నందమూరి బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం అఖండ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2 తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆ మూవీకి సంబంధించి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ మేరకు అఖండ-2 తాండవం పేరుతో ప్రోమోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తోన్న ఈ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో బాలయ్య డైలాగ్ అభిమానులను అలరిస్తోంది. ఇందులో బాలయ్య యాక్షన్ ఉగ్రరూపం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు.
The protector of Dharma will rage a powerful battle 🔱#Akhanda2 - Thaandavam shoot begins 💥💥
Grand release worldwide for Dussehra on SEPTEMBER 25th, 2025 ❤🔥
▶️ https://t.co/l2WnhFjwRj
'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @14ReelsPlus… pic.twitter.com/oZeJPHNwQR— 14 Reels Plus (@14ReelsPlus) December 11, 2024
Comments
Please login to add a commentAdd a comment