
ఎన్టీఆర్ చేస్తున్న తొలి హిందీ మూవీ 'వార్ 2'. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుగుతోంది. మొన్నీమధ్యే డ్యాన్స్ ప్రాక్టీసు చేస్తూ హృతిక్ రోషన్ మోకాలికి గాయం కావడంతో విడుదల ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని రూమర్స్ వినిపించాయి. కానీ వీటికి చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్.. మరోసారి తేదీపై క్లారిటీ ఇచ్చేసింది.
(ఇదీ చదవండి: రామ్ చరణ్.. ఓ 'అద్దె ఆటగాడు'?)
'ఆర్ఆర్ఆర్' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన తారక్.. గతేడాది 'దేవర'గా వచ్చాడు. ఈ ఏడాది 'వార్ 2'తో రాబోతున్నాడు. తాజాగా ట్విటర్ లో ఓ మీమ్ పేజ్.. ఈ మూవీ కోసం వీడియో చేసింది. దీనికి రిప్లై ఇచ్చిన యష్ రాజ్ ఫిల్మ్స్.. ఆగస్టు 14న 'వార్ 2' థియేటర్లలోకి వస్తుందని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.
యష్ రాజ్ ఫిల్మ్స్ తీస్తున్న స్పై యూనివర్స్ లో తొలుత 'ఏక్ థ టైగర్'(2012) వచ్చింది. దీని కొనసాగింపుగా 'టైగర్ జిందా హై' (2017), 'వార్' (2019), 'పఠాన్'(2023) వచ్చాయి. వీటిలో భాగమైన 'వార్ 2'.. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ అవుతుంది. ఇదే ఏడాది క్రిస్మస్ కి ఈ యూనివర్స్ లో భాగమైన 'ఆల్పా' కూడా విడుదల కానుంది.
(ఇదీ చదవండి: మళ్లీ హాస్పిటల్ బెడ్ పై సమంత)
Must say… you have set it up brilliantly even before we have started our marketing of #War2 🔥😎💥😱💪 ... there will be mayhem in cinemas on 14 August 2025, worldwide… 😈⚠️‼️🚨🤯 https://t.co/eVmQRLLJtG
— Yash Raj Films (@yrf) March 16, 2025
Comments
Please login to add a commentAdd a comment