
'దేవర' తర్వాత ఎన్టీఆర్ రెండు సినిమాలు చేస్తున్నాడు. హిందీలో 'వార్ 2', ప్రశాంత్ నీల్ తో మరో మూవీతో బిజీగా ఉన్నాడు. తాజాగా తారక్ నటించిన ఓ డెలివరీ పోర్టర్ యాడ్ రిలీజైంది. అయితే అందులోని కంటెంట్ ఎంత రీచ్ అయ్యిందో లేదో తెలీదు గానీ తారక్ లుక్ గురించి ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి.
ఈ మధ్య కాలంలో తారక్ సన్నబడినట్లు ఉన్నాడు. 'వార్ 2' కోసం డిఫరెంట్ లుక్ మెంటైన్ చేస్తున్నాడు. ఒకవేళ యాడ్ లోనూ అదే లుక్ తో ఉంటే కష్టం కాబట్టి క్రాఫ్ కాస్త మార్చినట్లున్నారు. అలా తారక్ డిఫరెంట్ గా కనిపించాడు. దీంతో అలా ఉన్నాడు ఇలా ఉన్నాడంటూ యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))
ఇలా కనిపించిన ప్రతి కంటెంట్ ని ట్రోల్ చేయడం సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ఆ హీరో ఈ హీరో అనేం లేదు. ప్రతిఒక్కరూ దీనిబారిన పడ్డవాళ్లే! ఇప్పుడు తారక్ నటించిన యాడ్ కి కూడా ఈ సెగ తగిలిందని చెప్పొచ్చు.
ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. వార్ 2 ఆగస్టు 14న రాబోతుందని ఇదివరకే ప్రకటించారు. అందుకు తగ్గట్లే షూటింగ్ వేగంగా చేస్తున్నారు. త్వరలో ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ కి తారక్ హాజరవుతాడు. దీన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేశారు. కానీ రిలీజ్ చేస్తారా లేదా లేట్ అవుతుందా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు))