి హరి.. సరస్వతిపై పగ తీర్చుకున్నాడా? డబ్బు కోసం ఇద్దరు కలిసి ఏం చేశారు? అతడు సరస్వతి అతడిని జైలుకు ఎందుకు పంపించింది? అన్నది డెకాయిట్ చూసి తెలుసుకోవాల్సిందే! #Dacoit opens with a BANG ❤️🔥❤️🔥15 CRORES+ GROSS ON DAY 1 🔥The Biggest opening ever for @AdiviSesh 💥💥💥Don’t miss it in theatres near you 🤩Book your tickets now!🎟️ https://t.co/jOhNHoshAS#AudienceBlockbusterDacoit pic.twitter.com/3WON13una1— Annapurna Studios (@AnnapurnaStdios) April 11, 2026 చదవండి: డెకాయిట్ మూవీ రివ్యూ -
మైండ్ బ్లాక్ అయ్యే సిరీస్.. ఓటీటీలో ఎప్పుడంటే?
కొన్ని వెబ్ సిరీస్‌లు చూడటం మొదలుపెడితే మధ్యలో ఆపేయడం చాలా కష్టం. గంటల తరబడి స్క్రీన్కు అతుక్కుపోయి మరీ ఆ సిరీస్‌ను పూర్తి చేయాలనిపిస్తుంది. ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేస్తూ ప్రేక్షకుల్ని తన వశం చేసుకుంటాయి. అలాంటి సిరీసే "ఫ్రమ్". ఇదొక అమెరికన్ సైన్స్ ఫిక్షన్, హారర్ సిరీస్. జాన్ గ్రిఫిన్ సృష్టించిన ఈ సిరీస్ 2022లో ఓటీటీలో విడుదలైంది. నాలుగో సీజన్కథ, డైరెక్షన్ అద్భుతంగా ఉండటంతో సూపర్ హిట్ సిరీస్‌గా నిలిచింది. దీంతో 2023లో రెండో సీజన్, 2024లో మూడో సీజన్ విడుదలయ్యాయి. కానీ నాలుగో సీజన్ మాత్రం వెంటనే రిలీజవ్వలేదు. దీంతో నాలుగో సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఫ్రమ్ సిరీస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ ఎదురుచూపులకు తెరపడింది. ఏప్రిల్ 20న ఫ్రమ్ నాలుగో సీజన్ విడుదలవుతోంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా వెల్లడించింది. దీంతో ఫ్రమ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.సిరీస్‌లో అసలేముంది?రోడ్డుపై జాలీగా వెళ్తుంటే సడన్‌గా ఓ భారీ చెట్టు పడిపోతుంది. దాంతో వాహనదారులు పక్కనే ఉన్న ఇంకో దారి గుండా వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఆ దారి ఒక నిర్మానుష్యమైన టౌన్‌కు దారి తీస్తుంది. ఎంతసేపు ప్రయాణించినా చివరకు ఎక్కడ మొదలయ్యారో అక్కడికే వస్తారు తప్ప గమ్యాన్ని చేరుకోలేరు. దాంతో రాత్రి ఆ టౌన్లో సేద తీరేందుకు వెళ్తారు. అయితే అక్కడ రాత్రి అయిందంటే చాలు దెయ్యాలు మనుషుల్ని చంపేందుకు బయటకు వస్తాయి. అవి ఇంట్లోకి రాకుండా తలుపుకు ఒక లాకెట్ పెడతారు. కానీ కిటికీ తెరిస్తే మాత్రం అవి లోపలకు వచ్చి రక్తపాతం సృష్టిస్తాయి. రోడ్డు మీద వెళ్లే ఒక్కొక్కరూ నెమ్మదిగా ఈ టౌన్లో స్థిరపడుతూ ఉంటారు. రాత్రవగానే బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. ఎప్పటికైనా తిరిగి ఇంటికి చేరుకోవాలన్న ఆశతో బతుకుతుంటారు. మరి వారు ఇంటికెళ్లే మార్గాన్ని కనుగొన్నారా? అసలు ఈ భయంకర ప్రదేశాన్ని ఎవరు సృష్టించారు? అందుకు గల కారణాలేంటి? అన్నది నాలుగో సీజన్లో అయినా బయటపెడతారేమో చూడాలి! time to shut the windows 🫣#FromOnPrime, New Season, April 20 pic.twitter.com/YBOVGHAv04— prime video IN (@PrimeVideoIN) April 10, 2026 చదవండి: రూ.10 కోట్ల మోసం.. మంగ్లీపై కేసు -
'జన నాయగణ్' లీక్.. కావాలనే చేశారు: కమల్ హాసన్
దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగణ్. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ సెన్సార్ సమస్య కారణంగా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. దీంతో ఓటీటీ డీల్ కూడా రద్దయింది. ఈ క్రమంలో జననాయగణ్ సినిమా సోషల్ మీడియాలో లీకవడం సంచలనంగా మారింది. ప్రారంభ సన్నివేశాలు సహా సినిమాలోని అనేక సీన్స్ ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి.అందుకే ఇలా..ఈ ఘటనపై శివకార్తికేయన్, చిరంజీవి సహా ఎంతోమంది సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీని అరికట్టాలని, తమ కష్టాన్ని గౌరవించాలని కోరారు. తాజాగా ఈ వ్యవహారంపై లోకనాయకుడు కమల్ హాసన్ స్పందించారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదని, వ్యవస్థ వైఫల్యం వల్లే ఇలా జరిగిందని మండిపడ్డారు. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో సకాలంలో రిలీజ్ అవలేదని, ఈ కారణం వల్లే పైరసీకి అవకాశం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఎవరు కాపాడతారు?ఇది కళ, కళాకారుడిపై జరిగిన దాడి అని అభివర్ణించారు. ఇలాంటి చర్యలు వందలాది కళాకారులు, సాంకేతిక నిపుణులు, థియేటర్ ఓనర్లు, నిర్మాతలను ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. వ్యవస్థ విఫలమైనప్పుడు సినిమాను ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. సినీ ప్రియులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి పైరసీ చేసేవాళ్లకు గట్టి సమాధానమివ్వాలని కోరారు. గతంలో తనకు మద్దతుగా నిలబడినట్లే జననాయగణ్ సినిమాకు సైతం అంతే అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రజనీ రియాక్షన్ఈ ఘటనపై రజనీకాంత్ సైతం స్పందిస్తూ.. 'ఇంటర్నెట్లో జననాయగణ్ రిలీజైందన్న విషయం తెలిసి షాకయ్యాను. సినిమా సంఘాలు ఇటువంటి విషయాలపై తీవ్రంగా స్పందించాలి. ప్రభుత్వం పైరసీకి పాల్పడ్డ వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదు' అని ట్వీట్ చేశారు. The leak of #Jananayagan is not an accident - it is the result of systemic failure. Had due process been timely, we would not be here. Inordinate delays in certification created fertile ground for piracy. When legal access is stalled, illegitimate channels take over.Piracy is…— Kamal Haasan (@ikamalhaasan) April 10, 2026ஜனநாயகன் திரைப்படம் இணையத்தில் யாராலோ வெளியிடப்பட்டிருப்பது அதிர்ச்சியையும்,வேதனையையும் அளிக்கிறது. திரை அமைப்புகள் இதற்கு எதிராகக் குரல் எழுப்பி, அரசு இதைச் செய்தவர்களைக் கண்டுபிடித்து கடுமையான தண்டனை அளிக்க வேண்டும். இது போன்ற குற்றம் இனியும் தொடரக்கூடாது.— Rajinikanth (@rajinikanth) April 10, 2026 చదవండి: మా సినిమాను ధురంధర్‌తో పోల్చకండి: దర్శకుడు -
రూ.10 కోట్ల మోసం.. సింగర్ మంగ్లీపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గాయని మంగ్లీపై పోలీసు కేసు నమోదైంది. మంగ్లీ తనను రూ.10 కోట్ల మేర మోసం చేసిందంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని తెలిపాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు.. మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 351 (2), 352 కింద వీరిపై కేసు నమోదైంది.మంగ్లీ నేపథ్యంమంగ్లీ అసలు పేరు సత్యవతి చౌహాన్. తీన్మార్ వార్తలు ప్రోగ్రామ్‌లో తెలంగాణ యాసలో మాట్లాడుతూ పాపులర్ అయింది. ఆ తర్వాత బతుకమ్మ, బోనాలు, భక్తి పాటలు పాడుతూ జనానికి మరింత దగ్గరైంది. పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లో అయినా తెలంగాణ జానపదంపై తనకు మంచి పట్టుంది. తను పాడిన ఎన్నో పాటలు లక్షలాది వ్యూస్‌ను రాబడుతూ సోషల్ మీడియాను షేక్ చేశాయి.సినిమాల్లో సాంగ్స్ఇదే స్పీడుతో తర్వాత సినిమాల్లోనూ ఎంటర్ అయింది మంగ్లీ. శైలజా రెడ్డి అల్లుడు మూవీలో 'శైలజా రెడ్డి అల్లుడు చూడే' సాంగ్ పాడింది. జార్జ్ రెడ్డిలో 'వాడు నడిపే బండి', అల వైకుంఠపురములోలో 'రాములో రాములా', సీటీమార్లో 'జ్వాలారెడ్డి', లవ్‌స్టోరీలో 'సారంగదరియా', రౌడీ బాయ్స్‌లో 'బృందావనం నుంచి', విక్రాంత్ రోనాలో 'రారా రక్కమ్మా', ధమాకాలో 'దండకడియాల్', 'జింతాక్' , బలగంలో 'ఊరు పల్లెటూరు..' ఇలా ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించింది. చదవండి: ఓటీటీలో సూపర్ హిట్ మూవీ.. తాయ్ కిళవి రివ్యూ -
మా సినిమాను ధురంధర్‌తో పోల్చకండి: దర్శకుడు
ఆర్య హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ ఎక్స్. గౌతమ్ రామ్ కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్ ప్రధాన పాత్రలు పోషించారు. అనగా, అతుల్య రవి, రైసా విల్సన్, సంజనా సింగ్, కాళీ వెంకట్, జయప్రకాశ్ కీలక పాత్రల్లో నటించారు. ఎఫ్ఐఆర్ ఫేమ్ మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ గురువారం (ఏప్రిల్ 9న) ప్రీరిలీజ్ కార్యక్రమం నిర్వహించింది.ఈ సందర్భంగా మంజు వారియర్ మాట్లాడుతూ.. స్పై థ్రిల్లర్ కథా చిత్రంలో నటించడం తన అదృష్టమని పేర్కొంది. గౌతమ్ రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. ఇది 70 శాతం యాక్షన్ సన్నివేశాలతో కూడిన సినిమా అన్నారు. దర్శకుడు మను ఆనంద్.. ఈ మూవీ ప్రపంచంలో ఏడు చోట్ల జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా అని తెలిపారు. హిందీ మూవీ ధురంధర్ కూడా వాస్తవ సంఘటనలతో రూపొందినా.. ఆ చిత్రాన్ని మిస్టర్ ఎక్స్‌తో పోల్చరాదని పేర్కొన్నారు. -
చిన్న సినిమా ఘన విజయం.. వారం రోజుల్లోనే సెంచరీ
మలయాళంలో రెండేళ్ల క్రితం సంచలన విజయం సాధించిన చిత్రాల్లో "వాళా" ఒకటి. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ.40 కోట్లు వసూలు చేసింది. వాళా అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థం. అలాగే పనీపాటా లేకుండా తిరిగే సోమరులని కూడా అదే పేరుతో పిలుస్తారు. వాళా చిత్రానికి 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్' అనేది ట్యాగ్‌లైన్ ఇచ్చారు.మలయాళంలో హిట్ కొట్టిన తెలుగు డైరెక్టర్2024లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు కథ అందించింది విపిన్ దాస్ ఒక్కరే అయినా.. దర్శకులు మాత్రం మారారు. మొదటి భాగానికి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించగా రెండో భాగాన్ని సవిన్ డైరెక్ట్ చేశాడు. సీక్వెల్‌కు రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించారు. తెలుగు నిర్మాత సాహు గారపాటి ఈ సినిమా నిర్మాతల్లో ఒకరిగా ఉన్నాడు. సెంచరీ కొట్టిన వాళా 2ఏప్రిల్ 2న విడుదలైన ఈ చిత్రం ఏకంగా సెంచరీ కొట్టింది. కేవలం వారం రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోవడం విశేషం. ఈ ఏడాది మన శంకరవరప్రసాద్‌గారుతో హిట్ అందుకున్న సాహు గారపాటి.. మూడు నెలల్లో వాళా 2తో మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. కాగా వాళా మొదటి భాగం హాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. View this post on Instagram A post shared by Vaazha-2 Movie (@vaazhamovie) చదవండి: గాయపర్చుకున్న హీరో.. కదల్లేని స్థితిలో ఉంటే.. -
తనను తాను గాయపర్చుకున్న హీరో.. కదల్లేని స్థితిలో ఆస్పత్రికి..
'ధురంధర్' సినిమాతో హీరో రణ్వీర్ సింగ్ పేరు మారుమోగిపోతోంది. అతడికి సినిమా పట్ల ఉన్న అంకితభావం, నటన గురించి బోలెడన్ని ప్రశంసలు వస్తున్నాయి. అయితే అతడు మొదటినుంచి అంతే డెడికేషన్‌తో పని చేసేవాడంటున్నాడు దర్శకనటుడు అనురాగ్ కశ్యప్. రణ్వీర్ సింగ్ హీరోగా, అనురాగ్ నిర్మాతగా వ్యవహరించిన చిత్రం లూటేరా. ఇది రణ్వీర్ నటించిన మూడో చిత్రం. అనురాగ్ సినిమా నిర్మించడంతో పాటు డైలాగ్స్ అందించాడు.రణ్వీర్ ఎప్పుడూ ఇంతే..ఆ మూవీ విశేషాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు అనురాగ్ కశ్యప్. ఆయన మాట్లాడుతూ.. 'ధురంధర్ మూవీకోసం రణ్వీర్ సింగ్, అర్జున్ రాంపాల్ ఎంత కష్టపడ్డారు? ఎన్ని గాయాలు తగిలించుకున్నారు? అని మనమంతా మాట్లాడుకుంటున్నాం. తమ పాత్రలకు న్యాయం చేయడం కోసం వాళ్లు ఎంతదూరమైనా వెళ్తారు. వారి కష్టానికి ప్రతిఫలంగా సినిమా కూడా అద్భుతంగా ఆడుతోంది, మంచి కలెక్షన్స్ రాబడుతోంది. కానీ రణ్వీర్ సింగ్ ఇప్పుడే కాదు, మొదటినుంచి కూడా ఇలాగే ఉండేవాడు. తన కెరీర్ మొదట్లో చేసిన లూటేరా సినిమా గురించి చెప్తాను. గాయం చేసుకునిఈ మూవీ క్లైమాక్స్‌లో రణ్‌వీర్‌పై కాల్పులు జరుగుతాయి. ఆ నొప్పి అనుభవించడం కోసం అతడు తన పొట్టపై గాయం చేసుకున్నాడు. కనీసం మాకెవరికీ ఒక మాటైనా చెప్పలేదు. సహజత్వం కోసం అంతగా తపించాడు. నొప్పితో బాధపడుతున్నా సరే మాతో పంచుకోలేదు. చివరకు అతడు కదల్లేని స్థితిలో ఉండటంతో ఏమైందని చూడగా పొట్టపై గాయం ఉంది. దాంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాం. అదీ అతడికి సినిమా పట్ల ఉన్న అంకితభావం! కానీ ఆ మూవీ ధురంధర్‌లా కలెక్షన్ల వర్షం కురిపించలేకపోయింది' అని చెప్పుకొచ్చాడు. సినిమాధురంధర్ విషయానికి వస్తే.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, సారా అర్జున్ హీరోహీరోయిన్లుగా నటించారు. మొదటి భాగం 2025 డిసెంబర్లో విడుదలవగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రెండో భాగం ఈ ఏడాది మార్చి 19న రిలీజవగా ఇప్పటివరకు రూ.1600 కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రంలో ఆర్.మాధవన్, రాకేశ్ బేడీ, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.చదవండి: లావుగా ఉందని నా భార్యపై ట్రోలింగ్.. ఆ వ్యాధి వల్లే: విశ్వ -
నీ పెళ్లాన్ని సన్నగా చేయ్ అని ట్రోలింగ్.. ఆ వ్యాధి వల్లే..: విశ్వ
నటుడు విశ్వ సీరియల్స్‌లో, సినిమాల్లో యాక్ట్ చేశాడు. తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలం క్రితమే విశ్వ ఫిట్నెస్ క్లబ్ ఓపెన్ చేసి జిమ్ ట్రైనర్‌గానూ మారాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను ఏకరువు పెట్టాడు. విశ్వ మాట్లాడుతూ.. 'నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి 24 ఏళ్లవుతోంది. 10వ తరగతి అయిపోగానే పరిశ్రమలో అడుగుపెట్టాను. పెళ్లికోసం, విద్యార్థి వంటి పలు చిత్రాల్లో నటించాను. తర్వాత సీరియల్స్ చేశాను. తొక్కేశారుకొంతకాలంగా సీరియల్స్‌కు దూరంగా ఉన్నాను. ప్రస్తుతం పెద్ది మూవీ చేస్తున్నాను. అయితే ఒకానొక సమయంలో నాకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా తొక్కేశారు. అప్పుడు నా తమ్ముడి సంపాదనపైనే బతికాను. ఆరునెలలపాటు వాడే ఇంటిని నడిపించాడు. అలాగే నాన్నకు వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాం. ఎప్పుడైనా పనివాళ్లు రాకపోతే నేను గిన్నెలు కడిగేవాడిని. రేషన్ బియ్యం తిన్న రోజులున్నాయి అన్నాడు.నా అభిమానిశ్రద్ధతో తన లవ్‌స్టోరీ గురించి చెప్తూ.. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో శ్రద్ధ నన్ను చూసి ఇష్టపడింది. అప్పటికి నేను బ్రేకప్ బాధలో ఉన్నాను. నిజమైన ప్రేమ లేదని తెగ బాధపడిపోతూ ఉన్నాను. ఆ సమయంలో శ్రద్ధ మెసేజ్ చేయడంతో టైంపాస్ చేద్దామని నా నెంబర్ ఇచ్చాను. తనకు చాలా కనెక్ట్ అయిపోయాను. వారం రోజులకే తను ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పింది. వాళ్లు మొదట ఒప్పుకోలేదు. నా గురించి పూర్తిగా ఆరా తీశాకే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ట్రోల్స్ఆమెను దేవుడు నాకోసం పంపిన ఏంజెల్ అని భావిస్తాను. విశ్వ ఫిట్నెస్ క్లబ్లో శ్రద్ధ డైట్ ప్లాన్, ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటుంది. నేనేమో ఎక్సర్సైజ్ చేయిస్తాను. అయితే మేమిద్దరం కలిసి సోషల్ మీడియాలో ఏదైనా వీడియో పెడితే చాలు.. ముందు నీ పెళ్లాన్ని సన్నగా చేయు, వేరేవాళ్లకు నీతులు చెప్పడం కాదు, ఇంట్లో సక్కగ చూసుకో అని ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్లు అన్నదాంట్లో తప్పు లేదనుకోండి.ఆ వ్యాధి వల్లే..అయితే రెండోసారి కొడుకు పుట్టిన తర్వాత హార్మోన్ల అసమతుల్యత కారణంగా శ్రద్ధ విపరీతంగా బరువు పెరిగిపోయింది. కొన్ని నెలలకు ఎక్సర్సైజ్ మొదలుపెట్టాం. కానీ తనకు కార్పెల్ టన్నెల్ అనే అరుదైన వ్యాధి వచ్చింది. దానివల్ల చేతులు బలహీనంగా మారిపోయాయి. పిల్లాడికి షర్ట్ బటన్ కూడా పెట్టేంత శక్తి లేకపోయింది. అంటే.. తన పనులు తను చేసుకోలేదు. ఆ వ్యాధి వల్ల ఎక్సర్సైజ్ ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ కోలుకుంది. ఇప్పుడిప్పుడే మళ్లీ ఎక్సర్సైజ్ మొదలుపెట్టింది' అని విశ్వ చెప్పుకొచ్చాడు.చదవండి: లోక సినిమా.. నన్ను మోసం చేశారు: మమ్ముట్టి -
లోక మూవీ.. నన్ను మోసం చేశారు: మమ్ముట్టి
గతేడాది బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించిన చిత్రాల్లో లోక మూవీ ఒకటి. ఈ మలయాళ చిత్రం తెలుగులో 'కొత్త లోక: చాప్టర్ 1 చంద్ర' గా రిలీజైంది. కల్యాణి ప్రియదర్శన్, నజ్లీన్, సాండీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. అయితే ఈ చిత్రంలో మూతన్ పాత్ర కోసం దుల్కర్ తండ్రి మమ్ముట్టి వాయిస్‌ను ఉపయోగించారు.దుల్కర్ అడగలేదుమరి సీక్వెల్లో మమ్ముట్టి గొంతు మాత్రమే వినిపిస్తుందా? లేక ఆయన కనిపిస్తాడా? అని సినీ ప్రేక్షకులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ ఊహాగానాలపై తాజాగా మమ్ముట్టి స్పందించాడు. 'సినిమాలో నా ప్రమేయం ఉంటుందని చిత్రయూనిట్ నాకసలు చెప్పనేలేదు. మొదటిభాగం సమయంలోనూ దుల్కర్ నన్ను సంప్రదించలేదు, అతడి మేనేజర్, ఫ్రెండ్ వచ్చి.. నా గొంతు అరువివ్వమని అడిగారు. ఆ చేయి కూడా నాదేనట!మొదట తిరస్కరించినప్పటికీ చివరకు ఆ ఒక్కసాయం చేశాను. తీరా మూవీ రిలీజయ్యాక.. నేను వాయిస్ ఇచ్చిన పాత్ర నాదేనని, అందులో కనిపించే చేయి కూడా నాదేనని చెప్పారు. ఇది మోసం చేయడం కాక ఇంకేమవుతుంది? వాళ్లు చేసిన పని వల్ల ఇప్పుడు సీక్వెల్లో ఆ పాత్రలో నటించాల్సిన బాధ్యత నాపై పడింది. అయితే రెమ్యునరేషన్ తీసుకునే యాక్ట్ చేస్తాను. నేనడిగినంత ఇస్తే సినిమాలో భాగం అవుతాను' అని చెప్పుకొచ్చాడు.సినిమాకాగా డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన లోక మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో మమ్ముట్టి వాయిస్ ఓవర్ ఇచ్చిన మూతన్ పాత్ర తెరపై వినిపించిందే తప్ప కనిపించలేదు. సీక్వెల్లో ఆ పాత్ర కనిపించే అవకాశం ఉంది.చదవండి: మొదటి భార్యతో విడాకులు.. ఎంత దిగజారిపోయానంటే: ఆమిర్ ఖాన్ -
మొదటి భార్యతో విడాకులు.. ఎంత దిగజారిపోయానంటే..: ఆమిర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లికి సిద్ధమవుతున్నాడు. కొంతకాలం క్రితమే గౌరీ స్ప్రాట్‌ను తన ప్రియురాలిగా అందరికీ పరిచయం చేశాడు. తనతో కలిసి పలు ఈవెంట్లకు హాజరవుతున్నాడు. అయితే తాజా ఇంటర్వ్యూలో తన మొదటి భార్యతో విడాకుల గురించి ఓపెనయ్యాడు. ఆమిర్ మాట్లాడుతూ.. 'సాధారణంగా నేను మద్యానికి దూరంగా ఉంటాను. కానీ ఎప్పుడైతే నా మొదటి భార్య రీనాతో విడాకులయ్యాయో నేను పూర్తిగా మారిపోయాను. నియంత్రించుకోలేకపోయా..తను పిల్లల్ని తీసుకుని ఇల్లు వదిలేసిన రోజు తీవ్రమైన ఒంటరితనానికి లోనయ్యాను. నా భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. మందు ముట్టని నేను తాగుబోతుగా మారిపోయాను. అతిథుల కోసం ఇంట్లో మద్యం బాటిళ్లు ఉంటే వాటిని ఖాళీ చేయడం మొదలుపెట్టాను. ఏడాదిన్నరపాటు ప్రతిరోజు రాత్రి ఒక బాటిల్ తాగేశాను. మందుకు దూరంగా ఉండే నేను బాటిల్ ఖాళీ చేసే స్థాయికి దిగజారిపోయాను' అని గుర్తు చేసుకున్నాడు.పర్సనల్ లైఫ్కాగా ఆమిర్ ఖాన్.. రీనా దత్తా 1986లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు జునైద్, కూతురు ఇరా ఖాన్ సంతానం. 2002లో దంపతులు విడాకులు తీసుకున్నారు. 2005లో ఆమిర్.. దర్శకురాలు కిరణ్‌రావును పెళ్లి చేసుకున్నాడు. వీరికి సరోగసి ద్వారా కుమారుడు ఆజాద్ జన్మించాడు. ఆమిర్-కిరణ్ దాంపత్యం కూడా ఎంతోకాలం సాగలేదు. 2021లో వీరు విడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి గౌరీ స్ప్రాట్‌తో ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని 2025లో తన బర్త్‌డే సందర్భంగా అధికారికంగా వెల్లడించాడు. గౌరీతో ప్రేమలో ఉన్నట్లు తెలిపాడు.చదవండి: డెకాయిట్ మూవీ రివ్యూ -
నా ఇంట్లో కోట్లు లేవు, రూ.40 వేలే ఉన్నాయి: నిర్మాత
మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయి ఈ మధ్యనే బెయిల్‌పై విడుదలయ్యారు నిర్మాత జాఫర్ సాదిక్. ఈయన నిర్మిస్తున్న మంగై, ఇరైవన్ మిగ పెరియవన్ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కాగా ఏప్రిల్ 6న ఐటీ అధికారులు, ఎన్నికల స్క్వాడ్ అధికారులు చెన్నైలో జాఫర్ సాదిక్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై జాఫర్ స్పందించారు.ఆ ప్రచారంలో నిజం లేదుఅధికారులు తన ఇళ్లలో సోదాలు నిర్వహించిన విషయం వాస్తవమేనని, అయితే పలు కోట్ల రూపాయలు, ఇతర డాక్యుమెంట్లు పట్టుబడినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. 5వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సోదాలు నిర్వహించారని, ఎలాంటి అనధికారిక డబ్బుకానీ, ఇతర డాక్యుమెంట్స్ గానీ లభించలేదని చెప్పి పత్రాలపై సంతకం చేయించుకుని వెళ్లిపోయారన్నారు.ఇంట్లో అంతే ఉందితన ఇంట్లో ఒక సాధారణ కుటుంబ ఖర్చులకు సరిపోయే రూ.40 వేలు మాత్రమే ఉన్నాయన్నారు. అదేవిధంగా ఇంతకుముందు కూడా పలు శాఖలకు చెందిన అధికారులు తన ఇళ్లల్లో తనిఖీలు చేశారని, అయితే ఐటీ అధికారులు మాత్రమే కరెక్ట్‌గా సోదాలు నిర్వహించారన్నారు. ఏదేమైనా ఈ వ్యవహారంలో తన గురించి అసత్య ప్రచారం చేయకూడదన్నారు. తాను ప్రశాంతంగా జీవించాలని భావిస్తున్నట్లు తెలిపారు. తను నిర్మిస్తున్న సినిమాలు రిలీజ్ చేసే పనిలో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. -
అవన్నీ పీరియడ్స్‌లో ఉండగానే చేశా: శ్రీలీల
శ్రీలీల.. తక్కువకాలంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది. సన్నజాజి తీగలా ఉండే ఈ బ్యూటీ తన డ్యాన్స్ స్టెప్పులతో మరింత ట్రెండ్ అయింది. అయితే తాను నటించిన చాలా పాటలు పీరియడ్స్‌లో ఉండగానే చిత్రీకరణ జరిగాయంటోంది. తాజాగా ఓ ఈవెంట్లో శ్రీలీల మాట్లాడుతూ.. 'నేను చాలా పాటలకు డ్యాన్స్ చేశాను. అందులో హిట్ సాంగ్స్ అన్నీ దాదాపు నెలసరి సమయంలో చేసినవే! సమానత్వం కోరుకున్నప్పుడు మనం పీరియడ్స్‌ను సాకుగా చూపించకూడదని నా అభిప్రాయం. సాకుగా చూపించొద్దుమనం శారీరకంగా, మానసికంగా అన్నింటిని అధిగమించి ముందుకు సాగాలి. పురుషులతో సమానంగా అవకాశాలు, అధికారం, హక్కులు కోరుతున్నప్పుడు నెలసరి వంటి సమస్యలను సాకుగా చూపించి వెనక్కు తగ్గడం కరెక్ట్ కాదు. మనల్ని మనం ముందుకు నెట్టుకోవాలి' అని పేర్కొంది. అయితే ఆమె కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెలసరిలో అందరి పరిస్థితి ఒకేలా ఉండదని, దాన్ని ఎవరూ కావాలని సాకుగా చూపించరని కామెంట్లు చేస్తున్నారు.తప్పేముంది?డాక్టర్ చదివిన శ్రీలీలకు ఈ విషయం ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో.. పీరియడ్స్‌లో ఉన్నప్పుడు కూడా పనిచేసేవారు ఎంతమంది లేరు, ఆ ఉద్దేశంతోనే ధైర్యంగా ముందుకు వెళ్లాలని చెప్పిందే తప్ప.. తప్పుగా ఏం మాట్లాడిందని మరికొందరు శ్రీలీలను సమర్థిస్తున్నారు. ఇకపోతే శ్రీలీల చివరగా ఉస్తాద్ భగత్ సింగ్‌లో నటించింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.చదవండి: నన్ను డ్రమ్ములో పెడతారట.. బండబూతులు తిడుతున్నారు: నటుడు -
నన్ను డ్రమ్ములో పెడతారట.. బండబూతులు తిడుతున్నారు!
చిరయ్యా.. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో నటుడు సిద్దార్థ్ షా ప్రధాన పాత్రలో నటించాడు. భార్య వ్యక్తిగత స్వేచ్ఛకు, అభిప్రాయానికి విలువ ఇవ్వని భర్తగా కనిపించాడు. అయితే ఈ సిరీస్ రిలీజయ్యాక తనను ప్రజలు ఎంతగానో ద్వేషిస్తున్నారంటున్నాడు నటుడు సిద్దార్థ్ షా. అతడు మాట్లాడుతూ.. 'జనం నన్ను బ్లూ డ్రమ్‌లో పెట్టి చంపుదామన్నంత కసితో ఉన్నారు. బండబూతులుముఖ్యంగా మహిళలే ఈరకంగా వయొలెంట్‌గా ఆలోచిస్తున్నారు. పురుషులేమో బండబూతులు తిడుతున్నారు. చాలాచోట్ల ఇదే జరుగుతోందని, ఇప్పుడు ఈ సిరీస్ చూసి పురుష సమాజం తేలు కుట్టిన దొంగలా మౌనంగా ఉండిపోయిందని పలువురూ రీల్స్, వీడియోలు చేస్తున్నారు. ఈ ద్వేషాన్ని చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఆ కోపంలోనూ ప్రేమే కనిపిస్తోంది. బెడ్రూమ్ సీన్స్నాపై పీకలదాకా కోపం ఉందంటే నాకిచ్చిన పాత్రకు పూర్తి స్థాయి న్యాయం చేశానన్నమాట! అయితే ఇంటిమేట్ (బెడ్రూమ్) సన్నివేశాలు షూట్ చేసేటప్పుడు మాత్రం నేను తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనయ్యాను. మొదటిరోజే బెడ్రూమ్ సీన్స్ షూట్ చేశారు. ఫస్ట్ సీన్ తీయడానికి ముందే ఐదునిమిషాల పాటు గట్టిగా ఏడ్చేశాను. దీంతో కాసేపు చిత్రీకరణ నిలిపివేశారు. అందరూ నన్ను ఓదార్చేందుకు ప్రయత్నించారు. అయినా సరే ఆ సీన్స్ షూట్ చేసేటప్పుడు టెన్షన్‌తో బిగుసుకుపోయాను. తీవ్ర సంఘర్షణనా శరీరం ముందుకు కదల్లేదు. ఇలా చాలాసార్లు జరిగింది. ఆరు నెలలపాటు ఈ సిరీస్ నుంచి నేను బయటకు రాలేకపోయాను. ఎందుకంటే అవి ప్రేమ సన్నివేశాలు కావు, భార్యపై జరిగే అత్యాచార సీన్స్. హనీమూన్ సీన్ తర్వాత అయితే తీవ్ర సంఘర్షణకు లోనయ్యాను. ఇకపోతే ఆ సన్నివేశాలను నా కుటుంబం ధైర్యంగా తెరపై చూడలేకపోయింది' అని సిద్దార్థ్ చెప్పుకొచ్చాడు.చదవండి: అత్తామామకు సర్ప్రైజ్ ఇచ్చిన నయనిక రెడ్డి -
రేణూ దేశాయ్‌పై అసభ్య కామెంట్స్.. నిందితుడి అరెస్ట్
సామాజిక మాధ్యమాలలో నటి రేణు దేశాయ్‌పై అసభ్యకర పోస్టు చేసిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. గుంటూరుకు చెందిన చెన్నయ్య ఖాళీ సమయంలో తరచుగా యూట్యూబ్‌లో రీల్స్ చూస్తుంటాడు. ఇటీవల నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఒక రీల్‌ను చూశాడు. ఆ రీల్ చూసిన తర్వాత చెన్నయ్య తన యూట్యూబ్ ఖాతా నుంచి ఆమెను ఉద్దేశిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యను పోస్ట్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాంకేతిక ఆధారాలతో నిందితుడు చెన్నయ్య గుంటూరులో ఉన్నట్లు గుర్తించారు. సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక బృందంతో అక్కడికి వెళ్లి చెన్నయ్యను అరెస్టు చేసి, గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
అత్తామామకు సర్ప్రైజ్ ఇచ్చిన నయనిక
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్- నిర్మల దంపతుల ఇంట ఇటీవలే ఓ శుభకార్యం జరిగింది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్ పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. నయనిక రెడ్డిని ప్రేమించగా పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. మార్చి 6న ఎంతో ఘనంగా ఈ వివాహం జరిగింది.అరవింద్ పెళ్లిరోజుతాజాగా ఈ కొత్త జంట ఇంట్లోవారికి ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. ఏప్రిల్ 7న అల్లు అరవింద్ - నిర్మల పెళ్లిరోజు. ఈ సందర్భంగా అత్తామామల కోసం చిన్నపాటి పార్టీ ఏర్పాటు చేసింది కొత్త కోడలు నయనిక. వారితో కేక్ కట్ చేయించి ఈ వెడ్డింగ్ యానివర్సరీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.డిన్నర్ పార్టీ'అమ్మానాన్నల 52వ పెళ్లిరోజు. నేను, నయనిక కలిసి ఇంట్లోనే డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశాం' అని తెలిపాడు. ఈ వేడుకలో అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా భాగమైంది. కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టడంతోనే అత్తామామలకు మంచి సర్ప్రైజ్ ఇచ్చిందని నెట్టింట నయనికపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.చదవండి: సాయిపల్లవి మూవీ.. క్లైమాక్స్ మార్చేసిన ఆమిర్ ఖాన్ -
సాయిపల్లవి సినిమా.. క్లైమాక్స్ మార్చేసిన ఆమిర్ ఖాన్
సౌత్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి ఏక్ దిన్ (ఒక రోజు) సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. సునీల్ పాండే దర్శకత్వం వహించిన ఈ మూవీని ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణ పురోహిత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.పట్టు కోల్పోలేదుతాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు ఆమిర్ బంధువు, దర్శకనిర్మాత మన్సూర్ ఖాన్. ఆయన మాట్లాడుతూ.. 'ఈరోజుల్లో నేను పెద్దగా సినిమాలు చూడటం లేదు. కానీ నాలో కళాత్మక దృక్పథం మాత్రం చెక్కు చెదరలేదు. కొన్ని సన్నివేశాలను మరీ ఓవర్‌గా చూపించడం కంటే కాస్త సున్నితంగా డీల్ చేయడమే మంచిదని భావిస్తాను. అలా కథపై నాకింకా మంచి పట్టుంది. అందుకే ఏదైనా అవసరమైతే సాయం చేస్తానని చిత్రయూనిట్‌కు మాటిచ్చాను. కథలో ఏదైనా మార్పు చేయాలి అనిపిస్తే ఓపెన్‌గా చెప్తానన్నాను.మేము ఒప్పుకోలేదుఉదాహరణకు.. ఏక్ దిన్ మూవీ చివర్లోని ఓ పాటను జపాన్‌లో చిత్రీకరించాం. ఆ పాట షూటింగ్ క్లిప్స్ చూసిన ఆమిర్.. అమ్మాయి ఈపాటికే ఓ పాటలో ఏడ్చేసింది. ఇప్పుడు మళ్లీ ఈ సాంగ్‌లో ఏడవడం దేనికన్నాడు. అబ్బాయితో ప్రేమలో పడటం గురించి ఒక పాట పాడితే బాగుంటుందన్నాడు. అయితే దర్శకుడు ఏం ఆలోచిస్తున్నాడో నాకు బాగా తెలుసు, కాబట్టి డైరెక్టర్‌కే సపోర్ట్ చేశాను. అప్పుడు ఆమిర్ సరదాగా.. ఏదైనా తేడా జరిగిందంటే మిమ్మల్ని జపాన్‌కు పంపించేస్తాను అన్నాడు.క్లైమాక్స్ మార్చేసిన ఆమిర్తర్వాత పూర్తి సాంగ్ చూసినప్పుడు మాత్రం మేము చేసింది సరైనదేనని మాతో ఏకీభవించాడు. అలాగే క్లైమాక్స్ సీన్‌పైనా కొన్ని అభ్యంతరాలు చెప్పాడు. దాన్ని కాస్త మార్చి రాశాడు. అది చూశాక ఆమిర్ చెప్పేది కరెక్టే అనిపించి మేము అదే ఫాలో అయిపోయాం. ఇలా సినిమా కోసం అందరి కలిసి పని చేశాం' అని తెలిపాడు. ఏక్ దిన్ మూవీ మే 1న విడుదల కానుంది. ఇకపోతే మన్సూర్ ఖాన్ గతంలో ఆమిర్‌ఖాన్ హీరోగా 'ఖయామత్ సే ఖయామత్ టక్', 'జో జీతా వొహి సికందర్' సినిమాలు తెరకెక్కించాడు. మన్సూర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి.చదవండి: నీకోసం పిలిచా, అరిచా, ఏడ్చా.. అయినా నువ్వు రాలేదు: నటుడి భావోద్వేగం -
కడదాకా ఉంటానన్నావ్, మధ్యలోనే వదిలేశావ్: నటుడి భావోద్వేగం
మనకు బాగా కావాల్సినవారిని కోల్పోతే ఆ బాధ మాటల్లో వర్ణించలేం. ప్రముఖ నటుడు ఉత్తేజ్ కొన్నేళ్లుగా అదే బాధలో ఉన్నాడు. జీవితాంతం చేయి వదలనని మాటిచ్చిన భార్య మధ్యలోనే ఊపిరి వదిలేయడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఉత్తేజ్ భార్య పద్మావతి 2021లో క్యాన్సర్‌తో కన్నుమూసింది. తాజాగా పెళ్లిరోజు సందర్భంగా భార్యతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నటుడు భావోద్వేగానికి లోనయ్యాడు.మార్గమధ్యంలో చేయి వదిలేశావ్'పద్దూ, ఈరోజు మన పెళ్లిరోజు. ఇపుడు బాగా గుర్తుంటోంది. అప్పట్లో నీ పుట్టినరోజుని, మన పెళ్లిరోజుని మాత్రం రెండు నెలల ముందునుంచే గుర్తుపెట్టుకొని.. డేట్ వల్లె వేస్తూ ఉండేవాడిని.. ఎక్కడ మర్చిపోతానో అని! ఇది అందరి మొగుళ్లకి అనుభవైకవేద్యమే.. ఎలా ఉన్నావు పద్దూ.. కడదాకా, నే కడతేరే దాకా నా వెంటే ఉంటానన్నావు. మార్గమధ్యంలో చెయ్యి వదిలేశావ్... పట్టు సడలి కిందపడ్డాను.. లేచి చూస్తే నువ్వు లేవు.. పిలిచా, అరిచా, ఏడ్చా.. నువ్వులేవు. ముందుగా వెళ్తావనుకోలేఇంకా వెదుకుతూనే ఉన్నా.. సంతలో తప్పిపోయిన పిల్లాడు అమ్మకోసం వెదుక్కున్నట్టు! తప్పు చేశావు పద్దూ.. నన్ను మరీ డిపెండెంట్ చేశావ్.. అన్నింటికీ తోడున్నావ్.. అన్నింటికీ ముందున్నావు. నేనున్నాను పదయ్య అన్నావు. నేనున్నాగా పర్లేదన్నావ్.. ధైర్యం అయ్యావు. ఆలంబన అయ్యావు. ఆసరా అయ్యావు. ముందుంటావనుకున్నా.. ముందుగా వెళ్తావనుకోలేదు. అన్ని పనులు... భోజనం, ఆలనా పాలనా ఓ మ్యాజిక్‌లా సాక్షాత్కారమయ్యేవి. తిట్టుకున్నా, అరుచుకున్నా నవ్వుతా.. తుళ్ళుతా ఉండేదానివి. మిస్ యూనాన్నలా భుజం తట్టావు. తిట్టావు కూడా.. అమ్మలా అక్కున చేర్చుకున్నావు.. ఫ్రెండ్‌లా తోడున్నావు. పాటమ్మకి నిన్ను తెచ్చివ్వలేను, ఆ స్పర్శని అందివ్వలేను, కానీ నీ బాధ్యతని, నీ ప్రేమని అందించే ప్రయత్నం చేస్తున్నా.. నాన్నలా 100% ఉంటాను.. దానికి నేనయినా ఉన్నాను... నాకే ఎవరూ లేరు.. లవ్యూ పద్దూ, నిన్ను చాలా మిస్ అవుతున్నాం' అని రాసుకొచ్చాడు. కాగా ఉత్తేజ్.. మనీ మనీ, రాత్రి, ఖడ్గం, నిన్నే పెళ్లాడతా, మహాత్మ వంటి పలు చిత్రాలకు సంభాషణలు రాశాడు. హిట్లర్, ప్రేమించుకుందాం రా, అభిషేకం, అన్నయ్య, బద్రి, ఖడ్గం, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, జై చిరంజీవ.. ఇలా అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. View this post on Instagram A post shared by Uttej Artiste (@uttejartiste) చదవండి: విజయ్ ర్యాలీలో ప్రమాదం.. రజనీకాంత్ హెచ్చరిక


