హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే? | Charmy Kaur Unfollows Ravi Teja And Director Harish Shankar | Sakshi
Sakshi News home page

Charmy Kaur: స్నేహితుల మధ్య మనస్ఫర్థలు.. కారణం అదేనా?

Jul 28 2024 12:22 PM | Updated on Jul 28 2024 12:53 PM

Charmy Kaur Unfollows Ravi Teja And Director Harish Shankar

ఒకప్పుడు హీరోయిన్, ఇప్పుడు నిర్మాతగా సినిమాలు తీస్తున్న ఛార్మీ.. హీరో రవితేజతో పాటు డైరెక్టర్ హరీశ్ శంకర్‌ని ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది. అయితే స్నేహితులుగా ఉన్న వీళ్ల మధ్య అసలేం జరిగింది? ఛార్మీ ఎందుకిలా చేశారు అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?)

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీసిన 'డబుల్ ఇస్మార్ట్'.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ పూర్తవగా.. ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు పూరీతో పాటు ఛార్మీ నిర్మాతలు. ఇకపోతే ఇదే తేదీన రవితేజ-హరీశ్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' కూడా రిలీజ్ చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు.

పూరీ జగన్నాథ్ శిష్యుడు హరీశ్ శంకర్. అలానే పూరీతో రవితేజకు మంచి బాండింగ్ ఉంది. వీళ్ల కాంబోలో ఐదు సినిమాలు వచ్చాయి. ఛార్మీ కూడా పూరీతో గత కొన్నేళ్ల నుంచి ట్రావెల్ అవుతోంది. ఇకపోతే వీళ్లంతా స్నేహితులే. అలాంటిది ఇప్పుడు ఛార్మీ.. రవితేజతో పాటు హరీశ్ శంకర్‌ని అన్ ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ ఒకే తేదీన రిలీజ్ అవుతున్నాయి. 

బహుశా వాయిదా వేయాలని ఏమైనా అనుకుని, సయోధ్య కుదరకపోవడంతో స్నేహితుల మధ్య మనస్పర్థలు వచ్చాయా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఛార్మీ క్లారిటీ ఇస్తే తప్ప అసలు నిజం ఏంటనేది బయటకురాదు.

(ఇదీ చదవండి: హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement