Harish
-
వాజేడు ఎస్సై ఆత్మహత్యకు అనూషే కారణం
వాజేడు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్య కేసు మిస్టరీ వీడింది. ఎస్సై ఆత్మహత్యకు కారణమైన యువతిని శనివారం అరెస్టు చేసినట్టు వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్ వెల్లడించారు. ఈ మేరకు కేసు వివరాలు, అరెస్ట్ చూపిన ఫొటోలను మీడియాకు ఒక ప్రకటన రూపంలో పంపారు. వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్(29) ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అదేరోజు అతని తల్లిదండ్రులు రుద్రారపు రాములు, మల్లికాంబలు వాజేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించడానికి దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి ఆధారాలను పోలీసులు, క్లూస్‌టీమ్ సభ్యులు సేకరించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దుదియతండాకు చెందిన బానోత్ అనసూర్య (అనూష) కారణమని గుర్తించారు. ఈ మేరకు ఆమెను వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి చేసుకోవాలని..అనూష హైదరాబాద్‌లోని వీబీఐటీ కాలేజీలో అడ్మిన్ స్టాఫ్‌గా పనిచేస్తోంది. ఏడు నెలల క్రితం రాంగ్ నంబర్ కాలింగ్ ద్వారా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్‌ను అనూష పరిచయం చేసుకుంది. ఎస్సై కావడంతో అతడిని పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందని భావించింది. తరచూ ఫోన్ చేసి సాన్నిహిత్యం పెంచుకోవడంతోపాటు పెళ్లికి ఒప్పించాలని నిర్ణయానికి వచ్చింది. ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసి తనను పెళ్లి చేసుకోకపోతే శారీరకంగా వాడుకున్నట్టు మీడియాతోపాటు పైఅధికారులకు ఫిర్యాదు చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడంతోపాటు బెదిరించింది. ఇలా ఎస్సై హరీశ్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీ రాత్రి వాజేడు మండలం పూసూరు గ్రామ సమీపంలోని గోదావరి బ్రిడ్జి వద్ద ఉన్న ఓ రిసార్ట్‌లో హరీశ్‌తోపాటు అనూష ఉన్నారు. తనను పెళ్లి చేసుకోవాలి లేదా చచ్చిపోవాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో భావోద్వేగానికి లోనైన హరీశ్.. 2వ తేదీ తెల్లవారుజామున ఆమెను బయటకు పంపి తన సర్వీస్ రివాల్వర్‌తో గదువ కింది భాగంలో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి ఆధారాలను సేకరించిన పోలీసులు అనూష ప్రమేయం ఉండడంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్టు వెల్లడించారు. -
ఎస్సై హరీశ్, యువతి ఆడియో సంభాషణ వైరల్
ములుగు: ఎస్సై హరీశ్, ఆ యువతి మాట్లాడుకున్నట్టుగా చెబుతున్న ఓ ఆడియో వైరల్ అవుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఓ రిసార్టులో ఎస్సై హరీశ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హరీశ్ ఆత్మహత్యకు సూర్యాపేట జిల్లాలోని దుగ్యాతండాకు చెందిన ఓ యువతిపై పోలీసులు ఎక్కువగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యువతి పేరిట బయటకు వచ్చిన ఆడియోపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది నిజమా..అబద్ధమా అని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. ఆ ఆడియోలో ఏంముందంటే...: ‘మనం పెళ్లి చేసుకోవాలంటే ముందుగా నువ్వు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ధర్నా చేయాలి. పలువురిని ఆకర్షించేలా చేస్తేనే మన ప్రేమ విషయం బయటకు వస్తుంది.. అప్పుడు పెళ్లి చేసుకోవడానికి వీలవుతుంది. విషయం బయట కు వచ్చిన తర్వాత పెద్దలు ఒప్పుకోని పక్షంలో నా తల్లిదండ్రుల కాళ్లు పట్టుకుందాం.’ – ఎస్సై హరీశ్‘నేను కాళ్లు పట్టుకుంటాను కానీ.. మా అమ్మా నాన్న పట్టుకోరు.. నేను కొందరిపై కేసులు పెట్టినట్టు వార్తలు ప్రచారం అవుతున్నాయి. నన్ను ఇబ్బంది పెట్టిన ఇద్దరిపై కేసులు పెట్టాను. ఈ విషయం హరీశ్‌కు ముందుగానే తెలిపాను. ఆయన మంచి మనసుతో కలిసి జీవించడానికి ఒప్పుకున్నాడు.. మా ఇద్దరి మధ్య ఎలాంటి డబ్బు చర్చలు రాలేదు. నాకు డబ్బులు ఇచ్చినట్టుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నా బ్యాంకు ఖాతాలను చూస్తే ఆ విష యం తెలుస్తుంది. నాపై కావాలనే చిలుకూరులోని కొందరు కుట్ర పూరితంగా వ్యవహరించి తప్పుడు ప్రకటనలు వచ్చేలా చేశారు’. – సదరు యువతిఆ కానిస్టేబుల్ ప్రైవేట్ వెహికిల్ ఎందుకు నడిపారు? -
రాంగ్ కాల్ ఫలితం.. యువతి వేధింపులకు ఎస్ఐ ఆత్మహత్య
సాక్షి, వరంగల్: ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీశ్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఓ యువతి వేధింపుల కారణంగానే ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. తమ కుమారుడి మృతికి సదరు యువతే కారణమని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు చెందిన యువతి ఏడు నెలల కిందట హరీష్‌కు కాల్ చేసింది. మాటామాటా కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు. హైదరాబాద్‌లో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేదని సమాచారం. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆమె గురించి ఎస్ఐ హరీష్ ఆరా తీశాడు. దీంతో అతనికి కొన్ని విషయాలు తెలిశాయి.ఈ 26 ఏళ్ల యువతిది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం. ఊళ్లో ఉన్నప్పుడు ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేది. అందులో ఒకరు పెళ్లికి నిరాకరించడంతో చిలుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు అయింది. ఈ విషయాలను తెలుసుకున్న హరీశ్.. ఆమె పెళ్లి ప్రతిపాదనను నిరాకరించాడు. ఇంట్లో వాళ్లు చూసే సంబంధాన్ని చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. దీంతో ఆమె మాట్లాడేందుకు ఆదివారం సాయంత్రం వాజేడు ముళ్ల కట్ట సమీపంలోని ఓ రిసార్టుకు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.ఈ క్రమంలో వారిద్దరి మధ్య అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. సెటిల్మెంట్ చేసుకోవడానికి ఎస్సై ప్రయత్నించగా, సదరు యువతి అందుకు అంగీకరించకలేదు. అంతేకాకుండా తమ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన హరీశ్ తన సర్వీసు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. తమ కుమారుడి మృతికి యువతే కారణమని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఇక, ఈ నెల ఆరో తేదీన హరీష్‌కు నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. -
సహాయక చర్యల్లో ఆ మంత్రులు విఫలం
సాక్షి, హైదరాబాద్, చేగుంట(తూప్రాన్): ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వరదల్లో చిక్కుకున్న 9 మందిని కూడా కాపాడలేకపోయారని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. సోమవారం మెదక్ జిల్లా చేగుంటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వాతావరణశాఖ హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే అనేక మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు.వర్షాలతో 16 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం 31 మంది మృతి చెందారని తెలిపారు. ఖమ్మంలో కాపాడమని కోరుతున్న వరద బాధితులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు సహాయక చర్యలు చేపట్టడం మానేసి బీఆర్ఎస్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని నిందించారు. ప్రతీ ఎకరాకు రూ.10వేల పరిహారమివ్వాలి ఓ వైపు ప్రజలు ఆపదలో ఉంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాజకీయాలు మాట్లాడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల కన్నీళ్లు తుడవకుండా ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నారని ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ ఎకరాకు రూ.10వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, శాసన మండలి మాజీ సభ్యులు, ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై సోషల్ మీడియా వేదికగా బీజేపీ చేస్తున్న దాడిని హరీశ్‌రావు ఖండించారు. -
బెయిల్ వస్తే ఓకే.. రాకుంటే ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ దాదాపు 150 రోజులకు పైగా తీహార్ జైలులో ఉన్న ఆమె బెయి లు పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ విషయంలో కౌంటర్లు దాఖలు చేసేందుకు ఆలస్యమెందుకంటూ ఈనెల 12న సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది. దీనితో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోర్టును ఈడీ అడగ్గా.. విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.మంగళవారం కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్న నేప థ్యంలో.. కేటీఆర్, హరీశ్ తదితరులు సోమవారం ఢిల్లీ లో న్యాయవాదులతో భేటీ అయ్యా రు. 2 గంటల పాటు సుప్రీం కోర్టులో వాదించబోయే అంశాలపై చర్చించారు. కాగా, కోర్టు నిర్ణయం అనంతరం సాయంత్రం ఎమ్మెల్యేల అనర్హత అంశంపై మరోమారు న్యాయబృందంతో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బెయిల్‌పై ఆశాభావంతో..: కవిత 154 రోజుల నుంచి తీహార్ జైలులోనే ఉన్నారు. మంగళవారం సుప్రీంకోర్టులో ఆమె బెయిల్ పిటిషన్‌పై వాదనల నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, హరీశ్‌లు న్యాయవాది మోహిత్‌రావు బృందంతో సుదీర్ఘమైన చర్చలు జరిపారు. ‘బెయిల్ వస్తే ఓకే.. ఒకవేళ బెయిల్ రాని పక్షంలో తదుపరి కార్యాచరణ ఏమిటి? న్యాయ పోరాటం ఎలా చేయాలి’అనే అంశాలపై చర్చించారు. బెయిల్‌పై కౌంటర్ దాఖలు విషయంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటూ ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఈ సారి కవితకు బెయిల్ వస్తుందని ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. మహిళగా కవితకు మినహాయింపు ఇవ్వండిపీఎంఎల్ఏ సెక్షన్–45లోని కఠిన నిబంధనల నుంచి మహిళగా ఎమ్మెల్సీ కవితకు మినహాయింపు ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ్గ సుప్రీంకోర్టును కోరారు. ఇప్పటికే కవిత హైబీపీతో బాధ పడుతున్నారు. పదికేజీలకు పైగా బరువు తగ్గారు. మరోపక్క జ్వరంతో బాధపడుతూనే ఉన్నారు. వీటన్నింటికంటే ఆమె దీర్ఘకాలికంగా ఉన్న గైనిక్ సమస్యల వల్ల మరింత ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని న్యాయబృందం సుప్రీంకోర్టుకు నివేదించనుంది.పీఎంఎల్ఏ సెక్షన్–45లోని కఠిన నిబంధనల నుంచి కవితకు మినహాయింపు ఇచ్చి బెయిల్ మంజూరు చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించేందుకు ఆమె తరఫు న్యాయవాదులు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా కవితకు ఉన్న అనారోగ్య సమస్యలపై ఢిల్లీ ఎయిమ్స్ ఇచ్చిన రిపోర్టులను ఈడీ అధికారులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం బెయిలు మంజూరు చేస్తుందా లేక వాయిదా వేస్తుందా అన్న అంశంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. -
ఐరాసలో భారత రాయబారిగా హరీశ్
సాక్షి, న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితికి భారత శాశ్వత ప్రతినిధిగా పర్వతనేని హరీశ్‌ను నియమిస్తూ కేంద్ర విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా సేవలందిస్తున్న హరీష్ త్వరలో యూఎన్ అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. సెప్టెంబర్‌లో ఐరాసలో ప్రధాని మోదీ ఒక సదస్సుకు హాజరుకానున్న నేపథ్యంలో హరీశ్ నియామకం త్వరగా పూర్తయింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాం¿ోజ్ జూన్‌లో పదవీవిరమణ చేశాక ఆ పోస్ట్ అప్పటి నుంచీ ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో తదుపరి రాయబారి నియామక ప్రక్రియను కేంద్రం వేగంగా పూర్తిచేసింది. 1990 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సరీ్వస్ అధికారి అయిన హరీష్ మూడు దశాబ్దాలుగా విదేశాంగ శాఖ పరిధిలో పలు దేశాల్లో పనిచేశారు. -
పరిహారం రాక.. ప్రాణాలు తీసుకున్నాడు!
జైపూర్: జీవనోపాధి కోసం రూ.6 లక్షలు అప్పు తెచ్చి కొనుగోలు చేసిన ట్రాక్టర్‌కు గిరాకీ లేదు.. ట్రాక్టర్ కిస్తీలు కట్టలేని పరిస్థితి. అదీగాక ఏడాది క్రితం చెల్లి పెళ్లి కోసం రూ.5 లక్షలు అప్పు తెచ్చాడు. సింగరేణి సంస్థ నుంచి పరిహారం వస్తే తన కష్టాలు గట్టెక్కుతాయనుకున్నాడు. కానీ, రెండేళ్లుగా పరిహారం విషయం ఎటూ తేలడం లేదు. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో హరీశ్ (28) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.తన చావుకు సింగరేణి యాజమాన్యం, గ్రామ పెద్దలు కారణమని సూసైడ్ నోట్ రాశాడు. అమ్మా నాన్న క్షమించండి.. అక్క, చెల్లి.. అమ్మనాన్నలను బాగా చూసుకోండి అని అందులో పేర్కొన్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట పంచాయతీ పరిధిలోని దుబ్బపల్లిలో జరిగింది. జైపూర్ ఎస్సై నాగరాజు కథనం ప్రకారం.. దుబ్బపల్లి గ్రామానికి చెందిన జాడి బొందాలు–పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు హరీశ్ సంతానం. బొదాలు కూలీనాలి చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేశాడు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం ఏ పని చేయడం లేదు. దీంతో కుటుంబ భారం హరీశ్‌పై పడింది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వస్తుందని...దుబ్బపల్లి గ్రామాన్ని రెండేళ్ల క్రితం సింగరేణి శ్రీరాంపూర్ ఓసీపీ విస్తరణ కోసం సేకరించింది. ఇంటితోపాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.20 లక్షలు పరిహారం వస్తుందని హరీశ్ భావించాడు. కానీ, రెండేళ్లుగా సింగరేణి యాజమాన్యం పరిహారం విషయం తేల్చడం లేదు. గ్రామ పెద్దలు పరిహారం ఇప్పించే బాధ్యత తీసుకున్నా.. ఎలాంటి పురోగతి లేదు. ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
NRI: ఘనంగా.. 'నేషనల్ ఇండియా హబ్' ప్రారంభోత్సవం!
ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ కమ్యూనిటీ సెంటర్ గా నేషనల్ ఇండియా హబ్ ప్రారంభమైంది. అమెరికాలోని చికాగోలో పలువురు ప్రముఖుల సమక్షంలో నేషనల్ ఇండియా హబ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కాన్సుల్ జనరల్ సోమనాథ్ ఘోష్ ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. ఇంద్రాణి ఫేమ్ అంకిత ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. తెలుగువారు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.నేషనల్ ఇండియా హబ్ గురించి వ్యవస్థాపకులు హరీష్ కొలసాని, వ్యవస్థాపక సభ్యులు కేకే రెడ్డి వివరించారు. అలాగే ఈ హబ్ ను స్థాపించటానికి గల కారణాలు కూడా వెల్లడించారు. 'Unite, Celebrate, Help Each Other' ప్రధాన సూత్రాలుగా ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు. నేషనల్ ఇండియా హబ్ ద్వారా అన్ని సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.ఇలా ఎక్కువ ఆర్గనైజేషన్స్ ఒకే రూఫ్ కిందకు రావటం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు చేసుకునే విషయం అన్నారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టే పలు సేవా కార్యక్రమాలను వివరించారు. ఎడ్యూకేషన్, హెల్త్ కేర్, CPR ట్రైనింగ్, ఇమిగ్రేషన్ వంటి ఎన్నో రకాల సేవ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.ఈ సంస్థను ప్రారంభించటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ కమ్యూనిటీ సెంటర్ గా నేషనల్ ఇండియా హబ్ ను ఏర్పాటు చేయటం పట్ల పలు సంఘాల నాయకులు, ప్రవాసులు అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.ఇవి చదవండి: -
12 ఏళ్ల తర్వాత గ్రూప్–1 పరీక్ష నిర్వహించింది మేమే
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూసే పరిస్థితి ఉండేదన్నారు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్–1 పరీక్ష నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనేనని బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు హరీశ్, కేటీఆర్‌ల ఆరోపణలను కౌంటర్ చేస్తూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.‘ఆశ వర్కర్ల గురించి మాట్లాడే అర్హత హరీశ్‌రావుకు లేదు. బీఆర్ఎస్ హయాంలో ఆశవర్కర్లను గుర్రాలతో తొక్కించారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నాం. మూడునెలల మా పాలన పూర్తయ్యేలోపే ఎన్నికల కోడ్ వచి్చంది. ఇప్పుడే కోడ్ అయిపోయింది. అన్ని హామీలు అమలు చేస్తాం. త్వరలోనే జాబ్ కేలండర్ విడుదల చేస్తాం.’అని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని, మతఘర్షణల వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. -
‘పట్టభద్రులపై’ పట్టు కోసం!
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ‘వరంగల్– ఖమ్మం–నల్లగొండ’పట్టభద్రుల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్లలో పట్టు సాధించేందుకు విస్తృతంగా ప్రచారం సాగిస్తోంది. ఈ నెల 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక వ్యూహాన్ని బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు.అందుకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఇప్పటికే పట్టభద్రుల నియోజకవర్గం విస్తరించి ఉన్న జిల్లాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. నాలుగు రోజులుగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ప్రచారం చేసిన కేటీఆర్ బుధవారం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.ఎన్నికల ప్రచారం ఈ నెల 25న ముగియనుండటంతో సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లోనే ఆయన ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ఈ నెల 23 నుంచి రెండు రోజుల పాటు పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇక నాగర్‌కర్నూలు నుంచి బీఆర్ఎస్ తరపున లోక్‌సభ అభ్యరి్థగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఓటరునూ కలిసి.. శాసన మండలి ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ స్థానం నుంచి బీఆర్ఎస్ వరుసగా నాలుగు పర్యాయాలు గెలవడంతో ప్రస్తుత ఉప ఎన్నికలోనూ ఆ పార్టీ అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల ప్రచార గడువు, పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో పార్టీ యంత్రాంగం నడుమ సమన్వయానికి బీఆర్ఎస్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలకు సమన్వయ బాధ్యతలు అప్పగించింది.మండలాల వారీగా పట్టభద్రులు నియోజకవర్గం ఓటరు జాబితాను సమన్వయకర్తలకు అందజేసి, క్షేత్ర స్థాయిలో ప్రతీ ఓటరును పార్టీ కేడర్ కలిసేవిధంగా ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రచారంలో ప్రధానంగా కాంగ్రెస్ వైఫల్యాలు, ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ల జారీలో వైఫల్యం, పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి విద్యార్హతలు, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న వ్యవహార శైలి తదితరాలను ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ప్రతీ ఓటును ఒడిసి పట్టేందుకు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఓటరును ప్రత్యక్షంగా కలవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అసంతృప్త నేతలకు బుజ్జగింపు ఏనుగుల రాకేశ్‌రెడ్డి అభ్యరి్థత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలతో కేటీఆర్ స్వయంగా మాట్లాడి బుజ్జగిస్తున్నారు. ఈ ఉప ఎన్నికను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో విభేదాలు వీడి కలిసి పనిచేయాలని కోరుతున్నారు. త్వరలో ఏర్పాటయ్యే పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల్లో ప్రాధాన్యతను ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యరి్థత్వం ఆశించిన వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మంగళవారం కేటీఆర్‌ను కలిశారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు. కేటీఆర్, హరీశ్ ప్రచార షెడ్యూలు ఇదే కేటీఆర్ ఈ నెల 22న ములుగు, నర్సంపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశి్చమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. హరీశ్‌రావు ఈ నెల 23న భూపాలపల్లి, వర్దన్నపేట, పాలకుర్తి, డోర్నకల్, 24న సత్తుపల్లి, వైరా, మధుర, పాలేరు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. -
మిస్టర్ బచ్చన్ వస్తున్నాడు
ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు ‘మిస్టర్ బచ్చన్’. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘షాక్’, ‘మిరపకాయ్’ వంటి సినిమాల తర్వాత రవితేజ, హరీష్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఇది. ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఇందులో ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ బచ్చన్ పాత్రలో రవితేజ కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం. పనోరమా స్టూడియోస్, టి–సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేసేలా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ స్వరకర్త. మరోవైపు అజయ్ దేవగన్ హీరోగా నటించిన హిందీ హిట్ ఫిల్మ్ ‘రైడ్’ (2018) చిత్రానికి ‘మిస్టర్ బచ్చన్’ తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది. -
రాష్ట్రానికి చెదలు పట్టించింది మీరే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయిని కాదని, అది తెలంగాణకు ఒక కళంకంగా మిగిలిపోయిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్, హరీశ్ కలసి తెలంగాణకు చెదలు పట్టించారని, వారు ఎంత ద్రోహం చేశారో ప్రజలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని కేసీఆర్ పుర్రెలోనే పురుగులా పుట్టిందని, ఆయనే ఇంజనీర్లకు సలహా ఇచ్చారని విమ ర్శించారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు అవాంఛనీయమని, తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాలని ఐదుగురు సభ్యుల రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ చెప్పినా పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. ఖజానాను కొల్లగొట్టడానికే దుర్మార్గానికి తెగబడ్డారని ఆరోపించారు. శనివారం ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టింది. దీనిపై జరిగిన చర్చలో హరీశ్‌రావు మాట్లాడుతున్న సమయంలో.. సీఎం రేవంత్ జోక్యం చేసుకుని మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించింది. నాడు ప్రాణహిత నది మీద తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కడితే 1,850 ఎకరాల పట్టా భూమి మునుగుతుందని, గ్రామాలేవీ ముంపునకు గురికావని తేల్చారు. అదే 150 మీటర్ల ఎత్తుతోనే కడితే 1,250 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతాయని గుర్తించారు. ప్రాణహిత–చేవెళ్లకు అడ్డంకులను తొలగించేందుకు నాటి మహారాష్ట్ర సీఎంతో, ఉమ్మడి ఏపీ సీఎం చర్చించారు. 2012లో స్టాండింగ్, కో–ఆర్డినేషన్ కమిటీలు వేశారు. మేడిగడ్డ నిరుపయోగమని చెప్పినా.. తెలంగాణ వచ్చాక అప్పటి సీఎం కేసీఆర్, సాగునీటిశాఖ మంత్రి హరీశ్‌రావు.. గోదావరి ప్రాజెక్టులపై రిటైర్డ్ ఇంజనీర్ బి.అనంతరామ్ నేతృత్వంలో ఐదుగురు ఇంజనీర్లతో కమిటీ వేశారు. ఆ కమిటీ 14 పేజీలతో నివేదిక ఇచ్చింది. అప్పటికే శంకుస్థాపన కూడా చేసిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తుతో కాకపోతే 150 మీటర్ల ఎత్తుతోనైనా నిర్మించాలని.. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు అవాంఛనీయమని తేల్చి చెప్పింది. అయినా మేడిగడ్డ దగ్గరే ప్రాజెక్టు నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు. మరోవైపు మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు చేపట్టడం సరికాదంటూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇచి్చన నివేదిక ఆధారంగా 2015 సెపె్టంబర్లో ‘సాక్షి’ ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. సభలో క్షమాపణలు చెప్పాలి కేసీఆర్, హరీశ్ కలసి ఇంజనీర్ల కమిటీ నివేదికను తొక్కిపెట్టి.. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు చేపట్టారు. రూ.38వేలకోట్ల నుంచి రూ. 1.47 లక్షల కోట్లకు అంచనాలను పెంచేశారు. తెలంగాణ ఖజానాను కొల్లగొట్టేందుకు ఇంత దుర్మార్గానికి తెగబడ్డారు. జరిగిన తప్పులకు క్షమాపణలు చెప్పి సహకరిస్తే హరీశ్‌రావుకు గౌరవం ఉండేది. కానీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశి్నస్తారా? ప్రాజెక్టులు ఫక్కున పగిలిపోతుంటే క్షమాపణలు చెప్పకుండా ఇంకా వాదిస్తారా? హరీశ్‌రావును నేను నిలదీస్తున్నా.. ఈ పాపాలకు మామా అల్లుళ్లు కారణం కాదా? ఇలాంటి పరిస్థితుల్లో మొండి వాదనలు వద్దు. ప్రాణహిత–చేవెళ్లలో ప్రాజెక్టు ఆపితే ఆనాడు ధర్నా చేసిన మా అక్క సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నారు. నాడు దీక్షలు, ధర్నాలు చేసిన సబితక్క ఇప్పుడు మౌనంగా హరీశ్‌రావు గారిని సమరి్ధస్తున్నారా? జరిగిన తప్పులకు హరీశ్ క్షమాపణ చెప్పాలి. సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి విచారణకు వచ్చినపుడు.. ఎవరి ఒత్తిడితో ఇలా చేశారో నాటి మంత్రులు కన్ఫెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చి తప్పులు ఒప్పుకోవాలి..’’ అని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్‌కు రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ పునర్నిర్మాణంతోపాటు సభను సజావుగా నడిపించడంలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను మాజీ సీఎం కేసీఆర్ సమర్థవంతంగా పోషించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. రేవంత్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సాగునీటి రంగంపై శాసన సభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టి చర్చ నిర్వహిస్తున్న సందర్భంగా సీఎం ఈ మేర కు ప్రకటన చేశారు. కేంద్రమంత్రి, మంత్రి, సీఎంగా వివిధ హోదాల్లో 40 ఏళ్లు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తన పాత్ర పోషించారని తెలిపారు. -
చంద్రబాబు ద‘మనీ’యం
సాక్షి అమలాపురం: లోక్ సభ మాజీ స్పీకర్, దివంగత జీఎంసీ బాలయోగి వారసుడు గంటి హరీష్ టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ దమన నీతికి బలైపోతున్నారు. అమలాపురం నుంచి ఎంపీ టికెట్ రేసులో ఉన్న హరీష్‌కు డబ్బు లేదనే ఉద్దేశంతో మొండిచేయి చూపేందుకు టీడీపీ అధిష్టానం యత్నిస్తోంది. ఈ విషయంపై అలిగిన హరీష్ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లినా పార్టీ పెద్దలు పట్టించుకోలేదు. దీంతో బాలయోగి అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. హరీష్ ప్రస్తుతం టీడీపీ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ త్రిమెన్ కమిటీలోనూ సభ్యునిగా కొనసాగుతున్నారు. అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని తొలి నుంచీ ఆసక్తిగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో హరీష్‌ను ఎంపీగా బరిలోకి దింపారు. 39,996 ఓట్ల తేడాతో హరీష్ ఓడిపోయారు. పార్లమెంట్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల కన్నా హరీష్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అప్పటి నుంచి పార్లమెంటు స్థానంలో పోటీ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అయితే టీడీపీ అధిష్టానం డబ్బు లేదనే ఉద్దేశంతో హరీష్‌ను పక్కన పెట్టేందుకు యత్నిస్తోంది. హరీష్‌కు క్యాడర్లో పట్టు లేదని సాకుగా చూపుతోంది. హరీష్ మరీ పట్టుబడితే పి.గన్నవరం, లేదా అమలాపురం అసెంబ్లీకి పంపించాలని పార్టీ అదినేత చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఈ విషయాన్ని హరీష్‌కు చెప్పేశారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. దీంతో అలిగిన హరీష్ వారం పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. అయినా అధిష్టానం చలించలేదు. డబ్బు లేనందున హరీష్‌కు ఎంపీ సీటు ఇవ్వలేమని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. పాము‘కొనేనా’! హరీష్ స్థానంలో ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎంపీ ఏజేవీబీ మõßæశ్వరరావు కుమార్తె, పాము సత్యశ్రీని పార్లమెంట్‌కు పంపితే ఎలా ఉంటుంది అనేదానిపై టీడీపీ ఆలోచన చేస్తోంది. ఆమె పార్టీలో కొత్తగా చేరినా.. ఆర్థికంగా స్థితిమంతురాలు కావడంతో అధినేత మొగ్గు చూపుతున్నారని తెలిసింది. గుంటూరుకు చెందిన ఒక పారిశ్రామికవేత్త కూడా అమలాపురం ఎంపీ టికెట్‌పై ఆశతో త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. ఆయన అభ్యర్థిత్వాన్నీ బాబు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. దీంతో బాలయోగి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ‘ఆనంద’రావుకు దుఃఖమేనా! హరీష్ అసెంబ్లీకి వెళ్లేందుకు అంగీకరిస్తే అమలాపురం, పి. గన్నవరంలో ఒక దానిని ఎంపిక చేసుకోవాలని పార్టీ అధిష్టానం సూచించిందని తెలిసింది. ఆయనను అమలాపురం నుంచి అసెంబ్లీ బరిలో నిలపాలని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్రంగా యత్నిస్తున్నట్టు సమాచారం. రాజప్పతోపాటు ఆయన వర్గం హరీష్‌ను ఒప్పించే యత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. హరీష్‌ను అమలాపురం అసెంబ్లీ బరిలో నిలపడం ద్వారా ఈ సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు చెక్ పెట్టాలని రాజప్ప యోచిస్తున్నారు. ఒకప్పుడు తన శిషు్యడైన ఆనందరావు ఎదురు తిరగడంతో గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాకుండా రాజప్ప చివరి వరకు విఫలయత్నం చేశారు. ఈసారి ఆనందరావుకు ఎలాగైనా సీటు రాకుండా చేయాలని పావులు కదుపుతున్నారు. -
కారు వేగం ధాటికి.. ఇద్దరు యువకుల విషాదం!
కరీంనగర్: పట్టణంలోని సిద్ధార్థ ఉన్నత పాఠశాల సమీపంలో ప్రధాన రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. స్థానికుల కథనం ప్రకారం.. ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన కూతరు నగేశ్ (21), పడిదం హరీశ్ (19) ఇద్దరు స్నేహితులు. ద్విచక్ర వాహనం (టీఎస్ 22 హెచ్ 6725)పై మల్లాపూర్ నుంచి కరీంనగర్ వస్తున్నారు. ఈక్రమంలో వరంగల్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న కారు సిద్ధార్థ స్కూల్ దాటాక బస్సును ఓవర్టేక్ చేయబోయి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారు, బైక్ ధ్వంసం కాగా, బైక్ నడుపుతున్న నగేశ్, వెనుక కూర్చున్న హరీశ్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆదిలాబాద్‌కు చెందిన కారు డ్రైవర్ గౌస్ బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో బైక్‌ను ఢీకొట్టినట్లు స్థానికులు భావిస్తున్నారు. కారు వేగం ధాటికి ఇద్దరు చెరో చోట ఎగిరిపడ్డారు. కాగా రాష్ట్ర రహదారిపై గత కొన్నేళ్లుగా గుంతలు పడ్డ చోటనే ప్రమాదాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇటీవలే ప్రమాద సూచికలను రోడ్డుపై ఏర్పాటు చేసిన అధికారులు, రోడ్డును మరమ్మతు చేయక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కడే కుమారుడు.. ప్రమాదంలో మృతి చెందిన పాడిదం హరీశ్ తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కావడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. చెర్లపల్లి నుంచి ధర్మారం మండలం మల్లాపూర్‌లో మూడేళ్లుగా నివాసం ఉంటూ సుతారి పనులు చేస్తు హరీశ్ తండ్రి రాజయ్య కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హరీశ్ ఇంటర్ మొదటి సంవత్సరం వరకు చదవగా, మరో సోదరి ఐదో తరగతి చదువుతోంది. సెల్‌ఫోన్ రిపేర్ చేస్తూ.. మృతుడు కూతురు నగేశ్ ఇటీవలే బైక్ కొనుగోలు చేశాడు. కరీంనగర్లో నివాసం ఉంటూ సెల్‌ఫోన్ రిపేర్లు చేస్తుండేవాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడికి ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. తండ్రి పో చమల్లు నగేశ్ చిన్నతనంలోనే మృతి చెందినట్లు తెలిసింది. సోదరుడికి వివాహమైంది. రోడ్డు ప్రమాదం నిరుపేద కుటుంబాల్లో విషాదం నింపింది. ఇవి చదవండి: హనుమకొండ: దైవదర్శనానికి వెళ్తూ.. ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి -
హరీశ్‌బాబుకు టికెట్ ఖరారు
సాక్షి, ఆసిఫాబాద్: కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన బీజేపీ తొలి జాబితాను ఎట్టకేలకు ఆదివారం ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ముందుగా ఊహించినట్లుగానే జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు ఖరారయ్యారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. రెండో జాబితాలో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి శనివారమే జాబితా ప్రకటించాల్సి ఉండగా.. మూడు సీట్ల ఖరారు విషయంలో సందిగ్ధత నెలకొనడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మాత్రం అభ్యర్థిత్వాలు ఖరారైన వారికి స్వయంగా ఫోన్లు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల్లో శనివారమే పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. బలమైన రాజకీయ నేపథ్యం.. పాల్వాయి హరీశ్‌బాబుకు బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. హరీశ్‌బాబు తండ్రి పాల్వాయి పురుషోత్తంరావు 1989, 1994లో వరుసగా రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందగా.. తల్లి రాజ్యలక్ష్మి సైతం 1999లో టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన పాల్వాయి హరీశ్‌బాబు.. ఆ తర్వాత చైన్నెలోని శ్రీరామచంద్రా యూనివర్శిటీ నుంచి ఎం.ఎస్.(ఆర్థోపిడిక్స్) చేశారు. పీడియాట్రి ఆర్థోపిడిక్ సర్జన్‌గా వైద్యవృత్తిని ప్రారంభించారు. 2017 నవంబర్‌లో రాజకీయ అరంగ్రేటం చేశారు. ప్రత్యేక రాజకీయ ఎజెండాను రూపొందించుకుని ప్రజల్లోకి వచ్చారు. మొదట 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కోనేరు కోనప్పపై పోటీ చేసి 59,052 ఓట్లు సాధించారు. ఆ తర్వాత ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వివిధ వర్గాలకు మద్దతుగా పోరాటాలు చేయడంతోపాటు మారుమూల గ్రామాల్లో పాదయాత్ర చేసిన ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టుంది. -
హరీశ్ పరీక్ష ఫలితాలు వెల్లడించండి
సాక్షి, హైదరాబాద్/కమలాపూర్: పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో బాధ్యుడిని చేస్తూ హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలలో చదువుతున్న దండెబోయిన హరీశ్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి చేసిన డీబార్‌ను హైకోర్టు ఎత్తివేసింది. అనంతరం ఇతర విద్యార్థులలాగానే హరీశ్‌కు అన్ని సర్టిఫికెట్లు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ఈ నెల 6న ఉత్తర్వులు జారీ చేసింది. కమలాపూర్‌లోని బాలుర ఉన్నత పాఠశాల కేంద్రంలో పదో తరగతి పరీక్షల సందర్భంగా ఏప్రిల్ 4న హిందీ ప్రశ్నపత్రం బయటికి రాగా విద్యార్థి దండెబోయిన హరీశ్‌ను బాధ్యుడిని చేస్తూ అప్పటి డీఈఓ ఐదేళ్లపాటు డీబార్ చేశారు. దీంతో విద్యార్థి హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర ఉత్తర్వులతో మిగిలిన పరీక్షలు రాశాడు. అయినప్పటికీ ఫలితాల్లో హరీశ్‌ది విత్‌హెల్డ్‌లో పెట్టి మాల్ ప్రాక్టీస్ కింద చూపారు. దీంతో హరీశ్ మరోసారి తన ఫలితాలు ప్రకటించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుదీర్‌కుమార్ బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. హరీశ్ పరీక్ష ఫలితాలను అధికారులు వెల్లడించకుండా విత్ హెల్డ్‌లో పెట్టారని, దీంతో అతను పైతరగతులకు వెళ్లడం ఇబ్బందిగా మారిందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. హరీశ్ ఫలితాలు వెంటనే వెల్లడించడంతోపాటు సర్టిఫికెట్లన్నింటినీ అందజేయాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు ఉత్తర్వుల పట్ల హరీశ్‌తోపాటు అతని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు చెప్పినా ఫలితాలు ప్రకటించడం లేదు: బల్మూరి పేపర్ లీకేజీ కేసులో అకారణంగా డీబార్ చేసిన విద్యార్థి హరీశ్ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. హైకోర్టు చెప్పినా హరీశ్ ఫలితాలు విడుదల చేయడం లేదని, మరో రెండు, మూడు రోజుల్లో ఇంటర్ అడ్మిషన్లు పూర్తవుతున్న తరుణంలోనైనా ప్రభుత్వం ఫలితాలు విడుదల చేసి హరీశ్‌కు న్యాయం చేయాలని కోరారు. బీఆర్ఎస్, బీజేపీలు తమ రాజకీయ డ్రామాల కోసం హరీశ్ జీవితంతో ఆడుకుంటున్నాయని గురువారం గాం«దీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. కనీసం పదో తరగతి పేపర్ లీకేజీతో సంబంధం ఉందని అరెస్టు చేసిన అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసు ఏమైందో అయినా ప్రభుత్వం చెప్పాలని వెంకట్ ఎద్దేవా చేశారు. -
హనుమకొండ: డిబార్ అయిన టెన్త్ విద్యార్ధి పరీక్షకు హాజరు
-
కేసినోపై ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో కేసినో ఆడిన వ్యక్తుల విచారణ పర్వంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. వ్యాపారవేత్త బుచ్చిరెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) హరీశ్ సోమవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. బుచ్చిరెడ్డి ఉదయం ఈడీ ఎదుట హాజరయ్యారు. విచారణ సమయంలో బ్యాంకు లావాదేవీల రికార్డులు అందించాల్సిన ఆయన సరైన పత్రాలు లేకుండా రావడంతో ఆరేళ్ల బ్యాంకు లావాదేవీలు తీసుకుని రావాలని అధికారులు ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసినోలో మనీలాండరింగ్‌కు, హవాలాకు అవకాశం లేదని చెప్పారు. కేసినోలో తనకు 5% వాటా ఉందన్న బుచ్చిరెడ్డి జనవరిలో నేపాల్ వెళ్లినట్లు, తనతోపాటు మరో పది మంది వచ్చినట్లు వివరించారు. కేసినో ఆడటానికి వెళ్లే సమయంలో తమ వద్ద రూ.15 వేలకు మించి ఎక్కువ డబ్బు తీసుకెళ్లడానికి వీల్లేదన్నారు. డబ్బంతా ఇక్కడే డిపాజిట్ చేస్తామని, అక్కడ కేసినోలో గెలిచిన వారికి ఇక్కడకు ఇచ్చిన తర్వాతే డబ్బు చెల్లిస్తారని, ఇందులో మనీలాండరింగ్‌కు అవకాశమే లేదని చెప్పారు. అనంతరం బ్యాంకు స్టేట్మెంట్లతో వచ్చిన బుచ్చిరెడ్డిని రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ప్రశ్నించారు. కేసినోలో భాగస్వామ్యం, నేపాల్, గుడివాడ కేసినోలకు సంబంధించి ప్రశ్నించినట్లు సమాచారం. బుధవారం కూడా విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. కాగా హరీశ్‌ను అధికారులు 7 గంటలపాటు ప్రశ్నించారు. బ్యాంకు లావాదేవీల స్టేట్మెంట్లతోపాటు ఆయన కాల్‌డేటాపై కూడా అధికారులు విచారణ చేసినట్లు సమాచారం. కేసినో అడటానికి ఎన్నిసార్లు వెళ్లావు.? డబ్బెలా చెల్లించావు..? ఎవరికి చెల్లించావు.? ఎంత మొత్తం చెల్లించావు.? మీతో పాటు వచ్చిన వారు ఇంకెవరు ఉన్నారు?.. తదితర అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా, కేసినోల కేసులో నోటీసులు అందుకున్న మెదక్ డీసీసీ బ్యాంక్ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి ఈడీ ఎదుట హాజరుకాలేదని సమాచారం. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణకు నోటీసులిచ్చిన సమయంలోనే దేవేందర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసినా.. ఆయన ఇంకా విచారణకు హాజరుకాకపోవడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోదరులు మహేష్, ధర్మేంద్ర, ఊర్వశీ బార్ యజమాని యుగంధర్‌ను విచారించారు. గ్రానైట్ వ్యాపారులు కూడా.. ప్రభుత్వానికి సీనరేజ్ ఎగ్గొట్టి.. నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేసిన వ్యాపారులను కూడా ఈడీ అధికారులు ఈరోజు విచారించినట్లు సమాచారం. అనుమతించిన పరిమాణం కంటే ఎక్కువ మొత్తాన్ని విదేశాలకు పోర్టుల ద్వారా ఎగుమతి చేసిన వ్యాపారులు అక్కడ నుంచి హవాలా రూపంలో డబ్బు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. 2012–13లో రాష్ట్ర విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి దాదాపు ప్రభుత్వానికి రూ.124 కోట్ల సీనరేజి చెల్లింపులు ఎగ్గొట్టారని తేల్చారు. సీనరేజి చట్టం ప్రకారం.. ఎగ్గొట్టిన మొత్తానికి ఐదు రెట్లు జరిమానా, వడ్డీలు కలిపి మొత్తం రూ.748 కోట్లు చెల్లించాలని అప్పట్లోనే వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా కేసులు నమోదు చేసిన ఈడీ ఇటీవల మళ్లీ గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. వారికి నోటీసులు కూడా ఇచ్చి విచారణకు హాజరుకావాలని ఆదేశించిన విషయం విదితమే. ఈడీ అధికారుల ఆదేశాలతోనే పలు కంపెనీల డైరెక్టర్లు హాజరైనట్లు తెలిసింది. ఈడీ ఆఫీస్‌లో బుచ్చిరెడ్డి, హరీశ్ -
జమున హేచరీస్ భూకబ్జాకు ఆధారాలివిగో: మెదక్ కలెక్టర్
మెదక్ రూరల్: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులకు చెందిన జమునా హేచరీస్ 70.33 ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములను ఆక్రమించడం ముమ్మాటికీ వాస్తవమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ పునరుద్ఘాటించారు. ఆయా భూముల్లో చేపట్టిన రీ సర్వే వివరాలను సోమవారం విలేకరుల సమావేశంలో కలెక్టర్ వెల్లడించగా దాన్ని ఈటల సతీమణి జమున తప్పుబట్టడం తెలిసిందే. కలెక్టర్ టీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరించారంటూ ఆమె ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఆయన ఈ అంశంపై వివరణ ఇస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈటల టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆ భూమిని ప్రైవేటుదిగా చూపి ఇప్పుడు ప్రభుత్వ భూమిగా తాము చూపుతున్నట్లు ఈటల జమున చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. జమున హేచరీస్ భూఆక్రమణలకు సంబంధించిన వివరాలను విడుదల చేశారు. అచ్చంపేటలోని సర్వే నంబర్ 130కి సంబంధించిన వాస్తవాలివీ.. ►అచ్చంపేట గ్రామంలోని సర్వే నంబర్ 130లో ఉన్న మొత్తం 18.35 ఎకరాలను ప్రభుత్వం సీసీ నంబర్ 1491/ఎండీకే/75 పేరిట 11–07–1990లోనే సీలింగ్ మిగులు భూమిగా ప్రకటించిందని, అప్పుడే ఫోడీ తయారైందని కలెక్టర్ తెలిపారు. ►ప్రభుత్వ మెమో 27703/ఎల్.ఆర్‌ఈవీ./2006–08 ప్రకారం 17–12–2007 నుంచే ఆయా భూములను రిజిస్ట్రేషన్ల నుంచి నిషేధించారని కలెక్టర్ తెలిపారు. ►జమున హేచరీస్ 1590/2019 డాక్యుమెంట్ పేరిట 25–03–2019లో చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 3 ఎకరాల భూమి సహా సర్వే నంబర్ 130లోని మొత్తం భూమి 11 మంది పేదలకు అసైన్ అయిందని వివరించారు. ఈ సర్వే నంబర్లో అసలు పట్టా భూమే లేదన్నారు. అయినా ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున సర్వే నంబర్ 130లోని 3 ఎకరాల అసైన్డ్ భూమిని ఎలాంటి హక్కు లేని రామారావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారని, కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ చట్టవిరుద్ధమైనదని స్పష్టం చేశారు. ►సర్వే నంబర్ 130లోని అసైన్డ్ భూమిని ప్రభుత్వం చాకలి యాదయ్య, చాకలి సత్తయ్య, చాకలి మాణయ్య, చాకలి లింగయ్య, చాకలి బిక్షపతి, చాకలి చంద్రయ్య, కత్తెర యాదయ్య, చాకలి పెద్ద వెంకయ్య, చాకలి చిన్న రాములు, ఎరుకల లచ్చయ్య, దాసరి అంజయ్య అసైన్ చేసినట్లు కలెక్టర్ వివరించారు. కానీ ఈ భూములను జమున హేచరీస్ తెల్ల కాగితం ద్వారా అక్రమంగా కొనుగోలు చేసిందన్నారు. ఈ రికార్డులు తమ వద్ద ఉన్నాయన్నారు. అచ్చంపేట గ్రామంలోని సర్వేనంబర్ 81 గురించి సంక్షిప్త వాస్తవాలు ఇలా.. ►అచ్చంపేట గ్రామంలోని సర్వే నెంబర్ 81లో మొత్తం విస్తీర్ణం 16.91 ఎకరాలని కలెక్టర్ హరీశ్ వివరించారు. ఇందులో 14 ఎకరాల 05 గుంటలను ప్రభుత్వం సీసీ నం.1491/ఎండీకే/75, 11–07–1990, సీసీ నం. 919/డీ/75, 03–03–1991లోనే మిగులు భూమిగా ప్రకటించిందని, అప్పుడే ఫోడీ తయారైందన్నారు. ఆ భూమిని ఏడుగురు నిరుపేదలకు వెల్దుర్తి తహసీల్దార్ అసైన్ చేశారన్నారు. ►సర్వే నంబర్ 81లో ఈటల జమున కొనుగోలు చేసిన 5 ఎకరాల 36 గుంటల భూమి చట్టవిరుద్ధమైనదన్నారు. అది అసైన్డ్ భూమి అయినప్పటికీ భూమిపై ఎలాంటి హక్కు లేని రామారావు నుంచి కొనుగోలు చేశారన్నారు. ►సర్వే నంబర్ 81లోని భూమిని ప్రభుత్వం బి/1901/2010, 19–12–2011 నోటిఫికేషన్ కింద స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోని నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చిందన్నారు. అయినప్పటికీ ఆ భూమిని 07–02–2020లో జమున హేచరీస్ చట్టవిరుద్ధంగా కొనుగోలు చేసిందన్నారు. ►సర్వే నంబర్ 81లోని అసైనీలకు చెందిన భూమిలో జమున హేచరీస్ పిల్లర్ స్ట్రక్చర్లు, రోడ్లు వేయడం ద్వారా సర్వే నంబర్ 81లోని మొత్తం 14 ఎకరాల 05 గుంటలను ఆక్రమించిందని కలెక్టర్ వివరించారు. ►మొత్తంగా అచ్చంపేటలోని సర్వే నంబర్లు 77, 78, 79, 80, 81, 82, 130తోపాటు హకీంపేట గ్రామంలోని సర్వే నంబర్ 97తో కలిపి 70.33 ఎకరాలను జమున హేచరీస్ ఆక్రమించినట్లు తూప్రాన్ ఆర్డీవో సమగ్ర నివేదికలో వివరించారని కలెక్టర్ పేర్కొన్నారు. -
జమునా హేచరీస్.. 70.33 ఎకరాలు కబ్జా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి, మెదక్ జోన్: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబీకులకు సంబంధించిన జమునా హేచరీస్ సంస్థ భూఆక్రమణలకు పాల్పడటం వాస్తవమేనని మెదక్ జిల్లా అధికార యంత్రాంగం మరోమారు నిర్ధారించింది. మొత్తం 70 ఎకరాల 33 గుంటల అసైన్డ్, సీలింగ్ భూములను ఆ సంస్థ కబ్జా చేసినట్లు రీ సర్వేలో తేలిందని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అసైన్డ్ భూముల బదిలీ నిషేధిత చట్టం ప్రకారం జమునా హేచరీస్‌పై సివిల్, క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు. మొత్తం 56 మంది లబ్ధిదారులకు చెందిన 61 ఎకరాల 13.5 గుంటల అసైన్డ్ భూములతోపాటు 9 ఎకరాల 19.5 గుంటల ప్రభుత్వ భూమిని జమునా హేచరీస్ ఆక్రమించిందన్నారు. అచ్చంపేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 77, 78, 79, 80, 82, 130లతోపాటు హకీంపేట పరిధిలోని 97 సర్వే నంబర్లోని అసైన్డ్ భూముల్లో రోడ్లు వేసి రైతులను భూముల్లోకి వెళ్లకుండా సంస్థ యాజమాన్యం అడ్డుకుంటోందని చెప్పారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు.. జమునా హేచరీస్ స్థానిక గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా మూడు నిర్మాణాలు చేపట్టిందని తేలినట్లు కలెక్టర్ హరీశ్ వివరించారు. ఫౌల్ట్రీ ఫీడ్ నిల్వ చేసేందుకు హకీంపేట్ గ్రామ పరిధిలో గాదెలను, అచ్చంపేట్ గ్రామ పరిధిలో ఫౌల్ట్రీ షెడ్లను నిర్మించిందని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలకు విరుద్ధంగా జమునా హేచరీస్ డంప్ చేస్తున్న కోళ్ల వ్యర్థాల వల్ల సమీపంలోని హల్దీ వాగుకు అనుసంధానంగా ఉన్న ఎల్క చెరువులో నీరు కలుషితమవుతోందని, స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారని ప్రభుత్వానికి పంపిన నివేదికలో కలెక్టర్ పేర్కొన్నారు. అందువల్ల ఆ సంస్థ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అసైనీలకు భూములు తిరిగిస్తాం... జమునా హేచరీస్ కబ్జా చేసిన భూములపై తిరిగి తమకు హక్కులు కల్పించాలని అసైన్డ్ భూముల లబ్ధిదారులు కోరుతున్నారని కలెక్టర్ హరీశ్ వివరించారు. ఈ భూముల్లో రోడ్ల నిర్మాణాలను తొలగించి స్వాధీనం చేసుకొని వాటిని అసైనీలకు అప్పగించాల్సి ఉందన్నారు. అలాగే అచ్చంపేట గ్రామ సర్వే నంబర్ 81, 130లలోని అసైన్డ్, సీలింగ్ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ జమునా హేచరీస్ రిజిస్ట్రేషన్లు చేసుకుందనే విషయం తమ దృష్టికి వచ్చిందని, ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోరినట్లు చెప్పారు. -
బాధితులకు తగిన న్యాయం చేస్తాం
వెల్దుర్తి(తూప్రాన్): మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో ఆక్రమణకు గురైన భూములకు సంబంధించి బాధిత రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, త్వరలో అందరికీ న్యాయం చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు అచ్చంపేట శివారులో కొనసాగుతున్న భూముల సర్వేను శనివారం రాత్రి పరిశీలించారు. ఫోన్ టార్చి లైట్ వెలుగులో అటవీప్రాంతం మాదిరిగా ఉన్న భూముల్లోకి వెళ్లి సర్వే అధికారులు ఏర్పాటు చేసిన సబ్ డివిజన్ హద్దులను స్వయంగా పరిశీలించారు. సర్వే ప్రక్రియ మరో రెండు, మూడు రోజులు కొనసాగుతుందని, భూ కబ్జా ఆరోపణలపై నిజాలు బయటకు రావడానికి సమయం పడుతుందన్నారు. అచ్చంపేట శివారులో సర్వే ప్రక్రియ సబ్ డివిజన్ల వారీగా దాదాపు పూర్తయిందని, ఈ విషయంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారిణి నివేదిక అందించాల్సి ఉందన్నారు. జమునా హేచరీస్ వ్యర్థాల వల్ల ఏర్పడుతున్న కాలుష్యంపై అధికారుల నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. -
సర్వే నివేదిక వచ్చాక చర్యలు
వెల్దుర్తి (తూప్రాన్): జమునా హేచరీస్ భూ వ్యవహారంపై సర్వేతుది నివేదిక వచి్చన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. మాజీ మంత్రి ఈటల కుటుంబీకులకు సంబంధించి మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట శివారుల్లో కొనసాగుతున్న భూముల సర్వేను గురువారం ఆయన పరిశీలించారు. సర్వే పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులు, అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో సర్వే పనులకు సంబంధించి వివరాలు వెల్లడించారు. అచ్చంపేట, హకీంపేట గ్రామాల దళితులు, బలహీన వర్గాల వారు తమ భూములను కొందరు కబ్జాచేసి, పాలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని గత ఏప్రిల్‌లో ఫిర్యాదు చేయడంతో అప్పట్లోనే అధికారులు విచారణ చేపట్టి ప్రాథమిక నివేదిక రూపొందించారని కలెక్టర్ తెలిపారు. అయితే ప్రాథమిక నివేదికకు వ్యతిరేకంగా జమునా హేచరీస్ హైకోర్టులో పిటిషన్ వేయగా పూర్తిస్థాయిలో సర్వే చేపట్టాలని హైకోర్టు ఆదేశించిందని చెప్పారు. ఈ మేరకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారిణి, తహసీల్దార్ ఆధ్వర్యంలో అచ్చంపేట, హకీంపేట శివార్లలో రెవెన్యూ అధికారులు మూడు రోజులుగా రీ సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. నివేదిక వచి్చన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. సీలింగ్ భూముల్లో ఎన్ని ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయి, ఆ భూముల్లోకి వెళ్లకుండా ఎంతమంది రైతులను అడ్డుకున్నారనే దానిపై నిజ నిర్ధారణ చేయడానికి సర్వే కొనసాగుతుందన్నారు. భూముల కబ్జాపై రైతులు ఎవరూ భయపడొద్దని, విచారణ తర్వాత బాధితులకు న్యాయం చేయడంతో పాటు ఆక్రమణదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. -
విషాదం: పెళ్లి విషయంలో ధైర్యం చూపారు.. బతికే విషయంలో తెగువ చూపలేక..
సాక్షి, రేగిడి (శ్రీకాకుళం): ఇద్దరూ బాగా చదువుకున్న వాళ్లు. మంచి చెడులు ఆలోచించగల విచక్షణ ఉన్నవారు. కష్టాలు కలకాలం ఉండవనే నిజం తెలిసిన వారే. అయినా క్షణికావేశానికి గురయ్యారు. పెళ్లి విషయంలో ధైర్యం చూపిన ఈ దంపతులు.. బతికే విషయంలో మాత్రం తెగువ చూపలేకపోయారు. రేగిడి మండలంలోని తునివాడకు చెందిన నవ దంపతులు పల్లి హరీష్(29), రుంకు దివ్య(20) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ బలవన్మరణం వెనుక కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎస్ఐ షేక్ మహమ్మద్ ఆలీ తెలిపిన వివరాల ప్రకారం.. చదవండి: (పుట్టినింటికి వచ్చిన చెల్లెని హతమార్చి.. పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు) వివరాలు సేకరిస్తున్న ఎస్.ఐ షేక్ మహమ్మద్ ఆలీ మండలంలోని తునివాడ గ్రామానికి చెందిన పల్లి హరీష్ ఎంసీఏ చదివాడు. అదే గ్రామానికి చెందిన రుంకు దివ్య డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ఒకే గ్రామం, ఒకే సా మాజిక వర్గానికి చెందిన వీరి మధ్య కొన్నేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1న వీరు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో స్నేహి తుల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విశాఖలో కొత్త కాపురం పెట్టారు. ఇద్దరూ ఉద్యోగాల వేటలో పడ్డారు. రెండు రోజుల కిందటే ఊరికి వచ్చిన ఈ దంపతులు అబ్బాయి ఇంటిలో ఉన్నారు. బుధవారం ఏమైందో గానీ ఇద్దరూ ఇంటిలో ఉన్న ఫ్యానుకు ఉరి వేసుకుని విగతజీవులయ్యారు. కేసు నమోదు విషయం తెలిసిన వెంటనే సీఐ జి.శంకరరావు, ఎస్ఐ షేక్ మహమ్మద్ ఆలీ తునివాడ గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని, ఇంటిని పరిశీలించా రు. వీరితో పాటు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. అనంతరం శవ పంచనామా చేసి రాజాం సామాజిక ఆస్పత్రికి పోస్టుమార్టంకు తరలించారు. చదవండి: (కర్కోటక తండ్రి.. కుమారుని గృహ నిర్బంధం) -
ఒకప్పుడు బెంగళూరులో హార్డ్‌వేర్ ఇంజనీర్.. ఇప్పుడేమో
అనంతపురం జిల్లా గోరంట్ల మండలం మందలపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మందలపల్లి హరీష్‌కు వ్యవసాయం పట్ల ఎనలేని మక్కువ. చదువు, ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ ఆలోచనలు మాత్రం నిరంతరం సొంత ఊరు, వ్యవసాయం చుట్టూ తిరిగేవి. ఎమ్మెస్సీ చదివి బెంగళూరులో ఒక కార్పొరేట్ కంపెనీలో హార్డ్‌వేర్ ఇంజనీర్‌గా చిప్ డిజైనింగ్ విభాగంలో ఉద్యోగం చేస్తూ వారాంతాల్లో స్వగ్రామానికి వచ్చి సొంత భూమిలో వ్యవసాయ పనులు చక్కబెట్టుకునే వారు. ప్రస్తుతం కరోనా వల్ల ఇంటి నుంచి పనిచేసే అవకాశం లభించడంతో.. పని గంటలు ముగిసిన తర్వాత.. పూర్తిస్థాయిలో వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు తనకు ఎదురైన ఆరోగ్య సమస్యలకు నగర కాలుష్యం, జీవనశైలి కారణాలని డాక్టర్లు చెప్పటంతో.. హరీష్ ఆహారపు అలవాట్లు మార్చుకొని చిరుధాన్యాలు తినడం ప్రారంభించారు. ఆరోగ్యం నెమ్మదిగా కుదుట పడడం మొదలైంది. దీంతో సొంత ఊర్లోనే అవసరమైన పంటలు పండించుకొని కాలుష్యానికి దూరంగా ఉంటూ ఆరోగ్యంగా జీవించవచ్చని నిర్ణయించుకున్నారు. దాదాపుగా 10 సంవత్సరాల పాటు ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేశారు. పాలేకర్ చెప్పిన ప్రకృతి వ్యవసాయంలో ఆవు ప్రాముఖ్యత, గోమూత్రం, గోమయం వల్ల కలిగే వ్యవసాయ, ఆరోగ్య ప్రయోజనాలను అవగతం చేసుకున్నారు. అంతటితో ఆగలేదు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని పంచగవ్య విద్యాపీఠంలో సంవత్సరం పాటు శిక్షణ పొందారు. విద్యార్థి దశలో నేర్చుకున్న వేదం, పంచగవ్య శిక్షణకు ఎంతగానో దోహదపడిందని చెప్పారు. చిరుధాన్యాలతో తొలి ప్రయత్నం చిరుధాన్యాల వినియోగం పెరుగుతుండటంతో 18 ఎకరాలలో అరికలు, సామలు, ఊదలు, వరిగలు, కొర్రలు, అండు కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నల సాగును హరీష్ చేపట్టారు. తాను పండించడంతో పాటు చుట్టుపక్కల ఉన్న రైతులను కూడా చిరుధాన్యాలు పండించేలా ప్రోత్సహిస్తుండటం విశేషం. పంటల చీడపీడలు, యాజమాన్య సమస్యలు అధిగమించేందుకు ఉమ్మడిగా పరిష్కారాలు వెతుక్కుంటూ పరస్పర సహకారంతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. కేవలం పంటలు పండించడం వరకే పరిమితం కాకుండా వాటికి విలువ జోడించడం ద్వారా ఆర్థికంగా లబ్ధి ఉంటుందని ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. తద్వారా తన పంటతో పాటు రైతుల పంటను కూడా ప్రాసెస్ చేశారు. తనకు తెలిసిన వినియోగదారులను నేరుగా సంప్రదించి వారికి చిరుధాన్యాలు సరఫరా చేశారు. రైతులు పండించిన పంటకు మాత్రం ప్రాసెసింగ్ చార్జీలు మాత్రమే తీసుకుని విలువ జోడింపు ద్వారా వచ్చిన మొత్తాన్ని వారికే అందేలా సహాయపడ్డారు. ప్రాసెసింగ్ చేసిన చిరుధాన్యాలకు మంచి ధర లభించడంతో రైతులంతా ఆర్థికంగా లబ్ధిపొందుతున్నారు. దేశీ వరి రకాల సాగు చిరుధాన్యాల ధరలు తగ్గడంతో ప్రస్తుతం 8 ఎకరాల్లో విస్తృతంగా అమ్ముడవుతున్న వరి సాగు మొదలు పెట్టారు హరీష్. నల్లబియ్యం, ఎర్రబియ్యపు దేశీయ వరి విత్తనాలను సాగు చేస్తున్నారు. నవారా, రాజముడి, రాక్తశాలి, చెన్నంగి, చిట్టిముత్యాలు, కాలాబట్టి, మణిపూర్ బ్లాక్ చఖావో, కర్పు కవునీ, సేలం సన్నాలు రకాలను పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే రసాయనాలు లేకుండా పండిస్తున్నారు. మిల్లెట్స్, మిల్లెట్స్‌ను యంత్రంతో శుద్ధిచేస్తున్న హరీష్ రసాయనాల అవశేషాలు లేని మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యంగా జీవించాలనే ఆకాంక్షతో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన హరీష్ ఇప్పుడు పలువురి జీవితాలను ప్రభావితం చేస్తున్నారు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్న, సన్న కారు రైతులకు ప్రకృతి వ్యవసాయం చేయడం, లాభసాటిగా గోశాల నిర్వహించడం పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని హరీష్ (76010 80665) అంటున్నారు. – ప్రసన్న కుమార్, బెంగళూరు ఇంటి వద్ద నుంచే హార్డ్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూనే పూర్తిస్థాయి రైతుగా మారి స్వయంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు హరీష్. చిరుధాన్యాలు, దేశీ వరి రకాల సాగుపై దృష్టి సారించారు. చుట్టుపక్కల రైతుల ప్రయోజనం కోసం కూడా కృషి చేస్తూ ఈ హార్డ్‌వేర్ ఇంజనీర్ శభాష్ అనిపించుకుంటున్నారు. బ్లాక్ రైస్ కాలాబట్టి పొలంలో హరీష్ నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ // మీ అభిప్రాయాలు, సూచనలను prambabu.35@gmail.com కు పంపవచ్చు. -
లారీని ఢీకొట్టిన బైక్
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామస్టేజీ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ ఓ లారీని వెనకనుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన మేడి హరీశ్ (22), హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో నివాసం ఉండే ఎం.డి.ఆసిఫ్ (22), ఎం.డి.సల్మాన్ (23)లు రామంతపూర్‌లోనే ఓ కంపెనీలో ఏసీ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. హరీశ్, ఆసిఫ్‌లు సంస్థకు చెందిన హాస్టల్లోనే ఉంటుండగా సల్మాన్ మాత్రం తల్లిదండ్రులతో కలసి స్థానికంగా ఉంటున్నాడు. ఈ ముగ్గురు శుక్రవారం సాయంత్రం పిట్టంపల్లి గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అర్ధరాత్రి వరకు అందరితో కలసి ఆనందంగా గడిపారు. భోజనం చేశాక ఒంటిగంట సమయంలో ముగ్గురు కలసి హైదరాబాద్‌కు పల్సర్ బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. ధర్మోజిగూడెం స్టేజీ వద్ద, వే బ్రిడ్జి నుంచి గ్రానైట్ లోడ్ లారీని డ్రైవర్ రివర్స్ తీస్తూ అకస్మాత్తుగా హైవేపైకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో బైక్ నడుపుతున్న సల్మాన్, లారీ అకస్మాత్తుగా రావడంతో వెనక నుంచి ఢీకొట్టాడు. దీంతో ముగ్గురు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. -
‘ఈటల బావమరది సూరి బెదిరించారు’
సాక్షి, హైదరాబాద్: ఈటల రాజేందర్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన జమునా హేచరీస్ సంస్థ మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో 66.01 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసిందని జిల్లా కలెక్టర్ హరీశ్.. రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదికలో తేల్చిచెప్పారు. హకీంపేటలోని సర్వే నం.97, అచ్చంపేటలోని సర్వే నం. 77, 78, 79, 80, 81, 82, 103లో ఆక్రమించిన అసైన్డ్ భూముల్లో పౌల్ట్రీ షెడ్లు, భవనాలు, రోడ్డును జమున హేచరీస్ నిర్మించిందని నిర్ధారించారు. తెలంగాణ అసైన్డ్ భూముల(పీఓటీ) చట్టం–1977 కింద సదరు భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు నిబంధనల మేరకు ఇతర చర్యలు తీసు కుంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో ఈటల భూకబ్జా ఆరోపణలపై శనివారం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో మెదక్ జిల్లా కలెక్టర్ ఆగమేఘాల మీద విచారణ జరిపి అదేరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రాథమిక నివేదికను పంపించారు. త్వరలో తుది నివేదిక సమర్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆదివారం అనధికారికంగా బయటకు వచ్చిన ప్రాథమిక నివేదికలోని ముఖ్యాంశాలు.. ఖజానాకు భారీ నష్టం... అసైన్డ్ భూముల్లో కచ్చా రోడ్డును వేశారని, దీనికోసం చాలా చెట్లను అనుమతి లేకుండా నరికారని మెదక్ డివిజనల్ ఫారెస్టు అధికారి(డీఎఫ్‌వో) నివేదిక సమర్పించారు. నరికివేసిన చెట్ల సంఖ్యను తక్షణమే మదించి అటవీ సంరక్షణ చట్టం–1980 కింద బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ వ్యవసాయేతర భూ మార్పిడి(నాలా) చట్టం–2006 కింద అనుమతి తీసుకోకుండానే పట్టా భూముల్లో జమున హేచరీస్ భారీ పౌల్ట్రీ షెడ్డు, ప్లాట్ ఫారాలు, భవనాలు, రోడ్డు నిర్మించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు. జరిగిన నష్టాన్ని నాలా చట్టంలోని సెక్షన్ 4 కింద మదించి రెవెన్యూ రికవరీ చట్టం (ఆర్ఆర్ యాక్టు) కింద పాత బకాయిలను వసూలు చేయాలని అధికారులను ఆదేశించడం జరుగుతుందని తెలిపారు. హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో జమున హేచరీస్ కబ్జా చేసిన ప్రభుత్వ, సీలింగ్ అసైన్డ్, పట్టా భూముల జాబితాను పట్టిక రూపంలో జిల్లా కలెక్టర్ నివేదికలో పొందుపరిచారు. గ్రామం, సర్వే నంబర్, మొత్తం భూవిస్తీర్ణం, జమున హేచరీస్ అధీనంతలోని భూవిస్తీర్ణం, కబ్జా చేసిన భూ విస్తీర్ణం వివరాలను పట్టికలో పొందుపరిచారు. జమునా హేచరీస్ అధీనంలోని 55.26 ఎకరాల పట్టా భూములు సైతం విచారణ(ఎగ్జామిషన్)లో ఉన్నట్టు ఈ పట్టికలో పేర్కొనడం గమనార్హం. అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో జమునా హేచరీస్ అధీనంలోని పట్టాభూములు, సీలింగ్ అసైన్డ్ భూములకు సంబంధించిన నక్షాను సైతం నివేదికతో కలెక్టర్ జతచేశారు. ఈటల బావమరది సూరి బెదిరింపులు... ఈటల రాజేందర్ భూ వ్యవహారంలో ఆయన బావమరిది సూరి అలియాస్ సురేష్ పేరు తెరపైకి వచ్చింది. ఈటల, సూరి తమను బెదిరించి భూ కబ్జాకు పాల్పడ్డారని పలువురు ఇచ్చిన వాంగ్మూలాన్ని జిల్లా కలెక్టర్ నివేదికలో పొందుపరిచారు. మొత్తం డబ్బులు ఇవ్వకుండానే తమ భూములను కబ్జా చేశారని చాకలి బుచ్చమ్మ(1.30 ఎకరాలు), చాకలి పరుశురాం/నాగులు (1.20 ఎకరాలు), బానాపురం రాములు(3 ఎకరాలు), ఎరుకల ఎల్లయ్య(3 ఎకరాలు) స్టేట్మెంట్ ఇవ్వగా, అసలు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండానే తమ భూమి లాక్కున్నారని బానాపురం దుర్గయ్య(3 ఎకరాలు), చాకలి లింగయ్య(1.2 ఎకరాలు), చాకలి క్రిష్ణ(1.2 ఎకరాలు) స్టేట్మెంట్ ఇచ్చారు. రికార్డుల ప్రకారం ఈ భూములన్నీ అసైన్డ్ భూములని కలెక్టర్ నిర్ధారించారు. తమ భూములను ఈటల కబ్జా చేసి రోడ్డు, పౌల్ట్రీ షెడ్లు, ప్రహరీ నిర్మించారని కొందరు చెప్పగా, తమ భూముల నుంచి అక్రమంగా మట్టిని తరలించుకుపోయారని మరికొందరు పేర్కొన్నారు. 20 మంది ఫిర్యాదు... బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన తమకు 1994లో ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములను ఈటల రాజేందర్, ఆయన సంబంధీకులు కబ్జా చేసి పౌల్ట్రీ షెడ్లు నిర్మించారని, తీవ్ర పరిణామాలు చూడాల్సి ఉంటుందని బెదిరించారని చాకలి లింగయ్య, ఇతరులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో విచారణ జరిపి క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించడం జరిగిందని నివేదకలో కలెక్టర్ పేర్కొన్నారు. దాదాపు 20 మంది తమ భూములను జమున హేచరీస్ కబ్జా చేసిందని విచారణ సందర్భంగా ఫిర్యాదు చేయడంతో పాటు తిరిగి వాటిని ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: సీఎం కేసీఆర్ సంచలనం: ఈటల బర్తరఫ్ -
తప్పు చేస్తే తప్పించుకోలేరు..
ఆదర్శ్, హరీష్, ట్వింకిల్ అగర్వాల్, సాయి శ్వేత, ఆకెళ్ల, ఫహీం ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘తప్పించుకోలేరు’. రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) దర్శకత్వం వహించారు. రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)–తలారి వినోద్ కుమార్ ముదిరాజ్– శ్రీనివాస్ మామిడాల–లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. విలేకరుల సమావేశంలో తలారి వినోద్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ– ‘‘తప్పు చేస్తే తప్పించుకోలేరు అనేది చిత్రం ప్రధానాంశం. ఈ చిత్రం విడుదల తర్వాత దర్శకుడు ఆర్.వి.జికి మంచి పేరు వస్తుంది. వి.ఎస్.పి. తెన్నేటి మాటలు–పాటలు, రాజేష్ రాజ్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ఆర్.వి.జి దర్శకత్వంలోనే మరో సినిమాకు శ్రీకారం చుట్టాం’’ అన్నారు. చదవండి: ‘రంగస్థలం’ తమిళ ట్రైలర్: చిట్టిబాబు చింపేశాడుగా -
నలుగురు కుర్రాళ్ల కథ
హరీష్, వినోద్, కార్తీక్, వెంకట చరణ్ హీరోలుగా, గీత్ షా, సంజన, లాస్యశ్రీ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘పంక్చర్’. చంద్రుడు క్రియేష¯Œ ్స సమర్పణలో శ్రీలక్ష్మి ప్రొడక్ష¯Œ ్స పతాకంపై శ్రీరంగం శేషశ్రీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో శ్రీరంగం శేషశ్రీ మాట్లాడుతూ– ‘‘ఇది నా మొదటి సినిమా. నలుగురు కుర్రాళ్ల మధ్య జరిగే పరిణామాల నేపథ్యంలోనే కథ ఉంటుంది. చక్కటి హాస్యంతో నిండిన కథతో రూపొందుతోంది’’ అన్నారు. ‘‘సమాజానికి ఉపయోగపడేలా మా సినిమా ఉంటుంది’’అన్నారు సమర్పకులు రాజు రాళ్లబండి. ‘‘ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి. చిన్న చిత్రాలను ప్రోత్సహించాలి’’ అన్నారు సంగీత దర్శకుడు అర్జున్. ‘‘వినోదంతో పాటు ఆలోచింపజేసే సినిమా ఇది’’ అన్నారు రచయిత సాయినాథ్. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, ఎల్బీశ్రీరామ్, జయప్రకాష్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:ఎస్. శ్రీనివాస్. -
విప్రోలో టీం లీడర్‌గా హరీష్ బిల్డప్..
రాంగోపాల్‌పేట్: అతను చదివింది ఏడో తరగతి.. విప్రోలో టీం లీడర్‌గా పని చేస్తున్నట్లు బిల్డప్. సూటు, బూటు, వేష భాషలతో కనికట్టు చేస్తాడు. వీఐపీలతో సెల్ఫీలు దిగి అందరితో పరిచయాలున్నాయంటూ నమ్మిస్తాడు...తన పలుకుబడితో సాప్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని గోపాలపురం పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా, వావిలాలపల్లికి చెందిన రిషిరెడ్డి అలియాస్ హరీష్ 7వ తరగతితో చదువుకు ఫుల్స్టాప్ పెట్టాడు. తండ్రి హెచ్ఎంగా పనిచేస్తూ కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. తల్లి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తోంది. జల్సాలకు అలవాటు పడిన హరీష్ 2016లోనే ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. అప్పటి నుంచి పలువురు ప్రముఖులు, మంత్రులు, వీఐపీలతో ఫొటోలు దిగుతూ వాటిని చూపి అమాయకులను మోసం చేసేవాడు. తాను విప్రో కంపెనీలో టీం లీడర్‌గా పనిచేస్తున్నానని ప్రచారం చేసుకునే అతను విప్రోతో పాటు ఇతర సాఫ్ట్వేర్ సంస్థల్లో పెద్ద జీతంతో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి వారి నుంచి రూ.లక్షలు వసూలు చేసేవాడు. ఆ డబ్బుతో విల్లాలు, స్టార్ హోటళ్లలో బస చేస్తూ విలాసవంతమైన జీవితం గడిపేవాడు. గత కొన్నేళ్లుగా కరీంనగర్, నిజామాబాద్, ఎల్లారెడ్డి, గోదావరిఖని ప్రాంతాల్లో దాదాపు 50 మందిని ఇదే తరహాలో మోసం చేశాడు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆరుగురు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యా యి. గత జూలైలో హైదరాబాద్‌కు మకాం మార్చిన హరీష్ సికింద్రాబాద్ రెజిమెంటల్‌బజార్‌లోని గణేష్ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. తన మాటల మాయాజాలంతో అక్కడున్న వారిని మచ్చిక చేసుకున్నాడు. హోటల్ నిర్వాహకుడు సురేష్‌తో పరిచయం పెంచుకున్న అతను అతని బంధువులకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ విప్రో కంపెనీకి తీసుకెళ్లాడు. వారిని కింద ఉంచి పైన ఉండే కార్యాలయంలోకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి తిరిగి వచ్చి ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. అనంతరం నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ అంటగట్టి వారి నుంచి రూ.4లక్షలు తీసుకున్నాడు. బయటికి వెళ్లి వస్తానని వారి బైక్ తీసుకుని వెళ్లిన అతను చెప్పి అక్కడినుంచి పరారయ్యాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు కంపెనీకి వెళ్లి విచారించగా ఆ పేరుతో ఎవరూ పనిచేయడం లేదని చెప్పారు. అతడు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా నకిలీదని తేల్చారు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడి కోసం గాలిం పు చేపట్టారు. బుధవారం బాధితుల సమాచారం మేరకు ట్యాంక్‌బండ్ నిందితుడు హరీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అతడి నుంచి బైక్, 3తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఏరీ... ఎక్కడ!
ప్రజా ప్రతినిధి అంటే ఓడినా, గెలిచినా నిత్యం ప్రజల మధ్యనే ఉండాలి. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. గెలిస్తే ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఓటర్ల మన్ననలు అందుకోవాలి. ఓడితే ఆ కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాసటగా నిలవాలి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులుగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్, మాగంటి రూప, గంటి హరీష్‌ల జాడే కానరాకపోవడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి): అధికారం ఉంటే హల్చల్ చేస్తారు. ఆ అధికారం దూరమైతే ఆచూకీలేకుండా పోతారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయంటే చాలు హడావుడి... తెలుగుదేశం పార్టీ నేతల తీరు ఇదీ అని జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని మూడు పార్లమెంటు స్థానాల నుంచి పోటీచేసి ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ అభ్యర్థుల ఆచూకీ కోసం ఆయా నియోజకవర్గ ప్రజలు భూతద్దాలు పెట్టి వెతికినా కనిపించడంలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనాన్ని సృష్టించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటిపోయింది. ఇన్ని నెలలయినా టీడీపీ నుంచి పోటీ చేసిన ముగ్గురు పార్లమెంటు అభ్యర్థుల జాడ పార్టీ కార్యక్రమాల్లో లేకుండా పోయింది. మురళీ రాగం ఏమైంది...? మూడు నెలల కిందట ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్లమెంటు స్థానాల నుంచి టీడీపీ ఓటమిని మూటగట్టుకుంది. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థులు మాగంటి రూప, చలమలశెట్టి సునీల్, గంటి హరీష్ మాధుర్ ఎన్నికలైపోయాక నియోజకవర్గాన్నే మరచిపోయారు. సినీ నటుడు మాగంటి మురళీమోహన్ రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం నుంచి ఎంపీ కావాలని కలలుగని తొలిసారి 2009లో పోటీచేసి మహానేత వైఎస్ గాలిలో ఓటమి చవిచూశారు. అప్పుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై పోటీచేసి ఓడిపోయిన మురళీమోహన్ ఆ తరువాత సేవా కార్యక్రమాలతో పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో తిరుగుతూండే వారు. తరువాత 2014లో పోటీచేసి ఎంపీ కావాలనే కలను మురళీమోహన్ సాకారం చేసుకున్నారు. ఎంపీ అయ్యాక కోడలు రూపను వెంట తిప్పుకుంటూ తన రాజకీయ వారసురాలుగా ఎంపీకి పోటీ చేస్తారనే సంకేతాల్లో పంపించారు. ఆ క్రమంలోనే గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం ఎంపీగా కోడలు రూప బరిలోకి దిగగా వైఎస్సార్సీపీ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్ చేతిలో లక్షపై చిలుకు ఓట్ల తేడాతో ఘెర పరాజయాన్ని మూటగట్టుకోక తప్పింది కాదు. అప్పటి నుంచి మామ, కోడలు జనానికి దూరమయ్యారు. స్థానికత్వం కోసం రాజమహేంద్రవరం వెంకటేశ్వరనగర్‌లో మురళీమోహన్ సొంత ఇల్లు కూడా నిర్మించుకున్నారు. ఈ నెలాఖరుకు రాజమహేంద్రవరంలోని ఇంటిని కూడా ఖాళీచేసి రాజకీయాలకు ప్యాకప్ చెప్పేందుకు సిద్ధపడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇంటి వద్ద పనిచేస్తున్న సిబ్బందికి నెలాఖరు వరకూ మాత్రమే పని ఉంటుందని, ఆ తరువాత ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పేశారంటున్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఇక్కడే ఉండి సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామని మురళీమోహన్ చెప్పిన మాటలు ఏమయ్యాయని పార్టీ కేడర్ ప్రశ్నిస్తోంది. గంటి హరీష్దీ అదే దుస్థితి అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి ఓటమిచెందిన గంటి హరీష్ మాధుర్‌ది కూడా దాదాపు అదే పరిస్థితి. లోక్‌సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగికి ఉన్న పేరు, ప్రతిష్టలు, బాలయోగి వారసుడిగా సానుభూతి కలిసి వస్తుందని అతని కుమారుడు మాధుర్‌ను టీడీపీ బరిలోకి దింపింది. బాలయోగిపై ఉన్న సానుభూతితో గెలుపు ఖాయమనే అతి విశ్వాసానికి పోయిన ఆ పార్టీ ఫలితాల్లో బోర్లాపండింది. ఓటమి తరువాత మాధుర్ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. అమలాపురం నల్లవంతెనకు సమీపాన ఇల్లును అద్దెకు తీసుకుని స్థానికంగా ఉంటామని ఎన్నికలప్పుడు నమ్మకాన్నికలిగించే ప్రయత్నం చేశారు. తీరా ఓడిపోయాక గడచిన మూడు నెలల్లో పార్లమెంటు పరిధిలో ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొన్న దాఖలాలు లేవు. బాలయోగి వారసుడిగా పార్టీకి ఓ ఊపు వస్తుందనుకున్న అధిష్టానం అంచనాలు తలకిందులయ్యాయి. సునీల్ సీను అంతే... జిల్లా కేంద్రం కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి మూడోసారి ఓటమి తరువాత చలమలశెట్టి సునీల్ ఎక్కడున్నాడో పార్టీ శ్రేణులకు కూడా తెలియడం లేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ, 2014 వైఎస్సార్సీపీ, 2019లో టీడీపీ...ఇలా మూడు ఎన్నికలు ... మూడు పార్టీలన్నట్టుగా పోటీచేసిన సునీల్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అయినా మూడు ఎన్నికల్లో వరుస ఓటముల తరువాత పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించే సాహసం చేయలేకపోతున్నారంటున్నారు. వాస్తవానికి సునీల్ హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ కాకినాడ ఎల్బీ నగర్లో పెద్ద బిల్డింగ్ అద్దెకు తీసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహించే వారు. అటువంటి భవనం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. ఎన్నికల ముందు రావడం ... ఓటమి తరువాత కనిపించకుండా పోవడం షరామామూలేనని అంటున్నారు. ఇలా ముగ్గురు టీడీపీ పార్లమెంటు అభ్యర్థులు జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు దూరమైపోయారు. ఇటీవల చంద్రబాబు కాకినాడలో పార్టీ జిల్లా సమీక్షా సమావేశానికి వచ్చినప్పుడు మురళీమోహన్, రూప, సునీల్ మొహం చాటేశారు. ఎటొచ్చీ హరీష్‌మాధుర్ ఆ ఒక్క రోజు మాత్రమే వచ్చి ఆ తరువాత జిల్లాలో కనిపించలేదు. ఇలా ఓటమి తరువాత పార్లమెంటు నియోజకవర్గాన్ని విడిచిపెట్టిపోయే నేతల తీరును క్యాడర్ ఏవగించుకుంటోంది. -
పల్లెలు మెరవాలి
సాక్షి, రంగారెడ్డి : 30రోజుల ప్రణాళికలో భాగంగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే పంచాయతీల ప్రత్యేక కార్యాచరణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ హరీష్ సూచించారు. పల్లెలను పరిశుభ్రంగా, పచ్చదనంగా తీర్చిదిద్దడమే అందరి లక్ష్యం కావాలన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 30 రోజుల ప్రణాళిక కార్యాచరణపై జిల్లాస్థాయి అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. ప్రతి మండలానికి నియమించిన ప్రత్యేక నోడల్ అధికారి.. చేయాల్సిన పనుల జాబితాను రూపొందించుకోవాలన్నారు. పూర్తిచేసిన పనుల వివరాలను ఎప్పటికప్పుడు డీపీఓకు తెలియజేయాలన్నారు. ప్రతిఇంటి ఆవరణలో నాటుకునేందుకు వీలైన మొక్కలను అందజేయాలన్నారు. వార్షిక, పంచవర్ష ప్రణాళికలను రూపొందించి గ్రామసభల ఆమోదం తీసుకోవాలని సూచించారు. ఈ ప్రణాళికను అనుగుణంగానే బడ్జెట్ రూపొందించాలని చెప్పిన ఆయన.. అప్పులు, జీతాలు, కరెంటు బిల్లుల చెల్లింపు ఖర్చులను వ్యయం పద్దులో చూపెట్టాలన్నారు. ప్రతి ఇంటికి, ఆస్తికి కచ్చితమైన విలువ కట్టి క్రమం తప్పకుండా ఆస్తుల విలువ మదింపు చేయాలన్నారు. దీనికి అనుగుణంగా పన్నులు వసూలు చేయాలన్నారు. ప్రత్యేక నోడల్ అధికారుల నియామకం.. పంచాయతీల్లో 30 రోజుల ప్రణాళిక రూపొందించి అమలు చేసేందుకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక నోడల్ అధికారులుగా నియమించారు. 21 గ్రామీణ మండలాలకు ఒకరి చొప్పున నియమిస్తూ ఇన్చార్జి కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. గురువారం ఎంపీడీఓల సమక్షంలో ప్రత్యేక నోడల్ అధికారులు.. అన్ని పంచాయతీలకు మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించనున్నారు. ఆమనగల్లు – జి.ప్రశాంతి (జిల్లా ఉపాధి అధికారిణి), అబ్దుల్లాపూర్‌మెట్ – డాక్టర్ సునందారాణి (జిల్లా ఉదాన్యశాఖ అధికారిణి), చేవెళ్ల – డాక్టర్ కేవీఎల్ నర్సింహారావు (జిల్లా పశుసంవర్థకశాఖ అధకారి), ఫరూఖ్‌నగర్– ఓం ప్రకాశ్ (జిల్లా ప్రణాళికాధికారి), చౌదరిగూడం – ఎ.వెంకటరమణ (వయోజన విద్యాశాఖ డీడీ), కడ్తాల్ – రత్నకల్యాణి (జిల్లా మైనారిటీ అభివృద్ధిశాఖ అధికారిణి), కందుకూరు – సత్యనారాయణరెడ్డి (జిల్లా విద్యాశాఖాధికారి), కేశంపేట –చంద్రారెడ్డి (జిల్లా భూగర్భజలశాఖ అధికారి), కొందుర్గు – జానకిరెడ్డి (జెడ్పీ అకౌంట్స్ ఆఫీసర్), మాడ్గుల – ప్రవీణ్‌రెడ్డి (గనులశాఖ అధికారి), మహేశ్వరం – రాజేశ్వర్‌రెడ్డి (జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం), మంచాల – దివ్యజ్యోతి (ఆత్మ పీడీ), మొయినాబాద్ – గీతారెడ్డి (జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి), శంకర్పల్లి –ప్రశాంత్‌కుమార్ (డీఆర్డీఓ), శంషాబాద్ – బోజరాజు (మెప్మా పీడీ), తలకొండపల్లి – వెంకట్రాంరెడ్డి (డీఆర్డీఏ అదనపు పీడీ), ఇబ్రహీంపట్నం – సుకీర్తి (మత్స్యశాఖ అధికారిణి), షాబాద్ – అంజయ్య (జిల్లా సహకారశాఖ అధికారి), కొత్తూరు–ఛాయాదేవి (మార్కెటింగ్ శాఖ ఏడీ), నందిగామ–ఎన్.మోతీ (జిల్లా సంక్షేమాధికారిణి), యాచారం – జ్యోతి (మార్క్‌ఫెడ్ డీఎం)లను ప్రత్యేక నోడల్ అధికారులుగా నియమితులయ్యారు. మార్గదర్శకాలు జారీ.. పంచాయతీల్లో 30 రోజుల ప్రణాళిక అమలులో కీలకమైన కోఆప్షన్, పంచాయతీ స్థాయీ సంఘాల కమిటీలను నియమించేందుకు ఇన్చార్జి కలెక్టర్ మార్గదర్శకాలు జారీచేశారు. ఒక్కో జీపీకి ముగ్గురు చొప్పున కోఆప్షన్ సభ్యులు, నాలుగు చొప్పున స్టాండింగ్ కమిటీలను నియమించాలని సూచించారు. వీటి నియామకంలో పాటించాల్సిన నిబంధనలను పేర్కొంటూ ఎంపీడీఓలకు సర్క్యులర్ జారీచేశారు. -
నిష్క్రమణే నికార్సయిన మందు!
జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను అంతర్గతంగా కూడా ప్రశ్నిస్తూ వచ్చిన రాజకీయ సంస్కృతి సోనియా గాంధీ హయాం నుంచి కనుమరుగు కావడమే కాంగ్రెస్ ప్రస్తుత పతనానికి ముఖ్యకారణం. కుటుంబ నాయకత్వంపట్ల తిరుగులేని విశ్వాసం ప్రదర్శించడంతో పార్టీ స్వీయ విమర్శనా సమర్థతకు తీవ్ర హాని జరిగింది. కొత్త ప్రయోగాలు చేయడానికి సిద్ధం కావడం కాదుకదా.. మార్పు అనే భావనకే అది దూరమైపోయింది. రాహుల్ గాంధీ స్వీయ నిష్క్రమణ కాంగ్రెస్ భవిష్యత్తుకు నిక్కమైన మేలు చేస్తుంది. చరిత్రలో నిర్ణాయకమైన స్థానంవైపు ముందుకు నడవడంలో ఏ రాజకీయ పార్టీ అయినా కఠిన నిర్ణయానికి సిద్ధపడాల్సి ఉంటుంది. ఈ సంధికాలంలోనే పార్టీ సభ్యులు నాయకత్వాన్ని పరీక్షించడం, ప్రశ్నించడం నేర్చుకోవాలి. సంస్థ నిర్మాణాన్ని బాగు చేసుకోవడంలో కాంగ్రెస్ నిజంగా రక్తమోడ్చాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సూత్రాలు, దాని సిద్ధాంతం, దాని విధానాలు, సంప్రదాయాల గురించి చర్చించే అవకాశం తమకు కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ సభ్యులు యావన్మందీ రాహుల్ గాంధీకి కృతజ్ఞులై ఉండాలి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం పొందడంతో రాజకీయ పార్టీ అంటే ఎన్నికలకు సంబంధించింది మాత్రమే కాదని, దానికి మించిన ప్రాధాన్యం ఉంటుందని కాంగ్రెస్ వాదులకు బోధపడింది. దేశ ఐక్యత, సమగ్రత, భద్రత, సుస్థిరత, సౌభాగ్యం, సామరస్యం, సమానత్వం, న్యాయం వంటి భారత రిపబ్లిక్ ఆశయాల పరిరక్షణకు సదా నిలుస్తూ వచ్చిన సూత్రబద్ధ సంస్థగా కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ విలువను పునరుద్ధరిం చేందుకు రాహుల్ రాజీనామాకు మించిన గొప్ప సందర్భం బహుశా ఉండదు. పైన పేర్కొన్న విలువలు, లక్ష్యాలు ఏ సంఘటిత రాజకీయ సంస్థకైనా అవసరమే. అనుకూల, వ్యతిరేక స్వభావంతో ఉన్న ఇరుగుపొరుగు దేశాలు, అననుకూలమైన, ఇబ్బందికరమైన ప్రపంచ వాతావరణం రెండింటినీ సర్దుబాటు చేసుకుని భారత ప్రభుత్వం ముందుకు నడుస్తున్న తరుణమిది. జాతీయ స్వాతంత్య్ర పోరాటాన్ని నడపటంలో, శిశుప్రాయంలోని జాతీయ రాజ్యాన్ని సంఘటిత పర్చడంలో బలమైన రాజకీయ ఉపకరణంగా నిలిచిన కాంగ్రెస్ పార్టీకి గర్వించదగిన చరిత్ర ఉంది. పైగా మన ప్రజాస్వామిక రాజ్యపాలనా విధానాన్ని సచేతనంగా ఉంచడంలో ఈ పార్టీ కీలకపాత్ర పోషిస్తోంది కూడా. ఇంతటి ఘనతర చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి తన రాజకీయ స్వరాన్ని మళ్లీ కనుగొనవలసిన అవసరం ఉంది. ఇన్నాళ్లుగా కాంగ్రెస్ వాదులు తమ పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేయడం ఆపివేసిన కారణంగానే ఈ లక్ష్యం నిర్లక్ష్యానికి గురైంది. అయితే కాంగ్రెస్ అన్ని కాలాల్లోనూ ఇలాగే ఉండేదని చెప్పలేం. గతాన్ని కాస్త పరికిద్దాం. జవహర్లాల్ నెహ్రూ దేశ ప్రధానిగా పనిచేసినంత కాలం ఆయన విధానాలు సొంతపార్టీలోనే సవాలుకు గురయ్యేవి. ఇక ఇందిరాగాంధీ హయాంలో స్పష్టంగా రెండు చీలికలను మనం చూడవచ్చు. మారుతున్న రాజకీయ అర్థశాస్త్రానికి అనుగుణంగా పార్టీ అంతర్గత సమీకరణలను పునరేకీకరించడానికి ఈ చీలికలు ముందుకొచ్చాయి. ఇక రాజీవ్ గాంధీ హయాంలో వీపీ సింగ్, అరుణ్ నెహ్రూ, పీవీ నరసింహారావు ఆయనతో నేరుగా తలపడ్డారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వీరు రాజీవ్‌ని సవాలు చేశారు. ఈ క్రమంలో తల్కతోరా స్టేడియంలో జరిగిన ఒక బోగస్ తిరుగుబాటు ఉదంతాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇక తర్వాత ఎన్నికైన పార్టీ అధ్యక్షుడు సీతారాం కేసరిని 1998 మార్చి 14న జరిగిన అప్రతిష్టాకరమైన కుట్రలో పదవినుంచి తొలగించేశారు. ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీ తన యధాతథ స్థితి పట్ల సౌకర్యవంతంగా ఫీలవుతూ, పూర్తి సంతృప్తి చెందుతూ కాలం గడుపుతూ వచ్చింది. కుటుంబ నాయకత్వ నమూనా పట్ల తిరుగులేని విశ్వాసం ప్రదర్శించిన యధాతథ స్థితిని అనాలోచితంగా ఆలింగనం చేసుకోవడంతో తనను తాను విమర్శించుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సమర్థతకు తీవ్రంగా హాని జరిగింది. ఈ ఆరాధనా భావం వల్ల పార్టీ విధానాలు దెబ్బతినిపోవడమే కాకుండా, జాతీయ లక్ష్యాలు, ప్రయోజనాలకు కూడా హాని కలిగింది. ఈ క్రమంలో సంస్థాగత నిర్మాణంలో ఎలాంటి కొత్త ప్రయోగాలు చేయడానికి కూడా ఆ పార్టీ భీతిల్లిపోయింది. పైగా మార్పు అనే భావననుంచే అది దూరం జరిగిపోయింది. పార్టీ అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం పనిచేసిన సోనియా గాంధీ అనుభవజ్ఞులైన, సీజనల్ నేతల కూటమికి మాత్రమే అందుబాటులో ఉండేవారు. పార్టీ పాలనా విధానంలో నెహ్రూవియన్ సమానతావాదానికి కేంద్ర స్థానం కల్పిస్తూ పాత విధానాలనే పునరుద్ధరించాలని వీరు ఆందోళన చేసేవారు. వీరే సోనియాకు రక్షణ కవచంగా ఉండి ఆమెను రక్షించే పనిలో మునిగిపోయారు. కానీ అలాంటి నాయకులందరూ ఇప్పుడు ముసలివారైపోయారు. పైగా గాయాల బారిన పడిన పార్టీని యధాతథంగా కొనసాగించడం అనే ఆటలో వీరంతా అలసిపోయారు. వారసత్వాన్ని సమర్థిస్తూవచ్చిన ఈ వయోవృద్ధులు ఎవరూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఏకైక అభ్యర్థిగా రాహుల్ గాంధీనే తగినవారు అనే భావనను ముందుకు తీసుకెళ్లడంలో స్వయంగా రాహుల్‌నే మెప్పించలేకపోయారు. తమ సొంత కుమారులను, కుమార్తెలను ప్రోత్సహించే విషయంలో ప్రలోభాలకు దూరంగా ఉండటంలో విఫలమైన వీరు రాహుల్ గాంధీకి రాజకీయ సమగ్రత్వం, సంపూర్ణత్వం అలవర్చగలరని ఎలా ఊహించగలం? తన వెనుకనుంచి తనకు తగిలిస్తున్న ‘పప్పు’ ముద్రనుంచి బయటపడటానికి రాహుల్ గాంధీకి దాదాపు దశాబ్ద కాలం పట్టింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గట్టి పోరాటమే చేశారు. చాలామంది ఈ ఎన్నికల్లో రాహుల్ పనితీరుపట్ల ప్రశంసలు కురిపించారు. తీవ్రమైన వెనుకంజలు, ఎదురుదెబ్బలను తట్టుకుని నిలబడటంలో రాహుల్ కనబర్చిన అసాధారణ స్థిరత్వం పట్ల ప్రజల్లో గౌరవం పెరిగింది. కానీ రాహుల్ చేసిన ఈ రాజీనామా విషయం ఎలా అర్థం చేసుకోవాలి? తనపై దాడికి దిగిన కాషాయపార్టీ ప్రత్యర్థులతో తలపడడానికి అవసరమైన నిర్ణయాత్మక శక్తి, నిపుణతలు, కృత నిశ్చయం వంటివి తనకు లేవని రాహుల్ స్వయంగా అర్థ చేసుకున్నట్లు కనబడుతోంది. భారతదేశంలో కానీ, ప్రపంచంలో మరెక్కడైనా సరే రాజకీయ జీవితం అనేది వ్యక్తులకున్న పరిధిని, మనోభావాలను సామూహిక హితానికి పూర్తిగా లోబర్చవలసి ఉంటుందని డిమాండ్ చేస్తుంటుంది. ఇలా చేయడం తనకు సాధ్యం కాదని రాహుల్ భావిస్తూ ఉండవచ్చు. అందుకే రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను కాంగ్రెస్ ఇప్పుడు తప్పకుండా ఆమోదించాలి. గాంధీ కుటుంబం వెలుపల నుండి ఆయన స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడిని కనుగొనాల్సి ఉంది. ఇది కీలకమైన దశ. కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. చరిత్రలో నిర్ణాయకమైన స్థానంవైపు ముందుకు నడవడంలో ఏ రాజకీయ పార్టీ అయినా కఠిన నిర్ణయానికి సిద్ధపడాల్సి ఉంటుంది. మారుతున్న కాలంలో ప్రజల అవసరాలకు సమాధానం ఇవ్వడంలో వాజ్‌పేయి, అడ్వాణీ ద్వయం ఇక ముందుకు పోలేరన్న వాస్తవాన్ని బీజేపీ కేడర్లకు, నాయకులకు వివరించి నచ్చచెప్పడంలో నరేంద్రమోదీ అద్భుత కృషి చేశారు. పైగా రాహుల్ గాంధీ వయస్సు కూడా ఒక ప్రశ్నగా మారింది. అంటే ఆయనను ఇప్పుడు ఇంటికి వెళ్లడానికి అనుమతించకపోతే, మరో 20 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ రాహుల్‌నే అంటిపెట్టుకుంటుంది. అది కూడా రాహుల్ పెట్టే షరతులపైనే పార్టీ కొనసాగాల్సి ఉంది. ఇది కచ్చితంగా వారసత్వాన్ని కొనసాగించడం వైపే సాగుతుంది. ఇదే సమయంలో ప్రియాంక గాంధీని స్టార్ కేంపెయినర్‌గా ముందుకు తీసుకురావడం ఎన్నికల సీజన్లో ఒక రకమైన శక్తిని పార్టీకి తీసుకొచ్చింది. కానీ దీనివల్ల కూడా కాంగ్రెస్ పార్టీ వారసత్వ ముద్రనే మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చినట్లయింది. దీంతో కాంగ్రెస్ భాయి–బెహెన్ (అన్నా, చెల్లెలు) పార్టీ స్థాయికి కుదించుకుపోయింది. అందుకే నామ్‌ధార్, కామ్‌ధార్ నినాదంతో నరేంద్రమోదీ ఈ వంశపారంపర్య రాజకీయాలను తన ప్రచారంలో సులువుగా ఎండగట్టగలిగేరు. అమేథీలో రాహుల్ నామినేషన్ దాఖలు చేసిన రోజు అప్రదిష్ట పాలైన రాబర్ట్ వాద్రా తెరముందుకొచ్చారు. ఆయన కుమారుడు రెహాన్ కాంగ్రెస్ కుటుంబ రాజకీయ వ్యవస్థ సంభావ్య వారసుడిగా ఆ సమయంలో కనిపించాడు. ఒకరకంగా 2019 పోలింగ్‌కి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరాజయం కంటే ఎక్కువ విలువ కలిగింది. వారసత్వ రాజకీయ నాయకత్వ నమూనాను ఇది తిరస్కరించింది. ఏమాత్రం రాజీపడని రాజకీయ ప్రత్యర్థిని కాంగ్రెస్ ఎదుర్కొంది. నెహ్రూవియన్ విదానాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని వ్యతిరేకిస్తున్న ఒక సిద్ధాంతంతో కాంగ్రెస్ పార్టీకి సవాలు ఎదురైంది. దీంతో భారతీయ సామాజిక సమీకరణాలనే కాంగ్రెస్ కొత్తగా మథనం చేయాల్సి వచ్చింది. మన దేశపౌరులకు తిరిగి హామీ ఇవ్వగలిగిన ఒక విశ్వసనీయమైన ప్రాపంచిక దృక్పథాన్ని అది నేర్చుకోవలసి వచ్చింది. పైగా తన కేడర్, కార్యకర్తలు సంతోషంగా స్వీకరించగలిగిన ఒక స్పష్టతను, దార్శనికతను అది ప్రదర్శించవలసి వచ్చింది. దీనికోసం కాంగ్రెస్ పార్టీకి నిజంగానే సాంస్కృతిక విప్లవం లాంటిది అవసరమవుతుంది.. కానీ ఈ తరహా పరిష్కారంలో ‘గాంధీ’లు భాగం కాలేరు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ నిష్క్రమణను కాంగ్రెస్ దయతో అనుమతించాల్సి ఉంది. అనేకమంది కాంగ్రెస్ వాదుల వ్యక్తిగత అదృష్టాలు గాంధీ కుటుంబంతోనే ముడిపడివున్నాయి. ఇలాంటి నాయకులే ఇప్పుడు రాహుల్ పదవినుంచి దిగిపోతే, అస్త్రసన్యాసం చేస్తే పార్టీ విచ్ఛిన్నమవుతుందనీ, కుప్పగూలిపోతుందనీ భయాందోళనలను ప్రచారం చేస్తూ వస్తున్నారు. అనివార్యమైన ఈ ఉపద్రవం, ఈ కల్లోలభరిత కాలం కాంగ్రెస్ పార్టీకి నిజంగానే మంచి చేస్తుంది. ఈ సంధికాలంలోనే పార్టీ సభ్యులు నాయకత్వాన్ని పరీక్షించడం, ప్రశ్నించడం నేర్చుకోవాల్సి ఉంటుంది. పైగా అవసరమైతే నాయకత్వానికి, కార్యకర్తలకు మధ్య, ఆదేశాలకు, విధేయతకు మధ్య ఉన్న సంబంధాల సంప్రదాయాన్ని కూడా వీరు ఛేదించవలసి ఉంటుంది. యావత్ పార్టీ నిర్మాణాన్ని బాగు చేసుకునే క్రమంలో కాంగ్రెస్ నిజంగానే రక్తమోడ్చాల్సి ఉంటుంది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ‘ది వైర్’తో ప్రత్యేక ఏర్పాటు -
రైతుని కాపాడండి
‘‘సింహరాశి, శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఎవడైతే నాకేంటి, అధినేత వంటి పలు హిట్ చిత్రాలు తీసిన వి.సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జై సేన... ది పవర్ అఫ్ యూత్’. శ్రీకాంత్, సునీల్, శ్రీ ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రవీణ్, కార్తికేయ, హరీష్, అభిరామ్‌లు హీరోలుగా పరిచయమవుతున్నారు. శివ మహాతేజ ఫిలిమ్స్‌పై సాయి అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్యాచ్ వర్క్ మినహా పూర్తయింది. సముద్ర మాట్లాడుతూ– ‘‘దేశానికి వెన్నెముక అయిన రైతుని కాపాడండి అంటూ ప్రభుత్వంతో, రాజకీయ నాయకులతో విద్యార్థులు చేసే యుద్ధమే ఈ సినిమా. మంచి సందేశం ఉన్న ఈ చిత్రం నాకు మరో హిట్ అవుతుంది. ఇందులో ఇద్దరు ప్రముఖ హీరోలు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి కెమెరా: వాసు, మ్యూజిక్: ఎస్ఆర్ రవిశంకర్, సహ నిర్మాతలు: శిరీష్ రెడ్డి, శ్రీనివాస్. -
ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఖాయం
సంగీత దర్శకుడు చక్రవర్తి తనయుడు రాజేష్ శ్రీ చక్రవర్తి హీరోగా హరీష్ వట్టికూటి దర్శకత్వంలో మాస్టర్ హరి సమర్పణలో సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మోహన్‌బాబు పులిమామిడి నిర్మించిన సినిమా ‘శివకాశీపురం’. ఇందులో ప్రియాంకా శర్మ కథానాయికగా నటించారు. వచ్చే నెల 3న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాతలు కేవీవీ సత్యనారాయణ, రాజ్ కందుకూరి, రుద్రరాజు పద్మరాజు, నల్లమోతు శ్రీధర్ అతిథులుగా పాల్గొని చిత్రం పాటలు, ట్రైలర్, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ‘‘ట్రైలర్ బాగుంది. రాజేష్ బాగా నటించాడు. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కేవీవీ సత్యనారాయణ. ‘‘ఈ సినిమా టైటిల్ నాకు బాగా నచ్చింది. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాజ్ కందుకూరి. ‘‘ఈ రోజుల్లో చిన్న సినిమా విడుదల కావడం కష్టంగా మారింది. ట్రైలర్లో టీమ్ తపన కనిపిస్తోంది. వారి కష్టానికి తగిన ఫలితాన్ని అందించాలని మిత్రుడు విజయవర్మ సినిమా విడుదల బాధ్యతను తీసుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు రుద్రరాజు పద్మరాజు. ‘‘మంచి కథతో సినిమా తీశాం. హరీష్ బాగా తెరకెక్కించాడు’’ అన్నారు నిర్మాత మోహన్. ‘‘ఒక మంచి చిత్రం చేయడానికి నిర్మాత ఎలాంటి సహయం అదించాలన్నది మోహన్‌బాబుగారిని చూసి తెలుసుకోవాలి. ఈ రోజుల్లో సినిమా చేయడం వేరు, దాన్ని రిలీజ్ చేయడం వేరు. ఆ బాధ్యతను తీసుకున్న విజయ్‌వర్మకు థ్యాంక్స్’’ అన్నారు హరీష్. ‘‘ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’’ అన్నారు విజయ్. ‘‘నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు థ్యాంక్స్. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు హీరో రాజేష్. ప్రియాంక శర్మ పాల్గొన్నారు. -
హత్యా..? ఆత్మహత్యా..?
సైదాపూర్(హుస్నాబాద్): ఓ యువకుడు ఓ వివాహిత ఇంట్లో ఉరేసుకుని అనుమానాస్పదస్థితిలో చనిపోయిన ఘటన మండలంలోని ఎలబోతారం గ్రామంలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. యువకుడి మృతికి సదరు మహిళే కారణమని, వివాహేతర సంబంధం నెరిపి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తోందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. చిగురుమామిడి మండలం సుందరగిరికి చెందిన మ్యాకల ముత్యాలమ్మ, రాజయ్య కుటుంబం మండలంలోని ఎలబోతారం గ్రామానికి ఏళ్ల క్రితమే వలసవచ్చింది. వీరి కుమారుడు హరీష్(23) చింతలపల్లి గోదాములో పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులిద్దరూ హరీశ్ చిన్నతనంలోనే చనిపోయారు. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో హరీష్‌కు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. సదరు వివాహిత భర్త రాజన్నసిరిసిల్ల జిల్లాలో పనిచేస్తుండగా.. ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఎలబోతారంలోనే ఉంటోంది. హరీష్‌తో వివాహేతర సంబంధముందన్న విషయం తెలిసి ఆమె భర్త తరచూ గొడవపడుతున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఈ విషయం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేవరకూ వెళ్లింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా.. కొద్దిరోజులకు మళ్లీ ఎప్పటిలాగే వివాహేతర సంబంధం నెరుపుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈక్రమంలో శనివారం రాత్రి హరీష్ మద్యంతాగి తన ఇంటికి వచ్చాడని సదరు వివాహిత పోలీసులకు ఫోన్‌ద్వారా సమాచారం అందించింది. బ్లూకోట్ సిబ్బంది వచ్చేసరికే.. ఇంట్లో దూళానికి ఉరేసుకుని కనిపించాడు. ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హరీష్‌ను సదరు మహిళే హత్య చేసి ఉంటుందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. న్యాయం జరిగేవరకూ మృతదేహాన్ని తీసుకెళ్లేదిలేదని ఆందోళనకు దిగారు. అనుమానితులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో సదరు వివాహితపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. -
శివకాశీపురం ఘనవిజయం సాధించాలి
సాయి హరీశ్వర ప్రొడక్షన్స్బ్యానర్ పై మాస్టర్ హరి సమర్పణలో మోహన్‌బాబు పులిమామిడి నిర్మిస్తూ, హరీష్ వట్టికూటిని దర్శకునిగా పరిచయం చేస్తున్న సినిమా ‘శివకాశీపురం’. స్వర్గీయ స్వరచక్రవర్తి మనవడు, సంగీత దర్శకుడు శ్రీ తనయుడు అయిన రాజేష్ శ్రీ చక్రవర్తి హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలోని మూడవ పాటను తెలంగాణ ఎఫ్డీసీ చెర్మన్ రామ్మోహన్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సినిమాలో ఎక్కువ పోర్షన్‌ను మంచిర్యాలలో తీశారు. చాలా సంతోషం. సినిమా వాళ్ళకు తెలంగాణ లో ఎక్కడైనా సహకారం లభిస్తుంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ ఈ పాటను రామ్మోహన్ రావుగారు రిలీజ్ చేయటం ఆనందంగా ఉంది. రిలీజ్ అప్పుడు కూడా ఆయన సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘ సినిమాను జనవరి లేదా ఫిబ్రవరిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం. పవన్ శేష్ సంగీతం హైలెట్‌గా నిలుస్తుంది’’ అన్నారు దర్శకుడు. -
ప్రభుత్వ వ్యవస్థ బలోపేతానికి చర్యలు
కొత్తూరు(షాద్‌నగర్): గత పాలకుల నిర్లక్ష్యంతో అన్ని రంగాల్లో వెనుకబడిన రాష్ట్రాన్ని కేవలం మూడున్నర ఏళ్లలోనే అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చామని భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో నాట్కో ట్రస్ట్–ఎల్వీప్రసాద్ ఆస్పత్రి భాగస్వామ్యంతో నిర్మించిన కంటి ఆస్పత్రిని ఆయన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ బలహీనంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారని, దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో 540 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థికి సగటున లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నారని మంత్రి వివరించారు. తల్లిదండ్రులు ప్రైవేట్ నుంచి తమ పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించడానికి క్యూ కడుతున్నారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, వసతులు మెరుగుపర్చినట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 35 తాలూకా ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు, 55 ఆస్పత్రుల్లో ఐసీయూలను ఏర్పాటు చేసినట్లు హరీశ్‌రావు చెప్పారు. గ్రీన్ట్రిబ్యునల్లో కేసులతోనే ‘పాలమూరు’ఆలస్యం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేతలు చట్టాల్లోని లొసుగుల ఆధారంగా గ్రీన్ట్రిబ్యునల్లో కేసులు వేస్తున్నారని, దీంతో పనులు ఆలస్యమవుతున్నాయని హరీశ్ అన్నారు. ఏడాది లోపలే అడ్డంకులు, కేసులను పరిష్కరించుకొని చట్టపరంగా పనులు ప్రారంభించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. 7 నెలల్లో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయడానికి సీఎం కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
ఘనంగా కమెడియన్ హరీశ్ రిసెప్షన్
-
ఘనంగా 'జబర్దస్త్' కమెడియన్ హరీశ్ రిసెప్షన్
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల వివాహం చేసుకుని ఓ ఇంటివాడైన 'జబర్దస్త్' కమెడియన్ 'అల్లరి' హరీశ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ రిసెప్షన్‌కు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. తీన్మార్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సహా పలు టాలీవుడ్ చిత్రాల్లో తనదైన శైలి హాస్యంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కమెడియన్ హరీశ్ కోయగండ్ల. ఈ అక్టోబర్ 5న హరీశ్ ఓ ఇంటివాడయ్యారు. ఈ విషయాన్ని ఫేస్బుక్ లో పోస్ట్ చేసి ఇటీవల తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. కమెడియన్ హరీశ్ వివాహ రిసెప్షన్‌కు దర్శకులు వీఎన్ ఆదిత్య, జయంత్ సి పరాన్జీ, అవసరాల శ్రీనివాస్, టాలీవుడ్ నటులు సాయి ధరమ్ తేజ్, సుశాంత్, అశ్విన్, కాదంబరి కిరణ్, ఉత్తేజ్, నటి మోనాల్ గజ్జర్, కమెడియన్లు వెన్నెల కిషోర్, 'తాగుబోతు' రమేశ్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. పలు షార్ట్ ఫిలింస్ తో అలరించిన హాస్యనటుడు హరీశ్ గతంలో జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. హరీశ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అందుకే ఈ విజయం
– జయ .బి యూనివర్సల్ పాయింట్‌తో తీసిన ‘వైశాఖం’ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు సెంటిమెంట్ నచ్చింది. అందుకే ఇంతటి విజయం సాధ్యమైంది. పాటలు, ఫోటోగ్రఫీ కూడా ఈ విజయానికి దోహదపడ్డాయి. ఒక మంచి పాయింట్‌తో సినిమా తీశారని రిలీజ్ రోజు నుంచి అందరూ అభినందిస్తున్నారు’’ అన్నారు డైరెక్టర్ జయ బి. హరీష్, అవంతిక జంటగా ఆమె దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ 12 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. బీఏ రాజు మాట్లాడుతూ– ‘‘మా సినిమా అర్ధ శతదినోత్సవం జరుపుకోవడానికి కారకులైన అందరికీ ధన్యవాదాలు. మానవతా విలువల్ని మరోసారి గుర్తు చేశారంటూ సినిమా చూసిన వాళ్ళంతా మెచ్చుకోవడం ఆనందాన్ని కలిగించింది’’ అన్నారు. 8 -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సర్! నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తోంది. కానీ వాళ్ల ఇంట్లో ఒప్పుకోవడం లేదు! మా పేరెంట్స్ అయితే.. ‘వాళ్లు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోండి! లేదంటే వద్దు!!’ అంటున్నారు. నాకు వాళ్ల ఇంటికి వెళ్లి అడిగే ధైర్యం లేదు. ఆ అమ్మాయి చెబితే వాళ్లు వినడంలేదు. సో ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటారో చెప్పండి సార్ ప్లీజ్! – హరీష్ నీలాంబరీ! వెంటనే మార్కెట్‌కి వెళ్లి రా. ‘ఎందుకు సార్?!?’ అర్జెంట్‌గా వెళ్లు! ‘అర్ కైకూ.. జానా.. మార్కెట్‌కు..’ ఎహే?!? ‘అదే సార్ హిందీలో అడుగుతున్నా మార్కెట్‌కు ఎందుకు వెళ్లాలని?’ వై హిందీ..? ‘హైదరాబాద్ మార్కెట్లో హిందీ ఎక్కువ సార్...’ఓకే.. వెంటనే మార్కెట్‌కి వెళ్లు...! ‘ఏమి తేవడానికి అని అడుగుతున్నా..’ నేను చెబుతా కదా నువ్వు బయలుదేరు! ‘ఫోన్లో చెబుతారా సార్..!’ ఎస్! ‘ఇప్పుడు చెప్పరా?’ నో ‘వై..?’ అది అంతే... ‘ఇప్పుడు చెబితే ఏమవుతుంది..?’ ఇప్పుడు.. ఇక్కడ.. చెబితే నువ్వు నమ్మవు! ‘మైండ్ బ్లాక్ అయ్యిందా సార్.. తొక్క మీద కాలేశారా సార్.. కరెక్ట్‌గా చెప్పండి!’ సరే చెబుతా విను! ‘నేనక్కడికి వెళ్లి ఏం తేవాలి... చెప్పండి’ మార్కెట్‌కి వెళ్లి ఒక కిలో ధైర్యం తీసుకురా!‘సార్..!?!’ హరీష్ వాళ్ల ఇంట్లో ధైర్యం అయిపోయిందట!! ‘అయితే మార్కెట్లో దొరుకుద్దా సార్? ధైర్యం??’ ఆ ముక్క హరీష్‌కి చెప్పు.. ఎక్కడయితే ప్రేమ కలుగుతుందో.. ధైర్యం కూడా అక్కడే దొరుకుతుంది! – ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
కొత్తవాళ్లతో జయగారు ఎప్పుడు సినిమా తీసినా హిట్టే!
– నాగార్జున ‘‘నేను చిత్రపరిశ్రమకు వచ్చి 31 ఏళ్లు. రాజు, జయగార్లు అప్పట్నుంచి తెలుసు. మనకున్న అతికొద్ది మంది మహిళా దర్శకుల్లో జయగారు ఒకరు. ఆమె ఎప్పుడు కొత్తవాళ్లతో సినిమా లు తీసినా... హిట్టవుతూనే ఉన్నాయి. ట్రెండ్ చూస్తుంటే కొత్త కథలు, ఆలోచనలతో వచ్చే దర్శకులను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కొత్త చిత్రాలు, చిన్న సినిమాలు ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు నాగార్జున. హరీశ్, అవంతిక జంటగా జయ. బి దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన సినిమా ‘వైశాఖం’. రేపు విడుదల కానున్న ఈ సినిమా ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున యూనిట్ సభ్యులకు షీల్డులు అందించారు. బీఏ రాజు మాట్లాడుతూ– ‘‘రాజుగారి గది–2’ షూటింగ్, మీటింగ్స్‌లో బిజీగా ఉన్నా నాగార్జునగారు ఈ వేడుకకు వచ్చారు. నేనిది ఎప్పటికీ మర్చిపోలేను. ఏయన్నార్‌గారు, నాగార్జునగారు, నాగచైతన్యగారు, అఖిల్... అక్కినేని ఫ్యామిలీ అంతా మాకెప్పట్నుంచో సపోర్ట్‌గా ఉన్నారు. ఈ సినిమాకీ సపోర్ట్ చేశారు. ఆయనకు స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నాగార్జునగారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. హైదరాబాద్‌లో మా ఫ్యామిలీ లేదు. బట్, నాగార్జునగారు ఈజ్ మై ఫ్యామిలీ’’ అన్నారు జయ. బి.5 -
హీరోలపై గౌరవం పెరిగింది
‘‘కొందరు ‘వైశాఖం’ ట్రైలర్ చూసి ఈ కుర్రాడు రవితేజలా ఉన్నాడన్నారు. నాకొచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అది. అయితే దాన్ని తలకు ఎక్కించుకోను. చిన్నప్పట్నుంచి పవన్‌కల్యాణ్‌గారంటే ఇష్టం. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్టార్స్, హీరోలు పడే స్ట్రగుల్స్ తెలిశాయి. హీరోలందరిపై గౌరవం పెరిగింది. వాళ్లందరూ నాకు స్ఫూర్తి’’ అన్నారు హరీశ్. జయ. బి దర్శకత్వంలో హరీశ్ హీరోగా ఆర్.జె. సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. హరీశ్ చెప్పిన సంగతులు... ► కొత్తవాళ్లు ఛాన్సుల కోసం ఎలా కష్టపడతారో నేనూ అలాగే కష్టపడ్డా. ‘ప్రేమ ఇష్క్ కాదల్’లో ఓ హీరోగా నటించా. ఆ తర్వాత పలు ఛాన్సులొచ్చాయి. అయితే.. మళ్లీ మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో కొంచెం గ్యాప్ తీసుకున్నా. ఓ పర్ఫెక్ట్ ఫ్లాట్‌ఫామ్ కోసం ప్రయత్నిస్తున్న టైమ్‌లో జయగారిని కలిశా. చాలా ఆఫీసులకు వెళ్లి ఆడిషన్ ఇచ్చినట్టే ఇచ్చా. నాకు ఛాన్స్ ఇస్తారో? లేదో? అనే డౌట్ ఉండేది. తర్వాత ఓ నెలకు ఫోన్ చేశారు. సోలో హీరోగా నా మొదటి చిత్రమిది. ► కథ కంటే ముందు జయ మేడమ్ టైటిల్ చెప్పారు. ‘వైశాఖం’ అనగానే పాజిటివ్ వైబ్స్ కలిగాయి. కథ చెబుతున్నప్పుడు... నాకు నేనుగా హీరో పాత్రలోకి వెళ్లాను. కథలో అంత డెప్త్ ఉంది. ప్రతి ఒక్కరి లైఫ్లోనో, స్నేహితులు, చుట్టాల లైఫ్లోనో జరిగిన సంఘటనలు సినిమాలో ఉంటాయి. ఓ క్లాస్ సిన్మాను మాసీగా చూపించడం జయ మేడమ్ స్ట్రెంగ్త్. ఈ సిన్మాలో నాది కాస్త పొగరు, ఆటిట్యూడ్ ఉన్న పక్కింటి కుర్రాడి పాత్ర. ► కొత్తవాళ్లతో సినిమాకు రాజుగారు ఎందుకింత ఎక్కువ ఖర్చు పెడుతున్నారనే డౌట్ వచ్చింది. కానీ, ఆయన కథపై నమ్మకంతో ఖర్చు పెట్టారు. బహుశా... కొత్తవాళ్లతో కజికిస్థాన్ వెళ్లి అంత ఖర్చుపెట్టి ఎవరూ మూడు పాటలు తీయాలనుకోరు. ఐయామ్ లక్కీ టు వర్క్ విత్ దెమ్. ► ఆర్.జె. సినిమాస్ సంస్థలో బీఏ రాజుగారు నిర్మాతగా మరో సినిమా చేస్తున్నా. సెప్టెంబర్‌లో ఆరంభ మవుతుంది. తమిళంలో హీరోగా నటించిన ‘మున్నోడి’ గత నెలలో విడుదలైంది. అక్కడ్నుంచి ఛాన్సులొస్తున్నాయి. స్టార్స్ సిన్మాల్లో విలన్ రోల్స్ చేయడానికి కూడా నేను రెడీ. -
వైశాఖంలో కాదు... మైనస్ డిగ్రీస్ చలిలో డ్యాన్స్ చేశా!
‘‘మోడ్రన్ డ్రెస్సుల్లోనే కాదు... చీరల్లోనూ అమ్మాయిలు ఎంతో అందంగా కనిపిస్తారు. అయితే వల్గర్‌గా కాకుండా ఎంత అందంగా చూపిస్తారనేది కెమెరామెన్, దర్శకుల చేతుల్లో ఉంటుంది. గ్లామరస్ రోల్స్ చేయడానికి నేను రెడీ. అయితే వల్గర్‌గా ఉండే గ్లామర్ రోల్స్ చేయాలనుకోవడం లేదు’’ అన్నారు హీరోయిన్ అవంతిక. హరీశ్ హీరోగా జయ. బి దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’లో ఆమే హీరోయిన్. ఈ నెల 21న సినిమా విడుదలవుతున్న సందర్భంగా అవంతిక చెప్పిన విశేషాలు... ⇒ నేను పుట్టింది ఢిల్లీలో. మా నాన్నగారు ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్. తరచూ ట్రాన్స్ఫర్లు కావడంతో ఇండియా మొత్తం తిరిగేశాం. బెంగళూరులోని కాలేజీలో చదువుకున్నాను. కాలేజ్ డేస్‌లో స్పోర్ట్స్ పర్సన్ లేదా పైలట్ అవ్వాలనుకున్నాను. నేను స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ని. చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఇష్టం. అందుకే మనసు మార్చుకుని, హీరోయిన్గా ట్రై చేద్దామనుకున్నా.గతంలో నీలకంఠ డైరెక్షన్లో ‘మాయ’ సినిమా చేశాను. ‘వైశాఖం’ నా ఫస్ట్ కమర్షియల్ మూవీ. ⇒ బీఏ రాజుగారు, జయ మేడమ్ నా ఫొటోలు చూసిన రోజే హారీశ్ కాంబినేషన్లో ఫొటోషూట్ చేసి కథ, వినిపించారు. కథ విన్నప్పుడు మంచి క్యారెక్టర్ చేయబోతున్నాననే ఫీల్ కలిగింది. నా రియల్ లైఫ్‌కి దగ్గరగా భానుమతి క్యారెక్టర్ ఉంటుంది. క్లైమాక్స్‌లోని ఎమోషనల్ సీన్లో నాకు ఐదు పేజీల డైలాగ్స్ ఉన్నాయి. కొంచెం కష్టమనిపించినా జయగారి ప్రోత్సాహంతో సీన్ కంప్లీట్ చేశాను. చిన్నప్పుడు కథక్ నేర్చుకున్నాను. కానీ ఫిల్మ్ డ్యాన్స్ కష్టం. కజకిస్థాన్‌లో మైనస్ 6 డిగ్రీస్‌లో సాంగ్ షూట్ చేశాం. అదో మంచి ఎక్స్పీరియన్స్. ఏడాదిగా ‘వైశాఖం’ జర్నీ సూపర్. ⇒ నా డ్రీమ్ రోల్వారియర్ ప్రిన్సెస్. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్, మిలటరీ బ్యాక్‌డ్రాప్ ఉన్న పాత్రలంటే ఆసక్తి ఉంది. తమిళంలో ‘నెంజమెల్లామ్ కాదల్’ అనే సినిమా చేస్తున్నా. తెలుగులో మరిన్ని సినిమాలు చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. -
ఇష్టం+కష్టం= వైశాఖం
‘‘నా గత చిత్రాలకూ, ‘వైశాఖం’కీ చాలా డిఫరెన్స్ ఉంది. కథ–కథనాలు ఎలానూ డిఫరెంట్‌గా ఉంటాయి. అయితే టేకింగ్ వైజ్‌గా ఎక్కువ టైమ్ తీసుకున్న సినిమా ఇది. ఇంతకుముందు సినిమాలప్పుడు త్వరగా తీసేయాలని ఒక టైమ్ ఫిక్స్ చేసుకునేదాన్ని. ఈ సినిమాని చాలా కూల్‌గా తీశాను. అవుట్‌పుట్ చూస్తే అది అర్థమవుతుంది’’ అన్నారు జయ. బి. హరీష్, అవంతిక జంటగా ఆమె దర్శకత్వంలో ఆర్. జె సినిమాస్ బ్యానర్‌పై బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకురాలు జయ. బి చెప్పిన విశేషాలు ♦ ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోతోంది. అందులో నివసించే వ్యక్తుల మధ్య వచ్చే చిన్న చిన్న క్లాషెస్, రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయన్నదే ‘వైశాఖం’ కథ. ఓ వాస్తవ సంఘటనను ఈ సినిమాలో చూపించాం. స్రీన్–ప్లే డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమాలోని క్యారెక్టర్స్‌తో ఇన్వాల్వ్ అయి ప్రేక్షకులు సినిమాను చూస్తారు. ఒకానొక దశలో సినిమా చూస్తున్న విషయాన్ని మరచిపోయి రియల్ లైఫ్‌లో ట్రావెల్ అవుతున్నట్లుగా ప్రేక్షకులు ఫీలవుతారు. ♦ వైశాఖం’ టఫ్ జర్నీ. ఏడాది జర్నీలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశా. అనుకున్నది అనుకున్నట్లుగా రావాలని రాజీ పడకుండా నిర్మించాం. 23 మంది యూనిట్‌తో 400 కేజీల లగేజ్‌తో 15 రోజులపాటు ట్రావెల్ చేసి, కజికిస్తాన్లో సాంగ్స్ షూట్ చేశాం. అక్కడ మూడు రోజులకొకసారి పాస్‌పోర్ట్ స్టాంపింగ్ చేయించుకోకపోతే మూడు నెలల జైలు తప్పదు. బడ్జెట్, శ్రమ ఎక్కువైనప్పటికీ లొకేషన్స్ బాగుండటంతో రిస్క్ చేశాం. ♦ నా గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా బడ్జెట్ ఎక్కువే. కజికిస్తాన్లో సాంగ్స్ తీస్తే బాగుంటుందనుకున్నప్పుడు బడ్జెట్ ఎక్కువ అని నేను వెనకాడాను. కానీ, రాజుగారు ప్రోత్సహించడంతో అక్కడ చేశాం. అదే వేరే నిర్మాత అయితే వైజాగ్‌లో కానిచ్చేయమనేవారేమో (నవ్వుతూ). ♦ హరీశ్ నిర్మాతల హీరో. ఈ సినిమాతో తనకూ, హీరోయిన్ అవంతికకూ మంచి పేరొస్తుందన్న నమ్మకం ఉంది. ఇక సాయికుమార్ రోల్ కథను కీలక మలుపు తిప్పుతుంది. సరస్వతమ్మ పాత్రలో యాక్ట్ చేసిన రమాప్రభగారి నటన సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. వసంత్ మంచి పాటలు ఇచ్చారు. పాటలు చూసి, నాగచైతన్య బాగా ఇంప్రెస్ అయ్యారు. సినిమాలో ‘చిలకా... చిలకా’ సాంగ్ విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంది. ♦ డైరెక్షన్ నా హాబీ. అన్ని విషయాలు నా గ్రిప్‌లో ఉన్నాయనుకుంటేనే సినిమా తీస్తా. కథ విషయంలో పర్టిక్యులర్‌గా ఉంటాను. పది, పదిహేను కథలు విన్నాకే ‘వైశాఖం’ కథను ఫైనల్ చేశా. ఈ సినిమా తర్వాత మరో సినిమా చేయడానికి మరికొంత సమయం పట్టవచ్చు. -
భానుమతి వలలో...
అసలెప్పుడూ అబ్బాయిలే అమ్మాయిలను వాడుకుని వదిలేస్తారా? – హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో కొత్తగా అద్దెకొచ్చిన భానుమతిని ఈ ప్రశ్న వెంటాడింది. వెంటనే ఓ డేరింగ్ స్టెప్ వేసింది. అపార్ట్మెంట్లో పరిచయమైన ఓ అబ్బాయికి వల వేసి, వాడుకోవడం మొదలుపెట్టింది. ఈవిడగారి వాడకం ఎలా ఉందనేది ఈ నెల 21న చూపిస్తామంటున్నారు బీఏ రాజు. హరీశ్, అవంతిక జంటగా జయ బి. దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై ఆయన నిర్మించిన సినిమా ‘వైశాఖం’. సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిన్మా గురించి బీఏ రాజు మాట్లాడుతూ– ‘‘అపార్ట్మెంట్ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ ఇది. ఆల్రెడీ విడుదలైన థియేట్రికల్ ట్రైలర్, థీమ్ టీజర్, డీజే వసంత్ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ క్రేజ్ చూసి సీడెడ్ ఏరియా డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చిన ‘శ్రీసాయిచంద్ర ఫిల్మ్స్’ నరసింహ విశాఖ కూడా తీసుకున్నారు. ప్రతి ఏరియాకి నలుగురైదుగురు బయ్యర్స్ పోటీ పడుతున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బి. శివకుమార్. -
వైశాఖం సూపర్ హిట్ అవ్వాలి
– నాగచైతన్య ‘‘సినిమా పరిశ్రమ అభివృద్ధి అవ్వాలంటే కొత్త వాళ్లను, ప్రతిభావంతులను ప్రొత్సహించాలి. అప్పుడు మంచి సినిమాలు మరిన్ని వస్తాయి. మంచి కథతో వస్తే ‘ఆర్.జె. సినిమాస్’లో నేను సినిమా చేస్తా’’ అన్నారు హీరో నాగచైతన్య. హరీశ్, అవంతిక జంటగా జయ. బి దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్‌పై బీఏ రాజు నిర్మించిన చిత్రం ‘వైశాఖం’. ఈ సినిమా థీమ్ టీజర్‌ను ఇప్పటి వరకు సుమారు 32 లక్షలమంది చూశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘వైశాఖం’ వంటి మంచి చిత్రాన్ని చేసిన జయగారికి కంగ్రాట్స్. సాంగ్స్ విజువల్‌గా బాగున్నాయి. హరీశ్, అవంతిక లుక్స్ సూపర్‌గా ఉన్నాయి. ఈ సినిమా సూపర్‌హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా రిలీజ్, పబ్లిసిటీ విషయాల్లో రాజుగారు నాకు, అక్కినేని కుంటుంబానికి ఇచ్చిన సపోర్ట్‌ను మరవలేను’’ అన్నారు. ‘‘ఆర్టిస్టుగా, స్టార్‌గా పైస్థాయికి ఎదుగుతున్న చైతు మా సినిమాకి విషెస్ చెప్పడం హ్యాపీగా ఉంది. ఈ నెలలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం అన్నారు’’ బీఏ రాజు. ‘‘కొంతమంది హీరోలను చూసి నప్పుడు మంచి హీరో, పక్కింటి అబ్బాయిలా ఉంటా డనుకుంటారు. కానీ, నాగచైతన్య మా ఇంట్లో అబ్బాయి లా అనిపిస్తాడు. తను మా ఫంక్షన్‌కు రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు జయ. బి. ఈ చిత్రానికి సహనిర్మాత: అమరనేని నరేష్, లైన్ ప్రొడ్యూసర్: బి. శివకుమార్. -
... ప్లస్ కౌంటింగ్!
హరీశ్, అవంతిక... తెలుగు తెరకు ఈ హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్తే. కానీ, వీళ్లిద్దరూ జంటగా నటించిన ‘వైశాఖం’ థీమ్ టీజర్‌ను యూట్యూబ్‌లో 30 లక్షల మంది చూశారు! రోజు రోజుకీ వ్యూస్ కౌంట్ పెరుగుతోంది కూడా. ‘చంటిగాడు, ప్రేమికుడు, లవ్లీ’ వంటి హిట్ సినిమాలు తీసిన బి. జయ ఈ సినిమాకు దర్శకురాలు కావడంతో కొత్త వాళ్లతో తీసిన ఈ సినిమాపై ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆర్.జె. సినిమాస్‌పై బీఏ రాజు నిర్మించిన ఈ ‘వైశాఖం’ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథతో ఈ సినిమాను రూపొందించామని బీఏ రాజు తెలిపారు. రోజు రోజుకీ తగ్గుతున్న కుటుంబ విలువలు, అనుబంధాలకు ప్రతిబింబంగా ఈ సినిమా ఉంటుందన్నారు దర్శకురాలు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బి. శివకుమార్. -
నా బంగారం లేకుండా బతకలేను..
వేములవాడ: ‘అమ్మా.. నన్ను క్షమించు.. నా బంగారం (ప్రేమించిన యువతి) లేనిదే బతకలేనని నీకు ముందే చెప్పా.. అందుకే మీ నుంచి దూరంగా వెళ్లిపోతున్నా.. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. నా మిత్రుడు మిథున్‌కు చెందిన బంగారంపై నేను లోను తీసుకున్నా.. ఆ లోను చెల్లించి బంగారం వాడికి అప్పగించండి’ అని సూసైడ్ నోట్ రాసి రాపర్తి హరీశ్ (26) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బద్దిపోచమ్మవీధిలో శనివారం జరిగింది. హరీశ్ తన తల్లి, సోదరితో కలిసి కొన్నేళ్లుగా ఓ ఇంట్లో అద్దెకు ఉండేవారు. ఇటీవలే ఆ ఇంటిని ఖాళీ చేసి సుబాష్నగర్లోని మరో అద్దె ఇంటికి మారారు. శుక్రవారం సాయంత్రం వరకూ తాను నడిపిస్తున్న టిఫిన్ సెంటర్లో పనులు పూర్తి చేసుకున్న హరీశ్.. ఇంటికొచ్చి తల్లిని పలుకరించి బయటకు వెళ్లాడు. రాత్రి 7.30 గంటలకు కుటుంబ సభ్యులకు చెందిన వాట్సాప్ గ్రూప్‌లో ‘ఐ మిస్‌యూ ఆల్’ అంటూ మెసేజ్ పెట్టడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. రాత్రి వరకూ ఇంటికి రాకపోవడంతో బంధువులు, మిత్రులు రాత్రంతా గాలించినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం గతంలో వీరు అద్దెకున్న ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో చూసిన స్థానికులు హరీశ్ తల్లి విజయకు సమాచారం ఇచ్చారు. వచ్చి చూడగా, హరీశ్ దూలానికి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. విగతజీవుడైన కుమారుడిని చూసి తల్లి తల్లడిల్లిపోయింది. -
జీఎస్టీ వల్ల ప్రాంతీయ చిత్రాలకు ఇబ్బంది
‘‘నా బాల్య మిత్రుడు, క్లాస్‌మెట్ పట్టాభికి సినిమా అంటే ప్యాషన్. చిత్ర పరిశ్రమలో తనకు ఎవరూ తెలిసినవారు లేరు. సినిమాపై ఇష్టంతో సురేశ్‌బాబుగారికి ఓ ఉత్తరం రాయడంతో, ఆయన పెద్ద మనసుతో పట్టాభిని తన సంస్థలో చేర్చుకున్నారు’’ అన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్. సాయి రోనక్, హరీష్, పూజ ముఖ్య పాత్రల్లో పట్టాభి ఆర్. చిలుకూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కాదలి’. ప్రసన్ ప్రవీణ్ శ్యాం స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీలను కేటీఆర్ రిలీజ్ చేసి, నిర్మాత సురేశ్‌బాబు, హీరో రామ్‌చరణ్‌కి అందించారు. కేటీఆర్ మాట్లాడుతూ – ‘‘మిత్రుడు రామ్‌చరణ్‌ని అడగ్గానే ఈ ఫంక్షన్‌కి వచ్చాడు. ‘కాదలి’ టీం కొత్తవారైనా చక్కగా చేశారు. కథే కింగ్. బాగుంటే చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని చూడకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ విషయం ‘పెళ్లి చూపులు’ చిత్రం నిరూపించింది. ‘బాహుబలి’ తెలుగు సినిమా, ఇండియన్ సినిమా ఖ్యాతిని పెంచింది. అమెరికాలోని కాలిఫోర్ని యాకి వెళ్లినప్పుడు ‘బాహుబలి’ చూశాం అని అక్కడి వాళ్లు చెప్పడం గర్వంగా అనిపించింది. సినిమా రంగానికి 28 శాతం జీఎస్టీ (వస్తు సేవల పన్ను) విధించడం వల్ల ప్రాంతీయ చిత్రాలకు ఇబ్బందే. కమల్‌హాసన్‌గారు కూడా ఇదే విషయాన్ని రైజ్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి అందరూ వెళ్లి కేంద్ర మంత్రి అరుణŠ æజైట్లీని కలిసి పన్ను తగ్గించాలని కోరదాం. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ చిత్ర పరిశ్రమకు అండగా ఉంటుంది’’ అన్నారు. హీరో రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘దాసరిగారు చనిపోయాక జరుగుతున్న పెద్ద ఫంక్షన్ ఇది. కాబట్టి అందరూ ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. ‘కాదలి’ విజువల్స్ చూస్తే నా ‘ఆరెంజ్’ చిత్రం అంత ఫ్రెష్‌గా ఉన్నాయి. నా తొలి చిత్రంలో నేను ఇంత బాగా చేసి ఉండను. యాక్టర్స్ కొత్తవారైనా పది సినిమాలు చేసిన అనుభవం ఉన్నవారిలా చేశారు. ఈ సినిమా ఎప్పు డెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా’’ అన్నారు. ‘‘ఇప్పుడు మనం 7 నుంచి 14 పర్సెంట్ పన్నులో ఉన్నాం. జీఎస్టీ 28 శాతం అంటే రీజనల్ సినిమాలు చాలా నష్టపోతాయి’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. ‘‘ఒక తెలుగు సినిమాకి తమిళ టైటిల్ పెట్టినప్పుడే ఈ మూవీ ప్రత్యేకమని అర్థమైంది. ‘హ్యాపీడేస్, పెళ్లిచూపులు’లా ‘కాదలి’ కూడా హిట్ ఇవ్వాలి’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. పట్టాభి మాట్లాడుతూ – ‘‘నాకు íసినిమా ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశమిచ్చిన సురేశ్‌బాబుగారికి థ్యాంక్స్. నా మిత్రుడు కేటీఆర్ ఇక్కడికొచ్చి నన్ను సపోర్ట్ చేయడం చాలా హ్యాపీ. చిరంజీవిగారికి ఏ మాత్రం తగ్గకుండా అదే రేంజ్లో రామ్‌చరణ్‌గారు డ్యాన్స్‌లో ఉర్రూతలూగిస్తున్నారు. ‘కాదలి’ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. సాయి రోనక్, హరీష్, పూజ, దర్శకులు దశరథ్, వీరూ పోట్ల, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేశ్, పాటల రచయిత వనమాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆనంద్ రంగా, కెమెరామేన్ శేఖర్ వి.జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. -
జయగారు డబ్బులొచ్చే సినిమాలే తీశారు!
– వీవీ వినాయక్ ‘‘జయగారి సినిమాల్లో హిట్, యావరేజ్ సినిమాలున్నాయి. అయితే, వాటి వల్ల ఎవరికీ ఒక్క రూపాయి నష్టం రాలేదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు... అందరికీ డబ్బులొచ్చే సినిమాలే తీశారు’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. హరీశ్, అవంతిక జంటగా బి. జయ దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ పబ్లిసిటీ టీజర్‌ను వినాయక్ విడుదల చేశారు. అలాగే, ఇటీవల విడుదలైన థీమ్ టీజర్ 2.5 మిలియన్ వ్యూస్ సాధించిన సందర్భంగా కేక్ కట్ చేసి, చిత్ర బృందాన్ని అభినందించారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ – ‘‘మహిళా దర్శకురాలు ఎనిమిది సినిమాలు తీయడమంటే తమాషా కాదు. విజయ నిర్మలగారి తర్వాత తెలుగులో ఎక్కువ సినిమాలు తీసిన ఘనత జయగారిదే. ‘వైశాఖం’ ట్రైలర్, పాటలు బాగున్నాయి. జయగారు తీసిన సినిమాల్లో ‘లవ్లీ’ పెద్ద హిట్. ఈ సినిమా అంత కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. మంచి డేట్, థియేటర్లు లభించిన తర్వాత సినిమాను విడుదల చేయమని సలహా ఇస్తున్నా’’ అన్నారు. ‘‘వినాయక్‌గారు ఎంతో మంచి మనిషి. ఆయన ఈ వేడుకకు రావడం మా అదృష్టం. ప్రేక్షకులు మెచ్చేలా ‘వైశాఖం’ ఉంటుంది’’ అన్నారు బి. జయ. నిర్మాత బీఏ రాజు, హీరో హరీశ్, సంగీత దర్శకుడు డీజే వసంత్, నటుడు పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురూ ముగ్గురే!
- హాకీలో రాణిస్తున్న లోక్‌నాథ్, హరీష్, వెంకటేష్ అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంత ఆర్డీటీ హాకీ జట్టులో ఆ ముగ్గురు సభ్యులు కీలకంగా మారారు. ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుత ప్రతిభతో దూసుకుపోతున్నారు. నంతపురంలో జరుగుతున్న జాతీయస్థాయి పోటీల్లో ఆర్డీటీ హాకీ జట్టును ఫైనల్‌కు చేర్చడంలో క్రీడాకారులు లోక్‌నాథ్, హరీష్, వెంకటేష్ కీలకంగా వ్యవహరించారు. రైతు, చేనేత, బేల్దారి కుటుంబాలకు చెందిన ఆ ముగ్గురూ భారత హాకీ జట్టులో స్థానమే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. లోక్‌నాథ్ : ఆత్మకూరు మండలం తలుపూరుకు చెందిన సాధారణ రైతు జగన్నాథ్, సరస్వతి దంపతుల కుమారుడు లోక్‌నాథ్. ప్రస్తుతం అనంతలక్ష్మీ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఆర్డీటీ హాకీ జట్టులో సెంటర్ ఆఫ్ పొజిషన్లో ఉంటున్నాడు. జట్టు గోల్ సాధించాలన్నా.. ప్రత్యర్థి జట్టు గోల్ చేయకుండా ఆపాలన్నా తనే కీలకం. స్పెయిన్‌కు చెందిన హాకీ జట్టు కెప్టెన్‌ను తన ఆరాధ్య దైవంగా భావిస్తున్నాడు. అనంతపురం జిల్లా నుంచి భారత జట్టులో చోటు సంపాదిచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. హరీష్: ధర్మవరంలో చేనేత మగ్గం నేసే ప్రభాకర్, లక్ష్మీనారాయణమ్మ దంపతుల కుమారుడు హరీష్ అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలలో బీకాం చదువుతున్నాడు. ఆరేళ్ల క్రితం సమ్మర్ కోచింగ్ క్యాంపునకు హాజరై ప్రతిభ కనబరచడంతో ఆర్డీటీ అకాడమీకి ఎంపికయ్యాడు. జట్టులో ఫుల్ బ్యాక్ స్థానంలో ఉంటూ జట్టుకు గోల్ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ టోర్నీలో 2 మ్యాచులు ఆడి 1 గోల్ సాధించాడు. భారత జట్టుకు సారథి కావడమే తన లక్ష్యం అంటున్నాడు. వెంకటేష్ : ధర్మవరం పట్టణానికి చెందిన వెంకటేష్ తండ్రి బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి లక్ష్మీనారాయణమ్మ గృహిణి. వెంకటేష్ రాఘవేంద్ర డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ చదువుతున్నాడు. ఆరేళ్ల నుంచి ఆర్డీటీ అకాడమీలో ఉంటూ అనంత జట్టులో ప్రత్యేకత చాటుతున్నాడు. జట్టులో లెఫ్ట్ ఆఫ్ స్థానంలో ఉంటూ జట్టు గోల్ సాధించడానికి కీలకంగా వ్యవహరిస్తున్నాడు. -
ఒక్క రోజులో 13 లక్షలు!
స్టార్ హీరోల సిన్మాల కొత్త టీజర్లు, ట్రైలర్లు విడుదలైతే... నెట్టింట్లో హిట్టుల మీద హిట్టులు, లైకుల మీద లైకులు వచ్చేస్తాయి. అదే కొత్త హీరో, హీరోయిన్ నటిస్తున్న సినిమా టీజర్‌ను విడుదలైన ఒక్క రోజులో 13 లక్షలమంది చూశారంటే... ప్రేక్షకుల్లో ఆ సినిమాపై ఎంత క్రేజ్ ఉందనేదానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హరీశ్, అవంతిక జంటగా బి. జయ దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ సినిమా థీమ్ టీజర్‌ను దర్శకుడు కొరటాల శివ మంగళవారం విడుదల చేశారు. నిర్మాత బీఏ రాజు మాట్లాడుతూ – ‘‘ఒక్క రోజులో టీజర్‌కు 1.3 మిలియన్ వ్యూస్ రావడం హ్యాపీ. క్లాస్ అండ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు. సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బి. శివకుమార్, సంగీతం: డీజే వసంత్. -
రాజకీయ దురుద్దేశంతోనే విమర్శలు
హరీశ్‌పై బీజేపీ నేత కృష్ణసాగర్‌రావు ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాజకీయ దురుద్దేశంతోనే కేంద్ర ప్రభు త్వంపై మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేస్తు న్నారని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ధ్వజమెత్తారు. హరీశ్ చెప్పిన లెక్కలన్నీ తప్పులతడకగా, కేంద్రంపై అసత్య ప్రచారానికి తెర తీసేవిగా ఉన్నాయని శుక్రవారం విమర్శిం చారు. కేంద్రం ఎఫ్ఏక్యూ రకం మాత్రమే కొనుగోలు చేయాలని ఎక్కడా చెప్పలేదని, ఈ పేరుతో హరీశ్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేసిన హరీశ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మిర్చి దిగుబడి ఫిబ్రవరి, మార్చికల్లా వస్తుండగా, ఆలస్యంగా మార్చి 30న మార్కెట్ ఇంటర్వేన్షన్ స్కీం (ఎంఐఎస్) కింద ఆదుకోవాలని కేంద్రాన్ని కోరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులకు రూ.3 వేల బోనస్ ప్రకటించాలని, ఎంఐఎస్ కింద కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. -
కనువిందుగా వైశాఖం పాటలు – దేవిశ్రీ ప్రసాద్
హరీష్, అవంతిక జంటగా సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వైశాఖం’. జయ బి. దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బి.ఎ. రాజు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. డీజే వసంత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం దేవిశ్రీ మాట్లాడుతూ– ‘‘వైశాఖం’ పాటలు బాగా నచ్చాయి. కంగ్రాట్స్ టు వసంత్. ముఖ్యంగా పాటల పిక్చరైజేషన్ చాలా బాగా నచ్చింది.జయగారి టేకింగ్ బాగుంది. ఆడియో, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. రాజుగారు అందరికీ కావాల్సిన మనిషి. జయగారు మాకెంతో ఆత్మీయులు. ‘వైశాఖం’ ఆమె కెరీర్లో చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఏ భారతీయ చిత్రం షూట్ చెయ్యని కజకిస్తాన్‌లోని అరుదైన లొకేషన్స్‌లో పాటలు తీశారు. అలాంటి రేర్ లొకేషన్స్‌ని స్క్రీన్‌పై చూడడం చాలా సంతోషంగా అనిపించింది’’ అన్నారు. ‘‘ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ‘వైశాఖం’ పాటలు చూసి, మమ్మల్ని అభినందించిన దేవిశ్రీగారికి కృతజ్ఞతలు. ఈ వేసవిలోనే సినిమాను విడుదల చేయనున్నాం. దేవిశ్రీ చెప్పినట్టుగానే పాటలు, సినిమా పెద్ద హిట్ అవుతాయని ఆశిస్తున్నాం’’ అని బి.ఎ.రాజు అన్నారు. -
పాముకాటుతో జర్నలిస్టు మృతి
మడకశిర : గుడిబండ మండలం కేఎన్పల్లికి చెందిన హరీష్ (42) అనే జర్నలిస్టు పాముకాటుకు గురై శుక్రవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఓ దినపత్రికలో మడకశిర టౌన్‌కు జర్నలిస్టుగా పనిచేస్తున్న హరీష్ గురువారం సాయంత్రం తన స్వగ్రామంలో మల్బరీ ఆకులు కోయడానికి వెళ్లిన సమయంలో పాము కాటు వేసింది. వెంటనే ఇతడిని మడకశిర ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి హిందూపురం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యుల సూచన మేరకు బెంగళూరు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మడకశిర ప్రభుత్వ ఆస్పత్రిలో జర్నలిస్టు మృతదేహాన్ని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న సందర్శించి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైఎన్ రవిశేఖర్‌రెడ్డి, ఏడీసీసీ బ్యాంకు ఉపాధ్యక్షుడు కే ఆనందరంగారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి రంగేగౌడ్, గుడిబండ వైఎస్సార్సీపీ నేత జీబీ కరుణాకర్‌గౌడ్, గుడిబండ జెడ్పీటీసీ డాక్టర్ శ్రీనివాసమూర్తి, కాంగ్రెస్ నాయకులు ఎస్ ప్రభాకర్‌రెడ్డి, నాగేంద్ర, అక్రమ్, నారాయణప్ప తదితరులు కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి కూడా జర్నలిస్ట్ మృతికి సంతాపం తెలిపారు. -
మీ సాయం మాకొద్దు!
పరామర్శించేందుకు వచ్చిన రేవంత్‌కు బాధిత కుటుంబం షాక్ సిద్దిపేట రూరల్: ‘‘ మీ సాయం మాకొద్దు.. హరీశ్ మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటారు’’ అని తమను పరామర్శించేందుకు వచ్చిన టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి, బాధిత కుటుంబం తేల్చి చెప్పింది. దీంతో రేవంత్ కంగుతిన్నారు. సీఎం కేసీఆర్ సొంతూరైన సిద్దిపేట మండలం చింతమడకలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మహిళా రైతు వట్టిపల్లి నాగమణి కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధ వారం రేవంత్‌రెడ్డి వచ్చారు. అయితే, రేవంత్ గ్రామంలోకి రావొద్దని స్థానికులు ఊరు బయటే అడ్డుకున్నారు. మరోవైపు రేవంత్ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ని పోలీసులు సీతారాం పల్లి శివారులోనే నిలిపివేశారు. ఆత్మహత్య చేసుకున్న మహిళా రైతు భర్త పద్మారెడ్డి, పిల్లల్ని కారులో ఎక్కించు కుని రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకొచ్చారు. రేవంత్ వారిని పరామర్శించారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.50 వేల ఆర్థిక సహాయం అందిం చేందుకు ప్రయత్నించగా.. వారు తీసుకోలేదు. దీంతో రేవంత్ వెనుదిరిగారు. -
వైశాఖం పాటలు బాగున్నాయి : మహేశ్‌బాబు
‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో నాకు బాగా కావాల్సిన వ్యక్తుల్లో బీఏ రాజు గారు ఒకరు. ఆయనకెప్పుడూ మంచి జరగాలని కోరుకుంటా. ‘వైశాఖం’ పాటలు, విజువల్స్ చాలా బాగున్నాయి. జయగారికి, హరీష్, అవంతిక, మొత్తం టీమ్‌కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. హరీష్, అవంతిక జంటగా జయ బి. దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మించిన చిత్రం ‘వైశాఖం’. డి.జె. వసంత్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం పాటల సీడీని మహేశ్‌బాబు రిలీజ్ చేసి, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి అందించారు. జయ బి. మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్‌గారి తర్వాత మాకు సౌత్ ఇండియా సూపర్‌స్టార్ మహేశ్‌బాబే. ఆయన మా చిత్రం పాటల విడుదలకు రావడంతో ఈ ఫంక్షన్‌కి ఒక కళ వచ్చింది. మహేశ్‌బాబు, మురుగదాస్ డైరెక్షన్లో రానున్న చిత్రం ఇండియా రికార్డులన్నీ క్రాస్ చేయాలన్నదే నా ఫస్ట్ కోరిక’’ అన్నారు. ‘‘మహేశ్‌బాబుది గోల్డెన్ హ్యాండ్. ఆయన చేతుల మీదుగా ఆరు సినిమాల ఆడియో రిలీజ్ చేశాం. అన్నీ హిట్టయ్యాయి. ఏడో సినిమా కూడా సక్సెస్ ఖాయం. ఫోన్ చేయగానే వచ్చిన త్రివిక్రమ్, వంశీ పైడిపల్లిగార్లకు థ్యాంక్స్’’ అన్నారు బీఏ రాజు. ‘‘చైత్రమాసంలో వసంత రుతువు, ఆ తర్వాత వైశాఖ మాసం వస్తుందని చిన్నప్పుడు చదువుకున్నాం. ‘వైశాఖం’ వంటి మంచి టైటిల్‌తో సినిమా చేయడం హ్యాపీ. ఈ చిత్రం సక్సెస్ అవ్వాలి’’ అన్నారు త్రివిక్రమ్. నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, వై. రవిశంకర్, హరీష్, అవంతిక, డీజే వసంత్, లైన్ ప్రొడ్యూసర్ బి. శివ కుమార్, ఆదిత్య మ్యూజిక్ ఆదిత్య గుప్తా, నిరంజన్ పాల్గొన్నారు. ‘భరత్ అనే నేను’ ఫిక్స్ మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘భరత్ అనే నేను’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ‘‘భరత్ అనే నేను’కి పాటలు స్వరపరచడం ఆనందంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు. దీన్నిబట్టి చూస్తే ‘భరత్ అనే నేను’ టైటిల్‌ని ఫిక్స్ చేశారని అర్థమవుతోంది. -
శివుడి ఆశీస్సులతో ఆరంభం.. శివరాత్రికి పూర్తి
‘‘కీసరగుట్ట శివాలయంలో శివుడి ఆశీస్సులతో మా ‘వైశాఖం’ చిత్రీకరణ ప్రారంభమైంది. సరిగ్గా శివరాత్రికి చిత్రీకరణ పూర్తయింది’’ అని నిర్మాత బీఏ రాజు అన్నారు. హరీష్, అవంతిక జంటగా బి. జయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘వైశాఖం’ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. రాజు మాట్లాడుతూ– ‘‘వైశాఖం’ ఓవర్సీస్ రైట్స్‌ను బ్లూ స్కై సంస్థ ఫ్యాన్సీ ఆఫర్‌కు సొంతం చేసుకుంది. నైజాం, ఆంధ్ర, సీడెడ్ ఏరియాల నుంచి బయ్యర్స్ చాలామంది వస్తున్నారు. స్పీడ్‌గా బిజినెస్ అవుతోంది’’ అన్నారు. ‘‘కథ ప్రకారం ఓ సన్నివేశంలో చండీయాగాన్ని శాస్త్రోక్తం గా జరిపించాం. అలా శివుడి అనుగ్రహం ఉన్న మా సినిమా శివరాత్రికి పూర్తవడం విశేషం. మంచి ఫీల్‌గుడ్ మూవీ ఇది’’ అని బి. జయ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె. వసంత్, లైన్ ప్రొడ్యూసర్: బి.శివకుమార్. -
వేసవిలో వైశాఖం
వైశాఖంలోనే శ్రీ వేంకటేశ్వర స్వామి–పద్మావతిల కల్యాణం జరిగింది. అందుకే, ఈ మాసంలో ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఎంతో ప్రాముఖ్యత, పవిత్రత గల ఈ ‘వైశాఖం’ పేరుతో బి. జయ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హరీశ్, అవంతిక జంటగా ఆర్.జె. సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దర్శకురాలు బి. జయ మాట్లాడుతూ – ‘‘ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. ఓ అబ్బాయి లైఫ్‌లో ‘వైశాఖం’లా ప్రవేశించిన ఓ అమ్మాయి, అతడి లైఫ్‌లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? వీరి ప్రేమ పెళ్లి వరకూ ఎలా వెళ్లిందనేది సినిమా’’ అన్నారు. ‘‘మా సంస్థ తీసిన ప్రేమకథా చిత్రాలన్నీ హిట్టయ్యాయి. కుటుంబ నేపథ్యంలో తీసిన ఈ ప్రేమకథా చిత్రం కూడా హిట్టవుతుంది’’ అన్నారు బీఏ రాజు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బి. శివకుమార్, సంగీతం: డీజే వసంత్. -
మంత్రులూ... శెభాష్
• రికార్డు సమయంలో ‘భక్త రామదాస’ పూర్తిపై సీఎం కేసీఆర్ హర్షం • రాష్ట్ర ప్రత్యేకత చాటారని మంత్రులు హరీశ్, తుమ్మల, అధికారులకు అభినందన • మిగతా ప్రాజెక్టులనూ వేగంగా పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని ప్రకటన సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో చేపట్టిన భక్త రామదాస ప్రాజెక్టును గడువుకన్నా ముందే పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. వేగంగా ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను చాటారని మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్రావు, నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లను అభినందించారు. పాలేరు ఉప ఎన్నికలో అఖండ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిన ప్రజలకు భక్త రామదాస ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసి కృతజ్ఞతలు తెలపడం ఆనందంగా ఉందని సీఎం పేర్కొన్నారు. టీఆర్ఎస్కు ఓటేసి గెలిపించిన రాష్ట్ర ప్రజలందరికీ అన్ని ప్రాజెక్టులనూ వేగంగా పూర్తి చేసి రుణం తీర్చుకుంటామని, ప్రజల నమ్మకం నిలబెట్టుకునేలా పనిచేస్తామని సీఎం ప్రకటించారు. చిత్తశుద్ధి, అంకితభావం ఉంటే ప్రాజెక్టులు అనుకున్న సమయంకంటే ముందే నిర్మించవచ్చని నిరూపించగలిగామన్నారు. ఈ ప్రాజెక్టును భక్త రామదాసు జయంతి రోజైన ఈ నెల 31న సీఎం ప్రారంభించనున్నారు. రెండున్నరేళ్లలో 19 లక్షల ఎకరాలకు నీరు రాష్ట్రం ఏర్పడ్డాక రెండున్నరేళ్లలో కొత్తగా 19 లక్షల ఎకరాల మేర నీరందించామని నీటిపారుదల శాఖ ప్రకటించింది. మేజర్, మీడియం ప్రాజెక్టుల కింద కొత్తగా 11 లక్షల ఎకరాల మేర నీరివ్వగా చెరువులు పునరుద్ధరణతో మరో ఏడున్నర లక్షలకుపైగా ఆయకట్టుకు నీరిచ్చామని తెలిపింది. మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేసి ఇప్పటికే నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరందించామని, మరో మూడున్నర లక్షల ఎకరాలకు వచ్చే ఏడాది నీరందిస్తామని పేర్కొంది. వచ్చే రెండు, మూడేళ్లలో అన్ని ప్రాజెక్టులనూ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, భక్త రామదాస ప్రాజెక్టు పూర్తి ఇచ్చిన విజయం... పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణానికి కొత్త ఉత్సాహం ఇస్తుందని నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషీ పేర్కొన్నారు. మా సంస్థకు గొప్ప పేరు: మెగా డైరెక్టర్ కృష్ణారెడ్డి భక్త రామదాస ప్రాజెక్టును గడువుకంటే రెండు నెలల ముందే పూర్తి చేయడం తమ సంస్థకు గొప్ప పేరును తెచ్చిపెట్టిందని మెగా ఇంజనీరింగ్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారం వల్లే ప్రాజెక్టు పనుల పూర్తి సాధ్యమైందన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో 12 నెలల్లో పట్టిసీమ నిర్మించి రికార్డు సృష్టించామని, ఇప్పుడు రాష్ట్రంలో కేవలం 11 నెలల్లో భక్త రామదాసను నిర్మించి కొత్త రికార్డు నమోదు చేయగలిగామన్నారు. -
‘ఇది కొత్త తరహా చిత్రం’
‘‘నాన్నగారి మరణం నన్ను చాలా విషయాల్ని ఆలోచించేలా చేసింది. అప్పుడీ కథ రాశా. ప్రతి ఒక్కరూ మన లైఫ్‌లోనూ ఇలాంటి సంఘటన జరిగిందని సర్ప్రైజ్ అవుతారు’’ అన్నారు దర్శకురాలు బి. జయ. హరీశ్, అవంతిక జంటగా ఆమె దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన సినిమా ‘వైశాఖం’. వచ్చే నెలలో ఆడియో, వేసవిలో సినిమా రిలీజ్. ఈ సందర్భంగా నేడు పుట్టినరోజు జరుపుకొంటున్న బి. జయ మాట్లాడుతూ – ‘‘హీరో నివసించే అపార్ట్మెంట్లో దిగిన హీరోయిన్ అతణ్ణి ఎలా మార్చింది? ఆమె ఉద్దేశం ఏంటనేది కథ. అపార్ట్మెంట్లో కుటుంబాలన్నీ కలిసుంటే ఎంత అందంగా ఉంటుందనేది సినిమాలో చెబుతున్నాం. కజికిస్థాన్‌లో తీసిన పాటలు హైలైట్. ఇప్పటివరకూ నేను తీసిన సినిమాలు ఓ ఎత్తు. ఈ సినిమా మరో ఎత్తు. కొత్త తరహా చిత్రమిది’’ అన్నారు. -
రెండు... మూడేళ్లే అయినట్టుంది!
‘‘ఓ నిర్మాతగా సినిమాలోని కథకు న్యాయం చేస్తూ, కథను కథగా తీయాలని ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడీ ‘వైశాఖం’ కూడా కథే మెయిన్ హీరోగా నడిచే సినిమా. మా సంస్థ నిర్మించిన చిత్రాలన్నిటిలోనూ ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది’’ అన్నారు బీఏ రాజు. హరీశ్, అవంతిక జంటగా బి. జయ దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై ఆయన నిర్మించిన సినిమా ‘వైశాఖం’. నేడు నిర్మాత బీఏ రాజు పుట్టినరోజు. ఆయన మట్లాడుతూ – ‘‘విలేకరిగా ప్రయాణం ప్రారంభించి, పీఆర్వోగా, పత్రికాధినేతగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో నాకంటూ ఓ స్థానం ఏర్పరుచుకున్నాను. నా విజయం వెనుక నా సతీమణి బి. జయ మద్దతు ఎంతో ఉంది. ఇన్నేళ్లుగా పనిచేస్తున్నా కెరీర్ స్టార్ట్ చేసి రెండు మూడేళ్ళే అయినట్టుంది. ప్రతిరోజూ చేసే పనిని ఇష్టంగా చేయడం నా పాలసీ. ‘వైశాఖం’ చిత్రానికి వస్తే ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ మా సంస్థ నిర్మించిన సినిమాలు బయ్యర్లకు లాభాలు తీసుకురావడంతో ‘వైశాఖం’ బిజినెస్ బాగా జరిగింది. ఈ సినిమా విడుదలకు ముందే మరో సినిమా ప్రారంభిస్తా’’ అన్నారు. -
అన్ని చెరువులకు జియో ట్యాగింగ్
త్వరలో మూడోదశ: హరీశ్ సాక్షి, హైదరాబాద్: త్వరలో మిషన్ కాకతీయ మూడో దశ పనులు చేపట్టనున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఇటీవలి భారీ వర్షాలతో చాలా చెరువుల్లో నీళ్లు నిలిచి ఉన్నందున అంచనాలు రూపొందించే పని సకాలంలో జరగక పోవటంతో మూడోదశలో కొంత జాప్యం జరిగిందన్నారు. వర్షాలతో రెండో దశలో ఆగిపోయిన పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. మరో వారం పది రోజుల్లో చెరువులకు జియో ట్యాగింగ్ పూర్తి చేసి వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తామని వెల్లడించారు. ఎన్ఆర్ఎస్ఏ, ఇస్రోల సాయంతో చెరువుల వివరాలే కాకుండా వాటి పరిధిలో పంటల వివరాలను కూడా ప్రజల ముందుంచే ఏర్పాటు చేసినట్టు వివరించారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, విపక్షాలకు చెందిన చల్లా ధర్మారెడ్డి, బాబూరావు రాథోడ్, వీరేశం, రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితర సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. కొత్త చెరువులను కూడా మిషన్ కాకతీయలో చేపట్టేందుకు సిద్ధమన్నారు. మొదటి దశకు రూ.2,595 కోట్లు మిషన్ కాకతీయ తొలి దశలో 8,165 చెరువులకు గాను రూ.2,595 కోట్లు మంజూరు చేయగా.. రూ.1,295 కోట్లు ఖర్చు చేసినట్లు హరీశ్ తెలిపారు. రెండో దశలో రూ.3,135 కోట్లు మంజూరు చేయగా 1,536 చెరువుల పనులను పూర్తి చేసినట్టు వెల్లడించారు. నాగార్జున చెరువు కబ్జా ఆరోపణలపై చర్యలేవీ? నటుడు నాగార్జున హైటెక్‌సిటీ చేరువలో గురు కుల్ ట్రస్టు భూముల సమీపంలోని చెరువును సగం మేర కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినా చర్యలెందుకు తీసుకోలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. హరీశ్ బదులిస్తూ.. అది జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నందున ఆ బాధ్యత సంబంధిత శాఖదేనని చెప్పారు. -
సౌదీలో కొలిమికుంట వాసి మృతి
చొప్పదండి: పొట్ట చేతపట్టుకుని సౌదీ అరేబియా వెళ్లిన ఓ వ్యక్తి అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామానికి చెందిన హరీష్ అనే వ్యక్తి డ్రైవర్ ఉద్యోగం కోసం యాభై రోజుల క్రితం విజిట్ వీసాపై సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. పది రోజుల కిందట జరిగిన ఈ సంఘటన కొలిమికుంటలో ఉన్న అతని కుటుంబీకులకు సోమవారం తెలిసింది. -
సురేశ్ కామాక్షి దర్శకత్వంలో మిగమిగ అవసరం
నిర్మాతగా అనుభవం గడించిన వాళ్లు దర్శకులుగా అవతారమెత్తడం అన్నది కొత్తేమీ కాదు. ఆ కోవలో తాజాగా సురేశ్ కామాక్షి చేరారన్నదే తాజా న్యూస్. ఇంతకు ముందు వి.హౌస్ ప్రొడక్షన్ పతాకంపై అమైదిప్పడై-2,కంగారు వంటి చిత్రాలను నిర్మించిన సురేశ్ కామాక్షి ఇప్పుడు అదే పతాకంపై స్వీయ దర్శకత్వంలో మిగ మిగ అవసరం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నామ్ తమిళర్ పార్టీ అధ్యక్షుడు, దర్శకుడు ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో గోరిపాలైయం చిత్రం ఫేమ్ హరీష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా కంగారు, వందామల చిత్రాల ఫేమ్ శ్రీజ నాయకిగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో లింగా, ఆండవన్కట్టళై అరవింద్, దర్శకుడు శరవణ పిళ్లై, వీకే.సుందర్, వెట్రికుమరన్ నటిస్తున్నారు.చిత్ర వివరాలను దర్శక నిర్మాత సురేశ్ కామాక్షి తెలుపుతూ చిత్ర షూటింగ్‌ను సేలం జిల్లా, భవాని గ్రామ సమీసంలో గల కోనేరిపట్టి బ్రిడ్జి వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో 23 ఏళ్ల క్రితం దర్శకుడు కే.భాగ్యరాజ్ పవను పవనుదాన్ చిత్ర షూటింగ్ నిర్వహించారన్నారు. ఆ తరువాత ఈ ప్రాంతంలో చిత్రీకరించుకుంటున్న చిత్రం తమ మిగ మిగ అవసరం చిత్రమేనని చెప్పారు. కథకు అవసరం అవ్వడంతో ఇక్కడ చిత్రీకరిస్తున్నట్లు వివరించారు. మరో మిషయం ఏమిటంటే ఈ చిత్రానికి ఎపిక్ వెపన్ హెలియం 8కే సెన్సార్ అనే అతి నవీన కెమెరాను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఇది 8కే రెజల్యూషన్‌తో కూడిన కెమెరా అని, భారతీయ సినిమా చరిత్రలోనే ఈ కెమెరాతో చిత్రీకరిస్తున్న తొలి చిత్రం మిగ మిగ అవసరం అని దర్శక నిర్మాత సురేశ్ కామాక్షి పేర్కొన్నారు. -
పిల్లర్ గుంటలో పడి బాలుడి మృతి
పిల్లర్ కోసం తీసిన గుంటలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన శంషాబాద్ మిషన్‌కంపౌడ్ సమీపంలోని శీనయ్య వెంచర్లో గురువారం వెలుగుచూసింది. స్థానిక శీనయ్య వెంచర్లో కార్మికులుగా పనిచేస్తున్న హరీష్, యాదమ్మ దంపతుల ఆరేళ్ల కుమారుడు బాలు పిల్లర్ గుంటలో పడి మృతిచెందాడు. శ్రీనయ్య వెంచర్లో పిల్లర్ల కోసం గుంటలు తవ్వారు. అందలో వర్షపు నీరు చేరడంతో ప్రమాదవశాత్తు బాలుడు అందులో పడి మృతిచెందాడు. గుంటల వద్ద ఎలాంటి సేఫ్టీ బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆందోళన చేస్తున్నారు. కార్మికులు అనంతపూర్ వాసులుగా గుర్తించారు. -
ఎస్ఎఫ్డీ జిల్లా కన్వీనర్ గా హరీష్
అనంతపురం సప్తగిరిసర్కిల్ : అఖిల భారత విద్యార్థి పరిషత్ లోని స్టూడెంట్ ఫర్ డెవెలప్మెంట్ (ఎస్ఎఫ్డి) విభాగం జిల్లా కన్వీనర్ గా హరీష్ ను ఎంపిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు తిరుమల రెడ్డి ప్రకటించారు. హరీష్ మాట్లాడుతూ విద్యార్థులలో నైపుణ్యం, ప్రతిభ ను వెలికితీయడం కోసం సేవాభావంతో సమాజం పట్ల అవగాహన పెంపొందించడమే ఎస్ఎఫ్డీ విభాగం ప్రధాన లక్ష్యమన్నారు. -
తర్వాతి సినిమాలోనూ అతనే హీరో!
హరీశ్, అవంతిక జంటగా బి.జయ దర్శకత్వంలో బీఏ రాజు నిర్మిస్తున్న ‘వైశాఖం’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. బి.జయ మాట్లాడుతూ - ‘‘నాకు బాగా దగ్గరయిన కథ ఇది. లవ్, కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్.. ఇలా సినిమాలో నవరసాలు ఉన్నాయి. హరీశ్ న్యాచురల్ పెర్ఫార్మర్’’ అన్నారు. బీఏ రాజు మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా ‘లవ్లీ’ కంటే పెద్ద హిట్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. యూత్, ఫ్యామిలీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది. ఆగస్టు, సెప్టెంబర్లలో జరిగే షెడ్యూళ్లతో షూటింగ్ పూర్తవుతుంది. మా సంస్థ తదుపరి సినిమాలో కూడా హరీశ్‌ని హీరోగా తీసుకున్నాం’’ అన్నారు. ‘‘రెండు మూడు హాలీవుడ్ సినిమాలకు మాత్రమే ఉపయోగించిన స్పైడర్ క్యామ్‌ను ఈ సినిమాకి ఉపయో గిస్తున్నాం’’ అని సినిమాటోగ్రాఫర్ వాలిశెట్టి సుబ్బారావు అన్నారు. హీరో హరీశ్, సంగీత దర్శకుడు డీజే వసంత్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు
సికింద్లాపూర్, మల్లారం, అనంతసాగర్, గుర్రాలగొందిలో పర్యటన పలు శంకుస్థాపనలు, ఆవిష్కరణలు, చెక్కుల పంపిణీ చిన్నకోడూరు: రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదివారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా సికింద్లాపూర్‌లో రూ.20 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం, రూ.25 లక్షలతో నిర్మించిన ముదిరాజ్ కమ్యూనిటీ హాళ్లను, మల్లారంలో మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. అనంతసాగర్‌లో రూ.13 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, కుర్మ యాదవ సంఘం భవనాలను ప్రారంభించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సరస్వతీ మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతసాగర్ మాజీ సర్పంచ్ జీవ¯ŒSరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గుర్రాలగొందిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. వంతెన, బాలుర గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గుర్రాలగొంది శ్మశాన వాటికలో మొక్కలు నాటారు. అనంతసాగర్, సికింద్లాపూర్‌లో మంత్రి మొక్కలు నాటారు. సికింద్లాపూర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు బాల్‌రెడ్డి భార్య భాగ్యమ్మకు రూ.6 లక్షల చెక్కును అందజేశారు. మావోయిస్టుల దాడిలో మృతి చెందిన ఇస్తారి భార్య అంబమ్మకు రూ.5 లక్షల చెక్కును, అనంతసాగర్‌లో మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. మంత్రి వెంట ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, జెడ్పీటీసీ నమూండ్ల కమల రామచంద్రం, మార్కెట్ కమిటీ , ఓఎస్డీ బాల్‌రాజు, వెటర్నరీ ఏడీ అంజయ్య, సర్పంచ్‌లు మెట్ల శంకర్, ఆంజనేయులు, మేడికాయల వెంకటేశం, ఎంపీటీసీలు ఆంజనేయులు, బాలదుర్గవ్వ, మల్లేశం, ఎంపీడీఓ జాఫర్, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఏపీఓ మల్లేశం, ఏపీఎం మహిపాల్, ఈఓపీఆర్డీ సుదర్శ¯ŒS, ఆయా శాఖల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
అపార్ట్‌మెంట్స్‌లో ఏం జరిగింది?
బి.జయ దర్శకత్వంలో ఆర్.జె.సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘వైశాఖం’. హరీశ్, అవంతిక జంటగా నటిస్తున్నారు. విశాఖలో ప్రారంభమైన ఈ చిత్రం నాలుగో షెడ్యూల్ 20వ తేదీ వరకూ జరుగుతుంది. బి.జయ మాట్లాడుతూ - ‘‘సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. అపార్ట్మెంట్స్ నేపథ్యంలో వినోదం, భావోద్వేగాలు మేళవించిన కమర్షియల్ కథ. కజక్‌స్థాన్‌లో తీసిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. బీఏ రాజు మాట్లాడు తూ - ‘‘జయ దర్శకత్వం వహించిన గత చిత్రాలు విజయం సాధించ డంతో పాటు బయ్యర్లకు లాభాల్ని అందించా యి. దాంతో ఈ చిత్రానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్లోనూ బిజినెస్ పరంగా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఆగస్టులో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది’’ అన్నారు. ప్రత్యేక పాత్రలో సాయికుమార్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: వాలిశెట్టి వెంకట సుబ్బారావు, సంగీతం: డీజే వసంత్. -
అందరికీ నచ్చేలా వైశాఖం
మహిళా దర్శకుల్లో ‘డైనమిక్’ అనిపించుకున్న వాళ్లల్లో జయ బి. ఒకరు. ఆమె దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘వైశాఖం’. హరీశ్, అవంతిక జంటగా ఆర్జే సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ అరవైశాతం పూర్తయింది. ఈ నెల 20న మూడో షెడ్యూల్ మొదలవుతుంది. జయ బి. మాట్లాడుతూ- ‘‘నైట్ ఎఫెక్ట్‌లో ఓ ఫైట్, కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్లో చిత్రీకరించబోతున్నాం. సరికొత్త కథాంశంతో అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. హీరో, హీరోయిన్స్‌తో పాటు అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది’’ అన్నారు. ‘‘యువతను, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నాం. చిత్రీకరణలో ఎక్కడా రాజీ పడకుండా హై బడ్జెట్లో తెరకెక్కిస్తున్నాం. పాటలు చాలా బాగా వచ్చాయి’’ అని బీఏ రాజు చెప్పారు. సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డీజే వసంత్, లైన్ ప్రొడ్యూసర్: బి. శివకుమార్. -
ఏకపక్షంగా కృష్ణా బోర్డు తీరు
కేంద్రమంత్రి ఉమకు కేసీఆర్, హరీశ్ వేర్వేరుగా లేఖలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాల్లో స్పష్టత వచ్చే వరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి చేర్చే విషయంలో తొందర అవసరం లేదని సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఈ మేరకు బుధవారం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతికి వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రాజెక్టుల వారీ కేటాయింపులపై స్పష్టత వచ్చాకే బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను సంప్రదించకుండా, చర్చలు జరపకుండా బోర్డు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ వాటా తేలే వరకు బోర్డు పంపిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను ఆమోదించవద్దని కోరారు. ఎందుకంత ఆత్రుత: ‘‘రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేసిన తర్వాత, ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక బోర్డు వీటి నిర్వహణను మాత్రమే చూడాలి. అదీగాక బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును పొడిగిస్తూ.. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు నిర్ధారించాలని సూచించారు. ఎవరి వాటా ఎంత, వినియోగం ఎలా ఉండాలో ట్రిబ్యునల్ చెప్పాకే బోర్డు అర్థవంతంగా వ్యవహరించాలి. కానీ దురదృష్టవశాత్తూ బోర్డు ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఆత్రుత చూపుతోంది’’ అని సీఎం, హరీశ్ తమ లేఖల్లో వివరించారు. ‘‘రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89(ఏ), (బీ) ప్రకారం ట్రిబ్యునల్ కాల పరిమితిని రెండేళ్లు పెంచారు. కృష్ణా జలాల వివాదం రెండు రాష్ట్రాల మధ్యా లేదా నాలుగు రాష్ట్రాల మధ్యా అన్న అంశం ఇంకా తేలలేదు. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేవు. నీటి కేటాయింపులకు సంబంధించిన అంశాలు ఇంకా బ్రజేష్ ట్రిబ్యునల్ పరిశీలనలో ఉన్నాయి. అలాంటప్పుడు బోర్డు నియంత్రణ ఎక్కడిది’’ అని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో గత అరవై ఏళ్లుగా తెలంగాణకు నీటి కేటాయింపుల్లో తీరని అన్యాయం జరిగిందని, ఇప్పుడు తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుంటే అదే అన్యాయం మళ్లీ కొనసాగినట్లు అవుతుందని వివరించారు. ఈ దృష్ట్యా కృష్ణా ప్రాజెక్టులను తన పరిధిలోకి తేవాలంటూ బోర్డు పంపిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను ఆమోదించరాదని కోరారు. ఏపీ ఒత్తిళ్లకు తలొగ్గుతోంది ఏపీ ఒత్తిళ్లకు తలొగ్గి కృష్ణా బోర్డు ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తోందని మంత్రి హరీశ్ తన లేఖలో పేర్కొన్నారు. బ్రజేష్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించే వరకు బోర్డు నియంత్రణ అవసరం లేదని అన్నారు. రాష్ట్రాల పునర్విభజన చట్టంలోని 87(1), 85(8) సెక్షన్ల ప్రకారం కృష్ణా బోర్డు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను తయారు చేయలేదని తెలిపారు. -
ట్రాక్టర్ బోల్తా..ఒకరి మృతి
బిజినేపల్లి మండలం వెలిగొండ గ్రామంలో ట్రాక్టర్ అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌పై కూర్చున్న రాములు(18) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అదుపు తప్పిన ట్రాక్టర్ పొలంలోకి దూసుకెళ్లింది. దీంతో ట్రాక్టర్ పైన కూర్చున్న వ్యక్తులు పక్కనున్న చెట్టుకు ఢీకొన్నారు. దీంతో రాములు అక్కడికక్కడే మరణించగా..హరీశ్ అనే మరో యువకుడు స్వల్పంగా గాయపడ్డాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్పందిస్తున్న హృదయాలు
అవయవ దానంపై పెరుగుతున్న ఆసక్తి పేర్ల నమోదులో దక్షిణాదిలోనే కర్ణాటక ముందంజ యువతలో స్ఫూర్తి నింపుతున్న హరీష్ చివరి కోరిక సగటున రోజూ 20 మంది జెడ్సీసీకే వద్ద పేర్ల నమోదు బెంగళూరు: అవయవ దానంపై యువతలో ఆసక్తి పెరుగుతోంది. తాము చనిపోయిన తర్వాత తమతో పాటు విలువ కట్టలేని అవయవాలు మట్టిలో కలిసిపోకూడదని రాష్ట్ర యువత భావిస్తోంది. దీంతో రాష్ట్రంలో అవయవ దానం చేయడానికి యువత ముందుకు వస్తున్నారు. 2015లో 60 మంది అవయవ దానం చేయగా వారి ద్వారా సేకరించిన 158 అవయవాలు ప్రాణాపాయస్థితిలో ఉన్న ఇతరులకు ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అవయవదానం విషయమై దాతలకు, గ్రహీతలకు మధ్య సంధాన కర్తగా వ్యవహరిస్తున్న జోనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కర్ణాటక ఫర్ ట్రాన్స్ప్లాన్టేషన్ (జెడ్సీసీకే) సంస్థ వద్ద 10 వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో అవయవదానం కోసం తమ పేర్లను నమోదు చేసుకోవడం కర్ణాటకలోనే ఎక్కువ ని జెడ్సీసీకే సంస్థ చెబుతోంది. అంతేకాకండా అవయవదానం కోసం ముందుకు వచ్చేవారిలో ఎక్కువగా 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారు కావడమే గమనార్హం. ఇదిలా ఉండగా నెలమంగళ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తన శరీరం రెండు ముక్కలు అయినా తన కళ్లను దానం చేయాలని హరీష్ చెప్పిన సంగతి తెలిసిందే. అ ఘటన జరిగినప్పటి నుంచి అవయవదానం కోసం ముందుకు వ చ్చేవారి సంఖ్య మరింతగా పెరుగుతోంది. ప్రతి రోజు సగటున 20 మంది జెడ్సీసీకే వద్ద తమ పేర్లను అవయవదానం కోసం నమోదు చేయించుకుంటున్నారు. అవయవదానం అంటే... ఏదేని వ్యక్తి ప్రమాదానికి గురైనప్పుడు బ్రెయిడ్‌డెడ్ స్థితికి చేరుకుంటే సదరు వ్యక్త్తి నుంచి (జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా బంధువులు అనుమతితో) కళ్లు, మూత్రపిండాలు, లివర్ తదితర అవయవాలను సేకరిస్తారు. అటుపై వాటిని అవసరమైన వారికి శ స్త్ర చికిత్స ద్వారా అమరుస్తారు. దీనినే వైద్య పరిభాషలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ అంటారు. దీని వల్ల అత్యంత విలువైన మానవ అవ యవాలు మరోకరికి జీవం పోస్తాయి. జెడ్సీసీకే పాత్ర ఏంటంటే... ప్రతి రాష్ట్రంలో అవయవదానంపై జాగృతి కోసం ఒక సంస్థ పనిచేస్తుంటుంది. అంతేకాకుండా ఈ సంస్థ అటు వ్యాధిగ్రస్తులకు, ప్రభుత్వంతో పాటు అవయవదానం కోసం ముందుకు వచ్చే వారి మధ్య సంధానకర్తగా పనిచేస్తుంటుంది. కర్ణాటకలో జెడ్సీసీకే సంస్థ ఈ విధులను నిర్వర్తిస్తోంది. ఇదిలా ఉండగా ఆయా అవయవ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు మొదట రూ.2వేలు చెల్లించి జెడ్సీసీకే వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో జెడ్సీసీకే సంస్థ సదరు వ్యక్తి బ్లడ్‌గ్రూప్, వ యస్సు తదితర విషయాలన్నీ (హెల్త్ హిస్టరీ) నమోదు చేస్తారు. ప్రమాద సమయంలో బ్రెయిడ్‌డెడ్ అయిన వ్యక్తులు ఎవరైనా వారి అవయవాలను దానం చేయడానికి ముందుకు వస్తే వారి వయస్సు, బ్లడ్‌గ్రూప్ తదితర విషయాలను అప్పటికే సదరు అవయవాల కోసం తమ వద్ద పేర్లు నమోదు చేసుకొన్న వ్యక్తుల వివరాలతో జెడ్సీసీకే సిబ్బంది పోల్చి చూస్తారు. అన్నిరకాలుగా ఇరువురి హెల్త్హిస్టరీ సరిపోతే సదరు అవయవాలను పేషెంట్‌కు ఉచితంగా అందజేస్తారు. ఇక శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చును (ప్రైవేటు ఆస్పత్రుల్లో) వ్యాధిగస్తుడే భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కిడ్నీ సంబంధ ఆర్గాన్ట్రాన్స్ప్లాంట్ విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఎంత మంది ఎదురు చూస్తున్నారంటే... ప్రస్తుతం కిడ్నీ, లివర్ తదితర అవయవ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న 2,502 మంది... జెడ్సీసీకే వద్ద తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో కిడ్నీ కోసం 1,834 మంది, లివర్ కోసం 600, హృదయం కోసం 40, ఊపిరితిత్తుల కోసం 6 మంది, కిడ్నీ, లివర్ రెండింటీ కోసం 11 మంది, హృదయం, ఊపిరితిత్తుల కోసం 8 మంది, ప్యాంక్రియాస్ కోసం ముగ్గురు ఎదురు చేస్తున్నారు. పేర్ల నమోదు ఇలా... అవయవదానంతో పాటు కిడ్నీ, లివర్ తదితర అవయవసంబంధ వ్యాధులతో బాధవపడుతూ సదరు అవయవాల కోసం ఎదురు చూస్తున్నవారు 9845006768, zcckbangalore@gmail.com, www.zcck.in లో సంప్రదించవచ్చు. -
హరీష్ కుటుంబాన్ని ఆదుకుంటాం
బాధితుడి కుటుంబాన్ని కలిసిన మంత్రి టి.బి. జయచంద్ర రూ. 2 లక్షల చెక్ అందజేత తుమకూరు : నెలమంగళ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తన శరీరం రెండు బాగాలుగా విడిపోయి తాను మరణిస్తు న్నానని తెలిసీ అవయవాలు దానం చేసిన తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలూకా, కరెగౌడనహళ్ళికి చెందిన హరీష్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి టి.బి.జయచంద్ర హామీ ఇచ్చారు. ఈమేరకు బుధవారం ఆయన హరిష్ ఇంటికి వెళ్లి హరీష్ తల్లి గీతమ్మ, అన్న శ్రీధర్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ప్రభుత్వం అందజేసిన రూ. 2 లక్షల చెక్కును హరిష్ తల్లికి అందజేసారు. మంత్రి మాట్లాడుతూ మరణంలోనూ అవయవాలు దానం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచిన హరీష్ వల్ల గ్రామానికి మంచి పేరు వచ్చిందన్నారు. ఆయన జ్ఞాపకాలకు గుర్తుగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాకలెక్టర్ మోహన్‌రాజ్, తాలుకా ఆదికారి ఉమేష్‌చంద్ర, జడ్పి సీఈఓ రమేష్, టీపీఈఒ శివప్రకాశ్ పాల్గొన్నారు. -
‘హరీష్’ స్ఫూర్తి అజరామరం
= ప్రమాద బాధితులకు సాయం చేయండి = ముఖ్యమంత్రి సాంత్వన‘హరీష్ యోజన’ను ప్రారంభించిన సీఎం = ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు = తన కుమారుడి పేరుతో పథకం ప్రారంభించడం సంతోషదాయకం : హరీష్ తల్లి గీత బెంగళూరు : తాను చావు బతులకు మధ్య ఉన్నానని తెలిసి తన అవయవాలను మరొకరికి దానం చేయాలని చివరి కోరికగా అసమాన స్ఫూర్తి ప్రదర్శించిన ‘హరీష్’ పేరుతో పథకం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడి విధాన సౌధలో ముఖ్యమంత్రి సాంత్వన‘హరీష్ యోజన’ పథకాన్ని ప్రారంభించి మాట్లాడుతూ... హరీష్ మరణం దురదృష్టకరమైనా ఆయన స్ఫూర్తి అజరామరమన్నారు. రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు మాకెందుకులే అంటూ ప్రజలు భావించకుండా తక్షణ సాయం చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల సందర్భంలో బాధితులకు ఉపయుక్తంగా ఉండేలా రూపొందించిన ముఖ్యమంత్రి సాంత్వన‘హరీష్ యోజన’ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ పథకంలో ఉన్న ముఖ్యమంత్రి పేరును తీసేస్తే బాగుంటుందని ముందుగా సిద్ధరామయ్య రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సూచించారు. ప్రమాదాల బారిన పడిన వ్యక్తులకు ప్రైవేటు ఆస్పత్రులు సైతం ముందుగా అవసరమైన చికిత్సను అందజేయాలని, డబ్బు గురించి ఆలోచించరాదని అన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం విజయవంతంగా అమలు కావాలంటే సాధారణ ప్రజలు, ప్రైవేటు ఆస్పత్రుల యజమానులు, వైద్యులు, పోలీసులు ఇలా అందరి సహకారం అవసరమన్నారు. ఈ పథకంలో భాగంగా ప్రమాద బాధితులకు 48 గంటల వరకు రూ. 25 వేల ఖర్చును ప్రభుత్వం భరించే దిశగా ప్రైవేట్ ఆస్పత్రులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఇప్పటివరకు దేశంలో ఇలాంటి పథకం లేదని చెప్పారు. ఇలాంటి కార్యక్రమానికి రూపకల్పన చేసిన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు ఆయన అభినందనలు తెలియజేశారు. హరీష్ తల్లి గీతా మాట్లాడుతూ....‘నా కుమారుడికి కలిగిన పరిస్థితి మరే బిడ్డకు రాకూడదు. ఈ పథకానికి హరీష్ పేరు పెట్టడం సంతోషాన్నిచ్చింది. ప్రమాద బాధితులకు కొత్త ఊపిరి పోయడానికి ఈ పథకం ఉపయుక్తంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. మంత్రులు యు.టి.ఖాదర్, శరణ్ ప్రకాష్ పాటిల్ పాల్గొన్నారు. -
ఆ చివరి ఆశయానికి సముచిత గౌరవం
దివంగత హరీష్ పేరుతో సంక్షేమ పథకం రేపు ‘ముఖ్యమంత్రి సాంత్వన హరీష్ యోజన’ పథకం ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం స్ఫూర్తిగా నిలచిన హరీష్ చివరి కోరిక బెంగళూరు: రాష్ర్ట ప్రభుత్వం ఒక సాధారణ వ్యక్తి పేరుతో సంక్షేమ పథకం అమలు చేయడం మహా ఆరుదు. ప్రాణాలు పోతున్న చివరి క్షణంలో ఆ వ్యక్తి అసాధారణ తాపత్రయం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన నేపథ్యం ఆయన పేరుతో సంక్షేమ పథకం తీసుకురావడానికి కర్ణాటక ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కూడా తాను చనిపోయే చివరి క్షణంలో కూడా అవయవదానం చేయాలని భావించిన హరీష్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సముచిత గౌరవం ఇవ్వనుంది. ప్రభుత్వం రేపు (మంగళవారం) ఆయన పేరు మీదుగా ప్రమాద బాధితులను ఆదుకునేందుకు ఓ సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది. నగరంలో ఇటీవల జరగిన రోడ్డు ప్రమాదంలో నగరంలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న హరీష్ చనిపోయిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఆయన శరీరం రెండు భాగాలైంది. ఇక తాను బతకనని భావించి దగ్గరగా వచ్చిన వారితో ‘నా శరీరంలో ఏ అవయవం పనికి వస్తే ఆ అవయవాన్ని దానం చేయండి.’ అని అర్థించారు. విషయం తెలుసుకున్న వైద్యులు కుటుంబ సభ్యుల అనుమతితో ఆయన కళ్లు దానం చేశారు. ఆయన స్ఫూర్తితో స్వగ్రామమైన తుమకూరు జిల్లా, గుబ్బి తాలూకా కరెగౌడహళ్లి గ్రామ ప్రజలంతా తమ కళ్లను దానం చేయడానికి ముందుకు వ చ్చారు. ఇదిలా ఉండగా ప్రమాదంలో గాయపడిన ప్రజలకు సత్వర వైద్య సహాయం అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి సాంత్వన యోజన’ పేరుతో నూతన పథకాన్ని అమలు చేయాలని గతంలో భావించింది. గత జనవరి నెలలో ప్రారంభం కావాల్సిన ఈ పథకం వివిధ కారణాల వాయిదా పడుతూ వస్తోంది. చివరికి రేపు ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో హరీష్ తన చివరి క్షణంలో కూడా అవయవదానం చేయడానికి ముందుకు రావడమే కాకుండా ఎంతోమందికి ఈ విషయంలో ప్రేరణగా నిలిచారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి సాంత్వన యోజన పేరును ‘ముఖ్యమంత్రి సాంత్వన హరీష్ యోజన’ పేరుతో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి యూ.టీ ఖాదర్ ధ్రువీకరించారు. ‘ముఖ్యమంత్రి సాంత్వన హరీష్ యోజన’ ఇలా పనిచేస్తుంది ►రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గాయపడిని వారు ఆసుపత్రిలో చేరిన మొదటి 48 గంటలు చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. గరిష్టంగా రూ.25 వేల వరకూ ఖర్చు పెడుతుంది. ►బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి నేరుగా ఈ పథకం ద్వారా నిధులు అందజేస్తారు. ► చిన్న గాయాలు మొదలుకుని మొత్తం 25 రకాల చికిత్సలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. అగ్ని ప్రమాదాల్లో గాయపడిన వారికి కూడా ఈ పథకం ద్వారా సాయం అందుతుంది. ►ఈ విషయంపై మరింత సమాచారం కోసం 108, లేదా 104లను సంప్రదించవచ్చు. -
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపేశాడు
నిజామబాద్: నిత్యం మద్యం తాగి తల్లిని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని.. విసుగు చెందిన కుమారుడు తండ్రిని హతమార్చాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అబ్బాపూర్ (ఎం) గ్రామంలో శనివారం అర్ధరాత్రి దాటాక చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దసాయిల్ (52) మద్యానికి బానిసై భార్యను తరచూ వేధింపులకు గురి చేసేవాడు. ఎంత చెప్పినా తన పద్ధతి మార్చుకోకపోవడంతో విసుగుచెందిన కొడుకు హరీష్ (19) తండ్రిపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి బాగా తాగి వచ్చిన పెద్దసాయిల్ భార్యతో గొడవపడ్డాడు. దీంతో కోపోద్రిక్తుడైన హరీష్ తండ్రి పడుకున్న సమయంలో సుత్తెతో తలమీద మోది హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పాపం చిన్నోడు..
కాలేయ సమస్యతో నాలుగేళ్ల బాలుడి అవస్థ మెరుగైన వైద్యానికి రూ.20 లక్షలు ఆర్థిక స్థోమత లేక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు దాతల కోసం ఎదురుచూస్తున్న పేదకుటుంబం పేద కుటుంబానికి పెద్ద కష్టమొచ్చింది. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ తమ ఇద్దరు సంతానాన్ని పోషించుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. ఇంతలో పిడుగులాంటి వార్త అందడంతో ఒక్కసారిగా చతికిలపడ్డారు. నాలుగేళ్ల బాబుకు కాలేయ మార్పిడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో తల్లడిల్లిపోతున్నారు. మెరుగైన వైద్యం చేయించాలంటే దాదాపు రూ.20 లక్షలు కావాల్సి ఉండడంతో ఏమి చేయాలో పాలుపోక.. దాతల కోసం ఎదురు చూస్తున్నారు. వివరాల ఇలా.. - ఖైరతాబాద్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం యగువమెట్ట గ్రామానికి చెందిన పోకపూడి వెంకటేశ్వర్లు, మంజుల దంపతులు. వీరికి హేమలత(6), హరీష్(4) సంతానం. వ్యవసాయ కూలీగా పని చేస్తూ బతుకీడుస్తున్నారు. ఏడాదిన్నర కిందట బాబు హరీష్ అనారోగ్యం బారిన పడ్డాడు. వెంటనే నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాలలో చేర్పించి వరబీజం ఆపరేషన్ చేయించారు. ఆ తరువాత తరచూ పొట్ట ఉబ్బడం, ముందుకు రావడం ప్రారంభమైంది. ఓసారి ఆడుకుంటూ ఉండగా ముక్కులోంచి రక్తం కారడంతో పడిపోయాడు. హుటాహుటిన బాబును ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు లివర్ సమస్య ఉందని చెప్పారు. ఈనెల 12న హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ గ్లోబల్ హాస్పిటల్‌కు హరీష్‌ను తీసుకొచ్చి సీనియర్ హెపటాలజిస్ట్కు చూపించారు. పరీక్షలు చేసిన అనంతరం బాబుకు ‘క్రానిక్ లివర్ డిసీజ్’ ఉందని.. కాలేయం రాయిలాగా మారిందని... బాబు బతకాలంటే లివర్ మార్పిడి అత్యవసరమని తేల్చి చెప్పారు. లివర్ మార్పిడి చేయకుండా చికిత్స ద్వారా తగ్గించే దశ కూడా దాటిపోయిందన్నారు. ఆపరేషన్‌తోపాటు ఆ తరువాత అయ్యే ఖర్చులకు రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. అంత ఖర్చు చేసే పరిస్థితి లేక ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దాతలెవరైనా ముందుకు వస్తే తమ బాబు బతుకుతాడని వారు అర్థిస్తున్నారు. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు... పోకపూడి మంజుల, సిండికేట్ బ్యాంక్, స్రావిపల్లి, నెల్లూరు జిల్లా అకౌంట్ నెం: 34812210029267, ఐఎఫ్ఎస్సీ: ఎస్వైఎన్డీ0003481’ ఖాతాలో జమచేయవచ్చని ఆ బాలుడి తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, మంజుల కోరుతున్నారు. ఫోన్ ద్వారా అయితే 9652248372 నంబర్ ద్వారా తమను సంప్రదించవచ్చని వారు సూచించారు.