పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో పవన్ సినిమా తీయాలని డైరెక్ట్‌ర్ హరీశ్ శంకర్ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ మేరకు పవన్ పుట్టిన రోజున తమ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనుందంటూ ప్రీ లుక్ విడుదల చేశాడు డైరెక్టర్.
కాగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా రేపు ఈ మూవీ నుంచి క్రేజ్ అప్‌డేట్ రాబోతుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. గురువారం(సెప్టెంబర్ 9) 9:45 గంటలకు ఈ మూవీ నుంచి అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఈ అప్‌డేట్ ఎంటో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా సినిమాలో పవన్‌కు సరసన పూజా హెగ్డే నటించనున్నట్లు టాక్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే నెల సెట్స్‌పై రానున్నట్లు తెలుస్తోంది.
Get ready for Next Level Celebrations 💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) September 8, 2021
A POWER PACKED ANNOUNCEMENT will enthrall you tomorrow at 9:45 AM 😎😎@PawanKalyan @harish2you @ThisIsDSP @DoP_Bose #AnandSai @venupro pic.twitter.com/1uTGZpRNUd
Comments
Please login to add a commentAdd a comment