
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం ‘వార్ 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ మరో లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వార్ 2’ చిత్రం 2025 ఆగస్టు 15న విడుదల కానుంది.
కాగా ‘వార్ 2’ చిత్రం తర్వాత హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ సినిమా చేస్తారనే మాట కొన్నిరోజులుగా బాలీవుడ్‌లో వినిపిస్తోంది. అయితే హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ఐ యామ్ లెజెండ్’ (2007) రీమేక్ హక్కులను హృతిక్ రోషన్ దక్కించుకున్నారని బీటౌన్ సమాచారం. దీంతో ఈ సినిమా హిందీ రీమేక్‌లో హృతిక్ తొలుత నటిస్తారని, ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని టాక్.
Comments
Please login to add a commentAdd a comment