పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండించిన హరీశ్ శంకర్!
సినిమా హీరోలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ పరోక్షంగా ఖండించారు. సినిమాల ప్రభావం ప్రజలపై ఉంటుందని చెప్పడం సరికాదన్నారు. ఒకవేళ అదే నిజమైతే ‘గాంధీ’సినిమా చూసి అందరం మహాత్మ గాంధీలాగే మరిపోవాలన్నారు. తన వరకు అయితే సినిమా అనేది కేవలం వినోదాన్ని పంచడానికే పని కొస్తుందని తనదైన శైలీలో చెప్పుకొచ్చారు.
వినోదం కోసమే సినిమా: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హరీశ్ తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ.. ‘సినిమాల ఎఫెక్ట్ ప్రజలపై కొన్ని గంటలు మాత్రమే పని చేస్తుంది. నిజంగా సినిమా చూసి మనుషులు మారిపోతారంటే.. ‘పుష్ప’ సినిమా చూసిన ప్రతి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. గొడ్డలి పట్టుకొని తిరుపతి వెళ్లి స్మగ్లింగ్ చేయాలి. కానీ అలా చేయట్లేదు కాదా? ఠాగూరు చూసిమా చూసిన తర్వాత లంచం తీసుకోవడం మానేయాలి. కానీ మన ఆఫీసర్లు ఆ పని చేస్తున్నారా? అంతెందుకు ఆస్కార్ అవార్డు గెలిసిన ‘గాంధీ’సినిమా చూసి ప్రతి ఒక్కరు మహాత్మ గాంధీ అయిపోవాలి. అలా అయ్యారా? నటుడు అన్నప్పుడు రకరకాల పాత్రలను చేస్తారు. వారి అంతిమ లక్ష్యం వినోదాన్ని పంచడమే. వారిని చూసి మారిపోతారనేది నేను నమ్మను. నా వరకు సినిమా అనేది వినోదం మాత్రమే. నేను కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే అందిస్తాను’ అని హరీశ్ చెప్పుకొచ్చారు.
పవన్ ఏం అన్నారు?
ఇటీవల బెంగళూరు పర్యటనకు వెళ్లిన పవన్.. అక్కడ మీడియాతో అడవుల సంరక్షణ గురించి మాట్లాడుతూ.. ‘40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవాడు. కానీ ఇప్పుడు హీరోలే అడవును నరికి స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా చూపిస్తున్నారు. ఒక సినిమా వ్యక్తిగా నేను అలాంటి ఎంకరేజ్ చేయను. అలాంటి సినిమాలు బయటకు మంచి మెసేజ్ ఇవ్వలేవు’అన్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ గురించే పవన్ సెటైర్లు వేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment