Ministry of External Affairs
-
13న ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఈ నెల 13న వాషింగ్టన్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారని సోమవారం అధికారులు తెలిపారు. సాధ్యమైనంత త్వరలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన జరిపేందుకు చర్చలు సాగుతున్నాయని విదేశాంగ శాఖ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్ రెండోసారి అమెరికా పాలనాపగ్గాలు చేపట్టాక ఇది ప్రధాని మోదీ మొట్టమొదటి అమెరికా పర్యటన కానుంది. ఫ్రాన్సులో రెండు రోజుల పర్యటనను ముగించుకుని ఆయన వాషింగ్టన్ వెళతారని చెబుతున్నారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టాక జనవరి 27వ తేదీన ప్రధాని మోదీ ఆయనతో ఫోన్లో సంభాషించారు. -
రష్యా-ఉక్రెయిన్ వార్: 16 మంది భారతీయులు మిస్సింగ్, 12 మంది మృతి
ఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్దంలో రష్యా తరఫున పోరాడుతున్న 16 మంది భారతీయులు కనిపించకుండా పోవడంతో పాటు, ఇప్పటి వరకు 12 మంది మరణించినట్లు కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. ప్రస్తుతం రష్యాలో చిక్కుకుని యుద్ధంలో పోరాడుతున్న భారతీయ పౌరులందరినీ స్వదేశానికి రప్పించడం కోసం తాము రష్యన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు.రష్యా తరఫున యుద్ధంలో 126 మంది భారతీయులు పాల్గొన్నట్లు సమాచారం ఉందన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ.. 96 మంది సైన్యం నుంచి విడుదలయ్యారని పేర్కొంది. కొందరు స్వదేశానికి తిరిగివచ్చారని.. ఇక 18 మంది ఇంకా సైన్యంలోనే పనిచేస్తున్నారని జైశ్వాల్ తెలిపారు. వారిలో 16 మంది ఆచూకీ లేదని స్పష్టం చేశారు.తాజాగా రష్యా తరఫున యుద్దంలో పాల్గొన్న భారతీయుడు మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారతీయుడి మృతిని దేశ విదేశాంగశాఖ తీవ్రంగా పరిగణించింది. దీంతో, రష్యా యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రష్యాకు మద్దతుగా యుద్ధం చేస్తున్న కేరళకు చెందిన బినిల్ బాబు(32) మృతిచెందాడు. అలాగే, అతడి సమీప బంధువు టీకే జైన్ (27)కు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో బినిల్ చనిపోయిన విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసిందని అతడి బంధువులు మీడియాతో చెప్పారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ క్రమంలో భారతీయుడి మృతిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.ఇదీ చదవండి: ద.కొరియా విమాన ప్రమాదం..వెలుగులోకి కీలక విషయాలు -
రష్యా యుద్ధంలో భారతీయుడు మృతి.. కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య పోరు కారణంగా పలువురు మృత్యువాత పడుతున్నారు. తాజాగా రష్యా తరఫున యుద్దంలో పాల్గొన్న భారతీయుడు మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ క్రమంలో భారతీయుడి మృతిని దేశ విదేశాంగశాఖ తీవ్రంగా పరిగణించింది. దీంతో, రష్యా యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది.ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రష్యాకు మద్దతుగా యుద్ధం చేస్తున్న కేరళకు చెందిన బినిల్ బాబు(32) మృతిచెందాడు. అలాగే, అతడి సమీప బంధువు టీకే జైన్ (27)కు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో బినిల్ చనిపోయిన విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసిందని అతడి బంధువులు మీడియాతో చెప్పారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ క్రమంలో భారతీయుడి మృతిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.రష్యాకు మద్దతుగా యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. ఈ విషయాన్ని మాస్కోలోని రష్యన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపింది. అలాగే, ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయం అధికారులతోనూ మాట్లాడినట్టు స్పష్టం చేసింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మిగిలిన భారతీయులను అక్కడి నుంచి పంపించాలని కోరినట్టు ప్రకటన విడుదల చేసింది.మరోవైపు.. ఈ ఘటనపై కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. ‘మాస్కోలోని భారత రాయబార కార్యాలయం మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోంది. మృతదేహాన్ని త్వరగా భారత్‌కు రప్పించేందుకు రష్యన్ అధికారులతో మాట్లాడుతున్నాం. గాయపడిన జైన్‌ను కూడా విడుదల చేసి, ఇండియాకు పంపించాలని కోరాం’ అని వెల్లడించారు. -
పోస్టాఫీసుల్లో మరో 600 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు
న్యూఢిల్లీ: తపాలా శాఖల్లో 2028–29 నాటికి మరో 600 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుకు వీలుగా తపాలా శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ మధ్య ఒప్పందం కుదిరినట్టు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. ‘భారత ఆర్థిక సదస్సు 2024’ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. తపాలా శాఖకు దేశవ్యాప్తంగా 6,40,000 విక్రయ కేంద్రాలున్నాయని, ప్రపంచంలో మరే సంస్థకు ఈ స్థాయి నెట్వర్క్ లేదన్నారు. పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు 2017తో ప్రారంభం కాగా.. 1.52 కోట్ల మందికి పైగా సేవలు అందించడంలో ఇవి కీలకంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 442 పోస్టాఫీసు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలున్నాయి. -
Champions Trophy: బీసీసీఐ, భారత విదేశాంగ శాఖది ఒకే మాట
చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా మరోసారి సంకేతాలు ఇచ్చారు. ఆటగాళ్ల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యం అని పునరుద్ఘాటించారు. కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులకు పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.వన్డే ఫార్మాట్లో జరుగనున్న ఈ మెగా ఈవెంట్‌కు టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్‌లతో పాటు ఆతిథ్య దేశ హోదాలో పాక్ అర్హత సాధించింది. సొంతగడ్డపై డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతోంది.అయితే, ఇరుదేశాల మధ్య పరిస్థితులు, భద్రతాకారణాల దృష్ట్యా బీసీసీఐ తమ జట్టును పాకిస్తాన్‌కు పంపేందుకు ససేమిరా అంటోంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలికి కూడా చెప్పింది. టీమిండియా ఆడే మ్యాచ్‌ల కోసం తటస్థ వేదికలను ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేసింది. అయితే, పాక్ క్రికెట్ బోర్డు మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు.వేరే ఆప్షన్లు కూడా ఉన్నాయిటీమిండియా తమ దేశానికి రావాల్సిందేనని పట్టుబడుతోంది. ఇలాంటి తరుణంలో శుక్రవారం ఐసీసీ వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసింది. నేటితో చాంపియన్స్ ట్రోఫీ వేదికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజీవ్ శుక్లాను మీడియా పలకరించగా.. ‘‘మేము ఈ విషయంలో చర్చలు జరుపుతున్నాం. పరిస్థితులకు అనుగుణంగా తుది నిర్ణయం ఉంటుంది.ఏదేమైనా ఆటగాళ్ల భద్రతే మాకు మొదటి ప్రాధాన్యం. హైబ్రిడ్ మోడల్ అనే ఆప్షన్ కూడా ఉంది. అదే కాకుండా ఇంకా వేరే ఆప్షన్లు కూడా ఉన్నాయి. వాటి గురించి చర్చ జరుగుతోంది’’ అని పేర్కొన్నారు.#WATCH | Delhi: On Champions Trophy in Pakistan, BCCI vice president & Congress leader Rajeev Shukla says, "Our discussions are going on. A decision will be taken after looking at the situation. Our top priority is the safety of the players. Hybrid mode is also an option,… pic.twitter.com/daIaqIEyZ2— ANI (@ANI) November 29, 2024 విదేశాంగ శాఖ కూడా ఇదే మాటటీమిండియాను పాకిస్తాన్ పంపే ప్రసక్తి లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(ఎమ్ఈఏ) స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎమ్ఈఏ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ధ్రువీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ ఆందోళనలు లేవనెత్తింది. ఇందుకు సంబంధించి ప్రకటన కూడా విడుదల చేసింది. కాబట్టి భారత జట్టు అక్కడికి వెళ్లే అవకాశమే కనిపించడం లేదు’’ అని పేర్కొన్నారు.చదవండి: స్వర్ణ పతక విజేతను ప్రోత్సహించే తీరిదేనా?: సుప్రీం కోర్టు అసంతృప్తి#WATCH | Delhi: On Indian cricket team participating in Pakistan, MEA Spokesperson Randhir Jaiswal says, "... The BCCI has issued a statement... They have said that there are security concerns there and therefore it is unlikely that the team will be going there..." pic.twitter.com/qRJPYPejZd— ANI (@ANI) November 29, 2024 -
‘మీ మీద మాకు నమ్మకం లేదు’.. కెనడా ప్రధానిపై భారత్ ఆగ్రహం
ఢిల్లీ : ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ -కెనడా మధ్య దౌత్య పరమైన వివాదం రాజుకుంది. కెనడా దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ కార్యాలయానికి కెనడా అధికారి స్టీవర్ట్ వీలర్ సమన్లను అందుకున్నారు.నిజ్జర్ హత్య కేసులో భారత హై కమిషన్ సహా, పలువురు దౌత్య వేత్తలను అనుమానితుల జాబితాలో చేర్చింది కెనడా. అంతేకాదు వారిని విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిర్ణయాన్ని ఖండించింది భారత్. కెనడా వాదన అసమంజసమని కొట్టిపారేసింది. ట్రూడో సర్కార్ రాజకీయ ఎజెండాలో భాగమేనంటూ ఫైరయ్యింది.ట్రూడోకు భారత్ పట్ల విధ్వేష భావం ఉందని భారత్ తన ప్రకటనలో తెలిపింది. భారత్‌కు వ్యతిరేకంగా తీవ్రవాద,వేర్పాటువాద ఎజెండాలతో సంబంధం ఉన్న వ్యక్తులను ట్రూడో తన కేబినెట్లో చేర్చుకున్నారని విమర్శించింది.ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత రాయబారి ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో గతేడాది వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన ఆధారాల్ని నాటి నుంచి నేటి వరకు తమతో పంచుకోలేదని భారత్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పుడు ఏకంగా భారత దౌత్యవేత్తలను అనుమానితుల జాబితాలో చేర్చడం రాజకీయ దురుద్దేశమేనని ఆరోపించింది. కెనడా హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ‘హై కమీషనర్ సంజయ్ కుమార్ వర్మ 36 సంవత్సరాల పాటు దౌత్యవేత్తగా విశిష్టమైన సేవలందించారు. భారత్‌లోనే అత్యంత సీనియర్ దౌత్యవేత్త. సంజయ్ కుమార్ జపాన్, సూడాన్‌లలో రాయబారిగా ఉన్నారు. ఇటలీ, టర్కీ, వియత్నాం, చైనాలలో కూడా సేవలందించారు. అలాంటి దౌత్యవేత్తపై కెనడా ప్రభుత్వ తీరు హాస్యాస్పదంగా ఉంది’అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.ఈ సందర్భంగా కెనడా నుంచి భారత హై కమిషనర్‌ను వెనక్కు పిలిపించింది. భారత దౌత్య సిబ్బందికి కెనడాలో రక్షణ లేదు అందుకే వెనక్కి పిలిపిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్రం నిర్ణయంతో హై కమిషనర్‌తో పాటు ఇతర దౌత్య సిబ్బంది భారత్‌కు తిరిగి రానున్నారు. -
లెబనాన్ సరిహద్దులో 600 మంది సైనికులు.. భారత్ ఆందోళన
దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ జరుపుతున్న కాల్పుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుల భద్రతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లెబనాన్‌లో ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షణ మిషన్‌లో 600 మంది భారతీయ సైనికులు ఉన్నారు. వీరంతా ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో 120 కిలో మీటర్ల బ్లూ లైన్ వెంబడి ఉన్నారు. దీంతో అక్కడి ఉన్న భారత్ సైనిక భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. భారత్ ఓ ప్రకటన విడుదల చేసింది.‘‘ బ్లూ లైన్ వెంబడి భద్రతా పరిస్థిలు వేగంగా క్షీణించటంపై మేం ఆందోళన చెందుతున్నాం. అక్కడ నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉన్నాం. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ప్రాంతాల్లో దాడుల ఉల్లంఘనకు పాల్పడవద్దు. యూఎన్ శాంతి పరిరక్షకుల భద్రత కోసం అక్కడ తగిన చర్యలు తీసుకోవాలి’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ సైన్యం యూఎన్ఐఎఫ్ఐఎల్ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న అబ్జర్వేషన్ టవర్‌పై దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇద్దరు యూఎన్ శాంతి పరిరక్షకులు గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి ఓ ప్రకటనలో పేర్కొంది.‘‘ అదృష్టవశాత్తూ ఇద్దరు శాంతి పరిరక్షకులు గాయపడ్డారు. వారు చికిత్స కోసం ఆస్పత్రిలో ఉన్నారని తెలిపింది.హిజ్బుల్లా మాజీ చీఫ్ హసన్ నస్రల్లా హత్య తర్వాత ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితి పెరిగింది. ఇజ్రాయెల్ సైన్యం ఈ ప్రాంతంలో దాడులు చేయటతో అక్కడే ఉన్న యూఎన్ శాంతి పరిరక్షకులకు ప్రమాదకరంగా మారింది.అయితే.. యూఎన్ఐఎఫ్ఐఎల్ సైనికుల పోస్టులకు సమీపంలో హెజ్బొల్లా బలగాలు ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆరోపణలు చేస్తోంది.చదవండి: ట్రంప్‌పై ఒబామా విమర్శలు.. అమెరికాకు కమలా హారిస్ కావాలి -
అది రాజకీయ ప్రేరేపిత నివేదిక: భారత్
న్యూఢిల్లీ: అమెరికా ఫెడరల్ కమిషన్ యూఎస్సీఐఆర్ఎఫ్ తాజా నివేదికపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అది పూర్తిగా హానికరమైన.. ప్రేరేపితమైన నివేదికగా పేర్కొంటూ భారత విదేశాంగ శాఖ స్పందించింది.‘యూఎస్సీఐఆర్ఎఫ్’ రాజకీయ ఎజెండాతో కూడిన పక్షపాత సంస్థ. వాస్తవాలను తప్పుగా సూచిస్తోంది. భారత్‌పై ప్రేరేపిత కథనాలను కొనసాగిస్తోంది అని నివేదికపై ఎదురైన ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ బదులిచ్చారు.‘అంతర్జాతీయ మతస్వేచ్ఛపై ఈ యూఎస్ కమిషన్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. అందులో.. మత స్వేచ్ఛ విషయంలో భారత్ క్రమబద్ధమైన ఉల్లంఘనలు చేస్తోందని పేర్కొంటూ కొలంబియాకు చెందిన విశ్లేషకురాలు సేమా హసన్ ఈ నివేదికను రూపొందించారు. అయితే..‘యూఎస్సీఐఆర్ఎఫ్’ నివేదికను.. భారత్ ఖండించడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఇలాంటి వార్షిక నివేదికలను తోసిపుచ్చుతూ వస్తోంది. -
3 నుంచి ప్రధాని బ్రూనై, సింగపూర్ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సెప్టెంబర్ మొదటి వారంలో సింగపూర్, బ్రూనై దేశాల్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 3–4వ తేదీల్లో ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. భారత ప్రధాని ఒకరు బ్రూనైలో పర్యటించడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలకు 40 ఏళ్లవుతున్న సందర్భంగా ప్రధాని అక్కడికి వెళ్తున్నారన్నారు. బ్రూనై నుంచి ప్రధాని సెప్టెంబర్ 4–5 తేదీల్లో సింగ్‌పూర్‌ను సందర్శిస్తారని చెప్పారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహా్వనం మేరకు మోదీ ఈ పర్యటన చేపట్టనున్నారని జైశ్వాల్ వివరించారు. -
ఐరాసలో భారత రాయబారిగా హరీశ్
సాక్షి, న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితికి భారత శాశ్వత ప్రతినిధిగా పర్వతనేని హరీశ్‌ను నియమిస్తూ కేంద్ర విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా సేవలందిస్తున్న హరీష్ త్వరలో యూఎన్ అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. సెప్టెంబర్‌లో ఐరాసలో ప్రధాని మోదీ ఒక సదస్సుకు హాజరుకానున్న నేపథ్యంలో హరీశ్ నియామకం త్వరగా పూర్తయింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాం¿ోజ్ జూన్‌లో పదవీవిరమణ చేశాక ఆ పోస్ట్ అప్పటి నుంచీ ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో తదుపరి రాయబారి నియామక ప్రక్రియను కేంద్రం వేగంగా పూర్తిచేసింది. 1990 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సరీ్వస్ అధికారి అయిన హరీష్ మూడు దశాబ్దాలుగా విదేశాంగ శాఖ పరిధిలో పలు దేశాల్లో పనిచేశారు. -
Olympics: ప్యారిస్ వెళ్లేందుకు పంజాబ్ సీఎంకు అనుమతి నిరాకరణ
ఒలింపిక్స్‌ను వీక్షించేందుకు పారిస్ వెళ్లేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత హాకీ జట్టుకు మద్దతుగా మాన్ ఆగస్టు 3 నుంచి 9 వరకు ఫ్రాన్స్ రాజధానిని సందర్శించాల్సి ఉంది.పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఒలింపిక్స్‌ను వీక్షించేందుకు ప్యారిస్ వెళ్లేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అనుమతి నిరాకరించింది. భద్రతా కారణాలతో అనుమతి నిరాకరించినట్లు పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందించింది.కాగా సీఎం భగవంత్ మాన్ ఆగస్టు 3 నుంచి 9 వరకు ప్యారిస్ పర్యటనకు వెళ్లాలని అనుకున్నారు. అక్కడ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత హాకీ జట్టుకు మద్దతు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. సీఎం, తన భార్య డాక్టర్ గుర్ప్రీత్ కౌర్ మాన్, ఇద్దరు సహాయకులు, మరో అయిదుగురు భద్రతా అధికారులు, సీఎంఓ నుంచి 10 మంది సీనియర్ అధికారుల ప్యారిస్‌కు వెళ్లేందుకు అనుమతి కోరగా.. ఆలస్యంగా అనుమతి కోరడం వల్ల భద్రతా కారణాలతో తిరస్కరించినట్లు ఎమ్ఈఏ పేర్కొంది.భారత్ నుంచి ఒలింపిక్ కంటెంజెంట్లో పంజాబ్‌కు చెందిన 19 మంది ఆటగాళ్లు ఉన్నారు. హాకీ జట్టులో పది మంది క్రీడాకారులు మన రాష్ట్రానికి చెందినవారు. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. అయితే ప్యారిస్ వెళ్లడానికి అనుమతి కోసం దరఖాస్తు చేయడంలో మా అధికారులు ఆలస్యం చేశారు, అయితే హాకీ జట్టు ప్రారంభ మ్యాచ్‌లను క్లియర్ చేసిన తర్వాత మాత్రమే మేము వారిని ఉత్సాహపరిచేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం’ అని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు.అయితే తనకు అనుమతి నిరాకరించడంపై మాన్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశ సమాఖ్య విధానంపై బీజేపీ నిరంతరం దాడి చేస్తోందని విమర్శించారు. 2022లోనూ సింగపూర్ వెళ్లేందుకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు బీజేపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు ప్రస్తావించారు. గత ఏడాది గోపాల్ రాయ్‌కి కూడా అమెరికా వెళ్లేందుకు అనుమతి నిరాకరించారని, ఆయన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. బీజేపీ పాలనలో ప్రతిదానికీ కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని అన్నారు. -
‘ఫ్రెంచ్ జర్నలిస్ట్ సెబాస్టియన్ వ్యాఖ్యలు సరికాదు’
సార్వత్రిక ఎన్నికలను కవర్ చేయకుండా తనను దేశం విడిచి వెళ్లమని భారత హోంశాఖ చెప్పినట్లు ఫ్రెంచ్ జర్నలిస్ట్ సెబాస్టియన్ ఫ్రాన్సిస్ చేసిన ఆరోపణలపై భారత్ శనివారం స్పందించింది. భారత దేశం వదలి వెళ్లాల్సి వచ్చిందని సెబాస్టియన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని తెలిపింది. ఆయన వర్క్ పర్మిట్ రిన్యూవల్ పునరుద్ధరణ పరిశీలనలో ఉందని స్పష్టం చేసింది.‘ఫ్రాన్సిస్ ‘ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా’ గుర్తింపు కార్డును కలిగి ఉన్నారు. అయితే జర్నలిజం కవరేజీకి సంబంధించి కొన్ని నిబంధనలకు అనుమతి కలిగి ఉండాలి. 2024 మేలో ఆయన వర్క్ పర్మిట్ రిన్యూవల్ కోసం మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన దరఖాస్తును తాము పరిశీలిస్తున్నాం. ఇక దేశం బయట ఆయన చేసే ప్రయాణానికి సంబంధి పూర్తి హక్కులు ఉన్నాయి ’అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.‘2024 సార్వత్రిక ఎన్నికల కవరేజీ చేయకుండా బలవంతంగా నేను భారత్ వెళ్లి పోవాల్సి వచ్చింది. దీంతో జూన్ 17న భారత్ నుంచి వెళ్లిపోయాను. మార్చి 7న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన జర్నలిస్ట్ అనుమతిని పునరుద్దరించడానికి నిరాకరించింది. సాధారణ ఎన్నికలను కవర్ చేసేందుకు తిరస్కరించింది. 2011 నుంచి నేను జర్నలిస్ట్‌గా భారత్‌లో పనిచేస్తున్నా. నేను భారతీ మహిళను వివాహం చేసుకున్న కారణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నా కుటుంబం ప్రభావితం అవుతుంది’ అని సెబాస్టియన్ ఫ్రాన్సిస్ ‘ఎక్స్’లో తెలిపారు. -
Kuwait Fire Incident: 49లో 45 మంది భారతీయులే
కువైట్ సిటీ/ దుబాయ్: గల్ఫ్ దేశం కువైట్‌లో బుధవారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో అగ్నికి ఆహుతైన 49 మందిలో 45 మంది భారతీయులేనని అధికారులు తెలిపారు. మరో ముగ్గురు ఫిలిప్పీన్స్ దేశస్తులు కాగా మరో మృతదేహాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మృతుల్లో మలయాళీలు 24 మంది ఉన్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. ఆ రాష్ట్ర వాసులు మరో ఏడుగురు వివిధ ఆస్పత్రుల్లో ఐసీయూల్లో చికిత్స పొందుతున్నట్లు గుర్తించామని వెల్లడించింది. విదేశాంగ శాఖ నుంచి ధ్రువీకరణ సమాచారం అందాక బాధితుల వివరాలను వెల్లడిస్తామని తెలిపింది. కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్‌లో మాంగాఫ్ ప్రాంతంలోని ఏడంతస్తుల భవనంలో బుధవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో 49 మంది మృతి చెందగా మరో 50 మంది వరకు గాయపడ్డారు. గురువారం కువైట్ చేరుకున్న విదేశాంగ మంత్రి కీర్తివర్థన్ సింగ్ క్షతగాత్రులైన భారతీయులతో మాట్లాడి, వారికి అవసరమైన సాయం అందేలా చూస్తున్నారు. ముబారక్ అల్‌కబీర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న భారతీయులను పరామర్శించారు. అదేవిధంగా, మృతదేహాలను సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి తరలించే ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నీళ్ల ట్యాంకుపైకి దూకి..ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో ఆ భవనంలో కేరళలోని త్రిక్కారిపూర్కు చెందిన నళినాక్షన్ కూడా నిద్రిస్తున్నారు. మూడో అంతస్తులో ఉన్న ఆయన జనం హాహాకారాలు విని, వెంటనే అప్రమత్తం అయ్యారు. భవనం సమీపంలోనే ఉన్న వాటర్ ట్యాంకుపైకి దూకారు. పక్కటెముకలు విరిగి, తీవ్రంగా గాయపడిన నళినాక్షన్ ట్యాంకుపైన చిక్కుకుపోయారు. కదల్లేని స్థితిలో ఆయన్ను ఉదయం 11 గంటల సమయంలో కొందరు గుర్తించి కిందికి దించి, ఆస్పత్రికి తరలించారని అతడి మామ బాలకృష్ణన్ చెప్పారు.కుమార్తెకు బహుమతిగా ఫోన్ ఇవ్వాలని..12వ తరగతి బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన తన కూతురికి ఫోన్ బహుమతిగా ఇవ్వాలనుకున్నారు లుకాస్. ఇంటికెళ్లాక కుమార్తెను స్వయంగా బెంగళూరు తీసుకెళ్లి నర్సింగ్ స్కూల్లో చేర్పిద్దామనుకున్నారు. అయితే, ఆ కల నెరవేరలేదు. కువైట్ ప్రమాదంలో అగ్నికి ఆహుతైన వారిలో కేరళలోని కొల్లంకు చెందిన లుకాస్ కూడా ఉన్నారు. బుధవారం వేకువజామున ప్రమాదం జరిగిన సమయంలో లూకాస్ తమ సొంతూళ్లోని చర్చి ఫాదర్‌తో ఫోన్లో మాట్లాడుతున్నారు. హఠాత్తుగా ఫోన్ డిస్ కనెక్టయ్యింది. తర్వాత చర్చి ఫాదర్ ఫోన్ చేసినా లూకాస్ లిఫ్ట్ చేయ్యలేదు. 18 ఏళ్లుగా కువైట్‌లో ఉంటున్న లూకాస్‌కు వృద్ధులైన తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. -
ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న మహిళా క్యాడెట్
న్యూఢిల్లీ: ఇరాన్ అధీనంలో ఉన్న సరుకు రవాణా నౌక ఎంఎస్సీ ఏరీస్‌లోని 17 మంది భారతీయ సిబ్బందిలోని ఏకైక మహిళా క్యాడెట్ సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. కేరళలోని త్రిసూర్‌కు చెందిన ఆన్ టెస్సా జోసెఫ్‌ను ఇరాన్ ప్రభుత్వం విడుదల చేయడంతో గురువారం మధ్యాహ్నం విమానంలో కొచ్చిన్‌కు చేరుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మిగతా 16 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా విడుదల చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, భారత్‌లోని కుటుంబసభ్యులతో ఫోన్లో సంభాషిస్తున్నట్లు కూడా వివరించింది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ నాలుగు రోజుల క్రితం ఇరాన్ విదేశాంగ మంత్రి అమిర్ అబొల్లాహియన్‌తో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసింది. ఇజ్రాయెల్‌తో సంబంధాలున్నాయనే అనుమానంతో ఇరాన్ ప్రత్యేక బలగాలు ఈ నెల 13న హొర్ముజ్ జలసంధిలో ఉన్న ఎంఎస్సీ ఏరీస్ నౌకను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. -
కేంద్రం అలర్ట్.. ఎయిరిండియా కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎయిరిండియా విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ గగనతలం మీదుగా విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. తాజా సమాచారం ప్రకారం.. యూరప్‌కు వెళ్లే విమానాలు ఇరాన్ గగనతలం నుంచి కాకుండా మరో మార్గంలో వెళ్లనున్నాయి. దీంతో ప్రయాణ సమయం మరింత పెరగనుంది. ఇదిలా ఉంటే.. ఇండియా, ఫ్రాన్స్, రష్యా దేశాలు ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్‌కు ప్రయాణాలు మానుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశాయి. అలాగే వీలైనంత వరకు ప్రయాణాల్ని తగ్గించుకోవాలని ఆయా దేశాల్లో ఉన్న భారతీయులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో భారతీయ రాయబార కార్యాలయం సాయం తీసుకోవాలని సూచించింది. Travel advisory for Iran and Israel:https://t.co/OuHPVQfyVp pic.twitter.com/eDMRM771dC — Randhir Jaiswal (@MEAIndia) April 12, 2024 గాజాపై ఇజ్రాయెల్ దాడుల జరిగిన ఏడు నెలల తర్వాత.. పశ్చిమాసియా ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా మారింది. టెల్‌అవీవ్‌పై క్షిపణులతో విరుచుకుపడేందుకు టెహ్రాన్ సమాయత్తమైందన్న అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రపంచవ్యాప్తంగా అలజడిని రేపింది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయొచ్చన్న సంకేతాలతో పలు దేశాలు తమ తమ పౌరుల్ని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. మరోవైపు యూఎస్ వార్‌షిప్‌లు ఇజ్రాయెల్‌కు చేరుకుంటుండడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కేజ్రీవాల్‌పై స్పందన.. అమెరికా దౌత్యవేత్తకు సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై అమెరికా విదేశాంగ శాఖ చేసిన వ్యాఖ్యలకు భారత్.. ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు పంపింది. బుధవారం అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాను.. భారత విదేశి వ్యవహారాల కార్యాలయానికి పిలిపించుకొని సుమారు 40 నిమిషాల పాటు చర్చించినట్లు తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్‌పై అమెరికా స్పందించిన విషయం తెలిసిందే కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన నివేదికలను ఆమెరికా ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపింది. ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సాహిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. ‘ఈ కేసులో సమయానుకూల, పారదర్శక న్యాయ ప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌పై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అంతకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన కూడా దుమారం రేపింది. కేజ్రీవాల్ విచారణ పారదర్శకంగా జరగాలంటూ అనవసర వ్యాఖ్యలు చేసింది జర్మనీ. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జర్మనీ దేశ రాయబారికి కూడా సమన్లు పంపిన విషయం తెలిసిందే. -
CAAపై అమెరికా ప్రకటన.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో అగ్రరాజ్యం అమెరికా ప్రకటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ విషయం భారత అంతర్గత విషయమని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. 2019కు చెందిన పౌరసత్వ సవరణ చట్టం దేశానికి సంబంధించిన అంతర్గత విషషమని, ఇది దేశ సమగ్ర సంప్రదాయాలకు, మానవ హక్కుల విషయంలో తమ దీర్ఘకాల నిబద్దతకు అనుగుణంగా రూపొందించినట్లు వెల్లడించారు. అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో హింసకు గురై 2014 వరకు భారత్‌కు వలస వచ్చిన హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, పార్శీ, క్రైస్తవ వర్గాలకు చెందిన మైనారిటీలకు భారత పౌరసత్వం, భద్రత కల్పించే ఉద్ధేశ్యంతో ఈ చట్టం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ చట్టం ఏ పౌరుడి హక్కులను తొలగించదని అన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టం పౌరసత్వం ఇవ్వడం.. పౌరసత్వం తీసివేయడం గురించి కాదని అన్నారు. ఇది అందరికీ అర్థం కావాలన్నారు. ‘ఇది ఏ దేశపు జాతీయత లేని వ్యక్తి సమస్యను పరిష్కరిస్తుంది. మానవ హక్కులకు మద్దతు ఇస్తుంది. మానవ గౌరవాన్ని అందిస్తుంది’ అని పేర్కొన్నారు. కాగా పౌరసత్వ సవరణ చట్టంపై అమెరికా స్పందించిన విషయం తెలిసిందే. సీఏఏ అమలులు తీరును తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. మార్చి 11వ తేదీన రిలీజైన సీఏఏ నోటిఫికేషన్ పట్ల ఆందోళనగా ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. సీఏఏను ఎలా అమలు చేస్తారన్న విషయాన్ని గమనిస్తున్నామని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని మతాలకు స్వేచ్ఛ ఉంటుందని మిల్లర్ తెలిపారు. చదవండి: ఎలక్టోరల్ బాండ్ల డేటాపై 'జైరాం రమేష్' కీలక వ్యాఖ్యలు -
నిటాషా వివాదం: ‘అందుకే భారత్‌లోకి రానివ్వలేదు’
భారత సంతతికి చెందిన యూకే ప్రొఫెసర్, రచయిత నిటాషా కౌల్‌ను భారత్‌లోకి అడుగుపెట్టకుండా అడుకున్న ఘటన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆమె కర్ణాటక రాష్ట్రంలో జరిగే ఓ సెమినార్‌కు రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై భారత్‌కు వచ్చారు. అయితే అనూహ్యంగా నిటాషాను బెంగళూరు ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆమెకు భారత్‌లోకి అనుమతి లేదని వెనక్కి పంపించారు. దీంతో ఈ ఘటన బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదంగా మారింది. తమ రాష్ట్రంలోకి వచ్చే విదేశియురాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటుందోని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. తాజాగా నిటాషాను భారత్‌లోకి రాకుండా నిరాకరించినందుకు భారత విదేశి వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది. ‘ఆమె యూకే దేశానికి చెందిన పౌరురాలు. ఒక విదేశి పౌరుడు/పౌరురాలును దేశంలోకి ప్రవేశం కల్పించటమనేది.. పూర్తిగా భారత దేశ సార్వభౌమాధికారిక నిర్ణయం’ అని విదేశి వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ వెల్లడించారు. తనను భారత్‌లోకి రానివ్వలేదని..ఎయిర్‌పోర్టులో కూడా తనను 24 గంటల పాటు ఎయిర్‌పోర్టులోనే ఉంచారని తెలిపారు. గతంలో తాను ఎన్నొసార్లు భారత్‌కి ఇలా జరగలేదని అన్నారు. అయితే ఆమె గతంలో ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా పలు ఆర్టికల్స్ రాశారు. దీంతో ఆమె ఉగ్రవాద సానుభూతిపరురాలు అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. భారత వ్యతిరేకతను నిటాషా ప్రచారం చేస్తుందని కూడా మండిపడ్డారు. -
విదేశాల్లో విద్యార్థుల మరణాలపై కేంద్రం పకటన
న్యూఢిల్లీ: విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాలపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటులో ప్రకటించింది. గత ఐదేళ్లలో.. విదేశాలలో 403 మంది భారతీయ విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ వెల్లడించారు. మూడోరోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఒక ప్రశ్నకు మంత్రి మురళీధరన్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2018 నుంచి విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందగా.. అత్యధికంగా 91 మంది కెనడా దేశంలో మరణించినట్లు తెలిపారు. ఇంగ్లండ్‌లో 48, రష్యాలో 40 మంది, అమెరికాలో 36, ఉక్రెయిన్‌లో 21 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారని పేర్కొంది. అయితే ఇటీవల అమెరికాలో వరుసగా నలుగురు భారతీయ విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాలల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఏ దేశంలో ఇప్పటివరకు అసలు ఎంత మంది విద్యార్థులు విదేశాల్లో మృతి చెందారన్న విషయంపై స్పష్టత ఇచ్చింది కేంద్రం. చదవండి: అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు -
దౌత్య సంబంధాల్లో సహనం ముఖ్యం
మాల్దీవుల్లోని ప్రస్తుత ప్రభుత్వం ‘ఇండియా ఔట్’ నినాదంతో గెలిచింది. భారత సైన్యాన్ని తమ దేశం నుంచి ఉపసంహరించుకోవాలని కోరింది. దీనికి తోడు లక్షదీవులు వర్సెస్ మాల్దీవుల సోషల్ మీడియా వివాదం చెలరేగింది. ఈ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో భారత్ వైఖరి ఎలా ఉండాలి? సోషల్ మీడియాకు ప్రతిస్పందనగా విదేశాంగ విధానం ఉండకూడదు. అభ్యంతరకరమైన ట్వీట్లకు కారణమైన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయాన్ని మనం విస్మరించకూడదు. అలాగే మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఇండియాకు అనుకూలం. ఈ ముఖ్యమైన వర్గాన్ని చీకాకు పెట్టేలా భారతీయ కార్యకలాపాలు ఉండకూడదు. విదేశాంగ విధానం అనేది ఎప్పటికప్పుడు ముగిసిపోయేది కాదు. అది స్థిరంగా కొనసాగాలి. 2023 నవంబర్‌లో జరిగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ నాయకుడు మొహమ్మద్ ముయిజ్జూ ‘ఇండియా ఔట్’ (భారత్ వెళ్లిపో) అనే ప్రజాకర్షక నినాదంతో గెలిచినప్పుడే భారత్–మాల్దీవుల సంబంధాలు మళ్లీ దెబ్బతింటాయని అందరూ భావించారు. బాధ్యతలు స్వీక రించిన వెంటనే, తమ దేశం నుంచి భారత రక్షణ సిబ్బందిని ఉపసంహరించుకోవాలని ముయిజ్జూ భారత్‌ను కోరారు. మాల్దీవులలోని వెయ్యికి పైగా ద్వీపాలు విస్తారమైన సముద్ర ప్రాంతంలో వ్యాపించి ఉన్నాయి. అక్కడి అతిపెద్ద ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్) భద్రత, దీవుల్లో విపత్తు సహాయ కార్యకలాపాలపై నిఘా కోసం భారత్ బహుమతిగా ఇచ్చిన డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లను 75 మంది భారత సైనికులు నడుపుతున్నారు. మాల్దీవులు వ్యవస్థాపక సభ్యదేశంగా ఉన్న ‘కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్’లో భాగంగా సముద్ర భద్రతను ప్రోత్సహించడానికి ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగానే దేశంలోని అతిపెద్ద ఆర్థిక మండలిలో భూజ లాధ్యయన సర్వేను భారత్ నిర్వహించాల్సి ఉంది. కానీ ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి కూడా కొత్త ప్రభుత్వం నిరాకరించింది. దీనిమీద భారత్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన లేదు. కానీ తమ అభ్యర్థనలను భారత్ అంగీకరించిందని ముయిజ్జూ చెబుతున్నారు. జనవరి 8న చైనాలో నాలుగు రోజుల అధికారిక పర్యటనకు ముయిజ్జూ వెళ్లారు. అదే సందర్భంలో ఆయన ప్రభుత్వంలోని ముగ్గురు ఉప మంత్రులు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించీ, మొత్తంగా భారతీయుల గురించీ అవమానకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేయడంతో ఒక వికారమైన వివాదం చెలరేగింది. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్ దీవులను సందర్శించిన ఫోటోలను పోస్ట్ చేశారు. లక్షద్వీప్‌కు దక్షిణంగా ఉన్న ఈ దీవులు మాల్దీవుల కంటే మరింత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా ఆవిర్భవించగలవని కొందరు సోషల్ మీడియాలో వాద నలు మొదలుపెట్టారు. వాటికి వ్యతిరేకంగానే మాల్దీవుల మంత్రులు ప్రతిస్పందించినట్లు కనబడింది. ఆ తర్వాత మాల్దీవులను బహిష్కరించాలని కొందరు భారతీయ ప్రముఖులు పిలుపునివ్వడంతో సోషల్ మీడియా యుద్ధం చెలరేగింది. కొన్ని సంవత్సరాలుగా, మాల్దీవులను సందర్శించేవారిలో భారతీయుల వాటా అత్యధికం. తాజా పరిణా మంతో మాల్దీవులను సందర్శించాలనుకున్న భారతీయులు తమ హోటల్, విమాన బుకింగ్‌లను రద్దు చేసుకున్నారు. ఇది ఆ దేశ పర్యా టక పరిశ్రమను దెబ్బతీసింది. అయితే ఒకటి మర్చిపోకూడదు. కోవిడ్ –19 మహమ్మారికి ముందు, ఈ పర్యాటకుల రాకపోకలలో చైనా మొదటి స్థానంలో ఉండేది. అన్ని ప్రయాణ ఆంక్షలను చైనా ఎత్తివేస్తే ఆ స్థానాన్ని తిరిగి ఆ దేశమే పొందే అవకాశం ఉంది. ముయిజ్జూ చైనా పర్యటన సందర్భంగా, రెండు దేశాల మధ్య ‘సమగ్ర వ్యూహాత్మక సహకార భాగస్వామ్యాన్ని’ ప్రకటించే సంయుక్త పత్రికా ప్రకటన వెలువడింది. గ్లోబల్ సివిలైజేషన్ ఇనిషియేటివ్, గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్, గ్లోబల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ (జీడీఐ) అనే మూడు కీలకమైన చైనా ప్రాజెక్టులలో పాల్గొనడానికి మాల్దీవులు సుముఖంగా ఉన్నట్లు ఈ ప్రకటన సూచిస్తోంది. ‘గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ ద జీడీఐ’లో మాల్దీవులు చేరింది. చైనీస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద ప్రాజెక్టులను స్వాగతించింది. మాల్దీవుల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి ప్రామాణికమైన చైనా మద్దతు ఉంది. మాల్దీవుల అంతర్గత వ్యవహారాలలో ఏదైనా బాహ్య జోక్యాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో పేరు ఎత్తని గురి ఇండియానే అని చెప్పనక్కరలేదు. అయితే చైనా, మాల్తీవుల ఉమ్మడి ప్రకటనలో రెండు ముఖ్యమైన మినహాయింపులు ఉన్నాయి. 2017లో అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ బీజింగ్‌లో పర్యటించారు. చైనాకు అత్యంత అను కూలమైన స్థానాన్ని ఇచ్చేలా, ఇరు దేశాల మధ్య కుదిరిన వివాదా స్పద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద అమలు గురించి ఉమ్మడి ప్రకటనలో ఏ ప్రస్తావనా లేదు. అప్పటినుంచి అది సుప్తచేతనలో ఉంది. దాని పునరుద్ధరణ కోసం మాలేలోని చైనా రాయబారి ఒత్తిడి చేస్తున్నారు. హిందూ మహాసముద్రంలో సముద్ర ట్రాఫిక్‌ను పర్యవేక్షించడానికి తమకు అనుకూలమైన స్థానాన్ని ఇచ్చే పరిశీలనా కేంద్ర ఏర్పాటు కోసం చైనా ప్రతిపాదించిన ప్రాజెక్ట్ గురించి కూడా ఉమ్మడి ప్రకట నలో ప్రస్తావన లేదు. ఇవి సాపేక్షంగా భారత్‌కు సానుకూలాంశాలు. ఈ పరిణామాలను భారత్ గమనించాలి. (దీవుల్లో పరిశోధన కోసం చైనా నౌక చేరుకుందన్న వార్తలు వచ్చాయి. అది ఫిబ్రవరిలో రానుందనీ, కానీ పరిశోధన కోసం మాత్రం కాదనీ మాల్దీవులు చెబుతోంది.) 2023 డిసెంబర్ 7న మారిషస్‌లో జరిగిన కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్కు మాల్దీవులు గైర్హాజరవడం ఒక ఎదురుదెబ్బ. భారత్ 2011లో శ్రీలంక, మాల్దీవులతో ఈ త్రైపాక్షిక సముద్ర భద్రతా వేదికను ప్రారంభించింది. సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధం, మానవ అక్రమ రవాణా, సైబర్ భద్రతతో కూడిన ఎజెండాపై, ఈ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడంలో ఈ వేదిక ముఖ్య మైన పాత్ర పోషించింది. 2020లో మారిషస్ ఈ కూటమిలో చేరింది. ఇటీవలి మారిషస్ సమావేశంలోనే, సీషెల్స్, బంగ్లాదేశ్ పరిశీలకులుగా చేరాయి. తర్వాత ఇవి పూర్తి సభ్య దేశాలు కావచ్చు. చైనా మెప్పు కోసం మాల్దీవులు ఈ సమావేశానికి హాజరుకాలేదని అనుకోవచ్చు. ఈ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో భారత్ వైఖరి ఎలా ఉండాలి? ఒకటి, సోషల్ మీడియాకు ప్రతిస్పందనగా విదేశాంగ విధానం ఉండకూడదు. మాల్దీవుల ప్రభుత్వం అధికారికంగా క్షమా పణ చెప్పనప్పటికీ, అభ్యంతరకరమైన ట్వీట్లకు కారణమైన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేయడంతోపాటు, తమ మంత్రుల చర్యలను తీవ్రంగా ఖండించిన విషయాన్ని మనం విస్మరించకూడదు. రెండు, మాల్దీవులలోని పార్లమెంట్లో ఇండియాకు అనుకూలంగా ఉండే మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఆధిపత్యం చలాయిస్తోంది, దీని ప్రతినిధులు మోదీ వ్యతిరేక ట్వీట్లను తీవ్రంగా ఖండించారు, అధికారికంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పైగా దీర్ఘకాలంగా మాల్దీవులకు భారత్ ఇస్తున్న మద్దతు, సద్భావన గురించి గొప్పగా మాట్లాడాలని డిమాండ్ చేశారు. మాలెలో ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికల్లో ఈ పార్టీ సునాయాసంగా విజయం సాధించింది. ముయిజ్జూ అధ్యక్షుడు కావడానికి ముందు రాజధాని మేయర్‌గా ఉన్న విషయం తెలిసిందే. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భారత అను కూల రాజకీయ శక్తులు విజయం సాధించే అవకాశం ఉంది. భారత్ పట్ల సానుకూల భావాలను కలిగి ఉన్న ఈ బలమైన, ముఖ్యమైన వర్గాన్ని చికాకు పెట్టేలా మన కార్యకలాపాలు ఉండకూడదు. భారత విదేశాంగ మంత్రి ఇటీవలి ప్రకటన, రెండు దేశాల మధ్య బలమైన ప్రజా సంబంధాలను సమర్థించడంలోని ప్రాముఖ్యతను సూచిస్తోంది. అదే సమయంలో, మాల్దీవుల వ్యతిరేక సోషల్ మీడియా వ్యాఖ్యల వరదలకు ఆయన ప్రకటన ఒక ముఖ్యమైన దిద్దుబాటుగా వెలువడింది. విదేశాంగ విధానం ఎప్పటికప్పుడు ముగిసే ఉపకథలా ఉండ కూడదు. పొరుగు దేశాలలోని రాజకీయాలు అనుకూలంగా లేన ప్పుడు కూడా స్థిరంగా, బలమైన ఒప్పుదలతో కొనసాగాలి. భారత్‌కు మాల్దీవులు వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. అక్కడి పరిణామాలపై తన మాటలు, చేతలను భారత్ జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి. అంతి మంగా సహనమే ఫలితాన్ని ఇస్తుందని మరచి పోకూడదు. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఖతర్‌లో మరణశిక్ష కేసు.. బాధితులను కలిసిన భారత రాయబారి
ఢిల్లీ: తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులపై ఖతర్ దేశ న్యాయస్థానం మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. తాజాగా మరణ శిక్షపడిన వారిని భారత రాయబారి కలిసినట్లు విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం మీడియాకు వెల్లడించారు. ఎనిమిది మంది నావికాదళ అధికారులపై ఖతర్ కోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ.. భారత్ అప్పీల్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిగిందని తెలిపారు. #WATCH | MEA Spokesperson Arindam Bagchi says, "You would have seen Prime Minister Modi meet Sheikh Tamim Bin Hamad, the Amir of Qatar in Dubai on the sidelines of CoP28. They've had a good conversation on the overall bilateral relationship as well as in the well-being of the… pic.twitter.com/PfcBKtKvnm — ANI (@ANI) December 7, 2023 సున్నితమైన ఈ అంశాన్ని నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. నావికాదళ అధికారులకు న్యాయ, దౌత్యపరమైన సాయం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 3ను వారిని భారత్ రాయబారి కలిసినట్లు అరిందమ్ బాగ్చి వెల్లడించారు. అదేవిధంగా.. ఇటీవల కాప్ సదస్సులో భాగంగా దుబాయ్ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమాద్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, అక్కడి భారత కమ్యూనిటీ సంక్షేమం సంబంధించి పలు అంశాలపై చర్చ జరిగినట్లు బాగ్చి తెలిపారు. -
గల్ఫ్ చట్టాలు తెలియకే..
గల్ఫ్ దేశాల చట్టాలపై కనీస అవగాహన కూడా లేకపోవడంతో పలువురు భారతీయులు జైళ్ల పాలవుతున్నారు. మన దేశానికి చెందిన కొన్ని రకాల మందులను గల్ఫ్ దేశాలు నిషేధించాయి. ఇది కూడా తెలియనివారు అనేకమంది ఉన్నారు.ఉపాధి కోసం ఎడారి బాట పట్టేవారిలో డిగ్రీ కూడా దాటని వారే అధికంగా ఉంటున్నారు. ఇలాంటి వారిని విడిపించడానికి మన విదేశాంగ శాఖ చొరవ తీసుకోవాల్సి ఉంది. కేంద్రం ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్‌కు నిధులు కేటాయించి గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయసాయం అందించాలి. –మోర్తాడ్ (బాల్కొండ)/జగిత్యాల క్రైం కొందరు ఇలా.. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన 23 ఏళ్ల యువకుడు ఒళ్లు నొప్పులు తగ్గడానికి వేసుకునే మందులతో పట్టుబడి ఆబుదాబిలోని సుహాన్ సెంట్రల్ జైలులో మగ్గుతున్నాడు. ఇది గడిచిన జనవరిలో జరగ్గా, విచారణ ఖైదీగా జైలుకు పరిమితమయ్యాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ఓ యువ ఇంజినీర్ జాతీయభద్రత కేసులో నాలుగేళ్ల కింద అరెస్టు అయ్యాడు. అప్పటినుంచి అబుదాబి జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి, జగిత్యాల జిల్లా కన్నాపూర్, కామారెడ్డి జిల్లా కరడ్‌పల్లికి చెందిన యువకులు నిషేధిత మందులతో పట్టుబడి జైల్లోనే ఉండిపోయారు. దౌత్య, న్యాయ సాయం అందించాలి విదేశీ జైళ్లలో ఉన్న వారికి మన విదేశాంగశాఖ కార్యాలయాల ద్వారా దౌత్యసాయం అందించాలి. న్యాయసాయం అందించి విడుదల అయ్యేలా చూడాలి. రాయభార కార్యాలయాల్లో ప్యానల్ లాయర్ల సంఖ్య పెంచాలి. వలస వెళ్లే కార్మికులకు గల్ఫ్ చట్టాలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక సదస్సులు నిర్వహించాలి. – చెన్నమనేని శ్రీనివాసరావు, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, గల్ఫ్ జేఏసీ నేత రాజ్యసభలో ప్రశ్నతో.. ఇటీవల రాజ్యసభలో ఎంపీలు డాక్టర్ మనోజ్ రాజోరియా, రంజితా కోలి, సుమేధానంద సరస్వతిలు గల్ఫ్ జైల్లో మగ్గుతున్న భారతీయుల సంఖ్య ఎంత అంటూ ప్రశ్నించారు. దీనికి విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ సమాధానం ఇస్తూ గల్ఫ్ దేశాల్లోని వివిధ జైళ్లలో మగ్గుతున్న వారు 4,630 మంది ఉన్నారని చెప్పారు. -
రాజ్యసభ ఎంపీగా జైశంకర్ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ సహా తొమ్మిది మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం పార్లమెంట్ హౌజ్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. 2019లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన జైశంకర్ రెండోసారి గుజరాత్ నుంచి ఇటీవల రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు బీజేపీకి చెందిన బాబూభాయ్ జెసంగ్‌భాయ్ దేశాయ్ (గుజరాత్), కేస్రీదేవ్ సింగ్ దిగి్వజయ్‌సింగ్ ఝాలా (గుజరాత్), నాగేంద్ర రాయ్ (పశి్చమ బెంగాల్)లు, ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు డెరెక్ ఒబ్రియాన్, డోలా సేన్, సుఖేందు శేఖర్ రే, ప్రకాష్ చిక్ బరైక్, సమీరుల్ ప్రమాణ స్వీకారం చేశారు. -
ఐరాసలో యోగా వైట్‌హౌస్‌లో విందు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటన షెడ్యూల్‌ను శుక్రవారం విదేశాంగ శాఖ విడుదల చేసింది. జూన్ 20 నుంచి 25 వరకు ప్రధాని అమెరికా, ఈజిప్టులలో పర్యటిస్తారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే యోగా కార్యక్రమానికి నేతృత్వం వహిస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఈ సారి పర్యటనలో యూఎన్‌లో జరిగే యోగా డేలో ప్రధాని పాల్గొనడం విశేషం. ప్రతీ రోజూ యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రపంచంలో అవగాహన పెరగాలని మోదీ ప్రధాని పదవి చేపట్టాక చేసిన ప్రయత్నాలతో యూఎన్ 2014లో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఇప్పుడు తొమ్మిదేళ్లయ్యాక యూఎన్‌లో జరిగే కార్యక్రమానికి నేతృత్వం వహిస్తూ ఉండడంపై ప్రధాని మోదీ ఉద్విగ్నంగా స్పందించారు. యోగా మరింతగా ప్రజాదరణ పొందాలని ఒక ట్వీట్లో ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యాటన ఇలా..! ► ప్రధాని మోదీ అమెరికా పర్యటన న్యూయార్క్ నుంచి మొదలవుతుంది. జూన్ 21న యూఎన్ ప్రధాన కార్యాలయంలో ఉదయం 8 నుంచి 9 గంటలవరకు జరిగే యోగా సెషన్లో ప్రధాని పాల్గొంటారు. భారత్ యూఎన్‌కు బహుమతిగా ఇచ్చిన మహాత్మా గాంధీ విగ్రహం ఎదుటే ఈ యోగా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో యూఎన్ ప్రతినిధులు, వివిధ దేశాల రాయబారులు యోగా గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతారు. ► న్యూయార్క్ నుంచి వాషింగ్టన్కు వెళతారు. జూన్ 22న అధ్యక్షుడు బైడెన్‌తో అత్యున్నత స్థాయి చర్చలు జరుపుతారు. ► అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ స్పీకర్ల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి మోదీ ప్రసంగిస్తారు ► అదే రోజు రాత్రి ప్రధాని గౌరవార్థం బైడెన్ దంపతులు శ్వేత సౌధంలో అధికారిక విందు ఇస్తారు. ► జూన్ 23న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ప్రధానికి ఆతిథ్యమిస్తారు. అదే రోజు ప్రధాని పారిశ్రామికవేత్తలతో, కార్పొరేట్ సంస్థల సీఈవోలతో సమావేశమవుతారు. ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. ► జూన్ 24న ఈజిప్టుకి బయల్దేరి వెళతారు. అక్కడ రెండు రోజులు పర్యటిస్తారు. మన గణతంత్ర ఉత్సవాలకు హాజరైన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి ఆహ్వానం మేరకు అక్కడ పర్యటించనున్నారు. -
తుర్కియే, సిరియాల్లోని తెలుగువారిని ఆదుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తుర్కియే, సిరియాల్లో భూకంపం కారణంగా ఇబ్బందులు పడుతున్న తెలుగువారిని ఆదుకోవాలని కేంద్రానికి వైఎస్సార్సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగశాఖకు విజ్ఞప్తి చేసినట్లు ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, ఎన్.రెడ్డెప్ప, తలారి రంగయ్య, పోచ బ్రహ్మానందరెడ్డి బుధవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో మీడియాకు తెలిపారు. ఎంపీలు చంద్రశేఖర్, రంగయ్య మాట్లాడుతూ.. తుర్కియే, సిరియాల్లో చిక్కుకున్న ఉత్తరాంధ్రకు చెందిన వెయ్యిమంది తెలుగువారిని రక్షించాలని కోరామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పేదలకు సాయం చేయనివ్వకుండా కోర్టులకు వెళ్తున్నారన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డిలాగే చంద్రబాబు కూడా రాజకీయాల్లో భూస్థాపితం అవుతారన్నారు. ఓటుకు కోట్లు కేసుతో రాత్రికిరాత్రి విజయవాడ పారిపోయి వచ్చారన్నారు. -
విదేశాంగశాఖలో హనీట్రాప్ కలకలం.. సైనిక రహస్యాల కోసం పాక్ పన్నాగం
న్యూఢిల్లీ: భారత సైనిక సమాచారం కోసం పాకిస్థాన్ హనీట్రాప్ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. గూఢచర్యం ఆరోపణలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూఢిల్లోని జవహర్లాల్ నెహ్రూ భవన్ వద్ద శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఎమ్ఈఏ డ్రైవర్ పాక్ హానీ ట్రాప్‌లో చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాకిస్థానీ నిఘా ఏజెన్సీకి చెందిన మహిళ డ్రైవర్‌ను ముగ్గులోకి దింపి అతనితో సన్నిహితంగా ఉంటూ సైన్యానికి సంబంధించిన కీలక సేకరించినట్లు గుర్తించారు. కొన్నిసార్లు పాకిస్థాన్ మహిళ పూనమ్ శర్మ, మరికొన్ని సార్లు పూజాగా పరిచయం చేసుకున్న ఆ దేశ గూఢచారి వలలో చిక్కుకున్న డ్రైవర్.. దేశ రక్షణ సమాచారం, డాక్యుమెంట్లను బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలావుండగా ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీలో 46 ఏళ్ల భాగ్‌చంద్ అనే వ్యక్తిని, రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌లో పుట్టిన ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి 1998లో ఢిల్లీకి రాగా.. 2016లో మన దేశ పౌరసత్వాన్ని పొందారు. ఢిల్లీలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. అయితే పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు పోలీసులు ఆరోపించారు. పాకిస్థాన్‌లోని తన బంధువుల ద్వారా భాగ్‌చంద్ తన హ్యాండ్లర్లతో టచ్‌లో ఉండేవాడని తెలిపారు. చదవండి: షాకింగ్ ఘటన: ప్రియురాలిని చంపి.. ముక్కలుగా కోసి.. తలను పాలిథిన్ సంచిలో! -
మంగోలియా, జపాన్లలో నేటి నుంచి రాజ్‌నాథ్ పర్యటన
న్యూఢిల్లీ: మంగోలియా, జపాన్లలో ఐదు రోజుల పర్యటనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం బయలుదేరి వెళ్లారు. మారుతున్న ప్రపంచ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ రెండు దేశాలతో వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతమే లక్ష్యంగా పర్యటన సాగనుందని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. 5 నుంచి 7 వరకు మంగోలియాలో ఆయన పర్యటన ఉంటుంది. భారత రక్షణ మంత్రి ఒకరు మంగోలియాలో పర్యటించడం ఇదే ప్రథమం. అనంతరం 8, 9 తేదీల్లో జపాన్ పర్యటన సందర్భంగా జరిగే 2+2 విదేశాంగ, రక్షణ మంత్రుల సమావేశాల్లో రాజ్‌నాథ్‌తోపాటు జై శంకర్ కూడా పాల్గొంటారు. -
నేనెవర్నీ ఆహ్వానించ లేదు.. కలుసుకోను లేదు! : హమీద్ అన్సారీ
న్యూఢిల్లీ: ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కోసం గూఢచర్యం చేసినట్లు పేర్కొన్న పాకిస్తానీ జర్నలిస్టును యూపీఏ హయాంలో హమీద్ అన్సారీ తనను భారత్‌కు ఆహ్వానించారంటూ ఆరోపణలు వెలువెత్తాయి. ఐతే ఆ ఆరోపణలన్నింటిని హమీద్ అన్సారీ తోసి పుచ్చారు. ఈ మేరకు యూపీఏ హయాంలో తాను ఐదుసార్లు భారత్‌కు వచ్చానని, పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకి సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్లు పాకిస్తానీ జర్నలిస్ట్ నుస్రత్ మీర్జా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా హమీద్ అన్సారీని ప్రశ్నించడంతో ఆయన ఇలా వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ..."నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి తరుపున విదేశీ అతిథులకు ఆహ్వానాలు ప్రభుత్వ సలహా మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా పంపబడుతుంది. నేనెవర్నీ రీసివ్ చేసుకోలేదు, ఆహ్వానించ లేదు. తాను రాయబారిగా ఉన్న సమయాల్లో ప్రతి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాను. ఇరాన్ రాయబారిగా నేను చేసిన పని గురించి అప్పటి ప్రభుత్వానికి తెలుసు. నేను జాతీయ భద్రతకు కట్టుబడి ఉన్నాను. ఈ విషయమై భారత ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉంది." అని అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన హమీద్ అన్సారీ ఇరాన్లో భారత రాయబారిగా ఉన్నప్పుడూ జాతీయ ప్రయోజనాలకు రాజీ పడ్డారంటూ బీజేపీ చేసిన ఆరోపణలను ఖండించారు. తాను టెహ్రాన్‌లో పనిచేసిన తర్వాత యూఎన్ఎస్సీకి భారత శాశ్వత ప్రతినిధిగా సేవలందించానని, తనకు భారత్‌లోనూ, విదేశాల్లోనూ గుర్తింపు ఉందని నొక్కి చెప్పారు. (చదవండి: నేను గెలవలేదు!... నా డబ్బులు వెనక్కిచ్చేయండి!...ప్రజలకు బెదిరింపులు) -
మే మొదటి వారంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే నెలలో మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. మే 2 నుంచి 4వ తేదీ వరకూ ప్రధాని విదేశాల్లో పర్యటిస్తారని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన సందర్భంగా ఆయన.. జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్‌ల్లో పర్యటించనున్నారు. బెర్లిన్‌లో ప్రధాని మోదీ జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అంతేకాకుండా వారిద్దరూ భారతదేశం- జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ) ఆరవ ఎడిషన్‌కు సహ-అధ్యక్షులుగా ఉంటారు. ఇది ఛాన్సలర్ స్కోల్జ్‌తో ప్రధాని మొదటి సమావేశం. కాగా ఈ ఏడాది ప్రధాని మోదీకి ఇదే తొలి విదేశీ టూర్. చివరగా గతేడాది నవంబర్‌లో గ్లాస్గోలో జరిగిన కాప్ సదస్సుకు ఆయన హాజరయ్యారు. -
పార్లమెంట్ లో ప్రవాస భారతీయం
గుజరాత్ లోని రాజ్ కోట్ లోక్ సభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి మోహన్ భాయి కళ్యాణ్ జీ కుందరియా (బీజేపీ) విదేశాల్లో ప్రవాస భారతీయుల జనాభా గురించి అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ 2022 మార్చి 25న లోక్ సభలో లిఖితపూర్వక జవాబు ఇచ్చారు. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం నాన్ రెసిడెంట్ ఇండియన్, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయుల జనాభా భారీగా ఉంది. మొత్తం 210 దేశాలలో 1,34,51,654 మంది ఎన్నారైలు (ప్రవాస భారతీయులు), 1,86,83,645 మంది పీఐవో (పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ - విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయ సంతతి వారు) మొత్తం కలిపి 3,21,42,840 మంది ఓవర్సీస్ ఇండియన్స్ (భారత ప్రవాసీలు) ఉన్నట్టు తేలింది. గల్ఫ్ దేశాల్లో మొత్తం ఆరు గల్ఫ్ దేశాలలో కలిపి 88,88,733 మంది ఎన్నారైలు ఉన్నారు. వీరిలో అత్యధికంగా యూఏఈలో 34,19,875, సౌదీలో 25,92,166, కువైట్‌లో 10,28,274, ఓమాన్లో 7,79,351, ఖతార్‌లో 7,45,775, బహరేన్లో 3,23,292 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. ఇసీఆర్ పాస్పోర్టుతో ఇసిఆర్ పాస్ పోర్ట్ అంటే.. ఎమిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వయిర్డ్ (విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన). 10వ తరగతి కంటే తక్కువ విద్యార్హత కలిగిన వారికి ఇలాంటి పాస్ పోర్టు జారీ చేస్తారు. అమాయకులైన కార్మికుల రక్షణ కొరకు ఈ విధానం ప్రవేశపెట్టారు. ఇసిఆర్ పాస్ పోర్ట్ కలిగినవారు 18 ఇసిఆర్ (ముఖ్యంగా ఆరు గల్ఫ్) దేశాలకు ఉద్యోగానికి వలస వెళ్లిన ఇ-మైగ్రేట్ గణాంకాలను పార్లమెంటుకు తెలియజేశారు. ఇందులో ఇసిఎన్ఆర్ పాస్ పోర్ట్ కలిగిన వారికి సంబంధించి కచ్చితమైన వివరాలు లేవు. అలాగే విజిట్ వీసా పై వెళ్లిన వారి వివరాలు కూడా లెక్కలోకి తీసుకోలేదు. 2019 లో 3,68,048 మంది, 2020లో 94,145 మంది, 2021లో 1,32,673 మంది వలస వెళ్లినట్లు తెలిపారు. ఇఈసీఎన్ఆర్ పాస్‌పోర్ట్‌తో.. ఇసిఎన్ఆర్ పాస్ పోర్ట్ అంటే.. ఎమిగ్రేషన్ క్లియరెన్స్ నాట్ రిక్వయిర్డ్ (విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు). 10వ తరగతి పాస్ అయిన వారికి లేదా విదేశాల్లో మూడేళ్ళ అనుభవం ఉన్నవారికి లేదా ఆదాయపు పన్ను (ఐటి) చెల్లింపుదారులకు లేదా 50 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి ఇలాంటి పాస్ పోర్ట్ జారీ చేస్తారు. అనగా వీరు తెలివైన వారు, ఏదైనా కష్టం వస్తే తమను తాము రక్షించుకోగలుగుతారని అర్థం. - మంద భీంరెడ్డి (+91 98494 22622 ) -
పాకిస్తాన్.. మీకు మళ్లీ చెబుతున్నాం: భారత్
సాక్షి, న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాదదాడి గాయాల నుంచి భారతదేశం ఇంకా కోలుకోలేదు. ఈ విషాద ఘటన చోటుచేసుకొని నేటికి 13ఏళ్లు గడుస్తోంది. అయితే ఈ సందర్భంగా భారత విదేశాంగశాఖ.. పాకిస్తాన్ హైకమిషన్ సీనియర్ దౌత్యవేత్తకు ఓ నోట్‌ను విడుదల చేసింది. తమ దేశ నియంత్రణలో ఉన్న భూభాగాల నుంచి భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రదాడులకు అనుమంతించవద్దనే నిబద్దతకు పాక్ కట్టుబడి ఉండాలని తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్తాన్‌కు మరోసారి తెలుపుతున్నామంటూ భారత విదేశాంగ శాఖ వార్నింగ్ ఇచ్చింది. 13ఏళ్ల క్రితం జరిగిన పాశవిక ఘటనలో ప్రపంచవ్యాప్తంగా 15 దేశాలకు సంబంధించిన 166 కుటుంబాలు బాధితులయ్యాయి. అయితే ఈ ఉగ్రదాడికి పాల్పడినవారిని కోర్టు ముందుకు తీసుకురావటంలో పాకిస్తాన్ ఇప్పటికీ తన చిత్తశుద్ధిని చూపించలేదని పేర్కొంది. మరోసారి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఈ ఘటనపై ద్వంద్వ వైఖరి కట్టిపెట్టి ఉగ్రదాడికి పాల్పడిన నేరస్తులను శిక్షించాలని డిమాండ్ చేసింది. ఇది పాకిస్తాన్ ప్రభుత్వం జవాబుదారితనం కంటే టెర్రరిస్టుల చేతిలో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు సంబంధించిన అంతర్జాతీయ బాధ్యతని గుర్తుచేసింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులు, ఇతర బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపింది. 26 నవంబర్, 2008లో పది మంది పాకిస్తాన్ ఉగ్రవాదుల గ్రూప్ భారత్‌లోకి చొరబడి ముంబైలోని రైల్వేస్టేషన్, రెండు హోటల్స్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారకుడైన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌ను 21 నవంబర్, 2012లో ఉరితీశారు. -
కాబూల్‌లో భారతీయుని అపహరణ !
న్యూఢిల్లీ: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారతీయుని అపహరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాబూల్‌లో భారతీయ పౌరుడు బాన్‌శ్రీ లాల్ అరిందేను తుపాకీతో బెదిరించి కొందరు కిడ్నాప్ చేశారని వార్తలు వెలువడ్డాయి. అపహరణ విషయంపై భారత విదేశాంగ శాఖ గురువారం స్పందించింది. ‘కాబూల్‌లోని స్థానిక అధికారులతో మంతనాలు జరుపుతున్నాం. భారతీయ పౌరుడి కిడ్నాప్ వ్యవహారంపై అక్కడి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిరంతరం వారితో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ ఢిల్లీలో గురువారం మీడియాతో చెప్పారు. లాల్ కుటుంబం హరియాణాలోని ఫరీదాబాద్ పట్టణంలో నివాసముంటోంది. కాబూల్‌లో లాల్ గత రెండు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్నారు. -
సీఎం జగన్ లేఖపై తక్షణం స్పందించిన విదేశాంగ శాఖ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో బహ్రెయిన్‌లో తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారమైంది. బహ్రెయిన్‌లో ఎన్హెచ్ఎస్ అనే సంస్థలో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో తక్షణం ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ సెప్టెంబర్ 13న కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. దీనిపై తక్షణం స్పందించిన ఆ శాఖ బహ్రెయిన్‌లోని భారతీయ రాయబార కార్యాలయానికి ఆదేశాలు జారీచేసింది. (చదవండి: నేరాల నియంత్రణలో ఏపీ భేష్) దీంతో అక్కడి సిబ్బంది ఎన్హెచ్ఎస్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారని, సిబ్బంది తిరిగి విధుల్లో హాజరవడానికి సంస్థ అంగీకరించినట్లు ఏపీఎన్ఆర్టీ చైర్మన్ వెంకట్ ఎస్ మేడపాటి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీకి సంబంధించిన ఎన్హెచ్ఎస్ అనే సంస్థ సబ్ కాంట్రాక్టు పనులు నిర్వహిస్తోంది. కార్మికులకు సరైన మౌలిక వసతులు కల్పించకుండా ఈ సంస్థ ఇబ్బందులకు గురిచేస్తోందని, ఇందులో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన కార్మికులు ఉన్నట్లు మేడపాటి పేర్కొన్నారు. కొంతమంది నేపాలీయులు, భారతీయ కార్మికుల తీరువల్ల సమస్య జఠిలమైందని, సీఎం జగన్ చొరవతో భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి సమస్యను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. (చదవండి: జేసీ బ్రదర్స్‌కు టీడీపీ ఝలక్) -
‘అఫ్గాన్ నుంచి భారతీయుల తరలింపే మొదటి ప్రాధాన్యత’
సాక్షి, న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో ఏర్పడే ప్రభుత్వానికి సంబంధించిన స్వభావం, విధివిధానాల విషయంలో భారత్‌దేశానికి ఎటువంటి అవగాహన లేదని కేంద్రం గురువారం స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాతో మాట్లాడుతూ.. కాబూల్ విమానాశ్రయం మూసివేయడం కారణంగా నిలిచిపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కాబూల్ ఎయిర్‌పోర్టు ముసివేసినట్లు తెలిపారు. కాబూల్‌లో ఎయిర్‌పోర్టు సేవలు మొదలైన అనంతరం భారతీయుల తరలింపు ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతీయులను స్వదేశానికి తరలించడమే తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. మొదటిసారిగా తాలిబన్ నేత షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్‌తో ఖతార్‌లో భారత్ రాయబారి దీపక్ సమావేశమైన విషయం తెలిసిందే. అఫ్గాన్ గడ్డపై భారత వ్యతిరేకశక్తులను అడ్డుకోవడం, భారతీయుల స్వదేశానికి రాక తదితర అంశాలు చర్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొన్న సంగతి విదితమే. చదవండి: Afghanistan: అమెరికా సాధించింది శూన్యం, పుతిన్ సెటైర్లు -
Afghanistan: హెల్ప్‌లైన్ నంబర్లు ప్రకటించిన భారత ప్రభుత్వం
న్యూఢిల్లీ: అఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులు, అఫ్గానీల కోసం భారత ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. అవసరమైన వారు ఈ నెంబర్లకు సంప్రదించడం ద్వారా భారత ప్రభుత్వం నుంచి సహాయం పొందవచ్చు. ఇప్పటికే ఆఫ్గనీలకు ప్రత్యేక వీసాలను జారీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. అమెరికా సేనలు వైదొలగి పోవడంతో అఫ్గనిస్తాన్ పౌర ప్రభుత్వాన్ని తాలిబన్లు కూల్చివేశారు. తాలిబన్లు అధికార పీఠం చేజిక్కంచుకోవడంతో ఆ దేశం విడిచి వెళ్లేందుకు వేలాదిగా అఫ్గన్ పౌరులు ప్రయత్నాలు చేస్తున్నారు. విమానాశ్రయాలకు క్యూ కడుతున్నారు. వాట్సాప్: +91 8010611290 ; +91 9599321199 ; +91 7042049944 ఫోన్: +91 11 4901 6783 ; +91 11 4901 6784 ; +91 11 49016785 ఇ-మెయిల్: SituationRoom@mea.gov.in చదవండి: భారత సైనికుల చేతికి అత్యాధునిక AK 200 రైఫిల్స్ -
వలస కార్మికులను ముంచిన గల్ఫ్ కంపెనీలు
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ వలస కార్మికుల శ్రమను గల్ఫ్ కంపెనీలు దోచుకున్నాయి. కరోనా సాకు చూపి రెండు, మూడు నెలల వేతనాలు ఎగ్గొట్టాయి. అంతేకాదు కంపెనీల మాటలు నమ్మి స్వస్థలాలకు చేరుకున్న కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారి వీసాలు రద్దు చేశాయి. కార్మికులకు మొత్తంగా రూ.200 కోట్లకు పైగా వేతనాలు కంపెనీలు ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. తిరిగొచ్చాక ఇస్తామని చెప్పి.. కరోనా ప్రభావంతో పనులు సరిగా సాగడం లేదని, కొన్ని నెలల పాటు సెలవులపై ఇంటికి వెళ్లాలని సౌదీ, కువైట్ వంటి గల్ఫ్ దేశాలకు చెందిన పలు కంపెనీలు కార్మికులకు సూచించాయి. అప్పటికే రెండు మూడు నెలల వేతనాలు బకాయి పడిన కంపెనీలు.. గల్ఫ్‌కు తిరిగి వచ్చిన తర్వాత వేతనాలు చెల్లిస్తామని నమ్మ బలికాయి. ఈ క్రమంలో వందల సంఖ్యలో కార్మికులు రాష్ట్రానికి వచ్చారు. పరిస్థితి చక్కబడితే తిరిగి గల్ఫ్‌కు వెళదామని ఎదురుచూస్తున్న కార్మికులకు అనేక కంపెనీలు షాకిచ్చాయి. కార్మికులకు తెలియకుండానే వారి వీసాలను రద్దు చేశాయి. కరోనా పరిస్థితుల్లో తెలంగాణ జిల్లాలకు చెందిన సుమారు లక్ష మంది కార్మికులు ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు చేరుకున్నట్లు అంచనా. ఇందులో దాదాపు 50 వేల మంది కార్మికులకు వారి కంపెనీలు వేతనాలను పూర్తి స్థాయిలో చెల్లించలేదని తెలుస్తోంది. ఒక్కొక్కరికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వేతన బకాయిలు రావాల్సి ఉందని సమాచారం. కాగా కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం రూ.200 కోట్ల వరకు ఉంటుందని కార్మిక సంఘాలు అంచనా వేశాయి. గల్ఫ్ కార్మికులకే ఎక్కువ నష్టం.. వలస కార్మికుల వేతన దోపిడీపై కేరళలో రెండ్రోజుల క్రితం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. కరోనా కాలంలో ఎంతో మంది భారతీయులు గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు ఈ సందర్భంగా వెల్లడయ్యింది. వీరిలో గల్ఫ్ వలస కార్మికులే ఎక్కువగా వేతనాలను నష్టపోయారని, ఒక్క తెలంగాణకు చెందిన కార్మికులే సుమారు రూ.200 కోట్లు కోల్పోయారని నిర్మల్‌కు చెందిన ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల ఈ సదస్సులో వెల్లడించారు. పొరుగు దేశాల్లో వలస కార్మికులకు సహకారం కరోనా నేపథ్యంలో ఇంటి బాట పట్టిన వలస కార్మికులు ఎంత మేరకు నష్టపోయారు? వారికి అంతర్జాతీయ స్థాయిలో సహకారం అవసరమా? అనే అంశంపై పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్ దృష్టి సారించాయి. వేతనాలు నష్టపోయిన తమ దేశానికి చెందిన వలస కార్మికులకు అవసరమైన న్యాయ సహాయం చేయడానికి ఆయా చర్యలు తీసుకున్నాయని తెలిసింది. మన దేశంలో అలాంటి పరిస్థితులు లేకపోవడంపై కార్మికులు అసంతృప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయ సహాయం అందించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వాలు స్పందించాలి వలస కార్మికులకు జరిగిన భారీ నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. గల్ఫ్ దేశాల్లో ఉన్న మన రాయబార కార్యాలయాల ద్వారా న్యాయం జరిగేలా చూడాలి. దీని వల్ల వలస కార్మికులకే కాకుండా ప్రభుత్వాలకు కూడా ఆదాయం లభిస్తుంది. – మంద భీంరెడ్డి, ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మానవత్వంతో వ్యవహరించాలి వలస కార్మికులు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి గల్ఫ్ దేశాలకు వెళ్లారు. వారి విషయంలో ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలి. వారికి న్యాయం జరిగేలా చొరవ చూపాలి. – స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు -
యూఎన్‌ఓవి అనవసర వ్యాఖ్యలు: భారత్
న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మృగాళ్లు మారడం లేదు. ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై దారుణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ వీటిపై స్పందించారు. మహిళలు, వెనకబడిన వర్గాల బాలికలపై హింస పెరిగిపోతుంది అన్నారు. అయితే యూఎన్ అధికారులవి అనవసర వ్యాఖ్యలంటూ భారత్ మండిపడింది. ఐక్యరాజ్యసమితి అధికారిని, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది. దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని.. "బయటి ఏజెన్సీ అనవసరమైన వ్యాఖ్యలను పట్టించుకోము'' అని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. "మహిళలపై ఇటీవల జరిగిన కొన్ని హింస కేసులకు సంబంధించి యూఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ కొన్ని అవాంఛనీయ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక విషయం తప్పక తెలుసుకోవాలి. ఏంటంటే ఈ కేసులను ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది" అని తెలిపారు. (చదవండి: హథ్రాస్ ఘటన.. రూ.50 లక్షలు ఇస్తామన్నారట!) అంతేకాక "దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున, బయటి ఏజెన్సీ చేసే ఏవైనా అనవసరమైన వ్యాఖ్యలు ఉత్తమంగా నివారించబడతాయి. రాజ్యాంగం భారతదేశ పౌరులందరికీ సమానత్వానికి హామీ ఇస్తుంది. ప్రజాస్వామ్యంగా, అందరికీ న్యాయం అందించే సమయం-పరీక్షించిన రికార్డు మా వద్ద ఉంది" అని తెలిపారు. భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లోని హథ్రాస్, బల్రాంపూర్ ప్రాంతాల్లో జరుగుతున్న అత్యాచార కేసులకు సంబంధించి ఈ రోజు యూఎన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ''హథ్రాస్, బల్రాంపూర్లో జరిగిన అత్యాచారం, హత్య కేసులను పరిశీలిస్తే.. భారత్‌లో మహిళలు, వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన బాలికలు లింగ ఆధారిత హింసకు ఎక్కువగా గురవుతున్నారని తెలుస్తుంది" అని యూఎన్ తెలిపింది. -
చైనాతో శాంతియుత పరిష్కారం
న్యూఢిల్లీ: తూర్పు లదాఖ్‌లో సరిహద్దుల వద్ద తలెత్తిన విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్, చైనా అంగీకారానికి వచ్చినట్లు కేంద్రం తెలిపింది. రెండు దేశాల మధ్య అమలవుతున్న ద్వైపాక్షిక ఒప్పందాలు, మార్గదర్శకాలకు లోబడి చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఏకాభిప్రాయం కుదిరిందని విదేశాంగ శాఖ తెలిపింది. లదాఖ్ ప్రతిష్టంభనను తొలగించేందుకు ఆదివారం రెండు దేశాల సైనికాధికారులు జరిపిన ఉన్నత స్థాయి చర్చలపై ఈ మేరకు స్పందించింది. ‘ఈ భేటీ స్నేహపూర్వక, సానుకూల వాతావరణంలో జరిగింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 ఏళ్లు పూర్తవుతున్నందున విభేదాలకు త్వరగా పరిష్కారం కనుగొనాలి. ఇండో–చైనా సరిహద్దుల్లో శాంతి, సామరస్య పరిస్థితులు ద్వైపాక్షిక సంబంధాలు మరింత అభివృద్ది చెందేందుకు దోహదపడతాయి’అని విదేశాంగ శాఖ పేర్కొంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు, సరిహద్దుల్లో శాంతి, సామరస్య పూర్వక పరిస్థితులను నెలకొల్పేందుకు సైనిక, దౌత్యపరమైన సంబంధాలను రెండు దేశాలు కొనసాగిస్తాయని తెలిపింది. శనివారం నాటి భేటీతో కచ్చితమైన ఫలితాలు వస్తాయని తాము అనుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఉన్నత స్థాయి సైనిక సంభాషణలు సమస్య పరిష్కారానికి మార్గం సుగమం చేస్తాయి కాబట్టి చాలా ముఖ్యమైనవని పేర్కొన్నాయి. -
ప్రశాంత్ బాధ్యత పాకిస్తాన్‌దే: భారత్
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్లో అడుగుపెట్టిన ఇద్దరు భారతీయుల వ్యవహారంపై కేంద్ర విదేశాంగశాఖ గురువారం స్పందించింది. ఈ నెల 14న హైదరాబాద్‌కు చెందిన వైందం ప్రశాంత్‌తో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిలాల్‌ను పాకిస్తాన్ నిర్బంధంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. పాస్‌పోర్టు, వీసా లేకుండా అక్రమంగా తమ దేశంలోకి అడుగు పెట్టారని ఆరోపిస్తూ వీరిని పాక్ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ.. 2016-17 సంవత్సరంలో ఇద్దరు భారతీయులు పాక్ చెరలో అడుగు పెట్టారనే సమాచారం అందిందని, అప్పుడే ఈ విషయంపై పాకిస్తాన్ అధికారులకు సమాచారం అందించామన్నారు. అయితే అప్పటి నుంచి పాక్ నుంచి ఎటువంటి స్పందన రాలేదని.. అకస్మాత్తుగా అరెస్టు చేసిన ప్రకటన రావడం తమకు ఆశ్చర్యం కలిగించే విషయమన్నారు. ఈ అంశం గురించి పాక్ అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ చేస్తున్న అసత్య ప్రచారానికి వీరు బలికాబోరని.. వీరికి కాన్సులర్ యాక్సెస్ కల్పించాలని కోరినట్లు తెలిపారు. ఇద్దరికీ ఎటువంటి హానీ కలగకుండా సురక్షితంగా స్వదేశానికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. వీరిని తిరిగి రప్పించేందుకు కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు వీరి బాధ్యత పాకిస్తాన్‌దేనని స్పష్టం చేశారు. -
‘హ్యాట్సాఫ్ గంభీర్.. నువ్వేంటో మరోసారి నిరూపించావ్’
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత లోక్‌సభ సభ్యుడు గౌతమ్ గంభీర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ చిన్నారి శస్త్రచికిత్స కోసం భారత్ రావడానికి వీసా వచ్చేలా చేశారు. పాక్‌కు చెందిన ఉమామియా అలీ అనే ఆరేళ్ల చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆ చిన్నారి కుటుంబం చికిత్స కోసం భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని గంభీర్ తెలుసుకున్నాడు. దీంతో ఆ చిన్నారితో పాటు ఆమె తల్లిదండ్రులు భారత్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను గంభీర్ కోరారు. గంభీర్ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి స్పందించారు. చిన్నారితో పాటు ఆమె తల్లిదండ్రులకు వీసాలు జారీ చేయాలని పాక్‌లోని భారత హై కమిషన్‌కు సూచించారు. అనంతరం వారికి వీసాలు జారీ చేసినట్లు గంభీర్‌కు లేఖ రాశారు. ఆ లేఖను గంభీర్ తన ట్విటర్లో పోస్ట్ చేస్తూ ‘అవతలి వైపు నుంచి ఓ పసి హృదయం మనల్ని సంప్రదించినప్పుడు మన కట్టుబాట్లు, హద్దులు పక్కన పెట్టేలా చేస్తుంది. పాక్ చిన్నారి భారత్‌కు రావడమనేది ఒక బిడ్డ తన పుట్టింటికి వచ్చినట్లు అనిపిస్తోంది. భారత్‌కు వస్తున్న పాక్ చిన్నారికి స్వాగతం.’అని పేర్కొన్నారు. తన విజ్ఞప్తికి వేగంగా స్పందించి వారికి వీసా వచ్చేలా చేసిన విదేశాంగ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ‘ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి నేను వ్యతిరేకినని కానీ పాకిస్తాన్ ప్రజలపై కాదు. ఇంకా లోకం అంటే తెలియని చిన్నారి భారత్‌లో వైద్యం అందుకుని ప్రాణాలు దక్కించుకుంటే అంతకంటే ఆనందమేముంటుంది’అని మరొక ట్వీట్ చేశారు. ఇక పాక్ చిన్నారి వైద్యం కోసం చొరవ తీసుకుని వీసా వచ్చేలా చేసిన గంభీర్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘క్రికెటర్‌గానే కాదు.. గొప్ప మానవతావదిగా మరోసారి నిరూపించుకున్నావ్’, ‘హ్యాట్సాఫ్ గంభీర్.. నువ్వేంటో మరోసారి ప్రపంచానికి తెలిసేలా చేశావ్’అంటూ నెటిజన్లు గంభీర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. उस पार से एक नन्हे दिल ने दस्तक दी, इस पार दिल ने सब सरहदें मिटा दी। उन नन्हे कदमों के साथ बहती हुई मीठी हवा भी आई है, कभी-कभी ऐसा भी लगता है जैसे बेटी घर आई है। Thank u @DrSJaishankar 4 granting visa to Pakistani girl& her parents for her heart surgery @narendramodi @AmitShah pic.twitter.com/zuquO2hnMv — Gautam Gambhir (@GautamGambhir) October 19, 2019 -
అది కేజ్రివాల్‌ను అవమానించడమే!
సాక్షి, న్యూఢిల్లీ : క్లైమేట్ చేంజ్‌పై ‘సీ 40’ పేరిట డెన్మార్క్‌లో జరుగుతున్న అంతర్జాతీయ మెగా నగరాల మేయర్ల సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కి కేంద్రం అనుమతి నిరాకరించడం దారుణం. అయనకు అర్హత ఎక్కువైనందున అనుమతి నిరాకరించామని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి సమర్థించుకోవడం అర్థరహితం. ఏ వ్యక్తినైనా అర్హత తక్కువుందని నిరాకరించడంలో అర్థం ఉంది. అర్హత ఎక్కువుందని నిరాకరించడం అన్యాయం. అదీ ఓ మంచి కార్యక్రమం కోసం వెళ్లాలనుకున్నప్పుడు. ఢిల్లీ నగరంలో రోజు రోజుకు వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో, దాని గురించి సమగ్రంగా అంతర్జాతీయ సదస్సులో చర్చించాలని, వీలయితే సరైన పరిష్కారం కనుగొనాలని కేజ్రివాల్ భావించారు. ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు అధికార హోదాలో విదేశాల్లో పర్యటించాలనుకున్నప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి తప్పనిసరి. భారత విదేశాంగ విధానం అంతా ఒక్కటేనని చెప్పడానికి చట్టంలో ఈ నిబంధనను చేర్చారు. భారత్ సమాఖ్య ప్రభుత్వ స్ఫూర్తిని చాటు కోవాలంటే ఇలాంటి సంబంధాల్లో సానుకూలంగా స్పందించాల్సి ఉంటుంది. నిజంగా చెప్పాలంటే పలు అంతర్జాతీయ నగరాల మేయర్ల కన్నా కేజ్రివాల్‌కు అధికారాలు తక్కువ. ఆయన లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆదేశాలకు లోబడి పనిచేయాల్సి వస్తోంది. ఈ దుస్థితి నుంచి తప్పుకునేందుకు ఢిల్లీకి రాష్ట్ర హోదాను కల్పించాల్సిందిగా కేజ్రివాల్ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా, ఆందోళనలు చేసిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. కేంద్ర ప్రభుత్వ నేతలు కూడా ఢిల్లీలో ఉంటున్నందున ఆ నగర సమస్యకు ఓ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించడం పట్ల అభ్యంతరాలు ఉన్నట్లయితే ఆ విషయాన్ని ఆయనకు స్పష్టంగా వివరించాలి. తుది నిర్ణయం కేజ్రివాల్‌కే వదిలేయాలి. ఏమీ చెప్పకుండా నిర్ద్వంద్వంగా ఆయన వినతిని తిరస్కరించడమంటే ఉద్దేశ పూర్వకంగా ఆయన్నే అవమానించడమే అవుతుంది. కేజ్రివాల్ మంగళవారం మధ్యాహ్నం బయల్దేరి డెన్మార్క్ వెళ్లాల్సి ఉండింది. -
కేజ్రీవాల్ విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరణ
న్యూఢిల్లీ: వాతావరణ మార్పుపై డెన్మార్క్‌లో జరుగుతున్న సీ –40 క్లైమేట్ సదస్సులో పాల్గొనాలనుకున్న ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. ఆయన పర్యటనకు విదేశాంగ శాఖ రాజకీయ అనుమతి నిరాకరించిందని అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. దాంతో మంగళవారం కోపెన్‌హెగన్‌కు బయల్దేరాల్సిన ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట దెబ్బతింటుందని, ఆప్ అంటే కేంద్రానికి ఎందుకు అంత కోపమని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ విషయమై కేంద్రప్రభుత్వం స్పందించింది. క్లైమేట్ సదస్సు మేయర్ స్థాయి ప్రతినిధులు పాల్గొంటున్న కార్యక్రమం కాబట్టే అనుమతి ఇవ్వలేదని కేంద్రం వివరణ ఇచ్చింది. -
'మీ ప్రయాణం వాయిదా వేసుకోవడమే మంచిది'
న్యూఢిల్లీ : వేలమంది ప్రొ-డెమోక్రసీ నిరసనకారులు సోమవారం ఒక్కసారిగా హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చొచ్చుకుపోయి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హాంకాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన అన్ని విమానాలను ఒకరోజు పాటు రద్దు చేస్తున్నట్లు అక్కడి ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ భారత ప్రయాణికులకు పలు కీలక సూచనలు చేసింది. హాంకాంగ్ విమానాశ్రయంలో మంగళవారం కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, మరిన్ని నిరసనలు జరిగే అవకాశం ఉండడంతో విమానాల రాకపోకలు ఆలస్యం కావడం లేదా రద్దయ్యే అవకాశం ఉందని తమ ప్రకటనలో తెలిపింది. హాంకాంగ్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరే వరకూ ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమే మంచిదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇప్పటికే హాంకాంగ్‌లో ఉండిపోయిన భారత ప్రయాణికులు తిరిగి సేవలు పున: ప్రారంభం అయ్యేవరకు అక్కడి అధికారులతో టచ్‌లో ఉండాలని స్పష్టం చేసింది. ప్రయాణికులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి +852 90771083 హెల్ప్‌లైన్ ద్వారా సంప్రదించవచ్చని విదేశాంగ శాఖ వెల్లడించింది. -
విదేశాంగ మంత్రిని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మంగళవారం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ను కలిశారు. దాయాది పాకిస్తాన్ చెరలో ఉన్న ఉత్తరాంధ్ర జాలర్లను విడిపించాలని ఆయనను కోరారు. జాలర్లతో వారి కుటుంబసభ్యులు మాట్లాడేందుకు దౌత్య అనుమతి ఇప్పించాలని కేంద్రమంత్రిని వైఎస్సార్సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఉపాధి కోసం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి గుజరాత్ వెళ్లిన 21 మంది మత్స్యకారులు అరేబియా సముద్రంలో పాకిస్థాన్ గస్తీ దళాలకు చిక్కిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి కొంతమంది జాలర్లు గుజరాత్‌లోని వారావల్ ప్రాంతానికి బతుకుదెరువు కోసం వెళ్లారు. అక్కడి నుంచి మత్స్యకారులు చేపల వేటకోసమని నాలుగు మెక్‌నైజ్డ్ బోట్లలో పయనమై అరేబియా సముద్రంలోకి వెళ్లారు. అందులో మూడు బోట్లు చేపల్ని వేటాడుతూ పొరపాటున భారత సరిహద్దులు దాటి పాక్ జలాల్లోకి ప్రవేశించాయి. దీన్ని గుర్తించిన పాక్ కోస్టుగార్డులు వెంటనే ఆయా బోట్లలోని జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ ఎంపీలు ఈ అంశాన్ని పలుసార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. -
విదేశాంగ మంత్రిని కలిసిన మిథున్‌రెడ్డి
న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి మంగళవారం కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కలిశారు. కువైట్‌లో ఆంధ్రప్రదేశ్ వాసులు అరెస్టు అయ్యారని, వారిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన జైశంకర్‌ను అభ్యర్థించారు. తెలంగాణలోని వరంగల్‌లో 9 నెలల పాపపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆంధ్రవాసులు కువైట్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారని, దీంతో వారిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారని మిథున్‌రెడ్డి విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. -
బీజేపీలో చేరిన కేంద్రమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖమంత్రి ఎస్ జైశంకర్ అధికారికంగా బీజేపీలో చేరారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో సోమవారం పార్టీ కండువా కప్పుకున్నారు. గత ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా సుష్మా స్వరాజ్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో.. ఆయన (2015) భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమితులైన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సుష్మా దూరంగా ఉన్నారు. జైశంకర్ అనుభవం, సేవలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో.. ప్రధాని మోదీ ఆయనను విదేశాంగమంత్రిగా నియమించారు. దీంతో ఆరు నెలలలోపు ఆయన పార్లమెంట్‌కు ఎన్నిక కావాల్సి ఉంది. గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికవుతారని సమాచారం. 2014 నుంచి మోదీ ప్రభుత్వంతో ఆయన మంచి సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగానే జైశంకర్‌ను 2015లో భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా బీజేపీ ప్రభుత్వం నియమించింది. డోక్లాంపై భారత్, చైనా దేశాల మధ్య నెలకొన్న వివాదం శాంతియుతంగా పరిష్కరించడంలో.. పుల్వామా దాడుల తర్వాత బాలాకోట్‌పై వాయుసేన దాడులు.. పాకిస్తాన్లో చిక్కుకున్న అభినందన్ వర్ధమాన్‌ను భారత్ తిరిగి రప్పించడంలో జై శంకర్ కృషి ఎంతో ఉంది. ఆయన ప్రతిభ పాటవాలు స్వయంగా చూసిన మోదీ విదేశాంగ మంత్రిగా కీలక బాధ్యతలను అప్పగించారు. -
బిమ్స్టెక్తో ముందుకు!
న్యూఢిల్లీ: దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం(సార్క్)తో కొన్ని సమస్యలున్న నేపథ్యంలో బిమ్స్టెక్ దేశాల సాయంతో ప్రాంతీయ సహకారాన్ని మెరుగు పరుచుకునేందుకు భారత్ కృషి చేస్తుందని విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. గడిచిన ఐదేళ్లలో అంతర్జాతీయంగా భారత్ స్థాయి పెరిగిందని ప్రజలు గుర్తించారని, అందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి మరోసారి అధికారమిచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా సంభవించిన పరిణామాలు మారిన సమీకరణాలతో చైనా ప్రాముఖ్యం పెరిగిందని, అదేవిధంగా భారత్ పలుకుబడి కూడా విస్తరించిందని అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) గురువారం ఇక్కడ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘ప్రాంతీయ అనుసంధానతకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. అయితే, సార్క్‌తో సమస్యలున్నాయి. అదేమిటో మనందరికీ తెలుసు. ఉగ్రవాద అంశాన్ని పక్కన పెట్టినప్పటికీ అనుసంధానత, వాణిజ్యం వంటి వాటిల్లోనూ ఇబ్బందులున్నాయి. అందుకే ఆర్థిక అభివృద్ధికి, ప్రాంతీయ సమగ్రతకు సార్క్ కంటే బిమ్స్‌టెక్‌నే కీలకంగా భావిస్తున్నాం’ అని తెలిపారు. డబ్లు్యటీవో ఆశించిన ఫలితాలను ఇవ్వనందునే పలు దేశాలు స్వేచ్ఛావాణిజ్య ఒప్పందా(ఎఫ్‌టీఏ)లను కుదుర్చుకునేందుకు చొరవచూపుతున్నాయని తెలిపారు. బిమ్స్టెక్లో బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, నేపాల్, భూటాన్ ఉన్నాయి. -
పాక్‌కు అదొక హెచ్చరిక : జైశంకర్
న్యూఢిల్లీ : దక్షిణాసియాలో భారత్ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన కారణంగా పొరుగు దేశాలకు సహాయం చేయాల్సిన ఆవశ్యకత ఉందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు. సార్క్(ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక) దేశాల్లోని కొన్నింటితో భారత్‌కు సమస్యలు ఉన్నాయని పాకిస్తాన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించడంలో విదేశాంగ శాఖ వడివడిగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ప్రవాస భారతీయుల సమస్యలను తీర్చడంలో సుష్మా స్వరాజ్ ఎనలేని చొరవ చూపారంటూ ప్రశంసించారు. ఆమె సారథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ స్వరూపమే పూర్తిగా మారిపోయిందని ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్‌కు అదొక హెచ్చరిక!! ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి బిమ్స్టెక్(బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్) దేశాధినేతలు హాజరైన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి జైశంకర్ మాట్లాడుతూ.. ‘ బిమ్స్టెక్ దేశాధినేతలకు ఆహ్వానం పలకడం ద్వారా పాకిస్తాన్ స్పష్టమైన సందేశమిచ్చాం. ఉగ్రవాదంతో పాటు సార్క్ దేశాలతో సరిహద్దు, వ్యాపార సంబంధ సమస్యలు ఉన్నాయి. అయితే తమతో పాటు పొరుగుదేశాల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు పాటుపడటం భారత్‌కు ఉన్న గొప్ప స్వభావం. అందుకే ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక ఆసియాలో జాతీయవాదం అంటే ఎన్నికలు, రాజకీయాలకు అతీతంగా ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. కానీ ప్రపంచదేశాల్లో ఇందుకు వేరే అర్థం ఉంటుంది. కేవలం అధికారం చేజిక్కుంచుకునేందుకే ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతారు’ అని వ్యాఖ్యానించారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయం గురించి మాట్లాడుతూ.. విదేశాంగ విధానం, అభివృద్ధి కార్యక్రమాల వల్లే అఖండ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. కాగా విదేశాంగ శాఖ ముఖ్య కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన జైశంకర్‌కు ప్రధాని మోదీ తన కేబినెట్లో స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే ఆయనను రాజ్యసభకు పంపేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. -
ఆ రెండు దేశాలతోనే ఆయనకు అసలైన సవాళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: కీలకమైన విదేశాంగ శాఖ మంత్రిగా ఎస్ జైశంకర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు దేశాలతో దౌత్యపరమైన సమస్యలు శంకర్‌కు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా భారత్-చైనా, అమెరికా-భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సి ఉంది. భారత్‌కు పక్కలో బళ్లెంలా తయారైన చైనాతో దశాబ్దాలుగా సరిహద్దు సమస్య వెంటాడుతోంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, డోక్లాం సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు పాల్పడుతోంది. మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ఈ సమస్య పరిష్కారానికి ఎంతో కృషిచేసినప్పటికీ.. సరిహద్దుల్లో రెండు దేశాల మధ్య యుద్ధ వాతవారణం అప్పడప్పుడు కనిపిస్తూనే ఉంది. భారత భూభాగంలో భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌ను తమ దేశ పటంలో చూపిస్తూ.. డ్రాగాన్ అనేక సార్లు దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. వీటన్నింటని జై శంకర్ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమెరికా, జపాన్, కొరియాలతో వ్యూహాత్మక ఒప్పందాలు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గల దేశాలైన అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలకు తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలు పెంచడమే ఇందుకు కారణం. మరో 200 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాలను ట్రంప్ రెట్టింపు చేశారు. దీని ప్రభావం భారత్‌పై కూడా పడే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల కాలంలో అమెరికాకు ఇండియా దగ్గర కావడం చైనాకు మింగుడుపడడంలేదు. న్యూక్లియర్ ఒప్పందం (అమెరికా-చైనా) చైనాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. భారత్ ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వనికి మద్దతు ఇవ్వడానికి చైనా అభ్యంతరం చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జైశంకర్ ఎంతో వ్యూహత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్ అనుసరిస్తున్న లుక్ ఈస్ట్ పాలసీ చైనాకు చేదుగుళికలా తయారైంది. తన పొరుగు దేశాలైన జపాన్, వియాత్నం దేశాలతో భారత్ మరింత దూకుడుగా వ్యవహరించాల్సి ఉంటుంది. దీంతో చైనాను కొంతమెర అడ్డుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చైనా వ్యతిరేక శక్తులైన అమెరికా, జపాన్, కొరియా, లాంటి దేశాలతో భారత్ వ్యహాత్మక ఒప్పందాలను కుదుర్చుకోవాలి. భారత్‌కు ట్రంప్ షాక్ ఇదిలావుండగా.. భారత్‌కు వాణిజ్య ప్రాధాన్య హోదా (జీఎస్పీ)ను త్వరలో తొలగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఈ పరిణామం భారత్‌ను షాక్‌కు గురిచేసింది. ట్రంప్ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుందనే విషయం ఇప్పుడు భారత్‌లో చర్చనీయాంశమైంది. అమెరికాకు మన దేశం ఎలాంటి సుంకం చెల్లించకుండా ఏడాదికి రూ.39 వేల కోట్ల విలువైన వస్తువుల్ని ఎగుమతి చేస్తోంది. జీఎస్పీ హోదా తొలగిస్తే మనం ఆ వస్తువుల ఎగుమతికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా వాణిజ్య లోటును తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్ భారత్ వస్తువులపై సుంకాలు విధిస్తామని గతంలో పలుమార్లు హెచ్చరించారు. ఇప్పుడు ఏకంగా వాణిజ్య ప్రాధాన్య హోదాను తొలగించడానికే సిద్ధమయ్యారు. ఇన్ని సవాళ్ల నడుమ జైశంకర్ విదేశాంగశాఖను నడిపించాల్సి ఉంది. -
24 గంటలూ మీ సేవలోనే.. కేంద్రమంత్రి ఫస్ట్ ట్వీట్
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఎస్ జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అడుగుజాడల్లో ముందుకుసాగడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. భారత విదేశాంగ బృందం 24 గంటలూ దేశ ప్రజల సేవలోనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రమంత్రిగా పగ్గాలు చేపట్టిన అనంతరం ఆయన ఈ మేరకు ట్వీట్‌చేశారు. ‘ఇది నా మొదటి ట్వీట్. శుభాకాంక్షలు అందించినందుకు ధన్యవాదాలు. ఈ బాధ్యతలు చేపట్టడం గౌరవంగా భావిస్తున్నా. సుష్మా స్వరాజ్ అడుగుజాడల్లో నడుస్తుండటం గర్వకారణంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి మాజీ విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్ శుక్రవారం చరిత్ర సృష్టించారు. మాజీ ఐఎఫ్ఎస్ అధికారి అయిన ఆయన 2015లో విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు. భారత్-చైనా మధ్య తలెత్తిన 73 రోజుల డోక్లామ్ ప్రతిష్టంభనకు తెరదించడంలో జైశంకర్ కీలక పాత్ర పోషించారు. -
నిండుతనం..చెరగని చిరునవ్వు సుష్మా స్వరాజ్
సాక్షి వెబ్ ప్రత్యేకం : భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేతల్లో ప్రముఖంగా వినిపించే పేరు సుష్మాస్వరాజ్. పలు సందర్భాల్లో పార్టీ కీలక నేతగా తన ప్రాధాన్యతను చాటుకున్నారు. చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న సుష్మ రాజకీయాల్లోకి ప్రవేశానంతరం వెనుదిరిగి చూడలేదు. హరియాణా అసెంబ్లీలో అడుగుపెట్టిన అతి చిన్న వయస్కురాలిగా, ఢిల్లీకి బీజేపీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా, లోక్‌సభలో తొలి మహిళా ప్రతిపక్షనేతగా, అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు స్వీకరించిన తొలి మహిళగా, క్రియాశీలకమైన రాజకీయవేత్తగా తనదైన శైలిలో రాణించారు. సుష్మా స్వరాజ్ దేశంలో అనేక రాజకీయ అనిశ్చితులను, ముఖ్యంగా ఎమర్జెన్సీ, పదమూడు రోజుల సంకీర్ణ ప్రభుత్వం లాంటి ఒడిదుడుకులను ఆమె చాలా దగ్గరినుంచి పరిశీలించారు. సంప్రదాయం, మానవత కలగలిసిన రాజనీతిజ్ఞురాలుగా వన్నెకెక్కి తనదైన వాక్పటిమతో విపక్ష నేతలను సైతం ఆకట్టుకునే చాతుర్యం ఆమె సొంతం. అందుకే బెస్ట్ లవ్డ్ పొలిటీషియన్’, ‘బెస్ట్ అవుట్‌స్టాండింగ్ పార్లమెంటేరియన్’. అవార్డులు ఆమెను వరించాయి. దీంతోపాటు విదేశాంగ మంత్రిగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో ట్విటర్‌ద్వారా పలు సమస్యలను పరిష్కరిస్తూ స్మార్ట్ లీడర్‌గా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా 2016లో ఆమెకు జరిగిన కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స నేపథ్యంలో ట్విటర్ ద్వారా ఆమెకు లభించిన సానుభూతి, ఊరట ప్రస్తావించదగింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకే కాదు, మన దేశంలో చిక్కుకుపోయిన విదేశీయులకూ అంతే స్మార్ట్‌గా సాయం అందించి అనేకమంది హృదయాలను గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2015లో నేపాల్ భూకంపం సందర్భంగా సుష్మ స్పందించిన తీరు, అందించిన సేవలకు గాను స్పెయిన్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డును 'గ్రాండ్ క్రాస్‌ను ఇటీవల అందుకోవడం విశేషం. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంటులో బీజేపీ తరపున గట్టిగా వాదించి ‘తెలంగాణ చిన్నమ్మ’ గా పేరు గడించారు. రాజకీయ ప్రస్థానం 1977-82 హర్యానా శాసనసభ సభ్యురాలిగా క్రీయాశీల రాజకీయాల్లో ప్రవేశించి, పార్లమెంటు (రాజ్యసభ, లోక్‌సభ) సభ్యురాలిగా కాలిడి, 2014లో 16వ లోక్‌సభకు ఎంపికవరకూ ఆమె రాజకీయ పయనం అప్రతిహతమే. బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వాని స్థానంలో ప్రతిపక్షనేతగా ఎంపికకావడం ఒక ఎత్తు అయితే..పలుమార్లు కేంద్రమంత్రిగా విజయవంతంగా సేవలందించడం మరో ఎత్తు. విప్లవాత్మక నిర్ణయాలు దేశ రాజధాని నగరం ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రిగా, విదేశాంగ మంత్రిగా సాహసోపేతమైన, విప్లవాత్మక నిర్ణయాలతో ఆకట్టుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ల తనిఖీలు చేపట్టి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సమాచార ప్రసార మంత్రిగా పార్లమెంట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆరు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఏర్పాటు చేశారు. వ్యక్తిగత వివరాలు సుష్మాస్వరాజ్ తండ్రి హర్దేవ్ శర్మ (ఆర్ఎస్ఎస్ సభ్యుడు), తల్లి లక్ష్మీదేవి. సుష్మ బాల్యం, కాలేజ్ చదువు అంతా అంబాలాలో సాగింది. మూడేళ్లు వరుసగా బెస్ట్ ఎన్సీసీ క్యాడెట్ అవార్డు నుంచి బెస్ట్ హిందీ స్పీకింగ్ అవార్డు, బెస్ట్ స్టూడెంట్ అవార్డులను సుష్మ గెల్చుకున్నారు. న్యాయవాది పట్టా పొందిన అనంతరం 1973లో సుప్రీంకోర్టు న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. జార్జి ఫెర్నాండెజ్ లీగల్ డిఫెన్స్ టీమ్‌లో చేరడం... ఆమె జీవితంలో అటు రాజకీయంగా, ఇటు వ్యక్తిగతంగా కీలక మార్పులకు నాంది పలికింది. 1975, జూలై 13న సహచర న్యాయవాది కౌశల్ స్వరాజ్‌ను ఆమె పెళ్లి చేసుకుని సుష్మా స్వరాజ్గా మారడం అందులో ఒకటి. సుష్మ, స్వరాజ్ కౌశల్ దంపతులకు బన్సూరి కౌశల్ కుమార్తె ఉన్నారు. వివాదాలు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీకి వీసా పత్రాలు త్వరగా మంజూరయ్యేలా సిఫారసు చేశారన్న ఆరోపణలు అప్పట్లో ప్రకంపనలు రేపాయి. 2014లో భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలంటూ మరో వివాదంలో ఇరుక్కున్నారు. దీంతోపాటు ఆమె భర్త స్వరాజ్ కౌశల్, కూతురు బాంసూరి స్వరాజ్లను మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయవాదులుగా నియమించుకున్నారన్న వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై సుష్మ రాజీనామాను డిమాండ్ చేస్తూ 2015తలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే రాజ్యసభలో వాయిదా తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. గత ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆరోగ్యరీత్యా రాబోయే 2019 ఎన్నికల్లో పోటీ చేయలేనంటూ అనూహ్యంగా ప్రకటించారు. ఇష్టాలు సంగీతం, సాహిత్యం, లలిత కళలు, నాటకాలు. సుష్మ స్వరాజ్‌కు జ్యోతిషశాస్త్రంపై ధృడమైన నమ్మకం. భోంచేసినా, దుస్తులు ధరించినా అన్నీ దీనికనుగుణంగానే చేస్తారట. - టి. సూర్యకుమారి -
‘గత్యంతరం లేకే నా భార్యను చంపేశా’
సాక్షి, హైదరాబాద్: భార్యపై అనుమానంతో దుబాయ్ నుంచి వచ్చి మరీ హత్య చేశాడో భర్త. సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం.. గద్వాల్‌కు చెందిన రహీం ఉపాధి కోసం దుబాయ్‌కి వలస వెళ్లాడు. అయితే తన మొదటి భార్య బేగం ఇతరులతో ఫోన్లో మాట్లాడుతోందని, ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని రహీం అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య ఫోన్లో తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రహీం.. మంగళవారం సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జ్‌లో దిగాడు. అనంతరం భార్యకు ఫోన్ చేసి గద్వాల్ నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు రమ్మన్నాడు. ఆమెను లాడ్జ్‌కు తీసుకెళ్లి ఈ విషయమై చర్చించారు. ఇద్దరి మధ్య దీనిపై పెద్ద గొడవే జరిగిందని సమాచారం. కోపోద్రిక్తుడైన రహీం అతి కిరాతకంగా ఆమెను హత్య చేశాడు. అనంతరం గత్యంతరం లేకే తన భార్యను చంపినట్టు 100కు ఫోన్ చేసి పోలీసులకు చెప్పాడు. పోలీసులు లాడ్జ్‌కు వచ్చేంతవరకు వేచివున్న అతడు వాళ్లు వచ్చిన వెంటనే పరారయ్యాడు. మృతురాలి వివరాలు సేకరించిన పోలీసులు ఆమె బంధువులకు సమాచారమిచ్చారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
ఎమిగ్రేషన్ బిల్లుపై సూచనలు కోరిన విదేశాంగ శాఖ
వివిధ మంత్రిత్వశాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, రిక్రూట్మెంట్ ఏజెన్సీలు, అంతర్జాతీయ సంస్థలు, వాణిజ్య పారిశ్రామిక మండళ్లు (ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ), విద్యా సంస్థలతో సంప్రదింపుల తరువాత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త ఎమిగ్రేషన్ బిల్ ముసాయిదాను ఖరారు చేసింది. 35 ఏళ్ల క్రితం ఏర్పాటయిన ఎమిగ్రేషన్ యాక్ట్-1983 స్థానాన్ని, ఇప్పుడు ప్రతిపాదిస్తున్న ఎమిగ్రేషన్ బిల్-2019 భర్తీ చేయనున్నది. ప్రతిపాదిత ఎమిగ్రేషన్ బిల్-2019 ముసాయిదాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్ సైటు https://mea.gov.in/emigrationbill.htm లో చూడవచ్చు. ముఖ్యమైన అంశాలపై 4 పేజీల నివేదిక, 51 పేజీల పూర్తి ముసాయిదాను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రజలు ముసాయిదా బిల్లో వివిధ అంశాలపై వ్యాఖ్యలు, సలహాలు 20 జనవరి 2019లోగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ-మెయిళ్లు dsoia1@mea.gov.in, so2oia1@mea.gov.in కు పంపవచ్చు. కొత్త బిల్లు గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి పెట్టింది. -మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు +91 98494 22622 -
చికాగో సీజీఐలో ప్రారంభమైన ‘పాస్‌పోర్ట్ సేవా’ కార్యక్రమం
చికాగో: భారత ప్రభుత్వం చికాగోలోని భారత కాన్సులేట్ కార్యాలయం(సీజీఐ)లో ‘పాస్‌పోర్ట్ సేవా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. పాస్‌పోర్ట్ దరఖాస్తులను మరింత సరళతరం చేసేందుకు భారత విదేశాంగ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కాన్సులేట్ అధికారులతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం ద్వారా గడిచిన నాలుగున్నరేళ్లలో భారత్ పాస్‌పోర్ట్ జారీలో పెను మార్పులు వచ్చాయని విదేశాంగ శాఖ పేర్కొంది. పాస్‌పోర్ట్ సర్వీస్‌లలో 2017 సంవత్సరంలో 19 శాతం వృద్ధి సాధించామని తెలిపింది. కేవలం ఒక నెలలోనే పది లక్షల అప్లికేషన్లు వచ్చాయని.. పాస్‌పోర్ట్ సేవా ద్వారా ఆరు కోట్ల మందికి పాస్‌పోర్ట్‌లు జారీ చేసినట్టు వెల్లడించింది. పాస్‌పోర్ట్ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. పాస్‌పోర్ట్ విధానాలను సరళతరం చేయడమే కాకుండా పాస్‌పోర్ట్ సేవలను ప్రజల చెంతకే తీసుకువచ్చినట్టు స్పష్టం చేసింది. భారత్‌లోని అన్ని హెడ్ పోస్ట్ ఆఫీస్‌లలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అందులో భాగంగా ఇప్పటివరకు 236 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని.. మరికొన్ని సేవా కేంద్రాలు కూడా త్వరలో వినియోగంలోకి రానున్నాయని తెలిపింది. దేశంలో ఉన్న పాస్‌పోర్ట్ ఆఫీసులు, గతంలో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను కలుపుకుంటే.. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్నపాస్‌పోర్ట్ కార్యాలయాల సంఖ్య 365కు చేరిందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత రాయబార కార్యాలయాల్లో, కాన్సులేట్లలో పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపింది. అందులో భాగంగా తొలుత లండన్‌లోని భారత్ హైకమిషన్ కార్యాలయంలో ఈ ప్రోగ్రామ్‌ను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి.. ఆ తర్వాత బర్మింగ్‌హామ్, ఎడిన్‌బర్గ్‌లలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయాల్లో దీనిని విజయవంతంగా చేపట్టినట్టు పేర్కొంది. యూఎస్ విషయానికి వస్తే.. వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయంలో, న్యూయార్క్, శాన్‌ఫ్రానిస్కో, అట్లాంటా, హోస్టన్‌లలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయాలలో ఈ పోగ్రామ్‌ను చేపట్టినట్టు ప్రకటించింది. చికాగోలో ప్రారంభించిన పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం ద్వారా అక్కడి ఎన్ఆర్ఐలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపింది. ఈ నూతన పద్దతిలో ప్రజలు సులువుగా దరఖాస్తులు సమర్పించడమే కాకుండా, డిజిటల్ పరిశీలన, భద్రతోపాటు అప్లికేషన్ ట్రాకింగ్ కూడా అందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది. రాబోయే మూడు, నాలుగు నెలల్లో అన్ని భారత రాయబార కార్యాలయాల్లో పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపింది. -
సునాయిక
సకల సుగుణ నాయిక సుష్మాస్వరాజ్! వాగ్ధాటి, సుపరిపాలన, సత్వర ప్రతిస్పందన, సంస్కృతి, సంప్రదాయం, మానవత కలగలిసిన రాజనీతిజ్ఞురాలు.. సుగుణాలకే వన్నెతెచ్చిన నాయిక.. సునాయిక..సుష్మాస్వరాజ్. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం. ప్రత్యర్థి పార్టీలు కూడా గౌరవించే వ్యక్తిత్వం. దేశ రాజధానికి... ముఖ్యమంత్రి అయిన తొలి మహిళ. మూడు సార్లు ఎమ్మెల్యే... ఏడుసార్లు ఎంపీ. ‘బెస్ట్ లవ్డ్ పొలిటీషియన్’.. వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రశంస. ‘బెస్ట్ అవుట్‌స్టాండింగ్ పార్లమెంటేరియన్’.. మన దేశం. కొత్త తరం పొలిటీషియన్లకు రోల్‌మోడల్. అన్నీ కలిస్తే.. సుష్మా స్వరాజ్. ఓ రోజున సుష్మా స్వరాజ్ ట్విట్టర్ అకౌంట్‌కి ‘మేడమ్ ప్లీజ్ హెల్ప్’ అంటూ ఒక ట్వీట్ వచ్చింది. అది దోహా ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన తన సోదరుడిని రక్షించమని కోరుతూ ప్రన్షు సింఘాల్ అనే వ్యక్తి చేసిన ట్వీట్. మూడవ రోజునే ‘నా సోదరుడు అంకిత్ క్షేమంగా విడుదలయ్యాడు. కృతజ్ఞతలు’ అంటూ మరో ట్వీట్ చేశాడు ప్రన్షు సింఘాల్. అంతకంటే ముందు... బెర్లిన్‌లో పాస్‌పోర్టు, డబ్బు ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను పోగొట్టుకున్న అగర్త అనే అమ్మాయి నుంచి సుష్మకు ఒక ట్వీట్ వచ్చింది. ఆ మరుసటి రోజే ‘ఈ రోజు ఇండియన్ ఎంబసీకి వెళ్లి పాస్‌పోర్టుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక అనుమతి తీసుకున్నాను. కృతజ్ఞతలు’ అంటూ ఎంబసీ ఉద్యోగుల పేర్లతో సహా మరో ట్వీట్ చేసింది అగర్త. మరికొన్నాళ్లకు.. దేవ్ తంబోలి అనే వ్యక్తి నుంచి ఓ ట్వీట్.. ‘మా చెల్లెలు ఉద్యోగం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి వెళ్లింది. ఆమెను ఓ గదిలో బంధించారు. రక్షించండి’ అంటూ తన ఫోన్ నంబరు కూడా ఇచ్చాడతడు. కొన్ని గంటల్లోనే దేవ్ ట్విట్టర్ అకౌంట్‌కి ‘యుఎఈ అంబాసిడర్‌ని సహాయం అడిగాను. ఆయన మీతో మాట్లాడతారు, వివరాలు చెప్పండి’ అని భారత విదేశాంగ మంత్రి నుంచి రిప్లయ్ ట్వీట్ వచ్చింది. ఆ రోజు సాయంత్రానికే ‘దుబాయ్ పోలీసుల సహాయంలో మీ చెల్లెల్ని రక్షించాం. ఇప్పుడామెను దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ షెల్టర్‌కు చేర్చడమైంది’ అని దేవ్‌కి ట్వీట్ చేశారు భారత విదేశాంగ మంత్రి. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకే కాదు, మనదేశంలో చిక్కుకుపోయిన విదేశీయులకూ అంతే వేగంగా సుష్మ నుంచి సేవలు అందుతున్నాయి. సుజాన్నె లుగానో అనే డచ్ మహిళ తన సోదరి సబినె హార్మెస్ భారత పర్యటనలో రిషికేశ్‌లో తప్పి పోయిందని ట్వీట్ చేసింది. సోదరిని గుర్తుపట్టడానికి ఆనవాళ్లను కూడా వివరించింది సుజాన్నె. ఆ ట్వీట్‌కు బదులుగా ‘మా అధికారులు సబినె హార్మెస్ను కనుగొన్నారు. ప్రస్తుతం ఆమె స్వతంత్ర ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటోంది. డెహ్రాడూన్‌లోని పాస్‌పోర్టు అధికారి ఆమెను స్వయంగా కలిశారు’ అని ఒక ట్వీట్. మరి కొన్ని గంటలకు ‘ఆమె కాళ్లకు గాయాలయ్యాయి. ఆమె మానసికంగా కూడా స్థిమితంగా లేదు. నిర్మల్ జాలీ గ్రాంట్ హాస్పిటల్’లో చేర్చి చికిత్స చేస్తున్నారు’ అని మరో ట్వీట్ చేశారు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్. ఇవి మాత్రమే కాదు.. ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయుల వీడియో చూసి మనోవేగంతో స్పందించారు సుష్మ. ఆపదలో ఉన్న వారిని విడిపించారు, మరణించిన వారిని వారి బంధువులకు అప్పగించారామె. ఇవన్నీ భారతీయులుగా మన ఛాతీ ఉప్పొంగే సేవలైతే... సోనూ అనే చిన్నారిని రక్షించడంలో ఆమెలో అమ్మతనం దేశం హృదయాన్ని తాకింది. సోనూ నాలుగేళ్ల కుర్రాడు. ఢిల్లీలో ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా 2010లో ఇద్దరు మహిళలు ఆ చిన్నారిని అపహరించుకుని వెళ్లారు. సుష్మ దృష్టికి వచ్చిన తర్వాత సోనూ కోసం శోధించి 2016లో బంగ్లాదేశ్‌లోని షెల్టర్ హోమ్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ ప్రభుత్వంతో సంప్రదించి సోనూను ఇండియాకు రప్పించి అతడి తల్లిదండ్రులకు అప్పగించినప్పటి దృశ్యం దేశ ప్రజల గుండెల్ని కదలించింది ఆ స్థానంలో మగవాళ్లు ఉంటే ఆ సందర్భం కర్తవ్య నిర్వహణలో భాగంగానే ఉండేది. మీడియా కోసం ఫొటోకి పోజిచ్చి, పిల్లాడిని అమ్మానాన్నలకు అప్పగించేవాళ్లు్ల. సుష్మాస్వరాజ్ మంత్రిగా మాత్రమే కాదు, ఓ తల్లిలా కూడా స్పందించారు. సోనూను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. తన బిడ్డే తప్పిపోయి తిరిగి దగ్గరకు చేరితే తల్లిపేగు కన్నీరు పెట్టుకున్నట్లు స్పందించారామె. ఇలా ఆమెలో దేశాన్ని తల్లిలా భావించే లక్షణం కూడా ఆమెతోపాటే పెరిగింది. పాలకులు ప్రజలను బిడ్డల్లా పాలించాలనే తత్వాన్ని ఆమెకు పొలిటికల్ సైన్స్ నేర్పించింది. హరియాణా అమ్మాయి సుష్మాస్వరాజ్ పూర్వికులు లాహోర్ (పాకిస్థాన్)లోని ధరంపురా నుంచి హరియాణాకు వచ్చారు. తండ్రి హర్దేవ్ శర్మ ఆర్ఎస్ఎస్లో క్రియాశీలక సభ్యుడు. అంబాలా కంటోన్మెంట్లో స్థిరపడ్డారాయన. సుష్మ బాల్యం, కాలేజ్ చదువు అంతా అంబాలాలోనే. వరుసగా మూడేళ్లు బెస్ట్ ఎన్సీసీ క్యాడెట్ అవార్డు నుంచి బెస్ట్ హిందీ స్పీకింగ్ అవార్డు, బెస్ట్ స్టూడెంట్ అవార్డు, సంగీతం, సాహిత్యం, లలిత కళలు, నాటకాలు, వక్తృత్వం... అన్నింటిలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది. పంజాబ్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చదివే రోజుల్లో విద్యార్థి పరిషద్‌లో చురుగ్గా పాల్గొంటున్నప్పుడు ఆమె ఊహించి ఉండరు.. దేశంలో ఇంతటి క్రియాశీలకమైన రాజకీయవేత్తగా మారతానని. లా కోర్సు పూర్తయిన తర్వాత అందరిలాగానే న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. జార్జి ఫెర్నాండెజ్ లీగల్ డిఫెన్స్ టీమ్‌లో చేరడం... ఆమె జీవితాన్ని మలుపు తిప్పి, ఇప్పుడు మనం చూస్తున్న గమ్యానికి చేర్చింది. సుష్మ... స్వరాజ్ 1975, జూలై 13. అప్పటి వరకు ఆమె కేవలం సుష్మ, ఆ రోజు నుంచి సుష్మా స్వరాజ్. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తూ.. ఫెర్నాండెజ్, జయప్రకాశ్ నారాయణ్లతోపాటు సుష్మ ఉద్యమించిన సమయంలోనే ఫెర్నాండెజ్ టీమ్‌లో చేరి, పరిచయం అయిన న్యాయవాది కౌశల్ స్వరాజ్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. తర్వాత రెండేళ్లకు హరియాణా శాసనసభకు ఎన్నికలు వచ్చాయి. జనతాపార్టీకి చురుకైన అభ్యర్థులు కావాల్సి వచ్చింది. పార్టీ నాయకులకు సుష్మాస్వరాజ్ కనిపించారు. పాతికేళ్లకే ఆమె శాసన సభకు పోటీ చేయడం, గెలవడం, దేవీలాల్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణం చేయడం జరిగిపోయాయి. మరో రెండేళ్లకే పార్టీ రాష్ట్ర బాధ్యతలు స్వీకరించారు. విప్లవాత్మక నిర్ణయాలు సుష్మాస్వరాజ్ దేశంలో అనేక రాజకీయ అనిశ్చితులకు ప్రత్యక్ష సాక్షి. ఎమర్జెన్సీ నుంచి సంకీర్ణ యుగం వరకు, పదమూడు రోజుల ప్రభుత్వం వంటి ఒడిదుడుకులను కూడా చూశారు. సమాచార ప్రసార మంత్రిగా పార్లమెంట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆరు ఎయిమ్స్‌ల స్థాపన ఆమె చొరవే. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ల తనిఖీ వంటి సాహసోపేతమైన అడుగులు కూడా వేశారు. అప్పట్లో ఉల్లిపాయలు కేజీ ఐదు నుంచి యాభై రూపాయలను చేరడం భారత దేశం ఊహించని పరిణామం. ఆ ఫలితాన్ని ఆమె ఢిల్లీ ఎన్నికలలో మోయాల్సి వచ్చింది. భారతీయత– విదేశీయత సుష్మాస్వరాజ్ రాజకీయ జీవితం ఇందిరా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా మొదలవడం అనుకోకుండా జరిగిపోయింది. భారత విదేశాంగ శాఖను నిర్వహించిన మహిళల్లో ఇందిరాగాంధీ తర్వాత సుష్మ పేరు చేరడం కూడా యాదృచ్చికమే. అయితే 1999లో గాంధీ కుటుంబంతో బరిలో దిగడం మాత్రం అప్పటి రాజకీయ అవసరం. సోనియా గాంధీ కర్నాటకలోని బళ్లారి లోక్‌సభ స్థానానికి కూడా పోటీ చేశారు. అప్పుడు అద్వానీ, వాజ్‌పేయి వంటి పార్టీ పెద్దలు సుష్మాస్వరాజ్ వైపు మొగ్గుచూపారు. భారతీయతకు– విదేశీయతకు మధ్య పోటీగా రూపుదిద్దుకున్న ఆ ఎన్నికల్లో చివరి నిమిషంలో బరిలో దిగిన సుష్మాస్వరాజ్... ప్రచారంలో కన్నడ భాషలో మాట్లాడి కన్నడిగులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. మూడున్నర లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. కొద్ది తేడాతో విజయానికి దూరంగా ఉండిపోయినప్పటికీ ఆ ఎలక్షన్ సుష్మ పొలిటికల్ చరిష్మా గ్రాఫ్‌ను పెంచింది. నిత్య విద్యార్థి సుష్మా స్వరాజ్ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. టెక్నాలజీతోపాటు అప్డేట్ అవుతుంటారు. ట్విటర్‌ను పరిపాలనకు ఆమె ఉపయోగించినంత విరివిగా మరెవరూ వాడి ఉండరు. ఏ క్షణమైనా ప్రపంచానికి ఒక ట్వీట్ దూరంలోనే ఉంటారు. సుష్మాస్వరాజ్... స్మార్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎలాగన్నది చేతిలో స్మార్ట్‌ఫోన్‌తో చేసి చూపిస్తున్నారు. అదే వేదికగా ప్రజాభిమానాన్ని కూడా చూరగొంటున్నారు. ఆమెకు కిడ్నీ సమస్య వచ్చినప్పుడు వెల్లువెత్తిన అభిమానం రాజకీయ పార్టీల హద్దులను చెరిపేసింది. తమ కిడ్నీ ఇస్తామంటూ అభిమానుల నుంచి ట్వీట్లు వచ్చాయి. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆమె సంపాదించుకున్న స్థిరాస్తి అది. నాయకులు రెండు రకాలు. తమకు మార్గదర్శనం చేసిన వారి అడుగుజాడల్లో నడిచేవాళ్లు, తర్వాతి తరం కోసం తమ పాదముద్రలతో పథనిర్మాణం చేయగలిగిన వాళ్లు. సుష్మా స్వరాజ్‌ది రెండో కోవ. ప్రధాని అవుతారా?! సుష్మా స్వరాజ్ గత వారం... తన ఆరోగ్య రీత్యా రాబోయే 2019 ఎన్నికల్లో పోటీ చేయలేనని యథాలాపంగా అన్నట్లు అన్నారు. ఆ మాట ప్రజల దృష్టిని ఆకర్షించింది. రాజకీయాల నుంచి రిటైర్ అవుతారా? అన్ని పార్టీల్లోనూ సందేహం. ‘ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాజకీయాల నుంచి రిటైర్ అయినట్లేనా? రాజ్యసభ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యి ప్రధానమంత్రి కావచ్చు కదా, ఇందిరాగాంధీలాగా’ అని సీనియర్ జర్నలిస్టు బర్ఖాదత్ ఆశాజనకమైన సందేహాన్ని వ్యక్తం చేశారు. అదే నిజం కావాలని కోరుకునే వాళ్లు దేశంలో చాలామంది ఉన్నారు. తొలి మహిళ రికార్డులు ► ఢిల్లీ ముఖ్యమంత్రి ► భారత పార్లమెంట్లో ప్రతిపక్ష నేత ► జాతీయ పార్టీకి అధికార ప్రతినిధి ► అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు ► హరియాణా క్యాబినెట్ మంత్రి ► హరియాణా జనతాపార్టీ అధ్యక్షురాలు బర్ఖాదత్, సీనియర్ జర్నలిస్టు కూతురు బాన్సూరి కౌశల్‌తో సోనూను తల్లిదండ్రులకు అప్పగిస్తూ.. భర్త స్వరాజ్ కౌశల్‌తో (పెళ్లి ఫొటో) సుష్మలాగ అభినయిస్తున్న చిన్నారి (ఫ్యాన్సీ డ్రస్ పోటీ) – వాకా మంజులారెడ్డి -
భారత్ జోక్యం సహించబోం: చైనా
సాక్షి, న్యూఢిల్లీ : చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా ఓ బస్ సర్వీస్ త్వరలో మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ బస్ సర్వీస్‌పై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సీపీఈసీ ప్రాజెక్టును ఆది నుంచి వ్యతిరేకిస్తున్న భారత్ ఈ బస్ సర్వీస్ తమ సార్వభౌమాధికారాన్ని, దేశ సమగ్రతను ప్రశ్నించేదిగా ఉందని భారత్ ఇప్పటికే నిరసన తెలిపింది. పీఓకేను ఎప్పటికీ తమ భూభాగాంగానే పరిగణిస్తామని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేసింది. భారత్ అభ్యంతరాలను తోసిపుచ్చుతున్నామని చైనా, పాకిస్తాన్‌లు వెల్లడించాయి. (చైనా పాక్ ఒప్పందం.. భారత్ మండిపాటు) పాకిస్తాన్‌కు చెందిన ఓ వార్తా పత్రిక కథనం ప్రకారం.. చైనా-పాక్‌ల మధ్య బస్ సర్వీస్‌పై భారత్ అనవసర రాద్ధాంతం చేస్తోందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. అంతర్జాతీయంగా భారత్ తప్పుడు సంకేతాలు పంపుతోందని మండిపడింది. భారత్ లేవనెత్తిన అభ్యంతరాలను తిరస్కరిస్తున్నామని వెల్లడించింది. అభ్యంతరాలు తెలపడం ద్వారా కశ్మీర్ మాదే అనే ధోరణితో భారత్ వ్యవహరిస్తోందని ఒక ప్రకటన విడుదల చేసింది. గగ్గోలు పెట్టినంత మాత్రన వివాదం సమసిపోదనీ, ఐక్యరాజ్య సమితి ఆద్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం సరైన పరిష్కారం దొరుకుతుందని పేర్కొంది. ఇదిలాఉండగా.. భారత్ అభ్యంతరాలపై చైనా కూడా స్పందించింది. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ప్రాజెక్టులో మరే దేశం జోక్యం సహించబోమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లు-కాంగ్ స్పష్టం చేశారు. ఇండియా అభ్యంతరం తెలిపినంత మాత్రాన కశ్మీర్ అంశంపై చైనా విధానం మారబోదని తెలిపింది. ఈ మేరకు పాక్ పత్రిక ప్రచురించింది. కాగా, పాకిస్తాన్‌లోని లాహోర్.. చైనాలోని కాష్గార్‌ల మద్య ఈ బస్ సర్వీస్ నవంబర్ 13న ప్రారంభం కానుందని సమాచారం. -
చైనా పాక్ ఒప్పందం.. భారత్ మండిపాటు
సాక్షి, న్యూఢిల్లీ : చైనా, పాకిస్తాన్ చర్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)లో భాగంగా నిర్మించిన బస్ సర్వీస్‌ను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్లనున్న ఈ బస్ సర్వీస్ భారత సార్వభౌమాధికారాన్ని, దేశ సమగ్రతను ప్రశ్నించేదిగా ఉందని అన్నారు. (పాకిస్తాన్లో మోదీ మంత్ర) చైనా-పాకిస్తాన్ మధ్య రూపుదిద్దుకున్న ‘సరిహద్దు ఒప్పందం 1963’ అక్రమమైనది, కాలం చెల్లినది’ అని రవీష్ పేర్కొన్నారు. విలువలేని ఈ ఒప్పందాన్ని భారత్ ఎన్నడూ ఆమోదించబోదనీ, ఈ బస్ సర్వీస్ ముమ్మాటికీ ఉల్లంఘనలతో కూడుకున్నదేనని ఉద్ఘాటించారు. దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది తెలిపారు. కాగా, పాకిస్తాన్‌లోని లాహోర్.. చైనాలోని కాష్గార్‌ల మద్య ఈ బస్ సర్వీస్ నవంబర్ 13న ప్రారంభం కానుందని సమాచారం. 50 బిలియన్ డాలర్లతో 2015లో మొదలైన సీపీఈసీలో భాగంగా పాకిస్తాన్, చైనాల మధ్య విరివిగా రోడ్డు రైల్వే మార్గాలు నిర్మించనున్నారు. (క్రిస్టియన్ మహిళ కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు) -
అన్నీ అబద్ధాలు.. నిరాధారాలు
న్యూఢిల్లీ: జర్నలిస్ట్‌గా ఉన్న సమయంలో సహచర మహిళా పాత్రికేయులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ స్పందించారు. వారు తనపై చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని, అర్థరహితాలని, అవి తనను అమితంగా బాధించాయని ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో అధికారిక పర్యటనలో ఉన్నందువల్లనే ఇప్పటివరకు దీనిపై స్పందించలేదన్నారు. ఆఫ్రికా దేశాల పర్యటన నుంచి తిరిగొచ్చిన కాసేపటికే ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిరాధార ఆరోపణల కారణంగా తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు. తనపై అసత్య ఆరోపణలు చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నానని వెల్లడించారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగబోతున్న కారణంగా, తన ప్రతిష్ట దెబ్బతీసేందుకే ఇలాంటివన్నీ తెరపైకి వస్తున్నాయన్నారు. ’ఎన్నికలు కొన్ని నెలలు మాత్రమే ఉన్న సమయంలో ఈ తుపాను ఎందుకు వచ్చింది?’ అని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఇప్పుడు వైరల్ జ్వరంగా మారిందని అక్బర్ వ్యాఖ్యానించారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా హాలీవుడ్లో ప్రారంభమైన ‘మీ టూ’ ఉద్యమం భారత్‌లోనూ ఉవ్వెత్తున సాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎంజే అక్బర్ జర్నలిస్ట్‌గా ఉన్న సమయంలో వివిధ సమయాల్లో ఆయనతో పాటు జర్నలిస్ట్‌గా పనిచేసిన 11 మంది మహిళలు ఇటీవల ముందుకువచ్చి.. తమపై అక్బర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. వారిలో ప్రియా రమణి, గజాలా వాహెబ్, షుమ రాహ, అంజు భారతి, శుతుపా పాల్ల ఆరోపణలపై అక్బర్ స్పందించారు. ‘ప్రియా రమణి ఏడాది క్రితం ఓ మ్యాగజీన్లో రాసిన ఓ కథనం ద్వారా ఈ దుష్ప్రచారాన్ని ప్రారంభించారు. అందులో నా పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే అది అసత్య కథనమని ఆమెకూ తెలుసు. ఇటీవల ఈ విషయమై అడిగిన ప్రశ్నకు ఆమె.. ఆయన ఏమీ చేయలేదు కాబట్టే, పేరు ప్రస్తావించలేదని సమాధానమిచ్చారు. నేను తనపై చేయి ఎప్పుడూ వేయలేదని శుతుపా పాల్ చెబ్తున్నారు. నిజానికి నేనేం చేయలేదని షుమ అంటున్నారు. స్విమింగ్ పూల్‌లో పార్టీ చేసుకున్నామని అంజు భారతి ఆరోపించారు. కానీ నాకు ఈతే రాదు. రమణి, వాహెబ్‌లు వారు పేర్కొన్న లైంగిక వేధింపుల ఘటన తరువాత కూడా నాతో కలిసి పనిచేశారు. దీన్ని బట్టి ఇవన్నీ అసత్యాలని తెలియడం లేదా?’ అని అక్బర్ వివరణ ఇచ్చారు. ప్రధాని స్పందించాలి: కాంగ్రెస్ మంత్రి ప్రకటనకు కొద్ది సేపటి ముందు కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ.. సహచర మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ‘ఈ విషయంలో ప్రధాని మోదీ స్పందించాలి. ప్రధాని ఎలాంటి వారనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఈ అంశం ప్రభుత్వ నైతికతకు సంబంధించిందే కాదు, ప్రధానికీ, ఆయన పదవీ గౌరవానికి సంబంధించింది కూడా’ అని అన్నారు. -
పాక్ ప్రధాని లేఖపై స్పందించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, భారత ప్రధానమంత్రి నరేంద మోదీకి రాసిన లేఖపై భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం జరగాలన్న పాక్ ప్రధాని లేఖ నేపథ్యంలో సమావేశానికి సిద్ధమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ ప్రధాని నుంచి వచ్చిన శాంతి చర్చల ప్రతిపాదనను ధృవీకరించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రావీష్ కుమార్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరుకు నాటికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్జీఏ) న్యూయార్క్‌లో భారత, పాకిస్థాన్ విదేశాంగ మంత్రులు సమావేశం కానున్నారని తెలిపారు. ఇది కేవలం సమావేశం మాత్రమే.. చర్చల ప్రక్రియ మొదలుపెట్టినట్లు కాదని రావీష్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏం చర్చించాలనేది ఇంకా నిర్ణయించ లేదని చెప్పారు. అయితే పరస్పర అనుకూలమైన తేదీ , సమయములో ఈ సమావేశం జరుగుతుందని వివరించారు. గత నెలలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మొదటి అధికారిక ప్రతిపాదన కావడం విశేషం. రెండు దేశాలు అంగీకరిస్తే యూఎన్ సమావేశంతో పాటు విదేశాంగ మంత్రుల సమావేశాన్ని కోరారు. ఈ నెలలో జరగనున్న ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వీరిద్దరూ భేటీ కావాలని ఆయన ఆకాంక్షించారు, తీవ్రవాదం, రెండు దేశాల మధ్య శాంతి తదితర అంశాలపై చర్చించేందుకు పాకిస్తాన్ సిద్ధమని పాక్ ప్రధాని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా భారత్, పాక్ మధ్య నిర్మాణాత్మక సంబంధాల కోసం భారత్ ఎదురు చూస్తోందని ప్రధాని మోదీ ఆగస్ట్ 20న లేఖ రాసిన సంగతి తెలిసిందే. భారత్ పొరుగు దేశంతో శాంతియుత సంబంధాలకు కట్టుబడి ఉందని మోదీ అందులో ప్రస్తావించారు. -
మోదీకి లేఖ రాసిన పాక్ ప్రధాని : కీలాంకాశాల ప్రస్తావన
న్యూఢిల్లీ : ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి తేదీ ఖరారు చేయండంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, నరేంద్ర మోదీని కోరారు. పాక్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మోదీ ఇమ్రాన్ ఖాన్‌కు అభినందనలు తెలుపుతూ ఉత్తరం రాశారు. అందుకు బదులుగా ఇమ్రాన్ మోదీకి లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ.. త్వరలోనే ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా ఇమ్రాన్ ఖాన్, మోదీని కోరారు. అంతేకాక రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలని శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించాలన్నారు. త్వరలోనే సార్క్ సదస్సును పాకిస్తాన్లో నిర్వహించేలా చూడలాని.. ఇందుకు భారత దేశం తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఇమ్రాన్, అభ్యర్ధించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 20వ సార్క్ సదస్సు శ్రీలంకలో జరగనుంది. 2016లో సార్క్ సదస్సు పాకిస్తాన్ ఇస్లామాబాద్‌లో జరగాల్సి ఉంది. జమ్ముకశ్మీర్ యురి సెక్టార్ లోని ఆర్మీ స్థావరంపై టెర్రిరిస్ట్ ల దాడి భారత్ తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, ఆప్ఘనిస్తాన్, శ్రీలంక దేశాలు సార్క్ సదస్సుకు హాజరుకాలేమని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే పాక్‌లో సార్క్ సదస్సు పాక్‌లో నిర్వహించడానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఇమ్రాన్ కోరారు. ప్రస్తుతం భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లి (యుఎన్‌జిఎ) సమావేశాలకు హాజరయ్యేందుకు గాను న్యూయార్క్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సుష్మ స్వరాజ్ సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల అనధికార సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా హాజరవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం గురించి చర్చించే అవకాశాలున్నట్లు తెలిసింది. అన్ని అనుకూలిస్తే ఈ సమావేశం సార్క్ సదస్సుకు ఒక రోజు ముందు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
ఇక మూడు రోజుల్లోనే లిస్టింగ్
ముంబై: మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ మంగళవారం జరిగిన బోర్డ్ సమావేశంలో పలు ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు సంబంధించిన సవరించిన కొత్త కేవైసీ (నో యువర్ కస్టమర్)నిబంధనలకు ఆమోదం తెలిపామని, త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి వెల్లడించారు. ఐపీఓకు వచ్చిన కంపెనీలు స్టాక మార్కెట్లో లిస్టయ్యే సమయాన్ని తగ్గించామని, అలాగే మ్యూచువల్ ఫండ్ చార్జీలను కూడా తగ్గించామని వివరించారు. మ్యూచువల్ ఫండ్స్ మొత్తం వ్యయాలు 2.25 శాతానికి మించకుండా పరిమితిని విధించామని. ఫలితంగా ఇన్వెస్టర్లకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వ్యక్తుల ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్‌ను విశ్లేషించే అధికారాలు సెబీకి ఇవ్వాలని త్వరలో ప్రభుత్వాన్ని కోరనున్నామని తెలిపారు. సెబీ ఆమోదం తెలిపిన కొన్ని ముఖ్య నిర్ణయాలు. ♦ ఐపీఓ ముగిసిన తర్వాత ఆరు రోజులకు కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యేవి. ఇప్పడు ఈ సమయాన్ని మూడు రోజులకు కుదింపు ♦ ఐపీఓలలో షేర్లు కొనుగోలు చేసే రిటైల్ ఇన్వెస్టర్ల కోసం యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) పేరుతో ప్రత్యామ్నాయ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది. ♦ కొన్ని షరతులకు లోబడి కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లకు అనుమతి. ♦ దేశీయ మార్కెట్లలో ట్రేడింగ్ చేయడానికి నమోదు చేసుకోవడానికి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఒకటే దరఖాస్తు సమర్పిస్తే చాలు. ♦ కావాలని రుణాలు ఎగవేసిన వాళ్లు, ఆర్థిక నేరగాళ్లు సెటిల్మెంట్ ప్రక్రియలో పాల్గొనలేరు. ♦ ఆర్థిక నేరగాళ్లు ఓపెన్ ఆఫర్లను ప్రకటించలేరు. ♦ స్టాక్ మార్కెట్లో లిస్టైన దిగ్గజ కంపెనీలు తమ దీర్ఘకాలిక రుణావసరాల్లో కనీసం 25 శాతం వరకూ కార్పొరేట్ బాండ్ల ద్వారానే సమీకరించాలి. ♦ లిస్టైన కంపెనీల్లో మహిళలపై లైంగిక వేధింపుల ఫిర్యాదులను ఆయా కంపెనీలు సవివరంగా ఒక జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. కొచర్ సమస్య పరిష్కారంపై చర్చ... ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందాకొచర్ భర్తకు సంబంధించిన వ్యాపార లాదేవీల విషయమై తమ షోకాజు నోటీసుకు బ్యాంకు స్పందించిందని సెబీ చీఫ్ తెలిపారు. అంగీకారం ద్వారా ఈ అంశాన్ని పరిష్కరించుకునేందుకు బ్యాంకు అనుమతి కోరిం దన్నారు. కొచర్ భర్త దీపక్ కొచర్ వీడియోకాన్ గ్రూపుతో కొన్నేళ్లుగా ఎన్నో వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్నట్టు సెబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ప్రయోజన వివాదం కింద లిస్టింగ్ నిబం ధనలు పాటించకపోవడంపై సెబీ షోకాజు నోటీసు జారీ చేసింది. తమ వైపు నుంచి నియంత్రణపరమైన వైఫల్యం ఏదీ లేదని ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు చందా కొచర్ షోకాజు నోటీసులకు బదులిచ్చారు. ట్రేడింగ్ వేళల పెంపుపై అనిశ్చితి... స్టాక్ ఎక్సే్చంజ్‌ల ట్రేడింగ్ వేళల పెంపు సాకా రం కావడానికి మరికొంత కాలం పట్టేట్లు ఉంది. ట్రేడింగ్ వేళల పెంపు విషయమై స్టాక్ ఎక్సే్చంజ్‌లు ఎలాంటి సమగ్రమైన ప్రణాళికతో ముందుకు రాకపోవడంతో ఈ పెంపు మరికొంత కాలం వాయిదా పడే అవకాశాలున్నాయి. షెడ్యూల్ప్రకారమైతే, వచ్చే నెల ఒకటి నుంచి ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్‌ను రాత్రి 11.55 వరకూ కొనసాగించాలని సెబీ ఆలోచన. -
ఎఫ్‌పీఐల కేవైసీ నిబంధనల్లో మార్పులు!
న్యూఢిల్లీ: కొత్త కేవైసీ నిబంధనలకు సంబంధించి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు)ఊరటనిచ్చే నిర్ణయాన్ని మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ శనివారం తీసుకుంది. ఈ కొత్త కేవైసీ నిబంధనలపై ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ హెచ్. ఆర్. ఖాన్ అధ్యక్షతన గల అత్యున్నత స్థాయి సంఘం పలు వివాదాస్పద విషయాలపై చాలా మార్పులను సూచించింది. ఈ సిఫార్సుల ప్రకారం ఎన్నారైలు, ఓసీఐలు (ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా), ఆర్ఐలు (రెసిడెంట్ ఇండియన్స్) విదేశీ ఫండ్స్‌లో 50 శాతం లోపువాటాను కలిగివుండవచ్చు. ఆ ఫండ్స్‌ను నిర్వహిస్తున్న ఆయా ఇన్వెస్టర్లపై ఎటువంటి నియంత్రణలూ వుండవు. అలాగే ఆయా ఇన్వెస్టర్ల కెవైసీకి అదనపు డాక్యుమెంట్లను సమర్పించనక్కర్లేదని సూచించింది. కొత్త మార్గదర్శకాలకు తుది రూపు ఇచ్చే ముందు ఈ మార్పులపై ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని సెబీ నిర్ణయించింది. ఈ నెల 17 వరకూ హెచ్.ఆర్. ఖాన్ కమిటీ నివేదికపై ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని సెబీ పేర్కొంది. నివాస భారతీయులు, ప్రవాసభారతీయులు...విదేశీ ఫండ్స్ ద్వారా నిధుల్ని దేశీయ మార్కెట్లోకి తరలిస్తున్నారన్న కారణంగా కొత్తగా కైవైసీ నిబంధనల్ని గతంలో సెబి జారీచేసింది. సెబీ కేవైసీ నిబంధనల కారణంగా 7,500 కోట్ల డాలర్ల విదేశీ నిధులు తరలిపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
వియత్నాంలో పర్యటిస్తున్న విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్
-
విదేశీ నేతల్ని పిలవట్లేదు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీసహా విదేశీ నేతలెవరినీ ఆహ్వానించడం లేదని పాక్ విదేశాంగశాఖ తెలిపింది. పాక్ ప్రధానిగా తన ప్రమాణ స్వీకారం నిరాడంబరంగా సాగాలని ఇమ్రాన్ కోరుకుంటున్నట్లు వెల్లడించింది. 11న అధ్యక్ష భవనంలో ఇమ్రాన్ చేత అధ్యక్షుడు మమ్నూన్ ప్రమాణం చేయిస్తారు. ఈ వేడుకకు రావాల్సిందిగా ఇమ్రాన్ స్నేహితులైన కొంతమంది విదేశీయులకే ఆహ్వానాలు పంపారు. జూలై 25న జరిగిన పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పీటీఐ 116 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్రం అనుమతిస్తే ఇమ్రాన్ ప్రమాణస్వీకారానికి తాను హాజరవుతానని పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడితే వచ్చే ఏడాది పాక్‌లోని నన్‌కనా సాహిబ్‌లో జరిగే గురునానక్ 550వ జయంతి ఉత్సవాలకు హాజరవ్వాలన్న తన కల నెరవేరుతుందన్నారు. -
ప్రమాణానికి మోదీని ఆహ్వానించొచ్చా?
ఇస్లామాబాద్ : పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీని ఆహ్వానించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పాకిస్తాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ వర్గాలు పాక్ విదేశాంగ శాఖను కోరినట్లు ఓ స్థానిక చానెల్ బుధవారం కథనాన్ని ప్రసారం చేసింది. మోదీని తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని ఇమ్రాన్ కోరుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయమై పీటీఐ సీనియర్ నేతలు పాక్ విదేశాంగ కార్యదర్శి తెహ్మినా జన్జువాతో మాట్లాడారు. ప్రధాని మోదీ, చైనా అధినేత జిన్‌పింగ్, టర్కీ అధ్యక్షుడు ఎర్డొగన్, సార్క్ దేశాధినేతల్ని ఆహ్వానించాలని ఇమ్రాన్ యోచిస్తున్నట్లు ఛానెల్ తెలిపింది. ఇమ్రాన్ ప్రమాణస్వీకార ఆహ్వానాన్ని మోదీ తిరస్కరిస్తే అంతర్జాతీయంగా పాక్ తలెత్తుకోలేదని విదేశాంగ అధికారులు ఆందోళన చెందుతున్నట్లు వెల్లడించింది. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌లకు ఆహ్వానాలు పంపినట్లు పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్ చౌధురి తెలిపారు. కాగా ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి మంత్రుల నివాస సముదాయంలోని మరో ఇంట్లో దిగేందుకు ఇమ్రాన్ అంగీకరించారు. ఇప్పుడున్న ఇంట్లో ఇమ్రాన్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పించలేమని అధికారులు చెప్పిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పాక్ ప్రధాని నివాసాన్ని తాను ఉపయోగించబోనని గతంలో ఇమ్రాన్ చెప్పారు. -
15 రోజుల్లో పెళ్లి.. పాస్‌పోర్టు పోయింది!
విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ట్విటర్ వేదికగా సాయం కోరితే ఆమె వెంటనే స్పందిస్తారు. తాజాగా రవితేజ అనే వ్యక్తికి కూడా ఆమె సాయం చేశారు. ‘వాషింగ్టన్లో పాస్‌పోర్టు పోగొట్టుకున్నాను... వచ్చే నెల(ఆగస్టు) 13- 15 మధ్య నా వివాహ తేదీని ఖరారు చేశారు. అందువల్ల ఆగస్టు 10న బయల్దేరాలి కాబట్టి తత్కాల్లో పాస్‌పోర్టు జారీ చేయాలని’ అతడు ట్విటర్ వేదికగా సుష్మాను సాయం కోరాడు. రవితేజ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సుష్మా స్వరాజ్ సానుకూలంగా స్పందించారు. ‘రవితేజ.. మీరు చాలా రాంగ్ టైమ్‌లో పాస్‌పోర్డు పోగొట్టుకున్నారు. అయినప్పటికీ మీ పెళ్లి సమయానికి మండపానికి చేరేలా మేము సాయం చేస్తామని’ ట్వీట్ చేసిన సుష్మా.. మానవతా దృక్పథంతో అతడికి సాయం అందించాలంటూ అమెరికాలోని ఇండియన్ ఎంబసీని కోరారు. ఆమె ట్వీట్‌కు స్పందించిన నెటిజన్లు మాత్రం.. ‘మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు హ్యాట్సాప్ మేడమ్.. మీరు మా విదేశాంగ శాఖ మంత్రిగా ఉండటం మా అదృష్టం’ అంటూ ప్రశసంలు కురిపిస్తున్నారు. Devatha Ravi Teja - You have lost your Passport at a very wrong time. However, we will help you reach for your wedding in time. Navtej - Let us help him on humanitarian grounds. @IndianEmbassyUS https://t.co/wxaydeqCOX — Sushma Swaraj (@SushmaSwaraj) 30 July 2018 -
చోక్సీకి షాక్ : ప్రభుత్వానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడు, గీతాంజలి సంస్థల అధిపతి మెహుల్ చోక్సికి దిమ్మతిరిగే వార్త ఇది. వ్యాపార విస్తరణకోసం ఆంటిగ్వా పౌరసత్వాన్ని తీసుకున్నానని ప్రకటించిన చోక్సీకి షాకిచ్చేలా అక్కడి ప్రభుత్వం స్పందించింది. తమదేశ పౌరసత్వం దుర్వినియోగానికి తాము అనుమతించమని స్పష్టం చేసింది. ద్రోహులకు తమ నేలపై దాక్కునేందుకు అవకాశం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆంటిగ్వా , బార్బుడా విదేశాంగ మంత్రి ఇ. పాల్ చెట్ గ్రీన్ ఒక ప్రకటన విడుదల చేశారు. అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంలో నిందితుడుగా ఉన్న డైమండ్ వ్యాపారి చోక్సీకి చెక్ పెట్టే క్రమంలో కేంద్రానికి ఊరట కల్గించేలా ఆంటిగ్వా ప్రభుత్వం స్పందించింది. చోక్సీకి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యర్థన తమకు చేరలేదని తెలిపింది. చోక్సీ పౌరసత్వం రద్దు, లేదా అరెస్టు కోసం న్యూఢిల్లీ నుండి అధికారికంగా తమను ఎవరూ సంప్రదించలేదని చెప్పింది. భారతదేశ వ్యాపారవేత్త చోక్సిని బహిష్కరించాలని భావించి, అటువంటి అభ్యర్ధనను గౌరవిస్తామని స్పష్టం చేసింది. ఆర్థిక నేరగాళ్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందనీ, వారికి ఆంటిగ్వా స్వర్గంగా మారిందన్న విమర్శను విదేశాంగ మంత్రి తోసిపుచ్చారు. ఆటింగ్వా ప్రభుత్వ సానుకూల స్పందనపై కేంద్రం ఎలాంటి చర్యల్ని చేపట్టనుందో చూడాలి. భారతదేశంతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నట్టు గ్రీన్ చెప్పారు. ఇరు దేశాల సంబంధాలకు హాని కలిగించే చర్యల్ని చేపట్టబోమని వెల్లడించారు. మరోవైపు చోక్సీ ఆటింగ్వాకు తలదాచుకున్న వైనం అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచింది. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఆటింగ్వా ప్రధాని మౌనంపై విమర్శలు గుప్పించాయి. దీనిపై విచారణ జరిపించాల్సిందిగా నాయకులు డిమాండ్ చేశారు. -
నీరవ్‌పై మౌనం వీడిన విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడి, విదేశాలకు పారిపోయిన డైమండ్ కింగ్ నీరవ్ మోదీ ఆరు పాస్‌పోర్టులు కలిగి ఉన్నారని వస్తున్న వార్తలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు స్పందించింది. ఒక్క వాలిడ్ పాస్‌పోర్టు మించి అతని దగ్గర ఇంకేమీ లేవవి విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మోదీ ఆరు పాస్‌పోర్టులు కలిగి ఉన్నారని వస్తున్న రిపోర్టులను కొట్టిపారేసిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావీశ్ కుమార్, ఊహాగానాలకు చెక్ పెట్టాలని సూచించారు. ప్రతీసారి ముందస్తు పాస్‌పోర్టును పూర్తిగా రద్దు చేసిన అనంతరమే, మోదీకి కొత్త పాస్‌పోర్టును జారీ చేసేవారమని తెలిపారు. ఇతర దేశాల పాస్‌పోర్టులతో నీరవ్ మోదీ గతవారం బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం దేశాలను సందర్శించినట్లు రిపోర్టులు వచ్చిన సంగతి తెలిసిందే. నీరవ్‌ను పట్టుకునేందుకు సహకరించాలని పలు యూరోపియన్ దేశాలకు లేఖలు రాసినట్లు తెలిపారు. పాస్పోర్టుతో పాటు మూడు ముఖ్యమైన విషయాలపై కూడా ఆయన స్పష్టతనిచ్చారు. ఫిబ్రవరిలోనే మోదీ పాస్‌పోర్టును రద్దు చేయాలని ఆల్ఇండియా మిషన్లకు ఆదేశించామని, ఇదే విషయాన్ని సంబంధిత దేశాలకు భారత రాయబారులు తెలిపారని చెప్పారు. రెండోది.. నీరవ్ మోదీని పట్టుకునేందుకు సహకరించాలని ఎంపిక చేసిన దేశాలకు తాజాగా లేఖలు రాసినట్టు తెలిపారు. వారి భూభాగంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని సూచించినట్టు పేర్కొన్నారు. ఒకవేళ వారి దేశంలో ఉన్నట్టు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరినట్టు కూడా చెప్పారు. ఇక మూడోది... ఏజెన్సీల నుంచి నీరవ్ మోదీని అప్పగించాలని ఎలాంటి అభ్యర్థన రాలేదని తెలిపారు. నీరవ్ అప్పగింత ప్రక్రియను చేపట్టాలని ముంబై కోర్టు ఈ వారంలో ఈడీకి అనుమతి జారీచేసింది. కానీ ఇప్పటి వరకు ఈడీ, విదేశాంగ శాఖను సంప్రదించలేదు. నీరవ్ ఎక్కడున్నారనే కచ్చితమైన ప్రదేశం తెలియకుండా.. మంత్రిత్వ శాఖ కూడా ఏం చేయలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనంతవరకు విదేశాల్లో నీరవ్ మోదీని అరెస్ట్ చేయడం సాధ్యం కాదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
ఆ జంట తప్పు చేసిందా?
లక్నో: తీవ్ర దుమారం రేపిన మతాంతర జంట పాస్‌పోర్ట్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. అధికారుల విచారణలో ఆ జంట తప్పుడు డిక్లరేషన్‌ను సమర్పించినట్లు తేలింది. ఈ మేరకు నిఘా వర్గాలు దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూడగా, ఒక్క పేజీతో కూడిన నివేదిక లక్నో పోలీసులకు చేరింది. మంగళవారం సాయంత్రం ఆ నివేదికను ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి అందజేసినట్లు అధికారులు చేశారు. దీంతో ఆ జంటపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొహమ్మద్ అనాస్ సిద్దిఖీ-తన్వీ సేథ్ దంపతులు పాస్‌పోర్ట్‌ల కోసం లక్నోలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని సంప్రదించటం, అక్కడి అధికారి వికాస్ మిశ్రా మతపరమైన వ్యాఖ్యలు చేసి దురుసుగా ప్రవర్తించినట్లు సదరు జంట ఆరోపించారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. దీంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని వికాస్‌ను గోరఖ్‌పూర్ బదిలీ చేయటం, ఆ మరుసటి రోజే ఆ జంటకు పాస్‌పోర్టులు ఇప్పించటం జరిగిపోయాయి. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపింది. సుష్మా స్వరాజ్‌పై వ్యక్తిగత దూషణలు కూడా మొదలయ్యాయి. అటుపై పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో భాగంగా ఇంటెలిజెన్స్ వర్గాలు వారిచ్చిన డిక్లరేషన్ తప్పుల తడకగా తేల్చింది. నివేదికలో ఏముందంటే... ‘వివాహ సర్టిఫికేట్లో తన్వీ పేరు సాదియా అనస్‌గా పొందుపరచబడి ఉంది. ఆమె నోయిడాలోని బీటీ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పని చేస్తున్నారు. నోయిడా సెక్షన్ 76, జేఎం అర్చిట్ అపార్ట్మెంట్, బీ604లో ఆమె అద్దెకు నివసిస్తున్నారు. పాస్‌పోర్టు దరఖాస్తులో ఆమె ఆ అడ్రస్ పేర్కొనలేదు. పైగా ఆమె లక్నోలో నివసిస్తున్నట్లు అసలు అడ్రసే సమర్పించలేదు. ఏడాది నుంచి ఆమె నోయిడాలోనే ఉంటున్నారు’ అని నివేదిక పేర్కొంది. దీంతో వాళ్ల పాస్‌పోర్టులను రద్దు చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వారికి రూ. 5 వేలు జరిమానా విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. -
పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో తెలంగాణ నంబర్‌వన్
సాక్షి, న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ సేవల్లో రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పాస్‌పోర్ట్ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో విశిష్ట సేవలు అందించిన రాష్ట్రాలకు కేంద్ర విదేశాంగ శాఖ ర్యాంకులు ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ మొదటి ర్యాంకు సాధించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చేతుల మీదుగా డీజీపీ మహేందర్‌రెడ్డి అవార్డు అందుకున్నారు. అనంతరం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో సాంకేతికత ద్వారా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి పారదర్శకతతో వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. వెరిఫికేషన్‌లో యూజర్ ఫ్రెండ్లీ యాప్‌ను ప్రవేశపెట్టామని, 4 రోజుల్లో ప్రక్రియ పూర్తయి ఎప్పటికప్పుడు దరఖాస్తుదారులకు వివరాలు తెలియజేస్తున్నామన్నారు. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత థర్డ్ పార్టీ ద్వారా వెరిఫికేషన్ సేవల్లో పౌరుల ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకొని సంబంధిత అధికారులకు రేటింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియకు 9 రోజుల గడువు తీసుకుంటుండగా, రాష్ట్రంలో 4 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వెరిఫికేషన్‌లో విశిష్ట సేవలకు గుర్తింపుగా గత మూడేళ్లుగా మొదటి స్థానంలో నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. దీనికి సహకరించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. వెరిఫికేషన్ కోసం రాష్ట్ర పోలీసులు ప్రవేశపెట్టిన వెరీఫాస్ట్ యాప్‌తో పాస్‌పోర్ట్ దరఖాస్తును అనుసంధానం పై టీసీఎస్ సంస్థతో కలసి పనిచేస్తున్నట్లు తెలిపారు. -
పెట్టుబడుల్లో ‘స్వదేశీ’ బలం!
న్యూఢిల్లీ: భారత స్టాక్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు నానాటికీ తగ్గిపోతుండగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల (డీఐఐ) పెట్టుబడులు మాత్రం జోరుగా పెరుగుతున్నాయి. గత ఏడాది మొదటి ఆరు నెలల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 800 కోట్ల డాలర్లుగా ఉన్నాయని మార్నింగ్‌స్టార్ ఇండియా సంస్థ తెలిపింది. అయితే ప్రస్తుత ఏడాది ఇదే కాలానికి వీరి పెట్టుబడులు కేవలం 1.5 కోట్ల డాలర్లుగా మాత్రమే ఉన్నాయని పేర్కొంది. గత ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 330 కోట్ల డాలర్లు మాత్రమేనని, ఈ ఏడాది ఇదే కాలానికి వీరి పెట్టుబడులు 790 కోట్ల డాలర్లకు పెరిగాయని, అంటే దాదాపు రెట్టింపునకు పైగా పెరిగాయని పేర్కొంది. విదేశీ, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులపై మార్నింగ్‌స్టార్ ఇండియా సంస్థ రూపొందించిన తాజా నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే... నివేదికలోని అంశాలు ♦ విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది జనవరిలో 200 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ఫిబ్రవరిలో మాత్రం 180 కోట్ల డాలర్లను వెనక్కి తీసుకున్నారు. మార్చిలో మళ్లీ 180 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారు. మార్చి, ఏప్రిల్‌లో 230 కోట్ల డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ♦విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలు కొనసాగిస్తుండగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు జోరు మాత్రం కొనసాగుతోంది. ♦ విదేశీ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసే మార్కెట్లలో భారత్ కూడా ఒకటి. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు మాత్రం ఇన్వెస్ట్ చేయడానికి ఇది ఒక్కటే మార్కెట్. భారత్‌లో కంటే ఇతర దేశాల స్టాక్ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉన్నాయనుకుంటే, విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులను వెనక్కి తీసుకొని, వేరే దేశాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ వెసులుబాటు దేశీయ ఇన్వెస్టర్లకు ఉండదు. వాళ్లకు మన మార్కెట్ ఒక్కటే ఉంటుంది. ♦ ఇండియా ఫోకస్డ్ ఆఫ్‌షోర్ ఫండ్స్, ఈటీఎఫ్‌ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ బాగా జరిగింది. ఈ కేటగిరీలో జనవరిలో మాత్రం 120 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత నాలుగు నెలల్లో 200 కోట్ల నికర పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. గత నాలుగు నెలల్లో ఇండియా ఫోకస్డ్ ఆఫ్‌షోర్ ఫండ్స్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు 96.6 కోట్ల డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అలాగే ఇండియా ఫోకస్డ్ ఈటీఎఫ్‌ల నుంచి 94 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ♦ దీర్ఘకాలిక స్వభావం ఉన్న ఇండియా ఫోకస్డ్ ఆఫ్‌షోర్ ఫండ్స్ నుంచి భారీగా పెట్టుబడులు తరలిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. -
అంతర్జాతీయ మీడియా అత్యుత్సాహం
బీజింగ్: అంతర్జాతీయ మీడియా అత్యుత్సాహంపై చైనా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ తరలింపు వ్యవహారంలో వస్తున్న వార్తలను ఖండించింది. ఈ మేరకు గురువారం చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘నిరాధారమైన ఈ వార్తలు షాక్‌కు గురిచేశాయి. అంతర్జాతీయ ఉగ్రవాది, జమాతే ఉద్ దవా అధ్యక్షుడు హఫీజ్ సయీద్‌ను అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి పాక్ నుంచి పశ్చిమ ఆసియా దేశాలకు తరలించమని జిన్‌పింగ్ కోరినట్లు వార్తలు వచ్చాయి. అదంతా నిరాధారం. మేం ఎలాంటి సూచనలు చెయ్యలేదు’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ ఉగ్రవాది సయీద్‌పై చర్యలు తీసుకోవాలని అమెరికాతోపాటు భారత్ కూడా పాక్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సయీద్‌ను పశ్చిమ ఆసియా దేశాలకు పంపించాలని గత నెల బీజింగ్‌లోని బావో ఫోరమ్ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాక్ ప్రధాని అబ్బాసీతో సమావేశమైనపుడు కోరినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇరు దేశాధినేతలు దాదాపు అరగంట పాటు సయీద్ అంశం గురించి చర్చించినట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియాలు కథనాలు సైతం ప్రచురించాయి. ఈ నేపథ్యంలోనే డ్రాగన్ కంట్రీ ఖండన ప్రకటన విడుదల చేసింది. కాగా, హఫీజ్ సయీద్‌ను 2012లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా, అతడిపై 10 మిలియన్ల డాలర్ల రివార్డును ప్రకటించింది. -
అప్ఘనిస్తాన్‌లో ఏడుగురు భారతీయలు కిడ్నాప్
-
ఏడుగురు భారతీయ ఇంజనీర్ల కిడ్నాప్
కాబూల్: అప్ఘనిస్తాన్‌లో ఏడుగురు భారతీయ ఇంజనీర్లను గుర్తుతెలియని సాయుధులు కిడ్నాప్ చేశారు. ఒక అప్ఘన్ ఉద్యోగిని కూడా దుండగులు అపహరించారు. వీరంతా అప్ఘనిస్తాన్‌లోని కేఈసీ కంపెనీకి చెందిన ఉద్యోగులని తెలుస్తోంది. కంపెనీ పనిపై వీరంతా ఓ బస్సులో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కాగా, కిడ్నాప్ సమాచారంపై కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ సంప్రదిస్తోంది. భారత ఇంజినీర్లను విడిపించేందుకు చర్యలు ప్రారంభించినట్లు భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ ఇంతవరకూ ఏ సంస్థ ప్రకటించుకోలేదని చెప్పారు. కిడ్నాప్‌కు గురైన వారు ఎక్కడివారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉందనన్నారు. మరోవైపు తాలిబన్ ఉగ్రవాద సంస్థ ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
బ్యాంకు గ్యారంటీతో గల్ఫ్ రిక్రూటింగ్ ఎజెన్సీ లైసెన్సు
సాక్షి, హైదరాబాద్ : గల్ఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీ లైసెన్సు పొండం ఎలా అనే విషయంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు హైదరాబాద్ నాంపల్లిలోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పీఓఈ) కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెంట్లు, కొత్తగా లైసెన్సు పొందగోరే ఆశావహులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఢిల్లీ నుంచి వచ్చిన ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రంట్స్ ఎంసీ లూథర్, హైదరాబాద్‌లోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ మధుసూదన్‌రావులు పలువురి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. గల్ఫ్‌తో సహా 18 దేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే భారతీయులను భర్తీ చేయడానికి ఎమిగ్రేషన్ యాక్ట్–1983 ప్రకారం రిక్రూటింగ్ ఏజెన్సీ లైసెన్సు పొందడం తప్పనిసరి అని తెలిపారు. భారత దేశంలో 1200 పైచిలుకు రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీలు ఉండగా గ్రామీణ ప్రాంతాలలో తగినన్ని ఏజెన్సీలు లేవని, ఏజెన్సీ లైసెన్సు పొందడానికి రూ.50 లక్షలు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని సూచించారు. పెద్ద పెట్టుబడి పెట్టలేని వారి కోసం రూ.8 లక్షల బ్యాంకు గ్యారంటీతో చిన్న తరహా ఏజెన్సీలను స్థాపించవచ్చని వివరించారు. మరిన్ని వివరాల కోసం https://emigrate.gov.in/ext/ వెబ్ సైటును సందర్శించవచ్చు. -
పాక్ విదేశాంగ మంత్రిపై వేటు
-
పాక్ రాజకీయాల్లో మరో సంచలనం!
ఇస్లామాబాద్: అస్థిరతకు మారుపేరుగా ఉండే పాకిస్థాన్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాక్ ప్రభుత్వంలోని కీలక పాత్ర పోషిస్తున్న విదేశాంగమంత్రి ఖవాజా ఆసిఫ్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు అనర్హుడిగా తేల్చింది. ఖవాజాకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో వర్క్ పర్మిట్ ఉన్న కారణంగా పార్లమెంటు సభ్యుడిగా ఉండటానికి అనర్హుడని హైకోర్టు తేల్చింది. దీంతో ఆయన కేంద్రమంత్రి పదవి నుంచి, ఎంపీ పదవి నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాక్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి అయిన ఖవాజా విదేశాంగ బాధ్యతలను చూస్తున్నారు. కోర్టు ఆయనను అనర్హుడిగా తేల్చడం పాక్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే అవినీతి ఆరోపణల వల్ల పాక్ ప్రధాని పదవి నుంచి నవాజ్ షరీఫ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) పార్టీ షాహిద్ ఖకాన్ అబ్బాసీని ప్రధానిగా నియమించింది. ఈ నేపథ్యంలో తాజా కోర్టు ఉత్తర్వులు పీఎంఎల్‌కు మరో షాక్ నిచ్చాయని పాక్ మీడియా పేర్కొంటున్నది. -
డైమండ్ కింగ్ నీరవ్ మోదీ అక్కడే ఉన్నాడా?
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకుని భారీ కుంభకోణంలో ముంచెత్తిన డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. తొలుత అతను స్విట్జర్లాండ్‌కు పారిపోయినట్టు వార్తలు రాగ, తర్వాత న్యూయార్క్‌లో ఉన్నట్టు రిపోర్టు పేర్కొన్నాయి. అతను ఎక్కడ ఉన్నది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. కానీ ప్రస్తుతం అతను హాంకాంగ్‌లో ఉన్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు తెలిపింది. పీఎన్బీ కుంభకోణ కేసులో భాగంగా నీరవ్ మోదీని ప్రొవిజనల్ అరెస్ట్(తాత్కాలిక నిర్భందం) చేయాలని హాంకాంగ్ అథారిటీలను కోరినట్టు ప్రభుత్వం గురువారం పేర్కొంది. ‘హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్‌ను, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను నీరవ్ దీపక్ మోదీని అరెస్ట్ చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. 2018 మార్చి 23నే ఈ అభ్యర్థనను సమర్పించాం’ అని మంత్రిత్వ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ రాజ్యసభకు తెలిపారు. ఇప్పటికే మంత్రిత్వ శాఖ నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిల పాస్‌పోర్టులను రద్దు చేసినట్టు కూడా సింగ్ చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలకోట్ల రూపాయలను ముంచెత్తిన క్రమంలో రెండు నెలల క్రితం నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్తో, వీరి పాస్‌పోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మోసం వెలుగులోకి రాకముందే వీరు దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి దర్యాప్తు సంస్థలు వీరిని వెనక్కి రప్పించాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. -
చైనా రక్షణమంత్రిగా మిస్సైల్ ఎక్స్పర్ట్!
బీజింగ్: ప్రపంచంలో చైనాను మరింత శక్తిమంతంగా నిలిపేలా.. సమర్థవంతంగా, సేవా దృక్పథంతో పనిచేసేలా కొత్త మంత్రి వర్గాన్ని చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఏర్పాటుచేశారు. నలుగురు ఉప ప్రధానులతో పాటు 26 మంత్రిత్వ శాఖలు, కమిషన్లతో కూడిన కొత్త కేబినెట్‌కు చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. భారత్ సహా పలు సరిహద్దు దేశాలతో విభేదాల నేపథ్యంలో క్షిపణి రంగ నిపుణుడు లెఫ్టినెంట్ జనరల్ వై ఫెంఘేను రక్షణ శాఖ మంత్రిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాలో సైనిక ఆధునికీకరణ, పునర్వ్యవస్థీకరణకు ఆయన కృషి చేశారు. ఇక ఉప ప్రధాని ల్యూ హీ చైనా ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. ప్రపంచంలో అమెరికా తర్వాత అతి పెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాలో 30 ఏళ్ల అనంతరం 2016లో వృద్ధి రేటు మందగించింది. చెన్ వెన్కింగ్కు అంతర్గత భద్రత వ్యవహారాలు అప్పగించగా.. సంస్కరణ వాదిగా పేరొందిన యీ గ్యాంగ్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గవర్నర్‌గా నియమితులయ్యారు. 15 ఏళ్లుగా గవర్నర్‌గా ఉన్న ఝౌ స్థానంలో గ్యాంగ్‌కు ఈ అవకాశం దక్కింది. విదేశాంగ మంత్రికి స్టేట్ కౌన్సిలర్ పదవి చైనా అత్యున్నత దౌత్య పదవి అయిన స్టేట్ కౌన్సిలర్‌గా విదేశాంగ మంత్రి వాంగ్ యిను నియమించారు. భారత్‌తో సరిహద్దు వివాదంలో చైనా ప్రతినిధిగా చర్చలకు ఆయన నాయకత్వం వహించనున్నారు. చైనాలో విదేశాంగ మంత్రి కన్నా స్టేట్ కౌన్సిలర్ పదవి పెద్ద ర్యాంకు. ఇటీవల కాలంలో చైనాలో ఏకకాలంలో రెండు పదవులను నిర్వహిస్తున్న మొదటి వ్యక్తి వాంగ్ కావడం గమనార్హం. -
మంత్రి ముఖంపై సిరా పోసి నిరసన!
ఇస్లామాబాద్: పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతోన్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ముఖంపై స్థానికుడు ఒకరు సిరా పోశారు. పంజాబ్ ప్రావిన్సులో శనివారం రాత్రి జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహ్మద్ అసిఫ్ ముఖంపై ఓ వ్యక్తి సిరా చల్లాడు. రాజ్యాంగ చట్టాల పేరుతో మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ ముస్లింల మనోభావలను దెబ్బతీసేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని నిందితుడు ఆరోపించాడు. ఈ హఠాత్ పరిణామానికి స్పందించిన అక్కడి పోలీసులు వెంటనే అతణ్ని అరెస్టు చేశారు. సిరా పోసిన వ్యక్తిని ఫయాజ్ రసూల్‌గా గుర్తించారు. అతడికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని గుర్తించారు. నవాజ్ షరీఫ్‌పై చెప్పుతో దాడి పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గర్హీ సాహూలో శనివారం జరిగిన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన షరీఫ్‌పై ఓ యువకుడు షూతో దాడి చేశాడు. షరీఫ్ తన ప్రసంగం ప్రారంభించే కంటే ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. షూతో దాడి చేసిన యువకుడిని షరీఫ్ మద్దతుదారులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. -
పాకిస్తాన్ విదేశాంగమంత్రికి చేదు అనుభవం
-
‘కువైట్’పై జోక్యం చేసుకోండి
మోర్తాడ్ (బాల్కొండ): కువైట్ పరిణామాలపై కేంద్రం జోక్యం చేసుకొనిభారత కార్మికులకు ఊరట కల్పించాలని వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి, విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్, కువైట్‌లోని భారత రాయబార కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీ నేతలు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు లేఖలు రాశారు. కువైట్ లో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులు తమ సొం దేశాలకు వెళ్లిపోవడానికి అమలు చేసిన క్షమాభిక్ష ఆమ్నెస్టీకి ఈ నెల 22తో గడువు ముగిసిపోనుంది. సమయం తక్కువగా ఉండటంతో మన దేశ కార్మికులు సకాలంలో ఔట్‌పాస్ లను పొందక.. సొంతగడ్డకు చేరుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కేంద్రం చొరవ తీసుకుని కువైట్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి కార్మికులు సొంతూళ్లకు చేరు కునేలా చేయాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. ఇప్పటికే కువైట్‌లో తెలంగాణ కార్మికులకు సహకా రం అందించడానికి అక్కడికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ బృందం మన విదేశాంగ శాఖ ఉన్నతాధికారులను కలసి లేఖ అందించింది. కార్మికుల సంఖ్యకు సరిపడే విమాన సర్వీ సులు లేకపోవడం, విమానయాన చార్జీలు పెంచడం వల్ల కలిగిన అసౌకర్యాలపై అధికారులతో చర్చించారు. ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాశారు. కువైట్‌లో ఉన్న భారత సంతతి చిన్నారులు అక్కడ జనన ధ్రువీకరణ పత్రాలు లేని కారణంగా స్టేట్లెస్ చిల్డ్రన్‌గా పరిగణించబడి ఔట్‌పాస్‌లను పొందలేకపోతున్నారని తెలిపారు. చిన్నారులకు ఔట్‌పాస్‌లు లభించేలా కృషి చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. -
ఆ చిన్నారులకు జాతీయత చిక్కు!
మోర్తాడ్ (బాల్కొండ): కువైట్‌లోని భారత సంతతి చిన్నారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చిన్నారుల తల్లిదండ్రులు స్వదేశానికి వచ్చేందుకు కువైట్‌లోని రాయబార కార్యాలయం నుంచి ఔట్‌పాస్‌లు పొందినా ఆ చిన్నారులకు మాత్రం సాంకేతిక కారణాలు అడ్డొస్తున్నాయి. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఆస్పత్రులలో ప్రసవిస్తే ఆ ఖర్చు భరించే శక్తి లేక ఎంతో మంది కువైట్‌లో హోం డెలివరీకి ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు అదే చిన్నారులకు ఏ జాతీయత వర్తించకపోవడంతో వారిని స్టేట్లెస్ చిల్డ్రన్‌గా పరిగణిస్తున్నారు. దాదాపు 150 మంది చిన్నారులు మన దేశ సంతతివారు ఉన్నారు. పిల్లలను వదిలిపెట్టి రాలేక, నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉండలేక తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కడప జిల్లాకు చెందిన రెడ్డిబాలు దుర్గయ్య, లక్ష్మీదేవి దంపతులు మొదట కంపెనీ వీసాలపైనే కువైట్ వెళ్లారు. వీరికి ఏడేళ్ల కూతురు భాగ్యశ్రీ (7), కుమారుడు బాలు(5) ఉన్నారు. క్షమాభిక్ష వల్ల వీరికి మనదేశ రాయబార కార్యాలయం నుంచి ఔట్‌పాస్‌లు జారీ అయ్యాయి. వీరి పిల్లలకు మాత్రం జనన ధ్రువీకరణ పత్రాలు లేని కారణంగా ఔట్‌పాస్‌లు జారీ కాలేదు. క్షమాభిక్షకు గడువు మరో ఐదు రోజులే ఉంది. వీరిద్దరు స్వదేశానికి వస్తే చిన్నారుల పరిస్థితి ఏమిటనే సందేహం వ్యక్తమవుతోంది. పిల్లల కోసం అక్కడే ఉంటే జైలు శిక్షను అనుభవించాల్సిన పరి స్థితి ఏర్పడుతోంది. దీంతో చిన్నారులను వదిలి రావాలా లేక కువైట్‌లోనే ఉండాలా అని వారు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టంగుటూరి లక్ష్మీనర్సమ్మ పిల్లలు శిశుకుమార్(6), ధనలక్ష్మిలకు ఔట్‌పాస్‌లు జారీ కాలేదు. ఇలా ఎంతోమంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఔట్‌పాస్‌లను జారీ చేయాలంటూ మన విదేశాంగ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మా మనుమలు, మనమరాండ్లే గుర్తుకు వస్తున్నారు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఔట్‌పాస్‌ల కోసం తమ తల్లిదండ్రులతో వచ్చిన చిన్నారులను చూసిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఐఎన్టీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు రామచంద్ర కుంతియా చలించిపోయారు. ఆ చిన్నారులను చూస్తే మా మనుమళ్లు, మనుమరాండ్లు గుర్తుకు వస్తున్నారని ‘సాక్షి’కి ఫోన్లో వెల్లడించారు. ఏ జాతీయత లేక పోయినా వారు భారత సంతతి వారిగానే గుర్తించి మన దేశం అక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. –రామచంద్ర కుంతియా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎమర్జెన్సీ సర్టిఫికెట్లను జారీ చేయాలి విదేశాంగ శాఖ కువైట్‌లోని చిన్నారులకు ఎమర్జెన్సీ సర్టిఫికెట్లను జారీ చేయాలి. కువైట్ ప్రభుత్వం ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. అందువల్ల మన విదేశాంగ శాఖ స్పందించి సర్టిఫికెట్లను వీలైనంత తొందరగా జారీ చేసి స్వదేశానికి చిన్నారులను చేర్చాలి. – డాక్టర్ వినోద్‌కుమార్, మాజీ దౌత్యవేత్త, టీపీసీసీ ఎన్ఆర్ఐ విభాగం చైర్మన్ కువైట్ ప్రభుత్వంతో చర్చించాలి కువైట్‌లో ఉన్న చిన్నారుల విషయంలో భారత ప్రభుత్వం కువైట్ ప్రభుత్వంతో చర్చించి స్వదేశానికి రప్పించాలి. అలాగే ఇక్కడకు చిన్నారులు వచ్చిన తరువాత వారికి గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించి మెరుగైన విద్యను అందించాల్సిన అవసరం ఉంది. కువైట్‌లో చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది. 2011లో ఆమ్నెస్టీ సమయంలో వేగంగా చర్యలు తీసుకున్నారు. – నంగి దేవేందర్‌రెడ్డి, టీపీసీసీ గల్ఫ్ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ -
ఎన్నారై భర్తలపై కొరడా
విదేశాల్లో ఉద్యోగం.. లక్షల్లో జీతం... అక్కడ సొంత ఇల్లు, సొంత కారు–ఇలాంటి ఆకర్షణీయమైన కబుర్లు చెప్పి పెళ్లాడి, తీరా వెళ్లాక భార్యను శారీరకంగా, మాన సికంగా కష్టపెడుతున్న ప్రవాస భారతీయ (ఎన్నారై) యువకుల భరతం పట్టేందుకు భారతీయ శిక్షాస్మృతి(సీఆర్పీసీ)లో అవసరమైన నిబంధనలు చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగింది. పెళ్లి చేసుకుని దేశంగాని దేశానికి కొత్తగా వెళ్లిన యువతులు అనుభవిస్తున్న కష్టాల గురించి దశాబ్దాలుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంతక్రితం కలిగిన కుటుంబాలకే ఇలాంటి సమస్యలుండేవి. కానీ 90వ దశకం తర్వాత విదేశాల్లో లక్షలమందికి సాఫ్ట్వేర్ రంగ నిపుణులుగా ఉద్యోగావకాశాలు లభించడం పర్యవసానంగా మధ్య తరగతి ప్రజానీకాన్ని కూడా ఆ సమస్యలు తాకాయి. విదేశీ సంబంధమని మోజు పడి పెళ్లి చేసి పంపితే అక్కడ బాధల్లో కూరుకుపోతున్న కుమార్తెల విషయంలో ఏం చేయాలో తోచక వేలాదిమంది తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. యువతుల్ని చిత్రహింసలపాలు చేయడం అర్ధాంతరంగా వెళ్లగొట్టడం రివాజైంది. మరికొందరు ఘనులు పెళ్లాడి ముచ్చట్లన్నీ తీర్చుకుని, కట్న కానుకలతో విదేశాలకు పోయి అక్కడినుంచి విడాకుల నోటీసులు పంపుతున్నారు. ఎన్నారైలకు ప్రాతినిధ్య ఓటింగ్ హక్కు కల్పించడానికి చాన్నాళ్లనుంచి మన ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. కానీ ఇలాంటి మహిళల ఇబ్బందులపై ఈ స్థాయిలో దృష్టి పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. తాజా నిర్ణయంతో ఆ లోటు సరిదిద్దినట్టవుతుంది. మన విదేశాంగశాఖ వెల్లడించిన గణాంకాలు విస్మయం కలిగిస్తాయి. 2015 జనవరి మొదలుకొని నిరుడు నవంబర్ వరకూ ఆ శాఖకు 3,328 ఫిర్యాదులందాయి. వాటి ఆధారంగా ప్రతి 8 గంటలకూ ఒక ఫిర్యాదు వస్తున్నదని ఆ శాఖ వివరించింది. అంటే రోజుకు మూడు ఫిర్యాదులందుతున్నాయన్నమాట. అయితే బాధిత మహిళల అసలు సంఖ్య ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువుంటుంది. అన్ని దారులూ మూసుకుపోయాకే ఏ యువతి అయినా ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తుంది. నిందితుల్లో 60 శాతం మంది యువకులని ఆ గణాంకాలు చెబుతున్నాయి. వివిధ రంగాల్లో ఎంతగా పురోగతి సాధించామనుకుంటున్నా మన దేశంలో మహిళలపై వేర్వేరు రూపాల్లో వివక్ష, అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. విదేశాలకు పోయే యువకులు తమతోపాటు ఈ కశ్మలాన్నంతటినీ మోసుకు పోతున్నారు. కుటుంబాల్లో యధావిధిగా తమ ఆధిపత్య ధోరణులను ప్రదర్శి స్తున్నారు. ఇక్కడిలాగే మన సంప్రదాయాలు, కట్టుబాట్లు ఆ దేశాల్లో సైతం మన మహిళలకు అవరోధంగా మారుతున్నాయి. వీటిని ధిక్కరించి ఫిర్యాదు చేద్దామనుకున్నా ఎక్కడికెళ్లాలో, ఎలా వెళ్లాలో, ఎవరితో మాట్లాడాలో, ఏం మాట్లాడాలో తెలియని అయోమయ స్థితి. కొత్తగా కాపురానికెళ్లినవారికి ఇవన్నీ పెను అవ రోధాలవుతున్నాయి. వీటిని అధిగమించి ఫిర్యాదు చేసినా అక్కడి పోలీస్ అధి కారులకు సమస్యేమిటో అవగాహన కావడం కష్టమవుతోంది. భర్తతో సమానంగా ఉద్యోగం చేసే మహిళ పరిస్థితి ఎంతో కొంత మెరుగు. ఆమె స్వతంత్రంగా జీవనం సాగిస్తూ సమస్యలపై పోరాడగలదు. కానీ హెచ్ 4 వీసాపై అమెరికాలో ఉంటున్న ఆడపిల్లలది దుర్భరస్థితి. వారు తప్పనిసరిగా భర్త సంపాదనపైనే ఆధారపడాలి. ఇక్కడ పెళ్లాడటం, అక్కడికెళ్లాక ఆ దేశాల్లోని విడాకుల చట్టం ప్రకారం వదుల్చు కోవడం ఈమధ్యకాలంలో బాగా పెరిగింది. అక్కడేం చేసినా అడిగే దిక్కుండదు... అత్తింటివారికి తెలియకుండా భారత్ వచ్చి దర్జాగా తిరిగి వెళ్లొచ్చునన్న భరోసా ఎన్నారై యువకుల్లో ఉంటున్నది. సీఆర్పీసీలో మార్పులు తీసుకురావాలన్న తాజా నిర్ణయం వల్ల ఇకపై ఇది అసాధ్యమవుతుంది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం భార్యలను విడిచిపెట్టిన కేసుల్లో న్యాయస్థానాలు జారీ చేసే సమన్లను వరసగా మూడుసార్లు బేఖాతరు చేసి నట్టయితే అలాంటివారిని ‘పరారీలో ఉన్న వ్యక్తులు’గా పరిగణించి వారి ఆస్తుల్ని, వారి తల్లిదండ్రుల ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు న్యాయస్థానాలు ఆదే శాలివ్వొచ్చు. దీంతోపాటు విదేశాంగ శాఖ వెబ్సైట్లో పెట్టే సమన్లకు చట్టబద్ధత కల్పించడానికి అనువుగా సీఆర్పీసీ నిబంధనలను సవరించాలని కేంద్ర హోం శాఖను విదేశాంగ శాఖ కోరింది. ఇది కూడా ఆహ్వానించదగ్గ మార్పు. సమన్లు తీసుకోవడానికి నిరాకరించినవారి ఇంటి తలుపుపైనో, గోడపైనో ఆ సమన్లను అతికిస్తే చట్టం దృష్టిలో ఆ సమన్లు వారికి అందినట్టే. ఇప్పుడు వెబ్సైట్లో ఉంచే నోటీసులకు కూడా ఇదే సూత్రం వర్తింపజేయడం మంచి ఆలోచన. అలా మూడుసార్లు వెబ్సైట్లో పెట్టాక నిందితుల ఆస్తుల స్వాధీనం ప్రక్రియ మొదలవుతుంది. చూడటానికిది మొత్తంగా ‘ఎన్నారై వధువుల’ సమస్యేగానీ ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ. కేవలం భార్య ద్వారా సంక్రమించే ఆస్తిపై కన్నేసి కొందరు, ఇంట్లో ఉండే వృద్ధ తల్లిదండ్రుల అవసరాలు చూసుకోవడానికి ఇంకొందరు, జీతం ఇవ్వనవసరం లేని పనిమనిషిగా భావించి మరికొందరు యువతుల్ని పెళ్లి చేసుకుంటున్నారు. పంజాబ్ నుంచి అయ్యే పెళ్లిళ్లలో 80 శాతం ఈ బాపతేనని గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలం గాణ, గుజరాత్ రాష్ట్రాలున్నాయి. పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం, గృహ హింసకు పాల్పడేవారిని, భార్యల్ని విడిచిపెట్టేవారిని అప్పగించేందుకు విదేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఇలాంటి ఫిర్యాదులను స్వీకరించడానికి జాతీయ స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటుచేయడం, అందుకొక ప్రత్యేక వెబ్సైట్ పెట్టడం వంటి చర్యలు కూడా చాలా అవసరం. సంబంధం కుదుర్చుకోవడానికి ముందు అవతలి వ్యక్తి ఇచ్చిన సమాచారంలోని నిజా నిజాలేమిటో నిర్ధారించుకోవడం అవసరమన్న చైతన్యం అమ్మాయిల తల్లిదండ్రుల్లో కలగజేయడం అన్నిటికన్నా ముఖ్యం. ఇవన్నీ సాకారమైనప్పుడే పెళ్లి చేసి పంపిన మన ఆడపిల్లలు విదేశాల్లో క్షేమంగా, హుందాగా, గౌరవప్రదంగా బతక గలుగుతారు. -
సుష్మాజీ సాయం చేస్తారని నమ్ముతున్నా: నటి
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి మల్లికా షెరావత్, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సాయం కోరుతున్నారు. తన స్నేహితురాలి వీసా విషయంలో చొరవ చూపాలంటూ నటి విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆమె పలు ట్వీట్లు చేశారు. ఫ్రీ ఏ గర్ల్ అనే ఓ డచ్ ఎన్జీవో సంస్థకు సహ ఎవెలిన్ హెల్స్కెన్ వ్యవస్థాపకురాలు. తమ సంస్థ సేవలను భారత్‌లో కూడా అందించేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆమెకు భారత వీసా దొరకలేదు. దీంతో ఆమె తరపున స్నేహితురాలు, నటి మల్లికా షరావత్ విజ్ఞప్తి చేస్తున్నారు. ‘మేడమ్ సుష్మా స్వరాజ్.. ఫ్రీ-ఏ-గర్ల్ సంస్థ గత కొన్నేళ్లుగా మహిళలు, చిన్నారుల కోసం విశేషంగా కృషి చేస్తోంది. భారత్‌లో కూడా వారి సేవలను కొనసాగించేందుకు నిర్ణయించుకుంది. కానీ, ఆమె వీసా తిరస్కరణకు గురవుతోంది. దయచేసి సాయం చేయండి’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. ‘ఇలాంటి విషయాల్లో సుష్మాజీ ఎప్పుడూ సానుకూలంగానే స్పందించారు. ఇప్పుడు కూడా అదే రీతిలో స్పందిస్తారని భావిస్తున్నా’ అని మల్లికా ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఆ సంస్థ తరపున భారత్‌లో తన సేవలను అందించేందుకు సిద్ధమని మల్లికా వెల్లడించారు. Ma’am @SushmaSwaraj co-founder of Dutch NGO #FreeAGirl has been repeatedly denied visa to India, this NGO is doing superb work for trafficked children & women. Pls help! — Mallika Sherawat (@mallikasherawat) 12 February 2018 -
‘తత్కాల్’ పాస్‌పోర్టులకు అటెస్టేషన్ అవసరం లేదు!
సాక్షి, హైదరాబాద్: తత్కాల్ పథకం కింద పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త. ఇకపై ఐఏఎస్/ఐపీఎస్ అధికారుల అటెస్టేషన్ లేకుండానే పాస్‌పోర్టు పొందవచ్చు. ఆధార్/ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్, స్వీయ ధ్రువీకరణ పత్రంతో పాటు కేంద్రం సూచించి న 12 రకాల పత్రాల్లో ఏవైనా రెండు జత చేసి పాస్‌పోర్టు రుసుము రూ.1,500, అదనంగా తత్కాల్ రుసుము రూ.2 వేలు చెల్లిస్తే మరుసటి రోజు నుంచి గరిష్టంగా 3 రోజుల్లోగా పాస్‌పోర్టు జారీ కానుంది. ఈ మేరకు ‘తత్కాల్’ కింద పాస్ పోర్టుల జారీని సరళీకరిస్తూ విదేశాంగ శాఖ జనవరి 11న గెజిట్ ప్రకటన జారీ చేసిందని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాధారణ పథకం కింద తక్కువ సమయంలో (ఔట్ ఆఫ్ టర్న్) పాస్‌పోర్టు జారీకి పై విధానంలో దరఖాస్తు చేసుకుంటే 3 నుంచి వారం రోజుల్లో పాస్‌పోర్టు జారీ చేస్తామన్నా రు. పై రెండు విధానాల కింద దరఖాస్తు అంది న వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని, పాస్పో ర్టు జారీ చేసిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ జరిపిస్తామని చెప్పారు. అటెస్టేషన్ పొందడం లో గ్రామీణ, చిన్న పట్టణాల ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటుండటంతో ఆ విధానాన్ని కేంద్రం తొలగిం చిందని పేర్కొన్నారు. మరో 4 కేంద్రాలు.. తొలి విడత కింద వరంగల్, మహబూబ్‌నగర్ పట్టణాల్లో పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రా లు ఏర్పాటు చేశారని.. రెండో విడత కింద నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, సిద్దిపేట, మెదక్ జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ చివరిలోగా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని విష్ణువ ర్ధన్‌రెడ్డి తెలిపారు. వరంగల్, మహబూబ్ నగర్లలోని కేంద్రాల ద్వారా గత ఏప్రిల్ నుం చి ఇప్పటివరకు 15,470 పాస్‌పోర్టులు జారీ చేశామని చెప్పారు. హైదరాబాద్‌లో విదేశీ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయిం చిన వెంటనే నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. భవన్ ద్వారా విదేశాంగ శాఖ ప్రాంతీయ కార్యాలయం సహా పాస్‌పోర్టు తదితర కార్యాలయాలు ఒకే గొడుగు కిందకొస్తాయన్నారు. 12 రకాల పత్రాలివే.. 12 రకాల పత్రాల్లో ఓటరు గుర్తింపు కార్డు.. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ, స్థానిక సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసే ఉద్యోగుల గుర్తింపు కార్డు, ఎస్టీ/ఎస్సీ/ఓబీసీ సర్టిఫికెట్, ఆయుధ లైసెన్స్, పెన్షన్ పత్రాలు, సెల్ఫ్ పాస్‌పోర్టు, పాన్‌కార్డు, బ్యాంక్/కిసాన్/పోస్టాఫీస్ పాస్ బుక్, విద్యా సంస్థలు జారీ చేసే విద్యార్థి గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, జనన ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డులు ఉన్నాయి. మళ్లీ అగ్రస్థానంలో.. పాస్‌పోర్టుల జారీలో హైదరాబాద్ లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం వరుసగా మూడో ఏడాది దేశంలో నంబర్ వన్‌గా నిలిచిందని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపా రు. దరఖాస్తుల పరిశీలన, పోలీస్ వెరిఫి కేషన్ తదితరాలు పూర్తి చేసి పాస్‌పోర్టు జారీ చేసేందుకు దేశంలో సగటున 23 రోజులు అవుతుండగా, రాష్ట్రంలో 4 రోజుల్లోనే జారీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 2017 లో 5.89 లక్షల దరఖాస్తులొస్తే 5.87 లక్షలు.. 2016లో 6.64 దరఖాస్తులకు 6.53 లక్షల పాస్‌పోర్టులు జారీ చేశామన్నారు. -
సౌదీలో ఉండలేక.. స్వదేశం రాలేక !
మోర్తాడ్(బాల్కొండ): పొట్ట చేత పట్టుకొని.. పని కోసం సౌదీ వెళ్లిన తెలంగాణ కార్మికులు అక్కడి కంపెనీ చేసిన మోసంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సౌదీ అరేబియా దమామ్‌లో ప్రాజెక్టు సిస్టమ్ గ్రూపు అనే జనరల్ కన్స్ట్రక్షన్ కంపెనీ కాంట్రాక్టులను నిర్వహిస్తోంది. ఇందులో పని చేసేందుకు కార్మికులకు కంపెనీ వీసాలు జారీ చేసింది. తెలంగాణ జిల్లాల నుంచి పలువురు కార్మికులు వీసాలు పొంది అక్కడికి వెళ్లారు. ఇటీవల సౌదీలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కంపెనీ కాంట్రాక్టులు తగ్గించుకుంది. మొత్తం 56 మంది కార్మికులుండగా, 12 మందిని ఆరు నెలల క్రితం ఇళ్లకు పంపించి వేసింది. మిగిలిన వారికి అకామా ఇవ్వకుండా.. పని కూడా చెప్పకుండా సతాయిస్తోంది. ఆరు నెలలుగా వేతనాలు కూడా ఇవ్వటం లేదు. చివరికి అక్కడి లేబర్ కోర్టును ఆశ్రయించగా, కార్మికులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తమపై కోర్టుకు వెళ్లినందుకు కంపెనీ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తూ భోజన, సరైన నీటి వసతి కూడా కల్పించడం లేదు. వేతనం.. పాస్‌పోర్టులు ఇస్తే ఇంటికి వెళ్తామని చెప్పినా వినటం లేదు. ఈ క్రమంలో కార్మికులు అక్కడి మన విదేశాంగ శాఖలో ఫిర్యాదులు చేసినా స్పందన లభించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమను స్వదేశానికి రప్పించాలని కార్మికులు కోరుతున్నారు. నరకంలో ఉన్నట్లుంది... కంపెనీ యాజమా న్యం వేధింపులు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నా యి. సౌదీలో ఉండటం అంటే నరకంలో ఉన్నట్లుగా ఉంది. మమ్మల్ని ఎలాగైనా ఇళ్లకు రప్పించాలి. – రవీందర్, జక్రాన్‌పల్లి, నిజామాబాద్ జిల్లా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకువెళ్తాం సౌదీలోని దమామ్‌లో తెలంగాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై విదేశాంగశాఖను ఆశ్రయిస్తాం. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలసి బాధితులను ఇండ్లకు రప్పించడానికి చర్యలు తీసుకుంటాం. – పి.బసంత్‌రెడ్డి, టి.గల్ఫ్ కల్చరల్ ప్రతినిధి -
విదేశాంగ వ్యవహారాలశాఖ ఉద్యోగినికీ అత్తింటిపోరు
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణ మహిళలకే కాకుండా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న మహిళలకు కూడా అత్తింటివారి వేధింపులు తప్పట్లేదని కొన్ని సంఘటనలు రుజువు చేసిన విషయం తెలిసిందే. అలాంటిదే తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈసారి మాత్రం విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ మహిళ తనకు అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేస్తూ తీవ్రంగా వేధిస్తున్నారని అందులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే గుర్గావ్లోని సెక్టార్ 49లో ఉంటున్న ఓ గృహిణి విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆఫీసులో విధులు నిర్వర్తిస్తోంది. ఆమె 2016, జూలై 21న రజ్నీష్ గులాటి అనే ఢిల్లీకి చెందిన డాక్టర్‌ను వివాహం చేసుకుంది. ఆయన ముదిత్ విశ్వకర్మ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఇటీవల ఆమె గర్భం దాల్చగా తన కడుపులో పెరుగుతుందని ఆడ బిడ్డ అని వెంటనే అబార్షన్ చేసుకోవాలని భర్త దాడి చేశాడు. తన అత్త, మామ, ఆడబిడ్డ అందరూ కలిసి తనను ఇంట్లో నుంచి ఈడ్చి పడేశారని తీవ్ర వేధింపులకు గురిచేశారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
‘వాసెనార్’లోకి భారత్
న్యూఢిల్లీ: ఆయుధాల సరఫరా, ఎగుమతులను నియంత్రించే వాసెనార్ బృందంలో భారత్ సభ్య దేశంగా చేరింది. గురువారం వియన్నాలో ముగిసిన ప్లీనరీలో భారత్‌ను సభ్య దేశంగా చేర్చుకోవడానికి వాసెనార్ బృందం ఆమోదం తెలిపింది. దీంతో అవసరమైన విధాన ప్రక్రియను పూర్తిచేసి ఆ కూటమిలో చేరిపోయానమని భారత్ శుక్రవారం ప్రకటించింది. వాసెనార్‌లో భారత్ సభ్యత్వం పొందడానికి సహకరించిన 41 సభ్య దేశాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటన జారీచేసింది. ఇందులో భారత్ చేరడం పరస్పర ప్రయోజనం కలిగించడంతో పాటు అంతర్జాతీయ శాంతి, అణు వ్యాప్తి నిరోధక ప్రయత్నాలకు దోహదపడుతుందని వ్యాఖ్యానించింది. భారత్ చేరికతో ఈ బృందంలో సభ్య దేశాల సంఖ్య 42కి చేరింది. ఫలితంగా కీలక రక్షణ సాంకేతికతలను భారత్ ఇతర దేశాల నుంచి పొందడానికి వీలవుతుంది. అణు విస్తరణ నిరోధక కార్యకలాపాల్లో భారత్ స్థాయి పెరుగుతుంది. రక్షణ, అంతరిక్ష రంగాల్లో ఇతర దేశాలతో అధునాతన సాంకేతికత పంచుకోవడానికి ఈ ఒప్పందం సాయపడుతుంది. వాసెనార్, ఎన్‌ఎస్‌ఎజీ బృందాలకు నేరుగా ఎలాంటి సంబంధం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావీశ్ కుమార్ అన్నారు. వాసెనార్‌లో భారత్ చేరిక అణు వ్యాప్తి నిరోధక రంగంలో మన క్లీన్ ఇమేజ్ను స్పష్టం చేస్తోందన్నారు. ఆయుధాల ఎగుమతులు, సరఫరాలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు వాసెనార్ బృందం కృషిచేస్తోంది. సభ్య దేశాలు ఆయుధాలు సేకరించి తమ సైనిక సామర్థ్యాలు పెంచుకోవద్దని నిర్దేశించింది. ప్రమాదకర అణు, జీవ ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో పడకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
ఇరాక్‌లో బందీలుగా రాష్ట్ర కార్మికులు
మోర్తాడ్(బాల్కొండ): పొట్ట చేతపట్టుకుని ఇరాక్‌కు వెళ్లిన తెలంగాణ జిల్లాలకు చెందిన ఐదుగురు కార్మికులు అక్కడి బస్రా జైల్లో బందీలుగా ఉన్నారు. ఇంటికి వచ్చే తరుణంలో ఎయిర్‌పోర్టులో కార్మికులను అరెస్టు చేసిన ఇరాక్ పోలీసులు జైల్లో బంధించారు. వారికి తమ ఇంటివారితో మాట్లాడటానికి కూడా అవకాశం కల్పించడం లేదు. తమ వారిని విడిపించాలని బాధిత కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ గల్ఫ్ కల్చరల్ అసోషియేషన్ అధికార ప్రతినిధి పాట్కూరి బసంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఇతర ఉన్నతాధికారులను కలిసి విన్నవించారు. జగిత్యాల జిల్లాకు చెందిన జక్కి రాజు, పసుపుల లక్ష్మణ్, దుర్గం శాంతయ్య, మంచిర్యాల జిల్లాకు చెందిన కోడి రాజయ్య, నిర్మల్ జిల్లాకు చెందిన తాళ్లపెల్లి నారాయణలు ఏజెంట్ల ద్వారా 16 నెలల కింద ఇరాక్ వెళ్లారు. అక్కడ 10 నెలల పాటు వివిధ కంపెనీల్లో పనిచేసిన కార్మికులకు యాజమాన్యాలు సరైన వేతనమివ్వలేదు. కడుపునిండా భోజనం పెట్టలేదు. వసతి సరిగా లేకపోవడంతో కార్మికులు అనారోగ్యా నికి గురయ్యారు. ఇరాక్‌లో ఉంటే తాము బతికి బట్ట కట్టలేమని, తమని ఎలాగైనా స్వదేశానికి పంపించా లని ఇరాక్‌లో ఉన్న తమ గల్ఫ్ ఏజెంటును వేడుకు న్నారు. గత మేలో ఐదుగురు కార్మికులను ఇంటికి పంపించడానికి ఇరాక్‌లో ఉన్న ఏజెంటు దాసరి మురళి » స్రా ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చాడు. అక్కడి పోలీసులు ఆ కార్మికులను అరెస్టు చేసి జైల్లో ఉంచా రు. ఏజెంటు దాసరి మురళి సమాచారం ఇవ్వడం తోనే బాధిత కుటుంబీకులు ఈ సమాచారం తెలుసు కోగలిగారు. మే 14న అరెస్టైన కార్మికులు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఇరాక్‌లోని మన విదేశాంగ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి కార్మికులను విడిపించాలని వారి కుటుంబీకులు కోరుతున్నారు. -
జీఈఎస్‌లో సానియా, పుల్లెల
సాక్షి, న్యూఢిల్లీ: ‘గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్’(జీఈఎస్)లో పాల్గొనేందుకు 1,500 మంది ప్రతినిధులను ఎంపిక చేశారు. ఈ నెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో ఈ సదస్సు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దక్షిణాసి యాలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రంప్ అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ ఈ సదస్సులో పాల్గొంటారు. ఇందులో క్రీడారంగానికి చెందిన పుల్లెల గోపీచంద్, సానియా మీర్జా తమ కెరీర్ వివరాలను పంచుకుంటారు. ఈ సదస్సుకు అమెరికా సహ ఆతిథ్యం ఇస్తోంది. సదస్సులో పాల్గొనే ప్రతినిధుల్లో మూడో వంతు అమెరికా నుంచి, మూడోవంతు మన దేశం నుంచి ఉన్నారు. మరో మూడో వంతు ఇతర దేశాల నుంచి ఉన్నారు. మొత్తం 1,500 మంది ప్రతినిధుల్లో దాదాపుగా 300 మంది పెట్టుబడిదారులు ఉంటారు. 35 దేశాలకు చెందిన విభిన్న రంగాల్లో ఖ్యాతి గాంచిన వారు, విభిన్న నేపథ్యాలున్నవారు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. సాంకేతిక రంగం, సృజనాత్మక రంగం, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు జాన్ చాంబర్స్, ప్రేమ్ వత్స, మార్కస్ వాలెన్‌బెర్గ్ తదితరులు విభిన్న అంశాలపై ప్రసంగిస్తారు. అంతరిక్ష యాత్రికు రాలు అనౌషే అన్సారీ తన అనుభవాలు పంచుకుంటారు. తిరస్కరణకు గురైన విమాన సహాయకురాలి నుంచి సొంత విమానయాన సంస్థను నెలకొల్పే స్థాయికి ఎదిగిన సిబొంగైల్ సాంబో తన జీవన యానాన్ని వివరించను న్నారు. ప్రముఖ ఎంఐటీ ప్రొఫెసర్లు కార్లో రాటి, డేనియల్ వుడ్ గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ ధోరణులను పంచుకుంటారు. భారతదేశ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అనూ ఆచార్య, రాధికా అగర్వాల్ స్టార్టప్స్‌పై మాట్లాడుతారు. ఇన్వెస్టర్లుగా రాణిస్తున్న తెలుగు వ్యక్తి వాణి కోలా, శాంతిమోహన్ ఎంట్రప్రెన్యూర్షిప్లో తమ అనుభవాలు పంచుకుంటారు. ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా న్యూయార్క్‌లో రెస్టారెంట్ చైన్‌ను అభివృద్ధి చేసిన తీరును వివరిస్తారు. ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు 24 ఏళ్ల రితేష్ అగర్వాల్, 3 ఇడియట్స్ సినిమాలోని ఫున్‌షుఖ్ వాంగ్డు క్యారెక్టర్‌కు స్ఫూర్తి అయిన ప్రముఖ ఇంజనీర్ సోనమ్ వాంగ్‌చుక్, పద్మశ్రీ గ్రహీత పీయూష్ పాండే ఈ వేదికపై ప్రసంగిస్తారు. 52.5 శాతం మంది మహిళలే.. వాషింగ్టన్: ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్ (జీఈఎస్)కు హాజరవుతున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు అమెరికా తెలిపింది. అమెరికా బృందానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ నేతృత్వం వహిస్తారని ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. అఫ్గానిస్తాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ లాంటి సుమారు 10 దేశాల నుంచి కేవలం మహిళలే హాజరు కానున్నారని పేర్కొంది. మొత్తంగా చూస్తే సదస్సుకు హాజరవుతున్న వారిలో మహిళా పారిశ్రామికవేత్తల శాతం 52.5 శాతమని తెలిపింది. జీఈఎస్ సదస్సుకు వస్తున్న వారిలో మహిళలు మెజారిటీగా ఉండటం ఇదే తొలిసారి కావడం విశేషం. -
మలేషియాలో హైదరాబాద్ వ్యాపారి హత్య
సాక్షి, హైదరాబాద్: స్నేహితులతో కలసి విహారయాత్ర కోసం మలేషియా వెళ్లిన ఓ హైదరాబాద్ వ్యాపారి దారుణహత్యకు గురయ్యాడు. వ్యాపారిని కిడ్నాప్ చేసిన దుండగులు కుటుంబీకుల్ని రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి బేరసా రాలు సాగుతుండగానే అతనిని చంపేశారు. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం కుషాయిగూడ ప్రాంతంలో కలకలం రేపింది. రాజస్తాన్‌లోని పాలి జిల్లాకు చెందిన వాసుదేవ్‌సింగ్ రాజ్‌పురోహిత్(32) కుటుం బం 15 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చింది. వాసుదేవ్తోపాటు అతని అన్న రాధేశ్యాం కుషాయిగూడ మహేశ్‌నగర్‌లో ఉంటున్నారు. వీరు ఈసీఐఎల్, సైనిక్‌పురి ప్రాంతాల్లో ఇంటీరియర్ డెకరేటర్స్ దుకాణాలు నిర్వహి స్తున్నారు. గత నెల 27న వాసుదేవ్, సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన టైలర్ వెంకటేశ్, అతని బావమరిది శ్రీనివాస్‌తో కలసి విహారయాత్ర కోసం మలేషియా బయలుదేరారు. 28న సింగపూర్ చేరుకుని.. అక్కడ నుంచి 31న మలేషియా వెళ్లి కౌలాలంపూర్‌లోని హోటల్ రాయల్‌లో బస చేశారు. ఆ రోజు వెంకటేశ్, శ్రీనివాస్ హోటల్లోనే ఉండగా.. ఉదయం 11 గంటల ప్రాంతంలో వాసుదేవ్ మలేషియాలో ఉంటున్న పాకిస్తాన్ జాతీయుడు ఖాన్‌తో కలసి బయటకు వెళ్లాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో హోటల్‌కు వచ్చిన ఖాన్ వెంట వాసుదేవ్ లేడు. వెంకటేశ్, శ్రీనివాస్ అడగగా.. తాను గంట ముందే హోటల్ వద్ద వదిలి వెళ్లినట్లు ఖాన్ బదులిచ్చాడు. అదే రోజు రాత్రి మలేషియా నుంచి వాసుదేవ్ సెల్ నుంచే సైనిక్‌పురిలో ఉంటున్న అతడి అన్న శ్యాంకు ఫోన్ వచ్చింది. మీ సోదరుడిని కిడ్నాప్ చేశామంటూ రూ.30 లక్షల డిమాండ్ చేశారు. ఆ తర్వాత వాసుదేవ్ ఫోన్ నుంచి శ్యాంకు వాట్సాప్ కాల్స్, చాటింగ్స్ మొదలయ్యాయి. నవంబర్ 1న ఖాన్ ఫోన్ (0107682994) నుంచి శ్యాంకు కొన్ని వీడియో, వాయిస్ రికార్డులు వచ్చాయి. కౌలాలంపూర్ ఠాణాలో కేసు ఈ పరిణామాల నేపథ్యంలో వాసుదేవ్‌తో కలసి వెళ్లిన వెంకటేశ్, శ్రీనివాస్ నవంబర్ 1నే కౌలాలంపూర్‌లోని బ్రిక్‌ఫీల్డ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంకటేశ్, శ్రీనివాస్ వీసా గడువు గత శుక్రవారంతో ముగుస్తుండటంతో ఆ రోజు వారు తిరిగి వచ్చేశారు. వాసుదేవ్ కుటుంబీకుల్ని కలసి జరిగింది చెప్పడంతో ఆందోళనకు గురైన వారు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆయన సహాయంతో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో పాటు విదేశాంగశాఖ అధికారుల దృష్టికి విషయం తీసుకువెళ్లారు. వాసుదేవ్ సోదరులు శ్యాం, ప్రవీణ్, విక్రమ్ గురువారం అక్కడికి చేరుకు న్నారు. అప్పటికే కిడ్నాపర్లు బాధితుడిని హత్య చేసినట్లు తెలిసింది. వాసుదేవ్ మృత దేహం ఆదివారం నగరానికి చేరుకోనుంది. కాగా, శుక్రవారం మధ్యాహ్నం నుంచి వెంకటేశ్, శ్రీనివాస్ ఆచూకీ లభించట్లేదు. వీరిద్దరినీ దర్యాప్తు నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మూడేళ్లుగా పరిచయం వాసుదేవ్‌కు ఖాన్‌తో మూడేళ్లుగా పరిచయం ఉందని, ఫేస్బుక్ ద్వారా ఒకరికొకరు సంప్ర దింపులు జరిపేవారని వాసుదేవ్ కుటుంబీకు లు చెప్తున్నారు. గతంలో వాసుదేవ్ మలేషి యా వెళ్లినప్పుడు అక్కడ ఖాన్‌ను కలిశాడని, ఆ తర్వాత వారి మధ్య స్నేహం పెరిగిందని అంటున్నారు. వాసుదేవ్ ఫోన్ నుంచే వాట్సాప్ ద్వారా అతడిని బంధించిన, దాడి చేస్తున్న, మెడపై కత్తి పెట్టిన ఫొటోలు ఖాన్ పంపాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆపై ఖాన్ తన ఫోన్ నుంచే వాసుదేవ్ సోదరులతో చాటింగ్ చేశాడని చెపుతున్నారు. కిడ్నాపర్ గురువారం వరకు వాసుదేవ్ కుటుం బీకుల్ని డబ్బు డిమాండ్ చేస్తూనే ఉన్నాడు. డిపాజిట్ చేయాలని మలేషియాలోని బ్యాంక్ ఖాతా నంబర్ కూడా ఇచ్చాడు. పూర్తి సహకారం అందిస్తున్నాం వాసుదేవ్ హత్యకు సంబంధించిన కేసు కౌలాలంపూర్‌లో నమోదైంది. అక్కడి పోలీసులు మాతో సంప్రదింపులు జరిపారు. కొన్ని ఫోన్ నంబర్ల వివరాలు అడిగారు. అవి వారికి అందించాం. ఈ కేసును ఛేదించేందుకు కౌలాలంపూర్ పోలీసులు నిపుణుల సహకారం తీసుకుంటున్నారు. అక్కడి రాయబార కార్యాలయం పూర్తిగా సహకరిస్తోంది. – మహేష్ ఎం.భగవత్, రాచకొండ సీపీ కీలకంగా మారిన ఫోన్ కాల్.. రెండు రోజుల క్రితం వాసుదేవ్ సోదరుడికి వచ్చిన ఓ ఫోన్‌కాల్ కీలకంగా మారింది. ఓ మహిళ తెలుగులో తాను వరంగల్ నుంచి మాట్లాడుతున్నానని, వాసుదేవ్ పాస్‌పోర్ట్ మలేషియాలోని తమ పరిచయస్తులకు దొరికిందని, వారు చెప్పడంతో తాను ఫోన్ చేస్తున్నట్లు చెప్పింది. తన భర్త కొన్నాళ్లు మలేషియాలో ఉన్నారని, అక్కడి కిడ్నాపింగ్ గ్యాంగ్స్ ప్రమాదకరమని హెచ్చరించి.. వారు డిమాండ్ చేసిన నగదులో రూ.5 లక్షలైనా చెల్లించాలని చెప్పిందని వాసుదేవ్ సంబంధీకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో హతుడి పరిచయస్తులే కిడ్నాప్‌నకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పౌరుల దృష్టి మళ్లించే ఈ–దర్బార్లు ఆపండి!
అవలోకనం మన విదేశాంగ విధానపరమైన కృషిలో చాలా వరకు ప్రధాని కార్యాలయం నుంచే సాగుతోంది. దీంతో సుష్మా స్వరాజ్ ట్విటర్ ద్వారా ‘చురుగ్గా పనిచేసే’ మంత్రిగా కనిపిస్తున్నారు. ఒకటి రెండు కేసులను పరిష్కరించడం ద్వారా ఆమె నిజానికి వ్యవస్థాపరమైన మెరుగులపై నుంచి, దాని పనితీరుపై నుంచి దృష్టిని మరలిస్తున్నారు. మొగలాయిలు భారతదేశాన్ని జయించాక, అంతకు మునుపటి రాజుల రివాజైన రాజదర్శనాన్ని కొనసాగించారు. మొగల్ చక్రవర్తి పర్యటనలో ఉన్నప్పుడు తప్ప, ప్రతి రోజూ ప్రజలు తనను ‘చూడటానికి’ బాల్కనీలో నిల్చునేవాడు. ఈ దర్శనం, విగ్రహాన్ని చూడటం లాంటిదే. ఆ దర్శనం సామ్రాజ్యం పదిలంగా ఉన్నదని పౌరు లకు భరోసా కలిగించడం కోసమే. చక్రవర్తి గైర్హాజరీలో రాజ్యమంతటా వెంటనే పుకార్లు వ్యాపించి, అరాచకం నెలకొనేది. అందువల్లనే ఈ దర్శనం ముఖ్యమైనదిగా మారింది. 1627లో, జహంగీర్ చనిపోయినప్పుడు నేరస్తులు నగరాలను ఆక్రమిం చారని, వర్తకులు తమ వస్తువులను నేలలో పాతిపెట్టాల్సి వచ్చిందని జైన వర్తకుడు బనారసీదాస్ తన స్వీయ జీవిత చరిత్ర అర్థకథానక్లో రాశారు. మొగల్ రాకుమా రుడు కుర్రం వారసత్వ యుద్ధంలో నెగ్గి, షాజహాన్ పేరుతో చక్రవర్తి అయ్యాడనే వార్త దేశవ్యాప్తంగా వ్యాపించే వరకు ఈ గందరగోళం అలాగే ఉండి పోయింది. నిజానికి జహంగీర్ చక్రవర్తుల్లోకెల్లా ఎక్కువ సోమరి. అతిగా మద్యం లేదా నల్లమందు సేవించడం వల్ల సాయంత్రం దర్బారు అర్ధంతరంగా ముగుస్తుండేదని యూరోపియన్ పర్యాటకులు నమోదు చేశారు. జహంగీర్ చక్రవర్తి దర్శన కార్యక్ర మానికి న్యాయమనే కొత్త అంశాన్ని చేర్చారు. రాజప్రాసాదంలో ఒక గొలుసును వేలాడదీసి ఉంచేవారని, సమస్యలున్న సామాన్య పౌరులెవరైనా దాన్ని లాగవచ్చని చెప్పేవారు. ఆ గొలుసుకు ఓ గంట కట్టి ఉండేదని, అది మోగినప్పుడల్లా చక్రవర్తి, వ్యవస్థ నుంచి పొందలేకపోయిన న్యాయాన్ని చేయడానికి బయటకు వచ్చేవారని అంటారు. దీన్ని అదిల్ ఎ జహంగీర్ లేదా జహంగీర్ న్యాయం అనేవారు. అది పౌరులందరికీ తక్షణ న్యాయాన్ని అందించేది. అయితే ఇదంతా ఉత్త బూటకమే. చక్రవర్తులెవరికీ, ప్రత్యేకించి జహంగీర్‌కు అంతటి తీరిక ఉండేది కాదు. నేనింతకు ముందే చెప్పినట్టు అతడు సోమరి, స్వార్థపరుడు. న్యాయం చేయడంలో ఆసక్తికి అతడు ఆమడ దూరంలో ఉండటమే కాదు, మహా క్రూరుడు. ఇద్దరు వ్యక్తుల కాలి వెనుక పిక్కలను కోసేయించి, వారికి శాశ్వత వైకల్యాన్ని కల్పించిన వాడు. అడవిలో వాళ్లు చేసిన అలజడికి, జహంగీర్ తుపాకీ గురిపెట్టి చంపాలని చూస్తున్న పులి భయ పడి పారిపోయింది. అదే వాళ్లు చేసిన నేరం. తుజుక్ ఎ జహంగీరి అనే తన స్వీయ జీవిత చరిత్రలో ఈ విషయాన్ని రాసుకున్నాడు కాబట్టే ఇది మనకు తెలిసింది. కాబట్టి అదిల్ ఎ జహంగీర్ తెరచాటున భారతదేశంలో నెలకొని ఉండిన సర్వ సాధారణ పరిస్థితి అదే. అది నేటికీ కొనసాగుతోంది. పాలకులు, ప్రత్యక్ష జోక్యం ప్రదర్శనను రక్తి కట్టించడంలో ఆసక్తిని చూపవచ్చు. అంతేగానీ, ప్రపంచం లోని అత్యధిక భాగంలో జరుగుతున్నట్టుగా వ్యవస్థాగతంగా అందుతున్న సహా యానికి, సేవలకు హామీని కల్పించడంపై మాత్రం ఆసక్తిని చూపరు. సుష్మా స్వరాజ్ ట్విటర్ ఖాతా అదిల్ ఎ జహంగీర్‌కు ఆధునిక అవతారం కావడం వల్లే ఇది రాస్తున్నాను. ఆమె ట్విటర్ ఖాతా నుంచి ఇటీవల పతాక శీర్షికలకు ఎక్కిన కొన్ని ఇవి. ‘బిడ్డ అస్వస్థత గురించి సుష్వా స్వరాజ్‌కు ట్వీట్ చేసి మెడికల్ వీసాను పొందిన పాకిస్తానీ’ (జూన్ 2). ‘లాహోర్ పసి బిడ్డ గుండె ఆపరేషన్‌కు సుష్మా స్వరాజ్ ఆపన్న హస్తం’ (జూన్ 11). ‘సౌదీ అరేబియా నుంచి కర్కలా నర్సు తిరిగి వచ్చే ఆశ లను పెంచిన సుష్మా స్వరాజ్ ట్వీట్’ (జూన్ 25). రియాద్‌లోని భారత రాయబార కార్యాలయపు ట్విటర్ ఖాతాకు స్వరాజ్ పంపిన ఈ ప్రత్యేక ట్వీట్లో ఆమె, ‘‘జావెద్: ఈ మహిళను కాపాడటానికి దయచేసి సహాయం చేయండి’’ అని రాశారు. ఒక వార్తా కథనం నుంచి ఆమె ఆ మహిళను గుర్తించారు. అక్టోబర్ 27, శుక్రవారం రోజున స్వరాజ్ దుబాయ్‌లోని భారత కాన్సల్‌కు ‘‘విపుల్ – దయచేసి అతను తన తల్లి అంత్య క్రియలకు చేరుకునేలా సహాయపడండి’’ అనీ, మరెవరి ప్రయాణ పత్రాలనో భోపా ల్లోని భారత పాస్‌పోర్ట్ ఆఫీసుకు పంపమని రాశారు. ఆమె చేస్తున్న ఈ ట్వీటింగ్‌ను మీడియా క్రియాశీలమైన, సానుభూతిగల రాజ కీయవేత్త చర్యలుగా చూపుతోంది. ట్విటర్ ద్వారా ఒకటి రెండు కేసులను పరి ష్కరించడం ద్వారా ఆమె నిజానికి వ్యవస్థాపరమైన మెరుగులపై నుంచి, దాని పనితీరుపై నుంచి దృష్టిని మరలుస్తున్నారు. పౌరులు తమ సమస్యలకు పరి ష్కారం భారత విదేశాంగ మంత్రి చూపే వ్యక్తిగత శ్రద్ధ మాత్రమేనని నమ్మేలా తప్పు దోవ పట్టిస్తున్నారు. మేడమ్ ట్వీట్లపై శ్రద్ధ చూపడం కోసం దౌత్యవేత్తలు, ఉన్నతాధికారవర్గం వ్యవస్థాగతమైన తమ పనులను వదిలిపెట్టాల్సివస్తోంది. పాకిస్తాన్‌పై పొందికైన విదేశాంగ విధానమే మనకు లేదు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లేదా మయన్మార్ విషయంలోనూ అంతే. అయితే, ఈ–దర్బార్ లేదా ఈ–దర్శన్.. వ్యవస్థకు మరమ్మతులు చేసే గొప్ప నిపుణులు ఒకరు తలమునకలై పనిచేస్తున్న భ్రమను కలిగిస్తుంది. వ్యాధిగ్రస్తురాలైన పాకిస్తానీ బిడ్డకు శస్త్ర చికిత్స! ఊబకాయమున్న ఈజిప్ట్ మహిళకు బేరియాటిక్ శస్త్రచికిత్స! ఇలాంటి వీసాలకు ఒక కేంద్ర మంత్రి జోక్యం ఎందుకవసరమౌతోంది? ఏ నాగరిక దేశమైనా ఇలా ట్విటర్ ద్వారా వీసాలకు హామీని కల్పిస్తుందా? అమెరికా లేదా బ్రిటన్లు ఇలాగే చేస్తాయా? లేదు. వాటికి అందుకు తగ్గ యంత్రాంగాలున్నాయి. మనకు దర్బార్లున్నాయి. మన మంత్రులకు చేయడానికి మరే పనీ లేదా? నాకో క్రమబద్ధమైన ఉద్యోగం ఉంది. దానితో పాటే నా రాత పనీ చూసుకుంటా. అయినా నాకు ట్విటర్ కోసం సమయం చిక్కడం లేదు. ఆమెకు ఎలా దొరుకుతోంది? మన విదేశాంగ విధానంలో చాలావరకు ప్రధాని కార్యాలయం నుంచే సాగుతోందనే మాట నిజమే. చైనా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ వ్యవహారాలన్నీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పరిధిలోకి వస్తాయి. భారత విదేశాంగ విధానం మన నాగరికతా విలువల ప్రాతి పదికపై సాగాలనేది నెహ్రూవాద దృష్టి. అందుకు భిన్నంగా మోదీ ప్రధానంగా రక్షణ, ఉగ్రవాద దృక్కోణం నుంచి విదేశాంగ విధానాన్ని చూస్తుండటమే అందుకు కారణం. ఈ విధంగా తన వృత్తిపరమైన బాధ్యతలలో అత్యధిక భాగాన్ని ఇతరులు హస్తగతం చేసుకోవడంతో స్వరాజ్ తాను చేయదగిన ఇతర పనులను వెతుక్కో వాల్సి వస్తోంది. ట్విటర్ వాటిలో ఒకటనేది స్పష్టమే. అది, ‘చురుగ్గా పనిచేసే’ మంత్రిగా ఆమె ప్రముఖంగా కనిపించేలా చేస్తుంది. కనీసం మీడియాలోనైనా అలా కనిపిస్తారు. కానీ అలాంటి దర్శనం అవసరమేమీ లేదని ఆమెకు చెప్పాల్సి ఉంది. అది చేసేదేమైనా ఉందంటే దర్బారీ సంస్కృతిని పెంపొందింపజేయడమే. కొందరు వ్యక్తులకు అది ఉపయోగం చేకూర్చవచ్చు, కానీ వ్యవస్థకు ప్రతిబంధకమౌతుంది. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత‘ ఈమెయిల్ : aakar.patel@icloud.com -
ప్రవాసుల కోసం తక్షణం స్పందించే 'మదద్'
గల్ఫ్ తో పాటు ఇతర దేశాలలో ఉన్న భారతీయులు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. అసలే విదేశీ వ్యవహారం... సుదూర తీరంలో సమస్య. మనం ఇక్కడ... సమస్య ఎక్కడో... సమస్యలను ఒక సామాన్య పౌరుడు నేరుగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసికెళ్ళే పరిస్థిలేదు, చైతన్యం లేదు. ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయుల కష్టాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం 'మదద్' వెబ్ సైట్ తో శ్రీకారం చుట్టింది. ఇది ప్రవాసి కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు ఒక వారధిలాగా ఉపయోగపడుతుంది. విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు కూడా ఈ పోర్టల్ లో తమపేర్లను నమోదు చేసుకోవచ్చు. విదేశాల్లో పనిచేస్తున్న మన కార్మికులు, ఉద్యోగులకు కష్టమొస్తే ఎవరికి చెప్పుకోవాలి ? ఆయా దేశాలలోని ఇండియన్ ఎంబసీలు, ఇండియన్ కాన్సులేట్ లు, ఇండియన్ హైకమీషన్ లు అనగా భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలి. విదేశాల్లోని మనవారు జైలుపాలయితే, దురదృష్టవశాత్తు మరణిస్తే సహాయంకోసం వారి బంధువులు భారత్ లో గాని, విదేశంలో గాని ఎవరిని ఎలా సంప్రదించాలి ? సంబంధిత జిల్లా కలెక్టరు, రాష్ట్ర ఎన్నారై విభాగము, డిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశంలోని ఇండియన్ ఎంబసీ లకు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేయాలి. ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న సాంప్రదాయ పధ్ధతి ప్రకారం దరఖాస్తులు సంబంధిత అధికారులకు చేరడానికి, ఉత్తర ప్రత్యుత్తరాలకు ఎంతో సమయం పడుతుంది. ఈ స్పీడ్ యుగంలో తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకవచ్చి, వేగంగా పరిష్కారం పొందడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించే ఆన్ లైన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. భారతీయులు ఎక్కువగా వాడే పదం 'మదద్'... అంటే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం అని అర్థము. ఇంచు మించు అన్ని భాషల సారాంశం కూడా అదే. ఈ విశిష్టమైన అర్థం కలిగిన 'మదద్' పేరుతో విదేశాల్లోని భారతీయులకు సహాయం అందించే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం - విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ప్రవాసి భారతీయ వ్యవహారాల విభాగం) 21 ఫిబ్రవరి 2015 న ఒక వెబ్ సైట్ ను ప్రారంభించారు. హిందీ, ఉర్దూ, అరబిక్ భాషలలో వాడుకలో ఉన్న 'మదద్' అనే పదానికి తెలుగులో మద్దతు, అండ, బాసట, తోడ్పాటు, సహాయం, సాయం అనే సమానార్థాలు ఉన్నాయి. ఇంగ్లిష్ లో హెల్ప్, ఎయిడ్, అసిస్టెన్స్, సపోర్ట్ అనే అర్థాలున్నాయి. గల్ఫ్ వలస జీవుల ఇక్కట్లకు 'వెబ్' పరిష్కారం విదేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులు లేదా వారి కుటుంబ సభ్యులు లేదా వారి మిత్రులు 'మదద్' ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. 'మదద్' (కాన్సులార్ సర్వీసెస్ మేనేజ్మెంట్ సిస్టం - భారత రాయబార కార్యాలయాల్లో దౌత్య సంబంధమైన సేవల నిర్వహణ వ్యవస్థ) ను https://org2.passportindia.gov.in/AppConsularProject/welcomeLink లేదా https://portal2.madad.gov.in/AppConsular/welcomeLink లింక్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఫిర్యాదు చేసిన వెంటనే ఒక ఒక ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు. ఫిర్యాదుపై ఎంబసీలు తీసుకున్న చర్యల గురించి ఆన్ లైన్ లో సమాచారం తెలుసుకోవచ్చు. విదేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు ఇబ్బందులకు గురవుతున్నసందర్భంలో వారికి ఉపయుక్తంగా పారదర్శక పద్ధతిలో సహకారమందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆన్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. 21 రకాల సేవల గురించి విజ్ఞప్తులు చేసుకోవచ్చు విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు అందించే దౌత్య సంబంధమైన సేవలు పొందడానికి, ఫిర్యాదులు, విజ్ఞప్తులు నమోదు చేసుకోవడానికి 'మదద్' వెబ్ పోర్టల్ ను ఉపయోగించుకోవచ్చు. శరణార్థులు (అసైలం), జన్మ ధృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెటు), పరిహారం (కాంపెన్సేషన్), ఉద్యోగ ఒప్పంద సమస్య ( కాంట్రాక్టు ప్రాబ్లం), ఇంటి పనివారలు (డొమెస్టిక్ హెల్ప్), సందేహాస్పద ఉద్యోగ పత్రాలు / యజమాని / కంపెనీ (డుబియస్ జాబ్ లెటర్ / ఎంప్లాయర్ / కంపెనీ), మోసపూరిత కాల్స్ / ఇ-మెయిల్స్ (ఫ్రాడులెంట్ కాల్స్ / ఇ-మెయిల్స్), విదేశంలో జైలు పాలయినప్పుడు (ఇంప్రిజండ్ అబ్రాడ్), వివాహ సంబంధ వివాదాలు (మారిటల్ డిస్పూట్), మృతదేహాలను స్వదేశానికి రవాణా చేయడం (మోర్టల్ రిమేన్స్), నోరి (నో ఆబ్లిగేషన్ టు రిటర్న్ టు ఇండియా), ఓసిఐ (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) కార్డుల సంబంధమైన సమస్యలు, విదేశాల్లో పాస్ పోర్ట్ సమస్యలు (పాస్ పోర్ట్ ఇష్యూస్ అబ్రాడ్), శారీరక వేధింపులు (ఫిజికల్ అబ్యూస్), రిక్రూటింగ్ ఏజెంట్లు, స్వదేశానికి వాపస్ పంపడం (రిపాట్రియేషన్), వేతన బకాయిలు (సాలరీ డ్యూస్), లైంగిక వేధింపులు (సెక్సువల్ అబ్యూస్), యజమానితో సమస్యలు (స్పాన్సర్ ప్రాబ్లం), తప్పిపోయిన / జాడ తెలియని వారి ఆచూకి తెలుసుకోవడం (వేర్ అబౌట్స్ అన్నోన్), కార్మికులను ఇబ్బంది పెట్టడం (వర్కర్ అబ్యూస్) మరియు కోర్టుకేసుల లాంటి ఇంకా ఏమైనా ఇతర సమస్యలుంటే 'అదర్స్' కేటగిరీ ని సెలక్ట్ చేసుకోవాలి. ఇందులో కేవలం విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు అందించే దౌత్య సేవల గురించి మాత్రమే ఫిర్యాదు చేయవచ్చు. వీసా, డాక్యుమెంట్స్ అటెస్టేషన్ లాంటి సేవలకు 'మదద్' ద్వారా కాకుండా ఇండియన్ ఎంబసీలను నేరుగా సంప్రదించాలి. రిక్ర్రూటింగ్ సమస్యల గురించి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్ సైటు http://www.mea.gov.in/ లేదా ఇ-మైగ్రేట్ వెబ్ సైటు https://emigrate.gov.in/ext/ ను సంప్రదించాలి. 'మదద్' లో ఫిర్యాదులు, విజ్ఞప్తులు నమోదు చేయడం ఎలా ? https://org2.passportindia.gov.in/AppConsularProject/welcomeLink లేదా https://portal2.madad.gov.in/AppConsular/welcomeLink లింక్ ను క్లిక్ చేస్తే 'మదద్' పేజీ ఓపెన్ అవుతుంది. ముందుగా లాగిన్ ఐడి, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకొని సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. 'అప్లికంట్ లాగిన్' బాక్స్ లో లాగిన్ ఐడి టైపు చేసి 'కంటిన్యూ' బటన్ పై నొక్కాలి. తదుపరి వచ్చిన బాక్స్ మెదటి లైనులో పాస్ వర్డ్, రెండో లైనులో డిస్ ప్లే అయిన క్యారెక్టర్లను టైపు చేసి 'లాగిన్' బటన్ పై నొక్కాలి. 'రిజిస్టర్ గ్రీవెన్స్' పేజీలో విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తి వివరాలు నమోదు చేయాలి. పేరు, లింగము (జెండర్), పుట్టిన తేదీ, పాస్ పోర్ట్ నెంబరు, ప్రస్తుత అడ్రస్, మిషన్ / పోస్ట్ (భారత రాయబార కార్యాలయం), ఇ-మెయిల్ ఐడి, క్యాటగిరి (ఫిర్యాదు వర్గీకరణ), డిస్క్రి ప్షన్ (3 వేల పదాలకు మించకుండా సమస్య వివరాలు) తప్పకుండా నమోదు చేయాలి. ఆధార్ కార్డు, రిక్రూటింగ్ ఏజెంట్ వివరాలు, ఫోన్, మొబైల్ నెంబర్ల వివరాలు కూడా నమోదు చేయవచ్చు, కాని తప్పనిసరి కాదు. బాధితుల తరఫున వారి కుటుంబ సభ్యులు, మిత్రులు ఫిర్యాదు నమోదు చేసిన సందర్భంలో వారి వివరాలు కూడా నమోదు చేయడం తప్పనిసరి. పాస్ పోర్ట్, డాక్యుమెంట్లు స్కాన్ చేసి ఒక ఎంబి సైజుకు మించకుండా పిడిఎఫ్ ఫార్మాట్ లో అప్ లోడ్ చేయవచ్చు. 'మదద్' వ్యవస్థ పని చేసే విధానం ఫిర్యాదు నమోదు అయిన వెంటనే మన మొబైల్ నెంబర్ కు, ఇ-మెయిల్ ఐడి కి ఫిర్యాదు సంఖ్యను తెలుపుతూ సమాచారం వస్తుంది. ఫిర్యాదుపై అధికారులు తీసుకున్న చర్యల గురించి, స్టేటస్ (స్థితి) గురించి ఆన్ లైన్ లో ట్రాక్ చేసుకోవచ్చు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రవాసి భారతీయ వ్యవహారాల విభాగం, సంబందిత భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బ్రాంచి సెక్రెటేరియట్ లు చెన్నై, గువాహటి, హైదరాబాద్, కొలకత లకు ఏకకాలంలో ఆన్ లైన్ లో సమాచారం వెళుతుంది. అన్ని శాఖలు సమన్వయంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తాయి. 'మదద్' ను ఉన్నత ప్రమాణాలతో, జవాబుదారీతనంతో, తక్షణం స్పందించే విధంగా రూపొందించారు. నిర్ణీత సమయంలో సమస్యను పరిష్కరించడానికి ఫిర్యాదును ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులుగా వర్గీకరించారు. దీనితో అధికారుల జవాబుదారీతనం మరియు బాద్యత పెరిగింది. ఫిర్యాదుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించారు. కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు 'మదద్' ను ఎలా ఉపయోగించుకోవచ్చు ? స్వంత కంప్యూటర్, లాప్ టాప్ లేనివారు, కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు 'మదద్' ను ఎలా ఉపయోగించుకోవచ్చు ? విదేశాల్లో ఉన్న వలసకార్మికులు గాని, భారతదేశంలోఉన్న వారి కుటుంబ సభ్యులు చాలా మందికి వెబ్ సైట్ ఉపయోగించడం తెలియదు. వీరిలో కంప్యూటర్ పరిజ్ఞానం లేని వారే అధికం. గ్రామాలు, పట్టణాలలోని 'మీ సేవ' కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా 'మదద్' సేవలు పొందడానికి జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేయాలి. నిర్వాహకులకు, ఆపరేటర్లకు తగిన శిక్షణ ఇవ్వాలి. సామర్థ్య పెంపుదల (కెపాసిటీ బిల్డింగ్) అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. అన్ని పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్, ఎంపీడివో కార్యాలయాల్లో కూడా తగు ఏర్పాట్లు చేయాలి. ఈ విషయానికి విస్తృత ప్రచారం కల్పించి, ప్రజల్లోకి తీసికెల్లాలి. మొబైల్ అప్లికేషన్ ఫిర్యాదుల నమోదు, పరిష్కార వ్యవస్థను అందరికి అందుబాటులోకి తేవడానికి మరింత సులభతరం, వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 'మదద్' మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టింది. అన్ని భారతీయ భాషల్లో ప్రవాసులు వారి కుటుంబ సభ్యులు సహాయం కోసం, సమాచారం కోసం 24 గంటలు పనిచేసే హెల్ప్ లైన్ (టోల్ ఫ్రీ) నెంబర్ 1800 11 3090 లేదా చార్జీలు వర్తించే నెంబర్లు +91 124 234 1002 మరియు +91 11 4050 3090 మరియు +91 11 2307 2536 కు కాల్ చేస్తే తెలుగుతో సహా అన్ని భారతీయ భాషల్లో జవాబు దొరుకుతుంది. ఓవర్సీస్ వర్కర్స్ రీసోర్స్ సెంటర్ వెబ్ సైటు http://www.owrc.in ను కూడా సందర్శించవచ్చు. తెలుగువారు హైదరాబాద్ నాంపల్లి గృహకల్ప లోని మైగ్రంట్ రిసోర్స్ సెంటర్ (వలసదారుల వనరుల కేంద్రం) హెల్ప్ లైన్ నెంబర్ +91 73067 63482 ఇ-మెయిల్: helpline@owrc.in కు సంప్రదించవచ్చు. ఉ. 10 గం.ల నుండి సా.5 గం.ల వరకు స్వయంగా కూడా సంప్రదించవచ్చు. - మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు. సెల్ & వాట్సప్: +91 93944 22622 ఇ-మెయిల్: mbreddy.hyd@gmail.com -
కేరళ పర్యాటకశాఖ మంత్రికి కేంద్రం షాక్
సాక్షి, త్రివేండ్రం: కేంద్ర ప్రభుత్వంపై కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శలు ఎక్కుపెట్టారు. కేరళ టూరిజం మంత్రి విషయంలో విదేశాంగ శాఖ వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో ఈ నెల 11 నుంచి 16 తేదీల మధ్య గ్లోబల్ టూరిజం సదస్సు నిర్వహిస్తున్నారు. కేరళ టూరిజం శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్‌కు సదస్సుకు రావాలంటూ ఆహ్వానం అందింది. అయితే విదేశాంగ శాఖ మాత్రం మంత్రి సురేంద్రన్‌కు అనుమతి నిరాకరించింది. దీనిపై ఆయన కేంద్రానికి లేఖ రాయగా, దానికి బదులు కూడా ఇవ్వలేదంట. ‘ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయమన్న విషయం స్పష్టమౌతోంది. కనీసం కారణాలు కూడా వివరించలేదు’ అని సురేంద్రన్ తెలిపారు. ఈ విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. అయితే విదేశాంగ శాఖ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. పలు కోణాల్లో పరిశీలించాకే మంత్రి సురేంద్రన్‌కు అనుమతి నిరాకరించామని స్పష్టం చేసింది. ఇక ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ ట్విట్టర్లో స్పందించారు. ఇదో దురదృష్టకరమైన ఘటన అని, కేంద్రం నిర్ణయంతో రాష్ట్రం షాక్‌కి గురైందని, కేంద్ర పక్షపాత ధోరణిపై తాము నిరసన తెలిపి తీరతామని ట్విట్టర్లో విజయన్ తెలిపారు. Central Govt denied permission to Kerala Tourism Minister Kadakampally Surendran to visit China for attending a tourism meet. UNFORTUNATE ! pic.twitter.com/nWT1mwfasY — Pinarayi Vijayan (@vijayanpinarayi) September 8, 2017 Entire Kerala is shocked, We register strong protest against this discriminatory & biased decision of the Ministry of External Affairs. — Pinarayi Vijayan (@vijayanpinarayi) September 8, 2017 -
నాలుగు నెలలుగా నరకయాతన
- సౌదీలో తెలంగాణ కార్మికుల అరిగోస - ముగిసిన క్షమాభిక్ష గడువు - ఎక్కడ అరెస్టు చేస్తారోనని కార్మికుల ఆందోళన - స్వదేశానికి రావడానికి సహకరించని రాయబార కార్యాలయం అధికారులు - తిండి లేక అలమటిస్తున్న తెలుగు కార్మికులు మోర్తాడ్ (బాల్కొండ): ఉపాధి కోసం సౌదీ అరేబియా దేశానికి వెళ్లిన తెలంగాణ కార్మికులు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉండలేక, స్వదేశానికి రాలేక నాలుగు నెలల నుంచి నరకయాతన అనుభవిస్తున్నారు. అక్రమంగా నివాసం ఉంటున్న వారు దేశం విడిచి వెళ్లేందుకు సౌదీ ప్రభుత్వం క్షమాభిక్ష అవకాశం కల్పించింది. అయితే, తెలుగు కార్మికులపై అక్కడి కంపెనీల యజమానులు తప్పుడు కేసులు పెట్టడంతో కార్మికులకు ఔట్ పాస్‌పోర్టులను మన రాయబార కార్యాలయ అధికారులు జారీ చేయలేకపోయారు. సౌదీలోని కంపెనీల యజమానులు తమను వంచించారని, అందువల్లనే తాము కంపెనీలను వదిలి బయట పనులు చేశామని, తమకు ఎలాగైనా దౌత్య సహాయం అందించాలని కార్మికులు రియాద్‌లోని మన విదేశాంగ శాఖ కార్యాలయం అధికారులను అభ్యర్థించారు. అయితే, రియాద్‌లోని విదేశాంగశాఖ కార్యాలయం అధికారులు తాము సహాయం అందించలేమని చేతులెత్తేయడంతో తెలంగాణ జిల్లాలకు చెందిన దాదాపు 40 మంది కార్మికులు ఆందోళన చెందుతున్నారు. క్షమాభిక్ష ముగిసి పోవడంతో సౌదీలో అక్రమంగా ఉంటున్న కార్మికులను అరెస్టు చేయడానికి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులకు పట్టుబడితే కఠిన శిక్షలకు గురికావాల్సి ఉంటుందనే భయంతో కార్మికులు రహస్యంగా జీవనం గడుపుతున్నారు. తమ ఇబ్బందులను సామాజిక మాధ్యమాల ద్వారా గల్ఫ్ తెలంగాణ కల్చరల్ అసోషియేషన్ అధికార ప్రతినిధి పాట్కూరి బసంత్రెడ్డితోపాటు పలువురికి వివరించారు. విదేశాంగశాఖ కార్యాలయం అధికారులు సహాయం అందించలేమని స్పష్టం చేయడంతో తమకేమీ పాలుపోవడం లేదని వారు వాపోతున్నారు. నాలుగు నెలల నుంచి సరైన తిండి కరువైందని, తమ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సౌదీలో రహస్యంగా ఉంటున్న కార్మికుల్లో నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఈ విషయమై గల్ఫ్ తెలంగాణ కల్చరల్ అధికార ప్రతినిధి పాట్కూరి బసంత్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సౌదీలోని కార్మికుల విషయాన్ని ఎన్ఆర్ఐ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు విదేశాంగశాఖ చొరవచూపితే కార్మికులు ఇళ్లకు చేరుకునే అవకాశం ఉందని, సౌదీలోని కంపెనీల యజమానులు తమకు జరిమానా చెల్లిస్తేనే ఔట్ పాస్‌పోర్టులకు ఆమోదం తెలుపుతామని చెబుతున్నారని వివరించారు. విదేశాంగ శాఖ అధికారులు సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరిపితే కార్మికులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. -
సాదిక్‌ను నగరానికి తీసుకొస్తాం
► ఆయన తండ్రికి విదేశాంగ శాఖ లేఖ ► ఏజెంట్ల చేతిలో మోసపోయి సౌదీలో యువకుడి నరకయాతన ► ‘సాక్షి’ కథనానికి స్పందించిన అధికారులు సాక్షి, హైదరాబాద్: ఉపాధి నిమిత్తం కానరాని దేశం వెళ్లి నరకయాతన అనుభవిస్తున్న ఓ యువకుడిని రక్షించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఏజెంట్ల మోసానికి బలై సౌదీ ఎడారిలో అష్టకష్టాలు పడుతున్న సాదిక్ అనే హైదరాబాద్ యువకుడిని నగరానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ‘అలా ఉన్నాడు...ఇలా అయ్యాడు’ అనే శీర్షికన ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు స్పందించారు. సాదిక్‌ను నగరానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని అతడి తండ్రి అలీయోద్దీన్కు విదేశాంగ కార్యాలయం అధికారులు లేఖ రాశారు. సాదిక్ ఉపాధి నిమిత్తం స్థానిక ఏజెంట్ అర్షద్, ముంబైలోని రాజు అనే ఏజెంట్ సాయంతో గత ఏడాది జూన్ 23న సౌదీకి వెళ్లాడు. తీరా వెళ్లాక ఏజెంట్లు హామీ ఇచ్చిన తోటమాలి పని కాకుండా అబా నగరంలో ఒంటెలు, మేకలకు కాపలా కాసే పనిలో పెట్టారు. అయితే, ఖఫీల్(యజమాని) అన్నపానీయాలు కూడా సరిగా ఇవ్వడంలేదు. 11 నెలలపాటు జీతం ఇవ్వలే దు. సౌదీ ఎడారిలో నరకం అనుభవించాడు. అతని దీనస్థితిని చూసిన అక్కడి హైదరాబాద్ యువకులు యజమాని చెర నుంచి పారిపోవడానికి సహకరించారు. ప్రస్తుతం సాదిక్ రియాద్ సమీపంలోని ఉన్నట్లు అలీయోద్దీన్ ‘సాక్షి’కి తెలిపారు. ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని రెయిన్‌బజార్ పోలీసులను, ముంబైలోని అంధేరీ పోలీసులను వేడుకున్నారు. ఈ మేరకు ఏజెంట్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తన కొడుకును సౌదీ ఖఫీల్ బంధీఖానా నుంచి రక్షించాలని భారత విదేశాంగ వ్యవహారాలశాఖకు ఉత్తరం రాశారు. ‘సాదిక్ సౌదీ నుంచి నగరానికి రప్పించడానికి చర్యలు తీసుకుంటాం’ అంటూ సాదిక్ తండ్రికి విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి కార్యాలయం నుంచి లేఖ వచ్చింది. మరోవైపు రియాద్‌లో ఉన్న హైదరాబాద్ యువకులు భారత కాన్సులేట్‌కు సాదిక్ వ్యవహారం తెలియజేశారు. దీంతో సౌదీ కాన్సులేట్ వారు సాదిక్ ఖఫీల్‌కు ఫోన్ చేసి రియాద్‌కు రావాలని కోరగా వారం రోజుల్లో వస్తానని చెప్పినట్లు తెలిసింది. -
పాస్‌పోర్ట్‌కు బర్త్ సర్టిఫికెట్ అక్కర్లేదు
- ఇకపై ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఉన్న వివరాలే ప్రాతిపదిక - విదేశీ మంత్రిత్వ శాఖ నిర్ణయం సాక్షి, అమరావతి: పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే ఇకపై బర్త్ సర్టిఫికెట్ అవసరం లేదు. ఇప్పటి వరకూ ఆ సర్టిఫికెట్ ఉంటేనే పాస్ట్‌పోర్ట్ వచ్చే పరిస్థితి. అయితే తాజాగా ఈ నిబంధనలను సవరిస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్ట్‌ల జారీని సరళతరం చేసేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలకు విదేశీ మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ గుర్తింపు కార్డుతోనైనా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆధార్, ఓటరుకార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర కార్డులపై పుట్టిన తేదీ వివరాలు ఉండాలి. కాగా, ఎస్ఎస్సీ సర్టిఫికెట్ జనన ధృవీకరణకు ప్రాతిపదికగా ఉండేది. కొంతమంది నిరక్షరాస్యులు ఈ నిబంధన వల్ల పాస్‌పోర్ట్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసే ఏవైనా రెండు గుర్తింపు కార్డులుంటే పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. అలాగే పోలీసు వెరిఫికేషన్ కూడా దరఖాస్తు చేసిన వారంలోగా పూర్తి చేస్తున్నట్టు పేర్కొంది. పాస్‌పోర్ట్ దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు.. ► ఆధార్ కార్డు ► ఓటరు కార్డు ► డ్రైవింగ్ లైసెన్సు ► ల్యాండ్ లైన్ ఫోన్ బిల్లు ► అద్దెకున్న వారు రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వాలి ► విద్యార్థులకు బోనఫైడ్ సర్టిఫికెట్ -
బయటి విద్యుత్ కొంటే అదనపు సర్‌చార్జి
- యూనిట్‌పై రూ.1.50–రూ.2 వరకు విధిస్తాం - పరిశ్రమలకు తేల్చిచెప్పిన విద్యుత్ శాఖ - జూలై నుంచి అమల్లోకి? సాక్షి, హైదరాబాద్: తాము సరఫరా చేస్తున్న విద్యుత్‌ను కాదని బహిరంగ మార్కెట్ నుంచి నేరుగా విద్యుత్ కొనుగోలు చేసే పరిశ్రమలపై యూనిట్‌కు రూ.1.50 నుంచి రూ.2 వరకు అదనపు సర్‌చార్జి విధిస్తామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) స్పష్టం చేసింది. ఓపెన్ యాక్సెస్ విధానంలో విద్యుత్ కొంటున్న వినియోగదారులపై ఇప్పటి కే దేశంలోని ఏడు రాష్ట్రాల్లో అదనపు సర్‌చార్జీ విధిస్తుండగా, త్వరలో రాష్ట్రంలో అమలు చేస్తా మని వెల్లడించింది. ఓపెన్ యాక్సెస్‌లో విద్యు త్ కొనుగోలు చేస్తున్న 42 పరిశ్రమల యాజ మాన్యాలతో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, తెలంగాణ ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు బుధవారం సమావేశమై ఈ విషయాన్ని తెలియజేశారు. గత ఆర్థిక సంవత్స రంలో ఈ పరిశ్రమలు ఓపెన్ యాక్సెస్ విధా నంలో 3,018 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ప్రైవేటు విద్యుదుత్పత్తిదారుల నుంచి నేరుగా కొనుగోలు చేశాయి. ఈ కంపెనీలు రాత్రివేళ తక్కువ ధరకు విద్యుత్ ఎక్సేS్చంజీల నుంచి కొనుగోలు చేసి పగటి పూట మాత్రం డిస్కంల నుంచి విద్యుత్ కొంటున్నాయి. దీంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా పలు విద్యుదు త్పత్తి కంపెనీల నుంచి డిస్కంలు సమీకరించిన విద్యుత్ రాత్రి పూట నిరుపయోగంగా ఉండిపో తోంది. పలు పరిశ్రమలు ఓపెన్ యాక్సెస్ విధా నంలో బయటి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుండడంతో డిస్కంల విద్యుత్ సరఫరా డిమాండ్ తగ్గిపోతోంది. దీంతో పీపీఏల్లోని నిబంధనల మేరకు డిస్కంలు రూ. 400 కోట్ల వరకు స్థిర చార్జీలను విద్యుదుత్పత్తి కంపెనీల కు చెల్లించాల్సి వచ్చింది. ఉత్తర– దక్షిణ విద్యు త్ గ్రిడ్లను అనుసంధానం చేస్తూ వార్ధా–డిచ్ పల్లి–మహేశ్వరం 765 కేవీ విద్యుత్ లైన్ అందుబాటులోకి రావడంతో ఓపెన్ యాక్సెస్‌కు వెళ్లే వినియోగదారుల సంఖ్య పెరిగే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో విద్యుత్ చట్టంలోని నింబంధనల ప్రకారం ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై అదనపు సర్‌చార్జి విధించనున్నామని రఘుమారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఓపెన్ యాక్సెస్‌పై అదనపు సర్‌చార్జి విధిస్తున్నారన్నారు. ఈఆర్సీ ఆమోదంతో జూలై నుంచి దీన్ని అమలు చేసే అవకాశముందన్నారు. -
లండన్ టెర్రర్ అటాక్: భారతీయులు సేఫ్!
న్యూఢిల్లీ: బ్రిటన్ పార్లమెంటు లక్ష్యంగా బుధవారం జరిగిన ఉగ్రవాద దాడిలో భారతీయ బాధితులు ఎవరూ లేనట్టు తెలుస్తున్నదని విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. లండన్‌లో జరిగిన ఈ ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న లండన్‌పై ఓ ఉగ్రవాది విరుచుకుపడ్డాడు. థేమ్స్ బ్రిడ్జిపై కారుతో బీభత్సం సృష్టించి.. సమీపంలోని పార్లమెంట్‌ను టార్గెట్ చేశాడు. బ్రిడ్జిపై కారును వేగంగా నడిపి ఇద్దరిని పొట్టనబెట్టుకొని.. పార్లమెంట్ భవనం వద్దా ఓ పోలీసు అధికారిని కత్తితో పొడిచి చంపాడు. చివరికి పోలీసుల కాల్పుల్లో అతడు హతమయ్యాడు. బుధవారం పార్లమెంటులో సమావేశాలు జరుగుతుండగానే ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి సుష్మా ట్విట్టర్లో స్పందించారు. 'లండన్‌లోని భారత హైకమిషన్‌తో నేను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాను. లండన్ దాడుల్లో భారతీయులు ఎవరూ గాయపడలేదని ఇప్పటివరకు అందిన నివేదికలను బట్టి తెలుస్తున్నది' అని సుష్మా ట్వీట్ చేశారు. I am in constant touch with Indian High Commission in London. There is no Indian casualty reported so far. #LondonAttack @HCI_London — Sushma Swaraj (@SushmaSwaraj) 22 March 2017 -
పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శిగా మహిళ
హైదరాబాద్: పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యదర్శిగా మొట్టమొదటి సారిగా ఓ మహిళా అధికారి నియమితులయ్యారు. గత నెలలో అమెరికా రాయబారిగా నియమితులైన ఐజాజ్ అహ్మద్ స్థానంలో తెహ్మినా జంజువా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా వెల్లడించారు. తెహ్మినా జంజువా ప్రస్తుతం జనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఆ దేశ శాశ్వత రాయబారిగా పనిచేస్తున్నారు. ఈమె ఇంత మునుపు ఇటలీ రాయబారిగా కూడా పనిచేశారు. దేశ, విదేశీ వ్యవహారాల్లో మంచి అనుభవమున్న జంజువా విదేశాంగ శాఖలో 1984లో ఉద్యోగంలో ప్రవేశించారు. దాదాపు 32 ఏళ్లపాటు వివిధ బాధ్యతలను ఈమె సమర్ధవంతంగా నిర్వహించారు. ఈమె ఇస్లామాబాద్‌లోని క్వాయిద్-ఎ.ఆజం యూనివర్సిటీతోపాటు అమెరికాలోని కొలంబియా వర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీలు పొందారు. -
హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారిగా విష్ణువర్ధన్‌రెడ్డి
ప్రస్తుత అధికారి అశ్వని సత్తారు ఢిల్లీకి బదిలీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా ఎమ్మడి విష్ణువర్ధన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు విదేశీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రెండో డాక్టరుగా ఈయన గుర్తింపు పొందారు. గతంలో డాక్టర్ శ్రీకర్‌రెడ్డి పాస్‌పోర్ట్ అధికారిగా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా ఉన్న అశ్వని సత్తారును ఢిల్లీకి బదిలీ చేశారు. కొత్తగా నియమితులైన డా.విష్ణువర్ధన్‌రెడ్డి నేడో రేపో బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది. ఈయన 2008 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. ఈయన ఢిల్లీలోని విదేశీ మంత్రిత్వ శాఖలో ఎక్స్టర్నల్ పబ్లిసిటీ సెల్లో అండర్ సెక్రటరీగా పనిచేశారు. జెనీవాలోని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యం లో పనిచేసే పీఎంఐ (పర్మనెంట్ మిషన్ ఆఫ్ ఇండియా)లో మానవహక్కుల విభాగంలో సెక్రటరీగా పనిచేశారు. నెల కిందటే ఆయన హైదరాబాద్ సచివాలయంలోని బ్రాంచ్ సెక్రటేరియట్‌కు బదిలీ అయ్యారు. ఇప్పుడు పాస్‌పోర్ట్ అధికారిగా నియమితులయ్యారు. ఈయన వరంగల్ జిల్లా కు చెందినవారని పాస్‌పోర్ట్ అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలో తెలంగాణలోని 10 జిల్లాలతో పాటు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా జిల్లాలు విశాఖపట్నం పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోకి వస్తాయి. -
పాస్‌పోర్ట్ నిబంధనలు సరళం
న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్ నిబంధనలు సులభతరం కానున్నాయి. పాస్‌పోర్ట్ కావాలనుకునే వారు సమర్పించాల్సిన డాక్యుమెంట్లు, ఇతర నిబంధనలను సరళతరం చేస్తూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలు త్వరలోనే అమలులోకి రానున్నాయి. ఇంతకు ముందు నిబంధనల ప్రకారం.. 1989 జనవరి 26, ఆ తరువాత జన్మించిన వారు పాస్ పోర్ట్ కోసం తప్పనిసరిగా తమ డేట్ ఆఫ్ బర్త్(డీఓబీ) సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉండేది. ఈ డీఓబి తప్పనిసరి అన్న నిబంధనను మారుస్తూ దాని స్థానంలో.. బర్త్ సర్టిఫికేట్ (బర్త్ అండ్ డెత్స్ రిజిస్ట్రార్ లేదా మున్సిపల్ కార్పోరేషన్ ఇచ్చేది), పాఠశాలలో ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్‌తో కూడిన సర్టిఫికేట్, పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు లాంటి వాటిలో ఏదో ఒకటి సమర్పిస్తే సరిపోతుందని విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ అందించిన రిపోర్ట్‌లో పేర్కొన్న అంశాలను సైతం విదేశాంగ మంత్రిత్వ శాఖ అంగీకరించింది. దీని ప్రకారం సింగిల్ పేరెంట్ పిల్లలకు పాస్‌పోర్ట్ నిబంధనలు సరళం కానున్నాయి. ఈ మార్పులకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
సుష్మ స్వరాజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
-
జోరుగా విదేశీ ఇన్వెస్టర్ల నమోదు
ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,700 మంది జత న్యూఢిల్లీ: భారత్‌లో పెట్టుబడి అవకాశాల పట్ల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అధికాసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో కొత్తగా 1,700 మంది విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ)మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద నమోదు కావడమే దీనికి నిదర్శనం. గత ఆర్థిక సంవత్సరంలో 2,900 మంది నమోదు చేసుకున్నారని, ఈ ఏడాది మార్చి నాటికి తమ వద్ద నమోదైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లసంఖ్య 4,311గా ఉందని, ఈ ఏడాది అక్టోబర్ చివరినాటికి ఈ సంఖ్య 6,079కు పెరిగిందని సెబీ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్–అక్టోబర్ కాలానికి విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.2,800 కోట్లు పెట్టుబడులు పెట్టగా,డెట్‌మార్కెట్ల నుంచి రూ.42,600 కోట్లు ఉపసంహరించుకున్నారని పేర్కొంది. విదేశీ నిధులు తరలిపోవడానికి పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ఒక కారణం కావచ్చని సెంట్రమ్ బ్రోకింగ్ ఫండ్ మేనేజర్ అంకిత్ అగర్వాల్ చెప్పారు.పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్వల్పకాలమేనని, దీర్ఘకాలంలో విదేశీ పెట్టుబడులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వివరించారు. దీర్ఘకాలానికి భారత వృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. నల్ల ధనంనిరోధానికి, నగదు లావాదేవీల్లో మరింత పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల దీర్ఘకాలంలో సానుకూల స్పందన వ్యక్తం కావచ్చని వివరించారు. భారత్‌కు ప్రాధాన్యం భారత మార్కెట్ నిలకడగా ఉందని, ఆర్థిక పరిస్థితులు బాగున్నాయని, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు అపారమని, ఆర్థిక, సామాజిక సంస్కరణలు జోరుగా కొనసాగుతున్నాయని అందుకే భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికివిదేశీ ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారని నిపుణులంటున్నారు. కంపెనీ బాండ్లలో నేరుగా పెట్టుబడులు పెట్టడానికి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు సెబీ ఆనుమతించిన విషయం తెలిసిందే. -
వేతనాలు చెల్లించని కువైట్ కంపెనీ
విలవిల్లాడిపోతున్న తెలుగు కార్మికులు ఇంటికి వెళ్తామన్నా అనుమతివ్వని యాజమాన్యం మోర్తాడ్: కువైట్‌లోని ప్రముఖ నిర్మాణ కంపెనీల్లో ఒకటైన ఖరాఫీ నేషనల్ కంపెనీ కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వ కుండా వేధింపులకు గురిచేస్తోంది. ఈ కంపె నీలోని వివిధ క్యాంపుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు దాదాపు రెండు వేల మం ది పనిచేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా రెండు, మూడు నెలలకు ఒకసారి వేతనాలు తీసుకుంటూ సర్దుబాటు చేసుకున్న కార్మికు లకు తాజాగా కంపెనీ మొండి చెయ్యి చూపింది. ఐదు నెలల నుంచి కార్మికులకు వేతనాలు చెల్లించడంలేదని కంపెనీలో సైట్ ఇన్చార్జిగా పనిచేస్తున్న నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం ఏర్గట్ల వాసి మచ్చ శ్రీని వాస్ ’సాక్షి’కి ఫోన్లో వివరించారు. ఐదు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోయినా పని విషయంలో కఠినంగానే వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ ఇళ్లకు వెళ్లిపోతామంటే అను మతి ఇవ్వడం లేదు. నెలల తరబడి వేతనం చెల్లించకపోవడంతో ఇంటి వద్ద చేసిన అప్పు లు తీర్చడం ఎలా అని కార్మికులు ప్రశ్నిస్తు న్నారు. ఒక్కో కార్మికునికి రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు కంపెనీ యాజమాన్యం వేత నం చెల్లించాల్సి ఉంది. విదేశాంగ శాఖ స్పందించి ఖరాఫీ నేషనల్ కంపెనీ యాజమా న్యంతో చర్చించి కార్మికుల సమస్యను పరి ష్కరించాలని పలువురు కోరుతున్నారు. -
ఆమెను తీసుకొచ్చే విమానమే దొరకలేదు
న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాలపాటు మంచానికే పరిమితమై ఎట్టకేలకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ జోక్యంతో వైద్యం చేయించుకునే అవకాశం దక్కినప్పటికీ ఈజిప్టుకు చెందిన ఎమాన్ అహ్మద్ (36)ను మరో సమస్య వెంటాడుతోంది. దాదాపు అరటన్నుతో ప్రపంచంలోనే అధిక బరువున్న మహిళగా రికార్డుల్లోకెక్కిన ఎమాన్‌ను ఈజిప్టు నుంచి ఎలా ముంబయికి తీసుకురావాలన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏ విమానం ఆమె ప్రయాణికి అనుమతిస్తుందనేది పెద్ద సమస్యగా మారింది. ఏ చార్టర్ విమానం కూడా ఆమెను తరలించేందుకు ఒప్పుకోవడం లేదు.. ముందుకు రావడం లేదు. ప్రస్తుతం కైరోలోని తన ఇంట్లోనే 25 ఏళ్లుగా ఉంటున్న ఆమె కనీసం ఒక్క అడుగుకూడా బయటకు వేయలేని పరిస్థితి. ముంబయికి చెందిన వైద్యులు ఆమెకు చికిత్స చేసేందుకు అంగీకరించడంతో తనకు జీవితంపై కొండంత ఆశ కలిగింది. అయితే, మొన్నటి వరకు వీసా దొరకలేదు. చివరకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఉదారతతో ఆ సమస్య తీరింది. కానీ, ఇప్పుడు ఆమెను తీసుకోచ్చే విషయంలో మాత్రం ఏం చేయాలని ఆ కుటుంబ సభ్యులు మదనపడుతున్నారు. ఈజిప్టు నుంచి ముంబయికి నేరుగా విమానాలు లేవు. అలాగే చార్టర్ విమానాలు కూడా అందుబాటులో లేవు. ఒక వేళ ఆమెను తరలించాలని నిర్ణయించినా ఆ విమానంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. జెట్ ఎయిర్ వేస్ నిబంధనల ప్రకారం 136 కేజీల లోపు బరువున్న రోగులను మాత్రమే స్ట్రెచర్ ద్వారా అనుమతిస్తారు. అంతకంటే ఎక్కువ బరువును అనుమతించరు. అయితే, ఏయిర్ ఇండియాకు మాత్రం అలాంటి సమస్య లేదు. అయితే, ముంబయి నుంచి ఆఫ్రికాకు నేరుగా విమాన సర్వీసు లేదని, జర్నీలోని ఫ్రాంక్ ఫర్డ్ వరకు అవకాశం ఉందని, వారి విజ్ఞప్తిని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని ఎయిర్ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని లోహానీ తెలిపారు. ఈమెకు సర్జరీ చేసి బరువు తగ్గించడాన్ని ముంబయి వైద్యులు చాలెంజ్‌గా తీసుకున్నారు. -
అరటన్ను మహిళకు సుష్మా వరం
న్యూఢిల్లీ: దాదాపు అరటన్ను బరువుతో మంచానికే పరిమితమైన ఓ ఈజిప్టు మహిళకు భారత్‌లో చికిత్స పొందేందుకు అనుమతి లభించింది. ఈజిప్టులోని భారత రాయబార కార్యాలయం ఆమెకు వీసా మంజూరు చేసింది. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఉదారత వల్లే ఆమెకు ఈ వీసా దక్కింది. ఎమాన్ అహ్మద్(36) ఈజిప్టులోని అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన మహిళ. ఆమె ప్రస్తుతం 500 కేజీల బరువుంది. స్థూలకాయం కారణంగా పాఠశాలకు వెళ్లే సమయంలోనే బరువు పెరగడం ప్రారంభమైంది. దీంతో చదువు మధ్యలోనే ఆపేసింది. అయితే, ఆమెకు ముంబయిలోని వైద్యులు చికిత్స చేసేందుకు ముందుకొచ్చారు. ఆమెకు వీసా ఇచ్చి ముంబయిలో చికిత్స పొందేందుకు అవకాశం ఇవ్వాలని బేరియాట్రిక్ సర్జన్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన సుష్మా ‘ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఆమెకు మేం తప్పకుండా సహాయం చేస్తాం’ అంటూ ట్వీట్ చేశారు. ఆ మాట ప్రకారమే మంగళవారం భారత రాయబార కార్యాలయం ఎమాన్‌కు వీసా మంజూరు చేసింది. దీంతో త్వరలోనే ఆమె భారత్‌కు వచ్చి ముంబయిలో చికిత్స పొందనుంది. ప్రస్తుతం సుష్మా స్వరాజ్ మూత్రపిండాల సమస్యతో ఆస్పత్రిలో ఉన్న విషయం తెలిసిందే. -
యువశక్తితోనే భారత్ అభివృద్ధి
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సాక్షి,హైదరాబాద్: చైనా, జపాన్‌లాంటి దేశాల్లో వయసు మళ్లిన వారి సంఖ్య పెరుగుతుంటే.. యువతతో ఉరకలెత్తుతున్న భారత్ అనతికాలంలోనే అభివృద్ధిపథంలో దూసుకుపోతుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. యువశక్తిని సరిగ్గా వినియోగించుకోవడంతోపాటు వారికి విద్య, శిక్షణ, పోషకాహారం కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. పట్టణ ప్రాంత యువతకే కాకుండా గ్రామీణ యువతకు సమాన అవకాశాలు అందాల్సిన అవసరం ఉందన్నారు. విదేశాంగ శాఖ, ఐఎస్బీ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ‘ఎకానమిక్ ఎన్విరాన్మెంట్ అండ్ పాలసీ ఇండియా వర్సెస్ గ్లోబల్ ఎకానమీ చాలెంజెస్ డెవలప్మెంట్’ అన్న అంశంపై సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో కేటీఆర్ మాట్లాడారు. ‘‘వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న మనదేశంలో సేవారంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. విద్యారంగంలో సంస్కరణలు తేవాల్సిన ఆవశ్యకత ఉంది. తెలంగాణ అనేక అంశాల్లో ఎంతో ముందుంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, విద్యుదుత్పత్తి తదితర అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. టాస్క్ పథకంతో నైపుణ్య శిక్షణ, టీ-హబ్‌తో నవకల్పన, టీ-వర్త్తో తయారీ రంగంలో రాష్ట్రం పురోగతి దిశగా అడుగులేస్తోంది’’ అని చెప్పారు. టీఎస్-ఐపాస్ ద్వారా పరిశ్రమలకు ఏకగవాక్ష విధానంలో అనుమతులిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు రాయబారులు, విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఇది మాకు పునర్జన్మ!
ప్రతిక్షణం ప్రాణ భయమే.. తిరిగి ఇంటికి వస్తామని అనుకోలేదు - ప్రొఫెసర్లు గోపీకృష్ణ, బలరాం కిషన్ - లిబియాలో ఉగ్రవాదుల చెర నుంచి విడుదలై ఇంటికి చేరిన ప్రొఫెసర్లు - సుమారు 14 నెలల నిర్బంధం తర్వాత స్వదేశానికి సాక్షి, హైదరాబాద్: ‘అవి చీకటి రోజులు. ప్రతి క్షణం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతి కాం. తిరిగి ఇంటికి వస్తామని అనుకోలేదు. మాకు ఇది పునర్జన్మ’ సుమారు 14 నెలలపాటు లిబియాలో ఉగ్రవాదుల చెరలో ఉన్న ప్రొఫెసర్ గోపీకృష్ణ, ప్రొఫెసర్ బలరాం కిషన్ల మనోగతం ఇది. అమెరికా సైన్యం సహాయం తో ఈనెల 14న ఉగ్రవాదుల చెర నుంచి విము క్తి పొందిన వీరిద్దరు శనివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరి రాకతో కళ్లు కాయలు కాచే లా ఎదురు చూసిన ఆ రెండు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలోని బలరాం కిషన్, నాచారంలోని గోపీకృష్ణ ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొంది. పద్నాలుగు నెలల నిర్బంధంలో బిక్కుబిక్కుమంటూ బతికిన ప్రొఫెసర్లు తమ భార్యా పిల్ల లు, కుటుంబసభ్యులను చూసి ఆనందబాష్పా లు రాల్చారు. రెండున్నర ఏళ్ల తర్వాత తన కు టుంబాన్ని చూసుకోగలిగానని గోపీకృష్ణ సం తోషం వ్యక్తం చేశారు. 14వ తేదీనే ఉగ్రవాదుల చెర నుంచి బయటపడినప్పటికీ 21 వర కు లిబియాలోని భారత రాయబార కార్యాలయంలోనే ఉండి, 2 రోజుల కిందట ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం విదేశాంగ శాఖ పర్యవేక్షణలోనే ఉన్న వీరిద్దరూ.. అధికారుల సాయం తో తమ ఇళ్లకు చేరుకున్నారు. గోపీకృష్ణ ‘సాక్షి’తో మాట్లాడుతూ, ‘ఎందుకు కిడ్నాప్ చేశారో తెలి యదు. అసలు వదిలేస్తారో లేదో, ఎంత కాలం ఆ చెరలో ఉండాలో తెలియని భయంకరమైన ప్రశ్నలు వేధించేవి’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు. అనుభవాలు ఆయన మాటల్లోనే.. అసలేం జరిగింది.. 2015 జూలై 29న మేం పని చేస్తున్న సిర్తే యూనివర్సిటీ నుంచి ఇండియాకు బయలుదేరాం. ట్రిపోలీ పూర్తిగా ఉగ్రవాదుల నిర్బంధం లో ఉంది. దేశానికి రావాలంటే ట్యూనిషియా మీదుగా దుబాయ్ వెళి అక్కడి నుంచి రావలసిందే. ఆ రోజు వర్సిటీ నుంచి కారులో కొద్దిదూరం రాగానే ట్రిపోలీ చెక్‌పోస్టు వద్ద కొందరు మమ్మల్ని వెంబడించి నిర్బంధంలోకి తీసుకున్నారు. మా కిడ్నాప్ వార్త బయటి ప్రపంచానికి తెలుసో లేదో కూడా తెలియని భయంకరమైన నిర్బంధంలో 414 రోజులు గడిచాయి. అది పూర్తిగా జైలు జీవితం లాంటిదే. రాత్రి, పగలు మాత్రమే తెలిసేది. మాకు మేం మాట్లాడుకోవడం తప్ప మరో ప్రపంచం తెలియదు. ఎక్కడ ఉన్నామో తెలియదు. కాగితం పైన రాసుకుని ఒక అంచనాతో రోజులు, వారాలు లెక్కించుకొ నే వాళ్లం. నన్ను, బలరాం కిషన్‌ను ఒకే గదిలో బంధించారు.మాతోపాటు విజయ్‌కుమార్, లక్ష్మీకాంత్‌లను కూడా కిడ్నాప్ చేశారు. కాని రెండు రోజుల్లోనే వదిలేశారు. మమ్మల్ని ఎం దుకు కిడ్నాప్ చేశారో, ఎప్పుడు వదిలేస్తారో చెప్పలేదు. ఎవరూ మాట్లాడేవాళ్లు కాదు. మూడు నెలలకోసారి డెన్ మార్పు 2,3 నెలలకో సారి డెన్ మార్చేవాళ్లు. మమ్మల్ని కొట్టడం, దూషించడం వంటి వేధింపులకు పాల్పడలేదు. నూడుల్స్ వంటి ఆహారం మెక్డోనా, ఈజిప్షియన్ రైస్ ఇచ్చేవారు. తినలేకపోయేవాళ్లం. మా కిడ్నాప్ తర్వాత సిర్తే యూని వర్సిటీ అధికారులు కానీ, సహాధ్యాయులు కానీ మా కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అదే చాలా బాధనిపించింది. అందరికీ కృతజ్ఞతలు.. ఈనెల 14వ తేదీ మా జీవితంలో గొప్ప వెలుగు తెచ్చిన సుదినం. అమెరికా సైనికులు, లిబియా ఆర్మీ, భారత విదేశాంగ శాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు. అందరి కృషి వల్ల చెర వీడి బయటకు వచ్చాం. ఉగ్రవాదుల చెర నుంచి నేరుగా లిబియాలోని మన రాయబార కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ అన్ని సేవలు లభించాయి. ఆప్యాయంగా పలకరించారు. ఇదీ నేపథ్యం.. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన తిరువీధుల గోపీకృష్ణ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్. 2004 నుంచి 2007 వరకు భువన గిరి అరోరా కళాశాలలో పని చేశారు. 2008లో లిబియా వెళ్లారు. హైదరాబాద్‌కు చెందిన సీహెచ్ బలరామ్ కిషన్ ఇంగ్లిష్ ప్రొఫెసర్. 2009లో అక్కడికి వెళ్లారు. ఇద్దరు ప్రతి ఏటా సెలవుల్లో హైదరాబాద్ వచ్చి వెళ్లేవారు. అలా 2015 జూలై 29న అక్కడి నుంచి వస్తుండగా కిడ్నాపయ్యారు. 414 రోజుల తర్వాత విడుదలయ్యారు. -
పక్కాగా ఉడీ ఉగ్రదాడి!
న్యూఢిల్లీ: ఉడీ దాడి నేపథ్యంలో భారత్ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. దాడిలో పాక్ జాతీయుల పాత్రకు సంబంధించి వీలైనన్ని ఎక్కువ ఆధారాలను సేకరించింది. పఠాన్‌కోట్ ఘటనలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పాత్రపై విచారణకు ఆ దేశ సంయుక్త విచారణ కమిటీ వచ్చినట్లుగా ఈ సారి అలాంటి అవకాశాలేం లేకుండా భారతే అన్ని వివరాలను అందిస్తోంది. బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి భారత్‌లో పాక్ కమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను పిలిపించిన విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్.. దాడిలో ఉగ్రవాదుల వద్ద లభ్యమైన వాకీ టాకీలు, పాక్ తయారీ గ్రనేడ్లు, వేలి ముద్రల వివరాలను అందజేశారు. ఒకవేళ పాకిస్తాన్ దీనిపై మరింత లోతుగా విచారణ జరపాలనుకుంటే డీఎన్ఏ శాంపిల్స్, వేలిముద్రలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా, ఉడీ ఘటన నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య 56 ఏళ్ల క్రితం జరిగిన నదీజలాల (బియాస్, రావి, సట్లేజ్, సింధు, చీనాబ్, జీలం నదులు) ఒప్పందం తెరపైకి వచ్చింది. పాక్‌పై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ ఈ ఒప్పందాన్ని పక్కనపెట్టి నీటి విడుదల ఆపాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ‘ఈ ఒప్పందం మొదటి పేజీలోనే గుడ్‌విల్ అని రాసుంది. పరస్పర సహకారం, అంగీకారం లేనప్పుడు ఈ ఒప్పందానికి అర్థమేముంటుంది’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. -
విదేశీ ఇన్వెస్టర్లకు రెడ్‌కార్పెట్!
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లకు నిబంధనలను మరింత సరళతరం చేయడంపై సెబీ దృష్టిసారించింది. ప్రధానంగా దేశీ క్యాపిటల్ మార్కెట్లో కొన్ని విభాగాలకు చెందిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ)కు నేరుగా ట్రేడింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. అయితే, ముందుగా డెట్ మార్కెట్లో(బాండ్స్) ఇందుకు అనుమతించి... క్రమంగా ఈక్విటీ మార్కెట్లకూ వర్తింపజేయనున్నట్లు సెబీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై నేడు(శుక్రవారం) జరగనున్న బోర్డు సమావేశంలో సెబీ చర్చించనున్నట్లు సమాచారం. ఎఫ్‌పీఐలకు ఈ అనుమతులపై సెబీ ముందుగా చర్చాపత్రాన్ని విడుదల చేయనుందని.. వివిధ పక్షాల నుంచి అభిప్రాయాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎఫ్‌పీఐలు భారత్ మార్కెట్లో దేశీ స్టాక్ బ్రోకర్ల ద్వారా ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు.కాగా, కేటగిరీ-1, 2 ఎఫ్‌పీఐలకు సెబీ ఈ ప్రత్యక్ష ట్రేడింగ్ అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో సావరీన్ వెల్త్ ఫండ్స్, సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇక కేటగిరీ-2లో మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకులకు చోటుంది. అయితే, హెడ్జ్ ఫండ్స్, వ్యక్తిగత ఇన్వెస్టర్లతోపాటు ఇతర హై-రిస్క్ విదేశీ ఇన్వెస్టర్లకు ఈ సదుపాయం లేనట్టే. ప్రధానంగా దేశీ క్యాపిటల్ మార్కెట్లోకి విదేశీ నిధులను మరింత వెల్లువెత్తేలా చేయడమే సెబీ తాజా ప్రతిపాదనల ఉద్దేశం. అయితే, ఇది దేశీ బ్రోకరేజి సంస్థల మనుగడపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సెబీవద్ద రిజిస్టర్ అయిన ఎఫ్‌పీఐలు ఇప్పటివరకూ దేశీ మార్కెట్లో రూ.11.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో రూ.8.45 లక్షల కోట్లు ఈక్విటీ(స్టాక్స్)ల్లో, రూ.3.06 లక్షల కోట్లు బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. చర్చించనున్న ఇతర ప్రతిపాదనలు... * కంపెనీలు నాన్-ప్రమోటర్ల(ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్)కు ప్రత్యేక హక్కులు కల్పించేందుకు మైనారిటీ ఇన్వెస్టర్ల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. * రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు(రీట్స్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు(ఇన్విట్స్)లో పెట్టుబడులకు మరింత సరళతరమైన నిబంధనలు. ఇప్పటికే దీనిపై సంప్రతింపుల ప్రక్రియ కొనసాగుతోంది. 2014లో వీటిని సెబీ నోటిఫై చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ ట్రస్ట్‌ల ఏర్పాటు, వీటిని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడానికి దారులుతెరిచింది. * స్టార్టప్‌ల లిస్టింగ్ నిబంధనల సరళతరం. 2015 ఆగస్టులో సెబీ దీన్ని అమల్లోకి తీసుకురాగా, ఇప్పటివరకూ ఒక్క స్టార్టప్ కూడా లిస్ట్ కాలేదు. -
మందుల మాఫియా ఉచ్చుకు అమాయకుడు బలి
- నిషేధిత మందులను తీసుకువచ్చాడని.. - జైళ్లో పెట్టిన దుబాయ్ పోలీసులు - ఎయిర్‌పోర్టులోనే అరెస్టు అయిన తడపాకల్ వాసి - పార్శిల్ పంపించిన వ్యక్తుల సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా) గల్ఫ్‌లో నిషేధిత మందుల వ్యాపారం చేస్తున్న మాఫియా ఉచ్చుకు అమాయకుడు బలి అయ్యాడు. రెండు నెలల సెలవుపై దుబాయ్ నుంచి ఇంటికి వచ్చిన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తడపాకల్ వాసి పూసల శ్రీనివాస్ వారం రోజుల కింద మళ్లీ దుబాయ్ వెళ్లాడు. అయితే అతని వద్ద గల్ఫ్‌లో నిషేధించబడిన మందుల పార్శిల్ దొరకడంతో ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లకముందే దుబాయ్ పోలీసులు అరెస్టు చేసి జైళ్లో పెట్టారు. మన దేశంలో విరివిగా వినియోగించే అనేక మందులను గల్ఫ్ దేశాలు చాలా ఏళ్ల క్రితమే నిషేధించాయి. ఒంటినొప్పులు, నిద్రమాత్రలు తదితర రకాల మందుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని గుర్తించిన గల్ఫ్ దేశాలు మందులను నిషేధించడమేకాకుండా ఈ మందులతో పట్టుబడిన వారికి కఠిన శిక్షలను అమలు చేస్తున్నాయి. పూసల శ్రీనివాస్ దుబాయ్‌లో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో కార్మికునిగా నాలుగేళ్ల నుంచి పని చేస్తున్నాడు. ఇటీవల కంపెనీ సెలవు ఇవ్వడంతో ఇంటికి వచ్చిన అతను మళ్లీ దుబాయ్‌కు వెళ్లడానికి మోర్తాడ్‌లోని ఒక ట్రావెల్స్‌లో టిక్కెట్ బుకింగ్ చేసుకున్నాడు. ట్రావెల్స్ నిర్వహిస్తున్న వ్యక్తి మెట్‌పల్లికి చెందిన ఒక వ్యక్తి నుంచి తీసుకున్న పార్శిల్‌ను శ్రీనివాస్‌కు అప్పగించాడు. దుబాయ్‌లో అజయ్ అనే తమ వ్యక్తి పార్శిల్‌ను రిసీవ్ చేసుకుంటాడని శ్రీనివాస్‌కు వివరించారు. పార్శిల్లో ఏమి ఉందో చెప్పకుండానే పార్శిల్ ఇవ్వడంతో శ్రీనివాస్ దానిని తన లగేజీలో పెట్టుకుని దుబాయ్ చేరుకున్నాడు. అయితే నిషేధిత మందుల రవాణాపై నిఘాను తీవ్రతరం చేసిన దుబాయ్ పోలీసులు శ్రీనివాస్ లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. లగేజీలో పార్శిల్ దొరకడంతో దానిని పరిశీలించగా నిషేధిత మందులు లభ్యం అయ్యాయి. దీంతో ఎయిర్‌పోర్టులోనే శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. అయితే ఈ పార్శిల్లో ఏమి ఉందో తనకు తెలియదని దుబాయ్‌లో తాను ఉండే క్యాంపునకు అజయ్ అనే వ్యక్తి వచ్చి తీసుకువెళతాడని శ్రీనివాస్ ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదు. అంతేకాక అజయ్ సెల్‌నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అయ్యింది. జైళ్లో బందీగా ఉన్న శ్రీనివాస్ తన అరెస్టు విషయాన్ని తన సహచరుల ద్వారా కుటుంబ సభ్యులకు అందించాడు. ఇక్కడ పార్శిల్ అందించిన వ్యక్తుల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయి. పొట్టకూటి కోసం దుబాయ్‌లో పని చేస్తున్న శ్రీనివాస్ జైలు పాలుకావడంతో ఆయనపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శ్రీనివాస్‌ను ఈనెల చివరి వారంలో దుబాయ్ పోలీసులు కోర్టులో హాజరు పరిచితే ఎంత కాలం శిక్ష పడుతుందో స్పష్టం కానుంది. మందుల మాఫియా ధన దాహానికి ఇప్పటికే ఎంతో మంది అమాయకులు బలి అయ్యారు. కొందరు శిక్షలు అనుభవిస్తుండగా మరికొందరు ఎంతో ఖర్చు పెట్టుకుని ఇళ్లకు చేరుకున్నారు. విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు స్పందించి అమాయకుడైన శ్రీనివాస్‌ను విడిపించాలని అతని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
మిమ్మల్ని ఉచితంగా భారత్‌కు తీసుకువస్తాం
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులందరూ వచ్చే నెల 25వ తేదీ లోపల స్వదేశానికి తిరిగిరావాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సూచించారు. ఎలాంటి ప్రయాణ ఛార్జీలు లేకుండా ఉచితంగా భారత్‌కు తీసుకువస్తామని, ఇందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మూతపడిన కంపెనీల సమస్యలను సౌదీ అరేబియా ప్రభుత్వం పరిష్కరిస్తుందని, అప్పడు భారతీయులకు రావాల్సిన జీతాల బకాయిలను పరిష్కరిస్తారని సుష్మా పేర్కొన్నారు. వచ్చే నెల 25లోపు స్వదేశానికి తిరిగిరాలేకపోయిన భారతీయులు సౌదీలో ఉండటానికి సొంత ఖర్చులు పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అంతేగాక తిరిగిరావడానికి విమాన ఛార్జీలు కూడా వారే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సౌదీ ఆర్థిక వ్యవస్థ దిగజారడం, చమురు ధరలు తగ్గడం వల్ల చాలా కంపెనీలు మూతపడటంతో వేలాది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సమస్యపై సుష్మా స్వరాజ్ వెంటనే స్పందించి సౌదీలో ఉపాధి కోల్పోయిన భారతీయులకు ఉచిత రేషన్ అందజేయాల్సిందిగా అక్కడ ఎంబసీ అధికారులను ఆదేశించారు. -
ఆమెకు ఎన్ని చేతులున్నాయి?
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఎన్ని చేతులు ఉన్నాయి.. అసలు రోజులో ఆమెకు ఎన్ని గంటలు ఉంటున్నాయని నెటిజన్లకు ఆశ్చర్యం వేస్తోంది. ఒకవైపు విదేశాలతో సంబంధాలు జాగ్రత్తగా నెరపడంతో పాటు మరోవైపు ఒలింపిక్ పతక విజేతలను అభినందిస్తుంటారు. ఇంకోవైపు పతకాలు రానివారిని ఓదారుస్తుంటారు. ఇంకా గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తుంటారు. ఇవన్నీ కాక.. ప్రజలకున్న పాస్‌పోర్టు సమస్యలను కూడా తీరుస్తానంటున్నారు. దీనంతటికీ ఆమెకు సమయం ఎక్కడి నుంచి దొరుకుతోందంటే.. ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం ఆమె రిటైరైన తర్వాత ఆత్మకథ రాస్తే అందులో వెతుక్కోవాల్సిందేనని ట్విట్టర్ జనాలు అంటున్నారు. రియో ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో తీవ్రంగా గాయపడిన వినేష్ ఫోగట్‌ను.. 'నువ్వు మా కూతురి లాంటి దానివి' అంటూ ఓదార్చిన ఆమె, తాజాగా సైనా నెహ్వాల్‌ను కూడా త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. మరోవైపు తమకు పాస్‌పోర్టు సమస్య ఉందని చెప్పినవాళ్లకు ఆ సమస్యను పరిష్కరిస్తానంటూ ఊరట కలిగిస్తున్నారు. అవసరమైనప్పుడు ఆయా ట్వీట్లలో కొంత హాస్యం కూడా జోడిస్తూ అవతలి వాళ్లను నవ్విస్తున్నారు. తాజాగా సింగపూర్‌లో ఉంటున్న ఆరిఫ్ రషీద్ జర్గర్ అనే భారతీయుడికి ఇటీవలే కొడుకు పుట్టాడు. అతడికి పాస్‌పోర్టు తీసుకోవడం బాగా ఇబ్బంది అవుతోంది. దాంతో అతడు తన చిన్నారి కొడుకును చూసుకోలేకపోతున్నాడు. దాంతో జర్గర్ ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశాడు. తన పిల్లాడికి పాస్‌పోర్టు రాకపోతే, అతడు వాట్సప్ లేదా స్కైప్లనే తన తండ్రి అనుకుంటాడంటూ ట్వీట్లో తెలిపాడు. దాంతో సుష్మా అతడికి సమాధానం పెడుతూ.. అలాగైతే చాలా కష్టం అయిపోతుందని, తాను కలగజేసుకుని ఇప్పిస్తానని తెలిపారు. Ohh ! That will be too much, pl give me the details. @Gen_VKSingh @CPVIndia @passportsevamea https://t.co/IgGaCAE5n1 — Sushma Swaraj (@SushmaSwaraj) 18 August 2016 -
సౌదీలో భారతీయుల క్షుద్బాధ
ఆకలితో అలమటిస్తున్న 10 వేల మంది - ట్విటర్లో సుష్మకు వివరించిన ఓ బాధితుడు.. తక్షణమే స్పందించిన మంత్రి - సౌదీలోని భారత రాయబార కార్యాలయం సాయంతో భోజన ఏర్పాట్లు - అక్కడి అధికారులతో మాట్లాడుతున్న మంత్రులు వీకే సింగ్, ఎంజే అక్బర్ - జీతాలివ్వకుండా.. కంపెనీలు మూసేస్తున్న సౌదీ చమురు సంస్థలు జెడ్డా/న్యూఢిల్లీ : కుటుంబ పోషణకోసం.. పొట్టచేతపట్టుకుని సౌదీ బాటపట్టిన భారతీయులకు చాలా పెద్ద కష్టం వచ్చిపడింది. సౌదీ అరేబియా, కువైట్‌లో నష్టాల బాట పట్టిన చమురు, ఇతర కంపెనీలు తమ ఉద్యోగులను తీసేస్తుండటం, జీతాలివ్వకుండా కంపెనీలను మూసేస్తున్నాయి. ఇటీవల ఈ సమస్య చాలా తీవ్రంగా మారింది. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో.. భారతీయ కార్మికులు ఎక్కువగా పనిచేసే కంపెనీలు మూసేయటంతో.. 10వేల మంది భారతీయులు మూడ్రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు. బాధితుల్లో తెలుగువారు కూడా ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించిన విదేశాంగ శాఖ.. ముందుగా అక్కడి బాధితులకు భోజన, వసతి ఏర్పాట్లు చేసింది. ‘సౌదీలో ఏ ఒక్క భారతీయుడూ ఆకలితో ఉండకుండా చర్యలు తీసుకుంటున్నాం’ అని సుష్మ ట్వీట్ చేశారు. మూడ్రోజులుగా వీరు ఆకలికి అలమటిస్తున్నా ఈ విషయం బయటకు రాలేదు. అయితే.. ఇమ్రాన్ ఖోకర్ అనే వ్యక్తి ట్వీటర్ ద్వారా విదేశాంగ మంత్రి సుష్మకు తమ సమస్య గురించి ట్వీట్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన సుష్మ తక్షణ చర్యలకు ఉపక్రమించారు. భారతీయులకు ఆహారం అందించాలని సౌదీలోని భారత రాయబార కార్యాలయాన్ని మంత్రి ఆదేశించారు. సమస్యను పరిష్కరించేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ సౌదీ వెళ్తారని, మరో మంత్రి ఎంజే అక్బర్ పరిస్థితిపై సౌదీ అధికారులతో మాట్లాడతారని పేర్కొన్నారు. అనంతరం భారతీయులకు ఆహారం సరఫరా చేస్తున్న దృశ్యాలను మంత్రి సుష్మ పోస్టు చేశారు. కువైట్‌లో పరిస్థితులను వెంటనే అదుపులోకి తీసుకురావొచ్చని.. అయితే సౌదీ అరేబియాలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని సుష్మ తెలిపారు. గల్ఫ్‌లో భారతీయుల వెతలు ‘కూటి కోసం.. కూలి కోసం’ అంటూ నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు ఏ పనైనా చేసేందుకు గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిలో భారతీయులే అత్యధికం. ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్లేవారికి కచ్చితమైన పనేమీ దొరకదు. దీంతో ఏ పని దొరికితే అది చేసేందుకు వెనుకాడరు. చాలా సందర్భాల్లో భారతీయ కార్మికులకు అక్కడి యాజమాన్యాలు చాలా దారుణంగా చూస్తాయి. బాధితుల్లో తెలుగు వారు.. జెడ్డాలో ఆకలికి అలమటించిన వారిలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామబాద్ జిల్లాల నుంచి వెళ్లినవారున్నారు. సౌదీ ఓజర్, సౌదీ బిన్ లాడెన్ కంపెనీల్లో ఏడు నెలలుగా పనిలేకపోవటంతో.. అలాగే అక్కడ జీవనం గడుపుతున్నట్లు అక్కడ పనిచేస్తున్న ఇమ్రాన్ అనే వ్యక్తి సాక్షికి ఫోన్లో తెలిపారు. తిండిలేక ఖర్జూరం, నీళ్లు తాగి బతుకుతున్నామన్నారు. పాస్‌పోర్టులు.. కంపెనీల దగ్గరే ఉండటంతో ఎక్కడికీ కదల్లేక పోతున్నారని.. తమను ఆదుకోవాలని అక్కడి భారతీయ కార్మికులు కోరుతున్నారు. అసలు సమస్యేంటి? గల్ఫ్ దేశాల్లో మొదట్నుంచీ చమురు, చమురు ఆధారిత కంపెనీలే ఎక్కువ. అయితే ఇక్కడి కంపెనీల్లో పనిచేసేందుకు పెద్ద సంఖ్యలో విదేశీ కార్మికులు వస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురుకు మంచి ధర ఉన్నన్ని రోజులు ఈ కంపెనీలు కోట్లకు కోట్లు గడించాయి. అయినా కార్మికుల వేతనాలు నామమాత్రమే. కానీ ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధర తగ్గటం, రెండేళ్లుగా ఇదే ధోరణి కొనసాగుతుండటంతో.. గల్ఫ్ దేశాల కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. సౌదీ కంపెనీల పరిస్థితి మరీ దారుణం. దీంతో ఇక్కడి కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఈ పరిస్థితిని అంతర్జాతీయ మార్కెట్లు ముందుగానే ఊహించాయి. దీని ప్రభావం భారత్‌పై ఎక్కువగా ఉంటుందని హెచ్చరించాయి. అనుకున్నట్లుగానే ఉపద్రవం ముంచుకొచ్చింది. సౌదీలో పరిస్థితి తీవ్రంగా ఉండగా.. ఇతర గల్ఫ్ దేశాల్లో త్వరలోనే సమస్య తప్పేట్లు లేదు. -
ఉద్యోగాలు కోల్పోయిన వందలాది భారతీయులు
న్యూఢిల్లీ: ఉపాధికోసం సౌదీ అరేబియా, కువైట్ వెళ్లిన వందలాదిమంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. ఫ్యాక్టరీలు మూతపడటంతో భారతీయులు చాలామంది ఉపాధి కోల్పోయారని, వారికి జీతాలు చెల్లించడం లేదని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ సౌదీ అరేబియా వెళ్లారని సుష్మా శనివారం ట్వీట్ చేశారు. సౌదీ అరేబియాలోని జెద్దాలో గత మూడురోజుల్లో దాదాపు 800 మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారని ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా సుష్మా దృష్టికి తీసుకురాగా ఆమె స్పందించారు. ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులకు భోజనం సమకూర్చాల్సిందిగా సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం అధికారులను ఆదేశించినట్టు సుష్మా ట్వీట్ చేశారు. కువైట్ కంటే సౌదీ అరేబియాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, భారతీయులను ఆదుకుంటామని తెలిపారు. -
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు @ రూ.15,003 కోట్లు..
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) జోరు కొనసాగుతోంది. ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటిదాకా భారత క్యాపిటల్ మార్కెట్లో రూ. 15,003 కోట్లు (220 కోట్ల డాలర్ల) పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెల 22 వరకూ స్టాక్ మార్కెట్లో రూ.8,086 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.6,917 కోట్లు చొప్పున పెట్టుబడులు పెట్టారు. జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందగలదని, కంపెనీల క్యూ1 ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారని నిపుణులంటున్నారు. ఇంతకు ముందటి రెండు నెలల్లో(మే-జూన్)లలో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.4,373 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. -
16 సెన్సెక్స్ కంపెనీల్లో పెరిగిన విదేశీ వాటా
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఏప్రిల్-జూన్ కాలానికి 16 సెన్సెక్స్ కంపెనీల్లో తమ వాటాలను పెంచుకున్నారు. ప్రస్తుత విలువల ప్రకారం రూ.17,465 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అయితే 13 సెన్సెక్స్ కంపెనీల్లో తమ వాటాను తగ్గించుకున్నారు. ఈ 13 కంపెనీల్లో రూ.14,389 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీంతో సెన్సెక్స్ కంపెనీల్లో వీరి నికర పెట్టుబడులు రూ.3,076 కోట్లుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలానికి విదేశీ ఇన్వెస్టర్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కంపెనీలో అధికంగా (6.58 శాతం) వాటా కొనుగోలు చేశారు. ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్లో యాక్సిస్ బ్యాంక్‌లో 42.27 శాతంగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్ల వాటా ఈ ఏడాది జూన్ క్వార్టర్‌కు 45.81 శాతానికి పెరిగింది. -
7వ తేదీ నుంచి మోదీ ఆఫ్రికా టూర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7 నుంచి ఐదు రోజుల పాటు నాలుగు ఆఫ్రికా దేశాలలో పర్యటించనున్నారు. ఆఫ్రికా ఖండంతో సంబంధాల పటిష్టతకు మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యాల్లో పర్యటిస్తారు. అపార వనరులున్న ఆఫ్రికాలో పొరుగు దేశం చైనా తన ప్రభావాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన చేపట్టారు. రాష్ట్రపతి ప్రణబ్జ్, ఉప రాష్ట్రపతి అన్సారీలు ఇటీవలే ఆఫ్రికా దేశాల్లో పర్యటించారు. ఆఫ్రికా- భారత్ మధ్య అత్యున్నత రాజకీయ స్థాయిలో సన్నిహిత సంబంధాల నిర్మాణం, సహకార బలోపేతం, పెంపొందించటానికి మోదీ పర్యటన దోహదం చేస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. -
ఇస్తాంబుల్ ఉగ్రదాడి: భారతీయులు సురక్షితం
న్యూఢిల్లీ: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దుశ్చర్యగా భావిస్తోన్న ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టు పేలుళ్లలో భారతీయులు ఎవరికీ ఏమీ కాలేదని టర్కీ అధికారులు వెల్లడించారు. టర్కీ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఆత్మాహుతి దాడుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది సహా 36 మంది చనిపోయారు. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో భారతీయులు ఎవరూలేరని విదేశీ వ్యవహారాల శాఖ సైతం నిర్ధారించింది. ఇస్తాంబుల్ లోని భారత్ దౌత్యకార్యాలయం ఎప్పటికప్పుడు స్థానిక ప్రభుత్వం వద్ద నుంచి సమాచారం తెప్పించుకుంటున్నదని, సహాయం అవసరమైన భారతీయుల కోసం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్లు ఏర్పాటుచేశామని అధికారులు పేర్కొన్నారు. ఇస్తాంబుల్ దాడి ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. -
పాకిస్తాన్‌కు కూడా వెసులుబాటు ఇవ్వాలి
భారత్‌కు ఎన్ఎస్జీ సభ్యత్వంపై కొనసాగుతున్న చైనా వ్యతిరేకత బీజింగ్: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వ అంశంపై చైనా బుధవారం కూడా వ్యతిరే కత వ్యక్తం చేసింది. ఎన్ఎస్జీ సమావేశాల అజెండాలో భారత్, పాకిస్తాన్ సభ్యత్వ అంశం లేదని చైనా విదేశాంగ ప్రతినిధి హువా చున్యింగ్ చెప్పాడు. ఎన్ఎస్జీ సభ్యత్వం విషయంలో భారత్‌కు ఎలాంటి వెసులుబాట్లు కల్పిస్తారో వాటిని పాకిస్తాన్‌కు కూడా కల్పించాలన్నారు. కాగా, ఎన్ఎస్జీ సభ్యత్వం కోసం లాబీయింగ్ చేయడానికి భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ సియోల్ వెళ్లారు. విదేశాంగ శాఖ ఉన్నతాధికారి అమన్‌దీప్ సింగ్ గిల్ కూడా సియోల్ వెళ్లి.. భారత్ సభ్యత్వంపై అన్ని దేశాల్లో సానుకూల వైఖరి వచ్చేలా చేసేందుకు కృషి చేస్తున్నారు. ఎన్ఎస్జీలో భారత్ చేరికకు తాము మద్దతిస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది ఉ.కొరియాకు పాక్ అణు పదార్థాలు వాషింగ్టన్: ఓవైపు ఎన్ఎస్జీ సభ్యత్వం కోసం ప్రపంచ దేశాల సహకారం కోరుతున్న పాకిస్తాన్ మరోవైపు మోనెల్, ఇం కోనెల్ అనే అణు పదార్థాలను ఉత్తర కొరి యాకు అందిస్తోందని అమెరికా వర్గాలు బుధవారం తెలిపాయి. ఈ విషయం చైనాకు తెలుసని పేర్కొన్నాయి. -
చైనా అడ్డుకోవటం లేదు
భారత్‌కు ఎన్ఎస్జీ సభ్యత్వంపై సుష్మ న్యూఢిల్లీ: అణు సరఫరా బృందం (ఎన్ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకించడం లేదని, కొత్తగా సభ్యత్వం కల్పించేందుకు ఉద్దేశించిన విధివిధానాలపై చర్చమాత్రమే చైనా కోరుతోందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. రెండేళ్ల పాలనలో విదేశాంగ శాఖ సాధించిన వివరాలను ఆమె ఆదివారమిక్కడ వివరించారు. ‘చైనా మద్దతుతోపాటు ఎలాగైనా ఎన్ఎస్జీలో సభ్యత్వం దక్కించుకుంటాం. ఏకాభిప్రాయ సాధనకే తీవ్రంగా కృషిచేస్తున్నాం’ అని చెప్పారు. ‘నేను వ్యక్తిగతంగా 23 దేశాలతో మాట్లాడుతున్నాను. ఒకరిద్దరు మాత్రమే కొన్ని అంశాలను లేవనెత్తారు. కానీ ఏకాభిప్రాయం సాధిస్తామనే నమ్మకం ఉంది’ అని అన్నారు. భారత్‌కు ఎన్ఎస్జీలో చోటు దక్కితే భవిష్యత్తులో పాక్ సభ్యత్వానికి అడ్డుపడే అవకాశాలున్నాయన్న వార్తలను ఖండించారు. రెండేళ్లలో 3.68 లక్షల కోట్ల ఎఫ్‌డీఐలు రెండేళ్లలో మోదీ విదేశీ పర్యటనల వల్ల రూ. 3.68 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని సుష్మ తెలిపారు. లండన్‌లో తలదాచుకున్న మాల్యా, లలిత్‌మోదీల అప్పగింతపై బ్రిటన్‌తో చర్చించలేదన్నారు. ఇరాక్‌లో ఐసిస్ చెరలో ఉన్న 39 మంది భారతీయులు క్షేమంగా ఉన్నారని తెలిపారు. -
ఇక తెలుగులోనూ పీఎంవో
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించిన వివరాలతో కొత్త వెబ్సైట్ ప్రారంభమైంది. మొత్తం ఆరు భాషలతో దీనిని రూపొందించారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం దీనిని ప్రారంభించినట్లు అధికార వర్గాల సమాచారం. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పటి నుంచి బెంగాలీ, గుజరాతి, మరాఠీ, మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ఇక నుంచి పీఎంవో వెబ్ సైట్ అందుబాటులో ఉంటుంది. 'ప్రధాని నరేంద్రమోదీ కార్యాలయం 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్పీఎంఇండియాడాట్ గవ్డాట్ఇన్ మొత్తం ఆరు ప్రాంతీయ భాషల్లో లభించనుంది' అని ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతీయ భాషలకు చెందినవారికి దగ్గరయ్యేందుకు ప్రధాని చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇది కూడా ఒకటి అంటూ ఈ సందర్భంగా సుష్మా చెప్పారు. -
జైషే తీవ్రవాది మసూద్‌పై చర్చిద్దాం: చైనా
మాస్కో: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారి, జైషే ఈ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను యునైటెడ్ నేషన్స్ నిషేధ జాబితా1267లో చేర్చాలనే ఇండియా ప్రతిపాదనకు చైనా వ్యతిరేకత చూపడంపై రష్యా, ఇండియా, చైనా విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, చైనా మంత్రితో చర్చించారు. భారత్‌తో పాటు చైనాలో కూడా ఉగ్రదాడులు జరుగుతున్నాయని వాటిని ఆపాలంటే ఇరుదేశాలు సహకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై చైనా సానుకూలతను చూపిందని, ఈ అంశంపై చర్చలు జరగాలని ఇరువర్గాలు భావించాయని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. గత జనవరిలో పఠాన్‌కోట్ దాడి తర్వాత ఇండియా మసూద్‌ను నిషేధిత టెర్రరిస్టు జాబితాలో చేర్చాలని యూఎన్‌ను కోరింది. కాగా, మసూద్‌ను యూఎన్ జాబితాలో చేర్చేంతలా టెర్రరిస్టు కాదని, భారత్ కోరికను ఆపాలని చైనా యూఎన్‌ను కోరిన విషయం తెలిసిందే. -
మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
న్యూఢిల్లీ: బ్యాంకులకు రుణాల ఎగువేత కేసులో విచారణకు హాజరుకాకుండా ఇంగ్లండ్‌లో ఉంటున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ యజమాని, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం మాల్యా పాస్‌పోర్ట్‌ను సస్పెండ్ చేసింది. శుక్రవారం భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటించింది. మాల్యా డిప్లమాటిక్ పాస్ పోర్ట్‌ను 4 వారాల పాటు సస్పెండ్ చేసింది. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, లేకుంటే పాస్ పోర్ట్‌ను తొలగిస్తామని హెచ్చరించింది. మల్యాను భారత్‌కు వెనక్కిరప్పించే చర్యల్లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్ట్ యాక్ట్, 1967 కింద మాల్యా పాస్ పోర్ట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఈడీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. మాల్యా బ్యాంకుల వద్ద తీసుకున్న రూ.4,900 కోట్ల రుణం, దానికి అయిన వడ్డీ... మొత్తం కలుపుకొని రుణం రూ.9 వేల కోట్లకు చేరుకుంది. ఈ రుణాల సెటిల్ మెంట్ కు సంబంధించి 6 వేల కోట్లు రూపాయలు చెల్లించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. -
సుష్మకు వసుంధరా హామీ
న్యూఢిల్లీ : స్పానిష్ పర్యాటకులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే స్పష్టం చేశారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఇద్దరు స్పానిష్ పర్యాటకులపై సోమవారం రాత్రి దాడి జరిగింది. ఈ దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరారాజేతో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడారు. దీంతో వసుంధరా రాజే పై విధంగా స్పందించారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ మంగళవారం వెల్లడించారు. -
భారత నేవీ మాజీ అధికారి అరెస్టు!
గూఢచర్యానికి పాల్పడుతున్నాడని పాక్ ఆరోపణ ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: తమ దేశంలో గూఢచర్యం, విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై భారత నేవీ మాజీ అధికారిని అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ తెలిపింది. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. పాక్ అరెస్టు చేసినట్లుగా చెబుతున్న కుల్ యాదవ్ భూషణ్ నేవీ నుంచి ముందస్తుగానే పదవీ విరమణ చేశాడని, ప్రస్తుతం ప్రభుత్వానికి, అతనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. యాదవ్ కమాండర్ హోదాలో ఉన్న అధికారి అని, అతను కరాచీ, బలూచిస్తాన్ ప్రాంతంలో భారత గూఢచర్య సంస్థ ‘రా’ తరఫున పనిచేస్తున్నాడని పాక్ ఆరోపిస్తోంది. బలూచిస్తాన్‌లోని చమన్‌లో గురువారం యాదవ్‌ను అరెస్టు చేసినట్లు పేర్కొంది. విచారణ కోసం ఆయనను ఇస్లామాబాద్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి, ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్ గౌతమ్ బంబావాలేను పిలిపించి తమ నిరసనను తెలియజేశారు. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని ఢిల్లీలో విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ మీడియాకు తెలిపారు. పాక్ చెబుతున్న వ్యక్తి నేవీనుంచి ముందస్తుగానే పదవీ విరమణ చేసినందున అతనితో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టంచేశారు. -
అధినేత్రి ఏ మంత్రిత్వశాఖ తీసుకుంటారు..?
నేపిదా: దేశంలో దశాబ్దాలపాటు సాగిన సైనిక పాలనకు మయన్మార్ లో తెరపడి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. అయితే సైనిక రాజ్యాంగం నిబంధనల వల్ల ఆంగ్ సాన్ సూచీ అధ్యక్ష పదవికి అనర్హురాలయ్యారన్న విషయం తెలిసిందే. 1962 తర్వాత మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా ఆంగ్ సాన్ సూచీ ప్రధాన అనుచరుడు, గతంలో ఆమెకు డ్రైవర్‌గా పని చేసిన టిన్ క్వా(69) ఎన్నికయ్యారు. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) అధినేత్రి, ఉద్యమ నాయకురాలు ఆంగ్ సాన్ నూతన ప్రభుత్వంలో ఏ పదవి స్వీకరిస్తారన్న దానిపై అక్కడ చర్చ జరగుతుంది. ఆమె విదేశాంగశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడతారని ఎన్ఎల్డీ పార్టీ అధికార ప్రతినిధి జా మింట్ మాంగ్ పేర్కొన్నారు. ఆరుగురు క్యాబినెట్ సభ్యుల పేర్లను స్పీకర్ ఎదుట ప్రకటించారు. అయితే ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఎవరికి ఏ శాఖ దక్కుతుందో చెప్పలేము, కానీ ఆమెకు విదేశాంగశాఖ అప్పగిస్తే ఇతర మంత్రులతో కలిసి బాధ్యతలు నిర్వహించేందుకు వీలుగా ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సైనిక మద్దతుగల ప్రస్తుత అధ్యక్షుడు థీన్ సేన్ స్థానంలో(పదవీకాలం ముగియడంతో) క్వా ఈ నెల 30న అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. అనంతరం ఆంగ్ సాన్ సూచీ ఏ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారో తెలుస్తుంది. -
భారత్ బయలుదేరిన సుష్మా
పొక్రా : నేపాల్‌లో మూడురోజుల పర్యటన ముగించుకుని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ శుక్రవారం భారత్ బయలుదేరారు. ఆమె ఎమ్ఐ17 చాపర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ చేరుకుంటారు. నేపాల్ వేదికగా జరిగిన 37వ సార్క్ మంత్రులు సమావేశంలో సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. అందులోభాగంగా సార్క్ దేశాల విదేశాంగా మంత్రులతో సుష్మా సమావేశమై... ఆయా దేశాల ద్వేపాక్షిక సంబంధాలపై వారితో చర్చలు జరిపారు. ఆ క్రమంలో గురువారం పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రితో సుష్మా భేటీ అయి.. పఠాన్‌కోటపై జరిగిన ఉగ్రదాడిపై వారు చర్చించారు. పాక్ ఉన్నతాధికారుల దర్యాప్తు బృందం మార్చి 27వ తేదీన పఠాన్‌కోట రానున్నారని ఈ సందర్భంగా పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వెల్లడించినట్లు సుష్మా వెల్లడించిన సంగతి తెలిసిందే. -
27న రానున్న పాక్ బృందం
పఠాన్‌కోట్ దాడి ఘటనపై దర్యాప్తు కోసం... సుష్మాస్వరాజ్ వెల్లడి; పాక్ ప్రధాని సలహాదారుతో భేటీ పొఖారా (నేపాల్)/న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ వైమానిక క్షేత్రంపై ఉగ్రవాద దాడి ఘటనపై దర్యాప్తు కోసం పాకిస్తాన్ సంయుక్త దర్యాప్తు బృందం ఈనెల 27న భారత్‌కు రానున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించా రు. గురువారం పొఖారాలో పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్‌తో 20 నిమిషాల భేటీ అనంతరం ఆమె ఈ విషయం తెలిపారు. సార్క్ మం త్రుల మండలి సమావేశాల్లో భాగంగా వీరు నేపాల్‌కు వచ్చారు. ఈనెల 31న అమెరికాలో జరగనున్న అణు భద్రత శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు మోదీ, నవాజ్ షరీఫ్ భేటీ అవుతారని సుష్మ ఆశాభావం వ్యక్తంచేశారు. పాక్ దర్యాప్తు బృందం భారత్‌కు వస్తున్న తేదీలు ఖరారైనందున పఠాన్‌కోట్ దాడి అంశంపై అజీజ్‌తో జరిగిన భేటీలో చర్చించలేదన్నారు. పాక్ బృందం ఈనెల 27న భారత్‌కు వచ్చి 28న దర్యాప్తు చేస్తుందని చెప్పారు. అజీజ్‌తో కలసి ఆమె మీడియాతో మాట్లాడారు. మోదీ, షరీఫ్‌లు అమెరికాలో భేటీ అయ్యే అవకాశముందని, అయితే వీరి మధ్య నిర్మాణాత్మక చర్చలు జరుగుతాయో, లేదో చెప్పలేమన్నారు. నవంబర్‌లో పాక్ నిర్వహించనున్న సార్క్ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ రావాలంటూ అజీజ్ ఆహ్వాన పత్రిక అందించారు. కాగా, సార్క్ సెక్రెటరీ జనరల్ పదవికి తమ దేశ దౌత్యవేత్త అమ్జాద్ హుసేన్ సియాల్ పేరును పాక్ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న అర్జున్ బహదూర్ థాపా (నేపాల్) పదవీ కాలం వచ్చే ఫిబ్రవరితో ముగియనుంది. కాగా.. పఠాన్‌కోట్ దర్యాప్తునకు సంబంధించి ఏ ప్రాంతాల్లో అవసరమైతే ఆ ప్రాంతాల్లో పాక్ బృందాన్ని అనుమతిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు ఢిల్లీలో విలేకరులకు చెప్పారు. -
మోదీతో నేపాల్ ప్రధాని భేటీ
న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీతో నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి శనివారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అంతకుముందు ఈ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ హౌస్‌కు వచ్చిన నేపాల్ ప్రధాని కె.పి.శర్మకు మోదీ ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత్‌లో పర్యటన నిమిత్తం నేపాల్ ప్రధాని కె.పి.శర్మ శుక్రవారం న్యూఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. 2011లో నేపాల్ ప్రధాని బాబురామ్ భట్టారాయ్ ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా మొదటిసారిగా భారత్‌లో పర్యటించారు. ఆ తర్వాత 2014లో మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అప్పటి ప్రధాని సుశీల్ కోయిరాల హాజరయ్యారు. అలాగే అదే ఏడాది ఆగస్టులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ నేపాల్‌లో పర్యటించారు. అదే ఏడాది నవంబర్‌లో ఖాట్మండ్ వేదికగా జరిగిన సార్క్ లో మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24వ తేదీన కె.పి.శర్మ భారత పర్యటన ముగించుకుని ముంబై నుంచి తిరిగి నేపాల్ కి వెళ్లతారు. -
'భారత్‌లో పెట్టుబడులే మాకు ఆసక్తి'
న్యూఢిల్లీ: భారత్‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నామని ఆస్ట్రియా విదేశాంగమంత్రి సెబాస్టియన్ క్రూజ్ అన్నారు. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ , ఆస్ట్రియా విదేశాంగ మంత్రి సెబాస్టియన్ క్రూజ్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశం ద్వారా యూరప్‌తో తమ సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా భారత్ ముందడుగు వేయనుందని విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ, విద్యుత్, సహజవాయువుశాఖ మంత్రి పీయూష్ గోయల్, రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుతో కూడా క్రూజ్ సమావేశం కానున్నారు. అనంతరం గురువారం ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను, ప్లాన్సీ ఇండియా మెటీరియల్ సంస్థ(మైసూర్)ను సందర్శించనున్నారు. ఈ సంవత్సరం జరగబోయే యూరోపియన్ యూనియన్(ఈయూ), ఇండియా సమావేశం, సమావేశ ప్రాముఖ్యతను గురించి మంగళవారం నాటి సమావేశంలో చర్చించారు. -
పాలస్తీనాకు చేరుకున్న సుష్మాస్వరాజ్
-
చర్యలు తీసుకుంటేనే చర్చలు
-
చర్యలు తీసుకుంటేనే చర్చలు
* ఇప్పుడు బంతి మీ కోర్టులోనే ఉంది: పాకిస్తాన్‌కు స్పష్టం చేసిన భారత్ * భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల భేటీపై అనిశ్చితి * ఏం చేస్తారో చెప్పండి.. ఆ తర్వాతే మాట్లాడుకుందాం: వికాస్ స్వరూప్ * జైషే పాత్రపై పాక్‌కు స్పష్టమైన ఆధారాలిచ్చిన అజిత్ దోవల్ న్యూఢిల్లీ: భారత్-పాక్ మధ్య చర్చల ప్రక్రియ ముందడుగేయాలంటే.. ముందుగా పఠాన్‌కోట్ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని భారత్ స్పష్టం చేసింది. ‘ఇప్పుడు బంతి పాక్ కోర్టులో ఉంది’ అని తెలిపింది. దాడికి వ్యూహరచన పాక్‌లో జరిగినట్లు ఆధారాలున్నందున.. తర్వాత ఏం చేయాలో నిర్ణయించాల్సింది పాకిస్తానేనని తేల్చిచెప్పింది. షెడ్యూల్ ప్రకారం 15న ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల మధ్య చర్చలు జరగాల్సి ఉండగా.. పఠాన్‌కోట్ ఘటన తర్వాత ఈ భేటీపై అనిశ్చితి నెలకొంది. అయితే, ఈ చర్చలను నిలిపేసి ఇరుదేశాల భద్రతా సలహాదారులు మరోసారి కలుస్తారని వార్తలొస్తున్నాయి. ఢిల్లీలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘విదేశాంగ కార్యదర్శుల మధ్య చర్చలు జరుగుతాయో లేదో చెప్పలేం. పఠాన్‌కోట్‌పై పాక్ ఎలాంటి డెడ్‌లైన్ ఇవ్వకుండా.. చర్చలు కష్టం’ అన్నారు. పాక్ ప్రధానితో ఫోన్ సంభాషణలో.. ఉగ్రవాదంపై కఠిన చర్యలపైనే మోదీ పట్టుబట్టారని వెల్లడించారు. పాక్ నుంచి భారత్‌లో విధ్వంసానికి జరుగుతున్న ప్రణాళికలపై చర్యలు తీసుకోవాలని గట్టిగానే చెప్పారని.. దీనికి పాక్ ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. షరీఫ్ ఉన్నతస్థాయి సమావేశం భారత్-పాక్ చర్చల ప్రక్రియపై అనిశ్చితి నెలకొన్న సమయంలో.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసి.. పఠాన్‌కోట్ దాడిపై చర్చించారు. ఆర్థిక, హోం శాఖ మంత్రులు, విదేశాంగ శాఖ సలహాదారు, ఎన్ఎస్ఏ చీఫ్, ఇంటెలిజెన్స్చీఫ్లతో మాట్లాడారు. దాడి ఘటనపై భారత్ అందజేసిన సమాచారం ఆధారంగా విచారణ ప్రారంభించాలని.. కేవలం టెలిఫోన్ నంబర్లే ఉన్నందున మరింత సమాచారాన్ని భారత్‌నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. విచారణ పూర్తయిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. జైషే పాత్ర స్పష్టమే!: పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో జైషే మొహమ్మద్ సంస్థ పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలను భారత ఇంటలిజెన్స్ సంపాదించింది. జైషే చీఫ్ మౌలానా మసూద్ అజర్, అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్ (1999 కాందహార్ విమానం హైజాక్ సూత్రధారి)తో పాటు మరో ఇద్దరు ఈ దాడికి వ్యూహరచన జరిపినట్లు గుర్తించింది. లాహోర్ సమీపంలో కుట్ర జరిగినట్లు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. భారత ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్.. పాక్ ఎన్ఎస్ఏ చీఫ్‌తో మాట్లాడి.. స్పష్టమైన,చర్యలు తీసుకునేందుకు అనువైన సమాచారాన్ని ఇచ్చినట్లు తెలిసింది. ఈ వివరాలను పాకిస్తాన్‌కు అందజేసి వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చర్చలు కొనసాగించండి: చైనా ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న భారత్-పాక్ సంబంధాలను దెబ్బతీసేందుకే కొన్ని గ్రూపులు ప్రయత్నిస్తున్నాయని స్నేహబంధాన్ని మెరుగుపరుచుకునేందుకు చర్చల ప్రక్రియ కొనసాగించాలని ఆకాంక్షించింది. చివరి దశలో కూంబింగ్ పఠాన్‌కోట్: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో కూంబింగ్ చివరి దశకు చేరుకుందని భద్రతా దళాలు వెల్లడించాయి. ఎన్ఎస్జీ, గరుడ్, ఐఏఎఫ్ కమాండోలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాగున్నారా? ఎక్కడైనా బాంబులు పెట్టారా? అని వెతికేందుకే ఈ కూంబింగ్ జరుగుతోందని ఎయిర్ కమాండర్ జేఎస్ దమూన్ తెలిపారు. ఎన్ఎస్జీ బలగాల తక్షణ స్పందన, గరుడ్ విభాగం చాకచక్యంగా వ్యవహరించటంతో ఉగ్రవాదులను ఒక ప్రాంతానికే పరిమితం చేశామని చెప్పారు. బీఎస్ఎఫ్ నిజనిర్ధారణ కమిటీ ఉగ్రవాదులు భారత్-పాక్ సరిహద్దుగుండా ప్రవేశించి దాడికి పాల్పడ్డారనే విమర్శల నేపథ్యంలో.. అక్రమ చొరబాట్లు, నదులు, దట్టమైన అడవులున్న చోటనిఘా కొరవడటంపై విచారించేందుకు బీఎస్ఎఫ్ ఓ కమిటీని ఏర్పాటుచేసింది. పదిహేను రోజుల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించనుంది. సల్వీందర్ వాంగ్మూలం నమోదు: విచారణలో భాగంగా ఎస్పీ సల్వీందర్ సింగ్ వాంగ్మూలాన్ని ఎన్ఐఏ తీసుకుంది. ఈయన మిత్రుడు రాజేశ్ వర్మను విచారించారు. సరిహద్దు గ్రామాల్లో పర్యటించిన ఎన్ఐఏ అధికారులు.. బీఎస్ఎఫ్ సిబ్బంది, ప్రత్యక్ష సాక్షులను విచారించారు. ఉగ్రవాదుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక సివిల్ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు? సరిహద్దు గ్రామమైన టిబ్రీలో మిలటరీ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగాడుతుండగా చూశామని గ్రామస్తులు చెప్పటంతో సైనికులు, పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. -
'మోదీ మాట్లాడారు.. బంతి పాక్ కోర్టులోనే ఉంది'
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ దాడి విషయంపై ప్రధాని నరేంద్రమోదీ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ఇప్పటికే మాట్లాడారని భారత విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. తగిన చర్యలు తీసుకుంటామని షరీఫ్ హామీ ఇచ్చారని, ఆయన తీసుకోబోయే చర్యలకోసం ఇప్పుడు ఎదురుచూస్తున్నామని తెలిపారు. బంతి ఇప్పుడు పాకిస్థాన్ కోర్టులోనే ఉందని, పఠాన్ కోట్ దాడికి తగిన చర్యలు తీసుకునేందుకు నిఘా విభాగం సమాచారం కూడా అందుబాటులో ఉందని అన్నారు. పఠాన్ కోట్ దాడితో మరోసారి, సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యల అంశం కీలకంగా మారిందని, దీనిపై మరింత దృష్టిని సారిస్తామని చెప్పారు. విదేశాల్లో భారత వ్యవహారాలశాఖను భారత విదేశాంగ వ్యవహారాలశాఖలో కలిపేందుకు చేసిన ప్రతిపాదనకు ప్రధాని మోదీ అంగీకరించినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే సిరియా విదేశాంగ మంత్రి ఈ నెల 11 నుంచి 14 వరకు భారత్ పర్యటనకు రానున్నట్లు చెప్పారు. -
గతవారం బిజినెస్
ఎఫ్ఐఐలకు ఐటీ శాఖ ఊరట మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద నమోదై, భారత్‌లో శాశ్వత కార్యాలయాలు లేని విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు.. సమర్పించిన రిటర్నులు అసంపూర్తిగా ఉన్నా, వాటిని లోపభూయిష్టమైనవిగా పరిగణించబోమని ఆదాయపన్ను శాఖ (ఐటీ) తెలిపింది. దీంతో దాదాపు 500 పైచిలుకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ)కు ఊరట లభించనుంది. దశాబ్ద కనిష్టానికి దేశీ క్రూడ్ అంతర్జాతీయంగా డిమాండ్‌కి మించి ఉత్పత్తి జరుగుతుండటంతో ముడిచమురు ధరలు అంతకంతకూ తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కొనుగోలు చేసే ముడిచమురుకి సంబంధించి నెలవారీ సగటు 38.61 డాలర్లకు తగ్గింది. ఈ రేటు స్థిరంగా కొనసాగితే 2004 తర్వాత దశాబ్ద కాలంలో ఇదే అత్యంత కనిష్ట నెలవారీ సగటు కానుంది. 2004 డిసెంబర్లో ఇండియన్ బాస్కెట్ రేటు 36.85 డాలర్లుగా ఉండేది. 2.1 శాతం పెరిగిన ప్రభుత్వ రుణ భారం ప్రభుత్వ రుణ భారం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 2.1 శాతం పెరిగింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ భారం రూ. 53.01 లక్షల కోట్లుకాగా ఇది సెప్టెంబర్ క్వార్టర్‌కు రూ. 54.12 లక్షల కోట్లకు చేరిందని రుణ నిర్వహణపై విడుదలైన త్రైమాసిక నివేదిక తెలిపింది. మొత్తం రుణ భారంలో అంతర్గత రుణం వాటా 92.1 శాతం. విలువ రూపంలో ఇది రూ.49.85 లక్షల కోట్లు. 2015 సెప్టెంబర్‌నాటికి స్థూల దేశీయోత్పత్తి విలువతో పోల్చితే ఇది 37.4 శాతం. సెబీ జరిమానాపై రిలయన్స్‌కు ఊరట 2007లో ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ షేర్ల లావాదేవీల్లో రిలయన్స్ పెట్రోఇన్వెస్ట్‌మెంట్స్ (ఆర్‌పీఐఎల్) ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించిందన్న కేసు వివాదంలో సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్)లో ఊరట లభించింది. ఈ కేసును కొత్తగా మళ్లీ పరిశీలించి, మూడు నెలల్లోగా మరోసారి ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా సెబీని శాట్ ఆదేశించింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ రాజస్తాన్‌లోని సౌరశక్తి ప్లాంట్‌కు అక్రమంగా తరుగుదల ప్రయోజనాన్ని పొందిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తప్పుపట్టింది. కేబుల్ డిజిటైజేషన్ ఫేజ్-3 గడువు 31 ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం టీవీ ప్రసారాలను వీక్షించడానికి కేబుల్ టీవీ సబ్ స్క్రైబర్స్ అందరూ డిజిటైజేషన్ ఫేజ్-3లో భాగంగా డిసెంబర్ 31 నాటికి ముందు సెట్ టాప్ బాక్స్‌లను (ఎస్టీబీ) ఏర్పాటు చేసుకోవాలని బ్రాడ్‌కాస్టింగ్ రంగ రెగ్యులేటర్ ట్రాయ్ సూచించింది. భారత్.. ఒకే ఒక్కటి! ఒక్క భారత్‌ను మినహాయిస్తే... వర్ధమాన దేశాల్లో వృద్ధి తీరు నెమ్మదిగా ఉందని ప్రపంచబ్యాంక్ పేర్కొంది. వరుసగా ఐదేళ్ల నుంచీ ఇదే ధోరణి నెలకొందని తెలిపింది. భారత్ మినహా మిగిలిన బ్రిక్స్ (బీఆర్ఐసీఎస్- బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల వృద్ధి స్పీడ్ 2010 తరువాత భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ఇంతక్రితం భావించినదానికన్నా భిన్నంగా... సుదీర్ఘకాలం ఆయా మార్కెట్లలో ఇదే నిరాశాకర పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడింది. 20 శాతం తగ్గిన ఇంటి ధరలు గత 18 నెలల కాలంలో హౌసింగ్ ధరలు సగటున 15-20 శాతంమేర తగ్గాయని రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్ పేర్కొంది. ఇంతకు మించి ఇంకా తగ్గే అవకాశం లేదని తెలిపింది. పండుగ సీజన్లో ఇళ్ల అమ్మకాలు 15 శాతంమేర పెరిగాయని, దీనికి ధరలు తగ్గడం, గృహ రుణాలపై వడ్డీ రేటు తక్కువగా ఉండటం వంటి అంశాలు కారణాలుగా పనిచేశాయని క్రెడాయ్ ప్రెసిడెంట్ గీతాంబర్ ఆనంద్ మీడియాకు తెలిపారు. ఫార్మాకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ! కేంద్ర రసాయనాల, ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ వచ్చే ఏడాది కాలంలో ఫార్మా, వైద్య పరికరాలకు సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని తె లిపారు. అలాగే చైనా నుంచి జరుగుతున్న భారీ డ్రగ్స్ దిగుమతులకు అడ్డుకట్ట వేయడానికి త్వరలోనే కటోచ్ ప్యానెల్ సిఫార్సులను అమలు చేస్తామని పేర్కొన్నారు. దేశీ పరిశ్రమకు చేయూతనందించడమే లక్ష్యంగా కేంద్రం వచ్చే వంద రోజుల్లో కటోచ్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది 7.8 శాతం వృద్ధి! వచ్చే ఏడాది భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 7.8 శాతంగాను, 2017లో 8 శాతం మేర ఉండగలదని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ నొమురా పేర్కొంది. భారత్ జీడీపీ ఈ ఏడాది 7.3 శాతంగా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో వ్యాపార పరిస్థితులు మెరుగుపడే క్రమం ప్రాథమిక స్థాయిలో ఉందని, రాబోయే రెండు త్రైమాసికాల్లో వృద్ధి పుంజుకోగలదని ఆసియన్ ఎకనమిక్ అవుట్‌లుక్ నివేదికలో నొమురా తెలిపింది. స్టీల్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకం భారత ప్రభుత్వం కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించింది. చైనా, కొరియా, అమెరికా, యూరోప్ దేశాల నుంచి దిగుమతి అవుతున్న కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులపై 5.39 శాతం నుంచి 57.39 శాతం రేంజ్లో యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించింది. ఈ సుంకం తదుపరి ఉత్తర్వులు వెలువడేదాకా ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుందని సీబీఈసీ పేర్కొంది. పారిశ్రామికోత్పత్తి జూమ్ వినియోగ ఉత్పత్తులు, యంత్రపరికరాల తయారీ ఊతంతో అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) అయిదేళ్ల గరిష్టానికి ఎగిసింది. 9.8 శాతం వృద్ధి నమోదు చేసింది. దీపావళి కొనుగోళ్లతో డిమాండ్ పెరుగుదల దీనికి తోడ్పడి ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. గతేడాది అక్టోబర్‌లో ఐఐపీ వృద్ధి మైనస్ 2.7 శాతంగా ఉంది. కేంద్రీయ గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) శుక్రవారం విడుదల చేసిన వివరాల ప్రకారం అక్టోబర్‌లో ఐఐపీ సూచీ 9.8 శాతం మేర పెరిగి 181.3గా ఉంది. పెరిగిన పరోక్ష పన్ను వసూళ్లు పరోక్ష పన్నుల వసూళ్లు గత నెల లో 24% వృద్ధి చెందాయి. ఎక్సైజ్ సుంకాల వసూళ్లు పెరగడంతో పరోక్ష పన్ను వసూళ్లు 24% వృద్ధితో రూ. 55,297 కోట్లకు పెరిగాయి. గత ఏడాది ఇదే నెలలో ఈ వసూళ్లు రూ.44,475 కోట్లుగా ఉన్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల కాలానికి పరోక్ష పన్ను వసూళ్లు 34% వృద్ధితో రూ.4,38,291 కోట్లకు పెరిగాయి. డీల్స్.. సఈ-కామర్స్ సంస్థ పేటీఎం తాజాగా హోమ్ సర్వీసెస్ యాప్ నియర్డాట్ఇన్ను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు 1.5- 2 మిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. సహైదరాబాద్కు చెందిన కస్టమ్ ఫర్నిచర్ ఈ-టెయిలర్ కస్టమ్ఫర్నిచర్డాట్కామ్ సంస్థ బెంగళూరుకు చెందిన ఆగ్నస్ క్యాపిటల్ నుంచి రూ.30 కోట్ల తాజా పెట్టుబడులను సమీకరించింది. సగృహోపకరణాల వ్యాపారాన్ని స్వీడన్ కంపెనీ ఎలక్ట్రోలక్స్‌కి విక్రయించే ప్రతిపాదనను జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) సంస్థ పక్కన పెట్టింది. జీఈ నిర్దిష్టంగా ఇందుకు గల కారణాలను వెల్లడించనప్పటికీ.. గుత్తాధిపత్యం నెలకొనవచ్చన్న సందేహాలతో అమెరికా నియంత్రణ సంస్థలు డీల్‌ను వ్యతిరేకిస్తుండటమే కారణమై ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఒప్పంద విలువ 3.3 బిలియన్ డాలర్లు. సనేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తనకున్న 15 శాతం వరకూ వాటాను విక్రయించే ప్రక్రియను మొదలుపెట్టింది. ఎన్ఎస్ఈలో తమకున్న వాటాకు సరైన ధర కోసం చూస్తున్నామని ఎన్ఎస్ఈ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. సప్రపంచంలోనే అతి పెద్ద కెమికల్ కంపెనీ ఏర్పాటుకు తెరతీస్తూ డో కెమికల్, డ్యుపాంట్ సంస్థలు విలీనం కానున్నాయి. దీంతో కొత్తగా ఏర్పడే కంపెనీ విలువ ఏకంగా 130 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. డీల్ పూర్తిగా షేర్ల రూపంలో ఉంటుందని రెండు సంస్థలు తెలిపాయి. -
'వచ్చే ఏడాది మా దేశ పర్యటనకు రండి'
-
'వచ్చే ఏడాది మా దేశ పర్యటనకు రండి'
ఇస్లామాబాద్: పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌తో పాటు ఆసియా దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు వచ్చే ఏడాది భారత పర్యటనకు రావాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆహ్వానించారు. బుధవారం ఇస్లామాబాద్‌లో జరిగిన 'హార్ట్ ఆఫ్ ఆసియా' సదస్సులో సుష్మా ప్రసంగించారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో పాక్, అప్ఘాన్లతో చేతులు కలిపేందుకు భారత్ సుముఖంగా ఉందని చెప్పారు. అట్టారి సరిహద్దు వద్ద అఫ్ఘాన్ ట్రక్కులకు స్వాగతం పలికేందుకు భారత్ సిద్ధమని పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో సత్సంబంధాలు నెలకొల్పేందుకు తాము స్నేహ హస్తం అందించామని సుష్మా గుర్తు చేశారు. ఇస్లామాబాద్‌లో హార్ట్ ఆఫ్ ఏషియా సదస్సులో పాల్గొన్న ఆమె ప్రాంతీయ సమస్యలను సమష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పాక్, అప్ఘాన్ ప్రధానులు నవాజ్ షరీఫ్, అష్రాఫ్ ఘనితో పాటు ఆసియా విదేశీ వ్యవహారాల మంత్రులు పాల్గొన్నారు. అంతకుముందు పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ భేటీ అయ్యారు. ఈ సదస్సుకు వచ్చిన సుష్మా మర్యాదపూర్వకంగా షరీఫ్‌ను కలిశారు. వివిధ అంశాలపై కాసేపు ముచ్చటించారు.. ఈ రోజు మధ్యాహ్నం మరోసారి జరిగే చర్చల్లో భారత్, పాక్ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌పై ఓ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. -
పన్ను సమస్యలను పరిష్కరిస్తాం
విదేశీ ఇన్వెస్టర్లకు ఆర్థిక శాఖ హమీ * దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పన్ను సంబంధిత ఆందోళనలన్నింటినీ వీలైనంతం వేగంగా పరిష్కరిస్తామని కేంద్రం హామీనిచ్చింది. అయితే, దేశంలో శాశ్వత కార్యకలాపాలను ఏర్పాటు చేయాల్సిందిగా వారిని కోరుతున్నట్లు కూడా పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2016-17) బడ్జెట్ కసరత్తులో భాగంగా మంగళవారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు దిగ్గజ ఎఫ్‌పీఐలతో భేటీ అయ్యారు. సిటీ బ్యాంక్, డాయిష్ బ్యాంక్, ఫిడిలిటీ, గోల్డ్‌మన్ శాక్స్, బ్లాక్‌రాక్ సహా రెండు డజన్లకుపైగా అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘ఈ భేటీలో ఎఫ్‌పీఐలు అనేక సూచనలు, సలహాలను ఇచ్చారు. ప్రభుత్వం వీటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఇక పన్ను సంబంధ సమస్యలు సహజంగా ఉత్పన్నమైనవే. దేశంలో ఫండ్ మేనేజ్మెంట్ పరిశ్రమ స్థితిగతులపై కూడా మేం చర్చించాం’ అని ఆర్థిక వ్యవహరాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్బీఐ, సెబీ, సీబీడీటీలకు చెందిన ఉన్నతాధికారులకు కూడా ఈ సమావేశానికి హజరయ్యారు. ప్రస్తుతం ఎఫ్‌పీఐలు భారత్‌తో ద్వంద్వ పన్ను నిరోధక ఒప్పందం(డీటీఏఏ) ఉన్న దేశాల నుంచి తమ నిధులను ఇక్కడికి తరలిస్తున్నారని.. దీనివల్ల వారికి స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు లభిస్తున్నట్లు దాస్ చెప్పారు. అయితే, ఆయా సంస్థలు భారత్‌లోనే తమ కార్యకాలాపాలను నెలకొల్పినట్లయితే ఇక్కడి చట్టాల ప్రకారం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందన్నారు. కార్పొరేట్ బాండ్లపై 5 శాతం విత్‌హోల్డింగ్ పన్ను అంశాన్ని ఈ సమావేశంలో చర్చించినట్లు నోమురా ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ ఎండీ నీరజ్ గంభీర్ చెప్పారు. 2017తో ఈ 5 శాతం పన్ను విధింపునకు గడువు ముగియనుంది. ఈ ఏడాది వృద్ధి 7.5 శాతం పైనే... * ఎస్అండ్పీ అంచనాలతో విబేధం భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) వెలిబుచ్చిన అనుమానాలను శక్తికాంత దాస్ తోసిపుచ్చారు. అది కేవలం ఆ సంస్థ అభిప్రాయం మాత్రమేనని.. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.5 శాతంపైనే ఉంటుందని తాము అంచనావేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వృద్ధి జోరందుకోవాడానికి ప్రభుత్వం మరిన్ని సంస్కరణ చర్యలను చేపట్టనున్నట్లు కూడా దాస్ వెల్లడించారు. భారత్ ఆర్థిక మూలాలు అత్యంత పటిష్టంగా ఉన్నాయన్నారు. కాగా, భారత్ సార్వభౌమ రేటింగ్‌ను ఇప్పుడున్న బీబీబీ(మైనస్) స్థాయిలోనే కొనసాగిస్తున్నట్లు ఎస్అండ్పీ తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా రేటింగ్ పెంచే అవకాశాల్లేవని స్పష్టం చేసింది. పెట్టుబడులకు సంబంధించి ఇదే అత్యల్ప స్థాయి రేటింగ్. కాగా, విధాన, సంస్కరణల పరంగా తాము ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని... రేటింగ్ అప్‌గ్రేడ్ చేయాలంటూ ఆర్థిక శాఖ చాన్నాళ్లుగా కోరుతున్న సంగతి తెలిసిందే. -
'ఆమె మాటలు అద్భుతం'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ భారతీ విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడిన తీరు అద్భుతంగా ఉందని, పాకిస్థాన్‌కు తగిన సమాధానం చెప్పారని, భారత్ నిర్ణయాన్ని చాలా స్పష్టంగా చెప్పారని అన్నారు. చర్చలు, ఉగ్రవాదం కలిసి సాగలేవని భారత్ తరుపున ఐక్యారాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ పాకిస్తాన్‌కు సుష్మా స్వరాజ్ తేల్చి చెప్పారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్యల కోసం ఆ దేశ ప్రధాని చెప్పిన నాలుగు సూ త్రాలు అవసరం లేదని.. ఉగ్రవాదాన్ని నిలిపివేసి చర్చలకు రావటమన్న ఒకే ఒక్క సూత్రం చాలునని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. ముంబై దాడుల సూత్రధారులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న, సాయపడుతున్న దేశాలపై అంతర్జాతీయ సమాజం చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మోదీ ఆమెపై ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయంగా పలు ముఖ్యమైన అంశాలపై ఆమె మాట్లాడారని చెప్పారు. ఉగ్రవాదానికి సంబంధించిన ప్రతిపనికి స్వస్థి పలికి వెంటనే ప్రపంచశాంతిని నెలకొల్పాలని ఆమె సరిగ్గా చెప్పారని తెలిపారు. బాలికలను స్వయం సమృద్ధిగలవారిగా తీర్చిదిద్దడం ద్వారా సమాజంలో సత్వర మార్పుతీసుకురావచ్చని ఆమె చెప్పిన మాటలతో తాను అంగీకరిస్తానని చెప్పారు. ఐక్యరాజ్య సమితికి భారత్ అందించిన తోడ్పాటుగురించి ఆమె చాలా చక్కగా చెప్పారని, భారత్ విజన్‌ను అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించారని వివరించారు. -
ఉగ్రవాదం ఆపేస్తే చాలు..
తరువాతే చర్చలకు రండి పాకిస్తాన్‌కు సుష్మ సూచన ఇరు దేశాల మధ్య చర్చలు, ఉగ్రవాదం కలిసి సాగలేవు నవాజ్ చెప్పిన నాలుగు సూత్రాలు అవసరం లేదు ఐరాస సర్వసభ్య సభలో విదేశీ వ్యవహారాల మంత్రి ప్రసంగం ఐక్యరాజ్యసమితి:చర్చలు, ఉగ్రవాదం కలిసి సాగలేవని భారతదేశం పాకిస్తాన్‌కు తేల్చిచెప్పింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్యల కోసం ఆ దేశ ప్రధాని చెప్పిన నాలుగు సూ త్రాలు అవసరం లేదని.. ఉగ్రవాదాన్ని నిలిపివేసి చర్చలకు రావటమన్న ఒకే ఒక్క సూత్రం చాలునని పేర్కొంది. ఉగ్రవాదంపై పాకిస్తాన్ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. ముంబై దాడుల సూత్రధారులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని వివరించింది. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న, సాయపడుతున్న దేశాలపై అంతర్జాతీయ సమాజం చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. గురువారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగించారు. పాక్‌తో ఉగ్రవాదం అంశంతో పాటు.. భద్రతా మండలి సంస్కరణలు, మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు తదితర అంశాలనూ ప్రస్తావించారు. ఆమె ప్రసంగంలో ఉగ్రవాదానికి సంబంధించి ప్రస్తావించిన ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. ఆ దేశాలపై చర్యలు చేపట్టాలి: ఐక్యరాజ్యసమితికి భారత్ చాలా అందించింది. శాంతి పరిరక్షణ మిషన్లకు భారత్ చాలా ప్రాధాన్యత ఇస్తుంది. 8,000 మంది సైనికులు, పోలీసు సిబ్బంది పది దేశాల్లో పని చేస్తున్నారు. కానీ.. శాంతిపరిరక్షకులని అందించే దేశాలు నిర్ణయాలు తీసుకునే దేశాలు కాకపోవటం విచారకరం. శాంతిపరిరక్షణ ఆపరేషన్లకు భారత్ 25 ఏళ్లుగా దళాలు అందిస్తోంది. భారత్ 25 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. న్యూయార్క్ కూడా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంది. నేడు మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పు.. ఉగ్రవాదానికి మనం ఎలా స్పందిస్తాం అనే దానిపై అంతర్జాతీయ సమాజం భవిష్యత్తు ఇప్పుడు ఆధారపడి ఉంది. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే, వారికి శిక్షణనిచ్చే లేదా వారి దాడులు నిర్వహించేందుకు సాయం చేసే దేశాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి నిలబడాలి. భారీ మూల్యం చెల్లించేలా అంతర్జాతీయ సమాజం చర్యలు చేపట్టాలి. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు కింద ఒక అంతర్జాతీయ విధానాన్ని ఇక ఎంత మాత్రమూ జాప్యం చేయకూడదు. జమ్మూకశ్మీర్ కోసమే ఈ దాడులన్నది అందరికీ తెలుసు: సీమాంతర ఉగ్రవాదాన్ని అంతమొందించటంలో గతంలో ఇచ్చిన హామీలను పాకిస్తాన్ నిలబెట్టుకోలేదు. 2008 నాటి ముంబై దాడుల్లో పౌరులు మాత్రమే కాదు.. పర్యాటకులూ చనిపోయారు. ఈ ఘోరమైన చర్య సూత్రధారులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మేం ఇద్దరు ఉగ్రవాదులను సజీవంగా పట్టుకున్నాం. భారత్‌ను అస్థిరపరచటానికి, భారత రాష్ట్రమైన జమ్మూకశ్మీర్‌లో పాక్ అక్రమంగా ఆక్రమించుకున్న భూభాగాలు, మిగతా భాగాలపై హక్కు కోరటానికి ఈ దాడులు జరుగుతున్నాయని మనకందరికీ తెలుసు. ఉగ్రవాదం నిలిపివేసి.. చర్చించుకుందాం రండి: చర్చలకు భారత్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. కానీ చర్చలు-ఉగ్రవాదం ఒకేసారి సాగలేవు. కొత్తగా శాంతి చర్యల కోసం నవాజ్‌షరీఫ్ నిన్న నాలుగు సూత్రాలు చెప్పారు. నాలుగు సూత్రాలు అవసరం లేదు.. కేవలం ఒక్కటి చాలు. ఉగ్రవాదాన్ని నిలిపివేయండి.. కూర్చు ని చర్చించుకుందాం రండి. మా ప్రధానమంత్రికి, మీకు మధ్య ఉఫాలో చర్చలు జరిగాయి. ఎన్ఎస్ఏలు కూడా చర్చించాల్సి ఉండింది. ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలపై ఆ చర్చలు జరగాలని మేం కోరుకుంటున్నాం. అలాగే డీజీఎంఓల భేటీ కూడా త్వరగా జరగాలని కోరుతున్నాం. ఆ చర్చల్లో విశ్వసనీయత కనబరిస్తే.. మిగతా వివాదాలన్నిటినీ చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి మేం సిద్ధం. -
'మక్కా మృతుల్లో 18 మంది భారతీయులు'
న్యూఢిల్లీ: హజ్ యాత్ర సందర్భంగా సౌదీ అరేబియాలోని మినా నగరంలో గురువారం సంభవించిన తొక్కిసలాటలో 18 మంది భారతీయులు మరణించారని శనివారం ఉదయం భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో పాటు అమెరికా పర్యటనలో ఉన్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. ఎప్పటికప్పుడు సౌదీ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. సౌదీ అధికారులు పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాతే భారతీయ మృతుల సంఖ్యను వెల్లడించారు. గురువారం నాటి తొక్కిసలాటలో మొత్తం 717 మంది మరణించిన విషయం తెలిసిందే. -
'బాంబులేస్తున్నారు.. చంపేస్తారు.. రక్షించండి'
యెమెన్: 'పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. బాంబులు వేస్తున్నారు. కచ్చితంగా చనిపోతాం. ఈలోగా దయచేసి మమ్మల్ని రక్షించండి. మేమంతా భారతీయులమే' అంటూ ఓ ఆడియో మెస్సేజ్ భారత విదేశాంగ వ్యవహారాలశాఖకు విన్నప రూపంలో వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే గుజరాత్ తీరం నుంచి వస్తు రవాణాకోసం యెమెన్ తీరానికి వెళ్లిన భారతీయులు అక్కడి ఖోఖా పోర్టు వద్ద చిక్కుకు పోయారు. వీరు తీరం చేరక ముందే యెమెన్‌లో బాంబుల దాడులు మొదలయ్యాయి. ఘర్షణ వాతావరణం నెలకొంది. ముందు వెనుకా చూడకుండా వైమానిక దాడులు జరుపుతున్నారు. సరిగ్గా ఐదు పడవల్లో బయలు దేరి వెళ్లిన 70 మంది భారతీయుల పడవలు తీరం చేరుతుండగానే కొద్ది దూరంలో ఓ భారీ బాంబు పడింది. అది కొంచెం సమీపంలో పడినా వారి మృతి వార్త వినాల్సి వచ్చేది. ఈ ఘటన జరిగిన వెంటనే వారు వేగంగా తీరం చేరుకుని ఇప్పుడు నేలపై అటూఇటూ పరుగులు పెడుతున్నారు. ప్రాణాలు రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి దగ్గర ఉన్న ఫోన్లతో భారత్‌కు ఆడియో మెస్సేజ్ పంపించారు. అందులో వారి మాటలను పరిశీలిస్తే.... మేం ఇక్కడ చిక్కుకుపోయాం. ఇప్పటి వరకు మాకు ఎలాంటి సాయం దరిచేరలేదు. పరిస్థితి దారుణంగా ఉంది. మేం బోటులో ఉండగా వైమానికి బాంబు దాడులు జరిగాయి. అది కొద్ది దూరంలోపడింది కాబట్టి బతికి బయటపడ్డాం. ఈ నెల 11న మా బోట్లను ఖోఖా పోర్టు వద్ద వదిలేసి వచ్చాం. అవి ఇప్పుడు అక్కడ ఉన్నాయో లేవో తెలియదు. ప్రాణాలు రక్షించుకునేందుకు అక్కడా ఇక్కడా తిరుగుతున్నాం. మొత్తం 70మంది ఉన్నాం. మేమంతా భారతీయులమే. దయచేసి మమ్మల్ని రక్షించండి. లేదంటే వారు మమ్మల్ని చంపేస్తారు' అని అందులో ఉంది. దీనిపై భారత విదేశాంగ వ్యవహారాలశాఖ స్పందిస్తూ వారిని అక్కడి నుంచి భారత్‌కు తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వారిని రక్షిస్తామని హామీ ఇచ్చారు. -
సౌదీ మృతుల్లో పెరిగిన భారతీయుల సంఖ్య
జెడ్డా: సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో శుక్రవారం భారీ క్రేన్ కూలిన దుర్ఘటనలో భారతీయ మృతుల సంఖ్య 11కు పెరిగింది. 115మంది చనిపోయిన ఈ ఘటనలో భారతీయులను గుర్తించే పనిని విదేశాంగ శాఖ చేపట్టింది. మృతులను గుర్తించేందుకు సౌదీ అధికారులు మార్చురీలోకి యాత్రికుల బంధువులను అనుమతించటంతో.. శనివారం గుర్తించిన ఇద్దరితో పాటు మరో 9 మందిని గుర్తించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణ, యూపీ, ఎంపీల నుంచి ముగ్గురు చొప్పున, ఢిల్లీ, బెంగాల్‌ల నుంచి ఇద్దరు చొప్పున, పంజాబ్, బిహార్, అస్సాంల నుంచి ఒక్కొక్కరు గాయపడిన సంగతి తెలిసిందే. భారతీయులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్వరూప్ వివరించారు. -
ట్విట్టర్ లో సుష్మ మంత్రి హోదా మాయం
న్యూఢిల్లీ: వారం రోజుల క్రితం వరకు విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ పేజీ ఓపెన్ చేసినపుడు.. ఆమె ప్రొఫైల్ లో 'సుష్మా స్వరాజ్, విదేశీ వ్యవహారాల మంత్రి, భారత ప్రభుత్వం' అని ఇంగ్లీషులో ఉండేది. 2014 మేలో విదేశీ వ్యవహరాల శాఖ మంత్రిగా సుష్మ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమె ట్విట్టర్ పేజీ ఇలాగే కనిపించేది. అయితే ప్రస్తుతం సుష్మ ట్విట్టర్ పేజీలో ఆమె పేరు మాత్రమే కనిపిస్తోంది. సుష్మ హోదాను తెలియజేసే.. 'విదేశీ వ్యవహారాల మంత్రి, భారత ప్రభుత్వం' అన్న పదాలను తొలగించారు. లలిత్ మోదీ గేట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా పార్లమెంట్ సమావేశాలను కూడా స్తంభింపచేశారు. ఈ విషయంపై పార్లమెంట్లో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మంగళవారం సుష్మ ట్వీట్ చేశారు. ఇక ఈ రోజు కూడా సుష్మ.. పేరు ప్రస్తావించకుండా ఓ కాంగ్రెస్ సీనియర్ నేతపై ట్విట్టర్లో విమర్శలు చేశారు. కాగా ట్విట్టర్ పేజీ ప్రొఫైల్ లో సుష్మ తన హోదా తెలియజేసే పదాలను ఎందుకు తొలగించారన్నది చర్చనీయాంశమైంది. -
సుష్మా వెంటనే రాజీనామా చేయాలి
-
సుష్మా వెంటనే రాజీనామా చేయాలి
న్యూఢిల్లీ: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రెడ్ కార్నర్ నోటీసులు ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి వీసా మంజూరు చేయాలని ఏ విధంగా సిఫార్సు చేస్తారని సుష్మాను...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. ఆదివారం న్యూఢిల్లీలో సుష్మా స్వరాజ్ వైఖరిపై దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. నైతికత ఆధారంగా సుష్మా వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి వీసా కోసం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సిఫార్సు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే లలిత్ మోదీ భార్య గతకొద్ది కాలంగా కాన్సర్‌తో బాధపడుతున్నారు. అందుకు వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులోభాగంగానే తాను మానవత్వంతోనే వారికి సహాయం చేసినట్లు సుష్మా స్వరాజ్ వివరణ ఇచ్చినట్లు సమాచారం. -
ఇకపై వారంతా.. విశాఖకు వెళ్లాల్సిందే!
- పాస్‌పోర్ట్ సేవలపై విదేశీ మంత్రిత్వశాఖ తాజా ఆదేశాలు - నెల్లూరు, ప్రకాశంతో పాటు రాయలసీమ 4 జిల్లాలు హైదరాబాద్‌లోకే సాక్షి, హైదరాబాద్: గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలో ఉన్న యానాం జిల్లా పాస్‌పోర్ట్ సేవలను విశాఖపట్నం పాస్‌పోర్ట్ కార్యాలయానికి బదిలీ చేస్తూ కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి అశ్వనీ సత్తారు తెలిపారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వాసులు ఇప్పటి వరకూ పాస్‌పోర్ట్ సేవలకు హైదరాబాద్ కార్యాలయానికి వచ్చేవారు. యానాం వాసులు పుదుచ్చేరి వెళ్లేవారు. అయితే ఇకపై ఈ మూడు జిల్లాలకు చెందిన వారు విశాఖపట్నం వెళ్లాల్సి ఉంటుంది. ఈనెల 22 (నేటినుంచి) పూర్తిగా ఈ సేవలను విశాఖకు బదిలీ చేస్తున్నారు. దీంతో పాటు విజయవాడలో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రం కూడా విశాఖపట్నం పరిధిలోకి వస్తుంది. నేటినుంచి గుంటూరు, క్రిష్ణా, యానాం జిల్లాల వాసులు పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆ పాస్‌పోర్ట్‌పై విశాఖపట్నం కార్యాలయం పేరు మాత్రమే వస్తుంది. విశాఖపట్నం కార్యాలయం పరిధిలోకి వచ్చే జిల్లాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కొత్తగా గుంటూరు, కృష్ణా, యానాం జిల్లాలు. మొత్తం 8 జిల్లాలు విశాఖపట్నం పరిధిలోకి ఉంటాయి. విజయవాడలో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రం కూడా విశాఖ కార్యాలయం పరిధిలోకే వస్తుంది. హైదరాబాద్ కార్యాలయం పరిధిలోకి వచ్చే జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాదాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలు వస్తాయి. తిరుపతిలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రంతో పాటు, తెలంగాణలోని నిజామాబాద్, హైదరాబాద్‌లోని మూడు పాస్‌పోర్ట్ సేవా (అమీర్‌పేట, బేగంపేట, టోలిచౌకి) కేంద్రాలు హైదరాబాద్ కార్యాలయం పరిధిలోకే వస్తాయి.