release date
-
దళపతి విజయ్ చివరి సినిమా.. రిలీజ్ తేదీ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం 'జననాయగన్'. ఈ సినిమాను పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటి పూజా హెగ్డే, మమిత బైజు హీరోయిన్లుగా కనిపించనున్నారు. అంతేకాకుండా కోలీవుడ్ భామ శృతిహాసన్ అతిథి పాత్రలో మెరవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి ముందు నటిస్తోన్న చివరి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి.అయితే తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పొంగల్ పండుగ సందర్భంగా జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విజయ్ ప్రత్యేక పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నటి ప్రియమణి, దర్శకుడు గౌతమ్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు.pic.twitter.com/JeY4Vpnc3J— Vijay (@actorvijay) March 24, 2025 -
యష్ 'టాక్సిక్'.. చరణ్ కి కాస్త ఇబ్బందే?
'కేజీఎఫ్' పేరుతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ గుర్తొస్తారు. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలతో వీళ్ల కెరీరే మారిపోయింది. ప్రస్తుతం నీల్.. తారక్ తో మూవీ చేస్తుండగా, యష్ 'టాక్సిక్' అనే చిత్రంలో నటిస్తున్నాడు.మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తీస్తున్న 'టాక్సిక్'.. భారీ స్థాయిలో తీస్తున్నారు. కొన్నిరోజుల క్రితం బెంగళూరులో షూటింగ్ వల్ల ఈ మూవీ వివాదంలోనూ చిక్కుకుంది. సరే ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 19న థియేటర్లలోకి వస్తామని పేర్కొన్నారు.(ఇదీ చదవండి: అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో)మార్చిలో అంటే పరీక్షల సీజన్. అయినా సరే యష్ వస్తున్నాడంటే సాహసమనే చెప్పాలి. మరోవైపు తర్వాత వారమే అంటే మార్చి 26న నాని 'ప్యారడైజ్' రిలీజ్ కానుంది. మరోవైపు రామ్ చరణ్-బుచ్చిబాబు ప్రాజెక్టుని కూడా 26నే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఇది ఫిక్స్ అయితే మాత్రం 'టాక్సిక్' వల్ల చరణ్ కి కాస్త ఇబ్బంది ఉండొచ్చు.ఎందుకంటే యష్, చరణ్.. ఇద్దరివీ పాన్ ఇండియా మూవీసే. వారం గ్యాప్ లో ఈ రెండు సినిమాలు రిలీజై హిట్ అయితే పర్లేదు. లేదంటే మాత్రం ఒకరి వల్ల మరొకరికి వసూళ్లపై దెబ్బ పడే ఛాన్స్ ఉండొచ్చు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి సినిమా) -
రాజేంద్రప్రసాద్ మనవరాలి చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం "ఎర్రచీర - ది బిగినింగ్". ఈ మూవీలో సుమన్ బాబు కీలక పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే శివరాత్రికే విడుదల కావాల్సిన ఈ చిత్రం సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ వేసవి సీజన్లో ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన ఎన్వీవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో క్లైమాక్స్ ఎపిసోడ్, అనేకమంది అఘోరాలతో శివుడిని అత్యద్భుతంగా చూపిస్తూ షూట్ చేసిన సీక్వెన్స్ చాలా బాగా వచ్చింది. కుటుంబం అంతా పిల్లలతో సహా చూసి ఆనందించదగ్గ సినిమా' అని అన్నారు.దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. "ఈ సినిమాలో 45 నిముషాలు పాటు ఉండే గ్రాఫిక్స్ చాలా హైలెట్‌గా నిలుస్తాయి. సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారు. రిలీజ్ ఆలస్యమైనా కంటెంట్ మాత్రం ఖతర్నాక్‌గా ఉందని అందరూ అంటున్నారు. ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుందని నమ్ముతున్నాం" అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ, సురేష్ కొండేటి, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఎన్వీవీ సుబ్బారెడ్డి, సీహెచ్ వెంకట సుమన్ నిర్మించారు. ఈ మూవీకి ప్రమోద్ పులిగిల్ల సంగీతమందించారు. -
అఫీషియల్: అనుమానాల్లేవ్.. చెప్పిన టైంకే 'వార్ 2'
ఎన్టీఆర్ చేస్తున్న తొలి హిందీ మూవీ 'వార్ 2'. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుగుతోంది. మొన్నీమధ్యే డ్యాన్స్ ప్రాక్టీసు చేస్తూ హృతిక్ రోషన్ మోకాలికి గాయం కావడంతో విడుదల ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని రూమర్స్ వినిపించాయి. కానీ వీటికి చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్.. మరోసారి తేదీపై క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: రామ్ చరణ్.. ఓ 'అద్దె ఆటగాడు'?)'ఆర్ఆర్ఆర్' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన తారక్.. గతేడాది 'దేవర'గా వచ్చాడు. ఈ ఏడాది 'వార్ 2'తో రాబోతున్నాడు. తాజాగా ట్విటర్ లో ఓ మీమ్ పేజ్.. ఈ మూవీ కోసం వీడియో చేసింది. దీనికి రిప్లై ఇచ్చిన యష్ రాజ్ ఫిల్మ్స్.. ఆగస్టు 14న 'వార్ 2' థియేటర్లలోకి వస్తుందని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.యష్ రాజ్ ఫిల్మ్స్ తీస్తున్న స్పై యూనివర్స్ లో తొలుత 'ఏక్ థ టైగర్'(2012) వచ్చింది. దీని కొనసాగింపుగా 'టైగర్ జిందా హై' (2017), 'వార్' (2019), 'పఠాన్'(2023) వచ్చాయి. వీటిలో భాగమైన 'వార్ 2'.. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ అవుతుంది. ఇదే ఏడాది క్రిస్మస్ కి ఈ యూనివర్స్ లో భాగమైన 'ఆల్పా' కూడా విడుదల కానుంది.(ఇదీ చదవండి: మళ్లీ హాస్పిటల్ బెడ్ పై సమంత)Must say… you have set it up brilliantly even before we have started our marketing of #War2 🔥😎💥😱💪 ... there will be mayhem in cinemas on 14 August 2025, worldwide… 😈⚠️‼️🚨🤯 https://t.co/eVmQRLLJtG— Yash Raj Films (@yrf) March 16, 2025 -
'మ్యాడ్ స్క్వేర్' డేట్ మారింది.. కొత్త తేదీ ఇదే
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో ఫన్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'. ఇటీవల విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. టీజర్లో కామెడీ పంచులు ఆడియన్స్‌కు నవ్వులు తెప్పిస్తున్నాయి. గతంలో విడుదలైన అభిమానులను అలరించిన మ్యాడ్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చిలోనే రిలీజ్ కానుంది.అయితే టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు. మొదట అనుకున్న తేదీలో మ్యాడ్ స్క్వేర్ విడుదల కావడం లేదని వెల్లడించారు. ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం మార్చి 29న రిలీజ్ చేయడం లేదని తెలిపారు. ఆ రోజు అమావాస్య ఉన్నందున ఒక రోజు ముందుగానే మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే అదే రోజు నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్‌హుడ్ కూడా విడుదల కానుందని నాగవంశీ తెలిపారు. రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాబిన్ హుడ్ హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుములకు నాగవంశీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.లాజిక్స్ వెతకొద్దు..కాగా.. ఇటీవల మ్యాడ్ స్క్వేర్ మూవీపై ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. మ్యాడ్-2 చిత్రం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మ్యాడ్‌లాగే ఇందులో కూడా ఎలాంటి కథ ఉండదని తెలిపారు. కేవలం రెండు గంటలు నవ్వుకోవడానికి థియేటర్లకు రండి అని విజ్ఞప్తి చేశారు. ఇంజినీరింగ్ చదువుకుని ఉద్యోగం చేయకూడదనుకున్న ముగ్గురు వెధవలు ఒక మంచోడిని వెధవను చేసే కథే మ్యాడ్ స్క్వేర్. ఈ సారి హైదరాబాద్‌లో చేసిన అరాచకాలు అయిపోయాయని.. స్టోరీని గోవాకు మార్చామని తెలిపారు. ఈ సినిమా అంతా ఫన్.. ఎలాంటి లాజిక్స్ వెతకొద్దు.. ముందే క్లియర్‌గా చెబుతున్నాని పేర్కొన్నారు. ఇది మిస్సయింది.. అది మిస్సయింది లాంటి అడొగద్దు.. నవ్వుకోవడానికి మాత్రమే థియేటర్‌కు రండి అని నాగవంశీ టాలీవుడ్ అభిమానులకు సూచించారు. With the request and support of our esteemed distributors, #MADSquare is arriving a day earlier – March 28th. Since March 29th falls on Amavasya…Our distributors felt it was best to advance the release and we are happy to oblige.Apart from that, there was never any intention… pic.twitter.com/B78xeh64jM— Naga Vamsi (@vamsi84) March 2, 2025 -
మజాకా హీరోయిన్ మూవీ.. ఏడేళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్!
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం 'ధృవ నచ్చితిరమ్'(తెలుగులో ధృవ నక్షత్రం ). 2017లో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటివరకు థియేట్రికల్ రిలీజ్ కాలేదు. ఈ మూవీని గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్లో తెరకెక్కించారు. 2018లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు అనివార్య కారణాలతో పాటు ఆర్థిక సమస్యల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. దాదాపు ఏడేళ్లుగా ఈ మూవీ విడుదలకు మోక్షం మాత్రం లభించడం లేదు. గతేడాది కూడా రిలీజ్ అవుతుందని వార్తలొచ్చినా అలా మాత్రం జరగలేదు. అయితే ఈ చిత్రంలో మజాకా మూవీ హీరోయిన్ రీతూ వర్మ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై మరోసారి టాక్ వినిపిస్తోంది. అన్ని సజావుగా సాగితే ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుందని తాజా సమాచారం. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్ని కుదిరితే మే 1న కార్మిక దినోత్సవం రోజున ధృవ నచ్చతిరమ్ థియేటర్లలో విడుదలయ్యే అవకాశముంది. అదే జరిగితే సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో వస్తోన్న రెట్రోతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. గతంలో ధృవ నచ్చతిరమ్ మూవీని మొదట సూర్యతో ప్లాన్ చేశారు. కానీ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌తో విభేదాల కారణంగా సూర్య ఈ చిత్రం నుండి వైదొలిగాడు. ఆ తర్వాత చియాన్ విక్రమ్‌ని సినిమాను తెరకెక్కించాడు. కాగా.. 2017లో సెట్స్‌పైకి వెళ్లిన ధృవ నచ్చితిరమ్ ఆర్థికపరమైన సమస్యలతో 2023లో పూర్తయింది. అప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద మాత్రం విడుదల కాలేదు. కాగా.. ఈ చిత్రంలో నటుడు సిమ్రాన్, పార్థిబన్, రాధిక శరత్‌కుమార్, వినాయకన్, దివ్యదర్శిని, వంశీకృష్ణ ముఖ్యపాత్రలు పోషించారు. -
మా సినిమాలో ఎవరి ముఖాలు కనిపించవు.. పెద్ద ప్రయోగమే!
‘‘డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన ‘డ్యూయల్’ చిత్రంలో నటీనటుల ముఖం కనిపించదు. అలాంటి నేపథ్యంలో ‘రా రాజా’ సినిమా తీసి దర్శకుడు శివ ప్రసాద్ ధైర్యం చేశాడు. ఇది చాలా పెద్ద ప్రయోగం’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. బి. శివ ప్రసాద్ దర్శకత్వంలో పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘రా రాజా’. బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా మార్చి 7న విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను తమ్మారెడ్డి భరద్వాజ్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ముఖాలు కనిపించవు. కథే ముందుకు వెళ్తుంటుంది. ఇది అద్భుతమైన ఐడియా. ఇది సక్సెస్ అయితే హీరోలు, స్టార్లతో పని లేకుండా అద్భుతమైన చిత్రాలు, ప్రయోగాలు చేయొచ్చని అంతా ముందుకు వస్తారు’’ అన్నారు. ‘‘మా చిత్రంలో నటీనటుల ముఖాలు కనిపించవు. కథ, కథనమే ముఖ్యంగా ఈ మూవీని తీశాం. ఇది ఒక ప్రయోగం’’ అన్నారు డైరెక్టర్ శివప్రసాద్. చదవండి: అమ్మానాన్న విడిపోయినప్పుడు హ్యాపీగా ఉన్నా: నటి -
క్రేజీ సినిమా.. రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పిన తుంబాడ్ పాత్రలు
కొన్ని సినిమాల్ని చూసినప్పుడు అద్భుతం అనకుండా ఉండలేం. అలాంటి కోవలోకే వస్తుంది తుంబాడ్. బాలీవుడ్ నటుడు సోమహ్ షా నటన సినిమాను మరింత రక్తికట్టించింది. ఇందులో ఆయన నటించడమే కాకుండా ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించాడు. తాజాగా ఇతడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ మూవీ పేరు క్రేజీ (Crazxy Movie). ఇందులో సోహమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. శనివారం (ఫిబ్రరి 1న) ఈ క్రేజీ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఫిబ్రవరి 28న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తుంబాడ్లోని ఫేమస్ క్యారెక్టర్లు హస్తర్, వినాయక్, బామ్మ పాత్రలతో విడుదల డేట్‌ను రివీల్ చేశారు. క్రేజీ సినిమాకు గిరీశ్ కోహ్లి దర్శకత్వం వహిస్తుండగా సోహమ్ షాతో పాటు ముకేశ్ షా, అమిత్ సురేశ్, ఆదేశ్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తుంబాడ్ (2018) విషయానికి వస్తే.. హారర్ జానర్లో సెన్సేషన్ హిట్ అందుకున్న ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. View this post on Instagram A post shared by Sohum Shah (@shah_sohum) చదవండి: 'మీ తిట్లు విన్నాక ఆ పని పూర్తి చేశా..' ఇంతకీ టైటిల్ అదేనా? -
డేట్ చేంజ్
జీవా(jeeva), అర్జున్ సర్జా(arjun sarja) హీరోలుగా, రాశీ ఖన్నా హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘అగత్యా’(agatya). ప్రముఖ పాటల రచయిత పా. విజయ్ కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మించిన ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నేడు విడుదల కావాల్సింది.అయితే జనవరి 31 నుంచి ఫిబ్రవరి 28కి విడుదలని వాయిదా వేసినట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘అగత్యా’. మన సంస్కృతి, అనుబంధాలను దర్శకుడు బలంగా చెప్పారు. అద్భుతమైన సీజీ వర్క్‌తో భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. వీఎఫ్ఎక్స్ కోసం మరికొంత టైమ్ కేటాయించాలని భావించి, విడుదల వాయిదా వేశాం’’ అని యూనిట్ పేర్కొంది. -
డేట్ మారిందా?
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం. విజయ్ దేవరకొండ కెరీర్లో 12వ సినిమా ఇది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాను తొలుత మార్చి 28న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్.అయితే ఆ డేట్‌కి రిలీజ్ వాయిదా పడిందని తెలిసింది. మే 30న రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్రయూనిట్ ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ చిత్రంలో విజయ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారని, రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుందనే టాక్ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత దర్శకులు రాహుల్ సంకృత్యాన్ , రవికిరణ్ కోలా సినిమాల్లో విజయ్ దేవర కొండ నటించనున్నారు. -
కుబేర రిలీజ్ డేట్ లో ట్విస్ట్..
-
ఏప్రిల్‌లో జాక్
వేసవిలో థియేటర్స్‌కు రానున్నాడు జాక్. ‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటిస్తున్న సినిమా ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్ . ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘బేబీ’ ఫేమ్ వైష్ణవీ చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ 80శాతంపైనే పూర్తయింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా వెల్లడించి, కొత్త పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘జాక్’ పూర్తి వినోదాత్మక చిత్రం. సిద్ధు పాత్ర అలరించేలా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: అచ్చు రాజమణి. -
Akhanda 2 Release Date: బాలయ్య యాక్షన్ తాండవం.. బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
నందమూరి బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం అఖండ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2 తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ మేరకు అఖండ-2 తాండవం పేరుతో ప్రోమోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తోన్న ఈ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో బాలయ్య డైలాగ్ అభిమానులను అలరిస్తోంది. ఇందులో బాలయ్య యాక్షన్ ఉగ్రరూపం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. The protector of Dharma will rage a powerful battle 🔱#Akhanda2 - Thaandavam shoot begins 💥💥Grand release worldwide for Dussehra on SEPTEMBER 25th, 2025 ❤🔥▶️ https://t.co/l2WnhFjwRj'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @14ReelsPlus… pic.twitter.com/oZeJPHNwQR— 14 Reels Plus (@14ReelsPlus) December 11, 2024 -
ఘంటసాల సినిమా చూడటం తెలుగు వారి కర్తవ్యం: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
‘‘ఘంటసాలగారిని శతాబ్ది గాయకుడు (సింగర్ ఆఫ్ సెంచరీ) అంటారు. ఆయన్ను నేను అమర గాయకుడు అంటాను. ఒక సాధారణ వ్యక్తిగా మొదలైన ఆయన జీవితం సంగీతంతో సాగుతూ... స్వాతంత్య్ర సమరయోధుడిగానే కాకుండా, సినీ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, భగవద్గీత గానాన్ని అందించిన తొలి తెలుగు స్ఫూర్తిగా భావితరాలకు ఆయన ఆదర్శంగా నిలుస్తారని భావిస్తున్నాను’’ అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. దివంగత ప్రముఖ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘ఘంటసాల: ది గ్రేట్’.ఈ చిత్రంలో ఘంటసాలపాత్రలో కృష్ణచైతన్య నటించారు. ఘంటసాల భార్య సావిత్రిపాత్రలో కృష్ణచైతన్య భార్య మృదుల నటించారు. సీహెచ్ రామారావు దర్శకత్వంలో సీహెచ్ ఫణి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్పోస్టర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ– ‘‘ఘంటసాలగారిపై సినిమా తీసినందుకు ఫణిగారిని అభినందిస్తున్నాను. కృష్ణచైతన్య, మృదులలను మెచ్చుకుంటున్నాను.సదుద్దేశంతో తీసిన ఈ సినిమా చూడటం తెలుగు వారి కర్తవ్యం’’ అన్నారు. మరో అతిథి దర్శక–నిర్మాత–నటుడు ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలి. ఉత్తరాది గాయకులకు ఇచ్చి ఆయనకు ఎందుకు ఇవ్వలేదు? ఎంజీఆర్‌కు భారతరత్న ఇచ్చి ఎన్టీఆర్‌కు ఇవ్వలేదు. ఆయనకూ ఇవ్వాలి’’ అని అన్నారు. ‘‘మా సినిమాను ప్రేక్షకులకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కృష్ణచైతన్య. ‘‘ఘంటసాలగారిపాట ఎంత గొప్పదో అందరికీ తెలుసు. కానీ ఆయన వ్యక్తిత్వం కొందరికే తెలుసు. ఆయన వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని ఈ సినిమాలో చెప్పడం జరిగింది’’ అని తెలిపారు సీహెచ్ రామారావు. -
క్రిస్మస్ బరిలో పాన్ ఇండియా చిత్రం.. రాబిన్‌హుడ్‌కు పోటీ తప్పదా?
రాజమౌళి ఈగ మూవీతో టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న నటుడు కిచ్చా సుదీప్. ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో మ్యాక్స్ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. 2022లో విక్రాంత్ రోణ తర్వాత సుదీప్ చేస్తోన్న చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కిచ్చా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకు విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ అనౌన్స్మెంట్ వీడియోను షేర్ చేశారు. ఈ విషయాన్ని కిచ్చా సుదీప్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. డిసెంబర్ 25న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సుదీప్ తన ట్వీట్లో రాస్తూ..' నిరీక్షణ ఇంకా ఉంది. ఫైనల్‌గా రిలీజ్ డేట్ ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే మీ ప్రోత్సాహానికి, సహనానికి నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. అయితే అదే రోజున టాలీవుడ్ మూవీ రాబిన్‌హుడ్ కూడా రిలీజవుతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద నితిన్‌తో పోటీ పడనున్నాడు కిచ్చా సుదీప్.కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ విలన్‌గా నటిస్తున్నారు. హనుమాన్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్‌గా సునీల్ లుక్ సైతం ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారానే సునీల్ శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీని కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు.It's been quite a wait. Finally happy to announce the release date.Thanks for the unlimited patience shown by all you friends out there and the consistent encouragement.🤗❤️#MaxTheMovie hits the theaters this Dec 25th.https://t.co/car6H2hmEb— Kichcha Sudeepa (@KicchaSudeep) November 27, 2024 -
చంటబ్బాయ్ తాలూకా అంటోన్న వెన్నెల కిశోర్.. ఆసక్తిగా పోస్టర్
టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. చంటబ్బాయ్ తాలూకా అనే ఉపశీర్షిక. ఈ సినిమాకు రచయిత మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ గణపతి సినిమాస్ పతాకంపై వెన్నపూస రమణా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. వచ్చే నెల క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా రిలీజైన పోస్టర్ ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. పోస్టర్ చూస్తుంటే డిటెక్టివ్ అండ్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గానే ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. Agent with entertainment is coming ❤️🔥#SreekakulamSherlockHolmes In Theatres on December 25th#VennelaKishore pic.twitter.com/EhXaLFX3DK— Adnan369 (@Adnan3693) November 25, 2024 -
మంచు విష్ణు 'కన్నప్ప' రిలీజ్ డేట్ ప్రకటన
మంచు విష్ణు ప్రధాన పాత్రలో చేస్తున్న సినిమా 'కన్నప్ప'. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైనప్పటికీ.. రిలీజ్ డేట్ విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది. లెక్క ప్రకారం ఈ డిసెంబరులోనే రావొచ్చనే రూమర్స్ వచ్చాయి. కానీ చిత్రీకరణ ఆలస్యం కావడంతో ఇది కేవలం రూమర్ మాత్రమే అని తేలిపోయింది.(ఇదీ చదవండి: ప్రేమ విషయం.. పబ్లిక్‌లో ఓపెన్ అయిపోయిన రష్మిక)దీంతో 'కన్నప్ప' ఎప్పుడు థియేటర్లలోకి వస్తాడా అని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏప్రిల్ 25న వస్తున్నట్లు అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. అయితే శివరాత్రి కానుకగా వచ్చుంటే కంటెంట్‌కి కలిసి వచ్చేదేమో అనిపించింది.ఈ సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్ర చేయగా.. ప్రభాస్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఇందులో అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. కాజల్, మోహన్ బాబు, శరత్ కుమార్ తదితరుల కూడా నటించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్) -
సంక్రాంతి బరిలో వెంకీమామ.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న సంక్రాంతి వస్తున్నాం. వెంకీ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ఫిల్మ్‌లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న హ్యట్రిక్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇటీవల టైటిల్ ప్రకటించిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వెంకటేశ్ గన్ చేతిలో పట్టుకుని.. పంటకట్టులో కనిపిస్తోన్న ఫోటోను షేర్ చేశారు. సంక్రాంతికి వస్తున్నా.. విక్టరీ వినోదాన్ని పంచుతున్నాం అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. ENTERTAINMENT LOADED 😎FUN READY TO FIRE 🔥The Blockbuster combo of Victory @VenkyMama and Hit Machine Director @AnilRavipudi is all set for a VICTORIOUS HATTRICK this Sankranthi 💥💥💥#SankranthikiVasthunam GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025.… pic.twitter.com/m0isUz0FdA— Sri Venkateswara Creations (@SVC_official) November 20, 2024 -
నాగ చైతన్య తండేల్.. రిలీజ్ డేట్ కోసం ఇంతలా పోటీపడ్డారా?
అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంటుందా? లేదా అభిమానులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. దీంతో తండేల్ మేకర్స్ రిలీజ్ డేట్‌పై అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిం తండేల్ విడుదల తేదీని ప్రకటించారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా వెల్లడించారు. ఈ ప్రకటనతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. మొదట క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చిందని తెలిపారు.అయితే ఈ రిలీజ్ డేట్‌పై చేసిన వీడియో మాత్రం ఫన్నీగా తెగ ఆకట్టుకుంటోంది. కేవలం సినిమా విడుదల తేదీని నిర్ణయించేందుకు ఓ గేమ్ ఆడారు. అదే టగ్ ఆఫ్ వార్ పేరుతో చిన్న పోటీ నిర్వహించారు. సంక్రాంతి, సమ్మర్ పేరుతో రెండు టీమ్స్‌గా విభజించి 'టగ్స్ ఆఫ్ తండేల్' అంటూ పోటీ పెట్టారు. ఈ గేమ్‌లో రెండు టీములు గెలవకపోవడంతో మధ్యలో ఫిబ్రవరిని ఎంచుకున్నారు. అలా తండేల్ మూవీ రిలీజ్ డేట్ మేకర్స్ నిర్ణయించారు. ఈ వీడియో ఇదేందయ్యా ఇదీ.. ఇదీ నేను చూడలే అంటూ అల్లు అరవింద్ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్‌కు నవ్వులు తెప్పిస్తున్నాయి. కాగా.. శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. How did team #Thandel decide on the release date? With a super fun game...❤🔥'Tugs of Thandel' out now 💥▶️ https://t.co/H0x2uNz02r#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7TH, 2025 ❤️🔥In Telugu, Tamil & Hindi.#ThandelonFeb7th#DhullakotteyalaYuvasamrat… pic.twitter.com/HYZQPsSegw— Geetha Arts (@GeethaArts) November 7, 2024 -
థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఎమ్4ఎమ్ సినిమా
థ్రిల్లింగ్ సబ్జెక్టుతో రాబోతున్న మరో తెలుగు సినిమా ఎమ్4ఎమ్ (మోటివ్ ఫర్ మర్డర్). తెలుగుతో పాటు ఐదు భాషలలో దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల తీసిన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఒకే ఒక కిల్లర్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ రెడ్ కలర్ పోస్టర్ చూస్తుంటే ఈ కిల్లర్ పూర్తిగా డిఫరెంట్‌గా.. నా రూటు వేరు అన్నట్లు ఉంది.(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్టుతో సినిమా తీశామని.. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అమెరికాలోనూ ప్రమోషన్స్ మొదలయ్యాయని చెప్పారు. వసంత్ అందించిన మ్యూజిక్, ఆనంద్ పవన్ చేసిన ఎడిటింగ్, సంతోష్ షానమోని కెమెరా పనితనం.. వంటి తమ టీమ్ వర్క్ హాలీవుడ్ రేంజ్లో వచ్చాయని ప్రశంసించారు. (ఇదీ చదవండి: హైదరాబాద్‌లోని హనుమాన్ గుడిలో జాన్వీ ప్రత్యేక పూజలు) -
సూర్య 'కంగువా' రిలీజ్.. మేకర్స్ బిగ్ ప్లాన్!
కోలీవుడ్ స్టార్ హీరో నటించిన పీరియాడికల్ యాక్షన్ చిత్రం కంగువా. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించారు. గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోన్న కంగువా చిత్రంపై నిర్మాత ధనంజయన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కంగువా మూవీని భారీస్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదివేల స్క్రీన్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. బెంగళూరులో మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నిర్మాత ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ ప్రకటనతో సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ధనంజయన్ మాట్లాడుతూ..' కంగువా విడుదల కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. తమిళనాడులో ఇప్పటికే 700లకు పైగా స్క్రీన్లు సిద్ధం చేశాం. ఒక్క సౌత్‌లోనే 2,500 కంటే ఎక్కువ స్క్రీన్లు ప్లాన్ చేశాం. ఉత్తర భారతదేశంలో దాదాపు 3,000 నుంచి 3,500 వరకు థియేటర్లలో విడుదల చేయనున్నాం. ఈ విషయం పట్ల మేము చాలా గర్వంగా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14న పదివేల కంటే ఎక్కువ స్క్రీన్లలో విడుదల కానుంది' అని అన్నారు.కాగా.. ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌లో సూర్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. -
పుష్ప-2 కౌంట్ డౌన్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ తేదీని ప్రకటించిన మేకర్స్.. అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందుకు మార్చారు. అంటే డిసెంబర్ 5న పుష్పరాజ్ థియేటర్లలో సందడి చేయనున్నాడు.పుష్ప-2 విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం ఉండడంతో ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అల్లు అర్జున్, ఫాహద్ ఫాజిల్ ఉన్న పోస్టర్‌ను పంచుకున్నారు. నెల రోజుల్లోనే పుష్ప-2 రానుందంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. అంతేకాకుండా ట్రైలర్ త్వరలోనే పేలనుందంటూ హింట్ ఇచ్చారు. అయితే ట్రైలర్ రిలీజ్ తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే ఈ నెలలోనే పుష్ప-2 ట్రైలర్ విడుదలయ్యే అవకాశముంది. కేవలం 30 రోజులు మాత్రమే సమయం ఉండగా.. వరుసగా మరిన్నీ అప్డేట్స్ ఇవ్వనున్నారు. (ఇది చదవండి: ఓటీటీలో 'దేవర'.. అధికారిక ప్రకటన వచ్చేసింది)గ్రాండ్‌గా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్..పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ పెద్ద ప్లానింగే వేసినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన పాట్నా, కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో ఓకేసారి ట్రైలర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపుగా ఈనెల 15న ట్రైలర్ విడుదల చేసే అవకాశముందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా బాహుబలి-2 తర్వాత అత్యధిక బజ్ ఉన్న చిత్రంగా పుష్ప-2 నిలిచింది. #Pushpa2TheRule TRAILER EXPLODING SOON 🌋🌋#1MonthToGoForPushpa2RAGE#Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/DylHFYbItZ— Pushpa (@PushpaMovie) November 5, 2024 -
కంగువాతో పోటీకి దిగుతున్న ప్రశాంత్ వర్మ
అశోక్ గల్లా హీరోగా నటించిన చిత్రం దేవకీనందన వాసుదేవ. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించగా బుర్రా సాయిమాధవ్ మాటలు సమకూర్చాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తుండగా మానస వారణాసి హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. నవంబర్ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక అదే రోజు సూర్య కంగువ, వరుణ్ తేజ్ మట్కా సినిమాలు రిలీజవుతున్నాయి. అయినా సరే కంటెంట్ మీద నమ్మకంతో వాటితో పోటీకి రెడీ అయ్యాడు ప్రశాంత్ వర్మ. మరి ఈ బాక్సాఫీస్ ఫైట్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి! సినిమా మీద మంచి నమ్మకం తో కంగువా మీద వేస్తున్నారు 👍సినిమా కి #టాలీవుడ్ good రిపోర్ట్ ఉంది#DevakiNandanaVasudeva in cinemas from November 14th 🎥#DNVonNov14 🤩@AshokGalla_ @varanasi_manasa @ArjunJandyala @PrasanthVarma @lalithambikaoff pic.twitter.com/m4WwhMIfKn— Kakinada Talkies (@Kkdtalkies) October 25, 2024 -
ఎమర్జెన్సీకి లైన్ క్లియర్.. విడుదల తేదీపై ఉత్కంఠ!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా 'ఎమర్జెన్సీ'. ఇప్పటికే జూలైలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. గతనెల సెప్టెంబర్ 6న థియేటర్లలోకి వస్తుందని భావించినప్పటికీ.. ఊహించని విధంగా మరోసారి పోస్ట్‌పోన్ అయింది. దీంతో ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు.తాజాగా తన అభిమానులకు కంగనా రనౌత్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేసినట్లు ట్విటర్ ద్వారా ప్రకటించింది. మా చిత్రబృందం సెన్సార్ పూర్తి చేసుకుందని.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఈ విషయంలో మీ సహనానికి, మద్దతుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది.(ఇది చదవండి: కంగనా ఎమర్జెన్సీ.. రిలీజ్‌కు మోక్షం అప్పుడేనా?)కాగా.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జన్సీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ మూవీపై ఓ వర్గం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను చెడుగా చిత్రీకరించారంటూ ఈ చిత్రంపై ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా సెన్సార్ బోర్డ్ సైతం కొన్ని సీన్స్ కట్ చేయాలని చిత్రబృందానికి సూచించింది. అందువల్లే ఎమర్జెన్సీ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకోవడంతో త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. We are glad to announce we have received the censor certificate for our movie Emergency, we will be announcing the release date soon. Thank you for your patience and support 🇮🇳— Kangana Ranaut (@KanganaTeam) October 17, 2024 -
'పుష్ప 2' రిలీజ్ డేట్.. మళ్లీ మార్పు?
తెలుగు ప్రేక్షకులు 'పుష్ప 2' మూవీ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. లెక్క ప్రకారం ఈపాటికే షూటింగ్ పూర్తయి, థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ వాయిదా పడింది. ఈ ఏడాది డిసెంబరు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు ఆ తేదీలో కూడా చిన్నపాటి మార్పు చేశారట.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్)అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తీసిన 'పుష్ప' మూవీ 2021 డిసెంబరులో రిలీజైంది. ఎలాంటి అంచనాల్లేకుండా పాన్ ఇండియా వైడ్ రిలీజై, సెన్సేషన్ సృష్టించింది. దీంతో సీక్వెల్‌పై బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో దర్శకుడు సుకుమార్.. ప్రతి విషయాన్ని చాలా కేర్ తీసుకోవడం మొదలుపెట్టారు. అలా దాదాపు మూడేళ్లు గడిచిపోయింది.ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబరు 6కి ప్లాన్ మార్చారు. ఇప్పుడు ఒక్కరోజు ముందుకి రిలీజ్ డేట్ జరిపినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. మరి ఇందుకు గల కారణాలు ఏంటి? బిజినెస్, ఓటీటీల లెక్కల పరంగా మార్పు చేశారా? మరేదైనా కారణముందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: హీరో నారా రోహిత్ నిశ్చితార్థం ఆ హీరోయిన్ తో?) -
'సి 202' హారర్ మూవీ.. ఈ నెలలోనే రిలీజ్
ఇప్పుడు ఆడియెన్స్ అంతా కూడా కొత్త కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న చిత్రాలనే ఆదరిస్తున్నారు. ఈక్రమంలో విభిన్నమైన కాన్సెప్ట్, టైటిల్‌తో తెరకెక్కిన మూవీ ‘సి 202’. పూర్తి నైట్ ఎఫెక్ట్స్‌లోనే ఈ సినిమాను చిత్రీకరించారు. మున్నా కాశీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటించింది. మైటీ ఓక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కె ఎ నిర్మిస్తున్నాడు. తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ట్రైలర్లో ఒక్క డైలాగ్ లేకుండా.. కేవలం నటీనటుల హావభావాలతోనే అందరినీ ఆకట్టుకున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ ఈ చిత్రానికి ప్రధాన బలం అని ఇట్టే తెలిసిపోతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. అక్టోబర్ 25న విడుదల చేస్తున్నామంటూ రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. -
మెగా హీరో సడన్ సర్ప్రైజ్.. ఆశలన్నీ దీనిపైనే
మెగా హీరో వరుణ్ తేజ్ మంచి నటుడే. వైవిధ్యమైన సినిమాలు చేస్తుంటాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. అదృష్టమే కలిసి రావడం లేదు. ఎందుకంటే గత మూడు నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్స్‌గా నిలిచాయి. దీంతో మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఇలాంటి టైంలో 'మాట్కా' అనే మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు దీని రిలీజ్ డేట్ ఖరారు చేశారు.(ఇదీ చదవండి: పెళ్లికి ముందే పిల్లల గురించి శోభిత కామెంట్స్)'పలాస' మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న 'మాట్కా' చిత్రాన్ని.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీస్తున్నారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీత దర్శకుడు. నవంబరు 14న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.కొన్నాళ్ల క్రితం బడ్జెట్ సమస్యల వల్ల ఈ సినిమా ఆగిపోయిందనే రూమర్స్ వచ్చాయి. కానీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇంతలోనే సర్ప్రైజ్ అన్నట్లు రిలీజ్ డేట్‌తో వచ్చేశారు. దీనితో పాటే సూర్య 'కంగువ' రిలీజ్ కానుంది. మరి వరుణ్ తేజ్ హిట్ కొట్టి కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్) -
గ్యాంగ్‌స్టర్ రిలీజ్ డేట్ వచ్చేసింది
చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంచన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా గ్యాంగ్ స్టర్. అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్య నారాయణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్‌లో రవి, నరసింహా సమర్పణలో చంద్రశేఖర్ రాథోడ్ దర్శకత్వం వహిస్తున్న గ్యాంగ్ స్టర్ సినిమా అక్టోబర్ 25న రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీ పోస్టర్‌ను సాయి మాధవ్ బుర్ర విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా టీజర్, ట్రైలర్ ఇంకా పోస్టర్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీకి కష్టపడ్డ ప్రతి ఒక్కరిని విజయం వరించాలని కోరుకుంటున్నాను అన్నారు. నటుడు అభినవ్ జనక్ మాట్లాడుతూ.. రెండు గ్యాంగ్స్ మధ్య వార్‌ను డైరెక్టర్ చంద్రశేఖర్ ఆకట్టుకునేలా డిజైన్ చేశాడు. ప్రతి సీన్ బాగుంటుంది. ఈ చిత్రంలో నేనొక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను అన్నాడు.హీరో, దర్శక నిర్మాత చంద్రశేఖర్ రాథోడ్ మాట్లాడుతూ.. సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అన్నపూర్ణ స్టూడియోస్ లో డీఎఫ్ టీ కోర్స్ చేశాను. దిల్ రాజు గారు ట్రైలర్ చూసి బాగుందన్నారు. మా సినిమా తేదీ ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన సాయి మాధవ్ బుర్రా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. ఆ డేట్ ఫిక్స్ అయినట్టే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా హీరో నటిస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ డైరెక్షన్లో ఈ మూవీని పొలిటికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది.అయితే మెగా ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కోసం తెగ ఆరా తీస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్కు రిలీజవుతుందని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. కానీ విడుదల తేదీపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ గేమ్ ఛేంజర్ విడుదలపై హింట్ ఇచ్చాడు. వచ్చే వారం నుంచే గేమ్ ఛేంజర్‌కు సంబంధించిన అన్‌స్టాపబుల్ ఈవెంట్స్ డిసెంబర్ 20 వరకు జరుగుతాయని పోస్ట్ చేశారు. దీంతో గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20న రిలీజ్ కానుందని అభిమానులు భావిస్తున్నారు. దాదాపు ఈ తేదీ ఖరారు అయినట్లే. కాగా.. ఈ చిత్రం శ్రీకాంత్, ఎస్జే సూర్య, అంజలి, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు.రామ్ చరణ్ బిజీ..గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి కావడంతో రామ్ చరణ్ నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో చెర్రీ నటిస్తున్నారు. ఇందులో గ్లోబల్ స్టార్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఇటీవల ఈ మూవీ కోసం ఫిట్నెస్ ట్రైనర్ శివోహంతో కలిసి కసరత్తులు చేస్తున్నట్లు ట్విటర్లో పోస్ట్ చేశారు. From next week it will be an unstoppable Events forand releases for #GAMECHANGER till DEC 20 th 2024 ❤️🧨✨Get ready guys !!— thaman S (@MusicThaman) September 18, 2024 -
దసరా బరిలో సుధీర్ బాబు.. ఈ సారైనా హిట్ కొడతాడా?
ఇటీవలే హరోం హర మూవీతో మెప్పించిన టాలీవుడ్ స్టార్ సుధీర్‌బాబు. తాజాగా మరోసారి అభిమానులను అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మా నాన్న సూపర్ హీరో'. ఇందులో ఆర్ణ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీసెల్యూలాయిడ్స్, క్యామ్ ఎంటర్టైన్మెంట్తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.తండ్రీ, తనయులు అనుబంధం నేపథ్యంలో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ మూవీని రూపొందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను పంచుకున్నారు. అయితే రిలీజ్ డేట్‌ను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం మానాన్న హీరో అని చిత్రయూనిట్ తెలిపింది. కాగా.. చిత్రంలో సాయిచంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు.#MaaNannaSuperhero post production works underway.The emotional saga will hit the big screens during Dussehra. Release date announcement soon ❤🔥Stay tuned for more exciting updates 💥@isudheerbabu #SaiChand @sayajishinde @abhilashkankara @mahesh_films @vcelluloidsoffl… pic.twitter.com/AZQjpGRPF0— UV Creations (@UV_Creations) August 27, 2024 -
దసరా బాక్సాఫీస్.. రజినీకాంత్ - సూర్య ఫ్యాన్స్ మధ్య వార్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానుల్లో పెద్దఎత్తున అంచనాలు నెలకొన్నాయి. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే అనుకున్నట్లుగానే జరుగుతుందన్న తరుణంలో కంగువా వాయిదా పడుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సూర్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.అయితే అదే రోజు రజినీకాంత్ మూవీ వెట్టైయాన్ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే కంగువా మూవీ వాయిదా పడుతోందన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇది కాస్తా సూర్య, తలైవా ఫ్యాన్స్ మధ్య వార్‌గా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.కంగువా వాయిదా.. ట్విటర్లో ట్రెండింగ్?సూర్య నటిస్తోన్న కంగువా భారీ బడ్జెట్ చిత్రం కావడంతో నిర్మాతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 10 రజినీకాంత్‌తో పోటీపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 31కి వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కంగువా రిలీజ్ డేట్ ముందుగానే ప్రకటించినప్పటికీ పోటీలో రజినీకాంత్ రావడంతో వాయిదా పడినట్టేనని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త విన్న సూర్య ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'షేమ్ ఆన్ యూ స్టూడియోగ్రీన్' అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. కంగువా మేకర్స్ క్లారిటీ ఇస్తేనే ఫ్యాన్స్ మధ్య వార్‌కు చెక్ పడుతుంది. -
'ఇది చిన్న కథ కాదు'.. రిలీజ్ ఎప్పుడంటే?
నివేదా థామస్, ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం '35-చిన్న కథ కాదు'. నంద కిషోర్ ఈమని దర్శకత్వం వహించిన ఈ మూవీని రానా దగ్గుబాటి సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ విషయాన్ని టాలీవుడ్ హీరో రానా ట్విటర్ ద్వారా షేర్ చేశారు.ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల కానున్నట్లు వెల్లడించారు. ప్రియదర్శి బర్త్ డే కావడంతో రిలీజ్ తేదీతో పాటు స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ చూస్తే ఈ సినిమాను ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమెషన్స్ కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీలో విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. Get ready to experience the heartwarming Story of every household ❤️ ✨️ "Chinna Katha Kaadu"#35Movie in Theatres on SEPTEMBER 6th!#35CKK @i_nivethathomas @imvishwadev @PriyadarshiPN @gautamitads #NandaKishore @nikethbommi #VivekSagar @siddharthr87 @srujanyarabolu1… pic.twitter.com/aanB0IcZq5— Rana Daggubati (@RanaDaggubati) August 25, 2024 -
దుల్కర్ సల్మాన్ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
సీతారామం మూవీతో టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకున్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఆయన హీరోగా లక్కీ భాస్కర్ చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. కాగా.. ఇప్పటికే వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న ఈ మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.తాజాగా లక్కీ భాస్కర్ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అభిమానులకు మంచి క్వాలిటీతో సినిమాను అందించాలనే ఉద్దేశంతో పోస్ట్‌పోన్ చేస్తున్నామని వెల్లడించారు. ద్విభాషా చిత్రంగా రూపొందిస్తున్నప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నామని తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టర్‌ను పంచుకున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న లక్కీ భాస్కర్ సందడి చేయనున్నట్లు పోస్ట్ చేశారు. కాగా.. 1980-90 కాలంలో ఓ బ్యాంక్ క్యాషియర్ అసాధారణస్థాయికి ఎలా ఎదిగాడనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.అయితే అక్టోబర్ 31న మరో యంగ్ హీరో సినిమా రిలీజ్ కానుంది. మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగా నటిస్తోన్న మెకానిక్ రాకీ అదే రోజు విడుదలవుతోంది. ఈ చిత్రంలోనూ హీరోయిన్ మీనాక్షి చౌదరి కావడం మరో విశేషం. దీంతో ఓకే రోజు రెండు సినిమాలతో అభిమానులను అలరించేందుకు గుంటూరు కారం భామ సిద్ధమైంది. Postponing releases can impact social media reputation, but it's essential for our film's quality! 😔#LuckyBaskhar is set to make your Diwali special in theaters worldwide. 🏦🎇Grand release on Oct 31st, 2024. #LuckyBaskharOnOct31st 💵@dulQuer #VenkyAtluri @Meenakshiioffl… pic.twitter.com/cJCbFdeFr2— Sithara Entertainments (@SitharaEnts) August 20, 2024 -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తోన్న సంఘర్షణ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
చైతన్య పసుపులేటి, రషీద భాను ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం సంఘర్షణ. ఈ సినిమాకు చిన్న వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. మహీంద్ర పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీనివాస రావు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు.అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ప్రేక్షకులకు నచ్చే సినిమాతో రావడం సంతోషంగా ఉందని నిర్మాత వల్లూరి శ్రీనివాస్ రావు తెలిపారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 9న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని వన్ మీడియా ద్వారా పార్థు రెడ్డి థియేట్రికల్ విడుదల చేస్తున్నారు. ఆదిత్య శ్రీ రామ్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. -
రిలీజ్‌కు సిద్ధమైన పరాక్రమం మూవీ.. డేట్ ఫిక్స్!
బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం "పరాక్రమం". ఈ చిత్రాన్ని బీఎస్కే మెయిన్‌స్ట్రీమ్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను ఆగస్టు 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో మూవీ రిలీజ్ అనౌన్స్మెంట్ టీజర్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ..'మా పరాక్రమం సినిమాను చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేస్తున్నాం. పరాక్రమం విషయానికి వస్తే ఇదొక సంఘర్షణతో కూడుకున్న కథ. నేను మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చా. నేను గతంలో నిర్భందం , నిర్భందం 2 , మాంగళ్యం సినిమాలను రూపొందించా. ఒక మంచి ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం నా స్టైల్ మార్చాలని ఫిక్స్ అయ్యా. అలా మార్చి చేసిన సినిమానే పరాక్రమం. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
మాస్ మహారాజా వచ్చేస్తున్నాడు.. మిస్టర్ బచ్చన్ రిలీజ్ ఎప్పుడంటే?
మాస్ మహారాజా హీరో రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. గతంలో వీరిద్దరి కాంబోలో షాక్, మిరపకాయ్ లాంటి సినిమాలొచ్చాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి ఇటీవలే సితార్ అనే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు ఆడియన్స్ విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా మిస్టర్ బచ్చన్ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని రవితేజ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మాస్ లుక్‌లో ఉన్న పోస్టర్‌ను కూడా పంచుకున్నారు. దీంతో మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ ఫ్యాన్‌గా రవితేజ కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాతోనే భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. జగపతి బాబు విలన్ పాత్రలో కనిపించనున్నారు. Get Ready!!#MrBachchan is Arriving..MASSive entertainment begins from this August 15th 🤙Premieres on AUG 14th.. pic.twitter.com/xkSEy5EUkW— Ravi Teja (@RaviTeja_offl) July 21, 2024 -
అల్లు శిరీష్ 'బడ్డీ' వచ్చేస్తున్నాడు.. రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ నటిస్తోన్న తాజా చిత్రం 'బడ్డీ'. ఈ మూవీలో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సామ్ ఆంటోన్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజగా బడ్డీ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 'ఆగస్టు 2న బడ్డీ వస్తున్నాడు.. క్యాలెండర్లో ఈ డేట్‌ను మార్క్ చేసుకోండి.. థియేటర్లలో కలుసుకుందాం' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో టెడ్డీ బేర్‌కు సాయం చేసే కెప్టెన్ పాత్రలో హీరో అల్లు శిరీష్ కనిపించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో బడ్డీ ప్రేక్షకులను అలరించనున్నారు. చాలా రోజుల తర్వాత అజ్మల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.Buddy is now releasing on August 2nd. Please mark the date on your calendar. And see you soon in the theatres!!! 🐻🧸✨ pic.twitter.com/JqcJNqhlBe— Allu Sirish (@AlluSirish) July 17, 2024 -
దసరా రేస్‌లో నిలిచిన భారీ బడ్జెట్ చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'కంగువా'. ఈ సినిమాను శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది.తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు సూర్య ట్వీట్ చేశారు. కాగా.. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఒక వార్ సీన్ ఏకంగా 10 వేల మందితో తీసినట్లు టాక్ వినిపించింది. సూర్య, బాబీ డియోల్ మధ్య ఓ భారీ యుద్ధ సీక్వెన్స్‌ను తెరకెక్కించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా కంగువా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. సినిమాలో సూర్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమా ద్వారానే తమిళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. మరో బాలీవుడ్ నటి దిశా పటానీ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. జగపతి బాబు, యోగి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. Dear all It’s 10th October 2024#KanguvaFromOct10 @directorsiva @DishPatani @thedeol @ThisIsDSP @vetrivisuals #MilanArtDir @GnanavelrajaKe @StudioGreen2 @UV_Creations @KvnProductions @PenMovies #PenMarudhar @jayantilalgada @NehaGnanavel @saregamasouth pic.twitter.com/qPkwuSOJmS— Suriya Sivakumar (@Suriya_offl) June 27, 2024 -
పుష్ప-2 వాయిదా.. రేసులోకి వచ్చేసిన ఎన్టీఆర్ బామ్మర్ది!
జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్దిగా ఇండస్ట్రీకి పరిచయం హీరో నార్నెనితిన్. మ్యాడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. తాజాగా నితిన్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'ఆయ్'. అతనికి జంటగా నయన్ సారిక హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను జీఏ2 బ్యానర్‌పై అంజి కె.మణిపుత్ర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని బన్నీ, విద్యా కొప్పినీడి నిర్మాతలుదా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తాజాగా ఈ ఆయ్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పాటలకి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ తేదీ విడుదల కావాల్సిన పుష్ప-2 వాయిదా పడడంతో చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి.మరోవైపు అదే రోజున హీరో రానా నిర్మాతగా తెరకెక్కిస్తోన్న '35 – ఇది చిన్నకథ కాదు' రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, నివేదా థామస్ జంటగా నటించారు. వీటితో రామ్ పోతినేని-పూరి కాంబోలో వస్తోన్న డబుల్ ఇస్మార్ట్ సినిమాను అదే రోజు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో ఈ మూడు సినిమాలు పోటీ పడనున్నాయి. మరి ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే. Gear Up to Celebrate Godavari Emotion, Love, Friendship & much more with the 𝐔𝐋𝐓𝐈𝐌𝐀𝐓𝐄 𝐅𝐔𝐍 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐄𝐑 of the 𝗦𝗘𝗔𝗦𝗢𝗡 🥳❤️🔥#AAYMovie Grand release in theatres on Independence Day, 𝐀𝐔𝐆𝐔𝐒𝐓 𝟏𝟓𝐭𝐡!😍#AAY #AAYonAUG15 🤩#AlluAravind #BunnyVas… pic.twitter.com/HJV9kDEKgj— Geetha Arts (@GeethaArts) June 25, 2024From the sacred land of Tirupathi ✨Bringing you a lovely narrative that will touch everyone’s heartsPresenting35 ~ Chinna Katha Kaadu❤️🔥Starring @i_nivethathomas @PriyadarshiPN @imvishwadev @gautamitads In cinemas from AUGUST 15th, 2024#35Movie #NandaKisore… pic.twitter.com/4HjdTTXk8o— Rana Daggubati (@RanaDaggubati) June 25, 2024 -
తేదీ తార్ మార్
వచ్చేస్తున్నా అంటూ ఓ డేట్ చెప్పారు. అయితే ఆ డేట్‌కి కాకుండా కాస్త లేట్‌గా వస్తా అంటున్నారు. చెప్పిన డేట్కన్నా ముందే వస్తా అంటున్నవారూ ఉన్నారు. ఈ మధ్య కొన్ని తెలుగు చిత్రాల విడుదల తేదీలు తారుమారయ్యాయి. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ అలా వాయిదాలు పడి, ఫైనల్లీ ఈ 27న థియేటర్స్‌కి వస్తోంది. ఇలా రిలీజ్ డేట్‌ను తారుమారు చేసుకున్న కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం. దేవర.. ఓ పెద్ద కథ ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ సినిమాని ప్రకటించినప్పుడే విడుదల తేదీ (2024 ఏప్రిల్ 5న)ని కూడా ప్రకటించారు మేకర్స్. కానీ కథ పెద్దది కావడంతో ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లుగా ఆ తర్వాత పేర్కొన్నారు. అయితే చిత్రీకరణ ప్లాన్ చేసిన ప్రకారం జరగకపోవడంతో తొలి భాగం విడుదలను అక్టోబరు 10కి వాయిదా వేశారు.కానీ కాస్త ముందుకి వస్తున్నాడు ‘దేవర’. సెప్టెంబరు 27న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ముందుగా ప్రకటించిన మరో సినిమా సెప్టెంబరు 27న రాకపోవడంతో ఈ తేదీకి ‘దేవర’ రావడానికి రెడీ అయ్యాడట. కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం కానున్నారు. పుష్పరాజ్... సీన్ రిపీట్ ‘పుష్ప’ ఫ్రాంచైజీ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ 2021 డిసెంబరు 17న విడుదలై, మంచి విజయం సాధించింది. హీరో పుష్పరాజ్‌గా టైటిల్ రోల్ చేసిన అల్లు అర్జున్‌కి ఉత్తమ జాతీయ నటుడి అవార్డుని తెచ్చిపెట్టింది ఈ చిత్రం. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయిక. ఇక తొలి భాగం సాధించిన విజయంతో జోష్‌గా మలి భాగం ‘పుష్ప: ది రూల్’ను ఆరంభించారు. కొంత చిత్రీకరణ తర్వాత ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తి కాలేదు.క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేక ‘పుష్ప: ది రూల్’ రిలీజ్‌ను ఆగస్టు 15 నుంచి డిసెంబరు 6కు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ‘పుష్ప: ది రైజ్’ను కూడా తొలుత 2021 ఆగస్టు 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ డిసెంబరులో విడుదల చేశారు. అలాగే ‘పుష్ప 2: ది రూల్’ని 2024 ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకుని డిసెంబరు 6కి మార్చారు. తొలి భాగానికి జరిగిన సీన్ రిపీట్ అయింది. మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ రెడీ ‘ఇస్మార్ట్ శంకర్’గా హీరో రామ్‌లోని మాస్ యాంగిల్‌ని ఓ రేంజ్లో చూపించారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రం 2019లో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ‘ఇస్మార్ట్ శంకర్’ కథలో సీక్వెల్‌కు స్కోప్ ఉండటంతో రామ్‌తోనే ‘డబుల్ ఇస్మార్ట్’ను ప్రకటించారు పూరి. ఈ సినిమా ప్రకటించిన రోజునే 2024 మార్చి 18న రిలీజ్ చేయనున్నట్లు కూడా వెల్లడించారు. కానీ విడుదల కాలేదు. ఆ తర్వాత జూలైలో విడుదల కావొచ్చనే ప్రచారం సాగింది. ఈ మూవీ చిత్రీకరణ అనుకున్నట్లుగా సాగలేదట. దీంతో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను ఆగస్టు 15న రిలీజ్‌కి రెడీ చేస్తున్నట్లుగా తాజాగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మాతలు. ముందుకు రానున్న లక్కీ భాస్కర్‘మహానటి’, ‘సీతారామం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఈ హీరో ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘లక్కీ భాస్కర్’ని సెప్టెంబరు 27న విడుదల చేస్తున్నట్లుగా ఇటీవల ప్రకటించారు. కానీ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా అదే తేదీకి తెరపైకి రానుంది. ‘లక్కీ భాస్కర్’ సినిమా నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ ‘దేవర’ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకున్నారట.దీంతో ఒకే రోజు ఒకే బ్యానర్ నుంచి రెండు సినిమాల విడుదల ఎందుకని భావిస్తున్నారట నాగవంశీ. ఈ నేపథ్యంలో ‘లక్కీ భాస్కర్‌ను కాస్త ముందుగానే ఆగస్టులో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని భోగట్టా. అయితే ఆగస్టు 15న ఇప్పటికే రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’, కీర్తీ సురేష్ ‘రఘుతాత’ సినిమాలు ఉన్నాయి. సో.. ‘లక్కీ భాస్కర్’ ఏ తేదీన వస్తాడో చూడాలి. ఇక దుల్కర్ సూపర్ హిట్ మూవీ ‘సీతారామం’ 2022 ఆగస్టు తొలివారంలో విడుదలైంది. ఈ సెంటిమెంట్‌ని అనుసరించి, ‘లక్కీ భాస్కర్’ని కూడా ఆగస్టు తొలి వారంలో రిలీజ్ చేస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది.ఈ కోవలోనే మరికొన్ని సినిమాల రిలీజ్ డేట్లు ముందుకు, వెనక్కు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పుష్ప-2 మూవీ వాయిదా.. కోర్టులో కేసు వేస్తానంటోన్న నెటిజన్!
బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం 'పుష్ప-2: ది రూల్'. ఈ సినిమాను సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో రూపొందించిన పుష్ప బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో పుష్ప-2 పై కూడా అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.అయితే దాదాపు నాలుగు నెలల ముందే పుష్ప-2 రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని సుకుమార్ పలుసార్లు కుండబద్దలు కొట్టారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ కూడా ఖుషీ అయ్యారు. మరో రెండు నెలల్లో రిలీజ్ కావాల్సినా పుష్ప-2 ఊహించని విధంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అభిమాన హీరో మూవీ వాయిదా పడడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ వేదికగా తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ ట్వీట్‌కు ఓ నెటిజన్ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్లో రాసుకొచ్చాడు.ట్వీటిర్లో నెటిజన్ రాస్తూ.. 'పుష్ప-2 సినిమా జూన్ 2024లో విడుదల కావాల్సిన సినిమా. అసలు డిసెంబర్ 2024కి ఎందుకు మార్చారు. ఇదంతా పుష్ప మేకర్స్‌కు జోక్‌లా ఉందా? మీరు ప్రేక్షకుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు. తక్షణమే పుష్ప-2 విడుదల చేయాలని కమ్యూనిటీ తరపున కోర్టులో కేసు వేస్తా'అంటూ ఐకాన్ స్టార్ పోస్ట్‌కు రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. మరో నెటిజన్ రాస్తూ.. 'ఇది మంచి పద్ధతి కాదు.. ఇంకా ఎన్నిసార్లు డేట్ మారుస్తారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మూవీ రిలీజ్ డేట్ మారడంతో బన్నీ ఫ్యాన్స్ సైతం మండిపడుతున్నారు.oh godwhy you reschedule yr?😓How many times you are rescheduling #Pushpa2TheRulethis is unfair— Puneet (@iampuneet_07) June 17, 2024The movie was releasing in June 2024. Why this has been shifted to Dec 2024. Is this a joke to the filmmakers. Playing with the emotions of audience.On behalf of Puspha Community i will file a case in Court to release it ASAP— GlobalGlimpses✨ (@krunchi_hu) June 17, 2024 -
అనుకున్నదే జరిగింది.. పుష్ప-2 రిలీజ్ డేట్ ఇదే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం 'పుష్ప-2: ది రూల్'. ఈ సినిమాను సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ తేదీని ప్రకటించిన మేకర్స్ పుష్ప-2 పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. తాజాగా కొత్త విడుదల తేదీని రివీల్ చేశారు.ఈ ఏడాది డిసెంబర్ 6న పుష్ప-2 విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. ఇప్పటికే మూవీ వాయిదా పడుతుందంటూ చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. ఆగస్టు 15న రిలీజ్ అవుతుందని ప్రకటించాక రూమర్స్ మొదలయ్యాయి. అయితే కొంత షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ పెండింగ్ ఉన్నందున రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. We intend to give you the best 🔥The wait increases for a memorable experience on the big screens.#Pushpa2TheRule Grand release worldwide on 6th DECEMBER 2024 💥💥His rule will be phenomenal. His rule will be unprecedented ❤️🔥Icon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/3JYxXd2YgF— Pushpa (@PushpaMovie) June 17, 2024 -
పుష్ప 2 ప్లేసులోకి 'ఇస్మార్ట్'.. వాయిదా పడినట్లేనా?
అల్లు అర్జున్ 'పుష్ప 2' కోసం ఫ్యాన్స్ మామూలుగా ఎదురుచూడట్లేదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ వచ్చి దాదాపు మూడేళ్లు అవుతోంది. ఇకపోతే ఇప్పటికే రిలీజైన రెండు లిరికల్ సాంగ్స్ అంచనాలు పెంచేస్తున్నాయి. దీంతో ఆగస్టు 15 ఎప్పుడొస్తుందా అని బన్నీ ఫ్యాన్స్ వెయిటింగ్. అయితే ఈ తేదీకి మూవీ రిలీజ్ కావట్లేదని, వాయిదా పడిందని గత కొన్నిరోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి. ఇవి నిజమా కాదా అని అందరూ అనుకుంటూ ఉండగా.. మరో మూవీ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్)ఆగస్టు 15న 'పుష్ప 2' రిలీజైతే.. ఆ లాంగ్ వీకెండ్ బాగా కలిసొస్తుంది. ఇదే మూవీ టీమ్ ప్లాన్. కానీ షూటింగ్ ఇంకా చాలా చేయాల్సి ఉందని, దీంతో చెప్పిన డేట్‌కి కుదరకపోవచ్చని టాక్ నడుస్తోంది. ఇది ఇలా ఉండగానే రామ్-పూరీ జగన్నాథ్ 'డబుల్ ఇస్మార్ట్' మూవీ టీమ్ అదే తేదీని తమ సినిమా రిలీజ్ డేట్‌గా ప్రకటించింది. దీనిబట్టి చూస్తే 'పుష్ప 2' వాయిదా కన్ఫర్మే. లేకపోతే అంత ధైర్యంగా విడుదల తేదీ ఆగస్టు 15 అని అయితే వేయరుగా.మరోవైపు 'ఓజీ' విషయంలోనూ ఇలానే జరిగింది. సెప్టెంబరు 27న రిలీజ్ ఉంటుందని చెప్పారు. కానీ 'దేవర' టీమ్.. ఇదే తేదీన తాము మూవీని రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంటే 'ఓజీ' కూడా వాయిదా పడ్డట్లే. ఇకపోతే 'పుష్ప 2' ఇప్పుడు మిస్ అయితే మళ్లీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్. డిసెంబరులో ఉండొచ్చని ఓ టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి?(ఇదీ చదవండి: హీరోయిన్ ఫేక్ వీడియో.. రూ.100 కోట్ల పరువు నష్టం దావా) -
కేజీఎఫ్ హీరో సూపర్ హిట్ చిత్రం.. తెలుగులో రిలీజ్ ఎప్పుడంటే?
కేజీఎఫ్ హీరో యశ్, షీనా జంటగా నటిస్తోన్న చిత్రం రాజధాని రౌడీ. ఈ సినిమా కేవీ రాజు దర్శకత్వంలో తెరకెక్కించారు. డ్రగ్స్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సంతోశ్ కుమార్ మంచి సందేశం ఇచ్చేలా ఈ మూవీని నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మూవీ నిర్మాత సంతోష్ కుమార్ మీడియాతో మాట్లాడారు.సంతోష్ కుమార్ మాట్లాడుతూ..'మాదకద్రవ్యాలు, మద్యపానంతో నలుగురు యువకులు తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకున్నారు అనే కథే రాజధాని రౌడీ చిత్రం. వినోదానికి, సందేశాన్ని జోడించి రూపొందించిన చిత్రమిది. చెడు పరిణామాలను ఎత్తి చూపుతూ, ఆలోచన రేకెత్తించే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్‌గా అద్భుతమైన నటన ప్రదర్శించారు. ముమైత్ ఖాన్ తన అందాలతో కనువిందుచేస్తారు. అర్జున్ జన్య అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇలాంటి మంచి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. తెలుగు ప్రేక్షకులందరు ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. -
టాలీవుడ్ హారర్ కామెడీ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే?
వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఓ మంచి ఘోస్ట్'. హారర్, కామెడీ జానర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్క్‌సెట్ నెట్వర్క్స్ బ్యానర్‌పై శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో రూపొందించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, లిరికల్ సాంగ్, టీజర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా జూన్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. -
డేట్ ఫిక్స్
చాందినీ చౌదరి, వశిష్ఠ సింహా, భరత్ రాజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘యేవమ్’. ఈ చిత్రంలో ఎస్ఐ సౌమ్య పాత్రలో కనిపిస్తారు చాందినీ చౌదరి. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రకాశ్ దంతులూరి మాట్లాడుతూ– ‘‘మహిళా సాధికారతను చాటి చెప్పేలా ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని పేర్కొన్నారు. -
కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న నమో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్!
విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి, విస్మయ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం నమో. శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ప్రశాంత్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.విశ్వంత్- అనురూప్ కాంబోలో వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ పోస్టర్, టీజర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జూన్ 7న సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా రాహుల్ శ్రీవాత్సవ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా క్రాంతి ఆచార్య వడ్లూరి.. ఎడిటర్‌గా సనల్ అనిరుధన్ పని చేశారు. -
ఆ టైమ్ కి కల్కి రిలీజ్ అవుతుందా..?
-
విశ్వక్ సేన్ యాక్షన్ ఎంటర్టైనర్.. బ్యాడ్ సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఈ చిత్రంలో డీజే టిల్లు భామ నేహాశెట్టి, అంజలి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.'అడవికి గొడ్డలి బ్యాడ్.. కడుపుకి అంబలి బ్యాడ్.. మట్టికి నాగలి బ్యాడ్' అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా రిలీజైన ఈ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ చిత్రం రిలీజ్ తేదీ మరోసారి మారింది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మే 31 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. మొదట ఈనెల 17న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ప్రభాస్ 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ ఇదేనా? కానీ అదే టెన్షన్
డార్లింగ్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి'. లెక్క ప్రకారమైతే మే 9న థియేటర్లలో రిలీజ్ కావాలి. వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థకు అచ్చొచ్చిన తేదీ ఇది. కానీ ఓ వైపు గ్రాఫిక్స్ పనులు ఆలస్యం, మరోవైపు ఏపీలో ఎన్నికల హడావుడి వల్ల తప్పని పరిస్థితిల్లో వాయిదా వేశారు. దీంతో కొత్త రిలీజ్ డేట్ ఏమై ఉంటుందా అని అభిమానుల మధ్య డిస్కషన్. సరిగ్గా ఇలాంటి టైంలో కొత్త రిలీజ్ డేట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ 'కల్కి' రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేశారు? సంగతేంటి?'బాహుబలి' తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ రిలీజ్ విషయంలో వాయిదాలు పడుతూనే ఉన్నాయి. 'కల్కి' కూడా ఇందులో మినహాయింపు కాదు.మే 9న పక్కాగా వస్తామని నిర్మాతలు ఫిక్సయ్యారు. కానీ పలు కారణాల వల్ల మార్చుకోక తప్పలేదు. జూన్, జూలై అని రెండు ఆప్షన్స్ అనుకున్నారు. ఫైనల్‌గా జూన్ 27న రావాలని అందరూ ఫిక్సయ్యారట. శనివారం సాయంత్రం కొత్త పోస్టర్ రిలీజ్ చేసి మరీ ఈ విషయం చెప్పబోతున్నారట. మరోవైపు ప్రముఖ టికెట్ బుకింగ్ సంస్థ బుక్ మై షో కూడా జూన్ 27నే రిలీజ్ అవుతుందన్నట్లు చూపించేస్తుంది.జూన్ 27న 'కల్కి' రిలీజ్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ప్లస్సులతో పాటు మైనస్సులు కూడా ఉన్నాయి. ప్లస్సుల విషయానికొస్తే.. సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సరైన మూవీ పడటం లేదు. 'కల్కి'పై మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి హిట్ టాక్ తెచ్చుకుంటే వసూళ్లు మోత గ్యారంటీ. పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ ఇమేజ్ కూడా 'కల్కి'కి ప్లస్ అవుతుంది. మైనస్సుల విషయానికొస్తే.. జూన్ చివర్లో పండగలు, సెలవులు అంటూ ప్రత్యేకంగా లేవు. స్కూల్, కాలేజీలు అప్పటికే తెరిచేస్తారు. దీని వల్ల కలెక్షన్లపై కొంతమేర ఎఫెక్ట్ ఉండొచ్చు. కమల్ 'ఇండియన్ 2' కూడా ఇదే నెలలో రిలీజ్ ఉండొచ్చు. ఇదే జరిగితే సౌత్‌లో 'కల్కి' వసూళ్లు కాస్త తగ్గే ఛాన్సులు ఉంటాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో? -
రాబిన్‌హుడ్ డేట్ ఫిక్స్
నితిన్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’ విడుదల తేదీ ఖరారు అయింది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు ΄ోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘అన్ని వాణిజ్య అంశాలతో పాటు వినోదంతో రూపొందుతోన్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో కనిపిస్తారు. తన గెటప్ నుండి క్యారెక్టరైజేషన్ వరకు పూర్తిగా డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు వెంకీ కుడుముల. క్రిస్మస్ సెలవులు, ఆ తర్వాత న్యూ ఇయర్ సెలవులు మా సినిమాకి కలిసి రానున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: సాయి శ్రీరామ్. -
సేనాపతి రాక అప్పుడే...!
జూన్‌లో థియేటర్స్‌కు రానున్నాడు భారతీయుడు. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’). ఈ సినిమాలో సేనాపతి పాత్రలో కనిపిస్తారు కమల్‌హాసన్. 1996లో విడుదలైన ఈ సినిమాకు పాతికేళ్ల తర్వాత ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ సీక్వెల్స్‌ను రూపొందించారు హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్. ఈ రెండు చిత్రాల చిత్రీకరణ పూర్తయింది. ‘ఇండియన్ 2’ సినిమాను జూన్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ శనివారం అధికారికంగా ప్రకటించారు. ‘‘సేనాపతి మళ్లీ వస్తున్నాడు. జూన్‌లో ‘ఇండియన్ 2’ సినిమా థియేటర్స్‌లో విడుదల కాబోతోంది’’ అని ‘ఎక్స్’లో ఈ సినిమా కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు కమల్‌హాసన్. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా, సిద్ధార్థ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సుభాస్కరన్, ఉధయనిధి స్టాలిన్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 14న విడుదలయ్యే అవకాశం ఉందని కోలీవుడ్ సమాచారం. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరకర్త. -
మార్చి 2న 'వ్యూహం'...RGV ఇంట్రెస్టింగ్ ప్రకటన
-
మార్చి 2న 'వ్యూహం' రిలీజ్.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్
స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' విడుదలకు సిద్ధమైంది. మార్చి 2న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తొలుత ఫిబ్రవరి 25న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ సాంకేతిక సమస్యల కారణంగా మార్చి 1వ తేదీకి వాయిదా పడింది. ఇప్పుడు ఓ రోజు ఆలస్యంగా అంటే మార్చి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోను.. హీరోయిన్ ఆండ్రియా షాకింగ్ కామెంట్స్) తాజాగా 'వ్యూహం' సినిమా విడుదలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. 'పట్టు వదలని విక్రమార్కుడిని' అని క్యాప్షన్‌తో పాటు సెన్సార్ సర్టిఫికెట్‌ని చేతిలో పట్టుకున్న ఫొటోని పోస్ట్ చేశారు. వాస్తవానికి రెండు నెలల క్రితమే 'వ్యూహం' రిలీజైపోవాలి. కానీ విడుదల నిలిపేయాని నారా లోకేష్.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు అడ్డంకులన్నీ క్లియర్ అయిపోవడంతో 'వ్యూహం' సినిమా థియేటర్లలోకి రానుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. దీనికి 'శపథం' అని సీక్వెల్ కూడా త్వరలో రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) పట్టు వదలని విక్రమార్కున్ని .. VYOOHAM in theatres MARCH 2nd 💪 pic.twitter.com/DoGK95a4PB — Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024 -
ప్రభాస్ 'కల్కి' వాయిదా? ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసిన నిర్మాణ సంస్థ
ప్రభాస్ 'కల్కి' సినిమా వాయిదా.. గత కొన్నిరోజుల నుంచి అభిమానులు, సినీ ప్రేమికుల మధ్య ఇదే డిస్కషన్. చెప్పిన తేదీకి వచ్చే సమస్య లేదని కొందరు... కచ్చితంగా వస్తుందని మరికొందరు చెప్పుకొచ్చారు. దీంతో సగటు ప్రేక్షకుడు పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. సరిగ్గా ఇలాంటి టైంలో విడుదల తేదీ పుకార్లపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఎట్టకేలకు ఓ క్లారిటీ ఇచ్చేసింది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అలా చాలా ఏళ్ల క్రితమే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ మూవీ కమిట్ అయ్యాడు. కాకపోతే మిగతా చిత్రాల వల్ల ఇది లేట్ అవుతూ వచ్చింది. ఏడాదిన్నర క్రితం నుంచి మాత్రం గ్యాప్ ఇస్తూనే షూటింగ్ చేస్తూ వచ్చారు. కొన్నాళ్ల క్రితం టీజర్ లాంటి వీడియో ఒకటి రిలీజ్ చేసి హైప్ పెంచారు. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) ఈ మధ్య కాలంలో అయితే 'కల్కి' చిత్రంలో నాని, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ.. ఇలా చాలామంది స్టార్ హీరోలు నటిస్తున్నారని, ఏకంగా 9 భాగాల ఫ్రాంచైజీగా దీన్ని తీయబోతున్నారని ఇలా ఇలా అంచనాలు పెంచే మాటలు చాలా వినిపించాయి. అదే టైంలో చాలారోజుల క్రితమే ప్రకటించినట్లు మే 9న ఈ సినిమా థియేటర్లలోకి రాకపోవచ్చనే టాక్ వినిపించింది. అయితే ఇదంతా చూస్తూ వచ్చిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసింది. విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని చెబుతూ.. ప్రభాస్ కాలు చూపిస్తున్న ఓ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో రూమర్స్‌కి చెక్ పడినట్లయింది. ఈ వేసవిలో వస్తున్న ఏకైక స్టార్ హీరో సినిమా ప్రభాస్ 'కల్కి'నే కావడం విశేషం. (ఇదీ చదవండి: ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్) View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) -
ప్రేమకు అర్థం చెప్పేలా...
గ్రామీణ ప్రేమకథతో రూపొందిన చిత్రం ‘రాధా మాధవం’. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి జంటగా నటించిన ఈ సినిమాకు దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. గోనాల్ వెంకటేశ్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ప్రేమకు అర్థం చెప్పేలా మా ‘రాధా మాధవం’ సినిమా ఉంటుంది. ఈ చిత్రం సందేశాత్మకంగా కూడా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
తెలివిగా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'దేవర'
అనుకున్నదే జరిగింది. గత కొన్నిరోజుల నుంచి 'దేవర' వాయిదా పడిందనే మాట నిజమైంది. ముందు చెప్పినట్లు ఏప్రిల్ 5న రావట్లేదని, దసరాకు వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. అక్టోబరు 10న థియేటర్లలోకి ఈ సినిమాని తీసుకురాబోతున్నట్లు కొత్త పోస్టర్ రిలీజ్ చేసి మరీ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే మూవీ టీమ్ ప్లానింగ్ క్రేజీగా అనిపించింది. (ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్) 'ఆర్ఆర్ఆర్' లాంటి హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 5నే విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ విలన్‌గా చేస్తున్న సైఫ్ అలీఖాన్‌కి గాయం, పాటలు-గ్రాఫిక్ వర్క్ పెండింగ్ వల్ల తప్పక వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఆగస్టు 11న 'పుష్ప 2'కి పోటీగా దీన్ని బరిలో దింపుతారని ఊహాగానాలు వచ్చాయి. కానీ అది నిజం కాదని ఇప్పుడు తేలిపోయింది. అయితే దసరా కానుకగా అక్టోబరు 10న థియేటర్లలోకి వస్తున్న 'దేవర'కు బోలెడన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సమ్మర్లో ప్రభాస్ 'కల్కి'.. ఆగస్టులో బన్నీ 'పుష్ప 2'.. సెప్టెంబరులో పవన్ కల్యాణ్ 'ఓజీ' రిలీజ్ అవుతాయి. అక్టోబరులో 'దేవర' వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఆర్ సినిమాకు సోలో రిలీజ్ కన్ఫర్మ్. చిరంజీవి, బాలయ్య చేస్తున్న సినిమాలు సంక్రాంతికే రిలీజ్ పెట్టుకున్నాయి. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి. సో ఇదంతా చూస్తుంటే 'దేవర' రిలీజ్ విషయంలో టీమ్ చాలా తెలివిగా ప్లాన్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. (ఇదీ చదవండి: ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ రివ్యూ) #Devara Part 1 releasing on 10.10.24. pic.twitter.com/AK4EvxQBz7 — Jr NTR (@tarak9999) February 16, 2024 -
ఫ్యామిలీ స్టార్ వచ్చేస్తున్నాడు.. మరీ దేవర సంగతేంటి?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. ఈ చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. తాజాగా మూవీ రిలీజ్ తేదీని ప్రకటించారు. ఇటీవలే జరిగిన మీట్లో దిల్ రాజు చెప్పినట్లే ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దేవర వాయిదా పడినట్టేనా? అయితే గతంలో అదే రోజున జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర కూడా రిలీజ్ ఉందని ఇప్పటికే ప్రకటించారు. కొరటాల శివ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ వేసవి కానుకగా థియేటర్లో సందడి చేయనుందని ఫ్యాన్స్ భావించారు. అయితే ఈ మూవీ మరింత ఆలస్యమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇటీవల షూటింగ్లో భాగంగా సైఫ్ అలీఖాన్‌కు గాయాలవడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. అందువల్లే దేవరను వాయిదా వేయనున్నట్లు సమాచారం. ఒకవేళ దేవర పోస్ట్ పోన్ అయితే అదే రోజున ఫ్యామిలీ స్టార్ వస్తుందని దిల్ రాజు ఇటీవలే ప్రకటించారు. తాజా ప్రకటనతో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర దాదాపు వాయిదా పడినట్లే. కాగా.. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. Arriving April 05 2024. #FamilyStar pic.twitter.com/pX4UOD7pL6 — Vijay Deverakonda (@TheDeverakonda) February 2, 2024 -
గోపీచంద్ 'భీమా'.. రిలీజ్ ఎప్పుడంటే?
రామబాణం తర్వాత మాచో స్టార్ గోపీచంద్ చేస్తున్న చిత్రం ‘భీమా’. కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో గోపీచంద్ కనిపించనున్నారు. అతనికి జంటగా ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ నటిస్తున్నారు. కుటుంబ భావోద్వేగాలతో పాటు యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘భీమా’ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ వచ్చేసింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు గోపీచంద్ ట్వీట్ చేశారు. దీంతో గోపీచంద్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. గతేడాది నటించిన రామబాణం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గోపిచంద్‌కు కలిసొచ్చే పోలీస్ పాత్ర గోపీచంద్ 2010లో పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'గోలీమార్' సినిమాలో ఆయన పోలీస్‌గా మెప్పించాడు. అప్పుడా సినిమా సూపర్ హిట్ కొట్టింది. అందులో 'గంగారామ్' రోల్లో మెప్పించాడు. శౌర్యం, ఆంధ్రుడులో కూడా పోలీసుగానే హిట్స్ కొట్టాడు. ఈ కారణంతో 'భీమా'పై అంచనాలు పెరుగుతున్నాయి. కాగా.. కేజీయఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు. హరహర మహాదేవ శంభో శంకర..! See you all in Cinemas with #BHIMAA this Mahashivratri🔱 pic.twitter.com/aeu1jYQIB2 — Gopichand (@YoursGopichand) January 29, 2024 -
వేసవిలో డీజే టిల్లు వస్తున్నాడు
వేసవికి థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) మంచి హిట్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ ‘డీజే టిల్లు స్క్వేర్’తో బిజీగా ఉన్నారు సిద్ధు జొన్నలగడ్డ. సీక్వెల్లో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. మల్లిక్ రామ్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ను మార్చి 29కి వాయిదా వేస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించారు మేకర్స్. ‘‘కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి 9న అనుకున్న విడుదలను వాయిదా వేస్తున్నాం. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయాలని నిర్ణయించాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
‘ఫ్యామిలీ స్టార్’ ఎప్పుడొస్తున్నాడంటే..
‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిలీజ్ ఏప్రిల్ 5కు ఖరారైనట్లుగా తెలిసింది. హిట్ ఫిల్మ్ ‘గీతగోవిందం’ (2018) తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఫిబ్రవరి 20 కల్లా పూర్తి కానుందని తెలిసింది. ఫిబ్రవరిలో ఓ పాటను విడుదల చేసి, ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఆరంభించాలనుకుంటున్నారు. ఇక ఈ సినిమాను తొలుత సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కుదరకపోవడంతో మార్చిలో రిలీజ్‌కు ప్లాన్ చేశారు. ఫైనల్‌గా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిలీజ్ డేట్ ఏప్రిల్ 5కు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. అదే తేదీకి ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘దేవర’ విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ సినిమా విడుదల వాయిదా పడటంతో ఏప్రిల్ 5కి ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్‌ని ఫిక్స్ చేశారని సమాచారం. -
స్టార్ హీరోయిన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఓటీటీలో కాదట!
దసరా బ్యూటీ కీర్తి సురేశ్, జయం రవి ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'సైరెన్'. 108 అనేది ఉపశీర్షిక. యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ తేదీని కీర్తి సురేశ్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేసి క్రిమినల్‌గా మారిన ఓ వ్యక్తి కథనే సినిమాగా రూపొందిస్తున్నారు. 14 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి జైలు నుంచి బయటికొచ్చి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కథాంశంతో తెరకెక్కుతోంది. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్..! అయితే ఈ సినిమాపై మొదట డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కానుందని వార్తలొచ్చాయి. ఈ మూవీ రిలీజ్ తేదీపై గతంలో చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. దీంతో ఈ సినిమాను ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. తమిళ, తెలుగు భాషల్లో థియేటర్లోనే విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్లను జయం రవి, కీర్తి సురేష్ ట్విటర్లో పంచుకున్నారు. (ఇది చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీకి స్టార్ హీరోయిన్ యాక్షన్ థ్రిల్లర్..!) కాగా.. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. డీజే టిల్లు స్క్వేర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. మరోవైపు కీర్తి సురేశ్ రఘుతాత అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. . @actor_jayamravi coming out on parole this Feb16th ! 🚨#SirenFromFeb16 #Tamil & #Telugu A @gvprakash Musical @antonybhagyaraj @anupamahere @sujataa_HMM @iYogiBabu @IamChandini_12 @AntonyLRuben @brindagopal @dhilipaction @selvakumarskdop @SaktheeArtDir @shiyamjack… pic.twitter.com/Au67K5Vo3F — Keerthy Suresh (@KeerthyOfficial) January 22, 2024 -
'ఆ రోజే ఎమర్జన్సీ'.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
గతేడాది తేజస్, చంద్రముఖి-2 సినిమాలతో మెప్పించిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ప్రస్తుతం ఆమె ఎమర్జన్సీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కంగనా దర్శకత్వం వహించడమే కాకుండా.. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ కనిపించనున్నారు. 1975లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాలే కథాంశంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో ఎమర్జన్సీ సమయంలో జరిగిన సంఘటనలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. ఆమె ట్విటర్లో రాస్తూ.. 'ఇండియా చీకటి రోజుల వెనక స్టోరీని చూడండి. జూన్ 14న ఎమర్జెన్సీ రిలీజ్ అవుతుంది. చరిత్ర మరోసారి కళ్ల ముందుకురానుంది' ట్వీట్లో రాసుకొచ్చింది. కాగా.. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎమర్జెన్సీ జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. Unlock the story behind India’s darkest hour. Announcing #Emergency on 14th June,2024 Witness history come alive as the most feared & fiercest Prime Minister #IndiraGandhi thunders into cinemas 🔥#Emergency in cinemas on 14th June,2024@AnupamPKher #SatishKaushik… pic.twitter.com/hOBRnXt4uu — Kangana Ranaut (@KanganaTeam) January 23, 2024 -
'సద్ది.. పెట్టినోడికి లేదు బుద్ధి'.. రవితేజ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
వైవా హర్ష, దివ్య శ్రీపాద జంటగా నటించిన సుందరం మాస్టర్. ఈ చిత్రానికి కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజ నిర్మించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. న్యూ ఇయర్ సందర్భంగా వచ్చేనెల 16న థియేటర్లలో సందడి చేయనుందని రవితేజ్ ట్వీట్ చేశారు. రిలీజ్ తేదీని ప్రకటిస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. 'సుందరం మాస్టర్ అటెండెన్స్ కోసం రెడీగా ఉన్నారు.. ఫిబ్రవరి 16న థియేటర్లలో సిద్ధంగా ఉండండి' అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో వైవా హర్ష కామెడీ సినీ ప్రేక్షకులను నవ్వులు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల జీవన విధానం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సుందరం మాస్టర్‌గా హర్ష అభిమానులను అలరించనున్నారు. Our #SundaramMaster is ready to take your attendance! Stooodents get reddie two geev attendance et thiyatars frum Feb 16th!#SM @harshachemudu @SudheerKurru @kalyansanthosh8 @itswetha14 @NambuShalini @RTTeamWorks @GOALDENMEDIA pic.twitter.com/SHUxokoOQ7 — Ravi Teja (@RaviTeja_offl) January 1, 2024 -
సుహాస్ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' రిలీజ్ డేట్ ఫిక్స్
సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'. ఇందులో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి అనే పాత్రని సుహాస్ చేశాడు. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దుశ్యంత్ కటికినేని దర్శకుడు. ఇప్పుడీ సినిమా రిలీజ్ తేదీని ప్రకటించారు. (ఇదీ చదవండి: Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వహకులు షాకింగ్ డెసిషన్) కామెడీ డ్రామా కథతో తీస్తున్న'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమా.. ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో శివాని నాగరం హీరోయిన్ కాగా శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. శేఖర్ చంద్ర సంగీతమందించారు. కొన్నిరోజుల 'గుమ్మ' అనే సాంగ్ రిలీజ్ చేయగా, సంగీత ప్రియుల్ని అది ఆకట్టుకుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే) The Intense & hard-hitting tale of 'Malligadu' is all set to unveil itself on the Big Screens 🔥🥁#AmbajipetaMarriageBand GRAND RELEASE WORLDWIDE ON 2nd FEBRUARY, 2024 ❤️🔥#BunnyVas @ActorSuhas @Shivani_Nagaram @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @KalyanKodati… pic.twitter.com/opDxatjM4V — Geetha Arts (@GeethaArts) December 26, 2023 -
రెండు సినిమాలు బరిలో ఉన్నా సలార్ రిలీజ్.. ఎందుకంటే?
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం సలార్(పార్ట్ -1). ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంపై పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ తేదీ చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే చివరికి ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరో పది రోజుల్లోనే సినిమా రిలీజ్ కానుండగా.. ఇటీవలే ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విజయ్ సలార్ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రిలీజ్ తేది విషయంపై క్లారిటీ ఇచ్చారు. (ఇది చదవండి: బిగ్‌బాస్‌తోనే ఫేమ్.. వరుణ్ తేజ్ పెళ్లి వార్తతో షాకయ్యా!) సలార్ చిత్రం 2014లో వచ్చిన ఉగ్రమ్ చిత్రానికి రీమేక్ కాదని విజయ్ కిరంగదూర్ వెల్లడించారు. ఉగ్రమ్ మాదిరిగానే ఈ చిత్రం రీమేక్ అని చాలామంది భావించారని.. అలాంటిదేం కాదని కొట్టిపారేశారు. ప్రశాంత్ నీల్.. ఉగ్రమ్‌తో పాటు కేజీఎఫ్ తెరకెక్కించాడని.. ప్రతిసారి భిన్నంగా ఏం చేయాలో అతనికి తెలుసని అన్నారు. సలార్ రీమేక్ అనే వార్తలు కేవలం రూమర్స్ అని అన్నారు. అంతే కాకుండా సలార్ విడుదల తేదీ డిసెంబర్ 22 నిర్ణయించడంపై విజయ్ కిరంగదూర్ క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ ఉంటుందని అన్నారు. మాకు జాతకాలపై ఉన్న నమ్మకం ప్రకారమే ఆ తేదీని ఎంపిక చేశామని తెలిపారు. డంకీ, అక్వామన్ పోటీలో ఉన్నప్పటికీ.. దశాబ్దం కాలంగా తాము అనుసరిస్తున్న పద్ధతినే సలార్ విషయంలోనూ కొనసాగిస్తున్నట్లు విజయ్ కిరంగదూర్ వివరించారు. (ఇది చదవండి: పోస్టర్ కోసం క్రియేట్ చేసిన పదం.. కొత్త సినిమా టైటిల్‌గా!) సెన్సార్ పూర్తి కాగా.. ఇటీవలే సలార్ పూర్తి కాగా.. 2 గంటల 55 నిమిషాల 22 సెకన్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. అలానే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం. అంటే 18 ఏళ్ల నిండని వాళ్లు.. ఈ మూవీ చూడటం కుదరదని సెన్సార్ బోర్ట్ చెబుతోంది. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
తగ్గేదేలే అంటూ విశ్వక్ సేన్ పోస్ట్.. మూవీ రిలీజ్ వాయిదా!
యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రంలో నేహాశెట్టి హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. గతంలో విశ్వక్ సేన్ కూడా సినిమా రిలీజ్ తేదీ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ పోస్ట్ కూడా పెట్టారు. అది అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే విశ్వక్ సేన్ అనుకున్నదొకటి.. అయిందొక్కటి అన్న చందంగా మారింది. వచ్చే నెల 8న ఈ మూవీని రిలీజ్ చేయాలని భావించారు. కానీ ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చిన 8న విడుదల చేయనున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. దీంతో వచ్చే నెల మూవీ రిలీజవుతుందని భావించిన విశ్వక్ సేన్ అభిమానులకు నిరాశే ఎదురైంది. అదే కారణమా? అయితే డిసెంబర్ మొదటివారంలో నాని నటించిన హాయ్ నాన్న, నితిన్ మూవీ ఎక్స్ట్రా: ఆర్డినరీమ్యాన్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందువల్లే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాయిదా పడే అవకాశాలున్నాయని కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది. అదే సమయంలో విశ్వక్ సేన్ పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. స్పందించిన నిర్మాత నాగవంశీ విశ్వక్ సేన్ పోస్ట్‌పై నిర్మాత నాగవంశీ స్పందించారు. హీరో నాని, నితిన్‌తో మా బ్యానర్‌కు సత్సంబంధాలే ఉన్నాయని.. ఒకేసారి అన్ని విడుదలైతే పోటీ ఉంటుందని భావించి.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని వాయిదా వేద్దామని నేను అంటానేమోనని విశ్వక్ సేన్ భావించారు. అందువల్లే విశ్వక్ సేన్ అలాంటి పోస్ట్ పెట్టి ఉంటారని అన్నారు. A tale of absolute grit and determination and the rise of a man from rags to riches! 💥💥#GangsofGodavari will arrive in theatres on 8th March, 2024! 🔥🌊 @VishwakSenActor @thisisysr @iamnehashetty @yoursanjali #KrishnaChaitanya @vamsi84 #SaiSoujanya @Venkatupputuri… pic.twitter.com/q5qoqyVi30 — Sithara Entertainments (@SitharaEnts) November 27, 2023 -
RGV: ఆర్జీవీ వ్యూహం.. రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్డేట్!
టాలీవుడ్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం వ్యూహం. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దాసరి కిరణ్‌కుమార్ నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. వాయిదా పడిన సంగతి తెలిసిందే. వ్యూహం సినిమా రిలీజ్‌ను ఆపేయాలని టీడీపీ నాయకుడు లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్‌ను మేకర్స్ వాయిదా వేశారు. రివైజింగ్ కమిటీ సినిమా చూసిన తరవాత కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని ఆర్జీవీ గతంలోనే చెప్పారు. తాజాగా ఆర్జీవీ ఈ విషయంపై ట్వీట్ చేశారు. వ్యూహం సినిమా త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సినిమా పోస్టర్‌ను తన ట్విటర్లో పంచుకున్నారు. ఈ సినిమాపై గతంలోనే ఆర్జీవీ మాట్లాడుతూ.. ప్రముఖ నాయకుడు, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు మరణించినప్పుడు ఎవరికి వారు వ్యూహాలు పన్నారు. అందులో నాకు తెలిసినవే వ్యూహం సినిమా ద్వారా చెప్తున్నాను. నేను నమ్మిన దాన్ని సినిమా తీస్తున్నానని రామ్‌గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. గతంలో ‘ఉడ్తా పంజాబ్, పద్మావత్’ వంటి హిందీ సినిమాలకు కోర్టు ద్వారా రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నట్లే మేమూ తెచ్చుకుంటామని.. చట్టపరంగా ఉన్న పద్ధతుల ద్వారా వ్యూహం చిత్రాన్ని రిలీజ్ చేసుకుంటామని వెల్లడించారు. pic.twitter.com/WTUeAA7Fmk — Ram Gopal Varma (@RGVzoomin) November 19, 2023 -
నెల రోజుల్లోపే ఓటీటీకి సంపూర్ణేశ్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సంపూర్ణేష్ బాబు, వీకే నరేష్, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. పొలిటికల్ సెటైరికల్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఈ మూవీ నెల రోజులు కాకముందే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన మార్టిన్ లూథర్ కింగ్ త్వరలోనే ఓటీటీలో అలరించనుంది. నవంబర్ 17న లేదా 24న ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఓటీటీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా.. ఈ మూవీ సోనీ లివ్‌లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. కాగా.. తమిళంలో విజయవంతమైన మండేలా మూవీకి రీమేక్‌గా మార్టిన్ లూథర్ కింగ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో డైరెక్టర్ వెంకటేష్ మహా కీలక పాత్ర పోషించారు. అసలు కథేంటంటే.. 'మార్టిన్ లూథర్ కింగ్' ఒక స్థానిక చెప్పులు కుట్టే వ్యక్తి యొక్క కథ. అతను నివసించే గ్రామంలో ఎన్నికలు వస్తాయి. ఇద్దరు ప్రత్యర్థులు ఎలాగైనా గెలవాలని పోటీ పడతారు. అయితే ఆ ఎన్నికలలో అతని ఓటు, గెలుపుని నిర్ణయించే ఓటు కావడంతో ఒక్క రాత్రిలో అతని జీవితం మలుపు తిరుగుతుంది. -
ప్రజల్లో మార్పు కోసం వస్తోన్న 'జనం'!
సుమన్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం జనం. వెంకటరమణ పసుపులేటి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నవంబర్ 10న ప్రపంచం వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కథ విషయానికొస్తే ప్రతీ తల్లి తన బిడ్డను గొప్ప లక్షణాలతో, ఉన్నత విలువలతో పెంచాలనుకుంటుంది. కానీ ఎలక్షన్స్‌లో ఓటు విషయానికి వచ్చేసరికి కులం, మతం, ప్రాంతం, డబ్బు లాంటి ప్రలోభాలకు లోబడి తప్పు దారిలో వెళ్లేలా చేస్తుంది. ప్రజలకు ఎంతో మంచి చెయ్యాలనే రాజకీయాల్లోకి వచ్చే ప్రతీ నాయకుడు.. ప్రజల ఓట్ల కోసం, ఎలక్షన్స్‌లో గెలవడం కోసం ఎలా తప్పు దారి పడుతున్నాడన్న దానిపైనే ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో కిషోర్, వెంకట రమణ, ప్రగ్య నయన్, మౌనిక, లక్కీ, జయవాని, రషీదా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. -
విక్రమ్ డబుల్ సర్ప్రైజ్.. తంగలాన్ క్రేజీ అప్డేట్!
పొన్నియిన్ సెల్వన్ వంటి సూపర్ హిట్ తరువాత విక్రమ్ నటించిన చిత్రం తంగలాన్. పార్వతి, మాళవిక మోహన్, పశుపతి ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కర్ణాటక రాష్ట్రంలోని బంగారు గనుల నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు దర్శకుడు పా.రంజిత్ ఇది వరకే తెలిపారు. ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్లను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని విక్రమ్ గెటప్ చాలా డిఫరెంట్‌గా ఉండి తంగలాన్ చిత్రంపై అంచనాలను పెంచేస్తోంది. తాజాగా తంగలాన్ చిత్రానికి సంబంధించి మేకర్స్ బిగ్ అప్డేట్స్ ఇచ్చేశారు. ఓకేసారి టీజర్, మూవీ రిలీజ్ తేదీలను ప్రకటించారు. నవంబర్ ఒకటో తేదీన తంగలాన్ టీజర్ విడుదల చేస్తామని ట్విటర్ ద్వారా తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. పొన్నియిన్ సెల్వన్ తర్వాత ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. A fiery story of a bygone era that’s waiting to be told & cherished #Thangalaan teaser dropping on 1st November &#Thangalaan arriving at cinemas worldwide on 26th January, 2024@Thangalaan @beemji @kegvraja @StudioGreen2 @officialneelam @parvatweets @MalavikaM_… pic.twitter.com/pDfT6HiNs4 — Vikram (@chiyaan) October 27, 2023 A film that will touch your heart & blow away your mind!#Thangalaan coming to you on 26th January 2024🔥🔥🔥 Teaser out on Nov 1st! 💃🏻🔥💃🏻 pic.twitter.com/wEf3MaabqF — Malavika Mohanan (@MalavikaM_) October 27, 2023 -
డిజె టిల్లు 2 విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వని సిద్దు...
-
విజయ్ సేతుపతి- కత్రినా కైఫ్ మూవీ.. రిలీజ్ డేట్‌పై అప్డేట్!
ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ అంటూ భాషా భేదం లేకుండా ఎడాపెడా నటిస్తోన్న నటుడు విజయ్‌సేతుపతి. అదే విధంగా కథానాయకుడు, ప్రతినాయకుడు అని కూడా ఆలోచించకుండా.. పాత్ర నచ్చితే ఓకే చెప్పేస్తున్నారు. అలా ఏక కాలంలో హీరోగా, విలన్‌గా నటిస్తున్న అరుదైన నటుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయనొక్కరే అని చెప్పక తప్పదు. తాజాగా హీరోగా నటించిన తమిళ చిత్రం మహారాజా. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం విజయ్‌సేతుపతికి 50వ చిత్రం కావడం గమనార్హం. కాగా విజయ్ సేతుపతి ఇప్పటికే ఫర్జ్ అనే హిందీ వెబ్ సిరీస్ ద్వారా ఫేమస్ అయ్యారు. తాజాగా జవాన్ చిత్రంలో షారూఖ్‌ఖాన్‌కు విలన్‌గా నటించి బాలీవుడ్లో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్న మేరీ క్రిస్మస్ చిత్రంలో విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయనకు జంటగా బాలీవుడ్ క్రేజీ భామ కత్రినా కై ఫ్ నటించడం విశేషం. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కిస్తున్నారు. టిప్స్ ఫిలింస్, మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న మేరీ క్రిస్మస్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ముందుగానే ప్రకటించారు. అయితే తాజాగా ఒక వారం ముందే అంటే డిసెంబర్ 8న విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. కాగా ఈ చిత్రాన్ని హిందీ, తమిళం భాషల్లో వేర్వేరుగా రూపొందించినట్లు వారు తెలిపారు. దీంతో మేరీ క్రిస్మస్ చిత్రంపై కోలీవుడ్‌లోనూ ఆసక్తి నెలకొంది. Christmas comes even earlier this year!! Be ready to feel the chills and thrills of #SriramRaghavan's #MerryChristmas, now on 8th December, in cinema halls near you.@TipsFilmsInd #MatchboxPictures @RameshTaurani #SanjayRoutray #JayaTaurani #KewalGarg #KatrinaKaif #SanjayKapoor… pic.twitter.com/PHp65E9KPx — VijaySethupathi (@VijaySethuOffl) October 3, 2023 -
సలార్ VS డంకీ: రెఢీ
రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకేరోజు థియేటర్లకు వస్తే.. ఏ సినిమా చూడాలి? అనేది ప్రేక్షకుల ముందుండే ప్రశ్న. ఏ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలి? అనేది ఎగ్జిబిటర్ల ముందుండే ప్రశ్న? ఏ సినిమాని ఏ ఏరియాకి ఎంత ఇచ్చి కొనాలి? అనేది డిస్ట్రిబ్యూటర్ల ముందుండే ప్రశ్న.. అసలు రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రావడం కరెక్టేనా? బిజినెస్ ఎఫెక్ట్ అవుతుందేమో.. ఇది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు,ప్రొడ్యూసర్లు.. ఇలా అందరి ముందుండే ప్రశ్న. శుక్రవారం వచ్చిన ‘సలార్’ విడుదల తేదీ (డిసెంబర్ 22) ప్రకటన ఈ ప్రశ్నలకు కారణమైంది. అదే రోజు షారుక్ ఖాన్ ‘డంకీ’ కూడా రిలీజ్ కానుంది. బాక్సాఫీస్‌ను ఢీ కొట్టడానికి రెడీ అవుతున్న ‘సలార్’, ‘డంకీ’... చిత్రాల్లో ఏది వసూళ్లను కొల్లగొడుతుంది? ఈ రెండింటి కారణంగా వేరే చిత్రాలు వాయిదా పడతాయా? ఓ లుక్కేద్దాం. ఇండియన్ సినిమా బడా సూపర్ స్టార్స్ ప్రభాస్, షారుక్ ఖాన్ బాక్సాఫీస్ ఫైట్‌కి రెఢీ అయ్యారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’లోని తొలి భాగం ‘సలార్: సీజ్ ఫైర్’ను డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లుగా ఈ చిత్ర యూనిట్ శుక్రవారం ప్రకటించింది. నిజానికి 2022 ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకుని, ఆ తర్వాత 2023 సెప్టెంబరు 28కి వాయిదా వేశారు. తాజాగా డిసెంబర్ 22 అంటున్నారు. ఇంకోవైపు మరో పాన్ ఇండియన్ స్టార్ షారుక్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘డంకీ’. హిందీలో ‘మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్’, ‘3 ఇడియట్స్, ‘పీకే’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్స్ తీసిన అగ్రశ్రేణి దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి ఈ సినిమాకు దర్శకుడు. షారుక్, రాజ్‌కుమార్.. ఈ ఇద్దరికీ విడివిడిగా రికార్డులు ఉండటంతో తొలిసారి ఇద్దరూ కలిసి చేస్తున్న ‘డంకీ’ చిత్రం పై మంచి అంచనాలున్నాయి. గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణి, జ్యోతిదేశ్ పాండే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా 2022 ఏప్రిల్ 19న ‘డంకీ’ సినిమాను ప్రకటించిన రోజే విడుదల తేదీని (22 డిసెంబరు 2023) కూడా ప్రకటించారు. ఇప్పుడు ప్రభాస్ అండ్ టీమ్ ఇదే రోజున ‘సలార్’ విడుదలను నిర్ణయించడం ఇటు తెలుగు అటు హిందీతో పాటు పాన్ ఇండియా సినిమాలు కాబట్టి.. ఇతర భాషల ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశమైంది. ఎవరి రికార్డులు వారివి... ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో (2019)’, ‘రాధేశ్యామ్ (2022)’, ‘ఆదిపురుష్ (2023)’ చిత్రాలకు ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ప్రభాస్‌కు ‘సలార్’ హిట్ కీలకంగా మారింది. ఇటు ‘జీరో (2018)’ రిజల్ట్‌తో షారుక్ ఖాన్ డీలా పడ్డప్పటికీ ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు ‘పఠాన్’, ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ‘జవాన్’ చిత్రం కలెక్షన్స్‌లో హిందీ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిందని యూనిట్ పేర్కొంది. ఇవి షారుక్ ఖాన్ సూపర్‌ఫామ్‌ను స్పష్టం చేస్తున్నాయి. అలా అని ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమాలనూ తక్కువ చేయలేం. ఎందుకంటే ప్రభాస్ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ మొత్తం వసూళ్లను షారుక్ ఏ సినిమా కూడా ఇంకా అధిగమించలేదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే షారుక్ కెరీర్లో ఓ డిజాస్టర్‌గా నిలిచిన ‘జీరో’ రిలీజైన రోజున.. అంటే డిసెంబరు 21నే ‘కేజీఎఫ్: ఛాప్టర్ 1’ (యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూ΄÷ందింది) విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, కొత్త రికార్డులను సృష్టించింది. ఇలా ప్రశాంత్ నీల్, షారుక్ ఖాన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద ఢీ కొనడానికి రెడీ కావడం ఆసక్తికరమైన విశేషం. ఎవరి రికార్డులు వారికి ఉన్న నేపథ్యంలో తాజా ΄ోటీలో రికార్డ్ ఎవరిదనేది ఆసక్తికరంగా మారింది. ఫుల్ కన్ఫ్యూజన్ నో కన్ఫ్యూజన్..‘సలార్: సీజ్ ఫైర్’ను డిసెంబరు 22న విడుదల చేస్తున్నాం అంటూ ‘సలార్’ టీమ్ ప్రకటించింది. అయితే ‘సలార్’కు కన్ఫ్యూజన్ అక్కర్లేక΄ోవచ్చు కానీ 2023 క్రిస్మస్కు ఆల్రెడీ రిలీజ్‌ను కన్ఫార్మ్ చేసుకున్న తెలుగు చిత్రాల విడుదల విషయం ఇప్పుడు ఫుల్ కన్ఫ్యూజన్. డిసెంబరు 21న నాని ‘హాయ్ నాన్న’, 22న వెంకటేశ్ ‘సైంధవ్’, సుధీర్‌బాబు ‘హరోం హర’, 23న నితిన్ ‘ఎక్స్ట్రా’ చిత్రాలు విడుదలకు షెడ్యూల్ అయ్యాయి. ఇప్పుడు ‘సలార్’ ఎఫెక్ట్‌తో ఈ సినిమాల విడుదల వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పుడు వాయిదా వేసి, సంక్రాంతికి వద్దామనుకుంటే ఆల్రెడీ పండగ బరిలో నాగార్జున ‘నా సామిరంగ’, మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, రవితేజ ‘ఈగల్’, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్ (ప్రచారంలో ఉన్న టైటిల్), తేజా సజ్జా ‘హనుమాన్’ చిత్రాలతో పాటు అనువాద చిత్రాలు శివ కార్తికేయన్ ‘అయలాన్’, సుందర్. సి ‘అరణ్మణై 4’ ఉన్నాయి. అయితే ఒకేసారి ఇన్ని సినిమాలంటే థియేటర్ల సంఖ్య ప్రశ్నార్థకమవుతుంది... దాంతో పాటు వసూళ్లు కూడా షేర్ అయి΄ోతాయి కాబట్టి వీటిలో ఏదైనా వాయిదా పడే అవకాశమూ లేక΄ోలేదు. ఇక ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం ‘కల్కి 2098 ఏడి’ కూడా సంక్రాంతి బరిలో ఉంది. ఈ సినిమా వాయిదా పడే చాన్స్ ఉందని తెలుస్తోంది. ‘సలార్’, ‘డంకీ’... ప్రకటించిన ప్రకారం డిసెంబర్ 22నే వస్తాయా? ఇవి వస్తే ఏ చిత్రాలు వెనక్కి వెళతాయి? సంక్రాంతి బరిలో నిలిచే చిత్రాలేంటి? అనేది తెలియాలంటే కొంత సమయం వేచి ఉండక తప్పదు. ఆ తేదీకే ఎందుకు? ఓ సినిమా బాక్సాఫీస్ సరికొత్త రికార్డులను సృష్టించాలంటే సరైన రిలీజ్ డేట్ కూడా ముఖ్యం. ఇప్పుడు ‘సలార్’, ‘డంకీ’ చిత్రాలు డిసెంబరు 22ను ఎంచుకోవడం సరైనదే. ఎందుకంటే ఆ రోజు నుంచి వారాంతం ఆరంభమవుతుంది. సరిగ్గా క్రిస్మస్ సెలవులు కూడా మొదలవుతాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం ఖాయం. ఒకవేళ ఈ చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకుంటే.. న్యూ ఇయర్, ఆ తర్వాత సంక్రాంతి వరకూ ప్రదర్శనకు స్కోప్ ఉంటుంది. సంక్రాంతి సెలవుల టార్గెట్‌గా కొత్త చిత్రాలు వస్తాయి. అప్పుడు ‘సలార్’, ‘డంకీ’కి థియేటర్లు తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ పండగ టైమ్‌లో వచ్చే చిత్రాలకన్నా ఈ రెండూ బంపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే అప్పుడు సంక్రాంతి సెలవులను కూడా క్యాష్ చేసుకుంటాయి. ఈ చిత్రాల టాక్ ముందే తెలిసి΄ోతుంది కాబట్టి.. సంక్రాంతికి వచ్చే చిత్రాల్లో ఏదైనా వాయిదా పడే అవకాశం కూడా లేక΄ోలేదు. -
శుక్రవారం రిలీజ్ కానున్న మంగళవారం!
ఆర్ఎక్స్ 100, మహా సముద్రం చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తాజాగా తెరకెక్కిస్తోన్న మంగళవారం. ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో పోషిస్తుండగా.. శ్రీతేజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. ఆర్ఎక్స్ 100తో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి.. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్లో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'మంగళవారం' నవంబర్ 17న విడుదల కానుంది. (ఇది చదవండి: కాంతార ప్రీక్వెల్.. ఇప్పుడంతా దానిపైనే తెగ చర్చ!) గ్రామీణ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెంచాయి. కాగా.. ఈ సినిమాలో చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కన్నడ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. (ఇది చదవండి: టాలీవుడ్లో సూపర్ హిట్ జోడీ.. ఎంత చిలిపిగా ఉన్నారో చూడండి!!) గతంలో దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'మంగళవారం' చిత్రాన్ని డిఫరెంచ్గా తెరకెక్కిస్తున్నట్లు అభివర్ణించారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించని కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేస్తున్నామని.. ఇందులో మొత్తం 30 పాత్రలున్నాయని తెలిపారు. ఆర్ఎక్స్ 100 తరహాలోనే అజయ్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఊహించని సర్ ప్రైజ్ ఇస్తాడని నమ్ముతున్నారు. ఈ సినిమాను నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. Excited to show y'all a story that'll twist your heart like never before🦋#Mangalavaaram #Mangalavaar #Chevvaikizhamai #Chovvazhcha Releasing Worldwide in Telugu, Hindi, Tamil, Malayalam, Kannada on November 17th 🔥 An @AJANEESHB Musical 🥁@starlingpayal @Nanditasweta… pic.twitter.com/1G9OjAAn0w — Ajay Bhupathi (@DirAjayBhupathi) September 26, 2023 -
అండమాన్ దీవుల నేపథ్యంలో సరికొత్త వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుత సినీ ప్రపంచంలో ఓటీటీలదే కీలకపాత్ర. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి. ఇక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ విషయంలో కాస్తా ముందే ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా మరో కొత్త ఇండియన్ సిరీస్‌లో మిమ్మల్ని అలరించేందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోన్న గన్స్ అండ్ గులాబ్స్, ఢిల్లీ క్రైమ్, సేక్రెడ్ గేమ్స్, లిటిల్ థింగ్స్ సిరీస్‌లు బాగా పాపులర్ అయ్యాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా మరో కొత్త సిరీస్‌ను ప్రకటించింది. కాలా పాని పేరుతో మరోసారి మిమ్మల్ని ఆకట్టుకునేందుకు వస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్పై క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో పాటు ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే అండమాన్ నికోబార్ దీవులలోని సెల్యులార్ జైలు చుట్టే కథ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో బాలీవుడ్ నటి మోనా సింగ్ , అశుతోష్ గోవారికర్, అమీ వాఘ్, సుకాంత్ గోయెల్, వికాస్ కుమార్, అరుషి శర్మ, రాధిక మెహ్రోత్రా, చిన్మయ్ మాండ్లేకర్, పూర్ణిమ ఇంద్రజిత్ ఈ సిరీస్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోషమ్ పా పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సిరీస్‌ను బిశ్వపతి సర్కార్, అమిత్ గోలాని, సందీప్ సాకేత్, నిమిషా మిశ్రా సంయుక్తంగా నిర్మించారు. ఈ సిరీస్‌కు సమీర్ సక్సేనా, అమిత్ గోలాని కలిసి దర్శకత్వం వహించారు. Can you hear the islands calling you? 🌊 Get ready to dive into the mysteries of #KaalaPaani, premieres 18th October only on Netflix.#KaalaPaaniOnNetflix pic.twitter.com/Y7lFnrkppT — Netflix India (@NetflixIndia) September 20, 2023 -
కాస్త ఆలస్యంగా రూల్స్ రంజన్
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. రత్నం కృష్ణ దర్శకత్వంలో ఏఎం. రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన చిత్రం ఇది. కాగా ఈ సినిమాను ఇటీవల ఈ నెల 28న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే అక్టోబరు 6న రిలీజ్ చేయనున్నట్లు మంగళవారం ప్రకటించారు మేకర్స్. మెహర్ చాహల్, ‘వెన్నెల’ కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది,‘వైవా’ హర్ష కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: అమ్రిష్ గణేష్ -
'పుష్ప 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. పెద్ద ప్లానింగే
'పుష్ప' సినిమాతో జాతీయ అవార్డు అందుకుని.. తన రేంజుని ఎక్కడికో తీసుకెళ్లిపోయిన అల్లు అర్జున్.. ఈ మూవీ సీక్వెల్ ప్రస్తుతం చేస్తున్నాడు. అవార్డు వచ్చిన ఆనందంలో మరింత ఎనర్జీతో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. అలానే ఓ సరికొత్త పోస్టర్ని పోస్ట్ చేశారు. 2021 డిసెంబరు 2న 'పుష్ప'.. థియేటర్లలో రిలీజైంది. తొలుత దీన్ని కేవలం తెలుగు వరకు మాత్రమే అనుకున్నారు. కానీ రాజమౌళి సలహాతో ఎలాంటి ప్రచారం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చింది. నార్త్‌లో మాత్రం బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) దీంతో 'పుష్ప 2' విషయంలో అల్లు అర్జున్-సుకుమార్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే వచ్చే ఏడాది ఆగస్టు 15న థియేటర్లలోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఇదే తేదీ కన్ఫర్మ్ చేయడానికి పెద్ద కారణముంది. ఎలానూ ఆగస్టు 15 గురువారం సెలవు. దీని తర్వాత శుక్ర-శని-ఆదివారం వీకెండ్. సోమవారం రక్షా బంధన్(రాఖీ).. ఇలా ఐదు రోజుల లాంగ్ వీకెండ్ ఉంది. కాబట్టి ఈ సినిమాకు అద్భుతమైన వసూళ్లు దక్కే ఛాన్స్ ఉంది. అయితే ఆగస్టు 15నే.. కమల్-శంకర్ 'భారతీయుడు 2' కూడా రిలీజ్ అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బన్నీ vs కమల్ పోటీలో ఉన్నట్లే! (ఇదీ చదవండి: పంచ్ ప్రసాద్‌కు ఆపరేషన్ పూర్తి.. అండగా ఏపీ ప్రభుత్వం) Mark the Date ❤️🔥❤️🔥 15th AUG 2024 - #Pushpa2TheRule Grand Release Worldwide 🔥🔥 PUSHPA RAJ IS COMING BACK TO CONQUER THE BOX OFFICE 💥💥 Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/LWbMbk3K5c — Mythri Movie Makers (@MythriOfficial) September 11, 2023 -
సిత్తరాల సిత్రావతి...
‘సిత్తరాల సిత్రావతి.. ఉన్నపాటుగా పోయే మతి’ అని పాడుకున్నారు వైష్ణవ్ తేజ్. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం నవంబరు 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలోని ‘సిత్తరాల సిత్రావతి.’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. జీవీ ప్రకాష్‌కుమార్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా రమ్య బెహ్రా, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. -
స్కంద రెడీ
వారాంతపు సెలవులను, గాంధీ జయంతి సెలవుని క్యాష్ చేసుకోవడానికి ‘స్కంద’ రెడీ అయ్యాడు. రామ్ హీరోగా శ్రీలీల హీరోయిన్గా బోయ΄ాటి శ్రీను దర్శకత్వంలో రూ΄÷ందిన చిత్రం ‘స్కంద’. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. రిలీజ్ డేట్‌ని బుధవారం అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ‘‘మా ‘స్కంద’ గురువారం విడుదల కానుంది. వారాంతపు సెలవులు, ఆ తర్వాత సోమవారం గాంధీ జయంతి సెలవు, ఆ తర్వాత వచ్చే దసరా సెలవులు ఇవన్నీ మా సినిమాకు కలిసి వస్తాయి. అందుకే 28 పర్ఫెక్ట్ రిలీజ్ అనుకుని ఆ డేట్‌ని లాక్ చేశాం. రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూ΄÷ందించిన చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన ΄ాటలు, టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ΄ాన్ ఇండియా స్థాయిలో సినిమాని రిలీజ్ చేయనున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సంతోష్ డిటాకే, సమర్పణ: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్. -
దీపావళికి తిరిగొస్తున్న టైగర్..
-
సలార్ రిలీజ్ ఆ నెలలోనే.. వైరలవుతున్న ట్వీట్!
యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మూవీ రిలీజ్ వాయిదా పడిందనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా చెప్పకపోయినా రిలీజ్ వాయిదా పడిందనే టాక్ వినిపిస్తోంది. సలార్‌పై తాజాగా మరో టాక్ ఊపందుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్‌లో రిలీజ్ చేయనున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది. దీనిపై ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే గనుక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం సలార్ చిత్రబృందం పోస్ట ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. కాగా..'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్.. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాయి. కలెక్షన్స్ అయితే వచ్చాయి కానీ .. డార్లింగ్ ఫ్యాన్స్‌ని సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో ప్రస్తుతం ఫ్యాన్స్ ఆశలన్నీ 'సలార్'పైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్ డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా మేకర్స్ స్పందించి రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇస్తారేమో చూద్దాం. కాగా..ఈ చిత్రంలో శృతి హాసన్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రీయా రెడ్డి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ సాలార్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. #BreakingNews… PRABHAS: ‘SALAAR’ TO ARRIVE IN NOV… #Salaar is NOT arriving on 28 Sept 2023, it’s OFFICIAL now… The post-production work of this #Prabhas starrer is going on in full swing… #HombaleFilms - the producers - are bringing the film in Nov 2023… New release date… pic.twitter.com/SbOLGSobz5 — taran adarsh (@taran_adarsh) September 2, 2023 -
పుష్ప 2 రిలీజయ్యేది ఆరోజేనా?
పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ మాంచి జోష్‌లో ఉన్నారు. ‘పుష్ప’ చిత్రంలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంబరాలు పూర్తి స్థాయిలో పూర్తి కాకుండానే ‘పుష్ప’ సినిమాకు సంబంధించిన ఓ వార్త తెరపైకి వచ్చింది. ‘పుష్ప’ చిత్రంలోని మలి భాగం ‘పుష్ప: ది రూల్’ చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల విషయంలో మేకర్స్ ఓ క్లారిటీకి వచ్చారని, వచ్చే ఏడాది మార్చి 22న ‘పుష్ప: ది రూల్’ను విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారని టాక్. విడుదల తేదీపై అతి త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్, శ్రీ వల్లి పాత్రలో రష్మికా మందన్నా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. -
ఆ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన మహేశ్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబుని స్క్రీన్‌పై చూసి ఏడాది దాటిపోయింది. 'సర్కారు వారి పాట' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' చేస్తున్నాడు. దీని షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయినప్పటికీ పడుతూ లేస్తూ వచ్చింది. ఒకానొక దశలో అయితే ఈ మూవీ ఉంటుందా లేదా అని కూడా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ పుకార్లపై స్వయంగా మహేశ్ స్పందించాడు. మహేశ్, హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే 'గుంటూరు కారం' గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిచ్చిన మహేశ్.. 'సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ హ్యాపీగా ఉంటారు' అని చెప్పుకొచ్చాడు. అయితే ఇంతకీ 'గుంటూరు కారం' రిలీజ్ విషయంలో సందేహాలు ఎందుకొచ్చాయో తెలుసా? (ఇదీ చదవండి: రజనీకాంత్ మరో రికార్డ్.. ఆ లిస్టులో ప్రభాస్‌తోపాటు) మహేశ్-త్రివిక్రమ్ సినిమాను దాదాపు రెండేళ్ల క్రితమే మొదలుపెట్టారు. పూజా హెగ్డే హీరోయిన్ అన్నారు. మహేశ్‌తో ఓ ఫైట్ సీన్ తీశారు. అంతా బాగానే ఉంది అనుకునే టైంలో చాలా మార్పులు జరిగాయి. సెకండ్ హీరోయిన్ అనుకున్న శ్రీలీల.. మెయిన్ లీడ్ అయింది. ఇప్పటివరకు జరిగిన పార్ట్ అంతా కాకుండా కొత్తగా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇవన్నీ కాదన్నట్లు ఇప్పటివరకు కేవలం లుక్స్‌తో పోస్టర్స్, చిన్న గ్లింప్స్ వీడియో తప్ప లిరికల్ సాంగ్స్ ఏం రాలేదు. అలానే సినిమాటోగ్రాఫర్ తప్పుకోవడం లాంటివి జరిగేసరికి సంక్రాంతి రిలీజ్ కష్టమే అని అభిమానులు కూడా అనుకున్నారు. కానీ మహేశ్ స్వయంగా జనవరి 12న పక్కా అని చెప్పడంతో అందరూ రిలాక్స్ అయిపోయారు. చూడాలి అనుకున్నట్లు ముగ్గుల పండక్కి తీసుకొస్తారో లేదో? (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీదేవి చివరి కోరిక నెరవేర్చిన భర్త) -
ఆ వార్తను పేపర్లో చదివే ఈ సినిమా తీశాను: డైరెక్టర్
సయ్యద్ సోహైల్, రూపాకొడవయూర్ జంటగా శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ వింజనంపాటి మాట్లాడుతూ– ‘‘నా వ్యక్తిగత జీవితంలోని ఘటనల ఆధారంగా, మేల్ ప్రెగ్నెంట్ అనే వార్తను పేపర్లో చదివి ఈ కథ రాసుకున్నాను. అమ్మాయి కోసం అబ్బాయి, అబ్బాయి కోసం అమ్మాయి చూడాల్సిన చిత్రం ఇది. తెలుగు పరిశ్రమలో ఓ మంచి సినిమా చేశామనే పేరు వస్తుంది’’ అన్నారు. -
'రాజుగారి కోడిపులావ్'.. కొత్త రిలీజ్ డేట్
ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం 'రాజుగారి కోడిపులావ్' కుటుంబ కథా 'వి'చిత్రం అనేది ట్యాగ్. ఈ సినిమాతో శివ కోన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు అందరి దృష్టిని ఆకట్టుకొన్నాయి. ట్రైలర్ అయితే 1 మిలియన్ వ్యూస్ మార్క్ దాటేసింది. ప్రేక్షకులు సినిమా విడుదల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రాజు గారి కోడి పులావ్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా "వాట్ ద ఫ* ఈజ్ ఆఫ్ కోడిపులావ్" అనే మరో ఇంట్రెస్టింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ మూవీలో అందరూ కొత్త నటులే అయినప్పటికీ వారి పెర్ఫామెన్స్ తో సినిమాపై ఆసక్తి పెంచుతున్నాడు. ప్రభాకర్ ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికెట్ జారీ చేసింది. తొలుత జూలై 29న రిలీజ్ ప్లాన్ చేశారు కానీ ఎందులో ఇందులో మార్పు చేశారు. ఆగస్టు 4న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: 'రంగబలి' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే) -
ఆయన బయోపిక్.. 'దేశీయ తలవైర్' పేరుతో
తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన నాయకుడు పశుమ్పొన్ ముత్తు రామలింగ దేవర్ జీవిత చరిత్ర 'దేశీయ తలైవర్' టైటిల్‌తో సినిమాగా తీస్తున్నారు. ఇందులో ముత్తు రామలింగ దేవర్ పాత్రలో జేఎం బషీర్ నటిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్. అరవింద్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్ పనులు జరుపుకుంటోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్) ఈ సినిమాను అక్టోబర్ 30న పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయడానికి నిర్మాత ఏఎం.చౌదరి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కర్ణాటకలోనూ విడుదల కానుంది. కాగా ఇటీవలే కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్‌ను 'దేశీయ తలైవర్' హీరో, నిర్మాత ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. తాము నిర్మిస్తున్న 'దేశీయ తలైవర్' గురించి డీకే శివకుమార్‌కు వివరించినట్లు, ఆయన ఈ చిత్రంలో టైటిల్ పాత్రను పోషించిన జేఎం.బషీర్ ముత్తు రామలింగ దేవర్ మాదిరిగానే ఉన్నారని ప్రశంసించినట్లు చిత్రవర్గాలు ఆదివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని కన్నడంలో రాష్ట్రీయ నేత పేరుతో విడుదల చేయనున్నట్లు తెలిపారు. (ఇదీ చదవండి: కలెక్షన్స్‌లో 'బేబీ' ఆల్‌టైమ్ రికార్డ్!) -
'భోళాశంకర్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..
చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘భోళాశంకర్’ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 27న ట్రైలర్ విడుదలకానుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్స్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. కాగా ‘భోళాశంకర్’ ట్రైలర్‌ను ఈ నెల 27న(గురువారం) విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఆదివారం అధికారికంగా ప్రకటించి, చిరంజీవి లుక్‌ని రిలీజ్ చేసింది. చేతిలో కత్తి పట్టుకుని సీరియస్ లుక్‌లో నడిచి వస్తున్నారు చిరంజీవి. ఈ సినిమాలో సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, ‘వెన్నెల’ కిషోర్, తులసి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్, కెమెరా: డడ్లీ, లైన్ ప్రొడక్షన్: మెహర్ మూవీస్. -
వినాయక చవితి రేసులో 'మార్క్ ఆంథోని'
హీరో విశాల్.. ఇప్పుడు 'మార్క్ ఆంథోని'గా వచ్చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తీసిన ఈ సినిమాలో విశాల్‌కి జోడీగా రీతూవర్మ నటించింది. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. ప్రస్తుతం తుదిదశ పనుల్లో ఉన్న ఈ చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు. (ఇదీ చదవండి: పెళ్లయిన నటితో తెలుగు యాక్టర్ డేటింగ్?) వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న 'మార్క్ ఆంథోని' విడుదలవుతుందని, రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో మెయిన్ లీడ్స్ అందరూ సరికొత్త రెట్రో లుక్ తో కనిపించి సినిమాపై ఆసక్తి పెంచేశారు. ఇటీవల రిలీజైన టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. విశాల్ ఇందులో సరికొత్తగా కనిపించారు. గుబురు గడ్డంతో ఫైర్ చేస్తున్న విశాల్ లుక్, ఎస్.జె.సూర్య కామెడీ టైమింగ్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. జీవీ ప్రకాష్ సంగీతమందించారు. 'మార్క్ ఆంథోని'.. టైమ్ ట్రావెల్ థీమ్ చుట్టూ తిరిగే కథ. భారీ యాక్షన్ సన్నివేశాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలతో, అక్కడక్కడ ఎస్.జె.సూర్య కామెడీ టైమింగ్‌తో ఈ చిత్రం ఆద్యంతం అందరినీ అలరించనుంది. (ఇదీ చదవండి: ప్రముఖ ఫైట్ మాస్టర్ అరెస్ట్.. అలా చేయడంతో!) -
గోదావరి నేపథ్యంలో 'బెదురులంక'.. రిలీజ్ డేట్ ఫిక్స్
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ‘బెదురులంక 2012’ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించారు. రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. ‘‘హిలేరియస్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘బెదురులంక 2012’. ఇప్పటివరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది’’ అన్నారు బెన్నీ ముప్పానేని. ‘‘మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. మణిశర్మగారు అద్భుతమైన బాణీలు అందించారు. కార్తికేయ, నేహా జోడీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు క్లాక్స్. ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, సమర్పణ: సి. యువరాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సహనిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల. -
ఆగస్టులో ఆదికేశవ
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగవంశీ, ఎస్. సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 18న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘ఆదికేశవ’. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలను వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ ప్రకటించింది. రాధిక, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్, కెమెరా: డడ్లీ. -
వడ్డించడానికి రెడీగా ఉన్న 'రాజుగారి కోడిపులావ్'..!
ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం 'రాజు గారి కోడిపులావ్' కుటుంబ కథా 'వి'చిత్రం అనేది శీర్షిక. ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు ప్రేమకథ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 29న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజైన పాటలు, వీడియోలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. (ఇది చదవండి: కల్యాణ్ రామ్ 'డెవిల్' గ్లింప్స్ రిలీజ్.. కానీ డైరెక్టర్ మిస్సింగ్!) 'రాజు గారి కోడిపులావ్' చిత్రంలో నిర్మాతగా, డైరెక్షన్ బాధ్యతలు వహిస్తూనే శివ కోన ఈ చిత్రంలో డ్యాని పాత్రలో నటించారు. అలాగే అందరికి సుపరిచితుడు అయిన బుల్లితెర నటుడు ప్రభాకర్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వీరితోపాటు నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ మనీ సంగీతమందించారు. (ఇది చదవండి: అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!) -
చిరంజీవి-పవన్ కల్యాణ్.. మధ్యలో అనుష్క!
వేసవితో పాటు గత కొన్నిరోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ డల్‌గా ఉంది. దాదాపు వచ్చినవన్నీ చిన్న సినిమాలు, వాటిలోనూ హిట్ కొట్టినవి తక్కువే. ప్రేక్షకుల్ని అలరించిన చిత్రాలు పెద్దగా లేవు. మొన్నటివరకు పరిస్థితి ఇది. కానీ రాబోయే కొన్ని నెలలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర హడావుడి మాములుగా ఉండదు. బోలెడన్ని కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమైపోయాయి. వీటిలో ఓ ఫైట్ మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తోంది. 'మిస్ శెట్టి' రిలీజ్ ఫిక్స్ అనుష్క శెట్టి.. చాన్నాళ్ల తర్వాత తెలుగులో చేసిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. 'జాతిరత్నాలు' తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన సినిమా ఇదే. కొన్నాళ్ల ముందు టీజర్ విడుదల చేస్తే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో థియేటర్లలోకి ఈ చిత్రం ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూశారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఆగస్టు 4న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) మెగా బ్రదర్స్‌తో పోటీ అనుష్క 'మిస్ శెట్టి' సినిమా సోలో రిలీజ్. కానీ దీనికి వారం ముందే అంటే జూలై 28న పవన్ కల్యాణ్-సాయిధరమ్ తేజ్ 'బ్రో' థియేటర్లలోకి వస్తుంది. దీనికి వారం తర్వాత అంటే ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' థియేటర్లలోకి వస్తుంది. అటు చిరు ఇటు పవన్ మధ్యలో అనుష్క తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఇదంతా చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర ఈ ఫైట్ ఆసక్తి రేపుతోంది. అనుష్కకే ప్లస్ చిరు, పవన్ సినిమాలతో పోలిస్తే అనుష్క మూవీకే ఎక్కువ ప్లస్ అయ్యే అవకాశముంటుంది. ఎందుకంటే 'బ్రో'.. వినోదయ సీతం రీమేక్, 'భోళా శంకర్'.. వేదాళం చిత్రానికి రీమేక్. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మాత్రం ఒరిజినల్ కథతోనే తీశారు. అలానే కామెడీని నమ్ముకున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏ సినిమా హిట్ అవుతుందా అనే ఒకటే టెన్షన్. ఒకవేళ మూడు సక్సెస్ అయితే మాత్రం కలెక్షన్స్ ఎలా వస్తాయనేది ఇంకా ఇంట్రెస్టింగ్. చూడాలి మరి ఏం జరుగుతుందో? View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) (ఇదీ చదవండి: చిన్న సినిమా.. పెద్ద సక్సెస్.. కోట్లకు కోట్లు!) -
ఒక్క సినిమా.. 35 పాటలు.. అదే అసలు సమస్య!
ఆ డైరెక్టర్ తీసింది ఒక్కటే సినిమా. కానీ దేశవ్యాప్తంగా కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అదే మూవీని హిందీలో రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్. వందల కోట్ల కలెక్షన్స్. దీంతో ఆ దర్శకుడు నెక్స్ట్ చిత్రం ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు తెగ ఎదురుచూశారు. ఇప్పుడేమో మరో నెలరోజుల్లో విడుదల ఉందనగా, రిలీజ్ డేట్ మార్చేశారు. ఏకంగా మూడున్నర నెలల తర్వాత థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. అసలు కారణం ఏంటో కూడా బయటపెట్టారు. 'యానిమల్' వాయిదా 'అర్జున్‌రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తీస్తున్న పాన్ ఇండియా మూవీ 'యానిమల్'. రణ్‌బీర్ కపూర్, రష్మిక హీరోహీరోయిన్లు. ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాలి. ఇప్పుడేమో ఆ తేదీన రాలేకపోతున్నామని.. డిసెంబరు 1న విడుదలవుతుందని కొత్త డేట్ ప్రకటించారు. అభిమానులు కాస్త నిరుత్సాహపడిన మాట వాస్తవే.. కానీ డైరెక్టర్ చెప్పింది విని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన సినిమాపై పెట్టుకున్న నమ్మకం చూసి అంచనాలు పెంచేసుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) డైరెక్టర్ ఏం చెప్పారు? 'ఈ సినిమాలో ఏడు పాటలున్నాయి. ఐదు భాషల్లో లెక్కేస్తే మొత్తం 35 అవుతాయి. ఇన్ని సాంగ్స్ ని డిఫరెంట్ సెటప్ ప్లేసులు, డిఫరెంట్ సెటప్ సింగర్స్ తో రికార్డ్ చేయాలంటే కాస్త టైమ్ పడుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్లే ఆగస్టు 11న విడుదల చేయలేమని మాకు అర్థమైంది. ప్రీ టీజర్ కు వచ్చిన స్పందనకు ధన్యవాదాలు. హిందీలో రికార్డ్ చేసిన పాటలకు లిరికల్ గా ఎలాంటి ఔట్పుట్ వచ్చిందో ఇతర భాషల్లోనూ అలాంటి దానికోసం ప్రయత్నిస్తున్నాం. దీనికోసం టైమ్, ఎనర్జీ కేటాయించాల్సి ఉంటుంది' 'అలానే ఇతర భాషల్లో విన్నవాళ్లకు డబ్బింగ్ అనే ఫీల్ రాకూడదనేదే మా ఆలోచన. అందుకే మూవీ రిలీజ్ వాయిదా వేశాం. డిసెంబరు 1న 'యానిమల్' విడుదల చేయబోతున్నాం. ప్రేక్షకులకు వీడియో, ఆడియో పరంగా బెస్ట్ క్వాలిటీ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాను. ఓవరాల్ గా ఇది చాలా పెద్ద మూవీ. థియేటర్లలో రణ్‌బీర్ కపూర్ విశ్వరూపం చూస్తారు' అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు. సందీప్ చెప్పిన దానిబట్టి చూస్తుంటే.. పాటలు ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. అందుకే వాటి విషయంలో అస్సలు తగ్గట్లేదనిపిస్తోంది. ఇక 'యానిమల్' తర్వాత డైరెక్టర్ సందీప్.. ప్రభాస్ తో కలిసి పనిచేయబోతున్నాడు. 'స్పిరిట్' అనే మూవీని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. బహుశా దీని షూటింగ్.. వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశముంది. #1stDecemberANIMALrelease@AnilKapoor #RanbirKapoor @thedeol @iamRashmika@tripti_dimri23 @imvangasandeep #BhushanKumar @VangaPranay @MuradKhetani #KrishanKumar @anilandbhanu @VangaPictures @TSeries @rameemusic @cowvala #ShivChanana @neerajkalyan_24 @sureshsrajan pic.twitter.com/EAGLNTaEy9 — Sandeep Reddy Vanga (@imvangasandeep) July 3, 2023 (ఇదీ చదవండి: డైరెక్టర్‌తో హీరోయిన్ సీక్రెట్ పెళ్లి.. యూటర్న్ తీసుకున్న కల్పికా గణేశ్) -
సంక్రాంతి రేసులోకి 'హనుమాన్'.. వర్కౌట్ అవుతుందా?
టాలీవుడ్లో ఫాంటసీ కథలతో వచ్చిన సినిమాలు చాలా తక్కువ అనే చెప్పాలి. గ్రాఫిక్స్ ప్రధానంగా తీసే చిత్రాల్లో రాజమౌళి ఫెర్ఫెక్ట్. మిగతా దర్శకులు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతున్నారు. ప్రేక్షకులతో తిట్లు తింటున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వాళ్లందరూ ఓ సినిమా కోసం కాస్తంత ఎక్కువగానే ఎదురుచూస్తున్నారు. అదే ప్రశాంత్ వర్మ 'హనుమాన్'. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. సంక్రాంతి రేసులో హాలీవుడ్ లో వచ్చే సూపర్ హీరోల సినిమాలు చూసి మనం ఆహో ఓహో అంటుంటాం. వాళ్లందరికీ గురువు లాంటివాడు ఆంజనేయుడు. ఆయన కథతో ప్రశాంత్ వర్మ 'హనుమాన్' అనే చిత్రాన్ని తీస్తున్నాడు. గ్రాఫిక్స్ ప్రధానం కావడం వల్ల గత రెండేళ్ల నుంచి ఈ సినిమా సెట్స్ పైనే ఉంది. ఏదో తొందరపడి విడుదల చేయాలని కాకుండా నిదానంగా ఒక్కో పనిచేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అవన్నీ ఓ కొలిక్కి వచ్చినట్లు ఉన్నాయి. మరో ఆరు నెలల్లో అంటే వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని థియేటర్లలో తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) ఏకంగా అన్ని సినిమాలు? వచ్చే సంక్రాంతి బరిలో ఒకటి తర్వాత ఒకటి అన్నట్లు బోలెడన్ని సినిమాలు వచ్చి చేరుతున్నాయి. ప్రభాస్ 'ప్రాజెక్ట్ K'ని జనవరి 12న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మహేశ్ 'గుంటూరు కారం', రవితేజ 'ఈగిల్' ముగ్గుల పండక్కే వచ్చేందుకు సిద్ధమైపోయాయి. వీటితోపాటు విజయ్ దేవరకొండ-పరశురామ్ మూవీ, పవన్ కల్యాణ్ 'ఓజీ', చిరంజీవి-కల్యాణ్ కృష్ణ కాంబోలోని సినిమాను కూడా సంక్రాంతికే తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. 'హనుమాన్' స్పెషల్ ప్రశాంత్ వర్మ తీస్తున్న 'హనుమాన్' సినిమాని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్.. ఇలా 11 భాషల్లో విడుదల చేయబోతున్న తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇందులో హీరోగా తేజ సజ్జా నటిస్తున్నాడు. అమృత అయ్యర్ హీరోయిన్. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర చేస్తోంది. ఇలా సమ్‌థింగ్ స్పెషల్ అనిపిస్తున్న ఈ చిత్రం.. సంక్రాంతికి మిగతా సినిమాలతో కలిసి బరిలోకి దిగుతుందా? లేదా ప్లాన్ ఏమైనా మార్చుకుంటుందా అనేది చూడాలి. pic.twitter.com/LjAYhaDO9V — Prasanth Varma (@PrasanthVarma) July 1, 2023 (ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ) -
18 ఏళ్లకు సీక్వెల్.. చంద్రముఖి 2 రిలీజ్ డేట్ వచ్చేసింది..
రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి సినిమా అప్పట్లో సెన్సేషనల్ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే చాలు చాలామంది టీవీలకు అతుక్కుపోతారు. 2005లో విడుదలైన ఈ సినిమాను పి.వాసు డైరెక్ట్ చేశాడు. దీనికి సీక్వెల్ చేయాలని ఆయన ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో రజనీకాంత్ ఒప్పుకోకపోవడంతో సీక్వెల్ కథతో తెలుగులో నాగవల్లి సినిమా చేశాడు. చివరకు 18 ఏళ్ల తర్వాత తమిళంలోనూ చంద్రముఖి 2 పూర్తి చేశాడు. ఇందులో రజనీకాంత్‌కు బదులుగా నృత్య దర్శకుడు, నటుడు లారెన్స్ నటించాడు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసింది. వడివేలు, రాధిక ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. చంద్రముఖి 2 తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు రానుంది అంటూ అధికారికంగా వెల్లడించారు. దీంతో అభిమానులు సినిమా కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. We are thrilled to announce that the doors to the much awaited sequel Chandramukhi 2 🗝️ will be open from Ganesh Chaturthi 🤗✨ Releasing in Tamil, Hindi, Telugu, Malayalam & Kannada! #Chandramukhi2 🗝️ pic.twitter.com/hoM7BXxWp2 — Raghava Lawrence (@offl_Lawrence) June 29, 2023 చదవండి: పాట పాడటమే కాదు, డ్యాన్స్ కూడా చేసిన ఏఆర్ రెహమాన్ -
'సలార్' ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకేమో టెన్షన్!
'ఆదిపురుష్' రిజల్ట్ ప్రభాస్ అభిమానులని చాలా నిరాశపరిచింది. కలెక్షన్స్ తగ్గిపోవడం, లెక్కలేనన్ని వివాదాలు.. వాళ్లకు చిరాకు తెప్పిస్తున్నాయి. దీంతో ఈ సినిమా గురించి మర్చిపోవాలని ఫిక్స్ అయ్యారు. అదే సమయంలో 'సలార్' కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ మూవీతో ప్రభాస్ హిట్ కొట్టాలని గట్టిగా కోరుకుంటున్నారు. అప్పుడే విమర్శకుల నోళ్లు మూతబడతాయనేది వాళ్ల ఆశ. అయితే ఇప్పట్లో అది జరిగేలా కనిపించట్లేదు! 'సలార్' కోసం వెయిటింగ్! ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ కోరుకునేది మాస్ సినిమాలే. లేదంటే వేరే లెవల్ ఎలివేషన్స్ ఇచ్చే చిత్రాలు. 'బాహుబలి'తో డార్లింగ్ హీరో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీని తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' చేశాడు. కానీ అభిమానుల్ని పూర్తిస్థాయిలో సంతృప్తి పరచలేకపోయాడు. దీంతో వాళ్లందరూ 'సలార్'పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' ఎఫెక్ట్.. ఆ 'రామాయణం' మళ్లీ రిలీజ్) విలన్‌కి ప్రమాదం 'సలార్'లో జగపతిబాబు, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్స్ గా నటిస్తున్నారు. సరిగ్గా మూడు రోజుల క్రితం పృథ్వీరాజ్‌కి ఓ సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగింది. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించి, సర్జరీ చేశారు. కొన్నివారాలపాటు విశ్రాంతి తీసుకోమని సూచించారు. ఇలా సడన్ గా యాక్సిడెంట్ జరగడం.. 'సలార్' చిత్రబృందానికి షాక్ ఇచ్చింది. షూట్ బ్యాలెన్స్ ఎందుకంటే 'సలార్'లో పృథ్వీరాజ్ రోల్ కి సంబంధించి కాస్త షూట్ మిగిలుంది. త్వరలో ఇది పూర్తి చేయాలనుకున్నారు. ఇప్పుడేమో అతడికి ప్రమాదం జరిగి, బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. త్వరలో కోలుకుని సెట్ లో అడుగుపెడితే పర్లేదు. ఇదంతా త్వరగా జరిగితేనే ఆల్రెడీ ప్రకటించినట్లు సెప్టెంబరు 28న 'సలార్' థియేటర్లలోకి వస్తుంది. కుదరకపోతే మాత్రం వాయిదా గ్యారంటీ. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి. View this post on Instagram A post shared by Prithviraj Sukumaran (@therealprithvi) (ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?) -
'స్పై' రిలీజ్ డేట్ ఫిక్స్.. పట్టించుకోని హీరో నిఖిల్!
ప్రస్తుతం ఎక్కడచూసినా 'ఆదిపురుష్' హడావుడి నడుస్తోంది. టాలీవుడ్ లో మాత్రం 'స్పై' మూవీ రిలీజ్ విషయంలో హీరో-నిర్మాత మధ్య గొడవ జరుగుతోందా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ మూవీ థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. కానీ హీరోగా నటించిన నిఖిల్ మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు. దీంతో ఏం జరుగుతుందా అని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ అసలేంటి గొడవ? 'హ్యాపీడేస్'తో నటుడిగా మారిన నిఖిల్.. అప్పటి నుంచి పలు సినిమాలు చేస్తూ వచ్చాడు. కేవలం తెలుగుకే పరిమితమైన ఇతడు.. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ క్రమంలోనే తన కెరీర్ ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు. తెలుగులో ఏ యంగ్ హీరోకి సాధ్యం కాని విధంగా 'స్వయంభు', 'ద ఇండియా హౌస్' లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రెండో రోజు కలెక్షన్స్.. ఆ మార్క్ దాటేసింది!) వీటికంటే ముందు 'స్పై' మూవీ చేశాడు. కొన్నాళ్ల ముందు టీజర్ రిలీజ్ చేయగా ఆలోవర్ ఇండియా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ జూన్ 29న ఈ సినిమాని రిలీజ్ చేద్దామని నిర్మాత భావిస్తుంటే.. హీరో నిఖిల్ మాత్రం డేట్ వాయిదా వేద్దామని, దేశం మొత్తం ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేద్దామని అడిగారట. దానికి నిర్మాత రాజశేఖర్ రెడ్డి ఒప్పుకోలేదని టాక్. ఇప్పటికే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర అడ్వాన్స్ తీసుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాక.. దాన్ని మార్చితే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోరు. ఇలా ఎవరి కారణాలు వాళ్లకు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 'స్పై' రిలీజ్ డేట్ విషయంలో మార్పు లేదని క్లారిటీ ఇస్తూ మరోసారి పోస్టర్స్ విడుదల చేశారు. వీటిని హీరో నిఖిల్ ఎక్కడా ప్రమోట్ చేయలేదు, సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. దీంతో ఈ గొడవ ఇంకా క్లియర్ కాలేదా అని డౌట్ వస్తుంది. మరి నిర్మాత చెప్పినట్లు జూన్ 29నే ఈ మూవీ థియేటర్లలోకి వస్తుందా? లేదా వాయిదా పడుతుందా అనేది చూడాలి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'బిచ్చగాడు 2'.. స్ట్రీమింగ్ అందులో) -
'బిచ్చగాడు 2' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్
తెలుగులో ఎప్పుడు ఏ సినిమా, ఎందుకు హిట్ అవుతుందనేది అస్సలు అంచనా వేయలేం. అలా 2016లో ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చి బ్లాక్‌బస్టర్ సక్సెస్ కొట్టిన మూవీ 'బిచ్చగాడు'. అప్పటివరకు మ్యూజిక్ డైరెక్టర్ గా అందరికీ తెలిసిన విజయ్ ఆంటోని.. ఈ సినిమాతో హీరోగా క్రేజ్ సంపాదించాడు. చాలా సినిమాల్లో నటించాడు. అయితే 'బిచ్చగాడు' సక్సెస్ తర్వాత విజయ్ ఆంటోని చాలా సినిమాలు చేశాడు గానీ ఏవి కూడా పెద్దగా హిట్ కాలేదు. దీంతో తనకు సక్సెస్ ఇచ్చిన 'బిచ్చగాడు' సీక్వెల్ తో ఈ మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే.. ఏమంత ఇంట్రెస్టింగ్ గా లేకపోయినప్పటికీ తెలుగులో హిట్ టాక్ సొంతం చేసుకుంది. తమిళంతో పోలిస్తే తెలుగులో 'బిచ్చగాడు 2'కి మంచి కలెక్షన్స్ వచ్చాయి. చెప్పాలంటే డిస్ట్రిబ్యూటర్స్ లాభాలు సొంతం చేసుకున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే కొందరు మూవీ లవర్స్ మాత్రం ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. వారి కోసమా అన్నట్లు తాజాగా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు. దీని ప్రకారం జూన్ 18 నుంచి హాట్ స్టార్ లో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. (ఇదీ చదవండి: ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్‌లు ఇవే! టాప్ 5లో ఏమున్నాయంటే?) -
వరుణ్ తేజ్ యాక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'గాండీవధారి అర్జున.' ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్తో ముందుకొచ్చారు. (ఇది చదవండి: వేకేషన్ నుంచి తిరిగొచ్చిన ఐకాన్ స్టార్.. ఫోటోలు వైరల్!) ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనికి సంబంధించి వరుణ్ తేజ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా.. 'ఏజెంట్' సినిమాలో అఖిల్ జోడీగా మెరిసిన సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి మిక్కీ. జే. మేయర్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (ఇది చదవండి: 'ఆదిపురుష్' సినిమాపై వివాదం.. స్పందించిన చిత్రబృందం!) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
2018మూవీ కి బిగ్ షాక్..
-
మగవాళ్లని ఆడవాళ్లు ఎలా వేధిస్తారు అన్నదే 'మెన్ టూ' చిత్రం
'మెన్ టూ' చిత్రంలో మేం ఎక్కడా మహిళలని తిట్టలేదు. ఈ సినిమా పురుషులకే కాదు.. మహిళలకు కూడా నచ్చుతుంది. ఈ చిత్రం బాగా రావడానికి కారణమైన నిర్మాతలు, మౌర్యలకు థ్యాంక్స్ అని దర్శకుడు శ్రీకాంత్ జి.రెడ్డి అన్నారు. నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, కౌశిక్ ఘంటశాల, రియా సుమన్, ప్రియాంక శర్మ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం హ్యాష్‌టాగ్ మెన్ టూ. శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మౌర్య సిద్దవరం మాట్లాడుతూ.. హిలేరియస్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ఈ సినిమా విడుదలకు కారణమైన మైత్రీ మూవీస్ సంస్థకి థ్యాంక్స్ అన్నారు. మగవాళ్లని ఆడవాళ్లు ఏ విధంగా వేధిస్తారు? అనేది హ్యాష్‌టాగ్ 'మెన్ టూ' చూసి తెలుసుకోవచ్చు అన్నారు నటుడు బ్రహ్మాజీ. చిత్ర సహనిర్మాత శ్రీమాన్, నటీనటులు ప్రియాంక శర్మ, నరేష్, అగస్త్య, కౌశిక్ మాట్లాడారు. -
మజిలీ బ్యూటీతో హీరో సిద్ధార్థ్.. రిలీజ్ డేట్ ఆరోజే
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సిద్ధార్థ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘టక్కర్’. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ కథానాయికగా నటించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఫ్యాషన్ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘సాధారణంగా సిద్ధార్థ్ సినిమాల్లో ప్రేమ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ‘టక్కర్’లో ప్రేమ సన్నివేశాలతో పాటు అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఈ సినివ కోసం సిద్ధార్థ్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ఘనవిజయం సాధించి, తన కెరీర్లో మరో గుర్తుండిపోయే సినిమాస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. చదవండి: సుడిగాలి సుధీర్ సరసన దివ్యభారతి.. కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఈ చిత్రాన్ని జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘సాధారణంగా సిద్ధార్థ్ సినిమాల్లో ప్రేమ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ‘టక్కర్’లో ప్రేమ సన్నివేశాలతో ΄పాటు అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఈ సినిమా కోసం సిద్ధార్థ్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ఘనవిజయం సాధించి, తన కెరీర్లో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: నివాస్ కె. ప్రసన్న, కెమెరా: వాంనాథన్ మురుగేశన్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్. చదవండి: ఆ డైలాగ్స్ వింటే చాలు.. పూనకాలు పుట్టుకొచ్చేస్తాయి! -
నాగశౌర్య హీరోగా రంగబలి, స్పెషల్ పోస్టర్ రిలీజ్
నాగశౌర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగబలి’. ఈ చిత్రం ద్వారా పవన్ బాసంశెట్టి దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘రంగబలి’ని జూలై 7న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. నాగశౌర్య ట్రెండీ గెటప్‌లో కనిపిస్తున్న ఓ పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే కథతో ‘రంగబలి’ ఫన్ రైడ్ (సరదా ప్రయాణం) గా ఉండబోతోంది. ఇందులో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.. ఇందుకు ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. హీరోయిన్, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: పవన్ సీహెచ్, కెమెరా: దివాకర్ మణి. -
రానా తమ్ముడు హీరోగా 'అహింస'.. రిలీజ్ డేట్ ఫిక్స్
నిర్మాత సురేష్ బాబు తనయుడు, హీరో రానా సోదరుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం అహింస. తేజ దర్శకత్వంలో పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా జూన్2న రిలీజ్ కానుంది. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం అహింస. చదవండి: ‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. సినిమా కూడా అందర్నీ అలరించేలా ఉంటుంది అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం ఆర్పీ పట్నాయక్, కెమెరా సమీర్ రెడ్డి -
విజయ్ దేవరకొండ స్టైల్లో 'మేమ్ ఫేమస్' రిలీజ్ డేట్
సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి కీలక పాత్రల్లో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 2న విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే కొంచెం ముందే ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు హీరో విజయ్ దేవరకొండ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ‘‘ట్రాక్టర్ లా పోస్తాం డీజిల్.. విజయ్ అన్న ఒచ్చిండు కొట్టుర్రా విజిల్’ అంట టీమ్ చెప్పగా, ‘వర్షం పడుతోంది చమ్ చమ్ చమ్... మే 26న మేమ్ ఫేమస్కి అందరూ కమ్ కమ్ కమ్’ అంటూ విజయ్ దేవరకొండ తనదైన స్టైల్లో చెప్పారు. -
అంజనాద్రి కోసం సాహసాలు
అంజనాద్రి కోసం అహార్నిశలు కష్టపడ్డారు తేజ సజ్జా. అంజనాద్రి రక్షణకు ఈ యువ హీరో ఎలాంటి సాహసాలు చేశాడు అనేది ‘హను–మాన్’ సినిమాలో చూడాలి. తేజ సజ్జా, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను–మాన్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 12న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ‘అంజనాద్రి’ అనే ఊహాత్మక ప్రదేశం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘హను–మాన్’. హనుమంతుని శక్తులను పొంది అంజనాద్రి కోసం కథానాయకుడు ఎలా పోరాడాడనేది చిత్రకథాంశం. ‘‘హను–మాన్’ టీజర్‌పై ప్రేక్షకులు చూపించిన ప్రేమ మా బాధ్యతను బాగా పెంచింది. గ్రాఫిక్స్ వర్క్స్ పెండింగ్ ఉండటం వల్ల ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్‌గా హను–మాన్ చిత్రం రిలీజ్ కానుంది. వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్, కెమెరా: శివేంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి. -
వెనక్కి తగ్గిన ప్రశాంత్ వర్మ.. హనుమాన్ వాయిదా
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా హనుమాన్. జాంబిరెడ్డి లాంటి హిట్ మూవీ తర్వాత వీరిద్దరూ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో మూవీ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్గా విడుదలైన టీజర్‌తో ఈ మూవీపై మరింత హైప్ నెలకొంది. దీంతో రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఈనెల 12న విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించారు. కానీ గ్రాఫిక్ పనులు, ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని తెలిపారు. కాగా ఈ సినిమాలో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
ఆగస్ట్‌లో ఫిక్స్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించిన ఓ అప్డేట్ను గురువారం చిత్ర యూనిట్ ఇచ్చింది. ఆగస్ట్ 10న ‘జైలర్’ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. వీడియోలో కారులో నుంచి స్టైల్‌గా దిగుతున్న రజనీకాంత్ లుక్ ఆకట్టుకుంటోంది.కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కు పూర్తి భిన్నంగా థ్రిల్లర్ తరహాలో ఈ సినిమా తెరకెక్కుతోందని కోలీవుడ్ టాక్. శివరాజ్‌కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, ప్రియాంక అరుల్ మోహన్, మిర్నా మీనన్ తదితరులు ముఖ్య ΄ాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్. -
ఆకట్టుకుంటున్న 'మరువ తరమా' ఫస్ట్ లుక్ పోస్టర్
ఫీల్ గుడ్ లవ్స్టోరీస్కి యూత్‌లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇప్పటికే ఇలా ఎన్నో సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపాయి. ఇప్పుడు అదే బాటలో మరో ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ మరువ తరమా రాబోతుంది. అద్వైత్ ధనుంజయ,అవంతిక నల్వా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను వదిలారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్‌ను వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. -
త్వరలో ఆదిపురుష్ ట్రైలర్
-
అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం మీటర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ మీటర్. రమేష్ కాడూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. రిలీజ్‌కు ముందు మాంచి హైప్ క్రియేట్ చేసినా బాక్సాఫీస్ వద్ద రిజల్ట్ మాత్రం తారుమారు అయ్యింది. చదవండి: కొడుకుపై ట్రోలింగ్.. తొలిసారి రియాక్ట్ అయిన అమల అక్కినేని ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. మే 5 నుంచి మీరట్ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ లెక్కన సినిమా విడుదలైన నాలుగు వారాల్లోనే మీటర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. కిరణ్ అబ్బవరంకు జోడీగా కోలీవుడ్ బ్యూటీ అతుల్య రవి నటించింది. కాగా కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే.. ఓ మల్టీస్టారర్ మూవీలో ఆయన నటించనున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు మరో మూడు మరో మూడు భారీ ప్రాజెక్టుల్లో నటించనున్నారు కిరణ్. చదవండి: ‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..? -
ఇన్‌స్టా స్టార్ బన్నీ వోక్స్ హీరోయిన్గా 'విద్యార్థి' మూవీ
చేతన్ చీను, బన్నీవోక్స్ జంటగా నటించిన చిత్రం ‘విద్యార్థి’. మధు మాదాసు దర్శకత్వంలో మహాస్ క్రియేషన్స్ పతాకంపై ఆళ్ల వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 29న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో కాన్సెప్ట్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మధు మాదాసు మాట్లాడుతూ.. ‘‘దర్శకుడిగా తొలి చిత్రమిది. చాలాకష్టపడి తీశాం. ఎక్కడా బ్రేక్ లేకుండా సింగిల్ షెడ్యూల్లో సినిమా పూర్తి చేశాం. కాకపోతే కరోనా వల్ల సినిమా ఆలస్యమైంది. డి.ఎస్.రావు సినిమా చూసి విడుదల చేయడానికి ముందుకొచ్చారు. ఈ నెల 29న విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు. -
ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ 'గీతా సుబ్రహ్మణ్యం-3'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
గీతా సుబ్రహ్మణ్యం ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రేమ కథలో సుప్రజ్ రంగా సుబ్రహ్మణ్యంగా కనిపించగా.. అభిజ్ఞ్య ఉతలూరు గీతగా నటించారు. ప్రేమలో ఉండే చిన్న పాటి గొడవలు ఎంతో ఫన్నీగా చూపించారు. ఎనిమిది ఎపిసోడ్లతో గీతాసుబ్రహ్మణ్యం అందరినీ మెప్పించేందుకు రెడీ అవుతోంది. తాజాగా గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్ ఆహాలో రిలీజ్ చేయనున్నారు. మే 5న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్‌ను టమడ మీడియా నిర్మిస్తోండగా.. శివ సాయి వర్దన్ దర్శకత్వం వహించారు. అసలు కథేంటంటే.. గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్ గీతా, సుబ్బుల మధ్య నడుస్తుంది. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ బిజీ లైఫ్‌ను గడుపుతుంటారు. ఒక ప్రాజెక్ట్ కోసం ఈ ఇద్దరినీ ఎంపిక చేయడం.. అందులో ఉద్యోగులు ఎలాంటి రిలేషన్ షిప్లో ఉండకూడదని కండీషన్ పెడతారు. కానీ ఆ కండీషన్‌ను గీతా, సుబ్బులు బ్రేక్ చేస్తారు. ప్రేమలో పడతారు. కానీ వారి ఫీలింగ్స్‌ను మిగతా ఉద్యోగుల ముందు బయట పెట్టకుండా మ్యానేజ్ చేస్తుంటారు. మే 5న ప్రేకక్షకులను అలరించేందుకు వస్తోంది. -
అఖిల్ ఏజెంట్ కి దెబ్బేస్తున్నారు..100 కోట్ల సినిమా పరిస్థితి ఏంటి ?
-
'8 ఏఎమ్ మెట్రో'.. ఇద్దరు అపరిచితుల కథ
గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్ జంటగా ‘మల్లేశం’ చిత్రం ఫేమ్ రాజ్ రాచకొండ దర్శకత్వం వహించిన చిత్రం ‘8 ఏఎమ్ మెట్రో’. శిలాదిత్య బోరా ప్లాటూన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మే 19న ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రముఖ గేయ రచయిత, దర్శకుడు గుల్జార్ ఈ సినిమా పోస్టర్‌ను లాంచ్ చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రకథ చదివినప్పుడు గొప్ప అనుభూతి కలిగింది. అందుకే నా కవితలు అందించాను’’ అన్నారు. ‘‘మెట్రో ట్రైన్లో కలుసుకుని, ఒకరినొకరు తెలుసుకునే ఇద్దరు అపరిచితుల కథే ఈ సినిమా’’ అన్నారు రాజ్ రాచకొండ. ‘‘ఈ చిత్రంలో నా పాత్రకి ఒక సీక్రెట్ ఉంది. అది ఇద్దర్నీ వేరు చేయడంతో పాటు నమ్మకాల్ని కూడా చీల్చుతుంది’’ అన్నారు గుల్షన్. -
గర్ల్‌ఫ్రెండ్ గోవిందా.. బ్రేకప్ అయ్యిందంటున్న అఖిల్ అక్కినేని
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏజెంట్’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్గా నటించగా, మమ్ముట్టి కీలక పాత్ర చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి 2 పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘రామకృష్ణ గోవింద.. గోవింద హరి గోవింద...’ అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్. ‘ రామ పోయి కృష్ణ వచ్చె, బాధే పోయి హ్యాపీ వచ్చిందా, నైటే పోయి లైటే వచ్చె, ప్రేమే పోతూ పోతూ ఏదో ఏదో నేర్పించిందా.. గోవిందా గోవిందా గర్ల్‌ఫ్రెండ్ గోవిందా.. అయ్యిందా అయ్యిందా బ్రేకప్ అయ్యిందా, పోయిందా పోయిందా ప్రేమే దూరం పోయిందా, వచ్చిందా వచ్చిందా ఫ్రీడమ్ వచ్చిందా..’ అంటూ ఈ పాట సాగుతుంది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటని రామ్ మిర్యాల పాడగా, శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. -
వేసవిలో వచ్చేస్తున్న అల్లరి నరేష్ 'ఉగ్రం'
నాంది వంటి హిట్ చిత్రం తర్వాత హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందిన మరో చిత్రం ఉగ్రం. మీర్నామీనన్ హీరోయిన్. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాని మే5న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఉగ్రం. ఇప్పటికీ రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్‌కి, దేవరి.. అనే తొలి పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సిద్, సంగీతం: శ్రీ చరణ్ పాకాల I have won your hearts over many summers, but this summer you will witness my UGRA ROOPAM ❤️🔥#Ugram Grand Release Worldwide on May 5th 🔥#UgramOnMAY5th ❤️🔥#NareshVijay2@mirnaaofficial @DirVijayK @sahugarapati7 @harish_peddi @Shine_Screens @SricharanPakala @jungleemusicSTH pic.twitter.com/KwciqBmgkW — Allari Naresh (@allarinaresh) April 3, 2023 -
ఇండియన్ 2 మూవీ టార్గెట్ ఫిక్స్
భారతీయుడికి టార్గెట్ ఫిక్స్ చేశారు దర్శకుడు శంకర్. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ‘ఇండియన్’కి(తెలుగులో భారతీయుడు) సీక్వెల్‌గా తీస్తున్న ‘ఇండియన్ 2’ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తైవాన్‌లో జరుగుతోంది. కమల్ హాసన్‌పై కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇందులో ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉందని కోలీవుడ్ టాక్. అయితే ‘ఇండియన్ 2’ టాకీ పార్ట్ షూటింగ్‌ను జూన్‌కల్లా పూర్తి చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘టాకీ పార్టు పూర్తి కాగానే ఓ పాట చిత్రీకరిస్తాం.. దీంతో మేజర్ షూటింగ్ పూర్తవుతుంది. జూన్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను స్టార్ట్ చేస్తాం’’ అన్నారు శంకర్. కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్‌సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రవితేజ ఫ్యాన్స్‌కు పూనకాలే.. 'టైగర్ నాగేశ్వరరావు' వచ్చేస్తున్నాడు
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. నుపుర్ సనన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. 1970-80ల కాలంలో స్టువర్టుపురంలోని గజదొంగ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ కనిపించననున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. అక్టోబర్ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను వదిలారు. సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో రవితేజ ఈ చిత్రంలో కనిపించనున్నారు. నుపూర్ సనన్‌తో పాటు గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్గా నటించనుంది. -
రెండేళ్ల తర్వాత విడుదల కాబోతున్న అజయ్ దేవగన్ మూవీ!
ఎట్టకేలకు అజయ్ దేవగన్, ప్రియమణి చిత్రం ‘మైదాన్’ విడుదలకు సిద్ధమైంది. రెండేళ్ల క్రితమే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా పులుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది. జూన్ 23న విడుదల చేయనున్నట్లు మంగళవారం చిత్ర యూనిట్ వెల్లడిస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కాగా స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ ఫుట్‌బాల్ కోజ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా రూపొందింది. ఇందులో అజయ్ దేవగన్ ఫుట్‌బాల్ కోజ్గా కనిపించనున్నాడు. నటి ప్రియమణి కీలక పాత్ర పోషించిన ఈ మూవీకి అమిత్ రవీంద్రనాథ్ దర్శకత్వం వహించాడు. జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరుణవ జోయ్ గుప్తా నిర్మించిన చిత్రం ఇది. భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు కోచ్, మేనేజర్ (1950 –1963 సమయంలో) సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర సంఘటనలను మైదాన్‌లో చూపించనున్నాడు దర్శకుడు. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) -
బాలీవుడ్‌పై ఆశలు పెట్టుకున్న బెల్లంకొండ.. ఛత్రపతి రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఛత్రపతి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌కు మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పుడీ సినిమా బాలీవుడ్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేస్తున్నాడు. వి.వి వినాయక్ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను వేసవి కానుకగా మే12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. కండలు తిరిగిన దేహంతో బెల్లంకొండ శ్రీనివాస్ లుక్ అంచనాలను పెంచేస్తుంది. మరి ఈ సినిమాతో బెల్లంకొండ సక్సెస్ అందుకుంటారా? లేదా అన్నది చూడాల్సి ఉంది. The wait is over #Chatrapathi in cinemas on 12th May, 2023. Cannot wait to show you all our hardwork & this action-packed dhamaka.🔥 Written by the one and only #VijayendraPrasad, directed by #VVVinayak.@Penmovies #Bss9 pic.twitter.com/VSLYTWQkrT — Bellamkonda Sreenivas (@BSaiSreenivas) March 27, 2023 -
మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆరోజే సినిమా రిలీజ్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా పడితే అభిమానులకు పూనకాలు రావాల్సిందే! వీరి కాంబినేషన్లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు రాగా ముచ్చటగా మూడోసారి జతకట్టారిద్దరూ. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో సూపర్ స్టార్ చేతిలో సిగరెట్ పట్టుకుని స్టైలిష్‌గా నడుస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాకి ‘అడవిలో అర్జునుడు’, ‘ఆమె కథ’, ‘అమ్మ కథ’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 22న ఈ మూవీ టైటిల్‌ను అధికారికంగా రిలీజ్ చేయనున్నారంటూ జోరుగా ప్రచారం నడిచింది. కానీ అది నిజం కాలేదు. మరి ఈ చిత్ర టైటిల్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి! The Reigning Superstar @urstrulymahesh in an all new MASS avatar is all set to meet you with #SSMB28 in theatres from 13th January 2024 worldwide! 🤩#SSMB28FromJAN13 🎬🍿#Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/qqXjnJphqH — Haarika & Hassine Creations (@haarikahassine) March 26, 2023 -
విజయ్, సమంతల 'ఖుషీ'.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా 'ఖుషి'. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ ఏడాది సెప్టెంబర్ 1న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకుంది చిత్రబృందం. అయితే రెండు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి సమ్మర్లో ఖుషీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేసినా కుదరలేదు. సమంత అనారోగ్య కారణాలతో ఈ మూవీ షూటింగ్ ఆలస్యమైంది. సమ్మర్లో వస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఇటీవలే యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించి ఖుషి కొత్త షెడ్యూల్ కూడా ప్రారంభమైంది. కాగా.. ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం విడుదలకు సిద్ధంగా ఉంది. #Kushi ❤️ Sept 1st. With full love,@Samanthaprabhu2 @ShivaNirvana @MythriOfficial @HeshamAWMusic & your man. pic.twitter.com/97rT3t8zoC — Vijay Deverakonda (@TheDeverakonda) March 23, 2023 -
'ఏమో ఏమో' సాంగ్‌ని రిలీజ్ చేసిన విజయశాంతి
యోగేశ్వర్,అతిథి జంటగా, సాయి శివాజీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పరారీ. శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్ లో, గాలి ప్రత్యూష సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలోని ఏమో ఏమో సాంగ్‌ని లేడీ సూపర్ స్టార్ విజయశాంతి విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ టీంకు ఆల్‌ది బెస్ట్ చెప్పారు. సాంగ్ లాంచింగ్ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ నారాయణ్ మాట్లాడుతూ..తను రాసిన పాటను విజయశాంతి చేతుల మీదుగా రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. మార్చి 30న ఈ సినిమాను విడుదల చేస్తున్నామని, తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతందన్నారు. -
మెగా ఫ్యాన్స్‌కు ఉగాది సర్ప్రైజ్.. భోళాశంకర్ రిలీజ్ అప్పుడే!
Bhola Shankar Movie Release Date: వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తమిళ హిట్ మూవీ వేదాళంకి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఉగాది పర్వదినం సందర్భంగా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. భోళాశంకర్ మూవీని ఆగస్టు 11, 2023న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. తెలుగు నూతన ఏడాది సందర్భంగా మెగా అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. This Telugu NEW YEAR Begins in Advance with a MEGA upDATE 😎 Mega🌟@KChiruTweets #BholaaShankar 🔱 Releasing WorldWide In Theatres on AUG 11th 2023 ❤️🔥#HappyUgadi @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanth @AKentsOfficial @adityamusic pic.twitter.com/ksqeqldaiA — AK Entertainments (@AKentsOfficial) March 21, 2023 -
మధ్య తరగతి కుటుంబ కథ 'ఇంటింటి రామాయణం' రిలీజ్‌కు రెడీ
మధ్య తరగతి కుటుంబ కథ ‘‘ప్రేక్షకులు చిన్న చిత్రాలను ఆదరించాలి. ముఖ్యంగా ‘ఇంటింటి రామాయణం’ లాంటి మంచి చిత్రాలను ప్రోత్సహించాలి’’ అన్నారు డైరెక్టర్ మారుతి. వీకే నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రల్లో సురేష్ నరెడ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇంటింటి రామాయణం’. ఎస్. నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. నాగవంశీ మాట్లాడుతూ– ‘‘ఇంటింటి రామాయణం’ని ముందు ఓటీటీ కోసమే ప్రారంభించాం. అవుట్‌పుట్ చూశాక థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబ కథగా తెరకెక్కిన చిత్రం ఇది’’ అన్నారు సురేష్ నరెడ్ల. ‘‘మాకు మద్దతుగా నిలిచిన నాగవంశీ, మారుతిలకు థ్యాంక్స్’’ అన్నారు వెంకట్, గోపీచంద్. -
విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్‌కు రెడీ.. మాస్ పోస్టర్ రిలీజ్
విశ్వక్ సేన్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఉగాది సందర్భంగా ఈ నెల 22న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. విశ్వక్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్‌పై కరాటే రాజు (విశ్వక్ సేన్ తండ్రి) నిర్మించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించారు. రిలీజ్ డేట్ ప్రకటించి, విడుదల చేసిన పోస్టర్లో క్లాస్‌తో పాటు మాస్ లుక్‌లో కనిపించారు విశ్వక్ సేన్. ‘‘దాస్ కా ధమ్కీ’ని తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం. ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: దినేష్ కె. బాబు, సంగీతం: లియోన్ జేమ్స్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హీరో గౌతమ్ కార్తీక్ ‘ఆగస్ట్ 16, 1947’.. రిలీజ్ డేట్ వచ్చేసింది
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ఒక పల్లెటూరిలో జరిగిన కథతో రూపొందించిన హిస్టారికల్ మూవీ ‘ఆగస్ట్ 16, 1947’. గౌతమ్ కార్తీక్, రేవతి జంటగా ఎన్.ఎస్. పాన్కుమార్ దర్శకత్వంలో దర్శకుడు ఏఆర్ మురుగదాస్, ఓం ప్రకాష్ భట్, నర్సీరామ్ చౌదరి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, ఇంగ్లిష్ భాషల్లో ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నట్లు బుధవారం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘‘ప్రేక్షకులను ఈ సినిమా స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లోకి తీసుకెళ్తుంది. మంచి అనుభూతినిస్తుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సహనిర్మాత: ఆదిత్య జోషి. -
ఓటీటీకి 'రైటర్ పద్మభూషణ్'.. రిలీజ్ డేట్ ఫిక్స్
కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. టీనా శిల్పరాజ్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఓటీటీ రైట్స్‌ను జీ5 దక్కించుకుంది. ఈనెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. అసలు కథేంటంటే.. పద్మ భూషణ్ అలియాస్ రైటర్ పద్మభూషణ్(సుహాస్) విజయవాడలో లైబ్రేరియన్‌గా పని చేస్తుంటాడు. ఎప్పటికైనా గొప్ప రైటర్ కావాలని కలలు కంటాడు. అతని ఇష్టాన్ని ప్రోత్సహిస్తుంటారు తండ్రి మధుసూధన్‌రావు(అశిష్ విద్యార్థి), తల్లి సరస్వతి(రోహిణి). పద్మభూషన్ కష్టపడి ‘తొలి అడుగు’ అనే ఒక పుస్తకాన్ని రాస్తాడు. పేరెంట్స్‌కి తెలియకుండా అప్పుచేసి మరీ ఆ పుస్తకాన్ని పబ్లీష్ చేయిస్తాడు. కానీ ఆ పుస్తకాన్ని ఎవరూ కొనుగోలు చేయరు. ఉచితంగా ఇచ్చినా చదవరు. దీంతో తీవ్ర నిరాశకు గురవుతాడు. కట్ చేస్తే.. పద్మ భూషన్ పేరుతో మార్కెట్లోకి ఓ పుస్తకం వస్తుంది. అది బాగా సేల్ అవుతుంది. అంతేకాదు అతని పేరు మీద బ్లాగ్ కూడా రన్ అవుతుంది. దీంతో పద్మభూషన్ సెలెబ్రెటీ అవుతాడు. మేనల్లుడు గొప్ప రైటర్ అని కూతురు సారిక(టీనా శిల్పరాజ్)ని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్దమవుతాడు పద్మభూషన్ మామ లోకేంద్ర కుమార్(గోపరాజు రమణ). ఇష్టపడిన మరదలితో పెళ్లి అవుతుందన్న సమయంలో షాకింగ్ ట్విస్ట్ ఎదురవుతుంది. అదేంటి? రైటర్ పద్మభూషణ్ పేరుతో పుస్తకాలు రాసేది ఎవరు? ఎందుకు రాస్తున్నారు? మరదలు సారికాతో పద్మభూషణ్ పెళ్లి జరిగిందా లేదా? గొప్ప రైటర్ కావాలన్న పద్మ భూషణ్ కల నెరవేరిందా? లేదా? అనేదే మిగతా కథ. థియేటర్లలో మిస్సయినావారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. -
నిజ జీవిత సంఘటనల ఆధారంగా 'గీత సాక్షిగా'
ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా నటించిన చిత్రం ‘గీత సాక్షిగా’. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు. చేతన్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఆంథోని మట్టిపల్లి దర్శకత్వం వహించగా.. గోపీ సుందర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. ఇటీవల విడుదలైన మూవీ ఫస్ట్‌లుక్, టీజర్, సాంగ్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని ఈనెల 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. హోలీ సందర్భంగా ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలను తెలియజేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను మార్చి తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. మేకర్స్ మాట్లాడుతూ..' గీత సాక్షిగా చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ అవుతోంది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఇప్పుడు నిజ జీవిత సంఘటనల ఆధారంగా ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందిస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమాలో చరిష్మా కీ రోల్ పోషించింది. ఆమె చుట్టూనే సినిమా కథాంశం తిరుగుతుంటుంది.' అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, రూపేష్ శెట్టి, చరిష్మా, భరణి శంకర్, జయలలిత, అనితా చౌదరి, రాజా రవీంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
సమ్మర్లో వస్తానంటున్న గోపీచంద్.. పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ చాన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన ఖాతాలో ఒక్క సాలిడ్ హిట్ కూడా లేదు. దీంతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ కోసం తెగ కష్టపడుతున్నారు. 'లక్ష్యం', 'లౌక్యం' లాంటి హిట్ చిత్రాల డైరెక్టర్ శ్రీవాస్ డైరెక్షన్లో గోపీచంద్ నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా రామబాణం. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే5న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తుండగా,జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. #Ramabanam hitting Theatres on May 5th!!@DirectorSriwass @vishwaprasadtg @DimpleHayathi @MickeyJMeyer @vivekkuchibotla @peoplemediafcy pic.twitter.com/0sX11TXvc1 — Gopichand (@YoursGopichand) March 4, 2023 -
హీరోగా లాంచ్ అయిన నటుడు దేవరాజ్ కొడుకు.. రిలీజ్‌కు రెడీ
రామ్.! జై శ్రీరామ్.! ఈ మాట సినిమాల సక్సెస్ మంత్రం అయిపోయింది. ఔను, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అంత పెద్ద సక్సెస్ అవడానికి అందులో రామ్ చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో కనిపిస్తే, దాన్ని శ్రీరాముడి పాత్రగా నార్త్ ఆడియన్స్ తీసుకున్నారు మరి. చాలా సినిమాలు ‘జై శ్రీరామ్’ సెంటిమెంట్‌తో ఇటీవలి కాలంలో మంచి విజయాల్ని అందుకున్నాయి. తాజాగా ‘రామ్’ అంటూ ‘వైరం’ సినిమా తొలి పోస్టర్ని వదిలారు. ప్రముఖ నటుడు దేవరాజ్ తనయుడు ప్రణామ్ దేవరాజ్ హీరోగా తెరకెక్కిన ‘వైరం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకి టాలెంటెడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సాయి శివన్ జంపన దర్శకత్వం వహించాడు. త్వరలో ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయనుంది ‘వైరం’ టీమ్. కాగా, నెంబర్ ప్లేట్ మీదున్న ‘నంబర్’ ఒకింత ఇంట్రెస్టింగ్ చర్చకు తెరలేపింది. కారణమేంటంటే, ఆ నెంబర్స్ ‘రామ్’ని తలపిస్తుండడం. హిందీలో ‘ర’ అక్షరాన్ని నెంబర్ ‘2’గా చూపిస్తూ, రెండు ‘1’ నెంబర్లను పేర్కొంటూ, ‘4’ నెంబర్ని ‘మ’ అక్షరాన్ని పోలి వుండేలా ప్రస్తావించారు. పోస్టర్‌లోని ఈ అంశం సంచలనంగా మారే అవకాశం వుంది. ఈ చిత్రానికి జె.మల్లికార్జున నిర్మాత కాగా, సామల భాస్కర్ సినిమాటోగ్రఫీ అందించారు. మహతీ స్వర సాగర్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. -
సమంతతో బాక్సాఫీస్ ఫైట్‌కు దిగిన కోలీవుడ్ హీరో
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం బిచ్చగాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా బిచ్చగాడు-2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా చిత్రీకరణలోనే విజయ్ ఆంటోనీ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన కోలుకోవడంతో తిరిగి షూటింగ్‌ను ప్రారంభించారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ను వదిలారు మేకర్స్. ఏప్రిల్14న ఈ బిచ్చగాడు-2ను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే సరిగ్గా అదేరోజు సమంత నటించిన శాకుంతలం చిత్రం కూడా రిలీజ్ కానుండటంతో ఈసారి బాక్సాఫీస్ వద్ద ఫైట్ కనిపించనుంది. -
వాయిదా పడిన బెల్లంకొండ గణేష్ మూవీ.. కారణమిదే!
బెల్లండకొండ గణేశ్ నటిస్తున్న రెండో చిత్రం నేను స్టూడెంట్ సర్.రాఖి ఉప్పలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అవంతిక దస్సానీ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే రిలీజైప పోస్టర్స్, టీజర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను 10న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే తాజాగా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. విద్యర్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకొని సినిమాను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం. పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. వేసవి సెలవుల్లో కలుద్దాం అంటూ మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా ఓ కాలేజీ స్టూడెంట్‌కి ఎదురైన సమస్య నుంచి అతను ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో సినిమాను తెరకెక్కించారు. #NenuStudentSir! is postponed from March 10th! 👍🏻 Wishing every student all the best for their exams & Meet you all during SUMMER HOLIDAYS ⛱️#GaneshBellamkonda @avantikadassani @NaandhiSATISH #RakhiUppalapati #MahathiSwaraSagar @adityamusic pic.twitter.com/Xf2i3iKH3c — 𝐒𝐕𝟐 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 (@SV2Ent) February 27, 2023 -
లాజిక్ లేని ఎంటర్టైన్మెంట్ చిత్రమిది.. హీరోయిన్గా మేఘా ఆకాశ్
లాజిక్ లేని ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం 'సింగిల్ శంకరుం.. స్మార్ట్ ఫోన్ సిమ్రానుమ్' అని ఆ చిత్ర నిర్మాత కుమార్ తెలిపారు. ఈయన లార్క్ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో మిర్చి శివ కథానాయకుడిగా నటించారు. నటి మేఘా ఆకాష్ అంజు కురియన్ నాయికలుగా నటించారు. మాకాపా, ఆనంద్, సారా, దివ్య, గణేష్ తదితరులు ముఖ్య పాత్ర పోషించినా ఇందులో గాయకుడు మనో ఓ ప్రధానపాత్రలో నటించడం విశేషం. చాలా కాలం తర్వాత ఈయన నటించిన చిత్రం ఇదే. ఈ చిత్రం ద్వారా విఘ్నేష్ షా.పిఎన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. దీన్ని 11:11 ప్రొడక్షన్స్ అధినేత ప్రభు తిలక్ విడుదల చేస్తున్నారు. కాగా బుధవారం సాయంత్రం చిత్ర యూనిట్ స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ వేదికపై నిర్మాత కె.కుమార్ మాట్లాడుతూ తమ సంస్థ నిర్మించిన తొలి చిత్రం ప్యారిస్ జయరాజ్‌ను విడుదల చేసిన ప్రభు తిలక్ మళ్లీ ఈ చిత్రంలో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. ఆయన నిజ జీవితంలో డాక్టర్ కావడంతో తమ మానసిక వేదనను అర్థం చేసుకొని ఎలాంటి లాభనష్టాలను పరిగణలోకి తీసుకోకుండా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అంగీకరించారని చెప్పారు. అదేవిధంగా కరోనా బారిన పడ్డప్పుడు నటుడు మిర్చి శివ తనను ఎంతగానో ఉత్సాహ పరిచి, ఆత్మస్థైర్యాన్ని నింపి అందులోంచి బయట పడేలా చేశారన్నారు. దర్శకుడు చెప్పిన కథ విని ఈ చిత్రంలో నటించడానికి ఆయన అంగీకరించారని చెప్పారు. నటి మేఘా ఆకాష్ చాలా బాగా నటించారని, గాయకుడు మనో కామెడీ పాత్రలో అందరినీ నవ్విస్తారని చెప్పారు. ఈ చిత్రంలో ఆయన మంచి గుర్తింపు వస్తుందన్నారు. -
గ్యాంగ్‌స్టర్‌గా నటుడు జయంరవి.. రిలీజ్ డేట్ వచ్చేసింది
కథల ఎంపిక విషయంలో ఎప్పుడూ చాలా జాగ్రత్తలు తీసుకునే నటుడిగా జయం రవికి పేరుంది. అందుకే ఆయన కెరీర్లో విజయాల శాతం ఎక్కువ. ఇటీవల మణిరత్నం దర్శకత్వం వహించిన భారీ చారిత్రక కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్‌లో టైటిల్ పాత్రను పోషించి శెభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. స్కీన్ర్ సీన్ సంస్థకే వరుసగా మూడు చిత్రాలు చేస్తున్నాడు. అందులో ఒకటి అఖిలన్ చిత్రం. ఇందులో ఆయనకు జంటగా నటి ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా నటి తాన్యారవిచంద్రన్ మరో నాయకిగా ఎంపికైంది. ఎన్.కల్యాణ్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఉత్తర చెన్నై నేపధ్యంలో సాగే ఇందులో జయంరవి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఇక శ్యామ్ సీఎస్.సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా అఖిలన్ చిత్రాన్ని మార్చి 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా ఈ చిత్రం తరువాత జయంరవి నటుడు విక్రమ్, కార్తీ, విక్రమ్ ప్రభు, శరత్‌కుమార్, త్రిష, ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించిన పొన్నియిన్ సెల్వన్– 2 ఏప్రిల్ 28న తెరపైకి రానుంది. ఇవి కాకుండా జయం రవి ఇరైవన్, సైరన్ వంటి చిత్రాల్లోనూ నటిస్తున్నారు. వీటిలో నయనతారతో జత కడుతున్న ఇరైవన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా ఈయన నటించిన చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్ విడుదలకు సిద్ధం అవుతుండడం విశేషం. -
‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’ మూవీ రిలీజ్ డేట్ అప్పుడే
యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ కీలక పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ'. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మహా శివరాత్రి పర్వదినాన ఈ నెల 18న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ...‘‘రేలంగి నరసింహారావు ఎన్నో విజయవంతంమైన చిత్రాలు తీశారు. ఇది ఆయన చేస్తున్న 76వ చిత్రం. చక్కని కథతో తెరకెక్కించారు. మా టీమ్ అంతా ఇది మన సినిమా అని ఆప్యాయంగా పని చేశారు.కాశ్మీర్, హైదరాబాద్ ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో చిత్రీకరణ చేశాం. అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. పాటలు చక్కగా కుదిరాయి. ఇందులో కామెడీ, హారర్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. రీసెంట్ గా ప్రసాద్ లాబ్స్‌లో చాలామంది కి సినిమా చూపించాం. అందరికీ బాగా నచ్చింది. చిన్న సినిమాలను ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు. అలానే ఈ సినిమాకి కూడా మంచి ఆదరణ లభిస్తుంది అని అనుకుంటున్నాం అని పేర్కొన్నారు. -
సమంత ‘శాకుంతలం’ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మూవీ టీం
స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన శాకుంతలం ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 14న శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్ల తాజాగా ప్రకటన ఇచ్చారు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణ శేఖర్ పౌరాణిక ప్రేమ కావ్యంగా శాకుంతలంను తెరకెక్కించారు. చదవండి: ప్రకాశ్ కామెంట్స్‌పై ఘాటుగా స్పందించిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ ఇప్పటికే ఈ సినిమా ప్రచార పోస్టర్లు, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈ చిత్రంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా సమంత లీడ్ రోల్ చేస్తున్న ఈ మూవీ మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించాడు. అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ భరతుడి పాత్ర పోషించగా.. ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు, గౌతమి, మధుబాలలు కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. The Love that was forgotten... An unforgettable tale of Love that remains🦢#Shaakuntalam in theatres worldwide on April 14🤍@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth #ShaakuntalamOnApril14 pic.twitter.com/sUG21bjYUM — Gunaa Teamworks (@GunaaTeamworks) February 10, 2023 -
సెన్సార్ పూర్తి చేసుకున్న చెడ్డి గ్యాంగ్ తమాషా.. రిలీజ్ డేట్ ఫిక్స్
సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాణ సారధ్యంలో అబుజా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం చెడ్డీ గ్యాంగ్ తమాషా. ఈ చిత్రంలో గాయత్రి పటేల్ హీరోయిన్గా నటించింది. రీసెంట్గా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 10న ఈ మూవీని విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా నిర్మాత సిహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. ‘మా చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తిన్నాము. చదవండి: కాంతార 2పై కీలక అప్డేట్ ఇచ్చిన రిషబ్ శెట్టి సినిమా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలన్ని ఈ మూవీలో ఉన్నాయి. తప్పకుండా చెడ్డి గ్యాంగ్ తమషా ప్రక్షకులను ఆకట్టుకుంటుంది. టైటిల్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, టైటిల్ టిజర్ ను ప్రముఖ నటుడు సునీల్, టీజర్‌ను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ , ట్రైలర్‌ను హాస్య బ్రహ్మ బ్రహ్మానందం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్ ట్రైలర్‌తో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బిజినెస్ పరంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము. మా తోలి ప్రయత్నంను ఆశీర్వదించండి’ అని అన్నారు. -
ఇది నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా : సుస్మితా కొణిదెల
సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ జంటగా ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి శోభన్ బాబు’. సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. సంతోష్ శోభన్ మాట్లాడుతూ–‘‘1970 నేపథ్యంలో ఓ పల్లెటూరులో జరిగే అందమైన కథ ఇది’’ అన్నారు. ‘‘నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా ఇది’’ అన్నారు నిర్మాత సుస్మిత. ‘‘ఈ సినిమా చూసిన తర్వాత మన కుటుంబ సభ్యులందరూ కలుసుకుంటే బావుంటుందనే ఆలోచన వస్తుంది’’ అన్నారు ప్రశాంత్. ఈ కార్యక్రమంలో నటి గౌరి జి.కిషన్, నిర్మాత విష్ణు ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరణ్య పొట్ల పాల్గొన్నారు. -
అఖిల్ పాన్ ఇండియా మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
అక్కినేని హీరో అఖిల్ నటిస్తోన్న తాజా మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈచిత్రంలో అఖిల్ ఏజెంట్‌గా కనిపించనున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 28న థియేటర్లలో సందడి చేయనుందని అక్కినేని అఖిల్ ట్వీట్ చేశారు. సరికొత్త స్పై థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా టీజర్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ రేంజ్లో ఉండనున్నాయి. వాస్తవంగా ఈ మూవీని 2022లోనే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా వేస్తూ వచ్చారు. ఆ తర్వాత సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని భావించినా వీలు కాలేదు. అయితే కరోనా పాండమిక్ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజా ప్రకటనతో ఏప్రిల్ 28న ఈ చిత్రం విడుదల కానుంది. Brace yourselves...https://t.co/89oFCE8TFL The WILD ONE is coming to theatres on April 28th!#Agent #AgentonApril28th @mammukka @DirSurender @sakshivaidya99 @hiphoptamizha @AnilSunkara1 @VamsiVakkantham @AKentsOfficial @S2C_Offl — Akhil Akkineni (@AkhilAkkineni8) February 4, 2023 -
రిలీజ్‌కు రెడీ అయిన కమెడియన్ యోగిబాబు చిత్రం
ప్రస్తుతం నటుడు యోగిబాబు లేని చిత్రం లేదంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూనే మరోపక్క కథనాయకుడిగానూ బిజీగా ఉన్నారు. ఆయన తాజా చిత్రాల్లో బొమ్మై నాయకి ఒకటి. వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు పా.రంజిత్ నీలం ప్రొడక్షన్స్, వారినీ ఫిలిమ్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. కథా, కథనం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి కేఎస్ సుందర్ సంగీతాన్ని, అదిశయరాజ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని నిర్మాతలు తెలిపారు. ఇటీవల ఒక పాటను విడుదల చేసినట్లు తెలిపారు. కాగా ఈ చిత్రంలోని మరో పాటను శుక్రవారం విడుదల చేస్తామన్నారు. అదే విధంగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బొమ్మై నాయకి చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. చిత్ర కథా కొత్తగా ఉంటుందని, ప్రేక్షకుల ఆదరణను పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు తెలిపారు. -
భూతద్ధం భాస్కర్ నారాయణ రిలీజ్ డేట్ వచ్చేసింది!
శివ కందుకూరి హీరోగా రాశి సింగ్ హీరోయిన్గా నటించిన చిత్రం భూతద్దం భాస్కర్. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించగా మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్లపై స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మార్చి 31న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. దీనికి కూడా చిన్న మోషన్ పోస్టర్‌తో డేట్ ఎనౌన్స్ చేస్తారు. ఈ చిత్రంలో తర్వాత జరగబోయే సన్నివేశాలను ముందుగా ఊహించడం చాలా కష్టంగా ఉంటుందని, ఆరేంజ్‌లో దర్శకుడి స్క్రీన్‌ప్లే వుంటుందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చదవండి: వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ నాటు నాటు.. ఆ పాటేంది? ఆ యాసేంది? నటి ఘాటు రిప్లై -
హనుమాన్ పాన్ వరల్డ్ రిలీజ్ డేట్ వచ్చేసింది
తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అమృతా అయ్యర్ కథానాయిక. చైతన్య సమర్పణలో కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వదిలారు మేకర్స్. ఈ సినిమా మే 12న తెలుగు, హిందీ, మరాఠి, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కానున్నట్లు ప్రకటించారు. భారత్‌తో పాటు అమెరికా, చైనా, జపాన్, యూకే, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఆస్ట్రేలియా, జెర్మనీ, శ్రీలంక, మలేషియా దేశాల్లో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. హనుమంతుడి అనుగ్రహంతో ఓ కుర్రాడికి సూపర్ పవర్ వస్తే ఏం చేస్తాడనేదే సినిమా కథ. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకే రిలీజైన హనుమాన్ టీజర్లో వీఎఫ్ఎక్స్ హాలీవుడ్ స్టాండర్స్‌ను తలదన్నేలా ఉండటంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. #HanuManFromMay12th pic.twitter.com/SIDCSD6wns — Teja Sajja (@tejasajja123) January 9, 2023 చదవండి: -
'వారసుడు' వాయిదా వేస్తున్నాం.. నేనే వెనక్కి తగ్గాను : దిల్‌రాజు
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం 'వారీసు'. తెలుగులో 'వారసుడు' పేరుతో రిలీజ్ అవుతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈనెల 11న ఈ సినిమా విడుదల చేయనున్న్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు బుకింగ్ యాప్స్‌లో ఈ సినిమా కనిపించకపోవడం సందిగ్ధత మొదలైంది. రిలీజ్‌కు రెండు రోజులే ఉన్నా ఇంకా మూవీ టీం క్లారిటీ ఇవ్వకపోవడంతో అసలు ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందా? లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా దీనిపై నిర్మాత దిల్‌రాజు స్పందించారు. తానే ఒక అడుగు వెనక్కి వేశానని, సినిమాను 11కి బదులుగా 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'చిరంజీవి, బాలయ్య సినిమాలకు ఎక్కువ థియేటర్లు కావాలి. అందరు నిర్మాతలు బాగుండాలి. దీంతో నేనే ఒక అడుగు వెనక్కి తగ్గాను. అందరూ నామీద పడి ఏడుస్తున్నారు. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలుంటాయి. ఇండస్ట్రీ పెద్దలతో డిస్కస్ చేసిన తర్వాత సినిమాను రెండు రోజులు ఆలస్యంగా విడుదల వేయాలని నిర్ణయించాం' అంటూ వెల్లడించారు. కాగా తమిళంలో వారీసు రిలీజ్లో ఎలాంటి వాయిదా లేదు. ముందుగా అనుకున్న సమయానికే 11న అక్కడ విడుదల చేయనున్నారు. Dil Raju says that, he will make arrangements to bring Thalapathy @actorvijay to Hyderabad before the #Vaarasudu release on Jan-14. #Varisu pic.twitter.com/Jk8kekLyhs — T H M (@THM_Off) January 9, 2023 -
సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా సినిమా 'మైఖేల్' రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం మైఖేల్. రంజిత్ జేయకొడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ కెరీర్లో తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో తెరెకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతపతి, గౌతమ్ మీనన్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈమూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వదిలారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 3న దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.మైఖేల్ సినిమాలో సందీప్‌కిషన్‌కు జోడీగా మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌషిక్ హీరోయిన్గా నటిస్తోంది. Meet the Man who Loved the Hardest #MICHAEL 🖤 Worldwide only in Theatres on Feb 3rd, 2023 🔥#MichaelfromFEB3rd 👊🏾@VijaySethuOffl @Divyanshaaaaaa @menongautham @anusuyakhasba @jeranjit @itsvarunsandesh @SamCSmusic @SVCLLP @KaranCoffl #NarayandasNarang pic.twitter.com/5NEnI0KZgW — Sundeep MICHAEL Kishan (@sundeepkishan) January 3, 2023 -
వైష్ణవ్ తేజ్, శ్రీలీల మాస్ ఎంటర్టైనర్ వచ్చేస్తోంది..
‘ఉప్పెన’ ఫేమ్ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించి, వైష్ణవ్ తేజ్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో వైష్ణవ్ సరికొత్త మాస్ అవతారంలో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. టైటిల్‌తో పాటు, చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డుడ్లే. A journey of the fierce one, #PVT04 in theatres from this 29 April 2023! 🔥@sreeleela14 #SrikanthNReddy @vamsi84 #Dudley #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/jk0vrf5fPQ — Panja Vaisshnav Tej (@VaisshnavTej) January 2, 2023 -
సమంత 'శాకుంతలం' రిలీజ్ డేట్ ఫిక్స్.. రొమాంటిక్ పోస్టర్ విడుదల
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన సినిమా శాకుంతలం. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది. తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మూవీ టీం. ఫిబ్రవరి 17న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా శాకుంతలంను 3D వెర్షన్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సమంత, దేవ్ మోహన్ రొమాంటిక్ పిక్‌తో ఉన్న స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సమంత శకుంతలగా నటించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్హ ఈ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా డెబ్యూ ఇవ్వనుంది. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Gunaa Teamworks (@gunaa_teamworks) -
విడుదలకు సిద్ధం అవుతున్న త్రిష 'రాంగీ' చిత్రం
తమిళసినిమా: రాంగీ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కారణం పొన్నియిన్ సెల్వన్ ఘన విజయం తరువాత త్రిష నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమా. అదే లైకా ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న ఈ చిత్రాన్ని ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం ఫేమ్ శరవణన్ దర్శకత్వం వహించారు. స్వదేశం నుంచి విదేశాల వరకు సాగే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇన్ని ఆసక్తికరమైన విషయాలున్న రాంగీ చిత్రం ఈ నెల 30వ తేదీ భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చెన్నైలోని ఒక హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. త్రిష మాట్లాడుతూ కుటుంబ నేపథ్యంలో సాగే ఎమోషనల్ యాక్షన్ కథా చిత్రంగా రాంగీ ఉంటుందన్నారు. ఇది తనకు చాలా స్పెషల్ చిత్రం అని పేర్కొన్నారు. చిత్రాన్ని లైకా సంస్థ ఎక్కడా రాజీపడకుండా నిర్మించిందని చెప్పారు. చిత్ర షూటింగ్ కోసం రెండుసార్లు ఉజ్జెకిస్తాన్ వెళ్లినట్లు చెప్పారు. తనతో ఫైట్ మాస్టర్ రాజ్‌కుమార్ యాక్షన్ సన్నివేశాలను చాలా కేర్ తీసుకుని రూపొందించినట్లు తెలిపారు. సాధారణంగా తాను దర్శకుడు చెప్పినట్లు నటించి వెళ్లిపోతానని అయితే ఆ తరువాత సంగీతం, ఎడిటింగ్ వంటి చాలా విషయాలను చిత్ర టీమ్ చేయాల్సి ఉంటుందన్నారు. అవన్నీ కర్టెక్ట్‌గా ఉంటేనే చిత్రం సక్సెస్ అవుతుందన్నారు. ఈ విషయంలో దర్శకుడు శరవణన్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించారని ప్రశంసించారు. నటి త్రిష ఇలా చిత్రం కోసం ఎంతగానో సహకరించారని దర్శకుడు శరవణన్ పేర్కొన్నారు. కరోనా కాలంలో సమయం ఉండడంతో చిత్రానికి రెండుసార్లు ఎడిటింగ్ చేసినట్లు తెలిపారు. ఈ కథను ఓకే చేసిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌కు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు.