war 2 Movie
-
బాలీవుడ్లో ఎన్టీఆర్.. నాటు నాటు పాట రిపీట్?
ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాట ఎంత హిట్టో తెలియంది కాదు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఒకెత్తయితే ఆ ఒక్క పాట ఒకెత్తు అన్నట్టుగా భాషలకు, ప్రాంతాలకు అతీతంగా ఆ పాట దునియాని ఊపేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆ పాట ఓ రేంజ్లో పాప్యులరైంది. అదే ఊపులో ఇండియాకి ఆస్కార్‌ని కూడా తెచ్చేసింది. మరోసారి ఈ తరహా పాట రిపీట్ కానుందా? అందులో మన యంగ్ టైగర్ తన కాలు కదపనున్నారా? ప్రస్తుతం బాలీవుడ్లో రూపొందుతున్న భారీ చిత్రం వార్ 2 చిత్ర విశేషాలను గమనిస్తున్నవారు దీనిని దాదాపుగా ధృవీకరిస్తున్నారు. తొలిసారిగా ఎన్టీయార్ వార్ -2లో నటిస్తుండటంతో ఈ పాన్ ఇండియా సినిమాపై తెలుగు, హిందీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మన ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.హృతిక్, ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్స్ కలిసి స్క్రీన్ పై కనిపించే ప్రతీ సన్నివేశం స్పెషల్‌గా ఉండాలని కాబట్టి తప్పకుండా తగినన్ని యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు అందరూ భావిస్తున్నారు. మరోవైపు నాటునాటు పాట తరహాలో ఈ సినిమాలో కూడా అలాంటి పాట ఒకటి ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోందట. బాలీవుడ్లో హృతిక్ నృత్యాలకు కూడా మంచి పేరుంది. మరోవైపు ఎన్టీయార్ డ్యాన్సుల గురించి చెప్పనక్కర్లేదు. ఈ నేపధ్యంలో వీరి కాంబోలో సాంగ్ అనే ఆలోచన నిజమైతే... ఇక ప్రేక్షకులకు కన్నుల పండుగే అని చెప్పాలి. ఇటీవల హృతిక్ మాట్లాడుతూ, ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయడం పెద్ద సవాలుగా ఉంటుందని అన్నారు. . ఆయనతో పాటుగా స్టెప్స్ వేయాలంటే మరింతగా ప్రిపరేషన్ అవసరం అని అభిప్రాయపడ్డాడు. .ఈ సినిమాలో పాట నాటు నాటు పాట కంటే హై లెవెల్లో ఉండేలా తీయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.మరోవైపు తొలిసారిగా ఒక అగ్రగామి తెలుగు హీరో...విలన్ తరహా పాత్రను బాలీవుడ్లో పోషిస్తుండడంతో వార్ 2 సినిమా చర్చనీయాంశంగా మారింది: ఇందులో ఎన్టీఆర్ పాత్ర పూర్తి నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందని టాక్. అటు డ్యాన్స్, ఇటు యాక్షన్‌లో హృతిక్‌తో పోటీ పడాల్సిన ఈ పాత్రకు ఎన్టీఆర్ పూర్తి న్యాయం చేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వార్ 2 విడుదలకు సంబంధించి ఇంకా స్పష్టత రానప్పటికీ... ఆగస్టు 15కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది సంచలనాత్మక సినిమాల్లో వార్ -2 ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తొలి బాలీవుడ్, టాలీవుడ్ పూర్తి స్థాయి మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం విడుదలయ్యాక బాలీవుడ్, టాలీవుడ్ ల మధ్య సంబంధాలు మరింతగా విస్తరించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక వార్ 2 తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మల్టీ జానర్ సినిమా చేయబోతుండగా, మరోవైపు దేవర 2 కూడా లైన్లో ఉంది. -
హృతిక్, జూ.ఎన్టీయార్ల మధ్య ‘వార్’కి టైమ్ బాగుందట!
ప్రముఖ బాలీవుడ్ అగ్రనటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) తదుపరి చిత్రం వార్ 2(War 2) పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీయర్ సైతం నటిస్తుండడంతో దక్షిణాదిలోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో ప్రముఖ బాలీవుడ్ జ్యోతిష్కుడు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కానుందంటూ జోస్యం చెప్పడం విశేషం.బాలీవుడ్లో ప్రఖ్యాత జ్యోతిష్కుడు విక్రమ్ చంద్రరమణి హృతిక్ జ్యోతిష శాస్త్ర చార్ట్‌ను విశ్లేషించారు, దీని ప్రకారం 2025 అతని కెరీర్లో కీలకమైన సంవత్సరంగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హృతిక్ తన కెరీర్లో 10వ సూర్య దశను అనుభవిస్తున్నాడనీ ఈ సూర్య దశ జూలై 2025లో ముగిసి చంద్ర దశగా మారుతుందనీ ఆయన వివరిస్తున్నారు. ఆల్–టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘కహో నా... ప్యార్ హై’ (2000) సమయంలోనూ హృతిక్ విజయంలో వీనస్ కీలక పాత్ర పోషించిందని జ్యోతిష్కుడు విక్రమ్ అంటున్నారు. అదే విధంగా ఈ ఏడాది కూడా హృతిక్‌కు అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పారు. హృతిక్ వ్యక్తిగత వృత్తి జీవితంలో కీలక పరిణామాలు ఈ ఏడాది ప్రధమార్ధంలో జరిగే అవకాశం ఉందనీ, జనవరి ఫిబ్రవరిలో రియల్ ఎస్టేట్, స్టాక్‌లు లేదా ప్రైవేట్ ఈక్విటీలో వ్యూహాత్మక పెట్టుబడులు ఆయన పెడతారని కూడా జ్యోతిష్కుడు చెబుతున్నారు. బహుభాషా చిత్రాల ఒప్పందాలతో సహా, వినోద పరిశ్రమలో తన స్థాయిని మరింతగా విస్తరించవచ్చునన్నారు. అలాగే ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో కూడా హృతిక్ కొత్త మార్గాలను, నైపుణ్యాలను సంపాదించడంతో పాటుగా తన సినిమాల పోర్ట్‌ఫోలియోను వైవిధ్యంగా మారుస్తారని చెప్పారు. హృతిక్ గత చిత్రాలలో ’వార్’ (2019) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ’విక్రమ్ వేద’ (2022), ’ఫైటర్’ (2024) విమర్శకుల ప్రశంసలు పొందడంతో సరిపెట్టుకున్నాయి. మరోవైపు ఈ ఏడాది జనవరి 10న హృతిక్ రోషన్ తన 51వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ తరుణంలో, ఆయనకు ఇది మరో విజయవంతమైన సంవత్సరం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఏడాది ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కానున్న వార్ 2 హిందీ సినిమాల్లో రికార్డ్–బ్రేకింగ్ ఓపెనర్‌గా అంచనా వేస్తున్న నేపధ్యంలో పండితుడు చెప్పిన ఈ జోస్యం అభిమానులను సంతోషపెట్టేదే అని చెప్పాలి. మరోవైపు జోస్యం ఫలించి ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిస్తే ఈ సినిమాలో తొలిసారి విలన్‌గా నటిస్తున్న జూ.ఎన్టీయార్(Jr NTR) బాలీవుడ్ కెరీర్ కూడా మలుపు తిరగడం ఖాయంగానే కనిపిస్తోంది. -
ఢీ అంటే ఢీ
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘వార్ 2’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం హృతిక్ రోషన్–ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ మాసీ సాంగ్‌ను ముంబైలో వేసిన ఓ సెట్లో చిత్రీకరించారని బాలీవుడ్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నారట దర్శకుడు అయాన్ ముఖర్జీ.డిసెంబరు రెండో వారంలో చిత్రీకరించే ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో హృతిక్, ఎన్టీఆర్ ఢీ అంటే ఢీ అన్నట్లు ఫైట్ చేస్తారట. ఇది క్లైమాక్స్ ఫైట్ అని, దాదాపు పదిహేను రోజుల పాటు చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని, ఈ ఫైట్ కోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ రూపొందించారని టాక్. ఆదిత్యా చో్రపా నిర్మిస్తున్న ‘వార్ 2’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కియారా అద్వానీ పాత్రకూ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని తెలిసింది. వచ్చే ఏడాది ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. -
ఐ యామ్ లెజెండ్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం ‘వార్ 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వార్ 2’ చిత్రం 2025 ఆగస్టు 15న విడుదల కానుంది. కాగా ‘వార్ 2’ చిత్రం తర్వాత హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ సినిమా చేస్తారనే మాట కొన్నిరోజులుగా బాలీవుడ్లో వినిపిస్తోంది. అయితే హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ఐ యామ్ లెజెండ్’ (2007) రీమేక్ హక్కులను హృతిక్ రోషన్ దక్కించుకున్నారని బీటౌన్ సమాచారం. దీంతో ఈ సినిమా హిందీ రీమేక్‌లో హృతిక్ తొలుత నటిస్తారని, ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని టాక్. -
యుద్ధానికి సిద్ధం
‘వార్’కి సిద్ధం అవుతున్నారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్‌తో ఆయన యుద్ధం చేయనున్నారు. ఇక ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర:పార్ట్ 1’ గత నెల 27న విడుదలైన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో ‘దేవర’ రెండో భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఒక నెల విరామం తీసుకుని రెండో భాగం పనులు మొదలు పెట్టమని కొరటాల శివకి ఎన్టీఆర్ సూచించారట.ఇక ఎన్టీఆర్ మాత్రం ‘వార్ 2’ చిత్రం షూట్లోపాల్గొనడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వార్ 2’. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. జాన్ అబ్రహాం, కియారా అద్వానీ తదితరుల కాంబినేషన్లో ‘వార్ 2’ని యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారని టాక్.ఇప్పటికే అటు ముంబై ఇటు హైదరాబాద్ షెడ్యూల్స్‌లో హృతిక్–ఎన్టీఆర్‌లపై కాంబినేషన్ సీన్స్ చిత్రీకరించారు మేకర్స్. అయితే ‘దేవర:పార్ట్ 1’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ‘వార్ 2’ షూట్‌కి కాస్త గ్యాప్ ఇచ్చారు. దసరా పండగ తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది యూనిట్. ఈ షెడ్యూల్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ల మధ్య క్లైమాక్స్ ఫైట్‌ని చిత్రీకరించనున్నారట. 2025 ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది. -
డ్యాన్స్ టైమ్
ఎన్టీఆర్ డ్యాన్స్ అదరగొడతారు. హృతిక్ రోషన్ డ్యాన్స్ ఇరగదీస్తారు. మరి... ఈ ఇద్దరూ కలిసి ఓపాటకు డ్యాన్స్ చేస్తే థియేటర్స్ దద్దరిల్లేలా ఆడియన్స్ విజిల్స్ వేస్తారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘వార్ 2’ అనే స్పై యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓపాట ఉంటుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి.ఈపాట చిత్రీకరణకు సమయం ఆసన్నమైంది. టైమ్ టు డ్యాన్స్ అంటూ... ఈ నెల మూడో వారంలో ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్లో ఈపాటను ముంబైలో చిత్రీకరించనున్నారట. నృత్యదర్శకురాలు వైభవీ మర్చంట్ ఈ సాంగ్‌కు స్టెప్స్ సమకూర్చనున్నారని భోగట్టా. ఈ మాస్ మసాలా సాంగ్ కోసం సెట్స్ తయారు చేయిస్తున్నారట. ఆదిత్యా చో్ర΄ా నిర్మిస్తున్న ‘వార్ 2’ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. -
హైదరాబాద్‌లో యుద్ధం
హైదరాబాద్‌లో యుద్ధానికి సిద్ధం అవుతున్నారు హీరోలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్. వారిద్దరూ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో స్టార్ హీరోగా దూసుకెళుతున్న ఎన్టీఆర్ ‘వార్ 2’ మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ మూవీపై ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.ముంబై, గోవాతో పాటు విదేశాల్లోనూ కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ముంబై షెడ్యూల్లో ఎన్టీఆర్–హృతిక్ రోషన్ పాల్గొన్నారు. కాగా ‘వార్ 2’ తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుంది. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో భారీ బడ్జెట్‌తో పెద్ద సెట్‌ను నిర్మిస్తున్నారు.ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్–హృతిక్‌లపై యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారట. ఇంటర్వెల్లో వచ్చే ఈ ఫైట్ సినిమాలో ఓ హైలెట్‌గా నిలుస్తుందని సమాచారం. జాన్ అబ్రహాం, కియారా అద్వానీ ఇతర పాత్రల్లో నటిస్తున్న ‘వార్ 2’ ని యష్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. 2025 ఆగస్టు 14న ఈ సినిమా విడుదలకానుంది. కాగా 2019లో విడుదలైన హిట్ మూవీ ‘వార్’ కి సీక్వెల్‌గా ‘వార్ 2’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. -
బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా
-
ఎన్టీఆర్‌పై బాలీవుడ్ సీనియర్ హీరో ఆసక్తికర పోస్ట్
ఎన్టీఆర్ ఇప్పుడు ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. దేవర షూటింగ్‌కి గ్యాప్ ఇచ్చి, ‘వార్ 2’సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ అంతా ముంబైలోనే జరుగుతుండడంతో.. ఖాలీ సమయంలో తన స్నేహితులను కలుస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో అనుపమ్ ఖేర్ కలిశాడు తారక్. ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫోటోని అనుపమ్ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ.. ‘నా ఫేవరేట్ పర్సన్. యాక్టర్ ఎన్టీఆర్ ను కలవడం చాలా ఆనందంగా ఉంది. అతని వర్క్ నాకు చాలా ఇష్టం. అతను జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలి’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘వార్ 2’లో అనుపమ్ నటిస్తున్నారా?’, ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రంలో అనుపమ్ కీలక పాత్ర పోషిస్తున్నారా ఏంటి? అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. It was such a pleasure to meet one of my favourite persons and actor @tarak9999 last night. Have loved his work. May he keep rising from strength to strength! Jai Ho! 😍🕉👏 #Actors pic.twitter.com/XSetC87b4Y— Anupam Kher (@AnupamPKher) May 1, 2024 -
బాలీవుడ్‌నూ మడతెట్టేశాడుగా.. దటీజ్ తారక్
-
షూటింగ్... పార్టీయింగ్...
ఎన్టీఆర్ ముంబైలో బిజీ బిజీగా ఉంటున్నారు. ఓ వైపు షూటింగ్లో పాల్గొంటూనే.. మరోవైపు బాలీవుడ్ స్టార్స్‌తో పార్టీల్లో సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ మూవీ చిత్రీకరణ కోసం అక్కడే ఉన్నారు ఎన్టీఆర్. ‘వార్ 2’ షూటింగ్లో బిజీ బిజీగా ఉంటున్న ఆయన పార్టీలనూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని ఓ హోటల్లో జరిగిన పార్టీలో సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి పాల్గొన్నారు ఎన్టీఆర్. ఈ పార్టీలో బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్, దర్శక–నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. పార్టీ జరుగుతున్న హోటల్ వద్దకి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఎన్టీఆర్‌తో ఫొటోల కోసం వారు ఆసక్తిగా ఎదురు చూశారు. ఓ లేడీ ఫ్యాన్ అయితే.. ‘ఎన్టీఆర్ సార్.. ఈ రోజు నా బర్త్ డే.. మీతో సెల్ఫీ దిగాలని ఉంది’ అంటూ రిక్వెస్ట్ చేయడంతో.. ఆమెతో ఫొటో దిగారు ఎన్టీఆర్. ఇక హిందీలో ‘వార్ 2’తో పాటు తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. -
వార్ 2 కోసం జూనియర్ ఎన్టీఆర్ కసరత్తులు.. అర్థం చేసుకోరే?
టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. అటు కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాతో పాటు ఇటు బాలీవుడ్లో అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వార్ 2లో నటిస్తున్నారు. ఈ యాక్షన్ మూవీ కోసం తారక్ తరచూ ముంబై వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో తాజా షెడ్యూల్ కోసం మరోసారి ముంబై వెళ్లారు. హీరోను చూడగానే ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు. ఆయన స్టార్ హోటల్లో బస చేసేందుకు వెళ్తుంటే వెంబడించి వీడియో తీశారు.ఓయ్..ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతున్న తారక్.. తనను ఫోటోలు, వీడియోలు తీస్తున్నారని గమనించి ఓయ్.. అని పిలుస్తూ తనను క్లిక్మనిపించొద్దని అభ్యర్థించారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా తారక్ ఎంతో సరదాగా ఉంటారు. ఆయనకు అంత ఈజీగా కోపమనేది రాదు. సినిమా కోసం ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు వార్ 2 కోసం కూడా ఆయన ఎంతో కష్టపడుతున్నారు. తన మేకోవర్‌ను సైతం మార్చేశారు. ఇది అర్థం చేసుకోలేని కొందరు ఆయన అనుమతి కూడా తీసుకోకుండా తనను ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు. దీంతో అలా చేయొద్దని తారక్ సదరు కెమెరామన్లను వారించారు. తన లుక్ లీక్ కావొద్దని ఆయన ఇంతలా జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది.వార్ 2 కోసంకాగా వార్ 2 కోసం హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ 60 రోజులపాటు కాల్షీట్లు కేటాయించారు. తొలి భాగాన్ని మించిపోయేలా హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సీన్లు ప్లాన్ చేస్తున్నారట! ఈ పోరాట సన్నివేశాలను ‘కెప్టెన్ అమెరికా: ది సివిల్ వార్’, ‘కెప్టెన్ అమెరికా: ది ఫస్ట్ సోల్జర్’ ‘ఫాస్ట్ ఎక్స్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ డిజైన్ చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ స్పిరో రజాటోస్ డిజైన్ చేసినట్లు భోగట్టా! ‘వార్ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Total फ़िल्मी (@totalfilmii) చదవండి: బాలీవుడ్ ఎంట్రీ.. కీర్తి చూశారా? అప్పుడే ఎలా మారిపోయిందో! -
హిందీ వార్‌లో హాలీవుడ్ యాక్షన్
బాలీవుడ్ ‘వార్ 2’లో హాలీవుడ్ తరహా యాక్షన్ కనిపించనుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘వార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తారట. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముంబైలోని ఓ స్టూడియోలో జరిగింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారట మేకర్స్. ఈ పోరాట దృశ్యాలను హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ స్పిరో రజాటోస్ డిజైన్ చేశారని బాలీవుడ్ సమాచారం. ఇక ‘కెప్టెన్ అమెరికా: ది సివిల్ వార్’, ‘కెప్టెన్ అమెరికా: ది ఫస్ట్ సోల్జర్’ ‘ఫాస్ట్ ఎక్స్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ డిజైన్ చేశారు స్పిరో. కాగా స్పై జానర్లో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ‘వార్ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కానుంది. -
ఎన్టీఆర్‌తో నటించాలని ఉంది: ఊర్వశి
ఊర్వశి రౌతేలా.. ప్రత్యేకించి పరిచయం అక్కర్లేని పేరు. తన గ్లామర్‌తో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో.. ప్రత్యేకించి యువతలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారీ బ్యూటీ. తాజాగా ఊర్వశి రౌతేలా ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఎన్టీఆర్‌తో కలిసి ఉన్న ఫొటోను ఆమె షేర్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో, ఎన్టీఆర్ అభిమానుల్లో చర్చకు తెరలేపింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ సినిమాలో ఊర్వశి నటించనున్నారేమో? అనే చర్చలు జరుగుతున్నాయి. ‘వార్ 2’ హిందీ సినిమా చిత్రీకరణ కోసం ముంబయ్‌లో ఉన్నారు ఎన్టీఆర్. ఆయనతో జిమ్‌లో దిగిన ఫొటోను ఊర్వశి సోషల్ మీడియాలో షేర్ చేసి.. ‘‘ఎన్టీఆర్‌గారు మన ప్రియమైన, నిజమైన గ్లోబల్ సూపర్ స్టార్. క్రమశిక్షణ, నిజాయితీ, వినయపూర్వకంగా ఉండే వ్యక్తి. మీ దయ, ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం. సమీప భవిష్యత్తులో మీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘దేవర’ చిత్రంలో ఊర్వశి రౌతేలా ప్రత్యేక పాటలో కనిపించనున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఊర్వశి తెలుగులో ‘వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద’ వంటి చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో తన డ్యాన్స్‌తో అలరించారు. మరి... ఎన్టీఆర్ సినిమాలో నటించాలనే ఆసక్తి కనబరుస్తున్న ఊర్వశికి ఆ చాన్స్ వస్తుందా? అనేది చూడాలి. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
వార్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. కొత్త లుక్ ఫోటోలు వైరల్
బాలీవుడ్ ‘వార్’లో అడుగుపెట్టేశారు జూనియర్ ఎన్టీఆర్. హృతిక్‌రోషన్, తారక్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్’కు సీక్వెల్‌గా ‘వార్ 2’ తెరకెక్కుతోంది. ‘వార్’కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, ‘వార్ 2’కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇప్పటికే ‘వార్ 2’ చిత్రీకరణ పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయనే విషయం తెలిసిందే.. హృతిక్‌రోషన్‌కు సంబంధించిన చాలా సీన్లు మేకర్స్ చిత్రీకరించేశారు. తాజాగా తారక్ వార్ 2 షూటింగ్లో జాయిన్ అయ్యేందకు ముంబై బయల్దేరారు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యశ్ రాజ్ ఫిలింస్ స్టూడియోలో సుమారు 10 రోజుల పాటు వార్ షూటింగ్లో తారక్ పాల్గొననున్నారు. వార్2 కోసం ఎన్టీఆర్ 60రోజులు కేటాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హృతిక్, తారక్ మధ్య వచ్చే భారీ యాక్షన్ సీన్లను తెరకెక్కించబోతున్నారని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. వారిద్దరు కలిసి మొత్తంగా 30 రోజుల పాటు కలిసి షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా కనిపిస్తారని టాక్. ‘వైఆర్ఎఫ్’ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ‘వార్ 2’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' షూటింగ్ పనులతో కూడా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. 2024 అక్టోబర్ 10న దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆపై వెంటనే ప్రశాంత్ నీల్‌తో తారక్ సినిమా ప్రారంభించాల్సి ఉంది. ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలతో తారక్ వచ్చేస్తున్నారు. దీంతో పాన్ ఇండియాలో తారక్ క్రేజీ భారీగా పెరగడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by ɴᴛʀ ғᴀɴs ᴄʟᴜʙ™ (@ntrloversoffl) -
వార్‌కు రెడీ!
బాలీవుడ్ ‘వార్’కు రెడీ అవుతున్నారు ఎన్టీఆర్. హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్’కు సీక్వెల్‌గా ‘వార్ 2’ తెరకెక్కుతోంది. ‘వార్’కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, ‘వార్ 2’కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇప్పటికే ‘వార్ 2’ చిత్రీకరణ మొదలైందని, హృతిక్‌రోషన్ పాల్గొనగా కొంత చిత్రీకరణ కూడా జరిపారని టాక్. కాగా ఈ వారంలో ‘వార్ 2’ సెట్స్‌లో ఎన్టీఆర్ జాయిన్ అవుతారని బాలీవుడ్ సమాచారం. ఎన్టీఆర్‌పై ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట అయాన్ ముఖర్జీ. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా కనిపిస్తారని టాక్. ‘వైఆర్ఎఫ్’ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ‘వార్ 2’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వార్ 2 కోసం ఎన్టీఆర్ వందకోట్ల పారితోషికం ?
-
సీక్రెట్ ఏజెంట్ గా ఎన్టీఆర్.. ఏ సినిమాలో అంటే?
హిందీ చిత్రం ‘వార్ 2’లో ఎన్టీఆర్ విలన్‌గా కనిపిస్తారా? అసలు ఆయన పాత్ర ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలకు చిన్న క్లూ దొరికింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ భారతదేశానికి చెందిన రహస్య గూఢచారి పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ పాత్ర పాజిటివ్‌గా ఉంటుందట. ఇక యశ్‌రాజ్ స్పై యూనివర్శ్‌లో భాగంగా రూపొందుతున్న ‘వార్ 2’ మల్టీస్టారర్ మూవీ అనే విషయం తెలిసిందే. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. త్వరలో ఎన్టీఆర్ ఈ చిత్రం షూటింగ్లో పాల్గొంటారు. ఇంకో విషయం ఏంటంటే... ‘వార్ 2’లో రహస్య గూఢచారిగా యుద్ధం చేసే ఎన్టీఆర్‌తో ఆ తర్వాత ఇదే పాత్రతో ఒక ఫుల్ మూవీ తీయాలని, ఆ తర్వాత వచ్చే ఈ స్పై చిత్రాల్లో కీలక పాత్రల్లో ఎన్టీఆర్‌ని చూపించాలని ఆదిత్య చోప్రా అనుకుంటున్నారట. ఇక ‘వార్ 2’ వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. -
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వార్ -2 చిత్రంపై కీలక అప్డేట్
ఫైటర్ చిత్రం విడుదలైన నెలలోనే స్టార్ హీరో హృతిక్ రోషన్ తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు మొదలు పెట్టారు. జనవరి 25న విడుదలైన ఫైటర్ చిత్రం థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ నటించబోయే తదుపరి చిత్రం ఏదో కాదు ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్ 2. రీసెంట్ ఇంటర్వ్యూలో సైతం హృతిక్ ఈ చిత్ర షూటింగ్ గురించి మాట్లాడారు. అతిత్వరలో వార్ 2 మొదలు కాబోతోంది. బహుశా నాకు ఊపిరి తీసుకునే టైమ్ కూడా ఉండదేమో అని తెలిపారు. 2019లో విడుదలైన వార్ చిత్రంలో హృతిక్ ఏజెంట్ కబీర్ పాత్రలో అదరగొట్టారు. ఆ మూవీ గురించి ఆడియన్స్ ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. హృతిక్, టైగర్ ష్రాఫ్ కలసి నటించిన ఆ చిత్రం అంతలా ప్రభావం చూపింది. దీనితో వార్ 2పై ఆసక్తి పెరిగిపోయింది. వచ్చే వారమే వార్ 2 షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. వార్ 2 లో ఈ సారి హృతిక్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు అని చెప్పగానే అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఈ స్పై యూనివర్స్ లో తారక్ భాగం కాబోతుండడం ఆసక్తిగా మారింది. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు.ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌ని మరింత కొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ ఫిబ్రవరి 23 నుంచి వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈ ఫస్ట్ షెడ్యూల్లో దర్శకుడు అయాన్ ముఖర్జీ.. హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్‌ని రెండు వారాల పాటు చిత్రికరించబోతున్నారు. ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే విధంగా మైండ్ బ్లోయింగ్ యాక్షన్‌తో హృతిక్ ఇంట్రడక్షన్ ఉండబోతోందట. గత రెండు వారాల నుంచి హృతిక్ వార్ 2 చిత్రం కోసం పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందేందుకు జిమ్‌లో కష్టపడుతున్నారు. ఆ సమయంలోనే హృతిక్ గాయపడ్డారు. ప్రస్తుతం హృతిక్ కోలుకుంటున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ వచ్చే వారం షూటింగ్ కోసం రంగంలోకి దిగబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీనికి ప్రధాన కారణం తారక్ ఫిబ్రవరి, మార్చి నెలలో వార్ 2 చిత్రం కోసం డేట్స్ కేటాయించడమే అని తెలుస్తోంది. ఈ చిత్రం డార్క్ థీమ్‌లో ఇండియన్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ యాక్షన్ ఫీస్ట్ అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ఇద్దరు టాప్ పాన్ ఇండియా స్టార్స్ హృతిక్, ఎన్టీఆర్ నటించబోతున్న వార్ 2 చిత్రంపై ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. ఇటు సౌత్‌లో ఉన్న అభిమానులకు, నార్త్‌లో ఉన్న అభిమానులకు ఈ చిత్రం ఒక పండగే. వచ్చే ఏడాది ఆగష్టు 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. -
వార్ 2 నుండి కిక్కెక్కించే న్యూస్
-
ఎన్టీఆర్ విలన్ పాత్ర వెనుక పెద్ద స్కెచ్చే ఉంది
-
హృతిక్ రోషన్‌కు తీవ్ర గాయాలు.. జూ ఎన్టీఆర్ 'వార్- 2' మరింత ఆలస్యం
ప్రముఖ బాలీవుడ్ కథా నాయకుడు హృతిక్ రోషన్ కాలికి గాయమైంది. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ చేసి ఆయన తెలిపారు. నడుముకు ఒక బెల్ట్ పెట్టుకుని క్రచెస్ సాయంతో నిలుచున్న ఒక ఫోటోను ఆయన షేర్ చేశారు. గతంలో మీలో ఎంతమందికి ఈ క్రచెస్, వీల్ చైర్ అవరసమెచ్చింది..? ఆ సమయంలో మీ ఫీలింగ్ ఏంటి..? అని రాసుకొచ్చారు. గాయంతో కలిగిన బాధ నుంచి ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని తెలిపారు. ఈ క్రమంలో టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్ వంటి స్టార్స్‌తో పాటు అభిమానులు మెసేజ్‌లు చేస్తున్నారు. హృతిక్ త్వరగా కోలుకోవాలని వారు ఆశిస్తున్నారు. ఫోటోలో హృతిక్ రోషన్‌ను గమనిస్తే ఆయనకు తీవ్రమైన గాయాలే అయినట్లు ఉన్నాయి. అందుకు గల కారణాలను మాత్రం ఆయన తెలపలేదు. ఫైటర్ షూటింగ్ సమయంలో ఏమైనా జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఆయన కాలికి గాయం కావడంతో కొద్దిరోజుల పాటు రెస్ట్ తీసుకోనున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కాంబినేషన్లో రానున్న భారీ బడ్జెట్ చిత్రం వార్-2 షూటింగ్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది. 'వార్' మొదటి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా పోటాపోటీగా నటించారు. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. దీంతో 'వార్2'పై సినీ ప్రియుల్లో ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం తారక్ డేట్స్ కూడా ఇచ్చేశారు. త్వరలో షూటింగ్ అనుకుంటున్న సమయంలో హృతిక్ రోషన్‌కు గాయం కావడంతో ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కావచ్చు అని తెలుస్తోంది. ఈ ఏడాదిలో 'ఫైటర్' సినిమాతో హిట్ కొట్టారు హృతిక్ రోషన్. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొణె ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద రూ. 340 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం బాలీవుడ్లో ఇప్పటికి కూడా రన్ అవుతుంది. View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
వార్ 2తో బాలీవుడ్ రేంజ్ నెక్స్ లెవెల్ కి కానీ !
-
Jr ఎన్టీఆర్ వార్2 మూవీ అప్డేట్
-
అందుకే పోస్ట్ పోన్ అయిన వార్ -2