సాక్షి, న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితికి భారత శాశ్వత ప్రతినిధిగా పర్వతనేని హరీశ్‌ను నియమిస్తూ కేంద్ర విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా సేవలందిస్తున్న హరీష్ త్వరలో యూఎన్ అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. సెప్టెంబర్‌లో ఐరాసలో ప్రధాని మోదీ ఒక సదస్సుకు హాజరుకానున్న నేపథ్యంలో హరీశ్ నియామకం త్వరగా పూర్తయింది.
ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాం¿ోజ్ జూన్‌లో పదవీవిరమణ చేశాక ఆ పోస్ట్ అప్పటి నుంచీ ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో తదుపరి రాయబారి నియామక ప్రక్రియను కేంద్రం వేగంగా పూర్తిచేసింది. 1990 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సరీ్వస్ అధికారి అయిన హరీష్ మూడు దశాబ్దాలుగా విదేశాంగ శాఖ పరిధిలో పలు దేశాల్లో పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment