Double iSmart
-
భారీ బడ్జెట్ చిత్రాలు.. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్!
కాలం ఎవరి కోసం ఆగదు. కాలంతో పాటే మనం పరిగెత్తాల్సిందే కానీ నీకోసం ఈ ప్రపంచంలో ఏది వేచి ఉండదు. అలా కర్పూరంలా కరిగిపోతూనే ఉంటుంది కాలం. చూస్తుండగానే మరో ఏడాది కనుమరుగవుతోంది. ఈ కాలమనే భూగర్భంలో 2024 కలిసిపోనుంది. కొత్త ఆశలతో మరో ఏడాది అందరికీ స్వాగతం పలుకుతోంది. ఈ ఏడాది అయినా సక్సెస్ సాధించాలని కోరుకునే వాళ్లే ఎక్కువ కనిపిస్తారు. మరి ఈ ఏడాది సినీ పరిశ్రమకు కలిసొచ్చిందా? లేదా? అనేది చూద్దాం.మరి ఈ ఏడాది సినీ పరిశ్రమ కొంతవరకు సక్సెస్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద కల్కి 2898 ఏడీ, పుష్ప-2, స్తీ-2 లాంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. మరికొన్ని బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అయితే కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం అనూహ్యంగా చతికిలపడ్డాయి. భారీ అంచనాలతో రిలీజైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయాయి. మరి 2024లో విడుదలై బాక్సాఫీస్ డిజాస్టర్స్‌గా నిలిచిన చిత్రాలేంటో మనం ఓ లుక్కేద్దాం. ఇండియన్-2- నిరాశపరిచిన సీక్వెల్28 ఏళ్ల క్రిత శంకర్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం ఇండియన్(భారతీయుడు). ఈ మూవీకి సీక్వెల్‌గా దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా కమల్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. కమల్ హాసన్ నటనతో మెప్పించినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.సూర్య కంగువాకోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం కేవలం రూ.100 కోట్లకు పైగా నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. దీంతో ఈ ఏడాది రిలీజైన చిత్రాల్లో బాక్సాఫీస్ డిజాస్టర్‌గా నిలిచింది. యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ ఊహించిన స్థాయిలో రాణించలేకపోయింది.రామ్ పోతినేని- డబుల్ ఇస్మార్ట్ సీక్వెల్రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో గతంలో వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ కావడంతో అదే కాన్ఫిడెన్స్‌తో డబుల్ ఇస్మార్ట్ పేరుతో సీక్వెల్‌ను తీసుకొచ్చారు పూరి జగన్నాధ్. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. రామ్ నటన ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్‌గా పేరును దక్కించుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు.మోహన్ లాల్- మలైకోట్టై వాలిబన్మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన పీరియాడికల్ మూవీ మలైకోట్టై వాలిబన్. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం వీజువల్ ఫీస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ ఫెయిల్యూర్‌గా నిలిచింది. కథ, మోహన్ లాల్ నటన మెప్పించినప్పటికీ స్క్రీన్‌ప్లే మైనస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. వాలిబన్ అనే ఓ యోధుని కథ ఆధారంగా ఈ మూవీని తీసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించారు.మహేశ్ బాబు- గుంటూరు కారంఈ ఏడాది సంక్రాంతికి రీలీజైన టాలీవుడ్ చిత్రం గుంటూరు కారం. మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈచిత్రం అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు గతంలో సూపర్ హిట్స్ కావడంతో అదేస్థాయిలో ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఊహించని విధంగా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా అభిమానులను ఆకట్టుకుంది.మరోవైపు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, క, వాజై, మెయిజగన్ వంటి చిత్రాలు పెద్ద కమర్షియల్ హిట్ సాధించాయి. భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. -
ఓటీటీకి వచ్చేసిన డబుల్ ఇస్మార్ట్..
-
సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన డబుల్ ఇస్మార్ట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. బ్లాక్ బస్టర్ హిట్ ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే డబుల్ ఇస్మార్ట్ అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేస్తోంది. కాగా.. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్ కీలకపాత్ర పోషించారు. బిగ్‌బుల్‌గా అభిమానులను అలరించారు. థియేటర్లలో చూడడం మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.కథేంటంటే..ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని) తన తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే పోగొట్టుకుంటాడు. తన తల్లి పోచమ్మ (ఝాన్సీ)ని చంపిన బిగ్ బుల్ (సంజయ్ దత్)ను పట్టుకునే పనిలో ఇస్మార్ట్ శంకర్ పడతాడు. మరో వైపు బ్రెయిన్ ట్యూమర్ వల్ల మూడు నెలల్లోనే చనిపోతానని బిగ్ బుల్‌కు తెలుస్తుంది. దీంతో తాను ఎలాగైనా బతకాలని అనుకుంటాడు. థామస్ (మకరంద్ దేశ్ పాండే) మెమోరీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెబుతాడు. ఇస్మార్ట్ శంకర్ అనే వాడికి ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారని, అలా బిగ్ బుల్ మెమోరీనీ ఇస్మార్ట్ శంకర్‌కు ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని థామస్ సూచిస్తాడు.దీంతో ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం దిగుతుంది. మరో వైపు బిగ్ బుల్ కోసం ఇస్మార్ట్ శంకర్ కూడా వెతుకుతుంటాడు. ఇండియాలో బిగ్ బుల్ దిగాడని రా ఏజెన్సీకి తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకుని మెమోరీ ట్రాన్స్ఫర్మేషన్ చేయిస్తాడు బిగ్ బుల్. నాలుగు రోజుల్లోనే ఇస్మార్ట్ శంకర్ కాస్తా బిగ్ బుల్గా మారిపోతాడని చెబుతారు. ఈ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? బిగ్ బుల్‌ను పట్టుకునేందుకు రా ఏం చేస్తుంది? ఈ కథలో ఇస్మార్ట్ శంకర్ ప్రేయసి జన్నత్ (కావ్యా థాపర్) పాత్ర ఏంటి? చివరకు ఇస్మార్ట్ శంకర్ ఏం చేస్తాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఆశ్రమంలో 'డబుల్ ఇస్మార్ట్' హీరోయిన్.. సన్యాసం ప్లాన్?
ఆగస్టు 15న థియేటర్లలో 'డబుల్ ఇస్మార్ట్' రిలీజైంది. ఎప్పటిలానే పూరీ జగన్నాథ్ మళ్లీ నిరాశపరిచాడు. రొటీన్ రొట్టకొట్టుడు స్టోరీతో విసుగెత్తించాడు. ఉన్నంతలో హీరోయిన్ కావ్య థాపర్ గ్లామర్ షో కాస్త ఎంటర్టైన్ చేసింది. తెలుగులో ఇదివరకే పలు సినిమాల్లో నటించింది. కానీ ఈమెకు బ్రేక్ అయితే రాలేదు. తాజాగా ఈమె తన పుట్టినరోజు వేడుకల్ని అనంత్ థామ్ అనే ఆశ్రమంలో సెలబ్రేట్ చేసుకుంది.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలు)పుట్టినరోజుని ఆశ్రమంలో చేసుకోవడం పెద్ద విశేషమేం కాదు. కాకపోతే 'డబుల్ ఇస్మార్ట్' రిలీజ్‌కి ముందు ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన కావ్య థాపర్.. తాను జీవితంలో పెళ్లి చేసుకోనని క్లారిటీ ఇచ్చింది. ఇది జరిగిన కొన్నిరోజులకే ఇలా ఆశ్రమంలో కనిపించడం కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అలానే ఇన్ స్టాలో స్వామిజీ తనకు తండ్రి లాంటి వారు అని చెబుతూ పెద్ద క్యాప్షన్ పెట్టింది.తన గురువు అనంత్ బాబా ఆశీస్సులు తీసుకుని కావ్య థాపర్... అక్కడే ఆశ్రమంలోని అనాథలకు, మిగతా వారికి భోజనం ఏర్పాటు చేసింది. ఆశ్రమంలో తన పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న ఫోటోలు, వీడియోలు ఇన్ స్టాలో షేర్ చేసింది.పెళ్లి చేసుకోనని చెప్పడం, కుటుంబం ఉన్నా సరే ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోవడం లాంటివి చూస్తుంటే.. నటిగా కొన్నాళ్లపాటు చేసి, ఆ తర్వాత సన్యాసినిగా మారుతుందేమోనని అనిపిస్తుంది. తెలుగులో ఈ మాయ పేరేమిటో, ఏక్ మినీ కథ, ఈగల్, ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్ మూవీస్ చేసింది. అలానే గోపీచంద్-శ్రీనువైట్ల కాంబోలో తీస్తున్న 'విశ్వం' చిత్రంలోనూ ఈమెనే హీరోయిన్.(ఇదీ చదవండి: పెళ్లి జరిగిన ఇంటిని రూ.25 కోట్లకు బేరం పెట్టిన స్టార్ హీరోయిన్) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) -
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మారాల్సిన టైమ్ వచ్చిందేమో?
'మీరు మారిపోయారు సర్'.. పూరీ జగన్నాథ్ తీసిన టెంపర్ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇదే పూరీ జగన్నాథ్‌కి ప్రస్తుత పరిస్థితులకు సరిగా యాప్ట్ అవుతుందేమో? ఎందుకంటే ఒకప్పటి పూరీ వేరు. ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తి వేరు. మరీ ముఖ్యంగా రీసెంట్ రిలీజ్ 'డబుల్ ఇస్మార్ట్' చూస్తుంటే అసలీ సినిమా తీసింది ఈయనేనా అనే సందేహం.(ఇదీ చదవండి: నేను ఒళ్లు దగ్గర పెట్టుకుని చేసిన సినిమా ఇది: పూరి జగన్నాథ్)'బద్రి'లో పవన్ కల్యాణ్ 'నువ్వు నంద అయితే ఏంటి? నేను బద్రీ, బద్రీనాథ్' అన్నప్పుడు... 'ఇడియట్'లో రవితేజ 'కమీషనర్ల కూతుళ్లకి మొగుళ్లు రారా' అన్నప్పుడు గానీ... 'శివమణి'లో నాగార్జున 'నాక్కొంచెం మెంటల్' అన్నప్పుడు.. 'పోకిరి'లో మహేశ్ 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంటే ఆడే పండుగాడు' అన్నప్పుడు.. 'బిజినెస్‌మేన్'లో మహేశ్ 'ముంబైలో బతకడానికి రాలేదు, ఉ* పోయించడానికి వచ్చాను' అన్నప్పుడు.. 'నేనింతే'లో రవితేజ.. సినిమా కోసం డైలాగ్స్ చెప్పినప్పుడు గానీ మూవీ లవర్స్, మాస్ ఆడియెన్స్ ఉర్రూతలూగారు. పూరీపై ఇష్టం పెంచుకున్నారు.కానీ రీసెంట్ టైంలో పూరీ జగన్నాథ్ అంటే ఒక్కటంటే ఒక్క డైలాగ్ గుర్తురాదు. ఎందుకంటే ఆయన మార్క్ ఎప్పుడో మిస్ అయిపోయింది. 'బిజినెస్‌మేన్' వరకు పూరీ పెన్ను పవర్ వేరు.. ఆ తర్వాత వేరు. దాదాపు గత పదేళ్లుగా పూరీ జగన్నాథ్‌లోని అసలు సిసలు డైరెక్టర్ ఎక్కడో మిస్సయిపోయిన ఫీలింగ్!(ఇదీ చదవండి: ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ)లైగర్, పైసా వసూల్, రోగ్, మోహబూబా.. తాజాగా 'డబుల్ ఇస్మార్ట్'. ఈ సినిమాలన్నీ బాగున్నాయా బాగోలేవా అనే సంగతి పక్కనబెడితే పూరీ అభిమానుల బాధ వర్ణనాతీతం. మాకు ఇప్పుడు కనిపిస్తున్న పూరీ వద్దు.. ఒకప్పటి డైరెక్టర్ పూరీ జగన్నాథే కావాలని మారం చేసేంత ఇష్టం. మరోవైపు పూరీ జగన్నాథ్ ట్రెండ్‌కి తగ్గట్లు మారలేక ఒకే తరహా సినిమాలు తీస్తున్నాడో బాధ.ఎందుకంటే ఇప్పటి జనరేషన్ చాలామంది డైరెక్టర్స్‌కి పూరీ జగన్నాథ్ టెక్స్ట్ బుక్ లాంటోడు. కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నోడు. అలాంటి ఆయన ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం చూసి సగటు టాలీవుడ్ అభిమాని తట్టుకోలేకపోతున్నాడు. పూరీ సర్ మీరు మారాలేమో?(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన) -
మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్.. ఫస్ట్ డే కలెక్షన్స్
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా టాలీవుడ్లో సినిమాల జాతర జరిగింది. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాల మధ్యే బిగ్ ఫైట్ నడిచింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు సినిమాలకు కూడా మిక్సిడ్ టాక్ వచ్చింది. ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించేలా లేవని నెటిజన్ల నుంచి విమర్శలు అందుకున్నాయి. కోలీవుడ్ సినిమా 'తంగలాన్' కాస్త బాగుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. విక్రమ్ నటన కోసం అయినా సినిమా చూడాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.మిస్టర్ బచ్చన్ కలెక్షన్స్రవితేజ- హరీశ్ శంకర్ సినిమా మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద రూ.7.5 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఈ కలెక్షన్లు అడ్వాన్స్ ప్రీమియర్ షోలతో కలిపి అని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మొదటిరోజు సుమారు రూ. 10 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబడుతుందని అందరూ అంచనా వేశారు. కానీ మిస్టర్ బచ్చన్ ఆ మార్క్ అందుకోలేకపోయిందని తెలుస్తోంది. దాదాపు రూ. 35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన మిస్టర్ బచ్చన్ ఆ టార్గెట్ రీచ్ అవుతాడా..? అనే సందేహాలు వస్తున్నాయి. సినిమా పట్ల దారుణమైన నెగటివ్ టాక్ రావడంతో బయర్స్‌కు నష్టాలు తప్పవని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్యంగ్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించాడు. దాదాపు రూ. 60 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విడుదలైన ఈ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. ఈ క్రమంలో మొదటిరోజు రూ. 12. 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ట్రేడ్ వర్గాలు మాత్రం రూ. 10.40 కోట్లు మాత్రమే కలెక్షన్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. మొత్తానికి కలెక్షన్ల పరంగా మిస్టర్ బచ్చన్ కంటే ఇస్మార్ట్ శంకర్ కాస్త బెటర్ అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మించారు.తంగలాన్ కలెక్షన్స్ప్రయోగాత్మక పాత్రలతో మెప్పించే విక్రమ్ తాజాగా తంగలాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటిరోజు రూ. 19.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 1850ల్లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగే కథాంశంతో తెరకెక్కిన తంగలాన్ ఈ పోటీలో విజయం సాధించింది. సినిమా పట్ల పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అన్ని వర్గాల సినీప్రియులకు తంగలాన్ థ్రిల్ చేస్తాడు. చెన్నైలో మొత్తం 592 స్క్రీన్లలో తంగలాన్ ప్రదర్శించారు. 81 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. తంగలాన్ తెలుగు వర్షన్ రూ. 2 కోట్ల వరకు రాబట్టింది. -
‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ
టైటిల్: డబుల్ ఇస్మార్ట్నటినటులు: రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, సాయాజీ షిండే, అలీ, గెటప్ శ్రీను తదితరులునిర్మాణ సంస్థ: పూరి కనెక్ట్స్నిర్మాతలు: పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్దర్శకత్వం:పూరీ జగన్నాథ్సంగీతం: మణిశర్మసినిమాటోగ్రఫీ: సామ్ కె. నాయుడు, జియాని జియానెలివిడుదల తేది: ఆగస్ట్ 15, 2024ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన సినిమా ఇది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ప్రమోషన్స్ అంతగా చేయకపోయినా.. బజ్ మాత్రం క్రియేట్ అయింది. మరి భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథ ఏంటంటే..ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని) తన తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే పోగొట్టుకుంటాడు. తన తల్లి పోచమ్మ (ఝాన్సీ)ని చంపిన బిగ్ బుల్ (సంజయ్ దత్)ను పట్టుకునే పనిలో ఇస్మార్ట్ శంకర్ పడతాడు. మరో వైపు బ్రెయిన్ ట్యూమర్ వల్ల మూడు నెలల్లోనే చనిపోతానని బిగ్ బుల్‌కు తెలుస్తుంది. దీంతో తాను ఎలాగైనా బతకాలని అనుకుంటాడు. థామస్ (మకరంద్ దేశ్ పాండే) మెమోరీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెబుతాడు. ఇస్మార్ట్ శంకర్ అనే వాడికి ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారని, అలా బిగ్ బుల్ మెమోరీనీ ఇస్మార్ట్ శంకర్‌కు ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని థామస్ సూచిస్తాడు.దీంతో ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం దిగుతుంది. మరో వైపు బిగ్ బుల్ కోసం ఇస్మార్ట్ శంకర్ కూడా వెతుకుతుంటాడు. ఇండియాలో బిగ్ బుల్ దిగాడని రా ఏజెన్సీకి తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకుని మెమోరీ ట్రాన్స్ఫర్మేషన్ చేయిస్తాడు బిగ్ బుల్. నాలుగు రోజుల్లోనే ఇస్మార్ట్ శంకర్ కాస్తా బిగ్ బుల్గా మారిపోతాడని చెబుతారు. ఈ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? బిగ్ బుల్‌ను పట్టుకునేందుకు రా ఏం చేస్తుంది? ఈ కథలో ఇస్మార్ట్ శంకర్ ప్రేయసి జన్నత్ (కావ్యా థాపర్) పాత్ర ఏంటి? చివరకు ఇస్మార్ట్ శంకర్ ఏం చేస్తాడు? అన్నది థియేటర్లో చూడాల్సిందే.ఎలా ఉందంటే..డబుల్ ఇస్మార్ట్ కథ, కోర్ పాయింట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది చాలా సిల్లీగా ఉంటుంది. చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోవడం, తల్లిని చంపిన వాడి కోసం ఇస్మార్ట్ శంకర్ ప్రయత్నించడం.. ఇక కథలోకి హీరోయిన్ ఎంట్రీ.. ఆమె వెనకాల హీరో పడటం ఇవన్నీ కూడా చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. మధ్య మధ్యలో బోకా అంటూ అలీ అందరినీ విసిగిస్తాడు. ఏదో అలా తెరపై ఒక సీన్లో కనిపిస్తే జనాలు నవ్వుతారేమో. కానీ పదే పదే చూపించడంతో ప్రేక్షకుడికి సహన పరీక్షలా ఉంటుంది.ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం చేసే ప్రయత్నాలతో నిండిపోతుంది. ఇక సెకండాఫ్‌లో అయినా కథ ఇంట్రెస్టింగ్గా సాగుతుందా? ఏమైనా సీరియస్‌గా ఉంటుందా? అని అనుకుంటే పొరబాటే. సెకండాఫ్‌లో ఎమోషన్ పార్ట్ కూడా వర్కవుట్ అవ్వలేదు. షాక్ కొట్టినట్టు, అపరిచితుడులో విక్రమ్ రోల్స్ మారినట్టుగా.. ఇస్మార్ట్ శంకర్‌లో ఎలా అయితే బ్రెయిన్లో మెమోరీ మారిపోతుందో ఇందులోనూ అలానే అనిపిస్తుంది.ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ప్రగతి నటన చూస్తే అందరికీ నవ్వొస్తుంది. అక్కడ ఎమోషన్ పండాల్సింది పోయి.. అందరూ నవ్వుకునేలా ఉంటుంది. ఇక సినిమా ఎండ్ కార్డ్ పడక ముందే థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటకు వచ్చేలా కనిపిస్తోంది. పరమ రొటీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తుంది. పూరి నుంచి ఇక కొత్తదనం, కొత్త కథలు ఆశించడం కూడా తప్పేమో అన్నట్టుగా కనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే..రామ్ పోతినేని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర ఏదైనా సరే అందులో జీవించేస్తాడు. ఇక పక్కా తెలంగాణ యువకుడు శంకర్‌గా అదరగొట్టేశాడు. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగులు చప్పట్లు కొట్టిస్తాయి. సంజయ్ దత్ ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్. విలన్‌గా ఆయన అదరగొట్టేశాడు. రామ్, సంజయ్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక కావ్య థాపర్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. చాలా కాలం తర్వాత అలీ ఓ మంచి పాత్రలో కనిపించాడు. కానీ ఆయన కామెడీ వర్కౌట్ కాలేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. మణిశర్మ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు అంతంత మాత్రమే అయినా.. బీజీఎం మాత్రం అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్'.. ఏ ఓటీటీకి రానుందంటే?
రామ్ పోతినేని- పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ చిత్రం ఇవాళ థియేటర్లలో రిలీజైంది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఈ మూవీపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఉదయం నుంచే తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. డబుల్ ఇస్మార్ట్ సూపర్ హిట్ అంటూ థియేటర్ల వద్ద రామ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఈ మూవీని 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించారు.మొదటి నుంచే బజ్ ఉన్న మూవీ కావడంతో ఓటీటీ రైట్స్ కోసం భారీస్థాయిలో పోటీ నెలకొంది. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. దక్షిణాది భాషల్లో డిజిటల్ రైట్స్‌ను రూ.33 కోట్లకు దక్కించుకుంది. అయితే ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రన్ తర్వాతే ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే ఈ మూవీ హిందీ వర్షన్ డీల్ ఇంకా పూర్తి కాలేదు.కాగా.. ఈ చిత్రంలో రామ్‌కు జోడీగా కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, షాయాజీ షిండే, బానీ జే, అలీ, గెటప్ శ్రీను, మార్కండ్ దేశ్‌పాండే, ఉత్తేజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందించారు. -
రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?
రామ్ పోతినేని- పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీని 2021లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ముంబయి భామ కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్‌కు సిద్ధమైన ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్తో పాటు ఇండియాలోనూ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి.ఇవాళ థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రంపై నెటిజన్స్ ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమా అద్భుతంగా ఉందని.. ఫస్ట్ హాఫ్, సెకండాఫ్ ఎక్సలెంట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. రామ్ మాస్ యాక్షన్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు బ్లాక్‌బస్టర్ హిట్ అంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దీంతో ఉదయం నుంచే థియేటర్ల పండుగ వాతావరణం నెలకొంది. డబుల్ ఇస్మార్ట్‌కు హిట్ టాక్ రావడంతో రామ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. #DoubleISMART Super hit...My fav director puri sir is back...Positives Puri sir dialogues, Amma sentiment,mani Sharma music vere level, big plus Ram energy #DoubleismartonAug15th #DoubleISMARTCelebrations pic.twitter.com/xGwnAKPCAX— Srinu Nattu vidyam (@srinu18_srinu) August 14, 2024 Nandyal EMS mass crowd House full's everywhere 🔥🥵Ustaad @ramsayz ❤️🔥🥳#RAmPOthineni #DoubleISMART#DoubleismartRAmPAgepic.twitter.com/4CkXFS3zhF— DoubleISMART🔱 CITYZEN⚽️ (@Ismart_Cityzen) August 15, 2024 Just now completed ☑️ Congratulations #PuriJagannadh sir🎉Good Movie 👍2nd half >> 1st half Climax 💥💥💥#ManiSharma bgm and songs💥💥#DoubleISMART #RAmPOthineni pic.twitter.com/QJwUGJQbtt— JA$HU’NTR’ (@Jashu_Chowdary9) August 14, 2024 BLOCK BUSTER 💥💥🤟#DoubleISMART #BlockbusterDoubleISMART pic.twitter.com/s2GkDuAAId— RAm POthineni Trends (@RAPOFanTrends) August 15, 2024 -
నా అనుకున్న వాళ్లకే ఇస్తా.. అందుకే చెప్తున్నా: హీరో రామ్
రామ్ పోతినేని- పూరి జగన్నాధ్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండగా.. చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. హనుమకొండలోని జరిగిన ఈవెంట్‌కు చిత్ర యూనిట్ సభ్యులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో రామ్ అభిమానులను ఉద్దేశించి ఆసక్తకర కామెంట్స్ చేశారు. పక్కోడి గురించి.. పకోడీల గురించి పట్టింటచుకుంటే పనులు జరగవంటూ ఫ్యాన్స్‌కు అదిరిపోయే మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. రామ్ మాట్లాడుతూ..'ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ.. బయటకానీ ఓ ట్రెండ్ చూస్తున్నా. అరే... నీకిది నచ్చిందా? అని అంటే... వాళ్లకు నచ్చుతుందేమో... వీళ్లకు నచ్చుతుందేమోనని పక్కనోళ్ల మీద తోసేస్తున్నారు. ముందు మనకు నచ్చిందా? అనేది చూసుకోవాలి. మనం హోటల్‌కు వెళ్లి ఓ బిర్యానీ తిన్నామనుకోండి. బిర్యానీ బాగుందిరా అనుకోని.. చుట్టుపక్కల ఉన్న నలుగురు బాగలేదు అని అంటే మనమీద మనకు డౌట్ రాకూడదు. నేను తిన్నాను బాగుంది. అది బిర్యానీ అయినా, సినిమా అయినా.. రేపు మీ కెరీర్ అయినా..నీకు నచ్చింది నువ్వు చెయ్.. పక్కనోడి ఓపినియన్‌తో నీ అభిప్రాయం మార్చుకోవద్దు. ఎందుకంటే పక్కొడీ గురించి.. పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవు అన్నాయ్. మామూలుగా నేను సలహాలు ఇవ్వను. నా అనుకున్న వాళ్లకే ఇస్తా. మీరందరూ ఎందుకో నా మనుషులు అనిపించింది. అందుకే చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఆగస్టు 15న కలుద్దాం. లవ్ యూ ఆల్' అంటూ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఎమోషనల్‌గా స్పీచ్ ఇచ్చారు.ఈ చిత్రంలో హీరోయిన్ ముంబయి ముద్దగుమ్మ కావ్య థాపర్ కనిపించనుంది. ఇందులో సంజయ్ దత్ బిగ్బుల్ పాత్రలో మెప్పించనున్నారు. ఈ చిత్రంలో కమెడియన్ అలీ కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 15న థియేటర్లలోకి వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.పక్కనోడి గురించి.. పకోడీ గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవ్ అన్నాయ్..🔥#RamPothineni #DoubleISMART #TeluguFilmNagar pic.twitter.com/bMveIckc1Q— Telugu FilmNagar (@telugufilmnagar) August 11, 2024 -
Ram Pothineni: డబుల్ ఇస్మార్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
నేను ఒళ్లు దగ్గర పెట్టుకుని చేసిన సినిమా ఇది: పూరి జగన్నాథ్
‘‘ఈ మధ్య సోషల్ మీడియాలో, బయట ఓ ట్రెండ్ చూస్తున్నాను. అరే... నీకిది నచ్చిందా? అని అడిగితే... వాళ్లకు నచ్చుతుందేమో... వీళ్లకు నచ్చుతుందేమో అని తోటివారిపైకి తోస్తున్నారు. ముందు మనకు నచ్చిందా? అని చూసుకోవాలి. మీకు నచ్చింది మీరు చేయండి. పక్కోడి గురించి, పకోడీల గురించి పట్టించుకుంటే పనులు జరగవు. సాధారణంగా నేను సలహాలివ్వను. నా అనుకున్నవాళ్లు అడిగితే ఇస్తా. మీ అందర్నీ (ఫ్యాన్స్) నా వాళ్లుగా ఫీలై ఇస్తున్నాను’’ అని రామ్ అన్నారు.హీరో రామ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కాంబినేషన్లోనే 2019లో వచ్చిన హిట్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందింది. ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, అలీ కీలక పాత్రల్లో నటించారు. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో జరిగిన ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ మాట్లాడుతూ– ‘‘హీరోలు బుల్లెట్స్‌లాంటివారు. పేల్చే గన్ బాగుంటే బుల్లెట్ చాలా స్పీడ్‌గా వెళ్తుంది. పూరీగారిలాంటి గన్ ప్రతి ఒక్క యాక్టర్‌కి కావాలి. ఛార్మీ కౌర్‌గారు లేకపోతే ‘డబుల్ ఇస్మార్ట్’ లేదు. ఆమె ఓ ఫైటర్. బాస్ లేడీ అని పిలుస్తాను.‘డబుల్ ఇస్మార్ట్’ రేంజ్‌కి తగ్గట్లు, ప్రేక్షకుల అంచనాలను మించేలా మణిశర్మగారు మ్యూజిక్ ఇచ్చారు’’ అని అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘రామ్ లేకపోతే ఇస్మార్ట్ శంకర్ లేడు. సంజయ్ దత్‌గారు మా సినిమాలో యాక్ట్ చేసి, కొత్త కలర్ తీసుకొచ్చారు. నా నిర్మాణసంస్థకు ఛార్మీ కౌర్ ఓ బలం. నా దగ్గర రూపాయి లేకపోయినా నాకోసం ఎవరన్నా నిలబడ్డారంటే అది విషురెడ్డి. హిట్ సినిమా తీసినప్పుడు చాలామంది ప్రశంసిస్తారు. నా ఫ్లాప్ సినిమా విడుదలైన వారానికి విజయేంద్రప్రసాద్‌గారు ఫోన్ చేసి, ‘సార్... నాకో హెల్ప్ చేస్తారా?’ అన్నారు. ఆయన కొడుకే పెద్ద డైరెక్టర్.. రాజమౌళి. అలాంటిది ఆయన నన్ను హెల్ప్ అడుగుతున్నారేంటి? అనుకున్నా. ‘తర్వాతి సినిమా ఎప్పుడు చేస్తున్నారు? చేసే ముందు ఆ సినిమా కథ నాకోసారి చెప్తారా? మీలాంటి దర్శకులు ఫెయిల్ కావడం చూడలేను. చిన్న చిన్న తప్పులేవో ఉంటుంటాయి. తీసే ముందు నాకోసారి చెప్పండి’ అన్నారు. నేను భావోద్వేగానికి గురయ్యాను. అయితే ‘డబుల్ ఇస్మార్ట్’ కథను విజయేంద్రప్రసాద్‌గారికి చెప్పలేదు. తెలిసిన పనే కదా... ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా తీశా’’ అని తెలిపారు పూరి జగన్నాథ్. ‘‘ఇస్మార్ట్ శంకర్’ను ఆదరించినట్లే ‘డబుల్ ఇస్మార్ట్’నూ ఆదరించండి’’ అన్నారు ఛార్మీ. పూరీ కనెక్ట్స్ సీఈవో విషు రెడ్డి, అలీ తదితరులు పాల్గొన్నారు. -
నాలా ఎవరూ చేయకండి.. చాలా ప్రమాదం: హీరో రామ్
సినిమాల కోసం హీరోహీరోయిన్లు చాలా కష్టపడుతుంటారు. రిలీజ్ టైంలో ఇచ్చే ఇంటర్వ్యూల్లో ఈ విషయాల్ని బయటపెడుతుంటారు. యంగ్ హీరో రామ్ కూడా తన ఒక్క నెలలలో 18 కిలోలు ఎలా తగ్గానో చెప్పుకొచ్చాడు. అయితే తనలా ఎవరూ ప్రయత్నించొద్దని మాత్రం హెచ్చరిస్తున్నాడు. ఇంతకీ రామ్ ఏం చెప్పాడంటే?(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)''డబుల్ ఇస్మార్ట్' కోసం పూరీ జగన్నాథ్ చెప్పిన క్లైమాక్స్ కిక్ ఇచ్చింది. 'ఇస్మార్ట్ శంకర్'లానే ఇందులోనూ షర్ట్ లేకుండా క్లైమాక్స్ చేయాలనుకున్నాం. ఆ పార్ట్ అంతా నవంబరులోనే షూట్ చేయాలి. స్కంద రిలీజైన తర్వాత నాకు 2 నెలలు మాత్రమే సమయముంది. దాంతో వెంటనే బాలిలో ఓ ప్రాంతానికి వెళ్లి అక్కడే నెలరోజులు ఉండి ఫుల్లుగా వర్కౌట్ చేసి బరువు తగ్గాను. ఇలా తక్కువ టైంలో బరువు తగ్గడం ఆరోగ్యానికి ప్రమాదం. నేను చేసినట్లు ఎవరూ ప్రయత్నించొద్దు' అని రామ్ చెప్పుకొచ్చాడు.రామ్ కాబట్టి హెల్తీ డైట్ ఫాలో అవుతూ నెలలో 18 కిలోలు అంటే.. 86 నుంచి 68 కిలోలకు వచ్చాడు. సాధారణంగా ఇలా ఒకేసారి తగ్గితే మాత్రం శరీరంలో లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదముంది. రామ్-పూరీ కాంబోలో ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా తీసిన 'డబుల్ ఇస్మార్ట్'.. ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. పెద్దగా బజ్ అయితే లేదు. చూడాలి ఎలాంటి ఫలితం అందుకుంటుందో?(ఇదీ చదవండి: చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత చెల్లి!) View this post on Instagram A post shared by RAm POthineni (@ram_pothineni) -
ముంబైలో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ టీమ్ సందడి (ఫొటోలు)
-
డబుల్ ఇస్మార్ట్ సెన్సార్ రివ్యూ.. హైలెట్స్ ఇవే
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ , ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్ర పోషించాడు. రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది.పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్‌ని కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ జారీ చేశారు.ఇద్దరికి కంబ్యాక్ ఫిల్మ్!డబుల్ ఇస్మార్ట్ హిట్ డైరెక్టర్ పూరి, హీరో రామ్‌కి చాలా అవసరం. ఇద్దరి ఖాతాలో హిట్ లేదు. అందుకే చాలా జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇస్మార్ట్ శంకర్ మాదిరే డబుల్ ఇస్మార్ట్ కూడా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ ముందు నుంచి చెబుతున్నారు.తాజాగా సెన్సార్ సభ్యులు కూడా ఆ విషయాన్నే చెప్పినట్లు తెలుస్తోంది. సినిమా చూసి.. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ అని ప్రశంసించారట. సంజయ్ దత్, రామ్ పోతినేని మధ్య మైండ్ గేమ్ తో సాగే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. హీరో హీరోయిన్ల లవ్‌ట్రాక్ కూడా అదిరిపోయిందట. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేస్తుందని అంటున్నారు. అలీ కామెడీ, మణి శర్మ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్స్ అని చెప్పారట. సెన్సార్ సభ్యుల టాక్ బట్టి చూస్తే.. రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ ఇద్దరికీ కంబ్యాక్ ఫిల్మ్‌గా అవ్వబోతుందని తెలుస్తోంది. -
ఈసారి డబుల్ ఇస్మార్ట్ అంటున్న రామ్ పోతినేని.. మూవీ HD స్టిల్స్
-
ఆ పిచ్చి తగ్గక డైరెక్టర్ ని అయ్యా..
-
Ram Pothineni: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్'.. మ్యాడ్ ట్రైలర్ వచ్చేసింది!
రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో వస్తోన్న ఫుల్ యాక్షన్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. వైజాగ్‌లో నిర్వహించిన ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే రామ్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బిగ్బుల్ పాత్రలో మెప్పించనున్నారు. కాగా.. ఈనెల 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. Mamaaaaaa! #DoubleiSmartTrailer aaagayyaaaa! https://t.co/6PHbKXHj1Z -Ustaad #DoubleiSmart Shankar pic.twitter.com/7BtSgW5AeC— RAm POthineni (@ramsayz) August 4, 2024 -
బర్త్ డే స్పెషల్.. ఖరీదైన కారుతో డబుల్ ఇస్మార్ట్ నటుడు!
కేజీఎఫ్ సినిమాతో దక్షిణాదిలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న నటుడు సంజయ్ దత్. ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్న డబుల్ ఇస్మార్ట్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో బిగ్ బుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే జూలై 29న సంజయ్ దత్ 65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు పలువురు సినీతారలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తన బర్త్ డే రోజున అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చుకున్నారు. దాదాపు రూ.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే బాలీవుడ్లో గుడ్ఛాడీ మూవీలో సంజయ్ దత్ నటిస్తున్నారు. ఇందులో రవీనా టాండన్‌తో జతకట్టారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఆగస్టు 9న జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. ఆ తర్వాత రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమాలో కనిపించనున్నారు. #WATCH | Sanjay Dutt Gifts Himself New Range Rover On His 65th Birthday#Bollywood #SanjayDutt @duttsanjay pic.twitter.com/vIhiFbkpV2— Free Press Journal (@fpjindia) July 29, 2024 -
పదింటికే చలీ జ్వరం...
రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) కి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందింది. కావ్యా థాపర్ హీరోయిన్గా నటించారు. పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తోంది.మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘క్యా లఫ్డా..’ అంటూ సాగే మూడోపాటని సోమవారం రిలీజ్ చేశారు. ‘నరం నరం గరం గరం... పదింటికే చలీ జ్వరం, నీ ఊహలే నిరంతరం... పోతోందిరా నాలో శరం...’ అంటూ ఈపాట సాగుతుంది. శ్రీ హర్ష ఈమాని సాహిత్యం అందించిన ఈపాటని ధనుంజయ్ సీ΄ాన, సింధూజ శ్రీనివాసన్పాడారు. రామ్, కావ్యాల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, జియాని జియాన్నెలి. -
'డబుల్ ఇస్మార్ట్' నుంచి మరో సాంగ్ విడుదల
రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' సినిమా నుంచి మరో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ.. ఛార్మితో కలిసి పూరి కనెక్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభిస్తుంది. సుమారు ఐదేళ్ల తర్వాత రామ్,పూరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.2019లో వచ్చిన హిట్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తుంది. కావ్యా థాపర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అలీ, గెటప్ శ్రీను కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. అదేరోజున రవితేజ- హరీష్ శంకర్ల సినిమా మిస్టర్ బచ్చన్ విడుదల కానున్నడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. -
హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?
ఒకప్పుడు హీరోయిన్, ఇప్పుడు నిర్మాతగా సినిమాలు తీస్తున్న ఛార్మీ.. హీరో రవితేజతో పాటు డైరెక్టర్ హరీశ్ శంకర్‌ని ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది. అయితే స్నేహితులుగా ఉన్న వీళ్ల మధ్య అసలేం జరిగింది? ఛార్మీ ఎందుకిలా చేశారు అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?)డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీసిన 'డబుల్ ఇస్మార్ట్'.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ పూర్తవగా.. ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు పూరీతో పాటు ఛార్మీ నిర్మాతలు. ఇకపోతే ఇదే తేదీన రవితేజ-హరీశ్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' కూడా రిలీజ్ చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు.పూరీ జగన్నాథ్ శిష్యుడు హరీశ్ శంకర్. అలానే పూరీతో రవితేజకు మంచి బాండింగ్ ఉంది. వీళ్ల కాంబోలో ఐదు సినిమాలు వచ్చాయి. ఛార్మీ కూడా పూరీతో గత కొన్నేళ్ల నుంచి ట్రావెల్ అవుతోంది. ఇకపోతే వీళ్లంతా స్నేహితులే. అలాంటిది ఇప్పుడు ఛార్మీ.. రవితేజతో పాటు హరీశ్ శంకర్‌ని అన్ ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ ఒకే తేదీన రిలీజ్ అవుతున్నాయి. బహుశా వాయిదా వేయాలని ఏమైనా అనుకుని, సయోధ్య కుదరకపోవడంతో స్నేహితుల మధ్య మనస్పర్థలు వచ్చాయా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఛార్మీ క్లారిటీ ఇస్తే తప్ప అసలు నిజం ఏంటనేది బయటకురాదు.(ఇదీ చదవండి: హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?) -
డబుల్ ఇస్మార్ట్ కు కిక్ ఇచ్చే న్యూస్..
-
రిలీజ్‌కు ముందే భారీ డీల్.. డబుల్ ఇస్మార్ట్‌కు ఎన్ని కోట్లంటే!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్ ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ రిలీజ్ కాకముందే క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు విక్రయించినట్లు తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.33 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్ కీలకపాత్ర పోషిస్తున్నారు.