
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వస్తున్న పాన్ ఇండియా చిత్రం శనివారం ఆరంభమైంది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటించనున్నారు. చార్మీ కౌర్ సమర్పణలో పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్‌పై పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. ‘‘ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లో పూరి చాలా కేర్ తీసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా ప్రేక్షకులని అలరించే స్క్రిప్ట్‌ని సిద్ధం చేయడంతో పాటు నటీనటులను కూడా ఎంపిక చేశారు. ప్రీ ప్రోడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ వారంలోనే రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మా చిత్రం విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి సీఈఓ: విషు రెడ్డి.