Puri Jagannadh
-
దీన స్థితిలో పావలా శ్యామల.. సాయం చేసిన పూరీ తనయుడు
సీనియర్ నటి పావలా శ్యామల (Pavala Syamala) కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల ఆమె ఆరోగ్యం మరింత దిగజారింది. కనీసం మాట్లాడేందుకు కూడా శరీరం సహకరించడం లేదు. ఎవరైనా దయతలచి ఆదుకోమని చేతులెత్తి వేడుకుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో చూసిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ చలించిపోయాడు.ఆర్థిక సాయంహైదరాబాద్ శివార్లో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీలో నివాసముంటున్న శ్యామలను కలుసుకున్నాడు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని రూ.1 లక్ష ఆర్థిక సాయం చేశాడు. దీంతో శ్యామల ఎమోషనలైంది. డబ్బు ఎవరైనా సంపాదిస్తారు కానీ మంచి మనసు మాత్రం ఎవరూ సంపాదించలేరు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని ఆశీర్వదించింది.చదవండి: సైఫ్‌ను ఆవేశంతో పొడిచాడు.. నా నగల జోలికి వెళ్లలేదు: కరీనా -
దేవుడి పేరుతో ఉపవాసం ఉండండి : పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh) కొన్నాళ్లుగా యూట్యూబ్ వేదికగా ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. పూరి నిర్వహిస్తున్న ఈ పాడ్‌కాస్ట్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. సరికొత్త విషయాలను చెబుతూ తన అభిమానులకు జ్ఞానంతో పాటు కొన్ని విషయాల్లో ధైర్యాన్ని కూడా అందిస్తున్నాడు. తాజాగా ఈ డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ ‘ఆటోఫజీ’ అనే పదానికి అర్థం వివరిస్తూ దాని వెనుక ఉన్న కథను చెప్పాడు.‘‘ఆటోఫజీ’అనేది ఓ గ్రీకు పదం. ఆటో అంటే సెల్ఫ్ అని, ఫజీ అంటే తినడం అని అర్థం. దీన్నే ఇంగ్లీష్‌లో సెల్ఫ్ ఈటింగ్ అంటారు. ఇది శరీరంలో జరిగే జహన ప్రక్రియ. మన శరీరంలో ఉన్న పనికి రాని, దెబ్బతిన్న కణాలను మన శరీరమే తినేస్తుంది. ఆటోఫజీ(Autophagy) అనేది శరీరంలో జరిగే రీసైక్లింగ్ ప్రక్రియ. మన ఆరోగ్యానికి హానికలిగించే ఏ పదార్థం ఉన్నా, దాన్ని కూడా బయటకు పంపుతుంది. అలాగే, దెబ్బతిన్న ప్రొటీన్లను తీసేస్తుంది. ఈ ఆటోఫజీ వల్ల మన మెటబాలిజం పెరిగి, మరింత శక్తి చేకూరుతుంది. వృద్ధాప్య ఛాయలు కనపడకుండా చేస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్‌లాంటి రోగాలు రాకుండా చేస్తుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు, వ్యాయామం చేసినప్పుడే ఈ ఆటోఫజీ సక్రమంగా జరుగుతుంది. హీట్ అండ్ కోల్డ్ థెరపీలోనూ బాగా పనిచేస్తుంది. దీని వల్ల మన జీవన కాలం పెరుగుతుంది. మన ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. అందుకే పెద్దలు ఉపవాసం అలవాటు చేశారు. మీరు కూడా ఏదో ఒక దేవుడి పేరు చెప్పి, అప్పుడప్పుడు ఉపవాసాలు చేయండి. మీ వ్యాధి నిరోధకశక్తి, మెదడు పనితీరు పెరుగుతుంది. రోజూ వ్యాయామం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మంచిది. మన టిష్యులు రిపేర్ అయి, శరీరంలో హీలింగ్ ప్రక్రియ వేగం అవుతుంది. జపాన్‌కు చెందిన యష్నోరి అనే బయాలజిస్ట్ ఈ ఆటోఫజీ గురించి మొదట కనుక్కొన్నాడు. అతడికి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఉపవాసాలు, వ్యాయామాలు, చన్నీటి స్నానాల వల్ల ఆటోఫజీ యాక్టివేట్ అయి, ఆరోగ్యంగా ఉంటారు. దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే, మీ డాక్టర్‌ను సంప్రదించండి’ అని పూరి అన్నారు. ఇక సినిమాల విషయాలకొస్తే..పూరి ఇటీవల తెరకెక్కించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్దా బోల్తా కొట్టాయి. భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన ‘లైగర్’ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా తీసిన డబుల్ ఇస్మార్ట్ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో పూరి కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం పలు కథలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ స్టార్ హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
రవితేజకు 'నంది అవార్డు' తెచ్చిన సినిమా రీరిలీజ్‌పై ప్రకటన
మాస్ మహారాజా రవితేజ- డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా రీరిలీజ్ కానుంది. ఈమేరకు తాజాగా విడుదులైన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 2008లో విడుదలైన 'నేనింతే' చిత్రంలో రవితేజ,శియా గౌతం జోడీగా మెప్పించారు. పూరి దర్శకత్వానికి చక్రి సంగీతం తోడైతే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మ్యూజికల్‌గా ఈ చిత్రంలోని చాలా పాటలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి.సుమారు 16 ఏళ్ల తర్వాత నేనింతే చిత్రం రీరిలీజ్ కానుంది. రవితేజ బర్త్‌డే సందర్భంగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు చిత్ర మేకర్స్ ప్రకటించారు. ఈమరకు ఒక పోస్టర్‌ను కూడా అభిమానులతో పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో తమ టాలెంట్ చూపించాలని చాలామంది హైదరాబాద్ వస్తుంటారు. అలా కృష్ణ నగర్లో అడుగుపెట్టిన వారి కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ.. దర్శకుడు పూరి జగన్నాథ్ నేనింతే మూవీని తెరకెక్కించాడు. చిత్ర పరిశ్రమలో సక్సెస్ కావడం వెనుక దాగి ఉన్న కష్టాలను చాలా ఎమోషనల్‌గా ఈ మూవీలో పూరి చూపించాడు. ఈ మూవీ కమర్షియల్‌గా ఫెయిల్యూర్ అయినప్పటికీ ఉత్తమ నటుడిగా రవితేజకు నంది అవార్డు దక్కింది. ఇదే చిత్రానికి గాను ఉత్తమ మాటల రచయితగా పూరీ జగన్నాథ్, ఉత్తమ ఫైట్ మాస్టర్స్‌గా రామ్ లక్ష్మణ్‌లకు నంది అవార్డ్స్ లభించాయి.నేనింతే సినిమాలో రవితేజకు జోడీగా శియా గౌతమ్ హీరోయిన్గా తొలి పరిచయం అయింది. ఆమెకు అదితి గౌతమ్ అని మరో పేరు కూడా ఉంది. నేనింతే చిత్రంలో శియా నటనకు మంచి గుర్తింపు దక్కింది. అయినా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే, ముంబయికి చెందిన వ్యాపార వేత్తతో రీసెంట్గా ఆమె పెళ్లి కూడా అయిపోయింది. నేనింతే చిత్రంలో బ్రహ్మానందం, వేణుమాధవ్, సుప్రీత్, సుబ్బరాజు కీలక పాత్రల్లో కనిపించారు. ఇదే మూవీలో డైరెక్టర్లు హరీష్ శంకర్, వీవీ వినాయక్, కోన వెంకట్‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కూడా గెస్ట్ రోల్స్ కనిపించడం విశేషం. -
'ఇలాంటివి ఇండియాలో కూడా దొరికితే'.. పూరి జగన్నాధ్ ఆసక్తికర సందేశం
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చివరిసారిగా డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను హీరోయిన్ ఛార్మి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మించారు.ఇక సినిమాల విషయం పక్కనపెడితే పూరి జగన్నాధ్ తన మోటివేషనల్ వీడియోలతో అభిమానులను అలరిస్తుంటారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీటిని విడుదల చేస్తుంటారు. ఇటీవల వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తున్న డైరెక్టర్ పూరి జగన్నాధ్ తాజాగా మరో ఆసక్తికర సబ్జెక్ట్‌తో అభిమానులను పలకరించారు. అదేంటో మీరు చూసేయండి.అమెరికాకు చెందిన ప్రముఖ డిజైనర్ ఏంజెలా లూనా తయారు చేసిన జాకెంట్ గురించి ఈ వీడియోలో ప్రస్తావించారు. మనదేశంలో ఎలాంటి నీడ లేని వారికి ఇది చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. ఎవరైనా ఇండియాలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తే ఎందరో అభాగ్యులకు మేలు చేసిన వారవుతారని వీడియోలో మాట్లాడారు.పూరి జగన్నాధ్ తన మ్యూజింగ్‌లో మాట్లాడుతూ..' యుద్ధాల కారణంగా ఇంటిని వదిలి కట్టుబట్టలతో పెళ్లాం పిల్లలను తీసుకుని వేరే ప్రాంతాలకు వలసపోతున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇతర దేశాల్లో వీరికి ఇల్లు అనేదే ఉండదు. ముఖ్యంగా నైజీరియా, హోండురస్, ఇరాక్, సూడాన్, ఇండియా, చైనా, ఇథియోపియా, కాలిఫోర్నియా, న్యూయార్క్ ఫ్లోరిడాలో ఇల్లులేని వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇండియాలో 4 కోట్ల మంది అడుక్కు తినేవాళ్లున్నారు. ప్రపంచ జనాభాలో ఐదుశాతం మందికి ఇల్లులేదు. వీళ్ల కష్టాలు వర్ణనాతీతం.కొంతమంది వడదెబ్బ, తీవ్రమైన చలికి తట్టుకోలేక చనిపోతున్నారు. ఇల్లు వాకిళ్లు వదిలేసి ఒక మనిషి, తనకు అవసరమైనవి మాత్రమే తీసుకుని ఒక బ్యాగ్‌లో వేసుకుని బయలు దేరాల్సి వస్తే ఏం వేయాలో తెలియదు. దేన్నీ వదులుకోలేం. అలాంటి బ్యాగ్ చాలా బరువుగా ఉంటుంది. దాన్ని పట్టుకుని మోసుకుంటూ నడవాలంటే ఎంత కష్టం. బట్టలు, గిన్నెలు, స్టవ్ చాలా బరువు ఉంటాయి. ఆఖరికి దుప్పటి పట్టుకెళ్లాలన్న కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది. ఇక టెంట్‌ను మోసుకువెళ్లే శక్తి ఉండదు' అని మాట్లాడారు.పూరి చెబుతూ.. 'ఇలాంటి వారు వసతి సౌకర్యం లేకపోవడం వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. ఇలాంటి వారి కోసం న్యూయార్క్‌కు చెందిన ఏంజెలా లూనా అనే డిజైనర్ అద్బుతమైన ఐడియాతో సరికొత్త జాకెట్ చేసింది. దాని పేరే జాకెంట్. జాకెట్‌ను, టెంట్‌ను కలిపి చేసిన డిజైన్. దీన్ని మీరు జాకెట్లా వేసుకోవచ్చు. అలా ఎక్కడైనా పడుకోవాల్సి వస్తే.. టెంట్‌గా మారిపోతుంది. ఇది ఎంతో మంది సిరియా శరణార్థులను కాపాడింది. చాలా మంది డిజైనర్లు సెలబ్రిటీలు, డబ్బున్న వాళ్లకోసం కోసం లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు. వాటన్నింటి కంటే గ్రేట్ డిజైన్ ఇది. ఒక్కసారి మీరు గూగుల్ చేసి ఏంజెలా లూనా జాకెంట్ డిజైన్ చూడండి. దీన్ని అందరూ ప్రశంసించాలి. అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. అయిే ఈ జాకెంట్ ఇండియాలోకి రాలేదు. ఇలాంటివి మనదేశంలో వస్తే అడక్కునేవాళ్లకు దుప్పట్లు గిప్ట్గా ఇవ్వొచ్చు. ఏదైనా కంపెనీ వీటిని ఇండియాలో వీటిని పరిచయం చేస్తే బాగుంటుందని ఆశ. ఇదే ఐడియాను తీసుకుని తయారు చేసినా, సంతోషమే. ఎంతో మందిని కాపాడిన వాళ్లు అవుతారు. త్వరలోనే జాకెంట్ భారత్‌లో దొరుకుతుందని ఆశిస్తున్నా'అని అన్నారు. -
అలా చేస్తే కచ్చితంగా లీడర్ అవుతారు: పూరి జగన్నాధ్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇటీవల వరుస మ్యూజింగ్స్ రిలీజ్ చేస్తున్నారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా జీవితంలో ఎలా నడుచుకోవాలో తన మాటల ద్వారా మోటివేట్ చేస్తున్నారు. తాజాగా ప్లే ఫూలిష్ అనే కాన్సెప్ట్‌తో మరో కొత్త మ్యూజింగ్‌ను విడుదల చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి.పూరి మ్యూజింగ్స్‌లో మాట్లాడుతూ.. 'ది ఆర్ట్ ఆఫ్ ప్లేయింగ్ ఫూలిష్.. ఈ పోటీ ప్రపంచంలో సక్సెస్ అవ్వడానికి చాలామంది సైకాలజిస్టులు చెప్పే థియరీ ప్లే ఫూలిష్.. అది నీ బిజినెస్, జాబ్‌లో చాలామంది పోటీదారులు, సీనియర్స్, అనుభవజ్ఞులు ఉంటారు. నీకంటే బాగా సక్సెస్ అయినవాళ్లు ఉంటారు. వాళ్లందరినీ స్మూత్‌గా డీల్ చేసే థియరీ ప్లే ఫూలిష్. అంటే నిజంగానే ఫూల్‌లా ఉండటం కాదు. వాళ్ల ముందు తక్కువ నాలెడ్జ్ వాళ్లలా కనిపించడం. ఈ స్ట్రాటజీ మీరింకా నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అవతలి వ్యక్తి చెప్పే మాటలు వినటం నేర్చుకుంటే మనం ఎంత మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? అనే విషయాలు అర్థమవుతాయి. నీ పోటీదారులను ఎప్పుడు శత్రువులుగా చూడొద్దు. వారిని మెంటార్స్‌గా భావించండి. అతను, నువ్వు ఓకే బిజినెస్ చేస్తున్నా.. అతనికంటే నీకు తక్కువ తెలుసనే ఫీలింగ్ రావాలి' అని సూచించారు.ఇదేమీ మానిపులేటేడ్ టాక్టిక్ కాదు.. వాదించడం మానేసి.. జీనియస్‌గా వ్యవహరించడం.. నువ్వు తక్కువ నాలెడ్జ్ వాడిలా కనిపించినప్పుడు.. అవతలివాళ్లు నిన్ను ఇబ్బందిగా భావించరు. నీపై ఫోకస్ పెట్టరు. నీకు తెలిసినా సరే బేసిక్స్ చెప్పమని అడగండి. అలా అడిగితేనే అవతలివాళ్లు ఆనందంగా సమాధానం చెబుతారు. వాళ్లు ఏమనుకుంటున్నారో వినాలి.. అప్పుడే ఎక్కువ నేర్చుకుంటాం. నీవల్ల వాళ్లకి ఇబ్బంది లేదని ఫీలవ్వాలి. అప్పుడే వాళ్ల స్ట్రాటజీలు మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో చర్చలు జరపాలంటే నాలెడ్జ్ చాలా అవసరం. అది నీ సీనియర్స్, పోటీదారుల నుంచి నేర్చుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంది? వాళ్ల స్కిల్స్ ఏంటో మీకు అర్థమవుతాయి. అందుకే మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరైనా చెబితే నేర్చుకుంటా అనేలా ఉండాలి. నీకే ఎక్కువ తెలిసినట్లు మాట్లాడితే.. అవతలి వ్యక్తి ఏది నీతో షేర్ చేసుకోడు. పైగా నువ్వు వాడి దృష్టిలో అహంకారిగా కనిపిస్తావు. అందరితో శత్రుత్వం మనకెందుకు? మీరు ఏదైనా అనుకుంటే అందులో సూచనలు చేయమని అడుగుతూ ఉంటే మంచిది. వాళ్లు మీ జీవితంలో సపోర్టింగ్ పర్సన్ అవుతాం. సోక్రటీస్ ఒకమాట చెప్పాడు. 'నాకు తెలిసింది ఏంటంటే.. ఏమీ తెలియదని'. మనం కూడా అదే ఫాలో అవ్వాలి. ఎప్పుడూ బిగినర్స్ మైండ్ సెట్‌తోనే ఉండాలి. అబ్రహాం లింకన్ ఇలాగే ఉండేవాడట. ఎదుటి వాడి జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయొద్దు. మీకు ఎన్నో స్ట్రాటజీలు అర్థమవుతాయి. ప్లే ఫూలిష్ పవర్ఫుల్. ఈ ఆర్ట్‌లో మాస్టర్ అయితే మీరు లీడర్‌గా మంచి పొజిషన్లో ఉంటారు' అని చెప్పారు.కాగా.. ఈ ఏడాది డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ పోతినేని, కావ్యథాపర్ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని ఛార్మి కౌర్, పూరి జగన్నాధ్ నిర్మించారు. -
అలా చేస్తే సక్సెస్‌ఫుల్‌గా పనికి రాకుండా పోతారు: పూరి జగన్నాధ్
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ ఏడాది డబుల్ ఇస్మార్ట్‌తో ప్రేక్షకులను అలరించాడు. రామ్ పోతినేని, కావ్యథాపర్ జంటగా నటించిన బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో బిగ్‌బుల్‌గా కనిపించారు.సినిమాల విషయం పక్కనపెడితే.. దర్శకుడు పూరి మ్యూజింగ్స్ పేరుతో మోటివేషనల్ సందేశాలు ఇస్తుంటారు. జీవితంలో తను అనుభవాలతో పాటు గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ఇలాంటి వాటిని పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన చేసిన మరో గొప్ప సందేశాన్ని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంటారు. అదేంటో మనం కూడా వినేద్దాం.పూరి మ్యూజింగ్‌లో మాట్లాడుతూ..' చైనాలో లావోజు అనే గ్రేట్ ఫిలాసఫర్ ఉన్నారు. ఆయన 571 బీసీలో జన్మించారు. ఆయనొక మంచి మాట చెప్పారు. నీ ఆలోచనలను గమనించు. ఎందుకంటే అవే నీ మాటలవుతాయి. నీ మాటలే నీ యాక్షన్స్ అవుతాయి. అవే నీ అలవాట్లు.. ఆ తర్వాత అదే నీ క్యారెక్టర్ అవుతుంది. మరి మనకు థాట్స్ ఎలా వస్తాయి. మనం రోజు దేన్నైతే చూస్తామో అవే గుర్తుకొస్తాయి. చదివే పుస్తకాలు, చూసే వీడియోలు, సంభాషణలన్నీ మన ఆలోచనలు మార్చేస్తాయి. పనికిరానివన్నీ చూస్తూ టైమ్ పాస్ చేస్తే అతి తక్కువ కాలంలో మీరు కూడా సక్సెస్‌ఫుల్‌గా పనికి రాకుండా పోతారు. ' అని అన్నారు.ఆ తర్వాత..' మనం మొబైల్లో రోజు ఎన్నో చూస్తుంటాం. రోడ్డెక్కితే ఏదో ఒకటి మనం చూస్తుంటాం. వీటిలో మనం దేనికైనా ఎమోషనల్ అయితే.. అందులోనే మనం కొట్టుకుపోతాం. రోజు నాలెడ్జ్ పెంచుకోకపోయినా ఫర్వాలేదు.. నాన్ సెన్స్ తీసుకోకపోతే చాలు. అందుకే మంచిది, మనకు పనికొచ్చేది మాత్రమే తీసుకుంటే మంచిది. అప్పుడే మన థాట్స్ మారతాయి. మన క్యారెక్టర్‌తో పాటు రాత కూడా మారుద్ది. ' అంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా మన పూరి జగన్నాధ్ చెప్పినవి జీవితంలో పాటిస్తే సక్సెస్ అవ్వాలంటే తప్పకుండా పాటించాల్సిందే. -
ప్రభాస్‌తో పూరి జగన్నాథ్ సినిమా... ఈ సారి డైరెక్షన్ కాదు!
హీరో ప్రభాస్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ మూడో సారి కలసి పని చేయనున్నారని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా ‘బుజ్జిగాడు’(2008), ‘ఏక్ నిరంజన్’(2009) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు పూరి జగన్నాథ్. అయితే మూడోసారి మాత్రం ప్రభాస్ చిత్రాన్ని డైరెక్షన్ చేయడం లేదు పూరి. ‘స్పిరిట్’ చిత్రానికి పూరి జగన్నాథ్ డైలాగులు అందించబోతున్నారని టాక్. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ‘స్పిరిట్’ సినిమాకి డైలాగ్స్ రాసే బాధ్యతను పూరి జగన్నాథ్‌కు సందీప్ రెడ్డి అప్పగించినట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. సందీప్ స్వయంగా అడగడంతో పూరి కూడా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రభాస్‌తో తనకున్న స్నేహ బంధం ఓ కారణం అయితే.. సందీప్ స్టోరీకి డైలాగులు రాస్తే అది మరింతగా రీచ్ అవుతుందన్నది మరో ఆలోచన అట. అందువల్లే ఆయన అంగీకరించి ఉంటారని భోగట్టా. అయితే ఈ విషయంపై స్పష్టత రావాలంటే యూనిట్ అధికారికంగా ప్రకటించే వరకూ వేచిచూడాల్సిందే. ఇదిలా ఉంటే.. ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించే సినిమాపై స్పష్టత రావాల్సి ఉంది. -
యాక్షన్.. కట్.. ఓకే.. చెప్పెదెప్పుడు?
ఓ సినిమా విజయం అనేది డైరెక్టర్ల కెరీర్‌ని నిర్ణయిస్తుంది అంటారు. హిట్టు పడితే వరుస ఆఫర్లు వస్తాయి. అదే ఫ్లాపులొస్తే కెరీర్‌కి బ్రేకులు పడతాయి. నెక్ట్స్ చాన్స్ ఇచ్చే హీరో ఎవరు? అనే ప్రశ్న మొదలవుతుంది. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండానూ అవకాశాలు దక్కుతాయనుకోండి. కానీ కారణం ఏదైనా ప్రస్తుతం కొందరు దర్శకులు మాత్రం ఏ ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేయలేదు. వాట్ నెక్ట్స్? అనే ప్రశ్నకు జవాబు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి.ఆ వివరాల్లోకి వెళదాం... కృష్ణవంశీ పేరు చెప్పగానే కుటుంబ కథా చిత్రాలు గుర్తొస్తాయి. బంధాలు, బంధుత్వాలు, అనురాగం, ఆప్యాయతలు, భావోద్వేగాలను తనదైన శైలిలో తెరకెక్కిస్తుంటారాయన. అంతేకాదు... సమాజంలోని ప్రస్తుత పరిస్థితులు, వాస్తవ ఘటనల నేపథ్యంలోనూ సినిమాలు రూపొందిస్తుంటారు కృష్ణవంశీ. తొలి సినిమా ‘గులాబీ’ నుంచి గత ఏడాది తెరకెక్కించిన ‘రంగ మార్తాండ’ వరకూ మధ్యలో ‘నిన్నే పెళ్లాడతా, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ, శశిరేఖా పరిణయం, గోవిందుడు అందరివాడేలే’...’ ఇలా పలు హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు కృష్ణవంశీ. కాగా 2017లో వచ్చిన ‘నక్షత్రం’ తర్వాత దాదాపు ఆరేళ్లు గ్యాప్ తీసుకున్నారాయన. ఆ తర్వాత వచ్చిన ‘రంగమార్తాండ’ (2023) సినిమా ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించి, కన్నీరు పెట్టించింది. ఆ చిత్రం తర్వాత కృష్ణవంశీ ప్రాజెక్టుపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా లేదు. సో... నెక్ట్స్ ఏంటి? అంటే వెయిట్ అండ్ సీ. ఒకప్పుడు కమర్షియల్ హిట్స్‌కి కేరాఫ్‌గా నిలిచిన పూరి జగన్నాథ్ ఇప్పుడు సక్సెస్ వేటలో ఉన్నారు. ‘బద్రి, ఇడియట్, పోకిరి, దేశ ముదురు, చిరుత, బుజ్జిగాడు, బిజినెస్‌మేన్, టెంపర్, పైసా వసూల్, ఇస్మార్ట్ శంకర్’ వంటి ఎన్నో హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకున్నారు పూరి. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత ఆయన్ని హిట్ వరించలేదు. విజయ్ దేవరకొండ హీరోగా పూరి తెరకెక్కించిన పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘లైగర్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్‌గా వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక΄ోయింది. దీంతో నెక్ట్స్ పూరి జగన్నాథ్ ్ర΄ాజెక్ట్ ఏంటి? ఏ హీరోతో ఆయన సినిమా చేయనున్నారు? వంటి ప్రశ్నలకి జవాబు లేదు. ప్రభాస్, పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలకు ఆయన హిట్స్ ఇచ్చారు. ప్రస్తుతం వారంతా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో ఇప్పటికిప్పుడు పూరి జగన్నాథ్‌కి డేట్స్ ఇచ్చే వీలు లేదు. ఇలాంటి సమయంలో ఆయన తర్వాతి సినిమా ఏంటి? అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలతో ΄ాటు ప్రేక్షకుల్లో నెలకొంది. సరైన కథ, కాంబినేషన్ కుదిరితే మళ్లీ ఆయన బౌన్స్ బ్యాక్ అవడం కష్టమేమీ కాదు. మాస్ సినిమాలు తీయడంలో వీవీ వినాయక్ శైలి ప్రత్యేకం. హీరోలకు మాస్ ఎలివేషన్స్ ఇవ్వడంలోనూ ఆయనకి ఆయనే సాటి. అలాగే కమర్షియల్ సినిమాలకు కొత్త విలువలు నేర్పిన దర్శకుడిగా వినాయక్‌కి పేరుంది. ‘ఆది, చెన్నకేశవ రెడ్డి, దిల్, ఠాగూర్, బన్ని, లక్ష్మి, యోగి, కృష్ణ, అదుర్స్, నాయక్, ఖైదీ నంబర్ 150’ వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారాయన. అయితే చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబర్ 150’ (2017) సినిమా హిట్ తర్వాత వినాయక్ తీసిన ‘ఇంటెలిజెంట్’ (2018) సినిమా నిరాశపరచింది. ఆ చిత్రం తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు వినాయక్. ప్రభాస్ హిట్ మూవీ ‘ఛత్రపతి’ సినిమాని బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో హిందీలో ‘ఛత్రపతి’ (2023) పేరుతోనే రీమేక్ చేశారు. ఆ తర్వాత ఆయన్నుంచి కొత్త ్ర΄ాజెక్ట్ ప్రకటన ఏదీ రాలేదు. ఆ మధ్య ‘దిల్’ రాజు నిర్మాతగా వీవీ వినాయక్ హీరోగా ఓ సినిమా రానుందంటూ వార్తలు వచ్చాయి. ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్‌ని సైతం మార్చుకున్నారు వినాయక్. అయితే ఆ సినిమా పట్టాలెక్కలేదు. మరి ఇప్పుడు వినాయక్ ప్రయాణం డైరెక్టర్‌గానా? నటుడిగానా? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి. కల్యాణ్‌రామ్ హీరోగా రూపొందిన ‘అతనొక్కడే’ (2005) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు సురేందర్ రెడ్డి. ‘కిక్, రేసుగుర్రం, ధృవ, సైరా నరసింహారెడ్డి’ వంటి విజయవంతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారాయన. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. అయితే అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘ఏజెంట్’(2023) సినిమా భారీ అంచనాలతో విడుదలైనా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేక΄ోయింది. ఆ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి తెరకెక్కించబోయే మూవీపై ఇప్పటివరకూ ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు. ఫలానా హీరోతో ఆయన నెక్ట్స్ మూవీ ఉంటుందనే టాక్ కూడా ఇప్పటివరకూ ఎక్కడా వినిపించలేదు. మరి... ఆయన తర్వాతి సినిమా ఏంటి? అనే ప్రశ్నకు జవాబు రావాలంటే వేచి ఉండాలి. ప్రభాస్ హీరోగా నటించిన ‘మున్నా’ (2007) మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు వంశీ పైడిపల్లి. తెలుగులో ఇప్పటివరకూ ఆయన తీసింది ఐదు చిత్రాలే అయినా (మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి) అన్నీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ (2019) సినిమా తర్వాత ఆయన మరో తెలుగు సినిమా చేయలేదు. విజయ్ హీరోగా తమిళంలో ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’) సినిమా చేశారు. ఈ చిత్రం విడుదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఆయన తర్వాతి ్ర΄ాజెక్టుపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. ఆ మధ్య షాహిద్ కపూర్ హీరోగా వంశీ ఓ బాలీవుడ్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారనే వార్తలొచ్చాయి. తెలుగు సినిమాలని డబ్బింగ్ చేసి హిందీలో విడుదల చేసే గోల్డ్ మైన్ అనే సంస్థ ఈ ్ర΄ాజెక్టును నిర్మించనుందని, ఆగస్టులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందనే వార్తలు వినిపించినా ఈ ్ర΄ాజెక్టు ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. మరి వంశీ పైడిపల్లి తర్వాతి చిత్రం టాలీవుడ్లోనా? బాలీవుడ్లోనా? లేకుంటే మరో భాషలో ఉంటుందా? అనేది చూడాలి. దర్శకుడు పరశురాం ‘గీతగోవిందం’ (2018) సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాదు... హీరో విజయ్ దేవరకొండని వంద కోట్ల క్లబ్‌లోకి తీసుకెళ్లారు పరశురాం. ఆ సినిమా హిట్ అయినా నాలుగేళ్లు వేచి చూశారాయన. ఆ తర్వాత మహేశ్‌బాబు హీరోగా ‘సర్కారువారి ΄ాట’ (2022) సినిమా తీసి, హిట్ అందుకున్నారు. అనంతరం విజయ్ దేవరకొండ హీరోగా‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం తీశారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఫర్వాలేదనిపించుకుంది. ఈ సినిమా రిలీజై ఆర్నెళ్లు దాటినా పరశురాం తర్వాతి సినిమాపై స్పష్టత లేదు. గతంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా చేయనున్నారనే వార్తలు వినిపించినా ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ‘ఫ్యామిలీ స్టార్’ నిర్మించిన నిర్మాత ‘దిల్’ రాజు బ్యానర్లోనే పరశురామ్ మరో సినిమా చాన్స్ ఉందని టాక్. మరి ఆయన నెక్ట్స్ ్ర΄ాజెక్ట్ ఏంటి? అనేది వేచి చూడాలి. ఇరవయ్యేళ్ల ప్రయాణంలో ఏడు సినిమాలు తీశారు దర్శకుడు మెహర్ రమేశ్. వాటిలో రెండు కన్నడ సినిమాలున్నాయి. ఆయన తీసిన ఐదు తెలుగు చిత్రాలు ‘కంత్రి, బిల్లా, శక్తి, షాడో, బోళా శంకర్’. వెంకటేశ్‌తో తీసిన ‘షాడో’ (2013) తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు మెహర్ రమేశ్. అయితే ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత చిరంజీవి రూపంలో అదృష్టం ఆయన్ని వరించింది. ‘బోళా శంకర్’ సినిమా చేసే మంచి అవకాశం ఇచ్చారు చిరంజీవి. 2023 ఆగస్టు 11న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా రిలీజై ఏడాదికి పైగా అయినప్పటికీ తన తర్వాతి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. మరి.. మెహర్ రమేశ్ నెక్ట్స్ మూవీ ఏంటి? వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే... 2021న విడుదలైన నితిన్ ‘చెక్’ మూవీ తర్వాత డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి తర్వాతి సినిమాపై ఇప్పటికీ స్పష్టత లేదు. అలాగే ‘అన్నీ మంచి శకునములే’ (2023) తర్వాత దర్శకురాలు నందినీ రెడ్డి నెక్ట్స్ ్ర΄ాజెక్ట్ ఏంటి? అనేదానిపై క్లారిటీ లేదు. అదే విధంగా ‘ఆర్ఎక్స్ 100’ మూవీ ఫేమ్ అజయ్ భూపతి ‘మంగళవారం’ (2023) సినిమా రిలీజై దాదాపు ఏడాది కావస్తున్నా ఆయన తర్వాతి చిత్రంపై ఎలాంటి అప్డేట్ రాలేదు. కాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘పెదకాపు 1’ సినిమా 2023లో విడుదలైంది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘పెదకాపు 2’ ఉంటుందని చిత్రయూనిట్ గతంలో ప్రకటించినా ఇప్పటివరకూ ఎలాంటి వివరాలు తెలియరాలేదు. అలాగే శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ‘ఖుషి’ సినిమా విడుదలై ఏడాది దాటి΄ోయినా ఆయన తర్వాతి సినిమా ఏంటి? అనేదానిపై ఎలాంటి ప్రకటన లేదు. అదే విధంగా ‘ఘాజీ’ మూవీ ఫేమ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి నెక్ట్స్ ప్రాజెక్ట్‌పైనా ఎలాంటి అప్డేట్ లేదు. ఆయన తెరకెక్కించిన ‘ఐబీ 71’ (2023) అనే హిందీ చిత్రం రిలీజై ఏడాదిన్నర దాటినా తర్వాతి సినిమా టాలీవుడ్లో ఉంటుందా? బాలీవుడ్లో ఉంటుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.– డేరంగుల జగన్ -
పూరితో అఖిల్ మూవీ ఫిక్స్..
-
టాప్ హీరో ఫ్యామిలీ నుంచి పూరీ జగన్నాథ్‌కు ఆఫర్
టాలీవుడ్లో మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా పూరీ జగన్నాథ్‌కు గుర్తింపు ఉంది. తమ హీరో ఒక్క సినిమా అయినా పూరీ డైరెక్షన్లో చేయాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. అయితే, లైగర్,డబుల్ ఇస్మార్ట్ వంటి వరుస ప్లాపులతో ఆయన ప్రస్తుతం సతమతం అవుతున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన ఏ హీరోతో సినిమా చేస్తారా..? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈసారి బలమైన కథతో పాటు ఇండస్ట్రీలో హిట్ కొట్టాలని ఆయన పక్కా ప్లాన్‌తో రానున్నారని టాక్.వరసు ప్లాపులతో ఉన్న దర్శుకుడితో సినిమా చేసేందుకు చాలామంది హీరోలు జంకుతారు. కానీ, పూరీ కాస్త డిఫరెంట్ ఒటమి వస్తే ఎలా నిలబడాలో తెలిసిన డైరెక్టర్.. అందుకే ఆయనకు అక్కినేని కుటుంబం నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అక్కినేని హీరోలకు కూడా ఈ మధ్య పెద్దగా హిట్లు పడలేదు. నాగార్జున (నా సామి రంగా), నాగ చైతన్య (కస్టడీ) సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసినా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక అఖిల్ చివరి సినిమా ఏజెంట్. ఈ చిత్రం వచ్చి రెండేళ్లు దాటుతుంది. ఆయనా, అతని నుంచి సినిమా ప్రకటన రాలేదు. అయితే, ఇప్పుడు పూరీ- అఖిల్ కాంబినేషన్లో సినిమా రానుందని ఎక్కువ ప్రచారం జరుగుతుంది. భారీ విజయం కోసం ఎదురుచూస్తున్న వారిద్దరూ కసితో ఒక ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలని ఉన్నారట. నాగార్జునకు శివమణి, సూపర్ వంటి సూపర్ హిట్లు ఇచ్చిన పూరీ ఇప్పుడు అఖిల్‌తో భారీ హిట్ కొట్టే ప్లాన్‌లో ఉన్నారట. ఇదే నిజమైతే ఈ భారీ ప్రాజెక్ట్‌కు రామ్ చరణ్ నిర్మాతగా ఉండే ఛాన్స్ ఉంది. -
టాలీవుడ్ ఎప్పటికీ మర్చిపోని డైరెక్టర్.. కానీ ఇప్పుడిలా చూస్తుంటే! (ఫొటోలు)
-
బాలయ్య మూవీతో.. పూరి పంజా విసిరేనా..
-
బాలయ్యతో మరోసారి పూరి..
-
సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన డబుల్ ఇస్మార్ట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. బ్లాక్ బస్టర్ హిట్ ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే డబుల్ ఇస్మార్ట్ అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేస్తోంది. కాగా.. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్ కీలకపాత్ర పోషించారు. బిగ్‌బుల్‌గా అభిమానులను అలరించారు. థియేటర్లలో చూడడం మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.కథేంటంటే..ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని) తన తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే పోగొట్టుకుంటాడు. తన తల్లి పోచమ్మ (ఝాన్సీ)ని చంపిన బిగ్ బుల్ (సంజయ్ దత్)ను పట్టుకునే పనిలో ఇస్మార్ట్ శంకర్ పడతాడు. మరో వైపు బ్రెయిన్ ట్యూమర్ వల్ల మూడు నెలల్లోనే చనిపోతానని బిగ్ బుల్‌కు తెలుస్తుంది. దీంతో తాను ఎలాగైనా బతకాలని అనుకుంటాడు. థామస్ (మకరంద్ దేశ్ పాండే) మెమోరీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెబుతాడు. ఇస్మార్ట్ శంకర్ అనే వాడికి ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారని, అలా బిగ్ బుల్ మెమోరీనీ ఇస్మార్ట్ శంకర్‌కు ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని థామస్ సూచిస్తాడు.దీంతో ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం దిగుతుంది. మరో వైపు బిగ్ బుల్ కోసం ఇస్మార్ట్ శంకర్ కూడా వెతుకుతుంటాడు. ఇండియాలో బిగ్ బుల్ దిగాడని రా ఏజెన్సీకి తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకుని మెమోరీ ట్రాన్స్ఫర్మేషన్ చేయిస్తాడు బిగ్ బుల్. నాలుగు రోజుల్లోనే ఇస్మార్ట్ శంకర్ కాస్తా బిగ్ బుల్గా మారిపోతాడని చెబుతారు. ఈ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? బిగ్ బుల్‌ను పట్టుకునేందుకు రా ఏం చేస్తుంది? ఈ కథలో ఇస్మార్ట్ శంకర్ ప్రేయసి జన్నత్ (కావ్యా థాపర్) పాత్ర ఏంటి? చివరకు ఇస్మార్ట్ శంకర్ ఏం చేస్తాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మారాల్సిన టైమ్ వచ్చిందేమో?
'మీరు మారిపోయారు సర్'.. పూరీ జగన్నాథ్ తీసిన టెంపర్ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇదే పూరీ జగన్నాథ్‌కి ప్రస్తుత పరిస్థితులకు సరిగా యాప్ట్ అవుతుందేమో? ఎందుకంటే ఒకప్పటి పూరీ వేరు. ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తి వేరు. మరీ ముఖ్యంగా రీసెంట్ రిలీజ్ 'డబుల్ ఇస్మార్ట్' చూస్తుంటే అసలీ సినిమా తీసింది ఈయనేనా అనే సందేహం.(ఇదీ చదవండి: నేను ఒళ్లు దగ్గర పెట్టుకుని చేసిన సినిమా ఇది: పూరి జగన్నాథ్)'బద్రి'లో పవన్ కల్యాణ్ 'నువ్వు నంద అయితే ఏంటి? నేను బద్రీ, బద్రీనాథ్' అన్నప్పుడు... 'ఇడియట్'లో రవితేజ 'కమీషనర్ల కూతుళ్లకి మొగుళ్లు రారా' అన్నప్పుడు గానీ... 'శివమణి'లో నాగార్జున 'నాక్కొంచెం మెంటల్' అన్నప్పుడు.. 'పోకిరి'లో మహేశ్ 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంటే ఆడే పండుగాడు' అన్నప్పుడు.. 'బిజినెస్‌మేన్'లో మహేశ్ 'ముంబైలో బతకడానికి రాలేదు, ఉ* పోయించడానికి వచ్చాను' అన్నప్పుడు.. 'నేనింతే'లో రవితేజ.. సినిమా కోసం డైలాగ్స్ చెప్పినప్పుడు గానీ మూవీ లవర్స్, మాస్ ఆడియెన్స్ ఉర్రూతలూగారు. పూరీపై ఇష్టం పెంచుకున్నారు.కానీ రీసెంట్ టైంలో పూరీ జగన్నాథ్ అంటే ఒక్కటంటే ఒక్క డైలాగ్ గుర్తురాదు. ఎందుకంటే ఆయన మార్క్ ఎప్పుడో మిస్ అయిపోయింది. 'బిజినెస్‌మేన్' వరకు పూరీ పెన్ను పవర్ వేరు.. ఆ తర్వాత వేరు. దాదాపు గత పదేళ్లుగా పూరీ జగన్నాథ్‌లోని అసలు సిసలు డైరెక్టర్ ఎక్కడో మిస్సయిపోయిన ఫీలింగ్!(ఇదీ చదవండి: ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ)లైగర్, పైసా వసూల్, రోగ్, మోహబూబా.. తాజాగా 'డబుల్ ఇస్మార్ట్'. ఈ సినిమాలన్నీ బాగున్నాయా బాగోలేవా అనే సంగతి పక్కనబెడితే పూరీ అభిమానుల బాధ వర్ణనాతీతం. మాకు ఇప్పుడు కనిపిస్తున్న పూరీ వద్దు.. ఒకప్పటి డైరెక్టర్ పూరీ జగన్నాథే కావాలని మారం చేసేంత ఇష్టం. మరోవైపు పూరీ జగన్నాథ్ ట్రెండ్‌కి తగ్గట్లు మారలేక ఒకే తరహా సినిమాలు తీస్తున్నాడో బాధ.ఎందుకంటే ఇప్పటి జనరేషన్ చాలామంది డైరెక్టర్స్‌కి పూరీ జగన్నాథ్ టెక్స్ట్ బుక్ లాంటోడు. కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నోడు. అలాంటి ఆయన ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం చూసి సగటు టాలీవుడ్ అభిమాని తట్టుకోలేకపోతున్నాడు. పూరీ సర్ మీరు మారాలేమో?(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన) -
‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ
టైటిల్: డబుల్ ఇస్మార్ట్నటినటులు: రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, సాయాజీ షిండే, అలీ, గెటప్ శ్రీను తదితరులునిర్మాణ సంస్థ: పూరి కనెక్ట్స్నిర్మాతలు: పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్దర్శకత్వం:పూరీ జగన్నాథ్సంగీతం: మణిశర్మసినిమాటోగ్రఫీ: సామ్ కె. నాయుడు, జియాని జియానెలివిడుదల తేది: ఆగస్ట్ 15, 2024ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన సినిమా ఇది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ప్రమోషన్స్ అంతగా చేయకపోయినా.. బజ్ మాత్రం క్రియేట్ అయింది. మరి భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథ ఏంటంటే..ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని) తన తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే పోగొట్టుకుంటాడు. తన తల్లి పోచమ్మ (ఝాన్సీ)ని చంపిన బిగ్ బుల్ (సంజయ్ దత్)ను పట్టుకునే పనిలో ఇస్మార్ట్ శంకర్ పడతాడు. మరో వైపు బ్రెయిన్ ట్యూమర్ వల్ల మూడు నెలల్లోనే చనిపోతానని బిగ్ బుల్‌కు తెలుస్తుంది. దీంతో తాను ఎలాగైనా బతకాలని అనుకుంటాడు. థామస్ (మకరంద్ దేశ్ పాండే) మెమోరీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెబుతాడు. ఇస్మార్ట్ శంకర్ అనే వాడికి ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారని, అలా బిగ్ బుల్ మెమోరీనీ ఇస్మార్ట్ శంకర్‌కు ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని థామస్ సూచిస్తాడు.దీంతో ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం దిగుతుంది. మరో వైపు బిగ్ బుల్ కోసం ఇస్మార్ట్ శంకర్ కూడా వెతుకుతుంటాడు. ఇండియాలో బిగ్ బుల్ దిగాడని రా ఏజెన్సీకి తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకుని మెమోరీ ట్రాన్స్ఫర్మేషన్ చేయిస్తాడు బిగ్ బుల్. నాలుగు రోజుల్లోనే ఇస్మార్ట్ శంకర్ కాస్తా బిగ్ బుల్గా మారిపోతాడని చెబుతారు. ఈ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? బిగ్ బుల్‌ను పట్టుకునేందుకు రా ఏం చేస్తుంది? ఈ కథలో ఇస్మార్ట్ శంకర్ ప్రేయసి జన్నత్ (కావ్యా థాపర్) పాత్ర ఏంటి? చివరకు ఇస్మార్ట్ శంకర్ ఏం చేస్తాడు? అన్నది థియేటర్లో చూడాల్సిందే.ఎలా ఉందంటే..డబుల్ ఇస్మార్ట్ కథ, కోర్ పాయింట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది చాలా సిల్లీగా ఉంటుంది. చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోవడం, తల్లిని చంపిన వాడి కోసం ఇస్మార్ట్ శంకర్ ప్రయత్నించడం.. ఇక కథలోకి హీరోయిన్ ఎంట్రీ.. ఆమె వెనకాల హీరో పడటం ఇవన్నీ కూడా చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. మధ్య మధ్యలో బోకా అంటూ అలీ అందరినీ విసిగిస్తాడు. ఏదో అలా తెరపై ఒక సీన్లో కనిపిస్తే జనాలు నవ్వుతారేమో. కానీ పదే పదే చూపించడంతో ప్రేక్షకుడికి సహన పరీక్షలా ఉంటుంది.ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం చేసే ప్రయత్నాలతో నిండిపోతుంది. ఇక సెకండాఫ్‌లో అయినా కథ ఇంట్రెస్టింగ్గా సాగుతుందా? ఏమైనా సీరియస్‌గా ఉంటుందా? అని అనుకుంటే పొరబాటే. సెకండాఫ్‌లో ఎమోషన్ పార్ట్ కూడా వర్కవుట్ అవ్వలేదు. షాక్ కొట్టినట్టు, అపరిచితుడులో విక్రమ్ రోల్స్ మారినట్టుగా.. ఇస్మార్ట్ శంకర్‌లో ఎలా అయితే బ్రెయిన్లో మెమోరీ మారిపోతుందో ఇందులోనూ అలానే అనిపిస్తుంది.ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ప్రగతి నటన చూస్తే అందరికీ నవ్వొస్తుంది. అక్కడ ఎమోషన్ పండాల్సింది పోయి.. అందరూ నవ్వుకునేలా ఉంటుంది. ఇక సినిమా ఎండ్ కార్డ్ పడక ముందే థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటకు వచ్చేలా కనిపిస్తోంది. పరమ రొటీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తుంది. పూరి నుంచి ఇక కొత్తదనం, కొత్త కథలు ఆశించడం కూడా తప్పేమో అన్నట్టుగా కనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే..రామ్ పోతినేని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర ఏదైనా సరే అందులో జీవించేస్తాడు. ఇక పక్కా తెలంగాణ యువకుడు శంకర్‌గా అదరగొట్టేశాడు. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగులు చప్పట్లు కొట్టిస్తాయి. సంజయ్ దత్ ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్. విలన్‌గా ఆయన అదరగొట్టేశాడు. రామ్, సంజయ్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక కావ్య థాపర్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. చాలా కాలం తర్వాత అలీ ఓ మంచి పాత్రలో కనిపించాడు. కానీ ఆయన కామెడీ వర్కౌట్ కాలేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. మణిశర్మ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు అంతంత మాత్రమే అయినా.. బీజీఎం మాత్రం అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నేను ఒళ్లు దగ్గర పెట్టుకుని చేసిన సినిమా ఇది: పూరి జగన్నాథ్
‘‘ఈ మధ్య సోషల్ మీడియాలో, బయట ఓ ట్రెండ్ చూస్తున్నాను. అరే... నీకిది నచ్చిందా? అని అడిగితే... వాళ్లకు నచ్చుతుందేమో... వీళ్లకు నచ్చుతుందేమో అని తోటివారిపైకి తోస్తున్నారు. ముందు మనకు నచ్చిందా? అని చూసుకోవాలి. మీకు నచ్చింది మీరు చేయండి. పక్కోడి గురించి, పకోడీల గురించి పట్టించుకుంటే పనులు జరగవు. సాధారణంగా నేను సలహాలివ్వను. నా అనుకున్నవాళ్లు అడిగితే ఇస్తా. మీ అందర్నీ (ఫ్యాన్స్) నా వాళ్లుగా ఫీలై ఇస్తున్నాను’’ అని రామ్ అన్నారు.హీరో రామ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కాంబినేషన్లోనే 2019లో వచ్చిన హిట్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందింది. ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, అలీ కీలక పాత్రల్లో నటించారు. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో జరిగిన ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ మాట్లాడుతూ– ‘‘హీరోలు బుల్లెట్స్‌లాంటివారు. పేల్చే గన్ బాగుంటే బుల్లెట్ చాలా స్పీడ్‌గా వెళ్తుంది. పూరీగారిలాంటి గన్ ప్రతి ఒక్క యాక్టర్‌కి కావాలి. ఛార్మీ కౌర్‌గారు లేకపోతే ‘డబుల్ ఇస్మార్ట్’ లేదు. ఆమె ఓ ఫైటర్. బాస్ లేడీ అని పిలుస్తాను.‘డబుల్ ఇస్మార్ట్’ రేంజ్‌కి తగ్గట్లు, ప్రేక్షకుల అంచనాలను మించేలా మణిశర్మగారు మ్యూజిక్ ఇచ్చారు’’ అని అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘రామ్ లేకపోతే ఇస్మార్ట్ శంకర్ లేడు. సంజయ్ దత్‌గారు మా సినిమాలో యాక్ట్ చేసి, కొత్త కలర్ తీసుకొచ్చారు. నా నిర్మాణసంస్థకు ఛార్మీ కౌర్ ఓ బలం. నా దగ్గర రూపాయి లేకపోయినా నాకోసం ఎవరన్నా నిలబడ్డారంటే అది విషురెడ్డి. హిట్ సినిమా తీసినప్పుడు చాలామంది ప్రశంసిస్తారు. నా ఫ్లాప్ సినిమా విడుదలైన వారానికి విజయేంద్రప్రసాద్‌గారు ఫోన్ చేసి, ‘సార్... నాకో హెల్ప్ చేస్తారా?’ అన్నారు. ఆయన కొడుకే పెద్ద డైరెక్టర్.. రాజమౌళి. అలాంటిది ఆయన నన్ను హెల్ప్ అడుగుతున్నారేంటి? అనుకున్నా. ‘తర్వాతి సినిమా ఎప్పుడు చేస్తున్నారు? చేసే ముందు ఆ సినిమా కథ నాకోసారి చెప్తారా? మీలాంటి దర్శకులు ఫెయిల్ కావడం చూడలేను. చిన్న చిన్న తప్పులేవో ఉంటుంటాయి. తీసే ముందు నాకోసారి చెప్పండి’ అన్నారు. నేను భావోద్వేగానికి గురయ్యాను. అయితే ‘డబుల్ ఇస్మార్ట్’ కథను విజయేంద్రప్రసాద్‌గారికి చెప్పలేదు. తెలిసిన పనే కదా... ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా తీశా’’ అని తెలిపారు పూరి జగన్నాథ్. ‘‘ఇస్మార్ట్ శంకర్’ను ఆదరించినట్లే ‘డబుల్ ఇస్మార్ట్’నూ ఆదరించండి’’ అన్నారు ఛార్మీ. పూరీ కనెక్ట్స్ సీఈవో విషు రెడ్డి, అలీ తదితరులు పాల్గొన్నారు. -
ముంబైలో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ టీమ్ సందడి (ఫొటోలు)
-
డబుల్ ఇస్మార్ట్‌ని ఎంజాయ్ చేస్తారు: సంజయ్ దత్
‘‘తెలుగు సినిమా డైనమిక్స్‌ని మార్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ సార్. ‘డబుల్ ఇస్మార్ట్’లో నన్ను భాగం చేసి, బిగ్ బుల్గా చూపిస్తున్న ఆయనకి థ్యాంక్స్. రామ్‌తో పని చేయడంతో చాలా మజా వచ్చింది. ‘డబుల్ ఇస్మార్ట్’ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు’’ అని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అన్నారు. రామ్ పోతినేని, కావ్యా థాపర్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 15న ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తోంది.మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘బిగ్ బుల్...’ అంటూ సాగే పాటని ముంబైలో జరిగిన ఈవెంట్లో విడుదల చేశారు. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించిన ఈ పాటని పృధ్వీ చం, సంజన కల్మంజే పాడారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ– ‘‘డబుల్ ఇస్మార్ట్’తో ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. సంజయ్ దత్గారితో పని చేయడం గౌరవంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘సంజయ్ బాబాకి నేను బిగ్ ఫ్యాన్‌ని. ఆయన ‘డబుల్ ఇస్మార్ట్’ చేయడం చాలా హ్యాపీగా ఉంది’’ అని పూరి జగన్నాథ్ చె΄్పారు. ఈ వేడుకలో ఛార్మీ, కావ్యా థాపర్, పూరి కనెక్ట్స్ సీఈవో విష్, నటుడు అలీ మాట్లాడారు. -
'ఐదు జంటల లవ్ స్టోరీ'.. ట్రైలర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ తనయుడు!
ఎంఎన్వీ సాగర్, శృతి శంకర్ జంటగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం' కాలం రాసిన కథలు'. ఈ సినిమాను గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. యస్ యమ్ 4 ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాశ్ జగన్నాధ్ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమా మంచి విజయం సాధించాలని చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఈ సందర్భంగా దర్శక, నిర్మాత ఎంఎన్వీ సాగర్ మాట్లాడుతూ..' నా గురువుగా భావించే డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ జగన్నాథ్ ట్రైలర్ లాంచ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈనెల ఆగస్టు 29న థియేటర్లలో రాబోతున్నాం. పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీసుకొస్తున్నాం. 30 ఏళ్ల క్రితం మొదలైన పరువు హత్యల మధ్యే ఈ కథ సాగుతుంది. ఈ చిత్రం ద్వారా కొంతమంది కొత్తవారు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా ఐదు జంటల మధ్య జరిగే అద్భుతమైన కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే అంశాలు ఉన్నాయి' అని అన్నారు. ఈ చిత్రంలో వికాస్ , విహారికా చౌదరి, అభిలాష్ గోగుబోయిన, ఉమా రేచర్ల , రోహిత్ కొండ, హాన్విక శ్రీనివాస్, రవితేజ బోనాల ,పల్లవి రాథోడ్ , రేష్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
డబుల్ ఇస్మార్ట్ సెన్సార్ రివ్యూ.. హైలెట్స్ ఇవే
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ , ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్ర పోషించాడు. రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది.పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్‌ని కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ జారీ చేశారు.ఇద్దరికి కంబ్యాక్ ఫిల్మ్!డబుల్ ఇస్మార్ట్ హిట్ డైరెక్టర్ పూరి, హీరో రామ్‌కి చాలా అవసరం. ఇద్దరి ఖాతాలో హిట్ లేదు. అందుకే చాలా జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇస్మార్ట్ శంకర్ మాదిరే డబుల్ ఇస్మార్ట్ కూడా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ ముందు నుంచి చెబుతున్నారు.తాజాగా సెన్సార్ సభ్యులు కూడా ఆ విషయాన్నే చెప్పినట్లు తెలుస్తోంది. సినిమా చూసి.. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ అని ప్రశంసించారట. సంజయ్ దత్, రామ్ పోతినేని మధ్య మైండ్ గేమ్ తో సాగే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. హీరో హీరోయిన్ల లవ్‌ట్రాక్ కూడా అదిరిపోయిందట. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేస్తుందని అంటున్నారు. అలీ కామెడీ, మణి శర్మ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్స్ అని చెప్పారట. సెన్సార్ సభ్యుల టాక్ బట్టి చూస్తే.. రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ ఇద్దరికీ కంబ్యాక్ ఫిల్మ్‌గా అవ్వబోతుందని తెలుస్తోంది. -
ఫైట్స్ చేయడం సవాల్‌గా అనిపించింది: కావ్యా థాపర్
‘‘నేనిప్పటివరకూ వైవిధ్యమైన పాత్రలు చేశాను. తొలిసారి ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలో యాక్షన్ సీన్స్ చేశాను. మొదటిసారి ఫైట్స్ చేయడం, పాటల్లో ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేసే అవకాశం రావడం సవాల్‌గా అనిపించింది’’ అని హీరోయిన్ కావ్యా థాపర్ అన్నారు. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 15న ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా కావ్యా థాపర్ పంచుకున్న విశేషాలు. పూరి జగన్నాథ్‌గారి దర్శకత్వంలో నటించాలని ఉండేది. ‘ఇస్మార్ట్ శంకర్’కి ఆడిషన్ ఇచ్చాను కానీ కుదరలేదు. ‘డబుల్ ఇస్మార్ట్’కి నా ఆడిషన్స్ నచ్చి పూరి సార్, ఛార్మీగారు చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు డబుల్ ఫన్, ఎంటర్టైన్మెంట్ ఉండే ఈ సినిమాలో అవకాశం రావడం మరింత హ్యాపీగా ఉంది. పూరీగారు గొప్ప డైరెక్టర్. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలాగే చిన్న అమాయకత్వం కూడా ఉంటుంది. రామ్‌గారితో సాంగ్ షూట్లో ఫస్ట్ డే మార్నింగ్ సిక్ అయ్యాను. చాలా ఎనర్జీ, పవర్ కావాల్సిన సాంగ్ అది. అయినా సెట్‌కి వెళ్లాను. ఛార్మీగారు హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. మూడు రోజుల తర్వాత డబుల్ ఎనర్జీతో డిస్చార్జ్ అయ్యాను... నా బెస్ట్ డ్యాన్స్ ఇచ్చాను. మణిశర్మగారు లెజండరీ కంపోజర్. ఆయన సాంగ్స్‌కి డ్యాన్స్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ‘డబుల్ ఇస్మార్ట్’ నేరుగా హిందీలో రిలీజ్ కావడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. నాకు యాక్షన్ రోల్స్, అడ్వంచరస్ మూవీస్ చేయాలని ఉంది. ప్రస్తుతం గోపీచంద్‌గారితో ‘విశ్వం’ చిత్రంలో నటిస్తున్నాను. మరికొన్నిప్రాజెక్ట్స్ చర్చల్లో ఉన్నాయి. -
ఈసారి డబుల్ ఇస్మార్ట్ అంటున్న రామ్ పోతినేని.. మూవీ HD స్టిల్స్
-
ఆ పిచ్చి తగ్గక డైరెక్టర్ ని అయ్యా..
-
రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్'.. మ్యాడ్ ట్రైలర్ వచ్చేసింది!
రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో వస్తోన్న ఫుల్ యాక్షన్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. వైజాగ్‌లో నిర్వహించిన ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే రామ్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బిగ్బుల్ పాత్రలో మెప్పించనున్నారు. కాగా.. ఈనెల 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. Mamaaaaaa! #DoubleiSmartTrailer aaagayyaaaa! https://t.co/6PHbKXHj1Z -Ustaad #DoubleiSmart Shankar pic.twitter.com/7BtSgW5AeC— RAm POthineni (@ramsayz) August 4, 2024