Harish Shankar
-
అమెరికాలో ఉస్తాద్ కలెక్షన్స్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో విడుదలైన కొత్త మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. మార్చి 19న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఉగాది, రంజాన్ సెలవులు ఉన్నప్పటికీ కలెక్షన్స్ పరంగా నిరాశపరిచింది. తొమ్మిదిరోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 68.06 కోట్ల నెట్ రాబట్టినట్లు సాక్నిల్క్ ట్రేడ్ సంస్థ ప్రకటించింది. అయితే, ఓవర్సీస్లో ఉస్తాద్ కనీసం 1మిలియన్ మార్క్ కూడా దాటలేదు. ఆపై శుక్రవారం నాడు నార్త్ అమెరికాలో ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.నార్త్ అమెరికాలో ఉస్తాద్ భగత్‌సింగ్ ఇప్పటి వరకు రూ. 6 కోట్లు మాత్రమే రాబట్టింది. అక్కడ లాభాల్లోకి ఈ చిత్రం రావాలంటే కనీసం మరో రూ. 7 కోట్లు రాబట్టాలి. లేదంటే భారీ నష్టాలు తప్పవు. ఇప్పటి వరకు ఈ సినిమా కనీసం 1 మిలియన్ డాలర్ల మార్కును కూడా అక్కడ అందుకోకపోవడంతో ట్రేడ్ నిపుణులు నివ్వెరపోయారు. శుక్రవారం నాడు అయితే అమెరికాలో కేవలం 4వేల డాలర్లు రూ. 3.79 లక్షలు మాత్రమే రాబట్టింది. సినిమా డిజాస్టర్ కావడంతో చాలాచోట్ల ఉస్తాద్‌ను తొలగించేశరాఉ. ఇది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని అంటున్నారు. బాక్సాఫీస్ వద్ద తమ అంచనాలను నిరాశపరిచినందుకు దర్శకుడు హరీష్ శంకర్‌ను చాలామంది ఫ్యాన్స్ నిందిస్తున్నారు. దీంతో ఆయన సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. అయితే, అమెరికాలో ధురంధర్-2 దుమ్మురేపుతుంది. ప్రస్తుతం రూ. 275 కోట్లు సాధించి రికార్డ్ నెలకొల్పింది. North America Thursday Gross | Totals: #DhurandharTheRevenge - $643K | $18.06M#Aadu3 - $8K | $465K#BandMelam - $6K | $8K#Youth - $4K | $98K#UstaadBhagatSingh - $4K | $780K— Venky Box Office (@Venky_BO) March 27, 2026 -
మారుతికి అర్థమైంది.. హరీశ్ శంకర్‌కి అర్థం కావట్లేదు!
ఏ సినిమా గానీ హిట్ అయిందా? ఫ్లాప్ అయిందా? అని రిలీజైన రోజే అందరికీ అర్థమైపోతుంది. కాకపోతే ఫ్లాప్ అనే నిజాన్ని ఒప్పుకొనే ధైర్యం అందరికీ ఉండదు. కొందరికి మొదట్లోనే సీన్ అర్థమైపోతే మరికొందరికి మాత్రం ఎప్పటికి అర్థం అవుతుందో అని సందేహం కలుగుతుంది. ఎందుకంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంతో గతవారం పలకరించిన దర్శకుడు హరీశ్ శంకర్.. మూవీ ఫ్లాప్ అయినా సరే విడిచిపెట్టట్లేదు. తాను తీసింది సూపర్ హిట్ అనే రేంజులో ప్రమోట్ చేసుకుంటున్నారు. తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్‌కి ఇచ్చిన సమాధానమైతే మరీ విచిత్రంగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలోనూ మొత్తం డిస్కషన్ ఈయన గురించే.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. అధికారిక ప్రకటన)గతంలో పవన్‌తో 'గబ్బర్ సింగ్' అనే రీమేక్ తీసి హిట్ కొట్టిన హరీశ్ శంకర్.. దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్'తో వచ్చాడు. దాదాపు అప్పటి తరహా టెంప్లేట్ స్టోరీ కావడం, మూసగా ఉందనే నెగిటివ్ టాక్ రావడంతో తొలిరోజు నుంచి నిర్మాతలు సైలెంట్ అయిపోయారు. ప్రతి మూవీకి కలెక్షన్స్ ప్రకటించే వీళ్లు.. 'ఉస్తాద్' విషయంలో మౌనం పాటించారు. అందరికీ అప్పుడే ఫలితం అర్థమైపోయింది. దర్శకుడు హరీశ్ శంకర్ మాత్రం తాను తీసింది హిట్ అనే రేంజులో ఇంటర్వ్యూలు, మీటప్స్ పెడుతూ బిజీ అయిపోయాడు. అందులో ఈయన, హీరోయిన్లు తప్పితే మరో టెక్నీషియన్ కనిపించలేదు.రెండు నెలల క్రితం అంటే సంక్రాంతికి వచ్చిన 'రాజాసాబ్' రిలీజ్‌కి ముందు దర్శకుడు మారుతి కూడా ఇలానే చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. తీరా థియేటర్లలోకి మూవీ వచ్చిన తర్వాత విషయం అర్థమైపోయి సైలెంట్ అయిపోయాడు. అభిమానులు ఎంతలా ట్రోల్ చేసినా సరే అవన్నీ భరిస్తూ వచ్చాడు తప్పితే ఏది పడితే అది మాట్లాడలేదు. హరీశ్ శంకర్ మాత్రం సినిమాలో తప్పుల్ని కూడా సమర్థించుకుంటున్నాడు. పవన్ ఎంట్రీ సీన్‌పై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ.. మాస్టర్ తీసింది, తాను తీసింది నచ్చడంతోనే రెండుషాట్స్ పెట్టానని చెప్పేసరికి నెటిజన్ల మతిపోతోంది. హిట్ అయిన సినిమా గురించి ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది గానీ ఫ్లాప్ అయిన మూవీ గురించి పదేపదే మాట్లాడినంత మాత్రాన అది హిట్ అయిపోదు. ఈ విషయం హరీశ్ శంకర్ ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో?(ఇదీ చదవండి: 'రాజాసాబ్' ఫ్లాప్ నుంచి కోలుకున్న మారుతి.. పోస్ట్ వైరల్) -
ఆల్‌టైమ్ డిజాస్టర్‌గా ఉస్తాద్ భగత్‌సింగ్..
'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైందని పూర్తి లెక్కలతో వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా నటించిన ఈ మూవీని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు. సుమారు. 150 కోట్లకు పైగా బడ్జెట్‌తో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. అయితే, సినిమా విడుదలై వారం గడిచినప్పటికీ కలెక్షన్స్‌పై కనీసం ఒక్క పోస్టర్ కూడా నిర్మాతలు విడుదల చేయలేదు. అందుకు ప్రధాన కారణం సినిమా ఫలితమేనని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే, ట్రేడ్ వెబ్సైట్ సక్నిల్క్ బాక్సాఫీస్ గణాంకాల ప్రకారం చూస్తే ఆల్‌టైమ్ డిజాస్టర్‌గా ఉస్తాద్ భగత్‌సింగ్ నిలిచిపోయింది.'ఉస్తాద్ భగత్ సింగ్' నష్టాల దెబ్బ నిర్మాతల కంటే డిస్ట్రిబ్యూటర్స్పైనే ఎక్కువ పడింది. భారీ ధరకు కొనుగోలు చేసిన వారు పెట్టుబడిలో కనీసం సగం కలెక్షన్స్ కూడా తెచ్చుకోలేకపోయారు. ఓవర్సీస్లో ఉస్తాద్‌ను విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ముందుకు రాకపోవడంతో మైత్రీ మూవీస్ వారే రిలీజ్ చేశారు. ఆపై సీడెడ్, కర్ణాటకలతో పాటు ఏపీలో కూడా పేలవంగా కలెక్షన్స్ రాబట్టింది.పెట్టుబడిలో సగం కూడా రాలేదుట్రేడ్ వెబ్సైట్ సక్నిల్క్ ప్రకారం ఉస్తాద్ భగత్‌సింగ్ మొదటి వారం రూ. 65.74 కోట్ల నెట్ సాధించింది. ఏడోరోజు కేవలం కోటి రూపాయలు మాత్రమే రాబట్టడంతో పవన్ కల్యాణ్ మార్కెట్ సత్తా ఇంతేనా అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ ప్రకారం ట్రెండ్ చూస్తే రూ. 70 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో ఉస్తాద్ ప్రయాణం ముగిసిపోవడం దాదాపు ఖాయం. ఒక్క నైజాం ఏరియాలోనే దాదాపు రూ. 30 కోట్ల నష్టం రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కోసం సుమారు రూ. 115 కోట్లు పెట్టుబడి పెట్టారని సమాచారం. అయితే, ఏడురోజుల్లో రూ. 50 కోట్లు మాత్రమే రికవరీ అయినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిచోట ఈ మూవీకి పెట్టిన పెట్టుబడిలో సగం కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో భారీ నష్టాలను ఎదుర్కొవాల్సిన పరిస్థితి డిస్ట్రిబ్యూటర్స్‌కు ఏర్పడింది.పవన్ గత సినిమా 'ఓజీ' కేవలం నాలుగు రోజుల్లోనే రూ.130 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టించింది. కానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫైనల్ కలెక్షన్స్ కూడా రూ.100 కోట్ల మైలురాయిని చేరలేకపోవడం కష్టమే.. ఆశ్చర్యకరంగా, ఈ చిత్రం ఉత్తర అమెరికాలో 1 మిలియన్ డాలర్ కంటే తక్కువ వసూలు చేసింది. ఇది దాని ఘోరమైన ప్రదర్శనను స్పష్టం చేస్తోంది. ఈ మధ్య విడుదలైన డిజాస్టర్ సినిమాలు అఖండ -2, హరి హర వీర మల్లు చిత్రాలు కూడా 1 మిలియన్ డాలర్ల మార్కును దాటాయి. కానీ, 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆ మైలురాయిని చేరుకోవడంలో విఫలమైంది. -
పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?
గతంలో పవన్ కల్యాణ్ వరస ఫ్లాప్ సినిమాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు 'దబంగ్'ని రీమేక్ చేసి 'గబ్బర్ సింగ్' తీసిన దర్శకుడు హరీశ్ శంకర్ హిట్ కొట్టాడు. ఇది 2011లో జరిగింది. మూవీలో కంటెంట్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉండేసరికి ప్రేక్షకులు ఆదరించారు. దాదాపు అదే టెంప్లేట్‌తో తీసిన 'ఉస్తాద్ భగత్ సింగ్' రీసెంట్గా థియేటర్లలోకి వచ్చింది. పవన్ అభిమానుల కోసం దీన్నే తీశానని హరీశ్ శంకర్ మొదటి నుంచి చెబుతూ వచ్చాడు. అందుకు తగ్గట్లే ఫ్యాన్స్‌కి తప్పితే సగటు ఆడియెన్స్‌కి నచ్చలేదు. బుకింగ్సే అందుకు నిదర్శనం.(ఇదీ చదవండి: శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!)ఇప్పుడు పవన్‌తో మరో సినిమా తీస్తానని హరీశ్ శంకర్ అంటున్నాడు. ఈసారి స్టోరీ కొత్తగా ఉంటుందని, అందరికీ నచ్చేలా తీస్తానని అంటున్నాడు. అయితే ఈ దర్శకుడు మూవీ చేస్తానని అనడం బాగానే ఉంది గానీ పవన్ ఒప్పుకొన్నాడా లేదా అనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం పవన్ చేతిలో సురేందర్ రెడ్డి మూవీ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఒప్పుకొన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటి తర్వాత మూవీస్ చేస్తాడా అనేది సందేహమే.హరీశ్ శంకర్ ట్రాక్ రికార్డ్ చూస్తే.. అప్పుడెప్పుడో వచ్చిన 'గబ్బర్ సింగ్' హిట్ అయింది. తర్వాత చేసిన వాటిలో దువ్వాడ జగన్నాథం, సుబ్రమణ్యం ఫర్ సేల్ ఉన్నంతలో ఆకట్టుకున్నాయి. గద్దలకొండ గణేశ్, మిస్టర్ బచ్చన్ లాంటి రీమేక్స్ అయితే బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. ఇప్పుడు తీసిన 'ఉస్తాద్..' ప్రకటించి, పూర్తి చేసి రిలీజ్ చేయడానికే ఐదేళ్లు పట్టేసింది. ఇప్పుడు మరో సినిమా అంటే అయ్యే పనేనా అని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ పవన్ ఒప్పుకొన్న ప్రొడ్యూసర్ ఎవరనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పెద్ది'కి ఐటమ్ బ్యూటీ దొరికేసింది!) -
శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!
ఓ సినిమా హిట్-ఫ్లాప్ అనేది చాలా కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు అంటే స్టార్ హీరోల మూవీస్ ఓ మోస్తరుగా ఉన్నా ఆడేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అభిమానుల కోసం స్పెషల్‌గా తీశామని దర్శకులు చెబుతున్నా ఎందుకనో పెద్దగా వర్కౌట్ కావట్లేదు. ఇందుకు లేటెస్ట్ ఉదాహరణ 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఉగాది కానుకగా థియేటర్లలోకి వచ్చింది. తొలి షో నుంచి నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది.(ఇదీ చదవండి: ఉస్తాద్ భగత్‌సింగ్ కలెక్షన్స్.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్)విడుదలైన రోజు ఉగాది కావడం, 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ షోలు పడకపోవడంతో ఉన్నంతలో ఆడియెన్స్ ఈ మూవీకి వచ్చారు. దీంతో రూ.30 కోట్లకు పైనే కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. కానీ రెండురోజుకి(శుక్రవారం) వసూళ్లలో విపరీతమైన డ్రాప్ కనిపించింది. కేవలం రూ.9 కోట్లే వచ్చాయని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వీకెండ్ అయ్యేసరికి మరింతగా వసూళ్లు తగ్గిపోవచ్చు.ఇకపోతే ఈ మూవీలో పవన్ సరసన రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. రాశీఖన్నా పాత్ర గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సెకండాఫ్‌ని ఫ్లాష్ బ్యాక్‌లో శ్రీలీల కనిపిస్తుంది. ఈమె వరకు యాక్టింగ్ పర్లేదనిపించినప్పటికీ ఎందుకనో ఈ మూవీ కూడా ఈమెకు కలిసివచ్చేలా కనిపించట్లేదు. 'ఉస్తాద్..' సక్సెస్‌పై ఈమె బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఈ మూవీ కోసం రెండు మూడు చిత్రాలు కూడా వదిలేసుకుంది. చూస్తే ఇప్పుడి పవన్ కల్యాణ్ కూడా ఈమెని కాపాడలేకపోయాడనిపిస్తోంది.తెలుగులో గత ఐదేళ్ల నుంచి శ్రీలీల సినిమాలు చేస్తోంది. తొలి చిత్రం 'పెళ్లి సందడి' పర్లేదనిపించింది. రవితేజతో చేసిన 'ధమాకా' సూపర్ హిట్ అయింది. తర్వాత చేసిన వాటిలో 'భగవంత్ కేసరి' మాత్రమే హిట్ అనిపించింది. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డీనరీ మ్యాన్, గుంటూరు కారం, రాబిన్‌హుడ్, జూనియర్, మాస్ జాతర వరకు అన్ని ఫెయిల్యూర్సే. తమిళంలో ఈ సంక్రాంతికి వచ్చిన మొదటి మూవీ 'పరాశక్తి'ది కూడా ఇదే ఫలితం. ఇప్పుడు పవన్ 'ఉస్తాద్..' కూడా ఇదే లిస్టులో చేరేలా కనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా) -
'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. ఇలా అంటున్నారేంటి?
పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. తొలి నుంచి ఇది తమిళ మూవీ 'తెరి'కి రీమేక్ అని ప్రచారం సాగింది. గత కొన్నాళ్ల నుంచి ఈ విషయాన్ని డైరెక్టర్ ఖండిస్తూ వచ్చాడు. అయినా సరే దీనిపై పెద్దగా బజ్ లేదు. దానికి తోడు 'ధురంధర్ 2'కి పోటీగా థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఆంధ్రలో ఎర్లీ మార్నింగ్, ఓవర్సీస్ షోలు పడ్డాయి. మూవీ చూసిన ప్రేక్షకులు.. సోషల్ మీడియాలో ఏముంటున్నారు? ట్విటర్ టాక్ ఏంటి?(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)'ఉస్తాద్ భగత్ సింగ్' పూర్తిగా ఔట్ డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్. రైటింగ్ పరంగా కొత్తగా ఏం ఆశించలేం కానీ ఉన్నంతవరకైనా బాగా తీయాలిగా. అది కూడా సరిగా తీయలేదు. కొన్ని ఎలివేషన్ సీన్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి. కామెడీ, కమర్షియల్ రైటింగ్ విషయంలో దర్శకుడు హరీశ్ శంకర్ ఘోరంగా ఫెయిలయ్యాడు. అలానే పవన్ ఎనర్జీ కూడా మిస్ అయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)#UstaadBhagatSingh A Completely Outdated Commercial Entertainer!A commercial film like this doesn’t necessarily need out of the box writing, but it atleast needs some freshness. This one feels outdated to the core from the start to end. A few elevation blocks work, but the film…— Venky Reviews (@venkyreviews) March 18, 2026#UstaadBhagatSingh - PK’s look, Screen presence & Dialogues r the positives in this Routine, Outdated Drama. Parthiban Naidu as weak villain. Sreeleela ok. Raashi Khanna has no scope. Thaman does a Anirudh work in BGM. One melody track nice. Narration is a Patience Tester. BORE!— Christopher Kanagaraj (@Chrissuccess) March 18, 2026Indukenemo manaki raanidi..mana valla kaanidi cheyyakudadu antuntaru.. #HarishShankar @/harish2you#UstaadBhagatSingh #UBSReview https://t.co/Maam0Ys7tM pic.twitter.com/Pw5e37SahX— Sasi Kiran (@SasiKir54703134) March 18, 2026#UstaadBhagatSinghOutdated from start to finish.A few elevation scenes work, but overall feels like stitched mass compilation with weak flow.#PawanKalyan shines in bits, but energy is missing.#HarishShankar disappoints wth forced comedy & writing.⭐ 1.5/5 - Save your money. pic.twitter.com/N6ZoLLhQqS— theindia.360 (@theindiaa360) March 19, 2026ఫస్ట్ హాఫ్ పర్లేదు అనుకునేలోపు, సెకండ్ హాఫ్ సహనానికి పరీక్ష పెట్టింది. #UstaadBhagatSingh@PawanKalyan@harish2you— 𝕤𝕣𝕚𝕟𝕦 𝕧𝕚𝕥𝕒𝕝 (@srinuvital) March 19, 2026Painful 1st half.. PawanKalyan lost his touch in acting, trying his best.. Not a single ticket worthy episode. Weak writing with no proper story & screenplay underlined by excellent bgm.. collar etthara song is good. Worst interval, hope 2nd half saves #UBS #UstaadBhagatSingh— Peter Reviews (@urstrulyPeter) March 18, 2026 -
వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్.. టెన్షన్లో పవన్ ఫ్యాన్స్!
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. సినిమా అనౌన్స్మెంట్ మొదలు రిలీజ్ వరకు అన్నింట్లోనూ సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. ఇక హీరో-డైరెక్టర్, హీరో, హీరోయిన్ల కాంబినేషన్ విషయంలోనూ సెంటిమెంట్ చూస్తుంటారు. ఒక సినిమాకి సంబంధించిన ఈవెంట్‌కి ఎవరినైనా గెస్ట్‌గా పిలవాలంటే.. దానికి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. ఫలానా హీరో ప్రీరిలీజ్ ఈవెంట్‌కి వస్తే సినిమా హిట్ అవుతుందని నమ్మే దర్శకనిర్మాతలు చాలానే ఉన్నారు. ఇదంతా పాజిటివ్ సెంటిమెంట్. ఇదే ఇండస్త్రీలో నెగెటివ్ సెంటిమెంట్ కూడా ఉంది. పలాన హీరో.. పలానా దర్శకుడితో సినిమా తీస్తే ఫ్లాప్ గ్యారెంటీ.. ఆ ఇద్దరు స్టార్స్ రెండోసారి కలిస్తే.. అపజయం తప్పదు అనే నమ్మేవాళ్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా అభిమానులు ఎక్కువగా ఈ నెగెటివ్ సెంటిమెంట్లను నమ్ముతుంటారు. కొన్ని సందర్భాలలో వారి నమ్మకం నిజం అవుతుంటాయి కూడా. ఇప్పుడు ఇలాంటి ఒక బ్యాడ్ సెంటిమెంట్ పవన్ కల్యాణ్ అభిమానులను టెన్షన్ పెడుతుంది. అదేంటో చదివేయండి..రెండోసారి ఫ్లాప్పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఒక డైరెక్టర్‌తో రెండో సినిమా తీస్తే ప్లాప్ గ్యారెంటీ. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ మినహా..ఆయన కెరీర్ మొత్తంలో రెండోసారి సినిమా చేసిన దర్శకులందరికీ అపజయమే ఎదురైంది. పవన్ కల్యాణ్‌కి ‘తొలిప్రేమ’తో తొలి హిట్ అందించిన దర్శకుడు కరుణాకరన్. ఆ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘బాలు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అలాగే ‘సుస్వాగతం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్, దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు కాంబినేషన్లో వచ్చిన ‘అన్నవరం’ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.పవన్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘బద్రి’ సూపర్ హిట్ అయితే.. రెండో చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ డిజాస్టర్ అయింది. ‘ఖుషీ’ తర్వాత ఎస్ జే సూర్య దర్శకత్వంలో నటించిన ‘కొమరం పులి’ సినిమా కూడా ప్లాప్ అయింది. కిషోర్ పార్ధసాని (డాలీ), పవన్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘గోపాల గోపాల’ ఓ మోస్తరు విజయం సాధిస్తే.. ‘కాటమ రాయుడు’ డిజాస్టర్‌గా నిలిచింది. త్రివిక్రమ్ ఒక్కడే.. పవన్‌తో రెండోసారి సినిమా తీసిన దర్శకులంతా అపజయాలనే అందించారు. ఒక త్రివిక్రమ్ మాత్రం వరుసగా రెండు హిట్లు(జల్సా, అత్తారింటికి దారేది) ఇచ్చాడు. ఇదే జోష్‌లో ముచ్చటగా మూడో సినిమాగా ‘అజ్ఞాతవాసి’ తీస్తే..అది అతిపెద్ద డిజాస్టర్ అయింది.ఉస్తాద్ రిలీజ్..టెన్షన్లో ఫ్యాన్స్ఇప్పుడు ఈ బ్యాడ్ సెంటిమెంట్ చూసే పవన్ అభిమానులు భయపడుతున్నారు. హరీశ్ శంకర్- పవన్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh). అంతకు ముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’బ్లాక్ బస్టర్ అయింది. సెంటిమెంట్ ప్రకారం చూస్తే.. మార్చి 19న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఫ్లాప్ కావాలి. ఇప్పుడు అదే అభిమానులను కలవర పెడుతుంది. ఇప్పటీకీ ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. ఈ చిత్రానికి పోటీగా వస్తున్న ‘ధురంధర్ 2’ బుకింగ్స్ విషయంలో దూసుకెళ్తుంది. ట్రైలర్ కూడా అదిరిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్‌కు మిశ్రమ స్పందన రావడం.. బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉండడంతో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మరి సెంటిమెంట్ ప్రకారం సినిమా ప్లాప్ అవుతుందా లేదా సెంటిమెంట్‌ని బద్దలు కొట్టి హిట్ అవుతుందా అనేది రెండు రోజుల్లో తేలిపోతుంది. -
చిరంజీవితో సినిమా.. హరీశ్ శంకర్ ఆశ పెద్దదే!
టాలీవుడ్ దర్శకుల్లో చాలామందికి చిరంజీవితో సినిమా చేయాలని ఆశ. కానీ ఎప్పటికప్పుడు చిరంజీవి మూవీస్ లైనప్ మారిపోతూనే ఉంది. ప్రస్తుతానికైతే యంగ్ డైరెక్టర్స్‌కే ఎక్కువగా అవకాశమిస్తున్నారు. సంక్రాంతికి అనిల్ రావిపూడితో వచ్చి హిట్ కొట్టారు. 'విశ్వంభర' కోసం వశిష్ఠతో పనిచేశారు. ప్రస్తుతం బాబీతో, శ్రీకాంత్ ఓదెలతో తలో ప్రాజెక్ట్ చేయనున్నారు. తర్వాత ఎవరితో చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. అలాంటిది ఇప్పుడు హరీశ్ శంకర్.. చిరుతో మూవీ చేయాలని ఆశపడుతున్నాడు.(ఇదీ చదవండి: రిలీజ్‌కు ముందే దూకుడు.. ఓజీ, బాహుబలి-2 రికార్డ్స్ బ్రేక్..!)పవన్‌తో కలిసి గతంలో 'గబ్బర్ సింగ్' చేసి బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న హరీశ్ శంకర్.. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' చేశాడు. ఈ గురువారమే సినిమా థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్లలో భాగంగానే చిరంజీవితో మూవీ చేయడం గురించి హరీశ్ శంకర్ మాట్లాడాడు. రౌడీ అల్లుడు, దొంగ మొగడు లాంటి ఎంటర్టైనర్ తీయాలని ఉందంటూ తన ఆశని బయటపెట్టాడు.'ఈ (ఉస్తాద్ భగత్ సింగ్) ట్రైలర్ చూసి చిరంజీవి నాతో 20 నిమిషాలు మాట్లాడారు. డైలాగ్స్ బాగున్నాయని మెచ్చుకున్నారు. పవన్ అందంగా ఉన్నారని చెప్పారు. ఆయన ఫోన్ పెట్టేసిన తర్వాత నాకో విషయం అర్థమైంది. చిరంజీవికి పవన్ తమ్ముడు మాత్రమే కాదు కొడుకు కూడా అనిపించింది. నేను చిరంజీవిని చాలాసార్లు కలిశాను. కలిసి కొన్ని యాడ్స్ కూడా తీశాను. ఆయనతో నా మూవీ ప్రాసెస్‌లో ఉంది. కచ్చితంగా మెగాస్టార్‌తో గ్యాంగ్ లీడర్, దొంగ మొగుడు, రౌడీ అల్లుడు లాంటి సినిమా చేసి తీరతాను' అని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చాడు.హరీశ్ శంకర్ చెప్పడం వరకు బాగానే ఉంది గానీ చిరంజీవి యస్ చెబతారా అనేది ప్రశ్న. ఎందుకంటే హరీశ్ శంకర్ దర్శకుడిగా సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ లేవు. అప్పుడెప్పుడో వచ్చిన గబ్బర్ సింగ్ మాత్రమే పెద్ద హిట్. తర్వాత చేసిన వాటిలో ఒకటి రెండు హిట్స్ ఉన్నప్పటికీ అవి బాక్సాఫీస్ దగ్గర ఓకే ఓకే అనిపించాయి. గత చిత్రం 'మిస్టర్ బచ్చన్' అయితే ఘోరమైన డిజాస్టర్. 'ఉస్తాద్' సంగతేంటనేది మరో రెండు రోజుల్లో తేలుతుంది. ప్రస్తుతానికైతే ఈ మూవీపై పెద్దగా బజ్ లేదు. ఇది హిట్ అయి, హరీశ్ శంకర్ ఆశ నిజమవుతుందో లేదో చూడాలి? ఎందుకంటే గతంలోనే చిరు-హరీశ్ మూవీ అంటూ రూమర్స్ వచ్చాయి.(ఇదీ చదవండి: త్వరలోనే విజయ్‌తో పెళ్లి.. ఇలా హింట్ ఇచ్చిన త్రిష తల్లి!) -
‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఉస్తాద్ ఆశలన్నీ ట్రైలర్ మీదే.. తేడా వస్తే గల్లంతే
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. అయితే, ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. అదేరోజున ధరంధర్-2 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో రెండు సినిమాల మధ్య గట్టిపోటీ ఏర్పడనుంది. ఉస్తాద్ భగత్‌సింగ్ నుంచి ఇప్పటికే భారీగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా కాలరే ఎత్తరా... అంటూ సాగే పాటని విడుదల చేశారు.ధురంధర్ స్పీడ్ఇప్పటికే ధరుంధర్-2 టికెట్స్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. దీంతో సరైన ప్లానింగ్‌తో పద్ధతి ప్రకారం చిత్ర యూనిట్ ముందుకెళ్తుంది. అయితే, ఉస్తాద్ భగత్‌సింగ్ మేకర్స్ ఇప్పటివరకు మూడు పాటలను విడుదల చేశారు. దేఖ్లెంగే సాలా సాంగ్ అభిమానులను ఆకట్టుకుంది. సోషల్‌మీడియాలో మంచి స్పందన కూడా వచ్చింది. అయితే, ఆ తరువాతి రెండు పాటలు ఆరా ఆఫ్ ఉస్తాద్, కాలరే ఎత్తరా... చుట్టూ హైప్ ఉన్నప్పటికీ అనుకున్నంత రేంజ్లో బజ్ క్రియేట్ చేయడంలో విఫలమయ్యాయి.ముఖ్యంగా, తాజాగా విడులైన కాలరే ఎత్తరా... పాటలో పవన్ కల్యాణ్ డ్యాన్స్ చూస్తారని హరీష్ శంకర్ పదే పదే సూచించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సాంగ్ మేకింగ్ రిఫ్రెషింగ్‌గా ఉన్నప్పటికీ, ఈ పాట చాలా మంది అభిమానులకు ఊహించినంత హైప్‌ని అందించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.మొత్తంమీద, ఉస్తాద్ భగత్‌సింగ్ నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చాలా యావరేజ్‌గా ఉందని అంటున్నారు. ఈ మూవీపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ, బజ్ క్రియేట్ చేయడంలో విఫలమయ్యారు. ఇక అందరి చూపు మార్చి 14న విడుదల కానున్న ట్రైలర్ మీదనే ఆశలు ఉన్నాయి. సినిమాలో బలమైన కంటెంట్‌తో పాటు భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని తెలిపేలా ట్రైలర్ కట్ ఉంటేనే సినిమాకు బలం పెరుగుతుంది. ఇప్పుడు అందరి చూపు ట్రైలర్‌పైనే ఉంది. ఇక్కడ కూడా సరైన కంటెంట్ లేకుండా విడుదల చేస్తే ఇబ్బందులు తప్పవు. ఆపై ధురంధర్-2 వంటి హిట్ ప్రాంఛైజ్ని తట్టకుని ఉస్తాద్ ఎంతమేరకు నిలబడుతాడో చూడాల్సి ఉంది.ట్రైలర్‌తో తేలిపోతుంది.తమిళ్ హిట్ సినిమా తేరి రీమేక్‌గా ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాన్ని తెరకెక్కించారని విమర్శలు ఉన్నాయి. అయితే, దర్శకుడు హరీశ్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అందులో ఎలాంటి నిజంలేదని చెప్పారు. ఉస్తాద్ సరికొత్తగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ట్రైలర్ విడుదల కానున్నడంతో అసలు విషయం ఏంటి అనేది కూడా తెలిసిపోతుంది. ఒకవేళ తేరి రీమేక్ అయితే మాత్రం ఉస్తాద్ భగత్‌సింగ్‌ను ఎవరూ కాపాడలేరనేది వాస్తవం. -
ఖుషి రోజులను గుర్తు చేసేలా ఉంటుంది: నిర్మాత రవిశంకర్ యలమంచిలి
‘‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా చాలా బాగా వచ్చింది. ‘గబ్బర్ సింగ్’ మూవీ స్థాయికి తగ్గకూడదనే లక్ష్యంతో హరీష్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కించారు. ‘ఖుషి’ నాటి రోజులను గుర్తు చేసేలా ఈ చిత్రం ఉంటుందని హామీ ఇవ్వగలను. అన్ని వాణిజ్య అంశాలతో రూపొందిన ఈ సినిమా ఆద్యంతం ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అని నిర్మాత రవిశంకర్ యలమంచిలి పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ చిత్రం 19న విడుదల కానుంది.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘కాలరే ఎత్తరా..’ అంటూ సాగే మూడో పాటని విడుదల చేశారు మేకర్స్. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటని రామ్ మిర్యాల పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ–‘‘1500 నుంచి 2000 మందితో ఈ పాటను తెరకెక్కించాం. మైత్రి మూవీ మేకర్స్‌లాంటి నిర్మాతలు దొరకడం నా పూర్వజన్మ సుకృతం’’ అని తెలిపారు. ‘‘నేను కూడా ఈ పాటను ఎంతో ఎంజాయ్ చేశాను’’ అన్నారు రాశీ ఖన్నా. పాటల రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడారు. -
మహేష్ ఫ్యాన్స్ కోసమే కామెంట్స్ ఓపెన్ చేశాను: హరీశ్ శంకర్
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కోపానికి గురైన దర్శకుడు హరీశ్ శంకర్ తన పొరపాటును బహిరంగంగా ఒప్పుకున్నారు. “BoB రికార్డులు మళ్లీ లేపరా” అంటూ వచ్చిన ఒక పోస్టుకు హరీశ్ శంకర్ ‘తథాస్తు’ అని రిప్లయ్ ఇవ్వడం మహేష్ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. వెంటనే ట్వీట్‌ను డిలీట్ చేసినప్పటికీ, అభిమానుల ఆగ్రహం మాత్రం తగ్గలేదు. “నేను అంత స్పీడ్‌గా రియాక్ట్ కాకుండా, ట్వీట్ పూర్తిగా చదివి రెస్పాండ్ అవ్వాల్సింది. 30 సెకన్లలోనే డిలీట్ చేశాను. ‘బీ..వో’ అనే పదాలు కనిపించడంతో తొందర్లో బాక్సాఫీస్ అనుకున్నాను. అది పొరపాటు. అయినప్పటికీ కర్మను నమ్ముతాను. అందుకే క్షమాపణలు చెబుతూ నోట్ పెట్టిన తర్వాత కామెంట్ సెక్షన్ కూడా ఓపెన్ చేశాను. ఎంతయినా తిట్టండి అని అనుమతించాను” అని హరీశ్ తెలిపారు. “గద్దలకొండ గణేశ్ సినిమా బాగుందని మహేష్ బాబు స్వయంగా ట్వీట్ చేసి నన్ను అభినందించారు. నన్ను ప్రోత్సహించాల్సిన అవసరం లేని వ్యక్తి అయినా, మనస్ఫూర్తిగా అభినందించారు. అలాంటి వ్యక్తి గురించి పొరపాటున నేను తప్పుగా ట్వీట్ చేయడం మహాపాపం. నేను ధర్మబద్ధంగా బతికే వ్యక్తిని, అధర్మం పనులు చేయను. ఇది తప్పు కాదు, పొరపాటు మాత్రమే” అని హరీశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా అన్ని రికార్డులను బద్దలుకొడుతుందని తాను కూడా నమ్ముతున్నానని హరీశ్ ప్రకటించారు. -
ఉస్తాద్ భగత్‌సింగ్ 'కాలరే ఎత్తరా..' సాంగ్ విడుదల
పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. తాజాగా ఈ మూవీ నుంచి కాలరే ఎత్తరా ఫుల్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను సింగర్ రామ్ మిరియాల ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. -
మహేష్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన హరీష్ శంకర్
-
పవన్ కల్యాణ్ డూప్‌గా హరీశ్.. దర్శకుడు ఏమన్నాడంటే..
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయాడు దర్శకుడు హరీశ్ శంకర్. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనపై వచ్చిన ఓ క్రేజీ రూమర్‌పై స్పందించారు.పవన్ కాదు.. డూప్గబ్బర్ సింగ్ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఏపీలో ఎన్నికల కంటే ముందే ఈ మూవీ అనౌన్స్మెంట్ జరిగింది. ఎన్నికల తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో షూటింగ్ వాయిదా పడింది. ఒకనొక దశలో ఈ మూవీ ఆగిపోయిందనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆ సమయంలోనే ప్రీలుక్ పోస్టర్ని వదిలారు. అందులో పవన్ కల్యాణ్ ఖాకీ డ్రెస్‌లో కుర్చీలో కూర్చొని ఉంటాడు. అయితే హీరో ముఖం కనిపించకుండా వెనక నుంచి ఫోటో తీసి పోస్టర్ వదిలారు. ఆ సమయంలో అందులో ఉన్నది పవన్ కల్యాణ్ కాదంటూ రూమర్స్ వచ్చాయి. హరీశ్ శంకరే పవన్‌కు డూప్‌గా నటించారనే వార్తలు వైరల్ అయ్యాయి. టీజర్ విడుదలైన తర్వాత కూడా కొందరు ప్రేక్షకులు ఆయనే డూప్‌గా నటించారని అన్నారు.బాధ కాదు.. హ్యాపీగా ఫీలయ్యా.. ఈ రూమర్స్‌పై తాజాగా హరీశ్ శంకర్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఇప్పటి వరకు తాను పవన్‌కు డూప్‌గా నటించలేదని స్పష్టం చేశాడు. ప్రీలుక్ రిలీజ్ సమయంలో వచ్చిన రూమర్స్ చూసి బాధ పడలేదని, పవన్‌తో తనను పోల్చడం, తాను ఒక స్టార్ హీరోలా కనిపిస్తున్నానని జనం అనుకోవడం తనకు సంతోషాన్నిచ్చిందని చెప్పారు. అలాగే బాడీ డూప్ గురించి మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో హీరోలకు చిన్న గాయం తగిలినా షూటింగ్ షెడ్యూల్స్ మొత్తం అస్తవ్యస్తమవుతాయని, దాని వల్ల నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం వస్తుందని, అందుకే డూప్‌ని వాడతారని చెప్పారు. ఉస్తాద్ విషయానికొస్తే..హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. -
'విశ్వంభర' కోసం తల ఒంచుకుని పనిచేస్తున్నా
మెగాస్టార్ చిరంజీవి చేసిన భారీ బడ్జెట్ సినిమా 'విశ్వంభర'. లెక్క ప్రకారం గతేడాదిలోనే థియేటర్లలోకి రావాలి కానీ అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. దీని తర్వాత చిరు చేసిన 'మన శంకరవరప్రసాద్' రిలీజై నెలలు గడిచిపోతోంది గానీ దీని అప్డేట్ ఏంటనేది ఇప్పటివరకు తెలియట్లేదు. ఈ ఏడాది ద్వితియార్థంలోనే రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు గానీ అదెప్పుడనేది తెలియట్లేదు. ఇకపోతే ఇప్పుడీ చిత్రం గురించి, ఇందులో గ్రాఫిక్స్ గురించి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మూవీ ప్రెస్మీట్లో మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో కెమెరామ్యాన్స్ పరిస్థితి ఎలా ఉందో బయటపెట్టారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా)'సినిమాటోగ్రాఫర్ ఎవరైనా పర్లేదు. సీజీ(కంప్యూటర్ గ్రాఫిక్స్)వాళ్లు ఇప్పుడు చాలా ముఖ్యం. వాళ్లు ఎంత బాగా ఇస్తే కెమెరామ్యాన్ అంత బాగా చేయగలడు. సీజీ ఉన్న సినిమాలు హిట్, ఫ్లాప్ అవ్వడానికి కెమెరామ్యాన్‌కి ఎలాంటి సంబంధం లేదు. వాళ్లకేం కావాలో అడిగి.. వాళ్లకు నచ్చినట్లే చేస్తున్నాం. నేను కూడా! నేనో పెద్ద పుడింగి, 'అంజి' చేశాను, 'ఢమరుకం' చేశాను నంది అవార్డ్ వచ్చింది, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వచ్చిందని చెప్పట్లే. మా ఇగోలని పక్కనబెట్టి వాడు అడిగిందే ఇస్తాం. వాడు అడిగిన లైట్ రాంగ్ అని మాకు తెలుసు. అయినా రేపు క్వాలిటీ బాగోలేకపోతే కెమెరామ్యాన్ సహకరించలేదని వాడు వెళ్లి ఎవరితోనో మాట్లాడి చెడ్డపేరు రావడం ఆ ప్రాజెక్టుకి మంచిది కాదు ఆ కెమెరామ్యాన్‌కి కూడా మంచిది కాదు. అందుకని వాళ్లకు ఏం కావాలో అదే చేస్తున్నాం. రాకపోతే వాడి ఖర్మ. మా తప్పయితే ఏం లేదు. ప్రేక్షకులు, మీడియా మాట్లాడుకోవట్లేదు గానీ ఏదైనా తేడా జరిగితే కెమెరామ్యాన్ చెడగొట్టేశాడని మాట్లాడుకుంటున్నారు. కానీ కెమెరామ్యాన్‌కి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు సీజీ కంటూ వేరేగా ఓ టెక్నీషియన్ కొత్తగా వచ్చాడు. సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకు అతడు మా దగ్గరే ఉంటాడు. మాతోనే ట్రావెల్ చేస్తాడు. అతడు చెప్పకుండా ఒక్క ఫ్రేమ్ కూడా మేం తీయం. ఇప్పుడు రూల్ ప్రకారం తీయకూడదు. నేనైతే అతడు లేకుండా కెమెరా ఆన్ చేయట్లేదు'ఇక 'విశ్వంభర' ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ''అంజి' అయితే తలెత్తుకు పనిచేశాం. 'విశ్వంభర' కోసం తల ఒంచుకుని పనిచేస్తున్నాను. ఎందుకంటే 'విశ్వంభర' అనేదానిలో చాలా సీజీలు ఉన్నాయి. అక్కడికి పోయి నేను, చోటా కె నాయుడు. నాకు చాలా తెలుసు అని అంటే కుదరదు. చాలా బాగుండాలి. ఎందుకంటే ఆ మూవీ వెనక రూ.400 కోట్లు ఉంది. అక్కడికి పోయి నా ఇగో చూపిస్తే వర్కౌట్ అవ్వదు! అక్కడే ఏం కావాలో అదే చేశాం. బాగా జరుగుతుంది. అందుకే బాగా టైమ్ తీసుకుంటున్నాం. ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది' అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: మహేశ్ అభిమానులకు సారీ చెప్పిన హరీశ్ శంకర్) -
టాలీవుడ్లో మరో వివాదం.. సారీ చెప్పిన డైరెక్టర్
పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా తీసిన దర్శకుడు హరీశ్ శంకర్.. హీరో మహేశ్ బాబు అభిమానుల్ని హర్ట్ చేశాడు. నిన్న సాయంత్రం అంతా ట్విటర్లో ఈ విషయం గురించే చర్చ నడిచింది. ఇప్పుడు ఇది కాస్త సీరియస్ అయ్యేసరికి సదరు డైరెక్టర్.. మహేశ్ ఫ్యాన్స్‌కి క్షమాపణ చెప్పాడు. ఈ మేరకు ఓ నోట్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్లో చర్చనీయాంశమవుతోంది.(ఇదీ చదవండి: చేసిన రెండు సినిమాలు ఫ్లాప్.. అయినా మరో ఛాన్స్)అసలేం జరిగింది?మంగళవారం సాయంత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'ని ఉద్దేశిస్తూ ఓ అభిమాని.. బాబు రికార్డులు లేపేయాలని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. దీనికి ప్రతిగా 'తథాస్తు' అని రీట్వీట్ చేశాడు. సెకన్ల వ్యవధిలో విషయం అర్థమై హరీశ్ శంకర్.. తన ట్వీట్ డిలీట్ చేసినప్పటికీ మహేశ్ బాబు అభిమానులు మాత్రం హరీశ్ శంకర్‌ని ఘోరంగా ట్రోల్ చేశారు. 'ఉస్తాద్..' మూవీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ చేశారు. దీంతో ఇప్పుడు హరీశ్ శంకర్.. మహేశ్ అభిమానులకు సారీ చెప్పాడు.హరీశ్ ఏమన్నాడు?'సెన్సార్ తర్వాత బోర్డ్ అధికారులతో మీటింగ్, పెద్దమ్మ తల్లి దర్శనం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, తమన్ స్టూడియోలో బ్యాక్ గ్రౌండ్ స్కోరు పనులతో నిన్నంతా బిజీగా గడిచింది. అదే టైంలో జర్నలిస్టులు, అభిమానుల మెసేజులకు రిప్లై ఇస్తూ ఆ హడావుడిలో ఓ ట్వీట్‌ని పూర్తి చదవకుండానే రీట్వీట్ చేశాను. నా టీమ్ అలెర్ట్ చేయగానే నిమిషం లోపే ట్వీట్ డిలీట్ చేశాను. మహేశ్ బాబుపై నాకు ఎంతో గౌరవముంది. 'పోకిరి' గురించి గతంలో నేను చేసిన ట్వీట్స్ చూస్తే ఆయనపై నాకున్న ప్రేమ అర్థమవుతుంది. 'వారణాసి'తో ఆయన పేరుమీద మరెన్నో రికార్డులు సృష్టిస్తారని నమ్ముతున్నాను''ఆయనని కానీ ఆయన అభిమానులని కానీ బాధపెట్టాలని ఉద్దేశం నాకు ఏ మాత్రం లేదు. సినిమా మరో 10 రోజుల్లో విడుదలయ్యే ఈ టైంలో ఇలాంటి పోస్టులు చేసేంత అవివేకిని కాదు. ఓ సినిమా రికార్డులు సృష్టించాలనే అందరి హీరోల అభిమానుల మద్దతు అవసరం. అయినప్పటికీ నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను' అని హరీశ్ శంకర్ ఓ నోట్ రిలీజ్ చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా) -
'ఉస్తాద్ భగత్ సింగ్' సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. తొలుత ఈ నెల 26న థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ అనుకోని విధంగా ఓ వారం ముందే వచ్చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. ఉగాది సందర్భంగా 19వ తేదీన మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు సెన్సార్ కార్యక్రమాల పూర్తయ్యాయి.ఈ క్రమంలోనే రన్ టైమ్ ఎంతనేది కూడా బయటకొచ్చింది.(ఇదీ చదవండి: ఊహించని దర్శకుడితో ప్రభాస్.. రొయ్యల బిర్యానీతో డిన్నర్)'ఉస్తాద్..' చిత్రానికి విడుదలకు 9 రోజుల ముందే సెన్సార్ చేసేశారు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈమేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సెన్సార్ సభ్యులు.. ఎలాంటి కట్స్ చెప్పలేదట. అలానే 2 గంటల 34 నిమిషాల నిడివితో మూవీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.హరీశ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా మైత్రీ మూవీస్ నిర్మించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందించాడు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ పనిచేస్తున్నాడు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. అయితే ఇది తమిళ సినిమా 'తెరి'కి రీమేక్ అని చాలారోజులుగా ప్రచారం నడిచింది. మూవీ టీమ్ మాత్రం పదే పదే వీటిని ఖండించింది. సెన్సార్ ముగించారు. ట్రైలర్ కూడా వదిలితే సినిమా కంటెంట్ ఏంటనేది ఓ క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా) -
పవన్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్!
పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్! ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. లెక్క ప్రకారం ఈ నెల 26న థియేటర్లలోకి రావాలి. కానీ ఓ వారం ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా 19నే రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్‌గానే ప్రకటించారు. కానీ ప్రీమియర్ల విషయంలో మాత్రం మూవీ టీమ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?'గబ్బర్ సింగ్' తర్వాత పవన్-హరీశ్ శంకర్ కలిసి చేసిన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. చాన్నాళ్ల క్రితం ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ.. గతేడాది చివరలో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది. 18వ తేదీన రాత్రి ప్రీమియర్లు వేయాలని తొలుత అనుకున్నారు కానీ డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన మేరకు నిర్మాణ సంస్థ.. ప్రీమియర్ల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 19న ఉదయం 7 గంటల నుంచి మాత్రమే రెగ్యులర్ షోలు వేయాలని నిర్ణయించుకున్నారట.(ఇదీ చదవండి: త్రిషపై చిల్లర కామెంట్స్.. నోరు జారిన సీనియర్ నటుడు)ప్రీమియర్ల విషయంలో 'ఉస్తాద్' వెనక్కి తగ్గటానికి బజ్ ఏమైనా కారణమా అనిపిస్తుంది. ఎందుకంటే దీనిపై ప్రస్తుతానికి ఓ మాదిరి హైప్ మాత్రమే ఉంది. రెండు పాటలు రిలీజైనప్పటికీ అవేం పెద్దగా మ్యాజిక్ చేయలేదు. ట్రైలర్ వచ్చిన తర్వాతే మూవీ చూడాలా వద్దా అని చాలామంది ఆడియెన్స్ ఓ అంచనాకు రావొచ్చు. దీనితో పాటే తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతున్న డబ్బింగ్ సినిమా 'ధురంధర్ 2'పై హైప్ బాగానే ఉంది.'ధురంధర్ 2' ప్రీమియర్ షోలు.. 18వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి దేశవ్యాప్తంగా స్క్రీనింగ్ కానున్నాయి. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేశారు. మిగతా నగరాల కంటే హైదరాబాద్‌లోనే టికెట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. దీని రన్ టైమ్ దాదాపు 4 గంటలు. పోలిక అని చెప్పలేం కానీ 'ధురంధర్ 2' ప్రీమియర్ చూసిన తర్వాత ప్రేక్షకుడు.. 'ఉస్తాద్' ప్రీమియర్ అంటే ఆసక్తి చూపిస్తాడా అంటే సందేహమే. బహుశా ఈ కారణాల వల్లే 'ఉస్తాద్'.. ప్రీమియర్ల రిస్క్ తీసుకోవట్లేదా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్) -
'ఉస్తాద్ భగత్‌సింగ్' ఫ్యాన్స్‌కు షాకిస్తున్న బుక్‌మైషో
‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వారం ముందే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మొదటగా ఈ మూవీని ఈ నెల 26న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. టాక్సిక్ వాయిదా పడటంతో ఉగాది సందర్భంగా మార్చి 19న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా బుక్‌మైషోలో ఈ మూవీ స్టోరీకి సంబంధించి పాయింట్స్‌ను చేర్చి పవన్ కల్యాణ్ అభిమానులకు షాకిచ్చింది.మొదటి నుంచి ఈ సినిమా 'తేరి' రీమేక్ అని పుకార్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే, దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను అసలు స్క్రిప్ట్‌తో వచ్చానని స్పష్టం చేశారు. ఇప్పుడు, బుక్ మై షోలో ఉస్తాద్ భగత్ సింగ్ కథా సారాంశం అభిమానులను షాక్‌కు గురిచేస్తుంది. అందులో స్టోరీ లైన్ ఇలా ఉంది, “ఒక ఐపీఎస్ అధికారి తన కుమార్తెతో కలిసి సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే, క్రూరమైన నేరస్థులు హీరో కుటుంబాన్ని నాశనం చేయడంతో కూతురు కోసం అజ్ఞాతంలోకి వెళ్తాడు. కొన్ని సంవత్సరాల తరువాత హీరో ఆచూకీ తెలుస్తుంది. అతను తన గతానికి సంబంధించిన శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తనకు మిగిలి ఉన్న ఏకైక కూతురుని రక్షించడానికి మరోసారి పోరాడుతాడు.” అంటూ కథకు సంబంధించి కొన్ని పాయింట్స్ రాసుకొచ్చాడు.బుక్‌మైషో టికెటింగ్ ప్లాట్ఫామ్లో చేర్చబడిన ఈ స్టోరీ లైన్ పూర్తిగా తెరి సినిమాను పోలి ఉంది. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇది ప్లాట్‌ఫామ్ లోపమా లేదా ప్రధాన కథాంశం అలాగే ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్స్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
'ఉస్తాద్ భగత్ సింగ్'.. రిలీజ్‌కి ముందు భారీ మార్పులు?
టాలీవుడ్ నుంచి ఈ నెలలో రాబోతున్న భారీ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకుడు. మార్చి 26న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. విడుదలకు మరో 20 రోజుల మాత్రమే సమయముంది. సరిగ్గా ఈ సమయంలో కొన్ని భారీ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది?(ఇదీ చదవండి: అప్పట్లో రూ.9 లక్షలకు ఎకరం అమ్మాను.. ఇప్పుడు రూ.100 కోట్లు: శివాజీ)'గబ్బర్ సింగ్' కాంబో రిపీట్ చేస్తూ పవన్-హరీశ్ శంకర్ మరోసారి కలిసి పనిచేసిన సినిమా ఇది. తొలుత 'భవదీయుడు భగత్ సింగ్' పేరుతో ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. తమిళ మూవీ 'తెరి'కి ఇది రీమేక్ అని అన్నారు. కానీ తర్వాత తర్వాత టైటిల్ 'ఉస్తాద్ భగత్ సింగ్' అని మారినా సరే రీమేక్ రూమర్స్ మాత్రం ఆగలేదు. దర్శకుడు, మూవీ టీమ్ ఎంతలా ఇది రీమేక్ కాదు బాబోయ్ అని అంటున్నా జనాలు, అభిమానులు కూడా ఎందుకో నమ్మట్లేదు.ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. ఇప్పటికే రెండు పాటలు కూడా రిలీజయ్యాయి. వీటిలో ఒకటి ఆకట్టుకోగా.. రెండోది దారుణంగా నిరాశపరిచింది. ఇకపోతే ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం దేవికి బదులు తమన్ పనిచేస్తున్నాడని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టులు కొన్ని వైరల్ అవుతున్నాయి. అలానే మార్చి 19న రావాల్సిన 'టాక్సిక్' వాయిదా పడడంతో దాన్ని క్యాష్ చేసుకోవాలని 'ఉస్తాద్..' టీమ్ భావిస్తోంది. అనుకున్నట్లు 26న కాకుండా ఓ వారం ముందుకు జరిగి 19వ తేదీన తమ సినిమాని రిలీజ్ చేయాలని హరీశ్ శంకర్ అండ్ టీమ్ అనుకుంటున్నారట. మరి వీటిలో ఎంతవరకు నిజముందనేది ఒకటి రెండు రోజులు ఆగితే క్లారిటీ వచ్చేస్తుంది.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే?) -
నా సినిమాని పట్టుకుని 'తెరి' చేశారు.. హరీశ్ శంకర్ కామెంట్స్
మార్చి నెలాఖరులో టాలీవుడ్ నుంచి రాబోతున్న ఒకేఒక్క పెద్ద సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రంపై ఇప్పటివరకు అనుకున్నంతగా బజ్ లేదు. ఎందుకో రావట్లేదు కూడా. దానికి చాలానే కారణాలు. ప్రాజెక్ట్ మొదలైనప్పుడే ఇది రీమేక్ అనే రూమర్స్ గట్టిగా వినిపించాయి. ఈ మూవీకి రైటర్‌గా పనిచేసిన ఒకప్పటి దర్శకుడు దశరథ్.. ఇది 'తెరి' రీమేక్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇదంతా మొదలైంది. ఇప్పటికే అదే నిజమని చాలామంది ప్రేక్షకులు నమ్ముతున్నారు.మూవీ టీమ్ గానీ దర్శకుడు హరీశ్ శంకర్ గానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' దేనికి రీమేక్ కాదని గతంలో చెప్పారు. తాజాగా పలువురు జర్నలిస్టులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలోనూ హరీశ్ శంకర్.. మరోసారి రీమేక్ గురించి స్పష్టత ఇచ్చాడు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలే ఆసక్తికరంగా అనిపించాయి.(ఇదీ చదవండి: భర్తని చూస్తూ సిగ్గుపడిపోతూ.. రష్మిక వీడియో వైరల్)'తెరి మూవీలో ట్వింకిల్ ట్వింకిల్ అంటూ పాడే ఓ సీన్ ఉంటుంది. అది నా 'గబ్బర్ సింగ్' మూవీలోని అంత్యాక్షరి ఎపిసోడ్‌ని స్పూర్తిగా తీసుకుని తీశారు. నా సినిమాని పట్టుకుని తెరి చేస్తే.. నువ్వు 'తెరి' రీమేక్ చేస్తున్నావంటే నేను ఏం సమాధానం చెప్పాలో నాకర్థం కావట్లేదు' అని హరీశ్ శంకర్ అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దాని దిగువన కామెంట్స్ చాలావరకు ఈ దర్శకుడికి వ్యతిరేకంగానే వస్తుండటం విచిత్రం.కెరీర్లో చాలా సినిమాలు చేసిన హరీశ్ శంకర్.. 'గబ్బర్ సింగ్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కానీ తర్వాత నుంచి ఒక్కటీ సరైన సినిమా తీయలేకపోతున్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేశ్ లాంటి ఒకటి రెండు మూవీస్ ఆకట్టుకున్నప్పటికీ మరీ సూపర్ హిట్ కాలేకపోయాయి. హరీశ్ శంకర్ గత చిత్రం 'మిస్టర్ బచ్చన్' అయితే ఘోరమైన డిజాస్టర్. చూడాలి మరి హరీశ్ శంకర్ ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
'ఉస్తాద్ భగత్ సింగ్' రెండో పాట రిలీజ్
పవన్ కల్యాణ్ కొత్త సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకుడు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. మార్చి 26న థియేటర్లలోకి రానుంది. అందుకు తగ్గట్లే ప్రమోషన్లు మొదలుపెట్టారు. గతంలో 'దేఖ్ లేంగే సాలా' పేరుతో ఓ పాట రిలీజ్ చేయగా.. ఇప్పుడు 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పేరుతో మరో సాంగ్ విడుదల చేశారు.'మెడపై ముట్టుకుంటే తొడ గొట్టినట్లే..' అంటూ సాగే ఈ పాటలో ఈ ఒక్క లైన్ తప్పితే మిగతా లిరిక్స్ ఏమంత ఆకట్టుకునేలా అయితే లేవు. దానికి తోడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి మాత్రమే నచ్చేలా ఈ సాంగ్ కంపోజ్ చేసినట్లు అనిపిస్తుంది. ట్యూన్ కూడా రెగ్యులర్‌గానే అనిపించింది. పాటలో చాలావరకు పవన్ మేనరిజమ్‌నే చూపించారు. సినిమాలో ఓ డైలాగ్‌తో ఈ పాట పుట్టిందని దర్శకుడు హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యాట్యూబ్‌లో ఓకే ఓకే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి?ఇకపోతే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా.. దళపతి విజయ్ చేసిన 'తెరి' రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. టీమ్ ఈ విషయాన్ని ఖండించింది గానీ చాలామంది నెటిజన్లకు ఇంకా ఈ సందేహం అలానే ఉండిపోయింది. దానికి తోడు ఈ మూవీపై ఇప్పటివరకు అయితే పెద్దగా బజ్ కూడా లేదు. అలానే ధురంధర్ 2, టాక్సిక్ చిత్రాలు రిలీజైన తర్వాత వారమే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మరి వాటి నుంచి పోటీ తట్టుకుని ఎలా నిలబడుతుందనేది కూడా చూడాలి. -
పవన్ ఫ్యాన్స్‌ని అన్‌బ్లాక్ చేసిన హరీష్ శంకర్!
టాలీవుడ్లో సాధారణంగా దర్శకులు, అభిమానుల మధ్య గొడవలు, విమర్శలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అవయితే.. ఫ్యాన్స్ అంతా దర్శకుడిని ట్రోల్ చేస్తుంటారు. అతన్ని విమర్శిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. కానీ హరీష్ శంకర్, పవన్ ఫ్యాన్స్ మధ్య తాజాగా ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.గతంలో ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్పై కొందరు పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో అతిగా స్పందించి, నెగటివిటీ ప్రచారం చేశారు. దీంతో తన పనికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో హరీష్ శంకర్ ఆ అకౌంట్లను బ్లాక్ చేశారు.అయితే, తాజాగా విడుదలైన సినిమా అప్డేట్స్, టీజర్లు చూసిన అభిమానులు హరీష్ శంకర్ విజన్‌పై పూర్తి నమ్మకం పెంచుకున్నారు. దీంతో నిన్న ఒక అభిమాని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తరపున బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. "గతంలో జరిగిన పొరపాట్లను మన్నించి, అందరం కలిసి సినిమాను సెలబ్రేట్ చేసుకునేలా మమ్మల్ని అన్‌బ్లాక్ చేయండి" అని వినమ్రంగా కోరారు.ఈ అభ్యర్థనకు హరీష్ శంకర్ ఎంతో సానుకూలంగా స్పందించారు. "గతాన్ని మర్చిపోదాం.. మనమంతా ఒకటే కుటుంబం. సినిమాను కలిసి ఎంజాయ్ చేద్దాం" అంటూ తక్షణమే ఆ అకౌంట్లను అన్‌బ్లాక్ చేశారు. సినిమా రీలీజ్ సమయం దగ్గర పడడంతో హరీశ్ అన్‌బ్లాక్ చేయడం మొదలు పెట్టాడు. మరి పవన్ ఫ్యాన్స్, హరీష్‌ల మధ్య ఈ సఖ్యత ఇలానే కొనసాగుతుందా లేదా రిలీజ్ వరకే పరిమితం అవుతుందా చూడాలి. Come on Boys…. We all are family Forget the past …Lets make a Blast 😍😍😍😍🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗#UstaadBhagatSingh https://t.co/xSiV1zV6tH— Harish Shankar .S (@harish2you) January 24, 2026 -
ఉంచాలా తీసేయాలా.. ఫస్ట్ నన్ను అడగాలి
కెరీర్లో తొలిసారి రవితేజ.. తన 'మాస్ మహారాజ' అనే ట్యాగ్ తీసేసి, రెమ్యునరేషన్ అందుకోకుండా చేసిన సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఈ మంగళవారం(జనవరి 13) థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు హరీశ్ శంకర్.. రవితేజ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత సినిమాతో అలరించలేకపోయాం. ఈసారి కచ్చితంగా బ్లాక్ బస్టర్ తీస్తా అని మాటిచ్చారు.'ఈ సినిమాకు రవితేజ అన్నయ్య.. మాస్ మహారాజ్ టైటిల్ తీసేయండి అని అన్నారట. ఆ టైటిల్ పెట్టింది నేను. దాన్ని పేటెంట్ రైట్స్ నా దగ్గరే ఉన్నాయి. అది ఉంచాలన్నీ తీసేయాలన్నా ఫస్ట్ నన్ను అడగాలి. మాస్ మహారాజ్ అనే పేరు ఉంచాలా తీసేయాలా అనేది అన్నయ్య ఇష్టం. కానీ మమ్మల్ని ఆపడం మాత్రం మీకు చాలా కష్టం. గుర్తుపెట్టుకోండి. అది జరిగే పనికాదు. మిరాపకాయ్ వచ్చినా మిస్టర్ బచ్చన్ వచ్చినా ఒకేలా ఉండే వ్యక్తి మాస్ మహారాజ్ రవితేజ. ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్‌నే 'నేనింతే'లో పూరీ జగన్నాథ్ పెట్టారు'(ఇదీ చదవండి: 'చిరంజీవి' సినిమాకు రివ్యూలు, రేటింగ్స్ బంద్.. కోర్టు ఆర్డర్)'సినిమా ఎలా ఉన్నాసరే ఆడిందా ఊడిందా అనేది రవితేజ ఏం పట్టించుకోడు. తర్వాత రోజు షూటింగ్‌కి వెళ్లిపోతాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే.. బ్లాక్ బస్టర్స్ వచ్చినప్పుడు పొంగిపోకురా, ఫ్లాపులు వచ్చినప్పుడు కుంగిపోకురా' అని అర్థం. ఆయన పరిచయం చేసిన దర్శకులు బోయపాటి శ్రీను, శ్రీనువైట్ల, గోపీచంద్ మలినేని, బాబీ.. ఈరోజు స్టార్ డైరెక్టర్స్ పొజిషన్లో ఉన్నారు. మా గత సినిమా సరిగా ఎంటర్టైన్ చేయలేదు. డిసప్పాయింట్ చేశాం. కానీ మేం అక్కడితో అలా ఆగిపోము. రవితేజతో మళ్లీ బ్లాక్‌బస్టర్ తీస్తా' అని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చాడు.హరీశ్ శంకర్ కెరీర్ చూసుకుంటే.. ఇరవైళ్లలో ఎనిమిది సినిమాలు తీశాడు. వీటిలో మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం, సుబ్రమణ్యం ఫర్ సేల్ హిట్ అయ్యాయి. చివరగా 2024లో 'మిస్టర్ బచ్చన్' అనే రీమేక్ మూవీ చేశాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' చేస్తున్నాడు. ఇది దళపతి విజయ్ 'తెరి' రీమేక్ అనే ప్రచారం చాన్నాళ్లుగా జరుగుతోంది. దీని వల్ల మూవీపై అస్సలు బజ్ లేదు. ఈసారి హిట్ కొడితేనే హరీశ్ శంకర్‌కి ప్లస్ అవుతుంది. మరెం చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఏపీలో రవితేజ, నవీన్ సినిమాలకు టికెట్ ధరలు పెంపు) -
'ఉస్తాద్ భగత్ సింగ్' తొలిపాట రిలీజ్
పవన్ కల్యాణ్ లేటెస్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకుడు. గతంలో వీళ్లిద్దరూ 'గబ్బర్ సింగ్' చేశారు. అది అప్పట్లో పెద్ద హిట్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ మూవీ కోసం కలిశారు. ఇప్పటికే పవన్‌కి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో తొలి గీతాన్ని లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: అందుకే సినిమాల్లో నటించడం మానేశాను: స్మిత)'దేఖ్ లేంగ్ సాలా' అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోని ఇప్పుడు రిలీజ్ చేశారు. బీట్ బాగానే ఉంది కానీ ఎక్కడో విన్నామే ఇది అనిపించేలా మ్యూజిక్ ఉంది. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. వచ్చే ఏడాది మార్చి లేదా వేసవిలో మూవీ రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు.ఈ సినిమా విషయానికొస్తే.. తమిళ హీరో విజయ్ 'తెరి'కి ఇది రీమేక్ అని గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ దర్శకనిర్మాతలు మాత్రం కొత్త స్టోరీతో చిత్రాన్ని తెరకెక్కించామని చెబుతున్నారు. సినిమా టీజర్, ట్రైలర్ రిలీజైతే తప్ప కంటెంట్ ఏంటనేది క్లారిటీ రాదు. ప్రస్తుతానికైతే ఈ మూవీపై పెద్దగా బజ్ లేదు. రీమేక్ అనే రూమర్స్ దీనికి కారణం. అలానే దర్శకుడు హరీశ్ శంకర్ గత కొన్ని చిత్రాలు చాలావరకు ఫ్లాప్ అయ్యాయి. ఇది కూడా మరో కారణమని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: శవాలను దొంగతనం చేసే ముఠా.. ఆసక్తిగా తెలుగు సినిమా ట్రైలర్) -
తెలుగు సినిమాలో మూడు కోట్ల ఆఫర్.. ఆ రోల్‌కు ఒప్పుకోలేదు: మల్లా రెడ్డి
రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్లా రెడ్డి గురించి తెలియనివారు ఉండరు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు తనలోని కళామతల్లిని బయట పెడుతుంటారు. ఏదైనా ఈవెంట్స్‌కు వెళ్లినప్పుడు డ్యాన్స్‌తోనూ అలరిస్తూ సందడి చేస్తుంటారు. మల్లా రెడ్డి యూనివర్సిటీలో సినిమా ఈవెంట్స్ జరిగితే తనలో టాలెంట్‌ను ఒక్కసారిగా బయటికి తీసుకొస్తారు. అందుకే మల్లారెడ్డి అంటే కేవలం రాజకీయ నాయకుడే కాదు..కళాకారుడిగా కూడా ఆయనకు పేరు ఉంది.అయితే ఇటీవల దసరా సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మల్లారెడ్డి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తనకు టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సినిమాలో విలన్ పాత్రను ఆఫర్ చేశాడని చెప్పారు. ఆ రోల్ కోసం మా కాలేజీకి వచ్చి ఒక గంటసేపు వెయిట్ చేశాడని తెలిపారు. అంతేకాకుండా రూ.3 కోట్ల పారితోషికం కూడా ఆఫర్ చేశాడని వెల్లడించారు. అయినా కూడా నేను ఆ పాత్రను ఒప్పుకోలేదని మల్లారెడ్డి వివరించారు. విలన్‌గా చేస్తే ఇంటర్వెల్‌దాకా నేను హీరోను కొడతా.. ఆ తర్వాత హీరో నన్ను కొడతాడు.. తిడతాడు అంటూ హాస్యంగా మాట్లాడారు. ఈ కామెంట్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. -
'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్లోకి పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ పెండింగ్ పెట్టిన ప్రాజెక్టుల్లో ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎన్నికల ముందే ప్రారంభం అయింది. కొన్నాళ్లకే ఎన్నికలు రావడం..పవన్ బిజీ అయిపోవడంతో ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లింది. ఇటీవల ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ రోజు పవన్ కల్యాణ్ అఫీషియల్ గా షూటింగ్లో జాయిన్ అయ్యారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు, సినిమాలోని ప్రముఖ తారాగణం కూడా షూటింగ్లో పాల్గొంటోంది. పవన్ ఎంట్రీతో సెట్స్‌లో జోష్ నెలకొంది అని చిత్రబృందం పేర్కొంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానరర్ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ (ఫోటోలు)
-
వాళ్ల సినిమాల కోసమైతే ఎగేసుకుని వెళ్తారు.. ప్రేక్షకులపై హరీశ్ శంకర్ విమర్శలు
టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ వేదికలపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పటికే ఆయన పలుమార్లు తన కామెంట్ల వల్ల నెట్టింట నెగటివిటీని తెచ్చుకున్నారు. తాజాగా ‘ప్రేమలు’ మూవీ ఫేమ్ నస్లేన్ కె.గఫూర్ (Naslen K.Gafoor) నటించిన ‘జింఖానా’ (Gymkhana) ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్ 25న విడుదల కానున్న ఈ మూవీని దర్శకుడు ఖలీద్ రెహమాన్ తెరకెక్కించారు.దర్శకుడు హరీశ్ శంకర్ సినిమాలు బాగుంటాయని ఆయనకు గుర్తింపు ఉంది. అందుకే అతని నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్ట్‌కు క్రేజ్ ఉంటుంది. అయితే, ఒక్కోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్‌మీడియాలో వివాదస్పదంగానే వైరల్ అవుతుంటాయి. తాజాగా ‘జింఖానా’ మూవీ ప్రీ రిలీజ్ కోసం ముఖ్య అతిథిగా వెళ్లిన హరీశ్ ఏమన్నారంటే.. నేను గతంలో డ్రాగన్ సినిమాను ప్రమోట్ చేశాను. ఆ సమయంలో ఒకమాట అన్నాను.. మన సినిమాలకంటే పక్క భాషల సినిమాలే తెలుగువారు ఎక్కువగా చూస్తారన్నా.. అప్పుడు నన్ను అందరూ విమర్శించారు. ఆ సమయంలో ఆ మాట ఎందుకనాల్సి వచ్చిందంటే.. నా లాస్ట్ సినిమా (మిస్టర్ బచ్చన్)ను ఎవరూ చూడలేదు. కానీ, అదే టైమ్‌లో వచ్చిన మరో భాష సినిమా (తంగలాన్)ను చూశారు. అందుకే నేను అలాంటి వ్యాఖ్యలు చేశాను. ఇప్పడు కూడా అదే చెబుతున్నా.. ఇతర భాషల సినిమాలను చూసేందుకు ఎగేసుకుని వెళ్తాం కదా.. ఇదే విధంగా ఈ సినిమాను (జింఖానా) కూడా చూడండి. దయచేసి తెలుగు ప్రేక్షకులు అందరూ ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయండి. ఎవరెలా అనుకున్నా నాకు ఇబ్బంది లేదు. నా అభిప్రాయం చెప్పాను.' అని అన్నారు.హరీశ్ శంకర్ కామెంట్లకు నెటిజన్లు కూడా తమదైన స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు. పక్క భాషల సినిమాలను రీమేక్ చేసే నువ్వు కూడా ఇలాంటి కామెంట్లు చేస్తే ఎలా అంటూ విమర్శిస్తున్నారు. సినిమా బాగుంటే తమకు భాషతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. గతంలో మీ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులే హిట్ చేశారనే విషయం మరచిపోతే ఎలా హరీశ్ అంటూ గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. తాము ఎలాంటి సినిమాలు చూస్తామో, చూడాలో చెప్పడానికి మీరు ఎవరు..? అంటూ హరీశ్‌పై ఫైర్ అవుతున్నారు. -
ఫిలిం ఫైనాన్షియర్ బంగారు బాబు కుమారుడి వివాహ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు (ఫోటోలు)
-
పిల్లలు వద్దనుకున్నాం.. కారణం ఇదే: హరీశ్ శంకర్
టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్( Harish Shankar) పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చే సినిమా 'గబ్బర్ సింగ్'. నేడు ఆయన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే, మీకు ఆయన కుటుంబ నేపథ్యంతో పాటు పిలల్లను ఎందుకు వద్దనుకున్నారో తెలుసా..? కరీంనగర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన సినిమాలపై మక్కువతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. నాన్న శ్యాంసుందర్ తెలుగు ఉపాధ్యాయుడు కావడంతో హరీశ్‌కు సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. కోన వెంకట్ సహకారంతో రవితేజ నటించిన వీడే సినిమాకు సహాయకుడుగా హరీశ్ జర్నీ మొదలైంది. ఆ తర్వాత రామ్‌గోపాల్ వర్మ అతనికి రవితేజ హీరోగా షాక్ సినిమాకు దర్శకత్వం వహించమని అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం వంటి హిట్ సినిమాలను ఇండస్ట్రీకి ఇచ్చాడు.దర్శకులు హరీశ్ శంకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబ విషయాలను పంచుకున్నారు. తన భార్య పేరు స్నిగ్ధ అని ఆమెకు పెద్దగా సినిమాలంటే ఇష్టం ఉండదని ఆయన చెప్పారు. చివరకు ఒక సినిమా కోసం పనిచేసినందుకు వచ్చిన రెమ్యునరేషన్ గురించి కూడా ఆమెకు తెలియదని ఆయన అన్నారు. ఈ క్రమంలో తమకు పిల్లలు ఎందుకు వద్దనుకున్నారో హరీశ్ ఇలా చెప్పారు. నా భార్య స్నిగ్ధతో చాలా స్పష్టతతో ఉంటాం. మాది మధ్యతరగతి కుటుంబం. బడ్జెట్ విషయంలో ప్రతిదానికి లెక్కలు వేసుకునే ముందుకు సాగుతాం. కుటుంబంలో నేనే పెద్దవాడిని కావడంతో బాధ్యతలు తీసుకోవాల్సిందే.. నా చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయడంతో పాటు తమ్ముడిని సెటిల్ చేయడం నా ప్రధాన కర్తవ్యం. అమ్మానాన్నలకు కూడా మంచి ఇల్లు నిర్మించాలి. ఇలా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. వీటిని పూర్తి చేసే పనిలో ఉన్న నాకు స్నిగ్ధ కూడా మద్దతుగా నిలవడం మరింత బలాన్ని ఇచ్చింది. ఇంతకుమించి జీవితంలో ఎలాంటి బాధ్యతలూ వద్దనుకున్నాం. ఇద్దరం మాట్లాడుకున్న తర్వాతే పిల్లలు వద్దని నిర్ణయం తీసుకున్నాం. పిల్లలు పుట్టిన తర్వాత సెల్ఫీష్‌గా తయారవుతాం అనిపించింది. దీంతో వారి ప్రపంచం కుదించుకుపోతుంది అనేది నా అభిప్రాయం.' అని ఆయన అన్నారు.హరీశ్ శంకర్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్, కేవీఎన్, మైత్రీ మూవీ మేకర్స్ వంటి భారీ బ్యానర్స్‌లో ఆయన సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌తో ఇప్పటికే చర్చలు పూర్తి అయ్యాయి. త్వరలో వారిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రారంభం కానుంది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. -
NATS 8వ కర్టెన్ రైజర్ ఈవెంట్ (ఫొటోలు)
-
అదీ మీ సంస్కారం.. దేవిశ్రీ ప్రసాద్‌పై హరీశ్ శంకర్ ట్వీట్
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌పై హరీశ్ శంకర్ ప్రశంసల వర్షం కురిపించారు. మీ సంగీతమే కాదు మీ సంస్కారం గురించి కూడా అందరూ మాట్లాడుకునే చేశావంటూ పొగడ్తలతో మంచేశాడు. దేవిని హరీశ్ అంతలా ప్రశంసించడానికి గల కారణం ఏంటంటే..దేవి( Devi Sri Prasad) తాజాగా ఓ పాడ్ కాస్ట్లో మాట్లాడుతూ.. తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన రోజే కొన్ని నియమాలు పెట్టుకున్నానని, వాటిని ఇంతవరకు బ్రేక్ చేయలేదని చెప్పాడు. తన కెరీర్లో ఎప్పుడూ ఓ పాటను రీమేక్ చేయడం కానీ, కాపీ కొట్టడం కానీ చేయొద్దని ఫిక్సయ్యాడట. అయితే రీమేక్ సాంగ్ ఉందని చాలా సినిమాలే వదుకున్నాడట డీఎస్పీ. ‘హరీశ్ శంకర్(Harish Shankar) దర్శకత్వం వహించిన గద్దలకొండ గణేష్ సినిమాకి నేనే సంగీతం అందించాలి. హరీశ్ మొదట ఈ స్క్రిప్ట్ నాకే చెప్పాడు. నాకు బాగా నచ్చింది. కానీ చివర్లో ‘ఎల్లువొచ్చి గోదారమ్మ. ఎల్లకిల్లా పడ్డాదమ్మో’ రీమేక్ సాంగ్ ఉంటుందని చెప్పాడు. నేను రీమేక్ చేయనని హరీశ్‌కు తెలుసు. కానీ మా నాన్న సత్యమూర్తి మొదటి సినిమా ‘దేవత’లోని పాట కాబట్టి చేస్తానేమోనని హరీశ్ భావించాడు. కానీ నేను నా రూల్స్‌ని బ్రేక్ చేయలేనని చెప్పాను. చివరకు ఆ పాటను తీసేస్తానని చెప్పాడు. కానీ నా కోసం స్క్రిప్ట్‌లో మార్పులు చేయొద్దని చెప్పి.. ఆ సినిమాకు నో చెప్పాను. అయితే ఓ ప్రెస్మీట్లో ‘గద్దలకొండ గణేశ్’కి మొదట దేవిశ్రీని మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకుంటానని చెప్పారు కదా..ఎందుకు మార్చారు?’ అని మీడియా అడిగితే.. జరిగిందంతా చెప్పి..‘ఆయన రీమేక్ సాంగ్స్ చేయడు కాబట్టి మార్చాం’అని చెప్పారు. వాస్తవానికి హరీశ్ అక్కడ సింపుల్‌గా ‘కొన్ని కారణాల వల్ల సెట్ కాలేదు’అని చెప్పొచ్చు. అప్పుడు నాపై ఏవోవో వార్తలు రాసుకునేవాళ్లు. హరీశ్ అలా చెప్పి నా దృష్టిలో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఇకపై ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటానని అప్పుడే చెప్పా’ అని దేవి చెప్పుకొచ్చాడు.దీనికి సంబంధించిన వీడియోని హరీశ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘గుర్తింపు కోసం ఏదైనా మాట్లాడే ఈ రోజుల్లో …గుర్తు పెట్టుకుని మరీ మీరు ఇలా మాట్లాడ్డం కేవలం మీ గొప్పదనం .మీ సంగీతం గురించే కాకుండా మీ సంస్కారం గురించి కూడా అందరూ మాట్లాడుకునేలా చేసారు’అని రాసుకొచ్చాడు.ఇక ‘గద్దలకొండ గణేష్’ విషయానికొస్తే..తమిళంలో హిట్టయిన ‘జిగార్తండ’ తెలుగు రీమేక్‌గా హరీశ్ తెరకెక్కించాడు. వరుణ్ తేజ హీరోగా నటించగా, మిక్కీజే మేయర్ సంగీతం అందించాడు. 2019లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. -
‘అతిథి’గా హరీష్ శంకర్.. ఏ సినిమాలో అంటే..
‘గబ్బర్ సింగ్, రామయ్యా వస్తావయ్యా, దువ్వాడ జగన్నాథమ్’ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన హరీష్ శంకర్(Harish Shankar ) ‘ఓ భామ అయ్యో రామ’(Oh Bhama Ayyo Rama) చిత్రంలో గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. సుహాస్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమా ద్వారా మలయాళ నటి మాళవికా మనోజ్ తెలుగుకి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు రామ్ గోధల దర్శకత్వంలో హరీష్ నల్ల నిర్మిస్తున్న ఈ సినిమాని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా విడుదల చేయనుంది. ఈ చిత్రంలో హరీష్ శంకర్ అతిథి పాత్ర చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. సినిమాలో ఆయన గెస్ట్ రోల్ అందరిని సర్ఫ్రైజ్ చేస్తుందట. ఈ పాత్ర ఆయన చేస్తేనే బాగుంటుందని భావించిన మేకర్స్ హరీష్ శంకర్‌ను ఒప్పించి ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఇటీవల పూర్తిచేశారు.‘‘ఈ సినిమాలో సున్నితమైన ప్రేమ, భావోద్వేగాలతో పాటు మంచి వినోదం ఉంటుంది. ఈ మూవీలోని ఓ పాత్ర కోసం హరీష్ శంకర్‌గారిని ఒప్పించి, ఆయన పాత్ర షూటింగ్ పూర్తి చేశాం. ఆయన గెస్ట్ రోల్ సర్ప్రైజ్ చేస్తుంది. మా చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేస్తాం’’ అన్నారు హరీష్ నల్ల. -
'మిస్టర్ బచ్చన్'.. నేను తీసుకున్న చెత్త నిర్ణయం!
సినిమా హిట్ అయితే గొప్పగా చెప్పుకొంటారు. కానీ అదే ఫెయిలైతే మాత్రం చాలామంది నిర్మాతలు ఒప్పుకోరు. మేం బాగానే తీశాం, జనాలు ఆదరించలేదు అని ఏవేవో కబుర్లు చెబుతుంటారు. కానీ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాత్రం 'మిస్టర్ బచ్చన్' ఫ్లాప్ అని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు ఈ మూవీ ఎక్కడ ఫెయిలైందో అనే విషయాల్ని డీటైల్డ్‌గా చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: సత్యదేవ్‌కి అన్యాయం? 'ఆర్ఆర్ఆర్'లో 16 నిమిషాల సీన్స్ కట్)సినిమా లాంచ్ కావడానికి ఒక్కరోజు ముందే ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చానని చెప్పిన టీజీ విశ్వప్రసాద్.. రీమేక్ అవసరమా అని తాను మొదటే అడిగానని అన్నారు. రీమేక్ కంటే ఒరిజినల్ స్టోరీతో చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం చెప్పాను. కానీ అప్పటికే నిర్ణయం తీసుకునే విషయంలో చాలా లేట్ అయిపోవడంతో మరేం మాట్లాలేకపోయాను. 'మిస్టర్ బచ్చన్'ని లక్నోలో తీయడం నా జీవితంలో తీసుకున్న అతిపెద్ద చెత్త నిర్ణయం అనుకుంటున్నాను.80ల నాటి హిందీ పాటలు తమకు నచ్చడంతో 'మిస్టర్ బచ్చన్' ఆడేస్తుందని అనుకున్నామని విశ్వప్రసాద్ చెప్పారు. ఇది ఓ తప్పయితే, షూటింగ్ చాలా వేగంగా చేయడం మరో మైనస్ అని అన్నారు. సినిమాలో కొన్ని సీన్స్ అయినా సరిగా తీసుంటే.. హిట్ అయ్యుండేదేమో అని అభిప్రాయపడ్డారు. రైడ్ సీన్స్‌తో పాటు యాక్షన్ సన్నివేశాల విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టి, కాస్త నెమ్మదిగా షూటింగ్ పూర్తి చేసి ఉంటే బాగుందని అన్నారు.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)నిర్మాత విశ్వప్రసాద్ చెప్పిన దానిబట్టి చూస్తే తప్పంతా హరీశ్ శంకర్‌దే అనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్‌కి ముందు ఈయన మామూలు హడావుడి చేయలేదు. అంతెందుకు మొన్న ఐఫా అవార్డుల్లోనూ రానా-తేజ సజ్జా ఫన్నీగా 'మిస్టర్ బచ్చన్' గురించి ఏదో సెటైర్ వేశారు. దాన్ని కూడా హరీశ్ శంకర్ తీసుకోలేకపోయారు. 'ఎన్నో విన్నాను తమ్ముడు' అని ట్వీట్ చేశారు తప్పితే తన తప్పుని మాత్రం ఒప్పుకోవట్లేదు.పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని హరీశ్ శంకర్ చాన్నాళ్ల క్రితమే మొదలుపెట్టారు. కానీ అది ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. ప్రస్తుతానికి అయితే హరీశ్ శంకర్ చేతిలో మరో ప్రాజెక్టేం లేదు.(ఇదీ చదవండి: 'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?) -
అది 'తేరీ' రీమేక్ కాదు.. అప్పుడో మాట ఇప్పుడో మాట!
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి. మరోవైపు 'హరిహర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు పూర్తి చేయాలి. వీటిని చాలా ఏళ్ల క్రితమే మొదలుపెట్టారు. కానీ తేలవు, మునగవు అన్నట్లు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. అలా పవన్ చేయాల్సిన మూవీస్ విషయంలో కన్ఫ్యూజన్ తీరట్లేదు. ఇప్పుడు మరింత గందరగోళానికి గురిచేసేలా దర్శకుడు దశరథ్ కామెంట్స్ చేశాడు.పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కలిసి 'గబ్బర్ సింగ్' చేశారు. హిందీ మూవీ 'దబంగ్'కి రీమేక్ ఇది. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి 'భవదీయుడు భగత్ సింగ్' పేరుతో చాన్నాళ్ల క్రితం ఓ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఆ టైంలో ఇది దళపతి విజయ్ 'తేరీ' రీమేక్ అని ప్రచారం జరిగింది. తర్వాత దీని పేరుని 'ఉస్తాద్ భగత్ సింగ్' అని పేరు మార్చారు. ఈ ప్రాజెక్ట్‌లో స్క్రీన్ ప్లే రైటర్‌గా పనిచేస్తున్న దర్శకుడు దశరథ్.. అప్పట్లో దీన్ని 'తేరీ' రీమేక్ అని కన్ఫర్మ్ చేశారు.(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడికి మరో కారు గిఫ్ట్)రీసెంట్గా దశరథ్ తీసిన 'మిస్టర్ ఫెర్ఫెక్ట్' సినిమా రీ-రిలీజైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మూవీ గురించి చాలా విషయాలు మాట్లాడారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' టాపిక్ వచ్చేసరికి.. ఇది 'తేరీ' కాదని అన్నారు. అంటే మాట మార్చేసినట్లే. అప్పట్లో మిస్ కమ్యూనికేషన్ వల్ల, స్టోరీ లైన్ ఒకేలా అనిపించడం వల్ల అలా చెప్పానని దశరథ్ అన్నారు.పవన్ కల్యాణ్ సినిమా ప్రకటించినప్పుడే చాలామంది 'తేరీ' రీమేక్ అని అందరూ ఫిక్సయిపోయారు. అప్పట్లో ఈ విషయమై హరీశ్ శంకర్‌ని చాలా ట్రోల్ చేశారు. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ హోల్ట్‌లో ఉంది. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)Abba Sairam 🙏#UstaadBhagathSingh pic.twitter.com/mwgqfTE3sG— ♈️👁️🗨️〽️💲❗️ (@vamsi_pamuri) October 25, 2024 -
మరికొద్ది గంటల్లో ఓటీటీకి మిస్టర్ బచ్చన్.. ఎక్కడ చూడాలంటే?
మాస్ మహారాజ రవితేజ, భాగ్యశ్రీ బోర్సో జంటగా నటించిన చిత్రం'మిస్టర్ బచ్చన్'. హరీశ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. ఊహించని ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.అయితే ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఓటీటీ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన మిస్టర్ బచ్చన్.. ఓటీటీ ప్రియులను అలరిస్తుందేమో చూడాలి.అసలు కథేంటంటే..మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఓ నిజాయితీపరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్‌ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్‌ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్‌కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లదనాన్ని బచ్చన్ ఎలా బటయకు తీశాడు? అనేదే మిగతా కథ. -
ఓటీటీలో 'మిస్టర్ బచ్చన్' స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన
మాస్ మహారాజ రవితేజ- హరీశ్ శంకర్ కాంబినేషన్లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా 'మిస్టర్ బచ్చన్'. ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, తాజాగా ఓటీటీ రిలీజ్‌పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. 'మిస్టర్ బచ్చన్' సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, రిలీజ్ తర్వాత మొదటి ఆట నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచింది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే జోడీగా కనిపించారు. సినిమా డిజాస్టర్ టాక్ వచ్చినా పాటలు బాగుండటంతో ఓటీటీలో చూద్దాంలే అనుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ 'మిస్టర్ బచ్చన్' ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్‌ను పంచుకుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.కథేంటంటే..మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఓ నిజాయితీపరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్‌ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్‌ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్‌కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లదనాన్ని బచ్చన్ ఎలా బటయకు తీశాడు? అనేదే మిగతా కథ. -
హరీష్ కి హ్యాండ్ ఇచ్చిన రామ్.
-
మెగా హీరోస్ పైనే హరీష్ ఆశలు..
-
రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్!
హరీశ్ శంకర్ పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా 'గబ్బర్ సింగ్'. ఎక్కువగా రీమేక్ కథలతో మూవీస్ తీస్తాడనే అపవాదు ఉన్న ఈ దర్శకుడు తీసిన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ బచ్చన్'. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజై ఘోరంగా ఫ్లాప్ అయింది. చాలా నష్టాలొచ్చాయి. ఈ క్రమంలోనే హరీశ్ శంకర్ తన వంతుగా కొంత రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది.ప్రస్తుతానికి రెండు కోట్లు రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చారని, త్వరలో మరి కొంచె వెనక్కి ఇచ్చే అవకాశముందని సమాచారం. ఏదేమైనా ఇలా సినిమా నష్టపోతే ఇలా పారితోషికం వెనక్కి ఇచ్చి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లని ఆదుకోవడం మంచి విషయమే. మరోవైపు ఇదే సినిమాలో హీరోగా రవితేజ నుంచి ఇలాంటి రెస్పాన్స్ రాలేదు.(ఇదీ చదవండి: Bigg Boss 8: చావు వరకు వెళ్లొచ్చా.. ఏడిపించేసిన నాగ మణికంఠ!)'మిస్టర్ బచ్చన్' విషయానికొస్తే.. 2018 హిందీలో వచ్చిన 'రైడ్' అనే మూవీకి రీమేక్‌గా దీన్ని తీశారు. అయితే ఒరిజినల్ స్టోరీ సీరియస్‌గా ఉంటుంది. హరీశ్ శంకర్ మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పి పాటలు, ఫైట్స్ అని అదనంగా జోడించారు. దీంతో మూవీ కాస్త కిచిడి అయిపోయింది. అలానే మరీ ఎక్కువగా హీరోయిన్ భాగ్యశ్రీ అందాలని చూపించడం కూడా అసలు కథని పక్కదారి పట్టించిందనే విమర్శలు వచ్చాయి.ఇకపోతే 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసుకోవచ్చు అనేలా అగ్రిమెంట్ చేసుకున్నారని టాక్. దీనిబట్టి చూస్తే వచ్చే వారం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. లేదంటే వినాయక చవితి కానుకగా ఈ శనివారం నుంచి స్ట్రీమింగ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం) -
మా జీవితాలను మార్చింది: హరీష్ శంకర్
‘‘సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈ రోజుల్లో ‘గబ్బర్ సింగ్’ రిలీజ్ అయి ఉంటే ఎంత బాగుండేదో అని నా మనసులో చిన్న వెలితి ఉండేది. ఆ వెలితి ఇప్పుడు తీరింది. అప్పుడు మిస్ అయిన డిజిటల్ హంగామాని మళ్లీ క్రియేట్ చేసి ఇస్తున్న మా అన్న గణేశ్‌కి, సత్యనారాయణకి థ్యాంక్స్. ‘గబ్బర్ సింగ్’ మా జీవితాలను మార్చేసిన సినిమా’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. పవన్ కల్యాణ్, శ్రుతీహాసన్ జంటగా నటించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. బండ్ల గణేశ్ నిర్మించిన ఈ చిత్రం 2012 మే 11న విడుదలైంది. ఈ నెల 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో శనివారం ప్రెస్ మీట్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ – ‘‘గబ్బర్ సింగ్’ డబ్బింగ్ సమయంలోనే ఈ మూవీ పక్కా బ్లాక్‌బస్టర్ అన్నారు పవన్ కల్యాణ్‌గారు. నా అభిమానులు కోరుకునేది ఇవ్వబోతున్నావ్’’ అన్నారు. ‘‘నన్ను నేను నమ్మలేని పరిస్థితిలో పవన్ కల్యాణ్‌గారు నమ్మి, నన్ను నిర్మాతగా నిలబెట్టారు. నేను, హరీష్, దేవిశ్రీ ప్రసాద్... అందరూ ప్రేమించి ఈ సినిమా చేశాం. ఏడేళ్లుగా నేను సినిమా తీయకపోవడం బాధగా ఉంది... మళ్లీ సినిమాలు తీస్తా’’ అన్నారు బండ్ల గణేశ్. డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ, నటుడు రమేశ్‌రెడ్డి మాట్లాడారు. -
హరీశ్ శంకర్ గురించి నేను అలాంటి కామెంట్ చేయలేదు: నిర్మాత
రవితేజ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించిన సినిమా ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్స్ మీడియా బ్యానర్‌పై నిర్మాత టీజీవీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈక్రమంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన క్రిటిసిజం, ఫీడ్‌బ్యాక్‌ని దృష్టిలో పెట్టుకుని ‘మిస్టర్ బచ్చన్’ సినిమా నుంచి 13 నిమిషాల నిడివి తగ్గించారు. అయినా కూడా టికెట్లు మాత్రం తెగలేదు. ఈ సినిమా డిజాస్టర్ కావడానికి డైరెక్టర్ హరీశ్ శంకర్ అని నిర్మాత టీజీవీ విశ్వప్రసాద్ కామెంట్లు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ అంశం గురించి వారిద్దరూ ఒక క్లారిటీ ఇచ్చారు.స్క్రిప్ట్ బలంగా లేదు: టీజీవీ విశ్వప్రసాద్ మిస్టర్ బచ్చన్ సినిమాపై డిజాస్టర్ టాక్ వచ్చిన తర్వాత టీజీ విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సినిమా రిజల్ట్ గురించి ఆయన ఇలా చెప్పారు.' సినిమా స్క్రిప్ట్ మరింత బలంగా ఉండాల్సింది. ఈ విషయంలో మేము మిస్‌ఫైర్ అయ్యాం. కొంత ఎడిట్ చేసింటే బాగుండేది. మిస్టర్ బచ్చన్ సెకండాఫ్ కాస్త నిరాశపరిచింది. అయితే, కొంతమంది సోషల్ మీడియాలో పనికట్టుకుని సినిమాపై తప్పుడు ప్రచారం చేశారు.'అని ఆయన చెప్పారు.టీజీ విశ్వప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలను కొందరు తమకు నచ్చినట్లు ప్రచారం చేసుకున్నారు. సినిమాను హరీశ్ శంకర్ నాశనం చేశాడని విశ్వప్రసాద్ అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా విశ్వప్రసాద్ తన ఎక్స్ పేజీలో రియాక్ట్ అయ్యారు. హరీష్ శంకర్ తనకు మంచి స్నేహితుడని ఆయన పేర్కొన్నారు. హరీశ్ శంకర్ గురించి తాను ఎలాంటి కామెంట్లు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే, తాను అనని మాటలను మీడియా పెద్దవిగా చూపుతూ ప్రచారం చేసిందని చెప్పారు. హరీశ్ శంకర్ సినిమా మేకింగ్ మీద తనకు చాలా నమ్మకం ఉందని మరో సినిమా ఆయనతో కలిసి చేసేందుకు ఎదురుచూస్తున్నట్టుగా రాసుకొచ్చారు.డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా టీజీ విశ్వప్రసాద్ గురించి రియాక్ట్ అయ్యారు.. మీ సపోర్ట్ గురించి నాకు తెలుసు సార్.. అయితే, మీడియాలో మీరు అన్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం ఉందని నేను ఒక్క క్షణం కూడా నమ్మలేదు. మీతో కలిసి చేయబోయే తర్వాతి సినిమా కోసం ఎదురుచూస్తున్నా.. మంచి విజయాన్ని తప్పకుండా అందుకుంటాం. అయితే, మిస్టర్ బచ్చన్ విడుదల సమయంలో మీడియాపై హరీశ్ శంకర్ చేసిన కామెంట్ల వల్లే సినిమాపై వేగంగా నెగిటివ్ టాక్ వ్యాప్తికి కారణమైందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. -
'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?
రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ బచ్చన్'. అప్పుడెప్పుడో 2018లో హిందీలో వచ్చిన 'రైడ్' అనే చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని దీన్ని తీశారు. కాకపోతే కమర్షియల్ హంగులు అని చెప్పి అసలు కథని సైడ్ చేయడంతో మూవీ ఫెయిలైంది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైతే తొలిరోజే నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.(ఇదీ చదవండి: హీరోయిన్ ప్రణీత బేబీ షవర్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్)రిలీజ్‌కి ముందు దర్శకుడు హరీశ్ శంకర్ హైప్ పెంచేలా కామెంట్స్ చేశాడు. దీంతో సినిమాపై ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఘోరమైన రిజల్ట్ కనిపించింది. హీరోయిన్ తప్పితే చూడటానికి సరైన కంటెంట్ లేదని ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. అలానే సినిమాకు భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ పండితుల అంచనా. ఈ క్రమంలోనే అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది.'మిస్టర్ బచ్చన్' డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమా ఫలితం పాజిటివ్‌గా వచ్చుంటే కాస్త లేటుగా ఆరు వారాల్లో స్ట్రీమింగ్కి వచ్చి ఉండేదేమో? కానీ రిజల్ట్ తేడా కొట్టేయడంతో థియేటర్లలో రిలీజైన నెలలోనే ఓటీటీలోకి తీసుకొచ్చేయబోతున్నారని తెలుస్తోంది. అంటే వినాయక చవితికి సెప్టెంబరు 6 లేదా 7న లేదంటే ఆ తర్వాత వారంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: షూటింగ్ లో గాయపడ్డ రవితేజ.. ఆరు వారాలు విశ్రాంతి) -
రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేస్తున్న హరీశ్ శంకర్!
మిస్టర్ బచ్చన్.. ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. పాత రవితేజను చూస్తారంటూ ఊదరగొట్టిన డైరెక్టర్ హరీశ్ శంకర్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఇప్పటివరకు కేవలం రూ.12.6 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఫ్లాప్ దిశగా పయనిస్తోంది.దీంతో హరీశ్ శంకర్ ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడట! తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగిచ్చేయాలని ఫిక్స్ అయ్యాన్నాడంటూ ఓ వార్త ఫిల్మీదునియాలో వైరల్‌గా మారింది. మిస్టర్ బచ్చన్ పరాజయానికి బాధ్యత వహిస్తూ తనకు ఇచ్చిన రూ.15 కోట్లను నిర్మాతకు తిరిగిచ్చేస్తాడట! మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది.సినిమా విషయానికి వస్తే.. ఉత్తర భారతదేశంలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా మిస్టర్ బచ్చన్ తెరకెక్కింది. రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు. -
ఆ దర్శకులపై లేని అటాక్ నా ఒక్కడి మీదే ఎందుకు?: హరీశ్ శంకర్
ఆగస్టు 15 వీకెండ్లో రిలీజైన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు పెద్దగా పాజిటివ్ టాక్ రాలేదు. మరీ ముఖ్యంగా దర్శకుడు హరీశ్ శంకర్‌పై ఘోరమైన విమర్శలు వస్తున్నాయి. రిలీజ్‌కి ముందు మాట్లాడిన దానికి.. మూవీలో కంటెంట్‌కి ఏ మాత్రం సంబంధం లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫ్యాన్స్ మీట్ పెట్టిన హరీశ్ శంకర్.. తనపై ట్రోల్స్ గురించి స్పందించాడు.(ఇదీ చదవండి: సూర్య vs రజినీకాంత్.. కలెక్షన్స్ దెబ్బ తీసే పోటీ!)రవితేజ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల దర్శకులపై లేని అటాక్ తనపైనే జరుగుతోందని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చాడు. కావాలనే టార్గెట్ చేసి మరీ తనని విమర్శిస్తున్నారని అన్నాడు. 'ఇంతకు ముందొచ్చిన రామారావ్ ఆన్ డ్యూటీ, రావణాసుర, ఖిలాడి, ఈగల్ సినిమాలు కూడా కొంచెం డిసప్పాయింట్ చేశాయి. కానీ ఆ డైరెక్టర్స్ మీద లేని అటాక్ నా ఒక్కడి మీదే ఉంది. ఎందుకంటే వ్యక్తిగత అజెండాతో నన్ను టార్గెట్ చేశారని నాకు అనిపిస్తోంది' అని హరీశ్ శంకర్ అన్నాడు.అయితే హరీశ్ శంకర్ తాజా కామెంట్స్‌పై కూడా నెటిజన్లు రెచ్చిపోతున్నారు. మిగతా దర్శకులు ఇలా రిలీజ్‌కి ఇంటర్వ్యూల్లో మాట్లాడలేదని, వాళ్లెవరు రీమేక్స్ చేయలేదని తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా హరీశ్ శంకర్.. తాను తీసిన సినిమా కంటే చేస్తున్న వ్యాఖ్యల వల్లే వైరల్ అవుతుండటం ఇక్కడ విచిత్రమైన విషయం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
పొరబడ్డారు.. తను నా భార్య కాదు: హరీశ్ శంకర్
రీసెంట్గా రిలీజైన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా విడుదలకు ముందు దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడిన దానికి.. మూవీ వచ్చిన తర్వాత అసలు పొంతనే లేదు. దీంతో ట్రోలర్స్ రెచ్చిపోయారు. సినిమాలో కంటెంట్ పట్ల విమర్శలు చేస్తున్నారు. మరోవైపు హరీశ్ శంకర్ భార్య ఈమెనే అని ఓ నటి ఫొటో వైరల్ అవుతోంది. తాజాగా ఈ విషయమై హరీశ్ శంకర్ క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన హీరో మోహన్ లాల్!)చాన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న హరీశ్ శంకర్.. 'గబ్బర్ సింగ్' సినిమాతో బోలెడంత పేరు తెచ్చుకున్నారు. కాకపోతే దాన్ని కొనసాగించే క్రమంలో తప్పటడుగులు వేస్తున్నారు. అలాంటి తప్పిదమే తాజాగా రిలీజైన 'మిస్టర్ బచ్చన్'. సరే దీని గురించి వదిలేస్తే గతంలో ఇదే రవితేజతో 'మిరపకాయ్' అనే మూవీ చేశారు. ఇందులో హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ పక్కన ఓ అమ్మాయి నటించింది. అయితే ఈమెనే హరీశ్ శంకర్ భార్యని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపించాయి.తాజాగా ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో హరీశ్ శంకర్‌ని అడగ్గా.. తన భార్య పేరు, ఆ అమ్మాయి పేరు స్నిగ్ద అని అందుకే చాలామంది పొరబడుతున్నారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి అమెరికాలో జాబ్ చేసుకుంటోందని అన్నాడు. దీంతో ఓ క్లారిటీ వచ్చేసినట్లయింది. ఇదిలా ఉండగా హరీశ్ శంకర్.. రామ్‌తో తన తర్వాత సినిమా చేయబోతున్నాడు. బచ్చన్ మూవీ ప్రమోషన్స్‌లో ఈ విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?) -
పొరపాటు తెలుసుకున్న 'మిస్టర్ బచ్చన్'.. నిడివి తగ్గించి
ఆగస్టు 15. థియేటర్లలోకి తెలుగు స్ట్రెయిట్ మూవీస్ మూడు వచ్చాయి. వీటిలో రవితేజ 'మిస్టర్ బచ్చన్', రామ్ 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలతో పాటు 'ఆయ్' అనే మరో చిన్న మూవీ కూడా రిలీజైంది. కాన్ఫిడెన్స్‌తో ముందు రోజే అంటే ఆగస్టు 14నే బచ్చన్ ప్రీమియర్స్ వేశారు. అయితే అప్పడే డివైడ్ టాక్ వచ్చింది. మూవీలో సీన్లపై ఘోరంగా ట్రోలింగ్ సాగుతోంది. ఇప్పుడు మూవీ టీమ్ జాగ్రత్త పడింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్)సోషల్ మీడియాలో వస్తున్న క్రిటిసిజం, ఫీడ్ బ్యాక్ ఆధారంగా దాదాపు 13 నిమిషాల నిడివి తగ్గించినట్లు స్వయంగా మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే ఇదేదో ముందే చేసుంటే టాక్ పాజిటివ్‌గా వచ్చి ఉండేదేమో? ఏదైతేనేం తప్పు ఎక్కడ జరిగిందో వెంటనే తెలుసుకున్న బచ్చన్ టీమ్.. నిడివిలో మార్పు చేయడం మంచిదే.లాంగ్ వీకెండ్ ఉన్న నేపథ్యంలో ఇలా నిడివి తగ్గించడం మరి 'మిస్టర్ బచ్చన్' కలిసొస్తుందేమో చూడాలి? ఇప్పటికే 'ఆయ్'తో పాటు డబ్బింగ్ బొమ్మ 'తంగలాన్'కి పాజిటివ్ టాక్ వచ్చింది. అలానే హిందీ మూవీ 'స్త్రీ 2' కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. ఇలా వీటిని తట్టుకుని బచ్చన్ మూవీ ఏ మేరకు నిలబడుతుందో చూడాలి?(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?) -
రవితేజస్ మిస్టర్ బచ్చన్ సక్సెస్ సెలబ్రేషన్స్
-
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
పాత రవితేజను కొత్తగా చూస్తారు: హరీష్ శంకర్
⇒ ఉత్తర భారతదేశంలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఉంటుంది. కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాను. ఈ సినిమాలో హీరో బచ్చన్ పాత్రలో నిజాయితీ ఉన్న హీరోయిజమ్ ఉంటుంది. 1980లో లక్షల రూపాయలంటే పెద్ద మొత్తం. అంత మొత్తం లంచం రూపంలో వస్తుందన్నా కూడా ఓ అధికారి ఒప్పుకోలేదు.. లొంగలేదు. నాకు ఈ పాయింట్ నచ్చింది. ఇలాంటి నిజాయితీ గల ఆఫీసర్ జీవితంలో ప్రేమ, ఫ్యామిలీ, రొమాంటిక్ యాంగిల్స్ కూడా ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించి రవితేజగారి క్యారెక్టర్‌ను డిజైన్ చేశాను.ప్రేక్షకులు బాగా ఎంటర్టైన్ అవుతారు. హిందీ ‘రైడ్’కు, ‘మిస్టర్ బచ్చన్’కు...అజయ్ దేవగన్‌కు, రవితేజకు మధ్య ఉన్నంత తేడా ఉంది. ‘రైడ్’లో అజయ్ దేవగన్ రోల్ సెటిల్డ్‌గా ఉంటే... ‘మిస్టర్ బచ్చన్’లో రవితేజగారి రోల్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ఉంటుంది. ఇక ఈ కథకు ఓ కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని భావించి భాగ్యశ్రీ బోర్సేను తీసుకోవడం జరిగింది. జిక్కీ పాత్రలో ఆమె ప్రేక్షకులను మెప్పిస్తారు. జగపతిబాబుగారు ఎంపీ పాత్రలో కనిపిస్తాను. ⇒నేను సినిమా చూడని రోజులు ఉన్నాయేమో కానీ పాటలు వినకుండా ఉన్న రోజులు లేవు. ఓ సినిమా దర్శకుడిగా నేను విఫలం అయ్యానేమో కానీ... సంగీతం విషయంలో కాదు. నా ఫ్లాప్ మూవీ ‘షాక్’లోని ‘మధురం..’ పాట ఇంకా వినిపిస్తూనే ఉంది. ట్యూన్స్ సరైన సమయానికి ఇవ్వకపోవడం వల్ల లిరికల్ వీడియోలు లేట్‌గా విడుదల అవుతున్న రోజులివి. అలాంటిది వారం రోజుల్లో నాలుగు ట్యూన్స్ ఇచ్చారు మిక్కీ జే మేయర్. ఆయన చాలా ప్రతిభావంతుడు. మాస్ సాంగ్స్ చేయలేదు అంటే ఆయనకు రాక కాదు... చాన్స్ రాలేదు అంతే. ⇒ చలం, యండమూరిగార్ల నవలలు చదివి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సాహిత్యంలో మంచి పట్టు ఉంది నాకు. అలాంటి నేను ‘షాక్’ సినిమా తీస్తే మూడేళ్లు ఆడియన్స్ నన్ను షాక్‌లో ఉంచారు. ఆ వెంటనే ‘మిరపకాయ్’ సినిమా తీశాను. ఇక ‘ఇడియట్, ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’ వంటి సినిమాలు చేసిన రవితేజగారు ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలని అప్పట్లో ‘నా ఆటోగ్రాఫ్..’, ఇటీవల ‘టైగర్ నాగేశ్వరరావు, ఈగల్’ సినిమాలు చేస్తే ఆడియన్స్ ఆదరణ దక్కలేదు.కానీ ‘ధమాకా’ అంటే హిట్ ఇచ్చారు. అందుకే ‘మిస్టర్ బచ్చన్’లో పాత రవితేజనే కొత్తగా చూపిస్తున్నాం. నిర్మాత విశ్వప్రసాద్ గారు లేకపోతే ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఇంత గ్రాండ్‌గా వచ్చేది కాదు. ఆగస్టు 15న రిలీజ్ చేసేవాళ్లం కాదు. ఆడియన్స్‌కు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ‘మిస్టర్ బచ్చన్’ మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది. ఈ రోజు సాయంత్రం నుంచి ప్రీమియర్స్ వేస్తున్నాం. -
‘పుష్ప’ చూసి అంతా స్మగ్లింగ్ చేయట్లేదు కదా? : హరీశ్ శంకర్
సినిమా హీరోలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ పరోక్షంగా ఖండించారు. సినిమాల ప్రభావం ప్రజలపై ఉంటుందని చెప్పడం సరికాదన్నారు. ఒకవేళ అదే నిజమైతే ‘గాంధీ’సినిమా చూసి అందరం మహాత్మ గాంధీలాగే మరిపోవాలన్నారు. తన వరకు అయితే సినిమా అనేది కేవలం వినోదాన్ని పంచడానికే పని కొస్తుందని తనదైన శైలీలో చెప్పుకొచ్చారు.వినోదం కోసమే సినిమా: హరీశ్ శంకర్‘మిస్టర్ బచ్చన్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హరీశ్ తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ.. ‘సినిమాల ఎఫెక్ట్ ప్రజలపై కొన్ని గంటలు మాత్రమే పని చేస్తుంది. నిజంగా సినిమా చూసి మనుషులు మారిపోతారంటే.. ‘పుష్ప’ సినిమా చూసిన ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి.. గొడ్డలి పట్టుకొని తిరుపతి వెళ్లి స్మగ్లింగ్ చేయాలి. కానీ అలా చేయట్లేదు కాదా? ఠాగూరు చూసిమా చూసిన తర్వాత లంచం తీసుకోవడం మానేయాలి. కానీ మన ఆఫీసర్లు ఆ పని చేస్తున్నారా? అంతెందుకు ఆస్కార్ అవార్డు గెలిసిన ‘గాంధీ’సినిమా చూసి ప్రతి ఒక్కరు మహాత్మ గాంధీ అయిపోవాలి. అలా అయ్యారా? నటుడు అన్నప్పుడు రకరకాల పాత్రలను చేస్తారు. వారి అంతిమ లక్ష్యం వినోదాన్ని పంచడమే. వారిని చూసి మారిపోతారనేది నేను నమ్మను. నా వరకు సినిమా అనేది వినోదం మాత్రమే. నేను కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే అందిస్తాను’ అని హరీశ్ చెప్పుకొచ్చారు.పవన్ ఏం అన్నారు?ఇటీవల బెంగళూరు పర్యటనకు వెళ్లిన పవన్.. అక్కడ మీడియాతో అడవుల సంరక్షణ గురించి మాట్లాడుతూ.. ‘40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవాడు. కానీ ఇప్పుడు హీరోలే అడవును నరికి స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా చూపిస్తున్నారు. ఒక సినిమా వ్యక్తిగా నేను అలాంటి ఎంకరేజ్ చేయను. అలాంటి సినిమాలు బయటకు మంచి మెసేజ్ ఇవ్వలేవు’అన్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ గురించే పవన్ సెటైర్లు వేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. -
తమ్ముళ్లూ... ఇరగదీయబోతున్నాం: రవితేజ
రవితేజ, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్గా రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాని మా డీవోపీ అయాంక చాలా కలర్ఫుల్గా, లడ్డూలా చూపించారు. ‘మిస్టర్ బచ్చన్’లో నేను, భాగ్యశ్రీ చాలా అందంగా కనిపించడానికి కారణం ఆయనే. మా డ్యాన్స్ మాస్టర్ భాను రెండు పాటలను ఇరగదీశాడు. భాస్కరభట్ల నాకు ఎన్నో పాటలు రాశాడు. ఈ మధ్య నాకు కాసర్ల, సాహితీ కూడా రాస్తున్నారు. కొత్త యాక్షన్ కో–ఆర్డినేటర్ పృథ్వీ చాలా కామ్‌గా ఉంటాడు. నాలుగు ఫైట్స్‌లో ఒక్క ఫైట్ తప్ప మిగతా మూడూ తనే చేశాడు. ఫైట్స్ చాలా బాగా కొరియోగ్రఫీ చేశాడు. ఇంకా ఇతర టీమ్ సభ్యులు కూడా బాగా హార్డ్‌వర్క్ చేశారు. మిక్కీ జే మేయర్ నుంచి అసలు ఇలాంటి మ్యూజిక్ వస్తుందని ఊహించలేదు. ఫస్ట్ టైమ్ ట్యూన్స్ వినిపించినప్పుడు ‘ఇది మిక్కీనా’ అనిపించింది. అంత మంచి పాటలు ఇచ్చాడు. వివేక్‌గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలి. విశ్వప్రసాద్గారూ... మీ ఫ్యాక్టరీ ఇలానే రన్ అవ్వాలి. పేరుతో పాటు డబ్బులు కూడా రావాలి. హరీష్ చాలా హార్డ్ వర్కర్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయి, మా కాంబినేషన్లో నెక్ట్స్ సినిమా హ్యాట్రిక్‌కి నాంది కావాలి. తమ్ముళ్లూ (అభిమానులను ఉద్దేశించి) ఇరగదీయబోతున్నాం’’ అన్నారు. ‘‘ఒక్కసారి కాదు మళ్లీ మళ్లీ చూసే సినిమా ఇది’’ అని హరీష్ శంకర్ పేర్కొన్నారు. ఈ వేడుకలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి. వెంకటేశ్ అతిథులుగాపాల్గొన్నారు. -
'నల్లంచు తెల్లచీర' మాస్ సాంగ్‌కు స్టెప్పులేసిన మిస్టర్ బచ్చన్
రవితేజ టైటిల్ రోల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిస్టర్ బచ్చన్.. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్గా తొలిపరిచయం అవుతుంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. నల్లంచు తెల్లచీర అంటూ సాగే ఈ మాస్ సాంగ్నుశ్రీరామ చంద్ర, సమీర భరద్వాజ్ ఆలపించారు. భాస్కరభట్ల ఈ పాటను రచించారు. మాస్ ఆడియన్స్ విజిల్ వేసేలా ఈ సాంగ్ ఉంది. -
రవితేజ 'మిస్టర్ బచ్చన్'.. సూపర్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్‌కు ముందు మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నల్లంచు తెల్లచీర అనే లిరికల్ సాంగ్‌ను ఈనెల 12న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని హీరో రవితేజ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. హీరోయిన్‌తో సరదాగా నడుచుకుంటూ వెళ్తున్న ప్రోమోను అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సితార్ సాంగ్ యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈనెల 15న మిస్టర్ బచ్చన్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. కాగా.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కర్నూలులో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. This isn’t something I usually do, but this time, it’s for you all 😘#NallanchuThellacheera from #MrBachchan out Tomorrow, August 12th ❤🔥 pic.twitter.com/NokEYn4y0z— Ravi Teja (@RaviTeja_offl) August 11, 2024 -
హీరో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ అదిరిపోయే HD స్టిల్స్
-
రవితేజ 'మిస్టర్ బచ్చన్' మాస్ ట్రైలర్ విడుదల
రవితేజ టైటిల్ రోల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిస్టర్ బచ్చన్.. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మిస్టర్ బచ్చన్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈమేరకు ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్గా తొలిపరిచయం అవుతుంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. -
హీరోయిన్‌కు లేని ఇబ్బంది మీకెందుకు: హరీశ్ శంకర్
సినిమా పరిశ్రమలో మనం ఎక్కువగా వినే మాట ఏజ్ గ్యాప్.. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం కనిపిస్తే చాలు ఒక్కోసారి ట్రోల్స్ కూడా వస్తుంటాయి. ఈ క్రమంలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఇందులో రవితేజ- భాగ్య శ్రీ బోర్సే జంటగా నటిస్తున్నారు. అయితే, వీరిద్దరితో తెరకెక్కిన ఒక సాంగ్‌ను కొద్దిరోజుల క్రితం మేకర్స్ విడుదల చేశారు. అందులో వారిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ క్లియర్‌గా కనిపిస్తుందని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే, తాజాగా చిత్ర డైరెక్టర్ హరీష్ శంకర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో రవితేజ- భాగ్య శ్రీ బోర్సే కేవలం నటిస్తున్నారని ముందుగా అందరు గుర్తుపెట్టుకోవాలి. ఏజ్ గ్యాప్ అనేది ఈ సినిమాలో మాత్రమే జరగడంలేదు. ఇప్పటికే కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ఒక యాక్టర్ ఎప్పుడూ తన వయస్సును బట్టి నటించరు. సినిమా కోసం ఒక్కోసారి 25 ఏళ్ల వయసు ఉన్న యువతి కూడా 50 ఏళ్లు ఉన్నట్లుగా కనిపించాల్సి ఉంటుంది. దీనినే స్క్రీన్ ఏజ్ అంటారని హరీశ్ శంకర్ చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి చాలా సినిమాల్లో నటించి సూపర్ హిట్స్ అందుకున్నారని ఆయన గుర్తు చేశారు. రవితేజ, శ్రీలీల నటించిన ధమాకా చిత్రాన్ని కూడా ఓ ఉదాహరణగా హరీశ్ చెప్పారు.‘మిస్టర్ బచ్చన్’లో రవితేజ సరసన నటించేందుకు హీరోయిన్‌కు ఎలాంటి సమస్య లేదు. ఆమెకు అడ్డురాని ఏజ్ గ్యాప్ మీకెందుకు అంటూ నెటిజన్ల తీరును తప్పుపట్టారు. ఈ విషయంలో హీరోయిన్‌కు సమస్య లేదు. కానీ ట్రోలర్స్‌కు వచ్చిన బాధ ఏంటో తనకు అర్థం కావడంలేదని పేర్కొన్నారు. ఏజ్ గ్యాప్ గురించి ఆమెకు (భాగ్యశ్రీ) ఎలాంటి సమస్య లేదు. ఇంతటితో ఇలాంటి కామెంట్లు ఆపేస్తే మంచిదని హరీశ్ తెలిపారు. మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. -
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ టీమ్ ఫ్రెండ్‌షిప్‌డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
మిస్టర్ బచ్చన్ నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల
రవితేజ టైటిల్ రోల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిస్టర్ బచ్చన్.. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్గా తొలిపరిచయం అవుతుంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది.ఈ సంగతి ఇలా ఉంచితే హిందీ హిట్ ఫిల్మ్ అజయ్ దేవగన్ ‘రైడ్ ’(2018)కు తెలుగు రీమేక్‌గా ‘మిస్టర్ బచ్చన్ ’ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ విషయాన్ని డైరెక్టర్ శంకర్ తప్పుపట్టారు. సినిమా చూసిన తర్వాత ఇదే కామెంట్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు. కాన్సెప్ట్ రైడ్ సినిమా కావచ్చునేమో కానీ, ఆయన తెరకెక్కించే తీరు మాత్రం ప్రత్యేకతను తప్పకుండా చాటుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. -
నేను దర్శకుడిని కాబట్టి మర్యాదగా మాట్లాడుతున్నా..
-
రవితేజ, హరీశ్ శంకర్ పై కోపానికి కారణం అదేనా..?
-
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ టీజర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?
ఒకప్పుడు హీరోయిన్, ఇప్పుడు నిర్మాతగా సినిమాలు తీస్తున్న ఛార్మీ.. హీరో రవితేజతో పాటు డైరెక్టర్ హరీశ్ శంకర్‌ని ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది. అయితే స్నేహితులుగా ఉన్న వీళ్ల మధ్య అసలేం జరిగింది? ఛార్మీ ఎందుకిలా చేశారు అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?)డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీసిన 'డబుల్ ఇస్మార్ట్'.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ పూర్తవగా.. ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు పూరీతో పాటు ఛార్మీ నిర్మాతలు. ఇకపోతే ఇదే తేదీన రవితేజ-హరీశ్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' కూడా రిలీజ్ చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు.పూరీ జగన్నాథ్ శిష్యుడు హరీశ్ శంకర్. అలానే పూరీతో రవితేజకు మంచి బాండింగ్ ఉంది. వీళ్ల కాంబోలో ఐదు సినిమాలు వచ్చాయి. ఛార్మీ కూడా పూరీతో గత కొన్నేళ్ల నుంచి ట్రావెల్ అవుతోంది. ఇకపోతే వీళ్లంతా స్నేహితులే. అలాంటిది ఇప్పుడు ఛార్మీ.. రవితేజతో పాటు హరీశ్ శంకర్‌ని అన్ ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ ఒకే తేదీన రిలీజ్ అవుతున్నాయి. బహుశా వాయిదా వేయాలని ఏమైనా అనుకుని, సయోధ్య కుదరకపోవడంతో స్నేహితుల మధ్య మనస్పర్థలు వచ్చాయా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఛార్మీ క్లారిటీ ఇస్తే తప్ప అసలు నిజం ఏంటనేది బయటకురాదు.(ఇదీ చదవండి: హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?) -
‘లైలా’గా మారిన విశ్వక్ సేన్..కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
ఓవర్ చేయకు అంటూ డైరెక్టర్‌కు రవితేజ పంచ్
ప్రస్తుతం మాస్ మహారాజ ఫోకస్ అంతా మిస్టర్ బచ్చన్ మీదే ఉంది. ఈ మూవీని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం రవితేజ ఎంతగా కష్టపడుతున్నాడనేది ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెప్తూనే ఉన్నాడు హరీష్. హీరోకు మెడనొప్పి ఉన్నా సరే షూటింగ్‌కు డుమ్మా కొట్టకుండా సెట్‌కు వచ్చాడంటూ ఓ ఫోటో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. ఇటీవల సినిమా నుంచి టీజర్, ట్రైలర్‌కు బదులుగా షో రీల్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా హరీష్.. ఎక్స్(ట్విటర్)లో రవితేజ ఫోటో షేర్ చేశాడు. 'ప్రపంచంలో అందరికీ వయసొస్తోంది.. అన్నయ్యకు తప్ప! కశ్మీర్ లోయలో షూటింగ్ బాగా జరిగింది. త్వరలోనే హైదరాబాద్‌కు వచ్చేస్తున్నాం' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన రవితేజ.. 'ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా' ఉంది అని ఫన్నీగా స్పందించాడు.ఈ సినిమాలో హీరో.. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కు పెద్ద అభిమాని. అందుకు సంకేతంగానే టైటిల్ మిస్టర్ బచ్చన్ అని పెట్టారు. 2019లో హిందీలో వచ్చిన అజయ్ దేవ్‌గణ్ 'రైడ్' సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. Over cheyaku roiiiii .. Nee dishtey tagilela undhi..!! https://t.co/Rr57r1APYP— Ravi Teja (@RaviTeja_offl) June 23, 2024 చదవండి: సుత్తి లేకుండా సాగే థ్రిల్లర్ సినిమా.. లూ మూవీ రివ్యూ -
మాస్ బచ్చన్
శత్రువులు చుట్టుముట్టారు... అయినా బచ్చన్ కంగారుపడలేదు. కంగారు అంటే ఏంటో అతనికి తెలియదు. ధైర్యానికి చిరునామా లాంటివాడు. వచ్చినవాళ్లను వచ్చినట్లు ఇరగదీశాడు బచ్చన్. ఏ రేంజ్లో రఫ్ఫాడించాడో తెలియాలంటే ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం చూడాల్సిందే. రవితేజ టైటిల్ రోల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం షో రీల్ వీడియోను సోమవారం విడుదల చేశారు.ఈ వీడియోలో రవితేజ చేసిన మాస్ ఫైట్, ఆగ్రహంతో జగపతిబాబు, అమితాబ్ బచ్చన్‌ని రవితేజ అనుకరించడం తదితర విజువల్స్ కనిపించాయి. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: అయాంకా బోస్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
'మిస్టర్ బచ్చన్' నుంచి రవితేజ షో రీల్ విడుదల
టాలీవుడ్ మాస్‌మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం 'మిస్టర్ బచ్చన్'. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే షాక్ ,మిరపకాయ్ వంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు రాబోయే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా.. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.బాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్న 'రైడ్' చిత్రానికి రీమేక్‌గా 'మిస్టర్ బచ్చన్' తెరకెక్కుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి షో రీల్ విడుదలైంది. రవితేజ ఎనర్జిటిక్‌గా ఈ చిత్రంలో కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మూవీలోనూ ఆయన అమితాబ్ ఫ్యాన్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. షూటింగ్ కార్యక్రమం ఇప్పటికే పూర్తి కావడంతో త్వరలో ప్రచార కార్యక్రమాలను మేకర్స్ ప్రారంభించనున్నారు.ఈ సినిమా విడుదలకు ముందే రవితేజ తన 75వ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాతో రచయిత భాను భోగవరపును దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీలీల మరోసారి రవితేజతో జోడీగా కనిపించనుంది. షూటింగ్ కార్యక్రమాన్ని కొద్దిరోజుల క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే. -
నా పెళ్లికి రండి.. టాలీవుడ్ సెలబ్రిటీలకు వరలక్ష్మి ఆహ్వానం (ఫోటోలు)
-
Ustaad Bhagat Singh: సినిమాల్లోనూ పవన్ ప్యాకేజీ పాలిటిక్స్!
సొమ్ము ఒకడిది సోకు ఒకడిది.. సినిమాల విషయంలో పవన్ కల్యాణ్ చేస్తున్న హైడ్రామా చూస్తుంటే, ఆ మాట ఆయనకి సరిగ్గా సరిపోతుందనిపిస్తోంది. రాజకీయం కోసం సినిమాలను.. సినిమాల కోసం రాజకీయాలను వాడుతూ చివరికి రెండిటికి చెడ్డ రేవడిలా మారాడు ఈ నట నాయకుడు. ఒకప్పుడు పవన్ కల్యాణ్ నుంచి సినిమా అంటే అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉండేవి. సినిమా అప్డేట్స్ వస్తే చాలు మెగా ఫ్యాన్స్ చేసే హడావుడి మాములుగా ఉండేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఓ చిన్న హీరో సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కూడా పవన్ మూవీకి రావడం లేదు. దానికి కారణం సినిమాను సినిమాగా తీయకుండా.. తన రాజకీయాల కోసం వాడుకోవడమే. ప్రతి సినిమాలోనూ తన పార్టీ ప్రచారం కోసం అనవసరపు సన్నివేశాలనో.. డైలాగ్స్నో చొప్పించి, ప్రేక్షకులతో ఛీ కొట్టించుకుంటున్నారు. ఆ మధ్య ‘బ్రో’ సినిమాలోనూ ప్యాకేజీ పాలిటిక్స్ చేసి, చివరకు నిర్మాతలకు కోట్లల్లో నష్టం వచ్చేలా చేసి సైడ్ అయిపోయాడు. ఇక తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లోనూ తన ప్యాకేజీ పాలిటిక్స్‌ని అప్లై చేశాడు. తన పార్టీ గుర్తు గాజు గ్లాస్‌పై డైలాగ్స్ చెప్పించి.. సినిమాను రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే.. ఈ సినిమా నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్. అందులో పవన్ జస్ట్ యాక్టర్ మాత్రమే. అంటే రెమ్యునరేషన్ తీసుకొని నటించి వెళ్లాలి. కానీ ఒకవైపు భారీగా పారితోషికం పుచ్చుకుంటునే.. మరోవైపు ఆ సినిమానే తన పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నాడు. అలా తనకొచ్చిన ప్రతి సినిమానూ రాజకీయంగా వాడుకుంటూ.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడుతున్నాడు. దీని వల్ల నిర్మాతలు రూ. కోట్లలో నష్టపోవాల్సి వస్తోంది. ఒకవేళ సినిమాలను రాజకీయాల కోసం వాడుకోవాలంటే.. తనే నిర్మాతగా మారి సినిమా చేస్తే బాగుంటుంది కానీ.. మరొకరి సొమ్ముతో ఈయన రాజకీయ ప్రచారం చేసుకోవడం ఏంటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. పార్ట్‌టైం పాలిటిక్స్‌కి ఫిక్స్! ఇది ఎన్నికల సమయం. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులంతా ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. కానీ ప్యాకేజీ స్టార్ మాత్రం ఇప్పుడు కూడా తన సమయాన్ని సినిమాలకే కెటాయిస్తున్నాడంటే.. ఎన్నికల తర్వాత తన దారి ఎటో తెలిసిపోతుంది. ఎన్నికలు అయిపోగానే పాలిటిక్స్‌కి ప్యాకప్ చెప్పి..ముఖానికి మేకప్ వేసుకోవడానికి రెడీ అయిపోయాడు. తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకొనే.. వరుస సినిమాలను అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వపన్ చేతిలో హరిహరవీరమల్లు , ఓజీ , ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మరో రెండు మూడు సినిమాలు చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే భవిష్యత్తులో పవన్ ఫుల్టైమ్ని సినిమాలకే కేటాయించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ‘గ్లాస్’డైలాగ్స్‌పై సెటైర్స్ తాజాగా రిలీజైన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌పై నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమాపై ఇప్పటి వరకు భారీ అంచనాలు ఉండేవనీ..కానీ గ్లింప్స్ చూశాక పవన్ ఈ సారి కూడా తన స్వార్థం కోసం సినిమాను చెడగొట్టాడని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. పవన్ ఫ్యాన్స్ కూడా గ్లింప్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాను అడ్డుపెట్టుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అవసరమా అని పవర్ స్టార్ ఫ్యాన్సే చర్చించుకుంటున్నారు. ఇక మరికొంతమంది నెటిజన్స్ అయితే.. సినిమాలోని ‘గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం’ డైలాగ్స్‌పై సెటైరికల్ కామెంట్ చేస్తున్నారు. ‘అసలు సినిమాకు గాజు గ్లాసుకు సంబంధం ఏంటి?’, ‘ఇదేదో జనసేన పొలిటికల్ యాడ్‌లా ఉందే’‘ఈసారి పిఠాపురం(పవన్ పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానం)లో గ్లాస్ నుజ్జు నుజ్జు అయిపోతుందటగా’, ‘ఫ్యాన్ గాలికి గ్లాస్ పగిలిపోవడం ఖాయం’ అంటూ కామెంట్ చేస్తున్నారు. -
హరీశ్ శంకర్ సాయం.. నెటిజన్ల నుంచి ప్రశంసలు
టాలీవుడ్లో సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దర్శకుల్లో హరీశ్ శంకర్ ఒకరు. ఇండస్ట్రీలో ఆయన తక్కువ సినిమాలే డైరెక్ట్ చేసినప్పటికీ ప్రేక్షకులను మెప్పించాయి. సినిమాలపైనే కాకుండా పలు సామాజిక అంశాలపైనా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా ఆయన చెప్పడమే కాకుండా ఇతరులకు సాయం చేస్తూ కూడా అప్పుడప్పుడు నెట్టింట వైరల్ అవుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన ఒక మంచి పనికి సోషల్ మీడియా ద్వారా ఆయన్ను అభినందిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో రోడ్డుపై నిలిచిపోయిన ఒక కారు విషయంలో హరీశ్ సాయం అందించారు. నడిరోడ్డుపై ఆగిపోయిన కారును హరీశ్‌తో పాటు మైత్రి మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ కలిసి కొంత దూరం పాటు చేతుల సాయంతో నెట్టుకుంటూ వెళ్లారు. దీనిని గమనించిన కొందరు వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలో కొందరు వీడియో తీసి నెట్టింట వదిలారు. దీంతో హరీశ్, నిర్మాత రవిశంకర్ల సింప్లిసిటికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'మిస్టర్ బచ్చన్' పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించినన 'రైడ్' మూవీకి రీమేక్ అని ప్రచారం జరుగుతుంది. మరోవైపు పవన్ కల్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్‌సింగ్'ను కూడా హరీశ్ రూపొందిస్తున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్ట్‌ల తర్వాత హరీశ్- చిరంజీవితో సినిమా చేయనున్నారని ప్రచారం సాగుతోంది. ఈ బిగ్ ప్రాజెక్ట్‌కు చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ప్రొడ్యూసర్ ఉండనున్నారట. కానీ ఈ విషయంలో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. Director #HarishShankar @harish2you sir and @MythriOfficial Ravi gaaru are helping the vehicle which is stopped on road 👏👏👏 Kudos to you sir 🙏🙏 @harish2you it’s a great beginning of my day sir after watching this one 👏👏👏 pic.twitter.com/CbGfCiU7AN — Mahaa Max (@mahaamaxx) March 14, 2024 -
లంబసింగి ట్రైలర్.. కట్టిపడేసిన దివి!
వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేషన్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది. అదే ‘లంబసింగి’. ఇప్పుడు ఆ ఊరిలో జరిగిన ఒక ప్రేమ కథ సినిమాగా రూపొందుతోంది. ‘లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు. భరత్ రాజ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. ఇటీవల విడుదలైన "నచ్చేసిందే... డోలారే... వయ్యారి గోదారి పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. లేటెస్ట్గా లంబసింగి ట్రైలర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'కళ్యాణ్ కృష్ణ సినిమా చేస్తున్నాడు అంటే నా సొంత సినిమాలా అనిపించింది. ట్రైలర్ బాగుంది, అందమైన లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించిన విధానం బాగుంది. దర్శకుడు నవీన్ గాంధీ ఒక అందమైన ప్రేమకథను లంబసింగి సినిమా ద్వారా చెప్పబోతున్నారు. దివికి, అలాగే భరత్ రాజ్‌కు ఈ మూవీ మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లంబసింగి సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా' అన్నారు. చదవండి: అయోధ్య బాలరామున్ని దర్శించుకున్న ఉపాసన! -
సాయిరామ్ శంకర్ ‘వేయి దరువేయ’ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
ట్రోలింగ్‌పై హరీశ్ శంకర్ ఫైర్
-
స్పీడ్ పెంచిన స్టార్ డైరెక్టర్స్
-
కారైకుడిలో మిస్టర్ బచ్చన్
కారైకుడికి వెళ్లారు ‘మిస్టర్ బచ్చన్’. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. పనోరమా స్టూడియోస్, టీ–సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కాగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ తమిళనాడులోని కారైకుడిలో ప్రారంభమైంది. రవితేజతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ స్వరకర్త. -
ఆఫీసర్ ఆన్ డ్యూటీ
ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ బచ్చన్‌గా బాధ్యతలు తీసుకున్నారు రవితేజ. ‘మిరపకాయ్’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, దర్శకుడు హరీష్‌శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్‌ల సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ బచ్చన్ పాత్రలో రవితేజ నటిస్తున్నారని సమాచారం. కాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను గురువారం ప్రారంభించినట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. -
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
రవితేజ మిస్టర్ బచ్చన్
హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమాకు ‘మిస్టర్ బచ్చన్’ టైటిల్ ఖరారైంది.‘నామ్ తో సునా హోగా..!’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పనోరమా స్టూడియోస్, టి–సిరీస్‌ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం ఈ సినిమాప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి కె. రఘురామకృష్ణ, టీజీ భరత్‌లు కలిసి కెమెరా స్విచ్చాన్ చేయగా, మంగత్ పాఠక్ క్లాప్ ఇచ్చారు. ముహూర్తపు షాట్‌కు ‘‘మిస్టర్ బచ్చన్... నామ్ తో సునా హోగా!’’ అని రవితేజ డైలాగ్ చెప్పగా, వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. రవితేజ, విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, రఘురామకృష్ణలు కలిసి హరీష్ శంకర్‌కు ఈ సినిమా స్క్రిప్ట్‌ను అందించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జె. మేయర్, సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
ముచ్చటగా మూడోసారి.. మాస్ మహారాజా మూవీ టైటిల్ ఫిక్స్!
మాస్ మహారాజా రవితేజ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. మిరపకాయ్ వంటి మాస్ హిట్‌ను అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్‌తో పాటు పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని రవితేజ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. హరీశ్- రవితేజ కాంబోలో తెరకెక్కుతోన్న మూడో చిత్రమిది. వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపించాయి. తాజా చిత్రానికి మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ ఖరారు చేశారు. నామ్ తో సునా హోగా అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. పోస్టర్లో రవితేజ కూర్చుని స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘షాక్’, ‘మిరపకాయ్’ సినిమాల వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో రవితేజ సరసన కొత్త భామ భాగ్యశ్రీ బోర్సే నటించనున్నారు. ఈ విషయాన్ని మాస్ మహారాజాతో క్లాస్ మహారాణి అంటూ చిత్రబృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. #MrBachchan Naam tho suna hoga 😉 Honoured to play the character with the name of my favourite @SrBachchan saab 🤗🙏@harish2you @peoplemediafcy @TSeries pic.twitter.com/CHMOvgh3bo — Ravi Teja (@RaviTeja_offl) December 17, 2023 -
పవన్ సినిమాను పక్కన పెట్టిన హరీష్ శంకర్.. రవితేజతో హ్యాట్రిక్ ఫిల్మ్!
‘మిరపకాయ్’ వంటి మాస్ హిట్‌ను హీరో రవితేజకు ఇచ్చారు దర్శకుడు హరీష్ శంకర్. అలాగే రవితేజతో ‘ధమాకా’ వంటి మాస్ హిట్ చిత్రాన్ని నిర్మించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్. ఇప్పుడు ఈ హీరో–డైరెక్టర్-ప్రొడ్యూసర్ కాంబినేషన్ ఒకే సినిమాకి కుదిరింది. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించనున్నట్లు బుధవారం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. ‘‘ఈసారి మాస్ రీ యూనియన్ ఇంకా స్పైసీగా ఉంటుంది. త్వరలో ఇతర వివరాలు తెలియజేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. హరీష్ అది వదిలేశాడు.. రవితేజ ఇది పక్కన పెట్టాడు రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపించాయి. అయితే ఇంత త్వరగా వీరి మూడో ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఊహించలేదు. ప్రస్తుతం హరీష్ శంకర్.. పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ ఇంతవరకు సగం పార్ట్ కూడా పూర్తి కాలేదు. షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు. అందుకే హరీష్ శంకర్ ఆ సినిమాను పక్కకు పెట్టి రవితేజతో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఇక రవితేజ పరిస్థితి కూడా అంతే. క్రాక్ తర్వాత మరోసారి గోపిచంద్ మలినేని-రవితేజ కలిసి పనిచేసేందుకు రెడీ అయ్యారు. రవితేజ కోసం గోపిచంద్ మంచి కథ కూడా సిద్ధం చేసుకున్నాడు.అయితే బడ్జెట్ చేతులు దాటి పోవడంతో ఈ ప్రాజెక్ట్‌ని పక్కనపెట్టేశారట. దీంతో రవితేజ హరీష్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ‘షాక్’, ‘మిరపకాయ్’ సినిమాల వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. The Magical Mass Combo is back ❤️🔥 Mass Maharaja @RaviTeja_offl and @harish2you reunite for an entertainer 💥💥 This time, the #MassReunion gets spicier 🔥🔥 Produced by @vishwaprasadtg & @vivekkuchibotla under @peoplemediafcy 💥💥 More details soon! pic.twitter.com/OYNmnRuPDx — People Media Factory (@peoplemediafcy) December 13, 2023 -
కోటబొమ్మాళి పీఎస్ ట్విటర్ రివ్యూ.. టాక్ ఏంటంటే?
ఎస్ఐ రామకృష్ణగా శ్రీకాంత్, కానిస్టేబుల్ కుమారిగా శివానీ రాజశేఖర్, కానిస్టేబుల్ రవిగా రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘నాయట్టు’కు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించింది. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడు నిర్మించిన ఈ చిత్రం నేడు (నవంబర్ 24న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమాకు రివ్యూ ఇచ్చిన శ్రీవిష్ణు దీంతో సినిమా చూసిన జనాలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా ఉందంటున్నారు. శ్రీకాంత్ కెరీర్లోనే ఇది బెస్ట్ చిత్రంగా నిలుస్తుందంటున్నారు. డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉన్నాయంటున్నారు. హీరో శ్రీవిష్ణు సైతం సినిమాపై రివ్యూ ఇచ్చాడు. 'పోలీసుల్ని పోలీసులే ఛేదించడం.. శ్రీకాంత్, వరలక్ష్మి మధ్య వచ్చే సన్నివేశాలు టెర్రిఫిక్‌గా ఉన్నాయి' అని ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు. ఆ సన్నివేశాలు గూస్బంప్స్.. డైరెక్టర్ హరీశ్ శంకర్ సైతం ఈసినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. 'శ్రీకాంత్, వరలక్ష్మి మధ్య వచ్చే సన్నివేశాలు పిల్లి- ఎలుకల కొట్లాటలా అనిపిస్తుంది. ఈ సన్నివేశాలే ప్రేక్షకుడిని సీట్లకు అతుక్కుపోయేలా చేస్తాయి. చాలాకాలం తర్వాత శ్రీకాంత్‌గారు గుర్తుండిపోయే పాత్ర చేశారు. అతడి పర్ఫామెన్స్ అందరికీ గూస్బంప్స్ తెప్పిస్తాయి. ఈ థ్రిల్లర్ మూవీలో ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. అవి అందరికీ కనెక్ట్ అవుతాయి. అలాగే ప్రస్తుతం ఉన్న వ్యవస్థ గురించి పవర్ఫుల్ డైలాగులు కూడా ఉన్నాయి. వాటికి నేను చాలా కనెక్ట్ అయ్యాను. నిర్మాతల గుండెధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే' అని ఎక్స్‌లో రాసుకొచ్చాడు. Fantastic #KotaBommaliPS Every scene pure Mass 🔥 Must watch everyone pic.twitter.com/tZo484lviq — RC Varagani 🔥 (@VaraganiSaikum2) November 24, 2023 Mental Mass Entertainer#KotaBommaliPS Worth Watching Movie 👌🔥🔥🔥 pic.twitter.com/ZJIK2KsHvA — Cherry 🍒 (@Rammm755) November 24, 2023 Mind Blowing #KotaBommaliPS 🔥🔥🔥🔥 Best Movie Avuthundhi E year Lo Don't Miss It pic.twitter.com/cy6RFY20t1 — Kranthi 🔥 (@iamkranthi99) November 24, 2023 Movie chala bagundhi very interesting and thrilling go and Watch#KotaBommaliPS pic.twitter.com/cTgQvoh6sQ — Sweety 🦚 (@Pravallika7C) November 24, 2023 Gripping Screenplay 💥 Twists kuda next level unayi #KotaBommaliPS pic.twitter.com/pbFUW5oEY7 — Ramcharan tej (@Ramcharan14377) November 24, 2023 USA is reporting positive things about #KotaBommaliPS❤️🔥Applause for the amazing performances, gripping story, and intense drama is universal 👏 — Rainbow 💞 (@_AAnshu_) November 24, 2023 Watched #KotabommaliPS an intruding movie to watch on the big screens done by @DirTejaMarni . The unique plot of police chasing police and the scenes between @actorsrikanth Garu and @varusarath5 Garu are terrific.@Rshivani_1, @ActorRahulVijay & Each of the performances is… — Sree Vishnu (@sreevishnuoffl) November 23, 2023 I just finished watching the film #KotaBommaliPS. The screenplay between #Srikanth and #VaralaxmiSarathkumar, as well as their cat and mouse game, will have everyone glued to their seats in the theatres. After a long time, #Srikanth garu got a remarkable character, and his… — Harish Shankar .S (@harish2you) November 23, 2023 చదవండి: అమర్‌దీప్‌కు ఫిట్స్.. తనకు ఆ అనారోగ్య సమస్య ఉందన్న నటుడు -
యూత్‌ఫుల్ ప్రేమకథ
కిశోర్ కేఎస్డీ, దియా సితెపల్లి జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమకథ’. టాంగాప్రోడక్షన్స్ ఎల్ఎల్పీ, సినీ వ్యాలీ మూవీస్ పతాకాలపై విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేసి, లుక్ బాగుందని, ఈ సినిమా విజయం సాధించాలని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వైవిధ్యమైన లవ్‌స్టోరీతో నేటితరం యువ ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రథన్ , సహనిర్మాత: ఉపేంద్ర గౌడ్ ఎర్ర. -
రవితేజలో నెగిటివ్ క్వాలిటీస్ చెప్పినా శంకర్
-
రవితేజ గురించి హరీష్ శంకర్ గొప్ప మాటలు
-
చంద్రయాన్ 3 సక్సెస్.. హరీశ్ శంకర్ ట్వీట్‌పై ట్రోలింగ్
చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 జెండా పాతడంతో యావత్ భారతదేశం సంతోషంలో మునిగి తేలుతోంది. ఎవరూ అందుకోలేని ఘనతను మన దేశం సాధించడంతో జనాలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలవుతున్నారు కూడా! ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తల మనోభావాలు దెబ్బతీసేలా ఫోటో షేర్ చేసిన ప్రకాశ్‌రాజ్‌ను నెటిజన్లు ఓ ఆటాడేసుకున్న సంగతి తెలిసిందే! తాజాగా దర్శకుడు హరీశ్ శంకర్ ట్విటర్లో షేర్ చేసిన ఫోటోపై సెటైర్లు వేస్తున్నారు. చంద్రుడిపై జెండా.. జెండాపై చంద్రుడు(పాక్ జాతీయ పతాకం).. రెండూ ఒకటి కాదు అంటూ ఓ మీమ్ షేర్ చేశాడు హరీశ్. ఇది చూసిన జనాలు మధ్యలో పాకిస్తాన్‌ను తేవడం అవసరమా? అసలు ఆ దేశంతో మనకు పోలికేంటి? అని కామెంట్లు చేస్తున్నారు. 'మనకంటే దిగువన ఉన్న వాళ్లతో కాదు, మనకంటే గొప్పగా ఉన్నవాళ్లతో పోల్చుకోవాలి', 'ఈ విమర్శలు పక్కనపెట్టి చంద్రయాన్ 3 విజయంలో పాలుపంచుకున్నవాళ్లను ప్రశంసించండి' అని చురకలంటిస్తున్నారు. 'మనం అందుకున్న విజయాన్ని ఎంజాయ్ చేయాలే తప్ప పక్కదేశాన్ని వెక్కిరించకూడదు.. ఒక సెలబ్రిటీవైన నువ్వు కూడా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, మనం తోపులు అని చెప్పుకోవడానికి ఎదుటివాళ్లను ఎందుకు తక్కువచేయడం?..', 'అయినా అమెరికా, చైనా వంటి దేశాలతో మనం పోటీపడాలి, పోల్చుకోవాలే.. అంతే కానీ పాక్ లాంటి దేశాలతో కాదు.. అసలు నువ్వు డైరెక్టర్ ఎలా అయ్యావో.. ఏంటో?' అని విమర్శిస్తున్నారు. Haahhahaha mana janaala sense of humour 🙏🙏🙏🙏 pic.twitter.com/x0ZOlQWTgu — Harish Shankar .S (@harish2you) August 23, 2023 చదవండి: ఈసారి ఎంటర్టైన్మెంట్కు ఢోకా లేదు..లిస్టులో 20 మందికి పైగా కంటెస్టెంట్లు! కమెడియన్స్ నుంచి హీరోల దాకా.. -
కథా కేళి కొత్త ప్రయత్నంలా ఉంది – ‘దిల్’ రాజు
‘‘సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన ‘శతమానం భవతి’ సినిమా మా బ్యానర్‌కి జాతీయ అవార్డును తీసుకొచ్చింది. ఇప్పుడు శతమానం భవతి ఆర్ట్స్ పేరుతో సతీశ్ బ్యానర్ పెట్టడం సంతోషంగా ఉంది. ‘కథా కేళి’ టీజర్ చూస్తుంటే సతీశ్ కొత్త ప్రయత్నం చేసినట్లు అనిపించింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. యశ్విన్, దినేశ్ తేజ్, అజయ్, బాలాదిత్య, పూజితపొన్నాడ, నందిని, ఆయుషి, ప్రీతి, విరాట్ కీలక పా త్రల్లో నటిస్తున్న చిత్రం ‘కథా కేళి’. చింతా గోపా ల కృష్ణారెడ్డి సమర్పణలో సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొం దుతోన్న ఈ సినిమా లోగోను ‘దిల్’ రాజు విడుదల చేయగా, టీజర్‌ను డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పా తికేళ్లు అయ్యింది. ‘ప్రియా ఓ ప్రియా’ చిత్రంలో నా పేరుని మొదటిసారి స్క్రీన్ పై చూసుకున్నాను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు రైటర్‌గా, డైరెక్టర్‌గా నిలబడ్డాను. ఈవీవీ సత్యనారాయణగారి మాటల స్ఫూర్తితోనే ఈ బ్యానర్ పెట్టాను. నేను స్టార్ట్ చేసిన ‘కోతి కొమ్మచ్చి, శ్రీశ్రీశ్రీ రాజావారు’ సినిమాలు ఆలస్యం అవుతుండటంతో ఈ గ్యాప్‌లో ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేద్దామని ‘కథా కేళి’ తీశా’’ అన్నారు. -
భారత్‌లో బస్సు ఎక్కితే.. ఆస్ట్రేలియాలో దిగాడు
‘‘7:11 పీఎం’ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. సౌండ్, విజువల్స్, వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. సాహస్, దీపిక జంటగా చైతు మాదాల దర్శకత్వం వహించిన చిత్రం ‘7:11 పీఎం’. నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించిన ఈ సినిమా జూలై 7న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. చైతు మాదాల మాట్లాడుతూ–'ఒక టౌన్, రెండు గ్రహాలు, మూడు కాలాలు.. ఇదీ మా సినిమా లైన్. వీటిని ఎలా కనెక్ట్ చేశామనేది ఆసక్తిగా ఉంటుంది. మా సినిమాని విడుదల చేస్తున్న రవిశంకర్, నవీన్‌గార్లకు థ్యాంక్స్' అన్నారు. 'ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది' అన్నారు వై. రవిశంకర్. ట్రైలర్ విషయానికొస్తే.. కథానాయకుడు తనకు తెలియకుండానే టైమ్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. ముందు రోజు రాత్రి బస్ ఎక్కిన అతడు.. తర్వాతి రోజు ఉదయాన్నే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సముద్ర తీరంలో నిద్రలేస్తాడు. పలు ఆసక్తికరమైన సన్నివేశాలను ట్రైలర్లో చూపిస్తూ.. చివరికి ఓ టైమ్ మిషన్‌తో ముగించారు. మొత్తంగా ఓ గ్రామం, రెండు గ్రహాలు, మూడు వేర్వేరు కాలాల.. చుట్టూ ఈ కథ నడుస్తుందని అర్థమవుతోంది. -
తెలుగు ఇండస్ట్రీని చులకన చేస్తే ఊరుకోనంటూ హరీశ్ స్ట్రాంగ్ వార్నింగ్
2018 సినిమా.. మలయాళ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించింది. వారం రోజుల్లోనే వంద కోట్లు రాబట్టింది. టొవినో థామస్, కుంచక్కో బోబన్, వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జూడ్ ఆంటోని జోసెఫ్ దర్శకత్వం వహించారు. వేణు కున్నప్పిలి, సీకే పద్మకుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించిన ఈ సినిమాను బన్నీ వాసు తెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ నెల 26న తెలుగులో 2018 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో హరీశ్ శంకర్ మాట్లాడుతూ సినిమా చాలా బాగుందని, ఇది తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని చెప్పాడు. తర్వాత ఓ విలేఖరి మాట్లాడుతూ.. 'మన తెలుగు దర్శకనిర్మాతలు ఇంతవరకు ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఈ సినిమా చూశాక మన తెలుగు డైరెక్టర్ ఇలాంటి సినిమాలు తీయగలరా? ఇక్కడి నిర్మాతలు సాహసం చేయగలరా? అని మీకు అనిపించిందా?' ప్రశ్నించాడు. దీనికి హరీశ్ శంకర్ స్పందిస్తూ.. 'ప్రెస్మీట్స్ జరిగిన ప్రతిసారి ఆయన(విలేఖరిని ఉద్దేశిస్తూ) సాహసోపేతమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఎవరూ అడగని ప్రశ్నలు అడుగుతూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచి యూట్యూబ్‌లో ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ప్రపంచ సినిమా మన చేతికొచ్చేసింది(తెలుగు సినిమాను ఉద్దేశిస్తూ). అలాంటి టెక్నాలజీలో ఉన్నాం. ఆర్ఆర్ఆర్, బాహుబలి, కేజీఎఫ్‌లను ఎవరైనా డబ్బింగ్ సినిమా అనుకున్నారా? అనుకోలేదు కదా! డబ్బింగ్, రీమేక్ అదంతా ఏమీ లేదు.. కేవలం సినిమా అంతే! ఏ సినిమా ఎక్కడికెళ్లినా సంతోషించాలి. తెలుగు దర్శకులు ఇలాంటి సినిమాలు తీయరా? అని అడుగుతున్నావ్.. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తున్నప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగారంటే జాలేస్తోంది. అతడు కేరళ డైరెక్టర్ అని ఈ సినిమా చూడలేదు. ఆయనో గొప్ప సినిమా తీశారని పత్రికాముఖంగా ఆయన్ను మెచ్చుకుందామని వచ్చాను. గీతా ఆర్ట్స్ డబ్బింగ్ సినిమాలకే పరిమితమైపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు కదా.. నేనే వరుసగా 100 డబ్బింగ్ సినిమాలు చేయిస్తా.. అందులో తప్పేంటి? ఒక మంచి సినిమాను పదిమందికి చూపించే ప్రయత్నాన్ని ప్రశంసించాలి. ఈ సినిమాను ముందు మీకే చూపించాలని వాసు(నిర్మాత) అన్నాడు. ఎందుకంటే సినిమా నచ్చితే మీరు చేసినంత ప్రమోషన్స్ నిర్మాత కూడా చేయలేడు. డబ్బింగా? రీమేకా? అన్నది కాదు.. మంచి సినిమాలు చేస్తాం. తెలుగు, తమిళ, హిందీ దర్శకుడు అని భాషాబేధాలు చూడట్లేదు. సినిమా అనేది ఒక ఎమోషన్. దానికి భాషతో సంబంధం లేదు' అని చెప్పుకొచ్చాడు హరీశ్ శంకర్. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. చులకన చేసే నోరు ఉన్నప్పుడు చురకలు వేసే నోరు కూడా ఉంటుందని ట్వీట్ చేశాడు. చులకన చేసే నోరు ఉన్నపుడు చురకలు వేసే నోరు కూడా ఉంటుంది.. Can’t take insult to our industry. By all means please appreciate every film maker from every industry but for that sake don’t belittle our industry. Whole world is looking towards us. https://t.co/l5yZRZZgjZ — Harish Shankar .S (@harish2you) May 24, 2023 చదవండి: టాలీవుడ్‌కు మరో కొత్త హీరోయిన్ -
థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా 2018
‘‘2018’లాంటి అద్భుతమైన సినిమాని థియేటర్స్‌లోనే చూడాలి. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుందని మాట ఇస్తున్నా’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. టొవినో థామస్, కుంచక్కో బోబన్, వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘2018’. జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. వేణు కున్నప్పిలి, సీకే పద్మకుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో కొన్ని ప్రధాన ఏరియాల్లో ‘బన్నీ’ వాసు ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో జూడ్ ఆంటోనీ మాట్లాడుతూ–‘‘కేరళలో 2018లో వచ్చిన వరద బాధితుల్లో నేనూ ఒక్కణ్ణి. ఈ కథని ప్రపంచానికి చెప్పాలనుకుని ‘2018’ తీశాను. భాషతో సంబంధం లేకుండా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు. -
బలగం చూసి ఆ ముగ్గురు కమర్షియల్ డైరెక్టర్లు ఏడ్చేశారు: హరీశ్
కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనేది బలగంతో మరోసారి నిరూపితమైంది. రోజురోజుకీ వసూళ్లు పెంచుకుంటూ పోతూ హిట్ ట్రాక్ ఎక్కిందీ మూవీ. శుక్రవారం ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. దీనికి డైరెక్టర్ హరీశ్ శంకర్ ప్రత్యేక అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'చాలా రోజుల నుంచి చూస్తున్నా. సినిమాను క్లాస్, మాస్, కమర్షియల్ అని వేరు చేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఇండస్ట్రీలో మనం పెట్టుకున్న పేర్లు. కానీ జనాలు మంచి సినిమానా? కాదా? ఆ ఒక్కటే చూస్తారు. శంకరాభరణం, సాగరసంగమం సినిమాలకు బండ్లు కట్టుకుని వెళ్లారు. ఇసుకేస్తే రాలనంత జనం. ఆ సినిమాల్లో సుమోలు ఎగరలేదు, రక్తపాతాలు జరగలేదు. కానీ మాస్ ఆడియన్స్ కూడా చూశారు. అంతెందుకు, ఈ సినిమా చూసి కమర్షియల్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, త్రినాధ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకడు మూడు వందల కోట్ల సినిమా తీసినా, ఒకడు మూడు కోట్ల సినిమా తీసినా అన్నీ మన సినిమాలే. బయట మనకెన్నో సమస్యలున్నాయి.. వాటిపై పోరాడటం మానేసి మనలో మనం పోట్లాడుకోవడం కరెక్ట్ కాదు. పెద్ద సినిమా, చిన్న సినిమా అని కాదు, దేనికదే యునిక్. కాసర్ల శ్యామ్ రాసిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. మనం త్వరలోనే కలిసి పనిచేద్దాం. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు హిట్ అయినప్పుడు మేమంతా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే హమ్మయ్య బయ్యర్ల దగ్గర డబ్బులున్నాయి. తర్వాత నా సినిమాను మంచి రేటుతో కొంటారని అనుకుంటాం. అందుకే మా ముందు సినిమాలు హిట్ అయితే సంతోషపడతాం. అంతే తప్ప చాలా మంది అనుకున్నట్లు పక్కోడి సినిమాలు పోతే చప్పట్లు కొట్టం. అది కామన్సెన్స్ లేనివాళ్లు చేసే పని' అని చెప్పుకొచ్చాడు హరీశ్ శంకర్. -
సినిమానే మనల్ని ఎంచుకుంటుంది
‘‘మంచి చిత్రం ఎంచుకున్నామంటూ చాలా మంది అంటారు. కానీ, సినిమా అంటే ప్యాషన్ ఉన్నవాళ్లనే ఆ సినిమా ఎంపిక చేసుకుంటుంది.. అంతేకానీ, సినిమాను మనం సెలెక్ట్ చేసుకోం’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. ప్రణవ చంద్ర, మాళవిక సతీషన్ జంటగా శివ నాగేశ్వరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దోచేవారెవరురా’. బొడ్డు కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని హరీష్ శంకర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఎన్నో మంచి సినిమాలు తీసిన శివ నాగేశ్వరావుగారు ఇప్పుడు ‘దోచేవారెవరురా’ వంటి మంచి కథతో వస్తున్నారు. ట్రైలర్, పాటలు బాగున్నాయి.. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. ‘‘కథ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. కుటుంబమంతా చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు శివ నాగేశ్వరరావు. ‘‘దోచేవారెవరురా’లో మంచి వినోదం ఉంటుంది’’ అన్నారు బొడ్డు కోటేశ్వర రావు. -
స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి
నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ ముఖ్య తారలుగా కెఎస్ హేమరాజ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రిచిగాడి పెళ్లి’. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. ‘ఏ ఫోన్‌కాల్ వచ్చినా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి అంతే..!’, ‘రిచిగాడి పెళ్లి’ జీవితంలో మర్చిపోకూడదు’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘మానవ సంబంధాలకు అద్దం పట్టే కథతో ‘రిచిగాడి పెళ్లి’ని రూపొందించాం’’ అన్నారు హేమరాజ్. -
హరీష్ శంకర్ చేతులు మీదుగా "రిచి గాడి పెళ్లి" ట్రైలర్ లాంచ్
నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం "రిచి గాడి పెళ్లి". కెఎస్ హేమరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలె పూర్తయి ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను హరీష్ శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ ట్రైలర్ చూస్తుంటే చిన్నప్పుడు బల్లల మీద ఆడుకున్న చిన్న చిన్న ఆటలను ఆధారం చేసుకుని తీసిన సినిమా ఇది అని అర్ధమవుతుంది అన్నారు. ఇక దర్శకుడు కె యస్ హేమరాజ్ మాట్లాడుతూ..ట్రైలర్ మంచి స్పందన లభిస్తుందని, త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు. -
కొత్త తరం ప్రేమకథ
‘అతడు, ఆర్య, ΄పౌర్ణమి, భద్ర’ వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించిన దీపక్ సరోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. వి. యశస్వి దర్శకత్వంలో జయ ఆడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కాన్సెప్ట్ పో స్టర్‌ను డైరెక్టర్ హరీష్ శంకర్ ఆవిష్కరించగా, నిర్మాత అల్లు అరవింద్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘కొత్త తరం ప్రేమకథగా రూపొందిన చిత్రం ఇది. ఈ వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తన్వి నేగి, నాదిని, ఆనంద్, కల్యాణీ నటరాజన్, మాథ్యూ వర్గీస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రథన్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, లైన్ప్రొ డ్యూసర్: బి. శ్యామ్‌కుమార్. -
Siddharth Roy: హీరోగా మారిన ‘అతడు’ చైల్డ్ ఆర్టిస్ట్.. ‘ఫస్ట్‌లుక్’లోనే లిప్‌లాక్
‘అతడు, ఆర్య, పౌర్ణమి, భద్ర, లెజెండ్’ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించిన దీపక్ సరోజ్ ఇప్పుడు హీరోగా మారారు. ‘సిద్ధార్థ్ రాయ్’అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1 గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్, కాన్సెప్ట్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ , నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. విడుదలైన రెండు పోస్టర్లు కూడా యువతను ఆకట్టుకుంటున్నాయి. ఒక పోస్టర్లో దీపక్ సరోజ్ నోట్లో రెండు సిగరెట్లు, చేతిలో ఎర్ర గులాబీని పట్టుకుని కనిపిస్తున్నాడు. ఇందులో పొడవాటి జుట్టు, గడ్డంతో దీపక్ దుస్తులపై రక్తం మరకలు ఉన్నాయి. మరొక పోస్టర్లో హీరోయిన్ తన్వి నేగితో అతను లిప్ లాక్ చేస్తున్నాడు. మొత్తానికి పోస్టర్లు చూస్తుంటే ‘సిద్ధార్థ్ రాయ్’ న్యూ జనరేషన్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. తమ అభ్యర్థనను అంగీకరించి, కాన్సెఫ్ట్, ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసినందుకు దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత అల్లు అరవింద్‌గారికి మేకర్స్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఆసక్తి రేకెత్తిస్తున్న హరీశ్ శంకర్ ‘ఏటీఎం’ టీజర్
బిగ్‌బాస్ ఫేం వీజే సన్నీ నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘ఏటీఎం’. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సిరీస్‌కి కథ అందించారు. దోపిడీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు సి చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 20న ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ‘ఏటీఎం’టీజర్‌ని హరీశ్ శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `దోపిడీ జోనర్లో రాసే కథల్లో చాలా పొటెన్షియల్ ఉంటుంది. సెట్టింగ్ రియలిస్టిక్‌గా ఉంటుంది. ఈ సీరీస్‌లో దొంగలు రొటీన్‌గా ఉండరు. వాళ్లల్లో ఓ ప్రత్యేకత ఉంటుంది. వీజే సన్నీ కీ రోల్ చేశారు. స్లమ్ లైఫ్ మీద అతనికున్న ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. నవాబ్ తరహా జీవితాన్ని కోరుకున్న అతను ఏం చేశాడనేది ఆసక్తికరం. సీరీస్ గురించి ఇంతకు మించి ఎక్కువ చెప్పదలచుకోలేదు. ఓ వైపు నవ్విస్తూనే ఉంటుంది. చాలా కొత్త ప్రయత్నం చేశాం`అని అన్నారు. ‘పవర్ ఫుల్ ఫోర్సుల వల్ల కార్నర్ అయిన నలుగురు చిన్న దొంగల రోలర్ కోస్టరే ఈ సీరీస్. ప్రాణాలతో బతికి ఉండాలంటే కొన్ని కోట్ల రూపాయలను దోపిడీ చేయాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడిన వాళ్ల కథే ఇది. సుబ్బరాజు చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేశారు` అని నిర్మాత హర్షిత్ రెడ్డి అన్నారు. -
పవన్ కల్యాణ్ సినిమా నుంచి తప్పుకున్న పూజాహెగ్డే?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో స్టార్ హీరోయిన్గా క్రేజ్ దక్కించుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా పలు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న పూజా హెగ్డే కెరీర్ ఇటీవలి కాలంలో కాస్త వెనకబడినట్లు కనిపిస్తుంది. రాధేశ్యామ్, ఆచార్య వంటి వరుస ఫ్లాపులు పలకరించడంతో పూజాను కాస్త దూరం పెడుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ప్రాజెక్ట్ నుంచి కూడా పూజా హెగ్డే అవుట్ అయినట్లు తెలుస్తుంది. ఇటీవలో లాంచింగ్ అయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంలో ముందుగా పూజాహెగ్డేనే హీరోయిన్గా అనుకున్నారట. కానీ ఏమైందో ఏమో ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసినట్లు సమాచారం. పూజా హెగ్డే ఐరెన్ లెగ్ అనే ప్రచారమా? లేదంటే డేట్స్ సర్దుబాటు కాలేదా? అన్న విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి మరో భారీ ప్రాజెక్ట్ నుంచి పూజా బయటకు వచ్చేసినట్లు టాక్ వినిపిస్తుంది. -
‘భవదీయుడు భగత్‌సింగ్’ పేరు మారింది.. కొత్త టైటిల్ ఇదే
పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ ఈ మూవీ ఇప్పటివరకు సెట్స్‌పైకి పోలేదు. దీంతో ఈ సినిమా ఉంటుందో లేదో అనే చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఓ బిగ్ అప్డేట్ని వదిలింది. సినిమా టైటిల్‌ని మార్పు చేస్తూ..'భవదీయుడు భగత్ సింగ్' బదులుగా 'ఉస్తాద్ భగత్ సింగ్' అంటూ కొత్త పోస్టర్ని విడుదల చేసింది. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే ట్యాగ్ లైన్‌తో పాటు ఈ సారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు’ అనే థీమ్లైన్ కూడా ఇచ్చారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ రెండో చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ❤️🔥❤️🔥❤️🔥@PawanKalyan in and as #UstaadBhagatSingh 🔥 This time, it's beyond entertainment 😎🔥 Shoot begins soon 💥❤️🔥@harish2you @ThisIsDSP @DoP_Bose @MythriOfficial pic.twitter.com/F7EFDOW3F8 — Mythri Movie Makers (@MythriOfficial) December 11, 2022 -
‘లవ్ యూ రామ్’ టీజర్‌ను రిలీజ్ చేసిన హరీష్ శంకర్
‘రోహిత్ నటించిన ‘నాట్యం’ చూశాను. అతనిలో మంచి డ్యాన్సర్, యాక్టర్ వున్నారు. ‘లవ్ యూ రామ్’ అతనికి మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో పాటలు అద్భుతంగా వున్నాయి. దర్శకుడిగా అద్భుత చిత్రాలు అందించిన దశరథ్ నిర్మాతగానూ సక్సెస్ అవ్వాలని కోరుతున్నాను’’ అన్నారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధనన్ జంటగా దర్శకుడు కె. దశరథ్ అందించిన కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ యూ రామ్’. డీవై చౌదరి దర్శకత్వంలో డీవై చౌదరి, కె. దశరథ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సాంగ్ టీజర్‌ని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీజర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. ‘‘ఈ సినిమా చూశాను. అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు హరీష్ శంకర్. ‘‘మిస్టర్ పర్ఫెక్ట్’తో హరీష్ శంకర్, నా జర్నీ మొదలైంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ చిత్రానికి పని చేశారాయన’’ అన్నారు కె. దశరథ్. ‘‘ఈ సినిమాలో దశరథ్‌గారు కూడా నటించారు’’ అన్నారు డీవై చౌదరి. ఈ చిత్రానికి సంగీతం: కె. వేద. -
స్వాతి నా ఆల్ టైం క్రష్, అప్పటి నుంచి తనని చూస్తున్నా: డైరెక్టర్ హరీశ్ శంకర్
చాలా గ్యాప్ తర్వాత ‘కలర్స్’ స్వాతి రీఎంట్రీ ఇస్తున్న మూవీ ‘పంచతంత్రం’. ఐదు కథలతో నడిచే ఈ సినిమాలో బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 9న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రి రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్, కలర్స్ స్వాతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వాతి తన ఆల్ టైమ్ క్రష్ అని చెప్పాడు. ‘‘కలర్స్’ ప్రోగ్రామ్ నుంచి తను స్వాతిని చూస్తున్నారు. ఆమె నా ఆల్ టైం క్రష్. మిరపకాయ్ చిత్రంలో స్వాతి ఓ రోల్ చేసింది. ఆమె ఇక్కడ ఉండటం తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం’’ అంటూ స్వాతిపై ప్రశంసలు కురింపించాడు ఆయన. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకి చక్కని టైటిల్ పెట్టడంలోనే దర్శకడుఉ సగం సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలోని హీరోయిన్స్ అంతా తెలుగువారే అని అన్నారు. నా సినిమాల్లో కూడా తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వాలనే అనుకుంటూ ఉంటాను. కాకపోతే కొన్నిసార్లు న్యాయం చేయలేకపోతుంటాను. ఇందాకటి నుంచి అంతా ఇది చిన్న సినిమా అంటున్నారు. రిలీజ్ అయిన తరువాత ఇది చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అని తెలుస్తుంది’ అని అన్నాడు. చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌పై సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు అభిమానిగానే చిరంజీవికి ఆనాడు విజ్ఞప్తి చేశా: వర్మ క్లారిటీ -
ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు .. పవన్ కోసం హరీష్ ..!
-
నోట్లో సిగరెట్, చెవికి పోగు.. అల్లు అర్జున్ న్యూ లుక్ వైరల్
‘పుష్ప’ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడాయన పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్‌లో చేరాడు. టాలీవుడ్లో మాత్రమే కాకుండా.. బాలీవుడ్‌లోనూ బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సినీ ప్రియులంతా పుష్ప 2 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింట్ మొదలు కానుంది. ఇలాంటి తరుణంలో బన్ని న్యూలుక్లో దర్శనమిచ్చి అందరికి షాకిచ్చాడు. (చదవండి: సల్మాన్‌తో మెగాస్టార్ స్టెప్పులు.. కనువిందు ఖాయం) కొద్దిగా నెరసిన గెడ్డం, నోట్లో సిగరేట్, చెవికి పోగు పెట్టి రఫ్‌లో లుక్‌లో కనిపించాడు బన్ని. అయితే ఈ నయా లుక్ సినిమా కోసం కాదు. ఓ యాడ్ షూటింగ్ కోసం బన్ని ఇలా కనిపించాడు. ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ యాడ్ చిత్రీకరణలో పాల్గొన్న బన్ని..తాజాగా హరీశ్ శంకర్ డైరెక్షన్లో మరో యాడ్ చేశాడు. దాని కోసమే బన్ని ఇలా నయా లుక్‌లో కనిపించాడు. ఈ ఫోటోని బన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా.. కొన్ని క్షణాల్లోనే అది నెట్టింట వైరల్ అయింది. బన్ని నయా లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. లైకులు, రీట్వీట్లతో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది. మారేడుమిల్లి అడవుల్లోనే ఎక్కువ భాగం షూటింగ్ షెడ్యూల్స్ ఫిక్స్ చేశాడు సుకుమార్. జనవరితో షూటింగ్ కంప్లీట్ చేసి, మరో నాలుగు నెలలు పోస్ట్ ప్రోడకన్ కు టైమ్ ఇచ్చి, వచ్చే వేసవి లో పుష్పరాజ్ గ్రాండ్ రీఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు. 🖤 pic.twitter.com/wm1GuLLmsA — Allu Arjun (@alluarjun) July 29, 2022 -
మరోసారి జతకట్టిన హరీశ్ శంకర్-బన్నీ, థాయ్‌లాండ్‌లో షూటింగ్..
దర్శకుడు హరీశ్ శంకర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘డీజే’ చిత్రం మంచి విజయం సాధించడమే కాదు భారీ వసూళ్లు రాబట్టింది. తాజా వీరిద్దరు మళ్లీ జత కట్టారు. హరీశ్ దర్శకత్వంలో బన్నీ నటించనున్నాడు. దీనికి ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఛటర్జీ పని చేశాడు. అయితే, ఇది సినిమా కోసం కాదు. ఓ యాడ్ ఫిల్మ్ కోసం. ఈ యాడ్ త్వరలోనే విడుదల కానుంది. ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీతో తమ బ్రాండ్‌ను ఎండార్స్ చేసేందుకు పలు వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. Get ready to see never before Avatar of…… “ICONSTAAR “ @alluarjun #adshoots — Harish Shankar .S (@harish2you) July 28, 2022 దీంతో వాణిజ్య సంస్థలు తమ ప్రకటనల్లో నటించాలని కోరుతూ బన్నీని సంప్రదిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బన్నీ మరో యాడ్‌లో నటించనున్నాడు. అయితే ఇప్పటికీ వరకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ పలు ప్రకటనల్లో నటించాడు. ఇప్పుడు తొలిసారి హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ వాణిజ్య ప్రకటనలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా హరీశ్ శంకర్ ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ థాయ్ లాండ్లో జరిగనుందని సమచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. Icon Staar @AlluArjun is teaming up with director @harish2you and DOP Sudeep Chatterjee for an ad shoot for @AstralPipes being shot in Hyderabad. #AlluArjun pic.twitter.com/H2CSh7BAxG — Suresh Kondi (@SureshKondi_) July 28, 2022 చదవండి: బిగ్‌బాస్‌లోకి అలనాటి స్టార్ యాంకర్! భారీ రెమ్యునరేషన్ ఆఫర్? నాకు లైన్ వేయడం ఆపు అనన్య.. విజయ్ రిక్వెస్ట్ -
పవన్‌తో సినిమాకి భయపడుతున్న దర్శకులు...కారణం?
ఒకవైపు రాజకీయాలు ఇంకో పైవు సినిమాలు అంటూ రెండు పడవల పై ప్రయాణం సాగిస్తున్నాడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. అతని ప్లాన్ అతనికి ఉంది. కాని అతని సినిమాలతో కెరీర్ ప్లాన్ చేసుకున్న దర్శకుల ప్లానింగ్ మొత్తం డిస్టర్బ్ అవుతోంది. ఏళ్ల తరబడి పవన్ దర్శకులు ఖాలీగా కూర్చోవాల్సి వస్తోంది. మరికొందరికైతే ఏళ్లకు ఏళ్లు ఎదురుచూసినప్పటికీ అతనితో సినిమా చేసే అవకాశం మాత్రం రావడం లేదు. దీంతొ కొంత మంది దర్శకులు పవన్‌తో సినిమాలు చేయడానికి భయపడిపోతున్నారు. గద్దలకొండ గణేష్(2019) తర్వాత పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు దర్శకుడు హరీశ్ శంకర్. వీరిద్దరి కాంబోలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా ప్రకటన కూడా వచ్చేసింది.కేవలం పవన్ కోసమే హరీశ్ రెండేళ్లుగా వెయిట్ చేస్తూ వచ్చాడు.ఇప్పుడు పవన్ భవదీయుడు చేసేందుకు టైమ్ లేదు అంటున్నాడట పవన్. అందుకే హరీష్ ఇక తన వెయిటింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టి ఎనర్జిటిక్ హీరో రామ్ తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడట. (చదవండి: ఈ వారం అలరించనున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..) మరో దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా పవన్ తో సినిమా ప్రకటన చేశాడు. ఏజెంట్ తర్వాత పవర్ స్టార్ తో మూవీ అంటుంది అన్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. సురేందర్ రెడ్డి ఇప్పుడు యూత్ స్టార్ నితిన్ తో మూవీ కమిట్ అయ్యాడు. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ ప్రీ ప్రొడక్షన్ దశలోనూ దర్శకుడు సంపత్ నంది పవన్ తో సినిమా కోసం ఇలాగే ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేశాడు. అయితే లాస్ట్ కు ఆ ఛాన్స్ ను బాబి అందుకున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న హరి హర వీరమల్లు సినిమా ఆగిపోయిందంటూ ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. అదే జరిగితే క్రిష్ నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం చేతిలో ఉన్న చిత్రాలను అన్ని పక్కనపెట్టి , రెండేళ్లుగా తనతో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్న దర్శకులను కాదని, తమిళ సినిమా వినోదయ సిత్తంను సముద్రఖనితో కలసి రీమేక్ చేస్తున్నాడు పవన్. ఈ మూవీ షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కావాల్సింది..కానీ అదీ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. పవన్ చేతిలో ఉన్న సినిమాలేవి ఇప్పట్లో ముందుకు కదిలే అవకాశల్లేవు. పవన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల అభిమానులు నిరాశ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
పవన్-హరీశ్ శంకర్ మూవీ నుంచి తప్పుకున్న పూజా! అందుకేనా?
లక్కీ లెగ్ హీరోయిన్గా టాలీవుడ్లో గుర్తింపు పొందిన బ్యూటీ పూజా హెగ్డే. ఆమె సినిమాకు ఒకే చేసిందంటే అది హిట్ అనేంతగా దర్శకులకు, హీరోలకు సెంటిమెంట్‌గా మారింది ఆమె. ఇలా బడా హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకున్న ఈ ‘బుట్టబొమ్మ’ను వరుస ప్లాప్‌లు వెంటాడుతున్నాయి. అయినా పూజా క్రేజ్ ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఎందుకుంటే ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నవన్ని పెద్ద సినిమాలే. అంతేకాదు పలు భారీ చిత్రాల్లో సైతం స్పెషల్ సాంగ్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: ఆకట్టుకుంటున్న బ్రహ్మాస్త్ర కొత్త టీజర్, నాగార్జున లుక్ రిలీజ్ ఈ నేపథ్యంలో పూజాకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా డైరెక్టర్ హరీశ్ శంకర్ పవన్ కల్యాణ్‌తో భవదీయుడు భగత్ సింగ్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో పూజా హేగ్డే హీరోయిన్ అని ఆ మధ్య హింట్ కూడా ఇచ్చాడు. అయితే తాజాగా ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత తమిళ చిత్రం ‘వినోదయా సితం’ రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: హైదరాబాద్‌లో కిన్నెర మొగిలయ్యకు ఇంటిస్థలం, రూ కోటి నగదు.. ఉత్తర్వులు జారీ దీంతో ‘భవదీయుడు భగత్ సింగ్’ సెట్స్ పైకి ఎప్పుడు వస్తుందనేది క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే పూజా ప్రస్తుతం త్రివిక్రమ్ - మహేశ్ సినిమాలో చేయనుంది. మరో వైపు విజయ్ దేవరకొండ సరసన ‘జన గణ మన’, బాలీవుడ్ మూవీ యనిమల్లో స్పెషల్ సాంగ్స్‌కు ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో చేతి నిండా ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న పూజా తాను ఈ సినిమాలో చేయలేనని హరీశ్ శంకర్‌కు చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై స్పష్టత రావాలంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాల్సిందే. కాగా పూజా ఇటీవల ఆచార్య మూవీతో పాటు, ఎఫ్ 3లో స్పెషల్ సాంగ్‌తో అలరించిన సంగతి తెలిసిందే. -
ప్రతి రిలేషన్లో గొడవలు, మనస్పర్థలు కామన్: బండ్ల గణేశ్
Bandla Ganesh About Clash With Director: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌కు ఖరీదైన వాచ్ బాహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇది ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. కాగా గతంలో బండ్ల గణేశ్, హరీశ్ శంకర్ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్గా బండ్ల గణేశ్, హరీశ్ శంకర్‌ను కలవడం, బాహుమతులు ఇచ్చుకోవడం హాట్‌టాపిక్‌గా నిలిచింది. దీంతో గతంలో బండ్ల చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా మరోసారి తెరపైకి వచ్చాయి. చదవండి: ఆస్తులన్ని పోయాయి, ఒక్క పూట భోజనమే చేసేదాన్ని: ‘షావుకారు’ జానకి హరీశ్ శంకర్‌తో గొడవపై ఓ ఇంటర్య్వూలో స్పందించిన బండ్ల గణేశ్ ఇలా వ్యాఖ్యానించాడు. ‘ప్రతి రిలేషన్లో గొడవలు, మనస్పర్థాలు సాధారణమే. ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. మళ్లీ సర్థుకుంటాయి. ఇలాంటి వాటి గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దు’ అన్నాడు. అనంతరం ‘గబ్బర్ సింగ్ మూవీ నా జీవితాన్నే మార్చేసింది. ఈ మూవీతో నాకు అంత పెద్ద హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్‌కు నేను ఎప్పటికీ కృతజ్ఞతుడినే. నా జీవింతాంతం ఆయన నాకు మంచి స్నేహితుడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హరీశ్ శంకర్ కూడా మనసులో ఏం పెట్టుకోలేదని, ఆయన అంత వదిలేసి తనతో చాలా ఫ్రెండ్లిగా ఉంటున్నారని చెప్పాడు. అంతేగాక పవన్ కల్యాణ్ చాన్స్ ఇస్తే తనతో సినిమా చేసేందుకు ఆయన రెడీగా ఉన్నారని చెప్పాడు. చదవండి: ముచ్చటగా మూడోసారి.. అదే రిపీట్ అవుతుందా? కాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాకు బండ్ల గణేశ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్పట్లో బ్లాకబస్టర్గా నిలిచింది. దీంతో మే 12తో ఈ సినిమా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా బండ్ల డైరెక్టర్ హరీశ్ శంకర్ కాస్ట్లీ వాచ్‌ను కానుకగా ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఇదే మూవీ 8వ వార్షికోత్సవం సమయంలోనే హరీశ్ శంకర్, బండ్ల గణేశ్ మధ్య వాగ్వాదం నెలకొంది. 'గబ్బర్ సింగ్' 8వ వార్షికోత్సవం సందర్భంగా హరీశ్ శంకర్ అందరికీ థ్యాంక్స్ చెపుతూ ఒక లేఖను విడుదల చేశారు. అయితే, ఆ సినిమా నిర్మాత అయిన బండ్ల గణేశ్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. దీంతో, రచ్చ మొదలైంది. హరీశ్ శంకర్ ఓ రీమేక్ డైరెక్టర్ అని, అతనితో మళ్లీ సినిమా చేసే ప్రసక్తే లేదంటూ బండ్ల అప్పట్లో ఫైర్ అయిన విషయం విధితమే. -
హరీష్ శంకర్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బండ్ల గణేష్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో 'గబ్బర్ సింగ్' ఒకటి. ఈ సినిమా వచ్చి పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్‌కు నిర్మాత బండ్ల గణేష్ ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మీరు లేకపోతే ఈ సినిమా అంత వేగంగా పూర్తయ్యేది కాదంటూ ట్వీట్ చేశారు. కాగా హిందీలో సూపర్ హిట్‌గా నిలిచిన దబాంగ్ రీమేక్ చిత్రమే గబ్బర్ సింగ్. 2012లో విడుదలైన ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ నటించింది. ఈ సినిమా విడుదలై నిన్నటికి పదేళ్లు అయిన సందర్భంగా హరీష్ శంకర్‌కు సుమారు రూ. 5లక్షలు విలువచేసే వాచ్‌ను బండ్ల కానుకగా ఇచ్చారు. Successful Producer Bandla Ganesh gifted an expensive watch to Blockbuster Director Harish Shankar on the occasion of #DecadeForGabbarSingh #10YearsForGabbarSingh @harish2you @ganeshbandla pic.twitter.com/brxVrCRB6f — Vamsi Kaka (@vamsikaka) May 11, 2022 -
టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్స్ వాళ్లే: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం ‘ఆచార్య’. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేస్తున్న ఈచిత్రంపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక పలు వాయిదాల అనంతరం ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌ను స్పీడ్‌గా నిర్వహిస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలోనే చిరంజీవి, కొరటాల శివ, రామ్ చరణ్‌తో చిట్‌చాట్ నిర్వహించాడు డైరెక్టర్ హరీశ్ శంకర్. ఈ చిట్‌చాట్‌లో హరీశ్ శంకర్ పలు ప్రశ్నలు ఉడగ్గా.. చిరంజీవి ఆసక్తికర సమాధానలు చెప్పారు. చిరంజీవిని డ్యాన్స్‌కు సంబంధించిన ప్రశ్న అడిగాడు హరీశ్ శంకర్. 'మీరిద్దరు (చిరంజీవి, రామ్ చరణ్) కాకుండా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్సర్స్ ఎవరని అనుకుంటున్నారు' అని చిరంజీవిని అడిగాడు హరీశ్ శంకర్. ఇందుకు 'చాలా మంది డ్యాన్సర్స్ ఉన్నారు. ముఖ్యంగా బన్నీ, తారక్, రామ్, నితిన్ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు' అని చిరంజీవి చెప్పగా రామ్ చరణ్ మధ్యలో కల్పించుకుని 'నా దృష్టిలో తారక్, బన్నీ బెస్ట్ డ్యాన్సర్స్' అని తెలిపాడు. ఇకపోతే 'ఆచార్య' మూవీలో 'బంజారా' పాటకు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి డ్యాన్స్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. చదవండి: 'సినిమా ఆడకపోతే ఏ సమస్య లేదు.. ఆడితేనే సమస్య' బిగ్ సర్ప్రైజ్, ఆచార్యలో అనుష్క స్పెషల్ రోల్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
దొంగతనం మొదలుపెట్టిన బిగ్‌బాస్-5 విజేత సన్నీ
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, హరీష్ శంకర్ సంయుక్తంగా జీ5 కోసం రూపొందిస్తున్న వెబ్ సీరిస్ ‘ఏటీఎం’. బిగ్‌బాస్ ఫేం వీజే సన్నీ, దివితో పాటు నటుడు సుబ్బరాజు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సి.చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సీరీస్‌కు హరీష్ శంకర్ కథ అందించారు. హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఈనెల 27నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సందర్భంగా సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక తన కొత్త వెబ్‌సిరీస్‌పై సన్నీ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. 'ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఏటీఎం వెబ్‌సిరీస్ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. దొంగతనం షురూ' అంటూ రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా వీజే సన్నీకి అలీ, సోహైల్ సహా పలువురు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by VJ Sunny (@iamvjsunny) -
ఆశిష్‌కి ఈ సినిమా ఓ సవాల్
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆశిష్ హీరోగా నటిస్తున్న రెండో సినిమా ‘సెల్ఫిష్’ శుక్రవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. విశాల్ కాశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మాతలు. ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్ శంకర్ కెమెరా స్విచాన్ చేయగా, తమిళ స్టార్ ధనుష్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించడంతో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అనంతరం ‘దిల్’ రాజు మాట్లాడుతూ.– ‘‘రౌడీ బాయ్స్’తో మా ఆశిష్ నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమా తనకు టైలర్ మేడ్. కానీ ఈ సినిమా తనకు ఓ చాలెంజ్లాంటిది. నేను, సుకుమార్ ‘ఆర్య’ (2004) సినిమాకు పని చేశాం. ఇన్నేళ్లకు ‘సెల్ఫిష్’కు మేం పని చేయడం ఆనందంగా ఉంది. ‘సెల్ఫిష్’ ఐడియా చెప్పినప్పుడే బాగా నచ్చి సినిమా చేద్దామని కాశీకి చెప్పాను. స్టోరీ పర్ఫెక్ట్గా సెట్ అయింది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మణికందన్ .ఎస్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, అశోక్ బండ్రెడ్డి. -
హిట్ కాంబినేషన్, ఆ హీరోయిన్లే కావాలంటున్న డైరెక్టర్స్!
ఓ సినిమా హిట్టయితే.. ఆ హీరో–దర్శకుడిది హిట్ కాంబినేషన్ అంటారు. ఆ కాంబినేషన్లో అభిమానులు మరో సినిమాని ఎదురు చూస్తారు కూడా. ఇప్పుడు కూడా ‘హిట్ కాంబినేషన్’ షురూ అయింది. అయితే ఇది హీరోయిన్–డైరెక్టర్ కాంబినేషన్. ‘రిపీట్టే..’ అంటూ ఒక సినిమా తర్వాత వెంటనే తన మరో సినిమాకి ఆ హీరోయిన్నే ఎంపిక చేశారు కొందరు దర్శకులు. ఆ డైరెక్టర్–హీరోయిన్ కాంబినేషన్ సినిమాల గురించి తెలుసుకుందాం. దర్శకుడు త్రివిక్రమ్ హీరోయిన్ పూజా హెగ్డేకు హ్యాట్రిక్ చాన్స్ ఇచ్చారు. త్రివిక్రమ్‌తో పూజా హెగ్డేకి ‘అరవిందసమేత వీరరాఘవ’ తొలి సినిమా. ఆ సినిమా సూపర్ హిట్. ఆ వెంటనే ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి పూజకు చాన్స్ ఇచ్చారు త్రివిక్రమ్. ఈ సినిమా కూడా సూపర్ హిట్. ఇప్పుడు మహేశ్‌బాబుతో చేయనున్న సినిమాకి కూడా హీరోయిన్గా పూజా హెగ్డేనే తీసుకున్నారు త్రివిక్రమ్. సేమ్ ఒకప్పుడు త్రివిక్రమ్‌తో సమంత ఇలా వరుసగా మూడు సినిమాలు (‘అత్తారింటికి దారేది’ (2013), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015), ‘అ ఆ’ (2016) చేశారు. ఇప్పుడు పూజా హెగ్డేని రిపీట్ చేస్తున్నారు త్రివిక్రమ్. ఇక దర్శకుడు హరీష్ శంకర్ కూడా త్రివిక్రమ్‌లానే పూజా హెగ్డేకు హ్యాట్రిక్ చాన్స్ ఇచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ (2017), ‘గద్దలకొండ గణేష్’ (2019) చిత్రాల్లో హీరోయిన్గా నటించారు పూజా హెగ్డే. హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రం ‘భవదీయుడు భగత్‌సింగ్’లోనూ పూజా హెగ్డేనే హీరోయిన్. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ చిత్రంలో హీరోయిన్గా నటించిన రష్మికా మందన్నా ఈ చిత్రం రెండో భాగం ‘పుష్ప: ది రూల్’లోనూ నటిస్తారు. రెండు భాగాల సినిమా కాబట్టి ఈ కాంబినేషన్ రిపీట్ కావడం సహజం. ఈ చిత్రం షూటింగ్ ఈ వేసవిలో ప్రారంభం కానుంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘ఎఫ్ 2’లో ఓ హీరోయిన్గా నటించిన తమన్నా ఈ చిత్రం సీక్వెల్ ‘ఎఫ్ 3’లోనూ నటిస్తున్నారు. ఏప్రిల్ 27న ‘ఎఫ్ 3’ చిత్రం విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు ముందు మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇంకోవైపు ‘క్రాక్’ (2021) సినిమాకి ముందు దాదాపు మూడేళ్లు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారు శ్రుతీహాసన్. ఈ గ్యాప్ తర్వాత ‘క్రాక్’ హిట్‌తో టాలీవుడ్లో శ్రుతి సందడి మొదలైంది. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తాజాగా బాలకృష్ణ హీరోగా తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ కథానాయికగా శ్రుతీహాసన్నే తీసుకున్నారు గోపీచంద్ మలినేని. ఇక తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ్ల 2018లో వచ్చిన ‘గూఢచారి’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. ‘గూఢచారి’ తర్వాత శోభితా వెంటనే మరో తెలుగు సినిమా చేయలేదు. హిందీ సినిమాల్లో నటించారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఆమె యాక్ట్ చేసిన తెలుగు చిత్రం ‘మేజర్’. శశికిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. వీరితో పాటు మరికొందరు దర్శకులు తమ సినిమాల్లో హీరోయిన్గా నటించినవారిని రిపీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలిసింది. చదవండి: అనన్య గ్లామరస్‌గానే కనిపించాలి.. ఆమెకు అవసరం: చుంకీ పాండే -
టాలీవుడ్ ప్రముఖుల మధ్య కోల్డ్‌వార్, వరస ట్వీట్స్‌తో మాటల యుద్ధం..
టాలీవుడ్ ప్రముఖులు ఇద్దరు సోషల్ మీడియా వేదికగా వార్‌కు దిగారు. ఒకరిపై ఒకరూ వరసగా సటైరికల్‌గా పంచ్‌లు వేసుకుంటూ మాటల యుద్దానికి దిగారు. ఇదంతా చూస్తుంటే వారి మధ్య ఎదో కోల్డో వారి జరిగినట్లు తెలుస్తోంది. వారిద్దరూ ఎవరో కాదు ప్రముఖ డైరెక్టర్ హరీశ్ శంకర్, రచయిత బీవీఎస్ రవి. బీవీఎస్ రవి చేసిన ట్వీట్‌కు హరీశ్ శంకర్ ఇచ్చిన రిప్లై ఈ గొడవ దారి తీసింది. చదవండి: హీరోయిన్ పుట్టుమచ్చలపై ప్రశ్న, తీవ్రంగా స్పందించిన హీరో.. పోస్ట్ వైరల్ మొదట బీవీఎస్ రవి ‘అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయం చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్‌కు దర్శకుడు హరీశ్ శంకర్ రిప్లై ఇస్తూ.. ‘అనుభవించమని ఇచ్చారా.?’ అని రీట్వీట్ చేశాడు. దీనికి రవి బదులిస్తూ.. ‘దయచేసి నేను వేసిన సెటైర్‌ను ఎంజాయ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ’ అంటూ సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగిపోయింది. ఇలా ఒకరిపై ఒకరు వరుసగా కౌంటర్లు వేసుకుంటూ పోవడంతో.. ఇది చూసిన నెటిజన్లు ‘చూస్తుంటే వీరిద్దరి మధ్య ఏం జరిగింది. ఏదో జరగబోతుందని గట్టిగా కొడుతోంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా.. అనుభవించమని ఇచ్చారా ??🙏🙏 https://t.co/GaQxHVJLnJ — Harish Shankar .S (@harish2you) February 3, 2022 Giving statements on other’s statements at times reverberate as a statement from a critical condition in the struggle to exist. All the best. Continue to sail on social media democracy. https://t.co/6q37rJadCo — BVS Ravi (@BvsRavi) February 4, 2022 అనుభవించడంలో ఒక భాగం పరిపాలన,ఇంకొంచమే భాగం ప్రజా సేవ. ఎవరు వచ్చినా చేసేది అనుభవించడమే. ( for those who under read my below tweet. This is said by Chankaya to Chandra gupta in the విశాఖదత్తుడు విరచిత "ముద్రారాక్షసమ్") https://t.co/LKKrnKgePx — BVS Ravi (@BvsRavi) February 4, 2022 Permission isthe kaadhu Bawa Audition isthe raavochu …. ee madhya “veshaalestunnav”kadhaaa @BvsRavi https://t.co/ss4fUeiVKn — Harish Shankar .S (@harish2you) February 4, 2022 Anthe gaa unnadaani gurinchi ekkuva maatladanu leni valladaggara cheppadaaniki thadanadanu …good going Bawa pls continue ….. am having my weekend fun .. but will answer only at my leisure ;reply late ayithe feel ayyi mallee Whstsapp lo andari daggara edavaku ; https://t.co/4kwmbQMOPk — Harish Shankar .S (@harish2you) February 4, 2022 Tweets delete chese pirikithanam kanna …ontarithanam better emo kadhaa Bawa !!! Omg edi Emaina neetho naa flow super Bawa .. waiting for ur next come on u do it I mean u can Tweet it … https://t.co/pLNKr87GWv — Harish Shankar .S (@harish2you) February 4, 2022 Sarichesukovadam pirikithanam ayithe saagateesukovadam chavakabaaruthanam. Super kada punch. Neetho ade facility. Nee moham choosthe punch padipothundi. Bhavadeeyudu bhagat Singh shoot lo kaludham permission isthe. https://t.co/KzDrJtApYx — BVS Ravi (@BvsRavi) February 4, 2022 Hahahahaah deleted ?? @BvsRavi ur a quick learner Bawa …. Keep it up !!! https://t.co/vW944aO4yh — Harish Shankar .S (@harish2you) February 4, 2022 Lol… it’s not just the SHOW.. many of ur traits are UNSTOPPABLE bawa… pls continue …@BvsRavi https://t.co/Wl8ggPJM1C — Harish Shankar .S (@harish2you) February 4, 2022 -
Dil Raju: నా జీవితంలో అది చూడాలని ఉంది
‘‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(ఎస్వీసీ) బ్యానర్‌ని 2003లో స్థాపించి ‘దిల్’ సినిమాతో నిర్మాతగా ప్రయాణం ప్రారంభించాను. ఎస్‌వీసీపై 50వ సినిమా చేస్తున్నాం. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి 50 ఏళ్లు అయిన సందర్భంగా ఓ లోగో డిజైన్ చేశారు.. దేవుడి ఆశీర్వాదాలతో నా జీవితంలో ఎస్వీసీ లోగోను కూడా అలా చూడాలని ఉంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. శిరీష్ సమర్పణలో ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్, జీ 5 కాంబినేషన్లో ఎస్. హరీష్ శంకర్, హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా చంద్రమోహన్ డైరెక్షన్లో ‘ఏటీఎమ్’ అనే వెబ్ సిరీస్ రూపొందనుంది. గురువారం విలేకరుల సమావేశంలో ఈ వెబ్ సిరీస్ వివరాలను వెల్లడించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘దిల్’ రాజు ప్రొడక్షన్లో ప్రయోగాత్మక సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తాయి. ‘హిట్, జెర్సీ’ సినిమాలతో ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ త్వరలో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇక తెలుగులో హర్షిత్, హన్షితలకు ‘దిల్’ రాజు ప్రొడక్షన్ బాధ్యతలను నేను, శిరీష్ అప్పగించాం’’ అన్నారు. ‘‘ఏటీఎమ్’ స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే హాలీవుడ్ తరహాలో ఉంటుంది’’ అన్నారు ‘జీ 5’ వైస్ ప్రెసిడెంట్ పద్మ. ‘‘ఏటీఎమ్’ తొలి సీజన్ ఏడు ఎపిసోడ్స్ ఉంటుంది’’ అన్నారు డైరెక్టర్ చంద్రమోహన్. ‘‘ఎస్వీసీని సినిమా రంగంలో ఆదరించినట్టే ‘దిల్’ రాజు ప్రొడక్షన్‌ని డిజిటల్ మాధ్యమంలోనూ ఆదరించాలి’’ అన్నారు హన్షిత రెడ్డి. ‘‘మా మేనేజర్ కల్యాణ్‌గారి వల్లే ‘ఏటీఎమ్’ కథను రాశాను’’ అన్నారు ఎస్. హరీష్ శంకర్. -
వెబ్ కంటెంట్‌పై దృష్టిపెట్టిన దిల్‌రాజు
Dil Raju And Harish Shankar Join Hands For Web Series: ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఇప్పుడు వెబ్ కంటెంట్‌పై దృష్టి పెట్టారు. 'ఏటీఎమ్ రాబరీ' అనే వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నారు. దీనికి డైరెక్టర్ హరీష్ శంకర్ కథను అందిస్తుండగా చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ5 సంస్థతో కలిసి ఈ సిరీస్‌ను నిర్మించనున్నట్లు స్వయంగా దిల్‌రాజు ప్రకటించారు. ఇక హరీష్ శంకర్- దిల్‌రాజు కాంబినేషన్ కావడంతో ఈ వెబ్‌సీరిస్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. -
ఇది బాధ్యతారాహిత్యమంటూ డైరెక్టర్‌పై ట్రోల్స్, నెటిజన్లకు హరీశ్ శంకర్ ఘాటు రిప్లై
ప్రముఖ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను షేర్ చేసిన ఓ వీడియోపై సదరు నెటిజన్ స్పందించిన తీరుకు ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యాడు. కాగా ‘ఒమిక్రాన్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలా అని నిర్లక్ష్యం చేయవద్దు. కేసులు పెరుగుతున్నాయి. కానీ మరణాలు మత్రం నమోదు అవ్వడం లేదు. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసంర లేదు’ అంటూ ఓ వైద్యుడు చెప్పుకొచ్చిన వీడియోను హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు. చదవండి: హీరోయిన్‌కు కరోనా, మీ చావు కబురు కోసం ఎదురుచూస్తుంటామంటూ.. ఒమిక్రాన్ వెరియంట్ పట్ల ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిన సదరు వైద్యుడు వీడియో పంచుకున్న హరీశ్ శంకర్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మరికొందరూ నెటిజన్లు ‘హరీశ్ శంకర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఒమిక్రాన్ వెరియంట్‌పై ప్రజల్లో ఆందోళన, భయం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అయితే ప్రజల్లో భయం పోయి విచ్చలవిడిగా వ్యవహరిస్తారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వారికొ హరీశ్ శంకర్ తనదైన శైలితె ఘాటుగా సమాధానం ఇచ్చాడు. చదవండి: ‘మణిరత్నంను ఇంతవరకు కలవలేదు, ఆయనతో నాకు చేదు అనుభవం ఉంది’ ‘ఒక వైద్య నిపుణుడు ప్రజల్లో ఆశలు పెంచే దిశగా మంచి గురించి చెప్పినా మీలాంటి స్టుపిడ్స్ నిరాశ చెందుతూనే ఉంటారు’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కాగా హరీశ్ శంకర్ సోషల్ మీడియాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ నెటిజన్లతో పంచుకోవడంతో పాటు పలు సామాజిక అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటాడు. అలాగే ఇండస్ట్రీలో జరిగే పరిణామాలు.. దేశలోని రాజకీయ పరిణామాలపై ట్విట్టర్ వేదికగా స్పదిస్తుంటారు. అంతే కాదు వింతలు విశేషాలను పంచుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పించే వీడియోలను తరచూ తన పేజ్ ద్వారా నెటిజన్లకు, తన ఫాలోవర్స్‌కు అందిస్తుంటాడు. Am glad that stupids like u disappointed because guys like u never wanna give a hope to people even when an expert says something good and also he insists on precautions repeatedly !! https://t.co/tD5v3m80C5 — Harish Shankar .S (@harish2you) January 8, 2022 -
‘డేగల బాజ్జీ’గా బండ్ల గణేశ్, టైటిల్ ఖారారు
బండ్ల గణేశ్ హీరోగా ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఈ మూవీకి ‘డేగల బాజ్జీ’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. దర్శకుడు హరీశ్ శంకర్ చేతుల మీదుగా ఈ ఫస్టులుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కను బొమ్మపై గాయం, ఒక్క కన్నుతో సీరియస్‌గా చూస్తున్న బండ్ల గణేశ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ ఫస్టులుక్ విడుదల చేసిన హరీశ్ శంకర్, బండ్ల గణేశ్‌తో పాటు, మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. Thank you so much my dear blockbuster @harish2you 🤝 https://t.co/xg4RkctMgN — BANDLA GANESH. (@ganeshbandla) September 17, 2021 -
PSPK28: 'భవదీయుడు భగత్ సింగ్'గా పవన్ కల్యాణ్
Pawan Kalyans Bhavadeeyudu Bhagat Singh First Look: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్,హరీశ్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేశారు మేకర్స్. నిన్నటి నుంచే అప్డేట్ ఇస్తామంటూ ఊరించిన చిత్ర బృందం ఫైనల్‌గా ఈ చిత్రానికి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్‌ను ఖారారు చేశారు. 'ఇది కేవలం వినోదం మాత్రమే కాదు' అంటూ క్యాప్షన్‌ను జోడించారు. పోస్ట్‌ర్ లుక్‌లో పవన్ బైక్‌పై కూర్చొని ఓ చేతిలో మైక్, మరో చేతిలో టీ గ్లాస్‌తో కనిపించారు. పవన్-హరీశ్ శంకర్ మూవీ కావడంతో ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్‌కు జోడీగా పూజా హెగ్డే నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. We all need your … Blessings & Best wishes…. 🙏🙏@PawanKalyan @ThisIsDSP @DoP_Bose #AnandSai @MythriOfficial @venupro Let’s rock again….. #BhavadeeyuduBhagatSingh pic.twitter.com/T5reLKI5P9 — Harish Shankar .S (@harish2you) September 9, 2021 చదవండి : డ్రగ్స్ కేసు: ఈడీ కార్యాలయానికి చేరుకున్న రవితేజ హిందీ సూరరై పోట్రుకు లైన్‌క్లియర్ -
రేపు పవన్- హరీశ్‌శంకర్ మూవీ నుంచి అప్డేట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో పవన్ సినిమా తీయాలని డైరెక్ట్ర్ హరీశ్ శంకర్ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ మేరకు పవన్ పుట్టిన రోజున తమ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుందంటూ ప్రీ లుక్ విడుదల చేశాడు డైరెక్టర్. కాగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా రేపు ఈ మూవీ నుంచి క్రేజ్ అప్డేట్ రాబోతుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. గురువారం(సెప్టెంబర్ 9) 9:45 గంటలకు ఈ మూవీ నుంచి అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఈ అప్డేట్ ఎంటో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా సినిమాలో పవన్‌కు సరసన పూజా హెగ్డే నటించనున్నట్లు టాక్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే నెల సెట్స్‌పై రానున్నట్లు తెలుస్తోంది. Get ready for Next Level Celebrations 💥💥 A POWER PACKED ANNOUNCEMENT will enthrall you tomorrow at 9:45 AM 😎😎@PawanKalyan @harish2you @ThisIsDSP @DoP_Bose #AnandSai @venupro pic.twitter.com/1uTGZpRNUd — Mythri Movie Makers (@MythriOfficial) September 8, 2021 -
PSPK 28: జాతర షురూ అంటున్న హరీష్ శంకర్, పోస్టర్ రిలీజ్
PSPK28: నేడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డే(సెప్టెంబర్ 2). ఈ సందర్భంగా ఉదయం నుంచి అభిమానుల మీద అప్డేట్ల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ప్రీ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో హీరోను పూర్తిగా చూపించకుండా సగం మాత్రమే చూపించారు. Many More Happy Returns to The One and Only..... @PawanKalyan 🤗🤗🤗🤗🤗#JAATHARA SHURU #Team #PawanKalyan28 @harish2you @ThisIsDSP @DoP_Bose #AnandSai @MythriOfficial @venupro pic.twitter.com/fVpG8WlJOz — Harish Shankar .S (@harish2you) September 2, 2021 'జాతర షురూ' అంటూ వదిలిన ఈ పోస్టర్లో పవన్ ఓ బైక్ మీద స్టైలిష్‌గా కూర్చున్నట్లు కనిపిస్తోంది. వెనకాల ఇండియా గేట్ ఉండటాన్ని చూస్తుంటే కథ ఢిల్లీ నేపథ్యానికి సంబంధించినదై ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇది పవన్ కెరీర్లో 28వ సినిమా. ఇదిలా వుంటే ఈరోజు పవన్ బర్త్‌డే సందర్భంగా భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ రిలీజైంది. హరిహర వీరమల్లు సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29న రిలీజ్ అవుతున్నట్లు వెల్లడించారు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. -
పవన్ కళ్యాణ్‌తో క్రేజీ ప్రాజెక్ట్ కొట్టేసిన పూజ హెగ్డే
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవలే దిల్ రాజు నిర్మాతగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాతో తన అభిమానులను పలకరించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మలయాళంలో సూపర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ అనే సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా టైటిల్‌ను ‘భీమ్లా నాయక్’గా అధికారికంగా ప్రకటించారు. డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’లో నిధి అగర్వాల్.. పవన్ సరసన హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే చేస్తోన్న మొట్టమొదటి చారిత్రక నేపథ్యమున్న సినిమా ఇది. ఇక తాజా వార్త ఏంటంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటించనుంది. ప్రియమణి మరో కథానాయికగా నటించనుందని సమాచారం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రీ కొడుకులుగా నటించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రానికి ‘ఇపుడే మొదలైంది’తో పాటు ‘సంచారి’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. టైటిల్‌పై అధికారిక ప్రకటన సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా వెలుబడే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. -
ఆ పత్రికపై రకుల్ అసహనం, స్టార్ డైరెక్టర్ మద్దతు
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పరిశ్రమలోకి వచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇటూ తెలుగు, తమిళంతో పాటు అటూ బాలీవుడ్‌లోను రకుల్ తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో పలు ప్రాజెక్ట్స్‌కు సంతకం చేసిన రకుల్ చేతిలో ఇప్పుడు దాదాపు 6 సినిమాలు ఉన్నాయి. లాక్డౌన్ కారణంగా ఈ ఆ సినిమా షూటింగ్స్ వాయిదా పడటంతో ఆమె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక టాలీవుడ్లో రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ముగిసిందని, ప్రస్తుతం ఆమెకు అక్కడ సినిమాలు రావడంలేదని రకుల్ స్వయంగా చెప్పినట్లు ఆ పత్రిక రాసుకొచ్చింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘నాకు చాలా ఆశ్చర్యం ఉంది. మీరు పెట్టిన హెడ్డింగ్ ప్రకారం టాలీవుడ్లో నాకు అవకాశాలు రావడం లేదని నేనేప్పుడు చెప్పాను?. అసలు ఏడాదికి సాధారణంగా ఎన్ని సినిమాలు చేయగలం? 365 రోజుల్లో ఇప్పుడు నేను 6 సినిమాలు చేస్తున్నాను. అంటే ఒక్క ఎడాదికి ఇవి సరిపోవా? అలా అయితే కొత్త ఆఫర్స్ కోసం దయచేసి నా డేట్స్ సర్దుబాటు చేయండి. ఒకవేళ మీరు అలా చేయగలిగితే మా టీమ్‌కి సాయం చేయండి’ అంటూ రకుల్ ఆ పత్రికపై అసహనం వ్యక్తం చేసింది. అది చూసిన డైరెక్టర్ హరీశ్ శంకర్ రకుల్ ట్వీట్‌పై స్పందించాడు. ‘షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నావో నాకు తెలుసు రకుల్.. ఇటీవల నా స్నేహితుడు రాసిన స్క్రిప్ట్ నీకు బాగా నచ్చింది. దీంతో ఈ ప్రాజెక్ట్స్ కోసం నీ డేట్స్ సర్దుపాటు చేయడానికి నువ్వు ఎంతగా ప్రయత్నించావో తెలుసు. అది కుదరకపోవడంతో చివరకు ఆ ప్రాజెక్ట్‌ను వాయిదా పడింది. నువ్వు ఇలాగే నీ సినిమాలతో ఇలాంటి వాటికి సమాధాం చెప్పు’ అంటూ రకుల్‌కు శంకర్ మద్దుతునిచ్చాడు. .. And I know one of my Friends struggled a lot to plan ur dates when u liked their script and the project got postponed because of ur busy schedule. Keep Rocking @Rakulpreet and Let your work speak !!! https://t.co/GHsVsAO36R — Harish Shankar .S (@harish2you) June 20, 2021 చదవండి: బ్యాక్‌గ్రౌండ్ ఉంటే సరిపోదు.. రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు అబ్బాయిని నా దగ్గరకు పంపితే రకుల్ సీక్రెట్స్ అన్నీ చెప్తా :లక్ష్మీ -
‘షాక్’ ఇచ్చిన దర్శకుడితో రవితేజ సినిమా!
హీరో రవితేజ– దర్శకుడు హరీష్ శంకర్ మూడోసారి కలసి పని చేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. రవితేజ హీరోగా నటించిన ‘షాక్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు హరీష్. ఆ తర్వాత తన రెండో చిత్రం ‘మిరపకాయ్’ని కూడా రవితేజతోనే చేశారాయన. తాజాగా వీరి కాంబినేషన్లో మరో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయట. రవితేజ – హరీష్ మధ్య కథా చర్చలు కూడా జరిగాయని సమాచారం. ప్రస్తుతం రవితేజ తన సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. హరీష్ శంకర్ కూడా పవన్ కల్యాణ్ హీరోగా మైత్రీ మూవీస్ పతాకంపై ఓ సినిమా చేయనున్నారు. పవన్ సినిమా పూర్తి చేసి, గుమ్మడికాయ కొట్టాక రవితేజ సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నారట హరీష్ శంకర్. ‘ఖిలాడి’కి బ్రేక్ ఇదిలావుండగా, రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడి’. ఈ చిత్రదర్శకుడు రమేశ్ వర్మ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘‘నాకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో స్వీయ నిర్భంధంలో ఉన్నాను. దయచేసి అందరూ మాస్క్ ధరించండి. అనవసరంగా బయట తిరగకండి.. ఇంట్లోనే క్షేమంగా ఉండండి’ అని పేర్కొన్నారు రమేశ్ వర్మ. దీంతో ‘ఖిలాడి’ షూటింగ్‌కి చిన్న బ్రేక్ పడ్డట్లే. చదవండి: కొత్త డైరెక్టర్‌తో రవితేజ -
అయాన్ బర్త్‌డే: అల్లు అర్జున్ స్పెషల్ విషెస్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల తనయుడు అల్లు అయాన్ నేడు 6వ పుట్టిన రోజును జరపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అయాన్‌కు సినీ ప్రముఖులు, అల్లు అభిమానుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇక తండ్రి అల్లు అర్జున్ తనయుడికి ట్విటర్ వేదికగా స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపాడు. Many many happy returns of the day to my sweetest baby babu Ayaan . Your the love of my life. Wish u many more beautiful years to come . Love Nana #alluayaan #allufamily pic.twitter.com/fwvLSFH3Cn — Allu Arjun (@alluarjun) April 3, 2021 బన్నీ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేస్తూ.. ‘మేనీ మేనీ హ్యీపీ రీటర్స్ ఆఫ్ ది డే మై స్వీట్ బేబీ బాబు ఆయాన్. నీకు ఇంకా ఎన్నో అందమైన సంవత్సరాలు రావాలని కోరుకుంటున్నాను. లవ్ యూ నాన్న’ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. అలాగే బాబాయ్ అల్లు శిరీష్ కూడా అయాన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేగాక డైరెక్టర్ హరీష్ శంకర్ అయాన్‌తో దిగిన ఫొటోను షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. కాగా ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవల కేరళ అడవుల్లో షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్‌ను జరుపుకుంటోంది. Happy Birthday Ayaan... wishing u a playful and joyful year ahead !! 🤗🤗🤗 thanks to stylish star for this cute moment @alluarjun pic.twitter.com/zkcIZPq2Ok — Harish Shankar .S (@harish2you) April 3, 2021 చదవండి: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..‘పుష్ప’ నుంచి క్రేజీ అప్డేట్ భార్య, కూతురు ఫొటో షేర్ చేసిన బన్నీ -
మిస్సింగ్ కథతో...
పృథ్వీ, మైరా దోషి జంటగా నటించిన చిత్రం ‘ఐఐటి కృష్ణమూర్తి’. శ్రీవర్థన్ దర్శకత్వంలో ప్రసాద్ నేకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. పృథ్వీ మాట్లాడుతూ– ‘‘మంచి కాన్సెప్ట్‌తో, మిస్సింగ్ కథతో థ్రిల్లర్‌గా మా చిత్రం తెరకెక్కింది. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ‘ఐఐటి కృష్ణమూర్తి’ ట్రైలర్‌ను విడుదల చేసి, ప్రేక్షకులను అలరిస్తుందని అభినందనలు తెలిపారు’’ అన్నారు. మైరా దోషి మాట్లాడుతూ– ‘‘ఐఐటి కృష్ణమూర్తి’ నాకెంతో స్పెషల్ ఫిల్మ్. ఇందులో నేను చేసిన పాత్ర అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను’’ అన్నారు. శ్రీవర్థన్ మాట్లాడుతూ– ‘‘నన్ను నమ్మి నాతో ఈ ప్రాజెక్ట్ చేసిన నిర్మాతకు కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చే జానర్‌తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం తెరకెక్కించటం జరిగింది’’ అన్నారు. ‘‘సినిమా కాన్సెప్ట్ బావుంది. దర్శకుని కథ, కథనాల ఎంపిక నచ్చింది. టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్. -
ఏడు పాత్రల మథనం
మానస్ నాగులపల్లి, నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా అక్షత సోనావని హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘క్షీర సాగర మథనం’. అనిల్ పంగులూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ పిక్చర్స్‌తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేష¯Œ ్స ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలోని ‘నీ పేరు పిలవడం... నీ పేరు పలకడం..’ గీతాన్ని దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీమణి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. అజయ్ అరసాడ సంగీతం అందించారు. ‘‘మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలతో తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అన్నారు అనిల్ పంగలూరి. ఈ చిత్రానికి కెమెరా: సంతోష శానమోని, సహదర్శకుడు: కిషోర్ కృష్ణ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి. -
నేషనల్ మీడియాపై దర్శకుడి వ్యంగ్యాస్త్రాలు
దక్షిణ భారత దేశ ప్రముఖుల విషయంలో జాతీయ మీడియా వ్యవహరిస్తున్న తీరుపై దర్శకుడు హరీష్ శంకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్తకు జాతీయ మీడియా సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటంపై ఆయన మండిపడ్డారు. శనివారం ట్విటర్ వేదికగా హరీష్ స్పందిస్తూ..‘‘ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో.. మన నేషనల్ మీడియాని చూస్తే జాలేస్తుంది. అంతేలే, కొందరి స్థాయి విశ్వవ్యాప్తం. ( ‘బాలు ఎప్పుడూ మాతోనే ఉన్నారు.. ఉంటారు’ ) ఇరుకు సందుల్లో కాదు’’ అని పేర్కొన్నారు. ప్రముఖ ఇంటర్ నేషనల్ న్యూస్ ఛానల్ బీబీసీ.. ఎస్పీ బాలు మరణంపై ప్రచురించిన వార్తా కథనానికి సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో.. మన నేషనల్ మీడియా ని చూస్తే జాలేస్తుంది.. అంతేలే.. కొందరి స్థాయి విశ్వవ్యాప్తం.. ఇరుకు సందుల్లో కాదు.. pic.twitter.com/hcYDqMU9WK — Harish Shankar .S (@harish2you) September 26, 2020 -
‘బాలు ఎప్పుడూ మాతోనే ఉన్నారు.. ఉంటారు’
టాలీవుడ్లో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలు సినీ ఇండస్ట్రీని చీకట్లోకి నెట్టేస్టున్నాయి. సెలబ్రిటీల ఆకస్మిక మరణాలు అభిమానులను శోక సంద్రంలో ముంచేస్తున్నాయి. తాజాగా గాన గందర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ప్రాణాలు విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే బాలుని కొలిచే అనేక హృదయాలు షాక్‌కు గురయ్యాయి. ఎప్పటికైనా పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఇన్ని రోజులుగా ఎదురు చూసిన వారికి బాలు మరణం తీరని శోకాన్ని మిగిల్చింది. (బ్రేకింగ్ : ఎస్పీ బాలు కన్నుమూత) తన గాత్రంతో లక్షల పాటలను పలికిన ఆ స్వరం నేడు మూగబోవడంతో ఎస్పీబీకి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తన స్వరంతో కోట్లాది మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప గాయకుడికి ట్విటర్ వేదికగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. గాన గంధర్వుడు ఇక లేరని చిత్ర నిర్మాత బీఏ రాజు తెలిపారు. ‘లెజండరీ గాయకుడు ఎస్పీబీ ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం సినీ ఇంస్ట్రీకి తీరనిలోటు.. బాలు కుటుంబానికి నా సంతాపం’ అని ట్వీట్ చేశారు. ఓ శకం ముగిసింది ‘సంగీత ప్రపంచానికి చీకటి రోజు. బాలు గారి మరణంతో ఓ శకం ముగిసింది. ఆయన అందించిన పాటల కారణంగా నా ఎన్నో సినిమాలు విజయం సాధించాయి. ఎన్నో మరుపురాని పాటలను అందించారు. ఆయన స్వరంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. బాలు స్థానాన్ని ఎవరూ పూడ్చలేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. Heartbroken!! RIP SP Balu garu. pic.twitter.com/YTgZEBdvo9 — Chiranjeevi Konidela (@KChiruTweets) September 25, 2020 గాన గంధర్వుడు ఇక లేరు Legendary Singer SP Balasubrahmanyam breathed his last at 1:04 PM. Great loss to the Music World. Condolences to #SPB gari family and friends #RIPSPB pic.twitter.com/8S5hcsh6Uz — BARaju (@baraju_SuperHit) September 25, 2020 As the memories and conversations with Balu Garu come flooding back so do the tears... I still remember the call I got from him after my film Annamayya🙏He was such a unsaid integrable part of my life… దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా దాచుకో ! #ripspb 🙏 pic.twitter.com/pK8jYS5ONs — Nagarjuna Akkineni (@iamnagarjuna) September 25, 2020 ‘ఆగిపోయింది మీ గుండె మాత్రమే. మీ గొంతు కాదు. మీరెప్పుడు మాతోనే ఉన్నారు. ఉంటారు.’ - హరీష్ శంకర్ ‘నా కంట్లో కన్నీళ్లు ఆగడం లేదు.. మిమ్మల్ని మి్ అవుతున్నాం మామా’.. - తమన్ ‘తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ, పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రంగా కలచివేసింది. ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే.’ - జూ. ఎన్టీఆర్ నమ్మలేకపోతున్నాను బాల సుబ్రహ్మణ్యం మన మధ్య లేరు అన్న వార్తను నమ్మలేకపోతున్నాను. మీ ఆత్మకు శాంతి చేకురాలి. మీ పాటలు చిరస్మరణీయం, బాలు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. -మహేష్ బాబు వైజాగ్: గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది. తెలుగు జాతి గర్వించదగ్గ గాయకుడు. నాకు మంచి సన్నిహితుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను - కేంద్ర మాజీ మంత్రి టి. సుబ్బరామిరెడ్డి Unable to process the fact that #SPBalasubramaniam garu is no more. Nothing will ever come close to that soulful voice of his. Rest in peace sir. Your legacy will live on. Heartfelt condolences and strength to the family 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) September 25, 2020 அன்னைய்யா S.P.B அவர்களின் குரலின் நிழல் பதிப்பாக பல காலம் வாழ்ந்தது எனக்கு வாய்த்த பேறு. ஏழு தலைமுறைக்கும் அவர் புகழ் வாழும். pic.twitter.com/9P4FGJSL4T — Kamal Haasan (@ikamalhaasan) September 25, 2020 #ripspb ...Devastated pic.twitter.com/EO55pd648u — A.R.Rahman (@arrahman) September 25, 2020 A voice which made us laugh,which made us cry, you’ll live with us forever, my deepest condolences to the family 🙏🏼 you’ll be missed SPB sir pic.twitter.com/iZf9TUy3FQ — Sai Dharam Tej (@IamSaiDharamTej) September 25, 2020 Shri. S. P. Balasubrahmanyam Garu is an integral part of every Indian household. His voice and his contribution to music will always remain eternal. To the legend who gave us songs for every human emotion 🙏 Rest in peace sir. You will forever be missed. pic.twitter.com/CmUNe2JoRF — Ravi Teja (@RaviTeja_offl) September 25, 2020 Rest in peace SPB sir 💔 pic.twitter.com/kEwPxr1dSx — Anupama Parameswaran (@anupamahere) September 25, 2020 🙏🙏🙏😭😭 pic.twitter.com/qSI0zntwrN — Anil Ravipudi (@AnilRavipudi) September 25, 2020 Deeply saddened & heart broken to hear that the legendary singer #SPBalasubrahmanyam garu is no more. Great loss to Indian cinema. May his soul rest in peace 🙏 My deepest condolences to his family! Sir you will always be in our hearts and souls 🙏#ripspb pic.twitter.com/EbpL0yjvki — MM*🙏🏻❤️ (@HeroManoj1) September 25, 2020 He was not just a singer. He was a performer. It felt as if he was born to entertain the world with his expressions and his music. A great loss for our industry. Gone to soon. May his soul RIP . #balasubramanyam ji — Hansika (@ihansika) September 25, 2020 Extremely sad to hear the news of SP Balasubramaniam Garu’s passing. We have lost a legend today. I’ve had the privilege to work with him in some of my best movies like Prema and Pavitra Bandham. Your legacy will live on Sir! My heartfelt condolences to the family. RIP🙏 #RIPSPB pic.twitter.com/NjjcdSg2l1 — Venkatesh Daggubati (@VenkyMama) September 25, 2020 -
వేదాంతం రాఘవయ్య
హీరోగా పలు సినిమాలు చేశారు సునీల్. ఇటీవలే మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపించారు. మరోసారి హీరోగా ఓ సినిమా కమిటయ్యారు. ‘వేదాంతం రాఘవయ్య’ అనే చిత్రంలో హీరోగా కనిపించనున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ సంస్థపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ‘గద్దలకొండ గణేశ్’ చిత్రాన్ని ఈ బ్యానరే నిర్మించింది. ఆ అనుబంధంతో ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు హరీష్. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో ఇంకా ప్రకటించలేదు. -
స్వప్నాలికి హరీష్ శంకర్ ప్రశంసలు..
పుణె : చదువుకోవాలన్న ఆసక్తిగల ఎంతో మంది ప్రతిభావంతులు వివిధ కారణాలతో తమ చదువుకు దూరమవుతున్నారు. అలా తమ చెల్లి భవిష్యత్తు కావొద్దని ఆలోచించిన సోదరులు తన విద్యను కొనసాగించడం కోసం ఓ వినూత్న ఆలోచన చేశారు. వివరాలు.. సింధుదుర్గ్ జిల్లా కంకవ్లి మండలంలోని డారిస్టే గ్రామానికి చెందిన స్వప్నాలి సుతార్ అనే యువతి ఇంటర్లో 98 శాతం మార్కులు సాధించింది. భవిష్యత్తులో వెటర్నరీ డాక్టర్ కావాలనుకున్న స్వప్నాలి ప్రస్తుతం ఎంబీబీఎస్‌కు సన్నద్దమవుతోంది. అయితే ఆమె నివసించే ప్రాంతం మారుమూల గ్రామం అయినందున ఇంటర్నెట్ సదుపాయం లేదు. దీంతో తనకు ప్రస్తుతం జరుగుతున్న ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేకపోతుంది. ఇది చూసి చలించి పోయిన యువతి సోదరులు ఇంటర్నెట్ సిగ్నల్స్ కోసం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ పైన ఒక షెడ్ నిర్మించారు. (డిజిటల్ అంతరాలు అధిగమించాలి) స్వప్నాలి తన కుటుంబం అండతో రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొండమీద ఉన్న షెడ్ వద్దకు వెళ్లి చదువుకుంటోంది. అలాగే ఆన్లైన్ క్లాస్‌లకు హాజరవుతోంది. ఇక దీనిని స్థానిక మీడియా ప్రచురించడంతో ఆమెకు సాయం చేసేందుకు అనేక మంది ముందుకు వచ్చారు. ఓ వ్యక్తి ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేయగా టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ రీట్వీట్ చేశారు. అంతేగాక ఎమ్మెల్యే నితేష్ రాణే.. ఆమె హాస్టల్ ఫీజు రూ .50 వేలు చెల్లించాడు. దీనిపై స్పందించిన పలువురు ‘తన కలల వైపు ప్రయాణించేందుకు అడ్డంకులు ఆపలేవని స్వప్నాలి పట్టుదలతో నిరూపించింది. ఆమెను చూస్తుంటే..మరో రాజ్యాంగాన్ని రాస్తున్నట్లు కనిపిస్తుంది’ అంటూ యువతిని ప్రశంసిస్తున్నారు. (ఆన్లైన్ విద్య కష్టంగా ఉంది) 12 తరగతిలో 98% స్కోర్ చేసి సునీత ఇప్పుడు ఎంబిబిఎస్ కోసం సిద్ధమవుతోంది. కానీ ఆమె గ్రామానికి ఆన్లైన్ తరగతులకు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. ఫోన్ లో కూడా ఇంటర్నెట్ సిగ్నల్ రాదు, కాబట్టి ఆమె సోదరులు ఆమె కోసం గ్రామానికి దగ్గరలో ఒక కొండపై ఒక షెడ్ నిర్మించారు 1/2 pic.twitter.com/4CtPQcUvJb — Naga Kishore (@nagakishore981) August 23, 2020 -
ఎట్టకేలకు మెత్తబడ్డ బండ్ల గణేష్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాకు అవకాశమిచ్చినా తనను గుర్తుకు పెట్టుకోలేదని కొద్ది రోజుల కిత్రం దర్శకుడు హరీష్ శంకర్‌పై విమర్శలకు దిగిన నిర్మాత బండ్ల గణేష్ ఎట్టకేలకు మెత్తబడ్డారు. ఈ చిన్న జీవితంలో పోట్లాటలు, శత్రుత్వాలు అవసరం లేదని ట్విటర్లో పేర్కొన్నారు. హరీష్ తనకు కాల్ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. తనకు కాల్ చేసి మట్లాడినందుకు ఆయనకు బండ్ల గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ ఇద్దరు దర్శకనిర్మాతల కెరీర్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘గబ్బర్‌సింగ్’ విడుదలై 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. ఆ సినిమాకు పని చేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్తూ హరీష్ శంకర్ ట్విటర్లో ఓ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: గణేష్-హరీష్‌ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు) అయితే, అందులో నిర్మాత బండ్ల గణేష్ పేరు ప్రస్తావించలేదు. నిజానికి ఆయన మరిచిపోయారో లేక కావాలనే చెప్పలేదో తెలియదు కాని ఈ విషయంపై బండ్ల గణేష్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ‘అది ఆయన సంస్కారం. అంతకన్నా ఏం చెప్పను. ఆయన రీమేక్‌లు మాత్రమే చేయగలరు. స్ట్రయిట్ సినిమా తీసి హిట్ చేసి చూపించమనండి. ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా. హరీష్ శంకర్ అనే వ్యక్తికి పవన్ కల్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించింది నేను. ఎన్టీఆర్ సినిమా ఇస్తానన్న ఓ నిర్మాత ఆ సినిమా ఇవ్వకపోవడంతో డిప్రెషన్ లో వుంటే పిలిచి అవకాశం వచ్చేలా చేసింది నేను. గబ్బర్ సింగ్ కూడా అంత పెద్ద హిట్ అయ్యిందంటే అందులో పవన్ సలహాలు చాలా ఉన్నాయి’అని బండ్ల గణేష్ గతంలో ఏకి పారేశాడు. (పొరపాటు జరిగింది.. క్షమించడంటూ బండ్ల ట్వీట్) @harish2you thank you so much brother for your concern. Felt really happy after your call , this is a small life no fights no enemies.🙏 — BANDLA GANESH. (@ganeshbandla) July 26, 2020 -
జగన్నాథమ్ వచ్చి మూడేళ్లయింది
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన చితం ‘డీజే(దువ్వాడ జగన్నాథమ్)’. క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్రం విడుదలై నేటికి మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా బన్ని అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ చిత్ర బృందం కొన్ని స్టిల్స్‌ను విడుదల చేసింది. బన్ని పోలీస్ గెటప్‌లో, హూజా హెగ్డే పంచెకట్టులో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. స్టిల్స్ అదిరిపోవడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. (కరోనా ఎఫెక్ట్.. ‘పుష్ప’ అప్డేట్!) ఇక బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రంలో బన్ని కారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. బన్నీ మార్క్ కామెడీ, యాక్షన్‌తో పాటు హరీశ్ శంకర్ మాస్ కమర్షియల్ టేకింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అగ్రహారంలో బ్రాహ్మణుడిగా, స్టైలీష్ కిల్లర్‌గా రెండు డిఫరెంట్ పాత్రల్లోనూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బ్రాహ్మణ కుర్రాడిగా బన్నీ చెప్పిన డైలాగ్‌లు సూపరో సూపరస్య సూపర్భ్యః. బడిలో గుడిలో పాట విషయంలో వచ్చిన వివాదాలు కూడా సినిమాకు భారీ ప్రచారాన్ని తెచ్చిపెట్టాయి. (పెళ్లెప్పుడు బాబాయ్ : అల్లు అయాన్) పంచెకట్టులో పద్దతిగా కనిపించినా.. మాస్ మసాలా సీన్స్ లోనూ ఇరగదీశాడు. హీరోయిన్ పూజ హెగ్డే గ్లామర్ షో.. రావు రమేశ్ విలనిజం.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇలా అన్ని కలగలిపి ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ చిత్రం విడుదలై మూడేళ్లు అవుతున్నా టీవీల్లో, డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ‘డీజే’కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్‌లో హిందీ డబ్బింగ్ వర్షన్లో విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డులను కొల్లగొట్టింది. ఇక ప్రస్తుతం బన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శక్తత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు హరీశ్ శంకర్ పవన్ కల్యాణ్ సినిమాతో పాటు మరో సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. I’m indebted to you for all ur support and dedication.. Sir.. @alluarjun 🙏🙏especially for making my 2nd 20cr+ movie in Nizam, #DJ is always a special film which gave me special friends Like @hegdepooja , @DoP_Bose Million thanks to @ThisIsDSP & @SVC_official https://t.co/Scad3w9xdi — Harish Shankar .S (@harish2you) June 23, 2020 -
హరీశ్ మరో చిత్రం.. పవన్ ఫ్యాన్స్‌కు డౌట్
‘గద్దలకొండ గణేష్’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు క్రేజీ డైరెక్టర్ హరీశ్ శంకర్. తాజాగా ఆయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ఓ చిత్రం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హరీశ్ కాంబినేషన్లో వస్తున్న పవన్ 28వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే కథ, స్క్రిప్ట్‌ను సిద్దం చేసిన దర్శకబృందం ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతోంది. అంతేకాకుండా లాక్డౌన్ అనంతరం నిర్వీరామంగా షూటింగ్ జరిపేందుకు పూర్తి సన్నద్దమవుతోంది చిత్ర బృందం. అయితే ఈ చిత్ర షూటింగ్ ఇంకా ప్రారంభం కాక ముందే మరో చిత్రాన్ని లైన్లో పెట్టారు హరీశ్ శంకర్. ఈ విషయాన్ని మరో ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది. హరీశ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు పేర్కొంది. గతంలో ఇదే నిర్మాణ సంస్థలో వరుణ్ తేజ్ హీరోగా ‘గద్దల కొండ గణేష్’ చిత్రం తెరకెక్కించాడు హరీశ్. దీన్ని ఉద్దేశిస్తూ ‘గద్దల కొండ గణేష్ తర్వాత మరోసారి పవర్ఫుల్ దర్శకుడు హరీశ్‌తో పనిచేసేందుకు ఆనందంగా ఉన్నాం. త్వరలోనే ఇతర వివరాలు తెలియజేస్తామ’ని 14 రీల్స్ ప్లస్ సంస్థ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌తో పవన్ అబిమానుల్లో అనుమానాలు రేకెత్తాయి. పవన్-హరీశ్ సినిమా వాయిదా పడిందా అనే అనుమానంతో ఓ అబిమాని హరీశ్‌కు ట్వీట్ చేశాడు. ‘హరీశ్ అన్నా నువ్వు ఎన్ని సినిమాలైనా చేయ్. కానీ తర్వాతి చిత్రం పవన్‌తోనే ఉండాలి. అది కూడా చరిత్ర సృష్టించాలి’ అని పవర్‌స్టార్ ఫ్యాన్ ట్వీట్ చేశాడు. దీనికి ప్రతి స్పందనగా ‘ తమ్ముడు.. పవర్‌స్టార్ మూవీ స్క్రిప్ట్, మ్యూజిక్ వర్క్స్ జరుగుతున్నాయి. నేను చేసే ఏ ప్రాజెక్ట్ అయినా పవన్ చిత్రం తరువాతే ఉంటుంది. నేను కూడా మీలాగే పవన్‌కు వీరాభిమాని అని మర్చిపోకు’ అంటూ హరీశ్ ట్వీట్ చేశారు. ఇక హరీశ్-పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఎన్ని రికార్డులను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌తో పాటు పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలను పెట్టుకుంది. We are proud and happy to be working with Powerful Director @harish2you garu again after #GaddalakondaGanesh! More details to be announced once the Industry is back to business post lockdown! — 14 Reels Plus (@14ReelsPlus) May 18, 2020 చదవండి: హీరో సూర్య నిర్ణయం: దర్శకుడి ప్రశంసలు 42 ఏళ్ల వయసులో తల్లైన హీరోయిన్ Thammudu..... Power Star movie script work and music work under progress!! What ever may be the new commitment would be only after #PSPK28 👍👍 Nenu kooda mee lanti Fan ani marchipoku!! https://t.co/9PdjDRsKIQ — Harish Shankar .S (@harish2you) May 18, 2020 -
చీల్చి చెండాడటానికి ‘ఫైటే’ అక్కర్లేదు..
ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్‌పై ప్రముఖ నిర్మాత పీవీపీ ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్ ట్యాలెంట్‌ను అభినందించిన పీవీపీ ఎంతో మంది నిర్మాతలు ఆయనతో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘పైనున్న అమ్మవారు కిందున్న కమ్మవారు అంటూ మా బెజవాడ గురించి బ్రహ్మాండంగా చెప్పావు హరీష్. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తియ్యడట. వాడు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు. నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి వెయింటింగ్. తమ్ముడు స్టార్ట్ యూవర్ కుమ్ముడు’ అని పేర్కొన్నారు. పీవీపీ ట్వీట్‌పై స్పందించిన హరీష్.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ 'భాష,భావం' రెండూ నన్ను అలరించాయి. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి "ఫైటే" అక్కర్లేదు... "ట్వీటే" చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం’ అని పేర్కొన్నారు. కాగా, ఇటీవల హరీష్ నైపుణ్యాన్ని తక్కువ చేసేలా నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీవీపీ తన ట్వీట్ ద్వారా హరీష్ ట్యాలెంట్‌ను గుర్తుచేయడంతోపాటు బండ్ల గణేష్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడని అభిమానులు అంటున్నారు. (చదవండి : వర్మ మరో సంచలనం.. క్లైమాక్స్ ట్రైలర్) కాగా, మే 11తో గబ్బర్‌సింగ్ చిత్రం విడుదలై 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రయూనిట్‌ను గుర్తుచేసుకుంటూ హరీష్ శంకర్ ఒక లేఖను విడుదల చేశారు. అయితే అందులో బండ్ల గణేష్ పేరు మిస్సయింది. జరిగిన పోరపాటును గుర్తించిన హరీష్ మరో ట్వీట్లో బండ్ల గణేష్ గురించి ప్రస్తావించారు. అయితే అప్పటికే బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా హరీష్‌పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు. హరీష్‌కు తను అవకాశం ఇవ్వకపోతే సినిమాలే లేవని కామెంట్ చేశాడు. మీ 'భాష,భావం' రెండూ నన్ను అలరించాయ్. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి "ఫైటే" అక్కర్లేదు... "ట్వీటే" చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం.🙏🙏🙏🙏 Thank you for acknowledging my work Sir https://t.co/md0YjnZjqi — Harish Shankar .S (@harish2you) May 18, 2020 -
హరీష్‌పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ దర్శకనిర్మాతుల హరీష్ శంకర్, బండ్ల గణేష్‌ల మధ్య వివాదం ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఇరువురు ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటుండటంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఇద్దరు దర్శకనిర్మాతల కెరీర్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘గబ్బర్‌సింగ్’ విడుదలై 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆ సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ హరీష్ శంకర్ ట్విటర్లో ఓ లేఖ విడుదల చేశారు. అయితే ఆ లెటర్లో నిర్మాత బండ్ల గణేష్ పేరు ప్రస్తావించలేదు. అయితే నిజానికి ఆయన మరిచిపోయారో లేక కావాలనే చెప్పలేదో తెలియదు కాని.. దీనిపై బండ్ల గణేష్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ‘అది ఆయన సంస్కారం. అంతకన్నా ఏం చెప్పను. ఆయన రీమేక్‌లు మాత్రమే చేయగలరు. స్ట్రయిట్ సినిమా తీసి హిట్ చేసి చూపించమనండి. ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా. హరీష్ శంకర్ అనే వ్యక్తికి పవన్ కల్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించింది నేను. ఎన్టీఆర్ సినిమా ఇస్తానన్న ఓ నిర్మాత ఆ సినిమా ఇవ్వకపోవడంతో డిప్రెషన్ లో వుంటే పిలిచి అవకాశం వచ్చేలా చేసాను నేను. గబ్బర్ సింగ్ కూడా అంత పెద్ద హిట్ అయ్యిందంటే అందులో పవన్ సలహాలు చాలా ఉన్నాయి. అంతాక్ష్యరి ఎపిసోడ్ పవన్ సలహానే. హీరోయిన్ శృతి హాసన్ ఎంపిక కూడా పవర్‌స్టార్‌దే. అనుకున్న బడ్జెట్లో సినిమా తీయడంలో డైరెక్టర్‌గా హరీష్ విజయం సాధించాడు’ అని ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక బండ్ల గణేష్ వ్యాఖ్యలపై హరీష్ శంకర్ ధీటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. ‘గబ్బర్ సింగ్’ విజయంలో ఎవరి పాత్ర ఏంటిదో అందరికీ తెలుసని తన సన్నిహితుల దగ్గర హరీష్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వివాదం ఎక్కడివరకు వెళుతుందో వేచిచూడాలి. Thanks again for the overwhelming appreciations and celebrations.... 🙏🙏🙏 thanks to all the fans who made this 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/ZVyHrdGASg — Harish Shankar .S (@harish2you) May 11, 2020 చదవండి: భార్యకు విడాకులు.. గాయనితో 9 ఏళ్లుగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కౌశల్ -
పవన్ కల్యాణ్.. ‘ఇప్పుడే మొదలైంది’?
రీఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక ఈ చిత్రం తర్వాత మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవర్ స్టార్. ఏఎమ్ రత్నం నిర్మాణంలో క్రిష్ డైరెక్షన్లో ‘విరూపాక్ష’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తున్నారు.పీరియాడిక జానర్లో తెరకెక్కుత్ను ఈ చ్రితంలో పవన్ క్యారక్టరైజేషన్ రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. క్రిష్ చిత్రం తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ నటించనున్నారు. గబ్బర్‌సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. పవన్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను డైరెక్టర్ సిద్దం చేసి పెట్టుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మలయాళ నటి మానసా రాధాకృష్ణన్ హీరోయిన్గా నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. పవన్-హరీష్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రానికి ‘ఇప్పుడే.. మొదలైంది’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు లీకువీరులు పేర్కొంటున్నారు. గబ్బర్ సింగ్ విడుదలై 8 ఏళ్లు అయిన సందర్భంగా హరీష్ శంకర్ చేసిన ట్వీట్‌తో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఈ ట్వీట్లో ‘ఇప్పుడే మొదలైంది.. మేము మళ్లీ వస్తున్నాం' అని పేర్కొన్నారు. అలాగే, ఆ తర్వాత చేసిన ట్వీట్లలో కూడా ఆ టైటిల్‌ను హైలైట్ చేయడంతో సినిమా పేరు అదే అని అందరూ ఫిక్సయ్యారు. అయితే చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పూర్తి కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తుండగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. చదవండి: ‘జాన్వీ కపూర్’ వెనక ఇంత కథ ఉందా? శ్రీమతితో తొలి సెల్ఫీ.. వైరల్ Thanks again for the overwhelming appreciations and celebrations.... 🙏🙏🙏 thanks to all the fans who made this 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/ZVyHrdGASg — Harish Shankar .S (@harish2you) May 11, 2020 -
దేవిశ్రీ ఫిక్స్.. పవన్ ఫ్యాన్స్‌కు పండగే
పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన 'జల్సా, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలు మ్యూజికల్‌గా ఎంత హిట్ సాదించాయే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంగీత అభిమానులతో పాటు టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా వీరి కాంబినేషన్లో మరో సినిమా రావాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన గబ్బర్ సింగ్ విడుదలై నిన్నటికి ఎనిమిదేళ్లు పూర్తయింది. ఈ సందర్బంగా ఆనాటి మధురస్మ్రుతులను గుర్తు చేసుకుంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ ఆసక్తకిరమైన ట్వీట్ చేశాడు. అంతేకాకుండా తన తరువాతి సినిమాకు సంబంధించిన అప్డేట్ను కూడా అభిమానులతో పంచుకున్నాడు. గద్దలకొండ గణేష్‌తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న హరీష్ శంకర్.. పవర్‌స్టార్‌తో ఓ చిత్రం చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిచనున్నాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ హరీష్ స్వయంగా ప్రకటించాడు. తను దర్శకత్వం వహించబోతున్న పవన్ 28వ చిత్రానికి దేవిశ్రీనే మ్యూజిక్ అందించనున్నాడని ఈ క్రేజీ డైరెక్టర్ ప్రకటించాడు. దీంతో హరీష్-పవన్-దేవిశ్రీ కాంబినేషన్లో రాబోయే చిత్రం గబ్బర్ సింగ్‌కు మించి ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం తర్వాత క్రిష్ డైరెక్షన్లో విరూపాక్ష (ప్రచారంలో ఉన్న టైటిల్) చేయనున్న విషయం తెలిసిందే. ఇక దర్శకుడు హరీష్ ప్రస్తుతం పవన్ సినిమా కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాడు. It is a wonderful day. As enrgetic as the release day 8 years ago. What better day to announce that we are coming back together to recreate the same musical energy again. @ThisisDSP will be scoring music for #PSPK28. We are coming again Ippude modalaindi.... pic.twitter.com/hXTA0cPDXW — Harish Shankar .S (@harish2you) May 11, 2020 చదవండి: దిల్ వాకిట్లో తేజస్విని కాబోయే తల్లికి శుభాకాంక్షలు! -
అమ్మకి అమ్లెట్ వేసిన డీఎస్పీ..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్లో ‘బి ది రియల్ మ్యాన్’ చాలెంజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఇంటి పనుల్లో ఆడవాళ్లకు సాయం చేయడం ద్వారా ఈ చాలెంజ్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. తాజాగా దర్శకుడు సుకుమార్ నుంచి ఈ చాలెంజ్‌ను స్వీకరించిన.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇంటి పనుల్లో తన తల్లికి సాయం అందించాడు. ఇంటిని శుభ్రం చేయడంతో పాటుగా తన తల్లికి అమ్లెట్ వేసి పెట్టాడు. అంతేకాకుండా ప్లేట్ కూడా శుభ్రం చేశాడు. చివరిగా తన తండ్రి ఫొటో వద్ద నివాళులర్పించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన డీఎస్పీ.. మనల్ని రియల్ మ్యాన్‌గా తయారు చేస్తున్న ప్రతి ఒక్క తల్లికి దీనిని అంకితం ఇస్తున్నట్టుగా చెప్పారు. అలాగే ఈ చాలెంజ్‌ను ముందకు తీసుకెళ్లాల్సిందిగా హీరోలు అల్లు అర్జున్, యష్, కార్తి, దర్శకుడు హరీష్ శంకర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ను డీఎస్పీ కోరారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, సందీప్‌రెడ్డి వంగల మాదిరి వినోదాన్ని జోడించే ప్రయత్నం చేశానని చెప్పారు. ఈ వీడియోలో తొలుత బి ది రియల్ మ్యాన్ చాలెంజ్ చేసిన సినీ ప్రముఖల క్లిప్స్ చూపించారు. చదవండి : జ్యోతిక వ్యాఖ్యలను సమర్థించిన సూర్య.. -
పవన్‌తో మరో సినిమా.. మళ్లీ టాప్‌లోకి?
అందం, అభినయంతో దశాబ్దానికిపైగా కుర్రకారు మనసుదోచుకుని వారి డ్రీమ్ గాళ్ అనిపించుకుంది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. అగ్రహీరోలతో సినిమాలు, వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. సీన్‌కట్‌చేస్తే కుర్ర హీరోయిన్లు రావడం, సినిమా అవకాశాలు తగ్గడంతో రేసులో కొద్దిగా వెనకబడింది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కాజల్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చినట్టు కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’రూపంలో అనుకోని అవకాశం దక్కించుకున్న కాజల్.. మరో బంపర్ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘వకీల్ సాబ్’తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. వెణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరకుంది. ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగానే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టారు పవన్. విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్, గబ్బర్‌సింగ్‌తో భారీ విజయాన్ని అందించిన హరీష్ శంకర్ల సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర లేటేస్ట్ అప్డేట్ అభిమానుల్ని అలరిస్తోంది. పవన్-హరీష్ కాంబినేషన్లో వస్తోన్న సినిమాలో హీరోయిన్ ఎవరనేదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. పూజా హెగ్డే, లావణ్య త్రిపాఠిల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్‌ను చిత్ర బృందం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాజల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అనధికారిక సమాచారం. అయితే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందట. ప్రధాన కథానాయికగా కాజల్‌ను ఎంపిక చేశారని, మరో హీరోయిన్ ఎవరనేదానిపై దర్శకుడు ఇంకా స్పష్టతకు రాలేదని తెలుస్తోంది. ఇక ఆచార్య, పవన్ సినిమాతో కాజల్ మళ్లీ టాప్ రేసులోకి రావడం పక్కా అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: బాలయ్య సినిమాలో లేడీ విలన్? నా మనసులో కొందరు ఉన్నారు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు’
సినిమా షూటింగ్‌లతో నిరంతరం బిజీగా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడనే విషయం తెలిసిందే. షూటింగ్ ప్రదేశాలకు కూడా తారక్ అప్పుడప్పుడు పిల్లలను తీసుకొస్తుంటాడు. తాజాగా తన కుటుంబంతో కలిసి హోలీ జరుపుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘అందరికీ హోలీ శుభాకాంక్షలు’ అంటూ భార్య ప్రణతి, ఇద్దరు కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి ముఖానికి రంగులు చల్లుకున్న ఫోటోతో ట్వీట్ చేశాడు. (ఆర్ఆర్ఆర్ టైటిల్ ఇదే..) ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతుండంతో ఈ ఫోటోను చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అలాగే ఎన్టీఆర్‌కు హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా దీనిపై టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించారు. ఎన్టీఆర్ చిన్న కొడుకును ఉద్ధేశించి ‘చిన్నవాడు కెమెరా వైపు చూస్తున్న విధానం ఏదో చెబుతుంది.. వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు. లిటిల్ టైగర్.. వస్తున్నాడు’. అంటూ రీట్వీట్ చేశాడు. (ఆర్ఆర్ఆర్తో కేజీఎఫ్ 2 ఢీ : యష్ వివరణ) ఇక తారక్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్, అలియాభట్, ఒలియా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీకరణ అయిపోయిన వెంటనే తారక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తారక్‌కు ఇది 30వ సినిమా కావడం విశేషం. (యంగ్ టైగర్ అభిమానులకు గుడ్ న్యూస్!) The way younger one is looking at camera says something …… odilithe ippude dookeselaa unnadu…………… 👌👌👌 https://t.co/k6TDsPbd5X — Harish Shankar .S (@harish2you) March 10, 2020 Little Tigerrrrrrr❤️❤️❤️❤️❤️ on the wayyy!!!!! — Harish Shankar .S (@harish2you) March 10, 2020 -
నా మూడేళ్ల కల ఇది
రాహుల్, త్రిష్నా ముఖర్జీ జంటగా నటించిన చిత్రం ‘మధ’. ఇందిరా బసవ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీవిద్య దర్శకురాలు. ఈ నెల 13న విడుదలవుతున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘యంగ్ ఏజ్‌లో అందరూ డబ్బులు పెట్టి సినిమా చూస్తే ఈ చిత్రదర్శకురాలు శ్రీదివ్య మాత్రం డబ్బులు పెట్టి సినిమా తీశారు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఆమెలో చాలా ప్యాషన్ కనిపించింది’’ అన్నారు. నవదీప్ మాట్లాడుతూ– ‘‘శ్రీవిద్య నాకు ఫేస్బుక్ ఫ్రెండ్. నేనీ సినిమా చూశాను. నెక్ట్స్ లెవల్ మూవీ అని ఓ ప్రేక్షకునిగా చెప్పగలను. ఈ సినిమాను ఓ పెద్ద హీరోయిన్‌తో చేయమంటే తన టీమ్ కోసం ఆమె ఒప్పుకోలేదు’’ అన్నారు. శ్రీవిద్య మాట్లాడుతూ– ‘‘నా మూడేళ్ల కల ఇది. ‘మధ’ ప్యారలల్ మూవీ అనొచ్చు. స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలతో తీసిన ఈ చిత్రం ప్రతి అమ్మాయికి నచ్చుతుంది’’ అన్నారు. ‘‘శ్రీవిద్య కాన్సెప్ట్ చెప్పగానే, సినిమాలో ఉన్న అన్ని ఎమోషన్స్‌కి కనెక్ట్ అయ్యాను అన్నారు’’ త్రిష్నా. -
అర్ధరాత్రి శబ్ధాలు భరించలేకున్నా: హరీష్ శంకర్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తాను నివాసం ఉంటోన్న జూబ్లీ ఎన్క్లేవ్ రెసిడెన్సీకి సమీపంలో అర్ధరాత్రి సమయంలో భవన నిర్మాణ పనులు చేపడుతున్నారని, దానివలన భారీ శబ్దాలు వస్తుండటంతో ఇబ్బందిగా ఉందంటూ ఆదివారం రాత్రి ఓ ట్వీట్ చేశారు. 'జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సిటీ పోలీస్ జనావాస ప్రాంతాల్లో అర్ధరాత్రి పెద్ద శబ్ధాలతో భవన నిర్మాణాలు చేపట్టడానికి మీరు అనుమతిచ్చారా..? న్యాయపరంగా ఫిర్యాదు చేయడానికంటే ముందు మీ సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఆదేశాలను నేను పాటిస్తాను' అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. దీనికి వెంటనే స్పందించిన పోలీసులు ఆయనకు ఫోన్ చేసి అడ్రస్‌ను అడిగి తెలుసుకుని పెట్రోలింగ్ సిబ్బందిని పంపారు. భవన నిర్మాణ పనులు నిలిపేలా చేశారు. పోలీసుల స్పందన పట్ల హరీశ్ శంకర్ హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు మరో ట్వీట్ చేశారు. ‘నేను నమ్మలేకపోతున్నాను. కొన్ని నిమిషాల్లోనే ఆ శబ్దాలు ఆగిపోయాయి' అని పేర్కొన్నారు. జూబ్లీ ఎన్క్లేవ్ రెసీడెన్సీలో నివాసముంటున్న వారందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరని, ఎప్పుడైనా రాగలరని నిరూపించారని అన్నారు. తమ సమస్య పట్ల వెంటనే స్పందించి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని, ప్రజలు మరింత బాధ్యతగా మెలిగేలా చేశారని అన్నారు. I am indebted to @cyberabadpolice @GHMCOnline @hydcitypolice for their immediate action against my request..... Thank you so much this how you restore our trust and make us to be more responsible cirizen... 🙏🙏🙏 — Harish Shankar .S (@harish2you) February 16, 2020 Cant believe this with in minutes the noise has been stopped...... big thanks from entire jubli enclave residents .... meeru taluchukunte emainaa cheyagalaru eppudainaa raagalaru ani niroopinchaaru 🙏🙏🙏 https://t.co/1OF8UrqL9E — Harish Shankar .S (@harish2you) February 16, 2020 -
మెగా ఆఫర్
చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం హరీష్ శంకర్‌కి వచ్చిందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. త్వరలోనే చిరంజీవి – హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు హరీష్. ఆ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్‌తో సినిమా పూర్తయ్యాక చిరంజీవితో ఓ సినిమా తెరకెక్కిస్తారట హరీష్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఆ తర్వాత ‘లూసీఫర్’‡రీమేక్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారాయన. మరి.. చిరంజీవి–హరీష్ కాంబినేషన్ సినిమా ఎప్పుడు? అంటే ప్రస్తుతానికి సమాధానం దొరకని ప్రశ్నే. -
జోడీ కుదిరిందా?
‘గబ్బర్‌సింగ్’లో తొలిసారి పవన్‌కల్యాణ్‌తో జోడీ కట్టారు శ్రుతీహాసన్. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ‘కాటమరాయుడు’ సినిమాలో మళ్లీ జంటగా నటించారు. తాజాగా మరోసారి జంటగా కనిపించడానికి రెడీ అవుతున్నారట పవన్ కల్యాణ్, శ్రుతీహాసన్. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కల్యాణ్‌ని మరోసారి డైరెక్ట్ చేస్తున్నారు దర్శకుడు హరీష్ శంకర్. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఇందులో హీరోయిన్గా శ్రుతీహాసన్‌ని తీసుకోవాలని భావిస్తున్నారట చిత్రబృందం. -
‘విధి విలాసం’ చిత్రం ప్రారంభం
-
మూడు కోణాలు
అరుణ్ ఆదిత్, శివాత్మిక రాజశేఖర్ జంటగా దుర్గా నరేష్ గుత్తా దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘విధి విలాసం’. ఎస్.కె.ఎస్ క్రియేషన్స్ పతాకంపై శివ దినేష్ రాహుల్ అయ్యర్ నకరకంటి నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభం అయింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి డైరెక్టర్ హరీష్ శంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు ప్రవీణ్ సత్తారు క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ దశరథ్ గౌరవ దర్శకత్వం వహించారు. నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. దుర్గా నరేష్ గుత్తా మాట్లాడుతూ– ‘‘ఆదిత్ నాకు మంచి సన్నిహితుడు. తనతో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. నటనకి ఆస్కారం ఉన్న పాత్రలో శివాత్మిక నటిస్తున్నారు. రామాయణం ఎలాగైతే మూడు కోణాల్లో ఉంటుందో మా సినిమా కథ కూడా అలాగే ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ కథ విన్నప్పుడే ఆసక్తిగా అనిపించింది. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శివాత్మిక రాజశేఖర్. ‘‘ఫిబ్రవరి మొదటి వారంలో రెగ్యులర్ షూట్ ప్రారంభిస్తాం. వేసవిలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు శివ దినేష్ రాహుల్ అయ్యర్ నకరకంటి. ‘‘దశరథ్ గారి దగ్గర దుర్గ నరేష్ దర్శకత్వ శాఖలో పనిచేశారు.. మంచి ప్రతిభావంతుడు’’ అన్నారు అరుణ్ ఆదిత్. కోట శ్రీనివాసరావు, ఇంద్రజ, జయప్రకాశ్, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, తాగుబోతు రమేష్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.వి. విశ్వేశ్వర్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ మాచర్ల. -
తర్వాత ఏం జరుగుతుంది?
‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయమయ్యారు తమిళ యువ నటుడు అధర్వ మురళి. ఆయన నటించిన తమిళ చిత్రం ‘బూమరాంగ్’ను అదే టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్. ఆర్. కణ్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మేఘా ఆకాశ్, ఇందుజా రవిచంద్రన్ కథానాయికలు. రేపు(3న) విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘అధర్వ నాకు ఇష్టమైన హీరో. చాలా ప్యాషనేట్ హీరో.. యువత తలుచుకుంటే ఎలాంటి మార్పు తీసుకురావచ్చనే సందేశాన్ని ఈ చిత్రంలో చక్కగా చెప్పారు’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు మా సినిమాలో ఉంటాయి. తర్వాత ఏం జరుగుతుందోనని ఊహించలేని విధంగా దర్శకుడు స్క్రీన్‌ప్లే రాశారు’’ అన్నారు నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్. -
దిశ కేసు: చాటింపు వేసి చెప్పండి
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితులను పోలీసులు శుక్రవారం ఎన్కౌంటర్ చేశారు. దీనిపై టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, సీపీ సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. సజ్జనార్ పది కాలాల పాటు చల్లగా ఉండాలంటూ కామెంట్ చేశాడు. ‘సినిమాకు సంబంధించిన ట్రైలర్లు, టీజర్లు పట్టించుకోకపోయినా పర్లేదు. కానీ దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ వార్తను విస్తృతంగా ప్రచారం చేయండి. అందరికీ తెలిసేలా చాటింపు వేయండి’ అని అభిమానులను కోరాడు. కాగా నవంబర్ 28న వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యంత పాశవికంగా హత్యాచారం జరిగింది. దీనికి కారణమైన నిందితులను వెంటనే ఉరితీయాలంటూ దేశంలో పెద్దఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకుని కేసు రీకన్‌స్టక్షన్ చేస్తుండగా పోలీసుల ఆయుధాలు తీసుకొని పారిపోవడానికి యత్నించారు. దీంతో పోలీసులు నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేశారు. Maa trailers teasers like cheyalapoyinaa parledhu pls ee encounter news Maatram trending cheyandi...... ILA JARIGINDHI ani chaatimpu veyandi pls...... 🙏🙏🙏🙏 — Harish Shankar .S (@harish2you) December 6, 2019 (చదవండి: దిశను చంపిన ప్రాంతంలోనే ఎన్కౌంటర్) -
‘విజిల్’ ప్రీ రిలీజ్ వేడుక


