టాలీవుడ్ హీరో రామ్ పోతినేని మోస్ట్ అవేటైడ్ చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. ఈ మూవీని ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన కావ్యా థాపర్ కనిపించనుంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే స్టెప్ మార్ అనే పాటను రిలీజ్ చేసిన టీమ్ తాజాగా మరో సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కీర్తన శర్మ ఆలపించారు. అయితే ఈ సాంగ్ మధ్యలో మాజీ సీఎం కేసీఆర్ వాయిస్ డైలాగ్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.
కాగా.. పూరి- రామ్ కాంబోలో 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ భారీగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూవీకి కొనసాగింపుగా డబుల్ ఇస్మార్ట్‌తో రామ్ పోతినేని ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు.
Yo boys! #MaarMunthaChodChinta …Enjoy! https://t.co/9IMWg4rcUb
-USTAAD #DoubleIsmart Shankar pic.twitter.com/IjB7f6gWtV— RAm POthineni (@ramsayz) July 16, 2024
Comments
Please login to add a commentAdd a comment