ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు ‘మిస్టర్ బచ్చన్’. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘షాక్’, ‘మిరపకాయ్’ వంటి సినిమాల తర్వాత రవితేజ, హరీష్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ఇది. ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే తెలుగు పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు.
ఇందులో ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ బచ్చన్ పాత్రలో రవితేజ కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం. పనోరమా స్టూడియోస్, టి–సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేసేలా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ స్వరకర్త. మరోవైపు అజయ్ దేవగన్ హీరోగా నటించిన హిందీ హిట్ ఫిల్మ్ ‘రైడ్’ (2018) చిత్రానికి ‘మిస్టర్ బచ్చన్’ తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment