Mr Bachchan
-
ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం థియేటర్లలో రిలీజైన వాటిలో 'మత్తు వదలరా 2' అనే కామెడీ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మిగిలిన వాటి టాక్ తెలియాల్సి ఉంది. మరోవైపు ఓటీటీలో మాత్రం బోలెడన్ని తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ రిలీజైపోయాయి. ఈ శుక్రవారం ఏకంగా 20 చిత్రాలు పలు ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? వీటిలో చూడాల్సిన సినిమాలేంటి?(ఇదీ చదవండి: ‘మత్తు వదలరా 2’ మూవీ రివ్యూ)మొత్తంగా ఈ వీకెండ్ 25 సినిమాల వరకు ఉన్నాయి. కానీ వీటిలో తలవన్, రఘు తాత, సెక్టార్ 36, టీన్జ్ అనే డబ్బింగ్ బొమ్మలు బాగున్నాయి. మరోవైపు ఆయ్, స్పార్క్ లాంటి స్ట్రెయిట్ చిత్రాలు కూడా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. వీటిలో మీరు ఏది చూసినా సరే ఫుల్ టైమ్పాస్తో పాటు ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. మరి వీటిలో మీరేం చూస్తారు లేదా చూడబోతున్నారు?ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (సెప్టెంబరు 13)అమెజాన్ ప్రైమ్ఔరోన్ మైన్ కహాన్ దమ్ థా - హిందీ సినిమాబ్యాడ్ న్యూజ్ - హిందీ మూవీడ్రీమ్ డీల్స్ - జర్మన్ సిరీస్ఎన్ ఫిన్ - స్పానిష్ సిరీస్ట్రాప్ - ఇంగ్లీష్ సినిమారూపాంతర - కన్నడ మూవీటీన్జ్ - తెలుగు డబ్బింగ్ సినిమానెట్ఫ్లిక్స్సెక్టార్ 36 - తెలుగు డబ్బింగ్ మూవీఆఫీసర్ బ్లాక్ బెల్ట్ - కొరియన్ సినిమాఅగ్లీస్ - ఇంగ్లీష్ మూవీఆయ్ - తెలుగు సినిమామిస్టర్ బచ్చన్ - తెలుగు మూవీజీ5బెర్లిన్ - హిందీ మూవీనునకుళి - తెలుగు డబ్బింగ్ సినిమారఘు తాత - తెలుగు డబ్బింగ్ మూవీహాట్స్టార్గోలీ సోడా రైజింగ్ - తమిళ సిరీస్హౌ టూ డై ఎలోన్ - ఇంగ్లీష్ సిరీస్ఇన్ వోగ్: ద 90స్ - ఇంగ్లీష్ సిరీస్లెగో స్టార్ వార్స్ - ఇంగ్లీష్ సిరీస్ద ఓల్డ్ మ్యాన్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్సన్ నెక్స్ట్స్పార్క్ - తెలుగు సినిమాఆహానన్బన్ ఒరువన్ వంత పిరాగు - తమిళ సినిమాపరాక్రమం - తెలుగు మూవీ (సెప్టెంబరు 14)లయన్స్ గేట్ ప్లేలేట్ నైట్ విత్ ద డెవిల్ - ఇంగ్లీష్ సినిమాసోనీ లివ్తలవన్ - తెలుగు డబ్బింగ్ మూవీ(ఇదీ చదవండి: దేవరకు సెన్సార్ బోర్డ్ షాక్.. ఆ నాలుగు సీన్స్ మార్చాల్సిందే!) -
మరికొద్ది గంటల్లో ఓటీటీకి మిస్టర్ బచ్చన్.. ఎక్కడ చూడాలంటే?
మాస్ మహారాజ రవితేజ, భాగ్యశ్రీ బోర్సో జంటగా నటించిన చిత్రం'మిస్టర్ బచ్చన్'. హరీశ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. ఊహించని ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.అయితే ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఓటీటీ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన మిస్టర్ బచ్చన్.. ఓటీటీ ప్రియులను అలరిస్తుందేమో చూడాలి.అసలు కథేంటంటే..మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఓ నిజాయితీపరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్‌ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్‌ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్‌కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లదనాన్ని బచ్చన్ ఎలా బటయకు తీశాడు? అనేదే మిగతా కథ. -
ఓటీటీలో 'మిస్టర్ బచ్చన్' స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన
మాస్ మహారాజ రవితేజ- హరీశ్ శంకర్ కాంబినేషన్లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా 'మిస్టర్ బచ్చన్'. ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, తాజాగా ఓటీటీ రిలీజ్‌పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. 'మిస్టర్ బచ్చన్' సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, రిలీజ్ తర్వాత మొదటి ఆట నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచింది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే జోడీగా కనిపించారు. సినిమా డిజాస్టర్ టాక్ వచ్చినా పాటలు బాగుండటంతో ఓటీటీలో చూద్దాంలే అనుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ 'మిస్టర్ బచ్చన్' ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్‌ను పంచుకుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.కథేంటంటే..మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఓ నిజాయితీపరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్‌ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్‌ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్‌కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లదనాన్ని బచ్చన్ ఎలా బటయకు తీశాడు? అనేదే మిగతా కథ. -
రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్!
హరీశ్ శంకర్ పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా 'గబ్బర్ సింగ్'. ఎక్కువగా రీమేక్ కథలతో మూవీస్ తీస్తాడనే అపవాదు ఉన్న ఈ దర్శకుడు తీసిన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ బచ్చన్'. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజై ఘోరంగా ఫ్లాప్ అయింది. చాలా నష్టాలొచ్చాయి. ఈ క్రమంలోనే హరీశ్ శంకర్ తన వంతుగా కొంత రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది.ప్రస్తుతానికి రెండు కోట్లు రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చారని, త్వరలో మరి కొంచె వెనక్కి ఇచ్చే అవకాశముందని సమాచారం. ఏదేమైనా ఇలా సినిమా నష్టపోతే ఇలా పారితోషికం వెనక్కి ఇచ్చి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లని ఆదుకోవడం మంచి విషయమే. మరోవైపు ఇదే సినిమాలో హీరోగా రవితేజ నుంచి ఇలాంటి రెస్పాన్స్ రాలేదు.(ఇదీ చదవండి: Bigg Boss 8: చావు వరకు వెళ్లొచ్చా.. ఏడిపించేసిన నాగ మణికంఠ!)'మిస్టర్ బచ్చన్' విషయానికొస్తే.. 2018 హిందీలో వచ్చిన 'రైడ్' అనే మూవీకి రీమేక్‌గా దీన్ని తీశారు. అయితే ఒరిజినల్ స్టోరీ సీరియస్‌గా ఉంటుంది. హరీశ్ శంకర్ మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పి పాటలు, ఫైట్స్ అని అదనంగా జోడించారు. దీంతో మూవీ కాస్త కిచిడి అయిపోయింది. అలానే మరీ ఎక్కువగా హీరోయిన్ భాగ్యశ్రీ అందాలని చూపించడం కూడా అసలు కథని పక్కదారి పట్టించిందనే విమర్శలు వచ్చాయి.ఇకపోతే 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసుకోవచ్చు అనేలా అగ్రిమెంట్ చేసుకున్నారని టాక్. దీనిబట్టి చూస్తే వచ్చే వారం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. లేదంటే వినాయక చవితి కానుకగా ఈ శనివారం నుంచి స్ట్రీమింగ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం) -
హరీశ్ శంకర్ గురించి నేను అలాంటి కామెంట్ చేయలేదు: నిర్మాత
రవితేజ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించిన సినిమా ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్స్ మీడియా బ్యానర్‌పై నిర్మాత టీజీవీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈక్రమంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన క్రిటిసిజం, ఫీడ్‌బ్యాక్‌ని దృష్టిలో పెట్టుకుని ‘మిస్టర్ బచ్చన్’ సినిమా నుంచి 13 నిమిషాల నిడివి తగ్గించారు. అయినా కూడా టికెట్లు మాత్రం తెగలేదు. ఈ సినిమా డిజాస్టర్ కావడానికి డైరెక్టర్ హరీశ్ శంకర్ అని నిర్మాత టీజీవీ విశ్వప్రసాద్ కామెంట్లు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ అంశం గురించి వారిద్దరూ ఒక క్లారిటీ ఇచ్చారు.స్క్రిప్ట్ బలంగా లేదు: టీజీవీ విశ్వప్రసాద్ మిస్టర్ బచ్చన్ సినిమాపై డిజాస్టర్ టాక్ వచ్చిన తర్వాత టీజీ విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సినిమా రిజల్ట్ గురించి ఆయన ఇలా చెప్పారు.' సినిమా స్క్రిప్ట్ మరింత బలంగా ఉండాల్సింది. ఈ విషయంలో మేము మిస్‌ఫైర్ అయ్యాం. కొంత ఎడిట్ చేసింటే బాగుండేది. మిస్టర్ బచ్చన్ సెకండాఫ్ కాస్త నిరాశపరిచింది. అయితే, కొంతమంది సోషల్ మీడియాలో పనికట్టుకుని సినిమాపై తప్పుడు ప్రచారం చేశారు.'అని ఆయన చెప్పారు.టీజీ విశ్వప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలను కొందరు తమకు నచ్చినట్లు ప్రచారం చేసుకున్నారు. సినిమాను హరీశ్ శంకర్ నాశనం చేశాడని విశ్వప్రసాద్ అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా విశ్వప్రసాద్ తన ఎక్స్ పేజీలో రియాక్ట్ అయ్యారు. హరీష్ శంకర్ తనకు మంచి స్నేహితుడని ఆయన పేర్కొన్నారు. హరీశ్ శంకర్ గురించి తాను ఎలాంటి కామెంట్లు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే, తాను అనని మాటలను మీడియా పెద్దవిగా చూపుతూ ప్రచారం చేసిందని చెప్పారు. హరీశ్ శంకర్ సినిమా మేకింగ్ మీద తనకు చాలా నమ్మకం ఉందని మరో సినిమా ఆయనతో కలిసి చేసేందుకు ఎదురుచూస్తున్నట్టుగా రాసుకొచ్చారు.డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా టీజీ విశ్వప్రసాద్ గురించి రియాక్ట్ అయ్యారు.. మీ సపోర్ట్ గురించి నాకు తెలుసు సార్.. అయితే, మీడియాలో మీరు అన్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం ఉందని నేను ఒక్క క్షణం కూడా నమ్మలేదు. మీతో కలిసి చేయబోయే తర్వాతి సినిమా కోసం ఎదురుచూస్తున్నా.. మంచి విజయాన్ని తప్పకుండా అందుకుంటాం. అయితే, మిస్టర్ బచ్చన్ విడుదల సమయంలో మీడియాపై హరీశ్ శంకర్ చేసిన కామెంట్ల వల్లే సినిమాపై వేగంగా నెగిటివ్ టాక్ వ్యాప్తికి కారణమైందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. -
'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?
రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ బచ్చన్'. అప్పుడెప్పుడో 2018లో హిందీలో వచ్చిన 'రైడ్' అనే చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని దీన్ని తీశారు. కాకపోతే కమర్షియల్ హంగులు అని చెప్పి అసలు కథని సైడ్ చేయడంతో మూవీ ఫెయిలైంది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైతే తొలిరోజే నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.(ఇదీ చదవండి: హీరోయిన్ ప్రణీత బేబీ షవర్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్)రిలీజ్‌కి ముందు దర్శకుడు హరీశ్ శంకర్ హైప్ పెంచేలా కామెంట్స్ చేశాడు. దీంతో సినిమాపై ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఘోరమైన రిజల్ట్ కనిపించింది. హీరోయిన్ తప్పితే చూడటానికి సరైన కంటెంట్ లేదని ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. అలానే సినిమాకు భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ పండితుల అంచనా. ఈ క్రమంలోనే అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది.'మిస్టర్ బచ్చన్' డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమా ఫలితం పాజిటివ్‌గా వచ్చుంటే కాస్త లేటుగా ఆరు వారాల్లో స్ట్రీమింగ్కి వచ్చి ఉండేదేమో? కానీ రిజల్ట్ తేడా కొట్టేయడంతో థియేటర్లలో రిలీజైన నెలలోనే ఓటీటీలోకి తీసుకొచ్చేయబోతున్నారని తెలుస్తోంది. అంటే వినాయక చవితికి సెప్టెంబరు 6 లేదా 7న లేదంటే ఆ తర్వాత వారంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: షూటింగ్ లో గాయపడ్డ రవితేజ.. ఆరు వారాలు విశ్రాంతి) -
రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేస్తున్న హరీశ్ శంకర్!
మిస్టర్ బచ్చన్.. ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. పాత రవితేజను చూస్తారంటూ ఊదరగొట్టిన డైరెక్టర్ హరీశ్ శంకర్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఇప్పటివరకు కేవలం రూ.12.6 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఫ్లాప్ దిశగా పయనిస్తోంది.దీంతో హరీశ్ శంకర్ ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడట! తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగిచ్చేయాలని ఫిక్స్ అయ్యాన్నాడంటూ ఓ వార్త ఫిల్మీదునియాలో వైరల్‌గా మారింది. మిస్టర్ బచ్చన్ పరాజయానికి బాధ్యత వహిస్తూ తనకు ఇచ్చిన రూ.15 కోట్లను నిర్మాతకు తిరిగిచ్చేస్తాడట! మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది.సినిమా విషయానికి వస్తే.. ఉత్తర భారతదేశంలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా మిస్టర్ బచ్చన్ తెరకెక్కింది. రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు. -
ఆ దర్శకులపై లేని అటాక్ నా ఒక్కడి మీదే ఎందుకు?: హరీశ్ శంకర్
ఆగస్టు 15 వీకెండ్లో రిలీజైన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు పెద్దగా పాజిటివ్ టాక్ రాలేదు. మరీ ముఖ్యంగా దర్శకుడు హరీశ్ శంకర్‌పై ఘోరమైన విమర్శలు వస్తున్నాయి. రిలీజ్‌కి ముందు మాట్లాడిన దానికి.. మూవీలో కంటెంట్‌కి ఏ మాత్రం సంబంధం లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫ్యాన్స్ మీట్ పెట్టిన హరీశ్ శంకర్.. తనపై ట్రోల్స్ గురించి స్పందించాడు.(ఇదీ చదవండి: సూర్య vs రజినీకాంత్.. కలెక్షన్స్ దెబ్బ తీసే పోటీ!)రవితేజ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల దర్శకులపై లేని అటాక్ తనపైనే జరుగుతోందని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చాడు. కావాలనే టార్గెట్ చేసి మరీ తనని విమర్శిస్తున్నారని అన్నాడు. 'ఇంతకు ముందొచ్చిన రామారావ్ ఆన్ డ్యూటీ, రావణాసుర, ఖిలాడి, ఈగల్ సినిమాలు కూడా కొంచెం డిసప్పాయింట్ చేశాయి. కానీ ఆ డైరెక్టర్స్ మీద లేని అటాక్ నా ఒక్కడి మీదే ఉంది. ఎందుకంటే వ్యక్తిగత అజెండాతో నన్ను టార్గెట్ చేశారని నాకు అనిపిస్తోంది' అని హరీశ్ శంకర్ అన్నాడు.అయితే హరీశ్ శంకర్ తాజా కామెంట్స్‌పై కూడా నెటిజన్లు రెచ్చిపోతున్నారు. మిగతా దర్శకులు ఇలా రిలీజ్‌కి ఇంటర్వ్యూల్లో మాట్లాడలేదని, వాళ్లెవరు రీమేక్స్ చేయలేదని తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా హరీశ్ శంకర్.. తాను తీసిన సినిమా కంటే చేస్తున్న వ్యాఖ్యల వల్లే వైరల్ అవుతుండటం ఇక్కడ విచిత్రమైన విషయం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
పొరబడ్డారు.. తను నా భార్య కాదు: హరీశ్ శంకర్
రీసెంట్గా రిలీజైన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా విడుదలకు ముందు దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడిన దానికి.. మూవీ వచ్చిన తర్వాత అసలు పొంతనే లేదు. దీంతో ట్రోలర్స్ రెచ్చిపోయారు. సినిమాలో కంటెంట్ పట్ల విమర్శలు చేస్తున్నారు. మరోవైపు హరీశ్ శంకర్ భార్య ఈమెనే అని ఓ నటి ఫొటో వైరల్ అవుతోంది. తాజాగా ఈ విషయమై హరీశ్ శంకర్ క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన హీరో మోహన్ లాల్!)చాన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న హరీశ్ శంకర్.. 'గబ్బర్ సింగ్' సినిమాతో బోలెడంత పేరు తెచ్చుకున్నారు. కాకపోతే దాన్ని కొనసాగించే క్రమంలో తప్పటడుగులు వేస్తున్నారు. అలాంటి తప్పిదమే తాజాగా రిలీజైన 'మిస్టర్ బచ్చన్'. సరే దీని గురించి వదిలేస్తే గతంలో ఇదే రవితేజతో 'మిరపకాయ్' అనే మూవీ చేశారు. ఇందులో హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ పక్కన ఓ అమ్మాయి నటించింది. అయితే ఈమెనే హరీశ్ శంకర్ భార్యని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపించాయి.తాజాగా ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో హరీశ్ శంకర్‌ని అడగ్గా.. తన భార్య పేరు, ఆ అమ్మాయి పేరు స్నిగ్ద అని అందుకే చాలామంది పొరబడుతున్నారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి అమెరికాలో జాబ్ చేసుకుంటోందని అన్నాడు. దీంతో ఓ క్లారిటీ వచ్చేసినట్లయింది. ఇదిలా ఉండగా హరీశ్ శంకర్.. రామ్‌తో తన తర్వాత సినిమా చేయబోతున్నాడు. బచ్చన్ మూవీ ప్రమోషన్స్‌లో ఈ విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?) -
మాస్... క్లాస్ అని ఆలోచించను: సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్
‘‘ఏ సినిమాలో అయినా కథని బట్టే పాటలు ఉంటాయి. ప్రత్యేకించి మాస్, క్లాస్ అని నేను ఆలోచించను. ‘మిస్టర్ బచ్చన్’లో మాస్ సాంగ్స్ చేసే చాన్స్ దక్కింది. ఈ పాటలివ్వడం నాకేం షాకింగ్‌గా లేదు. ఎందుకంటే నేను మాస్ సాంగ్స్ చేయగలనని నాకు తెలుసు. ‘మిస్టర్ బచ్చన్’ సంగీతానికి మంచి స్పందన రావడం చాలా హ్యాపీగా ఉంది’’ అని సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్ అన్నారు. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘మిస్టర్ బచ్చన్’ ఈ నెల 15న విడుదలైంది.ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్ మాట్లాడుతూ– ‘‘నా భార్య, పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటాను. డైరెక్టర్స్ కథని ఫోన్లో లేదా జూమ్ కాల్స్‌లో వినిపిస్తారు. కథ విని ట్యూన్స్ ఇస్తాను. అయితే నేపథ్య సంగీతం మాత్రం ఇండియాకి వచ్చి చేస్తాను. నేనెప్పుడూ డైరెక్టర్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్‌లో కూర్చోలేదు. కానీ, ‘మిస్టర్ బచ్చన్’ కోసం హరీష్‌గారు సియాటిల్ వచ్చారు. కేవలం నాలుగు రోజుల్లో ఈ సినిమా ట్యూన్స్ పూర్తి చేశాం. నేను అమెరికాలో కాకుండా ఇండియాలో ఉంటే మరిన్ని సినిమాలు చేసే చాన్స్ ఉండేది. కానీ, ఫ్యామిలీకి కూడాప్రాధాన్యత ఇస్తాను.. అందుకే అమెరికాలో ఉంటున్నాను. ప్రస్తుతం మూడుప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి’’ అన్నారు. -
పొరపాటు తెలుసుకున్న 'మిస్టర్ బచ్చన్'.. నిడివి తగ్గించి
ఆగస్టు 15. థియేటర్లలోకి తెలుగు స్ట్రెయిట్ మూవీస్ మూడు వచ్చాయి. వీటిలో రవితేజ 'మిస్టర్ బచ్చన్', రామ్ 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలతో పాటు 'ఆయ్' అనే మరో చిన్న మూవీ కూడా రిలీజైంది. కాన్ఫిడెన్స్‌తో ముందు రోజే అంటే ఆగస్టు 14నే బచ్చన్ ప్రీమియర్స్ వేశారు. అయితే అప్పడే డివైడ్ టాక్ వచ్చింది. మూవీలో సీన్లపై ఘోరంగా ట్రోలింగ్ సాగుతోంది. ఇప్పుడు మూవీ టీమ్ జాగ్రత్త పడింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్)సోషల్ మీడియాలో వస్తున్న క్రిటిసిజం, ఫీడ్ బ్యాక్ ఆధారంగా దాదాపు 13 నిమిషాల నిడివి తగ్గించినట్లు స్వయంగా మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే ఇదేదో ముందే చేసుంటే టాక్ పాజిటివ్‌గా వచ్చి ఉండేదేమో? ఏదైతేనేం తప్పు ఎక్కడ జరిగిందో వెంటనే తెలుసుకున్న బచ్చన్ టీమ్.. నిడివిలో మార్పు చేయడం మంచిదే.లాంగ్ వీకెండ్ ఉన్న నేపథ్యంలో ఇలా నిడివి తగ్గించడం మరి 'మిస్టర్ బచ్చన్' కలిసొస్తుందేమో చూడాలి? ఇప్పటికే 'ఆయ్'తో పాటు డబ్బింగ్ బొమ్మ 'తంగలాన్'కి పాజిటివ్ టాక్ వచ్చింది. అలానే హిందీ మూవీ 'స్త్రీ 2' కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. ఇలా వీటిని తట్టుకుని బచ్చన్ మూవీ ఏ మేరకు నిలబడుతుందో చూడాలి?(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?) -
మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్.. ఫస్ట్ డే కలెక్షన్స్
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా టాలీవుడ్లో సినిమాల జాతర జరిగింది. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాల మధ్యే బిగ్ ఫైట్ నడిచింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు సినిమాలకు కూడా మిక్సిడ్ టాక్ వచ్చింది. ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించేలా లేవని నెటిజన్ల నుంచి విమర్శలు అందుకున్నాయి. కోలీవుడ్ సినిమా 'తంగలాన్' కాస్త బాగుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. విక్రమ్ నటన కోసం అయినా సినిమా చూడాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.మిస్టర్ బచ్చన్ కలెక్షన్స్రవితేజ- హరీశ్ శంకర్ సినిమా మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద రూ.7.5 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఈ కలెక్షన్లు అడ్వాన్స్ ప్రీమియర్ షోలతో కలిపి అని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మొదటిరోజు సుమారు రూ. 10 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబడుతుందని అందరూ అంచనా వేశారు. కానీ మిస్టర్ బచ్చన్ ఆ మార్క్ అందుకోలేకపోయిందని తెలుస్తోంది. దాదాపు రూ. 35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన మిస్టర్ బచ్చన్ ఆ టార్గెట్ రీచ్ అవుతాడా..? అనే సందేహాలు వస్తున్నాయి. సినిమా పట్ల దారుణమైన నెగటివ్ టాక్ రావడంతో బయర్స్‌కు నష్టాలు తప్పవని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్యంగ్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించాడు. దాదాపు రూ. 60 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విడుదలైన ఈ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. ఈ క్రమంలో మొదటిరోజు రూ. 12. 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ట్రేడ్ వర్గాలు మాత్రం రూ. 10.40 కోట్లు మాత్రమే కలెక్షన్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. మొత్తానికి కలెక్షన్ల పరంగా మిస్టర్ బచ్చన్ కంటే ఇస్మార్ట్ శంకర్ కాస్త బెటర్ అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మించారు.తంగలాన్ కలెక్షన్స్ప్రయోగాత్మక పాత్రలతో మెప్పించే విక్రమ్ తాజాగా తంగలాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటిరోజు రూ. 19.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 1850ల్లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగే కథాంశంతో తెరకెక్కిన తంగలాన్ ఈ పోటీలో విజయం సాధించింది. సినిమా పట్ల పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అన్ని వర్గాల సినీప్రియులకు తంగలాన్ థ్రిల్ చేస్తాడు. చెన్నైలో మొత్తం 592 స్క్రీన్లలో తంగలాన్ ప్రదర్శించారు. 81 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. తంగలాన్ తెలుగు వర్షన్ రూ. 2 కోట్ల వరకు రాబట్టింది. -
రవితేజ-భాగ్యశ్రీ కాంట్రవర్సీ స్టెప్.. స్పందించిన హరీశ్ శంకర్
రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదలై మిక్స్డ్ టాక్ని సంపాదించుకుంది. కథ-కథనం బాలేకపోయినా.. సంగీతం మాత్రం అదిరిపోయిందని అంతా అంటున్నారు. పాటల విషయంలో హరీశ్ మరోసారి తన మార్క్ చూపించారని కొనియాడుతున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్కే సినిమాకు ప్లస్ పాయింట్ అని పలు వెబ్సైట్లు తమ రివ్యూల్లో పేర్కొన్నాయి. అయితే ‘సితార్’ పాటలో రవితేజ-భాగ్యశ్రీ బోర్సే వేసిన ఓ స్టెప్పు మాత్రం కాంట్రవర్సీకీ దారి తీసింది. (చదవండి: మిస్టర్ బచ్చన్ రివ్యూ)కొంతమంది నెటిజన్స్ ఆ స్టెప్పు తాలుకు ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హరీశ్ శంకర్‌ని ట్రోల్ చేస్తున్నారు. చర్చనీయాంశమైన ఆ స్టెప్పు గురించి తాజాగా హరీశ్ శంకర్ స్పందించాడు. పాటలకు హీరోహీరోయిన్లు చేసే డ్యాన్స్‌ని ఫ్లోలో చూస్తే బాగుంటుందని.. స్క్రీన్ షాట్ తీస్తే ఇబ్బందిగానే కనిపిస్తుందని అని అన్నాడు.‘వాస్తవానికి ఆ పాటకు ఆ స్టెప్ అవసరం లేదని నాక్కుడా అనిపించింది. అయితే షూటింగ్ మొదటి రోజే ఆ పాటను షూట్ చేశాం. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఆయన చాలా పెద్ద కొరియోగ్రాఫర్. ఆయన కంపోజ్ చేసిన మూమెంట్‌ని మొదటి రోజే నేను వద్దు అంటే బాగోదేమో అని ఆగిపోయాను. షూటింగ్ బిజీలో పడి అది పట్టించుకోలేదు. సెన్సార్‌లో కూడాఫ్లోలో చూశారు కాబట్టి ఓకే అయింది. ఎప్పుడైనా పాటల్లో డ్యాన్స్‌ని ఫ్లోలో చూడాలి. అలా కాకుండా స్క్రీన్ షాట్ తీసి చూస్తే చాలా వరకు ఇబ్బందిగానే ఉండే అవకాశం ఉంది’ అని హరీశ్ చెప్పుకొచ్చాడు. -
రవితేజ మిస్టర్ బచ్చన్ సక్సెస్ ప్రెస్ మీట్
-
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
హరీశ్ శంకర్.. ఇటువైపు రాకండి అంటూ వార్నింగ్ ఇచ్చిన అభిమాని
డైరెక్టర్ హరీష్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' విడుదలకు ముందే ఇచ్చిన హైప్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. రవితేజ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ, తాజాగా సినిమా చూసిన ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు. సినిమా బాగాలేదంటూ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. అయినప్పటికీ రవితేజ్ ఇమేజ్‌తో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ అయితే దక్కాయి. కానీ, సినిమా చూసిన ప్రేక్షకులు, రవితేజ అభిమానులు మాత్రం ఈ సినిమాపై ఘూటుగానే విమర్శలు చేస్తున్నారు. కొంతమంది సినిమా పర్వాలేదు అంటున్నప్పటికీ మరికొంతమంది మాత్రం మిస్టర్ బచ్చన్ పెద్ద రాడ్ సినిమా అంటూ ఫైర్ అవుతున్నారు.తమ అభిమాన హీరో నటించిన సినిమాను విడుదలరోజే చూడాలంటే ఎవరైనా సరే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఫస్ట్ చాయిస్‌గా పెట్టుకుంటారు. అయితే, తాజాగా అక్కడ మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన రవితేజ అభిమాని ఒకరు దర్శకుడు హరీశ్ శంకర్‌పై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. మిస్టర్ బచ్చన్ సినిమా బాగాలేదంటూ మీడియా వారితో తెలిపాడు. దర్శకుడు హరీశ్ శంకర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కి వస్తే అభిమానులు చితక్కొడుతారని కామెంట్ చేశాడు. సినిమాలో విషయం ఉన్నా.. డైరెక్షన్ విభాగంలో లోపాలు ఉన్నాయని రవితేజ అభిమాని చెప్పుకొచ్చాడు. కేవలం హీరోయిన్‌తో పాటల కోసమే సినిమా తీశారేమో అనిపించేలా మిస్టర్ బచ్చన్ ఉందని కామెంట్ చేశాడు. ఇండస్ట్రీలో ఎంతో పేరున్న దర్శకుడు ఇంత చెత్త సినిమా తీయడమేంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. హరీశ్ శంకర్ గారు.. దయచేసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు రాకండి అంటూ వారు కామెంట్ చేశారు.అందమైన హీరోయిన్ పెట్టి రవితేజ సినిమాను నడిపించేద్దామని డైరెక్టర్ అనుకున్నారేమో అనే అభిప్రాయం నెటిజన్లలో వస్తుంది. ఇలాంటి సినిమాలు తీసి అన్యాయంగా ప్రజల నుంచి డబ్బులు గుంజుకుంటున్నారనే కామెంట్లు వస్తున్నాయి. తమ డబ్బు రీఫండ్ చేస్తారా సార్ అంటూ సరదాగా కామెంట్లు కూడా చేస్తున్నారు. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్గా తొలిపరిచయం అవుతుంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. -
'మిస్టర్ బచ్చన్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. ఎప్పుడు రావొచ్చు?
రవితేజ లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్' థియేటర్లలోకి వచ్చేసింది. చాలా నమ్మకంతో ముందు రోజే ప్రీమియర్లు వేశారు కానీ టాక్ అయితే పాజిటివ్‌గా రాలేదు. రవితేజ ఎనర్జీ, కొత్తమ్మాయి భాగ్యశ్రీ గ్లామర్ పరంగా ఏ లోటు లేనప్పటికీ మిగతా విషయాలు పరమ రొటీన్‌గా ఉన్నాయని చూసిన వాళ్లు అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఎవరనేది కూడా తేలిపోయింది.(ఇదీ చదవండి: ‘మిస్టర్ బచ్చన్’ మూవీ రివ్యూ)2018లో హిందీలో వచ్చిన సినిమా 'రైడ్'. ఓ సాధారణ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.. పలుకుబడి ఉన్న పెద్ద మనిషి ఇంటిపై రైడ్ చేసి ఎలా చెమటలు పట్టించాడనేదే స్టోరీ. దీనికి కాస్త ఎంటర్టైన్మెంట్ , రవితేజ మార్క్ వినోదం జోడించి తీసిన తెలుగు సినిమా 'మిస్టర్ బచ్చన్'. హీరోయిన్గా చేసిన భాగ్యశ్రీ గ్లామర్, డ్యాన్సుల వల్ల కాస్త హైప్ పెరిగింది. కానీ ఈ అంచనాల్ని మూవీ అందుకోలేకపోయిందని అంటున్నారు.ఇకపోతే 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. రీసెంట్ టైంలో ఈ ఓటీటీలో వచ్చిన మూవీస్ అన్నీ థియేటర్లలో రిలీజైన 28 రోజుల తర్వాత వచ్చేస్తున్నాయి. బచ్చన్ కూడా నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. అంటే సెప్టెంబరు రెండో వారంలో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. అంతకంటే ముందే వచ్చినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
‘మిస్టర్ బచ్చన్’ మూవీ రివ్యూ
టైటిల్: మిస్టర్ బచ్చన్నటినటులు:రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సత్య, చమ్మక్ చంద్ర, రోహిణి, అన్నపూర్ణ తదితరులునిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత: టీజీ విశ్వప్రసాద్‌దర్శకత్వం:హరీశ్ శంకర్‌సంగీతం:మిక్కీ జే మేయర్సినిమాటోగ్రఫీ:అయానక బోసేవిడుదల తేది: ఆగస్ట్ 15, 2024కథేంటంటే..మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఓ నిజాయితీపరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్‌ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్‌ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్‌కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లదనాన్ని బచ్చన్ ఎలా బటయకు తీశాడు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే...ఓ సూపర్ హిట్ మూవీని రీమేక్ చేయడం ఇప్పుడు కత్తిమీద సాము లాంటిదే. ఓ స్టార్ హీరో ఓ రీమేక్ చేస్తున్నాడంటే చాలు.. అది ఏ భాషా చిత్రమైనా సరే ఓటీటీలో వెతికి మరీ చూసేస్తున్నారు. ఆ తర్వాత రీమేక్ సినిమాను ఒరిజినల్‌తో పోల్చి చూస్తున్నారు. ఏమాత్రం తక్కువగా అనిపించినా విమర్శలు తప్పవు. అయితే డైరెక్టర్ హరీశ్ శంకర్ విషయంలో మాత్రం సినీ ప్రియులకు అపారమైన నమ్మకం ఉంది. ఆయన నుంచి ఓ రీమేక్ సినిమా వస్తుందంటే..కచ్చితంగా ఒరిజినల్‌కు మించిన చిత్రంగా ఉంటుందని గట్టి నమ్మకం. ఆ నమ్మకానికి కారణం గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ సినిమాలే. ఒరిజినల్‌ను ఉన్నదున్నట్లు తీయకుండా మార్పులు చేర్పులు చేసి.. మసాలా అద్ది సినిమా రూపు రేఖలే మార్చేశాడు. అందుకే ఆ రెండూ సూపర్ హిట్‌గా నిలిచాయి. మిస్టర్ బచ్చన్ విషయంలోనూ హరీశ్ అలానే మార్పులు చేశాడు కానీ.. అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అజయ్ దేవ్‌గణ్ ‘రైడ్’ మూవీ సారాన్ని మాత్రమే తీసుకొని..దాని చుట్టు కామెడీ,రొమాంటిక్ సీన్లు అల్లుకొని మిస్టర్ బచ్చన్‌ని తెరకెక్కించాడు. అయితే ఫన్ కోసం యాడ్ చేసిన కొన్ని సీన్లు నవ్వించకపోగా..అక్కడ అవసరమా అన్నట్లుగా కథనం సాగుతుంది. ముఖ్యంగా అన్నపూర్ణమ్మ ఎపిసోడ్, చమ్మక్ చంద్రతో వచ్చే సీన్లు.. ‘ఓహో..మనం ఇక్కడ నవ్వాలేమో..’ అని అనిపిస్తుంది. సినిమా మొత్తంగా చూస్తే..లవ్..కామెడీ..యాక్షన్ అన్నీ సమపాళ్లల్లో ఉంటాయి. అయితే అవి కథకు అనుగుణంగా కాకుండా..ఇరికించినట్లుగా అనిపిస్తుంది. అయితే బోర్ కొడుతున్నట్లుగా అనిపించిన ప్రతిసారి భాగ్యశ్రీని తెరపై చూపించి.. ప్రేక్షకుల మైండ్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అందులో మాత్రం హరీశ్ సక్సెస్ అయ్యాడు. భాగ్యశ్రీ అందాలను తెరపై ఎంతవరకు చూపించాలో..ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారో అలానే చూపించాడు. ఇక తన గత సినిమాల మాదిరే పాటల విషయంలో తన మార్క్‌ని చూపించాడు. మిక్కీ జే మేమయర్ నుంచి మంచి సంగీతాన్ని రాబట్టుకున్నాడు. ఓ భారీ యాక్షన్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వెంటనే కామెడీ జోన్లోకి వెళ్తుంది. రవితేజ పాత్రకు బచ్చన్ అనే పేరు పెట్టడం వెనుక ఉన్న స్టోరీ, జిక్కీతో ప్రేమాయణం..రొమాంటికి పాటలు..సత్య కామెడీతో ఫస్టాఫ్ సరద సరదాగా సాగిపోతుంది. ఇక ఇంటర్వెల్ సీన్‌తో అసలు కథ ప్రారంభం అవుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం విలన్ ఇంట్లో హీరో చేసే రైడ్ చుట్టే కథనం సాగుతుంది. అయితే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చేసే తనిఖీలు కానీ.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు అన్నీ సినిమాటిక్‌గానే ఉంటాయి తప్పితే...ఎక్కడా వాస్తవికానికి దగ్గరగా అనిపించవు. పోనీ కామెడీ అయినా వర్కౌట్ అయిందా అంటే..ఆ సీన్లు మరింత బోర్ కొట్టిస్తూ సాగదీతగా అనిపిస్తాయి. సినిమా ప్రారంభంలో జగపతి బాబుకి ఓ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చి..మధ్యలో కమెడియన్‌కి ఎక్కువ..విలన్‌కి తక్కువ అన్నట్లుగా చూపించారు. విలనిజాన్ని పండించడంలో శంకర్ పూర్తిగా విఫలం అయ్యాడు. జగపతి బాబు పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఉంటుంది. అయితే రైడ్ మూవీ చూడని వాళ్లకు, లాజిక్కులను పట్టించుకొని బీ, సీ సెంటర్ల ఆడియన్స్ మాత్రం మిస్టర్ బచ్చన్ అలరించే అవకాశం ఉంది. ఎవరెలా చేశారంటే.. మిస్టర్ బచ్చన్ పాత్రలో రవితేజ జీవించేశాడు. తెరపై వింటేజ్ రవితేజను చూస్తారు. యాక్షన్‌తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. ఇక భాగ్యశ్రీ బోర్సే సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. జీక్కీ పాత్రలో ఒదిగిపోయింది. తెరపై అందాలను ప్రదర్శించడమే కాదు..చక్కటి అభినయంతో ఆకట్టుకుంది. డ్యాన్స్ ఇరగదీసీంది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. విలన్‌గా జగపతి బాబు బాగానే నటించాడు. అయితే ఆయన పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. సత్య తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక స్పెషల్ రోల్లో మెరిసిన సిద్ధు జొన్నలగడ్డ తనదైన స్టైల్లో యాక్షన్ సీన్ అదరగొట్టేశాడు. తనికెళ్ల భరణి, సచిన్ ఖేదేకర్, అన్నపూర్ణమ్మ, చమ్మక్ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. ఇప్పటికే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అవి తెరపై మరింత ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. బీజీఎం బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హీరోహీరోయిన్లను తెరపై అందంగా చూపించడమే కాకుండా..ప్రతీఫేమ్ చాలా రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
పాత రవితేజను కొత్తగా చూస్తారు: హరీష్ శంకర్
⇒ ఉత్తర భారతదేశంలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఉంటుంది. కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాను. ఈ సినిమాలో హీరో బచ్చన్ పాత్రలో నిజాయితీ ఉన్న హీరోయిజమ్ ఉంటుంది. 1980లో లక్షల రూపాయలంటే పెద్ద మొత్తం. అంత మొత్తం లంచం రూపంలో వస్తుందన్నా కూడా ఓ అధికారి ఒప్పుకోలేదు.. లొంగలేదు. నాకు ఈ పాయింట్ నచ్చింది. ఇలాంటి నిజాయితీ గల ఆఫీసర్ జీవితంలో ప్రేమ, ఫ్యామిలీ, రొమాంటిక్ యాంగిల్స్ కూడా ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించి రవితేజగారి క్యారెక్టర్‌ను డిజైన్ చేశాను.ప్రేక్షకులు బాగా ఎంటర్టైన్ అవుతారు. హిందీ ‘రైడ్’కు, ‘మిస్టర్ బచ్చన్’కు...అజయ్ దేవగన్‌కు, రవితేజకు మధ్య ఉన్నంత తేడా ఉంది. ‘రైడ్’లో అజయ్ దేవగన్ రోల్ సెటిల్డ్‌గా ఉంటే... ‘మిస్టర్ బచ్చన్’లో రవితేజగారి రోల్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ఉంటుంది. ఇక ఈ కథకు ఓ కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని భావించి భాగ్యశ్రీ బోర్సేను తీసుకోవడం జరిగింది. జిక్కీ పాత్రలో ఆమె ప్రేక్షకులను మెప్పిస్తారు. జగపతిబాబుగారు ఎంపీ పాత్రలో కనిపిస్తాను. ⇒నేను సినిమా చూడని రోజులు ఉన్నాయేమో కానీ పాటలు వినకుండా ఉన్న రోజులు లేవు. ఓ సినిమా దర్శకుడిగా నేను విఫలం అయ్యానేమో కానీ... సంగీతం విషయంలో కాదు. నా ఫ్లాప్ మూవీ ‘షాక్’లోని ‘మధురం..’ పాట ఇంకా వినిపిస్తూనే ఉంది. ట్యూన్స్ సరైన సమయానికి ఇవ్వకపోవడం వల్ల లిరికల్ వీడియోలు లేట్‌గా విడుదల అవుతున్న రోజులివి. అలాంటిది వారం రోజుల్లో నాలుగు ట్యూన్స్ ఇచ్చారు మిక్కీ జే మేయర్. ఆయన చాలా ప్రతిభావంతుడు. మాస్ సాంగ్స్ చేయలేదు అంటే ఆయనకు రాక కాదు... చాన్స్ రాలేదు అంతే. ⇒ చలం, యండమూరిగార్ల నవలలు చదివి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సాహిత్యంలో మంచి పట్టు ఉంది నాకు. అలాంటి నేను ‘షాక్’ సినిమా తీస్తే మూడేళ్లు ఆడియన్స్ నన్ను షాక్‌లో ఉంచారు. ఆ వెంటనే ‘మిరపకాయ్’ సినిమా తీశాను. ఇక ‘ఇడియట్, ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’ వంటి సినిమాలు చేసిన రవితేజగారు ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలని అప్పట్లో ‘నా ఆటోగ్రాఫ్..’, ఇటీవల ‘టైగర్ నాగేశ్వరరావు, ఈగల్’ సినిమాలు చేస్తే ఆడియన్స్ ఆదరణ దక్కలేదు.కానీ ‘ధమాకా’ అంటే హిట్ ఇచ్చారు. అందుకే ‘మిస్టర్ బచ్చన్’లో పాత రవితేజనే కొత్తగా చూపిస్తున్నాం. నిర్మాత విశ్వప్రసాద్ గారు లేకపోతే ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఇంత గ్రాండ్‌గా వచ్చేది కాదు. ఆగస్టు 15న రిలీజ్ చేసేవాళ్లం కాదు. ఆడియన్స్‌కు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ‘మిస్టర్ బచ్చన్’ మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది. ఈ రోజు సాయంత్రం నుంచి ప్రీమియర్స్ వేస్తున్నాం. -
‘పుష్ప’ చూసి అంతా స్మగ్లింగ్ చేయట్లేదు కదా? : హరీశ్ శంకర్
సినిమా హీరోలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ పరోక్షంగా ఖండించారు. సినిమాల ప్రభావం ప్రజలపై ఉంటుందని చెప్పడం సరికాదన్నారు. ఒకవేళ అదే నిజమైతే ‘గాంధీ’సినిమా చూసి అందరం మహాత్మ గాంధీలాగే మరిపోవాలన్నారు. తన వరకు అయితే సినిమా అనేది కేవలం వినోదాన్ని పంచడానికే పని కొస్తుందని తనదైన శైలీలో చెప్పుకొచ్చారు.వినోదం కోసమే సినిమా: హరీశ్ శంకర్‘మిస్టర్ బచ్చన్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హరీశ్ తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ.. ‘సినిమాల ఎఫెక్ట్ ప్రజలపై కొన్ని గంటలు మాత్రమే పని చేస్తుంది. నిజంగా సినిమా చూసి మనుషులు మారిపోతారంటే.. ‘పుష్ప’ సినిమా చూసిన ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి.. గొడ్డలి పట్టుకొని తిరుపతి వెళ్లి స్మగ్లింగ్ చేయాలి. కానీ అలా చేయట్లేదు కాదా? ఠాగూరు చూసిమా చూసిన తర్వాత లంచం తీసుకోవడం మానేయాలి. కానీ మన ఆఫీసర్లు ఆ పని చేస్తున్నారా? అంతెందుకు ఆస్కార్ అవార్డు గెలిసిన ‘గాంధీ’సినిమా చూసి ప్రతి ఒక్కరు మహాత్మ గాంధీ అయిపోవాలి. అలా అయ్యారా? నటుడు అన్నప్పుడు రకరకాల పాత్రలను చేస్తారు. వారి అంతిమ లక్ష్యం వినోదాన్ని పంచడమే. వారిని చూసి మారిపోతారనేది నేను నమ్మను. నా వరకు సినిమా అనేది వినోదం మాత్రమే. నేను కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే అందిస్తాను’ అని హరీశ్ చెప్పుకొచ్చారు.పవన్ ఏం అన్నారు?ఇటీవల బెంగళూరు పర్యటనకు వెళ్లిన పవన్.. అక్కడ మీడియాతో అడవుల సంరక్షణ గురించి మాట్లాడుతూ.. ‘40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవాడు. కానీ ఇప్పుడు హీరోలే అడవును నరికి స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా చూపిస్తున్నారు. ఒక సినిమా వ్యక్తిగా నేను అలాంటి ఎంకరేజ్ చేయను. అలాంటి సినిమాలు బయటకు మంచి మెసేజ్ ఇవ్వలేవు’అన్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ గురించే పవన్ సెటైర్లు వేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. -
రవితేజను భయపెట్టిన అభిమాని.. అసలేం జరిగిందంటే?
మాస్ మహారాజా రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో వస్తోన్న యాక్షన్ చిత్రం 'మిస్టర్ బచ్చన్'. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెల 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడతుండడంతో చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.తాజాగా మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కర్నూలులో గ్రాండ్‌గా నిర్వహించారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగిన ఈవెంట్లో డైరెక్టర్‌తో పాటు చిత్రయూనిట్ సభ్యులంతా హాజరయ్యారు. అయితే ఈవెంట్ మధ్యలో రవితేజ మాట్లాడుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఓ అభిమాని ఒక్కసారిగా స్టేజీపైకి దూసుకొచ్చాడు. దీంతో రవితేజ అతన్ని ఆగు ఆగు గట్టిగా అరుస్తూ.. అభిమాని వద్దకు వెళ్లి అలా రాకూడదని అతనికి సూచించాడు. ఇలా వచ్చి మమ్మల్ని భయపెట్టకండ్రా బాబు.. అలా టప్పున వచ్చేస్తే మే భయపడతాం అంటూ రవితేజ నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Orai Ila Tappana Rakandra Babu Bayapadtham 😂😂🔥🔥🔥🔥#RaviTeja #MrBachchan pic.twitter.com/XBBfgSBlCe— Srinivas (@Srinivasrtfan2) August 12, 2024 -
హీరో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
తమ్ముళ్లూ... ఇరగదీయబోతున్నాం: రవితేజ
రవితేజ, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్గా రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాని మా డీవోపీ అయాంక చాలా కలర్ఫుల్గా, లడ్డూలా చూపించారు. ‘మిస్టర్ బచ్చన్’లో నేను, భాగ్యశ్రీ చాలా అందంగా కనిపించడానికి కారణం ఆయనే. మా డ్యాన్స్ మాస్టర్ భాను రెండు పాటలను ఇరగదీశాడు. భాస్కరభట్ల నాకు ఎన్నో పాటలు రాశాడు. ఈ మధ్య నాకు కాసర్ల, సాహితీ కూడా రాస్తున్నారు. కొత్త యాక్షన్ కో–ఆర్డినేటర్ పృథ్వీ చాలా కామ్‌గా ఉంటాడు. నాలుగు ఫైట్స్‌లో ఒక్క ఫైట్ తప్ప మిగతా మూడూ తనే చేశాడు. ఫైట్స్ చాలా బాగా కొరియోగ్రఫీ చేశాడు. ఇంకా ఇతర టీమ్ సభ్యులు కూడా బాగా హార్డ్‌వర్క్ చేశారు. మిక్కీ జే మేయర్ నుంచి అసలు ఇలాంటి మ్యూజిక్ వస్తుందని ఊహించలేదు. ఫస్ట్ టైమ్ ట్యూన్స్ వినిపించినప్పుడు ‘ఇది మిక్కీనా’ అనిపించింది. అంత మంచి పాటలు ఇచ్చాడు. వివేక్‌గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలి. విశ్వప్రసాద్గారూ... మీ ఫ్యాక్టరీ ఇలానే రన్ అవ్వాలి. పేరుతో పాటు డబ్బులు కూడా రావాలి. హరీష్ చాలా హార్డ్ వర్కర్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయి, మా కాంబినేషన్లో నెక్ట్స్ సినిమా హ్యాట్రిక్‌కి నాంది కావాలి. తమ్ముళ్లూ (అభిమానులను ఉద్దేశించి) ఇరగదీయబోతున్నాం’’ అన్నారు. ‘‘ఒక్కసారి కాదు మళ్లీ మళ్లీ చూసే సినిమా ఇది’’ అని హరీష్ శంకర్ పేర్కొన్నారు. ఈ వేడుకలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి. వెంకటేశ్ అతిథులుగాపాల్గొన్నారు. -
'నల్లంచు తెల్లచీర' మాస్ సాంగ్‌కు స్టెప్పులేసిన మిస్టర్ బచ్చన్
రవితేజ టైటిల్ రోల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిస్టర్ బచ్చన్.. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్గా తొలిపరిచయం అవుతుంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. నల్లంచు తెల్లచీర అంటూ సాగే ఈ మాస్ సాంగ్నుశ్రీరామ చంద్ర, సమీర భరద్వాజ్ ఆలపించారు. భాస్కరభట్ల ఈ పాటను రచించారు. మాస్ ఆడియన్స్ విజిల్ వేసేలా ఈ సాంగ్ ఉంది. -
ఆ పిచ్చి మన వాళ్లకే ఉంది: రవితేజ
టాలీవుడ్లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు అన్ని వారి వారి బర్త్‌డే సందర్భంగా మళ్లీ థీయేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. ఆ సినిమాలు విడుదలైనప్పుడు రానన్ని కలెక్షన్స్ రీరిలీజ్ టైమ్‌లో వస్తున్నాయంటే.. పాత సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తున్నారో తెలుసుకోవచ్చు. తాజాగా మహేశ్ బాబు మురారి సినిమా ఆయన బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 9న రీరిలీజై దాదాపు 7.32 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టి చరిత్ర సృష్టించింది. అయితే పాత సినిమాలు మళ్లీ థియేటర్స్‌లోకి వచ్చి భారీగా కలెక్షన్స్ రాబట్టడం ఆశ్యర్యానికి గురి చేస్తుందని అంటున్నాడు మాస్ మహారాజా రవితేజ. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రీరిలీజ్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రీరిలీజ్ ట్రెండ్ మన(టాలీవుడ్) దగ్గరే ఉంది. నిజంగా మన ప్రేక్షకులను దేవుళ్లు అనొచ్చు. వాళ్లు సినిమాను ఎంతలా ప్రేమిస్తారో ఈ రీరిలీజ్ కలెక్షన్స్‌ని చూస్తే అర్థమవుతుంది. ఒక పాత సినిమాను మార్నింగ్ 6.30 థియేటర్స్‌కి వెళ్లి చూడడం ఆశ్యర్యంగా అనిపిస్తుంది. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అయితే ఉదయం 7 గంటలకు వెళ్లి చూసేవాళ్లం. అవి కొత్త సినిమాలు కాబట్టి అంత మార్నింగ్ వెళ్లేవాళం. కానీ ఇప్పటి ప్రేక్షకులు ఉదయం 5 గంటలకే వెళ్లి చూస్తున్నారు. నిజంగా వాళ్లు చాలా గ్రేట్. ఇలాంటి పిచ్చి మనవాళ్లకు తప్ప ఎక్కడా లేదు’ అని రవితేజ అన్నారు. ఇక నీకు ఏ సినిమా రీరిలీజ్ కావాలని ఉంది అని యాంకర్ అడగ్గా.. అమితాబ్ బచ్చన్ ‘షోలే’ అని రవితేజ బదులిచ్చాడు. కాగా, గతంలో రవితేజ ‘విక్రమార్కుడు’, ‘వెంకీ’ సినిమాలు కూడా రీరిలీజై మంచి వసూళ్లను రాబట్టాయి.