డ్యాన్స్‌ టైమ్‌ | Jr NTR and Hrithik Roshan dance off in War 2: Bollywood | Sakshi
Sakshi News home page

డ్యాన్స్‌ టైమ్‌

Published Mon, Oct 7 2024 5:51 AM | Last Updated on Mon, Oct 7 2024 5:51 AM

Jr NTR and Hrithik Roshan dance off in War 2: Bollywood

ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ అదరగొడతారు. హృతిక్‌ రోషన్‌ డ్యాన్స్‌ ఇరగదీస్తారు. మరి... ఈ ఇద్దరూ కలిసి ఓపాటకు డ్యాన్స్‌ చేస్తే థియేటర్స్‌ దద్దరిల్లేలా ఆడియన్స్‌ విజిల్స్‌ వేస్తారు. హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ హీరోలుగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ‘వార్‌ 2’ అనే స్పై యాక్షన్‌ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా ‘వార్‌ 2’లో హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓపాట ఉంటుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి.

ఈపాట చిత్రీకరణకు సమయం ఆసన్నమైంది. టైమ్‌ టు డ్యాన్స్‌ అంటూ... ఈ నెల మూడో వారంలో ఎన్టీఆర్, హృతిక్‌ కాంబినేషన్‌లో ఈపాటను ముంబైలో చిత్రీకరించనున్నారట. నృత్యదర్శకురాలు వైభవీ మర్చంట్‌ ఈ సాంగ్‌కు స్టెప్స్‌ సమకూర్చనున్నారని భోగట్టా. ఈ మాస్‌ మసాలా సాంగ్‌ కోసం సెట్స్‌ తయారు చేయిస్తున్నారట. ఆదిత్యా చో్ర΄ా నిర్మిస్తున్న ‘వార్‌ 2’ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement